31, మే 2022, మంగళవారం

*ప్రణయానందము

*ప్రణయానందము*

*మూల మంత్రము :*

*. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః *

* 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*

*శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ *

* 376-1.  'శృంగార రస సంపూర్ణా' * 

*శృంగార మనెడు రసముచే లెస్సగా నిండినది శ్రీమాత అని అర్ధము. 'శృంగ' అనగా రెండు అని అర్థము. 'అర' అనగా దళము అని అర్థము. 'రస’ అను పదమునకు ఆరు అని అర్థము. ఇట్లు గ్రహించినచో ఆరు జతల దళముల పేర్పు అని తెలియవచ్చును. అనగా పండ్రెండు దళముల పద్మము. అదియే హృదయ పద్మము. అనాహత పద్మమని కూడ అందురు. హృదయము వ్యక్త, అవ్యక్తముల యొక్క కూటమి. అచట అనాహతము, ఆహతము కలియును. సూక్ష్మము,  స్థూలము కలియును. ప్రకృతి, పురుషుడు కలియును. నిత్యము, అనిత్యము కలియును.*

*అన్ని లోకములు ప్రకృతి పురుషుల కలయికచే యేర్పడు చున్ననూ హృదయ పద్మము యొక్క ప్రత్యేకత యేమనగా అచ్చట యిరువురును సమపాళ్ళుగ నుందురు. అందువలన ఆనందము సమ్యక్ పూర్ణమై నిలచును. ప్రకృతి, పురుషుడు అను శృంగములు రెండునూ సమమై వర్తించినపుడు పొందదగిన ఆనందము యితర స్థితులలో వీలుపడదు. సంపూర్ణమగు ఆనందమును ప్రేమ అందురు. అట్టి ప్రేమ యందు ఆధిక్యత, న్యూనత లేవు. సమత్వమే గోచరించును. లక్ష్మీనారాయణు లని, భవానీ శంకరు లని, వాణీ హిరణ్యగర్భు లని, శచీ పురందరు లని, అరుంధతీ వశిష్ఠు లని, సీతారాము లని కొనియాడబడు ఈ ఆరు జంటలు ఈ నామమునకు ఉదాహరణము.*

........

 యా నందం --7


 ..నేటి ఉదయ పద్యాలు ప్రణయానందము (1) 

*తే ...మానవత్వపు సేద్యము మనసు నందు
మంచితనము గా మమతలై మనుగడకు లె
గుండె తడి ఆరకయె సాగు గుళ్ళ యగుటె
మనిషి తనముగా మహిమయై మంకు పట్టు
........
*తే ..మనిషి కి మధుమాసముననే మధుర ఫలము
తాపము కు వసంతము గాను తల్ల డిల్లి
ప్రకృతి ఫలరాజ మగుటయే పండ్ల నందు
మామిడిది రాజస మధురం మనసు పంచు
...
*తే ...సిగ్గుశరము లేనిది ప్రేమ సేతువగుటె
ఇష్టమైన కష్టముగాను యింతి తోను
కధలు కావులే జీవితం కాల మాయ
ఎంత తిన్నాతరగనిదే ఏలు ప్రేమ
........
*తే ...పూల పాన్పుల పైజంట పూర్తి కసియె
ఇచ్చి పుచ్చుకొనుట ముద్దు ఈప్సితమగు
పంచు కొనె పరువపులీల పలుకు హేళ
చిన్మయానంద శృంగార చిరుత పులియె
.......,
*తే... రాగ అనురాగ కళలన్ని రాటు తేలి
సరిగమల సుధ సహకార సమయమందు
సమరమే సంగమమై కళ సాక్షియగుటె
నవ్య జీవితమునకుయే నాంది పలుకె
.......
*తే ..మొసుకు వచ్చెపల్లకిలాగ మొత్తుకొనక
ప్రకృతి ఒడిలో న మలుపులు పద్ధతి గాను
ఋతువు లు పిలుపు పొందుట ఋణము మల్లె
దాని కొరకేను కౌగిలి దరయు నీతి
........
* తే... సంగమిస్తూనె నేనుగా సర్దు సలిపి
సుఖమను దుఃఖ కళలను సూత్ర మాయె
చరిత చెప్పిన విధముగా చప్పరింత
చనువు ఏకమై సంబర చేష్ట లుడికె
.........
* తే.. మృదుమధుర వాత్సాయన మందహాస
మగువ మగనితో కలియుటే మన్మధ కేళి
చిరునగవులతో చిందులు చిత్ర మాయె
ఊహ కందని స్వర్గము ఉట్టి పడుట
......
* తే ..సలప రింపుల సల్లాపం సాగి సాగి
జిహ్వ చాపల్య కళలన్ని జైత్ర యాత్ర
అంత రంగాల ఆరాట ఆలుమగలు
ఆశ పాశమై ఆనంద అలుక గెలుపు
.......
*తే..కవి హృదయము ద్రవించెను కావ్యమగుటె
సవ్వసాచి గా శృంగారం సమయ మందు
హృదయ వాంఛల కలయిక హాయి గొలుపె
చిక్కు కున్న ముసుగులో న చీకు లొలుకె
.......
* తే..మల్లెపూలు చేతికి చుట్టి మగువ మనసు
కోరు మగధీరుని కళలు కోట లగుటె
మంచి మాటల కలయిక మంచమందు
ఉడుకు పరుగులే ఇద్దరి ఊత మయ్యె
.........


సీ::చైతన్య సంతోష చేతిపూవులతోడ
     నిందార మునిగిన నీటు కాడు
     విస్తృత లాహరీ విశ్వాస సద్భావ
     వినమ్రత విషయాల విద్య కాడు  
     మ్రోక్కిన వారికి మోక్షంబు కల్పించి
     ఇష్టము నేతెల్పి యిచ్చువాడు
     సుఖమునే నందించు సూత్రము సూర్యుడు 
     బట్టి యి చ్చాడునట్టి బాల కుండు

తే::  చెలియ మాటలతో తన్మాయ చెలిమి తోడు
       చెలిమి కోరుతూ నిత్యమూ చిలుకు వాడు 
       కలిమి కోరిన వారికి కామ్య పరుడు 
       మగువ మాటకు వొగ్గెడి మంచి వాడు
                   
సీ :: నిమ్నకళ్లా చూపు  నిత్యచంచలములై 
        కాంతులీనెడు  కడగండ్ల వాడు 
        లావణ్య రసవాసి లాస్యము పంచేటి 
        శృంగార  పురవాసి  రసిక వాడు 
        మన్మధ జనకుడై  మాధుర్య రక్షకా 
        భువినంత ఏలేటి  భాగ్య పరుడు
        భక్తితొ  పూజిస్తె  భాగ్యమ్ము కల్పించు 
        నిధియై చెలంగెడు నీటు గాడు   

తే : కధలు వినినను చదివిన  కారు చిచ్చు   
       కవిత పాడిన మధురమ్ము కంచ నోడు  
       కదులు రెప్పల మాటున కంత్రి గాడు 
       కమల నయనాల చూపుల కాంతి పరుడు       ....... 
                
సీ :: మధురాతి చిరునవ్వు మధురమ్ము చిన్నోడు 
       మ్మొగముతొ పడచులు ముద్దు చేయు  
       భూషణ వెలుగుల భూదయ విందము 
       సింగారమునుగల్గు సిగము కాడు 
       వెడద కన్నులతోడ వేడ్కగొల్పెడివాడు 
       మదన మోహనుడైన మన్మ దుండు  
       అలుక తీర్చు పలుకు ఆధార మోహను 
       నిత్యమూ నామది నీటుకాడు 

ఆ : ఆడు యీడు నాది ఆయిననుఁ మొక్కెద 
      ఈడు తోను సంత సమ్ము యిచ్చు 
      నట్టి జ్యోతి రూపు కల్గిన కృష్ణుడు   
      నన్ను రక్ష చేసి సన్ను తింతు 
ప్రాణయానందము (4) 
*తే ::మధురిమ లొలికేను మగువ మనసు ప్రణయ
మగుటె సరిగమ రాగాలు మమత లగుటె
సమతలమయమైన మగువ సత్వర మగు
శోభ లుతలచి సమతుల్య శాంతి నిచ్చు
---
*తే ::కరుణ చూపు కమలముపై కనికరముతొ  
ధరణి పిలుపులివే కళ దమకమునకు  
పరుల తో మన కేమియు పంత మేళ
జంట శాంతికి ప్రణయము జడ్జమవదు 
---
*తే ::మరచి పొయ్యేది కాదులే మగువ ప్రేమ 
మగసిరిని పట్టి ఆడించు మనసు ప్రేమ  
మరవ నియ్యదు ప్రణయము మదన ప్రేమ 
మనసు తత్వము బతికించు మగణి ప్రేమ
---
*తే ::తడబడి తడబడి నడక తపన లేల 
వడి వడిగను పరుగులేల వరద ప్రేమ 
పడి పడి ఒడల నీడల పలుకు లేల  
పసిడి వన్నెల ఇదియేను ప్రణయ లీల 
---
*తే ::మరక అంటని కాగితం మనసు జూడు 
మరకత మణిల ప్రకాశ మగువ జూడు 
గగన జాబిల్లి వెన్నెల గళము విప్పు 
మోహ సామ్రాజ్యమ్ము ఇదియు మోజు తీర్చు 
---
*తే ::కాలము పరుగులెట్టినా కావ్యమవదు  
కర్ర చేతికొచ్చిన పని కానె కాదు 
కధలు తెల్పిన ప్రణయము కాపు కాదు 
మగణి మగసిరి మహిమయే మగువు తీర్పు
---
*తే ::పైరగాలికి ఎగిరేను పైట చెంగు 
పరువపు పిలుపు పొంగులు పైకి చూపు 
గాలి వాటుగమనముకె గంప జూసె 
వలదు వలదన్న ప్రణయము వైపు జూసె
---
*తే ::ప్రకృతి నేర్పిన ప్రణయపు పాఠము ఇది          
దీని కి చదువు లేదులే దయతొ ప్రేమ 
హద్దులు తెలుప లేనిది హాయి ప్రేమ         
ముద్దుల ప్రణయపు కళలే మనసు తీర్పు
---
ప్రాణయానందము - (5)

దత్తపది........ అప్పు, పప్పు , తుప్పు , తప్పు
*అప్పుకాదు ప్రణయముయె ఆదరణయె
పప్పు కూడనకు ఇదియే పడక నీతి
తుప్పు పట్టినా చెదరదు తూర్పుఘడియ 
తప్పు అనుకుంటె జీవితం తప్పు త్రోవ 
---
*జీవితంలో కళల పంట జీవనదియె  
పూడ్చుకోవాలి ప్రణయపు పూల కన్ను  
మనిషిలోని లోపము కాదు మనుగడకునె   
ఓర్చు కోవాలి గెలుపులా ఓటమి గను 
-----
*అదిగదిగొ గదలుచు నుండె అద్దమందు 
ఆదరంబుగా చూడుమా ఆశ తీరు 
మైతిమా పలుకుము సొంత మైతిని కళ 
సరవి గొలచక సంతసిం చకళ ఇదియె
---
*శరణు వేడినా సాధువె సరయు చేయు 
ఎట్టి దయరాదు యిభము పై ఏల నీకు     
గుట్టు లీలలు , కొల్లలు గలవు విప్పు 
విరివి బిరుదులు , వీసమాయెనవి చూడు
---
*గట్టుపై చెట్టు కూలెను కధల మల్లె
చెట్టు తీగలలోజిక్కి చేటుజేసె
పట్టుకష్టము నష్టము ప్రకృతి వల్ల
కొట్టుకొని పోవు గాలికి కొండ లెల్ల
---
*ప్రకృతి జాగర ణకు కథలే పలుకులగుట 
పంచకోశ జాగరణకు పలుకు పెదవి 
చక్ర జాగరణకు వినయ చేష్ట పలుకు 
ప్రణయ మందు జాగరణలు పెదవి చుట్ట
---
*పలుకులన్నియు పలుకుట పడక ఇదియు 
పలుకులొలుకుచు పనిచేయు పదరవళి తొ
ప్రణయ ప్రక్రియ జరుగుటే పదనిసలగు   
చెప్పకచెకచెకా చేయు చేతి పనియు
---
ప్రణయసామ్రాజ్యమున  
---
*ఉ..తిక్కగ ఉండుటే మనసు తీరును రాజ్యపు హద్దులందునన్
తొక్కగ బ్రత్కుయే మనకు తోలున చర్మము తొట్రుపాటుయున్
డొక్కలు మాడితే తెలుపు డోలుగ నాటును సౌఖ్యమవ్వుటన్
రెక్కలు ముక్కలైననులె రక్తము పంచుటె రక్ష చేయుటన్
---
ప్రణయానందము --6
*మనసు పంచుటే ఇష్టము మందు వలెను
వెలుగు పంచుటే దీపము వేద మయ్యె
నది నిధిగను కదిలె నీరు నడక  కడలి
జల్లు ప్రణయానికి మలుపు చరిత చెప్పె
......
*పరిణితి వయస్సు వల్లనే ప్రక్క దారి
విషయ వాంఛల ఆరోగ్య విధియె నేర్పు
సంభ వించిన కళలన్ని సమయ మేలు
చరిత నేర్పు ప్రణయముయే చేరువయ్యె
........
*నిన్ను నువ్వు నిరూపించు నేతయనుటె
రాళ్ళు విసిరేటి వాళ్ళను రంగరించు
పాఠమున నేర్పు వారిని పలుకు వినుట
క్షణమొక యుగము దుఃఖపు క్షమకు దారి
.....
*మనసు ఒకటిగా నిలబడే మమత దొరకు
తనను తానుగా గుర్తించు తపన తగ్గు
మన్ను మిన్నయు కలియకే మనసు పండు
ధ్యేయ మొకటిగా కుదిరితే ధరణి తృప్తి
.......
*గుంపు మేఘములు మెరయు గుణము సతికి
నింపె వర్షపు ధారలు నియమముగను
నింపు ఆకాశ రాయుడు నిర్ణయమ్ము
దుంప మెల్లగా చిక్కెను దురిత యందు
.....
*ఆ...మనిషి చేయు అప్పు మగువసుఖము కోరు
తనువు పప్పు యగుటె తపన రోగి
మనసు తుప్పు పడితె మగువ మార్పు నడకే
తప్పు లెంచ కున్న తరము బ్రతుకు
----
*తే..కడుపు మండి తే యుక్తి గా కళల ఆట
కడుపు నిండి తే శక్తి గా కధల మాట
కడుపు ఎండి తే భుక్తి కే కలల వేట
కడుపు నిండ కే రక్తి గా మనసు బాట
........
*వేప చేదు అనుభవమే విద్య నేర్పు
చెక్కర స్థాయి గమనించి చక్క జేయు
మార్గదర్శక మధర్మమె మాయ నడక
ధర్మ ముప్రణయానంద తపము యగుటె
........
*ప్రతి ప్రాణము హరించి పరువెత్తు కాలుని          
వెన్నంటి పతిభిక్ష వేడు నాడు
శని పట్టి వని కేగు తన పతి నీడగా     
జని జంట చెరగుల బెనుచు నాడు  
---
*జనకాజ్ఞ వల్కలంబును జుట్టి యడవుల  
బడు భర్త వేణు వెంట నడుచునాడు  
మగ వారితో బాటు మారు వేసము దాల్చి 
సరి రాణి దాస్యంబు సలుపు నాడు  
---
*గీ:: నావగింజంత యైన గష్టానుభవము
దోచకుండుట కమలమ్ము దుర్జయమ్ము 
దుస్త్య జమ్ము నిసర్గమై తొణుకులాడు 
ప్రణయమే బీజభూతమౌ పద్మగంధి  

---

*గానమందు మోనముంచి మనసు నెంచె సొంపులై
వైన మాయ తన్ను తాను తిన్న కాల ఇంపులై
ప్రాణమైన ప్రణతి నుంచె  ఋణముతీర్చె శాంతమై
మానమైన మౌనమైన తృణము అనెడి నీడలై
.........
*నామదిలో కదిలేనే కధలన్నీ సోంపులై
నీమనసే కదలాలే వ్యతలన్నీ యింపులై
సమయాన్నీ సరిచేసే నిధులన్నీ శాంతమై
సముఖాన్నీ చేర్చానే బోధలన్ని బాధలై
........
*తే:: ధర్మ మందు సుఖము నిత్య దారిచూపు 
మూల ధర్మానికి ధనము ముఖ్య మొవ్వు 
అర్ధమునకు మూలమ్ తృప్తి ఆకలగుట 
ఇంద్రియాల్ని వశం ప్రేమ ఈశ్వరేశ్చ        
----
*మూలకారణం వినయమ్ము ముఖ్య మాట        
వృద్ధ సేవవలన విజ్ఞానమ్ము కలుగు 
ఆత్మ సంపాదనం ప్రేమ ఆస్తి కలుగు 
తానుగ ప్రణయానందము తనకు తృప్తి 
---
*సంభావ్యమ్మే - సంగమ్మేలే  
వైభోగమ్మే  - యైశ్వర్యమ్మే 
సౌభాగ్యమ్మే - సంతోషమ్మే 
ప్రాభల్యంమ్మే - ప్రాధాన్యమ్మే    
---
*శ్రీవారి కేను వలదా -సిరి నేను కాదా 
రావేల వేగ వరదా -రసరాగ దీపా 
భావాల పూల సర మో - పరమేశ నీకే 
రావాలు నీవి వినఁగా - రమణీయమేగా 
----
*దేహమ్ము తిత్తి గదరా తెలియంగ లేదా 
దాహమ్ము ముత్తి గదరా తరుణంబు రాదా 
వాహమ్ము మిత్తి గదరా పరువంబు పోదా 
సోహమ్ము చిత్తి గదరా సులభంబు గాదా 
----
*అత్తయ్య వద్దు నను నీవదిరించబోకే 
మత్తిల్ల వద్దు మదిలో మశకంబు గానే 
ఒత్తిల్లు మిప్పు డిఁకపై నుసి నించలేవే 
అత్తిల్లు పెద్ద చెఱయా యది యింక కాదే
---
*చీమలకు దోమలకు సూక్ష్మ జీవులకును
మెకములు నట్లె పశు పక్షి నికరమునకు 
బడుగు సామాన్య గుణమయి ప్రణయ మహిమ 
మానవాళికి గల్గుట మగువ యరు దె
---
ప్రణయానందము -- 8 
*శ్యామలమ్మగు నీమహీస్థలి సోమకాంతులు సొంపులే
రామణీయము కామవల్లరి హేమవారియు నింపులే
నామనోమయ కామ్యభావము నాట్య రాగము చూపులే  
సొమ్మసిల్లిన కమ్మనైనది చెమ్మ నయ్యెను నింపులే 
---      
*కోమలమ్మగు నామనమ్మున నామనిన్ విరులందమే 
రామ చిల్కరొ భామ పిల్చెను బ్రేమమున్ గురిపించునో 
కామితార్దము రమ్యమైనను కాంత సౌఖ్యము లండమే 
ప్రేమకర్ధము సౌమ్య సౌఖ్యము పేరు ముఖ్యము కాదులే 
...
*వంత నుంటిని జింతతోడను జెంత నీవిటఁ జేరుమా
యింతి నామది కంతుఁ గోవెల మంతరమ్మది మాల్మియే 
సొంతమైనది కొంత అయ్యెను శాంతి కోరుట జేరుమా 
పొంత నన్నది లేక ఉండెను పోరు జర్గిన మాల్మియే     
...
*అంతులేనిది వింత యైన య- నంతమౌ నొక యాశతో
వంత వీడుచు సంతసమ్మను పుంత ద్రొక్కుచుఁ బోదమా
పంతమేలను సంఘమందున వింత యాటలు యాశతో
కాంత దిక్కుయు నిత్య మయ్యెను  కానిదేదియు బోదమా
.......
* రసమె పరమాత్మ యాతడా రసమె క్రోలి
ప్రకృతి గల్పించు యానందభరితుడగును
 ప్రణయ వస్తు వనాదియై పరిఢ విల్లు
రాగ రహితమౌ చిత్తము రాయి ముగద
.........
*రాగమన రసమున ననురక్తి యనగ
బ్రేమ మనగను బ్రణయమ్మ పిలవ బడుచు
భిన్న పాత్ర ప్రయుక్తమై నేరువేరు 
పేరు లిక గొన్ని తాల్చునుసారసాక్షి

.ప్రణయా నందం....9
పెదవి మధురముయె కళ గా
మదన మనోహరుని రూప కల్పన వల్లే
కదనం తొక్కే భాష్యం
పదములు లేకుండ కవిత వ్రాయగ వచ్చున్
.........
ఆలోచనలో ధృడతే
ఆలాపనయే మనస్సు ఆశయ మవ్వున్
కళసంతుష్టత రగిలే
తనువందున పరిపక్వత తాపము తీర్చున్
........
ఆహారములో ఇష్టత
సహనమ్ము సమర్ధతే ను సాధన యందున్
దాహమ్మునుతీర్చుటలో
మోహమ్ము కళే సుఖాల మోక్షం! అవుటన్
.......
చీకటిన నేర్పు పాఠము
వాకిటి ముంగిటనముగ్గు వాదము తీర్చున్
కూకటి వేళ్ళతొ తరిమే
అహమును భయమును ఆకలి ఆత్రుత బుధ్ధిన్
........
ఆప్యాయతలే మనలో
విప్పారే కళ సుఖాల వేదము నీడై
తప్పొప్పులుగా కదిలే
చెప్పాచెప్పక నెపొందు చేష్టల పర్వం
.......
కనిపించని నవ్వొకటే
కన్నుల్లో మెరుపుచూపె కనికర మందున్
మానసమందును పరుగై
చనువే కొద్దిగను చూపె చురుకును పెంచెన్
......
.ముందు నిలిచియే ముచ్చట
పొందును కోరియు కోకను పోకను విప్పెన్
ముందర మోక్షము గనియే
చిందులు వేసియు మద్దుల చేష్టలు చేసెన్
......
చీకటి తుదిమెరుగులు గా
మక్కువ చూపిన మనసున మార్గము చూపే
బికము పికియు బరస్పర మే
చిక్కియు ఏకము వెలుగుకు చేరువ చేరెన్
.........
బహుకాలవ్యాకులతే
సహివాంఛ కోరియు చేరు సమయమ్మేగా
సహనమ్ము నీడ కొలువై
మోహము చిలికేను ముద్దు మోమును పంచెన్
........
వగరెక్కువగా కదిలే
పొగరెక్కువగా బిగువులు పొగలే కమ్మే
మగువే మదనుని గనియే
తగునా అనియే కుహూ కుతకుతే వల్కెన్
----
అనవుడు రతి పతి ముచ్చట
విన నభిరుచి కొంత పెరిగి విషయము సర్వం
బును దెలియ గోరి మదనుని
గని చెక్కిలి నొక్కి ముద్దుగా నిటు వల్కెన్
.......
ఉ..నిక్కమొ కింత తేలె రమణీ రమణీయ సురూప పండితుల్
నొక్కి వ చింప లేని యొక నూత్న వినోద మనోజ్ఞత త్త్వమున్
మక్కువ నాకు దెల్పితివి మానవులం బశుపక్షులం దొకే
ఫక్కి జెలంగునా ప్రణయ పద్ధతి భిన్నముగా నొసంగు నా
......
 
ఉ :: నావుడు మన్మధుండు నవనాగరికం బగు ప్రశ్న మిద్ది భా 
మా వినుమా వచింతు నని మంజుల లీల వచించె నిట్లు మ 
ర్త్యా వళి ప్రేమకున్ ద  దితి రఖిలజీవుల ప్రేమ కుల్లస 
 త్పావన తా విలక్షణ విధంబునఁ బేధము దోచు నెచ్చెలీ   
-----
ప్రణయానందంలో పద్యాలు...10

*పచ్చిక బయళ్ల గడ్డి రొంప ములు మేసి 
పడిన నీరును గ్రోలి సంబరముమీర 
నరకనులు విప్పి ముదమందు హరిణి గొమ్ము 
కొనల హరిణంబు గోకదే ప్రణయ మహిమ 
 ---- 
*కాలము ఇదియును -- కావ్యము నీదే  
గోల లు మరిచియు -- గోప్యము నీతో 
మాలను మరువను -- మధ్యమ కాదే 
తాళము ప్రణయము - తాపము నీకై 
---
*మానసమునఁ గల - మన్మథ లీలా 
సూనములనుఁ గల - సోయగ గోలా 
మౌనము మరచియు - మోహన రూపా
గాన సరిగమలు  -  గమ్మున వచ్చే 
---
*మోహన కదలిక - మ్రోఁగెను నాలో
వాహిని తెలపగ - వాదము లెన్నో
రా హరి నను గన - రమ్యము గా నా
దేహళి ప్రణయము - దృష్ణను జూతున్
----
*గీ...కదలి వచ్చి కలిసి ప్రేమ కళలు తీర్చు
కధలు వద్దు ప్రేమ పిలుపు కలల రాణి
నిలయ మౌ నిజ జీవితం నీకు నాకు
ప్రణయ నాదవేదము కళ ప్రకృతి ఫలము
....
*కం...నిద్దుర లేకే ఏలిన
హద్దులు దాటక మనస్సు హాయిగ నుంచెన్
ముద్దులు మరచే ఉంటిని
పద్దుల ప్రణయము గనేను పెదాలు నుంచెన్
......
*గీ..ప్రేమ బేధము లన్నింట విలువ గట్ట
నలవి గానిది యను రాగ మద్ది కొమరు
బ్రాయమున స్త్రీ పురుషుల హృత్ఫలకము లను
బుట్టి తెగ దట్ఠియటె గడ్డ కట్టు దరుణి
........
*గీ..యవ్వనంలో కళలు పిండి యదను పంచు
కష్ట నష్టము కానక కలలు తీర్చు
నాకుటంబ సంతసమేను నాకు దీక్ష
ప్రణయమునె వాన చలి యెండ ప్రధమ ఓర్పు
---
ప్రణయానందము -- 11 
* కంటి ముందున్న లక్ష్యాన్ని కలగలుపుగ 
  అంతలోనే కనుమరుగై  అలక తలపు 
   అందనంత దూరం లోన సంబరమ్ము 
   గగన కుసుమమై ప్రణయమ్ము కళలు నేర్పు 
------
* లక్ష్య మును పొంద గలిగితీ లయల తోను  
  లక్ష్యశుద్ధి తో పాటు క్షణమ్ము కలలు 
  చిత్త శుద్ధితో మనసునే చేష్ట ళుడికె   
  లక్ష్య తాండవ ప్రణయము లహరి యగుట
-----
* ఎంత తిన్నను గంటలో ఏల పలుకు 
  జీవితమనేది ఫలవంత జీవ మగుట   
  వీడనివి వాసనల బంది వేల్పు లగుట 
  జీవితభ్రమణమ్ముయే చేష్టలగుట 
-----
* లౌకికమగు కధలుగా అలౌకికముయె  
   అడుగడుగునందు లక్ష్యాన్నిసాధనకళ        
   ఆది లోనతో డుండేటి ఆత్రమేను   
   లక్ష్య ము జనుల ప్రణయము లొలకమ్ము
.........
* కల నిజ పరచడం కాదు కనికరమ్ము
  నిజమునే కలగనటమే నీకు రక్ష 
  ప్రణయ భావాల తత్త్వమే ప్రీతి కలలు
  హృదయ తత్వాన్ని తెలుపుటే ధృతి మతియు
.........
* జీవులను ముంచి ఆడించు జీవ యాత్ర
  సంద్రమున తేలుకొయ్య యే సమత జీవి
  కష్టము కెరటాలు గనుకే కలల వల్లె
  ఇష్ట ప్రణయము సంద్రమే ఈశ్వరేచ్ఛ
..........
* చెరువు నీటిలో స్వేచ్ఛ గా చేపల కళ
   బరువు నడకలై రచ్చగా మనసు కళలు
   తరువు ఉపయోగ వాంఛలు తనువు పైన
   కరువు నీడప్రణయమేను కధలు చదివి 
     .......
* ఆశల వలయం లో చిక్కి ఆట వలదు
   నీవు అత్యాశ పడకు మా నీకు తగదు
   పాశ మనునది పాఠము పాప మవదు
   నమ్మక ప్రణయ గీతమే నటన కాదు
.     ..........
*మనిషి అనుభూతులతొ ప్రేమ మధుర మగుట
మేను పరవశా లకళలు మేలు చేయు
నేల తల్లి మంగళముయే నీడ లగుట
పరిసరాలు శుభ్రంగా ను ప్రగతి యగుటె
.........
---    
*ప్రణయానందము పద్యాలు....12
ప్రకృతి కర్మల తో శృతి ప్రతిభ కొరకు
భక్తి ఉల్లాస ఉత్సాహ భరిత మగుటె
ఆర్తి జీవితంలోనే ను ఆశ లగుటె
జ్ఞాన సంపద నిష్టతొ జ్ణాతి యగటె
..........
*జాప్య మనునది సుకృతం మే జాగృతిగనె
కళల సాహిత్య మనునది కాల జగతి
త్యాగ నిరతి కి మాటలు కాన రావు
స్మ్రతికి హృదయ శుభాకాంక్షలు గను కళయె
........
*తప్పును తెల్పెద నేనే..తరతమ చూడక
ఓప్పుగ వాదన నాదే... ఓర్పుయు లేకయె
తప్పును ఒప్పుగ చెప్పే.. తప్పుకు నేందుకు
ఒప్పుగ నమ్ముట తప్పే..ఒడిసియే పట్టుటె
........
*పొమ్మని చెప్పను నేనే...పోరుగ కాదులె
నమ్మక ముందియ నీపై..నాట్యము కాదులె
రమ్మని కోరను నేనే....రమ్యత కాదులె
యిమ్మగ బ్రేమము నీవే .. ఇష్టము నీదిలె
.......
*బంధ ము విముక్తి అనురక్తి బాధ కాదు
మంచి చెడులన్ని ప్రణయమై మనసు చేరు
ఇరువురు కలయికయె బంధ మగుట నీతి
నిత్య మనురాగ మనుబంధ నిలయ మయ్యె
........
*ఆహ వెన్నముద్ద లుఓహొ ఆర్తి నాది
నాది నుట్యము అనకుమా నాకు నేను
లోక మంత యు తిరిగినా కోప మవదు
జనుల సేవలే మనసున జపము లగుటె
.......
*ప్రాణాయామం దేశంలో మత్తకోకిల పద్యం
ఏమి ఈకళలన్ని మారెను ఏల తీర్పును చెప్పెదా
కామి తార్ధముగాను నెంచియు కాలయాపన తప్పదా
భూమి కోరెను భారమయ్యెను భుక్తి కష్టము ఏలనో
సామి నీవును సంధి చేయుము సాధనమ్ముయు నీవులే
........
*ఎన్ని మాటలు కల్లలాయెను ఏమి చెప్పెద ఇప్పుడే
మన్నికైన వి యెన్న కుండిన మానసంబున కష్టమే
సన్నిధానము తెల్పలేకయు సమ్మతమ్మున తెల్పుటే
యెన్ని కైనను వారసత్వము యేమి చెప్పక ఉండుటే
.......
*ప్రణయా నందం లోని పద్యాలు --13 
 
*విసిగి పోయిన చంద్రుడు విర్ర వీగి 
కొలను లోని కలువ తోను కొరకు కలిగి   
చూసె సౌందర్యాలను ముగ్ద ఊపు పొందె 
కలువ తో సరసాలాడు కలువ రాయ 
----
ప్రాణాయానందం --14

*బుద్ధి ప్రేముడి విషయేచ్ఛ బడ్డ తిర్య
గాలి వావియు వరుసయు నరయు జాల
 కట్టె సంభోగ శృంగార మనుభవించు 
మానవుడు నట్టిడే  నీతి మరువ వగువ
.........
*..మానవత జ్ఞానవంతము గాన వావి 
వరుస ల గణించి ప్రణయము జరుగు చుండు 
పశువులకు భక్షు లకు వట్టి ప్రతిభ లేమి 
రాగ మపవిత్రమై యుండు రతి యె‌రుంగు 
........

*చేరి వసించు పూరిగుడిసెల్ మణి సౌధము లట్ల, త్రాగు ని 
స్సార పు టుప్పు గంజి య దె షడ్ర ససాధ్యసుభోజ్యమట్ల య
వ్వారలు దాల్చు పేలికలె బంగరుపుట్టములట్ల తోచు సం
సంసార పరస్పర ప్రణయ సారపిపాసుల కోత లో దరీ
.........
*కర్మ ఫలముల వల్లనే కలయిక కళ
ఆశ లుదురాశ వలయమే ఆట యగుటె
హర్ష శోకపు జీవితం హారతి యగు
గుణము ప్రణయాన్ని చేరుటే గుట్టు బ్రతుకు
....

*పుట్టి పెరిగియు మార్పుకు పుడమి నేను
నేను అహముయే మరణించి నిజము బ్రతుకు
ఉండి తిరిగి పోయినమేను ఉడుకు బుడగ
ఆత్మ తృప్తి పడుట ప్రేమ ఆత్మె నేను
కడలి లో నది ప్రణయమే కడకు తీర్పు
.....
*ప్రేమకు ఉదాహరణములే ప్రేయసి కళ   
ఇవ్వటం పుచ్చుకోవటం ఈప్సి తముయె   
ప్రేమ ఎదిగి ఒదిగుటయే ప్లీహ మగుట 
నిత్య ముఉదాహరణగాను నీడ నిచ్చు  
---
*విత్త నమ్ము పగిలితేనె విచ్చి మొక్క  
మెండు టాకు కలిసి తేనె మెలుకువగను  
కొత్త‌చిగురు తలెత్తేది కొలువ తీరు 
కాల మహిమవల్ల కరిగే గాయమగుట
---
*నెవరు చెప్పారు నాట్యము నెమలి కులుకు
సాగి పొమ్మని నదితో ను సాహసమ్మె
సులువు కాదులే బ్రతుకులు సుఖము శాంతి
వేళ్ళు అన్నది ప్రణయపు వేద వాక్కు
......

*కావాలి లక్ష్యము - కనుపాప దేహమ్ము 
రావాలి నిత్యమూ - రణరంగ ప్రేమ 
పోవాలి స్వార్ధము - పోరుతో దాహమ్ము  
అవ్వాలి ప్రేమయే - ఆనంద మెంట
----
*చూడవా ఇప్పుడే....చూపులే నీ కళా
నాడనా తెల్పుమా....యందాల పొందు
తోడుగా నేనున్న...తోరణమ్ముగను
చెడుటెందుకు సామి... చెలిమి గా చాలు
----
*ఈనాటి నాయాశ - యింద్ర నీలపు రంగు
విన్నావ రా చుట్టు - సిరి నాహొరంగు
ఆనంద  గళములో - ఆశలు నేవేతు
మూన్నాళ్ళ నావెంట  - ముచ్చట్లు సేతు
---
*మోహమ్ము ఈ రీతి - మోదాల స్వరగీతి
మాహ యీరోజులో - మాధుర్య మోజు
దాహమ్ము ప్రాణాయమ్ము - ద్వరగా రమించు
దాహమ్ము నానిండ - దాచుకో దండ 
----
*పూవు కంచమ్మునన్ దేటి బోటి కూడి
గండు తుమ్మెద కడు విందుగా మరంద 
సార ధారలు గ్రోలుట చాన కన నె      
ప్రణయజన్యంబె యా యైక్య భావ గరిమ 
...
*బ్రహ్మ ముడి గీలు కొల్పి తీర్ధముల మునుగు 
జంపతుల లీల నా యంచ జంట సూది 
కెడ మోసంగాని కలయిక మడువునందు 
దేలియాడుట ప్రణయ సందీప్తి కాదె 
---
*కాకలీకల రావముల్ కలగలుపుగ 
బికము పికియు పరస్పర ప్రీతి ముక్కు 
కొనల నొండరు మెడల నూల్కొలుపు టరయ
నలువకును మించు ప్రణయమ్ము నలన గాదె 
---
*ఆత్మశుద్ధి ఆచారము డైనవారి , 
భాండశుద్ధితో పాకము బాధ్య తగుట , 
చిత్తశుద్ధి ప్రణ యముయే చేష్ట లుడికి  
ఖర్మకొద్దీ కలసిపోవు ఖరముమల్లె   
----

ప్రాణాయానందం --15
---
*పాదరక్షలు కదలిక పగలు రాత్రి 
కళ్ళ జోడుతో కదలిక కాంతి మలుపు 
చేతి కర్రతో కదలిక చింత తీర్చు 
మనిషిలో ప్రణయము సుఖము మాత్ర లల్లె 
---
*గీ..కోప తాప ప్రభావము కోరు కొనకె
దూర భార బాధ్యత ఏల పుడమి నందు
ప్రణయ బంధము మారదు ప్రగతి లోన
ఆత్మ నిగ్రహం ఓర్పుయే ఆశ మార్చు
.........
*గీ...పృధ్విలో విత్తు మొక్కగా కృషి సలుపుటె
పండు టాకు రాలె చిగురు పండుగవుటె
కాల ప్రకృతి లో గాయము కరిగి పోవు
ప్రణయ వాంఛలు పుట్టు టే ప్రగతి శీల
........
*గీ...క్షణము బ్రతుకులో ఆశలు కళలు ఏల
క్షణము సుఖము లో దు:ఖము జపము లేల 
క్షణమొక యుగము గానుండు సమర మేళ 
క్షణ నిరీక్షణ ప్రణయము శయన మేళ

ప్రణయా నందం -16

సీ:: గాళి హోలునచేరి -- ధూళి యె కమ్మే లె
నళ్ళగాను మబ్బులు టేలి - నాత్య మేళ 
ఉలుములు పెలపెల - ఉల్కలు గోలేల 
కులవవే వచ్చమా - మాతు కులువు 
మన్మధ లీలలు - మాకును కమ్మెలే
హృదయవాంఛలు గోల - హాయి గోలి 
చెప్పి చెప్పకవచ్చె - చేష్టలన్నియు చేళి
కాలమార్పుకు కళై - కనికరమ్మె 

చేతి వాటము నీకయి చేష్ట లుడివె
మన పిలుపుల కళే ఇది మనసు పెట్టె 
కులవవే వచ్చమా మాలొ కులుకు తీర్చు 
మాలొ ప్రణయము ప్రమిదగా మమ్ము మార్చు 
___((()))___    

సీ:: నీ నవ్వులన్నియు - నేలచూపుల  ప్రేమ
నీ అందమంతయు - నింద లేల
నీ మాటలన్నియు - నిజమేనని తలపు 
నీ ప్రేమ నాకులే - నిర్ణయమ్ము 
నీ నిజ మైనది..నీలొరగిలే ప్రేమ
నీ కళ తీర్చేద - నేని పుడులె
నీ వీక్షణాలులే - నిజముగా ప్రణయము 
నీ జయ విజయమే - నేటి ప్రేమ 

బిందువున బిందు వగుటేను బేల మనము 
బంధ మాదుర్య సంపదా బడయవచ్చు 
రోజులన్నినీవియు నావి రోష మొద్దు 
నెచ్చెలి చలినే మార్చుము నిజము ప్రేమ    
___((()))___     

*సీ:: ఒకటిగా కావాలి - ఒక్కటై ఉండాలి
ఓర్పుయే ఆయుధం- ఒడిసిపట్టు 
లక్ష్యము ఒకటిగా - లాస్యము వద్దులే 
సాధనలో తృప్తి - సాన పట్టు 
ఉన్నతమైనది - ఉజ్వలమైనది 
ప్రణయము మనలోనే - ప్రగతి పట్టు 
సర్వ సమాజము - శ్రేయస్సు మనలోన 
లక్ష్యాభిలాశతో - లహరి పట్టు   
ఉత్కృష్టమైనచో - ఊసరవెల్లిగా   
శక్తులు లన్నియు - స్వేచ్చ పట్టు 

ప్రేమ అందలమెక్కిన -ప్రేయసికళ 
విజయవాంఛలు కలుగుట - వెన్నెల కళ  
నిత్య నిస్వార్ధ బుద్ధియే -నీకు రక్ష 
నిర్వి రామకృషిగనులే -నిజము బ్రతుకు 
___((()))__          

*సీ ::లలి మనోహర రూపవిలసనావిర్భూత
హావ భావములచే నంకు రించి     
యతిశ యానుభవ విద్యాగోచరాపాంగ 
పరమార్ద వీక్షల బల్ల వించి 
ఘననిష్క్రియాంగ తాగాత్ర కంపన గద్గ 
దాలాప విధుల నిండారా బూచి 
గ్లాని నిర్వేద శంకామ దాసూయాశ్ర 
మాదుల తోడ నింపారు గాచి  

దోరగా మారి పరిపక్వసార రుచులు 
మీరి, ఫలపూరముల వన్నె లూరి, పెరుగు 
బ్రేమవృక్షంబు ప్రేయసీ ప్రియుల మృదువి
శాల హృదయాల వాల భూస్థలుల జెలువ
___((()))___
ప్రాణయానందము -17

కమకమ్మని కళలు.. కలతలన్నియు తీర్చు
నమ్మక మనునదే ...నడక నేర్పు
తలపుల వలలోన... తనువు తహతహలు 
వలపుల కృషి కళ....వచ్చి చేరు
మనసు మల్లెల నవ్వు..మగువ రాశులు తీర్చు
అణువణువు తపన..ఆత్రముగను
అనునయన ప్రణయ..ఆట లుడికె

ఘడియఘడియకు కోరిక ఘనత కెక్కి
గుచ్చుతుండేమగాడు లే గుర్తు చేయు
గౌరవించేటట్లు కలిసి గౌరవించె
స్త్రీ నికూడాసగౌరవ లీల యిదియె
........

సీస పద్యము

పూల బుట్టలు జూసి పూర్తిగా మరిచి యే
పండ్ల బుట్ట కుదిపే.. పడుచు బేల
కవుల హృదయ వాంఛ...కల కలమై నదీ
కళ్ళతోనే తెల్పె ... కళల విద్య
బుట్టలో పడువారు...బుడతలే యైనను
బుడగలా వచ్చియు బుర్రు నెగెరె
వాళ్ళు వీళ్ళు ననక... వాకిలి వంక నే
వాలుజడల వారి.. వాస నయ్యె

పెదవి చుక్కలు జూపు నే  చూపరులకు
మక్కవ తొ  మకరంద మే మధువు పంచి
ప్రక్కలను జూడక నరులు పలక రింపు
గమ్మున యదితంతు యనేను గళము విప్పె
_____(((())))_____

సీ..గండుకోయల రాగ గళముయే వినినంత 
సుమగంధము కొరకు సూక్తి లేల
సుకుమార మైనట్టి పువ్వులు కలకలం
అడవి పూల పిలుపు ఆట సలపు

చల్లని గాలిలో చపలత్వ బుధ్ధి యే
రాలుతున్న చినుకు రెమ్మ కులుకు
మనసంత గిలిగింత మనుగడ కొరకే ను
మనసు పెట్టె పలుకు మధుర వాణి 

నీతులు ఇపుడే ఎందుకే నీరజాక్షి
పరుల మేలు చేయ సుఖము  పనియె లేదు
నోరు మూసుకొమ్మని ఏమి నొసలు తిప్పు
కొందరికి జిక్కి జారను కోమలాంగి
____((()))____


* ఏక పతిత్వము ప్రేయసి 
కేకసతీ వ్రతము ప్రియున కింపెసగిన నే    
లోకమున వారి ప్రణయము 
శ్రీ కమనీయముగ నెగడి చిగురించు సతీ 

*పడతి నీళ్లకువోయిన పావుగంట 
యతడు వచ్చాడు తొందర యద్దగంట  
పోపు కావాలి అన్నారు పోనుగంట 
గంట గడిచినా మ్రోగదు వంట గంట 

*ఆగవయ్య మగడ వేగ మాడు గంట 
నోరు సిద్ధ మయ్యె యుడికె నోచు గంట 
యార గించిము యుడుకుకు యన్నగంట   
మాట వినగ నతడు చేసె మోత గంట 

*ఉండ బట్ట లేక నువిద ఊపె గంట 
పండు కున్న వేమి తినుము పటిక గంట 
పెద్ద బండ నెత్తేద్దును పేనుగంట  
పెట్ట కున్న వంట వలదు పెనుగు గంట 

“చెంప లవలె కళ్ళు కలిగే చేరు గంట 
పసిడి వన్నెల మోముతోను పడుచు గంట 
తమల పాకులలో సున్న తొడిమ గంట 
ముసిముసి నవ్వుల లలనా ముందు గంట    
  
*సీ:: ధన పిశాచము వట్టి తన వాంఛ తీర్చెడు  
రమణి గూడుట యనురక్తి కాదు 
తనవంకఁజూడని తన్విపై కనుగీటి 
యానందపడ ప్రణయమ్ము కాదు 
జడునిగా దనను జూచెడి కాంత నాశించి
నిద్ర వీడుట ప్రేమ ముద్ర కాదు 
బాజారు రంకు వెంబడి మాన హీనుడై 
తిరుగాడు టది రససరణి గాదు 
       
పాశవ ప్రేమమద్దిత త్పాశములను
జిక్కి మనుజుడు వెత నంది స్రుక్కు నద్వి 
తీ యమై తీయమై భారతీయమైన 
సదమలప్రేమమే ధరా స్వర్గ మతివ 
___((()))___


ప్రణయానందము - 21 

*  గర్బపు ముక్కను నేనే
నిర్భయ చట్టం మనసున నీడలమయమై
దర్భల బ్రతుకులు మావి లె 
దుర్భర మైనట్టిదేను దూది బ్రతుకులే

*  మేలిముసుగు తొలగేలే
జాలిగ చూపులు మనసుకు జాగీ రగుటే
గిలిగింతలు గా తపమై
కలిమాయసొగసు ను మెచ్చి కళళే పొందే

* నువ్వు లేవు గళము నుంచెను నాలోన 
నవ్వు మల్లె కలువ నాతోనె
పువ్వులా పరిమళముళే పుడమినందున నీవు 
మువ్వలా జూకాల మురిపమే

* నేతిగారెలు చేసి నెమ్మి జూపడు లీల  
రాతి గుండెయ దిట్టి రాత్రిన
పూతరేకులు వండి మోదమొందడు లీల
మోతనంతయు కళా మోజుగా
  
*మధురమైనట్టివై ..మదిలోని దీపము
కరిగిపోయే కాల .. కళ్లలే  
మధుమాస కోకిల..మాధుర్య గానమై 
కావ్యాలను రాగమై--- కథలుగా 

* అంగణ సుమధుర ..ఆత్రమే భూషణం 
రసఝరి యదలో...రవ్వలే 
ఆమె సాంగత్యంలో ... ఆశలు తీరెనే
తనువులోని అణువు ...తపనుగా  
  
* నవనవోన్మేష నా ..నవ యవ్వన పుభావ
తెలియని భావమే -- తెలుపుటే   
గీతిక తనువంత --కేళి కలలుగాను 
మనసెందుకో మరి..  మైక0ము 

* అలరారిమధు మధురి.. మల హృదయస్పంద
చేతనత్వంలోన ..   చత్రఛాయ
అనుక్షణ జీవితం -- అజరామరమగుటే
సానుభవ కళలు -- సాధనే 
___((()))___

ప్రణయానందము --22
 
ప్రణయప్రభోదము...ప్రధమ ఆకర్షణగా
ప్రకృతి పరవశమ్ము..ప్రగతి  గా
పుడమి పురిటిగడ్డ... పువ్వులా ప్రాణమై
కవులు కాలము లాగ...కాంక్షఏ 

తెలియని భావమే .. తెలుపు హృదీవీణ
వీణ తంత్రిని మీట ...వేదన 
మనసంతయు కురియ... మరులగొలుపు వాన
కాలనిర్ణయముయే -- కామమే  

నిత్య వసంతగా...నిత్య సింగారమై 
సింగార ఝరియేను..సిరులుగా 
రేయి భేధము లేదు... రంజిల్లుట పగలు
సేవభావాలన్ని --- సేతువే  

మరచినది మనసు మాన పరిష్వంగంలో!
ఆనంద బృందాల.. ఆరొగ్య 
మరచిపోలేనిట్టి.. మంగళధ్వనులు
కారుణ్య మన్నది -- కాపలా 

సీ:: అన్యున్య కృత బంధురా శ్లేషణ సుఖంబ 
భాసుర మణిసౌధ వాస మగుచు 
నొండరుల్ విడక కన్పండుగా జూచుటే      
పట్టు పట్టంబులు సుట్టు టగుచు
నితరేతరసుధా ప్రసృతనర్మభాషలే 
చవులూర్చు రుచ్యభోజ్యమ్ము లగుచు 
సతతపరస్పర సాన్నిధ్యభాగ్యమే 
డెందమ్ముదన్పుమెల్వి0దు నగుచు 
    
నిత్యకల్యాణ లక్ష్మి సన్నిహిత చేటి 
యె మహానందసేవలు నందజేయ 
స్త్రీ పురుషు లొప్పుచుందురో చెలువ విలువ 
కట్ట రానట్టి ప్రణయమ్ము కలుగు వెడల
___(())___   
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి