30, ఏప్రిల్ 2022, శనివారం

గజల్ - అంచయాన - (2/18)


గజల్ -- అంచయాన - (011)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమునకు ప్రీతి కలిగించు హృదయమే అంచయాన 
పుణ్య కర్మలు చేయు వారి శిరమున అంచయాన  

యోగ నిష్ఠుల ప్రస్థానములొ సహాయ సహకారం 
నిర్మలత్వము ప్రసాదించు రూపము అంచయాన 

చ్ఛిన్నాభిన్నమైన తత్త్వజ్ఞానము సహకారం 
ఉండే సంశయములనే తిర్చేటి అంచయాన  

దుష్ట శిక్షణ శిక్ష రక్షణ యందు సహకారం 
కపాల మోక్షముకు అనుశ్రుతముగా అంచయాన

ఆఖరి దశలో శాంతి కల్పించే సహకారం 
విచ్ఛిన్నమస్తక గ్రంధులు ఏకం అంచయాన 

నిత్యమూ సందర్భము ననుసరించి సహకారం 
సరైన పునర్జన్మను కలుగచేయు అంచయాన 

జనులకు ఆత్మజ్ఞానము అందించే సహకారం 
జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు అంచయాన 
 
మంచి వారు ఎల్లప్పుడు పూజింప అంచయాన 
పాద పంకజములు కలగి పవిత్రత అంచయాన  

____(((())))____


గజల్ -- అంచయాన - (012)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

 పాదములు చేరిన ఆపదలు బాపు అంచయాన 
మూడు లోకములకు ఆశ్రయ స్థానము అంచయాన  
ధ్యానంలో ఋషివర్యులకు స్థిమితము కలిగించుట  
అధిక ఆనందము పొంది అందించుఁ అంచయాన 
 
కల్యాణ గుణముల స్తుతించుచు సుఖము కలిగించుట
భయ వర్జితు లైన వారికీ భయము అంచయాన 

ఉషోదయంలా తత్త్వ విచారణను కలిగించుట
అవగాహన,ఆధ్యాత్మికత విషయాన అంచయాన 
 
నిత్య పురుష ప్రయత్నముకు తోడ్పాటు కలిగించుట
ఉన్నతి లో కరుణను అందించినది అంచయాన 
   
సుప్రతిష్థ వృత్తములు ని కృపయేను అంచయాన 
హృదయస్పందన కల్పించే శాంతిగా అంచయాన 

____(((())))___


గజల్ -- అంచయాన - (010)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

అనిర్వాచ్యమగు చిత్ స్వరూపిణిగా అంచయాన 
విషయలోల భేదవంతు రాలుగా అంచయాన   

బాహ్య దృష్టితో చూచిన ప్రేమయే విశ్వమందు 
దృశ్యము, జడము, భిన్నము గా ఉండే అంచయాన  

రూపములచేత అస్వచ్ఛవై ఉండు విశ్వమందు 
సూక్ష్మమై అంతర్ దృష్టితో చూచు అంచయాన  

స్వచ్ఛమై ఏక స్వరూపవు కలిగుండు విశ్వమందు
అఖండ స్వరూప ముతోను ప్రేమించు అంచయాన   

ఖండ స్వరూపిణి వలె భాసించుటే విశ్వమందు
యుక్త చేతస్కులై జ్ఞాన యోగిగా అంచయాన   

దర్శించు వారికి మోక్ష మిచ్చేటి అంచయాన  
నిత్యమూ బంధ ప్రేమను పంచేటి అంచయాన 
_____(((())))____



గజల్ -- అంచయాన - (013)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

పిడికిలి బిగించి చమట బిందువులతొ అంచయాన
అవని రుద్రభూమి న ప్రళయ నృత్యం అంచయాన

జ్ణాపకాల దూరం తెలియని స్థితియు జీవితమే
సంబంధములలొ నమ్మకాన్ని చూపు అంచయాన

ప్రేమ ఉన్న చోట జాగర్తపడే జీవితమే
కోపమున్నా క్షమించే గుణమ్ముతొ అంచయాన

దాన మందు అత్యంత కుశలత్వపు జీవితమే 
ప్రకృతి కంటె వేరు కాని సమానమె అంచయాన
 
స్నేహ బంధు ప్రేమనే పంచు చున్న జీవితమే 
స్వచ్ఛ మైన, చిరునవ్వు కాంతులుగా అంచయాన

శక్తి ముక్తిగా ధ్యేయం ధైర్యంతొ అంచయాన
చైతన్య శ్రామికులతో కలిసేను అంచయాన
  
---((()))--



గజల్ ..అంచయాన..014
విధేయుడు..మల్లాప్రగడరామకృష్ణ

అక్షరాస్యత చేసియు మత్తు మార్చు అంచయాన
మనిషి గమ్మత్తు నుంచి మహత్తు చూపు అంచయాన

సన్నిహితము అతిదూరము ఉన్నాను నాజ్ఞయిచ్చి 
మతిలోన దలతు మతినే కరిగించు అంచయాన

తానై యాలోకన జేయు మనుచునె నాజ్ఞయిచ్చి
చైతన్యమ్మై పాలించే వీలు అంచయాన

భ్రాంతిని తొలిగించే ప్రేరణతో నాజ్ఞయిచ్చి
సత్య మునకు నీరాజన మిత్తుటే అంచయాన

సర్వభావాతీతమునె తెలుపుతూ నాజ్ఞయిచ్చి
వాస్తవమౌ చేతిని శక్తిని చూపు అంచయాన

మానసవీధిన నిండు నాదము గా అంచయాన
వేల్పుల కీ మానసమందు స్థానమె అంచయాన

___((()))___


గజిల్..అంచయాన..015
విధేయుడు.మల్లాప్రగడ రామకృష్ణ

శ్రామిక జీవిగా ప్రేమించేది యే అంచయాన
పృథ్వి గా విశ్రాంతి లేక జీవిత అంచయాన 

ఇష్టం ఉన్న చోటే కష్టమైన ఓర్పు చూపు
ఇష్టాలను బట్టి ప్రవర్తించే ది అంచయాన

కష్టం ఉన్న చోటే బాధ వున్న ఓర్పు చూపు
బాధను తెల్పక సుఖాన్ని పంచేది అంచయాన

అర్ధం కొరకు జాగ్రత్తలు తెల్పి ఓర్పు చూపు
అర్ధం చేసుకొని సేవ చేసేది అంచయాన

ఆశయ సాధనకు నిరంతరం ఓర్పు చూపు 
ధృడసంకల్పానికి అండగా నే అంచయాన

రాత్రిం బవలు సేవలను చేసేటి అంచయాన
చీకటి తరిమే కాంతి పుంజమ్ముయె అంచయాన

____((())))____


గజిల్..అంచయాన..016
విధేయుడు.మల్లాప్రగడ రామకృష్ణ

కెరటముల వలే నిత్యోదయమైన అంచయాన 
శోభస్కరమైన, లోకములు ఏలు అంచయాన
  
సుఖముకై ప్రసరింపచేయు మనసు మాటలన్ని 
వికసితము జీవనంబులొ ప్రేమపంచు అంచయాన 

మదము మత్సరములతొ నుండి రక్షణ మాటలన్ని 
విన మృదులమౌ రవంబు చైతన్య అంచయాన 
  
శరీర పోషణనకు భిక్ష చేయుట మాటలన్ని  
సకలమగు చేతనంబు తొ జీవితం అంచయాన  

జిరకాలము బ్రతికి బ్రతికించేదియె అంచయాన
కాలం గడిచే కొద్దీ గాయమే అంచయాన

___(((()))___


గజిల్..అంచయాన..017
విధేయుడు.మల్లాప్రగడ రామకృష్ణ

పుణ్య కర్మలు చేయు శిరమునందున అంచయాన 
నిర్మలత్వము యోగ నిష్ఠులతోను  అంచయాన   

సంశయాలను తీర్చు ప్రస్థానమగు కల్పతరువు
భిన్నమైన గ్రంథుల్ని ఒకటి చేయు అంచయాన 

తత్త్వజ్ఞానమును తెలుపు మస్తకము కల్పతరువు 
దుర్మార్గులను సంహరించె ద్యర్యము అంచయాన 
 
ప్రతి విషయంలో అనుశ్రుతముగానే   కల్పతరువు 
జీవితంలొ జన్మ ల భందమైనది అంచయాన 

ప్రభుత్వ కార్యాలకు మంత్రిగానే  కల్పతరువు 
సంఘ దృష్టితో హితబోధ చేసేది అంచయాన 

లలాట నేత్రుడు పురుషోత్తమునకే అంచయాన 
ప్రాణ నాయ కకే ప్రాణమైనట్టిది  అంచయాన 

____(((()))____



గజిల్...అంచయాన --018

కోపం రాని లోపం తెలుపని దే అంచయాన
కోపం వస్తే  కాపాడేది యే  అంచయాన

పదము పదము కలిసి వాక్యం అగుటే బ్రహ్మ వ్రాత
క్షణం సుఖంగా ఫలాన్నిచ్చేదీ  అంచయాన

పాపాన్ని హరించి పుణ్యాన్ని చ్చే బ్రహ్మ వ్రాత
తంతు తతంగం తారుమారు చేయు అంచయాన

ఆయువు పోచుకున్న ప్రతి అక్షరం బ్రహ్మ వ్రాత
అజ్ఞానాన్ని హరించే దివ్వే అంచయాన

అర్ధంలో పరమార్ధం చూపేది బ్రహ్మవ్రాత
అర్ధాన్ని ఆశయాన్ని బ్రతికించు అంచయాన

అసలు వడ్డీ నుంచి యే రక్షణే బ్రహ్మ వ్రాత
మనిషి ఉనికి తోనే మాటలు పంచు అంచయాన

తెలివి జ్ణానం ధ్యానం త్యాగమే అంచయాన
మనిషికి అవసరము తృప్తి నిచ్చేది అంచయాన
_____(((())))___

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి