17, జూన్ 2022, శుక్రవారం

 

లఘు కవితా ప్రక్రియ 


.01.మౌనమే ను

వేదనా మనసుకు రెక్కలొచ్చె

కధలన్నీ కాటికే కదలి వచ్చె


02.కాలమే ను

కదలి కదలి మనసులేక నిరూపించే

విషయ వాంఛలు కురిపించే


03. దేహమే ను

ఆశల వలయంలో చిక్కుటేను

బ్రతికి బ్రతికించ లేక వేగుటేను


04..మోహమేను

మనసు వేగపరిచి వేధించు

మధనముతో మరగించు


05.దాహమేను

దరిద్రులు కు ధనకులకు అవసరమే

నిత్యం బ్రతుకు తెరువు కోసం అవసరమే


06.గౌరవించు

ప్రేమున్నా లేకున్నా మనిషిగానే

నవ్వించి ఏడ్పించినా మనసుగానే


07.ఎదురు చూడకు

నీది కాని దానికోసం అంశాలతో

ఉన్నదాన్ని మరచి కొత్తరకం ఆశలతో


08.వ్యక్తిత్వం

సమయ సద్వినియేగ నిజాయితీ

బ్రతికి బ్రతికించే దేశ వ్యాప్తంగా గతీ


09..నిద్రలేని 

రాత్రిలోనే కలగా వచ్చావు అలలై

పట్టబోతే జ్ణాపకాల హోరులో పరుగులై


10..నిన్నెలా

గాలిగా బ్రతికించావు పట్టేదెలా

అగ్నిలా వెలిగిచ్చావు దాచేదెలా


11..పువ్వునైనాను

పరిమళాలు అందిస్తూ ఘాటైన చూపు

ముద్దిచ్చి మోజుతీర్చె వినయపు ఊపు


12. ఆతోటకి

ఎంతపచ్చదనమో అంత పరిమళం

వాతావరణం ఆహ్లాదకరంగా పరిమళం

13- ఆకలెక్కువే
కలానికి కాగితం లోకువె కానీ 
మొహానికి దాహము తక్కువె కానీ  

14- బాల్యం బలి
ఆక్రోశిస్తు అర్ద0 కాని అంతరంగం
వయసు తో ఆవిరవు తు విద్యారంగం  

15- ఏనాడైనా 
మీ అమ్మ స్తన్యం కుడిపిందా 
గోరుముద్దలు తినిపించిందా 

16-ఎన్నడైనా 
పండిన చేలో పరిగ ఏరావా
కోతి కొమ్మచ్చు లాట లాడావా
లఘు ప్రక్రియ కవిత

11..పువ్వునైనాను
పరిమళాలు అందిస్తూ ఘాటైన చూపు
ముద్దిచ్చి మోజుతీర్చె వినయపు ఊపు
12. ఆతోటకి
ఎంత పచ్చదనమో అంత పరిమళించే
వాతావరణం ఆహ్లాదకరంగా పరిమళించే 
13- ఆకలెక్కువే
కలానికి కాగితం లోకువె కానీ 
మొహానికి దాహము తక్కువె కానీ  
14- బాల్యం బలి
ఆక్రోశిస్తు అర్ద0 కాని అంతరంగం
వయసు తో ఆవిరవు తు విద్యారంగం  
15- ఏనాడైనా 
మీ అమ్మ స్తన్యం కుడిపిందా 
గోరుముద్దలు తినిపించిందా 
16-ఎన్నడైనా 
పండిన చేలో పరిగ ఏరావా
కోతి కొమ్మచ్చు లాట లాడావా
17..తగదునా
తగు మాటలాడి మౌనం బేలా
తగు బాస చేసి ఇపుడు ధ్యానం బేలా
18..తగురీత
తరుణమ్ము కరుణించ లేవా బేలా
మామాట మన్నించి గుర్తించవా బేలా
19..కోరితే
కొంగు బంగారం కూడా కాదంటివీ
వరము లిస్తానన్న వద్దంటివీ
20..వినునమ్మ
మా స్థితిగతుల పలుకులన్నీ
అయ్యతో తెలుపమా కధలన్నీ

లఘు కవితా ప్రక్రియ ...3
21..నువ్వంటే
పడని వారి పట్ల వివక్ష త నుండు
ఈర్య కోపం నీపై వున్నా పట్టించుకోకుండు
22..జాలితో
చేతనైన సాయం చేసి పుణ్యం కట్టుకోండి
దీనస్థితిలో నున్న యెడల విశ్వాసం చూపండి
23...సమాన స్థాయి
సుఖం కష్టం ఉన్నా ప్రేమ పెంచు
స్నేహ సంబంధాల బంధం ఉంచు
24..లోక రీతి
ఏ ఎండకు ఆ గొడుగు పట్టు
దేవుడికైనా గొడుగు పెట్టు
25...విగ్రహం
పోయిన వారి సొమ్ము తింటూ పెట్టె ది
చేసిన మించి గుర్తించడానికి పెట్టేది
26...ప్రభుత్వాలు
బ్రతికి బ్రతికించే న్యాయ పాలనంటారు 
ప్రజలకు స్వేచ్ఛ, పౌష్టికాహారం అంటారు

కంటి చుక్కలు
సందర్భోచితంగా నవ్వుల కే కారు
కొన్ని పనులు కన్నీరుతో చేకూరు

లోగిళ్ళు
ఒకరికొకరు తోడుగా కలిసి మెలయుట
కులమత విచక్షణ గా కలిసి పోవుట

లోగుట్టు
పిరుమాళ్ళ కెలుకు
బ్రతుకు బజారు బతుకు

25...సార్ధకత
అక్షర సాహిత్యం తెలుసుకొంటే
ప్రతి ఒక్కరి మనసు శాంతి గుంటే

తరుణం తరించే మార్గ మై ఉంటే
అనభవ సారం ఫలిస్తూ ఉంటే
ఆచరణ ఆశయంగా మారుతుంటే
బీద గొప్పా చూడక మంచి గుంటే
కష్ట నష్టాలన్నా గమ్యాన్ని చేరుతుంటే
జలమై దాహం తీరుస్తూ కడలి చేరుకుంటే
రుచులు భిన్నమైన తినగలిగి ఉంటే
రూపాలు వేరైనా గుణం గలిగి ఉంటే
బేధాలెన్ని ఉన్నా మాటలు మంచి గుంటే
జీవితంలో నమ్మకం ధర్మం గా గలిగి ఉంటే
____(()))___


నిత్య సత్య లఘు నూతన ప్రక్రియ కవితా ::4
40..కొద్ది పాటి
వెలుగై నా కొండంత వెలుగే
నమ్మకం బ్రతుకంతా వెలుగే
41..ఉత్సాహం
వెల్లు విరిసే గులాబీల గుబాళింపు
తల్లి తండ్రుల ప్రోత్సాహ మలుపు
42..బ్రతుకంత
పరమాత్ముని సగుణ సాకార రూపముగా
నిర్విరామ కృషి ప్రేమా సహకారం గా
44.. అసత్యం
వెలుగ కానరాని కారు చిచ్చు వంటిది
జిగురు కప్పిన నిప్పు గా దహించేది
45..నిజం
తల్లి తండ్రి గురువు దైవము తోడుగా
భార్య పిల్లలు స్నేహం ధనము తోడుగా
46..నీటిలోని
ఉప్పు రాయి , పంచదార బొమ్మ తెలేము
జల పుష్పాలు  తెచ్చాక బ్రతి కించ లేము
47.. పరీక్ష
నిత్యం జీవితంలో గుణ పాఠాల న్నీ
బ్రతికి బ్రతికించే ప్రేమ పాఠాల న్నీ
48.. నాయకుడు
ప్రజాకర్షక పధకాలను పంచేటి
సాధన భవబంధ మంటూ తిరిగేటి
49.. వారసుడు
పెద్దల కృషి త్యాగం ఫలం పొందు
 వంశపారంపర్యంగా వచ్చే ధనము పొందు
50.. నావికుడు
ఆటు పోటుల మధ్య తేలుతూ ఉండు
గమ్యాన్ని చేర్చుటకు శిక్షణ కలిగుండు
4 co
51..స్త్రీ వడి
ఏమీ తెలియని వయసులో చేరే
శాంతితో ఆకలి తీర్చుకోవడానికి మారే
52..చింతలూ
అపనమ్మకం ప్రశ్నలు గా ఉంటే ఎప్పుడూ
అనుమానం ఆకలి పోరాటం ఎప్పుడూ
53. పిలిస్తే
పలికే కళ్యాణ వేంకటేళ్వరు డే
మాట తప్పని మహాను భావుడే
54.. ఎటువంటి
వారినైన ఆదుకొనే ఆపద్భాందవుడు
కోర్కెలను తీర్చే కరుణామయుడు
55. . ముడుపు
అనాదిగా వడ్డి కాసులవానికి కట్టెడి
కోరిక తీరాక వడ్డీతో హుండీలో వేసెడి
56..తడబాటు
తల్లిదండ్రులు పిల్లలను సరిచేయు
భర్త మేలుకోరి భార్య గ్రహణాన్ని సరిచేయు
57...అలవాటు
మాట జారితే కలుగు గ్రహ పోటు
తప్పటడుగులు వల్ల గృహ పాటు
58..స్వభావం
కర్పూరం అగ్నికి దగ్ధమైన పరిమళం
యోగ్యులు ఆపదలో ఆదుకుంటూ పరిమళం
59..అసాధ్యం
మనస నే కుండ అతికించడం
నేయ్యి పృథ్వి పై తిరిగి తీయ్యడం
60..అలలు
భార్యను కలుపు కో వాలని ఉరుకులు
హృదయంలో కలిసే వెనక్కు పరుగులు
0

101..మేధస్సు
పుస్తకం గా మారే
తలలో లేదు దారే
102..విజ్ఞానం
వింతపోకడగా తలనే మార్చే
బ్రతుకు పుస్తకమై చేకూర్చే
103..తలలేదు
బ్రహ్మాండ లోకాలు చదువు
చరవాణి ద్వారా బరువు
104..చదువు
ముఖ్యంగా బ్రతకనేర్పుతుంది
ఎక్కువైనా తల పట్టుకోమంటుంది
105..వింత
తలతీసి మేక తలపెట్టే నాడు
తలతీసి పుస్తకం నింపె నేడు
106..చుట్టూ
చూసినవి చదవినవి నిక్షిప్తం మెదడులో
ముద్రణ తో ముఖపుస్తకంలో
107..తలలేని
మనిషి బ్రతుకు అగమ్యగోచరం
పుస్తకం పిచ్చి  ఉంటేను అగమ్యగోచరం
108..విద్యార్ధి
ఆలోచనలు అనంతము
ఆచరణకు లేదు సుఖాంతము
109..మెదడు
మేతకు శ్రమ అనవసరము
చరవాణి పీక నొక్కు అంతా సమము
110నేర్చి తి
తెలియలేనిదీ తెలిసిపోయినది
తలకన్నా దూరవాణి మేలైనది
0
నేడు లఘు కవితా ప్రక్రియ 
111..ఆచూపు
ఎవరిని చంపాలని ఆ కోపము
ఎవరి కోసం తీక్షణవీక్షణము
112..స్త్రీ
అయిన పురుషుడైన వ్యతరేకించు
ధర్మాన్ని అతిక్రమించిన వారిని శిక్షించు
113..కష్టం
నీదాకా వస్తేనే తెలిసిందా
శ్రామిక శ్రమకు గుర్తింపు లేదా
114..కంటిచూపు
తోను చంపేస్తా అలా చూడకూ
ఒకేసారి చూడు ఇటేచూడు మాట్లాడకూ
115..సంధి
కుదరలేదని యుద్దము తధ్యమని రోషమా
వ్యంగ్యాస్త్రాలు సంధించే వాడినీ చంపాలని రౌద్ర మా
116..కాబాళీ
వదలా నిన్ను అసలు వదలా
మింగేసే ఆ చూపు లేలా
117..చట్టం
కాకి లా అరుస్తూ పొడిచి చెప్పె
సింహం లా గర్జిస్తూ సిరికి చెప్పె
118..చుట్టం
కాకిలా వచ్చి పొడిచి కధలు చెప్పె
నక్కలా సలహాలిచ్చి సిరిని చెప్పె
119..బ్రతుకు
జీవుడా అని వాయసం కడలి కొమ్మచేరే
నత్త శంఖం లో హాయిగా నిద్రకు చేరే
120..చెట్టు
కొండలాగ ఆవరించె కడలిలో
చెలిమిగా చెట్టుపై వాయసం కడలిలో
___కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి