5, అక్టోబర్ 2019, శనివారం

చిన్న కధలు


 తెలుగు భాష నేర్చుకుందాం      
 రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
  
వలదన్న పోదు నిశ్చలానందం...
కలదన్న  మర్చి  మెచ్చే టానందం 
కలిసున్న వచ్చి పోయే టానందం 
కలగన్న  కల్సి తీర్చే టానందం  

వ్యధ కలుగ జేసినా నొక్కరి కానందం 

మంచి తెలిపి చేసినా అందరి కానందం
పిచ్చి ముదిరి చేసినా కొందరి కానందం 
అమ్మ తెలుపు మాటలే నిత్యము ఆనందం 

వందల మందికి మేలు జేసినా ఆనందం 

పండుగ సంబర మంత చూసినా ఆనందం 
తక్కువ ఎక్కువ చేసి చెప్పినా ఆనందం 
ప్రేమను పంచిన డబ్బు ఇచ్చిన ఆనందం 

వందనములు పెక్కు బెట్టియున్నా ఆనందం 

మంచిపనులు పెక్కు చేసియున్నా ఆనందం 
చెడ్డ పనులు చేసి మారి యున్నా ఆనందం 
తల్లి పలుకు వల్ల మారి యున్నా ఆనందం 

--((**))--





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి