1, ఫిబ్రవరి 2022, మంగళవారం

రోజువారీ ఛందస్సు ***






మనసున నెపుడును నిను గన దలఁతును

కందోయి ముందుఁ గనవోయి

మలవలెఁ దెరువున నిలువుము జతగను

సందేహ మిందు వలదోయి

...

అనయము వెదకితి దినమున నిరులున

డెందానఁ గుందు విడదాయె హరుసము కరిగెను విరసము పెఱిగెను

హిందోళమందుఁ దనువూఁగె

...

వననిధి హృదయము వినుశశి తమరన

బంధాల బొందు తెగదోయి

బరువిపు డధికము తఱుఁగునొ యెఱుఁగను

గెందూళియందు నడ యాయె

...

జననము మరణము జినునికి సుగమగు

బందీకి నిందు వెతయేగా

సరసము విరసము నరునికిఁ బ్రకృతియె

నిన్‌దాఁకు విందు లేపుడేమొ

...

విధేయుడు - మోహన

0

వర్ణచ్ఛందములు - 35 - సురనర్తకీ

==

సురనర్తకీ (తరంగ, తరంగమాలికా) - ర/న/ర/న/ర/న/ర

21 ప్రకృతి 765627

==

తెలుగు భాష నేర్చుకుందాం ...  ఛందస్సు ద్వారా ,, ప్రాంజలి ప్రభ 

సురనర్తకీ (తరంగ, తరంగమాలికా) - ర/న/ర/న/ర/న/ర /9

== 

తాన తాననన తాన తాననన తాన తాననన తాననా 6/6

==

నీకు నేనిచట నాకు నీవిచట నేల యాకసము చేరెనో 

మీకు మేమిచట మాకు మీరచట మేలు చేయుటయు వీలునో

చీకు చింత కథ చాక చెక్యమగు చేష్ట ఏ మనసు తీర్పునో 

నీకు నేనిచట నాకు నీవిచట నేల యాకసము హాయిలో 

      

రాకలో శశియు రాకుమారిఁ గన రాసలీలలకు వేచెనో 

యేక మౌనిలను జోడి తారకము లీశు నానతిని రేయిలో 

చాక చక్య మిది ఆశ పాశముయు తీర్పు నాకథయు మాటలో   

ఏక మౌనులె సహాయ మేనువిధి లీల వాదనలు హాయిలో    

    

కామి తార్దము సకామ కామ్యము వినీల మార్గము సమానమే 

స్వామి తీర్ధముసు సర్వ సామ్యము సహాయ లక్ష్యము సమానమే 

యామి నీ మనుసు విశ్వ యాగము సమాన జాడ్జ్యము సుఖమ్ముయే      

రామ నామము విశాల రాగపు మనస్సు యోగ్యత శుభమ్ముయే     

==


తాన తాననన తాన తాననన తాన తాననన తాననా 

==


తంద తన్నతన తంద తన్నతన తంద తన్నతన తందనా /13


==

ముందు రమ్మిటకుఁ జింద నిమ్ములను బొంద సొమ్ములను సుందరీ 

వంద క్రొన్ననల విందు వెన్నెలల బంధ మెన్నటికి గంధమై 

యెందు గన్న నొక యంద మిన్నడిట నెందు విన్న నొక ఛందమే 

నందనమ్మిపుడు సుందరమ్మెపుడు నంద మిమ్మదియు నందమే 


సద్దు చేయక సునంద సమ్మతియు సందెవేళల శుఘంధమే 

హద్దుఏ బ్రతుకు నందు హారతియు హావ భావపు వినోదమే 

వద్దు వాదనలు వంద యైనను సుతామనోభవ సహాయమే  

పద్దులన్నియును నిద్ర వాక్యములు పాట మాటలు సమానమే          

==

తాన తత్తనన తాన తత్తనన తాన తత్తనన తాననా 

==

ప్రేమ పిచ్చుకలు చూడ ముచ్చటగ వేగ మెచ్చటికొ సాఁగెనే 

భూమి పచ్చనగు వేళ వెచ్చనగు పూలు విచ్చఁ బెను మోదమే 

యేమి యక్కజమొ చాల చక్కగను హేల లెక్కడను గానుకై 

వ్యోమ మబ్బురము కారు మబ్బులటఁ బోవు బొబ్బిలిడు నేనుఁగై 

==

తయ్య తాననన తాన తందనన తాన తాననన తాననా  

==

మెల్లఁగాఁ జదల సాఁగుచుండెఁగద మేఘ మాలికలు చూడుమా 

చల్లఁగా మదిని లేచుచుండె నిట చారు రాగిణులు నీకునై 

తెల్లమై బడెను వీనులందు నును తేట గీతికలు తీయఁగా 

యుల్లమో జలధివోలెఁ బొంగె హృది నూఁగె నూయెలలు హాయిగా 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వర్ణచ్ఛందములు - 32 

==


 వర్ణచ్ఛందములు - 31 - వనమయూరము

==

వనమయూరము (ఇందువదనా, వరసుందరీ, కాంతా, మహితా, స్ఖలిత) - భ/జ/స/న/గగ UIII UIII UIII UU 

14 శక్వరి 3823 

==

తానతన తానతన తానతన తానా 

==

ఈవనమయూరములు హేలలకు తావే

పావనము లీఝరులు భావనల రేవే 

జీవనము నీకిడెడు సేవనల పూవే 

దేవి యిఁక పాడెదను దీవెనల నీవే 

==

తత్తతన తత్తతన తత్తతన తానా

==

ముత్తెముల యక్కరపు పొత్తమది నీవే 

చిత్తమున జక్కనగు చిత్తరువు నీవే 

విత్తనము మక్కువకు బిత్తరము నీదే 

యిత్తు విరు లిక్కడికి నిత్తరిని రావా 

==

తందతన తందతన తందతన తానా 

==

==

తన్నతన తన్నతన తన్నతన తానా 

==

నమ్మితిని నిన్ను మది నమ్మితిని దేవా

సమ్ముఖముకన్న నెది సమ్ముదము కాదే 

క్రమ్ముకొనె నన్న తిమిరమ్ము శశి లేదే 

యిమ్ము విభ తెన్ను గననిమ్ము దయ రాదే 

==

తయ్యతన తయ్యతన తయ్యతన తానా

==

పల్లవము లెల్లయెడ వల్లరులఁ జూడే 

మొల్లముగ మెల్లఁగను ఫుల్లమగుఁ గాదే 

చల్లఁగను దెల్ల జిగిఁ జల్లు శశి నేఁడే 

నల్లనయ యుల్లసపు నవ్వులకు ఱేఁడే 

==  

- 29 - తోటకము



పై చిత్రానికి స్పందన



Who do you see? Devata or Devi? | Creative Gaga

నేటి కవిత - ఆరాధ్యలీల 

ఆరాధ్య లీల - ఉందెక్కడ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు లోతు కనుగొను సూత్రము ఉందెక్కడ 
వయసు పెర్గు తెలుసుకొ సూత్రము ఉందెక్కడ  

సొగసు పంచు మనసుకు సూత్రము ఉందెక్కడ   
తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  

నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ  
మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    

కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  
కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  
  
ఆత్మకు రూపం, ప్రేమకు అర్ధం 
జీవికి మోక్షం, శ్రమకు సాక్ష్యం 
అమ్మ ఆరాటం, నాన్న పోరాటం 
స్నేహానికి సూత్రము ఉందెక్కడ
వేణు గోపాల ప్రేమ సుమా 
-((**))--
ద్విపద.. మల్లాప్రగడ రామకృష్ణ l

కరుకుగా నిన్నావు కట్టితి కృష్ణ 
బరుగునా వచ్చితీ బాపుము కృష్ణ 

సిరిచూప మాయగా శీఘ్రము కృష్ణ 
సరిలేరు నీతోడు సందడి కృష్ణ 

వలచితి నిన్నునే బాధలు కృష్ణ 
కలతను తీర్చుమా కన్నుల కృష్ణ 

పిలిచి మరువలేను భీతిగా కృష్ణ 
నిలిచినామొరవిను నిజముగా కృష్ణ 

సఖిడని తల్చితి సమ్మతి కృష్ణ 
సుఖమును పంచెటిశుభమగు కృష్ణ 

సఖ్యత చూపుము సమ్మోహకృష్ణ 
ముఖ్య మనస్సగు మోదము కృష్ణ

మన్నుని తిన్నటి మానస కృష్ణ 
వెన్నెల పంచేటి వేకువ కృష్ణ

ఉగ్గుపాలను పంచ యుజ్వల కృష్ణ 
 తగ్గుఎగ్గూ కళ తత్త్వము కృష్ణ 

తీయదనంమ్ముగా తెలుపంగ కృష్ణ 
మోయడం తెలియని మోదము కృష్ణ 

అధిక మాధుర్యము అందము కృష్ణ
విధిగాసహాయము విజయంబు కృష్ణ
***
పాఠము .. 

కరుణామయ మీ - కలి నాటకమే 
తరుణా మయమే - తపనాలయమే 
కరుణామయ మా-కలి కంటకమే 
విరజాజులుగా - విశ్వము మయమే 

కరుణించఁగ నే - కరుణాత్ముఁడు దా 
నరుదెంచునొ యీ - యవనిన్ ద్వరగా 
చిరుహాసము యే - చిరునామముగా 
పరువాలయమే - పరమాత్మగనే   
==
ముదమౌ నిధి రా-ముని సన్నిధియే 
పదపద్మము లా-పద రక్షణకే 
మదిలోఁగల యా - మధురోహలతోఁ 
బద మల్లెద నా - పరమాత్మునికై
==
ప్రాసయతితో:
"మఱుగేల చరా-చరరూప పరా-
త్పర సూర్యసుధా-కరలోచన" నీ 
చరణమ్ములె నా - శరణమ్ము గదా 
స్మరసుందర యో - వరదా కనరా 
==
తోటకము - స/స/స/స IIU IIU - IIU IIU
***

వలపు కౌగిలుల - వాలిపోదురా
తలుపులన్ని ఇవి - తాపమొందురా 
కొలువుతీరినది - కోర్కతిర్చరా 
కలుపుఓక్కవలె - పీక వద్దురా 

పిలుపు వేగ విను - ప్రేమ తాపమే 
మలుపు లొద్దు విను - మాయ కోపమే 
పలుకు లన్ని విను - ప్రేమ రాగమే 
కళల మత్తు నను - కమ్ము చుండిరా 

చెలియ వెల్గులిడు - స్నేహదీపమే 
కలలు కావు విడు   - కామ్య రమ్యతే 
వలపు ఏల నిను - వార్త కమ్మితే 
తలుపు తీసి విను - టప మొద్దులే 

విరహ మిచ్చు సెగ - వేడి తాళలే 
కరుణ ఏది సెగ  - కావ్య మేనులే 
బరువు ఏల ఇక - బాధ్యతవ్వులే 
తరువు లాగ ఇక - తడ్సీ ఎండుటే

IIIUIII – UIUIU - ప్రియంవద 
***

రామచంద్రునిలొ - త్యాగబుద్ధియే 
రమ్యమైనదియు - రామరాజ్యమే 
సౌమ్యతార్దముయు - సామరస్యమే 
జామురాత్రి కళ - కామ్య మర్మమే 

రాజ్యమేలుటయె  - ధ్యానదీక్షయే 
ఆజ్ఞ చేయుటయె  - ఆశ తీర్చుటే 
ప్రజ్ఞ ప్రాభవము - ప్రీతి నిచ్చుటే  
ప్రజ్వలించుటయుఁ - ప్రేమ తీర్చుటే

వైరివీర రస-వైద్య మన్మథా    
వీర భావ పస - వేద సద్గుణా  
కార ధీర పర-గండ భైరవా 
దారకీర్తి రానా - ధర్మ పండితా 

కాల మాయలులె -  కర్మ ధర్మమే  
గాల మేయుటయె - గర్వ మర్మమే 
మాల వేయుటయె - మంచి మార్గమే 
వేళ పర్వముయె - వేదనమ్ముయే     

ప్రేమ ప్రేమికులు - ప్రీతి చూపుటే  
స్వామితీర్ధములు - చాలు ఇప్పుడే 
కామితార్ధమును - కాలయాపనే  
ఏమి జీవితమొ - యెందుకో కదా 

నా మనస్సు నవ - నాట్య మాడఁగా 
నా వయస్సు వడ - గాలి మార్పుగా 
నా తమస్సు కధ - బాధ నివ్వగా 
ఈ ఉషస్సు  కళ - ఇచ్ఛ తీ ర్చగా 

నేటి ఛందస్సు  UIUIII - UIUIU - రథోద్ధతము 

***

హిమమణి - న/న/జ/జ/గగ  IIIII IIU - IIUI UU


కమలములఁ గనఁగాఁ - గమలాక్షి రావా 
విమలమగు నుషలో - వెలుఁగీయలేవా 
సుమము లిట వనిలో - సొగసార నీకై 
హిమమణులు విరిపై - నివి చాలు నాకై 
==
రమణమగు విరులన్ - రసమందు సాకే 
భ్రమరముల రొదలో - భ్రమలొందఁబోకే 
మమతలకు నెలవై - మదిలోని ప్రీతుల్ 
సుమధురము వినఁగా - సొగసైన గీతుల్ 
==
నిను గనక మనసో - నిలుచుండ లేదే 
కనుగవకు నిజమై - కదలంగ రాదే 
ప్రణయ మొక కథలోఁ - బదబంధమౌనా 
వదనమది వ్యధలో - వసివాడిపోనా 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

ఛందస్సు --వృత్తము - UUII UI UII UI III   (2) 



ప్రాణం ఇది దైవ తీర్పుకు లొంగ వలెను 
మానం మది భర్త నేర్పుకు లొంగ వలెను 
వైనం  కధ భార్య మార్పుకు చెప్పఁ వలెను 
ప్రేమే కళ  నిత్య సత్యము తెల్ప వలెను    

దేహం ఒక దాహ మవ్వుట ఏల మనసు 
దాహం ఒక  మార్పు తెచ్చుట ఏల వయసు
మొహం ఒక కోర్కె అవ్వుట ఏల సొగసు 
కామం ఒక వాంఛ  అవ్వుట ఏల రగడ   

ఈ జాగృతి సృష్టి వ్యాప్తియు జీవి తముకు  
బాహ్య కళ దృష్టి పెర్గును  కాలమునకు
ధర్మాత్ముని సేవ  ఆ కలి  జీవమునకు 
సర్వార్ధము కర్మ బంధము  సౌమ్యమునకె

కార్యార్థము ధర్మ మవ్వుట  నిత్య సమము 
ధర్మార్దము కర్మ మవ్వుటె సత్య మయము  
ఆరోగ్యము  ఆశ  చుట్టును తిర్గు  భయము 
వైరాగ్యము వల్ల ప్రేమలు మారు తపము   

++
హిమమణి - న/న/జ/జ/గగ  IIIII IIU - IIUI UU
14 శక్వరి 2944 
==
కమలములఁ గనఁగాఁ - గమలాక్షి రావా 
విమలమగు నుషలో - వెలుఁగీయలేవా 
సుమము లిట వనిలో - సొగసార నీకై 
హిమమణులు విరిపై - నివి చాలు నాకై 
==
 మణిరంగ వృత్తం 7/10 ---UIU IIU IIU U  (3)

సర్వదా శతధా సమధర్మం 
ధర్మమే వివిధా దృతి మర్మం  
మర్మమే వరమై మాయ సత్యం 
సత్యమే సహజం సాము నిత్యం 

కాలమే వినయం కార్య మేలే 
ప్రాణమే సహనం పాన లేలే 
మానమే మనసే  మాయ లేలే 
వేషమే బ్రతుకే వాద మేలే

కారణం సమతా కార్య మయ్యే  
దారుణం తరణం దారి అయ్యే 
ప్రాభవం ప్రభలే ప్రీతి  అయ్యే 
వేడుకే వరదై వేల్పు లయ్యే  

((()))


ద్వాందాల కలయిక జీవితం*
సూర్యచంద్రులు తిరిగేటి జగతిని యూహించగలగు
చావుపుట్టుకల నిర్ణయం దైవం ఆదేశమగు
మంచి చెడులుగా జీవభవితవ్యమై ముందుకు సాగు
అమ్మనాన్నల పలుకు పిల్లలకు భవిత త్యాగాలగు
సుఖదుఃఖాలను భూతుల జీవితం ముందుకు సాగు
దేవుడు దయ్యం నరుని అంత రాత్మలోననె సాగు
మనిషిలొ దాగియున్న గుణాల స్వరూపాలై సాగు
క్షణమొక కదలిక కష్ట సుఖము లాభ నష్టము సాగు
వేడి పదార్థాలు - చల్లని విధానాకలిగ సాగు
కవి యక్షరాలు పదబంధ రచనలగా విలువలగు
ఆరోగ్య యనారోగ్య చెలిమియే కుటుంబము సాగు
స్త్రీ పురుష సంగమం గా సృష్టి జననం బిడ్డలగు


సరాగమ్మేసామర్ధ్యమగు మనసా తన్మయా భావమేలే
స్వ రమ్యత్వంమే ప్రేమయగు మనసా లక్ష్యమే సోదనేలే    
విరోధత్వంమేవిశ్వమగు కరువే లోపమే పాపమేలే
జరామార్గంమేజాద్యమగు కరిచే కర్మగా దోషమేలే  

సహాయమ్మేసామర్ధ్యమగు మనసా సేవలే సఖ్యతౌలే   
విహారమ్మే విశ్వాస మున కరువే వేదనే వేకువేలే
ప్రహాసంమే ప్రాబల్య మగు సముపాద్యమ్ముగానుయేలే               
అహంమే సంసారం చితుకు సమగర్వమ్మెలే పాపమేలే     

చమత్కారం ప్రే మందు పలుకకు నష్టాన్ని కష్టాన్ని చూడా 
లి మానాన్ని ప్రశ్నించకు సరళ లాస్యాన్ని భాష్యాన్ని పంచా
లి మాంగల్యప్రాధాన్యత సలలితంగా సమాధాన మే చె 
ప్పి మోనాన్నీ వీడీ హృదయమును పంచాలి సంతోషమ్ముగా 

సమాధానమ్మే అర్ధమగ మనసే చెప్పి ఆనందమే పం
చి మాధుర్యాన్నే హృద్యమునకు సకాలమ్ము సానిత్యమ్ముగా 
సమమ్మే ప్రోత్సాహమ్ము వినయమునే శ్రీమతీ కోర్కనెతీ
ర్చి మాయామోహాన్నీ తరిమి సుఖసౌఖ్యమ్ముయే పంచుకర్తా    

సమమ్మే సమ్మోహం చెలిమి కవిభాష్యమ్ముగా విశ్వప్రేమా 
స మానత్వమ్ముగా మనసునకు చేర్చే ప్రమోదమ్మె భక్తీ   
రమాసత్యన్నారాయణిని కొలిచే శక్తియే దైవసంక
ల్పమే నిత్యానందం కలిగుటయు కారుణ్యభావమ్ము ప్రేమా 

య  మ న  స   ర   ర  గ - మేఘవిస్ఫూర్జిత -12  

***
నిన్నేనమ్మాను రామా - నిజమునకు కళే - నిర్మలమ్మే ను కాదా
ఎన్నో అన్నాను రామా - యదతలపు కళే - ఏదికాదంది లేదే 
మన్నేనమ్మాను రామా - మనుగడకు కళే  - మర్మమేదీను లేదే 
తన్మాయే కమ్మె రామా - తనువున కధలే  - తృప్తి పొందేను రామా 

ప్రాధాన్యంమేది లేదే -- ప్రతిభకు సమరం - ప్రజ్వలమ్మేను కాదా   
విధ్యారణ్యం ఇదేలే - విధియను మహిమే - విశ్వ జాడ్యమ్ము కాదా  
బంధుత్వాలే ప్రమాదం - భయముయె కలగా - భాగ్య భావమ్ముకాదా      
క్రోదంవల్లే ఎమేమీ - కొలవదు సహనం - కామమోహం నితాంతం 

సాహిత్యమ్మేది రామా  - సహనపు సమయం - సాధనమ్మేను రామా 
స్నేహత్వమ్మేను రామా - చిరునగవుమయం - చిన్మయానంద రామా 
మోహత్వమ్మేను రామా - మధురమదమయం - మోజుతీర్చేది రామా        
బ్రహ్మతత్వం విధానం - బ్రతుకుతెరువుగా - బాధ్యతమ్మేను రామా       

స్రగ్ధర - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU

***

ఆనంద నందనమునందు - నందముల నీకు నేఁ జూపనా 
గానంపు సుస్వరము లిందుఁ - గర్ణముల కింపుగా నింపనా  
నీనవ్వు మ్రోఁగవలె నెందు - నిర్ఝరపు సద్దులో భంగమై 
ప్రాణమ్ము నీవెగద నాకు - రమ్యమగు భావి నుద్రంగమై 
==
ఆవజ్రకేతకము నీకు - నందముగ నుండెఁ గేశమ్ములో 
నావంపు సోయగములందు - హావముల సొంపు వేశమ్ములో 
భావమ్ము గీతమగు నీదు - వర్ణనము సేయఁ జిత్తమ్ములో 
శ్రీవారి నొక్కతరి చూడు - చెల్వమున ముంచు మోదమ్ములో 
==
పంతమ్ము వద్దు మఱి నీకు - బంధమును ద్రుంచఁగాఁ గాదుగా 
నంతమ్ము కావలెను కిన్క - హర్షమొక యేరుగా పారఁగా 
సంతోష మాధురిని నంద - సంశయము లేలకో కోమలీ 
వింతైన లోకమున యాత్ర - వేగముగఁ జేయఁగా రాచెలీ 

వజ్రకేతక - త/భ/జ/భ/జ/త/గ UUI UIII UI - UIII UIU UIU  
***


నేటి శీర్షిక - గురుశిష్యుల్ ఛందస్సు పాఠము (2 ) 
రచయత : మల్లాప్రగడ  రామకృష్ణ   

నలుగురిలో కోపము చూప వలదున్
కలుషిత మే బ్రత్కులొ చేరి చెరచున్
మలినముయే మంచి లొ చెడ్డ కదులున్
కలియుగ మే మున్షి లొ మార్పు తలపున్

కథ గమనమ్మే ను సహాయ విధిగన్
వ్యధ తొలగించేను విధాన మదిగన్
రధ గమనమ్మేను మనో సమరముగన్
అధరసుఖమ్మే మన జీవితముగన్

కనుల సరాగమ్ము వినోద కలగన్
వినుట సహాయమ్ము సుధా మధురమున్
మనుట మనోనేత్రము కాంక్ష వలనన్
చినుకులు భావమ్ముయు దీక్ష తెలుపున్ 

పరువు యనేదే మనసౌ కలవలెన్   
వరుస సహాయమ్ముగనే తెలిపితిన్ 
కరువు నుతీర్చీ మమతే  తెలిపితిన్    
తరువు లమల్లే నిలిచే బ్రతుకుగన్ 

విముఖత యేలే వినయమ్ము కదగన్
అమరికవల్లే కదిలే కలముగన్ 
సమరమువళ్లే కదిలే సమముగన్ 
సముఖత వల్లే మెదిలే సమయమున్ 

III  IUU  IIU  III  U .. న య స న గ  
***
ఛందస్సు పాఠము .. (3 )
మల్లాప్రగడ రామకృష్ణ
*పోరులో నిజా నిజాలు తెల్సి పాల్గొను మున్
దూరియే విధాన మాట తెల్పి చేరుటయున్
మారు పల్కకే నిదానమే సమస్య విడున్
నోరు పెంచినా మనో మయం మరో తలపున్
*జాలిలో వివాదమేను తారుమారగుటన్
మెలిమై మనో వికాశ సాధ్య సాధ్యముగన్
ఆలిగా సహాయమేను ఆత్రమైసహనమ్
కాలిలో ముళ్ళును తీయ ముళ్ళు సాధానమ్మగుటన్
* ప్రాణమే నిజాయితీ సకాల సే వలగన్
మానమే ను విద్యగా విశాల దృక్పధమున్
ధ్యానమే ను నిత్యమేను శాంతి ధర్మముగన్
వైనమేను సామరస్య భావ భాగ్యమున్
కారణమ్ములేక సాగుచున్న కాలముగన్
ప్రేరణమ్మువళ్ళ వేగుచున్న వేళలుగన్
దారుణంమ్ము జర్గు చున్న మోసముగన్
వైరమేలనీకు వేళకానివేళ యగున్
కాలమే మన స్సుగా సకామమే యగున్
వేళయే యుషస్సుగా వినోదమే యగున్
జ్వాలయే తమస్సుగా జపమ్ముయే యగున్
పాలనే వయస్సు గా ప్రభావ మే యగున్


ఛందస్సు పాఠము (4 )
రచన .. మల్లా ప్రగడ రామకృష్ణ 
   
జీవమ్ వొక్కటే -  జీవితమ్  వేరు
నీతుల్ వొక్కటే - నియమమ్ వేరు 
జాతుల్ వొక్కటే - జాతరుల్ వేరు 
క్యాతుల్ వొక్కటే - కర్మగన్  వేరు 
   
రూపం ఒక్కటే - రణం వేరు  
గుణం ఒక్కటే - గరం వేరు 
కాలం ఒక్కటే -  గమ్యం   వేరు
వనం ఒక్కటే - ఔషదాలు  వేరు

ఆశ ఒక్కటే -  ఆశయం వేరు
పాశ మొక్కటే - పాఠమే వేరు 
రోష మొక్కటే - రొఖమే వేఱు
వేష మొక్కటే - వేల్పులే వేరు 
  
ఆకలి ఒక్కటే -  రుచులు వేరు
వాకిలి ఒక్కటే - వలపు వేరు 
రోకలి ఒక్కటే -  సొలుపు వేరు
తాకిడి ఒక్కటే - తపము వేరు  

ఆరాటాలు ఒక్కటే - ఆదరనే వేరు
పోరాటాలు ఒక్కటే - పొందుగనే వేరు 
స్వేరాటాలు ఒక్కటే - సొంపుగనే వేరు 
ధ్యారాటాలు ఒక్కటే - దంచుకొనే వేరు 
 
కలం ఒక్కటే -  కావ్యాలు వేరు  
గళం ఒక్కటే - గమ్యాలు వేరు 
తాళం ఒక్కటే - తత్వాలు వేరు 
మేళం ఒక్కటే - మేనాలు వేరు 

ఛందస్సు పాఠము (5 )

కత్తి  ఒక్కటే - ఉపయోగం వేరు
వత్తి ఒక్కటే - వెలుగులు ఇరు 
పత్తి ఒక్కటే -- నేతలు వేరు 
జ్యోతి ఒక్కటే - జీవితాలు వేరు
   
ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు
పాఠం ఒక్కటే - మంత్రాలు వేరు 
భాష ఒక్కటే - భావాలు వేరు
వేష మొక్కటే - వేయిధ్యాలు వేరు 
 
బంధం ఒక్కటే  - బాధ్యతలు వేరు 
గంధం ఒక్కటే - సువాసనలు వేరు 
పందెం ఒక్కటే - పరుగులు వేరు
మందం ఒక్కటే - మనుగడ వేరు 
  
తపస్సు ఒక్కటే - కోరిక వేరు
తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు
ఉషస్సు ఒక్కటే - ఉపయోగం వేరు
మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు 

తరుణం ఒక్కటే -  తమకం వేరు
చరణం ఒక్కటే - చరిత్ర వేరు
ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు
ప్రాణం ఒక్కటే - మరణం వేరు  

నవ్వులు ఒక్కటే - ఫలితం వేరు
ఏడుపు ఒక్కటే  -- రోగాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- కష్టాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- ఫలితాలు వేరు
***
ఛందస్సు పాఠము (6)

కాలము తెలప సమయ కార్యముగన్ 
గాళము వలన సహజ గ్రాస్యముగన్
మేళముతెలుప మనసు హృద్యముగన్        
హేళన బ్రతుకు వలదు ఏమనిషిన్ 

గాయము తెలిసి తెలిసి చేయకుమున్
కాయము  మరచి మనసు మార్చకమున్
నీ యునికిని మర చుట  ఎందుకుయున్   
మాయయు తరిమియు  కళలు చేయుమున్   

సాహస మనునది విధి మారదుయున్     
స్నేహము సహనము కళ పాఠముగన్
దేహము పెరిగి కరుగు నేస్తముగన్ 
దాహము తపన మనసు దాటకయున్ 

హేళన వలదు మనసు హీనమగన్
జాలిగ బతుకు నిజము కష్టమగున్
వాలిన నడుమ కథలు కాలమగన్ 
కాలము విజయ మగుట కావ్య మగన్
***
నేటి పాఠము
 
మనసు దోచేటి నయనాల మాయ లలన  
తనువు చూపే టి వయసాయె తపన లలన  
చినుకు పడ్డ కాంతి వెలుగు చిలిపి లలన  
వణుకు పుట్టించి చూపకు వరద లలన 

ఉదయ తొందర వద్దులె ఉడుకు లలన 
హృదయ స్పందన చెప్పక హృద్య లలన  
యదను చూపియు ఆశగ యెరుక లలన 
పదపదాయని యాటకు పరుపు లలన 

అరచి ఆర్భాట మెందుకు ఆశ లలన 
వెరసి తొందర చేయుత  వింత లలన 
మరచి వాగుట దేనికి మాయ లలన 
కరచె చూపులు ఎందుకు కార్య లలన 

గొడవ చేసియు ఉండును గొప్ప లలన 
మడమ తిప్పియు వాగుట మచ్చ లలన 
పడక ఇష్టము తెల్పుట పదము లలన 
నడక వద్దని ముద్దుయె నన్న లలన 

ధనము మెదడుకు మేతగా మార్చు లలన 
ధనము ఆరోగ్య సౌఖ్యము ధరణి లలన 
ధనము‌ మానసికముగను ధ్యాన లలన 
ధనము కామము క్రోధము ధర్మ లలన 
--(())--

*బ్రతుకు..హరిత (కవిత )

*కొమ్మ  రెమ్మ  ఆకు .. కోరు పూత
వీచు గాలి వల్ల.... విరియు మోత 
కుసుమశోభ బట్టి.. కునుకు గీత
చేర్చు ఫలము లన్ని... చెట్టు మమత
చెలువ పక్షులు కళ.. చేరి ఘనత

తాపమవ్వగనులె...తపన తీత 
మండుటెండనైన.. మనుజు ఖాత
చేరి చెంత కళలు....చెరిత మోత
కాసు లడగ వలదు..... కనక కూత
చెలిమి పంచ గలను... సేద దూత

కాల ధర్మమిదియు.... కడకు నవత
శోభ యంత మవదు.. సొబగు సీత
కాంతులన్ని కలసి.. కరిగి పోత
ఆకు శోభలన్ని.. యంత వింత 
కొమ్మ లన్ని పెరిగి.. కోరి తొలత

బీడులాయె బ్రతుకు ...బిగుతు వాత 
నీరు బోసెడు కళ ... నియతి వ్రాత 
కడకు వేచెను మది  .. కలత మోత 
ఆకు మొగ్గ పూలు ..యలసి రాత 
ఎండు కొమ్మ రాలు... యెదురు కోత 

కారుమబ్బు లుడికి ... కమ్మె బ్రాత  
ప్రళయ గర్జనలతొ ..పరయు జాత 
ప్రమధ మెరుపులన్ని .. ప్రభలు కలత 
తడచివనికినట్టి ... తల్లి నలత 
వేరు నిండె నులక ..  వెలుగు మడత  

సేద తీరగ కథ .. చెట్టు శాంత
పరవ శించెను కళ .. పల్ల వజత 
మనిషి బ్రతుకు దేలు ..మదన భీత 
మాధవుండు చూడు .. మాత ను పిత
కొలువుమదిన దినము . కోరు హరిత !

(సూర్య (5) - యతి --4 
**

విన్నపాలను వినగా - బ్రేమ పారు అమృతమే 
చిన్న చేష్టలు వదిలై - భ్రాత మాట సుకృతమే 
కన్న వారును నుడిరా - ప్రాణమే సమ కృతిగా  
వెన్న నీ హృది యవగా - బ్రీతి యౌనుగ ఘృతమై 

కాల మాయయు ఇదియే - కాపు కాయుట వలదే  
మాట మోసము కాదుగా - మూగ గుండుట దెనికే     
మాయ చేసిన మనిషే - మోటు వానిగ అనకే 
తీరు మారును ఇపుడే  -  తేరు కోవుట కథలే 

నిన్ను చూడగ మనసే -  నేడు పొంగెను చెలియా 
కన్ను కొట్టకు  ఇపుడే  -  వాద మెందుకు సఖియా 
మిన్ను తక్కువ చెయకే - శబ్ద  భేదము  దెనికే     
మన్ను తింటిని ఇపుడే  -  పాశ  మన్నది  కరువే 

నిత్యమంగళ మిదియే - బ్రేమ రాగపు మదిలో 
సత్య వాదిగ వినుమా  -  నీవు నాకొక  నిధిరా 
పత్య మెందుకు ఇపుడే - నీవు నాకిక  మదిరా 
తత్వ మేదియు లేదురా  -  దూరముండేది నెలరా 

ప్రేమ సంద్రపు టలలా -  కామ మోహిని  కలలా 
శ్వేత  పుష్పము కమలా -  అంద మంతయు వలలా 
బుద్ధి మంచిది విమలా  -  బ్రాంతి నొందకు భ్రమలా 
లాలి పాడెద  సరసా   - రా పరుండుము వడిలో 

నిత్యమంగళ - ర/న/య/జ/న/గ 
 UI UII IIU - UI UII IIU
***
ఛందస్సు పాఠము  .. లయవిభాతి  వృత్తము
గణములు:  న,స,న - న,స,న - న,స,న - న,స,గ 
ప్రాసయతులు- 2,11,20,29

పలుకు సమరమ్ముగను తెలుప పదమై కదిలె 
తెలుపు పదమై వినయ మలుపు కల నొప్పెన్           
కళలు కధలే కనులు సలసలవినమ్ర మగు     
తళుకు మెరుపు కడలి జలదరిగ నొప్పెన్ 

నలుపు నయనమ్ముగను వలపు పొదలై జరిగె
పిలుపు సహణమ్ముగను తెలుపు కథ నొప్పెన్
వలపు పిలుపే మనసు మలుపు సుఖమౌమెరుపు      
గళము జయమేయగుట వలల కళ  దేవీ  

అణువణువుగా సకల మనసు కధలే కదులు 
క్షణము కలలై సమర వినయ విధమేలే        
ప్రణయముగనే సుఖమగు ప్రభ మరుపే మొదలు   
ప్రాణతి ప్రతిభే ప్రకృతిన ప్రభలగు దేవీ 
   
***

నిత్యమంగళ - ర/న/య/జ/న/గ UI UII IIU - UI UII IIU

నిన్ను జూడఁగ మనమో - నేఁడు పొంగెను చెలియా
కన్నుదోయిని గని నేఁ - గావ్య మల్లితి సకియా
వెన్న నీహృది యవఁగాఁ - బ్రీతి యౌనుగ ఘృతమై
విన్నపాలను వినఁగాఁ - బ్రేమ పారు నమృతమై

నీవు నాకొక నిధిరా - నిత్య మంగళ మదిరా
త్రోవఁ జూపెడు దివెరా - దూరముండెడు నెలరా
భావగీతపు నుడిరా - ప్రాణవాయువు సడిరా
జీవనాభ్రపు రవిరా - చిత్ర కావ్యపు కవిరా

మాల వేసెదఁ ద్వరగా - మంచి గంధపు విరులన్
వ్రేల మీటెద సరసా - వీణ రాగిణి సరులన్
లాలి పాడెద లలితో - రా పరుండుమ యొడిలో
లీలఁ దట్టెద మెల నే - లేవకుండఁగ నిశిలో

ప్రాసయతితో -

నామనోహరి యెలుఁగా - రామచిల్కల గళమా
శ్యామసుందరి కనులా - శ్యామలోగల భములా
ప్రేమసంద్రపు టలలా - కామమోహిని కలలా
యామినీశశి మెఱుఁగా - మోమునందలి వెలుఁగా
***
నీవు పాదాలు పట్టుటెందుకు - నీపాదాలకే  పూజ చేసే వారుండగా
నీవు ప్రారబ్ధ అంటుటెందుకు - నీభావాలకే విలు విచ్చే వారుండగా
భక్తి చూపాలి సేవలెందుకు - నీ బాష్పాలకే కరుణించే వారుండగా
అమ్మ,  నాన్నకి ప్రెమపంచుట - నీ కర్తవ్యమే నవపాశం గాఉండగా

తొణికిసలాడే సంప్రదాయం తో - ధర్మా ధర్మ తర్కమాడిన   భూమి
చదువులు నిండే విద్యాదాయం తో - సత్యా సత్య పల్కులే ఉన్న భూమి
పదవులు ఉండే రాజకీయం తో  - నీతి ప్రేమ  కల్గి ఉండేటి భూమి
మమతలు పండే మాననీయం తో -  పుణ్యం పాపం పెర్గి కల్సిన భూమి       

చుక్కల చీర కట్టి మక్కువలా ఎదురొస్తే - చూడని వక్కరి  మాట మగాడెవడుండు
 నెత్తి కెక్కకయే  కదిలొస్తే  -  ప్రేమను చూపకెవడుండు
టక్కరి బుద్ధి  చుక్క పక్కకలా  ఎరవేస్తే -  కళ్ళను  విప్పకెవడుండు
చిక్కక వద్దు తప్పు తప్పుఅనీ చిరుతేస్తే -   చీరను దుల్పకెవడుండు 

--((***))--

చేతిలో చెయ్యేసి చెప్పాలి -  రా  రా  వేవేగ నా  ప్రేమ పొందాలిరా
మాటలో  మర్మాన్ని విప్పాలి  -  రా  రా  కామ్యమ్ము  తీర్చి పోవాలిరా
పాలలో  నీల్లలా  కల్వాలి -  రా  రా  ఆరోగ్య  మార్పు  కావాలిరా
ఓర్పుతో తీర్పునే  మార్చాలి -  రా  రా  రంజింప  చేయ  రావాలిరా

పాద మద్దిన అరచేయి నైనా - నీ వెప్పుడు మరవకు
పేద వద్దిన ముని వేలు నైనా - నీ వెప్పుడు మరువకు 
చేతి  లోచెయి  కలిపేసి నైనా - నీవెప్పుడు మరువకు
రంగు రంగుల  బతుకుఎదైనా - నీ వెప్పుడు మరువకు

ఓ మనిషి  గమ్యం  చెప్పి -  భజింప భావ్యమ్మే కాదా 
ఓ  ఋషియు లక్ష్యం చెప్పి - యజింప పుణ్యమ్మే రాదా
ఓ మహిళ  వర్జ్యం   చెప్పి -  సృజింప భాగ్యమ్మే కాదా
ఓ  ఒకరి కొక్కరు చెప్పి -  త్వజింప మోక్షమ్మే రాదా   

కనులు భాగ్యము నింపవే - కలలు పండించుకోవే 
కలియు  ప్రేమయు పంచవే - కతలు  పూరించుకోవే

వలపు సౌఖ్యము ఇవ్వవే - వెతలు  తొల్గిమ్చుకోవే
ఫలము పొందుట మంచిదే - సుఖముతో జీవించవే 

ఊహల లోకంలో  ఉన్నావు -  గాయం మానిందని  తెలుసుకోలేవు
మాటల మౌనంలో  చిక్కావు -  భావం తేలిందని  కలుసుకోలేవు

సేవల  కాలంలో  నల్గావు  -   శాపం వలైందని   కలనుకోలేవు
ప్రేమల  మార్గంలో  ఉన్నావు - మైకం తీరిందని  మనసు ఇవ్వావు
***
జనారణ్య అభ్యుదయమ్  - జీవన్మృత్యు సంఘటన్   
ప్రమాదిత్య సంఘటనమ్  - కారున్యత్య  భావమున్  

ప్రయోగస్య  సంయుతనమ్   -  సేవ భవ్య కార్యమున్ 
మహోన్నస్య జాలి దీపమ్   - ప్రేమ శక్తి  విసృతన్

నా మౌనం చులకన  చేయకు - తెలుసుకో నాతొ ఉన్న పరమార్ధం
నా వైనం   పలచన చేయకు  -  తెలుసుకో నాతొ ఉన్న పురుషార్ధం

నా సౌఖ్యం మరచియు ఉండకు - తెలుసుకో నాతో ఉన్న అంతరార్ధం
నా శీలం  అనుమతి వీడకు - తెలుసుకో నాతో ఉన్న స్త్రీ సుఖార్ధం

బాహుబంధాలకు చిక్కి -  పాలలో నీళ్లలా కరిగి 
కాల రూపాలకు దక్కి  -  ఓర్పుతో మార్పులా పెరిగి

వేష మోసాలకు  నక్కి -  మాటలా వేటలా  ఎదిగి     
కారు మేఘాలుల కక్కి -  గాలిలా  నీటిలా  ఒదిగి
***
 
పాఠము
       
దైవమా మమ ధైర్యము నీవే  
ఇంటిలో  సతి బిడ్డల మధ్యే 
కాలమే మమ కర్మయు కాదా  
లోకమే మమ లోభము దేవీ 

దైవమా మమ ద్వేషము నీవే 
వెంటనే  తమ వేల్పుల మధ్యే 
ఏంచెనే లని యేనన భక్తీ 
మార్గమే మమమానము దేవీ  

కార్య శక్తి సకా మణిరత్నం 
దివ్య శక్తి విదీ యువ జాడ్యం 
కర్మ ముక్తి సకా గురు చర్యం 
ధర్మ సాక్షి సదా సమ భోజ్యం
 
దైవమా ఇది దైవము  రాతా
మాయయే మమ మే భయాన్నీ 
తీపిగా వినతీ సమ నేస్తం 
మానసే మమమాన్యపు లక్ష్యం
  
సేవభానస సేతు మ మేకం   
ప్రాణమే యుప రక్షణ మార్గం 
దేహమే యదదీపము లక్ష్యం 
 దైవమే యద దైవము ధ్యేయం 

 మణి రంగ - UIU  IIU  IIU  U ... ర ..స స గ,   యతి -6
***
నేటి పాఠము 

బడిగంటకు గుడిగంటకు.. బంధ మెలా కుదిరిందో..
వడిఆటకు మదిపాటకు .... వాట మెలా కుదిరిందో
జడివానకు తడినేలకు ..... జట్టు యెలా కుదిరిందో
మడియాటకు పొడిమాటకు -- మచ్చ యెలా కుదిరిందో 
   
కళసాధన కలవేదన ........ గాలికెలా కుదిరిందో  
జల వేగము అల పర్గులు -- జాలి యెలా కుదిరిందో
వల రంధ్రము గాల కొక్కము ..వాలు యెలా కుదిరిందో
మొల కోరిక తల బాణము .. మాలు యెలా కుదిరిందో

కంటి చుక్క కన్న తీపి.. కడలి కుందెక్కడ..!
కుంటి సాకు కన్న ఓర్పు .... కూడు కుందెక్కడ
ఒంటి మోజు పైన తీపి ........ ఓర్పు కుందెక్కడ
చంటి పాప పైన ముద్దు ...... జగతి కుందెక్కడ

కాలమెంచి బతక గల్గు ... కాయముందెక్కడ 
జ్వాల నుంచి చల్ల బరచు ... జాతి యుందెక్కడ  
మాల పూలు మెచ్చ గల్గు ... మార్గముందెక్కడ 
బేల నవ్వు హేళ నయ్యె  ... బీజముందెక్కడ  
        
***

ఓసి ఎంతా మజా గున్నవే
చూసి నంతా కలా కాదులే 
వాసి కెక్కావుగా మెట్టులే 
రాసి గున్నా మనో బుధ్ధిలే 

ఎందుకో బాధతో నిండెగా
అందుకో నేస్తమా ముందుగా
సర్దుకో ముందునా పండుగా
మెచ్చుకో నుండెనే నిండుగా

డెందమే వేచినీ కుండెగా
పందమే వద్ద నే నుండగా
అందమే నీదియే దాసిగా
గంధమే పొందుయే నుండగా

ముందు నీ రాకయే ముద్దుగా
పొందు నీ వంతయూ హద్దు గా
నాదియే నీ సొంతమై పద్దుగా
నీదియే నా సొంతమై సిద్దు గా

దూర తీరాలలో వుండగా
వారి భావాలలో నుండగా
చేరు మార్గములో పండుగా
మారు సౌఖ్యమ్ములో నిండుగా

చేర రమ్మంచు నన్నంటివా
చేరి దమ్ముంది మన్నించగా
కోరి ఇమ్మంది పన్నీరు గా
మారి పోయింది కన్నీరు గా

కోరికే బుద్బుదమ్మెయ్యనా
చేరికే  నెమ్మదమ్మెయ్యనా
తీరికే  సమ్మతమ్మయ్యనా
ఊరికే నమ్మకమ్మయ్యనా

చేరగా మోహనా ఎట్లురా
బేరమే లేదురా పొందురా
నేరమే కాదురా విందుగా
భారమే కాదురా చిందురా

నారి జీవమ్మె ఇక్కట్లు రా
మేరి నాదమ్మె శబ్ధమ్మురా
వారి వైనమ్ము మోహమ్మురా 
చేరి దేహమ్ము దాహమ్ము రా

ఓ మహా శక్తి రమ్మింటికిన్
ఓ సహాయమ్ము ఈవంటికన్
గామితార్ధమ్ము లీడేర్చ గన్  
స్వామి తీర్ధమ్మునే పంచగన్ 
UIUUIUUIU
***
- మానిని  - భ భ భ భ భ భ  భ గ .. యతి.. 13

మా :: కోపము చూపకు కాలము చెప్పక కోరిక నాదియు మాటలుగా 
         లోపము వెద్కుట చేష్టలు కాదులె లోకము ఉన్నది సేవల కే 
          పాపము చేయకు  నిత్యము పల్కకు పాడుప దాలను ఎప్పటికీ      
         దీపము పెట్టుము వేదము పల్కెద దివ్యము నుండును శాంతముగా

మా ::  అప్పుటి కప్పుడు  తప్పులు చేసిన ఆ కలి తిప్పలు యేకముగా      
          ఇప్పుటి  కిప్పుడు  చేసిన  ఓర్పుకి  ఇచ్చును సంతస మొచ్చునులే    
          ఎప్పుడు చేయకు  కోపముతో పనె  యేలను  కష్టము కోరుటయే     
          ఒప్పుకొ  తప్పులు  మంచిని పంచుకొ ఓర్పును చూపియు బత్కుటయే 

మా :: గోపతి గోప్యము  ఎప్పుడు నీడగ గొప్పలు నుండును రక్షణగా      
         చూపరి చేష్టలు  చిత్రము యైనచొ చూపులు ఆగుత కష్టము గా   
         తాపము వచ్చిన  చూపుల ముద్రత  తన్మయ మేనని చెప్పదుగా
         జాప్యము లేదులె ఆకలి యుందిజ జాగృతి పెంచితి శీఘ్రముగా 

మా ::నిప్పుల జోలికి పోయిన కాటికి నీడలు  కాయము దక్కవలె 
        తప్పులు మీదను తప్పులు జాబిత తప్పవు బాధలు లెక్కవలె 
         చెప్పక చెప్పిన సత్యము  నమ్మిన చేష్టలు  వేదము చెక్కవలె 
         అప్పులు  ఇచ్చుట తప్పులు తెచ్చుట ఆలికి నష్టము మక్కువలె 
                     --(())--

నేటి ఛందస్సు .. పాఠము 
     
సర్వపర్వమగు వాసిగ చక్కగ నిల్పనా?
గర్వహీనుఁడన నన్నిఁక కాంచవ చక్కగా
నిర్వివాదమగు నీ కృప నీవెను కాంచుమా,
సర్వరక్షణయు భారము సన్నుతి  నీదయన్

నిత్యమై నిలయ మౌనని నీడగ నుంటినిన్ 
సత్యమై సమయ పాలన చక్కగ చేయగన్  
ముత్యమై వెలుగు బుద్ధియు ముందర మాటగన్ 
పైత్యమై పలుకు వేదన పాకిమ్ము చుట్టును యీశ్వరా 
    
ధర్మమై వయసు మోక్షపు దీక్షలు చేసితిన్
మర్మమై మమత మాయకు మానస నైనితిన్ 
కర్మమై నియమ బంధము కాలము నందునన్ 
శర్మ గ సహజ సంపద సాధన యీశ్వరా      

"నాయను చెలిమి చిత్తమె నానిన వేళగన్    
శాయత ప్రియము నిత్యము యాదశ  మేలుగన్ 
ప్రాయము విడచి నుండక ప్రాపకమేయగున్   
పోయిన గతులు రావులె  పోవల యీశ్వరా . 

UIU III  UII UII UIU ..10 
***
నేటి ఆలోచనా పద్యాలు 

విధి ఆట వెంట సౌఖ్యం  .... హృద యానమార్గ గాలం    
మది మోహ మైన సాధ్యం ... అది తీపి గుర్తు ఘోరం      
ఇది కర్మ మైన శాపం  ..ప్రణయమ్ము చేయు యుద్ధం 
మధు రమ్ము మోహ రూపం... వినిపించు తత్వ గానం 

అతి గాను పల్కు దూరం ... స్తుతి చేయు దుష్ట లోపం 
గతి మార్చు  చుండు లోపం   సరసంబు వళ్ళ శాపం 
బ్రతుకందు ఉంచు మర్మం ..  కలి చేయు చున్న ధర్మం 
బ్రతు కంత తెల్వి వాసం ..అని తెల్పు గాధ సర్వం

గుణ మంత మారు చక్రం.. సహజమ్ము వచ్చు దుఃఖం
మన మెంచలేము దుఃఖం.. మన కర్ధ మయ్యె‌వాసం 
కను విందు భక్తి మౌనం.. చెలరేగు రక్తి రాగం
పెను చీకటాయె లోకం .. చెలరేగె నాకు శోకం

ఇక భాగ్య మొవ్వు యుద్ధం .. ఇక ఉండి తీరు సిద్ధం 
కల కాల ముండు సిద్ధం - అది తెల్పు చున్న మర్మం 
సుఖ‌ మంత విద్య సర్వం... సుఖం వాంఛ తీర్చు వైనం
నిజ మార్గ మల్ల లాభం... అదియే ను ధర్మ గమ్యం

దయ వల్ల చేరు గమ్యం... ప్రకృతంత తిర్గు చక్రం
వెలుగిచ్చు యుక్తి గానం.. హృదయమ్ము సత్యం మౌనం
విసమాయె శోక రాగం.. మదిలోన మాయ లోకం
సుమ మాల మోహ వైనం .. నిజ మైన దివ్య రూపం

విష ముంది అన్న గాలం .. భయ ముంది అన్న సాధ్యం 
చిరు మంద హాసమొఖ్యం ... మన జీవి తమ్ము సౌఖ్యం  
సమభావ తృప్తి ఘోరం ....  గమనించు సృష్టి హారం ... 
ప్రమదమ్ము పొందు హారం .... నిరుపేద కుడు దూరం    
***

నేటి పాఠము 

కలలే ఈరోజు తీరే కమలనయన నా కాలమే మార్చి నా వా 
వలలో చిక్కాక మారే వన వినిమయ కావ్యాల కర్తా స్వధర్మా
శిలగా ఉన్నావ నాకే శృతి లయలను కాసిన్ని నేర్పే ప్రబుధ్ధా
వలపుల్ నీకోసమేగా విమల నయన సవ్యాసహాయం ప్రెమివ్వా

మనసే ప్రాణమ్ము పోసే మనుగడకధ సామాన్యమై మార్పు తేవా 
వనుకే ప్రాయమ్ము నెంచే వలపులకధ ప్రావిణ్యమై నేర్పు తేవా 
తనువే తంత్రమ్ము యేంచే తపనలకధ తాత్పర్యమై కూర్పు తేవా              
క్షణమే యోగమ్ము సామర్ధముగను కధ క్క్షమత్వమ్ము మార్పు దేవీ  

IIU UUI  UUI III III UUI UUI UU .. యతి .. 9 , 16          
--(())--
ఓ మానవా.....
రూపమ్ము కమలమై రూపించు విమలమే గా 
 విందులో తమలమై విరియ వలయము గా 
కదిలించు మాటయై కనువిందు తోట గా  
సెలయేటి ఊటయై  చింద వలయమే గ
చిరుగాలి రువ్వులై విరబూయు పువ్వులు గా 
మదికింపు నవ్వులై మనగ వలయును గా 
పేరైన కవితయై  బిరుదైన భవితము గా 
ఉదయించు సవితయై నొప్పవలయమే గ
చదువుచుండ పదే పదే చదువవలయును గా 
ననెడు కోరిక కలిగించు కొనుచు నుండ గా 
నిత్య క్రొత్తదనము గల్గి నిలిచియుండ గా 
కవిత లల్లగావలె గాదె కవివరుండు శాంతియే గ

ఓ మానవా.....

తేట తేట తెనుగు తేనెలూరు తెలుగు మా బ్రతుకౌను గా 
జానపదుల తెలుగు జాను తెలుగు నిత్య మూ శోభలుగా 
జావళీల తెనుగు జాజిపూల సొబగు  పరిమళాలు పంచెనుగా 
అన్నమయ్య తెలుగు అచ్చతెలుగు మనకు వెళుగౌను గ 

అమ్మనేర్పు తెలుగు అందమైన తెలుగు లాలి జోల పాట గా 
శాసనాల తెనుగు శాశ్వతంబు వెలు గౌను గా 
నన్నపార్యు తెలుగు  నవనీత మొలకించు ను గా 
తిక్కయజ్వ తెలుగు తీపిదెలుపు చెరుకు రసమే గ 

అరిగి కలుగునట్టి  అమృతమెట్లు  ఘనము సమాజమౌను గా 
భక్తిసుధలు తోడి ముక్తి కోరు పలుకు సోరంభమే గా 
మధుర మంజులమ్ము భాగవత  మహిమ తెలుసుకోవాలి గా 
తెలుగువారికిలను సొంతమోయి మనసు పండగే గ 

పోతపోసినట్టి పసిడియౌ  పోతన్న సాహిత్యమ్ము గా 
శైలికిలను నేది సాటివచ్చు పండిత్యము గా 
పదము పదములోన పారవశ్యము గాని పలుకులు గా 
మరియు మాట లేదు మహిని సుమ్ము జీవితమ్మే గ 

తెలుగువాడి వేడి తేజంబు దెల్పాలి దసదిశలు 
పసిడి వన్నె యంచు పంచగట్టి మనసున కదలికలు 
అచ్చతెనుగు పలుకు ఆనందమొలకించ విధి విధానాలు 
పలుకవలయు నీవు తెలుగు గ్రంధాలను 

చిరునవ్వులు రువ్వుతూ చెలి చెంతనుండ గా 
కమ్మని కబుర్లొలుకుతూ సఖి జతగానుండ గా  
కోరికల సెగలు రగుల్చుతూ నెచ్చెలి దరిచేర గా 
కళల కన్నె సొగసు పండగ చేసుకోవటమే గ

చిలిపిగ కులుకుతూ ప్రియురాలు ప్రక్కనుండ గా 
మగసిరి ప్రియునికి ప్రతిరేయీ పున్నమే యవ్వ గా 
ఎంతటి ప్రవరాఖ్యుడినైనా మన్మథుడే తోడవ్వ గా 
సుఖ దుఃఖమధ్య యేకమ్ము సృష్టికి నాందీయే గ

ఓ మానవా....

మానవత్వం నిలిపే విధంగా బతకాలి గా 
అశాంతిని తరిమేటి శాంతిని పంచాలి గా 
 ప్రతి ఆత్మలో శాంతి విత్తనం వృద్ది చెందును గా 
ప్రకృతి వాతావరణం సరైన పరిస్థితులు తోడౌనునే గ 

నిశ్చలంగా నుండి నిలకడ  స్థితిని గమనించాలి గా 
శాంతి మార్గాలు వెతుకుతూ అనుకరించాలి గా 
దేశసంరక్షణ ధ్యేయంగా కదలాలి గా
 ధ్యాన అభ్యాసంతో శాంతిని చేకూర్చాలిలే గ 

స్వచ్ఛమైన మేఘపు నీటికి సమమైన నీరు లేదు గా 
 ఆత్మ బలానికి సమానమైన శక్తి లేదు గా 
కన్నుల మించిన సాక్ష్యం మరొకటి లేదు గా 
ఆహారం కన్నా ప్రియమైనది ఇంకొకటి లేదు గ

బిడ్డల 5 సంవత్సరముల వరకు చిన్న వారి గా 
10 సంవత్సరముల వరకు రాజులు మాదిరి గా 
15 సంవత్సరముల వరకు సేవకుని గా 
16 సంవత్సరముల నుండి చెలిమే గ

అశాంతి అన్యాయం అధర్మమని వాదమొద్దు గా 
 చింతిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు గా 
సంకల్పం చేయడంలో నిశ్శబ్దంగా ఉండాలి గా 
జీవితంలో అశాంతికి మూలం వెతకాలి గ

ఓ మానవా 

వైద్యం నాడు బ్రతికించాలిని ధ్యేయము గా 
వైద్యం  నేడు ధనము చుట్టూ బ్రతికేను గా 
చికిత్స నాడు మేధా సంకల్ప బలము గా 
నేడు యంత్ర పరిశోదనా ద్వారా వైద్యులు గ 

ఆరోగ్యం త్యాగాల కృషి వైద్య సేవా ఫలాలు గా 
నేడు ప్రాణమే సంపాదనాస్త్రంగా కదిలే వైద్యము గా 
నాడు ఆయుర్వేదం ఆరోగ్యానికి రక్షణ గా 
నేడు రోగాన్నే అర్ధం చేసుకోలేని వైద్యము గ





Bijay Parida - Krishna & Yashodha 5 (Geru) - The Krishna Lila tells the story of Krishna, the eighth avatar of Lord Vishnu. Filled endearing, inspiring and terrifying scenes, it narrates the antics of Krishna as a baby, his role as the protector of the inhabitants of Vrindavan, and his adventures as a youth. Parida captures the beauty of the Ras Lila amid celebratory scenes of Krishna dancing with the <i>gopis</i>.

నేటి కవిత్వం - అమ్మలుగన్నఅమ్మ 
రచయత : మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ధర్మము తెల్పి నిత్య శోభకు మూలము అమ్మ
అర్ధము వచ్చు సత్య మార్గము చూపును అమ్మ
కర్మను బట్టి ఓర్పు నేర్పును చూపిన అమ్మ
మర్మము యేల ఉన్న పాపము చేయదు అమ్మ 

ఆకలి తీర్చి సంతసమ్మును పంచును అమ్మ
సౌఖ్యము చూపి విద్య నే ర్పెడి దేవత అమ్మ
అక్కసు చూపకే నిరీక్షణతో మమ తమ్మ  
మక్కువ చూపియే అనేకము చెప్పిన అమ్మ  

కష్టము తెల్పకే  వివేకము చూపును అమ్మ
ఇష్టము గాపనే సకాలము చేయును అమ్మ
నష్టము అన్నదే ఎకాలము చెప్పదు అమ్మ 
సృష్టికి కారణం  ప్రెమమ్మును చూపెది అమ్మ 

బిడ్డకు  సేవ యుక్తి ముక్తికి మూలము అమ్మ
నవ్వుల మాటలే సకాల ము తెల్పును అమ్మ
సవ్వడి చేయకే సుఖాలను పంచును అమ్మ
తల్లి కి తండ్రికీ సహాయము చేయును అమ్మ

కమ్మని మాటలే అహర్నిశమే  కళ లమ్మ 
నమ్మకమే నిరంతరం నిలిపే మమతమ్మ 
కమ్ముకొనే విషాద సంఘట మాపిన అమ్మ   
అమ్మలుగన్న ముగ్గురమ్మల మూలపు అమ్మ

--(())--
ఆటవెలఁది షట్పది - 
==
బేసి పాదములకు ప్రాసయతి, సరి పాదములలో అక్షరసామ్య యతి, అన్ని పాదములకు ద్వితీయాక్షర ప్రాస. త్ర్యస్రగతిలో వ్రాస్తే అందము ఇనుమడిస్తుంది. క్రింద నా ఉదాహరణములు - 
==
నిన్ను జూచు క్షణము 
నన్ను మఱచిపోదు 
వన్నె నింపు బ్రతుకు - వాసికెక్కు 
చిన్న చిన్న యాశ  
లెన్నొ నాకుఁ గలవు 
తెన్నుఁ జూప నీవు - తీరు నవియు 
==
ఎవరితోడ నుంటి 
వెవరి బొట్టొ యిదియు 
దివము రాత్రి నీకు - దెసలఁ జూతు 
యువత నవత గలదు 
సవతి నీకు నచట 
కవిత పాడఁగలదె - కంఠమెత్తి
==
పరవశించి పాడి 
సరసగతుల నాడి 
నిరత మిత్తు నీకు - నిండు తృప్తి 
సరస నీవు నాదు 
సరస నుండ నెపుడు 
వరము లేల నాకు - వరము నీవె 
==

సూ/ఇం/ఇం - పాదములు 1,2,4,5
సూ/ఇం/ఇం - సూ/సూ - పాదములు 3,6 
ప్రాస ఉండాలి, మూడవ, ఆఱవ పాదములలో అక్షరసామ్య యతి. 
వీటిని చక్కగా పాడుకొన వీలగును. 
==
చతుర్మాత్రల ఇంద్రగణములతో - 
==
వనమయూరము లాఁడఁగ 
స్వనము లెల్లెడ మ్రోఁగఁగ 
మనసు పాడెను హర్షఁపు - మధుర గీతి 
మినుకు మెఱుపుల తళతళ 
చినుకు సవ్వడి టపటప 
తనరె హృదయము రమ్మిటఁ - దాళలేనె 
==
నాదు కలలకు మూర్తిగ 
మోదమున కొక స్ఫూర్తిగ 
వేదనల కొక మందుగ - వేగ రమ్ము 
నాది యన్నది లేదిట 
నీదియేగద యన్నిట 
పేద పిల్చుచు నుంటిని - బ్రేమ నిమ్ము 
==
పంచమాత్రల ఇంద్రగణములతో - 
==
దినము మెలమెల్ల జారంగ 
నినుఁడు గగనమ్ము వీడంగ 
తనువుపై గాలి వీచంగఁ - దల్తు నిన్నె 
మనసులో నీవె యీవేళ 
కనులు నిను బిల్చె రావేల 
వినెద నీపల్కులో కుల్కుఁ - బ్రేమమూర్తి 
==
ఇందు నుండు నా దైవమ్మె 
నందు నుండుఁగా నిక్కమ్మె 
యెందు వెదుకంగఁ గన్పించు - నిది నిజమ్ము 
సందియ మ్మేల దేవుండు 
వంద చోటులం దానుండుఁ  
జిందుఁ గరుణా కటాక్షంపు - సిరుల నెపుడు 
==

నేటి ఆలోచన 

కధలు చెప్పనే చెప్పొద్దు 
నిదుర పొందుటే ఎందుకో 
మధుర నీతులు తెలుసుకో  మధురమ్మే  
చెదలు పట్టనే పట్టొచ్చు 
చెదర కుండగా ఉండాలి 
పదము వల్లనే కష్టాలు పాదమేయు 

నాదు కలలొచ్చు కామ్యమై 
మోదమున కాక స్ఫూర్తి యై 
వాదములులేవు వప్పుయై వరములవ్వు  
నాది అన్నది లేదులే 
నీది అన్నది ఉందిలే 
వాది వాదము మనసులో  వరములవ్వు 

దినము తరిగి పోవుచునుండు 
మనము చేసిన పుణ్యమే 
తనువు మధురమ్ము దుర్గన్ధమ్ మనసులోన 
వినుము నీతి వాక్యములను 
కనుము సుందర స్వప్నము 
అనకు పరులలో దోషాలు ఆర్తిగాను 

ఇందు ఏ ప్రశ్నలడగకు  
అందు జరుగు ఘటనచూడు 
యెందు మాటలు పెంచకు ఇది నిజమ్ము 
సందు లందును జాగర్త 
విందు పొందు ఆలోచించు 
పొందు వల్లసుఖము ఉండు  నిజmu జీవ 

***

ఖర్చులు గావిధి కాలము గా 
చర్చలు జర్గుట సాధన గా
చేర్చెడి శక్తియు చిత్తము గా
అర్చనలే శివ హారతి  గా

దీనజానార్తిని దీర్చెను దా
మానవ రూపుడు మాధవుడై
గాన మడంచును కష్టములన్
గూనల నిచ్చును గుస్తుభుడే

నీజత కూడుట నేస్తము గా 
గాజులు శబ్దము గాళము గా 
మోజును తీర్చుట మోక్షము గా 
రాజుల తీర్పుగ రాజ్యము యే

మానస యాటల మందిర మై 
ప్రాణము నిల్పును పాఠము గా 
దానము చేసిన దాసుడు వై 
ధ్యానము నిత్యము ధర్మము గా

చందన గంధము జల్లులు గా
విందుగ డెందము వేడ్కల గా
పొందగ రాజిలె మోములు గా
వందన మేమది వాక్కులు గా 

కావడి మోతల కాయము గా
చావడి చిత్రము జాతర గా
పోవుట వచ్చుట పోరులు గా
జీవము దైవము చిత్తముగా

విశ్వముఖి (భ. భ. భ. గ యతి 7)
***


భోగి భోగములు ప్రీతిగపొందుట సత్యమున్
యోగ సంబరము నెంచియు యోగ్యత సందడిన్
మూగగానయ నుభూతులు ముఖ్యము నిత్యమున్
భాగ్యమే మనసు నందున బంధపు తత్త్వమే

చక్కనైన కళ యూపుల చెంచల మెల్లగన్
చుక్కలై చరితమేయన చూపుల చల్లగన్
మక్కువై మనసు యాటలు మాయల వెల్లువన్
చిక్కులే తొలగి సర్వము శీఘ్రము కాంతిగన్

భోగభాగ్య ములు కమ్మని కాంతుల చిత్తరుల్
రాగ పల్లవిలు మెప్పుగ రమ్యత  గప్పుచున్
యోగ నిష్ఠలగ  నేత్రలు యెప్పగ దాల్చియున్
స్వాగతమ్మగుట పిల్పుల సాక్షిగ యుంటిరే

జీవితమ్ము విధి వాకిట చిత్తము పంచుటే
భావవేదముయు నిత్యము భాగ్యము కోరుటే
సేవ లక్ష్యమగు బంధము సత్యము పల్కుటే
నీవుగా నిజము తెల్పియు నీడగ యుండుటే

పంజరాన్ని వదిలే యిక పండుగ యేచెలీ 
మంజులా మహిమ జూపవె మానసమే గిళీ
శృంజనా భవము చక్కని సందడి యే చెలీ 
రంజనా సుఖము పొందుట రమ్యత యే విధీ 

నవ్వులై నటన నానుడి నాట్యము యేలనో
పువ్వులై పుడమి చెంతన పూజ్యము యేలనో
మువ్వలై కదల చూపులు ముచ్చట యేలనో
గువ్వలై కలయు కాలము గుర్తులు యేలనో

 భోగి, భోగమన భోక్తకు భోజ్యము ఇష్టమై 
త్యాగ మూర్తులను , పెద్దల దారిన పండుగై 
రాగ భారతిగ సంతస రమ్యత జూపులై
వేగ హృద్యమున పౌరుల సేవల రాజ్యమే

వానవెల్లువగు మబ్బుల వాహిని వాకిటౌ
మానుపోరు కళ మానస మార్గము మక్కుఔ
మేను యాశ లగుతుల్యమ మేకము మోక్షమౌ
తాను నే ననుట సంభవ తన్మయ భావమే

01..మాణిబూషణశ్రీ వృత్తము (ర న భ భ ర.. యతి 10)
***

నిర్మల మగు నామదినీరూపంబున్ ధ్యానింపన్
మర్మములవి యెల్లను మల్లేశామా యంబైపోన్
ధర్మము విధిదెల్పుచుదారుల్ చూపించేశంభో
కర్మలు తొలగించెడు కారుణ్యాంభోధీవందే||

నిర్మల మగు నామది నీ రూపమ్మిన్ నిల్పoగన్
మర్మమగుట తెల్లని మంచూచల్లా చల్లంగన్
ధర్మము విధి వేడికి దాహమ్మే తీర్చా సాగు న్
కర్మలు తొలగించెడి కారుణ్యామ్ భోధీ మంచే

నమ్మక మగుటే నటనా సౌలభ్యం సందర్భ
గ్రమ్మున కథలై విధి గమ్యమ్ సద్భావామ్ముగాన్
నమ్మిన కళలే కరుణా కష్టంబుల్  యిష్టంబుల్
అమ్మ మనసుగా సహనమ్మే చూపెన్ బిడ్డల్పై

కోడిగ యరిచే మది కోసే బుద్ధీ ప్రాణమ్మున్ 
వేడిగ చిరుహాసపు వేటే లే హర్షంబౌచున్
నాడి కదలికే విధి నాశమ్ముల్ ద్రేoపన్ గ్రమ్మున్
ఆడుట మనపుంజుగనే సందర్శమ్ముల్ సౌరీ 

*డిత కటకా వృత్తము-భససమమ-15/9
***
స్వరూపమ్ స్వేచ్ఛత్వమ్మగు సహన సాధ్యా మనస్సే
సరాగమ్ నిత్యా తృప్తిగను నిధి సాధ్యా యశస్సే
పరోక్షమ్ ప్రాబల్యమ్మగు జయముపాఠ్యల్ వయస్సే
వరాలెన్నో కూర్పంగ మనిషికి వాక్కే యుషస్సే

ధనంబే లోకమ్మున్ ప్రగతిగను ధర్మమ్ గ సాగన్
మనంబే ప్రేమమ్మున్ మనుగడయు మార్గమ్ సు శాంతిన్
వినంగన్ సర్వార్ధమ్ సకలమను విద్యా సుబుద్ధిన్
ఘనంబౌ స్నేహంబౌ సుఖచరిత గమ్యాల శక్తిన్

ధరా నాధా రామా సురవరశ సదా తల్చు చుండన్
విరోదీ నే పట్టా పలుకు వశ వాసా సహాయమ్మున్
శిరో భారమ్మున్ తొల్చ గలవు లె శీఘ్రమ్ము గన్
పరేశా దాక్షిణ్యంబున గనగ పాపాఘ్న దేవన్

వివేక జ్ఞానంబౌయగు సమయ విద్యా సమమ్మున్
వివేక స్వేచ్ఛంబౌ మది కళల విద్యా సుఖమ్మున్
వివేక ప్రేమ్మమ్మున్ సతి పతుల విద్యా వివాదన్
వివేకా నందమ్మున్ గడుపు కత విద్యా శుభమ్మున్

నిరాటంకంమ్మే లే గగనమగు సనీతిన్ సనీడన్
ధరిత్రిన్ కష్టమ్మే కలకళలు దైత్యుల్ స రీతిన్
దురాసౌ దౌర్భాగ్యమ్ గమనమగు దుర్భుద్ధి నేడున్
స్థిరమ్మున్ స్నేహమ్మున్ ప్రకటిత స్థితిన్ శీ ఘ్రమేయున్

దయంతో విశ్వాసమ్ము గను సముదాయమ్ముగానే
ప్రియoమ్మౌ నిత్యార్థమ్ము పలుకగు ప్రీతిన్ ససేవా
స్వయంగా సత్యమ్మే తెలుపగల సాధ్యా సహాయం
మ్మ యంతో సాగే విద్య వినయము మార్గమ్ము గానే
ధ్వయంమ్మౌ మంచీచెడ్డ కథలగు ధ్యానమ్ము రామా 

ఒ సామీ నీవేదిక్కు మతి గతి వోర్పున్ సహా య
మ్ము సామీ నీవే రక్ష విధిగను ముఖ్యమ్ము సుధీ మ 
మ్ము సామీ నీ మాయే మనసగుట ముచ్చట్లు నిధీ న
మ్ము సామీ మీ ప్రేమే సహనమగు మొక్కుల్లగు రామా

చంద్రశ్రీ (య మ న స ర గ.. యతి.12)
***

ఖచరము లేనిదే ఎవరు బత్క లేరని  ఇదేమి తెల్సుకొనరే 
రచనలు లేనిదే  మనసు మార్పు తెల్సుకొనుట తేలికా కథలతో 
పచనము లేని భోజనము ఉప్పు లేని నలభీమపాకములుగా 
వచనము లేని పద్యములు ఎంతచద్వి నను కష్టమే తెలియుటే 

మనసును గౌరవించని పనైన  చేసియు నిజాన్ని నిర్భయముగా 
మనసును తెల్పి ధైర్యమును చూపి వేగమును పెంచి ఓర్పునువహిం
చినటన చూపకే  మనసు మాట నమ్మియు సహాయమే హృదయమై 
మనసును పంచి మానవుని తెల్వినే విశదపర్చుటే పలుకుగా 

మనిషి సకాలమూ పలుకుపై దయా కృపయు చూపకుండ పలుకే  
వినయ వివాదమే మనసు నంత చేరియు సమర్ధమైన పలుకే 
చిరునగువే మనోమయముగా మనోహరునిగా సకల పలుకే 
కధలను తెల్పి సాహసముగాను మాలికలు గాను మానసముయే  

న   జ     భ   జ   భ జ   భ  ల గ .. అశ్వాలలలిత .. 12 
III  IUI  UII  IUI  UII IUI  UII  IU  
***




ఏకరూప + ఏకరూప = కీర (సంపఁగి జాతి ప్రత్యేకత) - అఠతాళము. 
==
చంపకోత్పలమాలలలోని ద్వితీయార్ధమును సహజా లేక ఏకరూప అని అంటారు. దీనిని రెండింతలు చేసి వ్రాసిన వృత్తమిది. ఇది సంపఁగి జాతి ప్రత్యేకత. సంపఁగి జాతిలో ఎదురు నడకలు లేని 4,5,5 మాత్రలు ప్రతిపాదములో నుండును. రెండవ మాత్రాగణమునుండి ప్రారంభిస్తే ఇది అఠతాళమునకు సరిపోతుంది, మాలికావృత్తములవలె. దీనికి కీర అని పేరుంచినాను. 
==
అఠతాళము - I5I5OO
==
కీర - స/స/జ/భ/భ/ర/లగ IIU IIUI UIU - IIU IIUI UIU
20 కృతి 355676 
==
కధలే మెదిలేను ఇప్పుడే .. కవితే కదిలేను కావ్యమై   
విధిగా మొదలౌను చప్పుడే .. విషయం తెలిపేను శ్రావ్యమై 
మదిలో చెదిరేను నిప్పుగా .. మనలో భయమేను కోపమై 
ముదిరే మనసాయె వీలుగా .. ముసురే తెలచేను వేగమై    
.....
చిలుకా వనజాక్షుఁ డెక్కడే - చెలితోఁ బలుకండు చిక్కఁడే 
పలికే చిరునామ ఎక్కడా .. అలిగే చినుకళ్లె చిక్కడే 
చలిలో నిశిలోన నొంటిగా - జడమై శిలవోలె నుంటినే 
చిలికే సమయాన మొండిగా .. వెనుకే తలపాయె యప్పుడే  

పలుకే యది పైడి యయ్యెనో - వలలో పడియుంటి చేఁపగాఁ  
గలలోఁ గన నెంచ నాకు నా - కలయే కరువాయెఁ గీరమా  
తలపే సహనమ్ము నాదుగా  -- తమకం బరువాయె జేరగా    
వలపే తపనాయె  ఇప్పుడే .. వరుసే కుదిరేను వీలుగా 
....
మదనా నను జేర రమ్మురా - మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
విధిగా మనమేను కల్పరా -- చెదిరే ను లె తెల్ల మాయరా 
మధురాధర మిత్తు నీకు నా - మధువుల్ కలకండ తీపిరా 
అధరమ్ము  పొత్తు నీకులే  -- అలకా తలపేల నీకురా 

సుదతిన్ గనినంత లిప్తలో - సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో - హృదయ మ్మరవింద మౌనురా 
కధలే  తెలిపేను ఇప్పుడే  .. సుత శాంతిని పొంది నవ్వరా 
చెదిరే మనసాయె ఒప్పుకో .. జపమే  నిలయమ్ము నీకులే      
==
మనసా యెఱుగంగ లేనె యీ - మధురస్వర గీత మెక్కడే 
మనమం దది మ్రోఁగె నందమై - మలపై ధ్వని పల్కు రీతిగా 
తనువో యొకచోట నిల్వదే - తనివిన్ దను నాట్యమాడునే 
కనఁగా నిది ప్రేమ తీరులో - కవితా ఝరి పొంగి పారెనే ...  
==
మొదటి రెండు పద్యములను రెండేసి యతిలేని ఏకరూప లేక సహజా వృత్తములుగా వ్రాయ వీలగును. 
==
ఏకరూప లేక సహజా - స/స/జ/గ IIU IIUI UIU
10 పంక్తి 348 
==
చిలుకా వనజాక్షుఁ డెక్కడే 
చెలితోఁ బలుకండు చిక్కఁడే 
చలిలో నిశిలోన నొంటిగా 
జడమై శిలవోలె నుంటినే ... (4)
==
పలుకే యది పైడి యయ్యెనో 
వలలో పడియుంటి చేఁపగాఁ 
గలలోఁ గన నెంచ నాకు నా 
కలయే కరువాయెఁ గీరమా ... (5)
==
మదనా నను జేర రమ్మురా 
మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
మధురాధర మిత్తు నీకు నా 
మధువుల్ కలకండ తీపిరా ... (6)
==
సుదతిన్ గనినంత లిప్తలో 
సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో 
హృదయ మ్మరవింద మౌనురా ... (7)
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు






 



నేటి ఛందస్సు  --- 1 ..... 
 
 
నేటి చందస్సు పాఠము..3...పుళిమా... IIU III IUU IUI
.....
తణువే తపన సకాలం సుఖమ్ము
అణువై అలక సమానం సుబుద్ధి
కనువై కినికు సుశాపం సులబ్ది
మనువై వయసు మమేకం మనస్సు
......
ఒకటై ఒకటి విధమ్మే ను జాలి
సకలం ఒకటి సకాలం సుజాలి
మకుటం ఒకటి మనమ్మేను జాలి
తకిలం ఒకటి తనమ్మే ను జాలి
....
ఒకమారు ఒకటి మాధర్యమేను
నొకలారు నొకటి నోమ్ముమ్ము గాను
సుకుమార మొకటి సూత్రమ్ము గాను
తకు లాట యొకటి తన్మాత్ర మేను
.....
అనునాద మిదియు నాడీ కణాలు 
అమృతమ్ము కరుణ స్వాద్వి క్షణాలు
అపరంజి వెలుగు అంబా కణాలు 
మనసేను కలయికా వీక్ష ణాలు 
.......

ప్రాంజలి ప్రభ చందస్సు పాఠము..4.వ రోజు .. UII UI III IU IUI
కాష్టము నుండి కథలు నమఃశివాయ
....
ఇష్టము నుండి వెతలు నమఃశివాయ
కష్టము నుండి కలలు నమఃశివాయ
నష్టము నుండి నడక నమఃశివాయ
ఓటమి నుండి గెలుపు నమఃశివాయ 
......
మాటల నుండి మలుపు నమఃశివాయ
బీటల నుండి బరుపు నమఃశివాయ
చాటల నుండి తుడుపు నమఃశివాయ
ప్రేమల నుండి పిలుపు నమఃశివాయ
.....
దోమల నుండి అరుపు నమఃశివాయ
చీమల నుండి పొదుపు నమఃశివాయ
సామము నుండి సహన నమఃశివాయ
దండము నుండి దమము నమఃశివాయ
.....
గండము నుండి గళము నమఃశివాయ
కాండము నుండి జలము నమఃశివాయ
పిండము నుండి బ్రతుకు నమఃశివాయ
మోసము నుండి మరుపు నమఃశివాయ
.....
ఆశల నుండి అరుపు నమఃశివాయ
పాశము నుండి పరుపు నమఃశివాయ
కాసుల నుండి కురపు నమఃశివాయ
నీడను నుండి నిజము నమఃశివాయ
....
మేడను నుండి మలపు నమఃశివాయ
జోడుల నిండి జపము నమఃశివాయ
ఆడుట నుండి అలము నమఃశివాయ
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
***
పార్వతీ పరమేశ్వరుని చేరాలని ఆశతో...
ఉషోదయ ఇష్టపది పద్యాలు 

విరహాన కలగంటి విభుడంటి శివయ్య
తరుణాన కరుణించి తిరువీధి శివయ్య
పరువాన  పదనిస పవళించు  శివయ్య
జడివాన కురిపించు జపమాయె శివయ్య
.....
ప్రక్కనే ఉండినే పవళించు శివయ్య
మక్కువే ఉందిలే మనసివ్వు శివయ్య
తక్కువే చెప్పనా దరిచేరు శివయ్య
ఎక్కువే  అంటినా  ఎరుకేది శివయ్య
......
తలవ బోకుమా తప్పులే శివయ్య 
తలచి బోకుమా తిప్పలే  శివయ్య 
వలచి బోకుమా ఒప్పులే శివయ్య 
పిలిచి బోకుమా  నెప్పులే శివయ్య
.....
జాగేల ప్రియతమా జపమేల శివయ్య
మూగేల మురిపమా మనువాడు శివయ్య
రావేళ తకధిమా  రసమాయె శివయ్య
ప్రేమేలె మధురిమా పిలుపాయె శివయ్య
......
రూపము జూచితి ఋణము యే శివయ్య 
ధూపము ఇచ్చితి తరుణమే శివయ్య
కోపము కాదిది  కరుణయే శివయ్య
తాపము ఏయిది మరణమే శివయ్య
....
ప్రేమవ్యసనమేను ప్రియునితో  శివయ్య
ప్రేమకూ మైత్రికి ప్రియమేను శివయ్య 
జన్మల బంధమే జయముగా శివయ్య
కర్మలు  చేసెదా కనువిప్పు శివయ్య
.......
నిప్పులోను మనసు నీటిలో శివయ్య 
కాల్చలేను వయసు నాన్చలే శివయ్య 
ఎండలోను కలలు ఎండెను శివయ్య 
వానలోను వలపు  నానెను శివయ్య
.......
ఎగరలేదు తలపు ఎదగాను శివయ్య 
జ్ఞానధాతవి నీవు జ్ఞానివి శివయ్య 
భక్తి నేర్పితివి యుక్తిగా శివయ్య 
రీతిగాను కళ  నీతినే శివయ్య
.....
భక్తిని, పంచుము భావన శివయ్య 
యుక్తిగ నుంచుము యోచన శివయ్య 
శక్తిని పెంచుము సాధన శివయ్య 
ముక్తిని పంచుట ముఖ్యము శివయ్య
........
ఆశలు తుంచుతూ అలకేల శివయ్య
అందము ఇదియేను ఆహ్లాద శివయ్య
ఆశయ అనుభవం ఆత్రము శివయ్య
అంత సూన్యమనేల ఆత్మవు శివయ్య
......
విద్యమధిన వుంది నిలుపుమా శివయ్య
వినయమ్ము మదిలో వివరమే శివయ్య
***
మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షము అందరికీ అందాలని ప్రాంజలి ప్రభ ప్రార్ధనలు
*పార్వతీపరమేశ్వరుడు అక్షరమాల స్తుతి*
*అ - అద్వైతమూర్తి - *పార్వతీపరమేశ్వరుడు*
*ఆ - ఆనందస్ఫూర్తి - పార్వతీపరమేశ్వరుడు*
*ఇ - ఇలదైవం - పార్వతీపరమేశ్వరుడు*
*ఈ - ఈప్సిత రూపము పార్వతీపరమేశ్వరుడు*
*ఉ - ఉద్ధరించువాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఊ - ఊర్ధ్వముఖుడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఋ - ఋజువర్తనుడు - పార్వతీపరమేశ్వరుడు*
*ౠ - ఋణము లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఎ - ఏమిలేదని చెప్పువాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ -పార్వతీపరమేశ్వరుడు*
*ఐ - ఐశ్వర్య ప్రదాత - పార్వతీపరమేశ్వరుడు*
*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు -పార్వతీపరమేశ్వరుడు* 
*ఓ - ఓంకార రూపము - పార్వతీపరమేశ్వరుడు*
*ఔ - ఔదార్య మేరువు - పార్వతీపరమేశ్వరుడు*
*అం - అందరూ సేవించేది - పార్వతీపరమేశ్వరుడు*
*అః - అహంకార రహితుడు - పార్వతీపరమేశ్వరుడు*

*క - కళంకము లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఖ - ఖండరహితుడు - పార్వతీపరమేశ్వరుడు*
*గ - గుణాతీతుడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఘ - ఘనస్వరూపము - పార్వతీపరమేశ్వరుడు*
*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - పార్వతీపరమేశ్వరుడు*
*చ - చక్రవర్తి - పార్వతీపరమేశ్వరుడు*
*ఛ - ఛత్రము వంటి వాడు - పార్వతీపరమేశ్వరుడు*
*జ - జనన మరణములు లేని వాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఝ - ఝరులవలె బోధించువాడు- పార్వతీపరమేశ్వరుడు*
*ఞ - జ్ఞానస్వరూపము - పార్వతీపరమేశ్వరుడు*
*ట - నిష్కపటుడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఠ - నిష్ఠకలవాడు - పార్వతీపరమేశ్వరుడు*
*డ - డంబము లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు -పార్వతీపరమేశ్వరుడు*
*ణ -  తూష్ణీభావము కలవాడు -పార్వతీపరమేశ్వరుడు*
*త - తత్త్వోపదేశికుడు -పార్వతీపరమేశ్వరుడు*
*థ - తత్త్వమసి నిర్దేశకుడు -పార్వతీపరమేశ్వరుడు*
*ద - దయాస్వరూపము -పార్వతీపరమేశ్వరుడు*
*ధ - దండించి బోధించువాడు -పార్వతీపరమేశ్వరుడు*
*న - నవికారుడు - పార్వతీపరమేశ్వరుడు*
*ప - పంచేంద్రియాతీతుడు -పార్వతీపరమేశ్వరుడు*
*ఫ - ఫలాకాంక్షా రహితుడు -పార్వతీపరమేశ్వరుడు*
*బ - బంధము లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*భ - భయరహితుడు -పార్వతీపరమేశ్వరుడు*
*మ - మహావాక్యబోధకుడు -పార్వతీపరమేశ్వరుడు*
*య - యమము కలవాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ర - రాగద్వేష రహితుడు -పార్వతీపరమేశ్వరుడు*
*ల - లవలేశము ద్వేషము లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*వ - వశీకరణశక్తి కలవాడు - పార్వతీపరమేశ్వరుడు*
*శ - శమము కలవాడు - పార్వతీపరమేశ్వరుడు*
*ష - షడ్భావ వికారములు లేనివాడు - పార్వతీపరమేశ్వరుడు*
*స - సహనశీలి - పార్వతీపరమేశ్వరుడు*
*హ - హరిహర రూపుడు -పార్వతీపరమేశ్వరుడు*
*ళ - నిష్కళంకుడు - పార్వతీపరమేశ్వరుడు*
*క్ష - క్షరాక్షర విలక్షణుడు -పార్వతీపరమేశ్వరుడు*
*ఱ-ఎఱుకతో ఉన్నవాడు -పార్వతీపరమేశ్వరుడు*
ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
***

*కవిత - దేవా ---కదా  ... UII .. IUU ..  IIUU 

తత్వమును తెల్పానులె దేవా
తన్మయపు తాత్పర్యము కాదా
సత్యమును పల్కినులె దేవా
విశ్వమున ప్రేమత్వము కాదా

ధర్మమునె నేర్పాను లె దేవా
మర్మము లె పాఠ్యాంశము కాదా
స్వర్ణముయె సంసారము దేవా
వర్ణములె వాదమ్ములు కాదా

ఆత్రముయె ఆరాధన దేవా
ఆర్తిగను అంతర్గత కాదా
సాధ్యముయె సాధారణ దేవా
శోధనయె సిద్ధాంతము కాదా

సత్యముయె సూక్ష్మత్వము దేవా
శాశ్వతము సంభావ్యము కాదా
 ఆశయము ఆశ్చర్యము దేవా
నిప్పుగను నేత్రత్వము కాదా

చిత్తమిది నీకిచ్చిది దేవా
హత్తుకొను ప్రేమించుట కాదా

సిగ్గువిడి నేవచ్చితి దేవా
నెగ్గవలె నామాటలు కాదా
మొగ్గవలె మోహమ్ముయు దేవా  
తగ్గుటయె తాత్పర్యము కాదా
         
మక్కువ నుజూడెప్పుడు బ్రేమీ
చక్కని ది పొందాలిని లేదా
చెక్కరగ నాముత్తియు నీవే
చక్కని ది చుక్కాని గ రావా
***

నేటి ఛందస్సు  --- 2 ..... 
 
 తెలుగు భాష నేర్చుకోవటానికి ఛందస్సు కొంత ఉపయోగపడుతుంది,  ముందుగా గణాలు తోపద్యాలు/ కవితలు వ్రాద్దాము ఇందులో తోటకము - స/స/స/స IIU IIU - IIU IIU 
చిన్న ప్రయత్నం ....మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
....
తరుణమ్ము ఇదీ .. తపమే జపమే 
చిరునామ ఇదీ  ... చరితమ్ వనమే
కరువేన ఇదీ   ......  కలమే జయమే  
తరువేన ఇదీ   ....  ధనమే హయమే 
......    
కరుణామయ మీ - కలి నాటకమే 
కరుణామయ మా-కలి కంటకమే 
కరుణించఁగ నే - కరుణాత్ముఁడు దా 
నరుదెంచునొ యీ - యవనిన్ ద్వరగా 
......
సహనమ్ము ఇదీ .. సమరమ్ము ఇదీ  
అహమే కలి గీ  ... అనువే కదిలే  
......
ముదమౌ నిధి రా-ముని సన్నిధియే 
పదపద్మము లా-పద రక్షణకే 
మదిలోఁగల యా - మధురోహలతోఁ 
బద మల్లెద నా - పరమాత్మునికై
....
"మఱుగేల చరా-చరరూప పరా-
త్పర సూర్యసుధా-కరలోచన" నీ 
చరణమ్ములె నా - శరణమ్ము గదా 
స్మరసుందర యో - వరదా కనరా 
....

నేటి ఛందస్సు  --- 3 ..... 
  తెలుగు భాష నేర్చుకోవటానికి ఛందస్సు కొంత ఉపయోగపడుతుంది,  ముందుగా గణాలు తోపద్యాలు/ కవితలు వ్రాద్దాము ఇందులో UII IIII ... UII IIII  ......  UII IIII ... IIUU
చిన్న ప్రయత్నం ....మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
......
నచ్చిన వయసు న.. ముచ్చట పడె విధి
మచ్చిక తగు పని... ప్రియ సీతా
కచ్చితముగ నిట....విచ్చినది కలువ
మెచ్చితివి తరుణి... ప్రియ సీతా
......
యిచ్చెను హృదయము...మెచ్చెను ప్రియతము
వచ్చెను ప్రియుడు లె ... ప్రియసీతా 
స్వచ్ఛత కలిగియు ... స్వేచ్ఛ తనడకలు
ఖచ్చితమయినది ..ప్రియ సీతా
.....
నచ్చితి వి మనసు ..నిచ్చితి ని నిజము 
మెచ్చుకొనుము నను... ప్రియ సీతా
లచ్చిగ వినవలె....లిచ్చెద శుభములు
 పచ్చని దగుటయె....ప్రియ సీతా
.....
ఇష్ట మనునదియెఁ - కష్ట పడుట మది 
ఇష్ట మలుపు గతి -  ప్రియ సీతా   
ఇష్ట హృదయమున - ఇష్ట కవుగిలివి   
ఇష్టముగ తపన - ప్రియ సీతా  
.....
ఇష్ట మొగ మదియు - ఇష్టపరిచయము 
ఇష్ట మొదలనులె - ప్రియ సీతా    
ఇష్ట మని వెలుగు - ఇష్టమని థళుకు  
ఇష్ట మని కునుకు - ప్రియ సీతా  
......
కష్ట మనునదియు -  కష్ట కల కళలు 
కష్ట కధలు వలె  -  క్రమ సీతా  
కష్ట వినిమయము  - కష్ట కసి వలలు 
కష్ట మనసు వలె  - క్రమ సీతా 
.....

నేటి ఛందస్సు  --- 4 ..... 
  తెలుగు భాష నేర్చుకోవటానికి ఛందస్సు కొంత ఉపయోగపడుతుంది,  ముందుగా గణాలు తోపద్యాలు/ కవితలు వ్రాద్దాము ఇందులో III UI IIII UII UUII
చిన్న ప్రయత్నం ....మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
....
మనసు లోతు కనుగొను సూత్రము ఉందెక్కడ 
వయసు పెర్గు తెలుసుకొ సూత్రము ఉందెక్కడ  
సొగసు పంచు మనసుకు సూత్రము ఉందెక్కడ   
తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  
.....
నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ 
భయము వల్ల తరుణము సూత్రము ఉందెక్కడ 
మయము వల్ల మగువకు సూత్రము ఉందెక్కడ 
జయము వల్ల సుఖమును సూత్రము ఉందెక్కడ 
 ....
తరువు వల్ల సుఖమగు సూత్రము ఉందెక్కడ
మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    
కరువు వల్ల తనువుకి  సూత్రము ఉందెక్కడ 
పరువు పోవు మనసుకి సూత్రము ఉందెక్కడ 
.....
కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  
కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  
  
....
శార్దూలలలిత - మ/స/జ/స/త/స UUU IIU IUI IIU - UUI IIU

ప్రారంభం వెనకే సమస్త కృషియే -  ప్రోత్సాహ పలుకే 
నిర్మాణం జరిగే నిరంతరముగా - నమ్మే జగతిలో 
కర్తవ్యం వలెనే ప్రభావ పరమై - కష్టాలు జయితే  
సర్వార్ధం అనుకూలమైన ధనమై -  సామర్ధ్య కలదై 
.....
లీలల్ నింపెనుగా వనిన్ లలితమై - లేలేఁతగను శా-
ర్దూలమ్మొక్కటి తల్లితో నడచుచున్ - రోమాంచముగ నా 
సాలక్ష్మాజపు నీడలోన జిగితో - సంతోషమున నా
కాలమ్మిట్టుల సాఁగుచుండె ననురా-గమ్ముల్ విరియఁగా  
**
సాహిత్యమ్ము మనో - సుసంపద మరీ -  వేదమ్ము విధియే  
మాహత్యమ్ము మనో - సహాయ స పదా - మానమ్ము విధియే 
ఆహార్యమ్ము మనో - సుసంతస మరీ - సమ్మోహ విధియే
స్నేహత్వమ్ము మనో  - అనంత సపదా - సన్మాన విధియే
****

స్రగ్విణీ (పద్మినీ, లక్ష్మీధరా) - ర/ర - ర/ర
12 జగతి 117
==
తందనా తాననా - తందనా తత్తనా 
==

ఎందుకో నీవు రా - వెందుకో చెప్పవా 
విందు నీ రాక గో-వింద రా యిప్పుడే 
సుందరా తోటలో - సొంపులే పచ్చఁగా 
ముందు నీతో సదా - పొందులే యిచ్చతో  
==
తాననా తందనా - తయ్యనా తాననా 
==
పావనా సుందరా - వల్లవీ నాయకా 
దేవకీ నందనా - తియ్యఁగా నూఁదరా 
మోవి నీదంటిరా - మువ్వ గోపాలుఁడా 
దేవ నీవండరా - దివ్యమౌ రేయిలో 
==
తయ్యనా తాననా - తందనా తందనా 
==
ఉల్లమే నీదిరా - యుండు నాకింబుగా 
వెల్లువై పారెరా - వెండియే కాంతిగా 
మల్లెలో జాజులో - మంచిగా గంధమే 
చల్లఁగా రేయిలో - సంగ మేకాంతమై 
==
తాననా తయ్యనా - తాననా తందనా 
==
దేవుఁడో దయ్యమో - దీపమో యంధమో 
దోవలో బయ్యమో - తోడుతో బంధమో 
జీవ మానెయ్యమో - చేత మానందమో 
ఆవలో విశ్వమో - ఆదిలో నంతమో 
==


ఆరాధ్య ప్రేమ లీల (శ్రీమతి)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

నామనమ్మందు హాయికల్పించి నవ్వులన్ పంచు ప్రేమ రూపా   
ప్రేమతో నన్ను ఊరడించేటి మత్తులన్  మాపె శక్తి రూపా          

దాహమంతాను తీర్చి సంతోష పువ్వులే పంచు ముగ్ద రూపా        
దేహమంతాను పర్చి మాధుర్య మంజులానంద పర్చె రూపా      

తామసమ్మందు ఉన్న నన్నుయు చక్కగన్ మార్చు శ్వేత రూపా
దివ్యకావ్యమ్ము వ్రాయు నింగితొ వేడుకన్ చేయు పృద్వి రూపా

మంచిభోజ్జ్యమ్ము పెట్టి ఆకలి తీర్చియున్ కామ  తృప్తి రూపా 
మంచి భాగ్యమ్ము  ఇచ్చి ఆశయ కల్పియున్ దీప భాగ్యరూపా 

జీవితాంతంము నందు సఖ్యత నిల్పియున్ ప్రేమ సాక్షి రూపా 
ప్రేమ ఆలింగ నంతొ సభ్యత కల్పియున్ ప్రేమ తీర్పు రూపా 

ద్వేషభావంబు మార్చె సద్గుణ నేర్పుయున్ దివ్య భవ్య రూపా 
భక్తి ఆరాధ నందు భాద్యత తెల్పియున్ పూజ్య భావ రూపా            

భర్త ఆనందం తనకర్తవ్యమనీ 
మనసా వాచా కర్మణా చేస్తాననీ   
ముక్కోటి దేవతలసాక్షిగా 
కల్సిఉంటామని వచ్చిన భార్య రూపా 
వేణు గోపాల ప్రేమ సుమా   

--((**))--
నేటి ఛందస్సు కవితలు (3) విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ మోటక-తోటక వృత్తములు == మోటకము లేక మోటనకము - నాట్యశాస్త్రము తోటకము (ఛిత్తక, నందినీ, భ్రమారావళి) - నాట్యశాస్త్రము, పింగళ ఛందస్సు == విధేయుడు - జ్ణానవృత్తము తనభభసగ యతి..10 శ్రీ మాత యనుచు వేడెద... శ్రీ కరమును పొందెన్ శ్రీ లక్ష్య మనుచు కోరెద ... శ్రీ పలుకు నెపొందెన్ శ్రీ శక్తి యనుచు మోక్కెద.. శ్రీ మనసును పొందెన్ శ్రీ యుక్తి యనుచు తెల్పెద... శ్రీ కళలను పొందెన్ కాలమ్ము ఇదియె వేడుక - కార్యము కమనీయం తాళమ్ము ఇదియె ధర్మము - తన్మయ భవదీయం గాలమ్ము ఇదియె వేయగ - గమ్యము చిరుహాసం జ్వాలమ్ము ఇదియె నీదియు - జాతర కలవైనం చూపాలి మనసు ధైర్యము - చూపులు కదిలేలే పాపాల వలన మౌనము - ప్రాకృతి విధి లీలా కోపాలు వలన తిప్పలు - గోప్యము అనలేవే తాపాలు వలన జీవము - తామస కళ చూపే ఊరంత కదిలె పండుగ - ఊపిరి తరుణానా ఘోరమ్ము జరిగె నప్పుడు - గుప్పున పొగలాయే నేరమ్ము జరిగె చప్పుడు - నీడలు పరుగాయే వైరము జనుల మధ్యన - వైనము కదలాయే **** నయన కరుణామయ మీ - కలి నాటకమే కరుణామయ మా-కలి కంటకమే కరుణించఁగ నే - కరుణాత్ముఁడు దా నరుదెంచునొ యీ - యవనిన్ ద్వరగా == ముదమౌ నిధి రా-ముని సన్నిధియే పదపద్మము లా-పద రక్షణకే మదిలోఁగల యా - మధురోహలతోఁ బద మల్లెద నా - పరమాత్మునికై

వర్ణచ్ఛందములు - 29 - తోటకము 

==

వర్ణచ్ఛందములు - 28 - స్రగ్విణీ వృత్తము

==


విధేయుడు - మోహన

1 Co

వర్ణచ్ఛందములు - 27

==

వర్ణచ్ఛందములుగా తెలుగులోని ఖ్యాత వృత్తములు

==

ఉత్పలమాల:

తందన తందనా తనతనా - తననా తనతంద తందనా (యతి మార్పు)

==

వందలు వందలై సుమములీ వనిలోఁ గనులందు విందులై 

యందము చిందఁగా నిజముగా నదియే మనమందు ఛందమై 

స్పందన నొందు నా నిముసమే పదమౌ నొక సింధు బిందువై 

చందన గంధమై మెలఁగు నీ జగమే వెలుఁగొందు సుందరీ 

==

చంపకమాల:

తనతన తత్తనా తనతనా - తననా తనతత్త తత్తనా (యతి మార్పు)

==

వదలక చిత్త మీరజనిలోఁ పఱుగాడెను గ్రొత్త రక్తితో 

ముదముల కద్దమా తెలియ దామొగమాయెను ముద్దు పద్దుగా 

కదలెడు బుగ్గపై నరుణ మా కమలానన సిగ్గు నిగ్గుగా 

హృదయము వెచ్చఁగా నగునుగా కృపతోఁ దను వచ్చు మెచ్చఁగా 

(రక్తి => రత్తి = తత్త)

==

మత్తేభవిక్రీడితము:

తనతానా తనతంద తానతననా - తానాన తానందనా 

==

ఇది నీకే ప్రణయంపు రాగములతో నీగీతి నాలింపుమా 

మది నీకే మధురంబు భావములుగా మాబాగు తానంబుగా 

ముదమేగా పులకించు జీవితములో మోహాలు లోపించునా 

యెదలోనే కుసుమించు నూతనముగా నీగోము శోభించఁగా 

==

శార్దూలవిక్రీడితము:

తన్నానా తనతంద తానతన - తన్నా తాననా తాననా (యతి మార్పు)

==

నిన్నేగా నిధియందు నేనెపుడు నిన్నే దేవిగా భావిగా 

నిన్నాళ్లీ భవమందుఁ జూచితిని యిమ్మా యావరా లీవిగా 

కొన్నాళ్లేగద యిందు జీవితము కొమ్మా పూజ లీవేళలో 

పన్నీరీ హృదియందుఁ బోయుమమ వమ్మా యాశ లీభూమిలో 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

0 Comments

  

వర్ణచ్ఛందములోని గణములు

రెండక్షరముల గణములు:

1) తన, తనా, తాన, తానా; ఉదా. హరి, సుధా, వారి, మేరీ.

తన గణములలో ఒత్తులు, అనుస్వారములు ఉండవు. కేవలము హ్రస్వ దీర్ఘాక్షరములు మాత్రమే. 

2) తత్త, తత్తా, తాత్తా; ఉదా. అత్త, రుక్కూ, కాక్కా. 

తత్త గణములలోని త్త-కారము వర్గాక్షరములకు అవే అక్షరపు ఒత్తులు (ద్విత్వములు), వేఱువేఱు వర్గాక్షరముల ఒత్తులు. 

3) తన్న, తాన్న, తాన్నా; ఉదా. క్షుణ్ణ, బామ్మ, నాన్నా. 

తన్న గనములలోని న్న-కారము అనునాసికములతో ద్విత్వాక్షరములు. 

4) తంద, తాంద, తాందా; ఉదా. రంగ, చాంగు, సాంబా 

తంద గణములలోని ంద అనునాసికములతో ఉండే వర్గాక్షరములు. 

5) తయ్య, (తాయ్య), తయ్యా; ఉదా. అవ్వ, కాళ్లు, భయ్యా.  

తయ్య గణములలోని య్య-కారము అంతస్థములతో ద్విత్వ, సంయుక్తాక్షరములు. తెలుగులో ఊష్మములతో కూడ కలుప వచ్చును.  

పై రెండక్షరముల గణములతో మిశ్రణము చేసి మూడు, నాలుగు, అయిదు అక్షరముల గణములను కల్పించవలెను. ఉదా. తనన, తత్తన, తాందన, తాతయ్య, తందతాన, తనతానన, ఇత్యాదులు. తమిళములో హలంతములైన ఛందములు కూడ ఉన్నాయి, ఉదా. తత్తత్, తందత్, ఇత్యాదులు. తెలుగులో ఇవి సాధ్యము కావు. చివరి హల్లు తఱువాతి హల్లుతో చేరాలి, ఉదా. తత్తత్ తంద => తత్తత్తంద. 

తెలుగులో కొన్ని చిక్కులు ఉన్నాయి, వాటిని వివేకముగా పరిష్కరించాలి. ఉదాహరణముగా, పుష్పము, పిల్చి, వార్త, పుణ్యము వంటి పదముల వర్ణ గణములు ఏమి? దీని పరిష్కరణ పదముల వైకృత రూపముపైన, ఊనికపైన ఆధారపడి ఉంటుంది. పుష్పము => పుప్పము (తత్తన); పిల్చి (తత్త ఎందుకంటే ఊనిక చ-కారముపైన), అదే విధముగా వార్త తాత్త అవుతుంది, పుణ్యము => పున్నెము తన్నన అవుతుంది.  

తత్తన, తయ్యన, తాందన, తానన, తన్నన, ఇవన్నియు భ-గణములే. కాని వీటి ధ్వనులు వేఱు. అందువలన ఒకే ధ్వనులను ఉపయోగించి పాటలను, పద్యములను వ్రాసినప్పుడు అవి చెవులలో మ్రోగి కర్ణానందము కలిగిస్తాయి. అందువలన ఈ వర్ణచ్ఛందములను బిగ్గరగా చదువవలెను. అప్పుడే వాటి ధ్వని అనుభూతి మనకు సిద్ధిస్తుంది.  

విధేయుడు - మోహన

2

వర్ణచ్ఛందములు - 26 - తిరుప్పుగఴ్ ఛందము 

==

తనతానన తనతానన 

తనతానన తనతానన 

తనతానన తనతానన తంద తాన (909) 

==

నిను గోరితిఁ జిరకాలము 

    నను జూడవు పలుకాడవు 

    మనమాయెను వెతతోడను మంజువాణీ 

  నెలరాజల వెలుఁగీయఁగ  

    వలరాజిల విరిబాణము 

    చెలరేగుచు గురి చేసెను నంజువోలె 

==

దినమాయెను జనె సూరుఁడు 

    తనువాయెను జిన ఱాయిగ 

    కను మూయక యిరులాయెను మందు నీవా 

  తెరువేదియుఁ గనరాదిట 

    తెరయోయన హిమధూమము 

    వెఱపాయెను విరహానల మిందు నాకే 

==

వనమాయెను మరుభూమిగ 

    నన గానదు లత వాడెను 

    వినరాదొక పిక గీతము విందు లేదే 

  వలపే యొక పెను శాపము 

    తలఁపే యొక పరితాపము 

    చెలువాలకు బలిపీఠము చిందు లేదే 

==

పని లేనిది పస లేనిది 

    పెను మేదిని చెఱసాలయె 

    వినువీథుల కరుణామయుఁ డిందు రాఁడే 

  పరమేశుని కెడబాటులె  

    మఱి నాహృది నెటులాతఁడు 

    సరి చేయును దరి చూపఁగ నిందు లేఁడే 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

1 Co


వర్ణచ్ఛందములు - 24 - మందాక్రాంతపు పాదము

==

నేను మందాక్రాంత వృత్తమునకు సంస్కృతములోవలె విఱుపులను అక్షరసామ్య యతితో నిస్తాను. ఇవి పాటలు కావున పాదాంతములో గురువుకు బదులు లఘువును వాడినప్పుడు అది గురుతుల్యమవుతుంది. 

==

మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU

17 అత్యష్టి 18929

==

తందాతందా - తనన తననా - తాననా తందతానా 

==

బృందానందా - విమలచరితా - ప్రేమగేహంపు దేవా 

నందానందా - నవరసమయా - నాదధామంపు నాథా 

విందీయంగా - వికచసుమమై - వేగ పూయంగలేవా 

యిందోరంగా - హృదయమును నీ - కీయఁగా నుంటి రావా 

==

తానాతానా - తనన తననా - తాననా తందతానా 

==

భావాతీతా - భవపు సుగతీ - భార మీబంధమేనా 

దేవా నీకై - దినము దలఁపే - దీపమై యిందు నేనా 

జీవేశా నా - సిరిగ నెదలోఁ - జేరఁగా సంగమేనా 

నీవానేనే - నిజము గదరా - నేల యానింగితోనే 

==

తందా తన్నా - తనన తననా - తాన తత్తాన తత్త 

==

రంగా నిన్నే - రమణ నిలపై - రాశి పుష్పాలఁ గొల్తు  

సంగీతమ్మే - సకలముగదా - సాధుపక్షా సుచిత్తా 

శృంగారమ్మే - చెలువు శిరమా - శ్రీశ విద్యాసముద్రా 

భృంగారమ్మే - వెలుఁగు నుడుపా - వేదనిష్ఠాగరిష్ఠా 

==

(ఇక్కడ విద్య, పుష్పము, పక్షము, సముద్రము మున్నగువాటిని విద్దె, పుప్పము, పచ్చము, సముద్దరముగా నిర్ణయించి తత్తను వాడినాను. అలాగే నిష్ఠ => నిట్ట, గరిష్ఠా => గరిట్టా. ఎందుకంటే తెలుగులో వీటిని ఎలా గ్రహించవలెనో తెలియదు. కొల్తు ఉచ్చరణలో త-కారముపైన ఊనిక ఉన్నది కావున దానిని కూడ తత్తగా వాడినాను.)

==

తానా తందా - తనన తననా - తత్తనా తందతానా 

==

మాతా యంబా - మరకతవపూ - మత్తమాతంగి దేవీ 

నాతోషంబై - నవ రుచులతో - నట్టులో నుండ రావా 

కాతాళంబీ - కసటు నరుపైఁ - గద్దు కాకుండ నౌనా 

యీతావందీ - యిరులు వలదే - యిచ్చతో రంగు లీవే 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

2  

వర్ణచ్ఛందములు - 23

==

ఆధారము: కల్పితము

సూత్రము: 

(తత్తన తనన తనతన - 

తత్తన తనన తనతన - 

తత్తన తనన తనతన తనతాన)2

==

ముత్తెపు నగవు గనగను 

    జిత్తము చెలువు నలరెను 

    విత్తము వలదు మనికిని నిజమేగా  

  ముప్పుల వెతలు మఱుగగు 

    తిప్పలు వదలుఁ దురితము 

    తప్పులు దొలఁగు భవమున సిరియేగా 

==

ఎత్తులు వలదు మనఁగను 

    జిత్తులు వలదు మనఁగను 

    సత్తెపు పలుకు లవసర మగుఁగాదా 

  యెప్పుడు నతనిఁ దలఁచినఁ  

    జప్పుడు నిడక మనలకుఁ 

    జప్పున వరము లొసఁగును ముదమేగా 

==

నిత్తెము మదిని గవనపు 

    చిత్తరు వొకటి మలచిన 

    సత్తెము హృదియు విరియును బొలుపేగా 

  నిక్కము భువన మతనిది 

    చిక్కఁడు మనకు దొఱకఁడు 

    చక్కని మొగపు చెలువుఁడు యెకిమీఁడే 

==

కత్తులు వలదు ధరణిని 

    మిత్తియు వెతయు జనులకు 

    మత్తిడు మదము నణచుము జగదీశా 

  కచ్చలు పగలు నసురము 

    లిచ్చయుఁ జెలిమి యమరము 

    త్రచ్చఁగ భయము గొలుతును సుగమీయ 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


పద్మపత్రాక్ష వృత్తము - 

--

ఆధారము - కల్పితము 

నడక - ఖండగతి, పద్మనాభ వృత్తములో చివరి గురువును తొలగించగా ఈ వృత్తము లభిస్తుంది. 

--

పద్మనాభ - (త)7/గగ 

పద్మపత్రాక్ష - (త)7/గ 

--

పద్మపత్రాక్ష - (త)7/గ 

22 ఆకృతి 1198373 

--

పద్మపత్రాక్ష - (త)7/గ అక్షరసామ్య యతితో - 1,7,13,19 అక్షరములు 


సామాన్యమే నీదు - సవ్యార్థ రూపమ్ము - సర్వార్ధ దీపమ్మె - సంతృప్తిగా 

సమ్మోహమే నీదు - సంతాపమౌనమ్ము - సఖ్యమ్ము కాలమ్ము - సంధానమే 

దామోదరా నీదు - ధర్మార్ధ ప్రాయమ్ము - తన్మాయ తీరమ్ము - ధ్యానమ్ముయే 

కామ్యార్ధమే నీదు - గమ్యార్ధ గ్రామ్యము - కారుణ్య భావమ్ము - కార్యార్థమే      


దీపమ్ములో నీదు - దివ్యస్వరూపమ్ము - దృష్టమ్ముగానయ్యెఁ - దృప్తమ్ముగా 

పాపమ్ములన్ బాపు - భవ్య స్వరూపమ్ము - వర్ణించ లేనిందు - వైనమ్ముతో 

రా పద్మపత్రాక్ష - రమ్యమ్ముగా వేణు - రావమ్ము లూఁదంగ - రంజిల్లఁగా   

కాపాడ రావయ్య - కస్తూరి రంగయ్య - కామమ్ము లీడేరఁ - గల్పద్రుమా  


కాలమ్ము నీదయ్య - కల్లోల రాగమ్ము - కన్యత్వ వైనమ్ము - కష్టమ్ముయే 

తాళమ్ము వెయ్యాలి - తత్వము రాయాలి - తన్మాయ పోవాలి - తత్వమ్ముయే 

మేలమ్ము మ్రోగాలి - మిస్సమ్ము చూడాలి - మొక్షమ్ము రావాలి - మైసమ్ముయే          

గాలమ్ము వెయ్యాలి - గమ్యాన్ని చూపాలి - గాధల్ని చెప్పాలి - కానిచ్చుటే   


నందాబ్ధి చంద్రుండు - చిందించు నా సౌరు - బృందావనమ్మందు విందే గదా 

కందోయి కానంద - మందిచ్చు నారూప - మిందీ మనమ్మందు నృత్యమ్ములే 

కుందారవిందమ్ము - లందాల్చి కృష్ణుండు - ముందుండఁగా నెప్డు మోదమ్ములే 

హిందోళమై యిందు - డెందమ్ము లూఁగంగ - మందమ్ము సామాగమాధానిసా 

(సమగమధనిస స్వరములు హిందోళపు స్వరములు)


విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

--

కుసుమషట్పది రూపములో - 5,5 / 5,5 / 5,5 - 5,2 మాత్రలు 

--

నందాబ్ధి చంద్రుండు - చిందించు నా సౌరు - బృందావనమ్మందు - విందే గదా 

కందోయి కానంద - మందిచ్చు నారూప - మిందీ మనమ్మందు - నృత్యమ్ములే 

--

కుందారవిందమ్ము  - లందాల్చి కృష్ణుండు - ముందుండఁగా నెప్డు - మోదమ్ములే 

హిందోళమై యిందు - డెందమ్ము లూఁగంగ - మందమ్ము సామాగ-మాధానిసా 

(సమగమధనిస స్వరములు హిందోళపు స్వరములు)

--

అక్షరసామ్య యతి మొదటి భాగములో, ప్రాస రెండవ భాగముతో - 

--

ఆలించుమా నీవు - హైన్యమ్ము మాగాథ 

పాలించుమా దేవ - పంచాననా 

ఈలాటి జన్మమ్ము - లిందిచ్చినావేల 

తాళమ్ము గీతానఁ - దప్పైనదా 

కాలమ్ము సాఁగంగఁ - గష్టాలు నిండంగ 

వేళయ్యెనా భూమి - వీడన్ హరా 

తేలించవా మమ్ము - తీయంగ సుంతైన 

లాలించు సౌఖ్యాల - రమ్యమ్ముగా 

--

ఇలా వ్రాస్తే మొదటి భాగమును, చివరి భాగమును UI వంతెన (లేక వరణము) కలుపుతుంది, అక్షరసామ్య యతి, ప్రాసయతులతో

UUI UUI UUIU - UI - UUI UUI UUIU

--

మందానిలమ్మందు గంధమ్ముగా - మంచి - 

ఛందమ్ములోనుండు బంధమ్ముగా 

సౌందర్య మాధుర్య మందారమై - చారు - 

మందాకినీ నీర పీయూషమై 

సిందూరమందుండు చెల్వమ్ముగా - శ్రీల - 

చిందించు సాయంసముద్రమ్ముగా 

నందాత్మజా రమ్ము మాగీములో - నాకు - 

నందమ్ము నీయంగఁ జిత్తమ్ములో 

--

పై పద్యములో వరణమును తొలగిస్తే కూడ పద్యము చదువుటకు బాగుంటుంది. 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


సమాని, ఉష్ణి, అర్ధసమవృత్తము సత్యభామ, సుగంధి - 

--

సమాని, ఉష్ణి వృత్తములు పద్య నిర్మాణమునకు ఇటుకలవంటివి. ఆ యిటుకలతో ఎలా పద్య భవనమును నిర్మించ వీలగునో అన్నదే ఈ సందేశపు సారాంశము. 

--

(2), (5) పద్యములతో నిర్మించిన రెండు సత్య భామలు - 

--

సారసాక్ష - చారుదేహ 

నారి నిన్ను - నమ్మెరా 

మేరలెల్ల - మించు ప్రేమ 

హారి యో వి-హారి రా ... (9) 

--

దూర మేల - దూరు లేల 

దారి నేను - దప్పితిన్ 

చేర రమ్ము - చిద్విలాస  

హోరు వాన - యూరిలో ... (10) 

--

(3), (6) పద్యములతో నిర్మించిన రెండు సత్య భామలు - 

--

మూలనుండెఁ - బూలవీణ 

మేళవించు - మేలుగా 

కేల నాను - కేరువారి 

లీలఁ బాడు - లెస్సగా ... (11) 

--

వ్రేలియందు - విచ్చు గీతి 

లాలివోలె - రాత్రిలో 

నేల చేరు - నింగితోడ 

రాల వెల్గు - రాశిగా ... (12) 

--

ఇప్పుడు (7), (😎 లోని రెండు పాదములను కలిపితే మనకు ఉత్సాహపు ఒక ప్రత్యేకతయైన సుగంధి వృత్తము ప్రాసయతితో లభిస్తుంది -  

--

భామ సత్య భామ నేను - రా మనోహరా సఖా 

శ్యామలాంగ చాలు వంక - నామనస్సు నాథుఁడా 

కోమలాంగి కోరి పిల్చె - గోము నింపు గోపకా 

వామయందు వాంఛ నిండెఁ - బ్రేమతోడ వేగ రా ... (13) 

--

ఇప్పుడు (9), (10) లోని రెండు పాదములను కలిపితే మనకు ఉత్సాహపు ఒక ప్రత్యేకతయైన సుగంధి వృత్తము ప్రాసయతితో లభిస్తుంది -  

--

సారసాక్ష చారుదేహ - నారి నిన్ను నమ్మెరా 

మేరలెల్ల మించు ప్రేమ - హారి యో విహారి రా 

దూర మేల దూరు లేల - దారి నేను దప్పితిన్ 

చేర రమ్ము చిద్విలాస - హోరు వాన యూరిలో ... (14) 

--

ఇప్పుడు (11), (12) లోని రెండు పాదములను కలిపితే మనకు ఉత్సాహపు ఒక ప్రత్యేకతయైన సుగంధి వృత్తము ప్రాసయతితో లభిస్తుంది -  

--

మూలనుండెఁ బూలవీణ - మేళవించు మేలుగా 

కేల నాను కేరువారి - లీలఁ బాడు లెస్సగా 

వ్రేలియందు విచ్చు గీతి - లాలివోలె రాత్రిలో 

నేల చేరు నింగితోడ - రాల వెల్గు రాశిగా ... (15) 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


విశారద - 

--

ఆధారము - కల్పితము 

నడక - ఖండగతి (UIII)5/U 

--

విశారద - భ/జ/స/న/భ/జ/స 

21 ప్రకృతి 978671 

--

UIII UIII - UIII UIII - UIIIU విఱుపుతో అక్షరసామ్య యతితో -  

--

నామనసు నిండఁగను - నాకలలు పండఁగను - నవ్వుచును రా

వ్యోమమున వెల్గు సుడి - పొందికగ నర్ధ నిశి - పూర్ణశశితో  

ప్రేమమయమయ్యె మది - ప్రీతిగను రమ్ము చలి - వేళ యిదిరా

శ్యామలశరీర సర-సాలఁ గురిపించు సుర-శాలఁ గనఁగా 

--

ఏమి యిల జీవనము - లేమి మన సాధనము - లెప్డు తుదయో 

ఈమనసు బాధలకు - నిల్లుగను మారెఁగద - యెప్డు ముదమో 

ప్రేమయు దుకాణమున - బేరమున వస్తువుగ - వేలఁ గొనుటో 

శ్యామల నిశీథమున - స్వామి నిదురించెనొ వి-షాదము ధరన్ 

--

UIII UIII - UIII UIII - UIIIU విఱుపుతో ప్రాస యతితో -   

--

చందురుని వెన్నెలల - గంధమును బూసికొని - ముందు నిలువన్ 

వంద కుసుమాల సర-మందు నిను జూడఁగను - విందు కనులన్ 

డెందమది యూఁగె నిటఁ - జింద ననుభూతి సుధ - సుందరముగా 

మందమతి నన్ను గన - మందిరము వచ్చితివి - నందసుతుఁడా 

--

మోదమన నీవెగద - నాదమన నీవెగద - శ్రీద వరదా 

బాధయన నేనెగద - ఖేదమన నేనెగద - వేదనలతో 

నీదయయె కావలెను - నాదరికి వేగఁ గడు - హ్లాదమున రా 

పోదమెపుడో యనుచుఁ - గాదనకు విన్నపము - బీదను హరీ 

--

UIII UIIIU - III - UIII UIIIU విఱుపుతో అక్షరసామ్య ప్రాస యతులతో - 

--

భారతికి గీతములతో - స్వరపు  

హారతుల నిత్తుఁ జెలువై 

నీరజదళాక్షిని సదా - నెరవుఁ  

గోరెదను జ్ఞానమునకై 

శారదను దల్తు విధిగా - వర వి-

శారదను గొల్తు నిధిగా 

నారదుని తల్లి దయతో - నగుచు 

గారమున స్ఫూర్తి నిడునో 

--

మానసము మాధవుఁడనెన్ - మధుర  

గానమును గోరె వినఁగా 

తేనియలఁ గ్రోలఁగఁ జెవుల్ - దియని 

వేణువుకు వేచె నిశిలో 

నానయనమందు వెలుఁగే - యవని 

కోనలను నింపు నదియై 

వాణి యది వేదములకే - వఱలి 

ప్రాణమును నింపు వరమై 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J

జాతి పద్యము ప్రీణనము - 

--

ఆధారము - కల్పితము 

నడక - మిశ్రగతి 

--

మొదటి మూడు పాదములు - త్రి/చ - త్రి/చ (హరిణగతి రగడ) 

నాలుగవ పాదము - త్రి/చ - త్రి/గ 

మొదటి మూడు పాదములకు అంత్యప్రాస

మొదటి రెండు పాదముల లయ వృషభగతి రగడ లయ 

చివరి రెండు పాదముల లయ మత్తకోకిల లయ 

--

ప్రీణనము - 

--

పిండి జల్లిన - విధము ధరపైఁ  

బండు వెన్నెల - పడెను మనకై 

నిండు హృదితో - నృత్యమునకై 

రండు రండీ - రాత్రిలో 

--

పాట పాడఁగఁ - బరవశించఁగ 

నాట లాడుచు - నలరి మించఁగ 

మాట లాడుచు - మమత పంచఁగఁ 

బూట యిదియే - ముదముగా 

--

వెలుఁగు నిండిన - వృత్త కేంద్రము 

వెలసె వాఁడే - ప్రేమ సంద్రము

చలిత మురళీ - స్వరము మంద్రము 

కలలు నిజమగుఁ - గమ్మఁగా 

--

వాని సుందర - వాణి విమలము 

కానఁగా నా - కనులు కమలము 

లానఁగా నా - యధర మమలము 

వాని నవ్వులు - వరములే 

--

చందమందున - జందమామయె 

యందమందున - నమరగామియె 

బంధమందున - వలపు మాయయె 

నందతనయుఁడు - నందమే 

--

కోకిలమ్మల - కొమరు పాటలు 

కేకి బృందపు - కెరలు నాటలు 

రాకలోఁ బలు - రమణి మాటలు 

ప్రాకటమ్మగు - రజనిలో 

--

గానవాహిని - గంగ యయ్యెను 

ప్రాణవాహిని - వఱద యయ్యెను 

వేణు నాదము - విశ్వ మయ్యెను 

ప్రీణనమ్మా - బ్రేమమే 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


అశ్వధాటి మఱొక నడక - 

--

అశ్వధాటి - త/భ/య/జ/స/ర/న/గ

మత్తేభము - మందారమరంద చంపూ 

(సూత్రము -  మత్తేభాఖ్యం తభయజసరనగయుక్తం స్వరార్వఫణిభిన్నమ్)

--

నేను ఈ రోజు ఏకస్వరూపముగానుండు రెండు భాగములకు ప్రాసయతిని ఉంచి, మధ్య ఉండే వరణమునకు అక్షరసామ్య యతిని ఉంచి వ్రాసిన రెండు పద్యములను మీకు అందిస్తున్నాను. 

--

అశ్వధాటి (మత్తేభము, సితస్తవకము) - త/భయ/జ/స/ర/న/గ 

22 ఆకృతి 1915509 

--

UUI UIII U - UI UIII 

UUI UIII U

--

ఆనంద సీమ యిదిరా - ఆశ పూయు నిట - 

సూనమ్ముగా మనసులో 

గానమ్ము జీవితమురా - గంగ పారు నిట - 

స్వానమ్ము స్నానమగురా 

వీణా వినోదములురా - ప్రేమ రాగములు - 

ప్రాణాల వర్ణములురా 

నేనిత్తుఁ గ్రొత్త సుధ రా - నీవు మర్వవది - 

సానంద జీవనదిరా 

--

మత్తేభ మా సరసిలో - మత్తుగాఁ దిరుగ, - 

మెత్తంగ నక్రమదియున్ 

మత్తిల్లి పట్టెఁ గజముం, - బాప మామృగము - 

మొత్తమ్ముగా భయముతోఁ  

జిత్తములో హరిని దాఁ, - శీఘ్రమై మొసలి 

నొత్తంగఁ గోరుకొనఁగా, 

విత్తంపుదేవి మగఁడే - వేగమై వెడలి 

హత్తిన్ బ్రియాన నిలిపెన్ 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Raoసాహిత్యం

nr1

,

m

c

m

2

r

e

c

సంపఁగి రూపములో చంపకోత్పలమాలలు - 

--

సంపఁగి - 4,5,5 - 4,5,5 మాత్రలు

సుమారు 18 సంవత్సరాలకు ముందు మాలికావృత్తములను తాళబద్ధమైన మాత్రా ఛందస్సుగా వ్రాయవచ్చునని కనుగొన్న దినము నా ఛందోయాత్రలో మఱువ లేని దినము! 

--

చంపకమాల సంపఁగి రూపములో -  

--

వలపుల వీథిలో రథములో - వడిగా నరుదెంచి వేగమే 

తలుపులఁ దట్టినా రెవరొ నా - తలపు న్నిలుపంగ జేసిరే 

వెలుఁగుల దివ్వె నా కరములోఁ - బ్రియమై కనిపింపఁ జేతురో 

సెలవలెఁ బారునో కవనముల్ - చిరమై యిలపైన నిల్వఁగా 

--

పలుపలు పూవు లీ వనములో - బరువై లతలందుఁ బూయఁగాఁ  

జెలువపు నాట్యమే నవముగా - చెలువా యిట రమ్ము డాఁయఁగా 

కలకల పాడు నా పులుఁగుతోఁ - గలుపన్ గళ మౌను రాగమే 

తెలుఁగునఁ బాటగాఁ బదములం - దియఁగాఁ బలికించ యోగమే

--

ఉత్పలమాల సంపఁగి రూపములో -  

--

కోరిక పక్షులై నభములో - గుమిగా నెగురంగ లేచెనే 

చేరఁగ నెంచె నా శిఖరముం - జిలుగౌ తెలిమేఘమాలతో 

తీరని యాస లీమనసులో - దిగునో మఱి పుల్గు నేలకున్ 

చేరును వానగా చినుకులై - శిఖరమ్మున మబ్బు రాల్చఁగా 

--

మానసవార్ధిలో మథనమా - మధువే సుధయంచు నెంచనా 

కానఁగ నీటికై పయనమా - కలయే మృగతృష్ణ వారియా 

నేనొక సృష్టియా నలువచే - నిజమై ననునిట్లు చేసెనో 

గానుగ యెద్దు నా గమనమా - కరువా యొక వెల్గు దారిలో 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


సంపఁగివలె మొదటి రెండు మాత్రలు లేని విక్రీడితములు - 

--

శార్దూల(మత్తేభ)విక్రీడితము - U(II) UU IIUI UIII - UU UIU UIU 

సంపఁగి - 4,5,5 - 4,5,5 మాత్రలు

--

రావా నను జూడ వేగముగ - రాత్రి న్నీవు నాకండగా 

నీవే యెపుడిత్తు వుల్లసము - నీతో స్వప్నముల్ మెండుగా 

పూవై వికసింతు నిన్ను గన - పూర్ణమ్మౌచు భాసించఁగా 

దేవా వెలిఁగించు దీపమును - దెర్వుల్ నాకుఁ గన్పించఁగా 

--

నాలో నొక వెల్గు పుట్టినది - నానా వర్ణ మిశ్రమ్ముగా 

హాలాహల మయ్యె నాసుధగ - హాహాకారముల్ తగ్గఁగా 

మేలే యగు నింక జీవితము - మేఘకాశమౌఁ దెల్లఁగా 

తేలించును వాఁడు సంద్రమున - దెడ్డున్ వాఁడె సాగించుఁగా 

--

విక్రీడితములకు, మాలికావృత్తములకు గల పరోక్ష సంబంధమును జాతి పద్యము సంపఁగి చక్కగా నిరూపిస్తుంది. 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


సంపఁగి ప్రత్యేకత మంచుమణి - 

--

ఆధారము - కల్పితము 

నడక - 4,5,5, మాత్రలు 

--

మంచుమణి - న/జ/భ/ర/స/న/ర IIII UIU IIUI - UII UIII UIU

21 ఆకృతి 767408

--

వదనము జూడఁగా మదిలోన - వాంఛలు లేచినవి మెల్లఁగా 

ముదములు పూవులై యెదలోన - మోహము నింపినది చల్లఁగా 

నిదురయు రాక నేనిరులందు - నెమ్మది వీడితిని రాత్రిలో 

మధురను వీడరా కమలాక్ష - మానిని వేగెనిట ధాత్రిలో 

--

శిశిరము చల్లఁగా మహిపైన - జిమ్మెను మంచుమణు లల్లఁగా 

నిశి యగుఁ గంబళమ్ములతోడ - నీజత మోదమగు వెచ్చఁగా 

వశమును జేయు నామదనుండు - వాగుర వేయు విరికోలతో 

దిశలను వెల్గుతోఁ దిమిరారి - తెల్లఁగఁ జేయునది రేపెగా 

--

మనసొక స్రోతమై ప్రవహించె - మానిని వాల్గనులఁ గాంచఁగా 

నునుసడి గీతమై గళమెత్తె - నోటను రాదు పద మెంచఁగా 

కనుగవ వద్దనెన్ గదలంగఁ - గామిని నగుమోము లిప్తమో 

పెనుముడి యిప్పుడీ యెదయందుఁ - బ్రేమము నిధివోలె గుప్తమో 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ఉత్పలక్రీడ - అర్ధసమవృత్తము 

--

బేసి పాదములు - ఉత్పలమాల పాదములు సంపఁగి రూపములో 

సరి పాదములు - మొదటి రెండు మాత్రలు లేని విక్రీడిత పాదములు సంపఁగి రూపములో 

సంపఁగి - 4,5,5 - 4,5,5 మాత్రలు 

అక్షరసామ్య యతి నాలుగవ మాత్రాగణముతో 

పాదము 1,3 - UII UIU- IIIU * IIU IIUI UIU

పాదము 2,4 - UU- IIUI UIII * -UU -UIU UIU

--

క్రింద నా ఉదాహరణములు - 

--

ఉత్పలక్రీడ - ఉత్పలమాల / శా(మ).వి. - 2 మాత్రలు

--

వీణయు రమ్యమై పలుకఁగా - విన నామనమందు శాంతియే 

వేణూ రవమిచ్చు రాగమున - బ్రేమాస్వాదమౌ కాంతియే 

గానము పాటతోఁ గలియఁగా - గతిలో వికసించు ఛందమే 

ప్రాణస్వర తాళమాలికలు - వాణీదేవి కానందమే 

--

ఏమని నిన్ను నేఁ బిలుతురా - యెపుడున్ హృదిలోన నీవెగా 

స్వామీ మనసొక్క కోవెలయె - సర్వ మ్మందులో నీవెగా 

భూమిని గల్పు నా క్షితిజలో - ధరయో నభమో యెఱుంగనే 

నామానససమిందు నెవ్వరిది - నాదా లేనిచో నీదియా 

--

మల్లియ లెందుకే కొలువఁగా - మదిలోఁగల భక్తి చాలునే 

యుల్ల మ్మొకతోట సొంపులిడు - నొప్పై దానిఁ గాపాడఁగా 

వల్లకి మీటు సుస్వరముగా - వఱలున్ నవభావ చిత్రముల్ 

హల్లీసకమొండు వెలయఁగా - హర్షధ్వానముల్ మ్రోఁగుఁగా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

వృషభగతి రగడ, సంపఁగి మిలనము - గతి గర్భ కవిత్వము

--

వృషభగతి రగడ ప్రత్యేకత - UI IIII UI IIU - UI IIII UI IIU 3,4,3,4 - 3,4,3,4 మాత్రలు 

సంపఁగి ప్రత్యేకత - UII IIIU IIIU - UII IIIU IIIU 4,5,5 - 4,5,5 మాత్రలు

--

వృషభగతి రగడ  - 

రమ్ము ప్రియతమ నన్ను గనఁగా - రాత్రి సమయము సుందరమురా 

కమ్మనగు నొక గీతి వినరా - గానరసమును గ్రోలి నగురా 

నమ్ము మనసున నెప్డు నిజమై - నాకు సకలము నీవె గదరా 

వమ్ము మనికియు వంత యగుఁగా - వాగు నినుపఁగ వాన యన రా 

--

సంపఁగి - 

రమ్మిటఁ బ్రియతమా నను గనన్ - రాతిరి సమయమో రమణమే 

కమ్మని పదములన్ వినఁగ రా - గానపు రసములన్ గుడువరా 

నమ్ముము మనసులో నిజముగా - నాకిట సకల మీవనెదరా 

వమ్మిది మనికిరా వ్యధలతో - వాగును నినుపరా చినుకులై 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


(నిభాలితా)2 = పాండుర - 

---

4,5,5 మాత్రాగణములతో నిభాలితకు ఆధారము - వాగ్వల్లభ 

--

నిభాలితా - స/త/ర IIU UUI UIU 

9 బృహతి 164 

--

చిలుకా నాచిల్క యెక్కడే 

పలుకే బంగారమాయెనే 

కలలోఁ జూడంగఁ దల్చఁగాఁ  

గలయే రాకుండె రాత్రిలో ... (1)

--

నిదురా నీవేల రావు నా 

మదిలో శాంతమ్ము నింపఁగా 

గదిలో నేనొంటివాడఁనై 

వ్యధతో నెట్లుంటిఁ జూడవే ... (2)

మనసా కవ్వింత లెందుకే 

మనునా నాయాస చెప్పవే 

వినవే వాఁడిందు వచ్చునా 

పెనవేయంగాను జెల్మితో ... (3) 

--

ప్రణయమ్మందేది మంత్రమో 

ప్రణయమ్మందేది తంత్రమో 

కనఁగా సాధ్యమ్ము కాదుగా 

కనులో, వీక్షించె రాకకై ... (4) 

--

ఇప్పుడొక ప్రయోగము - మూడవ నాలుగవ పద్యములను కలిపి ఒక నిడివి వృత్తమును చేద్దామా? అది ఇలాగుంటుంది - 

--

పాండుర - స/త/ర/స/త/ర IIU UUI UIU - IIU UUI UIU

18 ధృతి 83620

--

మనసా కవ్వింత లెందుకే - మనునా నాయాస చెప్పవే 

వినవే వాఁడిందు వచ్చునా - పెనవేయంగాను జెల్మితో  

ప్రణయమ్మందేది మంత్రమో - ప్రణయమ్మందేది తంత్రమో 

కనఁగా సాధ్యమ్ము కాదుగా - కనులో, వీక్షించె రాకకై ... (5) 

--

ఈ ఐదవ పద్యమునకు చంపకోత్పలమాలలవలె అమరిక, అనగా, 4,5,5 - 4,5,5 మాత్రలు పాదములో. దీనికి మాలికావృత్తమువలె యతినుంచి వ్రాస్తే ఇది అవగతమవుతుంది. 

--

మనకానందమ్ము నీయ - మానిని చూడా పూర్ణచంద్రునిన్ 

ప్రణయమందుండు వెల్గు - పాండుర శోభల్ వెన్నెలయ్యెఁగా 

వినుమీ రాత్రిన్ సుగమ్ము - ప్రేమముతో గీతమ్ములౌనుగా 

మనసుల్ చేరంగఁ జైత్ర - మాసపు నక్తమ్మేగదా సదా ... (6) 

--

ఈ వృత్తమునకు పాండుర అని పేరుంచినాను. 

--

ఇందులో మఱొక విశేషము కూడ మనకు తెలుస్తుంది. చంపకోత్పల మాలల నడకకు రెండవ మాత్రా గణమైన ర-గణము ముఖ్యము. అది త-గణమైతే నడక కొద్దిగా దెబ్బ తీస్తుంది. 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


(అపరవక్త్రా)2 = యోషా

--

అపరవక్త్రకు ఆధారము నాట్యశాస్త్రము. దీనికి ప్రసభ, భద్రికా, సుభద్రికా అని కూడ పేరులు ఉన్నాయి. ఇందులో 4,5,5 మాత్రలతో గణములు ఉన్నాయి. నేను నాలుగు గణములు ఉన్నప్పుడే యతిని ఉంచుతాను.

--

అపరవక్త్రా- న/న/ర/లగ IIII IIUI UIU

11 త్రిష్టుప్పు 704

--

దినమునఁ బనులందు నుందు, నా

మనమున నిను దల్తు రాత్రిలో

నినుఁడల నభమందు దోఁచఁగాఁ

బనులవి నను బిల్చు వెండియున్ ... (1)

--

హిమమణు లెటు చూడఁ దెల్లఁగా

రమణము ధర నేఁడు చల్లఁగా

గమనమునను గాలు జారుఁగా

శ్రమమగు హిమరాశి నూఁడ్చఁగా ... (2)

--

దినమణి కిరణాలు పైబడన్

దనరెను హిమముత్య మాలికల్

వినఁగను సడులెత్తె వాతముల్

పెనుముద మగు హైమనమ్ములో ... (3)

--

చదువుల తలి యోష భారతీ

సదమలమగు యో శుభాకృతీ

హృదయము లలరంగ వ్రాయఁగా

నెదురుగఁ గనిపించు తీయఁగా ... (4)

--

మృదువగు కవనమ్ము నీయుమా

ప్రిదలఁగ దురితమ్ము సేయుమా

మదినొక చిఱుదివ్వె వెల్గునా

మధురపు చెలువిందుఁ గల్గునా ... (5)

--

నాలుగవ, ఐదవ పద్యములను చేర్చినప్పుడు మనకు పాదములోని రెండు అర్ధ భాగములకు ఒకే అమరిక ఉండు నూతన కల్పిత వృత్తము యోషా లబిస్తుంది. దానికి క్రింద ఉదాహరణములు -

--

యోషా - న/న/ర/జ/న/స/జ/గ IIII IIUI UIU - IIII IIUI UIU

22 ఆకృతి 1440448

--

చదువుల తలి యోష భారతీ - సదమలమగు యో శుభాకృతీ

హృదయము లలరంగ వ్రాయఁగా - నెదురుగఁ గనిపించు తీయఁగా

మృదువగు కవనమ్ము నీయుమా - ప్రిదలఁగ దురితమ్ము సేయుమా

మదినొక చిఱుదివ్వె వెల్గునా - మధురపు చెలువిందుఁ గల్గునా ... (6)

--

ప్రణయపు వనమందుఁ బుష్పమా - వ్యధ నిడు విరహాన బాష్పమా

మనమను మణిపేటి రత్నమా - మధురిమ నొసగంగ యత్నమా

వినదగు వలఱేని గీతమా - ప్రియమగు నమృతంపు స్రోతమా

తెనుఁగున సరి క్రొత్త పద్యమా - తెలివిని మఱపించు మద్యమా ... (7)

--

కవనపు వనమందు మౌనమే - కవులకు నెలుఁగిచ్చు ధ్వానమా

దివసపు సడులందు ధ్యానమే - తెలివిని యలరించు జ్ఞానమా   

భువనపు కొనలందు వెల్గులే - పురిపులుఁగుల చిందు జిల్గులా

శ్రవణము విను గీతి నాదమే - రసమయమగు గీత పాదమా ... (😎

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


కమలలోచనా + కమలలోచనా = రాగమతి 

--

కమలలోచనావృత్తపు ఆధారము నాట్యశాస్త్రము (అన్ని ప్రతులలో లేదు ఇది)

--

నిన్న శ్రీమతి సుప్రభగారు సమవృత్తములో పాదమునకు పది అక్షరములు ఉన్నప్పుడు యతి నియతముగా నుంచుట తెలుగు లాక్షణికుల పద్ధతి కదా అన్నారు. ఈ కమలలోచన వృత్తమును గమనిస్తే యతిని ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు అది అనవసరము అన్న విషయము అర్థమవుతుంది.  న/న/జ/స గణములను III IIII UI IIU లేక IIII IIIU IIIU అని వ్రాయ వీలగును. మొదటిది మిశ్రగతి, 3,4,3,4 మాత్రలు. దీనికి మధ్యలో యతి సమంజసము. రెండవది 4,5,5 మాత్రల అమరిక. దీనికి యతి సబబుగా నుండదు.  రెండు కమలలోచన వృత్తములను కలిపితే వృషభగతి రగడ మూసతో ఒక వృత్తము, సంపఁగి మూసలో మఱొక వృత్తము జనిస్తుంది. వాటి నిర్మాణమును క్రింద తెలిపినాను. గతి గర్భ కవిత్వమునకు కూడ ఇది ఒక ఉదాహరణము. 

--

కమలలోచనా - న/న/జ/స 

12 జగతి 1920 

--

III IIII - UI IIU విఱుపుతో - 

--

నెలయు విరియఁగ - నేల వెలుఁగే 

కొలను విరియఁగఁ - గోరకములే 

శిలలు విరియఁగ - శిల్ప తరువే 

మలలు విరియఁగ - మంచు తెరలే ... (1) 

--

చెలువు విరియఁగఁ - జిందు సుధయే 

తలఁపు విరియఁగఁ - దాన రవమే 

కలలు విరియఁగఁ - గామ ధనువే 

చెలిమి విరియఁగఁ - జెన్ను గవయే ... (2) 

--

కమలముల గను - కన్నుగవయే 

కమలనయనుని - గాంచు మదిలో 

విమల హృదయుని - ప్రీతి యదియే 

విమలమయమగు -  ప్రేమ హృదిలో ... (3)

--

రమణమగు పద - రావ మదియే 

రమణుఁ బిలుచును - రాసగతితో 

రమణి గళమున - రాగమదియే 

రమతి దలఁపిడు - రాగమతితో ... (4)

--

మూడవ, నాలుగవ పద్యములను చేర్చినప్పుడు మనకు ఐదవ పద్యములో వృషభగతి రగడ మూసలో రాగమతి అనే క్రింది వృత్తము లభిస్తుంది. 

--

రాగమతి - న/న/జ/స/న/న/జ/స 

24 సంకృతి 7862144 

--

III IIII UI IIU-  III IIII UI IIU విఱుపుతో - 

--

కమలముల గను కన్నుగవయే - కమలనయనుని గాంచు మదిలో 

విమల హృదయుని ప్రీతి యదియే - విమలమయమగు ప్రేమ హృదిలో 

రమణమగు పద రావ మదియే - రమణుఁ బిలుచును రాసగతితో 

రమణి గళమున రాగమదియే - రమతి దలఁపిడు రాగమతితో ... (5)

--

వలపు గది నిఁక వాదములతో - వలదు సలుపుట వాంఛకరిగా 

వలపు మనసును వాసనలతోఁ - బఱచు టదియును బాడి సరిగా 

కలువ కనులకుఁ గాటుకనఁగా - కవిత సొబగులు గ్రమ్మ నవమై 

లలిత గతులగు లాస్యములతో - లలన త్వరగను రమ్ము దివమై ... (6) 

--

(5), (6) పద్యములలో మొత్తము నాలుగు వృషభగతి రగడలు ఉన్నాయి. 

--

కమలలోచనా IIII IIIU IIIU విఱుపుతో - 

--

మనసిట నలరఁగా ముదముతో 

దినమొక కవితగాఁ బదముతోఁ  

దనరఁగ రజనిలో నుడువఁగా 

ప్రణయపు ప్రతిమగా నిపుడె రా ... (7)

--

విరులను సరముగా నొసఁగనా 

కరుణను గమలలోచన హరీ 

వరములఁ ద్వరగ నాకొసఁగ రా 

సిరివలెఁ దలఁతు నేనవి సదా ... (😎 

--

జననమె యనఁగ నా మరణమున్  

జననపు కవలగా నమరుఁగా 

జననికిఁ జెలియ యా జమునయా  

జనకుని సహజుఁ డాశమనుఁడా ... (9)

--

మనుజుని ముగితి యా మరణమా 

మనుజుని ప్రగతి యా బసుమమా 

మనికిని రణము వారణమెగా 

మనికికి నునికి యా మునుకయా ... (10)

--

తొమ్మిదవ, పదియవ పద్యములను చేర్చగా సంపఁగి మూసలో మనకు 4,5,5 - 4,5,5 మాత్రలతో 11వ పద్యము రాగమతి వృత్తము లభిస్తుంది. 

--

రాగమతి IIII IIIU IIIU - IIII IIIU IIIU విఱుపుతో - 

--

జననమె యనఁగ నా మరణమున్ - జననపు కవలగా నమరుఁగా 

జననికిఁ జెలియ యా జమునయా - జనకుని సహజుఁ డాశమనుఁడా 

మనుజుని ముగితి యా మరణమా - మనుజుని ప్రగతి యా బసుమమా 

మనికిని రణము వారణమెగా - మనికికి నునికి యా మునుకయా ... (11) 

--

లలితుని గనఁగ నామనసులో - లలితము తలఁపులే మధురమై 

కలలకు నెలవు లాయనుకృతుల్ - గన వినఁ బదములే కవనమై 

తెలియని వలపులో తలఁపులే - దినమునఁ దెఱువ నాతలుపులే 

జ్వలితము దివెలుగా నెనరులే - సరసపు చెలిమి యామలుపులే ... (12) 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

--

J K Mohana Rao


కొన్ని U -> II వృత్తములు - 

--

ఒక గురువును రెండు లఘువులుగా, లేక రెండు లఘువులను ఒక గురువుగా చేయుట ఛందస్సులో సామాన్యము. శార్దూలమత్తేభ విక్రీడితములు, చంపకోత్పల మాలలు, మానినీ కవిరాజవిరాజితములు మున్నగునవి ఈ ప్రక్రియకు ఉదాహరణములు. ఈ రోజు మీకు మఱికొన్ని ఉదాహరణములను ఇస్తున్నాను. కొన్నింటిలో ఈ ప్రక్రియ పాదాంతములో కూడ జరుగుతుంది. 

--

UIUIII - UII xUU - స్వాగతము - 11 త్రిష్టుప్పు 443 

UIUIII - UII IIU - చంద్రవర్త్మ - 12 జగతి 1979

--

మాధవుండనెను - మానసమిందున్ 

రాధ వేచెనిట - రమ్మిట రాణన్ 

బాధనిచ్చితివి - భారము గాదా 

భూధరోద్ధరణ - మోదము నీరా 

--

మాధవుండనెను - మానస మిచటన్ 

రాధ వేచెనిట - రమ్మిట రమణన్ 

బాధనిచ్చితివి - భారము గదరా

భూధరోద్ధరణ - మోదము నిడరా 

--

xUU IIU - IIU IIU - మోటకము - 11 త్రిష్టుపు 877

IIU IIU - IIU IIU - తోటకము - 12 జగతి 1756

--

తెర్వెక్కడనో - తెలియన్ గనదే 

ఉర్వెక్కడనో - యుదయమ్మగునా 

హర్వెక్కడనో - హరుస మ్మిడఁగా 

పర్వై వడిగాఁ - బదముల్ ధరపై 

--

తెరువెక్కడనో - తెలియన్ గనదే 

ఉరువెక్కడనో - యుదయమ్మగునా 

హరువెక్కడనో - హరుస మ్మిడఁగా 

పరువై వడిగాఁ - బదముల్ ధరపై 

--

IIII IIII - IIII xUU - కమలవిలసితము - 14 శక్వరి 4096

IIII IIII - IIII IIU - మణిగణనికరము - 15 అతిశక్వరి 16384

--

వదనము గన నది - వరముగ నిల్చున్ 

హృదయము హరియని - యెపుడును దల్చున్ 

బదమును నుడువఁగ - బగితియు కల్గున్ 

ముదమున దివియలు - పొలుపుగ వెల్గున్ 

--

వదనము గన నది - వరముగ నిలుచున్

హృదయము హరియని - యెపుడును దలుచున్

బదమును నుడువఁగ - బగితియు కలుగున్

ముదమున దివియలు - పొలుపుగ వెలుఁగున్ 

--

xUUI UU - IIUI UU - ఇంద్రవజ్ర - 11 త్రిష్టుప్పు 357

IIUI UU - IIUI UU - మహేంద్రవజ్ర - 12 జగతి 716

--

శ్రీరంగ రంగా - చెలువాల రంగా 

పారంగ నీయా - వరహాస ధారల్ 

సారంగ మందున్ - శమమిమ్ము మాకున్ 

భారమ్ము నిండన్ - భరియించలేమే 

--

సిరిరంగ రంగా - చెలువాల రంగా 

పరువంగ నీయా - వరహాస ధారల్ 

క్షరలోక మందున్ - శమమిమ్ము మాకున్ 

బరువిందు నిండన్ - భరియించలేమే 

--

xUUI UII IU - IIUI UU - మదన (వసంతతిలకము) - 14 శక్వరి 2933

IIUI UII IU - IIUI UU - సరసాంకము - 15 అతిశక్వరి 5868 

--

శ్రీరామ రావణహరా - చిఱుదారి లేదా 

ధీరా నమింతును సదా - తెర తీయరాదా 

నీరాజసమ్ము వెలుఁగన్ - నిఖిలస్వరూపా 

రారమ్ము ప్రేమమున స-ద్రమణీయ రూపా

--

సిరిరామ రావణహరా - చిఱుదారి లేదా 

స్థిరతన్ నమింతును సదా - తెర తీయరాదా 

నెఱ రాజసమ్ము వెలుఁగన్ - నిఖిలస్వరూపా 

త్వర రమ్ము ప్రేమమున స-ద్రమణీయ రూపా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

మధురస, భాసితసరణి, లాక్షణి, తృషా - 

--

మధురస - భ/న/న/న/న UII IIII - IIII IIII (లఘ్వంత వృత్తము కల్పితము)

15 అతిశక్వరి 32767

--

నాదము లెపుడును - నవముగ వఱలఁగ  

వేదము లగు నవి - వినదగుఁ బ్రియముగ 

మోదము లొసగుచుఁ - బువువలె విరియఁగ 

శ్రీదములగుఁ గద - చెవులకు మురియఁగ ... (1)

--

మీసము మొగమున - మెలికల నలరఁగ 

నాసతి హృది మెల - నలలుగ నెగసెను 

రాసము నడుమను - రసమయ నటనము 

సేసెడు యువకుని - చెలువము దలఁచెను ... (2)

--

మానస సరసియు - మధురసభరితము 

వేణువు సడి యట - వినఁబడు గలగల 

వీణియ నుడి యట - వెలయును జలజల 

గానపు రవణము - గణగణ మొరయును ... (3)

--

భాసితసరణి - భ/న/న/స UII IIII - IIIIU (వాగ్వల్లభ)

12 జగతి 2047 

ఈ వృత్తమునకు ఇంతకుముందు ఉదాహరణములను ఇచ్చియున్నాను. 

--

నాదరి సుగముగ - నగుచును రా 

పేదకు నగునది - పెనునిధిగా 

పూఁదఱి యగునది - భువనములో 

సీధువు మనసుకు - చెణుకులతో ... (4) 

--

మధురస + భాసితసరణి = లాక్షణి (సులక్షణసారము) 

సులక్షణసారములో దీనికి యతి ఒక్కటే. కాని నా ఉద్దేశములో మూడు యతులు ఉండాలి, మానిని, కవిరాజవిరాజితములవలె. 30 మాత్రలతో దీని అమరిక కూడ అట్టిదే. 

--

లాక్షణి - భ/న/న/న/న/భ/న/న/స

UII IIII IIII IIII - UII IIII IIIIU 

27 భూశ్చందము 67076095 

--

(1) + (4) పాదములు కలుపగా 

నాదము లెపుడును - నవముగ వఱలఁగ - నాదరి సుగముగ - నగుచును రా 

వేదము లగు నవి - వినదగుఁ బ్రియముగ - పేదకు నగునది - పెనునిధిగా 

మోదము లొసగుచుఁ - బువువలె విరియఁగ - పూఁదఱి యగునది - భువనములో 

శ్రీదములగుఁ గద - చెవులకు మురియఁగ - సీధువు మనసుకు - చెణుకులతో ... (5)

--

మఱొక ఉదాహరణము - 

--

మాధవ యనఁగను - మధురము రసనయు - మార్గశిరముగద - మది హరికే 

శ్రీధర యనఁగను - సితమగు హృదయము - చిందిడి పలుకును - చిడతలతో 

బాధలు తొలగఁగఁ - బలువురు కలియఁగ - భక్తియుఁ బెరుగఁగఁ - బ్రమదములే 

పోదము గుడి కిఁక - మురహరుఁ గొలువఁగఁ - బొంగలి తినఁగను - బులకితులై ... (6)

--

చతురస్రగతితో 30 మాత్రలతో శరషట్పది అమరిక సాధ్యము. కాని లాక్షణి వృత్తములో మూడవ చతుర్మాత్ర లఘువుతో ప్రారంభమవుతుంది. అందువలన ఈ ప్రక్రియ సిద్ధించదు. కాని రెండు లాక్షణి పాదములను అర్ధసమ వృత్తముగా మలచినప్పుడు లయ బాగుంటుంది. అట్టి అర్ధ సమ వృత్తమును ఐదవ పద్యమును విఱిచి వ్రాయ వీలగును. 

--

నాదము లెపుడును - నవముగ వఱలఁగ  

నాదరి సుగముగ - నగుచును రా 

వేదము లగు నవి - వినదగుఁ బ్రియముగ 

పేదకు నగునది - పెనునిధిగా ... (7)

--

మోదము లొసగుచుఁ - బువువలె విరియఁగ  

పూఁదఱి యగునది - భువనములో 

శ్రీదములగుఁ గద - చెవులకు మురియఁగ  

సీధువు మనసుకు - చెణుకులతో ... (😎

--

ఈ అర్ధసమ వృత్తమును తృషా అని పిలువ దలచినాను. 

--

తృషా - బేసి - మధురస / సరి - భాసితసరణి 

--

చల్లఁగ వెలుపల - చలినిడు పవనము 

లెల్లెడ హిమములు - హృదికితవై 

యుల్లము లలరఁగ - నొలయఁగ జగతియు 

నల్లని ప్రభువుకు - నమనములే ... (9) 

--

రేయియు నిడివియె - తృషయును నిడివియె 

హాయియు నిడివియె - హసితముగా 

పాయని కవుఁగిలి - ప్రణయపు గిలిగిలి 

మాయగ జగమగు - మదనునితో ... (10) 

--

మంగళమగు నిఁక - మదనజనకునికి 

మంగళమగునిఁక - మరుఁ దలికిన్ 

మంగళమగునిఁక - మహిఁ గల జనులకు 

మంగళమగునిఁక - మన ధరకున్ ... (11) 

--

సూచన - బేసి పాదములలో నాలుగు చతుర్మాత్రలతో అక్షరసామ్య యతితో, సరి పాదములలో మూడు చతుర్మాత్రలు, ఒక గురువు, అక్షరసామ్య యతితో ఎన్నో కీర్తనలు ఉన్నాయి తెలుగులో. అర్ధసమవృత్తము తృష కూడ అట్టిదే. 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


మార్గశిరపు పాట - 

ఛందము - అర్ధసమ వృత్తము కృష్ణానంద 

బేసి పాదములు - చ/చ - చ/చ 

సరి పాదములు - చ/చ - చ/గ 

కన్నడములో దీనిని శరచౌపది అంటారు. 

ఆధారము - 

కృష్ణానంద ముకుంద మురారే  

వామన మాధవ గోవిందా 

శ్రీధర కేశవ రాఘవ విష్ణోః 

లక్ష్మీనాయక నరసింహా 

అన్నమాచార్యుల, రామదాసుల కీర్తనలు కూడ ఇట్టివి ఉన్నాయి. 

స్తోత్ర ఉదాహరణము - గోవిందాష్టకము - 

 https://www.youtube.com/watch?v=AMAy49Wkano...  

 https://stotranidhi.com/govindashtakam-in-telugu/ 

మహిమాన్వితమగు - మార్గశిరమ్మిది 

మహిపై నతఁడే - మార్గముగా 

మహనీయము లా - మాధవు నాటలు 

బృహదీశ్వరుఁ డీ - విశ్వములో 

బాలకుమారుఁడు - బాలల మారుఁడు 

లీలామానుషుఁ - డీధరపై 

నాలను గాచుచు - నానందము లిడుఁ 

గేలను వేణువు - గీతముతో 

తామరసాయత - తరళాక్షుని యా 

నామము దలఁచిన - నాకమెగా 

ప్రేమను నింపును - బ్రీతి నొసంగును 

శ్యామలవర్ణుఁడె - సకలముగా 

భువనము నోటను - ముదముగఁ జూపిన 

భువనపు మూలము - మోహనుఁడే 

నవనవముగ నా - నందతనూజుఁడు 

భవభయ హరుఁడగు - బాలకుఁడే 

విధేయుడు - మోహన


మార్గశిరపు పాట - 2 

ఛందము - కుసుమ చౌపది 

బేసి పాదములు - ప/ప - ప/ప 

సరి పాదములు - ప/ప - ప/గ 

మాధవుని కిష్టమగు - మార్గశీర్షమటంచు 

బోధించె గీతలో - ముక్తికొఱకు 

సాధించ నియమములు - సద్వర్తనలతోడ 

శ్రీధరుండలరి సౌ-శీల్య మిచ్చు 

కుసుమముల సరముతోఁ - గుసుమశరుఁ బిత నెంచ 

వసమౌను వాఁడు మన - వాంఛ దీర్చు 

వసివాడనిది భక్తి - వానికనురక్తి యగు 

మసిలేనివాఁడు స-మ్మతి నొసంగు 

ఉదయాన బలు మ్రుగ్గు - లొగి వేయ నింటిలో 

హృది విచ్చుఁ బద్మమై - హృష్టి నిండ

పదమొండు పాడఁగాఁ - బద్మనాభుఁడు మెచ్చు 

మదిలోన మాయు నా - మంచుతెరలు 

చల్లని సమీరములు - సప్తర్షి మండల 

మ్ముల్లమ్ము పొంగు నా - యుష వెలుంగ 

అల్లదిగొ కోవెలయు - నతి మోహనమ్ముగా 

నల్లనయ్యకు వంద-నమ్ము లిడఁగ 

విధేయుడు - జెజ్జల కృష్ణ మోహన రావు


మార్గశిరపు పాట - 3

--

ఛందము - భోగచౌపది

బేసి పాదములు - (త్రి)4 - (త్రి)4

సరి పాదములు - (త్రి)4 - (త్రి)2/గ

సరి పాదములలోని చివరి లఘువు గురుతుల్యము.

--

భోగిశయనుఁ గాంచ రండి - ప్రొద్దు గీత మాలపించ

వేగ గుడికిఁ జేరి మనవి - విన్నవించఁగా

రాగ మలర రమ్యముగను - రంగనాథు నిద్రనుండి

జాగు సేయకుండ లేప - సమయ మిదియెగా

--

అమరనాథు దెస వెలింగె - నంబరాన కిరణరాశి

యమరె నరుణదీప్తితోడ - నలల రీతిగా

కమలములల కొలనిలోనఁ - గడు మృదువుగ విరిసెఁ జూడ

నమలమైన నీటి బొట్టు - లాకులందున

--

పంజరాన శుకపు వాణి - పాదపమునఁ బికపు వాణి

కంజనయన లపుడె లేచి - కడు ముదమ్ముతో

రంజిలంగ మ్రుగ్గు లెన్నొ - రంగు నింపి యింటిముందు

మంజులముగ వేసిరి చిఱు - మాటలాడుచు

--

ఇంటిలోనఁ బాశురమ్ము - లింటిబయట సడుల గీతి

యింటివెనుక ప్రొయ్యి మంట - లెగయుచుండఁగా

వెంటఁ దల్లి జలకమాడ - వెడలుమనుచుఁ జెప్పుచుండఁ

దుంటరియగు కన్నె యొకతె - తూఁగె నిద్రలో

--

విధేయుడు - మోహన


మార్గశిరపు పాట - 4 

--

ఛందము - భామినీషట్పది 

1,2,4,5 పాదములు - 3,4,3,4 మాత్రలు 

3,6 పాదములు - 3,4,3,4 - 3,4,2 మాత్రలు 

మూడవ, ఆఱవ పాదములో చివరి లఘువు గురుతుల్యము. 

--

కోమలమ్మగు సుమములందున 

భామినీ, షట్పదులఁ జూడవె 

యామహావిష్ణువును గొల్వఁగ - నవియుఁ దలఁచినవో 

శ్యామసుందరు నామమేగద 

యీమహిన్ నవ నిధులు నిజమై 

యామహోజ్జ్వల రూపమును గను - మాలయమ్ములలో 

--

వాఁడు గాచెను వేద విద్యను 

వాఁడు మోసెను నగపు కవ్వము 

వాఁడు దంష్ట్రలఁ దాల్చె ధరణిని - వాఁడె మావాఁడు 

వాఁడు బాలకు నుద్ధరించెను 

వాఁడు జగతిని గొలిచెఁ బదముల 

వాఁడు జంపెను మత్తరాజుల - వాఁడె మాఱేఁడు 

వాఁడు దశముఖుఁ దునిమె భార్యకు

వాఁడు హలమును జేసె హనువుగ 

వాఁడు యోగిగ శాంతి నిలిపెను - వాఁడె మాతోడు 

వాఁడు వచ్చును రేపు హయమున 

వాఁడు సర్వము వాఁడనంతము 

వాఁడె కృష్ణుఁడు వాఁడె విష్ణువు - వాఁడె దైవమ్ము 

--

కోరె రాధయు వాని డెందము 

కోరె గోదయు వాని కరములఁ 

గోరె మీరా వాని పదములఁ - గోర్కె వాఁడేగా 

కోరె విజయుఁడు వాని మైత్రిని 

గోరెఁ గుబ్జయు వాని ప్రేమను 

గోరికల కొక కొండ వాఁడే - క్రోవి నూఁదునుగా 

--

లతలలోఁగల పూవులన్నియు 

శ్రుతులలోఁగల స్వరములన్నియు 

గతులలోఁగల గీతులన్నియుఁ - గంజనేత్రునికే 

మితులు లేని ప్రమోద నాట్యము 

వెతలఁ జిందెడు నశ్రుకణములు 

గతము భావియు వర్తమానపు - గతుల నిడు వాఁడే 

--

విధేయుడు - మోహన


మంజుభాషిణీ -

---

ఆధారము - పింగళ, నాట్యశాస్త్రము, వృత్తరత్నాకరము

--

ఇతర నామములు - కనకప్రభా, సుమంగలీ(ళీ), జయా, నందినీ, సునందినీ, విలంబితా, ప్రబోధితా

--

మంజుభాషిణీ - స/జ/స/జ/గ IIUI UIII - UIUIU

13 అతిజగతి 2796

--

ఇల నేఁడు క్రైస్తవుల - కెంత యిష్టమో

చలిలోన బుట్టె నొక - చంద్రబింబమై

యలనాఁడు యేసు శిశు - వశ్వశాలలో

మలవోలెఁ గష్టముల - మంచు సేయఁగా

--

నిను జూడ నామనసు - నేఁడు దల్చెరా

నను జూడు వేగముగ - నందనందనా

విన వేల నాకథను - బ్రేమ నిండఁగా

వనజాక్ష వచ్చి ప్రియ - వాంఛ దీర్చరా

--

మనమందు నీవెగద - మంజుభాషిణీ

తనువిందు దాహమున - దాపమొందెనే

ప్రణయమ్ము పంకజము - పర్వు గంధమై

పినవారి యాశ యొక - ప్రేమపాశమే

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


మదనమాలికా - 

--

ఆధారము - వాగ్వల్లభ 

నడక - మిశ్రగతి 

--

మదనమాలికా - న/ర/న/ర/ర 

15 అతిశక్వరి 9688

--

నిదుర లేని యీ - నిబిడమౌ నిశీథమ్ములో 

ముదము నీయవా - పులకరించ డెందమ్ములో 

హృదయవాటిలో - నిరులు త్రోయుమా వెల్గుతో 

మదనమాలికా - మధుర గీతికారాధితా 

--

హిమము కప్పఁగా - నిలయు నిద్రలో మున్గెనా 

ద్రుమము నగ్నమా - తొడిమ లెప్పుడో పూలలో 

భ్రమము లోకమా - రజని మాయలోఁ దూఁగఁగా 

అమృతమేదియో - యదియు నాహలాహాలమా 

--

ఒకని జీవిత - మ్మొకనికేకదా భూమిపై 

నొకరి యాత్ర వే-ఱొరులు సేయఁగాఁ జాలరే 

ఒకరి మార్గమం - దొలయు పూల గంధమ్ము వే- 

ఱొకరి మార్గమం - దొలయుఁ జాల దుర్గంధమే 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


Merry Christmas! 

--

ఛందము - కుసుమ షట్పది 

(5,5) / (5,5) / (5,5 - 5,2) మాత్రలు

--

నిసుఁగు యేసును దాను 

ప్రసవించె మరియమ్మ 

నిసిలోన నశ్వముల - నెలవులోన 

దెసలనుండియు వచ్చి 

రసమమగు బహుమతుల 

రుసులు ముగ్గురు దెచ్చి - రుబుక తుష్టి 

--

ఆబాలగోపాల 

మాబాలు జననమ్ము 

రేబవలు పండుగగ - ప్రీతితోడ 

నీబూమి జరిపెదరు 

ప్రాబల్యమున నేఁడు 

సేబాసు క్రిస్త్మస్సు - చెలువమ్ములే 

--

అందము లలంకార 

మందములు దీపాల 

చందములు చూడంగ - సంతసమ్మె 

బృందముల గానమ్ము 

మందిరపు ధ్యానమ్ము 

విందుల వినోదమ్ము - ప్రీతి నిడును 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

ద్విపద ప్రత్యేకత సంశయశ్రీ ఒక "స్వర్ణ" వృత్తము - 

--

ఆధారము - వాగ్వల్లభ 

నడక - ఖండగతి

--

సంశయశ్రీ - త/త/త/గల U UI UUI - UUIUI 

11 త్రిష్టుప్పు 1317

--

శ్రీరంగ లక్ష్మీశ - చిత్రప్రదీప 

భూరాజరాజేంద్ర - భూరిప్రతాప 

మారాయ సౌందర్య - మందారపుష్ప 

రారమ్ము వేగమ్ము - రాగస్వరూప 

--

నీసంశయశ్రీలు - నిక్కమ్ము నాకు 

హాసమ్ము కల్గించు - నానంద మిచ్చు 

భాసించు సందేహ - భావమ్ము విద్య 

నాసించఁగా నెప్పు - డారీతి చెల్లు 

--

ఈనాఁడు నీబిడ్డ - యీభూమి కిచ్చు 

నానంద మానంద - మమ్మా నిజమ్ము 

సూనుండు లోకాల - శోభించుచుండు 

సూనుండు నాదేవ - సూనుండు సుమ్ము 

--

తల్లీ త్రిలోకాల - తల్లీ భవాని 

చల్లంగఁ గాపాడు - సర్వేశు రాణి 

ఉల్లమ్ము పొంగంగ - నుఱ్ఱూఁత లూఁగ 

ఫుల్లమ్ముగా రమ్ము - పూజించ వేగ 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

టంకణము ఒక "స్వర్ణ" వృత్తము కూడ - 

--

ఆధారము - దుఃఖభంజనకవి వాగ్వల్లభ

నడక - మిశ్రగతి 3,5,5 - 3,5,5 మాత్రలు 

అంకె 13 విరహాంక-హేమచంద్ర (ఫిబొనాచ్చి) సంఖ్యలలో నొకటి అందుకే ఇది "స్వర్ణ" వృత్తము. ఈ వృత్తమును 3,5 లేక 5,3 మాత్రల నడకతో కొన్ని సంవత్సరాలకు ముందు తెలిపి యున్నాను. 

--

టంకణము - ర/న/ర/న/ర/న/గ UI UIII UIU - III UIU IIIU 

19 అతిధృతి 241339 

--

నిన్ను జూడఁగను మాధవా - నిఖిల మౌనుగా యుగముగా 

నిన్ను దల్చఁగను యాదవా - నిముసమందు నన్ మఱతురా 

మిన్నులోన గన నుంటివా - మృదుల మేఘ మీవనెదరా 

సన్నుతాంగ యిటు రమ్మురా - సరస హాసముల్ గురియఁగా 

--

యేసునాథుఁ డిటఁ బుట్టెనా - యిలను గాచఁగా స్వయముగా 

వాసుదేవుఁ డిటు వచ్చెనా - వసుధ గాచఁగా స్వయముగా 

మాశరీరముల బాధ లీ - మహిని దీరునా తెలియదే 

దేశదేశముల వంతలే - దిశల నల్లఁగాఁ దిమిరమే 

--

రంగులెల్ల శిశిరమ్ములో - రయము రాలె జ్ఞాపికలుగా 

భృంగ రావములు లేవె యా - వెలితి మౌనమై మెదలెనో 

శృంగమందు హిమ రాశులే - చెలువమయ్యెనో సితముగా 

రంగ నీవు నిదురించఁగా - రసము లింకె నీ రసనపై 

--

నాగుపామువలె వంపులా - నగవు మోడితో నటనలా 

బాగుబాగనుచుఁ జెప్పనా - వరము నాదిగాఁ దలువనా 

రాగమాలికలు పాడనా - రజని మంచులోఁ దడువనా 

భోగమందిరపు మేడలో - ముదము పూయునా మమతలో  

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


గజవృషభగతి - 

--

ఆధారము - కల్పితము 

వృషభకుంజరము అనే ఒక శిల్పమును చూచిన పిదప అట్టి ఛందస్సును సృజించవలయుననే ఆశ కలిగినది. దాని ఫలితమే యిది. గతి గర్భకవిత్వమునకు ఇది ఒక ఉదాహరణము.  

 https://www.flickr.com/photos/shivaj/5328726171/sizes/l/ 

--

గజవృషభగతి - ర/న/న/జ/ర 

15 అతిశక్వరి 11259 

--

ఖండగతి (గజగతి) - UIU IIIII IIUI UIU 

--

చూడఁగా గజముఖము - శుభమౌను మేలుగా 

పాడఁగా నగజసుతు - వరమిచ్చి యేలుఁగా 

తోడుగా మనకెపుడు - తులలేని యండగా 

నీడగా నిలుచుఁగద - నెఱ తుష్టి నిండఁగా 

--

ఎందుకో తిమిరమున - నిట నీవు ధాత్రిలో 

ముందు సాఁగితి విటులఁ - బులకించు రాత్రిలో 

సందియ మ్మిఁక వలదు - సక రమ్ము కూడఁగా  

చిందఁగా ముద మిచట - చెలువాల వీడుగా 

--

త్ర్యస్రగతి (వృషభగతి) - UI UI III III UI UI U 

--

గౌరితోడ వృషభ-గతిని గొల్చుచుందుఁగా 

మేఱలేని బగితి - మిగులఁ దల్తు ముందుగా 

వారి కారుణమున - వఱలుచుం దగత్యమై

మీఱజాలగలనె - మృడునియాన సత్యమై 

--

రమ్ము రమ్ము సకియ - రజని చంద్రకాంతిలో 

నిమ్ము నాకు సుగము - హృదయ మూఁగ శాంతిలో 

కమ్మనైన కవిత - గళము విప్పి పాడఁగాఁ  

జెమ్మగిల్లుఁ గనులు - చెవుల శ్రీలు నాడఁగా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


పరాగ గీతి - 

--

ఆధారము - కల్పితము 

--

లక్షణములు - సూ/సూ/ఇం/సూ/ఇం, మూడవ, ఐదవ గణములకు అంత్యప్రాస.

-- 

ఇంద్రగణములు పంచమాత్రలైనప్పుడు లేక ఇంద్రగణములకు బదులు పంచమాత్రలను వాడినప్పుడు, మొదటి సూర్యగణము న-గణమైనప్పుడు, ఇందులో వరుసగా 1,2,3,5,8 మాత్రలు ఉంటాయి. అప్పుడు ఇది ఒక "స్వర్ణగీతి". క్రింది ఉదాహరణములన్నియు స్వర్ణ గీతికలే. 

--

పరాగగీతి -  సూ/సూ/ఇం/సూ/ఇం 

5 పుష్యరాగ 12 

--

లలితమైన వనమాలి నన్ను దయమాలి 

విడువ నిట్లు సరికాదు నీకు దయలేదు 

వెలుఁగు లేని చీకట్ల నుంటి నిక్కట్ల 

కలువ రార యీరజని నాకు సుఖరజని 

--

మనసు పిలిచె రావేల హరుస మీవేల 

దినము దలఁతు భావాల మధుర రావాలఁ  

దనరె నెదను రాగాలు మృదు పరాగాలు

వనజ నయన నాకిమ్ము ప్రణయ నాకమ్ము 

--

ఇనుఁడు గ్రుంకె నరుణమై సొగసు తరుణమై 

మనకు సంధ్య కెంపులే మనసు కింపులే 

కనఁగ నింగిఁ బులుఁగులే వలపు టెలుఁగులే 

ప్రణయ గీతి పాడఁగా నాట లాడఁగా 

--

కలల కడలియందుంటి నిన్ను రమ్మంటి 

నలరు శశిని జూడంగ మదను వేడంగ 

జిలుఁగువోలె వెన్నెలలు క్రొత్త వన్నియలు 

ఎలుఁగు నిండ కోరికలు తలఁపు చేరికలు 

--

తలఁతు సరస భారతిని స్మృతుల కీరితిని 

కొలుఁతు నెపుడు శారదను స్వర విశారదను 

పిలుతు నమర వల్లికను గురు మతల్లికను 

కళల తల్లి పావకిని జ్ఞాన దాయకిని 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

"స్వర్ణ" గద్యము - 

--

ప్రతి పాదములో వరుసగా 1,2,3,5,8,13 మాత్రలు (3,3,5,3,5,3,5,5 మాత్రలతో పదములు). ప్రాసగలదు, యతి లేదు, కాని పంచమాత్రలకు అంత్యప్రాసలు ఉంచబడినవి. ఇది ఒక విధముగా చూర్ణ గద్యము వంటిది. 

--

స్వర్ణ గద్యము - 

--

కమల నయన కమలమ్ము నాదు హృదయమ్మె పూజ సేయంగ నో రంగ 

విమల పురుష వేదమ్ము నీదు నాదమ్మె నిన్ను గొలువంగఁ దలువంగ 

నమల చరిత గగనమ్ము సర్వ భువనమ్ము నీదు వాసమ్మె లాసమ్మె 

భ్రమల కలల మేము మఱువంగ నిన్ను వదలంగ నీవు గాచితివి బ్రోచితివి  

--

వనజ నయన భారతివి వెలుఁగు కీరితివి శరణు జొచ్చితిని మెచ్చితిని 

మనము నెపుడుఁ బ్రార్థనల నాదు నర్థనల నిన్ను బాడితిని వేడితిని 

దినము రజని వాక్కులను నీదు ఋక్కులను నేర్పు కూర్మితో నోర్మితో 

స్వనము వినఁగఁ దపియింతు పేరు జపియింతు నాశ విరియంగ మురియంగ 

--

విధేయుడు - జెజ్జల కృష్ణ మోహన రావు


"స్వర్ణ" మాత్రా దండకము - 

--

ప్రతి పాదములో వరుసగా 1,2,3,5,8,13,21 మాత్రలు, యతి లేదు, ప్రాస గలదు, పాదము లఘ్వారంభముగా నుండాలి. పాదమునకు సుమారు 40 అక్షరములు గలవు. 

--

"స్వర్ణ" మాత్రా దండకము - 

--

సిరిగఁ దలఁతు వాఙ్మయీ నిత్య చిన్మయీ ధవళాంగి దేవ వినుతాంగి 

మాకిమ్ము కరము చెన్నుగా స్వరము మిన్నగా 

తెరువు జూపు మరయంగ వెలుఁగు మెఱయంగ క్రొత్తఁగా మీట మెత్తఁగా  

వీణియను జాల యందమై పాట చందమై 

మఱియు మఱియు విడకుండ గతియు చెడకుండ ఛందముల నమరు బంధములఁ బాడెదను లాస్య మాడెదను నిన్ను వేడెదను 

వరద వీవు వరమిమ్ము నీదు కరమిమ్ము పదమిమ్ము నాకు ముదమిమ్ము 

గీర్వాణి సరస మృదువాణి విమల బ్రహ్మాణి 

--

అనఘ వేంకటేశ్వరా త్రిభువనేశ్వరా మాధవా భూరమాధవా 

నీవెగా యణచి గర్వమ్ము నిత్తు సర్వమ్ము 

వనజ నేత్ర రాజాధిరాజ సురభూజ దశరూప సతత నవరూప 

భక్తితో గొలుతు ముక్తికై యిల విరక్తికై 

ప్రణవనాద యశరీర నిత్య సుశరీర సుందరా సుగుణ మందిరా 

వరమిమ్ము గళపు స్వరమిమ్ము పదపు టిరవిమ్ము 

ప్రణయదీప ఆద్యంత రహిత శ్రీశాంత మోహనా గరుడ వాహనా 

గతి నీవె మాకు ధృతి నీవె మంచి మతి నీవె 

--

విధేయుడు - జెజ్జల కృష్ణ మోహన రావు


మృదులత - 

--

ఆధారము - కల్పితము, 

క్రీస్తు శకము 2021 జ్ఞాపికగా నిర్మించినది ఈ వృత్తము. 

--

మృదులత - త/త/న/స 

12 జగతి 2021

--

UUI UU - IIII IIU విఱుపుతో - 

--

చిత్తమ్ము లూఁగన్ - సిరివలె నిలపై 

నెత్తావితోడన్ - నెలయుచు ముదమై 

క్రొత్తంగ నేఁడై - కులుకుల కిరవై 

క్రొత్తంగ నేఁడే - కొమరున దరి రా 

--

మెల్లంగ రావా - మృదులత సుమమై 

చల్లంగ రావా - చలిమల సొగసై 

తెల్లంగ రావా - తెలి శశి వెలుఁగై 

చల్లంగ రావా - జలజల సుధలన్ 

--

UUI UUI - IIIIIU విఱుపుతో  

(రెండవ భాగము మందాక్రాంతపు రెండవ భాగమువలె నున్నది.)

--

అందమ్ము నిండంగ - నతిథిగను రా 

సౌందర్య మాధుర్య - చలనముల రా 

మందాకినీతీర - మధురతగ రా 

చందంపు నైపుణ్య - చతురతల రా 

--

కోరంగ లేదేమి - కువలయముపై 

నారోగ్యమే మాకు - నవసరమగున్ 

దారిద్ర్యమున్ బాపఁ - దరుణ మిదియే 

రారమ్ము సంవత్స-రము నవముగా 

--

విధేయుడు - జెజ్జల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

పరిపుంఖితా - 

--

3,4,3,4,4 మాత్రలతో ఉండే వృత్తములను వెదుకుచున్నప్పుడు నాకు ఈ వృత్తము కనిపించినది. ఇందులో 3,4,3 - 8 మాత్రలు. ఇది వాగ్వల్లభలో నున్నది. క్రింద నా ఉదాహరణములు - 

--

పరిపుంఖితా - ర/స/జ/ర UI UII UI - UIUIU

12 జగతి 1371

--

క్రొత్త వత్సరమందుఁ - గోర్కె తీరునా 

చిత్తమందున శాంతి - చేరి నిల్చునా 

మిత్తి నాట్యము లేక - మేలు గల్గునా 

తత్తరిల్లెడు భూమి - తాపమారునా 

--

దేవుఁ డుండఁగ జీవ - దీపమారునా 

చావు నాపుము భూమి - సైపలేనురా 

నీవె సృష్టిని జేసి - నీవె చూతువా 

యీవిధమ్ముగ నిట్లు - మృత్యు నాట్యమున్ 

--

మాకు వద్దుర సామి - మాకు వద్దురా 

చీకుచింతలు చాలు - జీవితమ్ములో

లోకమంతటి వెల్గు-లోన నింపరా 

చీఁకటింక చిరాకు - చేవ నివ్వరా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ఆద్యరుణ, మధ్యారుణ మధ్యాక్కరలు -

--

(అంత్యారుణ) మధ్యాక్కర - ఇం/ఇం/సూ - ఇం/ఇం/సూ

ఆద్యరుణ మధ్యాక్కర - సూ/ఇం/ఇం - సూ/ఇం/ఇం

మధ్యారుణ మధ్యాక్కర - ఇం/సూ/ఇం - ఇం/సూ/ఇం

అరుణ - సూర్య గణము

--

మధ్యాక్కర లక్షణములతో ఆద్యరుణ మధ్యాక్కర -

--

క్రొత్త సంవత్సర మ్మిద్ది - గూర్మి నిండంగ నేతెంచె

చిత్తమందుండు భావమ్ము - శ్రీలఁ జిందించు రావమ్ము

నిత్తె మాదేవుఁ డీయంగ - స్నేహ దీపాల వెల్గింతు

మిత్తి లేకుండఁ జేయంగ - మేను లారోగ్యమై యుండ

--

మనసునందాలయ మ్మొండు - మమత యందుండు నీకెప్డు

దినము నేనందుఁ బాడంగ - దివ్య గీతమ్ము మ్రోఁగంగ

బ్రణయ నైవేద్య భోగమ్ము - వలపుతో నిండు రాగమ్ము

వినఁగ రావేల నాముందు - బ్రీతి డెందమ్ము నొప్పార

--

మధ్యాక్కర లక్షణములతో మధ్యారుణ మధ్యాక్కర -

--

ఆనంద లోక మెందుండు - నందుందు నేను జూడంగ

గానంపు నాద మెందుండుఁ - గమ్మంగ వినుము నన్నందు

సూనమ్ము లెందు బుష్పించు - శోభింతు నందు గంధాల

కానంగ మూర్తి యందౌనె - కమనీయమైన యీసౌరు

--

నూత్నమై వచ్చె నీయేఁడు - నూత్నమ్ము నేఁడు హర్షమ్ము

నూత్నమ్ము నేఁడు దృశ్యమ్ము - నూత్నమ్ము నేల యానింగి

నూత్నమ్ము చిత్త గీతమ్ము - నూత్నమ్ము లింక యత్నమ్ము

నూత్నమ్ము ప్రేమ భావమ్ము - నూత్నమ్ము కాన్క రత్నమ్ము

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K


లోకేశ - జాతి పద్యము - 

--

ఆధారము - కల్పితము 

Lucas numbers లోని మొదటి ఆఱు సంఖ్యలు దీని మాత్రల సంఖ్యలు (2 1 3 4 7 11). 

నడక - మిశ్రగతి 

--

లోకేశ - 3,3,4 - 3,4 - 3,4,4 మాత్రలు

--

నిన్ను జూడ నామది - నేడు తలఁచెను - నిన్న జరిగిన ఘటనల 

నెన్ని యాట లాడితి - మెన్ని పాటల - నెన్ని విధముల నటనల 

చిన్నదనము నాఁటిది - చెలువమైనది - చెప్పనగునే చక్కఁగ 

వన్నెచిన్నెల రాత్రులు - వాంఛ నిండిన - వరము లిచ్చెను జల్లఁగ 

--

పూవు లెన్నొ నవ్వఁగఁ - బులకరింతురు - మోద మలరఁగ విరులుగ 

శ్రావణంపు వానల - చల్లగాలులు - జల్లుమనఁగను దెరలుగఁ

జేరలేక యుంటిని - చిత్రముగ నీ - చిత్తమున నీ చిత్రము 

మీఱలేని యానతి - మేను నాదిట - మిత్రమా యీరాత్రము   

--

యతి, ప్రాసయతులతో - 

--

చెలువమలరు వదనము - చెలియకదనము - జిలుఁగు నిండిన వసనము 

తెలుఁగు పదపు మధురిమ - దెలుపు కవితల - దెలుపు వెన్నెల హసనము 

లలియె కలల కలిమియొ - లలన చేసెడు - లలిత లాస్యపు చలనము 

చిలికి సుధల నొసఁగును - చెలిమి హృది యను - శిలకు ప్రాణపు జ్వలనము 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


జాతి పద్యము "పెల్లు" - 

--

ఆధారము - కల్పితము Pell numbers లో 3, 7, 17 సంఖ్యలతో వ్రాసినది. 

నడక - 3,3,4 - 3,3,4 - 3,4 మాత్రలు 

(పెల్లు అనగా అతిశయము) 

--

పెల్లు - 3,3,4 - 3,3,4 - 3,4 మాత్రలు 

--

పెల్లు మనుచు నుఱుము గు-భిల్లుమనఁగ మొరయుచు - భీతి నిడఁగాఁ 

జల్లగాలి వీచఁగ - జారె వాన చినుకులు - సముద మిడఁగాఁ  

ద్రుళ్లిపడెను మృగములు - తోయధారఁ గనఁగా - ద్రుమపు ఛాయల 

వెల్లివిరిసె నప్పుడు - వేగ మింద్రచాపము - వెలుఁగు మాయల 

--

సన్నజాజి తీవలఁ - జక్కనైన పూవులు - చాలు వనిలో  

నిన్న రాత్రి కలలో - నేను గంటి జాజులు - నీదు జడలో 

కన్నులిందు నీకై - క్షణము క్షణము దారిని - గాంచె నమ్ముము 

చిన్న కవిత వ్రాసితిఁ - జెఱుపబోకు దీనిని - జేరి పాడుము 

--

చందమామ వెలిఁగెను - సంద్రమందుఁ బూవుగ - జారు నిశిలోఁ  

గుందనమ్ము వెన్నెల - కోమలమ్ము లాశలు - కోరు హృదిలో 

మందపవనమందున - మసృణమైన గంధము - మధురవనిలో 

నెందు జూడ నందము - నృత్యమాడెఁ జందము - లిందు మదిలో 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


Must read article - Bell numbers and rhyming schemes

--

ఒక పద్యమునకు అంత్యప్రాసలు ఎన్ని విధములుగా నుంచ వీలగునో అన్న విషయమును Bell సంఖ్యలు తెలుపుతాయి. ఈ సంఖ్యలు - 1, 1, 2, 5, 15, 52, 203, 877, 4140, ... ఏకపదికి ఒక విధముగా, ద్విపదకు రెండు విధములుగా (ప్రాస లేమి కూడ ఒక విధమే), మూడు పాదములకు ఐదు విధములుగా, నాలుగు పాదములకు 15 విధములుగా అంత్య ప్రాసను ఉంచుటకు వీలగును. క్రింద చతుష్పదికి 15 విధములుగా ఎలా అంత్యప్రాసను ఉపయోగించ వచ్చునో అన్న విషయము సోదాహరణముగా తెలుపబడినది. అంత్యప్రాసలు ఆంగ్లములోని a, b, c, d అక్షరములతో గుర్తించబడినవి. ప్రతి ఉదాహరణమునకు వేఱువేఱు ఛందములు ఉపయోగించబడినవి. 

--

1) చతుర్మాత్రల చతుష్పది (చ)2 - (చ)2 - aaaa 

పొందిక పదములు - పులకల యానము 

ఛందపు సొంపులు - చక్కని గానము 

విందిడు హాయియు - వెన్నెల స్నానము  

సుందర కవనము - సోమపు పానము 

--

2) పంచమాత్రల చతుష్పది (పం)2 - (పం)2 - aaab

నిను జూడ మనసులో - నెఱయైన యందమ్ము 

కనుపాప నీవె నా - కన్నులకు చందమ్ము 

వినుమయ్య కన్న నీ - ప్రేమ యానందమ్ము 

వనజాక్ష నీవె నా - వలపునకు మందురా 

--

3) తేటగీతి - సూ/ఇం/ఇం - సూ/సూ aaba 

కనులకింపైన దైవమా - కనఁగ రమ్ము 

దినము నీరూపె మదిలోన - దేవ నమ్ము 

తనరు నీనామ మాకల్ప - తరువు మాకు 

ధనము వేఱేల చూపు శ్రీ-ధర ముఖమ్ము

--

4) చతుష్పదిగా ద్విపద ఇం/ఇం - ఇం/సూ aabb

శరణమ్ము నీవంటి - శారదా వాణి 

వరవీణ మీటుమా - వరద గీర్వాణి 

దరి నీవె మాకు స-త్వరము రా తల్లి 

స్మరణమ్ము నీపేరె - స్వరరాగవల్లి 

--

5) స్రగ్విణి (ర)2 -(ర)2 - aabc

ముందుగా రమ్ము స-మ్మోహనా మాధవా 

సుందరా నీవె నా - శోభ లోయాదవా 

వందన మ్మిత్తురా - పాదముల్ గొల్తురా  

నందగోపాలకా - నాదరూపాత్మకా 

--

6) కందము - abaa

సుందర రాసవిహారీ 

నందాత్మజ నాట్యలోల - నరకధ్వంసా  

బృందావనసంచారీ 

సందియమా సర్వ మీవె - జయ మల్లారీ 

--

7) ఆటవెలఁది (సూ)3 - (ఇం)2 / (సూ)3 - (సూ)2 - abab 

చాల ప్రొద్దు గడచెఁ - జలియయ్యె నీధాత్రి 

లాలి నల్లనయ్య - రామభద్ర 

నేల నింగి యెల్ల - నిదురించె నీరాత్రి 

పూల కనులు మూసి - పొమ్ము నిద్ర 

--

😎 మధ్యాక్కర ఇం/ఇం/సూ - ఇం/ఇం/సూ - abac 

ఈనాఁటి యీహాయి చెలియ - యేనాఁడు కనలేము మనము 

గానమ్ము పాడంగ మీటు - గంధర్వ వీణియన్ దీటు 

తేనియన్ ద్రావు నీ చెవులు - తీయఁగా మార సుస్వనము 

వానగా మారు నీ వలపు - వాణిగా మారు నీ తలఁపు 

--

9) ఉత్సాహ (సూ) - (సూ)3/గ- abba

నేను లేను వెదకుటేల - నిజముగాను గుడులలో 

నేను గలను నన్ను జూడు - నీవు చదువు గదులలో

కానలేవు నన్ను నీవు - గంగ వోలు నదులలో 

నేను గలను నన్ను జూడు - నీవు పలుకు నుడులలో 

--

10) మధురాక్కర - సూ/ఇం/ఇం - ఇం/చం abbb

నన్ను పాలింప రమ్మురా - నాదేవ నగుమోముతో 

తెన్ను క్రొత్తఁగా నిమ్మురా - దీపాల వెలిగింతురా 

కన్నె గాన సంద్రమ్మురా - కవితతోఁ బలికింతురా 

విన్నపమ్ములన్ నమ్మురా - ప్రేమలోఁ గులికింతురా 

--

11) ఉత్పలమాల భ/ర/న - భ/భ/ర/లగ - abbc

లెమ్మిఁక నిద్రనుండి చెలి - లెమ్మిది మార్గశిరమ్ము హాయిగాఁ  

గమ్మఁగ సెజ్జపైఁ గడు సు-ఖమ్ముగ దొర్లెదవేల కామినీ 

రమ్ము రయమ్ముగా మనము - రంజిలి స్నానములాడ భామినీ 

యిమ్ముగ మాధవున్ గొలువ - నిప్పుడు వేళ యుషోదయమ్ములో 

--

12) తోటకము స/స - స/స - abca 

కమలమ్ములతోఁ - గమలాకరముల్ 

రమణీయము లో - రమణీ కనుమా 

భ్రమరమ్ములె యీ - వన సూనములన్ 

నమియించును గ-న్నయ నా కరముల్ 

--

13) స్వాగతము ర/న - భ/గగ - abcb 

రాగరంజితము - రాసపు లీలల్ 

భోగరంజితము - మోహన గీతుల్ 

త్యాగరంజితము - ధన్యుల చేఁతల్  

యోగరంజితము - యోగ్యుల నీతుల్ 

--

14) మందారదామము ర/ర - ర/గగ - abcc 

శ్రీధరా చిన్మయా - సిద్ధ సంకల్పా  

మాధవా కేశవా - మాకు సర్వమ్మై 

రాధికాలోల చే-రంగ రా రంగా 

సాధుసంపూజితా - స్వామి నీలాంగా 

--

15) ఇంద్రవజ్ర త/త/జ/గగ UUI UU - IIUI UU - abcd

ఆనంద రూపా - అవినాశ తేజా 

గానస్వరూపా - కరుణాంతరంగా 

నీనామమేగా - నిఖిలమ్ము మాకున్ 

శ్రీనాథ రావా - చిఱునవ్వు తేవా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Raoసాహిత్యం


త్రిపదులకు అంత్యప్రాసలు -

--

నిన్న చతుష్పదులకు 15 విధములుగా అంత్యప్రాసలను ఉంచ వీలగునని ఉదాహరణములతో తెలిపినాను. ఈరోజు అంతకంటె సులువైన త్రిపదులకు ఐదు విధములుగా అంత్యప్రాసలను ఉంచవచ్చునన్న విషయమును త్రిపదులైన గాయత్రీ ఛందము, కర్ణాటక త్రిపదులతో తెలుపుతున్నాను.

--

గాయత్రీ ఛందము - పాదమునకు 8 అక్షరములు, చివరి నాలుగు అక్షరములు రెండు లగములుగా నుండాలి. ప్రారంభములో న-గణము ఉండరాదు.

--

కర్ణాటక త్రిపది - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి) / ఇం/సూ - ఇం/ఇం / ఇం/సూ/ఇం

--

aaa -

--

దేవ రావేల బంధువై

జీవ కారుణ్య సింధువై

భావరుగ్మంపు మందువై

--

గగనమ్ము నిండె నా - పొగమంచుతోఁ జూడు

సిగరమ్ము లేదు - చెలువాలతో నేఁడు

జగమయ్యె నావిరికి వీడు

--

aba -

--

అందమ్ములకు ఱేఁడుగా

సౌందర్యముల రాశి రా

సుందరా నాకుఁ దోడుగా

--

సొగసు నిండిన సామి - రగిలించె డెందమ్ము

పొగలతో మొగము - ముకురానఁ గనరాదు

వగలతోఁ గూడె నందమ్ము

--

aab -

--

నును వెన్నెల ఛాయలోఁ

గనిపించని మాయలో

వనజాక్షుని ముద్దులే

--

నీతోడ నిజముగాఁ - జేతు నే వాదమ్ము

నాతురాన విన - నందమౌ నాదమ్ము

చేతమ్మవంగ నబ్జమై

--

baa -

--

నిధి నాకిల నీవెగా

మధువైరి ముకుంద రా

సుధ బిందువు చింద రా

--

అమవాస రాత్రిలో - నమరు నక్షత్రాల

విమలమౌ శశిని - బ్రేమతో నూహింతు

రమణు నామదిని దర్శింతు

--

abc -

--

ఏకాంతమైన రాత్రిలో

రాకాశశిని జూడఁగాఁ

గాకుండె మేఘమడ్డమై

--

కనులతో నిను జూచి - మనసులో నిను దాఁచి

వినుచుంటి నీదు - ప్రేమస్వరము నేను

తనువెల్ల నీవె, నీవెరా

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


పెద్ద ఏనుగు(పులి)లో చిన్న యేనుగు! -

---

నిన్నరాత్రి శార్దూల మత్తేభ విక్రీడిత వృత్తములలో ద్విరదగతి రగడ ప్రత్యేకత ఒకటి ఉన్నదని కనుగొన్నాను.

--

ద్విరదగతి రగడ (ద్విపద) - పం/పం - పం/పం (ప్రాస, అంత్యప్రాస)

--

మత్తేభవిక్రీడితము - స/భ/ర/న/మ/య/లగ IIUU II UIU IIIU - UUI UUI U

--

మదిలో నుంటివి మాధవా కొనఁగ రా - మందారపుష్పమ్ములన్

హృదయ మ్మిచ్చితి శ్రీధరా వినఁగ రా - శ్రీరాగ గీతమ్ము ని-

య్యది నేవ్రాసితి యాదవా కనఁగ రా - యందాల దృశ్యమ్ము లిం-

పొదవంగాఁ గడు మోదమే కలుగురా - ముద్దీయ నాస్యమ్ముపై

--

ఇందులోని ద్విరదగతి రగడలు -

--

మాధవా కొనఁగ రా - మందారపుష్పమ్ము

శ్రీధరా వినఁగ రా - శ్రీరాగ గీతమ్ము

--

యాదవా కనఁగ రా - యందాల దృశ్యమ్ము

మోదమే కలుగురా - ముద్దీయ నాస్యమ్ము

--

శార్దూలవిక్రీడితము - మ/స/జ/స/త/త/గ UUU II UIU IIIU - UUI UUI U

--

రావా మానిని రంగులన్ వెలిఁగె నా - రమ్యారుణాభ్రమ్ము నా

కీవా మోదము శృంగమున్ గదియు నా - యింపారు భావమ్ము నా

జీవానందము చేరఁగా నగునె యీ - చెల్వమ్ము సత్యమ్ముగాఁ

దైవంబిచ్చెను ధారగా కవనముల్ - ద్రావంగ నిత్తెమ్ము నేన్

--

ఇందులోని ద్విరదగతి రగడలు -

--

రంగులన్ వెలిఁగె నా - రమ్యారుణాభ్రమ్ము

శృంగమున్ గదియు నా - యింపారు భావమ్ము

--

చేరఁగా నగునె యీ - చెల్వమ్ము సత్యమ్ము

ధారగా కవనముల్ - ద్రావంగ నిత్తెమ్ము

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


సార్థకనామ గణాక్షర వృత్తము సజల (ముహురా) -

--

108 సంఖ్యను గుఱించి ఒక వీడియో నిన్న చూచినాను. 108 అంకెతో ఏదైనను వృత్తము ఉన్నదా అని పుస్తకాలను తిరగవేసినప్పుడు వాగ్వల్లభలో ముహురా అనే వృత్తము కనబడినది. దీని గణములు స/జ/ల. కావున ఇది ఒక సార్థకనామ గణాక్షర వృత్తము. క్రింద నా ఉదాహరణములు -

--

సజల లేక ముహురా - స/జ/ల IIUI UII

7 ఉష్ణిక్కు 108

--

వలపింతు వెందుకొ

వలపీయ వెందుకొ

తెలినవ్వు చూడఁగ

నిల నెప్పుడో యిఁక

--

విజనమ్ము బాటలు

ప్రజయుండె నిద్రను

వ్రజనాథుఁ డెక్కడొ

సజలమ్ము కన్నులు

--

ఒకరోజు మోదము

ఒకరోజు ఖేదము

సకలమ్ము నీకొక

రకమౌ వినోదము

--

విరజాజి యచ్చట

సరసాల నవ్వెను

సిరిమల్లె యిచ్చట

చెఱలోన నేడ్చెను

--

దినమొక్క యుద్ధము

తనువిందు సిద్ధము

కనలేని నాకము

మనమందు శోకము

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


స్రగ్ధర - మందాక్రాంతము - 

--

నేనెప్పుడు స్రగ్ధరావృత్తమును సంస్కృతములోవలె వ్రాస్తాను. అనగా సంస్కృత విరామయతి, తెలుగు అక్షరసామ్య యతి రెండింటితో. అప్పుడే ఈ వృత్తపు నడక సవ్యముగా నుంటుంది. 

--

స్రగ్ధరా - మ/ర/భ/న/య/య/య UUU UIUU - IIIIIIU - UIU UIUU

21 ప్రకృతి 302993

--

శ్రీవాణీ యీయుమమ్మా - చెలువపు కవితల్ - చిమ్మనానందధారల్ 

భావావేశమ్ము నిండన్ - బ్రవిమల రుచితోఁ - బద్యసౌందర్య శోభల్ 

ద్రోవల్ ద్రొక్కంగ వీలై - రుచిరభరితమై - క్రొత్తఁగా వెల్గఁజేయన్ 

దేవీ ప్రార్థింతు నిన్నే - దినమున రజనిన్ - దివ్య వాగ్ధారయుక్తిన్ 

--

నీనామమ్మే దలంతున్ - నిరత మెడఁదలో - నీలవర్ణా శుభాంగా 

యీనాకోర్కెన్ నిజమ్మై - హృదయ మలరఁగన్ - హృష్టితోఁ దీర్చ రారా 

బోనమ్మిత్తున్ బ్రియమ్మై - ముదముల నొసఁగన్ - బుష్టిగా నుండు నీకున్ 

బ్రాణ మ్మీవే ముకుందా - ప్రణయ కుసుమమా - పావనా పంకజాక్షా 

--

రెండవ పద్యములో గర్భితమైయున్న మందాక్రాంతము - 

--

UUU UIUU - IIIIIIU - UIU UIUU - స్రగ్ధర  

UUU UXXX - XIIIIIU - UIU UIUU - మందాక్రాంతము 

--

మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU

17 అత్యష్టి 18929 

--

నీనామమ్మే - నిరత మెదలో - నీలవర్ణా శుభాంగా 

యీనాకోర్కెన్ - హృదయ మలరన్ - హృష్టితోఁ దీర్చ రారా 

బోనమ్మిత్తున్ - ముదము నొసఁగన్ - బుష్టిగా నుండు నీకున్ 

బ్రాణ మ్మీవే - ప్రణయ సుమమా - పావనా పంకజాక్షా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

తాళ వృత్తములకు ఒక నిర్దిష్టమైన స్థానములో యతి అవసరమా? - పథ్యా, స్రగ్విణి -

--

మొన్న  మంత్రాల పద్మజగారు వ్రాసిన భుజంగసంగత వృత్తపు ఉదాహరణములను చూడగా కలిగిన  ఆలోచనల ఫలితము ఈ సందేశము. అందులోని అమరిక IIUI UI UIU 5,3,5 మాత్రలు.  మొత్తము పాదములో 13 మాత్రలు. దీనికి చివర అదనముగా 7 మాత్రలను చేర్చినప్పుడు  20 మాత్రలు అవుతుంది. ఈ 20 మాత్రలను నాలుగు పంచమాత్రలుగా వ్రాయ వీలగును.  అప్పుడు పాదము 5/5 - 5/5 మాత్రలుగా విఱుగుతుంది. లేక 5/3 - 5/7 మాత్రలుగా  కూడ విడదీసి వ్రాయ వచ్చును. అలాటి వృత్తములను వెదకినప్పుడు ఎనిమిది  వృత్తాలు కనబడినవి. అందులో రెండింటిని గుఱించి ఇక్కడ తెలుపుతాను. అవి  పథ్యా, స్రగ్విణి. ఈ రెండు వృత్తములు ఇంతకు ముందే పరిచయము చేయబడిన  వృత్తములు.

--

పథ్యా - స/జ/స/య/లగ IIUI UI - IIUI UUIU లేక IIUI UIII - UIU UIU

14 శక్వరి 4844

--

IIUI UI - IIUI UUIU విఱుపుతో -

--

ఇనుఁడల్ల గ్రుంకు - నిఁక వేగ నభ్రమ్ములోఁ

గన నెఱ్ఱనైన - కలవోలె గుండ్రమ్ముగా

మనమెల్ల నీవె - మదిరాక్షి యెందుంటివో

నను జూడ రమ్ము - నటనాల నందమ్ముగా

--

సరసాల నీకు - సరిలేరు పృథ్విన్ గదా

చిఱునవ్వు నాకు - సిరియౌను చిత్తమ్ములోఁ

దరుణమ్ము వచ్చె - దరిఁ జేర వేగమ్ముగా

హరి రమ్ము నీవె - హరుసమ్ము సత్యమ్ముగా

--

పై పద్యములే కొద్ది మార్పులతో IIUI UIII - UIU UIU విఱుపుతో -

--

ఇనుఁడల్ల గ్రుంకుఁగద - యిప్పుడా నింగిలో

గన నెఱ్ఱనైన కల - కమ్మఁగా గుండ్రమై

మనమెల్ల నీవె ప్రియ - మానినీ కానవే

నను జూడ రమ్ము దరి - నవ్వులన్ బువ్వుగా

--

సరసాల నీకు సరి - స్థాయలో లేరుగా

చిఱునవ్వు నాకు సిరి - చిత్తమం దెప్పుడున్

దరుణమ్ము వచ్చె దరి-దాపులో రమ్మురా

హరి నాకు నీవె గద - హర్ష సౌభగ్యముల్

--

స్రగ్విణీ - ర/ర/ర/ర - UIU UI - UUI UUIU లేక UIU UIU - UIU UIU

12 జగతి 1171

--

UIU UI - UUI UUIU విఱుపుతో -

--

దైవమా నాకు - ధైర్యమ్ము నీయంగ రా

జీవిత మ్మిందుఁ - జేఁదైన పీయూషమా

త్రోవలో నెందు - రోచిస్సు లేకుండెనే

కావ రావేల - కాయమ్ము వ్రాలున్ ధరన్

--

ఎందుకో నిద్ర - యీరాత్రి రాకుండెనే

నందగోపాల - నాకేల యీబాధ యా

సుందరాభ్రమ్ము - శోభాయమానమ్ముగాఁ

జిందె వర్షమ్ము - శీఘ్రమ్ము రావేలకో

--

పై పద్యములే కొద్ది మార్పులతో UIU UIU - UIU UIU విఱుపుతో -

--

దైవమా యీయరా - ధైర్య మీ నాకు నా

జీవిత మ్మయ్యెరా - జేఁదు పీయూషమై

త్రోవలో లేదురా - రోచనల్ చూడఁగా

కావ రావేలరా - కాయమిందూఁగెరా

--

ఎందుకో నిద్ర లే - దిప్పుడీ రాత్రిలో

నందగోపాలకా - నాకు బాధేలకో

సుందరాభ్రమ్ములో - శోభతో నందమై

జిందు వర్షమ్ములో - శీఘ్రమై రావుగా

--

దీనివలన  మనము నేర్చుకొనవలసినది ఏమంటే తాళబద్ధమైన వృత్తములకు ఒక్కటే యతి స్థానము  అని చెప్పుటకు వీలుకాదు. ఈ విషయమును నేను ఎన్నో మారులు చెప్పినాను (ఉదా.  మానిని, మత్తకోకిల, ఇత్యాదులు). ఒక్కొక్కప్పుడు నాకనిపిస్తుంది, అసలు  వీటికి యతి అవసరమా అని. సంస్కృతములో తాళవృత్తములకు యతిని సూచించరు.

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


మర్మస్ఫురము - 

--

ఆధారము - వాగ్వల్లభ

--

మర్మస్ఫురము - త/భ/జ/త/గ UUI UI IIUI UUIU 

13 అతిజగతి 2421 

--

UUI UI - IIUI UUIU విఱుపుతో - 

--

అందాలఁ జిందు - మనురాగ రాగాలతో 

విందైన నీదు - ప్రియమైన గీతమ్ముతో 

సందేహ మేల - సరసమ్ము స్రోతమ్ముగా 

నిందింక పారు - హృదిలోని సంద్రమ్ములో 

--

భావింతు నీదు - వదనమ్ము చిత్తమ్ములో 

నావైపు చూడు - నగుమోము రేయెండతో

పూవుల్ సుమించె - భువనమ్ము సౌందర్యమే 

జీవమ్ములోనఁ - జెలువంపు నాట్యమ్ములే 

--

పై రెండు పద్యములు UUI UIII - UIU UIU విఱుపుతో - 

--

అందాలఁ జిందుమిట - హార్ద మింపారఁగా 

విందైన నీయనుఁగు - ప్రేమ గీతమ్ముతో 

సందేహమే వలదు - సాఁగు స్రోతమ్ముగా 

నిందింక నర్మములు - హృత్పయోరాశిలో 

--

నావైపు నీదు వద-నమ్ము చూపంగ రా 

భావింతు హర్షమున - భాసించు వెన్నెలన్ 

పూవుల్ సుమించె నిట - భూమి సౌందర్యమే 

జీవమ్ము నందునిఁక - చెన్నుగా నాట్యముల్ 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


చతుశ్చతుర్మాత్రా చతుష్పదిగా ఆర్యాగీతి - స్కందానందము -

--

సంస్కృతములో  ప్రసిద్ధికెక్కిన మాత్రా ఛందము ఆర్యా. ఇది ఎన్నియో విధములు, అందులో  ముఖ్యమైనవి - పథ్యా, విపులా, చపలా, గీతి, ఉద్గీతి, ఉపగీతి, ఆర్యాగీతి.  అన్ని ఆర్యాభేదములు ద్విపద, చతుష్పద కాదు. ఇందులో ఆర్యాగీతిలోని రెండు  పాదములలో ప్రతి పాదమునకు 8 చతుర్మాత్రలు ఉండును.

--

ఆర్యాగీతి స్వరూపము - చ1, చ2, చ3, చ4, చ5, చ6, చ7, చ8.

చ1, చ3, చ5, చ7 - - జ-గణము ఉండదు.

చ6 - నల లేక జ-గణము.

చ8 - స-గణము లేక గగము.

చ - UU, IIU, UII, IIII, IUI

--

కందము  - కన్నడములో ఒక అజ్ఞాతకవి లేక లాక్షణికుడు రెండు పాదములుగా నున్న  ఆర్యాగీతిని నాలుగు పాదములుగా మార్చినాడు. ఎనిమిది చతుర్మాత్రల పాదమును 3, 5  చతుర్మాత్రల రెండు పాదములుగా మార్చినాడు. మిగిలిన నియమము లన్నియు  ఆర్యాగీతివలెనే. తెలుగులో ఈ కందమునకు సరి పాదములలో అక్షరసామ్య యతిని  నిర్దేశించినారు.

--

ఈ నేపథ్యముతో ప్రస్తుత సందేశపు వివరణము. ఎనిమిది  మాత్రల ద్విపద పాదమును ఎందుకు రెండు చతుర్మాత్రల పాదములుగా విడదీయరాదు?  అట్లు చేసినప్పుడు నడక ఏ విధముగానుంటుంది? అట్టి ఛందమును "స్కందానందము" అని  పిలువ దలచినాను.

--

క్రింద కొన్ని కంద పద్యములు, వాటి స్కందానంద స్వరూపములు -

--

స్కందానందము చక్కని

ఛందము స్కందునకు నొసఁగు - సముదమ్ము సదా

కెందొగ రార్యాగీతికి

నందము నందిచ్చుఁ గనఁగ - నతిగా గతితో ... (1)

--

స్కందానందము - చక్కని ఛందము

స్కందునకు నొసఁగు - సముదమ్ము సదా

కెందొగ రార్యా-గీతికి నందము

నందిచ్చుఁ గనఁగ - నతిగా గతితో ... (2)

--

అరుణోదయమం దతిగా

నరుణ మ్మరయంగ నింగి - యసమానముగా

మురళీధరునిన్ ముదమై

"హరి యో హరి" యంచు గొలువ - నరుగుద మిపుడే ... (3)

--

అరుణోదయమం - దతిగా నరుణ

మ్మరయంగ నింగి - యసమానముగా

మురళీధరునిన్ - ముదమై :"హరి యో

హరి" యంచు గొలువ - నరుగుద మిపుడే ... (4)

--

నగ శిరముపైన నవశశి-

యు, గంగ, యుగళమ్ము దేవి - యుమతో నెపుడున్

గగనస్వరూప కన నా

మొగమ్ము ముగియింపు లేని - ముదమే యెపుడున్ ... (5)

--

నగ శిరముపైన - నవశశియు, గంగ,

యుగళమ్ము దేవి - యుమతో నెపుడున్

గగనస్వరూప - కన నామొగమ్ము

ముగియింపు లేని - ముదమే యెపుడున్ ... (6)

--

సరిలేరు నీకు సరసా

మురారి మురిపించ రమ్ము - ముచ్చట దీరున్

కరుణాలవాల కలయే

వరమ్మొ వరదా యనంగ - వరమియ్యవుగా ... (7)

--

సరిలేరు నీకు - సరసా మురారి

మురిపించ రమ్ము - ముచ్చట దీరున్

కరుణాలవాల - కలయే వరమ్మొ

వరదా యనంగ - వరమియ్యవుగా ... (😎

--

పై  పద్యములలో (1), (3), (5), (7) పద్యములు కంద పద్యములు. (2), (4), (6), (😎  పద్యములు (1), (3), (5), (7) పద్యముల స్కందానంద స్వరూపములు.

----

స్కందానందము -

--

మనసున దలంతు - మధురాధిపతీ

యనిశము మురారి  - యనురాగమతీ

కనవేలకొ నను - కంసవినాశా

వనజాక్ష వరద - స్వరపదకోశా ... (9)

--

ముద్దుగను గృష్ణ - మోహన రారా

వద్దింక యాట - ప్రణయాకారా

నిద్దుర వేళయు - నిశిలో నిదిరా

సద్దింక చాలు - సమయము పదిరా ... (10)

---

మనమెల్ల నీవు - మధురాపురీశ

తనువెల్ల నీవు - తాఁకఁగ రారా

దినమెల్ల నిన్ను - దెరువందుఁ జూడఁ

గనులందుఁ గాయ - గాచెను రారా ... (11)

--

సరిలేరు నీకు - సరసా మురారి

మురిపించ రమ్ము - ముచ్చట దీరున్

కరుణాలవాల - కలయే వరమ్మొ

వరదా యనంగ - వరమియ్యవుగా ... (12)

--

రమణియమైన - రసగంగలోన

రమణీ బిరాన - రమ్ము మునుంగన్

భ్రమరమ్ము కురులు - రమణమ్ము విరులు

కమనీయ మిందు - కలయే నిజమై ... (13)

--

నవనీత మిమ్ము - నవభోజనమ్ము

నవజీవనమ్ము - నాకది యొసఁగున్

గవనమ్ములోనఁ - గలరవపు వాన

చవులూరు సోన - శ్రవణమ్మందున్ ... (14)

--

మధురమ్ము రూపు - మధురమ్ము చూపు

మధురమ్ము కాపు - మధుర మ్మతఁడే

మధురమ్ము శ్రుతియు - మధురమ్ము గతియు

మధురమ్ము నృతియు - మధుర మ్మతఁడే  ... (15)

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


గీతి - షట్పది - 

--

మాత్రా వృత్తమైన ఆర్యలో గీతి ఒకటి. గీతిలో ద్విపదయైన ఆర్యలోని రెండు పాదములు ఒకే విధముగా నుండును. అనగా ఏడు చతుర్మాత్రలు, ఒక గురువు. పద్యము మొత్తములో 60 మాత్రలు. గీతిని తెలుగులోని కందమువలె వ్రాసినప్పుడు, బేసి పాదములలో మూడు చతుర్మాత్రలు, సరి పాదములలో నాలుగు చతుర్మాత్రలు, ఒక గురువు. మిగిలిన నియమములన్నియు కందమువలెనే. క్రింద గీతిని ఏ విధముగా వసు షట్పదిగా (వసు - ఎనిమిది మాత్రలతో) వ్రాయ వీలగునో అన్న విషయము తెలుపబడినది. క్రింది ఉదాహరణములలో (1), (3), (5) పద్యములు గీతార్య, (2), (4) (6) పద్యములు వసు షట్పదులు. 

--

ఇది మార్గశిరము మధుర-

మ్ము దలఁపు ముదమయ్యె నాకు - పులకలుగా 

వదనమ్ము చూడ హృదయ- 

మ్ము  దాను పొదలాడుచుండెఁ - బూర్ణముగా ... (1) 

--

ఇది మార్గశిరము 

మధురమ్ము దలఁపు 

ముదమయ్యె నాకు - పులకలుగా 

వదనమ్ము చూడ 

హృదయమ్ము  దాను 

పొదలాడుచుండెఁ - బూర్ణముగా ... (2) 

--

నను వీడకురా వనజా- 

నన రా కన నిటకుఁ ద్వరగఁ - గరుణాంశా 

మును నేఁజేసితిఁ బెనుపున 

ననఘా ఘన దూషణమ్ము - గావుమురా ... (3) 

--

నను వీడకురా 

వనజానన రా 

కన నిటకుఁ ద్వరగఁ - గరుణాంశా 

మును నేఁజేసితిఁ 

బెనుపున ననఘా 

ఘన దూషణమ్ము - గావుమురా ... (4) 

--

రామయ్యా యిది యేమ-

య్యా మాయామయము జగతి - యది కలరా 

నామానసమిటఁ బ్రేమగ 

రామా రామ యనుచుండె - రమణీయముగా ... (5) 

--

రామయ్యా యిది 

యేమయ్యా మా-

యామయము జగతి - యది కలరా 

నామానసమిటఁ 

బ్రేమగ రామా 

రామ యనుచుండె - రసమయమై ... (6) 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao


వనమయూరపు లయతో రమణ వృత్తము - 

నిన్న మీకు మందాక్రాంతపు నడకతో "వీణాక్వణము" అనే వృత్తమును పరిచయము చేసినాను. దాని గురు లఘువులు UUUU - IIIUU - UIU UIUU. మొదటి నాలుగు గురువులను తొలగిస్తే మనకు ఈ విధమైన అమరిక లభిస్తుంది - IIIU UUI - UUI UU.  నేను కొన్ని నెలలకు ముందు మందాక్రాంత వృత్తములో దాగియున్న ఒక అపురూపమైన విశేషమును బయటికి తీసినాను. అదేమంటే మందాక్రాంతములోని మొదటి నాలుగు గురువులను తొలగిస్తే వనమయూరపు లయ ఉండే "లాలసరాగ" అనే సార్థకనామ వృత్తము దొఱుకుతుంది. ఇది వీణాక్వాణమునకు కూడ వర్తిస్తుంది. అట్టి వృత్తమును "రమణ" అని పిలువ దలచినాను. క్రింద రమణ వృత్తమునకు నా ఉదాహరణములు - 

రమణ - న/మ/య/య IIIU UUI - UUI UU

12 జగతి 584 

నభములో నందమ్ము - నాట్యమ్ము సేసెన్ 

శుభముగా దీవించ - శోభించెఁ దారల్ 

విభునికై డెందమ్ము - బ్రేమించి వేచెన్ 

ప్రభువు దా వేవేగ - రాఁడేల నింకన్ 

పిలువఁగా రావేల - ప్రేమార్ద్ర చిత్తా 

పలుకఁగా రాలేనొ - వజ్రాలు నేలన్ 

తలపుతో డెందమ్ము - తందాన లాడెన్ 

వలపులో నే నిన్ను - వాంఛించుచుంటిన్ 

అలలతో హోరెత్తె - నంభోధి సంధ్యన్ 

శిలలపైఁ గూలంగఁ - క్షీరమ్ము సిందెన్ 

మిలమిలల్ వెల్గంగ - మీనమ్ము లెందున్ 

చెలువమా నేనెట్లు - చిత్రింతు నిన్నున్ 

కమలమా యీరోజు - కవ్వించబోకే 

కమలె నా చేతమ్ము - కన్నీళ్లు నిండెన్ 

యమళమై నుండంగ - నాశించఁగా నా 

రమణుఁడో రాలేదు - రాత్రిన్ రమించన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohan

మాలినీ వృత్తములో వనమయూరపు లయతో రమణ వృత్తము -

--

మాలిని - న/న/మ/య/య III III UU - UIU UIUU 15 అతిశక్వరి 4672

రమణ - న/మ/య/య IIIU UUI - UUI UU 12 జగతి 584

--

రమణ - https://www.facebook.com/groups/Chandassu/permalink/1179623575415634

--

నగుచు నగుచు రా శ్రీ-నాథ నన్నిందుఁ గాంచన్

వగల సెగలతో నా - వాంఛ జీరాడె నేలన్

మొగము సుగమిడున్ నీ - మోము చూడంగ లేనా

జగతి నగధరా యీ - జన్మ నాకేల నయ్యా ... (1)

--

నగుచు రా శ్రీనాథ - నన్నిందుఁ గాంచన్

సెగలతో నావాంఛ - జీరాడె నేలన్

సుగమిడున్ నీమోము - చూడంగ లేనా

నగధరా యీజన్మ - నాకేల నయ్యా ... (2)

--

ద్రుమము లలరె నీ కెం-దూళి యందమ్ము నిండన్

మమత తలఁపులో నా-మమ్ము ధ్యానింతుఁ గాదా

కమలు కలలతో నా - కాంక్ష కవ్వించె నేస్తీ

రమణ పిలువఁగా రా-రాదొ ప్రేమమ్ము పొంగన్ ... (3)

--

అలరె నీ కెందూళి - యందమ్ము నిండన్

దలఁపులో నామమ్ము - ధ్యానింతుఁ గాదా

కలలతో నాకాంక్ష - కవ్వించె నేస్తీ

పిలువఁగా రారాదొ - ప్రేమమ్ము పొంగన్ ... (4)

--

(1), (3) - మాలిని

(2), (4) - గర్భిత రమణ వృత్తము

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


భోగిలో భోగషట్పది - 

--

భోగషట్పది - (సూ)4 / (సూ)4 / (సూ)4 - (సూ)2/గ

--

భోగి వచ్చె నేఁడె చూడు  

భోగభాగ్యముల నొసంగ 

రాగమయము చేయగాను - రాశి విరులతో 

సాగుచుండెఁ గాలచక్ర 

మాఁగకుండ నవనిపైన 

నూఁగు నింక డెందమిందు - నూయెల యనఁగా 

--

మింట నొకటి రెండు తార 

లింటిముందు భోగిమంట 

కొంటె బాలురందఱికొక - కుతుకమేగదా 

మంట వేడి ననుభవించి 

కంటి నులుసు తుడుచుకొనుచు 

టంటమమని కొట్టి రపుడు - డప్పులెన్నియో 

--

నింగిలోన రవియు పొడిచె 

ముంగిలిపయి వెలుఁగు నిండె 

ఖంగు మనెను గంకణములు - కలరవమ్ముతో 

వంగి చుక్కలుంచి వేగ  

రంగులఁ బలు మేళవించి 

మంగళముగ మ్రుగ్గు లిడిరి - మహిళలెందఱో 

--

వృత్తమువలెనుండు మ్రుగ్గు 

చిత్తమలరఁ జేయుచుండఁ 

గ్రొత్త వేషముల ధరించి - కోమలాంగనల్ 

వృత్తములను జుట్టిచుట్టి 

నృత్తమాడి రపుడు చేతు 

లెత్తి దించి సడులఁ జేసి - రెంతొ వేడుకన్ 

--

ఆమని యది రాకమునుపె 

శ్యామ యొకటి గళమునెత్తి 

కోమలముగఁ గూయఁ దొడఁగెఁ - గొమ్మనొక్కటిన్ 

బ్రేమతోడ నింటిలోన 

రామచిలుక గొంతు కలిపె 

జాముకోడి కూసె నపుడె - చాల పెద్దగా 

--

మకరరాశిలోన సూర్యుఁ 

డిఁక ప్రవేశమగును గాదె 

సకలజనులకగును జాల - సంబరమ్ములే 

ప్రకరణమ్ము ముగియ నొకటి 

ప్రకరణమ్ము వేఱు వచ్చు 

సుకము నిండ భూమిపైన - శుభము కలుగఁగా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


త్ర్యస్రగతిలో కందము - 

--

నందతనయ నన్ను గనర 

సుందరమగు నీదు చూపు - సుగము నిడునురా 

వందనముల నిత్తు నెపుడు 

నిందితుఁడను నీకుముందు - నీవె శరణురా ... (1) 

--

మల్లె గుబురు గంధ మిచట, 

చల్లె కిరణజాలములను - శశియు రజనిలో 

నుల్ల మలరె నూహ లుబికె 

ఫుల్లమగును గోర్కె దమ్మి - ముదము నొసఁగఁగా ... (2) 

--

వేగ మిచట రమ్ము సకియ 

రాగలహరిలోన మునుఁగ 

రాగహృదయులై 

మూఁగమనసులందు వినఁగ 

మ్రోఁగు హృదయవీణ లింక 

భోగ మొనరఁగా ... (3) 

--

మూడవ పద్యము ఒక షట్పదకందము కూడ. అనగా సరిపాదములలో యతి స్థానమువద్ద ప్రాస కూడ ఉండును. 

--

విధేయుడు - మోహన


సంక్రాంతి శుభాకాంక్షలు - విషమసీసము తరుపదసీసము -

--

తరువోజ. ఇది యొక్క సంక్రాంతి - హృదయమ్ము దాఁకు - నెదలోని భావాల - మృదులమ్ముగాను

కదలు నా రవి నేఁడు - గగనమ్ములోనఁ - గడు శైత్య మది తగ్గుఁ - గ్రమముగా నింక

మొదలౌ వసంతమ్ము - మునుముందు మనకుఁ - బూలతోఁ బలికించు - ముదమీయగాను

నదులలోఁ బారు నా - నవమైన జలము - నవలామణులు పాడి - నాట్యమ్ము లాడ

--

తే. నిలయు వెలుఁగొందు నానంద - కలిత మగుచుఁ

గలలవలె సాఁగు దినములు - కాంతి నిండ

సలలితమ్మగు సంక్రాంతి - సత్యముగను

బలుకు నాందిని రాబోవు - భావి కిపుడు

--

సూచన. మామూలు సీసములో సీసమును, ఎత్తుగీతిని సంబంధము లేక విడివిడిగా వ్రాయ వచ్చును. కాని విషమసీసములో రెండింటిని కలుపవలెను. ఈ పద్యములో ఆడన్ + ఇలయు = ఆడ నిలయు ద్వారా ఇది నెరవేర్చబడినది. లక్షణ గ్రంథములో ఒక్క ఉత్సాహ + గీతి మాత్రమే విషమసీసముగా పేర్కొనబడినది. సీసమునకు తరువోజకు గణముల సంఖ్య ఒక్కటే. అమరిక మాత్రమే వేఱు.

--

విధేయుడు - మోహన


మధురాక్కర + ఉత్సాహ = మధురోత్సాహ 🙂  

--

మధురాక్కర - సూ/ఇం/ఇం - ఇం/చం 

ఉత్సాహ - (సూ)4 - (సూ)3/గ 

--

మధురాక్కర విఱుపులో ఉత్సాహ - 

--

మనసు పిలిచెను నిను వేగ - మధువుల నొసఁగన్ హరీ 

ప్రణయ కవితను సృజియించి - పాడెద ముదమొందగా 

దినము రాత్రులు మది నెంతు - దిక్కిల సక నీవె నీ 

స్వనము విన్న యాక్షణమది - స్వర్గమె యననౌనురా 

--

ఉత్సాహ విఱుపులో మధురాక్కర - 

--

మనసు పిలిచె నెపుడు వేగ - మధువు లొలుక మాధవా 

ప్రణయ కవిత నొకటి వ్రాయఁ - బరవశింతు నిజముగా 

దినము రాత్రి నిన్నె దలఁతు - దిక్కు నీవె యనెద నీ 

స్వనము విన్న క్షణమె నాకు - స్వర్గమునకు సాటిరా 

--

ఐదు అక్కరలలో మధురాక్కర మూడవది. దీనిని కన్నడములో నడువణక్కర అనగా మధ్యాక్కర అంటారు. తెలుగు మధ్యాక్కర నిజముగా మధ్యలో ఉండే అక్కర కాదు! 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


సార్థకనామ వృత్తములు హర, హలి, హరి - 

--

కనుమ రోజు గోపాలకులను స్మరిద్దామా? గోపాలకులు ముగ్గురు - శివుడు, బలరాముడు, కృష్ణుడు. వారికై సార్థకనామ గణాక్షర వృత్తములు హర, హలి, హరి. హర, హలి వృత్తములు గ్రంథములలో నున్నవి. హరి కల్పితము. 

--

హర (ధృతి, వాగురా, విదగ్ధక, వైనస) - ర/లగ UI UIU 

5 సుప్రతిష్ఠ 11 

--

ఓ వృషాధిపా 

కావరా హరా 

గోవులన్ సదా 

నీవు ప్రేమతో 

--

హలి (క్షుత్) - భ/లల UI III 

5 సుప్రతిష్ఠ 31 

--

ప్రోవుము హలి 

పావనమగు 

నీవనమున 

నావులఁ బలు 

--

హరి - ర/య/య/లగ UI UIU - UIU UIU

11 త్రిష్టుప్పు 587

--

గోకులమ్ములో - గోపబాలా హరీ 

గోకులమ్ములన్ - గ్రోవితోఁ బిల్వరా 

మ్రాకు నీడలో - మచ్చికన్ బచ్చికన్ 

జీఁకి మేయఁగాఁ - జెల్వమై యొప్పుఁగా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


ఉజ్జ్వల (ముద్రా) - 

--

ఆధారము - జయకీర్తి (ఉజ్జ్వల), హేమచంద్రుడు (ముద్రా)

సూత్రము -  నభభమాః ససలా గితి ముద్రా - రుద్రయతి క్వచిదుజ్జ్వలం 

--

న/భ/భ/మ/స/స/లగ III UII UII UU - UII UII UIU

20 కృతి 373176 

--

గగన మెల్లెడ నుజ్జ్వల శోభల్ - కానఁగ నెఱ్ఱని సంధ్యలో 

నగమునందున ఛాయలు నిండెన్ - నక్తపు నీడల రీతిగా 

సిగరమందున నాలయమయ్యెన్ - జెల్వపు జ్యోతుల పంక్తులై 

మగువ యింటను జేసెను బూజల్ - మంగళముద్రను గోరుచున్ 

--

విమల గాత్రము వేగము పాడన్ - బ్రేమము చిందిడుచుండఁగాఁ 

గమల నేత్రము లెప్పుడు విచ్చున్ - గానఁగ నన్నిట నందమై 

సుమము లెన్నియొ పూచెను నీకై - సొంపులతోఁ బలు గంపలై 

ద్రుమములందునఁ గొమ్మలగుండా - తోచెను వెల్గులు సూదులై 

--

కరుణ లేదని చెప్పకు దేవా - కాయము గాసిలె బాధతోఁ  

దరుణ మెప్పుడు చెప్పుము చూడన్ - ధైర్యము గల్గును గుండెలో 

మరణ మన్నది వచ్చును గాదా - మానిసి నీవలె నిత్యమా 

స్మరణ సేసెద నామదిలోనన్ - జాలును నాకిది జన్మలో 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


చిత్రలేఖా -

--

డా. వరలక్ష్మిగారు ఈ వృత్తమునుగుఱించి అడిగినారు. నాకు తెలిసి ఇట్టి వృత్తము పుస్తకాలలో లేదు. కాని ఇది ఉత్పలమాలలో మొదటి నాలుగు అక్షరములను తొలగించి ర-గణములోని చివరి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు లభిస్తుంది. దీనికి చిత్రలేఖా అని పేరుంచినాను. క్రింద దీనికి నా ఉదాహరణములు -

--

చిత్రలేఖా - న/న/భ/భ/ర/లగ III III UII - UII UIUIU

17 అత్యష్టి  44480

--

కనుగవకిడు కాటుక - కామిని చిత్రలేఖలా

మనసునగల కోరిక - మంద్ర విపంచినాదమా

తనువునగల తాపము - తగ్గఁగ మందులుండునా

ప్రణయపు సరిహద్దులు - పారెడు గంగనాపునా

--

అరవిరిసిన సూనము - లామని చేయు హాసమా

తెరువునగల దీపము - తెల్లని యంధకారమా

మెఱుపునగల తీవలు - మేఘపు కంఠహారమా

తరువునగల కోకిల - తన్వికి గీతి నేర్పునా

--

కమల దళపు కన్నుల - కన్నయ దేవళమ్ములో

భ్రమల తొలఁగ జేయునొ - భారము లేసు చేయునో

నమనమగుచు నుంటిని - నాదరి రాకయుండెనే

కమల విభుఁడు నాకిటఁ - గన్నులఁ గానరాఁడుగా

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

ఉత్పలమాల - కందము - 

--

ఉత్పలమాల - UII UIU III - UII UII UIUIU

--

ఈ వనిలోనఁ బుష్పముల - నేవనదేవత పూయఁజేసె వ-

ర్ణావృతమై సుశోభితము - లయ్యెను కన్నుల కింపు నీడుచున్ 

భా వనమెల్ల గీతికలు - పాయని నాదము మ్రోఁగుచుండె - నా-

శావరమై పులుంగుల వ-సంతపు సొంపుల వంపు రీతిగా 

--

ఉత్పలమాలలోని కందము - IIU IUI IIU / IIU IIU IUI - UU IIU 

--

(ఉత్పలమాల మొదటి పాదపు రెండవ అక్షరమునుండి రెండవ పాదపు నాలుగవ అక్షరము వఱకు) 

--

వనిలోనఁ బుష్పముల నే

వనదేవత పూయఁజేసె - వర్ణావృతమై 

వనమెల్ల గీతికలు పా-

యని నాదము మ్రోఁగుచుండె - నాశావరమై 

--

మాతృక - ఉత్పలమాల 

తనయ - కందము 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



ముక్తపదగ్రస్తము మత్తకోకిలలో - 

--

మానసాంబరచంద్ర దల్చితి - మానినిన్ నను గానవా 

గానవాహినిలోన మున్గెద - గంగ నీరగుఁ దేనెగాఁ 

దేనెగాల్వలు వీనులందున - దృప్తి నిచ్చు నిదానమై 

దానమై యది నీవొసంగఁగ - ధన్యురాలను నిక్కమై 

---

నిక్కమై యిట నీవు నాయెద - నిల్చియుంటివి చక్కఁగాఁ 

చక్క గారము చూపవేలకొ - చక్కనయ్యవు చిక్కవే 

చిక్క వేనలి చూడ నీవలఁ - జిక్కుకొంటిని ముక్కలై 

ముక్కలైనవి యొక్కటై మన - మ్రొక్కెదన్ దయ చూపరా 

--

చూప రా మురళీధరా నవ - శోభ లన్నిటి శ్రీపదా 

శ్రీపదాంభుజయుగ్మ సేవయె - చింత లన్నిటి నాపురా 

నాపురాకృత పుణ్యమయ్యెను - నందనందన గోపతీ 

గోప తీయని వేణువూఁదర - కోర్కే తీరు ఘనమ్ముగా 

--

నమ్ము గాయముతోడ నుంటిని - నక్తమే తిమిరమ్మురా 

రమ్ము రాజిల జీవ మిచ్చట - రాగదీపము కమ్మురా 

కమ్ము రాత్రుల యంధకారముఁ - గాంచ భీతి దినమ్మురా 

నమ్ము రాగపు కన్నులందున - నాకు నిద్దుర లేదురా 

--

లేదు రాకయు జీవితమ్మున - బ్రేమ చీఁకటి నాదమా  

నాద మాహ ముఖారి రాగపు - నాట్య మయ్యెను జేఁదుగాఁ  

జేఁదు గారెల భక్షణమ్మది - జిహ్వ కిచ్చునె మోదమున్ 

మోద ముద్గర ఘాత బాధలె - మోహ మయ్యెను భారమై 

--

భారమై బ్రతుకీడ్చుచుంటిని - భావనాంబర తారకా 

తారకాద్వయమై మనంగను - దారి నాకు సుదూరమా 

దూర మాకృతి నీదు కానఁగ - దుర్లభమ్మగు హీరమా 

హీరమా హృది నీకుఁ జెప్పుము - హృష్టి నీయవు ప్రేమికా 

--

ప్రేమి కామియు నీవె నిత్యము - బ్రేమ లోకపు స్వామి రా 

స్వామి రాజిలుచుండె నీగుడి - చాలు నాకది ధామమై 

ధామమై సురభూమమై భవ-తారమై ప్రియనామమై 

నామమై మొగమందు నెప్పుడు - నాకు సుందరమానసా 

--

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 1

==

తిరుప్పుగೞ್ ఛందములను తమిళములో చందప్పాట్టుగళ్ అంటారు. అనగా అవి ఛందోగీతులు. మిగిలిన భాషలలోని ఛందస్సులవలె ఇందులో గురు లఘువుల అమరిక మాత్రమే కాదు, అందులోని గురువులుగా ఎట్టి గురువులను వాడవలెనో అనే నియమములు కూడ ఉన్నాయి. వీటిని పాటించడమువలన పాటకు ఒక శబ్ద సౌందర్యము కూడ లభిస్తుంది. ఇట్టివి 1000కి పైగా అరుణగిరినాథునిచే వ్రాయబడినవి. నాకు తెలిసి ఇట్టి ఛందములు మఱెక్కడ లేవు! వీటిని దేవాలయములలో, కచేరీలలో ఇప్పుడు కూడ పాడుతారు. వీటికి అన్నిటికి ధ్వని ముద్రికలు అర్థ తాత్పర్యములు కూడ ఉన్నాయి అంతర్జాలములో.

==

సూత్రము: తందతన తనతానా - తందతన తనతానా

==

తన అన్నప్పుడు ఏ రెండు లఘువులయినను వాడ వచ్చును. తాన అన్నది UI మత్రమే కాదు. తాన యందలి న-కారము లఘువు మాత్రమే. అది ద్విత్వ లేక సంయుక్తాక్షరము కాదు, బిందుపూర్వక అక్షరము కూడ కాదు. అనగా తాన స్థానములో నేను వాడవచ్చును, కాని పువ్వు, ముందు వంటివి వాడరాదు. అదే విధముగా తందలో కచటతప వర్గములలోని మొదటి నాలుగు అక్షరములకు బిందుపూర్వమైన అక్షరములనే వాడాలి, ఉదా. పెంకి, గంగ, కంచి, గంజి, పంట, ఉండు, ముంత, సందు, పెంపు, రంభ, ఇత్యాదులు.

==

సూత్రము: తందతన తనతానా - తందతన తనతానా

==

చందనపు శిల నీవే - చంగులిడు జల నీవే

సందరపు టల నీవే - సంగమపు కల నీవే

మందిరపు వెలుఁగీవే - మంగళపు నుడి నీవే

నందనపు తరు వీవే - నన్ గనఁగ వడి రావే

(నన్ గనఁగ = నంగనఁగ)

==

మించువలె తళుకీవా - మెండుగను గులుకీవా

పంచశరు విరితీవా - పండుగకు సిరి నీవా

మంచువలె చలి నీవా - మండు చితి పొగ నీవా

నించి మనికిని దేవీ - నిండుగను బ్రతుకీవా

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Like


తిరుప్పుగೞ್ ఛందములు - 2

==

అరుణగిరినాథులు పదునాల్గు, పదునైదవ శతాబ్దముల కాలములో జీవించినాడు. ఇతడు సుమారు 16000 వేల పాటలను వ్రాసినాడట. కాని ఇప్పుడు సుమారు 13 వందలు మాత్రమే మనకు లభ్యము.

==

ఈ పాటలలో ఒక శబ్దముల అమరికను గ్రహించి దానిని కొన్ని మారులు చెప్పుతారు. ఇది పద్యములా చతుష్పది. ప్రతి పాదములో కనీసము రెండు repeating units ఉండాలి. వీటికి అక్షర సామాన్య యతిని (తమిళములో మోనై) ఉంచుతారు. నాలుగు పాదములకు ద్వితీయాక్షర ప్రాస (తమిళములో ఎదుగై) ఉంటుంది.

==

సూత్రము: (తానన తానన తానన తానన తానన తానన తనతానా)2

==

ఈ తాననలోని మొదటి నకారము సంయుక్తాక్షరముగా ఉండరాదు, బిందుపూర్వకమైన అక్షరముగా నుండరాదు. కేవలము దీర్ఘము,హ్రస్వము,హ్రస్వముగా ఉండాలి, ఉదా. మోహన.

==

ఏనుఁగు మోమది - మేనది స్థూలము - కానని యాపద వలదోయీ -

హేమ సుహాసపు - కోమల భాసపు - స్వామి వినాయక కనవోయీ

==

దీనుని జూడుము - దీన జనావన - నీనగు మోమున వరదాయీ -

ధీమతి నీవిఁక - మామతి కీయుము - ప్రేమపు సారము రసపాయీ

==

జ్ఞానరసోదధి - గానకళానిధి - ప్రాణపయోదధి యిల నీవే -

నామము నీదియె - మేమిట ధ్యానము - మామది సేతుము దయ నీదే

==

మౌనము నీవిఁక - మానుము మాపయిఁ - గానఁగఁ జేయుము దయ దేవా -

మాలల వేతుము - మేలుగఁ బాడుచు - శ్రీల గుణాలయ గణనాథా

==

విధేయుడు - జెజ్జాల కృష్ణమోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 3

==

సూత్రము: (తత్త తనతనన - తత్త తనతనన - తత్త తనతనన తనతాన)2

తత్తలోని ద్విత్వాక్షరము త్త; ఇది క,చ,ట,త,ప వర్గములలో అనునాసికములు కాని అక్షరముల ద్విత్వాక్షరములు. ఉదా. అక్క, నిగ్గు, వచ్చి, రజ్జు, పెట్ట, గుడ్డ, అత్త, మద్ది, చిప్ప, రుబ్బు, ఇత్యాదులు. అన్న, అమ్మ, మున్నగునవి వాడ రాదు, ఎందుకంటే అవి తన్న జాతికి చేరుతాయి. పిల్చి, తల్చి తెలుగులో అంగీకృతములు. కాని అయ్య, కఱ్ఱ, తుర్రు, మొల్ల, బువ్వ వంటి పదములు వాడరాదు. అవి తయ్య జాతికి చెందినవి. అచ్చ తెలుగు పదముల వాడుకకు ఇది ఒక గొప్ప అదను! 

==

కొన్ని విధములైన అక్షరములను మాత్రమే పద్యములలో వాడుట కూడ ఒక విధమైన చిత్రకవిత్వమే!

==

పొత్తములఁ జదువ - విత్తనములగును - జిత్తములు పెరుగు నిజమై యీ 

ముజ్జగపు జనుల - నొజ్జయగు జనని - గజ్జె లిట మొరయు విధమేగా 

--

సత్తెముగ మదికి - నిత్తె మొకపదము - గుత్తుకను వెడల - ముదమేగా 

చక్కనగు బ్రతుకు - ఋక్కు లిడు వెలుఁగు - నక్కజము నిడెడు సుగమేగా 

--

ముత్తి యది గలుగు - మత్తు మదిఁ దొలఁగు - బత్తి ద్వర పెరుఁగు వరమేగా 

పుట్టు నొక జవము - దట్టు నొక తలఁపు - దిట్టమగు మనసు దిగులేలా 

--

కత్తులిఁక వలదు - మెత్తనగు హృదికి - మిత్తి కడు భయము కనదోయీ 

కబ్బమగు జగతి - నిబ్బరము కలుగ - నబ్బురము భవము భువనాన(న్) 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 4 (1077)

==

సూత్రము: (తనతన తనన - తనతన తనన - తనతన తనన తందతాన)2

చివరి తందతాన నా ఉద్దేశములో తెలుగుకు బాగుంటుంది. పాడుకొనేటప్పుడు తానను తానా అని పాడుకొనవచ్చును. తందకు సరిపోయే పదములు, అంక, గంగ, కుంచె, కుంజ, వంట, నిండ, సంత, సంధి, చెంప, కుంభ, ఇత్యాదులు.

==

మనసున శిలగ - ఘనముగ నిలిచి -

యనిశము గలవు కంద నీవు

మధురము కొలువు - మధురము తలఁపు -

మధురము స్మరణ యెందు నీకు

--

జనకుని గురువు - జననికి శిశువు -

వనితల వరుఁడు వందనీయ

సలలిత హృదయ - చెలువపు టొడయ -

మలపయి నునికి మందహాస

--

వినుతము గుణము - ప్రణుతము కరుణ -

యనఘము చరిత యందగాఁడ

విలసిత ముఖము - వెలుఁగిడు కనులు -

సలలిత రవము చందనాభ

--

ఒనరఁగఁ గలిమి - యొనరఁగ బలిమి -

నను గను మిపుడు బంధనాశ

ఒకటియు నయిదు - మొకముల కొమర -

సకలము భువిని జిందు నీవె

==

విధేయుడు - జెజ్జాలకృష్ణ మోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 5

==

సూత్రము: (తత్త తన్న తయ్య - తత్త తన్న తయ్య - తత్త తన్న తయ్య - తనతాన)2 (606)

==

తత్త: కచటతప వర్గములలో అనునాసికములు కాని అక్షరముల ద్విత్వములు, క్క, గ్గ, చ్చ, జ్జ, ట్ట, డ్డ, త్త, ద్ద, ప్ప, బ్బలు. హల్లులేవైనను ఉండవచ్చును.

==

తన్న: కచటతప వర్గములలో అనునాసిక అక్షరముల ద్విత్వములు, ణ్ణ, న్న, మ్మ. హల్లులేవైనను ఉండవచ్చును.

==

తయ్య: య,ల,ళ,వ అక్షరముల ద్విత్వములు. తెలుగులో ర,శ,స లను కూడ కలుపుకోవచ్చును, వీటి సంయుక్తాక్షరములు కూడ. య్య, ల్ల, ళ్ళ, వ్వ, ర్ర, ఱ్ఱ, స్స, శ్వ, ర్ల, ఇత్యాదులు.

==

తమిళములో కూడ తయ్యతో పాటలు చాల తక్కువ, తన్నతో కూడ తక్కువే.

==

ఇక్కడున్న వల్లి - చక్కనమ్మ వల్లి -

యెక్కడున్న నయ్య ప్రియురాలే

యిద్దరున్న నిల్లు - ముద్దులన్న త్రుళ్ళు -

సద్దులన్ని చెల్లు సరసాలే

[సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు దేవసేన (దేవయానై లేక దేవానై) మఱియు వల్లి (వళ్ళి)]

--

మిక్కుటమ్ము నవ్వు - లెక్కువమ్ము పువ్వు -

లిక్కడున్న యయ్య కరుసాలే

మెప్పులెన్నొ చెల్లు - ముప్పులున్న వ్రయ్యు -

తప్పులున్న మళ్లు దరి వాఁడే

(ఎక్కువ + అమ్ము పువ్వులు = ఎక్కువమ్ము పువ్వులు, మళ్లు = మరలు)

--

చుక్కలున్న వెల్లి - యక్కజమ్ము బిల్లి -

దిక్కులన్ని ఝుల్లి కగుఁగాదే

సొత్తులన్ని చిల్లి - యెత్తులన్ని క్రుళ్లు -

మిత్తి తన్ను మళ్ళి సురనాథా

(వెల్లి = ప్రవాహము, ఇక్కడ పాలవెల్లి, బిల్లి = బింబము,  ఇక్కడ చంద్రబింబము, ఝుల్లిక = కాంతి, తన్ను = కాలితో తన్ను)

--

దిక్కులన్ని వల్లి - పక్కనున్న జియ్య -

యెక్కడున్నఁ దల్లి వలెఁ గాచున్

దెత్తు చిన్న దివ్వె - నిత్తు జున్ను పళ్లు -

చిత్త మున్న జవ్వనపు ఱేఁడా

(జియ్య = దేవుడు)

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 6

==

సూత్రము: (తత్తతన తానత్ తనతాన)2 (1281) 

==

ఇలాటివి తెలుగులో ఉండవు. తెలుగులో హలంత పదములు అరుదు. ద్రుతముతో (చేసెదన్ లాటివి), బహువచనములో (మాటల్ లాటివి) మాత్రమే ఈ తెగకు సరి పోతుంది. కాని ఇవి కూడ తఱువాతి పదములతో సంధి రూపములో వస్తాయి, చేసెద నిప్పుడు, మాటల్చాలును లాటివి. తమిళములో పరప్పొఱుళ్, కడఱ్కరై వంటి పదములను వారు పరప్ పొఱుళ్, కడఱ్ కరై అని కూడ వ్రాస్తారు. కవున తానత్ తనతాన అన్నది తెలుగులో తానత్తనతాన అవుతుంది. ఈ విధముగా నేను క్రింది పదమును అల్లినాను. కావున తెలుగులో దీని 

సూత్రము: తత్తతన తానత్తనతాన

ద్విరుక్త త-కారమునకు వర్గాక్షరములలోని అనునాసికము కాని అక్షరములను వాడవలెను.

==

చిత్తమిది నీకిచ్చితి దేవా 

  సిగ్గువిడి నేవచ్చితిఁ గావా 

మత్తువిడె నాకిప్పుడు సామీ 

  మక్కువను జూడెప్పుడుఁ బ్రేమీ 

చత్తునను నామిత్తియు నీదే 

  చక్కెరగ నాముత్తియు నీవే 

హత్తుకొను మోసుబ్బయ వేగం 

  బగ్గలము కాదబ్బ సుధీరా 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

తిరుప్పుగೞ್ ఛందములు - 7

==

సూత్రము: (తానతన తానతన తానతన తంద)2

తంద: అనునాసికములతో వర్గాక్షరములు; అంక, రంగు, కంచి, రంజన, మంట, చండి, కంత, స్కంధ, చెంప, రంభ, ఇత్యాదులు.

==

దీనులకు హీనులకు జ్ఞానమను మందై

తేనెలిడు గానముల తీపి విను విందై

మానసములోనఁగల వీణియకుఁ దంతీ

మానవుల ధ్యానమున మౌనపు స్రవంతీ

నీనగవులీను సుధ స్నేహపు ముదంబే

నేను భువనాన నిఁక నీపదరజంబే

కాననములోఁ దెరువు కానదుగ తండ్రీ

కారుణము చూపి నను గావుమయ తండ్రీ

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తిరుప్పుగೞ್ ఛందములు - 8

==

(తానతన తంద 

తానతన తంద 

తానతన తంద తనతాన)2 - (970)

==

కానగను జింత - మేనిదియు వంత - 

    వానరపు వింత కతయేనా - 

  కాల మొక వంపు - లీలగను జంపు - 

    మేలమిది యింపు గద నీకే 

==

స్వానముల జంగు - సూనముల రంగు - 

    ధ్యానముల ఖంగు విధియేనా - 

  సాయమున కిందు - రా యిపుడు ముందు - 

    నాయునికి కుందు జగమేనా 

==

వేణురవ మొండు - ప్రాణమున నుండు - 

    జ్ఞానమగు మెండు జలజాక్షా - 

  ప్రేమమది మంట - సోముఁడట మింట - 

    ప్రేమికుల పంట యిదియేనా 

==

మానసమునందు - నీనగవు చిందు - 

    గానముల విందు గద దేవా -  

  మానవుని కిందు - బాధ బ్రతుకందు - 

    లేదు ముద మెందు వ్యధలేనా 

===

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



తిరుప్పుగೞ್ ఛందములు - 9 - తెలుగు సీసముతో! 

==

తెలుగు సీసముతో తిరుప్పుగೞ್ ఛందమిది. తిరుప్పుగೞ್ ఛందములో చివర సామాన్యముగా తనతాన ఉంటుంది. ఈ తనతాన అనేది అరుణగిరినాథుడు పాటకు చివర ఉండే పెరుమాళే అనే పదముతో సరిపోతుంది. ఇది కేవలము ఒకే విధముగా నుండే లయకు ఒక ముగింపు నిచ్చుటకు వాడిన అమరిక. ఇది తెలుగు సీస పద్యములోని పాదాంతమునందలి రెండు సూర్య గణములను బోలినది. ఈ రోజు తెలుగు సీసపు అమరికతో ఒక తిరుప్పుగೞ್ ఛందమును కల్పించి ఉదాహరణముగా నిస్తున్నాను. దీని అమరిక తిరుప్పుగೞ್ ఛందపు అమరికవంటిదే. 

==

సూత్రము: 

(తనతంద తాననా 

తనతంద తాననా 

తనతంద తానన - తనన తాన)2 

మొదటి రెండు పంక్తులకు యతి లేక ప్రాసయతి. 

మూడవ పంక్తికి మొదటి పంక్తిలోని మొదటి అక్షరముతో అక్షరసామ్యతి. మూడవ పంక్తిలో చివరి గణములకు మొదటి ఆ పంక్తిలోని మొదటి అక్షరముతో యతి లేక ప్రాసయతి. 

తంద కచటతప వర్గాక్షరములు ఆ వర్గములలోని  అనునాసికముతో, ఉదా. కంకి, కంచె, గంట, కందు, కంబ వంటివి. 

==

కనులందు నీవెగా - తనువందు నీవెగా 

  కమలంబు లౌనుగాఁ - గనులు నీకు 

దినమందు నీవెగా - దెసలందు నీవెగా 

  తెరువందు నీవె నా - మురువు నీవు

==

నినదంబు వీనులో - నెఱ యింపు తేనెలో 

  నెలవంకవోలె నా - వెలుఁగు నీవు 

రణమందు వీరుఁడా - రసమందు మారుఁడా  

  రసనంబు చేల మో - రమణ నీకు 

==

వనమందు పూవులో - వలపించు తావిగా 

  వదనంబుపైన నా-వరణ మేమొ 

ప్రణవంపు మాటలై - ప్రణయంపు పాటలై 

  పదమందుఁ దానమై - పలుకు నీవు

==

క్షణమందు నాకమా - కణమందు లోకమా 

  స్వనమందు మౌనమా - వరద నీకు 

మనుమిందు మోహనా - యనిశంబు చూతురా 

  మధురంబు జీవ మీ - పృథివిపైన 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



తిరుప్పుగఴ్ ఛందములు - 10 

==

ఇది ఒక త్యాగరాజ కీర్తనపైన ఆధారపడినది. (తాన తనతనన - తాన తనతనన)3 + తనతాన లతో ఒక తిరుప్పుగఴ్ ఛందము (153) గలదు. ఇందులో అధికముగా మఱొక తాన తనతనన - తాన తనతనన ఉన్నది. చివరి తనతానకు బదులు ఇందులో తాన తానతన తాన. ఇక్కడ ఒక విషయము చెప్పాలి. త్యాగయ్య పాటలో అన్ని చోటులలో తనతనన లోని ఐదు లఘువులు లేవు. ఆకడక్కడ లయ చెడక గురువులు కూడ ఉన్నాయి. వ్రాసేటప్పుడు ఎప్పుడు తాన తనతనను రెండు చతుర్మాత్రలుగా వ్రాయ రాదు. 

==

తాన తనతనన - తాన తనతనన 

  *తాన తనతనన - తాన తనతనన 

$తాన తనతనన - తాన తనతనన 

  *తాన తనతనన - తాన తనతనన 

తాన తానతన తాన 

(-) అక్షరసామ్య యతి లేక ప్రాసయతి

(*) ముందు పంక్తితో అక్షరసామ్య యతి

($) మొదటి పంక్తితో ద్వితీయాక్షర ప్రాస 

==

వీణ గణగణలు - వాణి పలుకులగు 

  ప్రేమ చిఱునగవు - సోముఁ దళుకులగు 

గాన గమకములు - వాన చినుకులగు 

  కాఱు జలదములు - హారి తనువె యగు 

జ్ఞానసాగరుఁడు వాఁడే 

==

మీన నయనములు - రాణి దశభుజకు 

  మేలి కయిదువులు - కాలుఁ దనయునికి 

వేణు వర రవము - ధేను గణమునకు 

  వేదపురుషునిది - నాదసుధయునగు 

జ్ఞానసాగరుఁడు వాఁడే 

(దశభుజ = పార్వతి, కాలుని తనయుడు కుమారస్వామి)

==

ప్రాణి బ్రతుకు కొక - రాణ చదువులగు 

  భావ మధురతకు - భాష సొగసు నిడు 

దీన జనుల కొక - దీప మతఁడె యగు 

  దేవి చరణములఁ - బూవు యునికి యగు 

జ్ఞానసాగరుఁడు వాఁడే 

==

మానసపు కనులు - మాధవుని కనులు 

  మానసపు ముదము - మాధవుని కరుణ 

ప్రాణ మొక పరుగు - వాని దయ వెలుఁగు 

  భావి కలవరము - పావనము భవము 

జ్ఞానసాగరుఁడు వాఁడే 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



తిరుప్పుగఴ్ ఛందములు - 11 

==

సూత్రము: (తాన తనతనన తాన తనతనన తాన తనతనన తనతాన)2 (159)

==

గాలి సడులిడఁగఁ - జాల సుగమిడుచుఁ - 

    దేలెఁ బరిమళము లిట నీకై 

  కాయములు బడలెఁ - దీయనగు కలలు - 

    వేయి కలుగు నిఁక కను మూయ(న్) 

==

బాల శశివదన - పాలఁ గుడిచి వడి - 

    మేలు పఱుపుపయి పడుకోరా 

  పాట నొకటి కడు - తేట తెనుఁగునను - 

    నోటఁ బలికెదను పసికూనా 

==

వేళ యిది రజని - వ్యాళములు నడచుఁ - 

    బూల తరులతల భయమేలా 

  ప్రేమ కరములను - స్వామి తడవు నిను - 

    నామదియు కరగి హితమాయె(న్)

==

లీలలను వదలి - తూలు కలల వన-

    మాల కదలఁగను హరి లాలీ 

  ప్రీతి తలి కగును - భీతి వెలి యగును - 

    పూఁతవలె ముదములగు లాలీ 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


తిరుప్పుగఴ్ ఛందములు - 12

==

సూత్రము: (తత్త తనతనన తత్త తనతనన తత్త తనతనన తనతానా)2 (1245) 

చివరి తనతానను వదలితే మిగిలినవి సీసపు లక్షణములే! 

==

కచ్చితముగ నిట - ముచ్చటగును మది - 

    వచ్చి కనుము నను వనమాలీ 

  కద్దు హృదయమున - ముద్దు మొగమదియు - 

    వద్దు వదలకుము దయమాలి 

==

వచ్చి కవుఁగిలిని - నచ్చెరువు నిడఁగ - 

    నుచ్చమగును హృది హృదయేశా 

  కప్పురపు కళిక - నిప్పు తగులఁగను - 

    గుప్పుమని వెలుఁగు విధ మీశా 

==

నచ్చితివి మనసు - నిచ్చితిని నిజము - 

    మెచ్చుకొనుము నను మణిహారీ 

  నట్టుఁ గలవెపుడు - గట్టియగు నొరిమ - 

    పట్టుకొని విడువ వలదోయీ 

==

లచ్చలుగ సిరియు - నచ్చముగఁ దమరె - 

    విచ్చు ముదపు విరి హృదయాన 

  లచ్చనము శుభము - లిచ్చలగు శుభము - 

    పచ్చనగు మనికి భువనాన 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వర్ణచ్ఛందములు - 13

స్వాగతము, ద్రుతపదములకు ఒకే లయ

==

xUIUIII - UII UU - స్వాగతా - (నాట్యశాస్త్రము, పింగళ ఛందస్సు)

IIIUIII - UII UU - ద్రుతపద (ముఖర, కలహంస) - జయకీర్తి హేమచంద్రుల ఛందోనుశాసనము

నడక: 8 - 4,4 మాత్రలు

నేను వ్రాసిన అష్టమాత్రా వృత్తములు అను వ్యాసమును చదవండి.

==

స్వాగతము - ర/న/భ/గగ UIU III - UII UU

11 త్రిష్టుప్పు 443

==

స్వాగతమ్ము హరి-చందనగంధీ

రాగరంజితము - రాత్రి సుగంధీ

మూగవోయితిని - మోదము లేదా

రాగిణీ రజని - రమ్యము గాదా

==

నన్ను వీడితివి - న్యాయము లేమో

విన్నవించు మవి - వేగము నేనీ

తెన్ను లేని వని - దిక్కు నెఱుంగన్

వన్నె చిందు హృది - వజ్రమె యేమో

==

ఎంత హాయి మది - యిప్పుడు నాకే

చింత లేదు కడు - చిత్రముగా నా

కింత దగ్గరగ - నిట్టుల నుండన్

సంతసంపు ఝరి - సాఁగెను గాదా

==

ద్రుతపదము - న/భ/జ/య IIIU III - UII UU

12 జగతి 888

==

మనసు పాడ నొక - మంద్ర పదమ్ముం

గనులు వ్రాసె నొక - కావ్యము నీకై

వినఁగ రావు సక - ప్రేమము లేదా

కొనఁగ రమ్ము విరి - గుత్తుల నేన్నో

==

ద్రుతపదమ్ము చెలి - తొందరగా స-

ద్గతులు నిండఁగను - గానము సేతున్

జతగ నీవు కడు - చల్లఁగ నాతోఁ

గృతులఁ బాడ నతి - యిష్టముతో రా

==

మనసు పాడె నొక - మౌనపు రాగ

మ్మనఘ నీకు నిట - నాశల వీణా

స్వనము మ్రోఁగఁగను - వాంఛల తారా

గణము వెల్గె నిఱు - గన్నుల కింపై

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K 


వర్ణచ్ఛందములు - 14

(శ్రీరామనవమికి వ్రాసినది)

==

సూత్రము:

1. తందన తానన తందన తాన

2. తందన తానన తందన తాన

3. తందన తానన తందన తాన

4. తందన తానన తందన తాన

ఇది చతుర్మాత్రలతో ద్విపద.

అన్ని పాదములకు మూడవ గణముతో యతి లేక ప్రాసయతి.

1,2 మఱియు 3,4 పాదములకు అక్షరసామ్య యతి.

1,3 పాదములకు ద్వితీయాక్షర ప్రాస.

తందనలో ఐదు వర్గముల అక్షరములు ఆవర్గముల అనునాసికములతో నుండవలయును.

==

వందిత వీరుని - వంపుల విలును

బందిరిలోఁ గనెఁ - బంకజముఖియు

సుందర రాముని - సొంపగు పతిగ

సుందరి సీతయు - సొంపిలఁ గొనెను

==

సింగపు పీటయు - శృంగము వలదు

సింగము చేసెడు - చిందు సుగమనె

రంగులతో వన - రంగమె గృహము

రంజన మాహృది - ప్రాంగణ మనెను

==

లంకకు నా యక-లంకను గొనిరి

రంకుల రాజు క-ళంకునికొఱకు

కొంకున జానకి - కుందెను నలఁగి

క్రుంగెను మిక్కిలి - కుంపము గలుగ

==

అంజని దేహజుఁ - డంబుజ నయన

నంజలితోఁ గని - యంబుజ నయను

నంజిని నామెకు - నంగుళి నిడుచు

నంబ శిరోమణి - నందెను దొరకు

==

సింధువు దాఁటుచు - చిందుచు బలిమి

చెండుగ నాడిరి - చించి రసురుల

చెందుచు మోదము - సింధుజఁ గనిరి

సింగళ దీవిని - జెంగునఁ గపులు

==

శాంతిగ నేలెను - చంద్రుఁడు ధరను

స్వాంతము సీతకు - సంబర మొసఁగ

క్షాంతిని నేలెఁ బ్ర-శాంతము వెలయఁ

గాంతకుఁ దోడుగఁ - గాంతమొ యనఁగ

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao

వర్ణచ్ఛందములు - 15

==

ఇది తిరుప్పుగఴ్ ఛందము కూడ (1112). 

సూత్రము:

(తత్తతనా తాన  తత్తతనా తాన  తత్తతనా తాన  తనతాన)2

==

ముద్దుగదా చూడ ముద్దకు నా వ్రీడ 

    యిద్ధరపైఁ జాల సొబగేగా 

  ముద్దిడఁగాఁ దీపి ముత్తెములై వాన

    వద్దనునో యేమొ సరికాదో 

==

నిద్దురలో నేల నిత్తెము దానౌను 

    వద్దనునే నాకు జతలేదా 

  నిబ్బరమో నాకు నిచ్చయమై లేదు 

    నిగ్గులతో వేగ మసి సేయు 

==

పద్దెములో నేను బద్ధముగాఁ జేతు 

    ముద్దుగ నాప్రీతి యగుఁ గాదా 

  పగ్గము లేదాయె నెగ్గును లేదాయె 

    సిగ్గును లేదాయెఁ గలలోన 

==

అద్దములో నామె నిద్దముగా రూపు 

    శుద్ధము నాప్రేమ శివమేగా 

  అబ్బుర మీయాశ యగ్గల మీయాశ

    యక్కరతో నామె కనునేమో 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వర్ణచ్ఛందములు - 16 (తేటగీతి పాదము)

==

(తన్న తనతాన తనతాన తన్న తనన)2 

తేటగీతి పాదమును ఒక వర్ణచ్ఛందముగా వ్రాసినాను. 

తన్న = క్షుణ్ణ, నన్ను, అమ్మ వంటి పదములు మాత్రమే 

తనతానలోని గురువు తా బిందు యుక్తముగా లేక సంయుక్తాక్షర పూర్వకముగా నుండరాదు. అది దీర్ఘాక్షరము మాత్రమే. పాద పాదమునకు తేటగీతివలె యతి. రెండు పాదములకు అక్షర సామ్య యతి. నాలుగు పాదములకు ద్వితీయాక్షర ప్రాస. 

==

నిన్ను విడనాడి మనలేను - నన్ను గనుము 

  నెమ్మివలె నాడెఁగద మాన-సమ్ము నిజము 

==

చిన్ని హృదయానఁ జిన యాశ - నిన్ను గనఁగ 

  చెమ్మగిలె నాదు కనుదోయి - చిమ్ము జలగ  

==

వెన్న మది నేఁడు శిల యేమొ - వన్నె తఱిగె 

  విన్నపము నీవు వినలేవొ - తెన్ను నెఱుఁగ 

==

ఎన్ని నడి రాతిరుల నేను - నిన్ను దలఁతు 

  నెన్ని పెనుగాలి నినదాల - నిన్ను వలతు

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



వర్ణచ్ఛందములు - 17

==

ఇది తిరుప్పుగఴ్ ఛందము కూడ (1067).

సూత్రము: (తంద తనన తంద తనన తంద తనన తనతాన)2 (1067)

ఇది కొద్దిగా కష్టతరమైనది.

==

అందములకుఁ జందములకు వంద విరుల సొబగీవా

అంబ కనుల యంబుజముల కింబలరెడు రవి నీవా

==

అందఱిలను ముందుఁ గొలుచు వందితుఁడవు గద దేవా

అంపు కరుణ చంపి వెతల నింపు సుధల గణనాథా

==

తందనముల మందిరమున కందుని యన కన రావా

దంతి ముఖ మనంత మహిమ చింత తొలఁగు సిరి నీవా

==

కొందలముల కుందెద మిట సుందరతర గుణరాశీ

క్రుంగు చెఱచి పొంగు లిడుము గంగగ సురపురవాసీ

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

J K Mohana Rao


వర్ణచ్ఛందములు - 18 (మత్తకోకిల పాదము)

==

సూత్రము: (తాన తందన తాన తందన తాన తందన)2 తన తాననా

తందన = సంకెల, అంగన, చెంచెత, రంజన, జంటలు, పండుగ, చింతలు, నందుడు, సంపద, అంబిక, ఇత్యాదులు. 

==

నాదబిందువు నీవె యందురు - నాదసింధువు నీవెగా 

  నాయకుండవు నీవె యందును - నాకు నండవు నీవెగా 

    కర మీవుగా  

==

మోదమందున ఖేదమందునఁ - బూల గంధము నీవెగా 

  మోదకుండవు బోధకుండవు - మోహనుండవు నీవెగా 

    విరితీవెగా   

==

శోధనంబుల సాధనంబుల - సోయగంబుల నీవెగా 

  సోమసుందర హేమమందిర - చోర, డెందము నీదెగా 

    యిది నీకెగా 

==

కాదనంగను నౌననంగను - గాని బంధము నీవెగా 

  కామ భృంగము కాడె నంగన - గాయముంగన లేవుగా 

    మనలేనుగా 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



వర్ణచ్ఛందములు - 19 (ఉత్సాహ పాదము)

==

తాన తన్న తాన తన్న తాన తన్న తాననా

తన్న: క్షుణ్ణ, విన్ను, రమ్ము, ఇత్యాదులు.

==

మాయ చిమ్ము మాధవమ్ము మానసమ్ము దోచెనే

గాయనమ్ము సేసి నన్ను క్షాళనమ్ము సేతువో

పాయసమ్ము తీపి జున్ను పానకమ్ము నాదెగా

వ్రాయ నిమ్ము పాట లెన్నొ రాజితమ్ముగా సకీ

==

గేయమన్నఁ జాల వన్నె కేళి యన్న హాసమే

గాయమున్న దేహమన్నఁ గాలుచున్న భావమే

కూయు చిన్న కోకిలమ్మ కోమలమ్ము నాచెలీ

దాయు నన్ను ప్రేమ మిన్న దాఁగుమన్న దాఁగదే

(దాయు = సమీపించు)

==

తనన తంద తనన తంద తనన తంద తాననా

తంద: ఇంక, రంగ, కంచు, గంజి, తంట, కుండ, ముంత, సందు, ఇంపు, చెంబు, ఇత్యాదులు.

==

మనమునందు వెలుఁగులెందు మదనుఁడందు దాఁగెనో

వనమునందు విరులె యిందువదనమందుఁ బూచెనో

స్వనమునందు ఝరుల చిందు వలపు విందులాయెనో

కనులముందుఁ గడు పసందు కవుల ఛందమాయెనో

==

ఎఱుపు రంగు కురిసె నింగి యెవరి కంటి తోయమో

కరుగు కాంతి ధరను నింపుఁ గలువ లింక పూయునో

తెరయు దించి రవి చనంగ తిమిరమెందుఁ జూడఁగా

విరహమందుఁ దినఁగ మందు వెలయు బంధ పాశమా

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



వర్ణచ్ఛందములు - 20

==

ఇది తిరుప్పుగఴ్ 303లో తననం దనన తంద - తనతాన (தனனந் தனன தந்த —— தனதான) అని వివరించబడినది. కాని తెలుగుకు సరిపదదు అని నా ఉద్దేశము. కాబట్టి దీనిని తనతంద తనతంద తనతాన అని మార్చినాను.

సూత్రము: తనతంద తనతంద తనతాన.

==

గళమందు గతియందు రవమీవే

కలమందుఁ గరమందు బలమీవే

==

వెలుఁగందు నిరులందు ఛవి నీవే

పిలుపందు వలపందుఁ దలఁపీవే

==

కలకండవలె నుండు రసమీవే

కలలందు విదయందు మతి నీవే

==

తలువంగఁ గొలువంగఁ దగు దేవా

తనువందు మనమందు నెపుడీవే

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు



వర్ణచ్ఛందములు - 21 - మందాకినీవృత్త పాదము

==

మందాకినీ - త/మ/య/ర/త/గ UUIU UUIU - UUIU UUIU

16 అష్టి 17477 

ఆధారము: మందారమరందము 

==

తానాతనా తానందనా - తానాతనా తానందనా

==

బాలామణీ శృంగారమా - భావోదధీ భృంగారమా 

మాలాధరీ మందాకినీ - మాయామయీ ఛందోమణీ 

నీలీల లీకందోయికే - నీకోస మీబంధూకమే 

నాలాలసా నిండార రా - నామోదమే మెండౌనుగా

==

తత్తందనా తానాతనా - తత్తందనా తానాతనా

==

చిత్తంబులో నీకోసమే - సిద్ధుండరా సీతాపతీ 

విత్తంబు లీనాకేలరా - పిత్తంబురా రాగాకృతీ 

ముత్తెంబు లానీమాటలే - ముత్తిం బితా నీవీయరా 

సత్తెంబుగా నాయాశరా - చక్కంగ నీతావీయరా 

==

తానాన తానా తాననా - తానాన తానా తాననా 

==

దేవాధి దేవా పావనా - ధీరాఽతి శూరా భూధరా 

భావాతిరేకా మోదకా - వారీశహారీ దేవరా 

తావేది నాకీ భూమిలోఁ - దాపాన నాకీ బాధలే 

నావైపుఁ జూడో నాయనా - నాదారి నీవే యాశగా 

==

తానాననా తానందనా - తానాననా తానందనా 

==

ఆతారకా హారంబులో - నాదౌరులో నీయందమో 

యేతావులో నీవుంటివో - యేతీరుగా నీవుందువో 

పాతాళమా సారంగమా - పాలేటిలో వైకుంఠమా 

యేతానమో నీదండరా - యీజీవిలో నీవుండరా 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి