27, ఏప్రిల్ 2022, బుధవారం

వేంకటేశ


 రావె నాసఖీ - నేటి ఛందస్సు గీతం (001)  

రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

అతడు  

రావె నాసఖీ - మనసు దోచవే 

రావె నాప్రియా - మమత పంచవే

చూపు లన్నియూ - నవ వ సంతమై    

నన్ను దోచెనే - కళలు తీర్చవే   

==

అతడు

మందహాసమా  - మధుర గానమా 

సుందరాంగుడా - సుధను కోరితీ  

ఎందు నీవెగా - హృదయ రంజితా 

పొందు కోరితీ - దృఢత ధీరుఁడా 

ఆమె 

పంతమేలనే -  మధుర మంజరీ 

సొంతమేనులే - కధలు దేనికే 

ముందు రమ్ములే - మదన సుందరీ   

తెల్ప వద్దులే - నవకవిత్వమే 

అతడు

పూలమాలలే - పులకరింపుగా

గోల ఆటలే - సలపరింపుగా 

ఈల పాటలే - యెపుడు హాయిగా 

తాళ లేవులే - తపన నీడనే 

ఆమె 

తాళ వృత్తమై - తనరు చిత్తమే 

జ్వాలా చెంతనే - జపము దేనికే   

నీల దాహమా - నెనరు చిత్తమే 

తలా లేవులే - తపన తోణులే 

అతడు

చుక్క చుక్కగా - సుమదళమ్ములై 

ఒక్క మాటగా - కళ సమమ్ములై  

యక్కజమ్ముగా - నవని సొమ్ములై 

మక్కువంతయూ - మధుర మత్తులై  

ఆమె 

దిక్కుదిక్కులం - దెలి హిమమ్ములే 

యెక్కడుంటివో - యిచట నిమ్ములే 

కాల మంతయూ - కధల చింతనే 

దేహమంతయూ - హృదయ పొంతన 

అతడు.. ఆమె 

రావె నాసఖీ - మనసు దోచవే 

రావె నాప్రియా - మమత పంచవే

చూపు లన్నియూ - నవ వ సంతమై    

నన్ను దోచెనే - కళలు తీర్చవే   

రంజితా - ర/జ/స/లగ UIUIU - IIIUIU

0 Co

 రావె నాసఖీ - నేటి ఛందస్సు గీతం (002)  

రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 


గుత్తి గుత్తులుగఁ దెత్తు  

 క్రొత్త పుష్పముల నిత్తు 

మెత్త మెత్తగను చిత్తు   

మెప్పు నిచ్చకము ఒత్తు 


తప్పు తప్పనుట కొత్త 

ఒప్పు ఒప్పనుట పాత 

ముప్పు కాదనుట కొత్త  

తప్పు కోమనుట పాత 


వళ్ళు గుల్లలుగ చల్ల పరిచావా

చల్లఁ కోచ్చియులె నెల్లఁ సరిచేయా 

వళ్ళు మచ్చికయె చిత్తు మృదుభావా 

తుళ్ళి వచ్చితిని చిత్త మగు నీకై


మూల్య మెప్పుడును ముత్తువగుఁ గాదా       

కాల మెప్పుడును కల్లలగు గాదా 

ఘల్లు పల్కు నట గాలముగ  గాదా 

పల్ల మవ్వుటను పూలపని లాగా  

 

గుత్తి గుత్తులుగఁ దెత్తు  

 క్రొత్త పుష్పముల నిత్తు 

మెత్త మెత్తగను చిత్తు   

మెప్పు నిచ్చకము ఒత్తు 


సౌర్య ముండెనులె సత్తువుయె చూపే 

కార్య మంతయును కానిదియు కాదే 


తప్పు తప్పనుట కొత్త 

ఒప్పు ఒప్పనుట పాత 

ముప్పు కాదనుట కొత్త  

తప్పు కోమనుట పాత 


భాగ్య మయ్యెనులె బంధమగు టేగా 

సౌఖ్య మిచ్చెనులె సంత సముయేగా 

   

గుత్తి గుత్తులుగఁ దెత్తు  

 క్రొత్త పుష్పముల నిత్తు 

మెత్త మెత్తగను చిత్తు   

మెప్పు నిచ్చకము ఒత్తు 


తప్పు తప్పనుట కొత్త 

ఒప్పు ఒప్పనుట పాత 

ముప్పు కాదనుట కొత్త  

తప్పు కోమనుట పాత 


ఛందస్సు : UI UIII UIII UU 


*****


ప్రాంజలి ప్రభ - చైతన్య గీతం ...003 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో

నేల పై నడిచే వెన్నెలమ్మవు నీవు
నింగిపై గాలికి తేలే మెఘానివి నీవు
పృధ్వి పై వెంటాడే ఎండ నీడవు నీవు
ప్రేమతో ప్రత్యుపకారము చేయాలని నేను 

ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో

కళ్ళ భాష్యాలేందుకు  - చెక్కిళ్ళ వాపెందుకు
గుళ్ళ పై మక్కువెందుకు  - ముళ్ళపై శయనమెందుకు
గల్లము ఇచ్చుటెందుకు - వల్లప్ప గిన్చుటెందుకు
కళ్ళ కపటం ఎరుగ నందుకా  - కళ్ళు మైకంలో చిక్కినందుకా

నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకున్నాను నేను
ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో

ఈ 'ఊహ' నీది, నీ 'మనసు' నాది - ఈ ' నిషా' నీది, నీ 'వయసు' నాది
ఈ ' సిరి' నీది, నీ 'యశస్సు' నాది - ఈ 'భాష' నీది , నీ 'భారం ' నాది

ప్రకృతి భావాలను చెప్పాలనుకున్నాను నేను
ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో

నయనాల కదలిక కనక వర్షం - పెదాల పదనిస అనంత హర్షం
నరాల కధలిక ప్రకృతి వర్షం - మాయల బ్రతుకే ఒక శీర్షం

నీ హర్షం నిరన్తరం ఉండాలంటున్నాను నేను
ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో

తల్లి చేసేది పెళ్ళాం చేయగలదు
పెళ్ళాం చేసేది మాత్రం తల్లి చేయ లేదు
అమ్మని అన్నం అడగటం తప్పులేదు
పెళ్ళాం కొంగు వదిలితే తప్పనక తప్పదు
తల్లా ? పెళ్ళామా ? ఇరువురు సమానమంటాను నేను
ఎవ్వరు లేకున్నా ఇల్లంతా నరకం 
ప్రేమను సొంతం చేసుకొవటంలోనే ఉంది నిహజమైన జీవితం 

ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో  తెలుసుకొని మసలుకో
--((**))--

ప్రాంజలి ప్రభ - చైతన్య గీతం-004
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

అడుగులో అడుగు లేశా - కలలో కధలతో ముంచేశా
కనికరము కోసం కాపు కాశా - అనుకరణ కోసం ఎదురు చూశా

కల్ముషము లేని వాడిని - కార్యాలకు దక్షుడిని
నిత్య కర్తవ్యానికి సాక్షిని - కర్త, కర్మ, క్రియలకు భాధ్యుడ్ని

ఆశయాల సాధకుడ్ని - ఆశ్రితులకు ఉద్యమాన్ని
ఆరాధ్యులకు మోనాన్ని - ఆత్ముయులకు ఆనందాన్ని

ఆకర్షణకు నిజాన్ని- ఆచరణకు న్యాయాన్ని
పలుకులకు సత్యాన్ని - బతికించుటకు ధర్మాన్ని

ఓదార్పుకు ఓర్పుని - భాద్యతలకు భానున్ని
చల్లని చూపులకు చంద్రుడ్ని- ఎదురుచూసే అంబరాన్ని

అడుగులో అడుగులేశా - కలలో కధలతో ముంచేశా
కనికరం కోసం కాపుకాశా - అనుకరణ కోసం ఎదురు చూశా
--((**))--

ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం- 005
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

పెళ్ళియను పుస్తకము జీవితము కాదా 
జీవితమె హృధ్యముయె పావనము కాదా  

 బాధ్యతలు గామనసు త్యాగముకు చిక్కీ  
రేయి పగ లేకళల రెప్పలకునె  చిక్కీ 
ఈ తనువు సౌఖ్యముకు బంధమున చిక్కీ 
ఎన్నెలలు నమ్మకము ధైర్యము చిక్కీ

నీ హృదయ తాపమును పత్నికిని చిక్కీ 
వేడిసెగ కామమను పోరుకునె చిక్కీ  
శీలమున చెక్కినను మార్గమును చిక్కీ
నిత్యముయె నీ కళను ఆశలకు చిక్కీ 

నీ చదువు ఉన్నతను తెల్పకనె చిక్కీ 
నీ వయసు నీ తపన నీ మనసు చిక్కీ
జీవితమె బంధముకు పిల్లలకు  చిక్కీ
 కాంతులను చూపియును ప్రృధ్వినకె చిక్కీ

ఈవనమయూరములు హేలలకు చిక్కీ
పావనము లీఝరులు భావనల దక్కీ
జీవనము నీకిడెడు సేవనల చిక్కీ
దేవి యిఁక పాడెదను దీవెనల చిక్కీ

తాళిగను హృధ్యమున ప్రేమగను చిక్కీ
నా గృహము నాసతియు నాధనము చిక్కీ
ప్రేమఅను రాగమును పంచుటయు చిక్కీ
కాలమున దేశముకు సేవలకు చిక్కీ

పెళ్ళియను పుస్తకము జీవితము కాదా 
జీవితమె హృధ్యముయె పావనము కాదా 

వనమయూరము (ఇందువదనా, వరసుందరీ, కాంతా, మహితా, స్ఖలిత) - భ/జ/స/న/గగ UIII UIII UIII UU 
--(())--
ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం- 006
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

బాలగను - ఖేలగను - గాలిగను - చుట్టే  
కాలమై - ప్రేమగను  - కావ్యమను - వ్రాసితిని ప్రేమై   

దైవముయె - నిన్నుగను  - నన్నుగను టేగా   
భావమునె - తెల్పుటయు - బంధమును ఉంచే     
మోవియను  - పూవులుగ - మౌనమను నీడే   
ప్రేమయనె - నీదుగను  - పంచగను తోడే  

కాలననె - సాగుటయు  - కావ్యమువ లేలే    
మేలుగను  - చేయుటయు  -  పంచుటయు లేలే 
శ్రీలుగను  - మారుటయు  - చింతలగు లేలే      
తెల్చుటయు  - కార్యమును - తీర్చుటయు లేలే  

ఇందువదనంబు లిడు నింపులిట నీకే 
సుందర సుమంబు లిడు సొంపులవి నీకే 
వంద మధుపంబులకు వంపు నృతి నీదే 
బంధ మనిశంబు పరువంపు గుఱి యౌనే 

విద్దెలతొ -బుద్ధిగను - యుక్తిగను నుండే   
భుక్తికిలె - రక్తిగను  - శక్తిగను - తృప్తే    
వృద్ధిగాను -సిద్ధిగాను - ముక్తిగాను - వుండే  
ధర్మమగు - దీక్షగను  -  ధ్యానమును - పంచే    

కాలమే - సాగె నే  - కావ్యమే - వ్రాయగా  
మేలుగా - చేయుటే - మెక్షమే - పంచుటే
శ్రీలుగా - మారుటే - చింతలే - తీరుటే     
రాలగా - తెల్చుటే - కార్యమే - తీర్చుటే 

బాలగను - ఖేలగను - గాలిగను - చుట్టే  
కాలమై - ప్రేమగను  - కావ్యమను - వ్రాసితిని ప్రేమై   

వనమయూరము (ఇందువదనా, వరసుందరీ, కాంతా, మహితా, స్ఖలిత) - భ/జ/స/న/గగ UIII UIII UIII UU 
*****
ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం- 007
రచయిత: మల్లాప్రగడ  రామకృష్ణ

నిను గోరితిఁ జిరకాలము 
నను జూడవు పలుకాడవు 
కను సైగలె కనువిప్పుగ  
మన సైనది మది తెల్పవె
   
సలప రింతలు సాధన నీడగా    
తలుపు నల్లల తీయని పొత్తుగా 
మలుపు తీగగ మాధురి మత్తుగా 
కళలు తీరునె కామిని నీవెగా  
 
చిలిపి వేషము వేయుట ఎందుకే
కలిమి యొక్కరి కన్నుల కందమే 
చెలిమి యిద్దఱి చెన్నగు నందమే 
బలిమి నంతయు పన్నిన బంధమే 
 
నిను గోరితిఁ జిరకాలము 
నను జూడవు పలుకాడవు 
కాను సైగలె కనువిప్పుగ  
మన సైనది మది తెల్పవె
 
ద్రుతవిలంబితము - న/భ/భ/ర III UII - UII UIU

******

కలియుగ దైవ లీల (శ్రీ వెంకటేశ్వర స్వామి ) --1

అనుకోని విధంగా శ్రీ వేంకటేశ్వరుని తలుస్తూ ఆటవెలది పద్యాలు వ్రాయాలనిపించి ప్రారంభించాను ఆ ఏడుకొండల వేంకటేశ్వరుని కృప అందరికీ చేందాలని ఆశయంతో ఓం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరాయనమః.. సర్వే జనా సుఖినోభవంతు( 01-09)

ఆశ పాశ మనుటె అయ్యా ఎవరు నువ్వు ?
ఎవరు నేను అనను ఎవరు తల్లి?
తండ్రి ఎవరు అనియె తెలుపు కలలు ?
విశ్య మందు ఉన్న వేంకటేశ

సామ దాన భేద సాహిత్య భావమే 
సాద రమ్ము గనులె సానుభూతి 
సామ రస్య మైన సాధన బోధనే 
వేంకటేశ్వరావివేక దైవ

సర్వ జీవు లందు సహనముంచేదైవ 
మోహ మేధ మిచ్చి మోక్ష మిచ్చె    
భాగ్య మోసగి ధరణి భాద తీర్చు 
వేంకటేశ్వరా వివేక దైవ

భాధ మాపు నీవు బాధ్యతా విధిగాను 
సాధు హితము కోరి సాక్షి గుండు 
నిత్య శాంతి కోరు నియమ మందు
వేంకటేశ్వరా వివేక దైవ

భయము నుంచి మార్చు భగవతి ప్రార్ధన 
బోధనాది విధియె బొమ్మ లీల  
బాధ నుంచి తేల్చు భక్తసంసారమై    
వేంకటేశ్వరా వివేక దైవ

వెదకెద నిను నేను వేదము చెప్పఁగ 
హృదయము ననె యిరవు హృదయవాస 
పిలిచితిఁ బలుకఁగనె ప్రేమ జూపు
వేంకటేశ్వరా వివేక దైవ

తరుణవయసు పంచు తండ్రి వగుటయేను  
వీనుల మది సర్వ విందు జేయు 
పరగ మొక్కెదనులె పాద మందు 
వేద మంత్ర పఠన వేంకటేశ

సిరుల నిచ్చు బ్రహ్మ సేవలు పొందేలె 
మహిమల విభుఁడతడు మేలు జేయు 
మంగళకరమైన మహిమ జూపు 
వేద మంత్ర పఠన వేంకటేశ

నీమ నిష్ఠ లన్ని నెక్కువ గాపూజ 
యెక్క డున్న తలచు యదను తాకు  
మనసు కైవశమ్ము మముఁ గాతు నిత్యమ్ము    
వేద మంత్ర పఠన వేంకటేశ
_____((()))____

కలియుగ దైవ లీల (శ్రీ వెంకటేశ్వర స్వామి ) --2
ఆటవెలది  (10-18)

కృతయుగంలొ మనిషి కృప సజ్జనులు గను
వేరు లోక మందు వేద నగుటె
కలియుగంలొ మనిషి కృప దుర్జనులు గను
వేరు గుణము పలుకె  వేంకటేశ

రాముడు ఉద యించె రావణ మరణమే
రాగ మేది యైన రణము జరిగె
దుష్ట శిక్షణ గనె దూర విద్య
ధరణి యందు ఉన్న ధర్మ తేజ

పూజ పట్టులోనె పూలసొగసు జిందు
పువ్వు నలప వద్దు పూలు కళ్లు
భవ్య రీతి గనులె భారతీయులు పూజ
పూల మాల తోను పూజ్య దేవ

ఆత్మ బంధు వుంటె ఆదరణే కదా
ఆశ పాశ మందు ఆకలగుటె
ఊహ కంద నంత ఊపిరి పోశావు
అర్ధ మంద చేయు ఆర్య తేజ

ఆత్మ, ప్రకృతి కలిసి ఆశ పాశము గాను
జీవు డుద్భవించె జన్యు పరమె
నేను అనెడి అహము నెత్తి కెక్కె
అహము మార్చ వయ్య ఆది పురుష

వస్తు ఒకటి యైన వరుస ఖరీదు యే
జగతి నందు వెలుగు జాత కమ్ము
అది అనుభవ ‌పరము ఆరాట మగుటే ను
సమర మాయ కమ్మె శక్తి తేజ

పుడమిలోప్రకృతియె పురుడు పోసేనులే
ప్రకృతి ధర్మ ములయె ప్రతిభ ప్రభలు 
ప్రకృతి నియమ కళలు ప్రగతి సోపానాలు
ప్రకృతి నదుపు జేయు ప్రధమ తేజ

శ్రేష్ఠులైన పలుకు సర్వాత్ముడవు తేజ  
ఆత్మజ్ఞానులకును అంత శుభము 
నిరతిశయుడు వుగను నిర్మల తేజస్వి 
ఆత్మ దర్శకుడవు ఆది పురుష 

మూలకారణుడవు ముక్కోటి దైవము 
శాంతి తత్వముగను సమయ పాల 
ఇంద్రియముల తోను భూతాత్ముడవు తేజ 
చిత్తమునకు సర్వ చిన్మయుడవు 
_____((((())))____
శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి -- కలియుగ దైవ లీల --3
ఆటవెలది  (19-27)

సకల సృష్టి కలిగి సంకర్షణుడవులే 
జ్ఞాన ప్రభల బోధ జ్ఞప్తి చేయు 
ప్రాణులకును నిత్య ప్రాణ ప్రదుడవులే 
ఆది మధ్య రహిత ఆది పురుష 

వృద్ధిక్షయము లేని విద్య పూర్ణుడవులే   
చీకటి నితరిమియు చేరువ కళ  
ఆశయములు తీర్చు అనిరుద్ధుడవుకదా   
దండములను పెట్టె దారి చూపు 

స్వర్గమోక్షములకు సర్వాధికారివి 
పవిత్ర హృదయములొ ప్రభలు నీవు 
ఆది యజ్ఞ కర్త అగ్నిహోత్రుడవులే 
దివ్య సంపదలకు శోభితుడవు 

పితృదేవతలకు ప్రేమచూపెడివాడు 
అన్నముననె పంచు ఆత్మ బంధు   
తృప్తి నొసగు నట్టి తృణమునందించావు  
సర్వ పోషకుడగు సార్వ భౌమ 
 
దేహవాంఛ తీర్చు దినకరుడవు నీవు 
లోకములకురక్ష లోకనాధ
స్వరము శక్తి నిచ్చె సర్వవ్యాపకుడవు 
ఇంద్రియముల వృద్ధి ఇష్ట తేజ 

గుణము గలిగి వుంది గోప్యము కలవాడు 
స్పర్శ శబ్ద రూప సర్వ నిలయ  
పుణ్యకర్మ ఫలిత పుడమి ఉద్దారణ  
భేదములను తెలిపు బ్రహ్మ తేజ 

దుఃఖదాయకమును దూరము చేసావు 
నిత్య మనసు వృతి నియమ ముంచు 
ఉత్తమకళ నిచ్చు ఉత్తమోత్తవుడవు  
ధర్మఫలను నిచ్చు ధర్మ పాల 

యోగ సంఖ్య మునకు యుగపురుషుడవులే 
మంత్రమూర్తివిగను మహిమ చూపు  
మనసు అనురధమున మాయమార్చెడివాడు    
సర్వరక్షకుడవు శోభితుడవు 

కర్త, కర్మ క్రియలు కరణము పంచెను 
ఆశ్రయుడవు నీవు ఆదు కొనుట  
కాల రుద్రుడవులె కర్మసాక్షివిగనే   
వ్యక్తమగును లీల వాక్కు తేజ 
___(((())))___
శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి -- కలియుగ దైవ లీల --4
ఆటవెలది  (28-36)

కాలమందు నీవు కళ్యాణ గుణధామ  
భాగ్యము కొర కు కళ భాగ్యసీల  
సర్వ అర్ధ మిచ్చు సాధనరూపివి    
దారి చూపి నొసగు దర్శకుడవు 

వెదకి వెదకి నేను విచారించితి దేవ  
యెదుట నున్న నేను ఏమి తెలుప  
కాఁపు రమును సేతు కామితార్ద మిపుడు 
నిముష నిముష పిలుపు నిర్మ లేశ 

కంటి నయ్య ఇపుడు కమలనాధుడవులే   
కాల నిర్ణయమ్ము కళలు తీర్చు 
తులసి వనము నందు తుమ్మెద వైనావు     
విసిగి యుపవళించె వేంకటేశ 

దాసులమది నుండి దారిచూపుము దేవ 
చిరునగవుల మోము చిందు చుండె
 సకల జీవు లందు సామరస్యుడువులే 
అంతరార్ధ ముగను అంతర్యామి 

కాలమందు నీవు కళ్యాణ గుణధామ  
భాగ్యము కొర కు కళ భాగ్యసీల  
సర్వ అర్ధ మిచ్చు సాధనరూపివి    
దారి చూపి నొసగు దర్శకుడవు 

ప్రియుని భామిని కళ ప్రేమతో తీర్చ గా
ఎగసి పడిన మమత యెదనుతాకె
పరువపు కళ తీర్చె పద్మావతిని కల్సి
వేద మంత చెప్పె  వేంకటేశ

సులభ మన్నదేది సూత్రధారి తెలుపు
ధనము దినము పలుకు దారి తెలుపు
చివరి వరకు పరుగు చేతిపనులతోను
ఆశ నుండి మమ్ము ఆదు కొనుము

హాయి యున్నదేది హాస్యమున బ్రతుకు
జ్ణాన మున్న యేమి జ్ణప్తి లేదు
మంచి చెడుల బ్రతుకు మాయల మేళమే
నిన్ను నమ్మి నాము వేంకటేశ

నుదుట తిలక మెట్టి నునుపైన పుత్తడి
ఆభరణము పెట్టి అలక దీర్చి
పువ్వులన్ని పెట్టి పుడమి కోర్కనుదీర్చి
వలపు లన్నిదీర్చె వేంకటేశ

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి.. కలియుగ వైకుంఠం లీల..5
ఆటవెలది..(37....45)

నేను తెచ్చినవియు నీకుఇచ్చితి దేవ
ఉండ బట్ట లేక ఉట్టి వెన్న
తెచ్చి నీకుఉంచె తేరుకొని తినుము
వినయ విజయమిచ్చు వేంకటేశ

దాసులకు వరములు దండమునకె 
మరువ లేని మనసు మమత పంచు
కానుకలు లె ఇచ్చి  కార్యములను కోరు
మేలుకొలుపుగాను మోక్ష మిచ్చు

ఆ పరాత్పరుడుయె ఆనంద నిలమందు
భాస్కరకళ తోను భక్తి పెంచె
నిత్య శోభ శుభము నెంతయు పంచుటే
ఆలమేలుమంగ ఆలి గుండె

బాధ లన్ని తొలిచి భాగ్యలక్ష్మి నిపంచు
సర్వ కాలమందు సహన మొసగు
మనసు నిర్మలమగు మహిమలు చూపును
నిత్య శాంతి నిచ్చి నీడ గుండె 

మేఘమువలె నున్న మెరుపు మోహనుడవు  
శ్యామవర్ణముగల సార్వభౌమ   
కలువ రేకు దళము కల్వల రాయుడు 
చెక్కిళ్ళ నిగనిగలు చెంత జేర్చు  

నీ కిరీటకాంతి నిగనిగ మెరుపులు 
శంఖ, చక్ర, గధతొ శభధముగను
కంఠమందు మాల కమనీయ శోభలు 
కర్మ దీక్ష పరుడ కార్య దక్ష 

హారముల ధగధగ హంసవాహన ధారి   
అందెల తళుకులతొ ఆత్మబంధు 
దివ్యమంగళకర దివ్యతేజ విగ్రహ   
కౌస్తుభముల కాంతి కలలు తీర్చు

ఆద మరచి నిదుర ఆలయమునవద్దు
ఆశ పలుకుతోను ఆడ వద్దు
పాప నవ్వు మల్లె పాఠము లు తెలుపు
విద్య వినయ కళయె వేంకటేశ

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి.. కలియుగ వైకుంఠం లీల..5
ఆటవెలది..(46....54)

తహతహపడుచుటయె తాపమ్ము లక్షణం
 ఏమి చేయ లేక ఏల బ్రతుకు  
మల్లె పూల పరిధి మనసును వెంటాడె  
చెప్ప లేని చేష్ట వేంకటేశ 

ప్రళయకాలమందు  ప్రాధాన్య మగుటయే 
తీవ్రవేగముగను తీవ్రభాధ  
గాలి యందు కదులు గమ్యపు జ్ఞానము
విజయ మందు ఫలము వేంకటేశ

దేహధారులముయె దినదినాలబ్రతుకు 
శరణు జొచ్చితిమియు శుభము జేర్చు 
ధర్మవత్సలుడువి దారిచూపుము మాకు  
తమని దర్శనముయె తీర్పు మార్చు 

తెలియదు ఇది నాకు తెలుపు దేవ    
ఎవరు తెలప లేరు ఏల దేవ   
భక్తిబలముచేత బాధ్యత పెరుగుట
ఏడు కొండలు పైన ఏలు దేవ   

 వనజ నయనవాణి వల్లకీ రమ్యమై
ప్రణిత సుజన రక్ష భవ్వ దీక్ష
వినుత ధవళ మూర్తి విశ్వాస లక్ష్యమై
కనుము నిత్య కృపయు కమలనాధ

 గుణము లెరగ నీవు గొప్ప శక్తి గనులె
గుణము లవియు ఇవియు గమ్య మందు
వినగ ప్రణము నివ్వు వేడు కైవల్య శక్తి
తణువు సేవ లుగను తత్త్వ బోధ

 పదము విధము నీవు పద్యగద్యముగనే
పదనిసలు కధలులె పాట లగుటె
చదువులవియునీవె శాస్త్రముగను నీవె
యదను మార్చి వేయు యేలు దేవ

 గట్టి పట్టు పట్టి గానము చేసెద
పట్టు వీడ కుండ ఫలము కోరె
వట్టి మాట కాదు వాంఛతో పలికేను
ఒట్టు పెట్టు చుండ ఓర్పు పలుకు

మార్గదర్శి గాను మానస ముందుండి
మేళ వింపు లన్ని మేలు జేయ 
శక్తు లన్ని ఒకటె సాను కూలమయమై
సర్వ హితము కోరు సార్వ భౌమ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి