ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (6)
వయసు అనుభవాలే గొప్పవాడిగానో త్యాగధనుడిగానో చేయగలవను విధంగా ప్రేమ జంటలు కలసి అంనందం అనుభవం పొందటం
యా..య...య..యాయ..
యా..య...య..య..యాయ..
నా మీద నీ గాలి సల సల సోకింది
లోలోన నా గుండె గిల గిలలాడింది
కాదు బిడియాలకు వేళా సొగసంది
లేరా సయ్యాటకు రారా అని అన్నది
పరువాలకు పాడర జోల పాటది
నా మీద నీ గాలి సల సల సోకింది
కూకుంటే కునుకొస్తాది
కునుకొస్తే.. హ.. కలలొస్తాయి రా అంది
తానాలు ఆడేస్తున్నా తాపం తగ్గదురా ఇది
దీపాలు పెట్టారంటే ప్రాణం నిలవదు
నీకోసమే తెరిచాను ఈ గది
మల్లెల మబ్బులు ముసిరే వేళ ఈ మది
ఊహకు ఉరుములు పుట్టే వేళ ఈ మది
చినుకంత ముద్దాడి పోరా సమయమైనది ....
నా మీద నీ గాలి సల సల సోకింది
లోలోన నా గుండె గిల గిలలాడింది
పగటేల చలి వేస్తాది
నడిరేయి ..హా.. గుబులొస్తాది
పక్కంత దొర్లేస్తున్నా పరువం ఆగదు
వొల్లంత నిమిరేస్తున్నా వలపే తీరదు
మొటిమలు మొగ్గలు పుట్టే వేళ ఇది
బుగ్గకు ఎరుపులు పట్టె వేళ ఇది
ఎదనిండ అదిమేసుకోరా ఈ గది
నా మీద నీ గాలి సల సల సోకింది
లోలోన.. అబ్బా.. నా గుండె గిల గిలలాడింది
కాదు బిడియాలకు వేళ ఇది
లేరా సయ్యాటకు రారా ఇది
పరువాలకు పాడర జోల పాటది
నా మీద నీ గాలి సల సల సోకింది
లోలోన నా గుండె గిల గిలలాడింది
తొందర వద్దు అంతయు పొందు - తోడును నేను మొహమె
అందరి ముందు ఆటయు వద్దు - ఆశను తీర్చు దాహమె
మంధర బుద్ది ఇక్కడ వద్దు - మానస వీణ మీటుము
గంధము పొందె శాంతిగ ఉండి - దాహము తగ్గు చేయుము
సుందరి నాకు డెందము మ్రోఁగెఁ - జూడఁగ నిన్ను సత్యము
ముందర వచ్చి నవ్వుము లెస్సఁ - బూలను నిత్తు నిత్యము
సందియ మేల సందెల వేళ - చల్లని గాలి వీచెను
మందముగాను మల్లెల తావి - మత్తును జల్లి లేచెను
నల్లని నేల యెఱ్ఱని నింగి - నల్దెసలందు నాదము
మెల్లగ వెల్గు మేదిని వీడె - మెండుగ నింక మోదము
ఉల్లమునందు నూహల డోల - యూర్వశి సేయు నృత్తము
వల్లకి మీటి రాగము పాడఁ - బల్లవి పూచు నగత్యము
చల్లని రేయి రాగము పల్కె - రాత్రియు రాస లీలకు
తెల్లని పాలు తెచ్చితి త్రాగు - తేమగ ఉన్న వేళయె
ఉల్లము జల్లు అయ్యెను రమ్ము - ఊరిక ఉండు టేలను
బెల్లము పొందు అల్లము కాదు - బెర్కు దేని కిందులొ
ఈనాడు ఈ మనిషి మహా మనిషి గా సమాజంలో చిన్న పెద్ద ధనిక పేద అసమానతలు పట్టక అంతా ఒకటే అనీ భావిస్తు ఏమి ఆశించని ఋషి లా అందరి బాగును కోరుతు సాగుతు మేలు చేసుకుంటు పోతుంటే మేలు పొందిన వారు ప్రేమికులు కీర్తిస్తున్న పాడిన పాట యిది మదిని దోచింది ....
___((()))___
ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (5)
అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా?
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనైనా రమ్మని పిలిచేవా?
నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?
గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగ రాగమేదొ ఆలకించవా
ఆలకించి నన్ను నీవు ఆదరించవా
చందమామ రాకుంటే కలువ నిలువ లేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా
మాట రాని మాయవా, మాయతోన మాటవా
మనసులా దోచె ఆకాశమా, పుడమి మనసు దోచావా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
వచ్చినవాడ్ని చూడవా చూడని వాణ్ణి ప్రేమిస్తావా
కలలు కంటూ మోస పోతావా కళలు చూపేవాణ్ణి చూ సి నమ్ముతావా
ఆశయం లేని ఆశ లో చెక్కావా ఆశయం తీర్చు వాణ్ణి గుర్తించవా
యవ్వనంతో బాధ పెడతావా ఇది విధిరాతని తప్పుకుంటావా
నీలాల గగనాల ఓ ఆకాశం .. నిను నిరుపేద పుడమిని చూడవా
నీలాల గగనాల ఓ ఆకాశం .. నిను నిరుపేద పుడమిని చూడవా
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..
___((()))___
ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (4)
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి తేలే మానసము...
ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం.
****
కన నెపుడు నాననంబు, వనజమగు నామనంబు పరమేశా
శకలమగు వేదనంబు సకలేశా, దినమెపుడు నాకు చింత
కైలాసా దినమెపుడు నాకు ఉదయం మహేశ్వరా
అంటూ
ఏమి యన్న నేమి మనము ఏల అనక హాయిగా ఉదయం.
ఏమి చూతు జగతి లోన ఏది అనక హాయిగా హృదయం.
ఏమి తల్తు మనసు నందు , నింతి వలపు మానదే ఉదయం.
ఏమి గెల్తు నయ్య పోరు , నెంత సల్పు చున్నదే హృదయం.
నేను నాది యనెడి యహము,నింతలంత మాయమై ఉదయం.
పూను గొంటి స్వార్ధ , బుధ్ధి పుణ్య మేదొ మాయగా హృదయం
తోడు నీవు సుఖము చెంత తోలు తిత్తి బ్రతుకే ఉదయం.
గోడు వేద మనుచు పలుకు గూడు గుడ్డ కొరకే హృదయం
నిత్య భేదము నిర్ణయమ్ముయె నిమ్న హృదయము నియమ శక్తి యె ఉదయం
సత్య భావము సాధు లక్ష్యము సామరస్యము సమత భుక్తికె హృదయం
అంతు బట్టని ఆత్మ రూపము ఆశ నింపును అలక తిర్చుటె ఉదయం
పంత మైనను బంధ మైనను పోరు యైనను పడక కోరికె హృదయం
అందుకే మనసులో ఉత్సాహమే ఉల్లాసం హృదయం ప0చుతా జీవితానికి ఒక అర్ధ0 ఉందని, అర్ధంలో పరమార్ధం ఉందని, మనోగతం తృప్తిగా అందరి ప్రశాంతత, సంతోష చైతన్యాన్ని కలిగించి, జీవన వేద సారం తెలుసుకోవాలని పాటలతో సంతోష ఉదయం పంచుకోవాలని ఆకాంక్ష
___((())))___
ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (3)
“శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ” అంటూ ప్రారంభించారు ఒక కవి
పెరట్లో చెట్టు క్రింద నులకమంచం పై పడుకుని “మా పెరటి జాంచెట్టు కుశలం అడిగే” అంటూ సాగే మరో గేయ లేఖ కూడా మనం విన్నాం.
“ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాశాను నీకు చెప్పలేక ఎదుటపడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేతకాక” ... ఇలా ఎన్నో... ఎన్నెన్నో...
అమాయకుణ్ణి కాపాడటం కోసం ఆ ఊరి గుడిలో తాళి కట్టించుకొంటుంది. ఆ సందర్భంలో బాపూ గారు పాట సాక్షిగా
అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళూ తోడుగా, నీడగా !
నా మెడలో తాళిబొట్టు కట్టరా!
నా నుదుట నిలువుబొట్టు పెట్టరా!
నీ పెదవి మీద చిరునవ్వు చెరగదురా
నా సిగపువ్వుల రేకైనా వాడదురా! వాడదురా!
బతకరా బతకరా పచ్చగా!
నల్లని ఐరేనికి మొక్కరా!
సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా
నా నల్లపూసలే నీకు రక్షరా! రక్షరా!
బతకరా బతకరా పచ్చగా!
నా కొంగు, నీ చెంగు ముడి వేయరా!
నా చేయి, నీ చేయి కలపరా!
ఏడడుగులు నాతో నడవరా!
ఆ యముడైనా మన మద్దికి రాడురా! రాడురా!
బతకరా బతకరా పచ్చగా! ~ అమ్మ కడుపు ~
ఆ మాటలకూ ఆ పెళ్లి కొడుకు
* ఆకాశ గొడుగులా చూపుతానే విశ్వాసం
ఆకాశ గంగలా సంస్కరించే విశ్వాసం
*ఆకాశదేశాన విహరిస్తాను నిష్ట గాను
అంతరంగాన్ని పులకిస్తూ కళల విశ్వాసం
ఆకాశ భవనాన్ని నిర్మిస్తాను నిష్ట గాను
ఆతిథ్యమిస్తూ ఆనందం పెంచె విశ్వాసం
ఆకాశాన్ని అవనితొ కలిపెస్తా నిష్టగా ను
ఇరువురి మధ్యా సందేశమేలే విశ్వాశం
ఆకాశ దృశ్యాలను చూపుతా నిష్టగా ను
ఆకాశవాణి వినిపిస్తా కళల విశ్వాసం
ఆకాశ దీపాల్ని వెలిగిస్తాను నిష్టగా ను
అంధకారాన్ని తరిమేసి గుణమే విశ్వాసం
ఆకాశ తారల్ని తేగలిగేటి విశ్వాసం
ఆకాశ హరివిల్లును నిర్మించే విశ్వాసం
"ఆ ప్రియురాలికి విశ్వాసం కలిగించే ధైర్యంతో నింపిన ప్రేమలేఖ"
పాటలో నిజాయితి ఎక్కువ వుంటుందని చక్కటి వర్ణన , భర్తగా విశ్వాసం అద్భుతం
మనిషి సుప్రభాతమే, సత్యమేవ జయతే అంటూ నిత్యకల్యాణం పచ్చతోరణంలా మనస్థత్వమే మహోదయమై
మనిషి నిత్య సత్య భావమైతే విరాజిల్లదా విశ్వమంతా, ప్రవేశించదా పుడమి యంతా ఆనంద భైరవి రాగంతో ఆలాపన చేయదా
ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (2)
సాంకేతికంగా జరిగిన అభివృద్ధి క్రమంలో, స్థిరవాణి, చరవాణి, సంక్షిప్త సందేశాలవంటి అవకాశాలు అందుబాటులోకి వచ్చాక పాతనీరు క్రొత్తనీరులా లేఖ వెనుకబడింది. అయినా మనసు మాట, పాట, ఆట, వేట, కోట, తోటలు దాటే పాఠము రూపంలో ప్రణయానందముగా సంగీత భావం మనసుకి శాంతి తో ఉల్లాసం ఉత్త్సాహం ఏర్పడుతుంది
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో,
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
అంటూ ప్రతి ఒక్కరు హృదయాన్ని తాకుతూ ఎందుకో మరెందుకో అంటూ అంతులేని ఆనందం తో వచ్చి రాణి రాగాలు పలుకుతాయి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
గమదని సని పామా నిరిగమ రిగ నిరి స
మామాగా గాదప దపమ గానిద నిదప మాదని
సాని గారి సనిద పసాని దపమ
నిసని దపమ నిసని గమదని సని పామరిగా...
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా
ఆ.. ఆ..
ఆ అంటూ స్వరాలూ ఇద్దరిలో ఏకమౌతానికి దారితీస్తాయి
సన్నాయి డోలు పెల్లి పాటా పాడే
అబ్బాయి వోరకాంత చుస్తున్నడే
బంగారు బొమ్మా తాల ఏట్టి చూడే
నీ ఈడు జోడ్ అండాలా చందురూడే
అంటూ
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పారిహాసాలాడినవి
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
ఆ నవ్వు ఆ పరిహాసము ఆ గుట్టు విరిసిన హృదయాల ఆలాపన అంటూ సాగే జీవితం
(సినిమా పేర్లు, రచయిత పేర్లు తెలిస్తే తెలుపగలరు)
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
___((()))___
ప్రణయానందం నీకు - హృదయానందం నాకు (1)
మన కవులు రచయతలు సందర్భాన్ని బట్టి ప్రణయానందం కొరకు ప్రేమలేఖల్లో అస్పష్టత, అసత్యం, అర్థసత్యం, అతిశయోక్తి వంటి సుగంధ ద్రవ్యాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇరువురి హృదయాల్లో ప్రణయానందం కోరేందుకు మునిగి తేలేందుకు, ఆశలు తీర్చుకొని ఆనందం అనుభవించేందుకు ప్రేమ లేఖతో ఆనాడు ఈనాడు
“ప్రేమలేఖ రాశా, నీకందివుంటది...
కాల మంత నీదే, నీ మాట ఉంటది
పూలబాణమేశా, యెద కందివుంటది...”
ఆశ తోను వచ్చా, కథ కవ్వ మంటది
... ఇటువంటి ఆశావాదాలు!
మాధుర్యం మరవలేనునేను
“ఇది తీయని వెన్నెల రేయి,
మది వెన్నెల కన్నా హాయి,
కదిలే మది కన్నెల రేయి,
మెదిలే కధ మన్నిక హాయి
నా ఊహల జాబిలి రేఖలు,
కురిపించెను ప్రేమలేఖలు”
నా ఆశలు తీర్చెడి రేఖలు,
మురిపించెను హృద్య లేఖలు
... ఇటువంటి భావ చిత్రాలు!
“రాశాను ప్రేమలేఖలెన్నో...
దాచాను ఆశలన్ని నీలో...
భువిలోన మల్లియలాయే...
దివిలోన తారకలాయే...
నీ నవ్వులే...”
...ఇటువంటి అతిశయోక్తులు సహజం!
మా అమ్మ గారు ఈపాట పెట్టమనేవారు ఎక్కువగా రేడియోలో వచ్చేది, ఆనాడు తెలియదు, ఈనాడు ఆలోచన కొచ్చింది.
కొండగాలి తిరిగిందీ......
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ....
ఆ..ఆ..ఆ..
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికింది
గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
ఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ
ఆఆ..ఓఓ..ఆఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది
----
“తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” అంటూ కొనసాగించి,
“తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులీయండి” అంటూ ముగించిన లేఖా గీతం మనకు తెలిసిందే!
----
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దర ఖాస్తందుకో
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో
ఆ ఆ ఆ కాస్తందుకో.. దరఖాస్తందుకో.. భామ దర ఖాస్తందుకో
దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో
---
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట
ఆడుకొవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై
--- చిరంజీవి నటన గుర్తించి నా పాట
రాయలసీమ మురిసిపడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
(సునిల్ హీరోగా నిల్పిన రాజమౌళి మర్యాద రామన్న)
అప్పుడే కాలేదండి మన ప్రేమ లేఖ రేపు మల్లి కలుద్దాం ఊ హల్లో తేలి ఆకాశంలో విహరిద్దాం మబ్బుల్లో చంద్రుడిలా సూర్యుడిలా నక్షత్రాలై హాయిగా జీవిద్దాం
(సినిమా పేర్లు, రచయిత పేర్లు తెలిస్తే తెలుపగలరు)
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
____(((()))___
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి