2, మే 2022, సోమవారం

గజళ్ళు - అంచయాన -019- 027

 



గజళ్ళు  - అంచయాన -019
విధేయుడు: మల్లాప్రగడ రామకృష్ణ 

మీనము వంటి కన్నులు కలిగి నట్టి అంచయాన 
జ్యోతి స్వరూపిణి కలిగి ప్రేమతో అంచయాన  

లోకము లోని భక్తుల శోకమునే తొలగింపే 
కంటి చూపు చేతనె పోషించేది అంచయాన 

మనసులో జనన మరణముల భయమును తొలగింపే 
చూపు పుణ్య ఫలమై మంచి చేకూర్చు అంచయాన  

అనర్ధములకు కారణమైన ద్వేషం తొలగింపే 
అంధకార అజ్ఞానము ధ్వంసంగా  అంచయాన  

హాలాస్య మను మరో పేరు కలిగిన అంచయాన
అఖిలాండ నాయకునికి శక్తినిచ్చు అంచయాన 
  
____(((()))____


గజళ్ళు - అంచయాన -020
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
 
మనోవృత్తికి భోగము కోరుకుండే అంచయాన  
విషాంకురముయొక్క గతినివలేనను అంచయాన   

మనసులొ ప్రవేశమివ్వక మొదటనే ఛేదించుట  
సముద్రమున కలిసేటి జలమువలే అంచయాన 
  
పామరమనస్సు పదార్థ పూర్ణమై ఛేదించుట
ఆశతొ ఇంకను కోరుచునే యుండు అంచయాన 

చేతిని చేతితో నలిపి అనుకొనిది చేధించుట 
పండ్లు పండ్లచే కొఱికి తృప్తి పరిచె అంచయాన 

అవయవములను అవయవములచేనే చేధించుట 
నాక్రమించి నిగ్రహింప చేసేది  అంచయాన 

ఇంద్రియములను శత్రువులను జయించు అంచయాన 
సర్వప్రయత్నములచే  జయించేది అంచయాన 

___(((())))___


 గజిళ్ళు - అంచయాన 021 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

ఆత్మానుభవంలో నిష్ఠకలిగిన అంచయాన  
పరీక్షించాలనే పరీక్షలకు అంచయాన 

సముద్రం లో కెరటాలు లోక రక్ష ప్రకృతి నేను 
తెలుసు కో విశ్వానికి మూల మగుటే అంచయాన 

అసంపూర్ణం, అహంకారం నాకు ప్రకృతి నేను
ఎండమావుల నుండే కాపాడే అంచయాన 

అసంఖ్యాకమను వస్తువుల శక్తిగా ప్రకృతి నేను
అధిష్ఠానమయి ఆత్మ పూర్ణంగా ఆంచయాన

విశాల విశ్వమంతా ఉదయించే ప్రకృతి నేను
నీలో నుండే నర్తించి లయం గా అంచయాన 

కాంక్షించుఁ వారికిప్రణాళిక గాను ప్రకృతి నేను
సమాజ సేవతొ విశ్రాంతి లేనిది అంచయాన 

నికృష్టంగా జీవిస్తున్న ఉన్నతంగా అంచయాన 
అహంకారానికి బానిస కానిది  అంచయాన 
---((())))---
అంచయాన : అర్ధం హంసాయొక్క నడక వంటి నడక గలది =స్త్రీ


* గజిళ్ళు - అంచయాన 022
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

ఇంద్రియాలు జయించే వివేకముగ అంచయాన 
హృదయమందలి శత్రువులనుతరిమే అంచయాన     

ఎవరు తమ చిత్తము జయించిరో వారు గణనీయులు. 
హృదయమను బిలమున చుట్టచుట్టే అంచయాన  

సమస్త భూమండలనుందును సౌభాగ్యవంతులు
సంపాదించి పూర్ణత్వం కలిగించు అంచయాన
 
మోక్షకౌశలాదులందు వారే సాధుచిత్తులు
గర్వ పరవశమై మనస్సను సర్ప అంచయాన 

పురుషు లనఁదగిన మరియు పురుషకళల గణనీయులు
మహా నిర్మల మైన తత్త్వవేక్తి అంచయాన  

కాంక్షించి కష్టపడి ప్రణాళిక లతొ అంచయాన 
సమాజ సేవతో విశ్రాంతి లేని అంచయాన  

____(((())))____


గజిళ్ళు..అంచయాన..023
విధేయుడు. మల్లాప్రగడ రామకృష్ణ

మేఘంలా బుధ్ధితొ తాపం తీర్చు అంచయాన
జతగాడు తోడు లేకున్నా బ్రతుకు అంచయాన

అశ్వము దౌడు చేసినా దెబ్బలే తప్పవులే
బ్రతుకు తెరువు కు కష్టమైన భరించు అంచయాన 

 పండ్లున్నా చెట్లకు రా ళ్ళ దెబ్బలు తప్పవులే
దేహంతో ఆశలను తీర్చేది అంచయాన

సుఖము దించినాకే దెబ్బలకు ఓర్చు తప్పదులే 
ప్రొణం పొయ్యేదాక ప్రేమించు అంచయాన

పేరువున్న విమర్శలే భరించక తప్పదులే 
పిల్లలు  అన్నా సమాధాన పరచె అంచయాన

మనిషి మద్యం మత్తులో చిత్తవ్వక తప్పదులే
కాసుల వేటను ఆశించి కుండిన అంచయాన

ముదిమి కౌగిట్లో మనసు ఓదార్పులు తప్పదులే
గుడుంబా కు చిక్కే యువతను మార్చు అంచయాన

నాలుకను ఆపకయె పలికేనులే అంచయాన
చిరునాలుకను ఆపియు మనసు ఆపే అంచయాన

____(((())))___


గజిళ్ళు..అంచయాన..024
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ

సంబరాణ త్రిగుణాలు  మేలవింపు అంచయాన
ధ్యాన ముతో కార్యకరుణ నాదమై అంచయాన

 కాల సృష్టి స్థితి లయల జ్ఞానం మ్మే జీవితాన
లంపటపడి లక్ష్యం వ్యక్తం చేయు అంచయాన

సంఖ్య లెన్ని వున్న శ్రధ్ధతో దీక్ష  జీవితాన
ధ్యానించి పరమపదము నా ఉండే అంచయాన

కాన వచ్చు ప్రకృతి లీలలతోనే జీవితాన
లంబ శిఖరంగా సాధన ప్రక్రియ లొ అంచయాన

సంతృప్తి ముఖ్యం గా చేయు క్రియలు జీవితాన
ధ్యాన సాధన నిత్యం వ్యాయామం  అంచయాన

కాల నిర్ణయం బట్టి యే పలుకు అంచయాన
లంబుషము ధరించి అమ్మవారిలా అంచయాన

______(((()))))_____


గజిళ్లు - అంచయాన -025
విధేయుడు" మల్లాప్రగడ రామకృష్ణ 

సర్వప్రాణులకు చైతన్యా నిచ్చు అంచయాన  
సర్వాన్నీ గుర్తించె సమదృష్టి అంచయాన

సంకల్పం "నేను చేస్తున్నాను"  ఎప్పుడనక     
"ఇదినాది" వ్యక్తపరచ లేని స్థితిన అంచయాన  

అహంకారం కర్మలను చేస్తున్న ఎప్పుడనక  
వ్యక్తిత్వం తెలియని అజ్ఞానం తొ అంచయాన  

జీవితమే సమరమయినా ప్రేమతొో ఎప్పుడనక
అందఱిసుఖమే ధేయముగా ఉండె  అంచయాన 

ఆత్మజ్ఞానుల మంటున్న మనుషులను ఎప్పుడనక
ఎప్పుడూ మమకారాన్ని అందించు అంచయాన 

ఈ క్షేత్రమున పుట్టిన పుణ్య ఫలము అంచయాన 
నిష్ఠలగు మునులకు ముక్తి నిచ్చేది అంచయాన 
____(((())))____


గజిళ్ళు...026.
విధేయుడు..

జీవితేస సేవధ్యేయమ్ము తో అంచయాన
ప్రేమ పొం దువాడొక్కడి కోసమే అంచయాన

విరియు మల్లెలే కురియు జల్లులేమనసు కు శాంతి
కన్నుల తో భావాన్ని తెల్పేదియు అంచయాన

చెరువు లొ పువ్వులు సిరుల నవ్వులే మనసుకు శాంతి
బందీగా చిక్కినా ప్రేమ పంచు అంచయాన

తరువులు పంచును చల్లని గాలులు మనసుకు శాంతి
బంధానికి చిక్కినా సుఖము నిచ్చు అంచయాన

దినములే తియ్యగా మార్చుటయే మనసుకు శాంతి 
జీవ రాగమ్ములు భావ నాదమ్ము అంచయాన

తప్పులన్ని సరిచేసి సిరులు తెచ్చు అంచయాన
ముప్పులు రాని పలుకులు నుంచుంటే అంచయాన
_____(((()))))_____


గజళ్ళు - అంచయాన 
విధేయుడు 

దుఃఖానికి బాహ్య కారణం లేదు అంచయాన 
కారణం అంతర్గతమే అర్ధమే అంచయాన 

బాధ్యతలు బాహ్యానికి విసిరేస్తె ఫలితమవదు  
రాకపోకలు ఉన్న ప్రతీది మనసు అంచయాన 

అవమానం బయటది కోపం మీలొ ఫలితమవదు
ప్రాథమిక సత్యాలలోని అర్థం అంచయాన 

భౌతికపరమైన సుఖశాంతులతో ఫలితమవదు
నిత్యమూ తా నా ధరమేను అనే అంచయాన 

స్వయంప్రకాశ స్వరూపిణి అయిననూ ఫలితమవదు 
గర్భం నుండి భూ గర్భం లోకే అంచయాన 
  
ఆధారమివ్వగలంతటి శక్తుల తొ అంచయాన 
రాకపోక లేని ఉత్తమ'పురుష'ము  అంచయాన 
 
____(((())))___



గజిల్లు - అంచయాన - 028
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

కాలం మాయంటు నెపం వేయనిది   అంచయాన 
మనిషి తప్పును తప్పని వాదించేది అంచయాన 

నిస్వార్ధపరులు అదరి కోసమేను నిజంగాను
మానవత్వంతోను బ్రతికించే ది అంచయాన

తమకోసం ప్రార్ధన స్వార్ధమే ను నజంగాను
జగత్తులో సుఖమునె అందించేది అంచయాన

తలచి వలచి విసిగి వేసారెనులే నిజంగాను
కంటనీరు పన్నీరు గా మార్చే అంచయాన

పరిహసించి పరవసించి ప్రేమయే నిజంగాను
మమత మత్తు తొలగించే ప్రేమతో అంచయాన

దైన్యము లేక పారిపోకపోవడం నిజంగాను 
నారుపోసి నీరుపోసి నాశక్తి అంచయాన 
 
కోటి విద్యలు కూటి కొరకే కదా అంచయాన 
నిత్యము ఆకలి తీర్చి ఆదుకోను అంచయాన 

_____(((())))_____


గజిల్లు - అంచయాన - 029
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

మనోవృత్తికి భోగములకే అంచయాన 
విషాంకురముయొక్క గతినివలేను అంచయాన 

ఆకలి తీర్చి మనసు తో మైమరుపు పిలుపు వలపు
హిమజ్వాలా అగ్నిజ్వాల గా అంచయాన

కళ్ళతో కళ్ళను కలిపి కధలు చెప్పు పిలుపు వలపు
కాళ్ళకు కాళ్ళు తగిలిస్తూ సుఖమిచ్చు అంచయాన

ప్రేమ జ్వరంతో వడిలో కి జేరి పిలుపు వలపు
మైకపు మాటలు మనసును దోచే టి అంచయాన

ఊళ్లోకి వచ్చి వయ్యారాల చూపి పిలుపు వలపు
రాత్రి కలలోకి వచ్చి గుసగుసలు అంచయాన

నిగ్రహింపబడని మనస్సు తో యుండు అంచయాన 
ఆశవలన ఇంకను కోరుచు యుండు అంచయాన

____((()))___


గజిళ్ళు  - అంచయాన - 030
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

నిజాన్ని చిరునవ్వులతో పలుకే అంచయాన 
సర్వసంగ పరిత్యాగిలా మార్చే అంచయాన 

సముద్రం ఉపరితల భాగం - అల్లకల్లోలం    
లోపలి భాగం - నిశ్చలతతో  అంచయాన

మూల చైతన్యము ఉపరితల భాగ కల్లోలం
ప్రపంచం లోపలి భాగమే అచలత  అంచయాన

మనసుపెట్టి చూస్తే గుండె తలుపు లు కల్లోలం
అణువణువునా సహకరించేనులే అంచయాన

మనసుకు శాంతి బహుమతియే గ్రహీత కల్లోలం
మనిషి కి విశ్రాంతి గ సహాయకారి అంచయాన

త్యాగానికి మారుపేరుగా నే ఉండు అంచయాన 
న్యాయానికి రక్షణగానులే ఉండే అంచయాన 

----(((())))---


గజిళ్ళు  - అంచయాన - 031
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

నమ్మిన ధర్మమే జీవితమనేది అంచయాన 
చెదిరె కళలు సరిచేసి తీర్చేది అంచయాన 

ఉపకారికి అపకారం చేస్తుంటె కల్లోలం 
అపకారికి ఉపకారం చేసేది యే అంచయాన 

మాన యవమానము మనసువికార కల్లోలం
ధుఃఖ సంసారమయినా ఓర్పుతో అంచయాన

వాన చినుకులు తో వరములిచ్చినా కల్లోలం
మనసు కే సత్య వాక్కునిచ్చు మమత  అంచయాన
           
హృదయమందు మాటల ప్రక్రియ అంతా కల్లోలం
విషయ వాంఛ తీర్చి దిద్దిన విధాన అంచయాన

రగులుతున్న మానవత్వము నిలిపేది అంచయాన  
అవమానం చేసిన సహించేది అంచయాన 

____(((())))___


గజిళ్ళు...అంచయాన..32

నీ చూపులతో నే తడిపెయ్యాలి అంచయాన
కర్మ అనే చీకటిని తరిమె దివ్వె అంచమాన

విషయ సుఖాన్నే దూరంచేసేటి బుద్ధి గాను
తుమ్మెదకు మకరందం అందించే అంచయాన

సుజనులను ఇష్టపడే శ్రేయస్సే బుద్ధి గాను
స్వయం ప్రకాశ జ్ణానం అందించే అంచయాన

ధర్మ పరిరక్షణకై శాంతి నిచ్చు బుధ్ధి గాను
దుష్టాచారములను నశింప శక్తి అంచయాన

చల్లగాలి మంది తలచుచుండే ను బుధ్ధిగాను
యుల్లమో జలధివోలె బొంగె హృదియె అంచయాన

భూమి పచ్చనగు వేళే వెచ్చనగు బుధ్ధిగాను
మచ్చటగా కదిలే  మోదమేలే అంచయాన

కార్యనిర్వహణ మండలి అద్యక్ష అంచయాన
హిందూ ధర్మాన్ని సుస్ధిరపరచే అంచయాన
______((())))____


గజిళ్ళు...అంచయాన..33

నీ చూపులతో నే తడిపెయ్యాలి అంచయాన
కర్మ అనే చీకటిని తరిమె దివ్వె అంచమాన

విషయ సుఖాన్నే దూరంచేసేటి బుద్ధి గాను
తుమ్మెదకు మకరందం అందించే అంచయాన

సుజనులను ఇష్టపడే శ్రేయస్సే బుద్ధి గాను
స్వయం ప్రకాశ జ్ణానం అందించే అంచయాన

ధర్మ పరిరక్షణకై శాంతి నిచ్చు బుధ్ధి గాను
దుష్టాచారములను నశింప శక్తి అంచయాన

చల్లగాలి మంది తలచుచుండే ను బుధ్ధిగాను
యుల్లమో జలధివోలె బొంగె హృదియె అంచయాన

భూమి పచ్చనగు వేళే వెచ్చనగు బుధ్ధిగాను
మచ్చటగా కదిలే  మోదమేలే అంచయాన

కార్యనిర్వహణ మండలి అద్యక్ష అంచయాన
హిందూ ధర్మాన్ని సుస్ధిరపరచే అంచయాన
______((())))____

గజిళ్ళు...అంచయాన..34

పరబ్రహ్మ స్వరూపిణి వృద్ధిపొందిన అంచయాన 
బ్రహ్మజ్ఞాన ప్రదాయినిగా గోచరించు అంచయాన 

ఆత్మానందానుభూతి కలిగించ గలిగేదే 
సాధకుని జన్మతరింప చేయునది అంచయాన 

జ్ఞాని, అజ్ఞాననే వ్యక్తులను మార్చ గలిగేదే 
మంచి బుద్ధిచే వృద్ధుడౌతాదనేది అంచయాన 

జ్ఞానవృద్ధుడుగా లోకోపకారం గలిగేదే  
ముదుసలివై దండముతో నడచుచున్న అంచయాన 

స్థూల సూక్ష్మ జగత్తు లో సంచరించ గలిగేదే 
సాంప్రదాయవాదిగా అనుకరించే అంచయాన 

తల్లి పరబ్రహ్మస్వరూపిణిగాను అంచయాన 
సౌభాగ్య భాస్కరాన్నిచెపుతున్నది అంచయాన 

___((()))___



గజిళ్ళు...అంచయాన..35

అర్పించినా జయాన్ని ప్రసాదించు అంచయాన 
శృంగారం లొ క్షణికానందానిచ్చు అంచయాన  

నిత్య రహస్య యోగ ప్రక్రియలనేవి గావించిన
వ్యక్తి యొక్క జ్ఞానం లోకానికి తెల్పు అంచయాన   

బుద్ధి బలము విజయాన్నిచ్చు సహనం గావించిన 
ప్రణాలికను పద్దతిగా రూపు దిద్దు అంచయాన 

ఆరాధనము భక్తి శ్రద్ధలతోను గావించిన
వరాహ స్వరూపుణియై ఆదరించు అంచయాన
 
పర్వతమంత కర్మలను కూడాను గావించిన
సంసార సముద్రమున పడవ గాను అంచయాన   

కల్మషంలేని నిష్కల్మష హృదయాన్ని గావించిన
సర్వం త్యజించి అంతరంగానుండు అంచయాన 

విఘ్నములు తొలగించి అనుగ్రహించేది అంచయాన 
సంపదలు ప్రసాధించి జయము చేకూర్చు అంచయాన 

_____(((())))____


గజిళ్ళు...అంచయాన..36

సంకల్పమాత్రము చేతనే క్రీడా అవుతుందా
అనాయాసముగాను బ్రహ్మాండమున అంచయాన 

బ్రహ్మజ్ఞాన0 సంపదలొసంగుట అవుతుందా
భౌతికపరమైన సుఖశాంతులకే అంచయాన

దంపతుల క్రీడాత్మక వినోదం సృష్టి అవుతుందా
ప్రేరణ లీలలకు ఇచ్ఛాశక్తిగా అంచయాన 

అవమానము యొక్క ప్రభావము నిజం అవుతుందా  
నీలో క్రోధ శక్తి నుండి ఆదుకొను అంచయాన 

మానవ స్పృహకు కారణాలు అడగని అంచయాన 
సత్యాలతో  అర్థం చేసుకొనేది అంచయాన 

____(((())))___


గజిళ్ళు...అంచయాన..37

అధర్మంపై విశ్వరూపాన్ని చూపు అంచయాన 
చట్టాల(రూల్స్) సత్యమార్గంలో ఉంచే అంచయాన  

మాట, పట్టింపుల ప్రధాన్యత ఇక్కడ అవుతుందా 
చేసిన తప్పుకు క్షమాపణ మన్నించె అంచయాన 

''అవసరానికి'' కాక ''ఆత్మీయతే అవుతుందా 
తన మాటే నెగ్గాలన్న పంతం లేని అంచయాన 

బలహీనతలను చూసే అవకాశం అవుతుందా
పొరపాట్లు మన్నించే మేధస్సుతొ అంచయాన  

మనసు మెచ్చిన క్షణమ్మే గొప్పదే అవుతుందా  
మనసు నొచ్చిన క్షణం ఓర్పు వహించే అంచయాన 

కష్టమో,నష్టమో కలిగినా క్షమించు అంచయాన 
జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివి చూపు అంచయాన 

___((()))___


గజిళ్ళు...అంచయాన..38

ఎంపిక లేని చైతన్యం అనవసరమనే అంచయాన  
ఆలోచన ప్రవాహం సాగుతూ సహకార అంచయాన 
 
నిశ్శబ్దంగా నిర్మలంగా మనసు ఏకాగ్రతా 
మెల్లగా స్వచ్ఛత మొలకెత్తటానికి అంచయాన 

స్వచ్ఛత వల్ల ఏదీ మలిన పరచకె ఏకాగ్రతా 
అంతిమ చైతన్యం కలిగించి తోడు అంచయాన 

మంచి, చెడుల నుంచి స్పృహలోకి తెచ్చు ఏకాగ్రతా 
ప్రతిదీ దైవికమై, ప్రేమ పరంగా అంచయాన 

కాంతి, చీకటి చివరికి మరణంలో ఏకాగ్రతా 
ద్వంద్వ వైఖరి వదిలి జీవితానిచ్చు అంచయాన 

ద్వంద్వాలను రూపాంతరం నుండే ఏకాగ్రతా 
అంతిమ చైతన్యం స్వే చ్ఛకు మూలం అంచయాన 

నీతి అవినీతి, మంచి చెడ్డ, నుండే ఏకాగ్రతా
సాధ్యం. అ సాధ్యం.కలిగిన్చేది యే అంచయాన 

నిశ్శబ్దంగా మెల్లగా స్వచ్ఛత తెల్పు అంచయాన  
నిర్మలంగా కూచుని పరిశీలించు అంచయాన 

__((()))___



గజిళ్ళు...అంచయాన..39

భౌతికపరమైన సుఖశాంతు లిచ్చు అంచయాన  
సకలమునకు ఆధార మైనట్టి ది అంచయాన 

నగ్నసత్యం నగ్నత్వమై జీవి కమ్మదనం  
దేహానికి వస్త్రం మోహానికి శరీరం అంచయాన

అమ్మఒడిన చూపేటి అత్మీయత కమ్మదనం 
మృధుమధురమేను తన్మయత్వంలో అంచయాన 

అమ్మ ఆశీస్సులతోనె సృష్టిలోని కమ్మదనం
కమ్మ నైన స్పర్శను అందించేది అంచయాన 

మానవ స్పృహ వెలుపల కారణాల కమ్మదనం 
అర్ధం చేసుకొని ఆదరించు గుణం అంచయాన 

ప్రేమ పరివర్తన ప్రయాణంలోన కమ్మదనం 
క్రోధ శక్తి అణచి సుఖాన్ని నిచ్చేది అంచయాన 

నిత్యము పాదసేవతొ తరించేది అంచయాన 
అత్యంత శ్రద్ధగా ఉపాసించేది అంచయాన 
____(((())))____



గజళ్ళు - అంచయాన- 40
 
అమృతధారలో ఓలలాడింపజేయు అంచయాన 
మితంగా, హితంగా సుఖాన్ని చ్చే అంచయాన 

నాకు తెలిసినా తెలియకపోయినా తెల్పుటయే
తణువులోని ప్రతి అణువు బంధమగు అంచయాన

బంధ సంబంధం మేలు కొలువు గా తెల్పుటయే
సృష్టి లోని ప్రతి అణువు తోపు బంధమగు అంచయాన

మానవాళికి వర్ణాశ్రమధర్మములు తెల్పుటయే 
ఆహారము ప్రాప్తింప జేయు మాతృశ్రీ అంచయాన 
  
అన్నవస్త్రములకు లోటులేక మంచి తెల్పుటయే 
సుఖసంతోషములతొ జీవనమగుటె అంచయాన 

నాకు తెలిసినా తెలియకపోయినా తెల్పుటయే
తణువులోని ప్రతి అణువు బంధమగు అంచయాన

బంధ సంబంధం మేలు కొలువు గా తెల్పుటయే
సృష్టి లోని ప్రతి అణువు తోపు బంధమగు అంచయాన

మితిని దాటి గతిని మార్చుకోకూడనది అంచయాన 
ఆయుర్దాయంలో  సుఖాలిచ్చే అంచయాన 

____(((())))____


గజళ్ళు - అంచయాన- 41

ఆపద నివారించు మోక్షశాస్త్రము అంచయాన 
జీవితం వ్యర్థ పర్చనీయనిదే అంచయాన 

శోక, భయ, ఆయాస, గర్వరహిత నిర్బంధము
శాస్త్రానుసారము వ్యవహరింపుము అంచయాన 

దృశ్యపదార్థములందు విశేషమే నిర్బంధము 
ఇంద్రియములను త్రాటిచే కట్టిబడె అంచయాన 

సంసారమను చీకటినూతులందు నిర్బంధము
అస్త్రమై మృత్యు భయమును నివారించె అంచయాన  

కాలంలొ నిర్బంధాన్ని తొలగించు అంచయాన 
కరుణ చూపి కమల నయని మనసిచ్చు అంచయాన   

____(((())))____


గజళ్ళు - అంచయాన- 42

ముసలితనమై క్షీణించక రక్షించు  అంచయాన
మోహము బుద్ధి బలముతో రక్షించు అంచయాన

మానవుడు దేహ అవసాన దశలో కోరుచుండు
పవిత్ర స్వరూపిణివైన ఓ రక్షతి అంచయాన

పశ్చాత్తాపముతొ నీ చరణము నే కోరుచుండు
యౌవన సౌఖ్యములతొ సుఖమునుఇచ్చు అంచయాన  

శరీరము ప్రాయములో  వయస్సులో  కోరుచుండు 
అర్ధ భాగముతొ శివస్వరూపముకు తృప్తి అంచయాన

చరణముల సేవించు  శోచనీయము కోరుచుండు
సర్వార్ధ సాధకులకు ముక్తి ప్రసాది అంచయాన
  
తంత్ర శాస్త్ర విదులైన పండితులే కోరుచుండు  
జ్ఞానభిక్షతొ అమ్మలగన్న అమ్మ అంచయాన   

నాలుగు శివ, అయిదు శక్తి చక్రములుఅంచయాన
 శ్రీచక్ర అర్ధనారీశ్వరీ నయని అంచయాన

____((((()))))____


గజళ్ళు - అంచయాన- 43

కాల మాయలతో ఆశ తీర్చేది అంచయాన 
జీవిత చక్రం నిత్యం  తిప్పేది అంచయాన 

నిదురరాని రాతిరీ నిన్నేమని నిందించను
చెదిరి పోనీక కలలు చక్క జేసే అంచయాన 

పరుగు ఆపకుండ బ్రతుకుసాగుచూ నిందించను
అమావాస్య పున్నమలకు నడుమ కళల అంచయాన 

చెరిగిపోని వెతలను నేనేగతిని నిందించను
ఒడిదుడుకుల బతుకుబాట మార్చేది అంచయాన 

దినగండం శతాయుష్షు ఏదనీ నిందించను 
చంద్ర కళలన్ని చూపి తృప్తి పరిచు అంచయాన 

ఊపిరి నిండా స్థైర్యంతొ బ్రతికించు అంచయాన 
ముళ్ల కంచెలను బాటగా మార్చేది అంచయాన  

___((()))___



గజళ్ళు - అంచయాన- 44

సమర్ధనీయ పరిచె ప్రవర్తనలతొ అంచయాన
ప్రయోజనాలు కోసమే కృషిచేయు అంచయాన 

ముసలి తాబేలువలె నిద్రపోవుచు నుండకుడు 
(ప్రమత్తులై యుండరాదు). 
వార్ధక్య మరణములను (సంసార దుఃఖమును) రహితమొనర్చు అంచయాన

జన్మరాహిత్యము కై  యత్నశీలురుండకుడు
ధనసంపద అనర్థము నుండి కాపాడు అంచయాన

సంపద ఆపత్తులే ఆయియున్న నుండకుడు
భోగ సంసార రోగాన్ని తెప్పించి అంచయాన

ఉత్తమ సాధన, ప్రయత్నములన్నియు నుండకుడు
సర్వత్ర సదా ఉత్తమ ఫలముగా అంచయాన

సంసారమను బురదలో జీవితము నుండకుడు
వైరాగ్యమందు జయమ్ము కారణమే అంచయాన

ఆలోచనా అడుగుల అన్వేషణ అంచయాన
బ్రతుకు బంగారం గాను మార్చేది అంచయాన

____(((())))____



గజళ్ళు - అంచయాన- 45

కళలను నిజం నిర్భయంగా తెల్పు అంచయాన  
కులుకు మాటలు ఆశలు తిర్చున్లే అంచయాన 

కలువ చూపు తప్పుగ అర్ధం చేసు కొనే మనసు  
నిలువ లేక యు ఒప్పుగ వాదించే అంచయాన 

వయసు మనది తుళువ వళ్లెను కళా అనే మనసు 
విశ్వాసమ్ము చూపు మంచిని తెల్పు అంచ యాన
    
తళుకు బెల్కుల ప్రేమయు వెన్నంటే ఉండు మనసు 
మలయ మారుతమే జీవమ్ము అనే అంచయాన 

మన ఓర్పుకు రక్షణయే గుణమేను అనే మనసు
విలయ తాండవ మొచ్చినా రక్షించేఅంచయాన  
 
మనదే అనే తెలివిఁ సమవర్తిగా ఉండే మనసు 
సలప రింతలు తీర్చియు భావమ్మే అంచయాన 
 
చిలిపి చేష్టలతో కార్యోన్ముఖ్యుని అంచయాన   
చెలిమి చూపియు కోర్కల ఆవేశమ్ము అంచయాన  

--(())--



గజళ్ళు - అంచయాన- 46

జగతిన సకల సమృద్ధిన్ భాగ్యంబున్ అంచయాన 
దివ్య వెలుగు నిజమై ప్రమాణమ్మే అంచయాన 

లలనా నామనసే వినోద పర్చు ఎల్లప్పుడు
లలితా సుఖలాస్యా శోభలాంగీ అంచయాన

యవనీ నవనీత కోమలాంగీ ఎలప్పుడు 
యవనీ మృదు-హాస కోమలాంగీ అంచయాన 

శయనీయేయది నీయతే కథంచిత్ ఎలప్పుడు 
అవనీతల - మద్ది చాలు నీతో అంచయాన 

అవనీతలమేవ సాధుమన్యే ఎలప్పుడు 
నవమౌ నాకపు - నందనమ్ము లేలా అంచయాన 

న వనీ మాఘవనీ వినోదహేతుః ఎలప్పుడు
నిత్య సమృద్ధం సౌభాగ్యం సకలమ్ ల అంచయాన 
 
కవ గూడన్ నిను - గాంక్ష గల్గె నాకున్ ఎల్లప్పుడు  
సుధా సౌందర్యం సౌకుమార్యమే అంచయాన 

లయలే లేమది లోలతే కథేలే  అంచయాన 
లలుగేరునులేల సాధుమన్యే అంచయాన  
          
___((())))___    
 
గజళ్ళు - అంచయాన- 47

ప్రత్యక్షఅనుభూతములను పెంచే అంచయాన
అహంకార సంపద బుద్ధి మనసే అంచయాన

ఆనందైకరసమై, అమృతమయమై, నిరీక్షణే
తాపత్రయవర్జితమైనట్టి మనసె అంచయాన

విశ్వాంతరాళం లొ పోల్చ లేనిది నిరీక్షణే
అన్యాయాన్ని వేలెత్తి చూపించు అంచయాన 

నాకు ప్రశ్నకు బదులు ప్రశ్న ఎప్పుడు నిరీక్షణే  
భూత వర్తమాన భవిష్యత్కర్త గ అంచయాన 

అవిశ్రాంతంగ కొనసాగు యుద్ధంలా నిరీక్షణే
అనుక్షణం ప్రేమ పక్షాన ఉండు అంచయాన 

నా దృష్టి లొ శస్త్రధారి, ఖడ్గధారి అంచయాన 
వ్యూహ ప్రతివ్యూహ సర్వాధికారి అంచయాన 
____(((())))____

 
గజళ్ళు - అంచయాన- 48

శ్రీవారి కేను సిరి గాను నుండే అంచయాన  
రావేల వేగ రసరాగ దీపా అంచయాన

ప్రపంచమున ఎవరికి ఎన్నటికిని మనసు చెరచు
జగత్తులో బాగుగ రూఢిగానుండు అంచయాన 
 
అజ్ఞానమను బుధ్ధి కళంకిత మై మనసు చెరచు
 మోక్షసిద్ధి కొరకు వివేకము పెంచు అంచయాన

 జలముచే బాగుగ కడిగి ప్రకాశము మనసుచరచు
ప్రతి నిత్యం కథలన్నీ తీర్చేటి అంచయాన

భయంకరములైన సంసార స్థానము మనసుచరచు
 పామరునివలె  వశుడై పడిపోనియ్యని అంచయాన

సత్యమనే నిశ్చయమ్మే మనుజుని మనసుచరచు
పరమార్థతత్త్వ విచారణాభ్యాస అంచయాన  

భావాల పూల పరమేశ తృప్తే అంచయాన
రావాలు నీవి రమణీయ తృప్తే అంచయాన
___(((()))___
 
గజళ్ళు - అంచయాన- 49

" శ్రీ భవ్యదర్శనసుభిక్షవరేష్ట అంచయాన 
శ్రీ నవ్యవైభవసరూప విశిష్ట అంచయాన

సోయ గంబున నిన్ను మించిన వారు లేరు లేరు
మణులలో నే మణిపూసవైనావు అంచయాన

తోయ జాక్షుని మానసంబును దోచు వారు లేరు
ప్రేమతొ వేయిరేకుల పద్మమైన అంచయాన

వేడ్క చేయనెంచి పూజించేవారు వేరు లేరు
కూర్మితో నిత్యమూ నిన్ను కోరితి అంచయాన

నవనిధి దాయిని కలిమలహారిణిగ వేరు లేరు
కామిత ఫలప్రద హస్తయుతేను అంచయాన

శ్రీ దివ్యవిశ్వజననీంలలితాం అంచయాన 
శ్రీమాతరంశివసతీం శిరసా పంచయాన 

____(((())))___

గజళ్ళు - అంచయాన- 50

జయ జయహే మధుసూదన కామిని,అంచయాన  
విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ అంచయాన 

కమలమందువెలుగు కమనీయ శోభ ఇచ్చి పుచ్చు
అమలహృదయనీదుయలకనందన అంచయాన

సుమనసుందరహాసిశుభమంజులము ఇచ్చిపుచ్చు
సకలలోకములకూ శాంతినిచ్చే అంచయాన

ధవళకాంతులనిచ్చు ధనలక్ష్మి గాను ఇచ్చి పుచ్చు
ధరహాస వదనాంగి ధన్యమేలే అంచయాన

కువలనయననీదు కుందనమందారము ఇచ్చిపుచ్చు
బంధువై జనులకు భవ్య చరితగా అంచయాన

దేహమెల్ల కాంతి దేధీప్యముగా ఇచ్చిపుచ్చు
భవ్య సుగుణ రాశి బంగరమ్మయె అంచయాన

కావ్య కన్యకళవు కమనీయ రమణివి అంచయాన
కామితార్ధమిచ్చు కమల ప్రభవు గా అంచయాన

___((()))___

గజళ్ళు - అంచయాన- 51

ధర్మ అర్థ కామ మోక్ష ప్రదమైన అంచయాన  
ఉగ్ర స్వరూపమైన శాంతి చేకూర్చు అంచయాన 

జీవితంలో వచ్చే కష్టాలను  పారద్రోలి 
పరిహరించి,జయమును చేకూర్చేదే అంచయాన  .

అర్థ సిద్ధి కూర్చి, సర్వ దుఃఖములు పారద్రోలి  
సాటి లేని తెల్లని మందహాసము అంచయాన

అన్నిదిక్కులందలి చీకటులనే పారద్రోలి  
జ్ఞానమనే మోక్షము ప్రసాదించే అంచయాన ,

హానిని కలిగించే అధర్మమునే పారద్రోలి 
ధర్మ సిద్ధి సంపదల కలుగ చేసె అంచయాన

సుఖమగు కామప్రాప్తి కలుగచేయు అంచయాన  
అమృత సార ధార  ప్రసరింప చేయు అంచయాన 

____((()))____

***

గజల్ \\\\- గృహాలక్ష్మీ -- 52

సహనము సత్యము శాంతంబు వలయు జయమ్ముగ గృహ 
లక్ష్మీ  
వినయము విశ్వాసము ధైర్యము కలిగిన  బ్రతుకు గృహ లక్ష్మీ 

నీవేళన్ శుభములు బడయు కళలే  నియమ్ము  ఎల్లప్పుడు 
విందులు జిహ్వలకు రుచి పొందుట అవసరమా గృహ లక్ష్మీ 

నిండు మదితో మే కొనుమమ్మా ప్రేమా శుభము ఎల్లప్పుడు
సౌకల్యంబుగ వచింతు నిత్యమూ సత్యము గృహలక్ష్మీ 

గృహ ధర్మము లెల్లఁ తీర్చినా కీర్తి పొందుట ఎల్లప్పుడు 
మహిలో సూత్రమున్నది భర్త తోడు గనున్న గృహలక్ష్మీ  

తల్లి కి తోడై పనులెల్ల చేయు శ్రధ్ధగా ఎల్లప్పుడు 
చెల్లెల్లు అన్నదమ్ముల అందరి మమత ఏ  గృహలక్ష్మీ   

విడువక పఠియించు ప్రతిభా విజ్ణాన  కాంతి ఎల్లప్పుడు
ఫలంబులు మధుర కళలన్ని హాయిని పొందుము గృహలక్ష్మీ  

జననీ జనకులు మెచ్చును సుఖముయె ఘనముగా గృహలక్ష్మీ
మన్ననలను గొని వారి గన్నా కుగ శుభములు  గృహలక్ష్మీ
__((())__

గజిళ్ళు..53..గృహలక్ష్మీ
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ 

 మనిషిగా వాస్తవరూపం గ్రహించ గలిగే గృహలక్ష్మీ
కలకాలం ఉయ్యాలలో స్థిరమై  ఊగాలి గృహలక్ష్మీ

ప్రేమలో నిత్యము కొత్త పాత అని చూడుటె  ఏల నీవు
ద్వేషము భేదము ద్రోహపు భావాలు దేనికి గృహలక్ష్మీ

మంచి చెడ్డయే గుర్తించి చెప్పక పోవడం ఏల నీవు
వంచనను వంచించుట తప్పదు తప్పు కాదు గృహలక్ష్మీ

ఊహలు అపోహాలు రాజ్యమేలే అనుటయు ఏల నీవు
జీవితం లో నమ్మే నిజమే నీకు తోడు గృహలక్ష్మీ

మితిమీరిన కాంక్షా ఆశలతోను ఉండుట  ఏలనీవు
పాలలో జలమై కలసి నిజమై పోవాలి గృహలక్ష్మీ

సలహాలిస్తూ, ఇది చెయ్యి అనేటి వ్యాఖ్యలు ఏల నీవు
చక్షుస్మిత ఆకర్షణే విద్య ప్రేమించు గృహలక్ష్మీ

చిరునవ్వుతో కష్టాలు జయించే ప్రెయసివి గృహలక్ష్మీ
ప్రకృతి న్యాయం ధర్మాలను అంగీకరించే గృహలక్ష్మీ
___(()))___

గజిళ్ళు -- 54 గృహలక్ష్మీ 
విధేయుడు మల్లాప్రగడ  రామకృష్ణ  
 
స్వేత దీప కాంతి లోస్పష్ట భావాన్ని తెలుపు గృహలక్ష్మీ  
హృదయ మంత మంచు లాగ కరుగు నవ్వు చూపు గృహలక్ష్మీ

చక్కని విద్యలు నేర్చి సాహస పరులై సల్పు జానవే   
జన్మ భూమిని మక్కువాతో గొల్చు చుండు  గృహలక్ష్మీ 
      
సన్నుత సుగుణములె కీర్తి సంపద కలిగి సల్పు జానవే
అనువున గూర్చొని పధ్య, గీతములను పఠింపు గృహలక్ష్మీ  

సింగారపు కళలు హృదయంలో ఉండే సల్పు జానవే 
రక్తిని వీణా వినోద రాగముతో నుండు గృహలక్ష్మీ     

జీవన గమ్యానికి మనసు కలయికగోరె సల్పు జానవే
చల్లని స్నేహపు గాలి మధుర సుఘంధమే గృహలక్ష్మీ 

తళుకుల సుమలలిత ఫాలదేశమై జూపుల సల్పు జానవే
మధురాతి మధురమ్ము రమ్య మైన బింబమై గృహలక్ష్మీ

సిరులు ఒలక పుచ్చు చిన్నయ రూపము కలిగిన గృహలక్ష్మీ  
సువర్ణ ముఖకవలిక మృదు మధుర కళల రూప గృహలక్ష్మీ
___((()))__

గుంజిళ్ళు..55..గృహలక్ష్మీ

ప్రేమలు ఎన్నటికీ ఆవేశానికి మారవు గృహలక్ష్మీ
జ్వాలను ప్రేమ గుప్పెట బిగించి పట్టాలి గృహలక్ష్మీ

నేలకు రాలని పువ్వువు ప్రేమకు చిక్కిన నవ్వువు నీవు
మదిలో మెదిలే పువ్వుగ హాయినిచ్చు ‌స్మ్రతి గృహలక్ష్మీ

నిన్న నేడు రేపు ఆనందం వ్యక్తం చేసె నవ్వువు నీవు
శూన్యం కాని కాలం ఒడిలో చిక్కిన కలువ గృహలక్ష్మీ

గాయాలను మార్చే నమ్మకం చెలిమి గాను నవ్వువు నీవు
మౌనాన్ని మార్చి చీకటి తరిమే వెలుగు గా ఉండె గృహలక్ష్మీ

అందాల  వెల్లవుగ మందార పువ్వుగా నవ్వువు నీవు
చిందాడు పల్లకిలో ఉయ్యాల ఊగాలి గృహలక్ష్మీ

నీ ప్రేమే నను కట్టివేసే బంధమైన నవ్వువు నీవు
నీ ప్రేమే ఘన ప్రార్ధనా యే నిత్యమూ గృహలక్ష్మీ

సృష్టి కి మూల కారణ శ్రీ వి సృజనా శక్తి గృహ లక్ష్మీ
సంస్కృతి సంప్రదాయాలు పాటించెడి గృహ లక్ష్మీ
______((())))____

గజిళ్లు -- 56- గృహలక్ష్మీ  

నిత్యమూ మనసు వాసనలను పరిత్యజించు గృహలక్ష్మీ 
మోక్షమును గూర్చిన కోరికను కూడ త్యజించు గృహలక్ష్మీ  

మైత్రీ, కరుణాదుల భావ నిర్మలవాసను పరిగ్రహింపు
ఆత్మ జ్ఞానాన్ని అందించిన గురువు బ్రహ్మ గృహ లక్ష్మీ  

ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, ధ్యానము, పరిగ్రహింపు
వైరాగ్యము అనునవి షడ్గుణములు. గలిగిఉండు గృహ లక్ష్మీ

జీవశక్తితో పొంగి పొర్లు తున్నప్పుడు అది వికసిస్తుంపు  
ఎంత ఎక్కువ శక్తి అంత ఆనందం పొందు గృహ లక్ష్మీ

ఆలోచనల్లో, చింతల్లో, కోరికల్లో,సహకరింపు  
ఊహల్లో, కలల్లో, జ్ఞాపకాల్లో, శక్తి . గృహ లక్ష్మీ

సంసారం,  ప్రకృతి,  విషయ భోగములు నిత్యము పరిగ్రహింపు
సుఖేచ్చల వలన కలిగే భయము సంతాపమె గృహ లక్ష్మీ  

మనోబుద్ధియుక్తమగు ఆ చిన్మాత్ర వాసన గృహ లక్ష్మీ
తామస, రాజస వాసనలను త్యజించిమూ గృహ లక్ష్మీ
__(())__

గజిళ్ళు..57..గృహలక్ష్మీ
*తరుణానికి తగ్గవిధంగా ప్రవర్తించేది గృహలక్ష్మీ
*చేసినది చేప్తూ, చెప్పి నదీ చేస్తూ సేవలు గృహలక్ష్మీ

* భరించేది, బ్రతుకు నిచ్చేది, బాధ్యత వహించే ది తరుణీ 
*  ప్రేమ పంచేది, ఆశలు తీర్చేది ఆమేయే గృహలక్ష్మీ

* , స్నేహాన్ని అందించి, సర్వం తానై భరించేది తరుణీ 
*  సూర్యుడే   లేకపోయినా ఇంటికి వెలుగే గృహలక్ష్మీ

* భర్త  వంశానికి సృష్టికర్త ప్రేమ పంచు తరుణీ 
* మొగుడి అంశానికి మూలకర్త,బిడ్డలతో గృహలక్ష్మీ

*కొంగు తీసి ముందుకేగినా, మూతి తుడిచుటె తరుణీ 
* జీతం లేని పని మనిషి జీవితాన్ని పంచు గృహలక్ష్మీ

*మేదురమగు కీర్తి నిచ్చెటి కృతులన్ తెల్పునదియే తరుణీ 
*భాగ్యముతో తరించి వరించి పోషించేది గృహలక్ష్మీ   

*కాలం ఎవరిదైనా ధర్మాన్ని తప్పనిది గృహలక్ష్మీ
*కష్ట నష్టాలున్నా గుట్టు రట్టు చేయనిది గృహలక్ష్మీ

___((()))___


గజిళ్ళు..58..గృహలక్ష్మీ

ప్రేమతో నిన్ను ఊరడించే మత్తు శక్తి గృహ లక్ష్మీ
నామనమ్మందు హాయికల్పించే నవ్వులన్ గృహ లక్ష్మీ 

దాహమంతాను తీర్చి సంతోష పువ్వులే ముగ్ద రూప        
దేహమంతాను పర్చి మాధుర్య మంజులాగృహ లక్ష్మీ      

తామసమ్మందు ఉన్న నన్నుయు చక్కగన్ శ్వేత రూప
దివ్యకావ్యమ్ము వ్రాయు నింగితొ వేడుకన్ గృహ లక్ష్మీ

మంచిభోజ్జ్యమ్ము పెట్టి ఆకలి తీర్చియున్ కామ రూప 
మంచి భాగ్యమ్ము  ఇచ్చి ఆశయ కల్పియున్ గృహ లక్ష్మీ 

జీవితాంతంము నందు సఖ్యత నిల్పియున్ సాక్షి రూప 
ప్రేమ ఆలింగ నంతొ సభ్యత కల్పియున్  గృహ లక్ష్మీ 

ద్వేషభావంబు మార్చె సద్గుణ నేర్పుయున్ దివ్య రూప 
భక్తి ఆరాధ నందు భాద్యత తెల్పియున్ గృహ లక్ష్మీ            

భర్త ఆనందం తనకర్తవ్యమనీ మనసు  గృహ లక్ష్మీ    
ముక్కోటి దేవతలసాక్షికల్సి ఉండుట  గృహ లక్ష్మీ

___((()))___


గజిళ్ళు..59..గృహలక్ష్మీ

స్వచ్ఛత కలిగియు, స్వేచ్ఛ తనడకలు, నుండు ప్రియ గృహ లక్ష్మీ
నచ్చితి వి మనసు,నిచ్చితి ని నిజము, మెచ్చు ప్రియ గృహ లక్ష్మీ

కలలు గను సమయమిది, కతయౌను నిక్కముగా కలవాణీ
మక్కువ గనునువు, మోక్కుతు పలుకులు చక్కనిది గృహ లక్ష్మీ 

కమలముగ విరియు మది, కవనాలు పిక్కటిలా నలివేణీ
వద్దునలెదునులె,ఒద్దిక మనసు తొ మోద్దు ప్రియ గృహ లక్ష్మీ

వలపులకు విడిది యిదీ, వని నేఁడు చొక్కటము పువుబోణీ 
ముప్పులనివినను,ఒప్పులని అనను,తప్పు ప్రియ గృహ లక్ష్మీ

పలు పులుఁగు లల తరుల - వడి పాడె నక్కరగా మృదుపాణీ 
పువ్వుల కలిసియె, నవ్వుల పిలుపులె,అలక ప్రియ గృహ లక్ష్మీ

తెలివెలుఁగు కిరణముల - తెర చాల యక్కజపు కృష్ణవేణీ  
యిచ్చెను హృదయము,మెచ్చెను ప్రియతము, వచ్చెప్రియ గృహ లక్ష్మీ

నచ్చిన వయసున, ముచ్చట పడె విధి, తగిన ప్రియ గృహ లక్ష్మీ
కచ్చితముగ నిట....విచ్చినది కలువ, మెచ్చు ప్రియ గృహ లక్ష్మీ

___((()))___


ఓ నేస్తం.. గజిల్ .. 60

కలలలోను కలతలగుట కలువ పువ్వ ఓ నేస్తం
ఆనంద పరిమళాలను అశ్వాదన ఓ నేస్తం

కోరుకుంటున్నా నేను కొత్త కొత్త వేడుకయే 
వాయు వేగంగానులే ఒరుస గలుపు ఓ నేస్తం 

వేదనలోను నవ్వులన్ని వరుసగ వెదుకు తున్నావె 
దరికొచ్చె ప్రశాంతతయు ధర్మమ్మే ఓ నేస్తం

ఎదను రగిలె గాయాలనె ఎట్లాగా నన్నావే
మరుపునిచ్చు లేపనమే మాయ చేయు ఓ నేస్తం

అందరినీ  కీడు చేయు ఆదర్శం తలిచితివే
 ఆదుకునే మానవతయె ఆశయమ్ము ఓ నేస్తం

మదిని గిల్లు తుళువలనే  మహనీయుల మనస్సు వే 
మధుర భావ సుఖా లన్ని మహితులన్ని  ఓ నేస్తం

కావాలి ప్రమోదం ప్రమాదమున్నా ఓ నేస్తం
ప్రాణాల పణమై సాగు ప్రతిభ తోడు ఓ నేస్తం

గజల్:: తనువు తోడుగా 
        ***
ప్రకృతి ప్రభావము జీవి తానికి నిత్యము తోడుగా  
కుటుంబ సహాయము అర్ధాంగి ఆదరణ తోడుగా   

ఒకే తనువులో రెండు భావాల కన్నీరు ఇమిడి  
ఒకటి అలజడి మరొకటి మౌన నిగ్రహం తోడుగా   

ఒకటి శరీరాన్ని అతలా కుతలమ్మొవ్వు సత్యం   
మరొకటి గత జ్ఞాపకాల నీడ నిత్యం తోడుగా 

మనకు ఎప్పటికీ అర్థం కాని జీవిత సత్యం
ప్రశాంత మదిలొ దూరి మనసు విరిచేస్తు తోడుగా 

మరొకటి అస్థిర అనాలోచన సంసార సత్యం
జీవిత వింతలే వింతగా సృష్టిస్తూ తోడుగా

జీవితం కొంత అందం కొంత వికార సత్యం
జీవితాన్ని దగ్గరగా ఆస్వాదించ తోడుగా  

జీవితానుభవ పాఠాలు నేర్చుకుంటే సత్యం
పాఠాలు చదవకుంటే నిరర్థకమే తోడుగా

జీవిత గుణపాఠం ఎవరూ మార్చలేని సత్యం 
ఎవ్వరూ నీకు నేర్పలేరు నేస్తమా  తోడుగా 

హృదయ వాంఛలు నీడలా వెంటాడే తోడుగా  
సమయ తృప్తి పరిచే శాంతి విశ్రాంతి తోడుగా 
***
తిరుగుటయే... గజిల్
రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ ప్రాంజలిప్రభ 

మనసు నున్నది మాటలో మమత చుట్టు తిరుగుటయే 
మాట చేత సొగసు చేత చూపు నందు తిరుగుటయే

నిత్యమూ కనపడు రీతిగా ప్రేమలొ నుండువారు
కలత చెందకే జీవిత కాలమందు తిరుగుటయే

సులువుగానిల మాన్యత సొంత మగుచునె నుండువారు 
కాలనిర్ణయము ప్రకృతి సమయమే మది తిరుగుటయే 

మనసు నొకటియు మాటలో మరొకటియును నుండువారు 
చేత లింకేదొ రీతిగా చేయుచూ తిరుగుటయే

సుఖము పొందలేక కాదు సులభ మెపుడు నుండువారు 
కలదు శాంతమే మూడింటి కలిగియే తిరుగుటయే 

జీవిత చక్రము కళలుగా కదులుతూ తిరుగుటయే
సర్వ సమ్మోహనం విధి నాటకమై తిరుగుటయే

.....

ఎందుకురా.. గజిల్
మల్లాప్రగడ 

కాలు మోపిన గడ్డకే  భారమవ్వు ఎందుకురా 
కోరి కన్న కడుపుకు కష్టమె తెచ్చుట ఎందుకురా

కనులుగాంచ కాంతులన్ని క్షణికమె కావచ్చురా
కాటిలో కదము కలిపి  నీతొనెవ్వరు ఎందుకురా 

బ్రతుకుబాటన భ్రమలు మెండు బరువూ ఉండురా 
దారిలో ముళ్ళు దండు దశలు దిశలూ ఎందుకురా

బలము ధనము ఉండు బీద భేదమేల నుండురా 
పరుగు పర్వముండు పడకయె పాశమై ఎందుకురా 

గడ్డి పరక  గాలివానలోన నిలిచి నుండురా 
గగనమంటు వృక్షము తాళకయె నేల కెందుకురా

గడనెత్తున గర్వము గడ్డుకాలమై నుంచురా 
గతంనేర్పు పాఠము గగనతారలుగా ఎందుకురా 

పోరుసల్పు పరుష పదజాలము పలుకనె వద్దురా
పొగరుబోతు నడవడి పొగనుసెగను విధి ఎందుకురా

పంచుకున్న కష్టసుఖము హితము నీకు ఎందుకురా 
పరులమెప్పు పొంది నీవు పేరుపరువు ఎందుకురా

.....

గజల్ . 

నీ ప్రేమే లేదంటే..రూపమేది నా గజలుకు..! 
నువు కలవకుండ ఉంటే..జీవమేది నా గజలుకు..! 

డబ్బుతోటి కొనగలిగే దెంతసేపు నిలిచేనోయ్.. 
కన్నీళ్ళే లేకుంటే..గంధమేది నా గజలుకు..! 

గుండెలయల పొదరింట్లో..కాపురమే హాయికదా.. 
నువు తాళం వేయకుండ..అందమేది నా గజలుకు..! 

నిశ్శబ్దపు వనవాసం..విందుచేయు ఫలములెన్నొ.. 
నీ మౌనం తోడులేక..భావమేది నా గజలుకు..! 

చెలిమిపూల చెట్టుమీది..కొమ్మలలో యుగళగీతి.. 
నీ నవ్వే లేకుండా..విషయమేది నా గజలుకు..! 

విరహానికి వియోగాన్ని..కలిగించర మాధవుడా.. 
మనసు నీకు ఇవ్వకుండ..రాజ్యమేది నా గజలుకు..!

గజల్ . 

ఈ మనస్సు బరువునెలా..దించుకోను నీవు రాక..! 
ఈ చీకటి మంటనెలా..తట్టుకోను నీవు రాక..! 

ఖర్జూరపు గాలికూడ..వేదననే విసిరేనా.. 
ఒక తియ్యని పాటనెలా..పాడుకోను నీవు రాక..! 

ఒక ఒంటరి ఒంటెలాగ..ఎక్కడికో పయనమసలు.. 
మసలుతున్న అశ్రువెలా..నిలుపుకోను నీవు రాక..! 

నీరు లేని ఒయాసిస్సు పాలైనది వసంతమే.. 
సొంతమైన నీడనెలా..కప్పుకోను నీవు రాక..! 

పున్నమింటి వెన్నెలతో..జగడమెందు కంటావా.. 
గొంతుదిగని మధువునెలా..కోరుకోను నీవు రాక..! 

రేయి గడవనంటున్నది..నీవు లేక మాధవుడా.. 
ఒలకలేని దు:ఖమెలా..ఓర్చుకోను నీవు రాక..?
--((**))--
గజల్  
చెలిమిగూటి పడవలోన..పయనమెంత అద్భుతమో..!
అందమైన కలలకడలి..గంధమెంత అద్భుతమో..!
మేలిముత్యమా సొగసే..పసిడి ఇంద్రధనువు కదా..
కణకణమున తానయ్యిన..దీపమెంత అద్భుతమో..!
చెలి కన్నుల కాటుకేగ..ప్రతిసంధ్యన చీకటిగా..
విశ్రాంతికి శాంతినింపు..మౌనమెంత అద్భుతమో..!
సరసవీణ సంగతులకు..విభావరీ సాక్షి తాను..
పలుకుతేనె పెదవులింటి..రాగమెంత అద్భుతమో..!
చల్లగాలి నిమురుతున్న..చిలిపితలపు నాట్యమేమొ..
కలవరించు కనుపాపల..మోహమెంత అద్భుతమో..!
మాధవుడే పరవశించు..గజల్ గగన వీధి ఇదే..
తన అందెల సవ్వడిలో..సత్యమెంత అద్భుతమో..!
--((**))--
ఆధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వుకు సరితూగే, మల్లెపువ్వు శాశ్వితమా 
- మతి భ్రమకు సరితూగే, సంపెంగము శాశ్వితమా 

గుండె కోతకు సరితూగే, జీవనము శాశ్వితమా 
- మది చురుకు సరితూగే, ప్రణయము శాశ్వితమా

క్షణ సుఖంకు సరితూగే. సంసారము శాశ్వితమా
- నిత్య శోకంకు సరితూగే, కుటుంబము శాశ్వితమా 

దాహం మధువు సరితూగే, అనుభందం శాశ్వితమా
- వయసు ప్రేమ సరితూగే, స్వర్గమైన శాశ్వితమా

మౌనం కుదుపు సరితూగే, సంద్రమైన శాశ్వితమా 
- తల్లీ తండ్రికి  సరితూగే,    దైవమైన శాశ్వితమా
  
శీలం బాధకు సరితూగే, కొడుకైనా శాశ్వితమా 
- ప్రేమ శృతికి సరితూగే, భర్త ఐనా శాశ్వితమా 

చెలి ప్రేమకు సరితూగే, సుఖమైనా శాశ్వితమా
- గీత బోధకు సరితూగే, ఆచరణ శాశ్వి తమా                  
   
గాణ విద్యకు సరితూగే, సంగీతము శాశ్వి తమా
- విద్య భోదకు సరితూగే, సహాయము శాశ్వితమా 

దాసదాసీ జనము, నౌకర్లు, 
కొడుకు, బంధువు, వస్తువులు, 
వాహనములు, ధనసమృద్ది ధాన్య సమృద్ది యను 
శాశ్వితము కావు ఒక్క దైవ ప్రార్ధనే  శాశ్వితం 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
-((**))--

ప్రాంజలి ప్రభ .. గజల్ .. వేదనలే 
మల్లాప్రగడ రామకృష్ణ 
 
పంతముకాదు లోకమున పగలు రాత్రి వేదనలే   .
పరమ శివా నీతో చెప్పెద తీర్చుము  వేదనలే
  .
పుట్టుట గిట్టుట నీచేతి రాతన్న పంతమేను 
అమ్మ చేతి బొమ్మనే చూడుము ఈశ వేదనలే

మింగిన గరళము కంఠమందున శివా పంతమేను 
నిత్య గరళమే మాబతుకు తీర్చుమా వేదనలే

బట్ట లేనట్లు బతికే దిగంబరా పంతమేను
మేమయ్య మానము దాచు బట్ట లేక వేదనలే

బూడిద రాసుకు సోకులే శంకరా పంతమేను  
పోయ్యే లేని మాకును బూడిదెక్కడ వేదనలే

కపాలమ్ము నీభిక్షపాత్ర మహాశివ పంతమేను  
కవలమే లేని మాకు పాత్రతో పని వేదనలే 

కాశిపతీ  కావమని  నేనడగను పంతమేను  
కాపుకు అడగ పనేమి చేయలేవా  వేదనలే

హరహర  శంభో  శంఖఃపు నాదమ్ము వేదనలే  
హరహరా శంకరా వాదం శూన్యం వేదనలే 

***

ప్రాంజలి ప్రభ... (110)

గజిల్... క్షమించు 
రచన. మల్లాప్రగడ రామకృష్ణ 

నిరాశా, నిస్పృహ, మొండితనం నన్ను క్షమించు
చెడ్డవార్ని మంచివార్ని గౌరవిస్తున్న క్షమించు

అగ్నికి ఆజ్యమై పృద్వికి భారమై జీవితం
కలుషాల, కలహాలతో మొయు కావడినే క్షమించు

ఔనత్య, ఔదార్యము లేని ఆవేశ జీవితం 
తాపాల సోయగాల తిమిరాల పాపము క్షమించు

ప్రాయపు పాపపుణ్యాల మడుగున చిక్కు జీవితం
కామ,క్రోధ,మద, మత్యరమ్ము లతొ నున్న క్షమించు

ఉదయభాను నెలరాజును గుర్తించనీ జీవితం
రోజూ నీకోసం వెచ్చించను సమయం క్షమించు

హృదయము లో ప్రాణము ధ్యానము ప్రకాశజీవితం
ప్రతి స్ఫురణ చలన శబ్ద స్పందనయే క్షమించు

ప్రయత్నాలు నిరర్థకమని మొండిననే క్షమించు
అన్యాయం అక్రమం జరిగితే తిరగబడతా క్షమించు

.....
నివేదన.. గజిల్ 

హరుడైన, హరివైన భక్తిగా కొలిచాను 
ఆత్మ సాక్షిగ దరికి అర్తిగా వచ్చాను 

అందుకో విన్నపము, అందించు మభయమ్ము 
యెదలోన నీ రూపు పదిలముగ నిలిపాను,

పంతమెందుకు స్వామి చింతను దీర్చుమ్ము 
సత్యసుందరానంద జన్మగా కదిలాను 

దేహ భ్రాంతిని అహమ్మునే విడిచితినమ్ము 
గుండెలో గుడికట్టి కొలుచుచూ నున్నాను 

పొగిడి పొగిడీ నేను అలసిపోతిని నమ్ము 
అలుక చెందకా మన్నించవయ్య మమ్మును 

విధి విధానమ్ము నెరుగక విసిగించితి నమ్ము 
కరుణ చూపియు ఆదుకోవయ్య మమ్మును

నీ దివ్య సన్నిధి చేరుకుంటాము నమ్ము 
ఆది మధ్యాంత రహితునకు నైవేద్యమవుతాను

అండగా నీవుండు వరములనే కోరను 
సంసారానికీ అభయమీయుము, చాలును

****
గజిల్.. ఎలా... ఎలా.. ప్రాంజలి ప్రభ
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 

అంబరజాబిల్లి పరికించే దెలా
తెరలుతెరల మబ్బు పరిశీలించే దెలా

పాలుపోసి పెంచిననూ బతుకు వెలా 
ప్రియ మిత్రుల నెడబాపెడు బుద్ధి ఎలా 

పెంచినట్టి తల్లినైన తిట్టు టెలా 
వలపులతో డబ్బులనే పొందు టెలా 
      
వీధులలో తిరుగు గుణం పిచ్చి ఎలా 
ఆలిను హింసించి తిరుగ గల్గు టెలా 
        
కన్నమేసి దోచుకొనెడి మార్పు ఎలా       
మాటలతో ప్రజల దోచు యుక్తి ఎలా

స్వచ్ఛమైన మనసులోన మలినమెలా 
ఎద లోపల బాధలనే తుంచు టెలా 

సంయమనం కోల్పోకే బ్రతుకు యెలా 
చిరునవ్వులు జారవిడువ  బంధమెలా

ప్రేమలేని హృదయమేగ కఠిన మెలా 
సాత్వికమను సహజగుణం మనిషినెలా

క్రమశిక్షణ లేనివాడు  ఒప్పు టెలా 
వ్యర్ధమైన పనులతోటి కాలమెలా 

చిత్తశుద్ధి లేకుంటే  ఫలిత మెలా 
విలువలకై పాటుపడక లక్ష్యమెలా 

జీవితం నేర్పుతుంది  పాఠ మిలా 
నడవడికను దిద్దుకోక బ్రతుకునెలా 

నైపుణ్యం వెలికితీసి తెలిపే దెలా 
ధర్మంగా జీవింపక ప్రాణమెల
  
బ్రతికించు గాలినిగమనించే దెలా 
తనువున చల్లగాలినిగుర్తించే దెలా

పుడమినిచూశా పరవశించే దెలా 
ప్రకృతినిచూశా పులకరించే దెలా

కలలోని మంటకు కాలిపోడు ఎలా 
కలలోని మంచుకు గడ్డ కట్టడు ఎలా 

అధర్మపరుడు సుఖ పడతాడు ఎలా 
మహనీయుడు సుఖదుఃఖాలకు చలింపెలా

****

గజల్ ...  లేరులే   ..ప్రాంజలి ప్రభ 
రచన :: మల్లాప్రగడ రామకృష్ణ 

వీడను నిన్ను బ్రతుకంత తోడులే  
నిన్ను ఎన్నటికీ వదలని నీడలే 

సూర్యుడు వెలుగుని వీడను లేడులే
మాతృభూమి మరచి బ్రతక లేరులే
 
చంద్రుడు వెన్నెలను వీడ లేడులే
జనకులు బిడ్డల్ని మరువ లేరులే 

భూమి భ్రమణాన్ని వీడను లేదులే
తల్లి కష్టాలను  తెలప లేదులే

అంబుధి అలలను వీడ లేదులే 
తండ్రి సంపదలే మరువ లేడులే

నదులు నడకల్ని వీడను లేదులే
ప్రేమ ప్రేమను వీడను లేదులే

సెలయేళ్ళు రాగాలు వీడ లేవులే 
తత్వాన్ని ఎవ్వరు వీడ లేరులే 

కోకిల గానాన్ని వీడ లేదులే
పూజ విధా నాన్ని వీడ లేరులే

నెమలి నాట్యాన్ని వీడ లేదులే
ఆకర్ష బుద్దిని మరల్చ లేరులే

పూలు పరిమళాన్ని వీడ లేవులే
కుటుంబాన్ని మరచి ఉండ లేరులే

ప్రకృతి అందాలను వీడ లేదులే 
ఆశయ పాశము వీడ లేరులే

ఉంటాను నీవెంటే  సంతోషిలే  
నీలో కనబడని ఆత్మ నేనులే 

***
ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రే నమః.. నమః శివాయ

గజిల్.. దిగంబరా..పురంధరా.. ప్రాంజలి ప్రభ 
రచన మల్లాప్రగడ రామకృష్ణ 

అంగజ ముదసంహారా ఆశ్రిత జన పురంధరా
హృదయేశ్వరా విధ్యా ధరా కాలేశ్వర పురంధరా

గంగాధరా జంగమ దేవరా హరా శంకరా  
లింగరూపా నాగాభరణా దివ్య  పురంధరా

త్రినేత్రా పావన చరిత్రా నీలగాత్రా శివా 
జనని పార్వతి మానస ప్రియపాత్రా పురంధరా

త్రిశూల ధర త్రిగుణాతీత భవనాశ నీలకంఠ 
ఈశాన అహములేదు ఏ కోశాన పురంధరా

చింతామణి చెంతనుండ భిక్షమేల మహాశివా 
వింతగాకున్న అన్నపూర్ణ పతిగా పురంధరా

నేను నిత్యమూ నర్ధించపూజే విశ్వేశ్వరా 
మార్కండేయు, రావణాసురా బ్రోవ పురంధరా

ఒక్కడై కాలుని పరిమార్చె గౌరీ మహేశ్వరా 
దీనులయెడ పరమ దయాళువు ముక్తేశ్వర పురంధరా

భాను తేజా జీవన ప్రదాన దేవా ఈశ్వరా
పావన పాదముల నా శిరమునుంచీ పురంధరా

దీవెన లొసగుము మా జీవనాధార పురంధరా
ఇందు ధరా పురంధరా హిమాచలా పురంధరా

ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ
***


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి