3, ఫిబ్రవరి 2022, గురువారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం (21-31)

1.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము

గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

21.1 (ప్రథమ శ్లోకము)

య ఏతాన్ మత్పథో హిత్వా భక్తిజ్ఞానక్రియాత్మకాన్|

క్షుద్రాన్ కామాంశ్చలైః ప్రాణైర్జుషంతః సంసరంతి తే॥13043॥

శ్రీకృష్ణభగవానుడు పలికెను ఉద్ధవా! నేను ఉపదేశించిన మోక్షసాధకములైన భక్తి, జ్ఞాన, కర్మ మార్గములను వీడి చంచలములైన ఇంద్రియములద్వారా క్షుద్రములైన శబ్దాది విషయములను అనుభవించువారు పదేపదే జన్మమృత్యురూపమైన సంసారచక్రమున పరిభ్రమించుచుందురు.

21.2 (రెండవ శ్లోకము)

స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|

విపర్యయస్తు దోషః స్యాదుభయోరేష నిశ్చయః॥13044॥

మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల యందు దృఢమైన నిష్ఠకలిగియుండుటయే గుణము. అందులకు విరుద్ధముగా ఇతర వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట దోషము. సారాంశమేమనగా గుణదోషములయొక్క నిర్ణయము ఆయా వ్యక్తుల అర్హతలనుబట్టి యుండును.

21.3 (మూడవ శ్లోకము)

శుద్ధ్యశుద్ధీ విధీయేతే సమానేష్వపి వస్తుషు|

ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాఽశుభౌ॥13045॥

తాత్త్విక (వాస్తవిక) దృష్టితో చూచినప్పుడు వస్తువులు అన్నియును సమానములే. వాటి ప్రయోజనమును బట్టి, వాటి గుణదోషములు నిర్ణయింపబడును. ద్రవ్యముయొక్క మంచి-చెడులను గురుంచి కలిగిన సందేహముసు నివారించుటకై ఆ ద్రవ్యమును చక్కగా పరిశీలించి నిరీక్షణ-పరీక్షణలద్వారా దాని సహజస్వభావమును గురుంచిన గుణదోషములు, శుభాశుభములు నిగ్గుదేల్చబడును.

21.4 (నాలుగవ శ్లోకము)

ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ|

దర్శితోఽయం మయాఽఽచారో ధర్మముద్వహతాం ధురమ్॥13046॥

పుణ్యపురుషా! ఉద్ధవా! వర్ణాశ్రమ ధర్మానుష్ఠానము శాస్త్రసమ్మతముగా, లోకవ్యవహారమునకు అనుగుణముగా, వ్యక్తులయొక్క జీవనవిధానములకు తోడ్పడునదిగా ఉండవలెను. ధర్మబద్ధముగా జీవించువారికి కలిగే సందేహములను నివారించుటకొరకే ఆచార (ధర్మ)మును నేను మనువుద్వారా తెలిపియుంటిని.

21.5 (ఐదవ శ్లోకము)

భూమ్యంబ్వగ్న్యనిలాకాశా భూతానాం పంచధాతవః|

ఆబ్రహ్మస్థావరాదీనాం శారీరా ఆత్మసంయుతాః॥13047॥

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను పంచమహాభూతములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు గల  సకల శరీరములకును మూలకారణములు. ఇవి అన్నియును శరీరదృష్టితో చూచినప్పుడు సమానములే. వీటియందలి ఆత్మకూడ ఒక్కటే.

21.6 (ఆరవ శ్లోకము)

వేదేన నామ రూపాణి విషమాణి సమేష్వపి|

ధాతుషూద్ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థసిద్ధయే॥13048॥

ఉద్ధవా! పంచమహాభూతములు సమస్తప్రాణి పదార్థములయందును సమానముగనే యున్నవి. లోక వ్యవహారమునకై వాటికి వేదము వేర్వేరు నామరూపములను కల్పించెను.

21.7 (ఏడవ శ్లోకము)

దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమ|

గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణామ్॥13049॥

సాధుసత్తమా! మానవుల కర్మలయందు విశృంఖలప్రవృత్తి ఏర్పడగూడదనియు, నియమాను సారముగా, మర్యాదపూర్వకముగా కర్మలను ఆచరించుట కొరకు దేశము, కాలము, ద్రవ్యము మొదలగు వాటి గురుంచి గుణదోషములను విధించితిని.

21.8 (ఎనిమిదవ శ్లోకము)

అకృష్ణసారో దేశానామబ్రహ్మణ్యోఽశుచిర్భవేత్|

కృష్ణసారోఽప్యసౌవీరకీకటాసంస్కృతేరిణమ్॥13050॥

కృష్ణసారములు (నల్లజింకలు) లేనిదేశమును, ధార్మికప్రవృత్తి లేని దేశమును అపవిత్రమైన దేశముగా భావింపవలెను. ఒకవేళ కృష్ణసారములు ఉన్నను వేదవేత్తలను ఆదరించనిచో ఆ దేశములు అపవిత్రములే యగును. కీకట (కళింగాది) దేశములు అపవిత్రమైనవే. తీర్థయాత్రలకై దప్ప అవి మసలుటకు అర్హములు కావు. సంస్కారరహితములు, మరియు ఊసరక్షేత్రములు గూడ అపవిత్రమైనవే.

(శ్రీ వేదవ్యాసప్రణీతబ శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

1.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము

గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.9 (తొమ్మిదవ శ్లోకము)

కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా|

యతో నివర్తతే కర్మ స దోషోఽకర్మకః స్మృతః॥13051॥

కర్మలు చక్కగా నెరవేరుటకు, అందుకు కావలసిన సామాగ్రి పూర్తిగా లభించుటకు అనువైన కాలమే పవిత్రమైనది. కర్మలను నిర్వహించుటకు తగిన సామాగ్రి లభించునట్టి, ఆగంతుకమైన లేదా సహజమైన దోషములచే కర్మలు కొనసాగనట్టి కాలము అపవిత్రము - - అశుద్ధము అని తెలియవలెను.

21.10 (పదియవ శ్లోకము)

ద్రవ్యస్య శుద్ధ్యశుద్ధీ చ ద్రవ్యేణ వచనేన చ|

సంస్కారేణాథ కాలేన మహత్వాల్పతయాఽథ వా॥13052॥

ద్రవ్యములు, వచనములు, సంస్కారములు, కాలము, అధికము, అల్పము మొదలగువానిని బట్టి పదార్థములయొక్క పవిత్రతను, అపవిత్రతను నిర్ణయింపవలెను.

పాత్రలు జలముచే పవిత్రములగును, మూత్రాదులచే అపవిత్రములగును. ఏదైనను ఒక వస్తువు పవిత్రమైనదా? అపవిత్రమైనదా? అను శంక కలిగినప్పుడు బ్రాహ్మణుడు చెప్పినమీదట అది పవిత్రమగును. లేనిచో అది అపవిత్రమగును. పుష్పాదులపై జలములను చల్లినప్పుడు అవి పవిత్రములగును. వాసన చూచినచో అవి అపవిత్రములగును. అప్పుడే వండిన అన్నము పవిత్రము. చద్దిఅన్నము అపవిత్రము. పెద్దపెద్ద సరోవరములు, నదులు మొదలగు వాటియందలి జలములు పవిత్రములు, చిన్నచిన్న గుంతలలోని నీరు అపవిత్రము.

21.11 (పదకొండవ శ్లోకము)

శక్త్యాశక్త్యాథ వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే|

అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః॥13053॥

దేశకాల, అవస్థాది భేదములను అనుసరించి, శక్తినిబట్టి, అశక్తతనుబట్టి, బుద్ధిబలమునుబట్టి, సంపద్వైభవనములనుబట్టి దోషాదోషభావములు వర్తించును. ఉదాహరణమునకు గ్రహణాదుల సమయమున శక్తిగలవారు స్నానాదులను ఆచరింపకుండుట దోషమగును, శక్తిలేనివారి విషయమున అది దోషముగాదు. పుత్రజన్మాదుల విషయమున తెలిసి జాతాశౌచములను పాటింపకుండుట దోషము, తెలియనప్పుడు అది దోషముగాదు. అట్లే సంపద్వైభవములు కలిగియున్నప్పుడు జీర్ణ మలినాది వస్త్రములను ధరించుట దోషము, నిర్ధనుల విషయమున అది దోషముగాదు. దేశ, కాల, అవస్థాదుల విషయమునగూడ దోషాదోషములు ఇట్లే వర్తించును (ధనికుడు, దరిద్రుడు, బలవంతుడు, దుర్బలుడు, బుద్ధిమంతుడు, మూర్ఖుడు, ఉపద్రవములు, ప్రశాంతతగల దేశములు, యువకులు, వృద్ధులు, ఇత్యాది భేదములనుబట్టిగూడ దోషాదోషముల విచారణ (నిర్ణయము) చేయవలెను.

21.12 (పండ్రెండవ శ్లోకము)

ధాన్యదార్వస్థితంతూనాం రసతైజసచర్మణామ్|

కాలవాయ్వగ్నిమృత్తోయైః పార్థివానాం యుతాయుతైః॥13054॥

ధాన్యములు, కర్రలు, ఏనుగు దంతములు మొదలగు ఎముకలు, దారములు (వస్త్రములు), నెయ్యి, తేనె, ఉప్పు, నూనె మొదలగు రసపదార్థములు, బంగారము, కంచు మొదలగు తైజస వస్తువులు, చర్మవస్తువులు, మట్టి వస్తువులు మొదలగునవి కాలానుగుణముగను, వాయువు, అగ్ని, మట్టి, జలము మొదలగువాటివలన పరిశుద్ధములగును.

ధాన్యాదులు కాలానుగుణముగా, వాయువువలనను, దార్వాది (చెక్కమొదలగు) పాత్రలు, మట్టి, జలములతోడను, గజ దంతాదులు వాయువు, సూర్యరశ్మిచేతను, వస్త్రాదులు జలములవలనను, క్షీరాదులు కాచుటవలనను, బంగారము, కంచు మొదలగు లోహములు అగ్నివలనను, చర్మవస్తువులు తైలముతోను, అన్నము మొదలగు భోజన పదార్థములలో కేశములు వచ్చినప్పుడు వాటిని తీసివేసి, ఆజ్యసంస్కారము జరుపుటవలనను పరిశుద్ధములగును.

21.13 (పదమూడవ శ్లోకము)

అమేధ్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి|

భజతే ప్రకృతిం తస్య తచ్ఛౌచం తావదిష్యతే॥13055॥

అపవిత్ర పదార్థములు అంటినప్పుడు దుర్గంధములు, మాలిన్యములు తొలగిపోయి యథాస్థితికి వచ్చునంతవరకు వాటిని శుభ్రపరచవలెను. అప్పుడవి పవిత్రములగును.

21.14 (పదునాలుగవ శ్లోకము)

స్నానదానతపోఽవస్థా వీర్యసంస్కారకర్మభిః|

మత్స్మృత్యా చాత్మనః శౌచం శుద్ధః కర్మాచరేద్ద్విజః॥13056॥

ద్విజులు (మానవులు) నన్ను (భగవంతుని) స్మరించుచు, చిత్తశుద్ధిని పొంది, స్నానము, దానము, తపస్సు, వయస్సు (కర్మానుష్ఠాన వయస్సు), శక్తి, ఉపనయనాది సంధ్యోపాసనాది సంస్కారములు మున్నగు వాటిని ఆచరింపవలెను. అప్పుడు ఆ కార్యములు పరిశుద్ధములు అగును. అట్లొనర్చిన పిమ్మట ఇతర కార్యములను నిర్వర్తింపవలెను.

21.15 (పదునైదవ శ్లోకము)

మంత్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణమ్|

ధర్మః సంపద్యతే షడ్భిరధర్మస్తు విపర్యయః॥13057॥

గురువుద్వారా ఉపదేశమును పొంది, దాని అర్థపరిజ్ఞానముతో మననము చేసినప్పుడు మంత్రశుద్ధి ఏర్పడును. కర్మములను భగవదర్పణము చేసినప్పుడే అవి పవిత్రములు (సార్థకములు) అగును. ఈవిధముగా దేశము, కాలము, పదార్థము, కర్త, మంత్రము, కర్మలు అను ఆరును శుద్ధమొనర్చుట ధర్మము, దీనికి వ్యతిరేకముగా ఆచరించినచో అవి పరిశుద్ధములుగావు. అట్లు చేయుట అధర్మము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[05:20, 02/11/2021] +91 95058 13235: 2.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము

గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.16 (పదహారవ శ్లోకము)

క్వచిద్గుణోఽపి దోషః స్యాద్దోషోఽపి విధినా గుణః|

గుణదోషార్థనియమస్తద్భిదామేవ బాధతే॥13058॥

ఒక కార్యము గుణయుక్తమే యైనను, శాస్త్రనిషిద్ధమైనప్పుడు అది దోషయుక్తమే యగును. ఒక కార్యము దోషయుక్తమే ఐనను శాస్త్రసమ్మతమైనచో అది గుణమేయగును.

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాఽకార్యవ్యవస్థితౌ|

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి॥

కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (గీత 16/24)

ఈ విధముగా వస్తువుయొక్క లేదా కర్మలయొక్క గుణదోషముల విషయమున నియమములు ఏర్పరచబడినవి. ఏయే నియమములను ఎవరు ఆచరింపవచ్చును, ఎవరు ఆచరింపగూడదు అనునవి గూడ శాస్త్రములయందు నిశ్చయింపబడినవి. వర్ణాశ్రమ వ్యవస్థను దృఢపరచుట కొరకే ఈ గుణదోషముల భేదము కల్పింపబడినది.

21.17 (పదిహేడవ శ్లోకము)

సమానకర్మాచరణం పతితానాం న పాతకమ్|

ఔత్పత్తికో గుణః సంగో న శయానః పతత్యధః॥13059॥

పతితుడు లేదా నిమ్నశ్రేణికి చెందినవ్యక్తి పాపపుపని చేసినచో అది తప్పుకాదు. కాని అదేపని ఒక ఉత్తముడు చేసినచో, అది అపరాధమగును. ఉదాహరణకు నేలమీద పడుకొన్నవానికి క్రిందపడే భయము ఉండదు. గృహస్థునకు భార్యాసంగమ దోషముకాదు. యతీశ్వరునకు స్త్రీసంగము దోషావహము. గృహస్థాశ్రమము కంటె సన్న్యాసము శ్రేష్ఠముగాన ఇట్లు చెప్పబడినది. అట్లే సహజ-స్వభావమైన గుణమునకు తగిన ఆచరణ తప్పుకాదు. అందుకు వ్యతిరేకమైన ఆచరణయే పతనహేతువు అగును.

21.18 (పదునెనిమిదవ శ్లోకము)

యతో యతో నివర్తేత విముచ్యేత తతస్తతః|

ఏష ధర్మో నృణాం క్షేమః శోకమోహభయాపహః॥13060॥

క్రమక్రమముగా విషయసుఖముల నుండి మరలినవాడు ఆయా బంధముల నుండి విముక్తుడగును. నివృత్తిమార్గమును అవలంబించుటయే మానవులకు ధర్మము, క్షేమము. అప్పుడు అతడు  శోకమోహభయముల నుండి బయటపడును.

21.19 (పందొమ్మిదవ శ్లోకము)

విషయేషు గుణాధ్యాసాత్పుంసః సంగస్తతో భవేత్|

సంగాత్తత్ర భవేత్కామః కామాదేవ కలిర్నృణామ్॥13061॥

21.20 (ఇరువదియవ శ్లోకము)

కలేర్దుర్విషహః క్రోధస్తమస్తమనువర్తతే|

తమసా గ్రస్యతే పుంసశ్చేతనా వ్యాపినీ ద్రుతమ్॥13062॥

21.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తయా విరహితః సాధో జంతుః శూన్యాయ కల్పతే|

తతోఽస్య స్వార్థవిభ్రంశో మూర్చ్ఛితస్య మృతస్య చ॥13063॥

శబ్దాది విషయములలో సుఖమున్నదని భావించినవానికి వాటియందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి కారణముగా వాటిని పొందుటకు కోరిక (కాంక్ష) కలుగును. ఆ కోరిక నెరవేరనప్పుడు   పరస్పర కలహములు సంభవించును. కలహకారణముగా దుస్సహమైన క్రోధము జనించును. క్రోధాతిరేకమున తనకు ఏది హితమో? ఏది అహితమో? తెలియని అజ్ఞానస్థితి ఏర్పడును. ఈ అజ్ఞానమువలన కార్యాకార్యములను నిర్ణయించు చేతనాశక్తి (స్మృతి) లోపించును. స్మృతిభ్రంశమగుటవలన మానవత్వము లోపించి పశుత్వము ఏర్పడును. పిదప అతడు తన అస్తిత్వము కోల్పోవును. అప్పుడు అతడు స్పృహలేనివాడగును. లేక మృతప్రాయుడగును. అట్టిస్థితిలో స్వార్థముగాని, పరమార్థముగాని చేకూరదు.

21.22 (ఇరువది రెండవ శ్లోకము)

విషయాభినివేశేన నాత్మానం వేద నాపరమ్|

వృక్షజీవికయా జీవన్ వ్యర్థం భస్త్రేవ యః శ్వసన్॥13064॥

విషయచింత అధికమగుటవలన అతని జీవితము వృక్షమువలె జడమై (చేతనారహితమై) పోవును. అతని శరీరమునందు కొలిమితిత్తియందలి గాలివలె శ్వాసక్రియ జరుగుచుండును. అతనిలో స్వపరజ్ఞానము నశించును. తనను గూర్చిగాని, ఇతరుల గురుంచిగాని ఎరుంగు శక్తియుండదు. ఆ విధముగా అతడు ఆత్మఘాతకుడగును.

21.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఫలశ్రుతిరియం నౄణాం న శ్రేయో రోచనం పరమ్|

శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా భైషజ్యరోచనమ్॥13065॥

తల్లిదండ్రులు పిల్లలకు ఔషధసేవనమునందు ఇష్టము ఏర్పరచుటకై తియ్యని మాటలతోను, లేదా బెల్లము, లడ్డూ మొదలగు మధుర పదార్థములతోను వారిలో సుముఖతను కలిగించి, వారిచే ఔషధసేవనము చేయింతురు. అట్లే వేదాధ్యయనమునందు రుచి (శ్రద్ధ) ఏర్పడుటకై వైదికకర్మలద్వారా స్వర్గప్రాప్తి కలుగునని చెప్పబడినది. అందువలననే స్వర్గకామోయజేత (స్వర్గఫలప్రాప్తికై) యజ్ఞములను వేదాధ్యయనమందు ఏర్పడిన మక్కువ కారణముగా అది శ్రేయోమార్గమునకు ప్రేరకమగును.

21.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఉత్పత్త్యైవ హి కామేషు ప్రాణేషు స్వజనేషు చ|

ఆసక్తమనసో మర్త్యా ఆత్మనోఽనర్థహేతుషు॥13066॥

21.25 (ఇరువది ఐదవ శ్లోకము)

న తానవిదుషః స్వార్థం భ్రామ్యతో వృజినాధ్వని|

కథం యుంజ్యాత్పునస్తేషు తాంస్తమో విశతో బుధః॥13067॥

మానవులకు కర్మలయందును, తమ ప్రాణములపైనను, బంధుమిత్రులయెడలను సహజముగనే ఆసక్తియుండును. అది వారి పతనమునకు హేతువగును. ఈ విధముగా మనుష్యుడు జన్మజన్మాంతర సంస్కారములకు (వాసనలకు) వశుడై స్వప్రయోజనమునుండి భ్రష్టుడగును. పరమార్థ మార్గమునుండి వైదొలగిన ప్రాణి ఇంకను అంధకారములో పడిపోవుటయే జరుగును. అట్లు దారితప్పినవానిని వేదములు సన్మార్గమునందు ప్రవృత్తినిగా జేయుటకు కర్మలఫలశ్రుతిని (స్వర్గప్రాప్తి మొదలగువానిని) తెలిపి, అతనికి శ్రుతులయందు (వేదాధ్యయనమునందు) అభిలాష కలుగునట్లు చేసి, శ్రేయోమార్గమునకు ప్రేరణ గూర్చును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:58, 02/11/2021] +91 95058 13235: 2.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము

గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ఏవం వ్యవసితం కేచిదవిజ్ఞాయ కుబుద్ధయః|

ఫలశ్రుతిం కుసుమితాం న వేదజ్ఞా వదంతి హి॥13068॥

అజ్ఞానులు వేదములలోని అంతరార్థములను ఎరుంగక, కర్మాసక్తులై అందు వర్ణింపబడిన పుష్పములవలె ఆకర్షణీయములైన స్వర్గఫలాదుల ప్రాప్తిని గూర్చి విని, అదియే పరమప్రాప్యమని భావింతురు. ఫలితముగా వారు జనన మరణచక్రములో పరిభ్రమించు చుందురు. కాని వేదజ్ఞులైనవారు (వేదార్థవిదులు) ఇట్లుభావింపరు.

21.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కామినః కృపణా లుబ్ధాః పుష్పేషు ఫలబుద్ధయః|

అగ్నిముగ్ధా ధూమతాంతాః స్వం లోకం న విదంతి తే॥13069॥

విషయవాసనలలో చిక్కుపడిన దీనులు, లోభులు పుష్పములవలె ఆకర్షణీయములైన స్వర్గాదిలోకములనే సర్వస్వమని తలంతురు. అందువలన వారు అగ్నికార్యముల యందే నిమగ్నులై పరమార్థ వివేకమును కోల్పోవుదురు. నిరంతరము అగ్నికార్యరూపములలో అలిసిపోయి, తమఆత్మ (పరమాత్మ) స్వరూపమును తెలిసికొనజాలరు.

21.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

న తే మామంగ జానంతి హృదిస్థం య ఇదం యతః|

ఉక్థశస్త్రా హ్యసుతృపో యథా నీహారచక్షుషః॥13070॥

ఉద్ధవా! ఈ విశ్వముయొక్క ఉత్పత్తికి కారణమైన పరమాత్మ జనుల హృదయములయందే విరాజమానుడై యుండును. కాని, వారు ఈ విషయమును ఎరుగక సకామకర్మలనే అనుష్ఠించు చుందురు. తమ పాలన పోషణలలోనే నిమగ్నులైయుండెడి ఈ మానవులయొక్క కన్నులను చీకటిపొరలు కప్పివేసియుండును.

21.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తే మే మతమవిజ్ఞాయ పరోక్షం విషయాత్మకాః|

హింసాయాం యది రాగః స్యాద్యజ్ఞ ఏవ న చోదనా॥13071॥

21.30 (ముప్పదియవ శ్లోకము)

హింసావిహారా హ్యాలబ్ధైః పశుభిః స్వసుఖేచ్ఛయా|

యజంతే దేవతా యజ్ఞైః పితృభూతపతీన్ ఖలాః॥13072॥

విషయలోలురైన పురుషులకు నా అభిప్రాయము దురవగాహన మగుటచేత మాంసభక్షణకొరకే హింసాప్రవృత్తిని కలిగియుందురు. వారికి పశుహింస యందే ఆసక్తి అధికము. ఈ ప్రవృత్తిని నిరోధించి, వారి విశృంఖలధోరణిని అదుపు చేయుటకు యజ్ఞాచరణ విధానము సూచింపబడినది. హింసాప్రవృత్తిగల ఆ పామరులు తమ ఇంద్రియముల తృప్తికై యజ్ఞములద్వారా దేవతలను, పితృదేవతలను, భూతపతులను, సేవించునెపముతో దొరకిన మూగపశువులను హింసించు చుందురు. వాస్తవముగా వారికి మాంసభక్షణయందు గల ప్రీతియే ఇందులకు కారణము. అట్టివారు కపటులు. హింసాప్రవృత్తిని నిరోధించుటకొరకే యజ్ఞములయందు పశువులను స్పృశించుమనియే వేదములు చెప్పుచున్నవి కాని, వాటిని బలిరూపముగా హింసించుటకు చెప్ఫడములేదు. ఈ మాటను వారు ఒప్పుకోవడములేదు.

21.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

స్వప్నోపమమముం లోకమసంతం శ్రవణప్రియమ్|

ఆశిషో హృది సంకల్ప్య త్యజంత్యర్థాన్ యథా వణిక్॥13073॥

స్వర్గాదిలోకముల సుఖభోగములు, ఐశ్వర్యములు వినుటకు ఇంపుగొల్పునవియేయైనను స్వప్నములవలె అవి అనిత్యములు. అట్టి భోగములను ఆశించిన వ్యక్తులు అధికలాభమునకై ఆశపడిన వ్యాపారి మూలధనమును గూడ పోగొట్టుకొనినట్లు నిజముగా శ్రేయస్కరమైన ఆత్మజ్ఞానమును కోల్పోవుదురు.

21.32 (ముప్పది రెండవ శ్లోకము)

రజఃసత్త్వతమోనిష్ఠా రజఃసత్త్వతమోజుషః|

ఉపాసత ఇంద్రముఖ్యాన్ దేవాదీన్న యథైవ మామ్॥13074॥

సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము స్వభావముగా గలవారు తమతమ గుణములను అనుసరించి క్రమముగా ఇంద్రాదిదేవతలను, యక్షరాక్షసులను, భూతప్రేతగణములను ఉపాసించెదరు. కాని, నన్నుమాత్రము పూజింపరు.

21.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఇష్ట్వేహ దేవతా యజ్ఞైర్గత్వా రంస్యామహే దివి|

తస్యాంత ఇహ భూయాస్మ మహాశాలా మహాకులాః॥13075॥

21.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

ఏవం పుష్పితయా వాచా వ్యాక్షిప్తమనసాం నృణామ్|

మానినాం చాతిస్తబ్ధానాం మద్వార్తాపి న రోచతే॥13076॥

వారు ఈవిధముగా ఊహించెదరు. 'మేము ఈ లోకమున యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించినచో మాకు స్వర్గము లభించును. అచట దివ్యభోగములను అనుభవించెదము. అనంతరము ఉత్తమ కులములలో జన్మింతుము, విలాసవంతములైన హర్మ్యములలో  మా కుటుంబములతో హాయిగా జీవించెదము'. ఈ విధముగా ఆకర్షణీయమగు పగటి కలలలో తేలియాడుచు మోహితులగుచుందురు. అట్టి అహంభావముగల దురభిమానులకు నా విషయమే రుచింపదు. వారు సంసారలంపటులై అందులోనే కొట్టుమిట్టాడుచుందురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

3.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము

గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
21.35 (ముప్పది ఐదవ శ్లోకము)

వేదా బ్రహ్మాత్మవిషయాస్త్రికాండవిషయా ఇమే|

పరోక్షవాదా ఋషయః పరోక్షం మమ చ ప్రియమ్॥13077॥

ఉద్ధవా! వేదములయందు 'కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండము' అను మూడు కాండములు గలవు. వీటిద్వారా ఆత్మపరమాత్మలయొక్క ఏకత్వము అనగా సకల ప్రాణులలో అంతరాత్మగా నున్న పరబ్రహ్మ విషయము ప్రతిపాదింపబడినది. వేదమంత్రములు, మంత్రద్రష్టలైన ఋషులు ఈ విషయములను స్పష్టముగా పేర్కొనక గుప్తభావముతో పేర్కొనిరి. నాకును ఈ విషయములు గోప్యముగా ఉంచుటయే ఇష్టము. ఏలయన అంతఃకరణశుద్ధిగలవారు మాత్రమే ఈ విషయములను తెలిసికొనుటకు అర్హులు.

21.36 (ముప్పది ఆరవ శ్లోకము)

శబ్దబ్రహ్మ సుదుర్బోధం ప్రాణేంద్రియమనోమయమ్|

అనంతపారం గంభీరం దుర్విగాహ్యం సముద్రవత్॥13078॥

వేదములనగా శబ్దబ్రహ్మ. అవి నా స్వరూపమే. అందువలన వాటి రహస్యములను తెలిసికొనుట అత్యంతక్లిష్టము. ఆ శబ్దబ్రహ్మ పరా, పశ్యంతీ, మధ్యమా, వాణీ రూపములలో ప్రాణమయము, మనోమయము, ఇంద్రియమయముగా నుండును. సముద్రమువలె అది అనంతమైనది. అపారమైనది, గంభీరమైనది. దాని లోతులు తెలిసికొనుట అసాధ్యము. గొప్ఫ గొప్ప విద్వాంసులు సైతము దాని పరమార్థములను స్పష్టముగా వివరింపజాలరు.

21.37 (ముప్పది ఏడవ శ్లోకము)

మయోపబృంహితం భూమ్నా బ్రహ్మణానంతశక్తినా|

భూతేషు ఘోషరూపేణ బిసేషూర్ణేవ లక్ష్యతే॥13079॥

ఉద్ధవా! నేను అనంతమైన జ్ఞానము, వీర్యము, తేజస్సు మొదలగు శక్తులతో విరాజిల్లుచుందును. పరబ్రహ్మ స్వరూపుడనైన నేనే వేదవాణిని విస్తరింపజేసితిని. తామరకాడలలో తంతువువలె ప్రాణములయొక్క అంతఃకరణములయందు అనాహత నాదరూపములో ఈ వేదవాణి ప్రకటితమగుచుండును (చెవులు మూసికొనినప్పుడు వినబడు అనాహతమే ప్రాణఘోష).

21.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

యథోర్ణనాభిర్హృదయాదూర్ణాముద్వమతే ముఖాత్|

ఆకాశాద్ఘోషవాన్ ప్రాణో మనసా స్పర్శరూపిణా॥13080॥

21.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఛందోమయోఽమృతమయః సహస్రపదవీం ప్రభుః|

ఓంకారాద్వ్యంజితస్పర్శస్వరోష్మాంతస్థభూషితామ్॥13081॥

21.40 (నలుబదియవ శ్లోకము)

విచిత్రభాషావితతాం ఛందోభిశ్చతురుత్తరైః|

అనంతపారాం బృహతీం సృజత్యాక్షిపతే స్వయమ్॥13082॥

ప్రతిప్రాణియొక్క హృదయాకాశమునందు అనాహత నాదరూపమున ప్రాణఘోష అభివ్యక్తమగును. ఆ ప్రాణము మనస్సుద్వారా స్పర్శాది వర్ణరూపమున బయటికి వెలువడును. అ నుండి మ వరకుగల సకలవర్ణములు ఓంకారము నుండి ఉత్పన్నములగుచున్నవి. స్థానభేదములను బట్టి వాటి స్పర్శములు, స్వరములు, ఊష్మములు, అంతస్థములు అను పేర్లు ఏర్పడినవి. సాలెపురుగు తన నోటిద్వారా పోగులను బయటికి వెలువరించి, మరల లోనికి తీసికొనినట్లు వేదమయుడనైన నేను ఓంకారమునుండియే వేలకొలది శబ్దములను ఉత్పన్నము  చేయుదును. మరల వాటిని నాలో లీనమొనర్చుకొందును. ఈ విధముగా వేదవాణి నా స్వరూపమే. ఈ వాణి హృద్గతమైన సూక్ష్మమగు ఓంకారము ద్వారా అభివ్యక్తమైన స్పర్శములు ( క నుండి మ వఱకుగల ఇరువది ఐదు అక్షరములు), స్వరములు ( అ నుండి ఔ వరకు గల తొమ్మిది ఊష్మములు (శ, ష, స, హ), అంతస్థములు (య, ర, ల, వ) అను వర్ణములతో విభూషితమైయున్నది. అందులో ఉత్తరోత్తరముగా నాలుగు వర్ణములు అధికమగుచుండును. వాటిద్వారా విచిత్రభాషా రూపములలో అది (వేదనాడి) విస్తృతమైయున్నది.

21.41 (నలుబది ఒకటవ శ్లోకము)

గాయత్ర్యుష్ణిగనుష్టుప్ చ బృహతీ పంక్తిరేవ చ|

త్రిష్టుబ్జగత్యతిచ్ఛందో హ్యత్యష్ట్యతిజగద్విరాట్॥13083॥

నాలుగు వర్ణములకు అధికముగాగల ఛందస్సులు కొన్ని - గాయత్రి,ఉష్ణిక్, అనుష్టుప్, బృహతీ, పంక్తి, త్రిష్టుప్, జగతీ, అతిచ్ఛందము, అత్యష్టి, అతిజగతీ, విరాట్ అని చెప్పబడినది.

21.42 (నలుబది రెండవ శ్లోకము)

కిం విధత్తే కిమాచష్టే కిమనూద్య వికల్పయేత్|

ఇత్యస్యా హృదయం లోకే నాన్యో మద్వేద కశ్చన॥13084॥

వేదవాణిద్వారా - కర్మకాండమునందు ఏఏ కర్మల విధానమునుగూర్చి వివరింపబడినది? ఉపాసనాకాండములో ఏఏ దేవతలను ఉపాసించుటగూర్చి వర్ణింపబడినది? జ్ఞానకాండములో ప్రతీతములగు వేటిని అనుసరించి, ఇదికాదు, ఇదికాదని వేటిని నిషేధించి చెప్పబడినది? అనునిట్టి విషయములను గూర్ఛిన వేదవాక్కులయందలి రహస్యములను నేను  తప్ప వేరెవ్వరునూ ఎరుగరు.

21.43 (నలుబది మూడవ శ్లోకము)

మాం విధత్తేఽభిధత్తే మాం వికల్ప్యాపోహ్యతే త్వహమ్|

ఏతావాన్ సర్వవేదార్థః శబ్ద ఆస్థాయ మాం భిదామ్|

మాయామాత్రమనూద్యాంతే ప్రతిషిధ్య ప్రసీదతి॥13085॥

వేదము కర్మకాండలో యజ్ఞాదులద్వారా నన్నే వర్ణించుచున్నది. ఉపాసనా కాండలో వేర్వేఱు దేవతలరూపములో నన్నే పేర్కొను చున్నది. జ్ఞానకాండలో నాకంటె వేరైన వస్తువులను వర్ణించి, నేతి-నేతి - ఇది కాదు, ఇదికాదు అను వాక్యములలో ఇతరములైన వాటిని నిషేధించుచున్నది. ఈ విధముగా వేదము అన్ని కాండలలో  నన్నే సూచించుచు నన్నే వేర్వేరు రీతులలో వర్ణించుచున్నది. ఇదియంతయును మాయయే. చివరకు 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని పేర్కొనుచున్నది.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము అను ఇరువది ఒకటవ అధ్యాయము (21)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

3.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్ధవ ఉవాచ

22.1 (ప్రథమ శ్లోకము)

కతి తత్త్వాని విశ్వేశ సంఖ్యాతాన్యృషిభిః ప్రభో|

నవైకాదశ పంచ త్రీణ్యాత్థ త్వమిహ శుశ్రుమ॥13086॥

22.2 (రెండవ శ్లోకము)

కేచిత్షడ్వింశతిం ప్రాహురపరే పంచవింశతిమ్|

సప్తైకే నవ షట్కేచిచ్చత్వార్యేకాదశాపరే|

కేచిత్సప్తదశ ప్రాహుః షోడశైకే త్రయోదశ॥13087॥

ఉద్ధవుడు పలికెను ప్రభూ! విశ్వేశ్వరా! మహర్షులు తెలిపిన తత్త్వములసంఖ్య ఎంత? నీవు ఇంతకుముందు (పందొమ్మిదవఅధ్యాయములో) తొమ్మిది, పదకొండు, ఐదు, మూడు వెరసి ఇరువది ఎనిమిది అని తెలిపియుంటివి. కానీ, కొందరు వాటిసంఖ్య ఇఱువది ఆఱు అనియు, మరికొందరు ఇరువది ఐదు అనియు, ఇంకొక కొందరు ఏడు, తొమ్మిది, ఆరు అనియు పేర్కొనిరి. ఒకరు నాలుగు అనియు, వేరొకరు పదకొండు అనియు తెలిపిరి.

22.3 (మూడవ శ్లోకము)

ఏతావత్త్వం హి సంఖ్యానామృషయో యద్వివక్షయా|

గాయంతి పృథగాయుష్మన్నిదం నో వక్తుమర్హసి॥13088॥

ఇదేవిధముగా కొంతమంది ఋషులు పదునేడు అనియు, కొందరు పదునారు అనియు, మరికొందరు పదమూడు అనియు అభిప్రాయపడిరి. పురాణపురుషా! వేర్వేరు ఋషులు తత్త్వముల సంఖ్యను భిన్నభిన్నములుగా తెలిపిరి. వారు ఏ దృష్టితో ఇట్లు తెలిపియుండిరో, నీవు మాకు విశదపరచుము.

శ్రీభగవానువాచ

22.4 (నాలుగవ శ్లోకము)

యుక్తం చ సంతి సర్వత్ర భాషంతే బ్రాహ్మణా యథా|

మాయాం మదీయాముద్గృహ్య వదతాం కిం ను దుర్ఘటమ్॥13089॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను  ఉద్ధవా! వేదజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ విషయమున చెప్పినదంతయు సత్యమే. ఏలయన, తత్త్వములు అన్నియును వాటిలోనే అంతర్భూతములు. నా మాయను స్వీకరించి చెప్పుటకు ఏది అసంభవమగును?

22.5 (ఐదవ శ్లోకము)

నైతదేవం యథాత్థ త్వం యదహం వచ్మి తత్తథా|

ఏవం వివదతాం హేతుం శక్తయో మే దురత్యయాః॥13090॥

జగదుత్పత్తికి కారణమైన సత్త్వరజస్తమోగుణములయొక్క, వాటి వృత్తులయొక్క రహస్యములను జనులు అవగాహన చేసికొనుట కష్టము. కావున వారు తమకు తోచిన (స్ఫురించిన) రీతిగా 'నీవు తెలుపుచున్నది సరికాదు. నేను పలుకుచున్నదే యథార్థము' అని వాదవివాదములకు దిగెదరు.

22.6 (ఆరవ శ్లోకము)

యాసాం వ్యతికరాదాసీద్వికల్పో వదతాం పదమ్|

ప్రాప్తే శమదమేఽప్యేతి వాదస్తమనుశామ్యతి13091॥

సత్త్వాదిగుణముల క్షోభవలననే వివిధ కల్పనారూపమైన జగత్తు వ్యక్తమైనది. అందువలననే ఇట్టి వాదవివాదములు ఏర్పడినవి. బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములు వశమైనప్పుడు చిత్తము ప్రశాంతమగును. అంతట ఈ భేదబుద్ధియు తొలగిపోయి వివాదములు శాంతించును.

22.7 (ఏడవ శ్లోకము)

పరస్పరానుప్రవేశాత్తత్త్వానాం పురుషర్షభ|

పౌర్వాపర్యప్రసంఖ్యానం యథా వక్తుర్వివక్షితమ్13092॥

మహాత్మా! తత్త్వములు ఒకదానిలో మరియొకటి అనుప్రవిష్టములై యున్నవి. కావున కారణములను కార్యములయందును, కార్యములను కారణములయందు కలుపుటవలన జనులు తత్త్వముల సంఖ్యను తమ ఇష్టానుసారముగా పేర్కొనిరి.

22.8 (ఎనిమిదవ శ్లోకము)

ఏకస్మిన్నపి దృశ్యంతే ప్రవిష్టానీతరాణి చ|

పూర్వస్మిన్ వా పరస్మిన్ వా తత్త్వే తత్త్వాని సర్వశః॥13093॥

కారణతత్త్వమునందు కార్యతత్త్వము సూక్ష్మరూపములో మృత్తునందు (మట్టియందు) ఘటము (కుండ) వలె ప్రవేశించినట్లును, అట్లే కార్యతత్త్వమునందు కారణతత్త్వము ఘటమునందు (కుండయందు) మట్టివలె కనబడుచున్నది.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

[05:27, 04/11/2021] +91 95058 13235: 4.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.9 (తొమ్మిదవ శ్లోకము)

పౌర్వాపర్యమతోఽమీషాం ప్రసంఖ్యానమభీప్సతామ్|

యథా వివిక్తం యద్వక్త్రం గృహ్ణీమో యుక్తిసంభవాత్॥13094॥

ఏయే కార్యములను కారణములయందును, అట్లే ఏయే కారణములను కార్యములయందును అంతర్భూతములై యున్నట్లు భావించి, తత్త్వములసంఖ్య ఎంతని   పరిగణించుట జరిగినదో, అవి అన్నియును యుక్తియుక్తము లగుటవలన అన్నింటిని స్వీకరించెదము. అవి అన్నియును హేతుబద్ధము లగుటవలన సత్యములే.

22.10 (పదియవ శ్లోకము)

అనాద్యవిద్యాయుక్తస్య పురుషస్యాత్మవేదనమ్|

స్వతో న సంభవాదన్యస్తత్త్వజ్ఞో జ్ఞానదో భవేత్॥13095॥

అనాదికాలము నుండియు జీవుడు అజ్ఞాని. దేహాత్మభావముతో గ్రస్తుడైయున్నందున అతడు స్వయముగా తనను తాను తెలిసికొనజాలడు. అతనికి ఆత్మజ్ఞానము కలిగించుటకు మరియొక సర్వజ్ఞుని అవసరము ఎంతేని గలదు. కనుక, ప్రకృతియొక్క కార్యకారణరూపములైన ఇరువది నాలుగు తత్త్వములు, ఇరువదియైదవ తత్త్వమైన పురుషుడు, ఇరువది ఆరవ తత్త్వమైన పరమేశ్వరుడు వెరసి తత్త్వములసంఖ్య ఇరువది ఆరు  అని కొందరు భావించిరి.

22.11 (పదకొండవ శ్లోకము)

పురుషేశ్వరయోరత్ర న వైలక్షణ్యమణ్వపి|

తదన్యకల్పనాపార్థా జ్ఞానం చ ప్రకృతేర్గుణః॥13096॥

జీవేశ్వరుల మధ్య అణుమాత్రమైనను భేదములేదు. కావున వాటియందు భేదమును కల్పించుట వ్యర్థము. ఇంక జ్ఞానము   ప్రకృతియొక్క లక్షణము. కావున జ్ఞానమును వేరుగా (ప్రత్యేకతత్త్వముగా) స్వీకరించుటకు వీలులేదు. ఈ విధముగా ఇరువదినాలుగు జడతత్త్వములు, చేతనతత్త్వమైన పురుషుడు కలిసి మొత్తము ఇరువది ఐదు తత్త్వములని కొందరి భావన.

22.12  (పండ్రెండవ శ్లోకము)

ప్రకృతిర్గుణసామ్యం వై ప్రకృతేర్నాత్మనో గుణాః|

సత్త్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంతహేతవః॥13097॥

22.13 (పదమూడవ శ్లోకము)

సత్త్వం జ్ఞానం రజః కర్మ తమోఽజ్ఞానమిహోచ్యతే|

గుణవ్యతికరః కాలః స్వభావః సూత్రమేవ చ॥13098॥

సత్త్వరజస్తమో గుణములయొక్క సామ్యావస్థయే (అనగా అవి క్షోభకు గురి కానప్పటి స్థితియే) ప్రకృతి స్వరూపము. కనుక ఆ త్రిగుణములు ప్రకృతికి చెందినవి. ఆత్మకు చెందినవి కావు. వాటిద్వారానే ఉత్పత్తి, స్థితి, ప్రళయములు కలుగుచున్నవి. అందువలన జ్ఞానము ఆత్మయొక్క గుణము కాదనియు, ప్రకృతియొక్క గుణమనియు తెలియుచున్నది. సత్త్వగుణము జ్ఞానస్వరూపము అనియు, రజోగుణము కర్మస్వరూప మనియు, తమోగుణము అజ్ఞానమనియు తెలియనగును. ఈ త్రిగుణములకు క్షోభను కలిగించువాడే కాలపురుషుడైన భగవంతుడు. అతడే సూత్రాత్మయైన మహత్తత్త్వము. అందువలన తత్త్వముల సంఖ్య ఇరువది ఐదు అనుటయు, ఇరువది ఆరు అనుటయు యుక్తి సంగతమే.

22.14 (పదునాలుగవ శ్లోకము)

పురుషః ప్రకృతిర్వ్యక్తమహంకారో నభోఽనిలః|

జ్యోతిరాపః క్షితిరితి తత్త్వాన్యుక్తాని మే నవ॥13099॥

22.15 (పదిహేనవ శ్లోకము)

శ్రోత్రం త్వగ్దర్శనం ఘ్రాణో జిహ్వేతి జ్ఞానశక్తయః|

వాక్పాణ్యుపస్థపాయ్వంఘ్రిః కర్మాణ్యంగోభయం మనః॥13100॥

22.16 (పదహారవ శ్లోకము)

శబ్దః స్పర్శో రసో గంధో రూపం చేత్యర్థజాతయః|

గత్యుక్త్యుత్సర్గశిల్పాని కర్మాయతనసిద్ధయః॥13101॥

పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వము, అహంకారము, ఆకాశము, వాయువు, తేజస్సు (అగ్ని), జలము, భూమి - అను తొమ్మిది తత్త్వములను ఇంతకుముందే నేను పేర్కొనియుంటిని. 'చెవి, చర్మము, నేత్రము, నాసిక, నాలుక' అను ఐదును జ్ఞానేంద్రియములు. అట్లే వాక్కు, పాణి (చేయి), పాదము, గుహ్యప్రదేశము, జననేంద్రియము - అను ఐదును కర్మేంద్రియములు. అట్లే మనస్సు అంతరింద్రియము. ఈ పదకొండు ఇంద్రియములుగాక, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము - అను ఐదు జ్ఞానేంద్రియములయొక్క విషయములు. ఈ విధముగా 3 + 9 + 11 + 5 = 28 తత్త్వములు. కర్మేంద్రియములద్వారా జరుగు కర్మలు నడచుట, మాట్లాడుట, మలమూత్రములను విసర్జించుట, పనులను చేయుట, అను ఐదును కర్మేంద్రియముల యొక్క కార్యములు. ఇవి తత్త్వముల సంఖ్యలో చేరవు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:27, 04/11/2021] +91 95058 13235: 🌹🌹🌹శ్రేయోభిలాషులైన గురుతుల్యులకు, మిత్రులకు, సన్నిహితులకు దీపావళి శుభాకాంక్షలు💐💐💐

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
[21:22, 04/11/2021] +91 95058 13235: 4.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.17 (పదిహేడవ శ్లోకము)

సర్గాదౌ ప్రకృతిర్హ్యస్య కార్యకారణరూపిణీ|

సత్త్వాదిభిర్గుణైర్ధత్తే పురుషోఽవ్యక్త ఈక్షతే॥13102॥

సృష్ట్యాదియందు కార్యకారణ రూపమున, ప్రకృతియే యుండెను (కార్యములు అనగా పదకొండు ఇంద్రియములు, పంచమహాభూతములు, కారణములు, మహత్తత్త్వాదులు). ఈ ప్రకృతియే సత్త్వరజస్తమోగుణముల సహాయమున జగత్తుయొక్క ఉత్పత్తి, స్థితి, సంహారములకు సంబంధించిన దశలను వహించును. అవ్యక్త పురుషుడు (పరమేశ్వరుడు) ప్రకృతికిని, దాని దశలకును కేవలము సాక్షీభూతుడుగా ఉండును.

22.18 (పదునెనిమిదవ శ్లోకము)

వ్యక్తాదయో వికుర్వాణా ధాతవః పురుషేక్షయా|

లబ్ధవీర్యాః సృజంత్యండం సంహతాః ప్రకృతేర్బలాత్॥13103॥

ప్రకృతియొక్క వికారములైన మహత్తత్త్వాదులు పురుషుని (భగవంతుని) దృష్టి ప్రసారముచేత శక్తిని పొంది, పరస్పరము కలిసిపోవును. పిమ్మట అవి ప్రకృతిని ఆశ్రయించి, దాని బలమువలన బ్రహ్మాండమును సృష్టించును. అనగా పరమేశ్వరుని దృష్టిప్రసారముచేతనే ప్రకృతి సకలకార్యములను నెరవేర్చుచున్నది.

22.19 (పందొమ్మిదవ శ్లోకము)

సప్తైవ ధాతవ ఇతి తత్రార్థాః పంచ ఖాదయః|

జ్ఞానమాత్మోభయాధారస్తతో దేహేంద్రియాసవః॥13104॥

ఉద్ధవా! తత్త్వముల సంఖ్య ఏడు అని భావించువారు 'పృథివి, జలము, అగ్ని, వాయు, ఆకాశము' అను పంచమహాభుతములను, జీవుని, జీవునకు, జగత్తునకు అధిష్ఠాతయైన పరమాత్మను పరిగణనలోనికి తీసికొందురు (దేహ - ఇంద్రియ - ప్రాణాదుల ఉత్పత్తి పంచమహాభూతముల నుండియే జరుగుచున్నది గావున వారు వాటిని ప్రత్యేక తత్త్వములుగా పేర్కొనరు). 

22.20 (ఇరువదియవ శ్లోకము)

షడిత్యత్రాపి భూతాని పంచ షష్ఠః పరః పుమాన్|

తైర్యుక్త ఆత్మసంభూతైః సృష్ట్వేదం సముపావిశత్॥13105॥

'కొందరు పంచమహాభూతములు, పరమపురుషుడైన పరమాత్మ' అను   ఆరు తత్త్వములను మాత్రమే గుర్తింతురు. ఏలయన, పరమాత్మ తాను రచించిన పంచమహా భూతములతో కూడి దేహాదులను సృష్టించును. పిమ్మట జీవరూపమున వాటిలో ప్రవేశించును. అందువలన తత్త్వములు ఆరు మాత్రమే.

22.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

చత్వార్యేవేతి తత్రాపి తేజ ఆపోఽన్నమాత్మనః|

జాతాని తైరిదం జాతం జన్మావయవినః ఖలు॥13106॥

తత్త్వముల సంఖ్య నాలుగు అని పేర్కొనువారు ఆత్మనుండి తేజస్సు, జలము, పృథ్వి ఉత్పన్నములగుచున్నవి. జగత్తునందలి పదార్థములన్నియును వీటినుండియే ఏర్పడుచున్నవి, అన్ని కార్యములును వీటినుండియే ఏర్పడుచున్నవి. అన్ని కార్యములును వీటియందే మిళితములై యున్నవి. కనుక తత్త్వములు నాలుగు మాత్రమే అందురు.

22.22 (ఇరువది రెండవ శ్లోకము)

సంఖ్యానే సప్తదశకే భూతమాత్రేంద్రియాణి చ|

పంచ పంచైకమనసా ఆత్మా సప్తదశః స్మృతః॥13107॥

కొందరు పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, ఆత్మ అను పదునేడింటిని మాత్రమే తత్త్వములుగా గుర్తింతురు. కావున వారి దృష్టిలో 'తత్త్వములు పదునేడు' మాత్రమే.

22.23 (ఇరువది మూడవ శ్లోకము)

తద్వత్షోడశసంఖ్యానే ఆత్మైవ మన ఉచ్యతే|

భూతేంద్రియాణి పంచైవ మన ఆత్మా త్రయోదశ॥13108॥

మరికొందరు ఆత్మయందు మనస్సుగూడ మిళితమైయున్నందున మనస్సును ప్రత్యేక తత్త్వముగా గుర్తింపరు. కనుక, వారి అభిప్రాయములో పంచమహా భూతములు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియములు, ఆత్మ అను   తత్త్వములు 'పదునారు' అని చెప్పగా, వేరొకకొందరు ఆకాశాది పంచమహాభూతములు, శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియములు, మనస్సు, జీవాత్మ, పరమాత్మ అను వాటిని మాత్రమే తత్త్వములుగా పరిగణింపవలెననియు, అందువలన 'తత్త్వములు పదమూడు మాత్రమే' అనియు తెలుపుదురు.

22.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేంద్రియాణి చ|

అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చ నవేత్యథ॥13109॥

ఆత్మ, పంచమహాభూతములు, పంచ జ్ఞానేంద్రియములు అనునవి మాత్రమే తత్త్వములనియు, కనుక వాటి సంఖ్య 'పదకొండు' మాత్రమే అనియు కొందరు భావింతురు. మరికొందరు ఆకాశాది పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది  ప్రకృతులు, మరియు పురుషుడు అను  'తొమ్మిదింటిని' మాత్రమే తత్త్వములని నుడువుదురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[06:06, 05/11/2021] +91 95058 13235: 5.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఇతి నానాప్రసంఖ్యానం తత్త్వానామృషిభిః కృతమ్|

సర్వం న్యాయ్యం యుక్తిమత్త్వాద్విదుషాం కిమశోభనమ్॥13110॥

ఉద్ధవా! ఈ విధముగా మహర్షులు వేర్వేరురీతులలో తత్త్వముల సంఖ్యలను పేర్కొనిరి. అందఱి అభిప్రాయములు న్యాయసమ్మతములే, యుక్తియుక్తములే. వీరు  అందరును తత్త్వజ్ఞానులేగాన, వీరిలో ఎవరి వాదమునూ తప్పు అని చెప్పుటకు వీలులేదు. అందరి వాదములును సముచితములైనవే.

ఉద్ధవ ఉవాచ

22.26 (ఇరువది ఆరవ శ్లోకము)

ప్రకృతిః పురుషశ్చోభౌ యద్యప్యాత్మవిలక్షణౌ|

అన్యోన్యాపాశ్రయాత్కృష్ణ దృశ్యతే న భిదా తయోః|

ప్రకృతౌ లక్ష్యతే హ్యాత్మా ప్రకృతిశ్చ తథాఽఽత్మని॥13111॥

ఉద్ధవుడు పలికెను కృష్ణా! స్వరూపములనుబట్టి ప్రకృతి, పురుషుడు అను రెండును సర్వదా ఒకటి మరియొక దానికంటె వేరైనను, అవి పరస్పరము కలసిపోవుటవలన వాటి భేదమును  గుర్తించుటకు వీలుపడదుకదా. ప్రకృతియందు పురుషుడు, పురుషునియందు ప్రకృతి అభిన్నముగా ప్రతీతమగుచున్నవి. వీటి భిన్నత్వమును గూర్చి విశదపఱుచుము.

22.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఏవం మే పుండరీకాక్ష మహాంతం సంశయం హృది|

ఛేత్తుమర్హసి సర్వజ్ఞ వచోభిర్నయనైపుణైః॥13112॥

కమలనయనా! వీటియొక్క భిన్నత్వ - అభిన్నత్వములను గూర్చి నాలో తీరని సందేహము గలదు. సర్వజ్ఞుడవైన నీవు మాత్రమే నా సందేహమును సహేతుకములైన వచనములద్వారా నివారింపగలవు.

22.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తేఽత్ర శక్తితః|

త్వమేవ హ్యాత్మమాయాయా గతిం వేత్థ న చాపరః॥13113॥

ప్రభూ! నీ అనుగ్రహమువలననే నీ విద్యాశక్తిద్వారా జీవులకు జ్ఞానము లభించుచున్నది. నీ మాయాశక్తి ప్రభావమున వారి జ్ఞానము లుప్తమగుచున్నది. నీ జ్ఞానము పరిపూర్ణమైనది. ఇతరుల జ్ఞానము సంకుచితమైనది. విచిత్రమైన నీ మాయయొక్క యథార్థగతిని నీవే ఎఱుంగుదువు. నీ మాయామోహితులైనవారు (ఇతరులు) దాని వాస్తవస్థితిని తెలిసికొనజాలరు. కనుక నా సందేహమును తీర్చుటకు నీవు మాత్రమే సమర్థుడవు.

శ్రీభగవానువాచ

22.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ప్రకృతిః పురుషశ్చేతి వికల్పః పురుషర్షభ|

ఏష వైకారికః సర్గో గుణవ్యతికరాత్మకః॥13114॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను ఉద్ధవా! పురుషశ్రేష్ఠా! ప్రకృతి, పురుషులు - అను ఈ రెండింటిలో మిక్కిలి భేదము గలదు. పురుషుడు  పరమాత్మయొక్క అంశమగుటచే అవికారి - ఎట్టి వికారములు లేనివాడు. ప్రకృతి గుణముల మేళవింపుతో ఏర్పడుటవలన అది వికారి అని చెప్పబడినది.

22.30 (ముప్పదియవ శ్లోకము)

మమాంగ మాయాగుణమయ్యనేకధా వికల్పబుద్ధీశ్చ గుణైర్విధత్తే|

వైకారికస్త్రివిధోఽధ్యాత్మమేకమథాధిదైవమధిభూతమన్యత్॥13115॥

మిత్రమా! ఉద్ధవా! నా మాయ త్రిగుణాత్మకము. అది తన సత్త్వరజస్తమో గుణముల ద్వారా వివిధములైన వృత్తులను ఉత్పన్న మొనర్చుచున్నది. దీని విస్తృతి అనంతమైనను, వికారాత్మకమైన (పరిణామశీలమైన) ఈ సృష్టిని అధ్యాత్మ, అధిదైవ, అధిభూతములు అని మూడు భాగములుగా గుర్తింపవచ్చును.

22.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

దృగ్ రూపమార్కం వపురత్ర రంధ్రే పరస్పరం సిధ్యతి యః స్వతః ఖే|

ఆత్మా యదేషామపరో య ఆద్యః స్వయానుభూత్యాఖిలసిద్ధసిద్ధిః|

ఏవం త్వగాది శ్రవణాది చక్షుర్జిహ్వాది నాసాది చ చిత్తయుక్తమ్॥13116॥

ఉదాహరణమునకు నేత్రేంద్రియము అధ్యాత్మము, దాని విషయమైన రూపము అధిభూతము. నేత్రగోళమునందు ఉన్న సూర్యాంశ (సూర్యునియొక్క అంశ) అధిదైవము. ఈ మూడును ఒకదానితో వేరొకటి కలియుటవలన కార్యము సిద్ధించును. కనుక అధ్యాత్మ - అధిదైవ - అధిభూతములు మూడును ఒకదాని సహాయము మరియొకటి అపేక్షించుచుండును. కానీ! ఆకాశమునందుగల సూర్యమండలము ఈ మూడింటిపై ఆధారపడదు. ఏలయన అది స్వయంసిద్ధము. అట్లే ఆత్మయు పైన తెలుపబడిన మూడు భేదములకు మూలకారణమేయైనను, వాటికి సాక్షీభూతమై, అతీతమైయున్నది. అది స్వయంప్రకాశకము; దానిద్వారా అన్ని పదార్థములును ప్రకాశించును. అది (ఆత్మ) వాటికంటె భిన్నమైనది. చక్షురింద్రియమునకు మూడు భేదములు ఉన్నట్లే, త్వక్కు (చర్మము), శ్రోత్రము (చెవి), జిహ్వ (నాలుక),  నాసిక (ముక్కు), చిత్తము మొదలగు వాటికిగూడ మూడేసి భేదములు గలవు.

అధ్యాత్మము

చర్మము, శ్రవణము (చెవి), జిహ్వ (నాలుక), నాసిక (ముక్కు), చిత్తము, మనస్సు, అహంకారము, బుద్ధి.

అధిభూతము

స్పర్శ, శబ్దము, రసము (రుచి), గంధము, చింతనచేయు విషయము, మనస్సుయొక్క విషయము, అహంకార విషయము, గ్రహించు విషయము. 

అధిదైవము (అధిష్ఠాత)

వాయువు, దిక్కు, వరుణుడు, అశ్వినీకుమారులు, వాసుదేవుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ.
 
ఈ మూడువిధములైన తత్త్వములన్నింటితో ఆత్మకు ఎట్టి సంబంధమూ లేదు.

22.31 (ముప్పది రెండవ శ్లోకము)

యోఽసౌ గుణక్షోభకృతో వికారః ప్రధానమూలాన్మహతః ప్రసూతః|

అహం త్రివృన్మోహవికల్పహేతుర్వైకారికస్తామస ఐంద్రియశ్చ॥13117॥

ప్రకృతియందుగల త్రివిధగుణములలో క్షోభ కలుగుటవలన మహత్తత్త్వము ప్రకటమైనది. ఈమహత్తత్త్వమునుండి అహంకారము వెలువడినది. ఈ అహంకారము - సాత్త్వికము, రాజసము, తామసము అను మూడువిధములుగా ఉండును. ఈ అహంకారమే వ్యామోహము అనగా  అజ్ఞానమునకు మరియు సృష్టిలోగల వైవిధ్యమునకు మూలకారణము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:48, 05/11/2021] +91 95058 13235: 5.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఆత్మా పరిజ్ఞానమయో వివాదో హ్యస్తీతి నాస్తీతి భిదార్థనిష్ఠః|

వ్యర్థోఽపి నైవోపరమేత పుంసాం మత్తః పరావృత్తధియాం స్వలోకాత్॥13118॥

ఆత్మ జ్ఞానస్వరూపమైనది. దేహాది జడపదార్థములతో ఆత్మకు ఎట్టి సంబంధమూలేదు అను విషయమునందు ఎట్టి వాదవివాదములకు తావులేదు. కాని, భేదదృష్టియందే నిష్ఠకలిగినవారలు స్వస్వరూపమును తెలియకుండా, పరమాత్మపట్ల వ్యతిరేకబుద్ధిని కలిగి ఆత్మను గురుంచి అస్తి-నాస్తి అనగా ఉన్నది, లేదు అను వివాదమును లేవనెత్తుదురు. తమ వాదము వ్యర్థమైనదని తెలిసికూడా, ఆగకుండా వాదవివాదము చేయుచునే ఉందురు.

ఉద్ధవ ఉవాచ

22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

త్వత్తః పరావృత్తధియః స్వకృతైః కర్మభిః ప్రభో|

ఉచ్చావచాన్ యథా దేహాన్ గృహ్ణంతి విసృజంతి చ॥13119॥

22.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తన్మమాఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః|

న హ్యేతత్ప్రాయశో లోకే విద్వాంసః సంతి వంచితాః॥13120॥

ఉద్ధవుడు పలికెను ప్రభూ! నీయెడల విముఖులైనవారు తాము చేసికొనిన పుణ్య-పాపకర్మల ఫలితముగా ఉత్తమ-అధమ యోనులను (జన్మలను) పొందుచుందురు, విడిచిపెట్టు చుందురు. అయితే సర్వవ్యాపియై నిత్యమైన ఈ ఆత్మ ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు చేరుట, కర్మల విషయమున ఎట్టి కర్తృత్వము లేకున్నను జననమరణములను పొందుట ఎట్లు సంభవము? గోవిందా! ఆత్మజ్ఞాన రహితులైనవారికి ఈ విషయము ఆలోచనకుగూడ అందదు. అంతేగాదు శాస్త్రజ్ఞానముగల విద్వాంసులకు సైతము ఈ విషయము బోధపడదు. ఏలయన అందరూ నీ మాయకు మోహితులైనవారే. దయతో ఈ విషయమున నాకు తేటతెల్లము గావింపుము.

శ్రీభగవానువాచ

22.36 (ముప్పది ఆరవ శ్లోకము)

మనః కర్మమయం నౄణామింద్రియైః పంచభిర్యుతమ్|

లోకాల్లోకం ప్రయాత్యన్య ఆత్మా తదనువర్తతే॥13121॥

శ్రీభగవానుడు వచించెను ఉద్ధవా! మానవునియొక్క మనస్సు  కర్మ సంస్కారములకు నిలయము. ఆ సంస్కారములకు తగినట్లుగా భోగములను అనుభవించుటకై పంచేంద్రియములను తోడ్పడును. దీననే లింగశరీరము అని యందురు. ఈ లింగశరీరము పుణ్యపాపకర్మ వాసనలను అనుసరించి, ఒక యోనినుండి మరియొక యోనికిని, ఒకలోకమునుండి మరియొక లోకమునకును పోవుచు, వచ్చుచుండును. సర్వవ్యాపియైన ఆత్మ లింగశరీరముకంటె వేరైనను దేహాత్మాభిమాన (అహంకార) కారణముగా పోవుచు వచ్చుచున్నట్లు ప్రతీతమగు చుండును.

22.37 (ముప్పది ఏడవ శ్లోకము)

ధ్యాయన్ మనోఽను విషయాన్ దృష్టాన్ వానుశ్రుతానథ|

ఉద్యత్సీదత్కర్మతంత్రం స్మృతిస్తదను శామ్యతి॥13122॥

మనస్సు కర్మలకు వశమైయుండును. తాను చూచిన, వినిన విషయములను అది స్మరించుచునే యుండును. అట్టి స్మరణతో మనస్సు తాదాత్మ్యమును చెందును. ఇట్లే కర్మలకు వశమైన మనస్సు అనేక చింతనలు చేయుచుండును. ఒకే చింతన పుట్టినప్పుడు, దానిముందు  పుట్టిన చింతన నశించిపోవును.

22.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

విషయాఽభినివేశేన నాఽఽత్మానం యత్స్మరేత్పునః|

జంతోర్వై కస్యచిద్ధేతోర్మృత్యురత్యంతవిస్మృతిః॥13123॥

నిరంతర చింతనలో ఉన్నమనస్సు ఏదో ఒక కారణముతో ఒక విషయచింతనతో తాదాత్మ్యము చెందును. అప్పుడు అంతకు ముందుగుల చింతన స్మృతి   లుప్తమగును. తిరిగి వేరొక చింతన కలుగుచుండును. కాని ఒక్కొక్కసారి దీర్ఘమైన విస్మృతి కలుగును. ఇట్టి దీర్ఘవిస్మృతియే మరణముగా నిశ్చయింపబడును.

22.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

జన్మ త్వాత్మతయా పుంసః సర్వభావేన భూరిద|

విషయస్వీకృతిం ప్రాహుర్యథా స్వప్నమనోరథః॥13124॥

ఉదారుడవగు ఓ ఉద్ధవా! మనిషి స్వప్నమునందలి దేహముతో పూర్తిగా మమేకమై - నేను, నాది అని భావించుచు స్వప్నమును దర్శించును. జాగ్రద్దశలో మనోరథమునకు చెందిన దేహముతో కూడా మనిషి 'ఈ దేహమే నేను-నాది' అని పూర్తిగా తాదాత్మ్యమును చెంది 'నేను-నాది' అని స్వీకరించును. ఇదియే మనిషికి జన్మయని ప్రాజ్ఞులు చెప్పుదురు.

22.40 (నలుబదియవ శ్లోకము)

స్వప్నం మనోరథం చేత్థం ప్రాక్తనం న స్మరత్యసౌ|

తత్ర పూర్వమివాత్మానమపూర్వం చానుపశ్యతి॥13125॥

స్వప్నములు ఎల్లప్పుడును ఒకేరీతిగా ఉండవు. అవి ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉండును. అట్లే జీవుడు పదేపదే పుట్టుచుండును, గిట్టుచుండును. పుట్టుటయు, గిట్టుటయు స్వప్నములవలె మిథ్యలే. నూతన శరీరమును స్వీకరించినప్పుడు అతడు 'పూర్వము నేను లేను. ఇప్పుడే జన్మించినాను' అని భావించును. ఆ విధముగా అతడు పూర్వశరీరమును గూర్చి పూర్తిగా మరచిపోవును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[06:21, 10/11/2021] +91 95058 13235: 10.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఆత్మా పరిజ్ఞానమయో వివాదో హ్యస్తీతి నాస్తీతి భిదార్థనిష్ఠః|

వ్యర్థోఽపి నైవోపరమేత పుంసాం మత్తః పరావృత్తధియాం స్వలోకాత్॥13118॥

ఆత్మ జ్ఞానస్వరూపమైనది. దేహాది జడపదార్థములతో ఆత్మకు ఎట్టి సంబంధమూలేదు అను విషయమునందు ఎట్టి వాదవివాదములకు తావులేదు. కాని, భేదదృష్టియందే నిష్ఠకలిగినవారలు స్వస్వరూపమును తెలియకుండా, పరమాత్మపట్ల వ్యతిరేకబుద్ధిని కలిగి ఆత్మను గురుంచి అస్తి-నాస్తి అనగా ఉన్నది, లేదు అను వివాదమును లేవనెత్తుదురు. తమ వాదము వ్యర్థమైనదని తెలిసికూడా, ఆగకుండా వాదవివాదము చేయుచునే ఉందురు.

ఉద్ధవ ఉవాచ

22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

త్వత్తః పరావృత్తధియః స్వకృతైః కర్మభిః ప్రభో|

ఉచ్చావచాన్ యథా దేహాన్ గృహ్ణంతి విసృజంతి చ॥13119॥

22.35 (ముప్పది ఐదవ శ్లోకము)

తన్మమాఖ్యాహి గోవింద దుర్విభావ్యమనాత్మభిః|

న హ్యేతత్ప్రాయశో లోకే విద్వాంసః సంతి వంచితాః॥13120॥

ఉద్ధవుడు పలికెను ప్రభూ! నీయెడల విముఖులైనవారు తాము చేసికొనిన పుణ్య-పాపకర్మల ఫలితముగా ఉత్తమ-అధమ యోనులను (జన్మలను) పొందుచుందురు, విడిచిపెట్టు చుందురు. అయితే సర్వవ్యాపియై నిత్యమైన ఈ ఆత్మ ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు చేరుట, కర్మల విషయమున ఎట్టి కర్తృత్వము లేకున్నను జననమరణములను పొందుట ఎట్లు సంభవము? గోవిందా! ఆత్మజ్ఞాన రహితులైనవారికి ఈ విషయము ఆలోచనకుగూడ అందదు. అంతేగాదు శాస్త్రజ్ఞానముగల విద్వాంసులకు సైతము ఈ విషయము బోధపడదు. ఏలయన అందరూ నీ మాయకు మోహితులైనవారే. దయతో ఈ విషయమున నాకు తేటతెల్లము గావింపుము.

శ్రీభగవానువాచ

22.36 (ముప్పది ఆరవ శ్లోకము)

మనః కర్మమయం నౄణామింద్రియైః పంచభిర్యుతమ్|

లోకాల్లోకం ప్రయాత్యన్య ఆత్మా తదనువర్తతే॥13121॥

శ్రీభగవానుడు వచించెను ఉద్ధవా! మానవునియొక్క మనస్సు  కర్మ సంస్కారములకు నిలయము. ఆ సంస్కారములకు తగినట్లుగా భోగములను అనుభవించుటకై పంచేంద్రియములను తోడ్పడును. దీననే లింగశరీరము అని యందురు. ఈ లింగశరీరము పుణ్యపాపకర్మ వాసనలను అనుసరించి, ఒక యోనినుండి మరియొక యోనికిని, ఒకలోకమునుండి మరియొక లోకమునకును పోవుచు, వచ్చుచుండును. సర్వవ్యాపియైన ఆత్మ లింగశరీరముకంటె వేరైనను దేహాత్మాభిమాన (అహంకార) కారణముగా పోవుచు వచ్చుచున్నట్లు ప్రతీతమగు చుండును.

22.37 (ముప్పది ఏడవ శ్లోకము)

ధ్యాయన్ మనోఽను విషయాన్ దృష్టాన్ వానుశ్రుతానథ|

ఉద్యత్సీదత్కర్మతంత్రం స్మృతిస్తదను శామ్యతి॥13122॥

మనస్సు కర్మలకు వశమైయుండును. తాను చూచిన, వినిన విషయములను అది స్మరించుచునే యుండును. అట్టి స్మరణతో మనస్సు తాదాత్మ్యమును చెందును. ఇట్లే కర్మలకు వశమైన మనస్సు అనేక చింతనలు చేయుచుండును. ఒకే చింతన పుట్టినప్పుడు, దానిముందు  పుట్టిన చింతన నశించిపోవును.

22.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

విషయాఽభినివేశేన నాఽఽత్మానం యత్స్మరేత్పునః|

జంతోర్వై కస్యచిద్ధేతోర్మృత్యురత్యంతవిస్మృతిః॥13123॥

నిరంతర చింతనలో ఉన్నమనస్సు ఏదో ఒక కారణముతో ఒక విషయచింతనతో తాదాత్మ్యము చెందును. అప్పుడు అంతకు ముందుగుల చింతన స్మృతి   లుప్తమగును. తిరిగి వేరొక చింతన కలుగుచుండును. కాని ఒక్కొక్కసారి దీర్ఘమైన విస్మృతి కలుగును. ఇట్టి దీర్ఘవిస్మృతియే మరణముగా నిశ్చయింపబడును.

22.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

జన్మ త్వాత్మతయా పుంసః సర్వభావేన భూరిద|

విషయస్వీకృతిం ప్రాహుర్యథా స్వప్నమనోరథః॥13124॥

ఉదారుడవగు ఓ ఉద్ధవా! మనిషి స్వప్నమునందలి దేహముతో పూర్తిగా మమేకమై - నేను, నాది అని భావించుచు స్వప్నమును దర్శించును. జాగ్రద్దశలో మనోరథమునకు చెందిన దేహముతో కూడా మనిషి 'ఈ దేహమే నేను-నాది' అని పూర్తిగా తాదాత్మ్యమును చెంది 'నేను-నాది' అని స్వీకరించును. ఇదియే మనిషికి జన్మయని ప్రాజ్ఞులు చెప్పుదురు.

22.40 (నలుబదియవ శ్లోకము)

స్వప్నం మనోరథం చేత్థం ప్రాక్తనం న స్మరత్యసౌ|

తత్ర పూర్వమివాత్మానమపూర్వం చానుపశ్యతి॥13125॥

స్వప్నములు ఎల్లప్పుడును ఒకేరీతిగా ఉండవు. అవి ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉండును. అట్లే జీవుడు పదేపదే పుట్టుచుండును, గిట్టుచుండును. పుట్టుటయు, గిట్టుటయు స్వప్నములవలె మిథ్యలే. నూతన శరీరమును స్వీకరించినప్పుడు అతడు 'పూర్వము నేను లేను. ఇప్పుడే జన్మించినాను' అని భావించును. ఆ విధముగా అతడు పూర్వశరీరమును గూర్చి పూర్తిగా మరచిపోవును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:41, 10/11/2021] +91 95058 13235: 10.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.41 (నలుబది ఒకటవ శ్లోకము)

ఇంద్రియాయనసృష్ట్యేదం త్రైవిధ్యం భాతి వస్తుని|

బహిరంతర్భిదా హేతుర్జనోఽసజ్జనకృద్యథా॥13126॥

ఇంద్రియములను ఆశ్రయించి ఉండు  మనస్సు లేదా శరీరముయొక్క జన్మవలన ఆత్మవస్తువునందు ఉత్తమము, మధ్యమము, అధమము అని మూడువిధములుగా భాసిల్లును. వాటియందు అభిమానము కలిగియుండుట వల్లనే బాహ్యమైన, అభ్యంతరములైన భేదములకు కారణమైనట్లుగా తోచును. ఉదాహరణకు ఒక తండ్రికి దుష్టుడైన ఒక పుత్రుడు కలడు. ఆ పుత్రునికి కొందరు మిత్రులు, శత్రువులు కలరు. అయితే ఆ పుత్రునిపట్ల మిత్రభావముగలవారు వాని తండ్రిని కూడా మిత్రునిగనే భావించెదరు. శత్రుభావము గలవారు, శత్రువుగనే తలంచెదరు. కాని, వాస్తవమునకు ఆ తండ్రిలో మాత్రము మిత్రభావముగానీ, శత్రుభావముగానీ ఉండదు. అతడు నిర్లిప్తుడుగా ఉండును. అట్లే ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములులేవు. కాని, జీవుడు అజ్ఞానముచే, దేహాభిమానము పొంది నానావిధవికారములను అనుభవించును. ఇదియే సుఖదుఃఖాది ద్వంద్వములకు హేతువు అగుచున్నది.

ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. వాటియందు రుచి మరిగి, మనస్సును తమవైపు మళ్ళించి, తమతో జత కలుపుకొనును. ఇంద్రియములతో జతకట్టిన మనస్సు, ఆత్మసత్తాయందు ఉత్తమ, మధ్యమ, అధమములనెడు త్రివిధభావములను నిర్మించును. ఆత్మస్వరూపము మాత్రము లోపల-బయట అంతటా సమానరూపముగా వ్యాపించియున్నది. కాని మనస్సే దానియందు నానాత్వమును కల్పించును. మనస్సును జీవాత్మ యొక్క పుత్రునిగా భావింపవలెను. ఉదాహరణకు దుష్టుడైన పుత్రుని కలిగిన తండ్రిని, ఇతరులు అనగా పుత్రునికి చెందిన శత్రువులు, మిత్రులు ఆ తండ్రిపట్ల శత్రు-మిత్ర భావమును ప్రదర్శించెదరుకదా! ఇదేవిధముగా మనస్సు కల్పించెడు నానావిధములగు భావముల కారణముగా, జీవాత్మయందు ఆయా భావములను అటులనే ఆరోపింపబడును. కాని, నిజమునకు జీవాత్మ సహజస్వభావము మాత్రము సమమైనది, నిర్వికారమైనది. ఆచట తండ్రి అనగా జీవాత్మ, పుత్రుడు, మనస్సు, ఇతరజనులు శత్రు-మిత్రులు.

22.42 (నలుబది రెండవ శ్లోకము)

నిత్యదా హ్యంగ భూతాని భవంతి న భవంతి చ|

కాలేనాలక్ష్యవేగేన సూక్ష్మత్వాత్తన్న దృశ్యతే॥13127॥

ఉద్ధవా! పరిణామశీలములైన జీవుల శరీరములు నిత్యము (ప్రతిక్షణము) క్రొత్తస్థితిని పొందుచుండును. పూర్వస్థితిని త్యజించుచుండును. సూక్ష్మమైన కాలప్రభావమున ఈ పరిణామములు కనబడవు.

22.43 (నలుబది మూడవ శ్లోకము)

యథాఽర్చిషాం స్రోతసాం చ ఫలానాం వా వనస్పతేః|

తథైవ సర్వభూతానాం వయోఽవస్థాదయః కృతాః13128॥

కాలప్రభావమున దీపజ్వాలలు, నదీప్రవాహముల జలములు, చెట్లఫలములయొక్క స్థితులు మార్పు చెందుచుండునట్లు ప్రాణుల శరీరములయొక్క ఆయువులు, బాల్యాది అవస్థలు క్షణక్షణము మారుచుండును.

22.44 (నలుబది నాలుగవ శ్లోకము)

సోఽయం దీపోఽర్చిషాం యద్వత్స్రోతసాం తదిదం జలమ్|

సోఽయం పుమానితి నృణాం మృషా గీర్ధీర్మృషాయుషామ్॥13129॥

దీపజ్వాల క్షణక్షణము మారిపోవుచుండును. అట్లే నదిలోగల జలము ప్రవాహరూపముతో ప్రతిక్షణము మార్పుచెందుచుండును. ఐతే మార్పును గమనించకుండా అదే దీపము; అదే నది అని జనులు భ్రమించి చెప్పుట మిథ్యయగును. ఇదే విధముగా మానవుల ఆయువు అనుక్షణము గడచిపోవుచునే యుండును. అట్లే వారి దేహములలో నిరంతరము మార్పులు జరుగుచుండును. ఐననూ అవివేకముతో అతడే, ఇతడు అని భ్రమతో చెప్పుట సత్యముకాదు.

22.45 (నలుబది ఐదవ శ్లోకము)

మా స్వస్య కర్మబీజేన జాయతే సోఽప్యయం పుమాన్|

మ్రియతే వామరో భ్రాంత్యా యథాఽగ్నిర్దారుసంయుతః॥13130॥

పుణ్యపాపకర్మల ఫలితముగా దేహము ప్రాప్తించుచుండును. 'ఆ దేహముతోపాటు ఆత్మగూడ జన్మించును, మరణించును' అని తలంచుట భ్రాంతి. వాస్తవముగా ఆత్మకు జననమరణములు లేవు. అది శాశ్వతము. కట్టెలతోగల సంబంధమువలన అగ్ని మండుచున్నట్లు, చల్లారుచున్నట్లు కనబడుచుండును. మండుట, చల్లారుట అనునవి కట్టెలకు సంబంధించిన ధర్మములు. మహాభూతమైన అగ్నితత్త్వములో ఎట్టి మార్పూ ఉండదుగదా!

22.46 (నలుబది ఆరవ శ్లోకము)

నిషేకగర్భజన్మాని బాల్యకౌమారయౌవనమ్|

వయోమధ్యం జరామృత్యురిత్యవస్థాస్తనోర్నవ॥13131॥

'గర్భాధానము, గర్భవృద్ధి, జననము, బాల్యము, కౌమారము, యౌవనము, మధ్యవయస్సు, వార్ధక్యము, మరణము' అను తొమ్మిది దశలును శరీరమునకు సంబంధించినట్టివి.

నిషేకో జఠరేప్రవేశః, గర్భః తన్మధ్యేవృద్ధిః, గర్భస్తత్రోపచయః బాల్యమ్ ఆపంచమాదబ్దాత్ కౌమారమ్ ఆషోడశాదబ్దాత్, తతో యౌవనమ్ ఆచతుర్వింశతేః తతో మధ్యమాషష్ఠివర్షాత్ (వీరరాఘవీయవ్యాఖ్య)

నిషేకము (గర్భాధానము), రేతస్సు స్థితినుండి ఐదు నెలలవఱకు, జననమువఱకుగల తరువాత స్థితి గర్భవృద్ధి. తదుపరి జననము - పుట్టుక మొదలుకొని ఐదు సంవత్సరములవఱకు బాల్యము, ఐదునుండి పదునాఱవ సంవత్సరము వఱకు కౌమారము. పదునాఱునుండి నలుబదియవ సంవత్సరమువఱకు యౌవనము. అప్పటినుండి అఱువదియవ సంవత్సరము వఱకు మధ్యమ వయస్సు. తదుపరి మరణపర్యంతము వార్ధక్యము. పిదప మరణము. ఈ తొమ్మిదియు దేహమునకు సంబంధించిన దశలు.

22.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఏతా మనోరథమయీర్హ్యన్యస్యోచ్చావచాస్తనూః|

గుణసంగాదుపాదత్తే క్వచిత్కశ్చిజ్జహాతి చ॥13132॥

ఈ శరీరము జీవునికంటె భిన్నమైనది. గర్భాధానాది దశలును, ఆసనశయనాది అవస్థలును శరీరమునకు సంబంధించినవి. అజ్ఞాన కారణమున త్రిగుణముల సాంగత్యముచేత విషయాసక్తుడైన బద్ధజీవుడు వీటిని తనవిగా భావించును. కాని, ముక్తుడైనవాడు, సిద్ధపురుషుడు విషయములకు సంబంధించిన ఈ ఆసక్తులను త్యజించును.

22.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

ఆత్మనః పితృపుత్రాభ్యామనుమేయౌ భవాప్యయౌ|

న భవాప్యయవస్తూనామభిజ్ఞో ద్వయలక్షణః॥13133॥

పుత్రజనన సమయమున తండ్రియు, తండ్రి మరణ సమయమున పుత్రుడును తమతమ జననమరణములను గూర్చి ఊహించుకొనవలయును. 'జీవుడు ఈ జననమరణములకు ద్రష్టమాత్రమే. చావుపుట్టుకలు శరీరమునకేకాని, ఆత్మకుగావు' అని తెలిసికొనవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[05:37, 11/11/2021] +91 95058 13235: 11.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.49 (నలబై తొమ్మిదవ శ్లోకము)

తరోర్బీజవిపాకాభ్యాం యో విద్వాంజన్మసంయమౌ|

తరోర్విలక్షణో ద్రష్టా ఏవం ద్రష్టా తనోః పృథక్॥13133॥

వృక్షము మొలకెత్తినది మొదలుకొని, దాని వివిధ పరిణామములను చూచెడి విద్వాంసుడు దాని జననమరణములకు ద్రష్టమాత్రమే యగును. వృక్షముకంటె  అతడు వేరైనవాడు. అదేవిధముగా పంచభూతాత్మకమైన శరీరముయొక్క వివిధ పరిణామములను (జన్మపర్యంతము మృత్యువు వరకుగల అవస్థలను) చూచునట్టి ఆత్మ శరీరముకంటె భిన్నమైనది. ఈ  ఆత్మకు జననమరణములు లేవు.

న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః|

అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥ (భగవద్గీత 2/20)

ఈ ఆత్మ ఏకాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది (ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆఱును భావవికారములు). ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఆత్మ చావదు.

22.50 (ఏబదియవ శ్లోకము)

ప్రకృతేరేవమాత్మానమవివిచ్యాబుధః పుమాన్|

తత్త్వేన స్పర్శసమ్మూఢః సంసారం ప్రతిపద్యతే॥13135॥

అజ్ఞానియైన పురుషుడు ప్రకృతి - ఆత్మల తాత్త్విక విచారము ఈ విధముగా చేయడు. అతడు ఆత్మ శరీరముకంటె భిన్నమైనదని భావింపడు. విషయభోగములలోనే నిజమైన సుఖము ఉన్నదని తలంచుచు వాటితో మోహితుడగును. అందువలన అతడు జననమరణ రూపసంసార చక్రములో పరిభ్రమించు చుండును. 

22.51 (ఏబది ఒకటవ శ్లోకము)

సత్త్వసంగాదృషీన్ దేవాన్ రజసాఽసురమానుషాన్|

తమసా భూతతిర్యక్త్వం భ్రామితో యాతి కర్మభిః॥13136॥

శమదమాది సత్త్వకార్యముల యందలి అభినివేశము (ఆసక్తి) వలన వాటికి అనురూపములైన కర్మలను ఆచరించుటచే జీవుడు దేవత్వమును, ఋషిత్వమును పొందును. రజోగుణమునందు ఆసక్తియుండి కామ్యకర్మలను ఆచరించువారు అసురులుగను, మానవులుగను జన్మింతురు. శోకమోహాదులతోగూడిన తమోగుణాత్మక కార్యములను ఆచరించువారు భూతపిశాచములుగను, పశుపక్ష్యాదులుగను పుట్టుదురు. ఈ విధముగా జీవుడు పుణ్యపాప ఫలితముగా వివిధ యోనులలో జన్మించుచుండును.

22.52 (ఏబది రెండవ శ్లోకము)

నృత్యతో గాయతః పశ్యన్ యథైవానుకరోతి తాన్|

ఏవం బుద్ధిగుణాన్ పశ్యన్ననీహోఽప్యనుకార్యతే॥13137॥

పురుషుడు నృత్యముచేయువారిని, గానాలాపనచేయువారిని చూచి, తానుగూడ వారిని అనుకరించుటకు ప్రయత్నించును. అట్లే జీవుడు నిష్క్రియుడైనను, అతనియొక్క బుద్ధి-గుణములను ఆశ్రయించుటచే అతడు వాటికి అనుగుణములైన కార్యములను చేయును.

22.53 (ఏబది మూడవ శ్లోకము)

యథాంభసా ప్రచలతా తరవోఽపి చలా ఇవ|

చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే భ్రమతీవ భూః॥13138॥

22.54 (ఏబది నాలుగవ శ్లోకము)

యథా మనోరథధియో విషయాఽనుభవో మృషా|

స్వప్నదృష్టాశ్చ దాశార్హ తథా సంసార ఆత్మనః॥13139॥

కదులుచున్న నీటిలో ప్రతిబింబించుచున్న తీరమునందలి చెట్లును కదలుచున్నట్లు కనబడును. కండ్లు తిరుగుచున్నప్పుడు భూమియు తిరుగుచున్నట్లు అనిపించును. మనస్సులో మెదలినవి, స్వప్నములో కనబడినవి ఐన భోగపదార్థములు మిథ్యయేయైనను యథార్థముగా గోచరించును. ఓ ఉద్ధవా! అట్లే విషయానుభవ రూపసంసారము గూడ మిథ్యయే. ఐనను మోహితుడైనవానికి అవి సత్యములుగా తోచును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:52, 11/11/2021] +91 95058 13235: 11.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది రెండవ అధ్యాయము

తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
22.55 (ఏబది ఐదవ శ్లోకము)

అర్థే హ్యవిద్యమానేఽపి సంసృతిర్న నివర్తతే|

ధ్యాయతో విషయానస్య స్వప్నేఽనర్థాగమో యథా॥13140॥

స్వప్నమునందు తాను అనుభవించినట్లు కనబడిన దేశాంతరగమనము, శిరచ్ఛేదము మున్నగు దృశ్యములు మెలకువ వచ్చునంతవరకును అదృశ్యములుగావు. మేలుకొనినంతనే అవి అదృశ్యములైపోవును. అట్లే శబ్దాది విషయములను మనస్సులో ధ్యానించుచున్నంత వరకును దేహాత్మబుద్ధిగలవానికి అవి నిజములే అనిపించుచుండును. కాని, మనస్సునుండి ఆ ఊహలు తొలగిపోయినంతనే అవి నివృత్తములు అగును.

22.56 (ఏబది ఆరవ శ్లోకము)

తస్మాదుద్ధవ మా భుంక్ష్వ విషయానసదింద్రియైః|

ఆత్మాగ్రహణనిర్భాతం పశ్య వైకల్పికం భ్రమమ్॥13141॥

ఉద్ధవా! అందువలన నీవు అసద్విషయములయందు (ఏవిధముగను ఎప్పటికిని తృప్తిపడని శబ్దాది విషయముల యందు) ఆసక్తుడవు కావలదు. ఏలయన అజ్ఞానకారణముగా దేహమే ఆత్మయను భేదబుద్ధి కలుగును. నీవు అట్టి భ్రమనుండి వైదొలగుము.

22.57 (ఏబది ఏడవ శ్లోకము)

క్షిప్తోఽవమానితోఽసద్భిః ప్రలబ్ధోఽసూయితోఽథ వా|

తాడితః సన్నిరుద్ధో వా వృత్త్యా వా పరిహాపితః॥13142॥^

22.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

నిష్ఠితో మూత్రితో వాజ్ఞైర్బహుధైవం ప్రకంపితః|

శ్రేయస్కామః కృచ్ఛ్రగత ఆత్మనాఽఽత్మానముద్ధరేత్॥13143॥

దుర్జనులు ఆక్షేపించినను, నిందించినను, గేలిచేసినను, దోషారోపణ చేసినను, జీవనోపాధిని భంగపరచినను, కొట్టినను, బంధించినను, మీద ఉమ్మి వేసినను, మూత్రవిసర్జన చేసినను ఇంకను పలువిధములుగా బాధించినను శ్రేయస్కాముడు ఏమాత్రమూ చలింపక, పరమాత్మపైననే దృష్టినినిలిపి, తనను తాను ఉద్ధరించుకొనవలెను.  అనగా ఆత్మోద్ధరణమునకై పాటు పడుచుండవలయును.

ఉద్ధవ ఉవాచ

22.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

యథైవమనుబుధ్యేయం వద నో వదతాం వర|

సుదుఃసహమిమం మన్య ఆత్మన్యసదతిక్రమమ్॥13144॥

ఉద్ధవుడు పలికెను స్వామీ! నీవు సకలవిషయములను వివరించుటలో నేర్పరివి. దుష్టులు కలిగించు ఇట్టి దుస్సహములైన బాధలనుండి బయటపడి, ఆత్మోద్ధరణమునకై ప్రయత్నించు ఉపాయమును దయతో తెలుపుము.

22.60 (అరువదియవ శ్లోకము)

విదుషామపి విశ్వాత్మన్ ప్రకృతిర్హి బలీయసీ|

ఋతే త్వద్ధర్మనిరతాన్ శాంతాంస్తే చరణాలయాన్॥13145॥

విశ్వాత్మా! దేహాత్మాభిమానముగలవారు విద్వాంసులే యైనను బలీయములైన రాగద్వేషాదుల నుండి విముక్తులు కాలేరు. వాటి ప్రాబల్యము అట్టిది. కానీ, భాగవత ధర్మములైన శ్రవణ, కీర్తనాదులయందు నిరతులు, నీ చరణ కమలములను శరణుజొచ్చి, జితాంతఃకరణులు ఐనవారిని ఈ రాగద్వేషాదులు ఏమాత్రమూ చలింపచేయజాలవు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ద్వావింశోఽధ్యాయః (22)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి తత్త్వములసంఖ్య - ప్రకృతిపురుషులకు సంబంధించిన వివేకము అను ఇరువది రెండవ అధ్యాయము (22)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

12.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

బాదరాయణిరువాచ

23.1 (ప్రథమ శ్లోకము)

స ఏవమాశంసిత ఉద్ధవేన భాగవతముఖ్యేన దాశార్హముఖ్యః|

సభాజయన్ భృత్యవచో ముకుందస్తమాబభాషే శ్రవణీయవీర్యః॥13146॥

శ్రీశుకుడు నుడివెను వాస్తవముగా శ్రీకృష్ణభగవానుని లీలలను, కథలను వినుటకు ఇంపుగానుండును. ఆ యదువంశశిరోమణి భక్తిని, ముక్తిని ప్రసాదించునట్టి పరమపురుషుడు. భాగవతశ్రేష్ఠుడైన ఉద్ధవుడు ఇట్లు ప్రార్థించిన పిదప ఆయన వచనములను గౌరవించుచు ఆ ప్రభువు ఇట్లు నుడివెను.

శ్రీభగవానువాచ

23.2 (రెండవ శ్లోకము)

బార్హస్పత్య స వై నాఽత్ర సాధుర్వై దుర్జనేరితైః|

దురుక్తైర్భిన్నమాత్మానం యః సమాధాతుమీశ్వరః॥13147॥

శ్రీభగవానుడు ఇట్లు నుడివెను మహాత్ముడైన బృహస్పతియొక్క శిష్యుడవైన ఉద్ధవా! దుష్టులు పలికెడి కారుకూతలను సహించుచు, సుఖ దుఃఖములను సమానముగా భావించుచుండెడి సమర్థులైన సత్పురుషులు ఈ లోకమున అరుదుగా మాత్రమే ఉందురు.

23.3 (మూడవ శ్లోకము)

న తథా తప్యతే విద్ధః పుమాన్ బాణైస్తు మర్మగైః|

యథా తుదంతి మర్మస్థా హ్యసతాం పరుషేషవః॥13148॥

దుష్టాత్ములు పలికెడి హృదయవిదారకములైన పరుష వచనములవలె, ఆయువు పట్టులను ఛేదించెడి బాణములు సైతము అంతగా బాధింపజాలవు.

23.4 (నాలుగవ శ్లోకము)

కథయంతి మహత్పుణ్యమితిహాసమిహోద్ధవ|

తమహం వర్ణయిష్యామి నిబోధ సుసమాహితః॥13149॥

ఉద్ధవా! మహాపురుషులు ఈ విషయమున మిగుల పుణ్యప్రదమైన చక్కని ఇతిహాసమునుగూర్చి పలుకుచుందురు. దానిని నీకు ఇపుడు విపులముగా వివరించెదను, సావధానుడవై వినుము.

23.5 (ఐదవ శ్లోకము)

కేనచిద్భిక్షుణా గీతం పరిభూతేన దుర్జనైః|

స్మరతా ధృతియుక్తేన విపాకం నిజకర్మణామ్॥13150॥

దుర్జనులు మిక్కిలి అవమానకరములైన వచనములతో ఒక భిక్షువును ఎంతయు బాధించిరి. ఐనను సహనమును కోల్పోవక అతడు 'అదియంతయు తన పురాకృత కర్మఫలము' అని తలంచి, మనస్థైర్యమును వహించెను. ఈ వృత్తాంతము అతనిని గూర్చియే తెలుపుచున్నది.

23.6 (ఆరవ శ్లోకము)

అవంతిషు ద్విజః కశ్చిదాసీదాఢ్యతమః శ్రియా|

వార్తావృత్తిః కదర్యస్తు కామీ లుబ్ధోఽతికోపనః॥13157॥

పూర్వకాలమునందు అవంతీనగరమునందు ఒకానొక బ్రాహ్మణుడు ఉండెను. అతడు వ్యవసాయము, వాణిజ్యము మొదలగు వృత్తులద్వారా మిగుల సంపన్నుడు అయ్యెను. అతడు మిక్కిలి లోభి. భార్యాపుత్రులకు గూడ తిండిపెట్టక తన పొట్ట నింపుకొనుచుండెడి వాడు. కానీ, అతడు ఎంతయు దురాశాపరుడు. మిగుల కోపిష్ఠి.

23.7 (ఏడవ శ్లోకము)

జ్ఞాతయోఽతిథయస్తస్య వాఙ్మాత్రేణాపి నార్చితాః|

శూన్యావసథ ఆత్మాపి కాలే కామైరనర్చితః॥13152॥

ఆ విప్రుడు బంధుమిత్రులకును, అతిథులకును పెట్టిపోయు విషయమును అట్లుంచి, లోకమర్యాదకైనను వారితో ఆదరవచనములను పలికెడివాడు కాదు. అతిథిపూజలు మొదలగు ధర్మకార్యములను ఏమాత్రమూ ఆచరించెడివాడు కాదు. తాను కూడబెట్టిన ధనమును   కనీసము తానుగూడ అనుభవించెడి వాడు కాదు.

23.8 (ఎనిమిదవ శ్లోకము)

దుఃశీలస్య కదర్యస్య ద్రుహ్యంతే పుత్రబాంధవాః|

దారా దుహితరో భృత్యా విషణ్ణా నాచరన్ ప్రియమ్॥13153॥

ఆ దుశ్శీలుని పిసినారితనము కారణముగా భార్యాపుత్రులు, పుత్రికలు, బంధుమిత్రులు, సేవకులు మొదలగువారు అందరును దుఃఖితులై అతనియెడ ద్రోహబుద్ధి కలిగియుండెడివారు. అతనియెడ ఎవ్వరును ప్రీతికరముగా మసలుకొను చుండెడివారుకాదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

12.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.9 (తొమ్మిదవ శ్లోకము)

తస్యైవం యక్షవిత్తస్య చ్యుతస్యోభయలోకతః|

ధర్మకామవిహీనస్య చుక్రుధుః పంచభాగినః॥13154॥

అతడు యక్షునివలె కేవలము విత్తమును రక్షించుకొను చుండెడివాడు. తన ధనమును ధర్మార్థకామములకు వినియోగింపని కారణముగా ఆ లోభి ఇహపరలోకములనుండి భ్రష్టుడయ్యెను. పంచమహా యజ్ఞములను ఆచరింపనందు వలన అతనియెడ ఆ యజ్ఞాహుతుల భాగస్వాములైన దేవతలు, రాజర్షులు, పితృదేవతలు, సకలప్రాణులు, మానవులు, బ్రహ్మర్షులు కుపితులై యుండిరి.

పంచమహాయజ్ఞములు 1. దేవయజ్ఞము, 2. ఋషియజ్ఞము, 3. పితృయజ్ఞము, 4. మనుష్యయజ్ఞము, 5. భూతయజ్ఞము అను ఈ ఐదింటిని గృహస్థుడు తప్పక ఆచరింపవలెను.

23.10 (పదియవ శ్లోకము)

తదవధ్యానవిస్రస్తపుణ్యస్కంధస్య భూరిద|

అర్థోఽప్యగచ్ఛన్నిధనం బహ్వాయాసపరిశ్రమః॥13155॥

23.11 (పదకొండవ శ్లోకము)

జ్ఞాతయో జగృహుః కించిత్కించిద్దస్యవ ఉద్ధవ|

దైవతః కాలతః కించిద్బ్రహ్మబంధోర్నృపార్థివాత్॥13156॥

మహానుభావా! ఉద్ధవా! యజ్ఞభాగస్వాములైన దేవర్షిప్రభృతులయొక్క అనాదరమువలన పూర్వపుణ్య విశేషఫలము లన్నియు నశించెను. అందువలన అతడు పెక్కు ప్రయాసలకోర్చి, పలు అగచాట్లు పడి కూడబెట్టుకొనిన ఆ సంపదలు అన్నియును అతని కనులయెదుటనే క్షీణిఃచెను. ఆ బ్రాహ్మణాధముని సంపదలో కొంత జ్ఞాతులు (కుటుంబసభ్యులు, దాయాదులు మొదలగువారు) కాజేసిరి. మఱికొంత దొంగలు అపహరించిరి. దైవయోగము చాలక గృహదహనాదులవలన కొంతధనము నశించెను. కాలక్రమమున కొందరు మనుష్యులు కొన్ని వస్తువులను ఎత్తుకొనిపోయిరి. ప్రభుత్వాధికారులు దండన రుసుముగా పన్నుల రూపములో మిగిలినదానిని తీసికొనిపోయిరి.

23.12 (పండ్రెండవ శ్లోకము)

స ఏవం ద్రవిణే నష్టే ధర్మకామవివర్జితః|

ఉపేక్షితశ్చ స్వజనైశ్చింతామాప దురత్యయామ్॥13157॥

ఉద్ధవా! ఈ విధముగా ఆ లోభియొక్క ధనమంతయును నశించిపోయెను. ధర్మకార్యములకుగాని, లోకసహజములైన సుఖములకుగాని నోచుకొనని,ఆ నికృష్టుని స్వజనులెల్లరును పట్టించుకొనుట మానివేసిరి. ఫలితముగా అతడు అంతులేని దిగులుతో కృశించిపోసాగెను.

23.13 (పదమూడవ శ్లోకము)

తస్యైవం ధ్యాయతో దీర్ఘం నష్టరాయస్తపస్వినః|

ఖిద్యతో బాష్పకంఠస్య నిర్వేదః సుమహానభూత్॥13158॥

ఈ విధముగా సకలసంపదలను కోల్పోవుటచే అతడు ఎంతయు పరితాపమునకు గురియయ్యెను. మనస్సు ఖేదముతో నిండిపోయెను. నిరంతరము కన్నీరు గార్చుచుండుటచే కంఠము రుద్ధమాయెను. తనకు సంభవించిన విపత్తును గూర్చి దీర్ఘకాలము చింతించుచు అతడు సంసారమునెడ విరక్తుడయ్యెను.

23.14 (పదునాలుగవ శ్లోకము)

స చాహేదమహో కష్టం వృథాఽఽత్మా మేఽనుతాపితః|

న ధర్మాయ న కామాయ యస్యార్థాయాస ఈదృశః॥13159॥

ఇట్లు నిర్వేదమునకు గురియైన కారణముగా అతడు తనలోతాను ఇట్లు అనుకొనసాగెను. 'ఇంతకాలము వరకును నేను వ్యర్థముగా శారీరకముగా మిక్కిలి ప్రయాసపడితిని. ఎంతో కష్టపడి సంపాదించిన నా ధనమును ధర్మకార్యములకు వినియోగింపనైతిని. కనీసము దానివలన స్వసుఖములనైనను పొందలేకపోయితిని.

23.15 (పదునైదవ శ్లోకము)

ప్రాయేణార్థాః కదర్యాణాం న సుఖాయ కదాచన|

ఇహ చాత్మోపతాపాయ మృతస్య నరకాయ చ॥13160॥

తరచుగా నావంటి లోభుల సంపదలు ఎన్నటికినీ ఏమాత్రమూ సుఖములను చేకూర్చజాలవు. లోభులు ఈ లోకమున ధనమును సంపాదించుటలోను, దానిని రక్షించుకొనుటలోను సతమతమగుచుందురు. ఇట్లు కూడబెట్టిన ధనమును ఎట్టి ధర్మకార్యములకును వినియోగింపక పోవుటచే వారికి నరకమే ప్రాప్తించును.

23.16 (పదహారవ శ్లోకము)

యశో యశస్వినాం శుద్ధం శ్లాఘ్యా యే గుణినాం గుణాః|

లోభః స్వల్పోఽపి తాన్ హంతి శ్విత్రో రూపమివేప్సితమ్॥13161॥

స్వల్పమైన బొల్లిరోగముగూడ చక్కని శరీర సౌందర్యమునకు మచ్చదెచ్చును. అట్లే లోభము ఏమాత్రము ఉన్నను అది మానవుల నిర్మలమైన కీర్తిని, ప్రశస్తములైన గుణములను దెబ్బతీయును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[05:23, 13/11/2021] +91 95058 13235: 13.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.17 (పదిహేడవ శ్లోకము)

అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే|

నాశోపభోగ ఆయాసస్త్రాసశ్చింతా భ్రమో నృణామ్॥13162॥

23.18 (పదునెనిమిదవ శ్లోకము)

స్తేయం హింసానృతం దంభః కామః క్రోధః స్మయో మదః|

భేదో వైరమవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ॥13163॥

23.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఏతే పంచదశానర్థా హ్యర్థమూలా మతా నృణామ్|

తస్మాదనర్థమర్థాఖ్యం శ్రేయోఽర్థీ దూరతస్త్యజేత్॥13164॥

మానవులకు ధనమును ఆర్జించుట యందును, ఆర్జించినదానిని పెంచుటయందును ప్రయాస కలుగు చుండును. దానిని రక్షించువిషయమున భయము ఎదురగు చుండును. వ్యయోపభోగములయందు చింత ఏర్పడు చుండును. అది నాశనమగునేమోయని నిరంతరము భ్రమకలుగుచుండును. దొంగతనము, హింసావృత్తి, బొంకులాడుట, కపటము, కామము, క్రోధము, గర్వము, అహంకారము, భేదబుద్ధి, శత్రుత్వము, అపనమ్మకము, అసూయ, స్త్రీలౌల్యము, జూదము, మద్యపానము అను ఈ పదునైదు అనర్థములును మానవులకు ధనకారణముగనే కలుగుచుండును. కావున, శ్రేయస్సును కోరుకొనువాడు స్వార్థపరమార్థములకు విఘాతమును కలిగించునట్టి 'అర్థము అను పేరుగల' అనర్థమునకు దూరముగా ఉండవలయును.

అర్థమనర్థం భావయనిత్యం, నాస్తి తతస్సుఖలేశ స్సత్యమ్|

పుత్రాదపి ధనభాజాంభీతిః, సర్వత్రైషా విహితారీతిః॥

"పైసా పైసా ఏమి చేస్తావు అంటే, ప్రాణమంతటి తీపిగలవారిని దూరం చేస్తాను" అను లోకోక్తికూడా ప్రసిద్ధమైనది.

23.20 (ఇరువదియవ శ్లోకము)

భిద్యంతే భ్రాతరో దారాః పితరః సుహృదస్తథా|

ఏకాస్నిగ్ధాః కాకిణినా సద్యః సర్వేఽరయః కృతాః॥13165॥

తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, సోదరులు, బంధుమిత్రులు మొదలగువారు ఎంతటి ఆత్మీయతలు పెనవైచుకొనిన ప్రేమానురాగములు గలవారైనప్పటికిని ఒక్క పైసా విషయమున తేడా వచ్చినను వెంటనే బద్ధశత్రువులగుదురు.

23.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అర్థేనాల్పీయసా హ్యేతే సంరబ్ధా దీప్తమన్యవః|

త్యజంత్యాశు స్పృధో ఘ్నంతి సహసోత్సృజ్య సౌహృదమ్॥13166॥

ఈ ఆత్మీయులు అందరును స్వల్పమైన ధనముకొరకే ఆవేశములకు లోనై పరస్పర క్రోధభావమును వహించుచు యావజ్జీవితము స్పర్థలకు లోనగుచుందురు. అంతేగాక, వీరు తమ మధ్యగల సౌహృదములను పూర్తిగా మరచి ఒకరినొకరు చంపుకొనుటకుగూడ సిద్ధపడుదురు.

23.22 (ఇరువది రెండవ శ్లోకము)

లబ్ధ్వా జన్మామరప్రార్థ్యం మానుష్యం తద్ద్విజాగ్ర్యతామ్|

తదనాదృత్య యే స్వార్థం ఘ్నంతి యాంత్యశుభాం గతిమ్॥13167॥

దేవతలుగూడ కోరుకొనునట్టి మానవజన్మను, అందునా బ్రాహ్మణోత్తమజన్మను పొందియు, దానివలన లభించెడి శ్రేయస్సులను గూడ విస్మరించి, కేవలము ధనార్జనపరులైనవారు, ఆత్మహితములను కోల్పోవుదురు. నరకములపాలగుదురు.

23.23 (ఇరువది మూడవ శ్లోకము)

స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్|

ద్రవిణే కోఽనుషజ్జేత మర్త్యోఽనర్థస్య ధామని॥13168॥

ఈ మానవజన్మము స్వర్గప్రాప్తికిని, మోక్షలాభమునకు పరమసాధనము. అట్టి ఉత్తమమైన మానవజన్మనెత్తియు పెక్కు అనర్థములకు మూలమైన ఈ ధనాశలో బుద్ధిగలవాడెవ్వడును చిక్కుకొనడు.

23.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

దేవర్షిపితృభూతాని జ్ఞాతీన్ బంధూంశ్చ భాగినః|

అసంవిభజ్య చాత్మానం యక్షవిత్తః పతత్యధః॥13169॥

పంచమహాయజ్ఞములద్వారా దేవతలను, ఋషులను, పితృదేవతలను, ప్రాణులను తృప్తిపఱచక, జ్ఞాతులకు వారి భాగములను పంచిపెట్టక, బంధుమిత్రులకును, తదితరులగు ఆత్మీయులకును వినియోగింపక, కడకు తానును అనుభవింపక ధనమును కూడబెట్టుకొనినవాడు నరకముపాలగాక తప్పదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:40, 13/11/2021] +91 95058 13235: 13.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.25 (ఇరువది ఐదవ శ్లోకము)

వ్యర్థయార్థేహయా విత్తం ప్రమత్తస్య వయోబలమ్|

కుశలా యేన సిధ్యంతి జరఠః కిం ను సాధయే॥13170॥

నేను వ్యర్థమైన అర్థకాంక్షలో కూరుకొనిపోయి, నా వయస్సును, బలమును వృథాచేసికొనియుంటిని. వివేకవంతులు ఈ ధనమును ధర్మకార్యములకు వినియోగించి పురుషార్థములను (ధర్మార్థకామమోక్షమును) సాధించెదరు. కాని ఇప్పుడు వృద్ధుడనైయున్న నేను ఏమి చేయగలను?

23.26 (ఇరువది ఆరవ శ్లోకము)

కస్మాత్సంక్లిశ్యతే విద్వాన్ వ్యర్థయార్థేహయాసకృత్|

కస్యచిన్మాయయా నూనం లోకోఽయం సువిమోహితః॥13171॥

నిరంతరము వ్యర్థమైన ధనకాంక్షలోబడి విద్వాంసుడు సైతము ఇక్కట్ల పాలగుచుండుటకు హేతువేమి? బాగుగా ఆలోచించి చూచినచో ఈ లోకము ఇట్లు అర్థవ్యామోహములో చిక్కుపడుటకు దైవమాయయే కారణమని తోచును.

23.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కిం ధనైర్ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత|

మృత్యునా గ్రస్యమానస్య కర్మభిర్వోత జన్మదైః॥13172॥

మృత్యువు అనుక్షణము మానవుని వెంటాడుచునే యుండును. కనుక మృత్యువుచే కబళింపబడుచున్న (అవసానదశలోనున్న) వానికి ధనముతోగాని, ధనమును సమకూర్చిపెట్టెడి ఆస్తిపాస్తులతోగాని, కోరికలతోగాని, కోరికలను తీర్చెడి వస్తువులతోగాని పనియేమి? అట్లే జననమరణ చక్రములో పడవేయునట్టి సకామకర్మలతోగాని ప్రయోజనమేమి?

23.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

నూనం మే భగవాంస్తుష్టః సర్వదేవమయో హరిః|

యేన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మనః ప్లవః॥13173॥

బ్రహ్మాది సకలదేవతలును ఆ విరాట్ పురుషునిలోని అంగములే. సర్వేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహముచేతనే గదా ఇప్పటికైనను నాలో ఈ పశ్చాత్తాపధోరణి కలిగినది. లేనిచో నాకు ఈ నిర్వేదము (విరక్తి) ఎట్లు ప్రాప్తించును? దుఃఖమయమైన ఈ సంసారసాగరమును దాటించునట్టి నావ వైరాగ్యమే గదా?

శ్లో. భోగేరోగభయం, కులేచ్యుతిభయం, విత్తే నృపాలయాద్భయమ్ మానే దైన్యభయం, బలేరిపుభయం, రూపే జరాయాభయమ్|

శాస్త్రే వాదభయం, గుణే ఖిలభయం, కాయే కృతాంతాద్భయమ్|

సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం, వైరాగ్యమేవాఽభయమ్॥

మానవాళికి ప్రతిదీ భయావహమే. భోగములను అనుభవించువానికి రోగములవలనను, ఉన్నత వంశమున జన్మించినవానికి తమ వంశముయొక్క ఔన్నత్యము ఎక్కడ దెబ్బతినునో? అనియును, ధనవంతునకు రాజు వేయు పన్నులవలనను, అభిమానధనునకు దైన్యము ప్రాప్తించునేమో? అనియును, బలశాలికి శత్రువులవలనను, అందముగలవానికి ముసలితనము వచ్చిపడునేమో? అనియును, శాస్త్రజ్ఞునకు ప్రతివాదివలనను (గోష్ఠిలో ఓటమి కలుగునేమో? అనియును), గుణవంతునకు దుర్మార్గులవలనను, శరీరమునకు (శరీరికి) మృత్యువువలనను భయము కలుగుచుండును. లోకములో ఇందరికినీ ఇన్ని భయములు ఉన్ననూ, వైరాగ్యవంతునకు మాత్రము దేనివలననూ ఎట్టి భయమూ ఉండదు. (బర్తృహరి వైరాగ్యశతకము - 31).

23.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సోఽహం కాలావశేషేణ శోషయిష్యేఽఙ్గమాత్మనః|

అప్రమత్తోఽఖిలస్వార్థే యది స్యాత్సిద్ధ ఆత్మని॥13174॥

23.30 (ముప్పదియవ శ్లోకము)

తత్ర మామనుమోదేరన్ దేవాస్త్రిభువనేశ్వరాః|

ముహూర్తేన బ్రహ్మలోకం ఖట్వాంగః సమసాధయత్॥13175॥

ఈ విధముగా నిర్వేదమును పొందిన నేను ఇకనుండియైనను బ్రతికియున్నంత కాలము తపస్సు చేయుచు నా జీవితమును సార్థకము చేసికొందును. అట్లు పారమార్థిక విషయములయందు అప్రమత్తుడను (జాగరూకుడను) ఐనచో నాకు ఆత్మసిద్ధి ప్రాప్తించును. నా పూర్వవృత్తాంతమును పూర్తిగా ఎరిగినవారు, ముల్లోకాధిపతులు ఐన దేవతలు ఎల్లరును నన్ను క్షమించుచు నాయెడ ప్రసన్నులగుదురు. అంతట దైవానుగ్రహముచే ముహూర్తకాలములో (రెండుగడియలలో) విష్ణుసాయుజ్యమును పొందిన ఖట్వాంగమహారాజువలె నేనును మోక్షమును పొందెదను.

ఖట్వాంగ మహారాజు యుద్ధమున దేవతలకు  సహాయముచేయుటచే వారు ప్రసన్నులై, ఆ రాజుతో 'వరమును కోరుకొనుము' అని పలికిరి. వెంటనే ఆ మహారాజు దివినుండి భువికి చేరి, ఐహిక సుఖములను త్యజించి, యోగవిద్యాప్రభావముచే రెండుగడియలలో విష్ణుసాయుజ్యమును పొందెను.

శ్రీభగవానువాచ

23.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ఇత్యభిప్రేత్య మనసా హ్యావంత్యో ద్విజసత్తమః|

ఉన్ముచ్య హృదయగ్రంథీన్ శాంతో భిక్షురభూన్మునిః॥13176॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను అవంతినగరమునకు చెందిన ఆ బ్రాహ్మణోత్తముడు ఈ విధముగా నిశ్చయించుకొని, అహంకార మమకారములను, రాగద్వేషములను త్యజించి, నిర్మలచిత్తుడై, సన్న్యాసాశ్రమమును స్వీకరించెను.

23.32 (ముప్పది రెండవ శ్లోకము)

స చచార మహీమేతాం సంయతాత్మేంద్రియానిలః|

భిక్షార్థం నగరగ్రామానసంగోఽలక్షితోఽవిశత్॥13177॥

ఇప్పుడు అతని చిత్తమున ఏ వస్తువుమీదను, ఏ స్థానము పైనను, ఏ వ్యక్తియెడలను ఆసక్తి లేకుండెను. అతడు తన మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను వశమునందుంచు కొనెను. భూతలమునగల నగరములందును, గ్రామములలోను తనను ఎవరును గుర్తించనిరీతిలో సంచరించుచు అతడు భిక్షాటనతో జీవింపసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[05:40, 14/11/2021] +91 95058 13235: 14.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.33 (ముప్పది మూడవ శ్లోకము)

తం వై ప్రవయసం భిక్షుమవధూతమసజ్జనాః|

దృష్ట్వా పర్యభవన్ భద్ర బహ్వీభిః పరిభూతిభిః॥13178॥

ఉద్ధవా! మూడు కాళ్ళ ముదుసలియై, భిక్షాటన మొనర్చుచున్న ఆ అవధూతను (తలంటుస్నానము మొదలగు దేహసంస్కారములు లేనివానిని) చూచి దుష్టులు (పోలికలనుబట్టి ఇతడే ఆ బ్రాహ్మణోత్తముడు అని గుర్తించి) గేలిచేయుచు పలువిధములుగా అవమానపరచిరి.

23.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

కేచిత్త్రివేణుం జగృహురేకే పాత్రం కమండలుమ్|

పీఠం చైకేఽక్షసూత్రం చ కంథాం చీరాణి కేచన॥13179॥

23.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ప్రదాయ చ పునస్తాని దర్శితాన్యాదదుర్మునేః|

అన్నం చ భైక్ష్యసంపన్నం భుంజానస్య సరిత్తటే॥13180॥

23.36 (ముప్పది ఆరవ శ్లోకము)

మూత్రయంతి చ పాపిష్ఠాః ష్ఠీవంత్యస్య చ మూర్ధని|

యతవాచం వాచయంతి తాడయంతి న వక్తి చేత్॥13181॥

కొందరు అతని త్రిదండమును, కొందరు భిక్షాపాత్రను, మఱికొందరు కమండలవును ఎత్తుకొని పోవుచుండిరి. కొంతమంది  ఆసనమును (దర్భాసనమును), రుద్రాక్షమాలను, మీదకప్పుకొను బొంతను, వస్త్రములను లాగికొనిపోయిరి. వారందరును తాము తీసికొనిన ఆయా వస్తువులను అతనికి ఇయ్యజూపినట్లు ప్రదర్శించుచు ఎత్తుకొనిపోవుచుండిరి. అతడు మాత్రము నిశ్చలుడై (అన్నింటిని సహించి) లభించిన భిక్షాన్నముతో నదీతీరమునకు చేరి, భుజింపసాగెను. అప్పుడు కొందరు పాపాత్ములు అతని తలపై మూత్రవిసర్జన చేయుచు ఉమ్మివేయుచుండిరి. ఇట్లు జరుగుచున్నను అతడు మౌనము వహించియేయుండెను. కాని, ఆ దుష్టులు బలవంతముగా అతనిని మాట్లాడింపజేయుటకై ప్రయత్నింపసాగిరి. ఎంతకును మాట్ఞాడకుండుటచే వారు అతనిని కొట్టదొడగిరి.

23.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తర్జయంత్యపరే వాగ్భిః స్తేనోఽయమితి వాదినః|

బధ్నంతి రజ్జ్వా తం కేచిద్బధ్యతాం బధ్యతామితి॥13182॥

23.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

క్షిపంత్యేకేఽవజానంత ఏష ధర్మధ్వజః శఠః|

క్షీణవిత్త ఇమాం వృత్తిమగ్రహీత్స్వజనోజ్ఝితః॥13183॥

23.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

అహో ఏష మహాసారో ధృతిమాన్ గిరిరాడివ|

మౌనేన సాధయత్యర్థం బకవద్దృఢనిశ్చయః॥13184॥

కొందరు 'ఇతడు దొంగ సన్న్యాసి' అని వ్రేలెత్తి చూపుచు మాటలతో బెదిరింపసాగిరి. మరికొందరు 'కట్టివేయుడు, కట్టివేయుడు' అని యనుచు అతనిని త్రాళ్ళతో బంధించిరి. 'ఇతడు పచ్చిమోసగాడు, ధర్మాత్మునివలె నటించుచున్నాడు. పిల్లికి బిచ్చము పెట్టని ఈ లోభియొక్క ధనమును లాగికొని, స్వజనులు ఇతనిని ఇంటినుండి వెళ్ళగొట్టిరి' అని అవహేళన చేయుచు కొందరు పెక్కురీతుల అవమానించిరి. 'ఇతనిది రాతిగుండె. కొండవలె నిశ్చలుడై తనపనిని (భిక్షాన్నాదికమును) సాధింపదలచుకొని యున్నాడు. వాస్తవముగా ఇతడు బహుకపటి, మొండివాడు, పైకి కొంగజపము చేయుచున్నాడు'. అని,

23.40 (నలుబదియవ శ్లోకము)

ఇత్యేకే విహసంత్యేనమేకే దుర్వాతయంతి చ|

తం బబంధుర్నిరురుధుర్యథా క్రీడనకం ద్విజమ్॥13185॥

ఈ విధముగా కొందరు పరిహసించుచుండగా, మఱికొందరు  అతనిపై అపానవాయువును విడుచుచుండిరి. కొందరు పెంపుడు పక్షినివలె అతనిని త్రాళ్ళతో బంధించి, ఇండ్లలో బందీగా ఉంచిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:47, 14/11/2021] +91 95058 13235: 15.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.56 (ఏబది ఆరవ శ్లోకము)

కాలస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తత్ర తదాత్మకోఽసౌ|

నాగ్నేర్హి తాపో న హిమస్య తత్స్యాత్ క్రుధ్యేత కస్మై న పరస్య ద్వంద్వమ్॥13201॥

సుఖ దుఃఖములకు కాలమే హేతువని భావించినచో, ఆత్మయే కాలస్వరూపము. కావున ఆత్మవలన ఆత్మకు కష్టము ఎట్లు కలుగును? అగ్నివలన అగ్నికి తాపము గలుగదు. మంచుయొక్క చల్లదనము మంచును బాధింపదు. కనుక ఆత్మకు సుఖదుఃఖములు ఉండవు. ఇట్టి స్థితిలో జీవుడు ఎవరిపై కోపగించును? శీతోష్ణములు, సుఖదుఃఖములు మున్నగు ద్వంద్వములకు ఆత్మ పూర్తిగా అతీతమైనది.

23.57 (ఏబది ఏడవ శ్లోకము)

న కేనచిత్క్వాపి కథంచనాస్య ద్వంద్వోపరాగః పరతః పరస్య|

యథాహమః సంసృతిరూపిణః స్యాత్ ఏవం ప్రబుద్ధో న బిభేతి భూతైః॥13202॥

ఆత్మ ప్రకృతికి అతీతమైనది. కనుక ప్రకృతికి సంబంధించిన ఏ పదార్థముద్వారా ఏవిధముగను ఆత్మను సుఖదుఃఖములు స్పృశింపవు. అహంకారమే ఈ ద్వంద్వములకు కారణము. అనాత్మయైన దేహమునే ఆత్మనుగా భావించుటవలన జీవునకు ద్వంద్వముల పరితాపము కలుగుచున్నది. నిలకడలేని మనస్సు సంకల్పవికల్పములు చేయుచుండుటవలన నేను-నాది అను అభిమానము ఏర్పడుచుండును. దానివలన రాగద్వేషాదులు ఉత్పన్నములగుచుండును. దానిని అనుసరించి కర్మలు తత్ఫలితముగా జన్మలు సుఖదుఃఖములు తటస్థించును. విద్వాంసుడైనవాడు ఈ విషయమును తెలిసికొని, తన (ఆత్మయుక్త) నిజస్వరూపమును ఎరిగినచో అతనికి ఎవరివలననూ, ఎట్టి భయమూ ఉండదు.

23.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

ఏతాం స ఆస్థాయ పరాత్మనిష్ఠామధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః|

అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంఘ్రినిషేవయైవ॥13203॥

పూర్వము గొప్ప గొప్ప మహర్షులు ఈ అధ్యాత్మనిష్ఠను ఆశ్రయించిరి. ఇప్పుడు నేను కూడా దానినే ఆశ్రయింతును. ఇక ముక్తిని, ప్రేమను ప్రసాదించెడు శ్రీమన్నారాయణుని చరణకమలములను సేవించి అజ్ఞానసాగరమును అనాయాసముగనే దాటిపోగలను.

శ్రీభగవానువాచ

23.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

నిర్విద్య నష్టద్రవిణో గతక్లమః ప్రవ్రజ్య గాం పర్యటమాన ఇత్థమ్|

నిరాకృతోఽసద్భిరపి స్వధర్మాదకంపితోఽమూం మునిరాహ గాథామ్॥13204॥

భగవానుడు వచించెను ఉద్ధవా! ఆ బ్రాహ్మణునియొక్క ధనమైతే నష్టమైనదిగాని, అతని క్లేశములన్నియును దూరమైనవి. అతడు సంసారమునుండి విరక్తుడై సన్న్యాసిగా భూతలమున స్వేచ్ఛగా తిరుగసాగెను. దుష్టులతనిని ఎంతగా బాధించినను అతడు తన ధర్మమునందే స్థిరముగా ఉండి ఈషణ్మాత్రమూ చలింపకుండెను. ఆ సమయమున మౌనియైన ఆ అవధూత తన మనస్సులోనే పై (ఈ) విషయములను స్మరింపసాగెను.

23.60 (అరువదియవ శ్లోకము)

సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః|

మిత్రోదాసీనరిపవః సంసారస్తమసః కృతః॥13205॥

మహాత్మా! ఉద్ధవా! ఈ ప్రపంచమున మానవునకు సుఖముగాని, దుఃఖముగాని వాస్తవముగా ఇచ్చేవాడు లేడు. కాని  అవి 'కలవు' అని యనుకొనుట అతని చిత్తభ్రమ మాత్రమే. ఈ ప్రపంచమున వీరు మిత్రులు, వీరు ఉదాసీనులు, వీరు శత్రువులు అను భేదబుద్ధి కలిగియుండుట అజ్ఞానకల్పితమే.

23.61 (అరువది ఒకటవ శ్లోకము)

తస్మాత్సర్వాత్మనా తాత నిగృహాణ మనో ధియా|

మయ్యావేశితయా యుక్త ఏతావాన్ యోగసంగ్రహః॥13206॥

కనుక ఉద్ధవా! నీ మనోవృత్తులన్నియును నాయందే లగ్నముచేసి మనస్సును వశపరచుకొనుము. అనంతరము నాయందే నీ చిత్తమును స్థిరముగా నిలుపుము. ఇదియే యోగసాధనయొక్క సారము.

23.62 (అరువది రెండవ శ్లోకము)

య ఏతాం భిక్షుణా గీతాం బ్రహ్మనిష్ఠాం సమాహితః|

ధారయంఛ్రావయంఛృణ్వన్ ద్వంద్వైర్నైవాభిభూయతే॥13207॥

ఈ భిక్షుకుడు ప్రస్తావించిన విషయములు బ్రహ్మజ్ఞాన నిష్ఠ ఏర్పడుటకు దోహదకారులగును. మనుజుడు ఏకాగ్రచిత్తుడై, దీనిని విని, వినిపించి, ధారణ చేసినచో అతడెన్నడును సుఖదుఃఖాది ద్వంద్వములకు వశుడుకాదు.

సుఖస్య దుంఖస్య నకోఽపిదాతా, పరో దదాతీతి కుబుద్ధిరేషా|

అహం కరోమీతి వృథాఽభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః॥ (అధ్యా. రామా)

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే త్రయోవింశోఽధ్యాయః (23)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి భిక్షుగీతము అను ఇరువది మూడవ అధ్యాయము (23)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:33, 14/11/2021] +91 95058 13235: 14.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.41 (నలుబది ఒకటవ శ్లోకము)

ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్|

భోక్తవ్యమాత్మనో దిష్టం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత॥13186॥

ఆ భిక్షకుడు దుర్జనులవలన కలిగిన అవమానాది భౌతిక దుఃఖములను, శీతోష్ణాదులవలన సంభవించిన దైవిక బాధలను, అనారోగ్య కారణముగా ఏర్పడిన దైహిక వేదనలను మౌనముగా సహించుచు వచ్చెను. ఇవి అన్నియును తన పురాకృత దుష్కర్మల ఫలములే అనియు, వీటిని అనుభవింపక తప్పదనియు భావించెను. (అవశ్యమ్ అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్)

23.42 (నలుబది రెండవ శ్లోకము)

పరిభూత ఇమాం గాథామగాయత నరాధమైః|

పాతయద్భిః స్వధర్మస్థో ధృతిమాస్థాయ సాత్త్వికీమ్॥13187॥

దుర్జనులు భిక్షుక ధర్మమునుండి అతనిని పతితుని గావించుటకు ఎన్ని విధములుగా పరాభవించినను, అతడు మాత్రము తన స్వధర్మమునందే స్థిరముగా నిలిచియుండెను. అతడు సాత్త్వికధృతిని ఆశ్రయించి ఈ విధముగా ప్రస్తావింపసాగెను.

ద్విజ ఉవాచ

23.43 (నలుబది మూడవ శ్లోకము)

నాఽయం జనో మే సుఖదుఃఖ హేతుః న దేవతాఽఽత్మా గ్రహకర్మకాలాః|

మనః పరం కారణమామనంతి సంసారచక్రం పరివర్తయేద్యత్॥13188॥

బ్రాహ్మణుడు ఇట్లనెను నా సుఖదుఃఖములకు ఈ మనుష్యులు, దేవతలు, శరీరము, గ్రహములు, కర్మ, కాలము మున్నగునవి ఏవియును కారణములు కావు. 'జీవుడు జనన, మరణరూప సంసారచక్రములో పరిభ్రమించుటకు మనస్సే కారణము. (మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః) అనగా మానవుల బంధమోక్షములకు మనస్సే కారణము.

అని శ్రుతులు, మహాత్ములు పేర్కొనియుండుట ఎంతేని సత్యము.

23.44 (నలుబది నాలుగవ శ్లోకము)

మనో గుణాన్ వై సృజతే బలీయస్తతశ్చ కర్మాణి విలక్షణాని|

శుక్లాని కృష్ణాన్యథ లోహితాని తేభ్యః సవర్ణాః సృతయో భవంతి॥13189॥

వాస్తవముగా మనస్సు మిగుల బలీయమైనది. దానివలననే, విషయములు, వాటికి కారణములైన గుణములు, వాటికి సంబంధించిన వృత్తులు ఏర్పడుచున్నవి. ఆ వృత్తులను అనుసరించియే సాత్త్విక, రాజస, తామస కర్మలు కలుగు చుండును. ఆ కర్మలనుబట్టియే జీవునకు వివిధగతులు (దేవ, మనుష్య, తిర్యగాది జన్మలు) ప్రాప్తించుచుండును.

23.45 (నలుబది ఐదవ శ్లోకము)

అనీహ ఆత్మా మనసా సమీహతా హిరణ్మయో మత్సఖ ఉద్విచష్టే|

మనః స్వలింగం పరిగృహ్య కామాన్ జుషన్ నిబద్ధో గుణసంగతోఽసౌ॥13190॥

మనస్సుయొక్క వృత్తులద్వారానే కర్మపరంపర కొనసాగుచుండును. ఆత్మకు కర్మలతో ఎట్టి సాంగత్యమూ ఉండదు. అది విజ్ఞానస్వరూపము. అది నిరంతరము జీవుని అంటిపెట్టుకొనియే యుండును. సాక్షిగా ఉండును. కాని జీవుడు అహంభావ కారణముగా మనస్సును తోడుగా పెట్టుకొని, అనేకవిధములైన గుణవృత్తులను కల్పించుకొనుచుండును. వాటియందు ఆసక్తుడగుటవలన స్వయముగా బంధితుడగును. ఈ విధముగా జీవుడు మనస్సునకు వశుడై జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండును.

23.46 (నలుబది ఆరవ శ్లోకము)

దానం స్వధర్మో నియమో యమశ్చ శ్రుతం చ కర్మాణి చ సద్వ్రతాని|

సర్వే మనోనిగ్రహలక్షణాంతాః పరో హి యోగో మనసః సమాధిః॥13191॥

దానము, వర్ణాశ్రమోచిత ధర్మాచరణము, యమ, నియమాదులను పాటించుట, వేదాధ్యయనము, బ్రహ్మచర్యాది శ్రేష్ఠ వ్రతములను ఆచరించుట, వేదవిహితములైన సత్కర్మలను చేయుట, మొదలగు శుభకర్మలద్వారా మనోనిగ్రహము కలుగును. మనోనిగ్రహము ఏర్పడునంతవరకును వీటిని ఆచరించుచునే ఉండవలయును. కాని, మనస్సును ఇతర వృత్తులనుండి మఱలించి, భగవంతునియందు లగ్నము చేయుటయే పరమయోగము. మనస్సు ఇట్టి సమాధిస్థితిని పొందిస పిదప ఇతర కర్మలను ఆచరింపవలసిన అవసరమే ఉండదు.

23.47 (నలుబది ఏడవ శ్లోకము)

సమాహితం యస్య మనః ప్రశాంతం దానాదిభిః కిం వద తస్య కృత్యమ్|

అసంయతం యస్య మనో వినశ్యత్  దానాదిభిః శ్చేదపరం కిమేభిః॥13192॥

మనస్సు రాగాదులచే కలుషితముగాక ప్రశాంతమై యున్నప్పుడు దానాదులచే సాధింపవలసినది ఏముండును? అట్టి స్థితిలో దానాది కర్మల అవసరమే ఉండదు. అట్లుగాక అతనియొక్క మనస్సు విషయసుఖములయందు ఆసక్తమై వశములో లేనప్పుడు దానాది కర్మలను ఆచరించుటవలన లాభమేమి? ముముక్షువునకు (మోక్షేచ్ఛగలవానికి) సమాధి కుదురుకొనుటయే పరమసాధనము సుమా?

23.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

మనో వశేఽన్యే హ్యభవన్ స్మ దేవాః మనశ్చ నాఽన్యస్య వశం సమేతి|

భీష్మో హి దేవః సహసః సహీయాన్ యుంజ్యాద్వశే తం స హి దేవదేవః॥13193॥

మనస్సు వశమైనచో ఇంద్రియములు అన్నియును వశమగును. ఇంద్రియములు మనస్సును అదుపుచేయజాలవు. ఈ మనస్సును నిగ్రహింప గలిగినవాడు దేవాధిదేవుడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
[05:20, 15/11/2021] +91 95058 13235: 15.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

తం దుర్జయం శత్రుమసహ్యవేగమరుంతుదం తన్న విజిత్య కేచిత్|

కుర్వంత్యసద్విగ్రహమత్ర మర్త్యైర్మిత్రాణ్యుదాసీనరిపూన్ విమూఢాః॥13194॥

వాస్తవముగా మనస్సు దుర్జయము అనగా జయింపరాని శత్రువు (దానములు మొదలగువాటిచేత ఆరాధింపబడిన పరమపురుషుని అనుగ్రహమువలన తప్ప, ఇతరోపాయములచే దానిని జయించుట అశక్యము). శత్రువువలె అది దుఃఖప్రదము. కేవలము దేహమునేగాక అది ఆయువుపట్టులనుగూడ వేధించుచుండును. కావున మనుష్యులు ఈ శత్రువుపై విజయమును సాధింపవలెను. కానీ మూర్ఖులు దీనిని జయించుటకు ప్రయత్నింపరు సరిగదా! ఇతరులతో అనవసరముగా కలహించుచుందురు. ఫలితముగా వారు లోకులలో కొందఱిని మిత్రులుగను, కొందరిని శత్రువులుగను, మరికొందరిని ఉదాసీనులనుగను చేసికొనుచుందురు.

23.50 (ఏబదియవ శ్లోకము)

దేహం మనోమాత్రమిమం గృహీత్వా మమాహమిత్యంధధియో మనుష్యాః|

ఏషోఽహమన్యోఽయమితి భ్రమేణ దురంతపారే తమసి భ్రమంతి॥13195॥

సాధారణముగా మనుష్యుల బుద్ధులు మసకబారి యుండును. అందువలన వారు మనఃకల్పితమైన ఈ శరీరమును నేను-నాది అని భావించుచుందురు. ఆ భ్రమలోపడి, నేను వేరు, అతడు వేరు అను భేదబుద్ధిని కలిగియుందురు. ఫలితముగా వారు అంతులేని అజ్ఞానాంధకారములో పరిభ్రమించుచుందురు.

23.51 (ఏబది ఒకటవ శ్లోకము)

జనస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనశ్చాత్ర హి భౌమయోస్తత్|

జిహ్వాం క్వచిత్సందశతి స్వదద్భిస్తద్వేదనాయాం కతమాయ కుప్యేత్ ॥13196॥

సుఖదుఃఖములకు మానవుడే కారణమని భావించినప్పుడు, ఇక అతనితో ఆత్మకేమి సంబంధము ఉండును? ఏలయన పంచభూతాత్మకమైన శరీరమే సుఖదుఃఖములకు కారణమగును. భోగములనుగూడ అనుభవించును. భోజనము చేయు సమయమున ఎప్పుడైనను దంతములతో నాలుకను కొఱికినచో కలుగుబాధకు మనుష్యుడు ఎవరిని కోపింపగలడు.

23.52 (ఏబది రెండవ శ్లోకము)

దుఃఖస్య హేతుర్యది దేవతాస్తు కిమాత్మనస్తత్ర వికారయోస్తత్|

యదంగమంగేన నిహన్యతే క్వచిత్ క్రుధ్యేత కస్మై పురుషః స్వదేహే॥13197॥

జీవుని దుఃఖమునకు దేవతలే కారణమని భావించినచో, వాటితో ఆత్మకు ఎట్టి సంబంధముండును? ఏలయన సకలశరీరముల యందునుగల ఇంద్రియాధిష్ఠాన దేవతలు ఒక్కటియేగదా! ఇంద్రియాధిష్ఠాన దేవతలే మరొక ఇంద్రియాధిదేవతకు కష్టము కలిగించినచో దీనివలన ఆత్మకు ఏమి హాని కలుగును? శరీరములోని  ఒక అంగమువలన మఱియొక అంగమునకు కష్టము కలిగినచో, జీవుడు ఎవరిపై కోపపడును?

23.53 (ఏబది మూడవ శ్లోకము)

ఆత్మా యది స్యాత్సుఖదుఃఖహేతుః కిమన్యతస్తత్ర నిజస్వభావః|

న హ్యాత్మనోఽన్యద్యది తన్మృషా స్యాత్ క్రుధ్యేత కస్మాన్న సుఖం న దుఃఖమ్॥13198॥

ఆత్మయే సుఖదుఃఖములకు హేతువని భావించినచో, అది పురుషునికంటె వేరుగాదు. ఆత్మ నిత్యము. అది తప్ప తదితరములన్నియును మిథ్యయే. ఆత్మ ఆనందస్వరూపము. కాన సుఖదుఃఖములకు అది కారణము కాజాలదు. అప్పుడు జీవుడు ఎవరిని కోపగించును?

23.54 (ఏబది నాలుగవ శ్లోకము)

గ్రహా నిమిత్తం సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనోఽజస్య జనస్య తే వై|

గ్రహైర్గ్రహస్యైవ వదంతి పీడాం క్రుధ్యేత కస్మై పురుషస్తతోఽన్యః॥13199॥

జీవుని సుఖదుఃఖములకు సూర్యాది గ్రహములే కారణమని భావించినచో, జన్మరహితమైన ఆత్మకు సుఖదుఃఖములు ఉండనేయుండవు. ఏలయన గ్రహములు జన్నించినవారినే బాధించును. ఆత్మ శాశ్వతము. శరీరము మాత్రము నశించునట్టిది. కనుక గ్రహముల ప్రభావము శరీరము పైననే ఉండును. ఆత్మతో వాటికి ఎట్టి సంబంధమూలేదు. కనుక జీవుడు ఎవరిపై కోపగించును?

23.55 (ఏబది ఐదవ శ్లోకము)

కర్మాస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తద్ధి జడాజడత్వే|

దేహస్త్వచిత్పురుషోఽయం సుపర్ణః క్రుధ్యేత కస్మై న హి కర్మమూలమ్॥13200॥

సుఖదుఃఖములకు కర్మలే కారణములని భావించినచో వాటితో ఆత్మకు ఎట్టి సంబంధమూ లేదు. ఏలయన 'జడము, చేతనము' అను రెండురూపముల కలయికచే కర్మ సంభవమగును? దానిలో పక్షిరూపముతో ఉండునట్టి ఆత్మ పూర్తిగా నిర్వికారము, సాక్షిమాత్రము ఐనది. దేహము జడము, అచేతనము - అందువలన కర్మలకు ఆధారమే లేనప్పుడు ఇంక జీవుడు ఎవరిపై కోపగించును?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[20:49, 15/11/2021] +91 95058 13235: 15.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది మూడవ అధ్యాయము

భిక్షుగీతము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
23.56 (ఏబది ఆరవ శ్లోకము)

కాలస్తు హేతుః సుఖదుఃఖయోశ్చేత్కిమాత్మనస్తత్ర తదాత్మకోఽసౌ|

నాగ్నేర్హి తాపో న హిమస్య తత్స్యాత్ క్రుధ్యేత కస్మై న పరస్య ద్వంద్వమ్॥13201॥

సుఖ దుఃఖములకు కాలమే హేతువని భావించినచో, ఆత్మయే కాలస్వరూపము. కావున ఆత్మవలన ఆత్మకు కష్టము ఎట్లు కలుగును? అగ్నివలన అగ్నికి తాపము గలుగదు. మంచుయొక్క చల్లదనము మంచును బాధింపదు. కనుక ఆత్మకు సుఖదుఃఖములు ఉండవు. ఇట్టి స్థితిలో జీవుడు ఎవరిపై కోపగించును? శీతోష్ణములు, సుఖదుఃఖములు మున్నగు ద్వంద్వములకు ఆత్మ పూర్తిగా అతీతమైనది.

23.57 (ఏబది ఏడవ శ్లోకము)

న కేనచిత్క్వాపి కథంచనాస్య ద్వంద్వోపరాగః పరతః పరస్య|

యథాహమః సంసృతిరూపిణః స్యాత్ ఏవం ప్రబుద్ధో న బిభేతి భూతైః॥13202॥

ఆత్మ ప్రకృతికి అతీతమైనది. కనుక ప్రకృతికి సంబంధించిన ఏ పదార్థముద్వారా ఏవిధముగను ఆత్మను సుఖదుఃఖములు స్పృశింపవు. అహంకారమే ఈ ద్వంద్వములకు కారణము. అనాత్మయైన దేహమునే ఆత్మనుగా భావించుటవలన జీవునకు ద్వంద్వముల పరితాపము కలుగుచున్నది. నిలకడలేని మనస్సు సంకల్పవికల్పములు చేయుచుండుటవలన నేను-నాది అను అభిమానము ఏర్పడుచుండును. దానివలన రాగద్వేషాదులు ఉత్పన్నములగుచుండును. దానిని అనుసరించి కర్మలు తత్ఫలితముగా జన్మలు సుఖదుఃఖములు తటస్థించును. విద్వాంసుడైనవాడు ఈ విషయమును తెలిసికొని, తన (ఆత్మయుక్త) నిజస్వరూపమును ఎరిగినచో అతనికి ఎవరివలననూ, ఎట్టి భయమూ ఉండదు.

23.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)

ఏతాం స ఆస్థాయ పరాత్మనిష్ఠామధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః|

అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంఘ్రినిషేవయైవ॥13203॥

పూర్వము గొప్ప గొప్ప మహర్షులు ఈ అధ్యాత్మనిష్ఠను ఆశ్రయించిరి. ఇప్పుడు నేను కూడా దానినే ఆశ్రయింతును. ఇక ముక్తిని, ప్రేమను ప్రసాదించెడు శ్రీమన్నారాయణుని చరణకమలములను సేవించి అజ్ఞానసాగరమును అనాయాసముగనే దాటిపోగలను.

శ్రీభగవానువాచ

23.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)

నిర్విద్య నష్టద్రవిణో గతక్లమః ప్రవ్రజ్య గాం పర్యటమాన ఇత్థమ్|

నిరాకృతోఽసద్భిరపి స్వధర్మాదకంపితోఽమూం మునిరాహ గాథామ్॥13204॥

భగవానుడు వచించెను ఉద్ధవా! ఆ బ్రాహ్మణునియొక్క ధనమైతే నష్టమైనదిగాని, అతని క్లేశములన్నియును దూరమైనవి. అతడు సంసారమునుండి విరక్తుడై సన్న్యాసిగా భూతలమున స్వేచ్ఛగా తిరుగసాగెను. దుష్టులతనిని ఎంతగా బాధించినను అతడు తన ధర్మమునందే స్థిరముగా ఉండి ఈషణ్మాత్రమూ చలింపకుండెను. ఆ సమయమున మౌనియైన ఆ అవధూత తన మనస్సులోనే పై (ఈ) విషయములను స్మరింపసాగెను.

23.60 (అరువదియవ శ్లోకము)

సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః|

మిత్రోదాసీనరిపవః సంసారస్తమసః కృతః॥13205॥

మహాత్మా! ఉద్ధవా! ఈ ప్రపంచమున మానవునకు సుఖముగాని, దుఃఖముగాని వాస్తవముగా ఇచ్చేవాడు లేడు. కాని  అవి 'కలవు' అని యనుకొనుట అతని చిత్తభ్రమ మాత్రమే. ఈ ప్రపంచమున వీరు మిత్రులు, వీరు ఉదాసీనులు, వీరు శత్రువులు అను భేదబుద్ధి కలిగియుండుట అజ్ఞానకల్పితమే.

23.61 (అరువది ఒకటవ శ్లోకము)

తస్మాత్సర్వాత్మనా తాత నిగృహాణ మనో ధియా|

మయ్యావేశితయా యుక్త ఏతావాన్ యోగసంగ్రహః॥13206॥

కనుక ఉద్ధవా! నీ మనోవృత్తులన్నియును నాయందే లగ్నముచేసి మనస్సును వశపరచుకొనుము. అనంతరము నాయందే నీ చిత్తమును స్థిరముగా నిలుపుము. ఇదియే యోగసాధనయొక్క సారము.

23.62 (అరువది రెండవ శ్లోకము)

య ఏతాం భిక్షుణా గీతాం బ్రహ్మనిష్ఠాం సమాహితః|

ధారయంఛ్రావయంఛృణ్వన్ ద్వంద్వైర్నైవాభిభూయతే॥13207॥

ఈ భిక్షుకుడు ప్రస్తావించిన విషయములు బ్రహ్మజ్ఞాన నిష్ఠ ఏర్పడుటకు దోహదకారులగును. మనుజుడు ఏకాగ్రచిత్తుడై, దీనిని విని, వినిపించి, ధారణ చేసినచో అతడెన్నడును సుఖదుఃఖాది ద్వంద్వములకు వశుడుకాదు.

సుఖస్య దుంఖస్య నకోఽపిదాతా, పరో దదాతీతి కుబుద్ధిరేషా|

అహం కరోమీతి వృథాఽభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః॥ (అధ్యా. రామా)

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే త్రయోవింశోఽధ్యాయః (23)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి భిక్షుగీతము అను ఇరువది మూడవ అధ్యాయము (23)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

16.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము

సాంఖ్యయోగము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

24.1 (ప్రథమ శ్లోకము)

అథ తే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైర్వినిశ్చితమ్|

యద్విజ్ఞాయ పుమాన్ సద్యో జహ్యాద్వైకల్పికం భ్రమమ్॥13208॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను ఉద్ధవా! ఇప్పుడు నేను నీకు సాంఖ్యశాస్త్రమును గూర్చి తెలిపెదను. దీనియొక్క స్వరూప స్వభావములను గురుంచి పూర్వకాలమున మహర్షులు వివరించియుండిరి. దీనిని బాగుగా అవగాహన చేసికొనిన జీవుడు వైకల్పికమైన దేహాత్మభావమును అనగా 'నేను-అతడు' అను భేదబద్ధిని వెంటనే విడనాడును. ఈ లోకములో పరబ్రహ్మము తప్ప శాశ్వతమైనది ఏదియును లేదని తెలిసికొనును.

24.2 (రెండవ శ్లోకము)

ఆసీజ్జ్ఞానమథో హ్యర్థ ఏకమేవాఽవికల్పితమ్|

యదా వివేకనిపుణా ఆదౌ కృతయుగేఽయుగే॥13209॥

కల్పారంభమున జ్ఞానము, జ్ఞేయము అను విభాగములు ఏవియును లేకుండెను. అవిభాజ్యమైన ఒకేతత్త్వము (బ్రహ్మతత్త్వము) కలదు. కృతయుగారంభమున బ్రహ్మదృష్టిగల వివేకనిపుణులు 'నామ, రూప' విభాగరహితమైన పరమాత్మ స్వరూపము మాత్రమే కలదని నిశ్చయించిరి.

24.3 (మూడవ శ్లోకము)

తన్మాయాఫలరూపేణ కేవలం నిర్వికల్పితమ్|

వాఙ్మనోగోచరం సత్యం ద్విధా సమభవద్బృహత్॥13216॥

24.4 (నాలుగవ శ్లోకము)

తయోరేకతరో హ్యర్థః ప్రకృతిః సోభయాత్మికా|

జ్ఞానం త్వన్యతమో భావః పురుషః సోఽభిధీయతే॥13211॥

ఆ పరబ్రహ్మస్వరూపము అవాఙ్మానసగోచరము (వాక్కులకుగాని, మనస్సునకుగాని అందనట్టిది). గుణవైషమ్యరహితము. కాలాదులకు అతీతమైనది. ఆ పరబ్రహ్మస్వరూపమే మాయమగును, దానియందు ప్రతిబింబించు జీవునిగను - అనగా 'దృశ్య, ద్రష్ట' అను రెండు రూపములలో విభక్తమయ్యెను. ఆ రెండింటిలో ఒకదానిని 'ప్రకృతి' యందురు. అది జగత్తునందు కార్యకారణ రూపమున ప్రకటమయ్యెను. ఈ విధముగా అది  ఉభయాత్మకము. రెండవది చైతన్యవంతమైన 'జీవాత్మ' ఇది జ్ఞానస్వరూపము. దీనిని 'పురుషుడు' అనియందురు.

24.5 (ఐదవ శ్లోకము)

తమో రజః సత్త్వమితి ప్రకృతేరభవన్ గుణాః|

మయా ప్రక్షోభ్యమాణాయాః పురుషానుమతేన చ॥13212॥

24.6 (ఆరవ శ్లోకము)

తేభ్యః సమభవత్సూత్రం మహాన్ సూత్రేణ సంయుతః|

తతో వికుర్వతో జాతోఽహంకారో యో విమోహనః॥13213॥

ఉద్ధవా! జీవులయొక్క శుభాశుభ కర్మలను అనుసరించి, నేనే ప్రకృతియందు సంక్షోభమును కలిగించితిని. అంతట దానినుండి 'సత్త్వరజస్తమములు' అను మూడు గుణములు వ్యక్తములయ్యెను. వాటినుండి క్రియాశక్తి ప్రధానమైన సూత్రాత్మ, జ్ఞానశక్తి ప్రధానమైన మహత్తత్త్వము ప్రకటితములయ్యెను. ఈ రెండును పరస్పరము కలిసియుండును. ఈ మహత్తత్త్వమునందు కలిగిన వికారమువలన 'అహంకారము' వ్యక్తమయ్యెను. ఈ అహంకారమే జీవులను మోహములో ముంచివేయును.

24.7 (ఏడవ శ్లోకము)

వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రివృత్|

తన్మాత్రేంద్రియమనసాం కారణం చిదచిన్మయః॥13214॥

ఈ అహంకారము 'సాత్త్వికము', 'రాజసము', 'తామసము' అని మూడువిధములు. అహంకారమే పంచతన్మాత్రలకును, ఇంద్రియములకును, మనస్సునకును కారణము. కావున మనస్సు ప్రకృతియొక్క కార్యమగుటచే 'జడము' చైతన్యము యొక్క సంపర్కమువలన 'చేతనము' కావున ఇది ఉభయాత్మకమైనది.

24.8 (ఎనిమిదవ శ్లోకము)

అర్థస్తన్మాత్రికాజ్జజ్ఞే తామసాదింద్రియాణి చ|

తైజసాద్దేవతా ఆసన్నేకాదశ చ వైకృతాత్॥13215॥

తామసాహంకారము నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనెడి పంచతన్మాత్రలు ఉత్పన్నమాయెను. వాటినుండి పంచమహాభూతములు (పృథివ్యాపస్తేజోవాయురాకాశములు) ఏర్పడెను. రాజసాహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఆవిర్భవించెను. సాత్త్వికాహంకారమునుండి మనస్సు ఇంద్రియముల యొక్క అధిష్ఠానదేవతలు ప్రకటితులైరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

17.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము

సాంఖ్యయోగము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
24.17 (పదిహేడవ శ్లోకము)

యస్తు యస్యాదిరంతశ్చ స వై మధ్యం చ తస్య సన్|

వికారో వ్యవహారార్థో యథా తైజసపార్థివాః॥13224॥

24.18 (పదునెనిమిదవ శ్లోకము)

యదుపాదాయ పూర్వస్తు భావో వికురుతేఽపరమ్|

ఆదిరంతో యదా యస్య తత్సత్యమభిధీయతే॥13225॥

ఏ వస్తువు ఆదియందును, అంతమునందును ఉండునో, అది మధ్యయందును ఉండును. అదియే సత్యము. ఆ వస్తువులయొక్క వికారములు (నామ, రూపాదిభేదములు) లోకవ్యవహారము కొరకు ఏర్పడిన కల్పనామాత్రములే. కంకణములు, కుండలములు మొదలగునవి బంగారముయొక్క వికారములు. అట్లే కుండలు, కూజాలు మొదలగునవి మట్టియొక్క వికారములే. ఇట్టి వికారస్థితిని పొందకముందు ఆ పదార్థము బంగారము లేక మట్టియే. తరువాతగూడ అది బంగారముగను, మట్టిగను ఉండును. కనుక మధ్యలోగూడ ఆ మూలపదార్థము బంగారము, మట్టియే. పూర్వకారణములైన మహత్తత్త్వాదులు వాటి ఉపాదానకారణములైన అహంకారాది కార్యవర్గమును సృష్టించును. అవియును సత్యములే. సారాంశమేమనగా ఏ వస్తువు కార్యమునకు ఆదియందును, అంతమునందును ఉండునో అది సత్యము.

24.19 (పందొమ్మిదవ శ్లోకము)

ప్రకృతిర్యస్యోపాదానమాధారః పురుషః పరః|

సతోఽభివ్యంజకః కాలో బ్రహ్మ తత్త్రితయం త్వహమ్॥13226॥

ఈ ప్రపంచముయొక్క ఉపాదానకారణము ప్రకృతి. దానికి ఆధారము పరమాత్మ. దీనిని ప్రకటించునది కాలము. వస్తుతః  ఈ  మూడును బ్రహ్మస్వరూపమే. అది పరబ్రహ్మమునైన నేనే.

24.20 (ఇరువదియవ శ్లోకము)

సర్గః ప్రవర్తతే తావత్పౌర్వాపర్యేణ నిత్యశః|

మహాన్ గుణవిసర్గార్థః స్థిత్యంతో యావదీక్షణమ్॥13227॥

పరమాత్మునియొక్క ఈక్షణశక్తి ప్రసరించుచున్నంతవరకును, ఆ స్వామియొక్క పాలన ప్రవృత్తి కొనసాగుచున్నంతవరకును, జీవుల కర్మభోగానుభవములకై కార్యకారణ రూపమున, పితాపుత్రాది రూపమున ఈ సృష్టిచక్రము నిరంతరము కొనసాగుచునే యుండును. 

24.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

విరాణ్మయాసాద్యమానో లోకకల్పవికల్పకః|

పంచత్వాయ విశేషాయ కల్పతే భువనైః సహ॥13228॥

ఈ విరాట్ పురుషుడే వివిధలోకముల సృష్టి, స్థితి, సంహారములకు లీలాభూమి. నేను ఈ లోకముల ప్రళయమునకు సంకల్పించినపుడు కాలస్వరూపుడునై ఇందు ప్రవేశించెదను. అప్పుడు ఈ భువనములు అన్నియును నాలో లయమొందును.

24.22 (ఇరువది రెండవ శ్లోకము)

అన్నే ప్రలీయతే మర్త్యమన్నం ధానాసు లీయతే|

ధానా భూమౌ ప్రలీయంతే భూమిర్గంధే ప్రలీయతే॥13229॥

ఈ సృష్టి లయమగు ప్రక్రియ ఈ క్రమములో ఉండును. ప్రాణుల శరీరములు అన్నమునందును, అన్నము ధాన్యము నందును, ధాన్యము భూమియందును, భూమి గంధతన్మాత్ర యందును లీనమగును.

24.23 (ఇరువది మూడవ శ్లోకము)

అప్సు ప్రలీయతే గంధ ఆపశ్చ స్వగుణే రసే|

లీయతే జ్యోతిషి రసో జ్యోతీ రూపే ప్రలీయతే॥13230॥

గంధము జలమునందును, జలములు స్వగుణమైన రసతన్మాత్ర యందును లీనమగును. రసము తేజస్సునందును, తేజస్సు రూపతన్మాత్రయందును లీనమందును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
17.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము

సాంఖ్యయోగము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
24.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

రూపం వాయౌ స చ స్పర్శే లీయతే సోఽపి చాంబరే|

అంబరం శబ్దతన్మాత్ర ఇంద్రియాణి స్వయోనిషు॥13231॥

రూపము వాయువునందును, వాయువు స్పర్శ తన్మాత్రయందును, స్పర్శ ఆకాశమునందును, ఆకాశము శబ్దతన్మాత్రయందును లీనమగును. ఇంద్రియములు తమకు కారణములైన అధిష్ఠానదేవతలయందును, చివరకు ఇవి అన్నియును రాజసాహంకారమునందును లీనమగును.

24.25 (ఇరువది ఐదవ శ్లోకము)

యోనిర్వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే|

శబ్దో భూతాదిమప్యేతి భూతాదిర్మహతి ప్రభుః॥13232॥

సౌమ్యుడవైన ఉద్ధవా! ఇంద్రియాధిష్ఠాన దేవతలు తమ నియంతయగు మనస్సునందు లీనమగుదురు. మనస్సు దేవతలతోపాటు సాత్త్వికాహంకారమునందు లయమగును. శబ్దతన్మాత్ర పంచభూతములకు కారణమైన తామసాహంకారమునందు లీనమగును. సమస్త జగత్తును మోహములో ముంచుటను సమర్థములైన త్రివిధాహంకారము మహత్తత్త్వమునందు లీనమగును.

24.26 (ఇరువది ఆరవ శ్లోకము)

స లీయతే మహాన్ స్వేషు గుణేసు గుణవత్తమః|

తేఽవ్యక్తే సంప్రలీయంతే తత్కాలే లీయతేఽవ్యయే॥13233॥

జ్ఞానశక్తి మఱియు క్రియాశక్తి ప్రధానమైన మహత్తత్త్వము తనకు కారణములైన గుణములయందు లీనమగును. గుణములు అవ్యక్త ప్రకృతియందును, ప్రకృతి తనకు ప్రేరకము, శాశ్వతము ఐన కాలమునందు లీనమగును.

24.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కాలో మాయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే|

ఆత్మా కేవల ఆత్మస్థో వికల్పాపాయలక్షణః॥13234॥

కాలము మాయాప్రవర్తకుడను, సమస్త విశ్వమునకు చైతన్యమును కల్పించునట్టి జన్మరహితుడను, పరమాత్మ స్వరూపుడను ఐన నాయందును లీనమగును. ఈ పరమాత్మ దేనియందును లీనముగాదు. అది ఉపాధిరహితమై  తన స్వరూపమునందే స్థితమైయుండును. అది జగత్తుయొక్క సృష్టికిని, లయమునకును అధిష్ఠానము మరియు అవధి.

24.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఏవమన్వీక్షమాణస్య కథం వైకల్పికో భ్రమః|

మనసో హృది తిష్ఠేత వ్యోమ్నీవార్కోదయే తమః॥12235॥

ఈ విధముగా వివేకదృష్టితో చూచిన వాని చిత్తమున ప్రాపంచిక భ్రమకు తావులేదు. ఎప్పుడైనను దానిస్ఫూర్తి కలిగినను, అది ఎక్కువకాలము అతని హృదయమునందు నిలువజాలదు. సూర్యోదయము ఐన పిమ్మట అంధకారము నిలిచియుండదుగదా!

24.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ఏష సాంఖ్యవిధిః ప్రోక్తః సంశయగ్రంథిభేదనః|

ప్రతిలోమానులోమాభ్యాం పరావరదృశా మయా॥13236॥

ఉద్ధవా! నేను కార్యకారణములకు రెండింటికిని సాక్షిని. సృష్టినుండి ప్రళయమువఱకును, ప్రళయమునుండి సృష్టివఱకును కలుగు సాంఖ్యవిధిని నేను వివరించితిని. ఈ సాంఖ్యశాస్త్ర జ్ఞానము వలన సంశయములు అన్నియును దూరమగును. పురుషుడు (ఆత్మ) తన స్వరూపమునందే స్థితుడగును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే చతుర్వింశోఽధ్యాయః (24)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి సాంఖ్యయోగము అను ఇరువది నాలుగవ అధ్యాయము (24)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏



[04:54, 18/11/2021] +91 95058 13235: 18.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఐదవ అధ్యాయము

త్రిగుణములయొక్క వృత్తుల నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

25.1 (ప్రథమ శ్లోకము)

గుణానామసమిశ్రాణాం పుమాన్ యేన యథా భవేత్|

తన్మే పురుషవర్యేదముపధారయ శంసతః॥13237॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను మహాపురుషా! ఉద్ధవా! ప్రతి వ్యక్తియందును గుణములు వేర్వేరు విధములుగా యుండును. ఆ కారణముగా ప్రాణులయొక్క స్వభావములలో గూడ భేదములుండును. ఏ గుణమువలన ఏయే స్వభావములు ఏర్పడుచుండునో వాటి వివరములు ఇప్పుడు నీకు తెలిపెదను సావధానముగా వినుము.

25.2 (రెండవ శ్లోకము)

శమో దమస్తితిక్షేక్షా తపః సత్యం దయా స్మృతిః|

తుష్టిస్త్యాగోఽస్పృహా శ్రద్ధా హ్రీర్దయాదిః స్వనిర్వృతిః॥13238॥

సత్త్వగుణమువలన శమము (మనోనిగ్రహము), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), తితిక్ష (శీతోష్ణాది ద్వంద్వములను సహించుట),  వివేకము, తపస్సు, సత్యము, దయ, స్మృతి, సంతోషము, త్యాగము, విషయముల యందు అనిచ్ఛ, శ్రద్ధ, అనుచిత కర్మను అనుసరించుటకు సిగ్గుపడుట, వేదశాస్త్రములయందు, శ్రద్ధ, దానము, ఆర్జవము (సరళత్వము), వినయము, ఆత్మానుభవ సుఖము మొదలగు లక్షణములు ఏర్పడును.

25.3 (మూడవ శ్లోకము)

కామ ఈహా మదస్తృష్ణా స్తంభ ఆశీర్భిదా సుఖమ్|

మదోత్సాహో యశః ప్రీతిర్హాస్యం వీర్యం బలోద్యమః॥13239॥

రజోగుణమువలన విషయములను  అనుభవింపకుండ ఉండలేకపోవుట, వాంఛ, దర్పము, తృష్ణ (అసంతృప్తి), పట్టుదల,  ఐశ్వర్యము (ధనము) కొఱకు దేవతలను యాచించుట,భేదబుద్ధి, విషయభోగేచ్ఛ, సాహసకార్యముల యందు ఉబలాటము, ఇతరులవలన ప్రశంసలను పొందుటకై ఆరాటము, అపహాస్యము, శక్తిని ప్రకటించుటలో ఉత్సాహము, మొండితనముతో ప్రయత్నించుట మున్నగునవి కలుగుచుండును. 

25.4 (నాలుగవ శ్లోకము)

క్రోధో లోభోఽనృతం హింసా యాచ్ఞా దంభః క్లమః కలిః|

శోకమోహౌ విషాదార్తీ నిద్రాఽఽశా భీరనుద్యమః॥13240॥

కోపము (అసిష్ణుత), లోభము, అబద్ధములాడుట (మిథ్యాభాషణము), హింస (ద్రోహబుద్ధి), యాచించుట, వంచనము (దంభము), వృథాశ్రమ, కలహము, శోకము, మోహము, విషాదము (దుఃఖము), ఆర్తి (దైన్యము), నిద్ర, ఆశ, భయము, సోమరితనము అనునవి తమోగుణము గలవాని స్వభావములు.

25.5 (ఐదవ శ్లోకము)

సత్త్వస్య రజసశ్చైతాస్తమసశ్చానుపూర్వశః|

వృత్తయో వర్ణితప్రాయాః సన్నిపాతమథో శృణు॥13241॥

ఉద్ధవా! క్రమముగా సత్త్వరజస్తమో గుణముల యొక్క అధికాంశవృత్తులు వేర్వేరుగా వర్ణింపబడినవి. ఇప్పుడు వాటి కలయికవలన ఏర్పడు వృత్తులను గూర్చి వివరింతును వినుము.

25.6  (ఆరవ శ్లోకము)

సన్నిపాతస్త్వహమితి మమేత్యుద్ధవ యా మతిః|

వ్యవహారః సన్నిపాతో మనో మాత్రేంద్రియాసుభిః॥13242॥

ఉద్ధవా! మూడు గుణముల కలయికవలననే 'నేను, నాది'  అను బుద్ధి ఉత్పన్నమగును. మనస్సు, శబ్దాదివిషయములు, ఇంద్రియములు, ప్రాణములు అను వాటియొక్క కారణమున వీటి వృత్తులు వ్యవహరింప బడుచున్నవి. సాత్త్విక, రాజస, తామస గుణముల కలయిక వలననే క్రియలు జరుగుచున్నవి.

25.7 (ఏడవ శ్లోకము)

ధర్మే చాఽర్థే చ కామే చ యదాసౌ పరినిష్ఠితః|

గుణానాం సన్నికర్షోఽయం శ్రద్ధారతిధనావహః॥13243॥

మానవుడు ధర్మార్థ కామములనెడి పురుషార్థములను సాధించుటకు ఈ మూడుగుణముల అవసరముండును. సత్త్వగుణమువలన శ్రద్ధ, రజోగుణమువలన ఆసక్తి, తమోగుణమువలన ధనాశయము కలుగును. ఇదియును గుణముల కలయికవలననే సంభవించును.

25.8 (ఎనిమిదవ శ్లోకము)

ప్రవృత్తిలక్షణే నిష్ఠా పుమాన్ యర్హి గృహాశ్రమే|

స్వధర్మే చానుతిష్ఠేత గుణానాం సమితిర్హి సా॥13244॥

మనుష్యుడు సకామకర్మలను అనుష్ఠించినపుడు, లేదా గృహస్థాశ్రమము నందు నిష్ఠగలిగి స్వధర్మమును ఆచరించినప్పుడును  ఈ మూడుగుణముల సమ్మేళనము కలదని భావింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:43, 18/11/2021] +91 95058 13235: 18.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఐదవ అధ్యాయము

త్రిగుణములయొక్క వృత్తుల నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

25.9 (తొమ్మిదవ శ్లోకము)

పురుషం సత్త్వసంయుక్తమనుమీయాచ్ఛమాదిభిః|

కామాదిభీ రజోయుక్తం క్రోధాద్యైస్తమసా యుతమ్॥13245॥

శమదమాది గుణములతో గూడియున్న పురుషుని సత్త్వగుణ సంపన్నునిగను, క్రోధము, హింస మొదలగు ప్రవృత్తులు గలవానిని తమోగుణయుతునిగను గుర్తింపవచ్చును.

25.10  (పదియవ శ్లోకము)

యదా భజతి మాం భక్త్యా నిరపేక్షః స్వకర్మభిః|

తం సత్త్వప్రకృతిం విద్యాత్పురుషం స్త్రియమేవ వా॥13246॥

పురుషుడు లేక స్త్రీ ఎవరైనాసరే, నిష్కామభావముతో తన నిత్యనైమిత్తిక కర్మలద్వారా నన్ను ఆరాధించినచో, అట్టి వ్యక్తిని సత్త్వగుణము గలవానినిగా గుర్తింపవలెను. 

25.11 (పదకొండవ శ్లోకము)

యదా ఆశిష ఆశాస్య మాం భజేత స్వకర్మభిః|

తం రజఃప్రకృతిం విద్యాద్ధింసామాశాస్య తామసమ్॥13247॥

సకామభావముతో తన కర్మలద్వారా నన్ను భజించువాడు, పూజించువాడు రజోగుణయుతునిగా, తన శత్రువుయొక్క మృత్యువునుగాని, హానినిగాని కోరుకొనుచు నన్ను భజించువానిని, పూజించువానిని తమోగుణ సహితునిగా భావింపవలెను.

25.12 (పండ్రెండవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి గుణా జీవస్య నైవ మే|

చిత్తజా యైస్తు భూతానాం సజ్జమానో నిబధ్యతే॥13248॥

సత్త్వరజస్తమోగుణములు జీవునకు సంబంధించినవి. పరమాత్ముడనైన నేను ఆ త్రిగుణములకు అతీతుడను. ఈ గుణములు ప్రాణులయొక్క చిత్తముల యందు ఉత్తన్నములగును. వీటికారణముగనే శరీరమునందు, ధనాదులయందు ఆసక్తమగుటచే జీవుడు స్వయముగా బంధములలో చిక్కుకొనును.

25.13 (పదమూడవ శ్లోకము)

యదేతరౌ జయేత్సత్త్వం భాస్వరం విశదం శివమ్|

తదా సుఖేన యుజ్యేత ధర్మజ్ఞానాదిభిః పుమాన్॥13249॥

రజస్తమోగుణములను అణచివేసి, సత్త్వగుణము వృద్ధి పొందినప్పుడు, చిత్తము నిర్మలముగను, శాంతముగను అగును. సత్త్వగుణము చక్కగా ప్రకాశించును. అప్పుడు పురుషునియందు సుఖము (శమదమాదుల) ధర్మము చక్కగా పరిఢవిల్లును.

25.14 (పదునాలుగవ శ్లోకము)

యదా జయేత్తమః సత్త్వం రజః సంగం భిదా చలమ్|

తదా దుఃఖేన యుజ్యేత కర్మణా యశసా శ్రియా॥13250॥

రజోగుణము భేదబుద్ధికి కారణము - 'ఆసక్తి, ప్రవృత్తి' అనునవి దాని స్వభావములు. సత్త్వగుణమును, తమోగుణమును అణచిపెట్టి, రజోగుణము వృద్ధిపొందినప్పుడు చిత్తము విషయాసక్తమగును, శబ్దాది విషయభేదములతో చంచలమగును. దానికి అనుగుణమైన ప్రవృత్తి, స్వభావము ఏర్పడును. తత్ఫలితముగా రాజసదేవతారాధనాత్మకమైన కర్మలవలన దుఃఖము, ధనాది సంపదలయందు ఆశ, తత్ప్రయుక్తమైన యశోభిలాష కలుగును.

25.15 (పదిహేనవ శ్లోకము)

యదా జయేద్రజః సత్త్వం తమో మూఢం లయం జడమ్|

యుజ్యేత శోకమోహాభ్యాం నిద్రయా హింసయాఽఽశయా॥13251॥

తమోగుణముయొక్క స్వరూపము అజ్ఞానము. ఆలస్యము (సోమరితనము) బుద్ధిమాంద్యము. సత్త్వగుణమును, రజోగుణమును అణచి, తమోగుణము వృద్ధిచెందినప్పుడు చిత్తము వివేరహితమై - వివిధములగు ఆశలు, శోకమోహములు, హింస, నిద్ర, సోమరితనము పెరిగిపోవును.

25.16  (పదహారవ శ్లోకము)

యదా చిత్తం ప్రసీదేత ఇంద్రియాణాం చ నిర్వృతిః|

దేహేఽభయం మనోఽసంగం తత్సత్త్వం విద్ధి మత్పదమ్॥13252॥

చిత్తము ప్రసన్నమైనప్పుడు, ఇంద్రియములయందు శాంతి ఏర్పడినప్పుడు, శారీరకముగ భయము లేనప్పుడు, మనస్సులో ఆసక్తి దూరమైనప్పుడు సత్త్వగుణము వృద్ధిచెందినదని గుర్తించవలెను. సత్త్వగుణము నా అనగా భగవత్ప్రాప్తికి సాధనము.

25.17  (పదిహేడవ శ్లోకము)

వికుర్వన్ క్రియయా చాధీరనివృత్తిశ్చ చేతసామ్|

గాత్రాఽస్వాస్థ్యం మనోభ్రాంతం రజ ఏతైర్నిశామయ॥13253॥

కార్యములు చేయగా - చేయగా జీవుని బుద్ధి చంచలమైనప్పుడు, జ్ఞానేంద్రియములు అసంతృప్తికి గురియై కర్మేంద్రియములు అసంతృప్తికి గురియై కర్మేంద్రియములు వికారములు చెంది, మనస్సులో భ్రాంతి కలిగి, శరీరము అస్వస్థతకు లోనైనప్పుడు రజోగుణము వర్ధిల్లినదని తలంపవలెను.

25.18 (పదునెనిమిదవ శ్లోకము)

సీదచ్చిత్తం విలీయేత చేతసో గ్రహణేఽక్షమమ్|

మనో నష్టం తమో గ్లానిస్తమస్తదుపధారయ॥13254॥

జ్ఞానేంద్రియములు విషయములను గ్రహించుటలో అసమర్థములగుట వలన చిత్తము వికలమైనప్పుడు, మనస్సు సంకల్ప వికల్పములకు, ఊగిసలాటకు లోనైనప్పుడు, అజ్ఞానము, విషాదము ముప్పిరిగొనును. అప్పుడు తమోగుణము ప్రకోపించినట్లు భావింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


 19.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఐదవ అధ్యాయము

త్రిగుణములయొక్క వృత్తుల నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

25.19  (పందొమ్మిదవ శ్లోకము)

ఏధమానే గుణే సత్త్వే దేవానాం బలమేధతే|

అసురాణాం చ రజసి తమస్యుద్ధవ రక్షసామ్॥13255॥

ఉద్ధవా! సత్త్వగుణాభివృద్ధితో దేవతలకును, రజోగుణాభివృద్ధితో అసురులకును, తమోగుణాభివృద్ధితో రాక్షసులకును బలము పెంపొందును (సత్త్వరజస్తమో గుణముల వృత్తులు అధికమైనప్పుడు క్రమముగా దేవత్వ, అసురత్వ, రాక్షసత్వ లక్షణములైన నివృత్తి, ప్రవృత్తి, మోహము ఇనుమడించును).

25.20 (ఇరువదియవ శ్లోకము)

సత్త్వాజ్జాగరణం విద్యాద్రజసా స్వప్నమాదిశేత్|

ప్రస్వాపం తమసా జంతోస్తురీయం త్రిషు సంతతమ్॥13256॥

సత్త్వగుణమువలన జాగ్రదవస్థ, రజోగుణమువలన స్వప్నావస్థ, తమోగుణమువలన సుషుప్త్యవస్థ కలుగు చుండును. ఈ మూడు అవస్థలలో (ఈ మూడు స్థితులలో) సమానముగా విలసిల్లుచున్న ఆత్మ స్వరూపము తురీయము అనగా అది ఈ అవస్థాత్రయమునకు అతీతమైనది. శుద్ధమైనది.

25.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

ఉపర్యుపరి గచ్ఛంతి సత్త్వేన బ్రాహ్మణా జనాః|

తమసాధోఽధ ఆముఖ్యాద్రజసాంతరచారిణః॥13257॥

వేదాధ్యయనమునందు తత్పరులైన  బ్రాహ్మణులు సత్త్వగుణాభివృద్ధిలోగల తారతమ్యములను బట్టి క్రమముగా స్వర్గలోకమునకును, మహర్లోకమునకును, సత్యలోకమునకును చేరుదురు. తమోగుణాభివృద్ధిలోగల తారతమ్యములను బట్టి పశుపక్ష్యాదులుగను, స్థావరములుగను జన్మింతురు. రజోగుణాభివృద్ధి యందలి తరతమ భేదములనుబట్టి వేర్వేరు వర్ణములకు చెందిన మానవులుగా పుట్టుదురు.

25.22  (ఇరువది రెండవ శ్లోకము)

సత్త్వే ప్రలీనాః స్వర్యాంతి నరలోకం రజోలయాః|

తమోలయాస్తు నిరయం యాంతి మామేవ నిర్గుణాః॥13258॥

సత్త్వగుణము వృద్ధిచెందిన సమయమున మృతిచెందినవానికి స్వర్గము ప్రాప్తించును. రజోగుణము   అధికముగా నున్నప్పుడు మరణించిన వ్యక్తి మానవలోకమున  జన్మించును. తమోగుణము ప్రకోపించియున్న స్థితిలో అసువులను కోల్పోయినవాడు నరకము పాలగును. కాని త్రిగుణాతీతుడైన జీవన్ముక్తుడు నన్నేచేరును. అనగా నా పరమపదమును పొందును.

25.23  (ఇరువది మూడవ శ్లోకము)

మదర్పణం నిష్ఫలం వా సాత్త్వికం నిజకర్మ తత్|

రాజసం ఫలసంకల్పం హింసాప్రాయాది తామసమ్॥13259॥

తన వర్ణాశ్రమ ధర్మములను ఆచరించి, తత్ఫలములను నాకే సమర్పించిన వాడును, కర్మలను నిష్కామభావముతో చేసినవాడును సాత్త్వికుడు. ఫలములను ఆశించుచు కర్మలను ఆచరించినవాడు రాజసుడు. మాత్సర్యాది ప్రవృత్తితో ఇతరులను   హింసించుటకుగాని, తన డాంబికమును ప్రదర్శించుటకుగాని కర్మలను ఒనర్చువాడు తామసికుడు.

25.24  (ఇరువది నాలుగవ శ్లోకము)

కైవల్యం సాత్త్వికం జ్ఞానం రజో వైకల్పికం చ యత్|

ప్రాకృతం తామసం జ్ఞానం మన్నిష్ఠం నిర్గుణం స్మృతమ్॥13260॥

శుద్ధమైన ఆత్మజ్ఞానము సాత్త్వికమైనది. నేనే కర్తను, భోక్తను అను భావముతో గూడినది రాజసజ్ఞానము, శరీరమే ఆత్మయను భ్రాంతితో గూడిన జ్ఞానము తామసికము. ఈ మూడింటికిని విలక్షణమైన భగవత్తత్త్వమును ఎఱింగిన జ్ఞానము నిర్గుణజ్ఞానము.

25.25  (ఇరువది ఐదవ శ్లోకము)

వనం తు సాత్త్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే|

తామసం ద్యూతసదనం మన్నికేతం తు నిర్గుణమ్॥13261॥

వనమునందుగాని, ఏకాంత పవిత్ర ప్రదేశమునందుగాని ఉండుట సాత్త్విక నివాసము. నగరములో, గ్రామములో తన గృహమునందుండుట రాజసనివాసము. జూదగృహము నందుగాని, పానశాలయందుగాని ఉండుట తామసనివాసము. దేవమందిరమునందు ఉండుట ఉత్తమమైన నిర్గుణ నివాసము.

25.26  (ఇరువది ఆరవ శ్లోకము)

సాత్త్వికః కారకోఽసంగీ రాగాంధో రాజసః స్మృతః|

తామసః స్మృతివిభ్రష్టో నిర్గుణో మదపాశ్రయః॥13262॥

కర్మలను ఆచరించు వాడు సాత్త్వికుడు. ఫలాసక్తి లేకుండా కర్తవ్యరాగబద్ధుడై కర్మలను చేయువాడు రాజసుడు. విషయభోగములయందలి అనర్థములను ఎరింగియు వాటిని లెక్కసేయక కర్మలనొనర్చువాడు తామసుడు. భగవద్ధ్యానాదులయందు నిరతుడై నన్ను శరణుజొచ్చినవాడు త్రిగుణాతీతుడు లేదా నిర్గుణుడు.

25.27  (ఇరువది ఏడవ శ్లోకము)

సాత్త్విక్యాధ్యాత్మికీ శ్రద్ధా కర్మశ్రద్ధా తు రాజసీ|

తామస్యధర్మే యా శ్రద్ధా మత్సేవాయాం తు నిర్గుణా॥13263॥

ఆధ్యాత్మిక విషయములయందుగల శ్రద్ధ సాత్త్వికము; సకామకర్మల విషయములయందలి శ్రద్ధ రాజసము; అధర్మకర్మలను ఆచరించుటయే తామసికము; మత్సేవాపరమైన శ్రద్ధ నిర్గుణాత్మకము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

[20:28, 19/11/2021] +91 95058 13235: 19.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఐదవ అధ్యాయము

త్రిగుణములయొక్క వృత్తుల నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

25.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

పథ్యం పూతమనాయస్తమాహార్యం సాత్త్వికం స్మృతమ్|

రాజసం చేంద్రియప్రేష్ఠం తామసం చార్తిఽదా శుచి॥13264॥

హితకరమైనది (ఆరోగ్యకరమైనది), పవిత్రమైనది (వర్ణాశ్రమ ధర్మోచితమైనది), అనాయాసముగా ప్రాప్తించునది సాత్త్వికాహారము. 

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖ ప్రీతివివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః॥

ఇంద్రియములకు సుఖావహమైనది, ప్రయాస ఫలితముగా లభించునది రాజసాహారము. దేహేంద్రియములకు హానికరమైనది, అపవిత్రమైనది, అపవిత్రమైనది, శాస్త్రనిషిద్ధమైనది తామసాహారము.

25.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసమ్|

తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయమ్॥13265॥

అంతర్ముఖముతో (ఆత్మచింతనతో)  లభించు సుఖము సాత్త్వికము. శబ్దాది విషయములవలన ప్రాప్తించెడి సుఖము రాజసము. భార్యాపుత్యాదులపైగల మోహముచేతను, దైన్యమువలనను కలిగెడి సుఖము తామసము. దైవధ్యానాదికమువలన ఏర్పడు సుఖము నిర్గుణము.

 25.30 (ముప్పదియవ శ్లోకము)

ద్రవ్యం దేశః ఫలం కాలో జ్ఞానం కర్మ చ కారకః|

శ్రద్ధావస్థాఽఽకృతిర్నిష్ఠా త్రైగుణ్యః సర్వ ఏవ హి॥13266॥

ద్రవ్యము (వస్తువు), స్థానము, ఫలము, కాలము, జ్ఞానము, కర్మ, కర్త, శ్రద్ధ, అవస్థ, దేవ, మనుష్య తిర్యగాది శరీరములు, నిష్ఠ మొదలగునవి అన్నియును త్రిగుణాత్మకములే.

25.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

సర్వే గుణమయా భావాః పురుషాఽవ్యక్తధిష్ఠితాః|

దృష్టం శ్రుతమనుధ్యాతం బుద్ధ్యా వా పురుషర్షభ॥13267॥

మహాత్మా! ఉద్ధవా! ప్రకృతి పురుషుల సాంగత్యమువలన ఏర్పడిన పదార్థములు అన్నియును  త్రిగుణమయములే. అవి నేత్రాది ఇంద్రియములద్వారా అనుభవింపబడినవై యుండవచ్చును. లేదా శాస్త్రాదులద్వారా వినినవి, లోకలోకాంతరములకు సంబంధించినవియును ఐయుండవచ్చును. లేదా బుద్ధిద్వారా తర్కింపబడినవై యుండవచ్చును.

25.32 (ముప్పది రెండవ శ్లోకము)

ఏతాః సంసృతయః పుంసో గుణకర్మనిబంధనాః|

యేనేమే నిర్జితాః సౌమ్య గుణా జీవేన చిత్తజాః|

భక్తియోగేన మన్నిష్ఠో మద్భావాయ ప్రపద్యతే॥13268॥

సౌమ్యా! ఉద్ధవా! జీవునకు అతని గుణములను, కర్మలను అనుసరించి, జన్మలు ప్రాప్తించును. గుణములు అన్నియును చిత్తమునకు సంబంధించినవి. మనస్సును, ఇంద్రియములను జయించిన వాని చిత్తము భక్తియోగము ద్వారా నా యందే స్థిరమగును. ఆ జీవుడు చివరకు నా స్వరూపమునే పొందును.

25.33 (ముప్పది మూడవ శ్లోకము)

తస్మాద్దేహమిమం లబ్ధ్వా జ్ఞానవిజ్ఞానసంభవమ్|

గుణసంగం వినిర్ధూయ మాం భజంతు విచక్షణాః॥13269॥

ఈ మానవశరీరము మిక్కిలి దుర్లభము. దీనిద్వారా తత్త్వజ్ఞానము, నిష్ఠారూప విజ్ఞానము పొందుట సాధ్యమగును. కనుక ఈ మనుష్య శరీరమును పొంది, వివేకవంతులు గుణములయందు (విషయములయందు) ఆసక్తిని వీడి నన్ను భజింపవలెను.

25.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

నిఃసంగో మాం భజేద్విద్వానప్రమత్తో జితేంద్రియః|

రజస్తమశ్చాఽభిజయేత్సత్త్వసంసేవయా మునిః॥13270॥

ముముక్షువు మిగుల సావధానముగా సత్త్వగుణమును పెంపొందించుకొని, రజస్తమోగుణములను జయింపవలెను. ఇంద్రియములను, వశమునందుంచుకొనవలెను. నా స్వరూపమును అవగాహన చేసికొని, నన్ను భజింపవలెను. విషయాసక్తి లేశ మాత్రమైనను ఉండరాదు.

25.35 (ముప్పది ఐదవ శ్లోకము)

సత్త్వం చాఽభిజయేద్యుక్తో నైరపేక్ష్యేణ శాంతధీః|

సంపద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మామ్॥13271॥

ధ్యానయోగముద్వారా చిత్తవృత్తులను ఉపశమింపచేసి, నిరపేక్షత ద్వారా సత్త్వగుణముపై గూడ విజయమును సాధింపవలెను. ఈ విధముగా త్రిగుణములనుండి ముక్తుడై (త్రిగుణాతీతుడై) జీవుడు తన జీవభావమును త్యజించును. పిమ్మట నాలో లీనమగును.

25.36 (ముప్పది ఆరవ శ్లోకము)

జీవో జీవవినిర్ముక్తో గుణైశ్చాశయసంభవైః|

మయైవ బ్రహ్మణా పూర్ణో న బహిర్నాఽఽంతరశ్చరేత్॥13272॥

జీవభావమునుండి ముక్తుడై అతడు  అంతఃకరణము నందు ఉత్పన్నమగు గుణముల నుండి బయటపడును. సంపూర్ణముగా ఏకీభావముతో నాలో లీనమగును. అప్పుడప్పుడు బ్రహ్మానుభూతిలో పూర్ణుడగును. ఆ స్థితిలో అతడు విషయభోగములకై బాహ్యప్రపంచమునందు సంచరింపడు. అనగా బాహ్యమునందు బ్రహ్మమునే దర్శించుచుండును. మనస్సులోనైనను భగవచ్చింతనలోనే నిమగ్నమైయుండును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే పంచవింశోఽధ్యాయః (25)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి త్రిగుణములయొక్క వృత్తుల నిరూపణము అను ఇరువది ఐదవ అధ్యాయము (25)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


 20.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఆరవ అధ్యాయము

పురూరవుని వైరాగ్యము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

26.1 (ప్రథమ శ్లోకము)

మల్లక్షణమిమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః|

ఆనందం పరమాత్మానమాత్మస్థం సముపైతి మామ్॥13273॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను ఉద్ధవా! ఈ మానవ శరీరము నా స్వరూపాజ్ఞానుప్రాప్తికి అనగా నన్ను చేరుటకు ముఖ్యసాధనము. దీనిని పొంది, మచ్చలేని ప్రేమతో నాయందు భక్తి గలిగిన మానవుడు అంతఃకరణమునందు నిలిచియున్న  ఆనందస్వరూపుడనగు నన్ను చేరగలడు.

26.2  (రెండవ శ్లోకము)

గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాననిష్ఠయా|

గుణేషు మాయామాత్రేషు దృశ్యమానేష్వవస్తుతః|

వర్తమానోఽపి న పుమాన్ యుజ్యతేఽవస్తుభిర్గుణైః॥13274॥

జీవునకు లభించు జన్మలన్నియును త్రిగుణాత్మకములు. జ్ఞాననిష్ఠద్వారా జీవుడు దీని (గుణత్రయము) నుండి శాశ్వతముగా బయటపడును. సత్త్వాదిగుణములు వాస్తవముగావు. అవి కేవలము మాయా కల్పితములు. జీవుడు జ్ఞానమును పొందిన పిమ్మట శబ్దాది విషయములమధ్య నుండి వాటిని అనుభవించుచున్నను వాటిచే బంధింపబడడు. ఏలయన గుణములకు వాస్తవికమైన ఉనికిలేదు.

26.3  (మూడవ శ్లోకము)

సంగం న కుర్యాదసతాం శిశ్నోదరతృపాం క్వచిత్|

తస్యానుగస్తమస్యంధే పతత్యంధానుగాంధవత్॥13275॥

విషయలంపటులై ఉదరపోషణమే ముఖ్యముగాగల అసత్పురుషుల (సామాన్య మానవుల)  సాంగత్యమును ఎన్నడును చేయరాదు. అట్టి దుష్టులను అనుగమించువానికి, అంధుని మార్గదర్శకత్వములో నడచు అంధునకువలె దుర్దశయే మిగులును. ఫలితముగా అతడు అంధకారమయమైన జననమరణ చక్రములోనే పరిభ్రమింపవలసి వచ్చును.

26.4  (నాలుగవ శ్లోకము)

ఐలః సమ్రాడిమాం గాథామగాయత బృహచ్ఛ్రవాః|

ఉర్వశీవిరహాన్ముహ్యన్ నిర్విణ్ణః శోకసంయమే॥13276॥

ఉద్ధవా! మహాయశస్వియు, ఇళానందనుడైన పురూరవుడు ఊర్వశీ విరహమునకు తట్టుకొనలేక మిగుల ఖిన్నుడయ్యెను. శోకము తొలగిన పిమ్మట అతనికి ప్రబలమైన వైరాగ్యము కలిగెను. అప్పుడు అతడు ఈ గాథను పేర్కొనెను.

26.5  (ఐదవ శ్లోకము)

త్యక్త్వాఽఽత్మానం వ్రజంతీం తాం నగ్న ఉన్మత్తవన్నృపః|

విలపన్నన్వగాజ్జాయే ఘోరే తిష్ఠేతి విక్లవః॥13277॥

పురూరవుని పరిత్యజించి, ఊర్వశి పరుగెత్తసాగెను. ఆమె యెడబాటునకు తాళలేక అతడు ఉన్మత్తునివలె విలపించుచు విహ్వలుడై నగ్నముగా ఆమెవెంట పరుగెత్తుచు ఇట్లనెను- "దేవీ! క్రూరాత్మురాలా! ఆగుము ఆగుము, వెళ్ళవలదు".

26.6 (ఆరవ శ్లోకము)

కామానతృప్తోఽనుజుషన్ క్షుల్లకాన్ వర్షయామినీః|

న వేద యాంతీర్నాయాంతీరుర్వశ్యాకృష్టచేతనః॥13278॥

ఊర్వశి ఆయన చిత్తమును పూర్తిగా హరించివేసి యుండెను. ఆమెతోగూడి ఎంతగా సుఖించుచున్నను అతనికి తనివితీరకుండెను. క్షుద్రమైన విషయభోగములలో మునిగియున్న  అతనికి సంవత్సరముల కొలది ఎన్నిరాత్రులు గడచిపోవుచున్నను తెలియకుండెను.

ఐళ ఉవాచ

26.7 (ఏడవ శ్లోకము)

అహో మే మోహవిస్తారః కామకశ్మలచేతసః|

దేవ్యా గృహీతకంఠస్య నాయుః ఖండా ఇమే స్మృతాః॥13279॥

26.8 (ఎనిమిదవ శ్లోకము)

నాహం వేదాభినిర్ముక్తః సూర్యో వాభ్యుదితోఽముయా|

ముషితో వర్షపూగానాం బతాహాని గతాన్యుత॥13280॥

26.9 (తొమ్మిదవ శ్లోకము)

అహో మే ఆత్మసమ్మోహో యేనాత్మా యోషితాం కృతః|

క్రీడామృగశ్చక్రవర్తీ నరదేవశిఖామణిః॥13281॥

ఇళానందనుడగు, పురూరవుడు నుడివెను 'అయ్యో! నేను ఎంత మూఢుడను? అంతులేని కామములోబడి నా చిత్తము పూర్తిగా కలుషితమైపోయినది. ఊర్వశియొక్క బాహు బంధములలో చిక్కుకొని, నా ఆయువు ఎంతగా కరగిపోయినదో నాకు తెలియకుండెను. ఈ ఊర్వశి నన్ను పూర్తిగా భ్రష్టుని గావించినది. నేను ఈమెపైగల మోహములో చిక్కుకొని సూర్యోద యాస్తమయములనే గమనింపలేకుంటిని. సంవత్సరములకొలది రోజులు గడచిపోవుచున్నను నాకు తెలియరాకుండెను. అరెరే! ఎంత ఆశ్చర్యము? నేను మహారాజులలో మేటిని. చక్రవర్తిని ఐయుండియు ఈ  స్త్రీ వ్యామోహములోబడి, ఈమె చేతిలో ఒక క్రీడామృగమును (ఆటవస్తువును) ఐతిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

 20.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఆరవ అధ్యాయము

పురూరవుని వైరాగ్యము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

26.10 (పదియవ శ్లోకము)

సపరిచ్ఛదమాత్మానం హిత్వా తృణమివేశ్వరమ్|

యాంతీం స్త్రియం చాన్వగమం నగ్న ఉన్మత్తవద్రుదన్॥13282॥

పరివారములతోను, రాజ్యభోగములతోను తులతూగుచు మహారాజునైయున్న నన్ను ఒక గడ్డిపోచవలె పరిత్యజించి ఈమె (ఈ దేవభామిని) వెళ్ళిపోవుచున్నది కదా! ఈమెకొరకు నేను ఒక పిచ్చివాడనై ఏడ్చుచు నగ్నముగా ఈమెవెంట పరుగిడుచుంటిని. నేను   ఎంతటి మూర్ఖుడను?

26.11 (పదకొండవ శ్లోకము)

కుతస్తస్యానుభావః స్యాత్తేజ ఈశత్వమేవ వా|

యోఽన్వగచ్ఛం స్త్రియం యాంతీం ఖరవత్పాదతాడితః॥13283॥

ఆడుగాడిద వెనుకకాళ్ళతో తన్నుచున్నను మగగాడిద దానివెంటబడినట్లు, నేను ఈ స్త్రీని అనుసరించితిని. నా ప్రభావము, పరాక్రమము, రాజ్యాధికారము (రాచరికపు హోదా) ఏమైనట్లు? అవి అన్నియును మంటగలిసి పోయినవి

26.12 (పండ్రెండవ శ్లోకము)

కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన శ్రుతేన వా|

కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనో హృతమ్॥13284॥

స్త్రీ లౌల్యములోబడి కొట్టుకొనుచున్నవానికి వివేకము పనిచేయదు. తపస్సు బుగ్గిపాలగును, దానములు వ్యర్థములగును. శాస్త్రాభ్యాసము అడుగంటును, ఏకాంతవాసము నిరుపయోగమగును. ధ్యానము నీరుగారిపోవును. వేయేల? అతని జీవితమే మట్టిపాలగును.

26.13 (పదమూడవ శ్లోకము)

స్వార్థస్యాకోవిదం ధిఙ్మాం మూర్ఖం పండితమానినమ్|

యోఽహమీశ్వరతాం ప్రాప్య స్త్రీభిర్గోఖరవజ్జితః॥13285॥

ఇంతవఱకును 'నేను ఒక పండితుడను (తెలివిగలవాడను)' అని అనుకొంటిని. కానీ ఇప్పుడు మూర్ఖుడనై, నా మంచిచెడ్డలను నేను గుర్తింపనైతిని. ఇంతటి చక్రవర్తినై యుండియు గాడిదవలె, ఆంబోతువలె స్త్రీ లోలుడనైతిని. ఛీ! ఛీ! నిజముగా నేను నిందాపాత్రుడను.

26.14 (పదునాలుగవ శ్లోకము)

సేవతో వర్షపూగాన్ మే ఉర్వశ్యా అధరాసవమ్|

న తృప్యత్యాత్మభూః కామో వహ్నిరాహుతిభిర్యథా॥13286॥

ఏండ్లకొలది ఈ ఊర్వశియొక్క అధరామృతమును ఎంతగా గ్రోలుచు వచ్చినను నా మనస్సులో అనుక్షణమూ పెల్లుబుకుచున్న కామోద్రేకములు చల్లారనేలేదు, సరిగదా! అంతకంతకును అధికమే అయ్యెను. అగ్నిలో ఆజ్యాహుతులు పడినకొలదియు జ్వాలలు పెచ్చుపెఱుగునేగాని శాంతింపవుగదా!

26.15 (పదిహేనవ శ్లోకము)

పుంశ్చల్యాపహృతం చిత్తం కో న్వన్యో మోచితుం ప్రభుః|

ఆత్మారామేశ్వరమృతే భగవంతమధోక్షజమ్॥13287॥

స్వైరిణియైన ఊర్వశి తన అందచందాలతో నన్నొక పిచ్చివానిని చేసినది. ఈ స్థితిలో నాకు ఆ భగవంతుడే దిక్కు. ఆత్మారాముడు (విషయ సుఖములకు విముఖులైనవారి ఆత్మలో నివసించువాడు), ఇంద్రియాతీతుడు ఐన ఆ పరమేశ్వరునియొక్క అనుగ్రహము తప్ప నన్ను ఈ కామినీ వ్యామోహమునుండి బయట పడవేయుటకు ఎవ్వరును సమర్థులుకారు.

26.16 (పదహారవ శ్లోకము)

బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన దుర్మతేః|

మనో గతో మహామోహో నాఽపయాత్యజితాత్మనః॥13288॥

ఊర్వశీదేవి వైదికసూక్తులద్వారా హితము పలికి నన్ను మేల్కొలుపజూచినది. కాని, దుర్భుద్ధినైన నేను ఆమెపైగల వ్యామోహమునుండి బయటపడలేకపోయితిని. ఇంద్రియములు నా వశములో లేకుండటచే ఆమె మాటలు నా చెవికెక్కకుండెను.

26.17 (పదిహేడవ శ్లోకము)

కిమేతయా నోఽపకృతం రజ్జ్వా వా సర్పచేతసః|

రజ్జుస్వరూపావిదుషో యోఽహం యదజితేంద్రియః॥13289॥

అజ్ఞాని త్రాడును చూచి, సర్పమని భ్రమపడి దుఃఖించినచో (భయపడినచో) అందులో త్రాడుదోషమేమున్నది? స్వయముగా నేనే ఇంద్రియనిగ్రహము లేకపోవుటచే ఊర్వశిని చూచినంతనే కామాతురుడనైతిని. కనుక దోషము  నాదేగాని ఆమెదిగాదు.

 26.18 (పదునెనిమిదవ శ్లోకము)

క్వాయం మలీమసః కాయో దౌర్గంధ్యాద్యాత్మకోఽశుచిః|

క్వ గుణాః సౌమనస్యాద్యా హ్యధ్యాసోఽవిద్యయా కృతః॥13290॥

ఈ శరీరము (ఊర్వశి శరీరముగాని, నాదిగాని) మలినమయము, దుర్గంధభూయిష్ఠము, అపవిత్రము. అట్టి ఈ శరీరమునందు పుష్పోచితములైన సౌరభము, సౌమనస్యము, పవిత్రత మొదలగు హృద్యములైన గుణములు ఎట్లుండును? నా అజ్ఞాన ప్రభావమున నింద్యమైన ఈ శరీరమునందు సౌందర్యమును ఊహించుకొని భ్రమపడితిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

[04:17, 21/11/2021] +91 95058 13235: 21.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఆరవ అధ్యాయము

పురూరవుని వైరాగ్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
26.19 (పందొమ్మిదవ శ్లోకము)

పిత్రోః కిం స్వం ను భార్యాయాః స్వామినోఽగ్నేః శ్వగృధ్రయోః|

కిమాత్మనః కిం సుహృదామితి యో నాఽవసీయతే॥13291॥

ఈ తనువు తల్లిదండ్రులదా? భార్యయొక్క సంపదయా? వెలయిచ్చి కొన్న యజమానిదా? బంధుమిత్రులదా? అసువులను బాసిన పిమ్మట అగ్నికి ఇంధనమా? లేక కుక్కలకు, గ్రద్దలకును ఆహారమా? ఎంతగా తర్కించినను ఈ తనువు ఎవరిదో బోధపడదు.

26.20 (ఇరువదియవ శ్లోకము)

తస్మిన్ కలేవరేఽమేధ్యే తుచ్ఛనిష్ఠే విషజ్జతే|

అహో సుభద్రం సునసం సుస్మితం చ ముఖం స్త్రియాః॥13292॥

వాస్తవముగా ఈ శరీరము అపవిత్రమైనది, తుచ్ఛమైనది. అట్టి శరీరమునందు ఆసక్తుడై అజ్ఞాని 'ఈ స్త్రీ ముఖము, నాసిక, చిఱునవ్వు ఎంత బాగుగా ఉన్నవి' అని భ్రమపడి దానియందు మఱులుగొనును.

26.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

త్వఙ్మాంసరుధిరస్నాయుమేదోమజ్జాస్థిసంహతౌ|

విణ్మూత్రపూయే రమతాం కృమీణాం కియదంతరమ్॥13293॥

చర్మము, మాంసము, రక్తము, నరములు, క్రొవ్వు, మజ్జ (ఎముకలయందు ఉండెడి జిగురు), ఎముకలు, మలమూత్రములు, చీము మున్నగువానితో గూడినది ఈ శరీరము. ఇట్టి హేయమైన శరీరమునందు రమించువానికిని, మలమూత్రములలో సంచరించు క్రిములకును భేదమేమి?

26.22 (ఇరువది రెండవ శ్లోకము)

అథాఽఽపి నోపసజ్జేత స్త్రీషు స్త్రైణేషు చాఽర్థవిత్|

విషయేంద్రియసంయోగాన్మనః క్షుభ్యతి నాఽన్యథా॥13294॥

అందువలన ఆత్మశ్రేయస్సు కోరుకొనువాడు  స్త్రీలతోను, స్త్రీలోలురతోను సాంగత్యము చేయరాదు. విషయేంద్రియ సాంగత్యము వలననే మనస్సు వికలమగుచుండును. అనగా క్షోభకు గుఱియగుచుండును. మనోవికారములకు మరియొక కారణము లేదు.

26.23 (ఇరువది మూడవ శ్లోకము)

అదృష్టాదశ్రుతాద్భావాన్న భావ ఉపజాయతే|

అసంప్రయుంజతః ప్రాణాన్ శామ్యతి స్తిమితం మనః॥13295॥

26.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తస్మాత్సంగో న కర్తవ్యః స్త్రీషు స్త్రైణేషు చేంద్రియైః|

విదుషాం చాప్యవిస్రబ్ధః షడ్వర్గః కిము మాదృశామ్॥13296॥

ఎన్నడునూ చూడనట్టి, విననట్టి వస్తువులను గూర్చి మనస్సు వికారమునకు గుఱికాదు. విషయేంద్రియ సంయోగమునకు దూరముగా నుండువారి మనస్సులు (ఇంద్రియములను విషయములవైపు పోనీయకుండా నిగ్రహించుకొనువారి మనస్సులు) సహజముగనే నిశ్చలమై ప్రశాంతతను పొందును. కనుక వాక్కు, చెవి, మనస్సు మొదలగు ఇంద్రియములద్వారా స్త్రీలతోను, స్త్రీలంపటులతోను సాంగత్యము పెట్టుకొనరాదు. అనగా వారితో మాట్లాడుటగాని, వారి మాటలను ఆలకించుటగాని చేయరాదు,   మనస్సును వారివైపు పోనీయరాదు. మహావిద్వాంసులకు గూడా పంచేంద్రియములు, మనస్సులు విశ్వసనీయములు గావు. అనగాఅదుపులో ఉండవు. ఇక నా (పురూరవుడు) వంటి సామాన్యుల విషయము చెప్పనేల?

శ్రీభగవానువాచ

26.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఏవం ప్రగాయన్ నృపదేవదేవః స ఉర్వశీలోకమథో విహాయ|

ఆత్మానమాత్మన్యవగమ్య మాం వై ఉపారమజ్జ్ఞాన విధూతమోహః॥13297॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను ఉద్ధవా! చక్రవర్తియైన పురూరవుడు ఈ విధముగా తలపోసి, తన మనస్సును నా యందు లగ్నముచేసి, నన్ను ఉపాసించెను. ఆ ఉపాసనాత్మక జ్ఞానప్రభావమున అతనిలో దేహాత్మాభిమానము పూర్తిగా తొలగిపోయెను. ఫలితమగా ఊర్వశిపైగల మోహము అంతరించెను. ఆత్మస్వరూపుడనైన నన్ను అతడు తన హృదయములో సాక్షాత్కరింపజేసికొని ముక్తిని పొందెను.

26.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తతో దుఃసంగముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్|

సంత ఏతస్య ఛిందంతి మనోవ్యాసంగముక్తిభిః॥13298॥

26.27 (ఇరువది ఏడవ శ్లోకము)

సంతోఽనపేక్షా మచ్చిత్తాః ప్రశాంతాః సమదర్శినః|

నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః॥13299॥

కావున, శ్రేయస్కాముడైనవాడు దుష్టుల సాంగత్యమును పరిత్యజించి, సత్పురుషులను ఆశ్రయింపవలెను. ఆ సజ్జనులు తమ ఉపదేశములద్వారా శబ్దాది విషయములయందు వానికిగల ఆసక్తులను తొలగింతురు. నన్ను తప్ప మరి దేనినీ అభిలషింపనివారు సత్పురుషులు. వారి చిత్తములు రాగాదులచే కలుషితములు గావు. వారు సమదర్శనులు. అనగా చిదచిదాత్మకమైన జగత్తునందు పరబ్రహ్మను దర్శించుదురు. అహంకార, మమకార రహితులు. శీతోష్ణాది ద్వంద్వములకు ఇసుమంతైనను చలింపరు. ఎటువంటి పదార్థమును ప్రోగుచేయరు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:14, 21/11/2021] +91 95058 13235: 21.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఆరవ అధ్యాయము

పురూరవుని వైరాగ్యము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
26.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తేషు నిత్యం మహాభాగ మహాభాగేషు మత్కథాః|

సంభవంతి హి తా నౄణాం జుషతాం ప్రపునంత్యఘమ్॥13300॥

మహాత్మా! ఉద్ధవా! అట్టి మహాపురుషల సాంగత్యములో నిత్యము నా కథలను వినుటవలన మానవులలోని పాపలేశములన్నియును పూర్తిగా నశించును.

 26.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తా యే శృణ్వంతి గాయంతి హ్యనుమోదంతి చాదృతాః|

మత్పరాః శ్రద్దధానాశ్చ భక్తిం విందంతి తే మయి॥13301॥

జనులు శ్రద్ధాదరములతో  నా లీలలను, కథలను గూర్చి వినుటవలనను, గానము చేయుటవలనను, పారవశ్యమును పొందుటవలనను నన్ను ఆరాధించుటలో నిరతులగుదురు. ఇతరేతర వ్యాసంగములన్నియును తొలగిపోయి నాయందు అనన్యభక్తులగుదురు.

 26.30 (ముప్పదియవ శ్లోకము)

భక్తిం లబ్ధవతః సాధోః కిమన్యదవశిష్యతే|

మయ్యనంతగుణే బ్రహ్మణ్యానందానుభవాత్మని॥13302॥

ఉద్ధవా! నా కల్యాణగుణములు అనంతములు. నేను కేవలము సచ్చిదానంద స్వరూపుడను. సకలప్రాణులలో అంతర్యామిగా నున్న పరబ్రహ్మను. నాయందలి భక్తిద్వారా నిరతిశయానందమును పొందిన సత్పురుషులకు ఇక అలభ్యమైనది ఏదియును ఉండదు.

 26.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

యథోపశ్రయమాణస్య భగవంతం విభావసుమ్|

శీతం భయం తమోఽప్యేతి సాధూన్ సంసేవతస్తథా॥13303॥

అగ్నిదేవుని ఆశ్రయించిన మానవునకు చలిభయము గాని, అంధకార భయముగాని ఉండదుగదా! అట్లే భగవత్స్వరూపులైన సత్పురుషులను శరణుజొచ్చినవారికి అజ్ఞానము పటాపంచలగును. తద్ద్వారా సంసారభయము తొలగిపోవును.

 26.32 (ముప్పది రెండవ శ్లోకము)

నిమజ్జ్యోన్మజ్జతాం ఘోరే భవాబ్ధౌ పరమాయణమ్|

సంతో బ్రహ్మవిదః శాంతా నౌర్దృఢేవాప్సు మజ్జతామ్॥13304॥

జలములలో మునిగిపోవుచున్న వారికి (జలప్రమాదములో చిక్కుకొనినవారికి) దృఢమైన నావవలె, ఘోరమైన సంసార సాగరములో మునిగితేలుచున్న వారికి శాంతచిత్తులు, బ్రహ్మవేత్తలు అగు సత్పురుషుల ఆశ్రయమే పరమశరణ్యము. 

 26.33 (ముప్పది మూడవ శ్లోకము)

అన్నం హి ప్రాణినాం ప్రాణ ఆర్తానాం శరణం త్వహమ్|

ధర్మో విత్తం నృణాం ప్రేత్య సంతోఽర్వాగ్బిభ్యతోఽరణమ్॥13305॥

ప్రాణులకు అన్నమే జీవనాధారము. ఆపదలో నున్నవారికి పరమాత్ముడనైన నేనే రక్షకుడను. మానవులకు మరణించిన పిమ్మట ధర్మమే సంపద (రక్షణ). సంసారసాగరములో పడిపోయెదమని భయపడువారలకు సత్పురుషుల ఆశ్రయమే శరణ్యము.

 26.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

సంతో దిశంతి చక్షూంషి బహిరర్కః సముత్థితః|

దేవతా బాంధవాః సంతః సంత ఆత్మాహమేవ చ॥13306॥

ఉదయించిన సూర్యుడు మానవాళికి లోకమును దర్శించునట్టి వెలుగులను ప్రసాదించును. అట్లే సత్పురుషుల జ్ఞానోపదేశములద్వారా జనులకు కనువిప్పు కలిగించుచు భగవంతుని  దర్శించుటకు అంతర్దృష్టిని అనుగ్రహింతురు. అందువలననే యథార్ధముగా సత్పురుషులే (జ్ఞానులే) బంధువులు, దేవతలు, పూజ్యులు. వేయేల అట్టి జ్ఞానులెల్లరును నా ఆత్మస్వరూపులు.

 26.35 (ముప్పది ఐదవ శ్లోకము)

వైతసేనస్తతోఽప్యేవముర్వశ్యా లోకనిస్పృహః|

ముక్తసంగో మహీమేతామాత్మారామశ్చచార హ॥13307॥

ఉద్ధవా! ఇలానందనుడైన పురూరవునకు ఆత్మ సాక్షాత్కారము ఐనంతనే ఊర్వశిపైగల మోహము పూర్తిగా అంతరించెను. లౌకిక బంధములు అన్నియును పటాపంచలయ్యెను. అంతట ఆత్మారాముడై అతడు భూతలమున స్వేచ్ఛగా తిరుగసాగెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే షడ్వింశోఽధ్యాయః (26)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి పురూరవుని వైరాగ్యము అను ఇరువది ఆరవ అధ్యాయము (26)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

22.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్ధవ ఉవాచ

27.1 (ప్రథమ శ్లోకము)

క్రియాయోగం సమాచక్ష్వ భవదారాధనం ప్రభో|

యస్మాత్త్వాం యే యథార్చంతి సాత్వతాః సాత్వతర్షభ॥13308॥

ఉద్ధవుడు పలికెను భక్తవత్సలా! కృష్ణప్రభూ! సత్పురుషులు ఏలక్ష్యముతో, ఏయే పద్ధతులద్వారా నిన్ను ఆరాధింతురో ఆ క్రియాయోగమును దయతో విశదపరచుము.

27.2 (రెండవ శ్లోకము)

ఏతద్వదంతి మునయో ముహుర్నిఃశ్రేయసం నృణామ్|

నారదో భగవాన్ వ్యాస ఆచార్యోఽఙ్గిరసః సుతః॥13309॥

క్రియాయోగముద్వారా నిన్ను ఆరాధించుటవలననే మానవులకు శ్రేయస్సు కలుగునని దేవర్షియైన నారదుడు, వ్యాసభగవానుడు, దేవతలగురువైన బృహస్పతి ఇంకనూ అనేక ఋషులు, మునులు పదేపదే తెలిపియున్నారు.

27.3 (మూడవ శ్లోకము)

నిఃసృతం తే ముఖాంభోజాద్యదాహ భగవానజః|

పుత్రేభ్యో భృగుముఖ్యేభ్యో దేవ్యై చ భగవాన్ భవః॥13310॥

ఈ పూజాపద్ధతి మొట్టమొదట నీ ముఖారవిందమునుండియే వెలువడినది. దీనిని బ్రహ్మదేవుడు తన కుమారులైన భృగుమహర్షి మొదలగువారికి వివరించియుండెను. దీనినే శంకరభగవానుడు తన అర్ధాంగియగు పార్వతీదేవికి తెలిపియుండెను.

27.4 (నాలుగవ శ్లోకము)

ఏతద్వై సర్వవర్ణానామాశ్రమాణాం చ సమ్మతమ్|

శ్రేయసాముత్తమం మన్యే స్త్రీశూద్రాణాం చ మానద॥13311॥

మర్యాదాపురుషోత్తమా! ఈ పూజావిధానము బ్రాహ్మణ, క్షత్రియాది సర్వవర్ణములవారికిని, బ్రహ్మచర్యాది చతురాశ్రమముల వారికిని శ్రేయస్కరమైనది. అంతేగాక, స్త్రీలకును, శూద్రులకును ఇది ఉత్తమోత్తమ సాధనాపద్ధతియని నేను తలంతును.

27.5 (ఐదవ శ్లోకము)

ఏతత్కమలపత్రాక్ష కర్మబంధవిమోచనమ్|

భక్తాయ చానురక్తాయ బ్రూహి విశ్వేశ్వరేశ్వర॥13312॥

కమలపత్రాక్షా! నీవు దేవాదిదేవుడవు. నేను నీ భక్తుడను. నీచరణకమలములనే నమ్ముకొనియున్నవాడను. కర్మబంధముల నుండి విముక్తుని ప్రసాదించు ఈ ఆరాధనావిధిని నాకు ఎరిగింపుము.

శ్రీభగవానువాచ

27.6 (ఆరవ శ్లోకము)

న హ్యంతోఽనంతపారస్య కర్మకాండస్య చోద్ధవ|

సంక్షిప్తం వర్ణయిష్యామి యథావదనుపూర్వశః॥13313॥

శ్రీభగవానుడు వచించెను ఉద్ధవా! శాస్త్రములలో తెలుపబడిన నా ఆరాధనా విధానములు అనంతములు. వాటిని సంక్షిప్తరూపమున క్రమముగా వర్ణించెదను.

27.7 (ఏడవ శ్లోకము)

వైదికస్తాంత్రికో మిశ్ర ఇతి మే త్రివిధో మఖః|

త్రయాణామీప్సితేనైవ విధినా మాం సమర్చయేత్॥13314॥

'నా పూజాపద్ధతి వైదికము, తాంత్రికము, మిశ్రితము' అని మూడు విధములు. భక్తుడు ఆ మూడింటిలో తనకు అనుకూలమైన  విధానమున నన్ను ఆరాధింపవచ్చును.

27.8 (ఎనిమిదవ శ్లోకము)

యదా స్వనిగమేనోక్తం ద్విజత్వం ప్రాప్య పూరుషః|

యథా యజేత మాం భక్త్యా శ్రద్ధయా తన్నిబోధ మే॥13315॥

శాస్త్రోక్తముగా తగిన వయస్సు వచ్చినంతనే పురుషుడు ఉపనయన సంస్కారము ద్వారా ద్విజత్వమును పొందవలెను. పిమ్మట అతడు భక్తిశ్రద్ధలతో నన్ను ఆరాధింపవలెను. ఆ విధానమును తెలిపెదను, వినుము.

27.9 (తొమ్మిదవ శ్లోకము)

అర్చాయాం స్థండిలేఽగ్నౌ వా సూర్యే వాప్సు హృది ద్విజే|

ద్రవ్యేణ భక్తియుక్తోఽర్చేత్స్వగురుం మామమాయయా॥13316॥

భక్తుడు నన్ను గురువుగా భావించి, నిష్కపటభావముతో పూజింపవలెను. ప్రతిమ, సంస్కరింపబడిన వేదిక, అగ్ని, సూర్యుడు, జలము, హృదయము, భూసురుడు అను వాటిలో దేనియందైననూ పూజనీయుడనగు నన్ను భావించి, భక్తితో గూడి పూజాద్రవ్యములతో ఆరాధింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

23.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
27.10 (పదియవ శ్లోకము)

పూర్వం స్నానం ప్రకుర్వీత ధౌతదంతోఽఙ్గశుద్ధయే|

ఉభయైరపి చ స్నానం మంత్రైర్మృద్గ్రహణాదినా॥13317॥

ఉపాసకుడు ప్రాతఃకాలమున దంతధావనమొనర్చుకొని, శరీరశుద్ధికై స్నానమాచరింపవలెను. పిదప వైదిక, తాంత్రిక మంత్రములను పఠించుచు మృత్తికనుగాని, గోమయమునుగాని పూసికొని అనంతరము నిర్మల జలముతో స్నానమును చేయవలెను.

27.11 (పదకొండవ శ్లోకము)

సంధ్యోపాస్త్యాది కర్మాణి వేదేనాచోదితాని మే|

పూజాం తైః కల్పయేత్సమ్యక్ సంకల్పః కర్మపావనీమ్॥13318॥

పిదప విధ్యుక్తరీతిలో సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరింపవలెను. పిమ్మట నన్ను ఆరాధించుటకై సంప్రదాయ పూర్వకముగా సంకల్పము చేసి, వైదిక, తాంత్రిక (ఆగమోక్త) విధానమున పూజింపవలెను. తత్ఫలితముగా అతని కర్మబంధములన్నియును తొలగిపోవును.

27.12 (పండ్రెండవ శ్లోకము)

శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ|

మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా॥13319॥

రాయి, చెక్క, లోహము  (బంగారము, వెండి మొదలగునవి) మట్టి లేక చందనము, చిత్రపటము, ఇసుక, మనోమయము, మణిమయము అను ఎనిమిదింటిలో నా పూజాప్రతిమ ఏదైనను కావచ్చును.

27.13 (పదమూడవ శ్లోకము)

చలాచలేతి ద్వివిధా ప్రతిష్ఠా జీవమందిరమ్|

ఉద్వాసావాహనే న స్తః స్థిరాయాముద్ధవార్చనే॥13320॥

ఉద్ధవా! పూజామందిరమున తాత్కాలికమైన ప్రతిమను గాని, స్థిరమైన ప్రతిమనుగాని నెలకొల్పుకునే పూజింప వచ్చును. స్థిరముగా ప్రతిష్ఠించిన ప్రతిమను ఆరాధించు విషయమున ప్రతిదినము ఆవాహన విసర్జనములతో పనిలేదు.

27.14 (పదునాలుగవ శ్లోకము)

అస్థిరాయాం వికల్పః స్యాత్స్థండిలే తు భవేద్ద్వయమ్|

స్నపనం త్వవిలేప్యాయామన్యత్ర పరిమార్జనమ్॥13321॥

తాత్కాలిక ప్రతిమను ఆరాధించుటయందు రెండు విధానములు గలవు. ఉపాసకులు తాత్కాలిక ప్రతిమ విషయము నందు తమ తమ సంప్రదాయములను అనుసరించి, ఆవాహన విసర్జనములను చేయవచ్చును, చేయకుండవచ్చును, కానీ ఇసుకమూర్తి విషయమున ఆవాహన విసర్జనములను ప్రతిదినమూ చేయవలెను. మట్టి, చందనములతో చేసిన విగ్రహములకును, చిత్రపటములకును స్నానమును (అభిషేకమును) చేయించరాదు. వాటికి కేవలము మార్జనమే చేయవలెను. శిలాది ప్రతిమలకు మాత్రము ప్రతిదినమూ అభిషేకమును ఆచరింపవలెను.

27.15 (పదిహేనవ శ్లోకము)

ద్రవ్యైః ప్రసిద్ధైర్మద్యాగః ప్రతిమాదిష్వమాయినః|

భక్తస్య చ యథా లబ్ధైర్హృది భావేన చైవ హి॥13322॥

శిలాది విగ్రహములకు విధ్యుక్తముగా విశేష ద్రవ్యములతో పూజలను ఆచరింపవలెను. నిష్కామభక్తులు మాత్రము తమ శక్తికి తగిన సామాగ్రితో పూజింపవచ్చును. లేదా మనస్సున ధ్యానించుచు మానసిక పూజను చేయవచ్చును. విధానములు ఏవియైనను భగవాదారాధన విషయమున భక్తిశ్రద్ధలు ప్రధానములు. వాటిని భగవదర్పణము గావించుచుండవలెను.

27.16 (పదహారవ శ్లోకము)

స్నానాలంకరణం ప్రేష్ఠమర్చాయామేవ తూద్ధవ|

స్థండిలే తత్త్వవిన్యాసో వహ్నావాజ్యప్లుతం హవిః॥13323॥

ఉద్ధవా! శిలా! లోహాది ప్రతిమలకు జరుపు పూజలయందు స్నానము, వస్త్రము, ఆభరణములు మొదలగువాటిని యథావిధిగా నిర్వహింపవచ్చును. ఇసుకమూర్తి, మట్టి విగ్రహములను వేదికలపై నిలిపి పూజింపవలెను. అంగప్రత్యంగ దేవతలను మంత్రోక్తముగా స్థాపించి ఆరాధింపవలెను. అగ్నియందు పూజలు సలుపునప్పుడు ఆహుతులను ఘృతమిశ్రితములుగా సమర్పింపవలయును.

27.17 (పదిహేడవ శ్లోకము)

చాభ్యర్హణం ప్రేష్ఠం సలిలే సలిలాదిభిః|

శ్రద్ధయోపాహృతం ప్రేష్ఠం భక్తేన మమ వార్యపి॥13324॥

సూర్యుని ఆరాధించునప్పుడు లేచి నిలబడి మంత్రపూర్వకముగా, స్తుతులతో ఆర్ఘ్యాదులను సమర్పింప వలెను.

ఉద్యంతమస్తంయంతమాదిత్య మభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణోవిద్వాన్ సకలం భద్రమశ్నుతే - ఆసావాదిత్యోబ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద| ఆసావాదిత్యోబ్రహ్మ॥
అట్లే జలరూపముగానున్న నన్ను జలములతోను, పుష్పాదులతోను పూజింపవలెను. దృఢమైన భక్తుడు శ్రద్ధతో సమర్పించినది నీరైనా సరే! అది నాకు చాల ప్రియము.

27.18 (పదునెనిమిదవ శ్లోకము)

భూర్యప్యభక్తోపాహృతం న మే తోషాయ కల్పతే|

గంధో ధూపః సుమనసో దీపోఽన్నాద్యం చ కిం పునః॥13325॥

భక్తిలేనివాడు పెక్కు పూజాద్రవ్యములను సమర్పించిననూ నేను సంతోషించను. మిగుల భక్తిశ్రద్ధలతో సమర్ఫించెడు జలముతోడనే ప్రీతి చెందగల నేను, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులను సమర్పించి పూజించినచో, ఇంక చెప్పవలసినదేమున్నది?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

23.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

27.19 (పందొమ్మిదవ శ్లోకము)

శుచిః సంభృతసంభారః ప్రాగ్దర్భైః కల్పితాసనః|

ఆసీనః ప్రాగుదగ్వార్చేదర్చాయామథ సమ్ముఖః॥13326॥

మొదట ఉపాసకుడు (పూజచేయునతడు) స్నానాదులద్వారా శుచియై పుష్పగంధాది పూజోపకరణములను సమకూర్చు కొనవలయును. పిమ్మట దర్భలయొక్క కొనలు తూర్పుగా నుండునట్లు ఆసనమును కల్పించుకొనవలెను. అనంతరము అతడు తూర్పుముఖముగా గాని, ఉత్తరముఖముగాగాని ఆసనముపై కూర్చుండవలెను. ఒకవేళ పూజాప్రతిమను స్థిరముగా నెలకొల్పుకొనినచో ఆ మూర్తికి అభిముఖముగా కూర్చుండి పూజాకార్యక్రమములను నిర్వర్తింపవలెను.

 27.20 (ఇరువదియవ శ్లోకము)

కృతన్యాసః కృతన్యాసాం మదర్చాం పాణినా మృజేత్|

కలశం ప్రోక్షణీయం చ యథావదుపసాధయేత్॥13327॥

మొదట విధ్యుక్తముగా అంగన్యాస కరన్యాసములను గావింపవలెను. పిదప భగవన్మూర్తియందు మంత్రన్యాసము చేయవలయును. అనంతరము నిర్మాల్యమును తొలగించి స్వామిని చేతితో నెమ్మదిగా తుడిచి శుద్ధిచేయవలెను. జలముతో నిండియున్న కలశమును, ప్రోక్షణ పాత్రాదులను గంధపుష్పాదులతో పూజింపవలెను.

 27.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తదద్భిర్దేవయజనం ద్రవ్యాణ్యాత్మానమేవ చ|

ప్రోక్ష్య పాత్రాణి త్రీణ్యద్భిస్తైస్తైర్ద్రవ్యైశ్చ సాధయేత్॥13328॥

ప్రోక్షణ పాత్రలోని జలములతో పూజాద్రవ్యములను, దేవతామూర్తులను ప్రోక్షింపవలెను. పిదప ఆ జలములతో తనపై ప్రోక్షణ చేసికొనవలెను. క్రమముగా అర్ఘ్యపాద్య ఆచమనములకొఱకై మూడుపాత్రలను, కలశ జలములతో నింపవలెను. వాటియందు సంప్రదాయప్రకారము పూజాద్రవ్యములను ఉంచవలెను (పాద్యపాత్రలో - సామబియ్యము, గరికపోచలు, కమలము, విష్ణుక్రాంత పుష్పములు, చందనము, తులసీదళాదులను, అర్ఘ్యపాత్రలో - గంధ, పుష్ప, అక్షతలు, యవలు, కుశలు, తిలలు,  ఆవాలు, గరిక మున్నగునవి; ఆచమనపాత్రలో - జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు మొదలగునవి వేయవలెను).

 27.22 (ఇరువది రెండవ శ్లోకము)

పాద్యార్ఘ్యాచమనీయార్థం త్రీణి పాత్రాణి దైశికః|

హృదా శీర్ష్ణాథ శిఖయా గాయత్ర్యా చాఽభిమంత్రయేత్॥13329॥

అర్చకుడు (పూజించువ్యక్తి) క్రమముగా పాద్య, అర్ఘ్య, ఆచమనీయములను - మూడు పాత్రలను హృదయ, శీర్ష, శిఖామంత్రములతో అభిమంత్రించవలెను. పిదప గాయత్రీ మంత్రముద్వారా ఆ పాత్ర త్రయమును అభిమంత్రింపవలెను.

 27.23 (ఇరువది మూడవ శ్లోకము)

పిండే వాయ్వగ్నిసంశుద్ధే హృత్పద్మస్థాం పరాం మమ|

అణ్వీం జీవకలాం ధ్యాయేన్నాదాఽంతే సిద్ధభావితామ్॥13330॥

ముందుగా ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును భావనలద్వారా శరీరమందలి అగ్నిని శుద్ధమొనర్పవలెను. పిదప హృదయ కమలమునందు పరమసూక్ష్మము, శ్రేష్ఠమును ఐన దీపశిఖవలెనున్న నా జీవకళను అనగా - హృదయస్థుడగు భగవత్స్వరూపమును ధ్యానింపవలెను. గొప్ప గొప్ప మహర్షులు, సిద్ధులు, ఓంకారము నందలి 'అకార-ఉకార-మకారములు, నాదబిందువులు అను ఐదు కళల అంతమున ఆ జీవకళనే ధ్యానింతురు.

 27.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తయాఽఽత్మభూతయా పిండే వ్యాప్తే సంపూజ్య తన్మయః|

ఆవాహ్యాఽర్చాదిషు స్థాప్య న్యస్తాంగం మాం ప్రపూజయేత్॥13331॥

'భగవంతునియొక్క తేజోమయమైన అంశము నా హృదయమునందు ఉన్నది. ఆ జీవకళ ఆత్మస్వరూపమే' అని భావించుచు, ఆ తేజస్సుతో అంతఃకరణము, శరీరము పూర్తిగా వ్యాప్తమైనప్పుడు ఉపాసకుడు మానసిక ఉపచారములతో దానిని మనస్సులో పూజింపవలెను. అనంతరము తన్మయుడై భగవంతుని (నన్ను) ఆవాహనచేసి, ప్రతిమాదుల రూపములలో నన్ను ప్రతిష్ఠించవలెను. పిమ్మట మంత్రములద్వారా అంగన్యాసాదులొనర్చి, నన్ను అర్చింపవలెను.

 27.25 (ఇరువది ఐదవ శ్లోకము)

పాద్యోపస్పర్శార్హణాదీనుపచారాన్ ప్రకల్పయేత్|

ధర్మాదిభిశ్చ నవభిః కల్పయిత్వాఽఽసనం మమ॥13332॥

 27.26 (ఇరువది ఆరవ శ్లోకము)

పద్మమష్టదలం తత్ర కర్ణికాకేసరోజ్జ్వలమ్|

ఉభాభ్యాం వేదతంత్రాభ్యాం మహ్యం తూభయసిద్ధయే॥13333॥

ఉద్ధవా! నా ఆసనముపై 'ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యములు' అను నాలుగు గుణములను, సత్త్వ రజస్తమోగుణములతో గూడిన పీఠమున భావన చేయవలెను. దానిపై 'విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన, అనుగ్రహ అను నవవిధ శక్తులను ఆవాహన చేయవలెను. ఆ ఆసనమపై అష్టదళపద్మములను కల్పింపవలెను. దాని కర్ణిక మిగుల ప్రకాశవంతమై, పచ్చని కింజల్కముల శోభలతో విరాజమానమగుచుండును. ఆ ఆసనమునుగూర్చి ఇట్లు భావన చేసిన పిదప అర్ఘ్యపాద్య ఆచమనీయాది ఉపచారములను చేయవలెను. పిదప స్వర్గ-అపవర్గ సిద్ధికొఱకు వైదిక, తాంత్రిక విధానములచే నన్ను అర్చింపవలెను.

 27.27 (ఇరువది ఏడవ శ్లోకము)

సుదర్శనం పాంచజన్యం గదాసీషుధనుర్హలాన్|

ముసలం కౌస్తుభం మాలాం శ్రీవత్సం చాఽనుపూజయేత్॥13334॥

అనంతరము సుదర్శనచక్రము, పాంచజన్యశంఖము, కౌమోదకీగద, నందకనామ ఖడ్గము, శారఙ్గ ధనుస్సు, బాణములు, హలము, ముసలము - అను ఎనిమిది ఆయుధములను ఎనిమిది దిశలయందును, కౌస్తుభమణి, వైజయంతీమాల, శ్రీవత్సచిహ్నము అసు వాటిని వక్షస్థలమునందును యథావిధిగా పూజింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

: 24.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

27.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

నందం సునందం గరుడం ప్రచండం చండమేవ చ|

మహాబలం బలం చైవ కుముదం కముదేక్షణమ్॥13335॥

 27.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

దుర్గాం వినాయకం వ్యాసం విష్వక్సేనం గురూన్ సురాన్|

స్వే స్వే స్థానే త్వభిముఖాన్ పూజయేత్ప్రోక్షణాదిభిః॥13336॥

తదుపరి 'నంద - సునంద - ప్రచండ - చండ - మహాబల - బల - కుముద - కుముదేక్షణులు' అను ఎనిమిదిమంది పార్షదులను అష్టదిక్కులయందును, గరుడుని నాకు అభిముఖునిగను అర్చింపవలెను. దుర్గాదేవిని, వినాయకుని, వ్యాసుని, విష్వక్సేనుని నాల్గుమూలలయందు నిలిపి పూజింపవలెను. ఎడమ పార్శ్వమునందు గురువులను, తూర్పు మొదలగు దిక్కులయందు ఇంద్రాది దిక్పాలకులను స్థాపనచేయవలెను. ప్రోక్షణ - అర్ఘ్యప్రదానాదులతో వారిని క్రమముగా ఆరాధింపవలెను.

 27.30 (ముప్పదియవ శ్లోకము)

చందనోశీరకర్పూరకుంకుమాగురువాసితైః|

సలిలైః స్నాపయేన్మంత్రైర్నిత్యదా విభవే సతి॥13337॥

 27.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

స్వర్ణఘర్మానువాకేన మహాపురుషవిద్యయా|

పౌరుషేణాపి సూక్తేన సామభీ రాజనాదిభిః॥13338॥

చందనము, వట్టివేళ్ళు, కర్పూరము, కుంకుమ, అగరు మొదలగు సుగంధద్రవ్యములతో మిశ్రితములై పరిమళభరితమలైన జలములతో, సువర్ణఘర్మాను వాకమును పఠించుచు మంత్రపూర్వకముగా నన్ను అభిషేకింపవలెను. ఇట్లు నిత్యము తమ విభవానుసారము అర్చింపవలెను. ఆ అభిషేక సమయమున 'సువర్ణఘర్మంపరివేదవేనం' అను వాకమును, ' జితంతే పుండరీకాక్ష! నమస్తే విశ్వభావన,| నమస్తేఽస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ॥ అను మహాపురుష విద్యామంత్రమును, ' సహస్రశీర్షాపురుషః' అను పురుషసూక్తాది మంత్రములును, 'ఇంద్రం నరోనియమాధాతా హవంత' ఇత్యాది సామవేద మంత్రములను పఠింపవలెను. మంగళ నీరాజనాదులను సమర్పింపవలెను.

 27.32 (ముప్పది రెండవ శ్లోకము)

వస్త్రోపవీతాఽఽభరణపత్రస్రగ్గంధలేపనైః|

అలంకుర్వీత సప్రేమ మద్భక్తో మాం యథోచితమ్॥13339॥

వస్త్రములు, యజ్ఞోపవీతము, ఆభరణములు, తులసీదళాది పత్రములు, పూలమాలలు, శ్రీగంధాది లేపనములు మొదలగు వానితో నా భక్తుడు శ్రద్ధా పూర్వకముగా నన్ను యథోచితముగా అలంకరింపవలెను.

 27.33 (ముప్పది మూడవ శ్లోకము)

పాద్యమాచమనీయం చ గంధం సుమనసోఽక్షతాన్|

ధూపదీపోపహార్యాణి దద్యాన్మే శ్రద్ధయాఽర్చకః॥13340॥

ఉపాసకుడు నాకు భక్తిశ్రద్ధలతో పాద్యమును, ఆచమనీయమును, చందనమును, పుష్పములను, అక్షతలను,ధూప, దీప నైవేద్యములను సమర్పింపవలెను.

 27.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

గుడపాయససర్పీంషి శష్కుల్యాపూపమోదకాన్|

సంయావదధిసూపాంశ్చ నైవేద్యం సతి కల్పయేత్॥13341॥

యథాశక్తిగా నాకు పాయసమును, ఘృతమును, నేతితో సిద్ధపరచబడిన చక్కిలములను, ఆపూపములను, మోదకములను (లడ్డూలను), హల్వా, పెఱుగు, పప్పు, కూరలను, ఇంకను వివిధ వ్యంజనములను నివేదింపవలెను.

 27.35 (ముప్పది ఐదవ శ్లోకము)

అభ్యంగోన్మర్దనాదర్శదంతధావాభిషేచనమ్|

అన్నాద్యగీతనృత్యాది పర్వణి స్యురుతాన్వహమ్॥13342॥

భగవంతుని విగ్రహమునకు దంతధావనము, అభ్యంగస్నానాదులు, పంచామృత స్నానము, శుద్ధోదక స్నానము, సుగంధలేపనములు, దర్పణ దర్శనములు, నైవేద్యము సమర్పింపవలెను. ప్రతిదినముగాని, కనీసము పర్వదినములలోగాని నృత్యగీతాదులను, నామసంకీర్తనములను నెఱపవలెను.

 27.36 (ముప్పది ఆరవ శ్లోకము)

విధినా విహితే కుండే మేఖలాగర్తవేదిభిః|

అగ్నిమాధాయ పరితః సమూహేత్పాణినోదితమ్॥13343॥

 27.37 (ముప్పది ఏడవ శ్లోకము)

పరిస్తీర్యాథ పర్యుక్షేదన్వాధాయ యథావిధి|

ప్రోక్షణ్యాసాద్య ద్రవ్యాణి ప్రోక్ష్యాగ్నౌ భావయేత మామ్॥13344॥

ఉద్ధవా! పూజానంతరము శాస్త్రోక్తముగా నిర్మింపబడిన కుండమునందు అగ్నిని ప్రతిష్ఠించవలెను. ఆ కుండము మేఖలాగర్తవేదికలతో శోభిల్లుచుండవలెను. కుండమునందు అగ్నిని ఉంచి, చేతిని అడ్డముగా పెట్టి గాలి ఊది ప్రజ్వరిల్లచేయవలెను. చేతితో సమిధలను ఒకచోటికి చేర్చవలెను. వేదికకు నలువైపుల పదహారేసి కుశలను పఱచి (పరిస్తరణములను ఉంచి) వాటిపై మంత్రపూర్వకముగా జలములను ప్రోక్షింపవలెను. అనంతరము సమిధాది హోమద్రవ్యములను అగ్నికుండమునకు ఉత్తరభాగము నందుంచి, ప్రోక్షణ పాత్రయందలి జలములతో, వాటిపైనను, ఆజ్యపాత్ర మీదను ప్రోక్షణ చేయవలెను. పిమ్మట అగ్నియందు నన్ను భావన చేసి ఇట్లు ధ్యానింపవలెను. (తరువాయి, ముప్పది ఎనిమిదవ శ్లోకము నుండి)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

*****

24.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

27.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తప్తజాంబూనదప్రఖ్యం శంఖచక్రగదాంబుజైః|

లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్కవాససమ్॥13345॥

27.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

స్ఫురత్కిరీటకటకకటిసూత్రవరాంగదమ్|

శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభం వనమాలినమ్॥13346॥

"స్వామీ! నీ దివ్యరూపము మేలిమి బంగారమువలె ధగధగమెరయు చున్నది. నీ చతుర్భుజములు శంఖ, చక్ర, గదా, పద్మములతో శోభిల్లుచున్నవి. నీ భవ్యరూపము ప్రసన్నమై గంభీరముగానున్నది. నీ పట్టుపీతాంబరము పద్మకింజల్క శోభలను వెలార్చుచున్నది. శిరమున కిరీటము, ముంజేతుల యందు కంకణములు, నడుమునందు కటిసూత్రము, బాహువులయందు భుజకీర్తులు తళతళలాడుచున్నవి. వక్షస్థలమునందు శ్రీవత్సచిహ్నము, కంఠమున కౌస్తుభమణి, అపూర్వకాంతులను విరజిమ్ముచున్నవి. నీ మెడయందు విరాజిల్లుచున్న వనమాలా పరిమళములు దివ్యములు.

27.40 (నలుబదియవ శ్లోకము)

ధ్యాయన్నభ్యర్చ్య దారూణి హవిషాభిఘృతాని చ|

ప్రాస్యాజ్యభాగావాఘారౌ దత్త్వా చాజ్యప్లుతం హవిః॥13347॥

ఈ విధముగా అగ్నిదేవునియందు నా మూర్తిని ధ్యానించి పూజింపవలెను. అనంతరము నేతితో అభిఘరించిన సమిధలను ఆహుతులనుగా సమర్పింపవలెను. పిదప ఆజ్యభాగములను, ఆఘార (నెయ్యి అభిఘరించిన) సమిధలను  హోమము చేయవలెను. అనంతరము తక్కిన హోమద్రవ్యములను అభిఘరించి, అగ్నికి సమర్పింపవలెను.

27.41 (నలుబది ఒకటవ శ్లోకము)

జుహుయాన్మూలమంత్రేణ షోడశర్చావదానతః|

ధర్మాదిభ్యో యథా న్యాయం మంత్రైః స్విష్టికృతం బుధః॥13348॥

27.42 (నలుబది రెండవ శ్లోకము)

అభ్యర్చ్యాథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్|

మూలమంత్రం జపేద్బ్రహ్మ స్మరన్ నారాయణాత్మకమ్॥13349॥

పిదప తమ ఇష్టమంత్రముద్వారా లేక 'ఓమ్ నారాయణాయ' అను అష్టాక్షరీ మంత్రముద్వారా, ఇంకను పురుషసూక్తమునందలి పదునారు మంత్రములద్వారా హోమకార్యములను నిర్వర్తింపవలెను. పిదప యాజకుడు ధర్మాది దేవతలకుగూడ ధర్మాయ స్వాహా ఇత్యాది విధ్యుక్త మంత్రములద్వారా హవనము చేయవలెను. అగ్నయే స్విష్టకృతే స్వాహా, ఇదమగ్నయ స్విష్టకృతమిదం న మమ అని పఠించుచు హోమము చేయవలెను. ఇట్లు అగ్నియందు అంతర్యామిగా నున్న పరమాత్మను యథావిధిగా పూజించి, ప్రణమిల్లవలెను. పిమ్మట నంద, సునందాది పార్షదులకు ఎనిమిది దిశలయందును హవనకర్మాంగ బలులను సమర్పింపవలెను. అనంతరము ప్రతిమకు అభిముఖముగా ఓమ్ నమో నారాయణాయ అను భగవద్రూప మూలమంత్రమును జపింపవలెను.

27.43 (నలుబది మూడవ శ్లోకము)

దత్త్వాఽఽచమనముచ్ఛేషం విష్వక్సేనాయ కల్పయేత్|

ముఖవాసం సురభిమత్తాంబూలాద్యమథార్హయేత్॥13350॥

అనంతరము భగవంతునకు నివేదించిన ప్రసాదమును ఆచమన పూర్వకముగా విష్వక్సేనునకు సమర్ఫింపవలెను. తరువాత కర్పూరాది పరిమళద్రవ్య యుక్తముగా తాంబూలమును ముఖవాసముగా సమర్పింపవలెను. పిదప పుష్పాంజలి సమర్పింపవలెను.

27.44 (నలుబది మూడవ శ్లోకము)

ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణ్యభినయన్ మమ|

మత్కథాః శ్రావయన్ శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్॥13351॥

నా లీలలను వర్ణించుచు అభినయపూర్వకముగా గానము చేయవలెను. పారవశ్యముతో నృత్యమొనర్పవలెను. మహిమాన్వితములైన నా గాథలను  స్వయముగా వినుటయేగాక, ఇతరులకు వినిపింపవలెను. క్షణకాలము ఐహిక విషయములను  మరచి, నాయందే తన్మయుడై యుండవలెను.

27.45 (నలుబది ఐదవ శ్లోకము)

స్తవైరుచ్చావచైః స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి|

స్తుత్వా ప్రసీద భగవన్నితి వందేత దండవత్॥13352॥

వేదోక్తములైన, పౌరాణికములైన స్తుతులద్వారా స్తుతించుచు, అట్లే భక్తులద్వారా ప్రచలితములైన కీర్తనలను గానము చేయుచు 'ప్రభూ! నా యెడల ప్రసన్నుడవగుము, నీ కృపాకటాక్షములను నాపై ప్రసరింపజేయుము' అని ప్రార్థించుచు సాష్టాంగనమస్కారము  చేయవలెను.

27.46 (నలుబది ఆరవ శ్లోకము)

శిరో మత్పాదయోః కృత్వా బాహుభ్యాం చ పరస్పరమ్|

ప్రపన్నం పాహి మామీశ భీతం మృత్యుగ్రహార్ణవాత్॥13353॥

పిమ్మట ఉపాసకుడు (అర్చన చేయునతడు) తన శిరస్సును నా పాదములపై ఉంచి, తన కుడిచేతితో నా కుడిపాదమును, ఎడమచేతితో నా ఎడమపాదమును స్పృశించుచు ఇట్లు ప్రార్థింపవలెను - 'దేవా! నేను ఈ సంసారసాగరమునందు మునిగియున్నాను. మృత్యువను మొసలి నన్ను వెంటాడుచున్నది. ఆ భయమునుండి నన్ను ఉద్ధరించుటకై నిన్ను శరణుజొచ్చితిని. నన్ను కాపాడుము'

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

25.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఏడవ అధ్యాయము

భగవత్పూజావిధానము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
27.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఇతి శేషాం మయా దత్తాం శిరస్యాధాయ సాదరమ్|

ఉద్వాసయేచ్చేదుద్వాస్యం జ్యోతిర్జ్యోతిషి తత్పునః॥13354॥

ఈ విధముగా ప్రార్థించిన పిమ్మట నాకు సమర్పించిన తులసీమాలను నా ప్రసాదముగా భావించి, భక్తిపూర్వకముగా శిరస్సున ధరింపవలెను. మంత్రపూర్వకముగా ఉద్వాసనమొనర్చునప్పుడు నా ప్రతిమయందు ఆవాహనము ద్వారా నిలిపిన జ్యోతిని తన అంతరాత్మయందు నిలుపుకొనవలయును.

27.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

అర్చాదిషు యదా యత్ర శ్రద్ధా మాం తత్ర చాఽర్చయేత్|

సర్వభూతేష్వాత్మని చ సర్వాత్మాహమవస్థితః॥13355॥

ఉపాసకుడు తనకు భక్తిశ్రద్ధలుగల ప్రతిమయందు నన్ను పూజింపవలెను. ఏలయన, నేను సర్వాత్మను, సకలప్రాణులలోను, అట్లే ఉపాసకుని హృదయమునందును నెలకొనియుందును.

27.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

ఏవం క్రియాయోగపథైః పుమాన్ వైదికతాంత్రికైః|

అర్చన్నుభయతః సిద్ధిం మత్తో విందత్యభీప్సితామ్॥13356॥

ఉద్ధవా! ఈ విధముగా వైదిక, తాంత్రిక క్రియాయోగముల ద్వారా నన్ను పూజించిన ఏ భక్తునకైనను ఇహపరలోకముల యందు అతని అభీష్టములు అన్నియును సిద్ధించును.

27.50 (ఏబదియవ శ్లోకము)

మదర్చాం సంప్రతిష్ఠాప్య మందిరం కారయేద్దృఢమ్|

పుష్పోద్యానాని రమ్యాణి పూజాయాత్రోత్సవాశ్రితాన్॥13357॥

భక్తుడు తన శక్త్యనుసారము దృఢమైన చక్కని మందిరమును నిర్మించి, అందు నా అర్చామూర్తిని స్థాపింపవలెను. అందులకు అనుగుణముగా సర్వాంగసుందరమైన పుష్పోద్యానములను ఏర్పరచవలెను. నిత్యపూజకు తగిన ఏర్పాట్లు చేయవలెను. పర్వదినముల యందు వసంతోత్సవాదులను నిర్వహింపవలెను. శోభాయాత్రలను  జరుపవలయును.

27.51 (ఏబది ఒకటవ శ్లోకము)

పూజాదీనాం ప్రవాహార్థం మహాపర్వస్వథాన్వహమ్|

క్షేత్రాపణపురగ్రామాన్ దత్త్వా మత్సార్ష్టితామియాత్॥13358॥

ప్రతినిత్యము నియమానుసారముగా పూజలు నిరాటంకముగా నిర్వహింపబడుటకుగాను మరియు, పర్వదినములయందు జరుపవలసిన ఉత్సవాదులు సక్రమముగా కొనసాగించుటకై పొలములను, అంగడి వీథులను, నగరములను, గ్రామములను నా పేరిట సమర్పించినవారికి, నాతో సరిసమానములైన ఐశ్వర్యములు లభించును.

27.52 (ఏబది రెండవ శ్లోకము)

ప్రతిష్ఠయా సార్వభౌమం సద్మనా భువనత్రయమ్|

పూజాదినా బ్రహ్మలోకం త్రిభిర్మత్సామ్యతామియాత్॥13359॥

భక్తిశ్రద్ధలతో నా మూర్తిని ప్రతిష్ఠించినవాడు సార్వభౌముడు అగును. మందిరమును నిర్మించినవాడు ముల్లోకములకును అధిపతియగును. సాదరముగా నా పూజావ్యవస్థను ఏర్పరచినవాడు బ్రహ్మలోకమును చేరును. ఈ మూడింటిని గావించినవాడు నా సాయుజ్యమునే పొందును.

27.53 (ఏబది మూడవ శ్లోకము)

మామేవ నైరపేక్ష్యేణ భక్తియోగేన విందతి|

భక్తియోగం స లభత ఏవం యః పూజయేత మామ్॥13360॥

నిష్కామభావముతో నన్ను పూజించినవారికి భక్తియోగము ప్రాప్తించును. అట్టి నిరపేక్షమైన భక్తియోగముద్వారా వారు స్వయముగా నన్నే పొందగలరు.

27.54 (ఏబది నాలుగవ శ్లోకము)

యః స్వదత్తాం పరైర్దత్తాం హరేత సురవిప్రయోః|

వృత్తిం స జాయతే విడ్భుగ్ వర్షాణామయుతాయుతమ్॥13361॥

27.55 (ఏబది ఐదవ శ్లోకము)

కర్తుశ్చ సారథేర్హేతోరనుమోదితురేవ చ|

కర్మణాం భాగినః ప్రేత్య భూయో భూయసి తత్ఫలమ్॥13362॥

దేవతలకును, భూసురులకును తానుగాని, ఇతరులుగాని జీవనోపాయములుగా దానమొనర్చినవాటిని (మాన్యములు మొదలగువాటిని) అపహరించినవాడు (అక్రమముగా అనుభవించినవాడు) క్రిమిగా జన్మించి, వేలకొలది సంవత్సరములు మలమూత్రములలో జీవించుచుండును. ఆ విధమగా దేవబ్రాహ్మణ మాన్యములను అపహరించినవారును, వాటిని ఆమోదించిన వారును మరణించిన పిదప తత్పాపఫలములను కర్తతో సమానముగా అనుభవించెదరు. వారి పాత్ర అధికముగా నుండును.

శ్లో. కర్తా కారయితాచైవ, ప్రేరకశ్చానుమోదకః|

సుకృతే దుష్కృతేచైవ, చత్వారః సమభాగినః॥ (ధర్మశాస్త్రము)

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే సప్తవింశోఽధ్యాయః (27)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి భగవత్పూజావిధానము అను ఇరువది ఏడవ అధ్యాయము (27)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


25.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పరమార్థ నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

28.1 (ప్రథమ శ్లోకము)

పరస్వభావకర్మాణి న ప్రశంసేన్న గర్హయేత్|

విశ్వమేకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చ॥13363॥

శ్రీకృష్ణభగవానుడు వచించెను ఉద్ధవా! విశ్వమంతయును చేతనతత్త్వముతో కూడిన ఒకే ఒక ఆత్మ సత్తతో వ్యాపించియున్నది. అట్లే ప్రకృతియొక్క కార్యమగు జడతత్త్వముకూడా విశ్వమంతటా ఒకేవిధముగ వ్యాపించియున్నది. ఈ రీతిగా జడ-చేతనాత్మకమగు సమస్త విశ్వము అద్వితీయ ఆత్మస్వరూపమే యగును. కావున ఇట్టి అద్వైతదృష్టిని కలిగి ఇతరుల స్వభావములను గూర్చిగాని, వారి పనులను గురుంచిగాని పొగడకూడదు. అట్లే నిందించకూడదు.

28.2  (రెండవ శ్లోకము)

పరస్వభావకర్మాణి యః ప్రశంసతి నిందతి|

స ఆశు భ్రశ్యతే స్వార్థాదసత్యభినివేశతః॥13364॥

ఇతరుల యొక్క స్వభావములను, వారి కర్మలను ప్రశంసించువారును, నిందించువాడును అసత్తునందు పట్టుదల వహించుటచే స్వార్ధములో మునిగి పరమార్థసాధనమునుండి భ్రష్టులగుదురు.

28.3 (మూడవ శ్లోకము)

తైజసే నిద్రయాఽఽపన్నే పిండస్థో నష్టచేతనః|

మాయాం ప్రాప్నోతి మృత్యుం వా తద్వన్నానార్థదృక్ పుమాన్॥13365॥

ఇంద్రియములు అన్నియును తైజసము అనగా - రాజసాహంకార కార్యములు, అట్టి ఇంద్రియములు నిద్రలో మునిగినప్పుడు దేహమునందుగల జీవుడు చైతన్యరహితుడగును. స్వప్నావస్థలో వివిధమలగు మాయా దృశ్యములను చూచును. సుషుప్తియందు అజ్ఞాననిద్రలో మునిగియుండును. ఇదేవిధముగా జాగ్రదావస్థలో జీవుడు తన అద్వితీయ ఆత్మస్వరూపమును మరచిపోయి మాయామయమగు పదార్థములను, సత్యములుగా దర్శించును. అప్పుడు అతడు స్వప్నమువలె మిథ్యాదృశ్యములందు చిక్కుకొనును. లేక మృత్యురూపమగు అజ్ఞానమునందు లీనమగును.

28.4 (నాలుగవ శ్లోకము)

కిం భద్రం కిమభద్రం వా ద్వైతస్యావస్తునః కియత్|

వాచోదితం తదనృతం మనసా ధ్యాతమేవ చ॥13366॥

యథార్థముగా వస్తువే లేనప్పుడు దాని మంచి చెడ్డలను గూర్చి నుడువుట కేవలము వాగ్వైభవమే యగును. మిథ్యయైన అసత్పదార్థములను గూర్చి చింతించుట కేవలము వ్యర్థమే.

28.5 (ఐదవ శ్లోకము)

ఛాయా ప్రత్యాహ్వయాభాసా హ్యసంతోఽప్యర్థకారిణః|

ఏవం దేహాదయో భావా యచ్ఛంత్యామృత్యుతో భయమ్॥13367॥

ఛాయ (నీడ), ప్రతిధ్వని, ఆభాస అనగా దర్పణములోగల ప్రతిబింబము, ఈ మూడును సత్యములుగాకున్నను, వాటిద్వారా కార్యములు జరుగుచుండును. ఇదే ప్రకారము దేహాదిభావములు అసత్యములే ఐనప్పటికినీ దేహాభిమానియగు జీవునకు మృత్యుపర్యంతము భయమును కలిగించును.

28.6 (ఆరవ శ్లోకము)

ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభుః|

త్రాయతే త్రాతి విశ్వాత్మా హ్రియతే హరతీశ్వరః॥13368॥

ఉద్ధవా! ఈ విశ్వమంతా ఆత్మస్వరూపమే. ఆ ప్రభువు విశ్వరూపముగ తనను తానే సృష్టించుకొనుచున్నాడు. విశ్వాత్మయైన ఆ స్వామి తనను తానే రక్షించుకొనుచున్నాడు. అట్లే తనకు తానే లయమొనర్చు కొనుచున్నాడు. ఇదంతా ఆ స్వామి లీలావిలాసము.

28.7 (ఏడవ శ్లోకము)

తస్మాన్న హ్యాత్మనోఽన్యస్మాదన్యో భావో నిరూపితః|

నిరూపితేయం త్రివిధా నిర్మూలా భాతిరాత్మని|

ఇదం గుణమయం విద్ధి త్రివిధం మాయయా కృతమ్॥13369॥

పైన పేర్కొనబడిన హేతువులన్నింటి సారాంశముగా ఆత్మ తక్క వేరొక అస్తిత్వము లేదని స్పష్టమగుచున్నది. ఆత్మకంటె వేరుగా ఈ ప్రపంచమునందు అధ్యాత్మ - అధిభూత - అధిదైవము అను మూడువిధములుగా ప్రతీతమగుచున్నదానికి ఉనికి లేదు. అందుచే అది నిర్మూలము అని చెప్పబడినది. కావున ఈ ప్రపంచము త్రిగుణమయమగు మాయద్వారా భాసిల్లుచున్నది. స్వయంగా ఇది అసత్తు అగుతూ కూడా ఆత్మసత్తాయొక్క అధిష్ఠానమువలన సత్యముగా గోచరించుచున్నది.

28.8 (ఎనిమిదవ శ్లోకము)

ఏతద్విద్వాన్ మదుదితం జ్ఞానవిజ్ఞాననైపుణమ్|

న నిందతి న చ స్తౌతి లోకే చరతి సూర్యవత్॥13370॥

ఉద్ధవా! జ్ఞాన, విజ్ఞానయుక్తమైన ఈ నా ఉపదేశమును చక్కగా గ్రహించిన విద్వాంసుడు ఎవరినీ నిందింపడు, ఎవ్వరినీ స్తుతింపడు. అట్టి మహాపురుషుడు సూర్యునివలె ఈ జ్ఞానమును (ప్రకాశమును) సర్వత్ర విస్తరింపజేయుచు తిరుగుచుండును.

28.9 (తొమ్మిదవ శ్లోకము)

ప్రత్యక్షేణాఽనుమానేన నిగమేనాత్మసంవిదా|

ఆద్యంతవదసజ్జ్ఞాత్వా నిఃసంగో విచరేదిహ॥13371॥

ఉద్ధవా! ప్రత్యక్ష - అనుమాన ప్రమాణములద్వారా, శాస్త్రములద్వారా, మహాపురుషుల వచనములవలన, ఆత్మానుభవముద్వారా పిపీలకాది బ్రహ్మపర్యంతముగల ఈ జగత్తు అంతయును అసత్తు అని ఎరుంగవలెను. ఇవి అన్నియును ఆద్యంతములు గలవి, నశ్వరములు, 'ఆత్మ' ఒక్కటే శాశ్వతము. ఈ విషయములను బాగుగా గ్రహించి, మానవుడు ఈ మిథ్యాప్రపంచమున ఆసక్తిని వీడి మెలగవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఎనిమిదవ ధ్యాయము ఇంకను కొనసాగును)

26.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పరమార్థ నిరూపణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్ధవ ఉవాచ

28.10 (పదియవ శ్లోకము)

నైవాత్మనో న దేహస్య సంసృతిర్ద్రష్టృదృశ్యయోః|

అనాత్మస్వదృశోరీశ కస్య స్యాదుపలభ్యతే॥13372॥

ఉద్ధవుడు పలికెను శ్రీకృష్ణపరమాత్మా! ఆత్మ ద్రష్ట అనగా చూచేది దేహము, దృశ్యము అనగా చూడబడేది. ఆత్మ స్వయంప్రకాశము కాగా దేహము జడము. ఇట్టిస్థితిలో జన్మ - మృత్యురూపమగు సంసారము శరీరమునకు లేదు, ఆత్మకును లేదు. కాని, లోకంలో జనన-మరణములు కలుగుట కన్పించుచున్నదిగదా! మరి ఈ జననము - మరణము దేనికి కలుగుచున్నట్లు? ఆత్మకా లేక దేహానికా?

28.11 (పదకొండవ శ్లోకము)

ఆత్మాఽవ్యయోఽగుణః శుద్ధః స్వయంజ్యోతిరనావృతః|

అగ్నివద్దారువదచిద్దేహః కస్యేహ సంసృతిః॥13373॥

ఆత్మ నాశముకానిది, ప్రాకృత - అప్రాకృత గుణములు లేనిది (నిర్గుణము) శుద్ధమైనది. స్వయంప్రకాశము. ఎటువంటి ఆవరణములు లేనిది. అయితే దేహము మాత్రము కట్టెవలె జడమైనది. కాగా ఆత్మచేతనము. అగ్నివలె స్వయంప్రకాశము. ఐనప్పుడు ఈ జన్మ-మృత్యు రూపమగు సంసారము దేనికి సంబంధించినది?

శ్రీభగవానువాచ

28.12  (పండ్రెండవ శ్లోకము)

యావద్దేహేంద్రియప్రాణైరాత్మనః సన్నికర్షణమ్|

సంసారః ఫలవాంస్తావదపార్థోఽప్యవివేకినః॥13374॥

శ్రీకృష్ణభగవానుడు వచించెను ప్రియా ఉద్ధవా! వాస్తవముగా ఈ జగత్తునకు అస్తిత్వము లేదు. ఐనప్పటికినీ దేహేంద్రియ ప్రాణములతో ఆత్మకు సంబంధము జోడింపబడుటవలన, అజ్ఞానికి అహంకారము వలన మిథ్యయైన ఈ జగత్తు సత్యముగ స్ఫురించును. సుఖ-దుఃఖములను కలిగించును.

28.13 (పదమూడవ శ్లోకము)

అర్థే హ్యవిద్యమానేఽపి సంసృతిర్న నివర్తతే|

ధ్యాయతో విషయానస్య స్వప్నేఽనర్థాగమో యథా॥13375॥

జీవుడు స్వప్నమునందు పెక్కు అనర్థములను చూచినప్పుడు వాటిని నిజమైనవిగా భావించి దుఃఖించును. కాని మేల్కొనినంతనే ఈ అనర్థములు అన్నియును దూరమగును. అట్లే జాగ్రదవస్థయందును దేహాభిమానియగువాడు తనకు గోచరించుచున్న జగత్తునందలి మిథ్యా విషయములను నిరంతరము చింతించు చుండుటవలన ఈ జననమరణ చక్రములో పరిభ్రమించుచునే యుండును.

28.14 (పదునాలుగవ శ్లోకము)

యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్|

స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే॥13376॥

మానవుడు స్వప్నజగత్తులో ఉన్నప్పుడు (స్వప్నమునందు ఆయా అనుభవములను పొందుచున్నప్పుడు) మెలకువ రానంతవరకును ఎన్నియో అనర్థములను (సుఖదుఃఖములను ) అనుభవించుచుండును. మెలకువ వచ్చినంతనే స్వప్నములో అనుభవించిన అనర్థములు ఉండవు. వాటివలన కలిగిన మోహాదివికారములును ఉండవు.

28.15 (పదిహేనవ శ్లోకము)

శోకహర్షభయక్రోధలోభమోహస్పృహాదయః|

అహంకారస్య దృశ్యంతే జన్మమృత్యుశ్చ నాఽత్మనః॥13377॥

ఉద్ధవా! అదేవిధముగా 'నేను-నాది' అను భావములు అనగా అహంకార మమకారములు ఉన్నంతవరకును జీవునకు శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, కాంక్ష మొదలగు భావములునూ, అట్లే జన్మ, మృత్యురూప దుఃఖములును కలుగుచునే యుండును. ఇవి అన్నియును దేహాభిమానికి సంభవించును. కానీ! ఆత్మకు వీటితో ఎట్టి సంబంధమూ ఉండదు.

28.16 (పదహారవ శ్లోకము)

దేహేంద్రియప్రాణమనోఽభిమానో జీవోఽన్తరాత్మా గుణకర్మమూర్తిః|

సూత్రం మహానిత్యురుధేవ గీతః సంసార ఆధావతి కాలతంత్రః॥13378॥

దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు - అను ఇవన్నియును 'నావి' అని అభిమానించుటచే పిండస్థమైన అంతరాత్మ 'జీవుడు' అనబడును. ఇట్టి అహంకారము వలననే గుణకర్మలతో సంబంధము జోడించుకొనుటవలన ఈ జీవునకు సూక్ష్మృశరీరము ఏర్పడును. దీనినే లింగశరీరము అని అందురు. కాలముయొక్క ప్రేరణతో పరమేశ్వరుని అధీనములో ఉండి ఈ జీవుడు అహంకారమువలన జననమరణ చక్రమునందు పరిభ్రమించుచుండును. పరమాత్మ ఒక్కడే అవికారి, అతడు తప్ప ఇతరములన్ని కూడా కాలమునకు అధీనములే. విరాట్ జీవుడు సూత్రాత్మ, మహత్తత్త్వము మున్నగు పేర్లతో వ్యవహరింపబడును. అది కూడా కాలముయొక్క ప్రేరణతో సంసారమునందు పరిభ్రమించుచుండును.

28.17 (పదిహేడవ శ్లోకము)

అమూలమేతద్బహురూపరూపితం మనోవచఃప్రాణశరీరకర్మ|

జ్ఞానాఽసినోపాసనయా శితేనచ్ఛిత్త్వా మునిర్గాం విచరత్యతృష్ణః॥13379॥

ఈ అహంకారమే మనస్సు, వాక్కు, ప్రాణము, శరీరము, కర్మ మొదలగు పెక్కురూపములలో గోచరించుచుండును. ఇది అమూలము. కనుక ఇది మిథ్య. ఈఅహంభావ కారణముగనే జీవుడు బద్ధుడగుచున్నాడు. ఈ జీవుడు తృష్ణారహితుడై భగవంతుని ఉపాసించుటవలన లభించిన జ్ఞానమనెడి పదునైన ఖడ్గముచే బంధహేతువైన ఆ అహంకారమును ఛేదింపవలెను. భగవత్స్వరూపమును నిరంతరము  మననము చేయుచుండ వలెను. అంతట జీవన్ముక్తుడై స్వేచ్ఛగా భూతలమున సంచరించును.

28.18 (పదునెనిమిదవ శ్లోకము)

జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ ప్రత్యక్షమైతిహ్యమథానుమానమ్|

ఆద్యంతయోరస్య యదేవ కేవలం కాలశ్చ హేతుశ్చ తదేవ మధ్యే॥13380॥

ఆత్మానాత్మ స్వరూపమును చక్కగా ఎరుంగుటయే జ్ఞానము. వివేకము కలిగినంతనే అనగా నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము కలిగినంతనే, ద్వైతభావన తొలగును. కనుక ఆత్మచింతనద్వారా హృదయమును పరిశుద్ధమొనర్చు కొనవలయును. తపస్సు (కర్మయోగము), నిగమము (శాస్త్రాధ్యయనము వలన కలిగిన జ్ఞానము), ప్రత్యక్షము (ఆత్మకు, అనాత్మకు మధ్యగల భేదమును అనుభవపూర్వకముగా తెలిసికొనుట), ఐతిహ్యము (మహాపురుషుల యొక్క ఉపదేశము), అనుమానము (కృష్యాది దృష్టాంతముల వలన కర్మఫలములను ఊహించుట) మొదలగు సాధనములద్వారా ఆత్మతత్త్వము సర్వత్ర వ్యాప్తమైనట్లు ఎరుంగవలెను. ఈ ఆత్మతత్త్వము జగత్తుయొక్క ప్రారంభము నందును, అంతమునందును కలదు. కావున ఇది మధ్యయందును ఉన్నట్లు నిశ్చయించుకొనవలెను. దీనిని కాలము అనియు అందురు. హేతువుగూడ ఇదియే. ఇట్లు చింతన చేయుటద్వారా పరమాత్మనే సర్వత్ర దర్శింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

26.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పరమార్థ నిరూపణము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
28.19 (పందొమ్మిదవ శ్లోకము)

యథా హిరణ్యం స్వకృతం పురస్తాత్ పశ్చాచ్చ సర్వస్య హిరణ్మయస్య|

తదేవ మధ్యే వ్యవహార్యమాణం నానాపదేశైరహమస్య తద్వత్॥13381॥

ఉద్ధవా! పుటము పెట్టిన (మేలిమి) బంగారముతో గాజులు, కుండలములు మున్నగు ఆభరణములను సిద్ధపఱచునప్పుడు రాగి మొదలగు  లోహములతో అది మిశ్రితమగును. ఆ ఆభరణములు వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడునప్పుడును అది బంగారముగనే గుర్తింపబడును. సొమ్ములు కరిగించిన పిదప మిశ్రితములైన రాగి మొదలగు లోహములు తొలగిపోయి బంగారముగనే మిగులును. ఆభరణ నిర్మాణములకు ముందును, తరువాతను, అట్లే మధ్యదశయందును బంగారమే యున్నట్లుగా ఆత్మగూడ దేహాదులతో అనుబంధము ఏర్పడక పూర్వమునూ, తరువాతనూ, అట్లే మధ్యస్థితియందునూ ఆత్మయే యుండును. గాజులు, కుండలములు మొదలగునవి బంగారముయొక్క వికారములే యైనట్లు దేహసంబంధమువలన ఆత్మ వేర్వేరుగా ప్రతీతమగును. ఈ వికారములు అనిత్యములు. ఆత్మ నిత్యము.

28.20 (ఇరువదియవ శ్లోకము)

విజ్ఞానమేతత్త్రియవస్థమంగ గుణత్రయం కారణకార్యకర్తృ|

సమన్వయేన వ్యతిరేకతశ్చయేనైవ తుర్యేణ తదేవ సత్యమ్|13382॥

ఉద్ధవా! మనస్సు జాగ్రత్ - స్వప్న - సుషుప్తి అను మూడు అవస్థలచే యుక్తమైనది. ఈ మూడు అవస్థలును సత్త్వ, రజ, స్తమోగుణములచే ఏర్పడినవి. వీటియందు అనుస్యూతమగా ఉండునది ఆత్మయే. ఈ జగత్తు అధ్యాత్మము (ఇంద్రియ కారణము), అధిభూతము (పృథ్వి మొదలగు కార్యములు), అధిదైవము (మహత్తు, అహంకారము, కర్త) అను మూడు భేదములతో యుక్తమైనది. ఈ జగత్తుయొక్క అధిష్ఠాత పరమాత్మయగుటవలన ఈ జగత్తుగూడ సత్యముగనే ప్రతీతమగును. అన్వయరూపములో అన్నింటిలోను పరమాత్మయే అంతర్యామిగా ఉండును. వ్యతిరేక రూపములోనూ అనగా 'ఇదికాదు, ఇదికాదు' అని అన్నింటినీ తొలగించినప్పుడు గూడ పరమాత్మయే మిగులును. తురీయావస్థయందు సత్యమైన ఈ పరమాత్మ జ్ఞానము కలిగినంతనే సత్త్వరజస్తమో గుణాత్మకములైన మూడు అవస్థలునూ తొలగిపోవును.

28.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

న యత్పురస్తాదుత యన్న పశ్చాత్ మధ్యే చ తన్న వ్యపదేశమాత్రమ్|

భూతం ప్రసిద్ధం చ పరేణ యద్యత్తదేవ తత్స్యాదితి మే మనీషా॥13383॥

ఈ జగత్తు సృష్టికి పూర్వమూ లేదు. ప్రళయానంతరముగూడ ఉండబోదు. మధ్యలో దీని ఉనికి కేవలము ఆభాసమాత్రమే (అవాస్తవము మాత్రమే). వాస్తవముగా పరమాత్మయే జగత్తు యొక్క లోపల బయట ఓతప్రోతమైయుండును (సర్వవ్యాప్తమై యుండును). పరమాత్మనుండియే ఈ జగత్తు ఉత్పన్నమైనది, కడకు ఆయనలోనే లీనమగును. జగత్తుయొక్క వ్యవహారములన్నియును పరమాత్మద్వారా జరుగును. 'ఆయనయే సత్యము' అని నా దృఢనిశ్చయము.

28.22 (ఇరువది రెండవ శ్లోకము)

అవిద్యమానోఽప్యవభాసతే యో వైకారికో రాజససర్గ ఏషః|

బ్రహ్మ స్వయంజ్యోతిరతో విభాతి బ్రహ్మేంద్రియార్థాఽఽత్మవికారచిత్రమ్॥13384॥

సృజ్యపదార్థమైన ఈ జగత్తు, శరీరము అంతయును ప్రకృతియొక్క వికారరూపము. ఇది రజోగుణప్రాబల్యముచే ప్రవృత్తి స్వభావముగలది. దీనికి స్వయముగా ఉనికి లేకున్నను, ఉన్నట్లుగనే భాసించును. ఏలయన ఇందు స్వయంప్రకాశమానమైన పరబ్రహ్మము అంతర్యామిగా ఉండును. ఇంద్రియములు, శబ్దాది వివయములు, మనస్సు, పంచమహాభూతములు మొదలగు చిత్రవిచిత్రములైన నామరూపములు. అన్నిటియందును పరబ్రహ్మమే ప్రతీతమగును.

28.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఏవం స్ఫుటం బ్రహ్మవివేకహేతుభిః పరాపవాదేన విశారదేన|

ఛిత్త్వాఽఽత్మసందేహముపారమేత స్వానందతుష్టోఽఖిలకాముకేభ్యః॥16685॥

ఈ విధముగా పరబ్రహ్మమును గూర్చి తర్కించువాడు శ్రవణ, మనన, నిదిధ్యాసాది సాధనములద్వారా ఆత్మకంటె వేరైన వస్తువులను నిరాకరింతురు. ఇట్టి నిషేధములద్వారా ఆత్మ సంబంధమైన సందేహములను అన్నింటిని ఛిన్నా-భిన్నమొనర్చి ఆత్మను గూర్చి, దృఢముగా నిశ్చయించుకొనిన పిదప విషయసుఖములను అన్నింటిని త్యజించి, ఆత్మానందములో నిమగ్నులగుదురు.

28.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

నాత్మా వపుః పార్థివమింద్రియాణి దేవా హ్యసుర్వాయుర్జలం హుతాశః|

మనోఽన్నమాత్రం ధిషణా చ సత్త్వమహంకృతిః ఖం క్షితిరర్థసామ్యమ్॥13386॥

ఈ పార్థివ శరీరము ఆత్మకాదు. అట్లే ఇంద్రియాధిష్ఠాన దేవతలు ప్రాణము, వాయువు, జలము, అగ్ని, మనస్సు అనునవియును ఆత్మకాదు. అనగా ఇవి అన్నియును అనాత్మ వస్తువులే. ఇవి అన్నియును అన్నమువలననే పోషింపబడుచున్నవి. బుద్ధి, చిత్తము, అహంకారము, ఆకాశము, పృథ్వి, శబ్దాది విషయములూ, త్రిగుణముల సామ్యావస్థయగు ప్రకృతి అనేవి వికారమలగుట వలన ఇవియును ఆత్మకావు. ఈ విధముగా 'నేతి-నేతి' అను వచనముల ద్వారా అనాత్మ వస్తువులను నిరాకరింపవలెను.

28.25 (ఇరువది ఐదవ శ్లోకము)

సమాహితైః కః కరణైర్గుణాత్మభిర్గుణో భవేన్మత్సువివిక్తధామ్నః|

విక్షిప్యమాణైరుత కిం ను దూషణం ఘనైరుపేతైర్విగతై రవేః కిమ్|

ఉద్ధవా! ఆకాశమునందు మేఘములు వచ్చుచు, పోవుచు ఉండును. కాని, వాటివలన సూర్యునిపై ఎట్టి ప్రభావమూ ఉండదు. అట్లే భగవత్స్వరూపముయొక్క సంపూర్ణజ్ఞానము వలన కలిగిన అనుభవాత్మకమగు అనుభూతియందు నిలిచిన జ్ఞానికి గుణకార్యములగు ఇంద్రియములు ఏకాగ్రమగుటచే ఎట్టి లాభమూ లేదు. అవి విక్షేపము నొందినచో ఎట్టి నష్టమూ ఉండదు. ఏలయన, అతడు సంపూర్ణముగ స్వస్వరూపానుభూతిలో స్థిరముగా నిలిచియుండును.

28.26 (ఇరువది ఆరవ శ్లోకము)

యథా నభో వాయ్వనలాంబుభూగుణైర్గతాగతైర్వర్తుగుణైర్న సజ్జతే|

తథాక్షరం సత్త్వరజస్తమోమలైరహమ్మతేః సంసృతిహేతుభిః పరమ్॥13388॥

ఆకాశమును వాయువు శుష్కింప (ఆరిపోవునట్లు) చేయజాలదు. అగ్ని కాల్చజాలదు. నీరు తడుపజాలదు. దుమ్ము మలిన పరచజాలదు. అట్లే ఋతువులయొక్క గుణములైన శీతోష్ణాదులు దానిని ప్రభావితము చేయజాలవు. ఏలయన ఇవి అన్నియును క్షణికములు. వచ్చుచు పోవుచు ఉండును. ఆకాశము వీటికన్నింటికిని ఆధారము. అట్లే సత్త్వరజస్తమోగుణముల యొక్క వృత్తులు, కర్మలు అన్నియును అశాశ్వతములు. అవి ఆత్మను స్పృశింపజాలవు. ఆత్మ వీటికి అన్నింటికంటెను అతీతమైనది. వీటియందు (త్రిగుణములయందు) అహంకారభావము కలిగిన జీవుడు మాత్రమే సంసారరూప జననమరణ చక్రమున పరిభ్రమించుచుండును.

28.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తథాపి సంగః పరివర్జనీయో గుణేషు మాయారచితేషు తావత్|

మద్భక్తియోగేన దృఢేన యావద్రజో నిరస్యేత మనః కషాయః॥13389॥

ఉద్ధవా! నాయందు దృఢమైన భక్తియోగముద్వారా రజోగుణరూపమైన మనఃకాలుష్యములు (రాగద్వేషాదులు) పూర్తిగా తొలగిపోవువరకును, మాయానిర్మితములైన త్రిగుణములయొక్క వాటి కార్యములయొక్క సాంగత్యమును పూర్తిగా త్యజింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

27.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పరమార్థ నిరూపణము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
28.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

యథాఽఽమయోఽసాధుచికిత్సితో నృణాం పునః పునః సంతుదతి ప్రరోహన్|

ఏవం మనోపక్వకషాయకర్మ కుయోగినం విధ్యతి సర్వసంగమ్॥13390॥

రోగగ్రస్తుడైన మనుజునకు సరియైన చికిత్స చేయనిచో, ఆ రోగము సమూలముగా నశింపదు. అది పదే పదే తలయెత్తుచు అతనిని బాధించుచుండును. అట్లే రాగద్వేషాది వాసనలు, కర్మసంస్కారములు మనస్సునుండి పూర్తిగా తొలగిపోనంతవరకును మానవుడు స్త్రీ, పుత్రాదులయందు ఆసక్తుడై యుండును. అట్టి కుహనాయోగిని కర్మవాసనలు వెంటాడుచు బాధించుచునే యుండును,అతనిని యోగభ్రష్టునిగా చేయుచునే యుండును.

28.29 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

కుయోగినో యే విహితాంతరాయైర్మనుష్యభూతైస్త్రిదశోపసృష్టైః|

తే ప్రాక్తనాభ్యాసబలేన భూయో యుంజంతి యోగం న తు కర్మతంత్రమ్॥13391॥

దైవికముగా గాని, లేదా మనుష్యులవలనగాని కలుగు విఘ్నములవలన ఎప్పుడైనను యోగసాధకుడు యోగభ్రష్టుడైనచో, తన పూర్వాభ్యాస కారణముగా అతడు ఆ యోగసాధనను కొనసాగించుచునే యుండును. విషయవాసనలు తొలగిపోయినందువలన అతడు లౌకిక కర్మలయందు ప్రవృత్తుడు కాడు.

28.30 (ముప్పదియవ శ్లోకము)

కరోతి కర్మ క్రియతే చ జంతుః కేనాప్యసౌ చోదిత ఆనిపతాత్|

న తత్ర విద్వాన్ ప్రకృతౌ స్థితోఽపి నివృత్తతృష్ణః స్వసుఖానుభూత్యా॥13392॥

ఉద్ధవా! జీవుడు పూర్వజన్మ సంస్కారాదులచే ప్రేరితుడై, పుట్టినది మొదలుకొని, మరణపర్యంతము కర్మలయందు ప్రవృత్తుడు అగుచునే యుండును. వాటియందు ఇష్ట - అనిష్టబుద్ధి గలిగి హర్షవిషాదాది వికారములకు లోనగుచుండును. కానీ, భగవత్తత్త్వ సాక్షాత్కారము పొందినవాడు ప్రకృతియందు స్థితుడైయుండి తన సంస్కారములను అనుసరించి కర్మలను చేయుచున్నను హర్షశోకాది వికారములకు లోనుకాడు. ఏలయన ఆనందమయమైన ఆత్మయొక్క సాక్షాత్కారముతో సంసారబంధమైన అతని ఆశలు, కోరికలు ఇంతకుముందే తొలగిపోయినవి.

28.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

తిష్ఠంతమాసీనముత వ్రజంతం శయానముక్షంతమదంతమన్నమ్|

స్వభావమన్యత్కిమపీహమాన- మాత్మానమాత్మస్థమతిర్న వేద॥13393॥

జ్ఞాని తన స్వస్వరూపమునందు స్థితుడైయున్నప్పుడు తన శరీరము నిలబడియున్నను, కూర్చున్నను, నడచుచున్నను, ఆహారమును భుజించుచున్నను, పరుండియున్నను, మలమూత్రవిసర్జన కావించుచున్నను, ఇంకను ఇంద్రియములు దర్శనస్పర్శనాది క్రియలు ఒనర్చుచున్నను అతనికి ఆ   చర్యలపై స్పృహయే ఉండదు. ఏలయన, అతడు తన ఆత్మస్వరూపమునందు స్థితుడై యుండును.

28.32 (ముప్పది రెండవ శ్లోకము)

యది స్మ పశ్యత్యసదింద్రియార్థం నానానుమానేన విరుద్ధమన్యత్|

న మన్యతే వస్తుతయా మనీషీ స్వాప్నం యథోత్థాయ తిరోదధానమ్॥13394॥

ఏ వ్యక్తియైనను నిద్రనుండి మేల్కొనిన పిదప స్వప్నమున తాను చూచిన దృశ్యములు అన్నియును మాయమైనట్లు గమనించును. బాగుగా ఆలోచించిన పిమ్మట అతడు అవియన్నియును అసత్యములని గ్రహించును. అట్లే వివేకవంతుడైన నిత్యానిత్యవస్తువివేకము గల జ్ఞాని అనుమానాది ప్రమాణములద్వారా నానాత్వమును నిషేధించి, ఆత్మ తక్క ఇతర వస్తువులనన్నింటిని సత్యములుగా స్వీకరింపడు.

28.33 (ముప్పది మూడవ శ్లోకము)

పూర్వం గృహీతం గుణకర్మచిత్రమజ్ఞానమాత్మన్యవివిక్తమంగ|

నివర్తతే తత్పునరీక్షయైవ న గృహ్యతే నాపి విసృజ్య ఆత్మా॥13395॥

ఉద్ధవా! జ్ఞానోదయము కాకపూర్వము (అజ్ఞానకారణముగ) దేహాభిమానియైన పురుషుడు 'ఇంద్రియములు, ఇంద్రియార్థములు (శబ్దాదివిషయములు) తనకంటె వేరుకావు' అని భావింపవలయును. ఆత్మదృష్టి కలిగినమీదట అజ్ఞానము, దాని కార్యములు అంతరించును. అజ్ఞానము తొలగుటయే జ్ఞానోదయము. అప్పుడతడు అఖండమైన ఆత్మస్వరూపముతో వెలుగుచుండును. ఆత్మతత్త్వము ఇంద్రియములద్వారా గ్రహింపబడేది కాదు, త్యజింపబడేదికాదు. ఏలయన, అది అంతటా నిండియుండును.

28.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

యథా హి భానోరుదయో నృచక్షుషాం తమో నిహన్యాన్న తు సద్విధత్తే|

ఏవం సమీక్షా నిపుణా సతీ మే హన్యాత్తమిస్రం పురుషస్య బుద్ధేః॥13396॥

సూర్యోదయము మనిషి కళ్ళముందుగల చీకటిని తొలగించును. కాని, కొత్త వస్తువులను నిర్మింపదు. ఇదేవిధమగా, నా (ఆత్మ) స్వరూపముయొక్క నిశ్చయాత్మకమైన అపరోక్షజ్ఞానము కలుగగా, పురుషుని బుద్ధిని ఆవహించిన అజ్ఞానము తొలగిపోవును.

28.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఏష స్వయంజ్యోతిరజోఽప్రమేయో మహానుభూతిః సకలాఽనుభూతిః|

ఏకోఽద్వితీయో వచసాం విరామే యేనేషితా వాగసవశ్చరంతి॥13397॥

ఈ ఆత్మస్వయంప్రకాశమానము, జన్మాది వికార రహితము. ప్రత్యక్షాది ప్రమాణములద్వారా తెలిసికొనుటకు వీలుకానిది. దేశకాల పరిమితులు లేనిది. సకల విషయములను ఎరుంగునట్టిది. సకలప్రాణులలో ఒకటిగా భాసించునది. ప్రాకృత దేహరహితమైనది. వాక్కులచే వివరించుటకు వీలుకానిది (అనిర్వచనీయము). ఆ ఆత్మయొక్క ప్రేరణకారణముగనే వాగాది ఇంద్రియములు, ప్రాణములు తమ తమ కార్యములను నిర్వహించును.

28.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏతావానాత్మసమ్మోహో యద్వికల్పస్తు కేవలే|

ఆత్మన్నృతే స్వమాత్మానమవలంబో న యస్య హి॥13398॥

అద్వితీయమూ, అఖండమూ ఐన ఆత్మతత్త్వమునందు అర్థహీనమైన నామ రూప భేదములను కల్పించుకొనుటయే అజ్ఞానము. జీవుడు ప్రకృతి సంబంధమువలన అహంభావమును కలిగియుండుటచే ఈ భేదభావములను ఊహించుకొనును. ఈ భ్రమకుగాని, అజ్ఞానమునకు గాని స్వతంత్రమైన ఉనికియే లేదు. ఆత్మయొక్క ఉనికివలననే ఈ భేదబుద్ధి ఏర్పడుచున్నది. ఆత్మ తప్ప వేరొకటి లేనేలేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
27.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పరమార్థ నిరూపణము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

28.37  (ముప్పది ఏడవ శ్లోకము)

యన్నామాఽఽకృతిభిర్గ్రాహ్యం పంచవర్ణమబాధితమ్|

వ్యర్థేనాప్యర్థవాదోఽయం ద్వయం పండితమానినామ్॥13399॥

తాము పండితులు కాకున్నను తమకు తామే పండితుల మనుకొనువారు (పండితమ్మన్యులు) నామరూప భేదములుగల, ఇంద్రియములద్వారా గ్రహింపబడు పంచభూతాత్మకమైన ఈ ద్వైతజగత్తును సత్యమని భావింతురు. ఇది అంతయును వారి మనఃకల్పితమైన వాగాడంబరమే.

28.38  (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

యోగినోఽపక్వయోగస్య యుంజతః కాయ ఉత్థితైః|

ఉపసర్గైర్విహన్యేత తత్రాయం విహితో విధిః॥13400॥

యోగసాధన పూర్తికాకపూర్వమే సాధకుని శరీరము రోగాది ఉపద్రవములకు లోనైనచో వాటిని ఎదుర్కొనుటకై అనగా రోగాది విఘ్నములను తొలగించుకొనటకై కొన్ని ఉపాయములను ఆశ్రయింపవలెను.

28.39  (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

యోగధారణయా కాంశ్చిదాసనైర్ధారణాన్వితైః|

తపోమంత్రౌషధైః కాంశ్చిదుపసర్గాన్ వినిర్దహేత్॥13401॥

శీతోష్ణాదులను తట్టుకొనటకై సోమసూర్యాగ్ని యోగధారణ చేయవలెను.  వాతాది రోగములను  ప్రాణాయామము మొదలగు యోగసాధనముల ద్వారా నివారించుకొనవచ్చును. పాపగ్రహసర్పాది బాధలను తపశ్చర్యలచేతన, మంత్రోపాసనలవలనను, ఔషధసేవనముల ద్వారాను తొలగించుకొనవచ్చును.

28.40  (నలుబదియవ శ్లోకము)

కాంశ్చిన్మమానుధ్యానేన నామసంకీర్తనాదిభిః|

యోగేశ్వరానువృత్త్యా వా హన్యాదశుభదాన్ శనైః॥13402॥

యోగసాధనకు విఘ్నకారకములైన కామక్రోధాదులను నన్ను ధ్యానించుటద్వారా, నా నామ సంకీర్తనాదులను చేయుటద్వారా, రూపుమాపవచ్చును. పతనహేతువులైన దంభము, మదము మొదలగునవి యోగసాధనకు ఆటంకములను కలిగించును. మహాపురుషుల సేవలద్వారా వాటిని తిన్నతిన్నగా దూరమొనర్చుకొనవలెను.

28.41 (నలుబది ఒకటవ శ్లోకము)

కేచిద్దేహమిమం ధీరాః సుకల్పం వయసి స్థిరమ్|

విధాయ వివిధోపాయైరథ  యుంజంతి సిద్ధయే॥13403॥

28.42 (నలుబది రెండవ శ్లోకము)

న హి తత్కుశలాఽఽదృత్యం తదాయాసో హ్యపార్థకః|

అంతవత్త్వాచ్ఛరీరస్య ఫలస్యేవ వనస్పతేః॥13404॥

కొందరు సాధకులు ఔషధసేవనాది వివిధములగు ఉపాయములద్వారా  శరీరదారుఢ్యము కొరకును (దృఢముగానుండుటకును), యౌవనము సుస్థిరముగా ఉండుట కొరకును, యోగసాధనల ద్వారా అణిమాది సిద్ధుల ప్రాప్తికి పూనుకొందురు. కానీ తెలివిగలవారు ఈ ప్రయత్నములను ఆమోదింపరు. ఇది అంతయును వ్యర్థప్రయాస. వృక్షముల ఫలములు పండినంతనే రాలిపోవునట్లు ఈ శరీరము ఎప్పుడైనను పతనమగుట (మృత్యువుపాలగుట) తప్పదు.

28.43 (నలుబది మూడవ శ్లోకము)

యోగం నిషేవతో నిత్యం కాయశ్చేత్కల్పతామియాత్|

తచ్ఛ్రద్దధ్యాన్న మతిమాన్ యోగముత్సృజ్య మత్పరః॥13405॥

ఉద్ధవా! సాధకుడు పెద్దకాలము నిరంతరము పట్టుదలతో యోగసాధన చేయుటవలన అతని శరీరము సుదృఢముగా ఉన్నట్లు తోచినను అవిశ్వాసముతో అతడు తన సాధనను విడిచిపెట్టరాదు. వివేకియైనవాడు ఎల్లప్పుడును భగవత్ప్రాప్తికై ప్రయత్నించుచునే ఉండవలయును.

28.44 (నలుబది నాలుగవ శ్లోకము)

యోగచర్యామిమాం యోగీ విచరన్ మదపాశ్రయః|

నాంతరాయైర్విహన్యేత నిఃస్పృహః స్వసుఖానుభూః॥13406॥

నేను తెలిపిన ఈ యోగసాధనను చేయుచు నన్నే శరణుపొందిన నా భక్తుని ఎట్టి విఘ్నములుగూడ బాధింపజాలవు. అతనిలో ఎట్టికోరికలును మిగిలియుండవు. అతడు ఆత్మసుఖానుభవముతోనే నిమగ్నమైయుండును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే అష్టావింశోఽధ్యాయః (28)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి పరమార్థ నిరూపణము అను ఇరువది ఎనిమిదవ అధ్యాయము (28)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

\28.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భాగవతధర్మములు - ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఉద్ధవ ఉవాచ

29.1 (ప్రథమ శ్లోకము)

సుదుశ్చరామిమాం మన్యే యోగచర్యామనాత్మనః|

యథాఽంజసా పుమాన్ సిద్ధ్యేత్తన్మే బ్రూహ్యంజసాఽచ్యుత॥13407॥

ఉద్ధవుడు పలికెను పరమాత్మా! జితేంద్రియుడు కానివాడు నీవు తెలిపిన ఈ యోగసాధనను ఆచరించుట మిక్కిలి కష్టమని నేను భావింతును. కనుక, ఓ అచ్యుతా! మానవుడు అనాయాసముగా నిన్ను పొందెడి (నీ పరమపదమును చేరెడి) ఉపాయమును దయతో విశదపరుచుము.

29.2 (రెండవ శ్లోకము)

ప్రాయశః పుండరీకాక్ష యుంజంతో యోగినో మనః|

విషీదంత్యసమాధానాన్మనోనిగ్రహకర్శితాః॥13408॥

ఓ పుండరీకాక్షా! పెక్కుమంది యోగులు తమ మనస్సులను ఏకాగ్రమొనర్చుటకు ప్రయత్నించెదరు. పదేపదే ప్రయత్నించినను వారు తమ మనస్సులను వశములో నుంచుకొనజాలరు. అట్లు మనస్సును వశపరచుకొనుటలో విఫలురైన వారలు దుఃఖమును పొందెదరు.

29.3 (మూడవ శ్లోకము)

అథాత ఆనందదుఘం పదాంబుజం హంసాః శ్రయేరన్నరవిందలోచన|

సుఖం ను విశ్వేశ్వర యోగకర్మభిస్త్వన్మాయయామీ విహతా న మానినః॥13409॥

అరవిందనయనా! సారాసార వివేకవంతులైన (నిత్యానిత్య విచక్షణగల) కొందరు మహాపురుషులు ఆనందమును కురిపించెడు నీ పదాంబుజములను ఆశ్రయించి సుఖమును పొందెదరు. కానీ విశ్వేశ్వరా! యోగసాధములచే కర్మానుష్ఠానములచే తమను తాము శ్రేష్ఠులనుగా భావించు కొనువారు మాత్రము నీ మాయలోబడి, నీ పదములను ఆశ్రయింపరు.

29.4 (నాలుగవ శ్లోకము)

కిం చిత్రమచ్యుత తవైతదశేషబంధో దాసేష్వనన్యశరణేషు యదాత్మసాత్త్వమ్|

యోఽరోచయత్సహ మృగైః స్వయమీశ్వరాణాం శ్రీమత్కిరీటతటపీడితపాదపీఠః॥13410॥

అచ్యుతా! నీవు సర్వప్రాణులకును హితైషివి. ఆత్మీయుడవు. శరణాగతులైన అనన్యభక్తులను నీ వారినిగా చేసికొందువు. నీవు వారివాడవే అగుదువు. అంతేగాదు, నీవు వారికి దాసుడవే అగుదువు. బ్రహ్మాదిలోకపాలురు అందరును నీ అధీనులై, తమ కిరీటముల అగ్రభాగములను నీ పాదపీఠమును స్పృశించునట్లు భక్తిశ్రద్ధలతో సాష్టాంగనమస్కారముల నొనర్తురు. ఇంతటి మహాపురుషుడవైనను రామావతారమున వానరులయొక్క భక్తిప్రపత్తులకు పరవశుడవై వారితో మైత్రిని నెరపితివి. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమియును లేదు. ఇది నీ సౌశీల్యమునకును, భక్తవాత్సల్యమునకును తార్కాణము.

29.5 (ఐదవ శ్లోకము)

తం త్వాఽఖిలాత్మదయితేశ్వరమాశ్రితానాం సర్వార్థదం స్వకృతవిద్విసృజేత కో ను|

కో వా భజేత్కిమపి విస్మృతయేఽనుభూత్యై కిం వా భవేన్న తవ పాదరజోజుషాం నః॥13411॥

పురుషోత్తమా! నీవు సకలప్రాణులకును ప్రియతముడవు. ఆత్మస్వరూపుడవు. స్వామివి. శరణాగతులయొక్క సకల అభీష్టములను నెరవేర్చువాడవు. తమకు చేసిన ఉపకారమును స్మరించే కృతజ్ఞుడైన భక్తుడు నిన్ను ఎట్లు మరువగలడు? తుచ్ఛమైన భౌతిక సుఖముల కొరకు నీ భక్తులెవ్వరూ నిన్ను ఉపాసింపరు. ఏలయన, ఆ భౌతిక సుఖములు మమ్ములను మాయలో ముంచి, నిన్ను మరపింపజేయునుకదా! సర్వదా నీ పాదపద్మముల రజస్సును శిరమున దాల్చునట్టి అనన్యభక్తులమైన మాకు దుర్లభమైనది ఏముండును?

29.6 (ఆరవ శ్లోకము)

నైవోపయంత్యపచితిం కవయస్తవేశ బ్రహ్మాయుషాఽపి కృతమృద్ధముదః స్మరంతః|

యోఽన్తర్బహిస్తనుభృతామశుభం విధున్వన్నాచార్యచైత్త్యవపుషా స్వగతిం వ్యనక్తి॥13412॥

ఓ పరమేశ్వరా! నీవు మా కొరకు ఒనర్చిన మహోపకారములు అన్నీ - ఇన్నీ కావు. వాటిని పదేపదే తమ మనస్సులలో స్మరించువారలు అంతులేని ఆనందమున మునిగి పరవశించి పోవుదురు. కేవలము నీ అపారమగు నిర్హేతుకమైన కృపవల్లనే కదా! అవన్నియును మాకు లభించుచుండును. మాకు బ్రహ్మదేవునకువలె దీర్ఘాయుష్యము లభించినను నీకు, మేము ప్రత్యుపకారమును చేయజాలము అని నిన్ను తెలిసిన జ్ఞానులు అందురు. దేహధారులకు నీవు బయట ఆచార్య-గురువుగా, లోపల అంతర్యామిగా నిలిచి అశుభముల నన్నింటినీ రూపుమాపెదవు. అంతేగాక, అట్టి నీ భక్తులకు నీ స్వరూపమును (స్వరూపజ్ఞానమును) ప్రసాదించెదవు.

శ్రీశుక ఉవాచ

29.7 (ఏడవ శ్లోకము)

ఇత్యుద్ధవేనాఽత్యనురక్తచేతసా పృష్టో జగత్క్రీడనకః స్వశక్తిభిః|

గృహీతమూర్తిత్రయ ఈశ్వరేశ్వరో జగాద సప్రేమమనోహరస్మితః॥13413॥

శ్రీశుకమహర్షి నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మాదిదేవతలకు గూడ ప్రభువు. ఆ స్వామి తన శక్తిప్రభావమున త్రిగుణములద్వారా బ్రహ్మవిష్ణుమహేశ్వరుల రూపములను ధరించి సృష్టిస్థితి లయములను గావించు చుండును. ఆ దేవదేవునకు ఈ జగత్తుఅంతయును ఒక క్రీడాపరికరము. ఉద్ధవుడు అనురాగభరితమైన హృదయముతో ఇట్లు ప్రశ్నింపగా ఆ స్వామి ప్రేమతో మందహాస మొనర్చుచు ఇట్లు వచించెను.

శ్రీభగవానువాచ

29.8 (ఎనిమిదవ శ్లోకము)

హంత తే కథయిష్యామి మమ ధర్మాన్ సుమంగళాన్|

యాన్ శ్రద్ధయాఽఽచరన్ మర్త్యో మృత్యుం జయతి దుర్జయమ్॥13414॥

శ్రీకృష్ణభగవానుడు వచించెను ఉద్ధవా! అనురాగపూర్ణములైన నీ పలుకులకు నేను మిగుల సంతసించితిని. మంగళకరములైన భాగవతధర్మములను గూర్చి నీకు విశదపరతును. ఆ ధర్మములను నిష్ఠతో ఆచరించి, మానవుడు దుర్జయమైన మృత్యురూప సంసారమును అనాయాసముగా జయించును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


\29.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భాగవతధర్మములు - ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.9 (తొమ్మిదవ శ్లోకము)

కుర్యాత్సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్|

మయ్యర్పితమనశ్చిత్తో మద్ధర్మాత్మమనోరతిః॥13415॥

మానవుడు నన్ను స్మరించుచు తన వర్ణాశ్రమోచిత కర్మలను ఆచరింపవలెను. దానివలన అతనికి అంతఃకరణ శుద్ధి ఏర్పడును. అంతేగాక, మనస్సులోని అతని సంకల్పవికల్పకాత్మక వృత్తులును దూరమగును. అంతట అతని మనస్సు, ఆత్మ నాయందే లగ్నమగును.

29.10 (పదియవ శ్లోకము)

దేశాన్ పుణ్యానాశ్రయేత మద్భక్తైః సాధుభిః శ్రితాన్|

దేవాసురమనుష్యేషు మద్భక్తాఽఽచరితాని చ॥13416॥

మనుజుడు నా భక్తులైన సత్పురుషులు నివసించునట్టి స్థానములయందు ఉండవలెను. దేవతలలో, అసురులలో, మానవులలో నా భక్తులు ఆచరించినవాటిని అనుసరింపవలెను.

29.11 (పదకొండవ శ్లోకము)

పృథక్ సత్రేణ వా మహ్యం పర్వయాత్రామహోత్సవాన్|

కారయేద్గీతనృత్యాద్యైర్మహారాజవిభూతిభిః॥13417॥

పర్వదినములలో ఒంటరిగాగానీ, లేదా సకలజనులతో కలిసిగానీ నృత్యగానాదుల తోను, వాద్య కార్యక్రమములతోను మహరాజోచిత వైభవముగా నా యాత్రా మహోత్సవములను నిర్వహింపవలెను.

29.12 (పండ్రెండవ శ్లోకము)

మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతమ్|

ఈక్షేతాత్మని చాత్మానం యథా ఖమమలాశయః॥13418॥

పవిత్రమైన అంతఃకరణమువలన పురుషుడు 'ఆకాశమువలె లోపల, బయట పరిపూర్ణుడును, ఆవరణ శూన్యుడును, పరమాత్మను ఐన నన్ను సకలప్రాణులలోను, తనలోను దర్శింపవలెను.

29.13 (పదమూడవ శ్లోకము)

ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే|

సభాజయన్ మన్యమానో జ్ఞానం కేవలమాశ్రితః॥13419॥

29.14 (పదునాలుగవ శ్లోకము)

బ్రాహ్మణే పుల్కసే స్తేనే బ్రహ్మణ్యేఽర్కే స్ఫులింగకే|

అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితో మతః॥13420॥

మహాత్మా! ఉద్ధవా! జ్ఞానదృష్టితో సకల ప్రాణులయందును, పదార్థములయందును, నన్నే దర్శించుచు, వాటిని నా స్వరూపముగనే భావించి, పూజించువాడు నిజమైనజ్ఞాని. అతడు బ్రాహ్మణుని, చండాలుని, చోరుని, బ్రాహ్మణభక్తుని, సూర్యుని, అగ్నికణములను, కృపాళువును, క్రూరాత్ముని సమానదృష్టితో చూచును.

29.15 (పదిహేనవ శ్లోకము)

నరేష్వభీక్ష్ణం మద్భావం పుంసో భావయతోఽచిరాత్|

స్పర్ధాసూయాతిరస్కారాః సాహంకారా వియంతి హి॥13421॥

ఈ విధముగా నిరంతరము సకల మానవులను నా స్వరూపముగా భావించునట్టి సాధకునియొక్క చిత్తమునుండి స్పర్ధ, ఈర్ష్య, తిరస్కారము, అహంకారము మొదలగు దోషములు కొలది దినములలోనే దూరమగును.

29.16 (పదహారవ శ్లోకము)

విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్|

ప్రణమేద్దండవద్భూమావాశ్వచాండాలగోఖరమ్॥13422॥

తమవారు తనను పరిహసించినను, చులకనగా చూచినను వారిని పట్టించుకొనరాదు. దేహాభిమానమును, లజ్జను విడిచిపెట్టవలెను. 'కుక్క, చండాలుడు, గోవు, గాడిద మొదలగు ప్రాణులయందును, తనయందును పరమాత్మయే విరాజిల్లుచున్నాడు' అను భావముతో అన్నింటిని సాదరముగా చూచుకొనవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


[05:42, 30/11/2021] +91 95058 13235: 30.11.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భాగవతధర్మములు - ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.17 (పదిహేడవ శ్లోకము)

యావత్సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే|

తావదేవముపాసీత వాఙ్మనఃకాయవృత్తిభిః॥13423॥

సకల ప్రాణుల యందును భగవద్భావన కలుగునంత వఱకును సంకల్పములద్వారా, కర్మలవలన త్రికరణ శుద్ధిగా పైన తెల్పినరీతిగా నన్ను ఉపాసింపవలెను.

29.18 (పదునెనిమిదవ శ్లోకము)

సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాఽఽత్మమనీషయా|

పరిపశ్యన్నుపరమేత్సర్వతో ముక్తసంశయః॥13424॥

ఉద్ధవా! ఈ విధముగా సర్వత్ర బ్రహ్మబద్ధినే కలిగియున్న సాధకునకు అచిరకాలములోనే బ్రహ్మజ్ఞానము కలుగును. తత్ప్రభావమున అతడు సకల ప్రాణుల యందును పరమాత్మను దర్శించును. అంతట అతనికి ఆత్మనుగూర్చిన, జగత్తును గురించిన, పరమాత్మను గూర్చిన (జీవజగదీశ్వరులను గూర్చిన) సంశయములు అన్నియును తొలగిపోవుటయే గాక భగవత్సాక్షాత్కారముగూడ కలుగును. ఫలితముగా అతడు ముక్తిని పొందును.

29.19 (పందొమ్మిదవ శ్లోకము)

అయం హి సర్వకల్పానాం సధ్రీచీనో మతో మమ|

మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయవృత్తిభిః॥13425॥

సమస్త ప్రాణులయందును, పదార్థములయందును మనోవాక్కాయ వృత్తులద్వారా అన్ని విధములుగా భావనను (భగవద్భావనను) కలిగియుండుటయే నన్ను జేరుటకు పరమసాధనము.

29.20 (ఇరువదియవ శ్లోకము)

న హ్యంగోపక్రమే ధ్వంసో మద్ధర్మస్యోద్ధవాణ్వపి|

మయా వ్యవసితః సమ్యఙ్నిర్గుణత్వాదనాశిషః॥13426॥

ఉద్ధవా! నేను సూచించిన ఈ భాగవత ధర్మములను ఆచరించుటకు ప్రారంభించినచో దానికి ఇసుమంతయును విఘ్నము కలుగదు. ఏలయన ఇది నిష్కామధర్మము. త్రిగుణాతీతుడనైన నేనే 'ఈ ధర్మము సర్వోత్తమము' అని నిశ్చయించితిని.

29.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

యో యో మయి పరే ధర్మః కల్ప్యతే నిష్ఫలాయ చేత్|

తదాయాసో నిరర్థః స్యాద్భయాదేరివ సత్తమ॥13427॥

సత్పురుషా! ఉద్ధవా! మానవుడు ఆచరించే ఎంతటి చిన్నపనైనా సరే! తినుట, త్రాగుట వంటి పనులును, భయము, దుఃఖము వంటివి కలిగినప్పుడు నిరర్థకముగా కలిగే భావములు ఏడ్చుట, అరచుట, పరుగెత్తుటవంటి కర్మలును కూడా నిష్కామభావముతో నాకు సమర్పించినచో, అట్టి కర్మలన్నియును నన్ను సంతసింపజేసే ధర్మములే అగును.

29.22 (ఇరువది రెండవ శ్లోకము)

ఏషా బుద్ధిమతాం బుద్ధిర్మనీషా చ మనీషిణామ్|

యత్సత్యమనృతేనేహ మర్త్యేనాప్నోతి మామృతమ్॥13428॥

బుద్ధిమంతులు తమ బుద్ధి కౌశలముతో, ప్రజ్ఞావంతులు తమ సారాసార వివేకముద్వారా మరణధర్మము గలిగిన నశ్వరమైన ఈ దేహమతో శాశ్వతుడును, సత్యస్వరూపుడును ఐన నన్ను పొందగలరు.

29.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఏష తేఽభిహితః కృత్స్నో బ్రహ్మవాదస్య సంగ్రహః|

సమాసవ్యాసవిధినా దేవానామపి దుర్గమః॥13429॥

ఉద్ధవా! పరిపూర్ణ సమగ్రమైన ఈ బ్రహ్మవిద్యా రహస్యమును నీకు సంక్షిప్తముగను, విస్తృతమగను వివరించితిని. ఈ రహస్యములను గ్రహించుటకు దేవతలకును అసాధ్యము.

29.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

అభీక్ష్ణశస్తే గదితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్|

ఏతద్విజ్ఞాయ ముచ్యేత పురుషో నష్టసంశయః॥13430॥

నేను బ్రహ్మజ్ఞానమును గూర్చి సుస్పష్టముగా, సహేతుకముగా పదేపదే తెలిపితిని. ఈ రహస్యమును ఎరుగుటవలన మానవుని యొక్క సంశయములు అన్నియును తొలగిపోవును. అంతేగాక, అతనికి ముక్తియును ప్రాప్తించును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

[20:17, 30/11/2021] +91 95058 13235: 30.11.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భాగవతధర్మములు - ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీభగవానువాచ

29.41 (నలుబది ఒకటవ శ్లోకము)

గచ్ఛోద్ధవ మయాఽఽదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమమ్|

తత్ర మత్పాదతీర్థోదే స్నానోపస్పర్శనైః శుచిః॥13447॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను ఉద్ధవా! ఇక నా ఆదేశమును అనుసరించి నీవు నా బదరికాశ్రమమనకు చేరుకొనుము. అచట నా పాదమలనుండి ఉద్భవించిన గంగాజలములలో స్నానమొనరించి, ఆ తీర్ఠమును సేవించి పవిత్రుడవు కమ్ము.

29.42 (నలుబది రెండవ శ్లోకము)

ఈక్షయాలకనందాయా విధూతాఽశేషకల్మషః|

వసానో వల్కలాన్యంగ వన్యభుక్ సుఖనిఃస్పృహః॥13448॥

మిత్రమా! అలకనందా దర్శనమాత్రముననే నీ పాపతాపములన్నియును దూరమగును. అచట వల్కలములను (నారచీరలను) ధరించి, ఆ వనములో లభించెడి కందమూల ఫలములను భక్షించుచు, విషయాభిలాషరహితుడవై ఆత్మానుభవ ఆనందములో తేలియాడుము.

బదరికాశ్రమమునందు అలకనందా నది ప్రవాహము మిక్కిలి వేగవంతముగా ఉండును. అందులో స్నానమాడుట అసాధ్యము. అందుకే శ్రీకృష్ణభగవానుడు ఉద్ధవునితో ఈక్షయాలకనందాయా అని అలకనందను దర్శించుటతోడనే సకలపాపములు సమసిపోవును. కనుక, అలకనందను దర్శింపవలెను అని మాత్రమే సూచించెను, కాని స్నానమాడమని చెప్పలేదు.

29.43 (నలుబది మూడవ శ్లోకము)

తితిక్షుర్ద్వంద్వమాత్రాణాం సుశీలః సంయతేంద్రియః|

శాంతః సమాహితధియా జ్ఞానవిజ్ఞానసంయుతః॥13449॥

అచట నీవు శీతోష్ణాది ద్వంద్వములను సహించుచు, సరళస్వభావముగలవాడవై యుండుము. జితేంద్రియుడవై (బాహ్యేంద్రియములను, అంతరింద్రియములను జయించినవాడవై) ఏకాగ్రచిత్తముతో నా స్వరూపజ్ఞానానుభవములయందే నిమగ్నుడవై యుండుము.

29.44 (నలుబది నాలుగవ శ్లోకము)

మత్తోఽనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్|

మయ్యావేశితవాక్ చిత్తో మద్ధర్మనిరతో భవ|

అతివ్రజ్య గతీస్తిస్రో మామేష్యసి తతః పరమ్॥13450॥

ఉద్ధవా! నేను నీకు ఉపదేశించిన విషయములను ఏకాంతమున స్మరించుచు, మనస్సునందు దృఢపరచుకొను చుండుము. నా నామరూపములను కీర్తించుచు, నన్ను ధ్యానించుచుండుము. నన్ను ఆరాధించుచుండుము (నన్ను త్రికరణశుద్ధిగా సేవించుచుండుము). క్రమముగా త్రిగుణాతీతుడవై, నా పరమపదమును (నన్ను) చేరుదువు.

శ్రీశుక ఉవాచ

29.45 (నలుబది ఐదవ శ్లోకము)

స ఏవముక్తో హరిమేధసోద్ధవః ప్రదక్షిణం తం పరిసృత్య పాదయోః|

శిరో నిధాయాశ్రుకలాభిరార్ద్రధీర్న్యషించదద్వంద్వపరోఽప్యపక్రమే॥13451॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! సంసార బంధముల నుండి విమక్తి కలిగించునట్టి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును పొందిన పిమ్మట ఉద్ధవుడు ఆ ప్రభువునకు ప్రదక్షిణ మొనర్చి, ఆ స్వామి పాదపద్మములయందు శిరస్సును ఉంచెను. అతడు ఆత్మీయుల సంయోగవియోగ ఫలముల వలన కలుగు హర్షశోకములకు అతీతుడైయున్నను, ఆ పురుషోత్తముని విడిచిపెట్టి వెళ్ళు సమయమున ఆయనపైగల ప్రేమాతిశయముచే ఆర్ధ్రహృదయుడై తన కన్నీటితో ఆ ప్రభువుయొక్క చరణారవిందములను అభిషేకించెను.

29.46 (నలుబది ఆరవ శ్లోకము)

సుదుస్త్యజస్నేహవియోగకాతరో న శక్నువంస్తం పరిహాతుమాతురః|

కృచ్ఛ్రం యయౌ మూర్ధని భర్తృపాదుకే బిభ్రన్నమస్కృత్య యయౌ పునః పునః॥13452॥

మహారాజా! శ్రీకృష్ణ పరమాత్ముని పాదకమలములను వీడి వెళ్ళుటకు మనసొప్పకున్నను, ఆ స్వామి ఆజ్ఞమేరకు వెళ్ళవలసి వచ్చినందులకు ఉద్ధవుడు మిగుల పరితప్తుడయ్యెను. ఆ సమయమున అతని వేదన చెప్పనలవికాకుండెను. ప్రభువుయొక్క చరణారవిందమలకు పదేపదే నమస్కరించి, ఆ పురుషోత్తముని పాదుకలను శిరస్సునదాల్చి అతికష్టముమీద అతడు అచటినుండి బయలుదేరెను.

29.47 (నలుబది ఏడవ శ్లోకము)

తతస్తమంతర్హృది సన్నివేశ్య గతో మహాభాగవతో విశాలామ్|

యథోపదిష్టాం జగదేకబంధునా తపః సమాస్థాయ హరేరగాద్గతిమ్॥13453॥

భాగవతోత్తముడైన ఉద్ధవుడు ఆ దేవదేవుని స్వరూపమునే మనస్సున నిలుపుకొని, బదరికాశ్రమమునకు చేరెను. జగద్బాంధవుడైన ఆ పరమపురుషుని ఉపదేశానుసారము అతడు తపస్సొనర్చి, పరమపదమును పొందెను.

29.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

య ఏతదానందసముద్రసంభృతం జ్ఞానామృతం భాగవతాయ భాషితమ్|

కృష్ణేన యోగేశ్వరసేవితాంఘ్రిణా సచ్ఛ్రద్ధయాఽఽసేవ్య జగద్విముచ్యతే॥13454॥

శ్రీకృష్ణభగవానుని చరణకమలములను యోగేశ్వరులు నిరంతరము సేవించుచుందురు. అట్టి పురుషోత్తముడు భాగవతోత్తముడైన ఉద్ధవునకు పరమానందదాయకమైన జ్ఞానామృతమును ప్రసాదించెను. దీనిని భక్తిశ్రద్ధలతో సేవించిన మానవుడు స్వయముగా తాను తరించుటయేగాక సమస్త జగత్తును తరింపజేయును.

29.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

భవభయమపహంతుం జ్ఞానవిజ్ఞానసారం నిగమకృదుపజహ్రే భృంగవద్వేదసారమ్|

అమృతముదధితశ్చాపాయయద్భృత్యవర్గాన్ పురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోఽస్మి॥13455॥

పరీక్షిన్మహారాజా! తుమ్మెద వేర్వేరు పూవులనుండి మకరందమును సంగ్రహించి లోకమునకు పంచి ఇచ్చుచుండును. ఆ విధముగా వేదములచే ప్రకాశితమై, సంసారభయమును తొలగించునట్టి జ్ఞానవిజ్ఞానసారమైన ఈ బోధామృతమును ఆ స్వామి తన భక్తులకు పంచి ఇచ్చెను. ఆ ప్రభువే సమద్రమును మథింపజేసి అందుండి వెలువడిన అమృతమును తన భక్తసమూహమగు దేవతలకు పానము చేయించెను. పరమపురుషుడు, ఆదినారాయణుడు, జగత్కారణుడు ఐన శ్రీకృష్ణపరమాత్మునకు పదేపదే ప్రణమిల్లుచున్నాను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే ఏకోనత్రింశోఽధ్యాయః (29)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి భాగవతధర్మములు - ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుట అను ఇరువది తొమ్మిదవ అధ్యాయము (29)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏 

1.12.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పదియవ అధ్యాయము

యాదవవంశము నశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రాజోవాచ

30.1 (ప్రథమ శ్లోకము)

తతో మహాభాగవతే ఉద్ధవే నిర్గతే వనమ్|

ద్వారవత్యాం కిమకరోద్భగవాన్ భూతభావనః॥13456॥

పరీక్షిన్మహారాజు వచించెను మహాత్మా! శుకమహర్షీ! భాగవతోత్తముడైన ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరిన పిమ్మట సకలప్రాణులకు ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు ద్వారకా నగరమునందు ఏయే లీలలను ప్రదర్శించెను?

30.2 (రెండవ శ్లోకము)

బ్రహ్మశాపోపసంసృష్టే స్వకులే యాదవర్షభః|

ప్రేయసీం సర్వనేత్రాణాం తనుం స కథమత్యజత్॥13457॥

యాదవవంశము బ్రాహ్మణుల శాపమునకు గుఱియైన పిదప యదువంశ శిరోమణియైన శ్రీకృష్ణుడు సకలజనులకు నేత్రానందదాయకమైన తన లీలామూర్తిని ఏవిధముగా ఉపసంహరించెను?

30.3 (మూడవ శ్లోకము)

ప్రత్యాక్రష్టుం నయనమబలా యత్ర లగ్నం న శేకుః|

కర్ణాఽఽవిష్టం న సరతి తతో యత్సతామాత్మలగ్నమ్|

యచ్ఛ్రీర్వాచాం జనయతి రతిం కిం ను మానం కవీనామ్|

దృష్ట్వా జిష్ణోర్యుధి రథగతం యచ్చ తత్సామ్యమీయుః॥13458॥

గోపికలు మొదలగు స్త్రీలు అందరు శ్రీకృష్ణభగవానుని యొక్క రూపలావణ్య వైభవములను కనులార దర్శించిన పిమ్మట ముగ్ధలై వారు అందుండి తమ చూపులను మఱల్చుకొనలేకుండిరి. ఆ ప్రభువుయొక్క లీలలను గూర్చి తనివిదీర వినిన భక్తులు, రుక్మిణీదేవి, యజ్ఞపత్నులు మొదలగువారు తమ మనస్సులలో ముద్రితములైన ఆ స్వామియొక్క మహిమలను మరచిపోలేకుండిరి. ఆ ప్రభువుయొక్క తనులాలిత్యములను ఎంతగా వర్ణించినను కవులకు తనివి తీరకుండెను. పైగా వారికి ఆ స్వామిపైగల అనురాగము దినదినాభివృద్ధి చెందెను. అంతేగాదు ఆ పరమపురుషుని ఔన్నత్యమును ప్రస్తుతించిన కారణముగా లోకమున వారి యశోగౌరవములు ఇనుమడించెను. కురుక్షేత్ర యుద్ధరంగమున అర్జునుని రధసారథియైన శ్రీకృష్ణభగవానుని దర్శించుచు అసువులను వీడిన యోధులు సామాన్య మోక్షమును పొందిరి.

ఋషిరువాచ

30.4 (నాలుగవ శ్లోకము)

దివి భువ్యంతరిక్షే చ మహోత్పాతాన్ సముత్థితాన్|

దృష్ట్వాఽఽసీనాన్ సుధర్మాయాం కృష్ణః ప్రాహ యదూనిదమ్॥13459॥

శుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! అంతట భువియందును, దివియందును, అంతరిక్షమునందును పెక్కు ఉత్పాతములు, అపశకునములు పొడసూపెను. వాటిని చూచిన పిదప శ్రీకృష్ణుడు సుధర్మసభలో ఆసీనులైయున్న యదువంశీయులతో ఇట్లనెను-

30.5 (ఐదవ శ్లోకము)

ఏతే ఘోరా మహోత్పాతా ద్వార్వత్యాం యమకేతవః|

ముహూర్తమపి న స్థేయమత్ర నో యదుపుంగవాః॥13460॥

"యాదవశ్రేష్ఠులారా! ప్రస్తుతము ద్వారకలో భయంకరములైన ఉత్పాతములు పొడసూపనున్నవి. ఇవి యమునియొక్క ధ్వజమువలె అరిష్టసూచకములు. కనుక మనము ఇచట ఒక్కక్షణముగూడ నిలువరాదు.

30.6 (ఆరవ శ్లోకము)

స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ శంఖోద్ధారం వ్రజంత్వితః|

వయం ప్రభాసం యాస్యామో యత్ర ప్రత్యక్సరస్వతీ॥13461॥

కావున స్త్రీలు, బాలురు, వృద్ధులు వెంటనే  ఇచటినుండి శంఖోద్ధారక్షేత్రమునకు వెళ్ళవలెను. మనము మాత్రము ప్రభాస తీర్థమునకు వెళ్ళుదము. పశ్చిమవాహినియైన సరస్వతీనది అచట సముద్రమున సంగమించు విషయము మీరును ఎరుంగుదురుగదా! 

30.7 (ఏడవ శ్లోకము)

తత్రాభిషిచ్య శుచయ ఉపోష్య సుసమాహితాః|

దేవతాః పూజయిష్యామః స్నపనాలేపనార్హణైః॥13462॥

మనము ఆ ప్రభాసతీర్థమున స్నానములను ఆచరించి, పవిత్రులమై, ఉపవాసము చేసెదము. పిమ్మట ఏకాగ్రచిత్తులమై దేవతలకు అభిషేకమొనర్చి, చందనాది లేపనములతో, కుసుమాక్షతాది పూజాద్రవ్యములతో వారిని ఆరాధించెదము.

30.8 (ఎనిమిదవ శ్లోకము)

బ్రాహ్మణాంస్తు మహాభాగాన్ కృతస్వస్త్యయనా వయమ్|

గోభూహిరణ్యవాసోభిర్గజాశ్వరథవేశ్మభిః॥13463॥

బ్రాహ్మణులు స్వస్తివాచనములతో ఆశీర్వదించిన పిమ్మట మనము ఆ మహాత్ములకు గోవులను, భూములను, బంగారములను, వస్త్రములను, గజములను, అశ్వములను, రథములను, గృహములను దానమొనర్చి, వారిని సత్కరింతము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ముప్పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏



[06:20, 02/12/2021] +91 95058 13235: 2.12.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పదియవ అధ్యాయము

యాదవవంశము నశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.17 (పదిహేడవ శ్లోకము)

అన్యే చ యే వై నిశఠోల్ముకాదయః సహస్రజిచ్ఛతజిద్భానుముఖ్యాః|

అన్యోన్యమాసాద్య మదాంధకారితా జఘ్నుర్ముకుందేన విమోహితా భృశమ్॥13472॥

వీరేగాక నిశఠుడు, ఉల్ముకుడు మొదలగువారును, సహస్రజిత్తు, శతజిత్తు, భానుడు మున్నగువారును ఆ కదనరంగమున ఒకరినొకరు ఎదుర్కొని నిహతులగుచుండిరి. వీరందరును భగవంతుని మాయచే మోహితులై యుండిరి. పైగా మదిరాపాన మదాంధులై మత్తులై యుండిరి.

30.18 (పదునెనిమిదవ శ్లోకము)

దాశార్హవృష్ణ్యంధకభోజసాత్వతా మధ్వర్బుదా మాథురశూరసేనాః|

విసర్జనాః కుకురాః కుంతయశ్చ మిథస్తతస్తేఽథ విసృజ్య సౌహృదమ్॥13473॥

దాశార్హులు, వృష్ణివంశమువారు, అంధకులు, భోజులు, సాత్వతులు, మధు, అర్బుద, మాధురవంశములవారు, శూరసేన, విసర్జన, కుకుర, కుంతి వంశములవారు తమ తమ సోదర-స్నేహ భావములను విస్మరించి పరస్పరము చంపుకొనసాగిరి.

30.19 (పందొమ్మిదవ శ్లోకము)

పుత్రా అయుధ్యన్ పితృభిర్భ్రాతృభిశ్చ స్వస్రీయదౌహిత్రపితృవ్యమాతులైః|

మిత్రాణి మిత్రైః సుహృదః సుహృద్భిర్జ్ఞాతీంస్త్వహన్ జ్ఞాతయ ఏవ మూఢాః॥13474॥

పుత్రులు, తండ్రులతోడను, సోదరులు సోదరులతోను, మేనమామలు మేనల్లుళ్ళతోను, తాతలు దౌహిత్రులతోడను, సోదరపుత్రులు పినతండ్రులతోను, మేనల్లుళ్ళు మేనమామలతోను, మిత్రులు మిత్రులతోడను, సహృదులు సుహృదులతోడను, మూర్ఖులై పోరాడి చంపుకొనుచుండిరి.

30.20 (ఇరువదియవ శ్లోకము)

శరేషు హీయమానేషు భజ్యమానేషు ధన్వసు|

శస్త్రేషు క్షీయమాణేషు ముష్టిభిర్జహ్రురేరకాః॥13475॥

క్రమముగా వారి బాణములు ముక్కలైపోయెను. ధనుస్సులు విఱిగిపోయెను. శస్త్రములు ఛిన్నాభిన్నములై పోయెను. కడకు వారు సముద్రతీరమునగల రెల్లుగడ్డిని చేతబట్టి కొట్టుకొనసాగిరి. ఋషులయొక్క శాపకారణముగా ఉత్పన్నమైన రోకలిని చూర్ణము చేసి సముద్రమున కలుపుటవలన అచట రెల్లుగడ్డి మొలచియుండెను. ఆ రెల్లు గడ్డిపోచలే వారి వంశనాశనమునకు కారణములయ్యెను.

30.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తా వజ్రకల్పా హ్యభవన్ పరిఘా ముష్టినా భృతాః|

జఘ్నుర్ద్విషస్తైః కృష్ణేన వార్యమాణాస్తు తం చ తే॥13476॥

30.22 (ఇరువది రెండవ శ్లోకము)

ప్రత్యనీకం మన్యమానా బలభద్రం చ మోహితాః|

హంతుం కృతధియో రాజన్నాపన్నా ఆతతాయినః॥13477॥

మహారాజా! యాదవులు తమలో తాము కొట్టుకొనుటకు ఱెల్లుపోచలను చేతబట్టినంతనే అవి వజ్రములవలె, ఇనుపగదలవలె శక్తిమంతములాయెను. శ్రీకృష్ణుడు ఎంతగా వారించుచున్నను ఆయన మాటలను పట్టించుకొనక వారు పరస్పరము చావగొట్టుకొనిరి. యుద్ధోన్మాదముతో ఆవేశములకు లోనైయున్న ఆ యాదవులు పెడదారి పట్టియుండుటచే తమను వారింపవచ్చిన బలరామకష్ణులను శత్రువులుగా భావించి, వారినిగూడ కొట్టుటకు సన్నద్ధులైరి.

30.23 (ఇరువది మూడవ శ్లోకము)

అథ తావపి సంక్రుద్ధావుద్యమ్య కురునందన|

ఏరకాముష్టిపరిఘౌ చరంతౌ జఘ్నతుర్యుధి॥13478॥

పరీక్షిన్మహారాజా! అప్పుడు ఆ బలరామకృష్ణులును కోపోద్రిక్తులై పరిఘలతో సమానమగు రెల్లుగడ్డిని చేబూని, ఆ యుద్ధరంగమున వేగముగా అటునిటు తిరుగుచు వారిని చావమోదిరి.

30.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

బ్రహ్మశాపోపసృష్టానాం కృష్ణమాయాఽఽవృతాత్మనామ్|

స్పర్ధా క్రోధః క్షయం నిన్యే వైణవోఽగ్నిర్యథా వనమ్॥13479॥

వెదురుబొంగులు పరస్పరము ఒరసికొనుటచే ఏర్పడిన దావాగ్ని వాటినే బుగ్గిపాలు చేసినట్లు, బ్రాహ్మణ శాపగ్రస్తులు, కృష్ణమాయామోహితులు ఐన యాదవుల యొక్క క్రోధావేశములు వారినే పూర్తిగా నాశమొనర్చినవి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ముప్పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

2.12.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పదియవ అధ్యాయము

యాదవవంశము నశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఏవం నష్టేషు సర్వేషు కులేషు స్వేషు కేశవః|

అవతారితో భువో భార ఇతి మేనేఽవశేషితః॥13480॥

ఈ విధముగా యాదవవంశముల వారు అందఱును నశింపగా జూచి, శ్రీకృష్ణుడు మిగిలియున్న భూభారము  గూడ తొలగిపోయినట్లు తలంచెను.

30.26 (ఇరువది ఆరవ శ్లోకము)

రామః సముద్రవేలాయాం యోగమాస్థాయ పౌరుషమ్|

తత్యాజ లోకం మానుష్యం సంయోజ్యాత్మానమాత్మని॥13481॥

అంతట బలరాముడును ఆ సముద్రతీరమునందే భగవద్ధ్యానాత్మకమైన యోగమునందుండి, విష్ణ్వంశయైన తన ఆత్మను పరమాత్మయందు నిలిపి, భూలోకమును త్యజించెను.

30.27 (ఇరువది ఏడవ శ్లోకము)

రామనిర్యాణమాలోక్య భగవాన్ దేవకీసుతః|

నిషసాద ధరోపస్థే తూష్ణీమాసాద్య పిప్పలమ్॥13482॥

దేవకీసుతుడైన శ్రీకృష్ణభగవానుడు తన సోదరుడైన బలరాముడు పరమపదమును చేరుట చూచిన పిమ్మట ఒక రావివృక్షమూలమునకు చేరి, భూతలమున మౌనముగా కూర్చొనెను.

30.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

బిభ్రచ్చతుర్భుజం రూపం భ్రాజిష్ణు ప్రభయా స్వయా|

దిశో వితిమిరాః కుర్వన్ విధూమ ఇవ పావకః॥13483॥

దివ్యమూర్తియైన శ్రీకృష్ణుడు చతుర్భుజరూపమును దాల్చి దివ్యతేజస్సులతో వెలుగొందెను. అంతట ఆ తేజోమూర్తి పొగలులేని అగ్నివలె సకలదిశలను ప్రకాశింపజేసెను.

30.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటకవర్చసమ్|

కౌశేయాంబరయుగ్మేన పరివీతం సుమంగళమ్॥13484॥

30.30 (ముప్పదియవ శ్లోకము)

సుందరస్మితవక్త్రాబ్జం నీలకుంతలమండితమ్|

పుండరీకాభిరామాక్షం స్ఫురన్మకరకుండలమ్॥13485॥

30.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

కటిసూత్రబ్రహ్మసూత్రకిరీటకటకాంగదైః|

హారనూపురముద్రాభిః కౌస్తుభేన విరాజితమ్॥13486॥

30.32 (ముప్పది రెండవ శ్లోకము)

వనమాలాపరీతాంగం మూర్తిమద్భిర్నిజాయుధైః|

కృత్వోరౌ దక్షిణే పాదమాసీనం పంకజారుణమ్॥13487॥

అప్పుడు ఈ నీలమేఘశ్యాముని శరీరమునుండి పుటము పెట్టిన బంగారమువలె కాంతులు విరజిమ్ముచుండెను. ఆ స్వామియొక్క మంగళమయ వక్షస్థలము శ్రీవత్సచిహ్నమున తేజరిల్లుచుండెను. పట్టుపీతాంబరమును కట్టుకొని, ఉత్తరీయమును పరివీతముగా ధరించియున్న ఆయన శోభలు అపూర్వముగా నుండెను. దరహాసముతో విలసిల్లుచున్న ఆ ప్రభువుయొక్క ముఖారవింద సౌందర్యము నిరుపమానము. ఫాలభాగము నల్లని ముంగురులతో అలరారుచుండెను. నేత్రములు కమలములవలె ప్రసన్నములైనవి. మకరకుండల కాంతులు చెక్కిళ్ళపై మిలమిలలాడుచుండెను. నడుమున గల కటిసూత్రము, బుజముపై యజ్ఞోపవీతము, శిరముపై కిరీటము, చేతుల కంకణములు, బాహువుల భుజకీర్తులు తేజోవిరాజమానములై యుండెను. వక్షస్థలమునందు హారములు, చరణముల నూపురములు (కాలి అందెలు), వ్రేళ్ళయందు అంగుళీయకములు, కంఠమున కౌస్తుభమణి మనోజ్ఞములై అలరారుచుండెను. జానవులవఱకు వ్రేలాడుచున్న వనమాల పరిమళములను వెదజల్లుచుండెను. శంఖ, చక్ర, గదాది ఆయుధములు మూర్తిమంతమలై ఆ ప్రభువును సేవించుచుండెను. ఆ స్వామి తన కుడితొడపై కెందామరవంటి ఎడమపాదమును చేర్చి, ఆసీనుడైయుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ముప్పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

[04:23, 03/12/2021] +91 95058 13235: 3.12.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పదియవ అధ్యాయము

యాదవవంశము నశించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
30.33 (ముప్పది మూడవ శ్లోకము)

ముసలావశేషాయఃఖండకృతేషుర్లుబ్ధకో జరా|

మృగాస్యాకారం తచ్చరణం వివ్యాధ మృగశంకయా॥13488॥

మహారాజా! ముసలమునుండి ఏర్పడిన ఇనుపముక్కను బాణముగా చేసికొని, జర యను పేరుగల వ్యాధుడు ఆ స్వామియొక్క ఎర్రని పాదమును లేడి ముఖముగా భావించి, ఆ శరముతో దానిని కొట్టెను.

30.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

చతుర్భుజం తం పురుషం దృష్ట్వా స కృతకిల్బిషః|

భీతః పపాత శిరసా పాదయోరసురద్విషః॥13489॥

పిమ్మట ఆ కిరాతుడు చతుర్భుజరూపమున నున్న ఆ పురుషోత్తముని సమీపించి, 'అయ్యో! నేను ఎంతటి పాపకృత్యమును ఒనర్చితిని' అని భయముతో వణికిపోవుచు, అసురాంతకుడైన శ్రీకృష్ణుని పాదములపై మోకరిల్లి తన తప్ఫును మన్నించుమని ఇట్లు వేడుకొనెను-

30.35 (ముప్పది ఐదవ శ్లోకము)

అజానతా కృతమిదం పాపేన మధుసూదన|

క్షంతుమర్హసి పాపస్య ఉత్తమశ్లోక మేఽనఘ॥13490॥

30.36 (ముప్పది ఆరవ శ్లోకము)

యస్యానుస్మరణం నౄణామజ్ఞానధ్వాంతనాశనమ్|

వదంతి తస్య తే విష్ణో మయాసాధు కృతం ప్రభో॥13491॥

30.37 (ముప్పది ఏడవ శ్లోకము)

తన్మాఽఽశు జహి వైకుంఠ పాప్మానం మృగలుబ్ధకమ్|

యథా పునరహం త్వేవం న కుర్యాం సదతిక్రమమ్॥13492॥

30.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

యస్యాత్మయోగరచితం న విదుర్విరించో రుద్రాదయోఽస్య తనయాః పతయో గిరాం యే|

త్వన్మాయయా పిహితదృష్టయ ఏతదంజః కిం తస్య తే వయమసద్గతయో గృణీమః॥13493॥

"అయ్యో! మధుసూదనా! తెలియక ఈ పాపకార్యమును చేసితిని. ప్రభూ! పాపాత్ముడనైన నన్ను క్షమింపుము. నీ పుణ్యకీర్తి ఎంతో పవిత్రమైనది. సర్వసమర్థుడవైన ఓ పురుషోత్తమా! నీ దివ్యనామ స్వరూపములను స్మరించినంతమాత్రముననే మానవుల అజ్ఞానాంధకారము పటాపంచలగును. అట్టి నీయెడల నేను తీరని అపరాధమొనర్చితిని. వైకుంఠవాసా! ఏ పాపమెఱుగని మృగములను హతమార్చుచుండెడి మహాపరాధిని నేను. కనుక నన్ను వెంటనే వధింపుము. తత్ఫలితముగా నేను మఱల సత్పురుషులయెడ ఎట్టి అపరాధములకు పాల్పడను. దేవదేవా! నీ యోగమాయద్వారా రూపొందిన ఈ విశ్వమును గూర్చి బ్రహ్మదేవుడుగాని, పరమశివుడుగాని, బాగుగా వేదార్థములను ఎఱింగిన బృహస్పతి మొదలగు వారుగాని తెలిసికొనజాలరు. ఏలయన వారిదృష్టి నీ మాయచే కప్పబడినది. వారు నీ మాయామోహితులైరి. ఇంకను పాపయోనులయందు జన్మించిన మావంటివారు నీ మాయావిలాసమును ఎట్లు వర్ణింపగలము?"

శ్రీభగవానువాచ

30.39  (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

మా భైర్జరే త్వముత్తిష్ఠ కామ ఏష కృతో హి మే|

యాహి త్వం మదనుజ్ఞాతః స్వర్గం సుకృతినాం పదమ్॥13494॥

శ్రీకృష్ణభగవానుడు నుడివెను 'జర' యను పేరుగల వ్యాధుడా! భయపడకుము. నీవు నా పాదమును బాణముతో కొట్టుట నా సంకల్పానుసారమే జరిగినది లెమ్ము. నా ఆజ్ఞను అనుసరించి (నా అనుగ్రహ ప్రభావమున) నీవు పుణ్యాత్ములకు లభించునట్టి స్వర్గమునకు వెళ్ళగలవు".

శ్రీ శుక ఉవాచ

30.40 (నలుబదియవ శ్లోకము)

ఇత్యాదిష్టో భగవతా కృష్ణేనేచ్ఛాశరీరిణా|

త్రిః పరిక్రమ్య తం నత్వా విమానేన దివం యయౌ॥13495॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణపరమాత్మ తన సంకల్పానుసారమే మానవుడుగా అవతరించెను. ఆ ప్రభువు ఇట్లు ఆదేశించిన పిదప ఆ కిరాతకుడు మూడుమారులు ఆ స్వామికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి, ఒక దివ్యవిమానముపై స్వర్గలోకమునకు వెళ్ళెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ముప్పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


[20:42, 02/12/2021] +91 95058 13235: 3.12.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పదియవ అధ్యాయము

యాదవవంశము నశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.41 (నలుబది ఒకటవ శ్లోకము)

దారుకః కృష్ణపదవీమన్విచ్ఛన్నధిగమ్య తామ్|

వాయుం తులసికామోదమాఘ్రాయాభిముఖం యయౌ॥13496॥

శ్రీకృష్ణుని సారథియైన దారుకుడు ఆ స్వామిని వెదకికొనుచు ఆ పరమపురుషుడు ధరించిన తులసీమాల నుండి ప్రసరించుచున్న వాయుగంధములను ఆఘ్రాణించుచు, నందనందనుడు ఉన్నచోటికి చేరి, ఎదురుగా నిలిచెను.

30.42 (నలుబది రెండవ శ్లోకము)

తం తత్ర తిగ్మద్యుభిరాయుధైర్వృతం హ్యశ్వత్థమూలే కృతకేతనం పతిమ్|

స్నేహప్లుతాత్మా నిపపాత పాదయో రథాదవప్లుత్య సబాష్పలోచనః॥13497॥

అప్పుడు శ్రీకృష్ణభగవానుడు ఒక రావిచెట్టుక్రింద ఆసీనుడై ఉండుట అతడు గమనించెను. అచట దివ్యతేజో విరాజమానమలై శంఖచక్రాది ఆయుధములు మూర్తిమంతములై ఆ పురుషోత్తముని చుట్టును జేరి సేవించుచుండెను. ఆ స్వామిని దర్శించినంతనే దారుకుని హృదయమున స్నేహార్ధ్రభావము ఉప్పొంగెను. నేత్రములనుండి ఆనందబాష్పములు స్రవించెను. అంతట అతడు రథమునుండి దిగి, ఆ ప్రభువుయొక్క పాదపద్మములపైబడి, ఇట్లు పలికెను-

30.43 (నలుబది మూడవ శ్లోకము)

అపశ్యతస్త్వచ్చరణాంబుజం ప్రభో దృష్టిః ప్రణష్టా తమసి ప్రవిష్టా|

దిశో న జానే న లభే చ శాంతిం యథా నిశాయాముడుపే ప్రణష్టే॥13498॥

"పరమాత్మా! రాత్రివేళ చంద్రుడు కనుమఱుగైనంతనే దిక్కులన్నియు అంధకారమయములై ఏదియును కనబడదు. అట్లేప్రభూ! చిమ్మచీకటిలో చేరినవానికి కంటిచూపు కరవైనట్లు నీ దివ్యచరణాంబుజముల దర్శనము నేను దిక్కుతోచని స్థితికి గుఱియైతిని. నా హృదయమునకు శాంతి కరవైనది".

30.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఇతి బ్రువతి సూతే వై రథో గరుడలాంఛనః|

ఖముత్పపాత రాజేంద్ర సాఽశ్వధ్వజ ఉదీక్షతః॥13499॥

పరీక్షిన్మహారాజా! ఆ దారుకుడు ఇట్లు పలుకుచుండగనే గరుడచిహ్న పతాకముగల రథము అశ్వములతో సహా ఆకాశమునకు ఎగిరెను. ఆ దృశ్యమును అతడు చూచెను.

30.45 (నలుబది ఐదవ శ్లోకము)

తమన్వగచ్ఛన్ దివ్యాని విష్ణుప్రహరణాని చ|

తేనాఽతివిస్మితాత్మానం సూతమాహ జనార్దనః॥13500॥

వెంటనే శంఖచక్రాది దివ్యాయుధములుగూడ ఆ రథమును అనుసరించెను. ఆ దృశ్యమునుగాంచి, మిగుల ఆశ్చర్యపడుచున్న సారథితో (దారుకునితో) జనార్ధనుడు ఇట్లు పలికెను.

30.46 (నలుబది ఆరవ శ్లోకము)

గచ్ఛ ద్వారవతీం సూత జ్ఞాతీనాం నిధనం మిథః|

సంకర్షణస్య నిర్యాణం బంధుభ్యో బ్రూహి మద్దశామ్॥13501॥

"దారుకా! నీవు వెంటనే ద్వారకకు వెళ్ళుము. పరస్పరము పోట్లాడుకొని యదువంశములవారు మృతిచెందిన సంగతిని, అన్నయ్య బలరాముడు తన ధామమునకేగిన విషయమును, నేను పరంధామమునకు వెళ్ళదలంచిన వార్తను అచటి బంధువులకు తెలుపుము.

30.47 (నలుబది ఏడవ శ్లోకము)

ద్వారకాయాం చ న స్థేయం భవద్భిశ్చ స్వబంధుభిః|

మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిష్యతి॥13502॥

30.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

స్వం స్వం పరిగ్రహం సర్వే ఆదాయ పితరౌ చ నః|

అర్జునేనావితాః సర్వ ఇంద్రప్రస్థం గమిష్యథ॥13503॥

నేను విడిచిన ద్వారకానగరమును కొలది దినములలోనే సముద్రము ముంచివేయును. కావున 'మీరు అందఱును బంధుసహితముగా ద్వారకను విడిచిపెట్టి వెళ్ళుట యుక్తము. మా తల్లిదండ్రులును తదితర బంధుమిత్రులందఱిని, మీమీ ధనసంపదలను తీసికొని, అర్జునుని రక్షణలోనున్న ఇంద్రప్రస్థపురమునకు చేరుడు' అని వారితో నుడువుము.

30.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

త్వం తు మద్ధర్మమాస్థాయ జ్ఞాననిష్ఠ ఉపేక్షకః|

మన్మాయారచనామేతాం విజ్ఞాయోపశమం వ్రజ॥13504॥

దారుకా! నీవు మాత్రము నేను ఉపదేశించిన భాగవత ధర్మములను  ఆశ్రయించి, జ్ఞానయోగ నిష్ఠాపరుడవై, ఆపేక్షారహితుడవై యుండుము. ఇది అంతయును నా మాయారచితమని గ్రహించి, రాగబంధములు లేకుండ ప్రశాంతచిత్తుడవు గమ్ము".

30.50 (ఏబదియవ శ్లోకము)

ఇత్యుక్తస్తం పరిక్రమ్య నమస్కృత్య పునః పునః|

తత్పాదౌ శీర్ష్ణ్యుపాధాయ దుర్మనాః ప్రయయౌ పురీమ్॥13505॥

శ్రీకృష్ణపరమాత్మ ఇట్లు ఆదేశించిన పిమ్మట దారుకుడు ఆ స్వామి పాదారవిందములను ప్రదక్షిణ పూర్వకముగా పదేపదే నమస్కరించెను. పిమ్మట అతడు వ్యాకులచిత్తుడై ద్వారకాపురమునకు చేరెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే త్రింశోఽధ్యాయః (30)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి యాదవవంశము నశించుట అను ముప్పదియవ అధ్యాయము (30)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏




[04:52, 04/12/2021] +91 95058 13235: 4.12.2021 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పది ఒకటవ అధ్యాయము

భగవంతుడు తన పరంధామమునకు చేరుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ

31.1 (ప్రథమ శ్లోకము)

అథ తత్రాఽగమద్బ్రహ్మా భవాన్యా చ సమం భవః|

మహేంద్రప్రముఖా దేవా మునయః సప్రజేశ్వరాః॥13506॥

31.2 (రెండవ శ్లోకము)

పితరః సిద్ధగంధర్వా విద్యాధరమహోరగాః|

చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసో ద్విజాః॥13507॥

31.3 (మూడవ శ్లోకము)

ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకాః|

గాయంతశ్చ గృణంతశ్చ శౌరేః కర్మాణి జన్మ చ॥13508॥

31.4 (నాలుగవ శ్లోకము)

వవృషుః పుష్పవర్షాణి విమానావలిభిర్నభః|

కుర్వంతః సంకులం రాజన్ భక్త్యా పరమయా యుతాః॥13509॥

శ్రీశుకుడు వచించెను దారుకుడు వెళ్ళిపోయిన పిమ్మట అచటికి బ్రహ్మదేవుడు, పార్వతీ పరమేశ్వరులు, ఇంద్రాది లోకపాలురు, మరీచి మొదలగు ప్రజాపతులు, మహామునులు, పితృదేవతలు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, మైత్రేయాది బ్రాహ్మణోత్తములు, శ్రీకృష్ణభగవానుడు పరంధామ గమనమును దర్శించుటకై మిగుల ఉత్సాహముతో విచ్చేసిరి. వారందఱును శ్రీకృష్ణుని అవతారమహత్త్వమును, లీలావైభవములను, ప్రస్తుతించుచు గానము చేయసాగిరి. వారి విమానములతో ఆకాశమంతయు నిండిపోయెను. వారు అందరును మిక్కిలి భక్తిశ్రద్ధలతో ఆస్వామిపై పుష్పవర్షములను కురిపించిరి.

31.5 (ఐదవ శ్లోకము)

భగవాన్ పితామహం వీక్ష్య విభూతీరాత్మనో విభుః|

సంయోజ్యాఽఽత్మని చాఽఽత్మానం పద్మనేత్రే న్యమీలయత్॥13510॥

సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణపరమాత్మ తన విభూతి స్వరూపులైన బ్రహ్మదేవుని, ఇతరదేవతలను, ఋషులను చూచి కమలములవంటి తన నేత్రములను   మూసికొని విష్ణ్వంశయైన కృష్ణావతారమును స్వస్వరూపమునందు (శ్రీమహావిష్ణు తత్త్వమునందు) నిలిపెను.

31.6 (ఆరవ శ్లోకము)

లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యానమంగళమ్|

యోగధారణయాఽఽగ్నేయ్యాదగ్ధ్వా ధామాఽవిశత్స్వకమ్॥13511॥

భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహము ఉపాసకుల ధారణ ధ్యానయోగసాధనలకు పరమాశ్రయము. అది సకల లోకములకును శరణ్యమైనది, ఆనందప్రదమైనది. కనుక ఆ ప్రభువు శుభదాయకమైన తన కల్యాణమూర్తిని యోగాగ్నిలో దగ్ధమొనరింపకుండగనే తన వైకుంఠధామమునకు చేరెను.

31.7 (ఏడవ శ్లోకము)

దివి దుందుభయో నేదుః పేతుః సుమనసశ్చ ఖాత్|

సత్యం ధర్మో ధృతిర్భూమేః కీర్తిః శ్రీశ్చాను తం యయుః॥13512॥

అప్పుడు దేవదుందుభులు మ్రోగెను. ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. భూతలమునగల సత్యము, ధర్మము, ధైర్యము, కీర్తి, సంపదలు ఆస్వామిని అనుసరించెను (శ్రీకృష్ణుడు తన అవతారమును చాలించి, తన దివ్యధామమునకు చేరినంతనే సత్యము, ధర్మము మున్నగునవి భూలోకమునుండి వెడలిపోయినివి.

31.8 (ఎనిమిదవ శ్లోకము)

దేవాదయో బ్రహ్మముఖ్యా న విశంతం స్వధామని|

అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతివిస్మితాః॥13513॥

శ్రీకృష్ణపరమాత్మయొక్క తత్త్వము అవాఙ్మానసగోచరము. కావున ఆ పరమపురుషుడు తన పరంధామమున ప్రవేశించుటను బ్రహ్మాదిదేవతలుగూడ గమనింపలేక పోయిరి.  ఆ సంఘటనకు వారు ఎల్లరును విస్మితులైరి.

31.9 (తొమ్మిదవ శ్లోకము)

సౌదామన్యా యథాఽఽకాశే యాంత్యా హిత్వాఽభ్రమండలమ్|

గతిర్న లక్ష్యతే మర్త్యైస్తథా కృష్ణస్య దైవతైః॥13514॥

గగనమండలమున విద్యుత్కాంతులు మేఘములనుండి వెలువడిన మరుక్షణముననే మాయమగును. ఆ విద్యుత్కాంతి గతిని - మెరియుటను, అంతరించుటను ఎవరునూ గమనింపలేరు. అట్లే శ్రీకృష్ణభగవానుడు తన పరంధామమున ప్రవేశించుటను దర్శించుటకై వచ్చిన దేవతలు, మునులు ఆ స్వామి గమనమును గ్రహింపలేకపోయిరి.

31.10 (పదియవ శ్లోకము)

బ్రహ్మరుద్రాదయస్తే తు దృష్ట్వా యోగగతిం హరేః|

విస్మితాస్తాం ప్రశంసంతః స్వం స్వం లోకం యయుస్తదా॥13515॥

బ్రహ్మరుద్రాది దేవతలు శ్రీమహావిష్ణువుయొక్క ఈ యోగగతిని తిలకించి, ఆశ్చర్యమునకు లోనై ఆ పురుషోత్తముని ప్రస్తుతించుచు, తమ తమ లోకములకు చేరిరి.

31.11 (పదకొండవ శ్లోకము)

రాజన్ పరస్య తనుభృజ్జననాప్యయేహా మాయా విడంబనమవేహి యథా నటస్య|

సృష్ట్వాఽఽత్మనేదమనువిశ్య విహృత్య చాంతే సంహృత్య చాఽఽత్మమహిమోపరతః స ఆస్తే॥13516॥

మహారాజా! నటుడు అనేకములైన పాత్రలను ధరించి, నటించుచుండును. కాని అతడు ఏయేపాత్రలను ధరించినను తన సహజమైన వ్యక్తిత్వమును మాత్రము వీడడు. అట్లే ఆ సర్వేశ్వరుడు మనుష్యులవలె జన్మించుట, నానావిధములైన లీలలను ప్రదర్శించుట, మఱల తిరోహితుడగుట మొదలగునవి అన్నియును ఆ ప్రభువుయొక్క యోగమాయా విలాసములే. అనగా అభినయములే. ఆ పరమాత్మ జగత్తును సృష్టించును. అందు ప్రవేశించి విహరించును. కడకు ఆ సృష్టిని విలయమొనర్చి, తన మహిమాన్విత స్థితియందు స్థితుడగును. ఇవి అన్నియును ఆ జగన్నాటక సూత్రధారియొక్క లీలలే.

31.12 (పండ్రెండవ శ్లోకము)

మర్త్యేన యో గురుసుతం యమలోకనీతం త్వాం చానయచ్ఛరణదః పరమాస్త్రదగ్ధమ్|

జిగ్యేఽన్తకాంతకమపీశమసావనీశః కిం స్వావనే స్వరనయన్మృగయుం సదేహమ్॥13517॥

రాజా! శ్రీకృష్ణపరమాత్మ యమసదనమునకు వెళ్ళి గురుసుతుని రక్షించి, మానవదేహముతోనే అతనిని తీసికొనివచ్చి, తన గురువునకు అప్పగించెను. మాతృగర్భమునందు  ఉన్నప్పుడే బ్రహ్మాస్త్రానికి దగ్ధమగుచున్న నిన్ను సురక్షితుని గావించెను.  ఆ ప్రభువు మృత్యువునకే మృత్యువైన పరమశివుని, బాణాసురుని యుద్ధమున జయించెను. తనపై బాణమును ప్రయోగించిన వ్యాధుని  క్షమించి, వానిని సశరీరముగా స్వర్గమునకు పంపెను. సర్వసమర్థుడైన అట్టి శ్రీకృష్ణప్రభువు తనను రక్షించుకొనుటకు అసమర్థుడగునా?

31.13 (పదమూడవ శ్లోకము)

తథాప్యశేషస్థితిసంభవాప్యయేష్వనన్యహేతుర్యదశేషశక్తిధృక్|

నైచ్ఛత్ప్రణేతుం వపురత్ర శేషితం మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్॥13518॥

శ్రీకృష్ణభగవానుడు జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములకు నిరపేక్షకారణుడు. సర్వశక్తిమంతుడు. ఐనను తన శరీరమును అట్లే రక్షించియుండుట ఆ ప్రభువునకు ఏపాటి గొప్పదికాదు. తద్ద్వారా ఆత్మజ్ఞానియైనవాడు తన శరీరముపై ఎట్టి ఆసక్తిని యుంచక, స్వస్వరూపమునందే స్థితుడు కావలెననియు, పరమాత్మప్రాప్తియే అంతిమ లక్ష్యముగా ఉండవలెననియు లోకమునకు చాటుటకే ఇట్లు చేసెనా ఏమి?

31.14 (పదునాలుగవ శ్లోకము)

య ఏతాం ప్రాతరుత్థాయ కృష్ణస్య పదవీం పరామ్|

ప్రయతః కీర్తయేద్భక్త్యా తామేవాప్నోత్యనుత్తమామ్॥13519॥

ఏ వ్యక్తియైనను ప్రాతఃకాలమున మేల్కొనినంతనే శ్రీకృష్ణపరమాత్మయొక్క పరంధామగమన వృత్తాంతమును ఏకాగ్రచిత్తముతో భక్తిప్రపత్తులతో కీర్తించినచో అతనికి సర్వోత్తమమైన ఆ దేవదేవుని పరంధామము ప్రాప్తించును.

31.15 (పదిహేనవ శ్లోకము)

దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయోః|

పతిత్వా చరణావస్రైర్న్యషించత్కృష్ణవిచ్యుతః॥13520॥

శ్రీకృష్ణుని ఎడబాటునకు వ్యాకులచిత్తుడైన దారుకుడు ద్వారకానగరమున చేరి, వసుదేవ, ఉగ్రసేనుల పాదములపైబడి తన దుఃఖాశ్రువులతో వాటిని తడిపెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ముప్పది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[21:21, 04/12/2021] +91 95058 13235: 4.12.2021 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ఏకాదశస్కంధము - ముప్పది ఒకటవ అధ్యాయము

భగవంతుడు తన పరంధామమునకు చేరుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
31.16 (పదహారవ శ్లోకము)

కథయామాస నిధనం వృష్ణీనాం కృత్స్నశో నృప|

తచ్ఛ్రుత్వోద్విగ్నహృదయా జనాః శోకవిర్మూర్చ్ఛితాః॥13521॥

31.17 (పదిహేడవ శ్లోకము)

తత్ర స్మ త్వరితా జగ్ముః కృష్ణవిశ్లేషవిహ్వలాః|

వ్యసవః శేరతే యత్ర జ్ఞాతయో ఘ్నంత ఆననమ్॥13522॥

రాజా! అతడు ఎట్టకేలకు తన దుఃఖమునుండి తేరుకుని, అచటి వారందరికిని యదువంశములవారి మృత్యువృత్తాంతమును గూర్చి వివరించెను. ఆ దుఃఖగాథలను విని ఉద్విగ్న హృదయములతో శోకవిహ్వలులైరి. శ్రీకృష్ణుని ఎడబాటునకు శోకపరితప్పులై తలలు బాదుకొనుచు ఆ ద్వారకావాసులు తమ బంధుమిత్రులు అసువులను వీడియున్న ప్రదేశములకు చేరిరి.

31.18 (పదునెనిమిదవ శ్లోకము)

దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతౌ|

కృష్ణరామావపశ్యంతః శోకార్తా విజహుః స్మృతిమ్॥13523॥

31.19 (పందొమ్మిదవ శ్లోకము)

ప్రాణాంశ్చ విజహుస్తత్ర భగవద్విరహాతురాః|

ఉపగుహ్య పతీంస్తాత చితామారురుహుః స్త్రియః॥13524॥

అప్పుడు దేవకీ, రోహిణీ వసుదేవులు తమ ప్రియపుత్రులైన బలరామకృష్ణులు అచట కనబడకపోవుటతో శోకార్తులై స్పృహను కోల్పోయిరి. అంతేగాక ఆ మువ్వురును (దేవకీ, రోహిణి, వసుదేవులు) బలరామకృష్ణుల ఎడబాటును తట్టుకొనలేక ఆ క్షణముననే ప్రాణములను విడిచిరి. ద్వారకావాసులైన స్త్రీలు అందరును  తమ పతుల వియోగములకు తాళజాలక వారి కళేబరములపై బడి, లబలబ మొత్తుకొనుచు, కడకు వారి చితులపైబడి అగ్నికి ఆహుతియైరి.

31.20 (ఇరువదియవ శ్లోకము)

రామపత్న్యశ్చ తద్దేహముపగుహ్యాగ్నిమావిశన్|

వసుదేవపత్న్యస్తద్గాత్రం ప్రద్యుమ్నాదీన్ హరేః స్నుషాః|

కృష్ణపత్న్యోఽవిశన్నగ్నిం రుక్మిణ్యాద్యాస్తదాత్మికాః॥13525॥

బలరాముని పత్నులును తమ పతిదేవుని దేహమును కౌగలించుకొని ఆ చితాగ్నిలో భస్మమైరి. వసుదేవుని భార్యలు అతని శవముతోగూడ అగ్నిలో దగ్ధమైరి. శ్రీకృష్ణుని కోడండ్రు తమ పతులైన ప్రద్యుమ్నాదుల దేహములతో అగ్నిప్రవేశము చేసిరి. శ్రీకృష్ణుని పట్టపురాణులైన రుక్మిణి మున్నగువారు తమ మనస్సులలో ప్రాణనాథుని ధ్యానించుచు అగ్నిలో ప్రవేశించిరి. శ్రీమహావిష్ణువునకు నిత్యానపాయినియైన రుక్మిణీదేవి అగ్ని స్పర్శమాత్రమున తిరోధానమై తన దివ్యదేహముతో పరంధామమునకు చేరెను.

31.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అర్జునః ప్రేయసః సఖ్యుః కృష్ణస్య విరహాతురః|

ఆత్మానం సాంత్వయామాస కృష్ణగీతైః సదుక్తిభిః॥13526॥

శ్రీకృష్ణునకు అత్యంతప్రియసఖుడైన అర్జునుడు ఆ పురుషోత్తముని ఎడబాటునకు ఎంతయు పరితప్తుడయ్యెను. కాని, క్రమముగా గీతోపదేశములను స్మరించుకొనుచు, పెద్దలయొక్క లోకానుభవ వచనములకు తేరుకొని మనస్సును దిటవు చేసికొనెను.

31.22 (ఇరువది రెండవ శ్లోకము)

బంధూనాం నష్టగోత్రాణామర్జునః సాంపరాయికమ్|

హతానాం కారయామాస యథావదనుపూర్వశః॥13527॥

సంతానముతో సహా యుద్ధమున అసువులను కోల్పోయిన బంధువులకు (యదువంశముల వారికి) అందఱికిని అర్జునుడు యథావిధిగా పిండోదకదానాది (శ్రాద్ధ) కర్మలను నిర్వహింపజేసెను.

31.23 (ఇరువది మూడవ శ్లోకము)

ద్వారకాం హరిణా త్యక్తాం సముద్రోఽప్లావయత్క్షణాత్|

వర్జయిత్వా మహారాజ శ్రీమద్భగవదాలయమ్॥13528॥

మహారాజా! శ్రీహరి (శ్రీకృష్ణుడు) త్యజించిన ద్వారకను వెంటనే సముద్రుడు తన జలములలో ముంచివేసెను. శ్రీకృష్ణుడు నివసించిన భవనమును మాత్రము ముంచివేయక మిగిల్చియుంచెను.

31.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్ మధుసూదనః|

స్మృత్యాశేషాశుభహరం సర్వమంగళమంగళం॥13529॥

మధుసూదనుడైన శ్రీకృష్ణభగవానుడు అచట నేటికిని సర్వదా నివసించుచుండును. ఆ స్థానమును స్మరించినంత మాత్రముననే పాపతాపములు అన్నియును నశించును, సకలశుభములును చేకూరును.

31.25 (ఇరువది ఐదవ శ్లోకము)

స్త్రీబాలవృద్ధానాదాయ హతశేషాన్ ధనంజయః|

ఇంద్రప్రస్థం సమావేశ్య వజ్రం తత్రాభ్యషేచయత్॥13530॥

రాజా! మృతులైనవారికి శ్రాద్ధకర్మలను నిర్వహింపజేసిన పిదప అర్జునుడు మిగిలియున్న స్త్రీ, బాల, వృద్ధులను తీసికొని ఇంద్రప్రస్థమునకు చేరెను. అచట వారికి యథాయోగ్యముగ నివాసములను ఏర్పఱచెను. అనంతరము అతడు అనిరుద్ధుని కుమారుడైన వజ్రనాభుని మధురకు  పట్టాభిషిక్తుని గావించెను.

31.25 (ఇరువది ఐదవ శ్లోకము)

శ్రుత్వా సుహృద్వధం రాజన్నర్జునాత్తే పితామహాః|

త్వాం తు వంశధరం కృత్వా జగ్ముః సర్వే మహాపథమ్॥13531॥

పరీక్షిన్మహారాజా! నీ పితామహులైన  ధర్మరాజు మొదలగు పాండవులు అర్జునునిద్వారా యాదవులయొక్క, వారి బంధుమిత్రుల యొక్క మరణములనుగూర్చి తెలిసికొనిరి. వారు కురువంశోద్ధారకుడైన నిన్ను రాజ్యాభిషిక్తుని గావించి, మహాప్రస్థానము చేరిరి.

31.27 (ఇరువది ఏడవ శ్లోకము)

య ఏతద్దేవదేవస్య విష్ణోః కర్మాణి జన్మ చ|

కీర్తయేచ్ఛ్రద్ధయా మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే॥13532॥

మహారాజా! దేవతలకు ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణభగవానుని యొక్క అవతార విశేషములను, లీలావైభవములను నీకు వినిపించితిని. దీనిని శ్రద్ధాభక్తులతో కీర్తించిన మానవులు సమస్త పాపములనుండియు విముక్తులగుదురు.

31.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఇత్థం హరేర్భగవతో రుచిరావతారవీర్యాణి బాలచరితాని చ శంతమాని|

అన్యత్ర చేహ చ శ్రుతాని గృణన్ మనుష్యో భక్తిం పరాం పరమహంసగతౌ లభేత ॥13533॥

సౌందర్యమాధుర్యములకు నిధానమైన శ్రీకృష్ణపరమాత్మ యొక్క అవతార పరాక్రమములు, బాల్య, పౌగండ, కౌమారలీలలు భక్తుల భయములను పారద్రోలును, అవి పరమమంగళదాయకములు. శ్రీమద్భాగవత మహాపురాణము నందును, ఇతర పురాణేతి హాసముల యందును వర్ణింపబడిన ఆ స్వామి లీలామహత్త్వములను విన్నవారును, కీర్తించినవారును, చదివినవారును, చదివించినవారును, పరమహంసలగు మునీంద్రులకు ప్రాప్యమైన, శ్రీకృష్ణుని పాదపద్మములయందు పరమభక్తిని  పొందుదురు.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసక్యామష్టాదశసాహస్ర్యాం పారమహంస్యాం సంహితాయామేకాదశస్కంధే ఏకత్రింశోఽధ్యాయః (31)

ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి భగవంతుడు తన పరంధామమునకు చేరుట అను ముప్పది ఒకటవ అధ్యాయము (31)

🕉️🕉️🕉️సమాప్తోఽయమేకాదశస్కంధః🙏🙏🙏ఓం తత్సత్🕉️🕉️🕉

ఇంతటితో శ్రీమద్భాగవతమునందలి ఏకాదశ స్కంధము సమాప్తమయినది.

🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ 🕉️

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి