1, జనవరి 2022, శనివారం

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు)



: 🌹. కాలభైరవుడు ఎవరు? శివాలయం బయట ఎందుకు ఉంటాడు? 🌹

కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు... దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు.

భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా
...అంటుంది శతరుద్ర సంహితం. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేక పోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.

🌻. ఎవరీ కాలభైరవుడు... 🌻

శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే...’ - సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.

ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు ‘లాట్‌ భైరవ’ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే...కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.

పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మణికర్ణికాఘాట్‌ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్‌ (శ్మశాన)బాబాగా కొలుస్తారు. ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ... ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు. ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు.
🌹 🌹 🌹 🌹 🌹
బ్రహ్మ జ్ఞానం  ...105  

*భోగసమూహమందు రుచి తొలగ సర్వోత్తముడగు ఆత్మదేవుడు కానుపింప పరబ్రహ్మమందు ఎల్లప్పటికి శాశ్వతమగు అనంత విశ్రాంతి లభించును. 

*విషయానందమునే సారభూతముగ తలంచుచు, విషయములనే ఆస్వాదించుచు నుండు జీవులకు అనంతశాంతి ఎన్నటికిని లభింపదు. ఏలయనిన, ఆత్మయందు విశ్రాంతి బొందిన తప్ప జీవులకు పరమశాంతి చేకూరదు. 

*అదేవిధమున భోగవైరాగ్యాభ్యాసమను పురుష ప్రయత్న మొకదానిచే తప్ప మరి ఏయుక్తి చేతనుగూడ మనుజుని బుద్ధి శ్రేయోదాయకమగు ఆత్మసందర్శమున ప్రవర్తింపదు.

*చిద్రూప పరమకారణమగు ఆత్మయందున్నట్టి విశ్రాంతి బ్రహ్మాదిస్తంబపర్యంత మగు ఈ జగత్తునందెచటను లభింపదు. 

*ప్రాజ్ఞుడగువాడు పురుషప్రయత్నము నాశ్రయించి అదృష్టమును లెస్సగ దూరీకరించి ఆత్మశ్రేయమను ద్వారమును మూసివేయుటయందు గడియల వంటిదగు భోగములను బాగుగ తొలగించివేయవలెను. 

*వర్షాకాలము అభివృద్ధి కాగా సస్యసంపన్నమగు నిర్మలశరత్కాలము జనించునట్లు, భోగవిగర్హణ (విరక్తి) దృఢపడగా మనుజునకు (తత్త్వ) విచారణ జనించుచున్నది.

*భోగవిరక్తి వలన విచారణ, విచారణ వలన భోగవిరక్తి జనించుచున్నవి. ఈ రెండును సముద్ర, మేఘములవలె పరస్పర మొకదాని నొకటి పూరించు కొనుచున్నవి. 

*భోగముల యెడల విరక్తి, తత్త్వవిచారణ, శాశ్వతమగు స్మాత్మదర్శనము ఈ మూడును అతి స్నేహయుతులగు మిత్రులవలె పరస్పరము ఉపకరించుకొనుచుండును. 

*మొట్టమొదట “అదృష్టము”ను అనాదరించి పురుషప్రయత్నముచే పండ్లను పండ్లచే గట్టిగ కొఱికి (పట్టుదలతో మహాపరిశ్రమ చేసి ఎట్లయిన) భోగములందు విరక్తిని సంపాదింపవలెను.
***



ఆరోగ్యం బ్రహ్మ.... ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మికం బ్రహ్మ
తమవీధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ
అయ్యా! 
తమరే నా ప్రాణాలు కాపాడాల! 
విషయం చెప్పవోయ్! 
తమరికి తెలీన్దేముందీ, 
ఆ మధ్య రెండు పార్టీలోళ్ళు కర్రలతో కొట్టుకు చచ్చారుగా! 
ఔను!  కేసు నడుస్తోందిగా! 
ఔనయ్యా! 
కేసు రేపటితో తేలిపోతుందట! 
ఇంతకీ నీ సమస్యేమిటోయ్! 
ఆ కేసులో నేనొక్కడినే ప్రత్యక్ష సాక్ష్యిని! 
ఔనూ! నే విన్నది నిజమేనా? 
ఆ రెండు పార్టీలవాళ్ళు వాళ్ళకనుగుణంగా సాక్ష్యము చెప్పమని నీకు డబ్బిచ్చారటగా, 
ఎంత ముట్టిందోయ్? 
ఓ ఇరవై కోట్లండీ! 
సరే విషయానకి రా! 
ఒక పార్టీకనుకూలంగా సాక్ష్యమిస్తే మరో పార్టీవోళ్ళు నన్ను చంపేస్తారయ్య,
 సాక్ష్యం ఏం చెబితే నా ప్రాణాలు దక్కుతాయో తమరే శెలవియ్యాలయ్యా! 
సరే! ఓ ఐదు కోట్లు
 నా మొహం మీద కొట్టు! 
తెచ్చేనయ్యా, ఇందండయ్యా! 
డిఫెన్స్ లాయర్ నువ్వు ఏ గ్రూప్ వాళ్ళు ముందు కొట్టారో చెప్పమంటారు 
అప్పుడు నేనేం చెప్పాలయ్య? 
"అయ్యా! ఇంటికి పోతుంటే దార్లో ఆ రెండు గ్రూప్ లు పరస్పరంగా నిలబడి కొట్టుకోవడానికి సిద్దంగానున్నారండి, 
నాకు కళ్ళు తిరిగి నేలమీద పడిపోయానండీ, 
కళ్ళు తెరిచేసరికి రెండు గ్రూప్ లు కర్రలతో కొట్టుకోవడము చూసానండి" అని చెప్పు చాలు!
చివరాఖరుకి కేసేటౌద్ది బాబూ? 
దొమ్మీకేసు కింద కేసు కొట్టేస్తారు! 
రెండు గ్రూప్ లు నీకు పార్టీ ఇస్తాయి
*****"""****

*****
ఆరోగ్యం బ్రహ్మ...ఆనందం బ్రహ్మ... ఆధ్యాత్మికం బ్రహ్మ
మీ విధేయుడు .. మల్లాప్రగడ రామకృష్ణ, ఒక నాటి మాష్టారు
చక్కటి చిక్కటి తెలుగు పద్య గద్య వ్యాకరణ ప్రముఖులు వర్ణణ అమోఘము అద్భుతము ఆశ్చర్యం ప్రతి ఒక్కరు చదివి తెలుసు కోండి తేలుగు ఖ్యాతి
*తెలుగు మాస్టారా? మజాకా?*
తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.....
ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ
రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,
అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.
శుభమ్.
^^^^^   
ఆరోగ్యం బ్రహ్మ....ఆనందం బ్రహ్మ.... ఆధ్యాత్మికం బ్రహ్మ
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
     ఒక ఉల్లిపాయ.. ఒక పచ్చి మిరపకాయ..ఒక టమాటా..
ఒక ఐస్ గడ్డ..ప్రాణ స్నేహితులు గా ఉండేవి..
ఒకరోజు ఇవి నాలుగు కలసి,సముద్ర స్నానం చేసి,
దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని,బయలుదేరి రోడ్డు 
పక్కగా నడుచుకుని వెళుతున్నాయి..
అలా వెళుతుండగా,ఒక ఆటో వచ్చి ఢీ కొనగా,టైర్ కింద పడి టమాట చనిపోయింది.. టమాట చనిపోయిందన్న బాధతో..ఉల్లిపాయ,పచ్చి మిరపకాయ,ఐస్ గడ్డ 
భోరు భోరున విలపించాయి. కొంత సేపటి తరువాత
తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడచి వెళుతున్నాయి..
రోడ్డు పక్కన బజ్జీలు వేసేవాడు చూసి,పచ్చి మిరపకాయ ను పట్టుకుని,శనగపిండి లో ముంచి,నూనె మూకిడిలో
వేసేసాడు... అంతటితో పచ్చి మిరపకాయ చనిపోయింది..
ఇక ఉల్లిపాయ,ఐస్ గడ్డ చాలా సేపు ఏడ్చి...తిరిగి బయలుదేరి,సముద్రం చేరుకుని,స్నానానికి దిగాయి..
కొద్దీ సేపటి తరువాత స్నానం పూర్తి చేసుకుని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ..ఎంతసేపటికి ఐస్ గడ్డ తిరిగి రాకపోవడంతో,ఏడుస్తూ కూర్చుంది ఉల్లిపాయ..
ఐస్ గడ్డ సముద్రపు నీటిలో కరిగి చనిపోయిందని తెలుసుకుని,ఏడ్చుకుంటూనే వెళ్లి,గుడిలో దేవుని ముందు
సొమ్మసిల్లి పడిపోయింది..కొన్నిరోజుల అలాగే ఉండిపోయింది..కొన్నిరోజుల తరువాత............
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు..అమ్మా ఉల్లిపాయ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు..? ఏమిటి నీ బాధ అని అడిగాడు.
అప్పుడు ఉల్లిపాయ.....స్వామీ....ముగ్గురు ప్రాణ స్నేహితులను కోల్పోయాను అయినా తట్టుకున్నాను..
టమాట చనిపోయినప్పుడు నేను,పచ్చిమిరపకాయ,ఐస్ గడ్డ..కలసి ఏడ్చాము.పచ్చిమిరపకాయ చనిపోయినప్పుడు నేను,ఐస్ గడ్డ కలసి ఏడ్చాము..
ఐస్ గడ్డ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను..
స్వామీ...నా బాధ ఏమిటంటే.....
నేను చనిపోయింతరువాత.... నా కోసం ఏడ్చేవారు గాని,
నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చేవారు గాని ఎవరూ 
లేరుకదా....అంటూ భోరుబోరు న విలపించసాగింది..
అపుడు దేవుడు కరుణించి,ఉల్లిపాయ బాధ ను అర్ధం 
చేసుకుని,ఈ విధంగా వరం ఇచ్చాడు.
అమ్మా... ఉల్లిపాయ,నీకోసం ఏడ్చేవారు లేరని....
నీ కోసం కన్నీరు కార్చేవారు లేరని.....నువ్వు బాధపడవద్దు. ఎవరైతే నిన్ను కత్తితో కోసి,నీ మరణానికి
కారణం అవుతారో....వారే నీకోసం ఏడుస్తారు
నీ కోసం కన్నీరు కారుస్తారు..  ఇదే నేను నీకు ఇస్తున్న వరం.
అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యారు..
ఇది ఉల్లిపాయ కోస్తే...కన్నీళ్లు రావడం వెనుక ఉన్న కథ..        
--(())--

******
ఆరోగ్యం బ్రహ్మ - ఆనదం  బ్రహ్మ - ఆధ్యాత్మికం బ్రహ్మ 
మల్లాప్రగడ రామకృష్ణ 

ఓసారి అక్బర్ బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు 

దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.

ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్!

బీర్బల్ - మాతల్లి తులసీమాత

అక్బర్ వెంటనే అది పీకి పారేసి ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు అన్నాడు.

దానికి సరైన జవాబు ఇచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు 

ఓ చోట దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంబడే బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు 

అక్బర్ కి కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, బీర్బల్ ఏమిటిది అనడిగాడు.

మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు.

అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.

దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా  అన్నాడు 

బీర్బల్ - ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి చూద్దాము అన్నాడు.

అక్బర్ - ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు

బీర్బల్ - అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు.
అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ లేపనాన్ని పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!

కానీ అవతారం చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము అని.

బీర్బల్ -
లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది మార్గం చూపిస్తుంది అని చెప్పాడు.

ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది.

బీర్బల్ చెప్పాడు - ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని!

ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.

అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి  శుభానికి మేలు చేస్తుంటారు అని.

ఇది నమ్మేవారిని హిందువులు అంటాము
హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని
.

*గో,గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం, అవి మన సంస్కృతికి మూలస్థంభాలు.

ఆరోగ్యం బహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మికం బ్రహ్మ 
28-01-2022- విదేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

నేటి చిన్న కధ  "ఒ జర్నలిస్ట్" 

ఒక ప్రఖ్యాత శైవక్షేత్రం నికి ఒ జర్నలిస్ట్ ఏదైనా సేనసె‌ష్నల న్యూస్ కొసం వచ్చి ఓ భక్తుడిని ఇలా అడిగింది.

జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి

జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి

జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి

జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?

జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?

జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,

జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.

అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సుతో దేవుడినే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.

జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడినా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.

ఇది ఒక జర్నలిస్టు వ్రాసిన వ్యాసం
ప్రాంజలి ప్రభ 
*****


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - కధలు 
నేటి కధ - అయ్యోమయ్యం 

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా..?
లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని.... !?

బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!
మళ్ళీ బాల్యం కావాలని!

మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని

ఔను...

లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి!
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!

డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని

నవ్వాలని అనిపించినా ...
నవ్వలేని  పరిస్థితి...
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---
ఓహ్ !

నాకేం  బ్రహ్మాండంగా వున్నా!!
అని అనక తప్పనప్పుడు.
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి!

వాడికేందిరా....
దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు
ఇది జీవిత నాటకం...
ఇక్కడ అందరూ నటులే...

నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు...
బ్రతకటం కోసం !!
కాదు.. కాదు....

బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.
రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...

సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....
మరి మానవ జీవితంలో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...
పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !

మట్టిలో మొక్కలు నాటాలి...
మనసులో మానవత్వం నాటాలి ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....

మళ్ళీ ఒక్క క్షణం...
నాకెందుకులే అని !
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!
నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!
నా పని...
నా ఇల్లు... నా పిల్లలు...

నా...నా.. నా...
నాతోనే నలిగిపోతున్నా...!
ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!

జీవితమన్నది తనంత తానుగా...
నడచి పోతుంది  గడచి పోతుంది....
మనకళ్ళముందే....
.
మనకు తెలియకుండానే ముగిసిపోతుంది. చేయడానికి చాలా టైం వుందని
చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా!

చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో 
నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...
ఎవరినో అడిగాను ...
అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!

నిద్ర, సగం మృత్యువట!
మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!

అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో!
ఏదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం!

ఆనందం లేని అందం...
జవాబు లేని జీవితం....
ప్లాస్టిక్ పరిమళం..
సెల్ ఫోను సోయగం...

వెరసి ఇదీ నా నాగరిక జీవనం!
 తెల్లారి పోతున్నది...
 రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....

ఏంటో జీవితం....
రైలు బండి లా తయారయింది!
ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి చేరే గమ్యం మాత్రం లేనే లేదు!

ఒకడు శాసించి ఆనందిస్తాడు మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
అది లక్ష ఎప్పటికీ కాదు...
ఆ లక్ష సంపూర్ణం కాదు...
అందుకే...!

--(())--

ఉద్యోగుల కి జీతాలు పెoచడo అవసరమే ? కదా ?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో గత మూడు నెలలలు గా ఇటు ప్రజలలో అటు ఉద్యోగుల లో ప్రభుత్వం లో ఇదే చర్చ.   prcలో జీతాలు పెంచడo  ఇంతలా ఆలోచించి ,ఇంతలా చర్చలు చేసిన ప్రభుత్వం నభూతో నభవిష్యత్. ఇంత జరిగాక చివరికి దారుణంగా ఉద్యోగులు తిరిగి జీతాలు చెల్లించేలా Go ఇచ్చారు. అసలు ఉద్యోగులు ఏమి చేస్తున్నారు?వీళ్లకు జీతాలు పెంచడo అవసరం మా? సాధారణ ప్రజలు నుండి ప్రజాప్రతినిధులు వరకు చూద్దాం.

       సాధారణ ప్రజలు ఉదయం లెగిస్తే మీ ఇంటి చెత్త పట్టుకెళ్లేది,మీ విధి లో చెత్త క్లీన్ చేసేది  ఉద్యోగిస్తుడే(మున్సిపల్ కార్మికులు)

       బయటకు వెళ్ళాలి అంటే బస్ ఎక్కితే ఉద్యోగుల తీసుకువెళ్లాలి(Rtc)

       నీ ఇంటికి నిరంతరం కరెంట్ వస్తుంది అంటే ఉద్యోగులే(ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్)

       నీ ఇంటికి నీరు వస్తుంది అంటే ఉద్యోగే కారణం(water డిపార్ట్మెంట్)

       నీ  పొలం కి నీరు ఎరువు పంటకి బీమా పంటకు రేటు అన్ని ఉద్యోగుల పనిచేస్తే నే వస్తాయి

       నువ్వు ప్రశాంతంగా నిద్ర పోవాలి అంటే ఉద్యోగే కారణం(పోలీస్)

       నీకు చదువు రావాలి అంటే ఉద్యోగే కారణం(ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్)

       ఆఖరి కి నువ్వు పుట్టిన (బర్త్ సర్టిఫికెట్)ఉద్యోగే కావాలి నువ్వు చచ్చిన(డేర్త్ సర్టిఫికెట్) ఉద్యోగే కావాలి(రెవెన్యూ)

      నీకు ఏమి ఉన్నదో చెప్పాలి అంటే ఉద్యోగి ఇచ్చిన సర్టిఫికెట్ లే పట్టలే ఆధారo

     ఇలా చెప్పుకుంటే పోతే ఉద్యోగులు చేసే పనులు ఎన్నో

     చివరికి మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఏ ఉద్యోగి లేకపోయినా అడుగుతియ్యగలరా?

     ఒక్క పోలీసు లేకుండా బయటకి రాగలరా?ప్రతి సమాచారం ఉద్యోగుల నుండే ప్రభుత్వం కి అందాలి.

    ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి మీ ఇంటికి వచ్చి చూడరు.మిమ్మలి చూసేది మీ పరిస్థితి చెప్పేది మీకు ప్రతి పథకo వచ్చేలా చేసేది ఉద్యోగులే

    ఒక కలెక్టర్ నుండి ఒక చిరు ఉద్యోగి వరకు ప్రతి పనీ చేస్తేనే ప్రభుత్వం నడుస్తోంది పథకాలు నడుస్తున్నాయి. అంటే గాని ఏ ఒక్కరి వల్ల కాదు.

కాబట్టి సగటు ఉద్యోగి బాధ ఆంద్ర రాష్ట్రంలో ప్రజలు అర్ధం చేసుకుని ఇప్పటికి అయిన ఉద్యోగుల కు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వండి

******


దాతృత్వం...!!

దాత పిసినారి. చచ్చినా భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు.

 పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తరవాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తనవెంట ఏదీ తీసికొని వెళ్ళడు.

 దాతను, పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వ్యాఖ్య ఇది!

దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరవాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి.

దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదార చరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపర భేదాలను సృష్టించుకొంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది.

దానం చేసేవాడి చేయి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చేయి ఎప్పుడూ కిందనే ఉంటుంది. 

ఇదీ దాతకు, యాచకుడికి ఉన్న తేడా!

సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు.

 ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే. కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్నబావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావిలాంటివాడే.

 పిసినారి సముద్రంతో సమానుడు!

దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ఒక చేయినుంచి మరొక చేతిలోనికి తీసుకొనేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు!

 అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటివారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి.

సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి... 

వాటిలో మొదటిది, శ్రేష్ఠమైంది దానమని,  రెండోది మధ్య మార్గమైన భోగమని, ఈ రెండూ చేయకపోతే మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు. 

కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం.

పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు... ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి.

 అలా జీవించడం ప్రశంసార్హం. తేనెటీగలు ఎంతో శ్రమించి, పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి. కానీ, ఏం లాభం? ఎంతగా దాచినా, ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా, అది పరుల పాలవుతుంది.

మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు.

 అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి.

ఆర్తులకు దానం చేయడం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్నవాడికి ఆహారం పెట్టాలిగాని, అజీర్ణమైనవాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం?

పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరమూ పరోపకారానికే ఉపయోగపడాలి.

 బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా, శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే, కొవ్వు పెరగడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.

దాతృత్వం ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్యజీవన సాధనాలైనాయి.

 చేసిన దానం తరతరాలూ చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే..

*****


అనారోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ-- ఆధ్యాత్మిక బ్రహ్మ 
    మల్లాప్రగడ రామకృష్ణ 

 "ఉపనయనం":-(23-01-2022)

    "ఉపనయనం"

(ఓ సరదా నవ్వుల కథ)
ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు.అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు. ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడ వుందో
కనపడక వెతుకుతూ "నా చరవాణి ఎక్కడ?చరవాణీ ఎక్కడున్నావే?" అని గట్టిగఅరుస్తూ వుంటే, కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా "చరవాణా అదెవత్తీ?" అంటూనడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో గరిటతో సహా వచ్చింది.

"అదేనే కనకం! నా సెల్ ఫోను". "అలా అఘోరించ వచ్చుగా!" అని, "మీ చొక్కా జేబులో వుంది" అని చెప్పి వెళ్లి పోయింది. వెంటనే తెచ్చు కొని ఆకుపచ్చ మీట నొక్కి... ఎవరూ , అన్నాడు "నేను బావా! రమాపతిని. మా అబ్బాయి గణపతి కి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ,చెల్లి తప్పక రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను". "సరే వస్తాం లే బావా!" అని సెల్ పెట్టేసి భార్యను "కనకం! యిటు
రావోయ్" అని పిలిచాడు. "మీ అన్న కొడుకు ఉపనయనం అట.తప్పక రమ్మన్నాడు.
అంచేత 'దరిద్ర రథం' లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణి లో చేప్పేయ్" అన్నాడు. కనకం నెత్తి కొట్టుకుంటూ "మీ భార్య నైన పాపానికి 'దరిద్ర రథం' అంటే 'గరీబ్ రథ్' అనీ 'శయనాలు' అంటే 'బెర్త్స్' అనీ అర్థ
మయింది. ఆ పుస్తకం చెయ్యడమేమిటో? ఆ సంతోష ప్రయాణాల వాడెవడో? మీరే వివరించండి". "అదేనే! మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు"."అధికార భాషా చైర్మన్ గారూ! మీకో దండం" అని రెండు చేతులూ
శబ్దం వచ్చేలా కొట్టింది కనకం.

దోవకి పూరీ కూరా చేసుకొని బయల్దేరారు. ట్రైన్ ఎక్కి సర్దుకొని కూచున్న తర్వాత, "కనకం! అసలే నీది ద్విగవాక్ష శయనం,మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త" అన్నాడు ఉమాపతి.
"ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ ?" అంటే "సైడ్ లోయర్ బెర్త్" వివరించాడు.

కనకం నిట్టూర్చి "నా రవ్వల గాజులూ, చంద్ర హారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చి వచ్చాను,మిగతావి నా బాగు లో జాగ్రత్తగా వున్నాయి లెండి" అంది.
"అయ్యో! ఏ లెక్కా పత్రం లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే?

రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే? అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ, పరిభ్రమణ బోతూనూ" అన్నాడు. "పానబోతూ,పరిభ్రమణ బోతూ ఏమిటండీ?"
అంటే "తాగుబోతూ, తిరుగు బోతూ" అని వివరించాడు ఉమాపతి. "మహానుభావా! ఇంగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు కూడా పర్యాయ పదాలు కనిపెడు న్నారా?" అని తల బాదుకుంది. "అది సరే కానీ! మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయం లో తాళపేటిక ఒకటి విలపించింది కదా! అందులో పెట్టి రావలిసింది" అన్నాడు.

కాసేపు ఆలోచించి "ఓహో! ఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడిచింది కదా!" అని అర్థం చేసుకొని "మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు కదా!" అని దబాయించే సరికి నోరు మూసుకొని పడుకున్నాడు. పొద్దున్నే హైదరాబాద్ చేరారు. "మీ అన్న చతుశ్చక్ర వాహనం(కారు) పంపిస్తానన్నాడు. పంప లేదు చూశావా?" అని సరే "ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదాం" అంటూ (ఆటో)మాట్లాడాడు.

ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి "దరిద్ర రథం లో వస్తానని దూరవాణి లో చెప్పాను కదా!చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ?" అని బావ మరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూ వుంటే కనకం వివరించింది. "సారీ బావా!మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు .సమయానికి

కారు యింట్లో లేదు" అన్నాడు రమాపతి . ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై  , నేను పెళ్లి
మండపం లోకి వెళ్తున్నాను" అంటూ, త్వరగా తయారై వెళ్ళిపోయింది. ఉమాపతి తయారై "అరే నా ఉపలోచానాలు (కళ్ళజోడు) ఎక్కడ?"

అని కళ్ళజోడు కోసం వెతికాడు. కనపడ లేదు. అలాగే తడుముకుంటూ మండపం లోకి వెళ్ళాడు.అంతా మసక మసక గావుంది ఎవరూ సరిగ్గా కనపడడం లేదు. భార్య కోసం వెతుకుతున్నాడు. 'కనకం ఎక్కడుందీ?' అనుకుంటూంటే, అక్కడే కనకాంబరం చీర కనపడింది. 'అదిగో కనకం ఇక్కడే వుంది' అనుకుంటూ వెళ్లి కొంగు పట్టుకొని లాగాడు. ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గూబ గుయ్యిమని పించింది.

"ఏమిటీ తిక్క తిక్కగా వుందా?" అని అంటే ;ఏమైందంటే నా ఉపనయనాలు కనపడ లేదు" అని ఉమాపతి ఏదో చెప్పబోతూంటే

ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని "ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనబడ లేదంటా వేమిటి?" అంటూ కొట్టబోతుంటే, కనకం చూసి పరిగెత్తు కొచ్చి ఆపి "అన్నయ్యగారూ!


ఆయన మా ఆయనండీ! క్షమించండి. ఏదో పొరబాటు అయింది" అంటూ "ఏమిటండీ! ఇదీ" అంటే," కనకం! నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది. చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే?" అన్నాడు
.
"అబ్బా! ఫంక్షన్ లో గంట కొక చీర మారుస్తాము. ఇంతకీ ఉపనయనాలేమిటి?" అంది. "నా కళ్ళజోడు కనపడ లేదు అన్నాడుఉమాపతి.కనకం నెత్తి బాదుకొని "నిన్నరాత్రి రైల్లో నా బాగు లో పెట్టారుకదా!"అని తీసి కళ్ళకు తగిలించి, అందరికీ సారీ లు చెప్పి వెళ్ళింది.

ఊరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావ గారిని ఆటపట్టిస్తూ "బావా! ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో! అంటే స్పేర్ కళ్ళజోడు అన్నమాట అన్నాడు.

((()))

****

అనారోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ-- ఆధ్యాత్మిక బ్రహ్మ 
    మల్లాప్రగడ రామకృష్ణ 

 వివిధ శరీరాలు -  కలలు:-(22-01-2022)

        : నాన్న ఎప్పుడూ ఒంటరివాడే, అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో. నాన్న ఎప్పుడూ తుంటరివాడే, అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో. కని,పెంచటం అమ్మే అన్నట్లు కనిపిస్తుంది, నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.

    కనటం అమ్మే అయినా కలలుకనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్న వల్లేనని, కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. సేవచేయటం అమ్మ వంతు, సరిచేయటం నాన్న తంతు. అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి, నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు దోషాలు కూడా కనబడుతాయి.

            ప్రేమించటం అమ్మ వంతు అయితే,దీవించటం నాన్న వంతు.        ఆకలి తీర్చటం అమ్మ వంతు అయితే, ఆశలు తీర్చటం నాన్నవంతు. 

   అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది, నాన్న దీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.

అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. నాన్న గుండెలో పిల్లల క్షేమానికి అనుబంధించిన ఆవేదనే ఉంటుంది. అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,నాన్న ఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి. కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరాటం నాన్నది.

అమ్మకి లైకులెక్కువ, నాన్నకి షాకులెక్కువ. అమ్మ ఏడవటం కనిపిస్తుంది, నాన్నఎద చెరువవటం కనిపించదు.గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ, గుర్తింపు పొందని దేవుడు నాన్న..: నాన్న ఎప్పుడూ ఒంటరివాడే, వహారిక మణిప్రవాళ వృత్తములు
==

అనారోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ-- ఆధ్యాత్మిక బ్రహ్మ 
    మల్లాప్రగడ రామకృష్ణ 

 వివిధ శరీరాలు -  కలలు:-(22-01-2022)

 మనము, ఈ భౌతిక శరీరంతో పాటు మొత్తం ఏడు శరీరాల సముదాయం.  ఇవి ఒకదాని లోపల మరొకటి ఒదిగి ఉంటాయి.  నిద్రావస్థలో సమగ్ర జ్ఞాన సముపార్జన కోసం వివిధ శరీరాలు చేసే క్రియలే  'కలలు'.  మన దేహంలోని ఏడు శరీరాలు నిద్రావస్థలో కలలు కంటాయి. ఒక శరీరం యొక్క కల ముగిసిన తర్వాతే మరియొక శరీరం కల కంటుంది.

1. స్థూల శరీరం (Physical Body - అన్నమయ కోశం):-  భౌతిక శరీరము కనే కలలకి చైతన్య స్పృహ ఉంటుంది.  ఇది మనకు సంబంధించింది అని స్పష్టంగా తెలుస్తుంది.

ఉదా:- భౌతిక ప్రపంచానికి సంబంధించిన స్నేహితులు,  సంఘటనలు,  ప్రదేశాలు మొదలైనవి కలలుగా గోచరించడం.

2. కాంతిమయ శరీరం (Etheric Body -  ప్రాణమయ కోశం):-

కాంతిమయ శరీరంతో కనే కలలు సుప్త చైతన్యంలో ఉంటాయి కనుక వెంటనే మర్చిపోతాము. ఇవి మనం బలవంతంగా అణచుకున్న కోరికలకు సంబంధించి ఉంటాయి.  ఈ శరీరంతో మనం ఆ అనుభూతులను ఆస్వాదించవచ్చు.

ఉదా:- పెద్ద ఇళ్లల్లో జీవించడం, నగలు ధరించడం, అందమైన అమ్మాయిలతో రమించడం మొదలైనవి.

3. సూక్ష్మ శరీరం (Astral Body - మనోమయ కోశం):-

  ఈ శరీరంతో కనే కలలు ఎంతో గుర్తుపెట్టుకుంటే కానీ గుర్తుండవు. ఈ శరీరం దూరాన్ని అధిగమించగలదు.

ఉదా:- ఏ ప్రదేశానికంటే ఆ ప్రదేశానికి అనుకున్న వెంటనే చేరగలగడం.

4. భావన శరీరం (Causal Body -  విజ్ఞానమయ కోశం):-

 ఈ శరీరం కనే కలలు పూర్వ జన్మలకు సంబంధించిన సంఘటనలు.  ఉదాహరణకు ఏదైనా ప్రదేశాన్ని సందర్శించినచో అది అంతకు ముందే చూచినట్లు అనిపించడం.

5. కారణ శరీరం (Spiritual Body - ఆనందమయ కోశం):-

 భవిష్యత్తులో జరిగే సంఘటనలు అన్నీ ఈ శరీరం ద్వారా కలలుగా గోచరించును.

ఉదా:- బంధు, మిత్రులలో ఎవరైనా చనిపోబోవుచున్నచో ముందే కలలుగా రావడం.

6. మహాకారణ శరీరం (Cosmic Body -  విశ్వమయ కోశం):-

 ఇచ్చట ప్రజ్ఞ ఒక్కటే పని చేస్తుంది.  ఈ శరీరం విశ్వ విరాట్ మూర్తితో తాదాత్మ్యం చెందుతుంది. యావత్ సృష్టిని ఈ శరీరం దర్శిస్తుంది. యోగులు మాత్రమే ఈ దశను గుర్తించగలరు.

7. నిర్వాణమయ శరీరం (Nirvanic Body):-

  ఈ దశలో కలలు, కల్పనలు ఉండవు. ఈ సమయం మొత్తం మహా శూన్యమే గోచరించును. శూన్యం అయినా ఈ దశలోనే విశ్వప్రాణశక్తి పూర్ణంగా లభించును.  దీనినే మనం గాఢనిద్ర అని పిలవవచ్చు.

 మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు మొదటిగా భౌతికశరీరం యొక్క కలతో మొదలై వరుసగా నిర్వాణ శరీరం వరకు వెళ్ళి, తిరిగి నిర్వాణ శరీరం నుండి చివరగా భౌతిక శరీరం యొక్క కలతోనే నిద్ర ముగియును.

అందువలనే నిద్రను 'మహామాయ' అని పిలుస్తారు.

__(())__


అనారోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ-- ఆధ్యాత్మిక బ్రహ్మ 
    మల్లాప్రగడ రామకృష్ణ 
సృష్టి (21-01-2022)

దేవుడు కనబడడు - ఉనికి కనబడుతుంది 
కధ మొత్తం చదవండి , ఇతరులకు చెప్పండి  

దేవుడు ఉన్నాడు. అని నమ్మేవారు చాలామంది వున్నారు. అయితే నమ్మకానికి తార్కాణం ఏమిటి. దేవుడు కనుపించుతాడా? ఎలా? ఆయనకు కిరీటం వుంటుందా? నాలుగు చేతులుంటాయా? త్రిశూలం, సుదర్శనచక్రం లేక ఇంకేదైనా ఆయుధం వుంటుందా? మహిమలు చూపిస్తాడా? ఇవి ఏమీకావు.
అవునండి. దేవుడు డైరక్ట్ గా కనుపించడు. రకరకాల రూపాలలో మన ఆర్తిని బాపడానికి కనుపిస్తూవుంటాడు. మన నమ్మకాన్నిబట్టి. మన ఆలోచనలనుబట్టి ఆయన వునికి చాటుకుంటాడు.
ఒక సంఘటన ఇక్కడ వివరిస్తాను. నాహృదయం కదిలింది అదివిన్నతరువాత. మీరుకూడా తప్పకుండా ఆ అంతర్యామి లీలలు తప్పకతెలుసుకుంటారు. అది జనవరి 1, 2009. ఆ సంఘటన జరిగింది బరోడాలో. ఆయన ఒక హృద్రోగనిపుణుడు డాక్టర్ శైలేష్ మెహతా. ఆయన వద్ద అపాయింట్మెంట్ కావాలంటే నెలముందుగానే నమోదు చేసుకోవాలి. ఆయనకు బరోడా,అహ్మదాబాద్,రాజ్ కోట్ లలో ఎంతోమంది సీనియర్ డాక్టర్స్ వున్నారు. వందలమంది జూనియర్ డాక్టర్స్ కూడా వున్నారు. వాళ్ళందరూ రోగులను పరీక్షించి రిపోర్ట్ లు ఆయనకు చూపుతారు. ఆయనచూడవలసినది అయితే చూస్తారు.లేకుంటే సూచనలు ఇస్తారు. ఆయన పర్యవేక్షణలో ఎంతటి క్లిష్టతరమైన కేసైనా సక్సెస్ అవవలసిందే.

ఆరోజు ఆయన కారిడార్ డాక్టర్ మెహతా కూర్చున్నారు. 69 వయసు వున్న ఆయన ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత గోచరిస్తుంది. రోజుకు కనీసం పది అయినా గుండె శస్త్ర చికిత్సలు చేస్తారు. అయినా ఆందోళనగావుండరు.ఆయనవద్దకు ఒక జంట తమ బిడ్డతో వచ్చారు. తమ బిడ్డ ఒకహృద్రోగి అని, ఆయన జూనియర్ డాక్టర్లు ఇచ్చారని అంటూ ఆయన చేతిలో ఒక ఫైల్ వుంచుతూ దీనవదనంతో ఆయన మాటవినడానికి ఆత్రతగాచూస్తున్నారు.  ఆయనవద్దకు ఒక జంట తమ బిడ్డతో వచ్చారు. ఆరేళ్ళ తమ పాప ఒకహృద్రోగి అని, ఆయన జూనియర్ డాక్టర్లు ఇచ్చారని అంటూ ఆయన చేతిలో ఒక ఫైల్ వుంచుతూ దీనవదనంతో ఆయన మాటవినడానికి ఆత్రతగాచూస్తున్నారు. ఆయన ఒక్కక్షణం ఆ ఫైల్ చూశారు. కేస్ పరిస్థితి దయనీయంగావుంది అని తెలుసుకున్నారు. ఆయన పాప తల్లిదండ్రులకు ఇలా వివరించారు. చూడండి మీ పాప పరిస్థితి అసలు బాగాలేదు. కేవలం రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి పాపకు వెంటనే గుండెకు ఆపరేషన్ చేయాలి. కాని 30 శాతం మాత్రమే బ్రతకడానికి అవకాశాలు వున్నాయి. ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోవడానికి 70 శాతం అవకాశాలు వున్నాయి. రెండవది ఆపరేషన్ చేయకపోతే 3 నెలలకన్నా బ్రతకదు.  ఆ పాప తల్లిదండ్రులు గొల్లున ఏడ్చారు. ఆ ఏడపుకు అంతఅనుభవంవున్న డాక్టరుగారు కూడా కదిలిపోయారు. ఆపరేషన్ చేయించడానికి సిద్ధమయారు. తేదీకూడా ఖరారు అయింది.  ఆపరేషన్ తేదీకి ఆరురోజుల ముందు పాపను హాస్పటల్ లో అడ్మిట్ చేశారు. పాప తల్లి పాపతోటేవుంది. ప్రతిరోజు తల్లి దేవుడిని ప్రార్ధించుకుంటోంది. పాపచేత కూడా ప్రార్ధనచేయిస్తోంది. భారం అంతా దేవుడిమీద వుంచినట్లు భావిస్తూ ఆ పరమాత్ముడిని మనసారా ఆతల్లి ప్రా ర్ధించుకుంటోంది.  అమ్మా దేవుడిని ప్రార్ధించుకోఅమ్మా. ఆదేవుడు నిన్నుకాపాడుతాడు. అంటోంది రోజూ. పాపకూడా రోజూ ప్రార్ధించుకుంటోంది. ఆపరేషన్ చేయవలసిన రోజు రానేవచ్చింది. ఆపరేషన్ థియేటర్ సిద్ధంచేశారు. డాక్టర్లు అందరూ ఆపరేషన్ థియేటర్లో వున్నారు. శైలేష్ మెహతా ఆకుపచ్చరంగు డ్రస్, చేతులకు గ్లౌస్, తలకు ఆకుపచ్చరంగు cap  తో ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించారు. పాప ఆపరేషన్ టేబుల్ మీద వుంది. బ్రతికేవుంది. కాని ఆయువు కొన్ని నిముషాలే అవుతుందేమో అని అనుకుంటున్నారు. డాక్టర్ గారు పాపను ఆప్యాయంగా చూశారు. 

డాక్టర్: పాపా! భయపడకమ్మా. నువ్వు బాగావుంటావు 

పాప: నాకు భయంలేదు డాక్టర్.  నాకు గుండె ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేస్తారటకదా? అంటే గుండె అంతా ఓపెన్ చేస్తారా?

డాక్టర్: ఒక్క సారి డాక్టర్ గారు నివ్వెరపోయారు. అవును తల్లీ. నొప్పివుండదమ్మా. మందు ఇస్తాము నొప్పిలేకుండా భయపడకమ్మా. 

పాప: నాకు భయంలేదండి. నా ప్రశ్న ఇంకా పూర్తికాలేదు. నన్ను చెప్పనీయండి.

డాక్టర్: ప్రశాంతంగా పాప కళ్ళలోకి చూస్తున్నారు. 

పాప: గుండె పూర్తిగా ఓపెన్ చేస్తారు కదా. హృదయంలో దేవుడు వుంటాడని అమ్మ చెపుతూవుంటుంది. గుండె ఓపెన్ చేసినపుడు దేవుడ్ని చూస్తారుకదా మీరు? నేను బ్రతికితే ఆయన ఎలా వుంటాడో నాకు చెపుతారా డాక్టర్ గారు? 

డాక్టర్: OK. OK.

ఆపరేషన్ ప్రారంభమయింది. 45 నిమిషాలు గడిచింది. ఒక్క చుక్క రక్తం కూడా గుండెలోనికి రావడంలేదు. pulse కొట్టుకోవడం తగ్గింది. BP పడిపోతోంది. డాక్టర్ గారు ఒక్కసారి బోరున చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్నారు. పాప అన్నమాటలు చెవిలో రింగుమంటున్నాయి.  ఓ భగవంతుడా నాజీవితంలో ఇన్ని ఆపరేషన్లు చేశాను. నాచేతులో రక్తంలో నాని వున్నాయి. కానీ పాపలాంటి వాళ్ళను నేను చూడలేదు. ఓ తండ్రీ నువ్వు తన హృదయంలో వున్నావంటోంది. వుంటే ఈపాపను కాపాడు. నువ్వు తప్ప ఎవరూ కాపాడలేరు తండ్రీ అంటూ భోరున ఏడుస్తూ  పాప చనిపోయిందని అక్కడనుండి కదలిపోయారు. అంతలోనే ఆయనతో వున్న ఇంకొక డాక్టర్ ఒక్కసారి అరిచాడు. మెహతాగారు గుండెలోనికి రక్తంవస్తోంది అని. వెంటనే మిషన్స్ అన్నీ ఆన్ చేశారు. నాలుగున్నరగంటలు ఆపరేషన్ నడిచింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. పాపగుండె చాలా క్లీన్ గావుంది. పాప కనీసం 60 స లు జీవిస్తుందని మెహతా అన్నారు.  

ఆతర్వాత పాపను చూడడానికి మెహతా పాప ఇంటికి వెళ్ళారు. 

పాప: డాక్టర్ గారు నా గుండె ఓపెన్ చేసినప్పుడు దేవుడు కనుపించాడాండి. ఎలా వున్నాడాయన. ఏం చెప్పాడండి నాగురుంచి

డాక్టర్: దేవుడు కంటికి కనపడడమ్మా. ఆయనను చూడడానికి ప్రయత్నీంచకు. ఆయన వునికిని అనుభవిస్తాము. 

దేవుడంటే నమ్మకంలేని మెహతాగారు ఈ సంఘటన తరువాత ఆయన గదిలో దేవుడి ఫోటో ఏర్పాటు చేసుకున్నారు. 

దేవుడు కనుపించుతాడని అనుకోవద్దు. ఆయన కనబడడు. ఆయన వునికిని అనుభవించుతాము తప్ప చూడము.
🌺🌺🌺🙏🙏🙏🌹🌹

అనారోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ-- ఆధ్యాత్మిక బ్రహ్మ 
         
సృష్టి (20-01-2022)

ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్  (విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం)

  . విశ్వశక్తి (లేదా) విశ్వ చైతన్యం విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో ప్రకంపిస్తూ ఉంటుంది.
విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం (Emf) అనేది రెండు వాహకాలు యొక్క కలయిక ఇందులో...

1. విద్యుత్ శక్తి క్షేత్రం (Electrical Energy) అనేది పురుషశక్తి(Male Energy).

2. అయస్కాంత శక్తి క్షేత్రం (Magnetic Energy) అనేది స్త్రీ శక్తి (Female Energy).

ఈ భూమి పై మన దేహాలు విద్యుత్ అయస్కాంత శక్తితో కూడుకున్న జీవరూపాలు. మనం మల్టీ డైమెన్షనల్ లైట్ బీయింగ్స్(విద్యుత్ అయస్కాంత జీవిత రూపాలు). మనం భూమి పైన జీవిస్తూ ద్వంద్వత్వం గేమ్ ఆడుతున్న శక్తి స్వరూపులం.

శరీరంలో ఈ శక్తి C.W (Clockwise) కుడి వైపుకి, A.C.W(Anti Clockwise)ఎడమ వైపుకి తిరుగుతూ ఉంటుంది.

పురుష శక్తి (ఎలక్ట్రికల్ ఎనర్జీ) కుడివైపుకి తిరిగితే, స్త్రీ శక్తి (మాగ్నెటిక్ ఎనర్జీ) ఎడమవైపుకు తిరుగుతూ శక్తి క్షేత్రాన్ని చక్రాస్ నుండి ఆరా ద్వారా క్రియేట్ చేస్తుంది.

       . ఈ ఫ్రీక్వెన్సీలను Hz  రూపంలో కొలుస్తాం. Emf మనకు తీటా, బీటా, డెల్టా, ఆల్ఫా, గామా తరంగాల రూపంలో బ్రెయిన్ వేవ్స్ గా శరీరానికిశక్తిగా అందుతూ ఉంటాయి. Emf (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్) నుండి వస్తున్న శక్తి చక్రాస్ స్వీకరించి పరమాణు స్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీగా తయారు చేసుకుంటుంది.  తద్వారా DNA నుండి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ని మిగిలిన శక్తులను తయారు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని పొందేలా చేస్తుంది.
*****


 నాగరికత జననం, మరణం. 

   1) ప్రతి జీవికి జనన మరణ చక్రాలున్నట్లే ప్రతి నాగరికతకు జనన మరణ చక్రాలుంటాయి. ప్రతి నాగరికతకు లక్ష్యం ఉంటుంది. మానవ జాతి ఇతర జీవజాతులు అన్నీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. మానవజాతి సూక్ష్మ శరీరంతో ఇతర లోకాలకు వెళ్లగల సామర్ధ్యం కలిగివున్నాడు. అలాగే ఇతర జీవజాతులు కూడా అదే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

         2) ఒక్కొక్క నాగరికతలో జీవులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలను కలిగి ఉన్నాయి.ఒక నాగరికతలో ఉన్నజీవజాతులు మరో నాగరికతలో continue అవ్వవచ్చు ,లేదా అంతరించవచ్చు.

          3) కొన్ని నాగరికతల్లో కనీ విని ఎరుగని జంతువులు ఉండేవి, అవి ఇప్పటి నాగరికతలో లేవు
మనుషుల రూపాలు ఒక నాగరికతలో ఒక లాగా మరో నాగరికతలో మరో లాగా ఉండేవి.

        4) ఒక నాగరికత లో 50 అడుగుల ఎత్తు ఉండి భారికాయులు లాగా ఉండేవారు,వారి ఆయుష్షు కొన్ని వందల సంవత్సరాలు ఉండేది. జంతువు తల+మనిషి దేహం మనిషి తల+జంతువు దేహం
సగం మనిషి +సగం చేప కొన్ని నాగరికతల్లో సముద్రజాతి,కొన్ని నాగరికతల్లో  జంతువులు, dominate చేయడం జరిగింది.ప్రస్తుతం మనం domination ఉంది.

      5) కొన్ని నాగరికతల్లో వేరే లోకాలకు పయనించి అక్కడి జ్ఞానం భూమి మీదకు తీసుకువచ్చారు.

         6).ఒక నాగరికతలో ఉద్భవించిన జీవజాతులు మరింత ఉన్నతి కోసం మళ్లీ భూమి మీద వేరే భౌతిక రూపాలు ఎంచుకుని వేరే లక్ష్యాలు ఎంచుకుని సవాళ్లు ఎంచుకుని వేరే నాగరికతలోకి ప్రవేసిస్తాయి.

       7) మన దేహంలో ఒక భాగం పాడైతే శరీరం మొత్తం ఆ బాధను అనుభవించాల్సి ఉంటుంది. దేహంలోని ఇతర భాగాలన్ని దానికి సహకరించి ఆ బాధను తొలగిస్తాయి.
అలాగే భూమి మీద ఒక జాతి crisis లో ఉంటే దాన్ని అన్ని జాతులు భరించాల్సి ఉంటుంది.

*****


ఆరోగ్యం బ్రహ్మ --- ఆనందం బ్రహ్మ --- ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి  ప్రభ --19-01-2022

భగవంతుని చేరే క్రమాన్ని అన్వయ క్రమమంటారు. అంతఃకరణను శుద్ధిచెసుకొనె (క్రమాన్ని వ్యతిరేక క్రమమంటారు. ఈ రెండు భక్త ప్రహ్లాదుని విషయంలో మనం గమనించవచ్చును.

కమలాక్షునర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్చించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని జూచు చూడ్ములు చూడ్ములు
శేషశాయికి మొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వినులు వినులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు  పురుషోత్తముని మిది బుద్ధిబుద్ధి

దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
దండ్రీ ! హరిజేరు మనియెడి తండ్రి తండ్రి

తాః శ్రీ హరిని పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్షించే నాలుకే నాలుక. శ్రీపతిని చూచే చూపులే చూపులు. శేషశాయికి (మొక్కే శిరస్సే శిరస్సు. విష్ణు కథలను వినే చెవులే చెవులు. మధుసూదనుని తలచి మనసే మనసు. భగవంతునికి
ప్రదక్షిణ చేసే పాదాలే పాదాలు.

 పురుషోత్తముని యందు నిలిపె బుద్ధె బుద్ది. దేవదేవుని గురించి ఆలోచించే దినమె దినము. చక్రధారి గురించి బోధించె గురువే గురువు. శ్రీహరిని చేరవలెనని చెప్పే తంద్రె తండ్రి.

భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్పిన విధమిది. ఇంద్రియా లన్నింటినీ,
వాటి వాటి భోగ్య విషయాల మీద ప్రవర్తింపనీయక భగవంతుని మీద బాహ్య భక్తి కొరకు ఉపయోగిస్తూ చివరకు ముఖ్య భక్తుడిగా  మారడానికి సాధనను తెలివాడు. ఇది అన్వయ క్రమనాధన. 

కంజాక్షునకు గాని కాయంబు కాయమే ?
పవనకుంభిత చర్మభస్తి గాక
వైకుంఠు బొగడదని వక్రంబు వక్రమె గ
ధమ ధమ ధ్వనితోడి ధక్క గాక
హరి పూజనము లేని హస్తంబు హస్తమె ?
తరుశాఖ నిర్మిత దర్విగాక
కమలేశు జూడని కన్నులు కన్నులే ?
తను కుద్యజాల రంధ్రములు గాక
ఆ. చక్రి చింత లెని జన్మంబు జన్మమె "
తరళ సలిల బుద్చుదంబు గాక
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే ?
పాదయుగము తోడి పశువు గాక

తా : శ్రీహరికి అంకితంగాని శరీరం శరీరమెనా ? అది గాలితో నింపిన
కొలిమి తిత్తిగాని. వైకుంఠుని స్తుతి చెయని నోరు నోరెనా ? అది కేవలం ఢథమథఢమ మోగే ధక్కగాని. హరి పూజనం చేయని చెతులు చేతులెనా ? అవి కొయ్యతో చేసిన తెడ్లు గాని. కమలేశుని చూడని కన్నులు కన్నులినా? శరీరమనే గోడకు చేసిన రంధ్రాలుగాని. చక్రధారిని గురించి ఆలోచించని జన్మ జన్మేనా ? అది క్షణ భంగురమైన నీటి బుడగ గాని. విష్ణు భక్తిలేని పాండిత్యం ఎందుకు పనికి వస్తుంది ? ఆ పండితుడు రెండు కాళ్ళ పశువు గాని.

ఆ భగవంతునికే అంకితమై భక్తి సాధనకు ఉపయోగపడని ఇంద్రియాలు ఎందుకూ కొరగానివని, జన్మ వ్యర్థమని చెప్పడం చేత ఇంద్రియాలను విషయాల వైపుకు వెళ్ళనియకూడదని వ్యతిరేక క్రమాన్ని చెప్తున్నారు. అయితే మనం ప్రపంచంలో చేయవలసిన పనులు మానుకోవాలా? అంటే విషయ సంగత్వం లేకుండా ఎలా చెసుకోవాలో కూడా చెప్తున్నారు.

శా. పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్‌, భాషించుచున్‌, హాస లీలా నిద్రాదుల సేయుచుం, దిరుగుచున్‌ లక్తించుచున్‌, సంతత
శ్రీ నారాయణ పాదపద్మ యుగలీ చింతామృతాన్వాద సంధానుండై మరచెన్‌ సురారి సుతు దేతద్విశ్వమున్‌ భూవరా |!

తాః అన్న పానాదులను ఆరగిస్తున్నప్పుడు, వినోదిస్తున్నప్పుడు, నిద్రకు ఉపక్రమిస్తున్నప్తుడు, తిరుగుతున్నప్పుడు, విషయాలను గ్రహిస్తున్నప్తుడు కూడా ఆ శ్రీహరి పాద పద్మాల చింతనామృతాన్ని నిరంతరం గ్రోలుతున్న వాడై ఈ విశ్వాన్నే మరచిపోవుచుండును, అని ప్రహ్లాదుని గురించి హిరణ్యకశిపునకు చెబుతున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


ఆరోగ్యం బ్రహ్మ --- ఆనందం బ్రహ్మ --- ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి  ప్రభ --17-01-2022

ఏమేవ్! టవల్ ఎక్కడ తగలడ్డాది, స్నానానికెళ్ళాలి?
ఆ చిందులు తొక్కడం ఆపి, దండెం మీద వుంటుంది, పోనీ నా రెండు కళ్ళతోనూ చూడండి!
అగ్గిపెట్టె ఎక్కడ, దీపం వెలిగించడానికి!
అయ్యో రామా! అది మీ తడిచేతిలో పడి తడిసి ముద్దయింది, వూదొత్తివ్వండి, స్టౌ మీద వెలిగించి తెస్తాను

మీవాళ్ళేం మప్పేరో నాకైతే తెలియదు అన్నం వుడుకుతున్న స్టౌ అంటు కాదూ!

ఈ చాదస్తం మొగుడితొ వేగలేక చేస్తున్నాను, తీరామోసి కూరలు కొనడము కూడా ప్పలేదు, వేళకింత తినడం మాత్రం మప్పేరు  ఇదిగో మా అమ్మనేమైనా అన్నావా జాగ్రత్త!

అదే మాట నేనూ అంటున్నాను!

అది సరే గాని ఇవాళ శాఖపాకాలేమిటోయ్!!?

పూజ మనసు పెట్టి చేసుకోవచ్చుగా!!

చెప్పరా నా బంగారం వంకాయ కొత్తిమీరి కారం, సాంబారు!

అనుపానం!

కొబ్బరి, మామిడి పచ్చడి  అది సరే గాని శ్రావణం వచ్చేస్తోంది

పూజలో వుండగా బుర్ర పాడయే ఆ విషయాలిప్పుడెందుకే నా హ్రుదయమా!
"ఏమేవ్...ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడివచ్చాను. అతను అన్ని పనులూ చేస్తాడు.
అంట్లు తోముతాడు, గదులు తడిగుడ్డపెడతాడు, రుచికరమైన వంటలు చేస్తాడు,
ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా నోరు మూసుకుని పడుండే మెత్తటి మనిషి..."

"శ్రీవారూ! అతన్ని మన అల్లుడిని చేసుకుందాము! వేరే పనివాడ్ని చూడండి!
ఇలాంటి భర్త తనకు కావాలనేది మనమ్మాయి కోరిక మరి"
"వనజ! నువ్వు చెప్పేది నిజమేనా అని"

ఔను! మా అత్తగారు నన్ను వైవిద్యమైన రీతిలో భయపెడుతున్నారు ...

"ఏమని??? "

చెప్పిన పని సరిగ్గా చేయకుంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ , వాట్సప్ ఫ్రెండ్స్ అందరికీ నా ఒరిజినల్ ఫోటో పంపిస్తానని భయపెడుతుంది..
బ్రెదరూ! 
నేను రెండో మర్డర్ లో దోరికిపోయి జైలుపాలయ్యా, నువ్వెలా వచ్చావోయ్?

బేంకోళ్ళ మోసం వల్ల హడ్డెడ్డెడ్డె ఎట్టా ఎట్టా? చెప్పు చెప్పు రాత్రి దోంగతనానికని బేంకుకెళ్ళాను కేష్ తెరవడానికి తాళాల గుత్తి, సుత్తి, సానము తీస్తూ అక్కడ రాసున్న అక్షరాలు చదివేను ఏం రాశారు?

"కేష్ సేఫ్ తెరవడానికి కష్టపడక్కర్లేదు పక్కనున్న హేండిల్ తిప్పగానే తలుపు తెరుచుకుంటుంది" అని ఆగాగు! కధ నాకు తెలిసిపోయింది. అక్కడ రాసున్నట్లు చేసి ఇక్కడకోచ్చావంతేనా?

నీకెలా తెల్సు?

నీ సీనియర్ని కదా

నేను కూడ నీలాగే మోసపోయాను

ఎట్టెట్టెట్టా?

ఆడ్ని చంపుతూవుంటే వీడియో తీసుకున్నాడు

సరే! చివరి కోరికని సరిపెట్టుకున్నా

అదే కోంప ముంచింది

కడేరహో బంట్రోతు

ఈ వుద్యోగాలు ఆరేడు తరాల ముందువట


సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ,  ఆశుకవితాధురీణ
 6281190539
--((**))--


ఆరోగ్యం బ్రహ్మ.. ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మికం బ్రహ్మ
18--01-2023
ఏరాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది.* 
*కాని*
*కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి.*
*అలాగే కొన్ని పరిచయాలూ అంతే.*
*మన జననం ఓ సాధారణమైనది కావచ్చు.*
*కానీ, మన మరణం మాత్రం*
*ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.*
*పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికై పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి.*
*ఎందుకంటే వారు మనలను*
*అనుసరిస్తారు కాబట్టి.*
 *జీవితమే ఒక ప్రయాణం..*
*ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో*
*కానీ..*
*ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు*
*కేవలం నువ్వే శాశ్వతం*
*నీ నడవడికే శాశ్వతం*
*గెలిచేది నువ్వే..*
*ఓడేది కూడా నువ్వే*
*గెలుపుకి పొంగిపోకుండా..*
*ఓటమికి కృంగిపోకుండా*
*ధర్మ బద్ధంగా*
*ఫలాపేక్ష లేకుండా*
*తోటివారికి సాయపడుతూ*
*సాగిపోవడమే జీవితం*
*అదే నీ కర్తవ్యం..!!*
 *ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంకలాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి.*
*ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా*
*నెలవంక లాగా అందంగా కనిపిస్తారు.*
*పంచుకోలేనంతగా ఉన్న బాధలను గుండెల్లో దాచుకోకూడదు.* *అలాగే* 
*పెంచుకోలేనంతగా బంధాలను తుంచుకోకూడదు.* 
  *ఎందుకంటే*  
*దాచుకున్నా, తుంచుకున్నా, బరువెక్కేది మన గుండె మాత్రమే. అందుకే మనల్ని అర్థం చేసుకునేవారి వద్ద బాధను పంచుకోవాలి.* *ఆప్యాయతను పంచేవారి వద్ద బంధాన్ని పెంచుకోవాలి.*
*మూర్ఖునితో వాదింపకుము. బాధ్యత లేని వాని యందు మౌనము వహింపుము. 
*నీ విచక్షణా జ్ఞానమును ఇతరుల అభిప్రాయములనే మేఘములతో మరగుపరచు కొనకుము. అవగాహన లేనివారితో దీర్ఘ సంభాషణములు చేయకుము. పై సూత్రములను పాటించినచో నీవు అవమానింపబడవు. పాండిత్యము ప్రదర్శించు వారి ఎడల నిశ్శబ్దమును పాటించుము. పాండిత్య ప్రకర్ష వెనుక గల, వారి ఆవేదనను అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపుము.
* అతిగ మాట్లాడినవారి విషయమున కూడ, ఆ జీవుల ఆవేదనను గుర్తింపుము. వీరందరికిని కావలసిన దేదియోయుండి బైటికి మరియొకటి ఏదియో పలుకుచుందురు. జీవులను గుర్తించి, వారి నర్తనములను గమనించుట దైనందిన చర్యగ ఏర్పరచు కొనుము. ఎక్కువమంది లోతులేని బావివంటి వారే. లోతుగల బావుల యందు నీరు నిశ్చలముగ నుండును. అట్టి వారి సాన్నిధ్యమున నీవు కూడ అప్రయత్నముగ నిశ్చలుడవగుదువు.
*ప్రాంజలి ప్రభ*
9
ఆరోగ్యం బ్రహ్మ --- ఆనందం బ్రహ్మ --- ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి  ప్రభ --17-01-2022

ప్రపంచంలో జరిగిన కొన్ని సత్యాలుని మీ ముందు ఉంచుతున్నాను.
అవి ఏమిటంటే .....

* అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*

* ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.*

*మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.*

* మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు 
ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.*

* మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.*

* గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.*

* ప్రాణం పోతుందంటే మాత్రం ఏ కులపోడి రక్తం అయిన ఏక్కించుకుంటాం,ప్రాణం పోయిన సరే కాని వేరేకులపోల్ని మాత్రం పెళ్లీ చేసుకోడు 

* దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.*

* విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.*

* వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్న పట్టీలును కాళ్ళుకి కట్టుకుంటాం కానీ ఒక్క రూపాయి ఇచ్చి కొన్న బొట్టును మాత్రం నుదుటన పెట్టుకుంటాం.* %(అక్కడ పైసా విలువ చూడరు దాని చేసే పనితనం చూస్తాం )% చివరికి నేను చెప్పేది అందరికి తెలిసిన సత్యం ఏమిటంటే -

*ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం*

సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ,  ఆశుకవితాధురీణ
 6281190539

****** * 

ఆరోగ్యం బ్రహ్మ --- ఆనందం బ్రహ్మ --- ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి  ప్రభ --17-01-2022

 శ్రీ రాధాకృష్ణులు/శ్రీ రాధాదేవి తత్త్వం అంతరార్థం
రాధాదేవి అమ్మవారి అయిదు శక్తులలో ఒకటి. అమ్మవారి పరిపూర్ణ రూపములు అయిదు అని దేవీ భాగవతం వర్ణిస్తుంది.

దుర్గా లక్ష్మీ సరస్వతీ గాయత్రి రాధ అని అయిదు శక్తులు.మొదటి నాలుగు లోక వ్యవహారానికి సంబంధించి నటువంటివి.

దుర్గాదేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన జ్ఞాన శక్తి.లక్ష్మి ఐశ్వర్య శక్తి సరస్వతి వాక్బుద్ధిజ్ఞానముల, విద్యా శక్తి.గాయత్రీ దేవి సూర్య మండలాంతర్వర్తి యైన ప్రాణ శక్తి.ఈ నాలుగూ ఈ విశ్వాన్ని నడుపుతాయి. ఇక అయిదవది అయిన రాధాదేవి పరమాత్మయొక్క ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము. పరమాత్మ ప్రేమవల్లనే ఈ జగమంతా నడుస్తున్నది.

ఆ ప్రేమ, ఆనందము - ఈ రెండింటి యొక్క సాకార రూపమే రాధాదేవి. రాధాదేవి ఒక పాత్ర కాదు. రాధాదేవి ఎక్కడుంది? భాగవతంలో ఉందా? లేక పురాణాలలో ఉన్నదా? అని వెతకడం కాదు. ఆమె విశ్వమంతా ఉన్నది. రాధాదేవి పరమాత్మయొక్క ప్రేమానంద శక్తి. అందుకు రాధాదేవి ఉపాసన అత్యంత శుద్ధము. పైగా శుద్ధమైన మనస్సు గల వారు మాత్రమే రాధాదేవిని అర్థం చేసుకోగలరు. ఈ రాధాదేవి అమ్మవారియొక్క పూర్ణ రూపంగా చెప్పబడుతున్నది.

లలితా సహస్రంలో కూడా "ఆబాల గోప విదితా", "ప్రేమ రూపా ప్రియంకరీ" అని చెప్పబడుతున్న నామములు రాధాదేవి నామములే అని విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. ఈ రాధాదేవి గోలోకంలో కృష్ణ పరమాత్మతో ఉంటుంది. గోలోకం అనే శాశ్వత లోకం ఒకటి ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు విబుధుడై వేణునాద లోలుడై ఉంటాడు. అది కేవలం ఆనంద ధామం, పరమానంద ధామం.

 అక్కడ ఆయన శక్తి ప్రేమానంద రూపిణియైన హ్లాదినీ శక్తి రాధాదేవి. హ్లాదము అంటేనే ఆనందము అని అర్థం. హ్లాదినీ, సంధినీ ఇత్యాది శక్తులతో పరమాత్మ లోకాన్ని నడుపుతూ ఉంటాడు. వీటిలో హ్లాదిని ఆనంద శక్తి. సంధినీ ఇత్యాది శక్తులు లోక వ్యవహారాన్ని నడిపే శక్తులు. ఇటువంటి ఆనంద శక్తి అయిన రాధాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరమాత్మ యందు ప్రేమ కలుగుతుంది. 

ఆ ప్రేమ వల్ల పరమాత్మ ఆనందం లభిస్తుంది. ఆ ఆనందమే సచ్చిదానందము, బ్రహ్మానందము. ఆ బ్రహ్మానంద స్వరూపిణి రాధాదేవి. ఈ రాధాదేవి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఆరువేల సంవత్సరములు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరును చూడగలిగాడట. 

అంటే అర్థం రాధాదేవి దర్శనం అంత తేలిక కాదు అని చెప్పడం దీనిలోని విశేషం. పైగా అమ్మవారి దర్శనం కాలేదు అని దుఃఖపడితే అప్పుడు కృష్ణ పరమాత్మ బృందావనంలో నేను అవతరిస్తాను, అప్పుడు రాధాదేవి కూడా అవతరిస్తుంది అప్పుడు నీవు చూడవచ్చులే అని చెప్తాడు. ఆవిధంగా స్వామి కృష్ణుడై భూమియందు అవతరించినప్పుడు బృందావన సీమను ఎంచుకున్నాడు. నిజానికి బృందావనంలో సూక్ష్మమైన తేజోరూపంగా కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడుట.

కానీ ద్వాపర యుగాంతంలో అవతార మూర్తిగా ప్రకటింపబడ్డాడు. అప్పుడు అమ్మవారు రాధాదేవి కూడా అవతరించింది. కృష్ణ పరమాత్మ యశోదానందుల పుత్రుడిగా ఆయన ఉంటే ఈ రాధాదేవి ఒక అయోనిజగా అవతరించింది. వృషభానుడు అనే గోపరాజుకి అనేక జన్మల తపస్సుకు ఫలితంగా అమ్మవారు ఒక పద్మమునందు ఆవిర్భవించి గోచరించారు.

వృషభానుడు పరసానుపురమునకు రాజు. ఆ పరసానుపురమే నేటికీ బృందావనంలో బర్సానాధాం అని చెప్పబడుతున్నది. బ్రహ్మగిరి అని పర్వతమది. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఈ పరసానుపురం ఉన్నది. దానికి గోపరాజుగా ఉన్నటువంటి వాడు వృష భానుడు. ఆయన కుమార్తెగా ఈవిడ లభించింది. ఎలాగైతే సీతాదేవి అయోనిజగా జనక మహీపతికి లభించిందో అదేవిధంగా రాధాదేవి లభించింది. 

అలా లభించిన రాధాదేవి కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తున్న ప్రేమానంద శక్తి. రాధాకృష్ణుల దివ్యమైన అనుబంధం లౌకికమైనది కాదు. లౌకికమైన ధర్మము కానీ, అధర్మము కానీ రెండూ అక్కడ కనిపించవు. లౌకికమైన ద్వంద్వములేవీ లేవక్కడ. అదొక పరమ పావనమైన నిర్మలమైన అత్యంత శుద్ధమైన సచ్చిదానంద స్థితి. రాధాదేవి, కృష్ణుడు అవిభాజ్య తత్త్వము. అందుకే కృష్ణ రాధా తత్త్వములు ఎటువంటివి అంటే "చంద్ర చంద్రికయోరివా" అని వర్ణిస్తున్నది బ్రహ్మ వైవర్త పురాణం, పద్మపురాణం మొదలైనవి. రాధాదేవి తత్త్వం సామవేదం, ఋగ్వేదంలో కూడా చెప్పబడుతున్నది. 

"దేవం-దేవం రాధసే చోదయన్త్య్" అని. ఈ రాధాదేవి చంద్ర చంద్రికయోరివా అంటే చంద్రునికీ, వెన్నెలకీ ఎలాంటి అనుబంధమో కృష్ణునికీ రాధకీ అలాంటి అనుబంధం అని చెప్పారు. దీని భావం వారిద్దరూ అవిభాజ్య తత్త్వము. కృష్ణుని ప్రేమశక్తి, ఆనందశక్తి యే రాధ. కృష్ణుని యొక్క ప్రేమ అంటే మనపై అది కరుణగా వర్షిస్తుంది. కృష్ణుడికి మనపై ఉన్న ప్రేమ, మనకి కృష్ణుడి పై ఉన్న ప్రేమే రాధాశక్తి. జీవుడికి కృష్ణుడి పై ప్రేమ ఉంటే దానికి భక్తి అని పేరు. కృష్ణుడికి జీవుడిపై ప్రేమ ఉంటే దానికి దయ అని పేరు.

అందుకు కృష్ణుడిలో దయగానూ, భక్తుడిలో భక్తిగానూ ఉన్నది రాధాదేవి. రాధాదేవి దయలేకపోతే కృష్ణుడి దయ దొరకదు అన్నారు. అంటే భక్తి అనేది ఉంటేగానీ భగవంతుడు దొరకడు. ఆ భక్తి అనే ప్రేమ అందరికీ లభించదు. "ప్రకాశ్యతే క్వాపి పాత్రే" అని నారదుల వారు చెప్తారు. భక్తి, శుద్ధమైన భగవత్ప్రేమ అంత తేలికగా దొరకదు. ఆ ప్రేమ స్వరూపిణి రాధాదేవి. ఆ రాధాదేవిని కార్తిక పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ ఆరాధించాడు.

కృష్ణ పరమాత్మను ఆమె ఆరాధిస్తుంది. అందుకే ఆరాధనా శక్తియే రాధ. ఈ రాధాదేవి ఉపాసన చేస్తే "రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితా" అని దేవీభాగవతం చెప్తోంది. కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని ప్రత్యేకించి ఆరాధించాలి. దీనికి అనేక తంత్ర శాస్త్రాలలో ఉపాసనా పధ్ధతి ఉన్నది. రాధాదేవి సహస్రం ఉన్నది, రాధాదేవి మంత్రమున్నది, రాధాదేవి స్తోత్రమున్నది.

 సుయజ్ఞుడు అనే మహానుభావుడు రాధాకృష్ణుల ఉపాసన చేసాడు అని శాస్త్రం చెప్తున్నది. రాధాదేవి ఉపాసన చేస్తే సర్వమైన వాంఛలూ తీరుతాయిట. అంటే అన్ని అభీష్టములూ నెరవేరుతాయి అన్నారు. అన్ని అభీష్టములు నెరవేరడం అంటే అర్థం అసలు ఏకోరికా లేని పరిపూర్ణ స్థితి వస్తుందని దీనియొక్క భావం. 

సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ,  ఆశుకవితాధురీణ

 6281190539

******

ఆరోగ్యం బ్రహ్మ --- ఆనందం బ్రహ్మ --- ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి  ప్రభ --16-01-2022

 లోకోద్ధరణము- లోక కల్యాణము

లోకము అనెడి సంఘము చూపు  కోరును ఎప్పుడూ 
మంచిగా అనెడి పలుకుయే మంచి మానస మవ్వుటే 
చెడిపోయి నట్లు మనముగా చూస్తె చెడిపోవు సఖ్యతే 
నచ్చి నచ్చకయు ఆశల వేట నటనలు సంభవం 

రాగ ద్వేషాత్మకములుగు ముద్ర స్థితిగనే జీవితం 
సుఖదు:ఖా లుగను ప్రజ్ఞకు పాటుగా సంగమం జీవితం 
లోకము ఉద్ధ రించుట అలల లోలక భావమే 
పరిణామ దిశలు పరుగెత్తి మనిషి ప్రేరణ పెర్గుటే     
 
ఘర్షణ నడుమ బ్రతుకులు నాట్య ఘాతము అవ్వుటే 
శాంతి అ శాంతి మనిషిలో జరుగుతూ శాశ్విత మవ్వుటే 
గురువుగా చెప్పు ఫలితమనేది గుఱ్ఱము వేగమే 
వైఫల్య అలజడు లన్ని కలలుగా వైనము వ్యాప్తమే   

లోకము అంటే చూపు అని అర్థము. మనము జగత్తును ఎలా చూస్తే, ఆ లోకంలో మనం ఉంటాము. ఉదాహరణకు లోకమంతా చెడిపోయినట్లు మనం చూస్తే, మనము చెడిపోవడం జరుగుతుంది. లోకంలో మంచిని చూస్తుంటే మనం మంచి వారమే అవుతాం. 

ఇంతకూ లోకంలో వ్యక్తుల స్వభావం అనేది వారిని గూర్చి మన అభిప్రాయం మాత్రమే సన్నివేశాలను, వ్యక్తులను గూర్చి నచ్చినవారు, నచ్చనివారు అంటూ మనకు రెండురకాల ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రలతో కూడిన స్థితినే సంసార స-ముద్రమంటారు‌ రాగద్వేషాత్మకములయిన ముద్రలు మనకు సుఖదుఃఖాలను ఇస్తుటాయి‌. మన ప్రజ్ఞ వీని ఆటుపోటులకు లోనై శాంతిని కోల్పోతుంది. 

పాడయిన ఈ లోకమును ఉద్ధరించాలనే అభిప్రాయాలు మొలకెత్తుతాయి‌. మనకు మనమే లోకోద్ధరణ అనే బరువును నెత్తిన వేసికొంటాం‌‌. మనం ఇతరులకు ఏది మంచి అనుకుంటామో దాన్ని వారిపై రుద్దుతాం. అయితే ఇతరులు వారి వారి పరణామదశలు, స్వభావాలను బట్టి స్పందిస్తుంటారు. 

ఈ విధానములో ఒక స్థితిలో ఘర్షణ తప్పదు. కావున లోకోద్ధరణ కార్యక్రమ నిర్వహణలో ఘర్షణలు పెంచడం, మనం అశాంతికి గురి అయి, అశాంతినే లోకానికి పంచడం జరుగుతుంది. ఇతరులను ఉద్ధరించే గురువులము అనుకోవడం అహంకారమవడం వల్ల, ఇట్టివారు చేపట్టే చర్యలకు వైఫల్యం, అలజడియే ఫలితము. వీనిలో ఇరుక్కుని పోయేవాడు ఇతరులకు ఎట్టి తోడ్పాటును ఈయగలడు?.

మల్లాప్రగడ రామకృష్ణ 
....🌹 🌹 🌹 🌹 🌹

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ 
: జీవితం... ప్రకృతి... నియమాలు
ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు
1. ప్రకృతి యొక్క మొదటి నియమం...
ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది,
అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి...
2. ప్రకృతి యొక్క రెండవ నియమం...
ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు, సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు, దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.  
జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు, భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు, భయస్తులు భయాన్నే పంచగలరు... ఇది సత్యం...
3. ప్రకృతి యొక్క మూడవ నియమం...
మనకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి, ఎందుకంటే...
భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది,
మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది,
నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది,
అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది,
దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది, 
సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...
సమస్త లోకా సుఖినోభవంతు
*****
చక్రభ్రమణము
       .      జ్ఞాని యొక్క జ్ఞానమునకు పొరలుగా అజ్ఞానం ఆవరించి ఉన్నది. కోడి పిల్లకు తన చుట్టు ఉన్న గుడ్డుతో ఎట్టి సంబంధం ఉన్నది? తొలుత తనకు రక్షణము (అస్తిత్వానికి ఆధారం), పిదప తాను దానిని బ్రద్దలు కొట్టుకొనవలసిన సంబంధం. దానిని ఎప్పుడును పోగొట్టుకొనుచుండవలెను.
              పుట్టుచున్న అజ్ఞానము కామ క్రోధముల రూపమున వ్యక్తమగును. వాని నివారణోపాయం ఏమి? వానిని పూరించినచో తృప్తియై నివారణమగునని భావింపరాదు. నిప్పుపై నెయ్యి జల్లినచో ఏమగునో  మొగ ఏమగు ఆడఏనుగు కామపూరణ ప్రయత్నమున అదే జరుగును. కోరినది, ఆవశ్యకమగునది వేరువేరుగా బుద్ధితో నిర్ణయింపవలెను. కోరినది పూరించక ఆవశ్యకమగు దానిని పూరించవలెను.  దానితో పాప కారణమగు కామ క్రోధ తృష్ణ చల్లారును. ఉదాహరణకు జిహ్వ యందు వర్తించు మనసు రుచులను కోరును. జీర్ణకోశం ఆహారమును కోరును. ఆకలి, రుచులు కోరిక సమిశ్రముగా ఉండును. ఆకలిని బట్టి ఆహారమును నిర్ణయించినచో రుచికరమైన ఆహారంతో ఆకలి తీరును. రుచిని బట్టి నిర్ణయించినచో ఆకలిని మించి స్వీకరించిన ఆహారము రోగ కారణమై రుచులు ఇంకనూ చెలరేగును. ఆకలి ఆవశ్యకము. రుచి కోరిక. వీని వివేచనము ఉచిత ప్రవర్తనము, బుద్ధి యొక్క ప్రయోగమగును అదియే యోగము.
*****
0

ఆరోగ్యం బ్రహ్మ ... ఆనందం బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ

ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.
పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.
ఒకరు డాక్టరని,
ఇంకొకరు ఇంజినీరని,
మరొకరు లాయరని
అన్నారు.
ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు.
టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. 
ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో
బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.
స్కూళ్లో చెప్పిందే చెప్పాడు.
తల్లి:
"అలాగే అవుదువుగానీ, ఇలా రా"
అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,
"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి
ఆ 4గుర్రాల పేర్లు
*ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ*,
ఆ *బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ* చెప్పింది.
"నువ్వు కూడా జగత్తుకి
ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.
ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు.
పెంపకం అంటే అదీ!
పిల్లలు తెలియక తప్పు చేసినా,
తప్పు మాట్లాడినా
దానిని సరిదిద్దాల్సింది తల్లే!
*అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.*
 అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా   

0


ఆరోగ్యం బ్రహ్మ...ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
ఆచార్య చాణక్య తెలిపిన ఈ 10 అమూల్య విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి. 
1. ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో, అదే విధంగా ఒక వ్యక్తి చేసే మంచి, చెడు కర్మలు అతనిని అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తుండాలి.
2. తెలివిగల మనిషి తన ఇంద్రియాల అదుపు విషయంలో కొంగలా ప్రవర్తించి, స్థలం, సమయం, తన సామర్థ్యాలను అర్థం చేసుకుని తన పనితనాన్ని నిరూపించుకోవాలి.
3. కష్టపడి పనిచేసేవారిని చూస్తే పేదరికం పారిపోతుంది. ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించే వారు పాపపు పనులు చేయలేరు. ఇటువంటి మనసు కలిగినవారు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటారు.
4. రాజు యొక్క బలం అతని శక్తివంతమైన బాహువులలో ఉంటుంది. బ్రాహ్మణుని బలం అతని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంటుంది. స్త్రీ యొక్క బలం ఆమె అందం, యవ్వనం, మధురమైన మాటలలో ఉంటుంది.
5. మీరు త్వరగా విజయం సాధించాలనుకుంటే, మీరు నైపుణ్యం సంపాదించిన పనిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండండి.
6. ఐశ్వర్యం, స్నేహితులు, భార్య, రాజ్యం తిరిగి పొందవచ్చు. కానీ ఈ శరీరాన్ని తిరిగి పొందలేము. కాబట్టి కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి.
7మనం ఎవరి ద్వారానైతే ఏదైనా పని పూర్తిచేయించాలనుకుంటున్నామో.. వారు ఇష్టపడే రీతిలో మాట్లాడాలి. 
8. తన కుటుంబంతో విపరీతమైన అనుబంధం కలిగిన వ్యక్తిని భయం, దుఃఖం వెంటాడుతుంటాయి. అన్ని బాధలకు అనుబంధమే ప్రధాన కారణం. అందుకే సంతోషంగా ఉండాలంటే పరిధికి మించిన అనుబంధాలను వదులుకోవడం అవసరం.
9. బంగారంతో పూత వేస్తే వెండి కూడా బంగారంలానే కనిపిస్తుంది. సత్సంగం ప్రభావం ఖచ్చితంగా మానవులపై పడుతుందని దీని అర్థం.
10. పనులు చేపట్టాక ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే మూర్ఖులు తప్పులు కనుగొంటారు. తెలివైన వ్యక్తి పని ప్రారంభించే ముందే ప్రణాళికతో ఉంటాడు.
ప్రాంజలి ప్రభ
0

ఆరోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ --  ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి ప్రభ ---13-01-2022
వైకుంఠ ఏకాదశి - ఓంశ్రీమాత్రే నమః

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ , విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది.
చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు–అని అర్ధాలున్నాయి.
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?
అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం.

అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి 
వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది.

ఈ విశ్వము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.

ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము.

భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి.అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు.

ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞ నిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము.

కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? -

ఈ లోకంతో భవ బంధనాల నుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.
కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే).

అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం.

పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు,చెవులు,మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు,చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
--((())--
0
ఆరోగ్యం బ్రహ్మ -- ఆనందం బ్రహ్మ --  ఆధ్యాత్మికం బ్రహ్మ 
ప్రాంజలి ప్రభ ---13-01-2022
వైకుంఠ ఏకాదశి - ఓంశ్రీమాత్రే నమః

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ , విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది.

చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు–అని అర్ధాలున్నాయి.

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?

అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం.

అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది.

ఈ విశ్వము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.

ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము.

భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి.అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు.

ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞ నిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము.

కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? -

ఈ లోకంతో భవ బంధనాల నుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.

కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే).

అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం.

పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు,చెవులు,మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు,చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

--((())--

ఆరోగ్యం బ్రహ్మ -- ఆనందం  బ్రహ్మ --- ఆధ్యాత్మిక బ్రహ్మ 
(13-01-2022) 
నేడు పశ్చిమగోదావరి జిల్లా ముద్దుబిడ్డ అపర ధన్వంతరి ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలకు ప్రాంజలి  ఘటిస్తూ

యల్లాప్రగడ సుబ్బారావు ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త

యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - ఆగష్టు 9, 1948) భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.

యల్లాప్రగడ సుబ్బారావు
జననం: జనవరి 12,1895, ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం, మరణం 1948 ఆగస్టు 9 (వయసు 52)
పౌరసత్వం భారతీయత జాతీయతభారతీయుడు
రంగములువైద్య శాస్త్రము విద్యాసంస్థలు లెడర్లీ ప్రయోగశాల
పూర్వ విద్యార్థి, మద్రాసు మెడికల్ కళాశాల, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రసిద్ధి హెట్రజాన్ అను డ్రగ్ ఆవిష్కర్త టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ముఖ్యమైన అవార్డులు వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి
Notes
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము(ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.
బాల్యం - విద్యాభ్యాసం 
ఇయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895, జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.

మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాస్ వైద్య కళాశాల ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.

దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశాడు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు. ఈ సందర్భంలోనే ఈయన ఆలోచనాశైలి ఇలా ఉంది.

“ ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది ”
— యల్లాప్రగడ సుబ్బారావు

సుబ్బారావు భావాలలో నైశిత్యము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.

పరిశోధనలు
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను మందు ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్‌ను కనుగొనెను.

సుబ్బారావు సహచరుడు, 1988లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది".

కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.

మరణం 
డాక్టర్ యల్లాప్రగడ 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వ తేదిన అమెరికాలో కన్నుమూశారు. లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న డా. యల్లాప్రగడ సుబ్బారావుగారి చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు ఆయన జ్ఞాపకార్థం ఉంచింది. అంతే కాకుండా ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు లెడర్లీ సంస్థ వారు.

ప్రాంజలి ప్రభ : మల్లాప్రగడ రామకృష్ణ  

*****
 

*బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు। ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను।*

*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు। నేను ఎలా బతకగలను? అని అడిగాను। నువ్వేం భయపడకు। నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను। ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు।* 

*“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా। అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను।*

*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు।*

*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా।*

*“అదేం లేదులే। నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం। నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది।” అని చెప్పాడు బ్రహ్మా।*

*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు। ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను।*

*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు। భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను। “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది।*

*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు। తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని। మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి।ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా।*

*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు। అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు। అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా।*

*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు।*

*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను।*

*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు। అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని। మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని।*

*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి। ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు। “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ। “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా। అర్ధం కాలేదని చెప్పాను। కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు।*

*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా। మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది। పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా। మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది। నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది। ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా।*

 *మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా। నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది। మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు। అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి।*

*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది। నడక నేర్చుకుందామని ప్రయత్నించా। కానీ ఫలితం లేదు। పదే పదే పడిపోతూనే ఉన్నా। ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు। నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు।*

*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి। ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా। తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను। ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా। ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు। ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు। నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు। డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు। ఏం మాయో తెలీదు। నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా। నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా।*

*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి। నడవటం మొదలుపెట్టాను। కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను। ఎవ్వరూ కనిపించలేదు। భయం వేసింది। ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు। ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా। ఆయన కనిపించలేదు గాని వినిపించాడు। “ఏమైంది బాలకా” అని అన్నాడు। “భయం వేసింది స్వామి। అందుకే పిలిచా” అన్నా నేను।*

*“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు। ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా। అవును నాన్న నా వెనకే ఉన్నారు। నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు। నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది। అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి। నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు। మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు। నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది।*

*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది। దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు। నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు। కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు। కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి।*

*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను।*

*“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు।*

*“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు।” అని సమాధానం చెప్పాను గర్వంగా।*

*“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా।*

*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను। బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు। ఆశ్చర్యపోయాను। మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది। అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి)। “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”। మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి। అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను।*

*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు। నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు। ప్రేమగా హత్తుకున్నారు। నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో। క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు। ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా। నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు। ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను। నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా।*

*“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”*
*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం
సేకరణ।మల్లాప్రగడ రామకృష్ణ 
*****

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ 
చక్రభ్రమణము

       .      జ్ఞాని యొక్క జ్ఞానమునకు పొరలుగా అజ్ఞానం ఆవరించి ఉన్నది. కోడి పిల్లకు తన చుట్టు ఉన్న గుడ్డుతో ఎట్టి సంబంధం ఉన్నది? తొలుత తనకు రక్షణము (అస్తిత్వానికి ఆధారం), పిదప తాను దానిని బ్రద్దలు కొట్టుకొనవలసిన సంబంధం. దానిని ఎప్పుడును పోగొట్టుకొనుచుండవలెను.

              పుట్టుచున్న అజ్ఞానము కామ క్రోధముల రూపమున వ్యక్తమగును. వాని నివారణోపాయం ఏమి? వానిని పూరించినచో తృప్తియై నివారణమగునని భావింపరాదు. నిప్పుపై నెయ్యి జల్లినచో ఏమగునో  మొగ ఏమగు ఆడఏనుగు కామపూరణ ప్రయత్నమున అదే జరుగును. కోరినది, ఆవశ్యకమగునది వేరువేరుగా బుద్ధితో నిర్ణయింపవలెను. కోరినది పూరించక ఆవశ్యకమగు దానిని పూరించవలెను.  దానితో పాప కారణమగు కామ క్రోధ తృష్ణ చల్లారును. ఉదాహరణకు జిహ్వ యందు వర్తించు మనసు రుచులను కోరును. జీర్ణకోశం ఆహారమును కోరును. ఆకలి, రుచులు కోరిక సమిశ్రముగా ఉండును. ఆకలిని బట్టి ఆహారమును నిర్ణయించినచో రుచికరమైన ఆహారంతో ఆకలి తీరును. రుచిని బట్టి నిర్ణయించినచో ఆకలిని మించి స్వీకరించిన ఆహారము రోగ కారణమై రుచులు ఇంకనూ చెలరేగును. ఆకలి ఆవశ్యకము. రుచి కోరిక. వీని వివేచనము ఉచిత ప్రవర్తనము, బుద్ధి యొక్క ప్రయోగమగును అదియే యోగము.

*****
: జీవితం... ప్రకృతి... నియమాలు
ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు

1. ప్రకృతి యొక్క మొదటి నియమం...

ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది,
అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి...

2. ప్రకృతి యొక్క రెండవ నియమం...

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు, సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు, దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.  
జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు, భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు, భయస్తులు భయాన్నే పంచగలరు... ఇది సత్యం...

3. ప్రకృతి యొక్క మూడవ నియమం...

మనకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి, ఎందుకంటే...

భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది,
మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది,
నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది,
అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది,
దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది, 
సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...

సమస్త లోకా సుఖినోభవంతు

******


******
అll ఇంతదనుక జ్ఞానజ్ఞేయములను గూర్చి తెలిపి ఇక ప్రకృతి, పురుషులను వర్ణించుచున్నారు -

ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్యనాదీ ఉభావపి
వికారాంశ్చ గుణాంశ్చైవ
విద్ధి ప్రకృతి సంభవాన్

వ్యాఖ్య: - మాయ, ఈ సంసారము, బంధము - ఎప్పడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించుచుందురు. రాత్రి నిద్రించిన పిదప స్వప్నములో ఈ స్వప్నమెపుడు మొదలుపెట్టినది? అను ప్రశ్నకు ఫలానసమయమని ఎవరు ఎట్లు జవాబు చెప్పలేరో, అట్లే ఈ జాగ్రత్ర్పపంచమును గూర్చియు నెఱుంగవలెను.

కనుకనే ఈ మాయను, ప్రకృతిని అనాది యని పేర్కొనిరి. అనాదియని పేర్కొనిరేకాని అనంతమని చెప్పలేదు. ఏలయనగా ఏక్షణమున మనుజునకు జ్ఞానోదయమగునో ఆ క్షణముననే 'మాయ, ప్రకృతి బంధము' అంతమైపోవును. కాబట్టి ప్రకృతి, బంధము అనాదియని యెవరును భయపడనవసరములేదు. జ్ఞానప్రాప్తికై యత్నించినచాలును. స్వప్నలోకములో స్వప్నము అనాదిగా కన్పించినను, మేలుకొనినచో అంతమైపోవునుగదా! ప్రకృతి అనాది, సాంతము అనియు, పురుషుడు అనాది, అనంతుడు అనియు నెరుంగవలెను.

"వికారాంశ్చ గుణాంశ్చెవ విద్ధి ప్రకృతిసంభవాన్" - ప్రకృతి పురుషుల యిరువురిలో పురుషుడు (ఆత్మ) నిత్యశుద్ధుడు. వారిలో ఏవికారమున్ను ఉండజాలదు. కామక్రోధసుఖదుఃఖమోహాది వికారములన్నియు ప్రకృతినుండియే జనించినవై యున్నవి. కావున జీవునకు ఈ కామక్రోధాది వికారములున్నంతవఱకు తానింకను ప్రకృతియందున్నవాడేయనియు, బంధయుతుడేయనియు, పురుషుడగు నిర్వికారపరమాత్మను చేరలేదనియు నెఱుంగవలెను.

 జీవుడెపుడు ప్రయత్నపూర్వకముగ ఆ వికారములను పారద్రోలి చిత్తమును వాసనాశూన్యముగ గావించుకొనునో అపుడు మాత్రమే బంధవిముక్తిని బడసి, పురుషుడగు భగవంతునియందు వసింపగలడు. మరియు ఏవైన దుఃఖములు, మనోవికారములు కలిగినపుడు - "ఇవి ప్రకృతికి జెందినవేకాని నాకుగాదు. ఇవి నాస్వరూపములుకావు. నేను వీనికి సాక్షిని, నిర్వికారుడను"- అని దృఢముగ భావించుకొని దుఃఖరహితుడై మేరువుపగిది స్థిరచిత్తముగలిగి ఆయా వికారములను తొలగద్రోసికొనవలెను.

*******
 ఓం నమః శివాయ:
22) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

పరాపరాత్మనోరేవం యుక్త్య సంభావితైకతా ౹
తత్త్వమస్యాదివాక్యైః స్సా భాగత్యగేన లక్ష్యతే ౹౹43౹౹

43.ఈవిధముగా తర్కము ద్వారా అంగీకరింప బడిన జీవాత్మ పరమాత్మల ఐక్యత తత్త్వమసి మొదలగు వాఖ్యములచే భాగత్యాగ లక్షణద్వారా బోధింపబడు తున్నది.

వాఖ్య:-రెండుగా కనబడు వస్తువులందు విరుద్ధాంశములను పరిత్యజించి సామాన్యాంశమును సూచించుట భాగత్యాగ లక్షణ.  "తత్త్వమసి" ఈ మహావాక్యము సామవేదములోని "చాందోగ్యోపనిషత్తు" నందున్నది.

"తత్త్వమసి" మహావాక్యము శిష్యునికి గురువు చేయు ఉపదేశమై యున్నందున దీనిని ఉపదేశ వాక్యమని పిలుస్తారు. "తత్త్వమసి" మహావాక్యములోని "తత్"-"త్వమ్"పదముల వాచ్యార్ధ, లక్ష్యార్థములు తెలియవలెను. పదభావము గ్రహించుట వాచ్యార్థమైతే,వాక్యార్థము నందలి నిగూఢమైన అధిష్ఠాన సత్యమును ఎరుక పరచుట లక్ష్యార్థ మవుతుంది.

ఈశ్వరునికి సర్వజ్ఞత్వము,స్వతంత్రము, ఏకత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వము, పరోక్షత్వము, సమర్ధత్వము,మాయోపాధిత్వము అనునవి ధర్మములై ప్రకాశించుచున్నవి.
ఇట్టి అన్ని ధర్మములతో కూడిన మాయ,ఈమాయా ప్రతిబింబమైన చిదాభాసుడు,దీనికి అధిష్టాన బ్రహ్మము- ఈమొత్తము కలసి ఈశ్వరుడని చెప్పబడతాడు.ఇదియే "తత్" పద లక్ష్యార్ధము.

జీవునికి అల్పజ్ఞత్వము,పరతంత్రము, పరిచ్ఛిన్నత్వము,నానాత్వము, 
 అల్పశక్తిత్వము,అపరోక్షత్వము, అసమర్ధత్వము, అవిద్యోపాధిత్వము,అనునవి ధర్మములై వున్నవి. ఈ విధమైన ఇన్ని ధర్మములతో కూడిన అవిద్య,ఈ అవిద్యా ప్రతిబింబమైన చిదాభాసుడు,
దీని అధిష్టానమైన కూటస్థుడు ఈమొత్తము కలిపి జీవుడని చెప్పబడు చున్నాడు.ఇదియే "త్వమ్" పద లక్ష్యార్థము

భాగత్యాగ లక్షణ ద్వారా తత్-త్వమ్ యొక్క వాచ్యార్ధాన్ని గ్రహిస్తే ఉపాధితో కూడిన చేతనము అనగా "ఈశ్వరుడు- జీవుడు" ఏర్పడుతారు.వీరికి యేకత్వం కుదరదు.కారణమేమనగా వీరికి మాయ-అవిద్యలు ఉపాధులై వున్నవి.

ఇక "తత్-త్వమ్" పదాల లక్ష్యార్థాన్ని గ్రహిస్తే "మాయా- అవిద్య"లను ఉపాధులు,ఉపాది ప్రతి బింబములయిన "ఈశ్వరత్వ-జీవత్వములు" మిధ్యయై "శుద్ధబ్రహ్మము-కూటస్థుడు" మిగులు తారు.
వీరిద్దరికీ ఏకత్వము చెప్పుటలో విరోధము లేదు.

ఈ"కూటస్థ-బ్రహ్మలు" ఒకే చైతన్యరూపము "అసి" అను పదము ఈవిధముగా "ఏకత్వము"ను ప్రతిపాదించుచున్నది. బ్రహ్మము తనకన్నా అన్యము కాదని తెలిసికొని తరించడమే "తత్త్వమసి" లక్ష్యార్థమై యున్నది.

****

 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __
 నేడు రాధాష్టమి.......!!

శ్రీ కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి (26వ తేది) రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. చాలామందికి తెలియని విషయమేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే.

ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదినం సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.

: రాధాష్టమి ll

ఈ అనంత ప్రకృతి స్వరూపిణీ  అయిన పరాశక్తి యొక్క ప్రేమానంద స్వరూపమే రాధ. ఈ ప్రకృతి జీవులలో ఆ శక్తి  భక్తి రసమూర్తిగా స్ఫురిస్తే, పరమాత్మలో కృపారస స్పూర్తిగా మూర్తీభవిస్తే అదే “రాధాతత్వం”. విశ్వ ప్రకృతిలోని విద్యాశక్తి సరస్వతి, ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇచ్చాఙ్ఞానక్రియాత్మక శక్తి గౌరి, కాలస్వరూపం కాళి, ప్రతాపరూపం దుర్గ, జలరూపం గంగ, వేదస్వరూపం గాయత్రి. ఇలా విభిన్న శక్తుల విభిన్న రూపాలుగా ఆరాధింపబడి ఆ శక్తుల సమృద్ధి జగదంబకృపగా లభిస్తోంది. అలాగే భగవంతుని వైపు బుద్ధిని నిలిపి, సర్వ సమర్పణతో ఆ”రాధి"ంచే భక్తి శక్తి రాధ.

“సాత్మస్మిన్ పరమప్రేమరూపామృత స్వరూపా
కేవల అవిచ్చిన్న అనుభవరూపా”

అని నారదుడి భక్తి సూత్రాలలో వివరించిన భావనని రూపు కడితే అదే రాధా రూపం.

రాధాష్టకమ్ 

నమస్తే శ్రియై రాధికాయై పరాయై
నమస్తే నమస్తే ముకున్దప్రియాయై ।
సదానన్దరూపే ప్రసీద త్వమన్తః-
ప్రకాశే స్ఫురన్తీ ముకున్దేన సార్ధమ్ ॥ ౧॥

స్వవాసోపహారం యశోదాసుతం వా
స్వదధ్యాదిచౌరం సమారాధయన్తీమ్ ।
స్వదామ్నోదరే యా బబన్ధాశు నీవ్యా
ప్రపద్యే ను దామోదరప్రేయసీం తామ్ ॥ ౨॥

దురారాధ్యమారాధ్య కృష్ణం వశే తం
మహాప్రేమపూరేణ రాధాభిధాభూః ।
స్వయం నామకీర్త్యా హరౌ ప్రేమ యచ్ఛత్
ప్రపన్నాయ మే కృష్ణరూపే సమక్షమ్ ॥ ౩॥

ముకున్దస్త్వయా ప్రేమడోరేణ బద్ధః
పతఙ్గో యథా త్వామనుభ్రామ్యమాణః ।
ఉపక్రీడయన్ హార్దమేవానుగచ్ఛన్
కృపావర్తతే కారయాతో మయీష్టిమ్ ॥ ౪॥

వ్రజన్తీం స్వవృన్దావనే నిత్యకాలం
ముకున్దేన సాకం విధాయాఙ్కమాలామ్ ।
సమామోక్ష్యమాణానుకమ్పాకటాక్షైః
శ్రియం చిన్తయే సచ్చిదానన్దరూపామ్ ॥ ౫॥

ముకున్దానురాగేణ రోమాఞ్చితాఙ్గై-
రహం వేప్యమానాం తనుస్వేదబిన్దుమ్ ।
మహాహార్దవృష్ట్యా కృపాపాఙ్గదృష్ట్యా
సమాలోకయన్తీం కదా మాం విచక్షే ॥ ౬॥

యద్ అఙ్కావలోకే మహాలాలసౌఘం
ముకున్దః కరోతి స్వయం ధ్యేయపాదః ।
పదం రాధికే తే సదా దర్శయాన్తర్-
హృదిస్థం నమన్తం కిరద్రోచిషం మామ్ ॥ ౭॥

సదా రాధికానామ జిహ్వాగ్రతః స్యాత్
సదా రాధికారూపమక్ష్యగ్ర ఆస్తామ్ ।
శ్రుతౌ రాధికాకీర్తిరన్తఃస్వభావే
గుణా రాధికాయాః శ్రియా ఏతద్ ఈహే ॥ ౮॥

ఇదం త్వష్టకం రాధికాయాః ప్రియాయాః
పఠేయుః సదైవం హి దామోదరస్య ।
సుతిష్ఠన్తి వృన్దావనే కృష్ణధామ్ని
సఖీమూర్తయో యుగ్మసేవానుకూలాః ॥ ౯॥

ఇతి శ్రీనిమ్బార్కాచార్యవిరచితమ్ రాధాష్టకం సమ్పూర్ణమ్ ।

******


ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ 

"గొప్పవారమని గొప్పలు పోతూ
గొప్పలు చెప్పుతు తిప్పలు పడక 
దివ్యాత్మను కాంచుచు అంతట 
గొప్పగ మారుదమందరు నిజముగ"

అసలు గొప్పతనం అంటే ఏమిటి...? ఎవరు గొప్పవారు...? మనిషిని ఏది గొప్పగ తయారు చేస్తుంది...? ఈ  ప్రశ్నలకు సమాధానం మనలో చాలా మందిమి చెప్పలేం.కానీ.....

చాలా విషయాల్లో మనల్ని మనం గొప్పవాళ్ళుగా భావించేసుకుంటూ ఉంటాం.

ఇతరుల కన్నా రెండు పైసలు ఎక్కువున్నప్పుడు, అందమైన మొఖకవళికలు ఉన్నప్పుడు, శరీరసౌష్టం ఉన్నప్పుడు, ఇతరుల కన్నా తెలివితేటలు మనకు కొంచం ఎక్కువున్నాయని నిరూపించబడినప్పుడు, ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, సామాజికంగా గౌరవస్థానంలో ఉన్నప్పుడు, "గొప్ప "కులంలో జన్మించినప్పుడు... ఇలా ఎన్నో సందర్భాలు మనల్ని ఎదుటి వారికంటే గొప్పవారమని భ్రమింపజేస్తూ ఉంటాయి. .

అయితే, కొన్ని సందర్భాలలో ఆ గొప్పతనం "మనది "కాదు.. ఒక్కోక్కసారి డబ్బుది,ఒక్కొక్కసారి హోదాది, ఒక్కొక్కసారి పలుకుబడిది, ఒక్కొక్కసారి కులానిదీ వగైరా వగైరా... ఈ  "గొప్పతనాల " అస్తిత్వం క్షణభంగురమే ! .

నిజమైన గొప్పతనం గొప్పవారమని భావించేసుకోవడంలో ఉందా....? ఇతరులలో గొప్పతనాన్ని గుర్తించడంలో ఉందా... ? ఇతరులను తక్వచేయడం ద్వారా వచ్చే గొప్పతనంలో గొప్పతనం ఎక్కడ...?  ఆలోచిస్తే  గొప్పతనమన్నది మనోజనిత మిథ్యాపరికల్పన అని అర్థమౌతుంది.

శరీర కదలికలో గర్వం ప్రతిక్షణం తొంగిచూస్తూ ఉంటుంది. పరస్పర గౌరవం అనే విలువను జీర్ణం చేసుకొనేవరకు మానవ సమాజం అన్ని స్తరాలలోను ఈ గొప్పతనమనే దోషం  నుండి బయటపడటం దుస్సాధ్యమే..

నిజమైన గొప్పతనం ఆస్తిలో లేదు, అంతస్థులో లేదు, హోదాలో లేదు...మరెక్కడుంది...?

సృష్టిలో ప్రతి అణువులో, ప్రతి అంశంలో దాగిన గొప్పతనం గుర్తించడంలో ఉంది. అహంభావాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఉంది.

 అంతేకాదు... ప్రతివారు ఎవరికి వారే వారి వారిఎవరు  స్థానాలలో గొప్పవారని తెలుసుకోవడంలో ఉంది. ఎవరు తాము గొప్పవారమని భావిస్తారో వారు నిజానికి గొప్పవారు కానే కాదు..

నిజమైన గొప్పవారికి తాము గొప్పవారమనే ఆలోచన కూడా ఉండదు. అందుకే గొప్పతనమన్నది ఒక మిథ్యాభావం.

 నిజమైన గొప్పతనం ఇతరులను కించపరచదు. నిజమైన గొప్పతనం భేదాలను సృష్టించదు.భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేది. దర్శింపజేసేదే నిజమైన గొప్పతనం.  

భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అంటే..... సృష్టి అంతా వ్యాపించిన దివ్యత్వాన్ని దర్శించడమే !.

🌄ఆత్మీయ మిత్రులకు శుభోదయం.🌄

-సర్వేజనాః_ _సుఖినోభవంతు._

*****
ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
i పద్యం భావాలు చదవండి 

చూత ఫలావతంస! నిన్ను జూచిన గన్నుల పండువయ్యె! లో
పాతి శయంబునన్ బరిమళాన్వితమయ్యె దిశౌఘ మెల్ల వి
ఖ్యాతి యొనర్చె నీ గుణములైనను గల్గదు నాకు నెమ్మదిన్
గౌతక మెప్డు నీ హృదయ కర్కశ భావము చూడగాన్

అర్థము:-ఓ చూతఫలమా!నీవెంతో శ్రేష్ఠ మైనదానివి.అలంకారంగా చెప్పుకో దగిన దానివి.
నిన్ను చూస్తేనే కన్నుల పండుగ.ఏ పొరపాటు వల్లనో నీ సువాసనలు దిగంతాలకు వ్యాపించినవి.విఖ్యాతి పొందిన నీ రుచి,వాసన యింకా ఎన్నో ఆకర్షణీయము లైన గుణాలు నీకున్నవి.అయినా నాకు నిన్ను చూస్తే నెమ్మది కలుగదు.ఎందుకంటే నీ హృదయం
(టెంక)కఠిన మైనది. లోపలి మసకకూ కాఠిన్యానికీ పైన యెంతఅందమైన,మృదులమైన ముసుగు కౌతక మంటే 'పై పై వచ్చెడి మేలు' అనుభవింపని కోరిక యందలి యాశ'
యనేఅర్థాలు వున్నవి.నిన్ననుభవించ కూడదని అనిపిస్తుంది అని ధ్వని.అంటే పై పై పూతలు,పైకి కనిపించే నాజూకుతనం వట్టి మోసం దంభం.మనస్సు బాగుండాలి, మెత్తగా, ఆర్ద్రంగా,నవనీతం లా వుండాలి.అప్పుడే మనిషి పరోపకారానికి పూనుకుంటాడు.ఏమన్నా యేమి చేసినా మనసులో మాలిన్యం లేకపోతే యెప్పటికైనా మనిషి సంఘానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడ్తాడు వేషభాషల కంటే మనస్సంస్కారం గొప్పది. యింత మంచి హృదయాన్నికలిగివున్న పద్యమిది.సహజత్వం,ప్రకృతి వర్ణన,ఉపదేశం,వ్యంగ్యం,ఎత్తిపొడుపు వున్నాయి.

కొందరు అందంగా కనిపిస్తారు,సొగసుగా అలంకరించుకొని మధురంగా మాట్లాడుతారు
ఎంతో నాగరికంగా ప్రవర్తిస్తున్నట్టు కనబడతారు.కానీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.తమ పబ్బం గడుపుకుందుకు ఎన్ని వేషాలైనా వేస్తారు.ఎదుటి వాళ్ళను వలలో వేసుకుంటారు.సాహిత్య పోషకులుగా ,కళాపోషకులుగా పేరు తెచ్చుకుంటారు.
కానీ వాళ్ళ హృదయాలు మాత్రం కర్కశంగా వుంటాయి.ద్రవ్య సంపాదనా మార్గాలు కూడా
దేశ హితానికి ప్రతికూలంగా వుంటాయి.మామిడిపండును చూపించి అన్యాపదేశంగా ఒక
అజ్ఞాత కవి ఈ పద్యం చెప్పాడు.

వారక ఈశ్వరుండు తలపై ధరియించిన యంత మాత్రాన
వ్వారిజ వైరి తోడ సరివత్తువె యుమ్మెత పూవ నీ పసనన్
వారిధు లుబ్బునొ దెసలు వన్నెలు దేరునొ చంద్రకాంతముల్
నీరవునొ చకోరముల నెవ్వగ తీరునో తాపమారునో

అర్థము:--- ఎవరో శివ భక్తుడు ఈశ్వరుని తలపైన ఉమ్మెత్త పూవును వుంచాడట. దానితో ఉమ్మెత్త పువు నేనూ చంద్రుడిలా శివుని తలపై వున్నాను నేను చంద్రుని లాంటి వాడినే యని గర్వ పడిందట. అధికారంతో కుయుక్తులతో గద్దె నెక్కిన వారిని యీ పూవు తో పోలుస్తున్నాడు కవి. కాసేపు శివుని తలపై ఉన్నంత మాత్రాన చంద్రునితో నీవు సమాన మౌదునని అనుకుంటున్నావా? చంద్రుని కాంతితో సముద్రములు వుప్పొంగినట్లు నీ కాంతి తో పొంగుతాయా? దిశలన్నీ వెన్నెలతో వెలిగినట్లు నీ తెల్లదనం తో వెలుగు తాయా?

వెన్నెలను పాణం చేసి తమ దప్పికనూ, తాపాన్నీ చకోర పక్షులు తీర్చుకుంటాయి. మరి నీవు ఆ చకోరాల దాహాన్ని తీర్చ గలవా? చంద్ర కిరణాల స్పర్శ తోచద్రకాంత శిలలు చేమ్మగిల్లినట్టు నీ తెల్లని రంగుతో చేమ్మగిల్లుతాయా? అలాగే సంఘం లో అధికారస్థానమే గొప్పది కాదు. దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యము కూడా కావాలి. ప్రజలకు సేవ చెయ్య గలగాలి,.ప్రజల మనస్సులో స్థానం సంపాదించు కోగాలగాలి, అధికారం లో వున్నవాళ్ళు తమకు స్నేహితులని గొప్పలు చెప్పుకుని తమ పబ్బాలు గడుపుకునే వారు,అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునే వాళ్ళు ఈ పద్యములోని ఉమ్మెత్త పూవు వంటి వారే. ఆ అధికారము పోయినప్పుడు పూవు వలే వడలి రాలిపోతారు. శివుని మీద వున్న ఉమ్మెత్త చంద్రుడు కానట్టే చట్ట సభల్లో, విద్వత్ సభల్లో కూర్చున్న మూర్ఖుడు పండితుడు కాడు అతను కూడా యీ ఉమ్మెత్త పువు వంటి వాడే. ఈ నాటి రాజకీయాలకు సరిపోయే పద్యమిది.
--((***))--

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ --- 

 తైః సర్వైః సహితైః ప్రాణో  వృత్తిభేదాత్స పంచధా !
ప్రాణోఽ పానః సమాన శ్చోదానవ్యానౌ చ తే పునః !!22!!

22. పంచభూతముల రజోంశములన్నియు చేరి ప్రాణమేర్పడుచున్నది. పరిణామ భేదము చేత ఇది మరల ఐదు విధములు. ప్రాణము,అపానము, సమానమము,ఉదానము,వ్యానము అనునవి పంచ ప్రాణములు.

వాఖ్య : రజోంశములన్నియు చేరి ఏర్పడిన ప్రాణమునకు ముఖ్య ప్రాణమని పంచప్రాణములలో మొదటిదగు ప్రాణము నుండి వివేచించు కొనవలెను.ముఖ్య ప్రాణముచేయు పనుల భేదమువలన వేరు వేరు పేర్లతో పంచప్రాణములున్నవి. ఇవి అన్నియు కర్మేద్రియములద్వారా అస్థిమాంస మజ్జాపిండమగు శరీరమును నడిపించును. 
 పంచభూతముల యొక్క సమిష్టి రజోగుణాంశము వలన ప్రాణము కలుగును. ఈప్రాణము స్ధానభేదము చేతను క్రియా భేదము చేతను ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన మని ఐదువిధములు.ఇవి వాయు తత్త్వములు.

1)ప్రాణము:-హృదయమందును,
2)అపానము:-గుదస్థానము నందును,
3)సమానము :-నాభియందును,
4)ఉదానము:- కంఠమందును ,
5)వ్యానము:- శరీరమంతటా వ్యపించి ప్రవర్తిస్తాయి. ఇట్లు ప్రవర్తించుటచేతనే శరీరము జీవించి యున్నది.

ఆకాశంతో కలిసి సమానవాయువుగా, వాయువుతో కలిసి వ్యన  వాయువుగా, అగ్నితో కలిసి ఉదానవాయువుగా, జలముతో కలిసి ప్రాణవాయువుగా, భూమితో కలిసి అపాన వాయువు ఏర్పడ్డాయి. 

1)ప్రాణవాయువు:-హృదయస్థానమందుండి ఆకలి,దప్పులను కలిగిస్తుంది మరియు రాత్రింబగళ్ళు కలిపి ఇరవై ఒక్కవేలా ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను విడుస్తుంది.

2)అపానవాయువు:-ఈ వాయువు గుద స్థానమందుండి మలవిసర్జన చేస్తుంది.

3)సమాన వాయువు:-ఈవాయువు నాభి స్థానమందుండిమానవుడు స్వీకరించే అన్నమును,నీటినీ జఠరాగ్నిలో పక్వంగా మార్చి సూక్ష్మము,స్థూలము,మధ్యమని మూడుగా విభజిస్తుంది.

ఇందులో అన్నము యొక్క సూక్ష్మ భాగం హృదయమందున్న మనోబుద్ధులకు పుష్టిని కలిగించును. అలాగే అన్నము యొక్కజలము సూక్ష్మ భాగం ప్రాణానికి పుష్టిని చేకూరిస్తుంది.

మధ్యమ భాగం అన్నరసమే రక్తమాంసాలుగా మారి దేహమునకు బలాన్ని 
 కూర్చుతాయఅన్నంయొక్క జలం స్థూలభాగం మలమూత్రాదులుగా బహిర్గతమవుతాయి.

4)ఉదానవాయువు:-ఈవాయువు కంఠస్థానములో నుండి ఆహారమును మ్రింగునట్లు చేస్తుంది.ఎక్కిళ్ళు ఈ వాయువు ద్వారానే సంభవిస్తాయి.

5)వ్యానవాయువు:-ఈ వాయువు శరీరమంతా వ్యాపించి సమాన వాయువు ద్వారా పంపబడిన అన్నపానాదుల రసమును నాడునాడులకు,రోమరోమములకూ ప్రసరించునట్లు జేయును.

ఈప్రకారము ప్రాణము తనను ఐదు భాగములుగా విభజించుకొని ఈదేహమును జీవింప జేయు చున్నది.ప్రాణము విక్షేప(చలన)రూపమై వున్నది.ఈవిక్షేప స్వభావము రజోగుణ సంబంధమైనది కావున భూతముల యొక్క రజోగుణాంశము నుండి ప్రాణాది వాయువుల ఉత్పత్తి చెప్పబడినది. 

ఇప్పటి వరకూ చెప్పుకున్న  పంచ జ్ఞానేద్రియములు పంచకర్మేంద్రియములు
పంచప్రాణాలు కలిసి సూక్ష్మ శరీరం అంటారు.

^^ **** ^^ 


ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ --- 

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

రజోఽంశైః పంచభిస్తేషాం క్రమాత్కర్మేంద్రియాణితు !
వాక్ప్ ణి పాదపాయూపస్థాభిధానాని జజ్ఞిరే 

పంచభూతముల ప్రత్యేక  రజోంశముల నుండి క్రమమముగా  వాక్కు,చేయి,పాదము,గుదము,
గుహ్యము అను అయిదు కర్మేంద్రియములు ఏర్పడు చున్నవి.(ఇవి కూడా సూక్ష్మాంశములే. మాంసవికారములు కావు.)   మూలా ప్రకృతి యొక్క తాంశ అంశ నుంచి ఏర్పడ్డ పంచభూతాల యందలి రజోగుణాంశము నుండి కర్మేంద్రియాలు కలుగు చున్నవి.

ఆకాశము యొక్క రజో గుణము నుండి "వాగీంద్రియమును", వాయువు యొక్క రజోగుణము నుండి "పాణీంద్రియమము", అగ్ని యొక్క రజో గుణం నుంచి "పాదేంద్రియమును", జలము యొక్క రజో గుణము నుండి" ఉపస్థేంద్రియమును", భూమి యొక్క రజో గుణము నుంచి "గుదేంద్రియమును"
కలుగుచున్నవి. ఈవాక్కు ,పాణి,పాద,గుహ్యము,గుదము ఈ అయిదు కర్మేంద్రియములు భూతత్వములు.

ఈకర్మేంద్రియములు ఐదును స్థూలగోళకములైన  చేయి,కాలు,నోరు,విసర్జక అవయవములు నుండి పని చేయునే గానీ ,వీటి స్వరూపం మాత్రం సూక్మదేహానికి సంబంధించినదే గానీ , స్థూలదేహ స్వరూపంకాదు.

ఎలాగనగా వాక్కు నోటి యందు ఉచ్చరించెడి శబ్దము. శబ్ధము ఉచ్ఛరించక పూర్వము లేదు. ముఖమున నిల్చి  వాక్కులు ఉచ్ఛరణము  చేయుటచే వాగీంద్రమనియు, పాణి అనగా చేయి.ఈ పాణి యందు నిల్చి ఈ పాణి ద్వారా కర్మజేయు శక్తిని పాణీంద్రమనియు, పాదమనగా కాలు.ఈపాదమునందుండి పాదములచే గమనాగమనాలను జేయు శక్తిని పాదేంద్రియమనియు,
ఉపస్థ అనగా గుహ్యము. ఇట్టి ఉపస్థ యందు నిల్చి మూత్ర,వీర్యములను వదిలెడు శక్తిని ఉపస్థేంద్రియము లేక గుహేంద్రియమనియు, ఇక గుదము నందు నిల్చి మలమును వదులు శక్తిని గుదేంద్రియమనియు చెప్పబడినవి. 

కావున ఈఇంద్రియములు సూక్మదేహము నందును, చేయి కాలు మొదలగు అవయవములు స్థూలదేహము నందును ఉండునని యెరుగవలెయును. మరియు కర్తయైన జీవునికి ఈఇంద్రియముల ద్వారా స్థూల అవయవమముల సహాయమున కర్మ నిర్వర్తించబడుటచే ఈ ఐదింటినీ కర్మేంద్రియములనుచున్నారు. 

ఇవి గోళకములే మాంస వికారములు కావు.

*****


ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ --- హిత వ్యాఖ్యలు 

కదలని ఆకాశంలో భూమి కదలడం మహిమ కాదా! కదిలే భూమిపై మనం నిశ్చలంగా ఉండడం మహిమ కాదా! ప్రతి కదలిక "చైతన్యపు" మహిమే అని కనుగొన్న వాడే 'సిద్ధుడు'. ఇది నిజం అనుకుంటేనే అన్ని బాధిస్తాయి. 

ఇది కల (మాయ) అని ఉంటే ఏది బాధించదు. బహిర్ముఖమై ఉన్నవాడు బోర్లించిన కుండతో సమానం. ఎంత వర్షం పడినా అది నిండదు. అంతర్ముఖమై ఉన్న మనస్సే జ్ఞానాన్ని నింపుకోగలదు. ముష్టి చెట్టు తన పక్కనే ఉన్న చందనం చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకుని, తాను అలా అవ్వాలని సాధన చేసిందట. ఇంతకీ దానికి కలిగిన జ్ఞానోదయం ఏమంటే..

చందనం చెట్టుకి ఏది ఆధారమో నాకు అదే (భూమి) ఆధారం అని తెలుసుకుంది. బాహ్యంగా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని..

అంతరంగా అంతా ఒకటే అని తెలుసుకున్నది. పోల్చుకోవడం మానితే అదే సాక్షాత్కారం అని గ్రహించినది.  తనువు ద్వారా వ్యవహరించేది ఎవడో వాడే "నీవు".

శిష్యుడు:- వానప్రస్థుడు ఇంటివద్దనే ఉండవచ్చునా?

గురువు:- వానప్రస్థుడికి ప్రపంచమే తన ఇల్లు. కాబట్టి ఎక్కడైనా తాను ఉండవచ్చు.  కాలం అనంతం. కానీ మనకు కాదు.  అనంతుడికి.

గురువు రకాలు :- సూచక గురువు - చదువు చెప్పేవాడు. 

వాచక గురువు - కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చెప్పేవాడు. 

బోధక గురువు -  మహామంత్రాలు ఉపదేశించేవాడు.

నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు చెప్పేవాడు.

విహిత గురువు - విషయ భోగాల మీద విరక్తి కలిగించేవాడు. 

కారణ గురువు - జీవ బ్రహ్మైక్యము బోధించేవాడు.

పరమ గురువు - 'జీవాత్మ , పరమాత్మ ఒకటే' అనే ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

భగవాన్, మహర్షి, స్వామి, అవధూత, జ్ఞాని, సద్గురు.. ఈ పదాలన్నీ బిరుదులు కాదు, అవి పరమేశ్వరునికి పర్యాయపదాలు.

నీవు 'రోగం' అని దేనినైతే అంటున్నావో,  నిజానికి అది కూడా "ఆత్మానుభవం"లో భాగమే.

శిష్యుడు:- అపరోక్షం అంటే?

గురువు:- తాను ఉంటేనే ప్రత్యక్షమైనా, పరోక్షమైనా ఉండేది.  కాబట్టి తానే 'అపరోక్షం'.

భక్తి అనేది జోలపాట ; జ్ఞానం అనేది మేలుకొలుపు పాట.  జనన మరణాల మధ్యలో తానుంటే తాను జీవుడు. తనలో జనన మరణాలు ఉంటే తాను దేవుడు. కళ్ళు మూసుకుంటే పదార్ధం అంతా ఏకం అవుతుంది.మనసు మూసుకుంటే శక్తి అంతా ఏకం అవుతుంది.

కొన్ని చోట్ల,  కొన్ని వేళల్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే నాణాలు- నామరూపాలు.

అన్ని చోట్లా, అన్ని వేళల్లో చెల్లుబాటయ్యే ఏకైక నాణం - నేను.

జగదానుభవం, దైవానుభవం రెండూ మాయే. 'అనుభవమే' సత్యం.

శిష్యుడు :- నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను.

గురువు :- ఏ యాత్ర అయినా సరే ఒక కలలో నుండి మరొక కల లోకి వెళ్లడం లాంటిదే.

నేను దేహం అనుకున్నవాడికే 'ప్రారబ్ధం'.

*****

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ
ప్రాంజలి ప్రభ 

రాధ కృష్ణులు---- రాధ అంటే ఎవరు?

ఒకరు ప్రియురాలు అని. మరికొందరు కృష్ణుని బంధువులు అని... వేరొకరు కన్నయ్యకు అత్త అని.. ఏవేవో ఉహాలు ...కానీ.... ఒక్క ధ్యాని సాధకుడు యోగి మాత్రమే కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతాడు .  ధ్యాన స్దితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే.. రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని(భక్తీ అని ) అర్ధము. అనగా అత్యంత భక్తురాలు.

రాధ : ధారా ............ అదో నిరంతర వాహిని కుండలి నుండి మూలాదార వరకు జాలువారుతున్న అమృత బిందువులను ( విశ్వశక్తిని ) ధారలా భూలోకము నుండి ( మూలాధారా ) వైకుంఠము (సహస్రారం ) నకు తీసుకుని వెళ్ళగలిగే ఒక శక్తి ... ధార .....రాధ ............. ఇదో నిరంతర వాహిని ...

ఇదే ధ్యానం ..........భక్తీ ......... ప్రేమ............... కృష్ణుడనగా ఆకర్షించు వాడని యర్ధము:: నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది కాని మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము ..

రాధ యనగా సిద్ధింప చేయునది అని అర్దము (మోక్షం ) కృష్ణ ( సాధకుడు ) ఎక్కడ ఉంటే ( నిరంతర ) ధార (రాధ ) అక్కడ ఉంటుంది .నా దేహం వేరు ... నా శ్వాస వేరు అని చెప్పగలమా ?? లేదే ఇరువురు ఒక్కటే ... ఇలా కృష్ణుని అంతరమైన స్వరూపము రాధగను,

బాహ్య రూపము పురుషుడినియు. అలాగే రాధయొక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుని గాను, బాహ్య స్వరూపము రాధ. భగవాన్ కృష్ణ కోసం 16, ౦౦౦ మంది గోపికలు వచ్చారు ..

రాసలీలలు అని వ్యర్ద ప్రేలాపనలు చెపుతూ ఉంటారు  . యద్బావం తద్బభవతి వారిని మనం మార్చలేము ... కాని సత్యం మాత్రం ఇదే ............

ఎప్పుడు భాహ్య నేత్రాలతో చూడటమేనా ? .. ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో ఆత్మ స్దితిలో చుస్తే ... పరమాత్ముని కోసం పరితపిస్తున్న జీవాత్మలు 16,౦౦౦..

నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి సత్య జ్ఞానాన్ని పొందిన (ఎరుక ) సిద్దులు . వారు లక్ష్యం వెతుకులాట ! ఆ మహాచైతన్యం కోసం వెతుకులాట! ఆ పరంధాముని కోసం వెతులాట .. !

ఆ వెతుకులాటలో ధ్యాన మార్గం చూపిన వాడు కృష్ణ జ్ఞా న మార్గం చూపిన వాడు కృష్ణ దేముడికి జీవుడికి ఉన్న బంధాన్ని ఎరుక పరచిన వాడు కృష్ణ శోధన నుండి సాధన వైపు సత్యాన్ని ఎరుక పరచిన వారు కృష్ణ .ఆబాల గోపాలం అంతా సిద్దులు యోగులు తాపసులు.. గోకులం అంటే వైకుంఠం అందులో భక్తీ అంటే.. రాధ.వైకుంఠం + ధ్యానం +కలిసి యున్నదే బృందావనం ..

కాపున బృందావనము అంటే ఓ సమూహం జీవ సమూహము. ధ్యాన జీవుల సమూహం .

ఇకనైనా రాధ మాధవ తత్వాన్ని అర్ధం చేసుకుందాం.

*****

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ... ఆధ్యాత్మిక బ్రహ్మ

రోజువారీ 109

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరారు . 

మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . 

ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు 

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 

పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 

వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  

ప్రశ్న - సమాధానం 

ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?

స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .

ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?

స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .

ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 

స : నిజమే స్వామీ !

మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం . 

****

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు) 

రోజువారీ (007) *  ఇది ఒక కధ.... పిప్పలాదుడు.........!!

పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు

మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-

నారదుడు- నువ్వు ఎవరు?

అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

నారదుడు- నీ తండ్రి ఎవరు?

అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

 అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి!  నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి.  నీ తండ్రి అస్తిక తో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు.  మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

 నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

 పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

 నారదుడు- శనిదేవుని మహాదశ.

ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

 నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు.  బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు.  విశ్వంలో కలకలం రేగింది.  సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.

సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి  అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-

 1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.

 2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది.  కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని

 "శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

        శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.

సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ

******

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు) 

రోజువారీ (006) *  ఇది ఒక కధ. 

కాని నిజం మరియు ఆసక్తికరమైనది. 

ఒక రోజు ఒక పంచె కట్టుకుని భుజాలమీద శాలువ కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు. 

అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి "ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడి లా ఉన్న ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా...! అదీ ఈ నవీన యుగంలో.  మనం చంద్రుడు మీదకు వెళ్ళాం. ఇంకా మీలాంటి వారు రామాయణం, మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు.

అప్పుడు, ఆ పెద్దమనిషి ఆ యువకుడు ని అడిగారు, " బాబూ.. గీత గురించి నీకు ఏమి తెలుసు "? అని

అప్పుడు, ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా  ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు, ఏం జరుగుతుంది / వస్తుంది ఈ భగవద్గీత చదివితే. నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ లో పరిశోధనలు చేస్తున్నాను, నేను ఒక శాస్త్రవేత్త ను.... ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది. 

ఆ పెద్దమనిషి, ఆ యువకుడి మాటలకు నవ్వుతూండగా.. రెండు పెద్ధ కార్లు అక్కడ కు వచ్చి ఆగాయి. ఒక కారు లో నుండి కొంతమంది Black Commandos దిగారు, రెండవ కారు లోంచి ఒక సైనికుడు దిగాడు. ఆ సైనికుడు దిగీ దిగగానే, వినయంగా సెల్యూట్ కొట్టి, కారు వెనుక తలుపు తెరిచి పెట్టుకున్నాడు. ఆ భగవద్గీత పారాయణం చేస్తూన్న పెద్దమనిషి, మెల్లిగా వెళ్ళి కారులో కూర్చున్నారు. 

అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి లా ఉన్నారు అనుకుని, కారు దగ్గరకు పరుగెత్తి, ఆ పెద్దమనిషి ని "అయ్యా తమరు ఎవరు" అని అడిగాడు. 

ఆ పెద్దమనిషి చాలా ముందుగా, "నేను విక్రమ్ సారాభాయ్ ని" అన్నారు. 

ఆ కుర్రవాడు కి 440 వోల్టుల విద్యుత్ఘాతం తగిలినట్టయింది. 

ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా?... ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు. 

ఆ తర్వాత కలాం గారు భగవద్గీత, రామాయణం, మహా భారతం పుస్తకాలు చదివారు. దాని ఫలితంగా ఆయన, ఇటుపైన మాంసాహారం ముట్టకూడదు, అని ఒట్టు వేసుకున్నారు. ఇదంతా కలాం గారు తమ ఆత్మ కథ లో రాసుకున్నారు. అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు, శాస్త్రాలు. అంతే కాకుండా ఇవి మన దగ్గర పుట్టడం, భారతీయులకు గర్వకారణం, మరియు గొప్ప వారసత్వ సంపద అని రాశారు. 

(అనువాదం : శొంఠి కామేశ్వరరావు) 

*****

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు) 

రోజువారీ (005) * (05-01-2022)

            నది సముద్రం వైపుకి పరిగెత్తుకుని వస్తుంది. దీపపు జ్వాల ఆకాశం దిశగా పైకి లేస్తుంది. అలా లేవాలి అనే ప్రయత్నం ఏదైనా అది చేస్తుందా? ఏ విధంగా నీరు ఒక గోతిలోనికి పోతుందో, అదే విధంగా ఎక్కడ గురుత్వము జనిస్తుందో, అటువైపు అన్వేషణ చేస్తున్నవాడు ప్రయాణం చేసుకుంటూ పోతాడు. ఎవరు ఏదీ చేయరు. ఏ విధంగా అయస్కాంతము లాగేస్తుందో, అలా.

             మనం క్రియాతో పొందే శాంతి సంతోషం అయితే, క్రియ లేకుండా పొందే సంతోషం పేరు ఆనందం. మనం ఏ క్రియనైనా ఒక అనుభవం కోసమే కోరుకుంటాం. కానీ ఏ క్రియతో పనిలేకుండా అలాంటి అనుభవం ఇవ్వటం గురువు చేసేపని. ఒక పని తర్వాత కలిగే ఫలం భావంగా మనలో మిగిలిపోతుంది. ఆ పని లేకుండానే గురువు దాని ఫలాన్ని అందిస్తారు. 

             సహనం, సద్గుణాల వంటి అభ్యాసాదులు మనని గమ్యానికి చేరుస్తాయి. ఇక గురువు అనుగ్రహం అనేది పని పూర్తికావటంలో లేదు. అసలా పని మొదలు పెట్టాలన్న సంకల్పమే గురుఅనుగ్రహంతో లభించింది. మన సాధన, అభ్యాసం అన్నీ గురువు అనుగ్రహాలే. దేవుడికి దండం పెట్టాలనిపించటం, మంత్రం జపించాలనిపించటం, శాంతితో దివ్యజీవనం సాగించాలని పించటం, ఆత్మదర్శనం కావాలనిపించటం అన్నీ గురువు అనుగ్రహములో భాగాలే !

శ్లో𝕝𝕝 భక్తం శక్తం కులీనఞ్చ

న భృత్య మవమానయేత్।

పుత్రవల్లాలయేన్నిత్యం 

య ఇచ్ఛేఛ్రియమాత్మనః॥

తా𝕝𝕝 తనకు సంపదను కోరే రాజు ఎవ్వడైననూ భక్తుడూ, సమర్ధుడూ, సత్కులీనుడూ అయిన సేవకుని అవమానింపరాదు పుత్రునివలె లాలించాలి!!

             ధర్మం లో కర్తృత్వము అనే ప్రశ్న ఉండదు. గురువు అనే వాడు ఆకర్త. గురువు దగ్గర కూర్చోగా, కూర్చోగా ఏదో అవుతుంది. గురువు ఏదీ చేయడు. సత్సాంగము  అంటే గురు శిష్యులిద్దరు కూర్చుని వుంటారు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఘటిస్తుంది. అన్వేషించే వారు అన్వేషిస్తూ వుంటారు. ఇచ్చేవారు ఇస్తూ వుంటారు.

శ్లో𝕝𝕝 యస్తు సర్వం అభిప్రేక్ష్య

 పూర్వమేవాభిభాషతే|

స్మితం తు మృదుపూర్వేణ 

తస్య లోకః ప్రసీదతి||

తా𝕝𝕝 ఎవరైతే అందరినీ చూచి తానే ముందుగా చిరునవ్వుతో పలకరించునో అటువంటి వారికి లోకం అనుగ్రహము నిచ్చును.

             జనాలు ధ్యానం చేస్తున్నాము అంటారు. ధ్యానం చేయడం అనేది సరైన మాట కాదు. ధ్యానంలో ఉన్నాము అని అంటే చాలు. ఎప్పుడు ఆ చేయడం అంతా ఆగిపోతుందో అప్పుడు నీవు లోపల ఉంటావు. వ్యక్తి ధ్యానం లో ఉంటాడు. ధ్యానం చేయడం ఉండదు.

--(())--

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు) 

రోజువారీ (001) *

దేవుని దయాదాక్షిణ్యాలు కోసం…।  మనం ఎన్నెన్నో బాహ్యఆర్భాటాలు చేస్తుంటాం। అయితే వాటికి భగవంతుడు చిక్కడు। పరమాత్ముని దయకై తీవ్రమైన ఆవేదన కావలెను। 

అంతే! శిశువు రోదనము చేసిన, తల్లి ఆ రోదనము యొక్క రాగమెటువంటిదని పరీక్షించుట కొరకు ఆలస్యము చేయదు। పరుగెత్తి వచ్చి  ఎత్తుకొని బిడ్డకు ఆనందమిచ్చును, అలానే భక్తులు జిజ్ఞాసులై, ఆర్తులై ప్రార్థించిన చాలు, పరుగెత్తుకు వచ్చి ఆదుకుంటాడు। 

భగవంతునిలో ఎవరి యందునూ భేదభావము ఏమాత్రమూ లేదు। ఆవేదనే పరమాత్ముని సులభముగా కదిలించి కరిగించే ఏకైక సాధన। కనుక చేసే పూజ, ప్రార్థన, భజన ఎందులో అయినా ఆర్తి, ఆవేదన ఉండేలా చూసుకోవాలి। పరమాత్ముడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాడు అన్న సత్యం  గ్రహించి నడచుకోవాలి।।!

శ్లో𝕝𝕝 యస్తు సర్వం అభిప్రేక్ష్య  పూర్వమేవాభిభాషతే।

స్మితం తు మృదుపూర్వేణ తస్య లోకః ప్రసీదతి।।

తా𝕝𝕝 ఎవరైతే అందరినీ చూచి తానే ముందుగా చిరునవ్వుతో పలకరించునో అటువంటి వారికి లోకం అనుగ్రహము నిచ్చును।

ఒక్క మాట చాలు మనిషి మారటానికి ఎందరో భక్తులు వస్తూ వుంటారు అందరూ ఆశపరులుఁ అని నేను చెప్పలేను అయినా ఒక వ్యక్తి నాదర్శనం కోసం రెండు రోజులనుండి నన్ను కలవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎవరో అవుతున్నారు ఎందుకో తెలియదు-

నా ఫోన్ తెలుసుకొని ఫోన్ చేశారు  

వారు [భక్తుడు] నేను free గా ఉన్నాను రమ్మంటారా అంటే, గురువుగారు Be free, I am comming అన్నారు। Be free అన్న మాటతోనే వారికి ఎంతో ఆత్మానందాన్నిచ్చారు। ఆ రోజంతా వారు తెలియని ఆనందస్థితిని అనుభవించారు। గురువుగారు ఏ మంత్రమూ చెప్పలేదు। శక్తిపాతం చేయలేదు। ఆధ్యాత్మిక విషయాలు బోధించలేదు। కేవలం 'నేను వస్తాను' అన్న ఒక్కమాట ద్వారా వారి అనుగ్రహాన్ని వ్యక్తం చేశారు। ఆ ఒక్కమాటతో ఆ భక్తిని ఆనందం వర్ణనాతీతం। అది తురీయ సమాన ఆనందస్థితి। వారి బోధ, అనుగ్రహప్రసారం అలా ఉంటుంది ! 

అప్పుడు నాకనిపించింది 

సర్వార్ధ దేహమ్ము సంతృప్తి చెందేది సంతోష సంసార సాహిత్య మేలే 

ఆరోగ్య భావమ్ము ఆత్మీయ ఆకర్ష ఆనంద ఐశ్వర్య దానమ్ము మేలే 

కార్యోన్ముకానంద సత్భావ కర్తవ్య విశ్వాస భావమ్ము చూపేది మేలే 

ప్రారంభ ఆలోచనమ్మేను ప్రాధాన్య మిచ్చేను నిత్యమ్ము  నవ్వాట మేలే      

శివుడే ఈ నిఖిల జగత్తుకి నిజమైన గురువు। కాబట్టి సాక్షాత్తు గురువు స్వయముగా శివుడే। శివుడు ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు। గురువే ఆగ్రహిస్తే ఇక ఎవ్వరూ రక్షించలేరు। ఎందుచేతనంటే గురుతత్త్వమే మనతో ఉండే శివతత్వాన్ని తెలియజేస్తుంది। ఈ విశ్వమంతా ఉన్న శివతత్వం మన మనసుకు దూరమైనా మనలోని గురుతత్వం తిరిగి తెలియజేస్తుంది। కానీ అసలు మనలోని గురుతత్త్వమే మనకు దూరమైతే ఇక ఎన్నటికీ శివతత్వం తెలియదు। మనకు ప్రపంచం అర్థంకావాలన్నా, దైవం అర్థంకావాలన్నా గురురూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడి అనుగ్రహము అవసరం। సత్యదృష్టితో కలిగే అవగాహనే గురువు అందించే నిజమైన అనుగ్రహం। మన జ్ఞానసంపద మనకు తెలిసినరోజున ఇక లౌకిక సంపదల కోసం యాచన ఉండదు !

గురువు లేందే ఏమి చెయ్య లేరంటున్నారు మరి పూర్వం  స్త్రీ పురుషులు  ఏమి చదువుకున్నారు కాయకష్టం చేసుకొని సంసారం చేసేవారు 

నిజమే నాయనా ఆ పరమాత్ముడు కొన్ని ప్రకృతి ద్వారా మనకు నేర్పాడు, కొన్ని ఋతువులు ద్వారా మనకు నేర్పాడు, పంచభూతాలు అవి తన పని తను చేసు కుంటూ పోతాయి రాజ్యాన్ని పాలించే రాజుకు కూడా మంత్రులు సైన్యాధ్యక్షులు , భటులు ఉంటారు ఎవరు చేయ గల పని వారు చేసుకుంటూ ఉంటే దేశం సంతోషంగాఉంటుంది'  అదే దేవునిలీల। క్లుప్తముగా చెపుతాను విను 

కాల మను నది కానదు కదులు బండి

గాలి లాగను కదిలేను గాధ బండి

కాల ము బ్రతుకు నేర్పేను కావడి కధ

కాల కొలత పంచాంగము కళలు నేర్పు


సూర్య రూపం ఆరోగ్యాన్ని స్థిరపరుచుట

అగ్ని రూపం ఐశ్వర్యాన్ని ఆదు కొనుట

శంకరుని పూజ జ్ఞానాన్కి సాక్షి యగుట

విష్ణువుని పూజ మోక్షాన్కి విశ్వ మగట

మనిషి శక్తియుక్తియురక్తి ముక్తి యగుట

సంసారం నుండి, సృష్టి నుండి, ఈశ్వరుడు నుండి సహాయం పొందాలంటే ముందుగా స్వార్థం, మోహము త్యాగం చేసి, జీవితంతో సంఘర్షణ చేయాల్సి వుంటుంది.

ఏకాగ్రతా పట్టుదల సమయ పాలన లేక మిడి మిడిజ్ఞానంతో డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకోట తప్పు 

చెపుతా విను   యోగవాసిష్ఠ రత్నాకరము లో 

తనను తాను కొట్టుకొనుచు పరుగెత్తుననగా మనస్సు తనయందలి వాసనలచే కొట్టబడుచు పరుగిడుచున్నదని అర్థము. 

చపలమగు వానర మొకటి తన చాపల్యముచే అరణ్యమున దుఃఖ మనుభవించినట్లు చంచలమగు ఈ మనస్సున్ను దుఃఖముల పాలగుచున్నది. (ఒక యరణ్యమున పనివాండ్రు కొందరు కొయ్యను సగము నరికి, అందు చీలయుంచి వెడలగా నంతట చపలచిత్తము కల వానర మొకటి దానిపై గూర్చుండి చీలను బెరికివేయ, దాని వృషణములు అందు తగుల్కొనుటచే మరణించె నను సంగతి యిట సూచింపబడినది.) 

చిరకాల సమాధి పాలనముచేతను, చిరకాల ఆత్మభావనచేతను, అభ్యాసముచేతను మనస్సు క్రమముగ తన రూపమును కోల్పోయి తిరిగి యెన్నటికిని దుఃఖము నొందకుండును.

                                                                                       సశేషం 

ప్రాంజలి ప్రభ : రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

*****

ఆరోగ్యం బ్రహ్మ - ఆనందం బ్రహ్మ - ఆధ్యాత్మిక బ్రహ్మ (అనుభవపాఠాలు) 

రోజువారీ (002) 

                      .  నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. అప్పుడే ని మనసు పాఠం నిన్ను రక్షించు తుంది  నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణము అవుతుంది. 

ఉనికిలో నాట్యం చేయని పక్షంలో (అనగా ప్రకృతి కుటుంబాన్ని లోకాన్ని  ననుసరించి)  నీలో ఎట్లాంటి నాట్యానికి అవకాశం లేదు. నీలో ఉనికి పరవశం పొందని పక్షంలో నీలో ఎట్లాంటి పరవశమూ వుండదు. నిన్ను నువ్వు వదిలించుకో. అప్పుడు నీకూ వునికికి మధ్య నీతనమన్నది అడ్డంకిగా వుండదు. నీలో మనసు అల్లా కల్లోల సముద్రంగా మారుతుంది 

మనసు మాయ పద్యాలు

1 . మనసు మాయకు లొంగిన మౌన నీతి 

     మమత వేటకు చిక్కిన మంద వాక్కు 

     తపన ఆటకు దక్కిన తాడు తోడు 

     పతన మవ్వుట జీవికి ప్రధమ బుద్ధి 


2 . ధనము ఆశకు చిక్కని దాత  ప్రాణి

     విధికి దొర్కని తీరున వీధి  ప్రాణి

     మదిని దోచిన మూర్ఖుడు మూర్ఖ ప్రాణి

     ప్రకృతి మాటను తూలిన ప్రౌఢ బుద్ధి 


3. మనసు జబ్బుల డబ్బుల మనుగడకులె 

    అలల  తాకిడి సంద్రము ఖర్చులకులె 

    విజయ తాకిడి సాహస  వినయముకు లె    

    జలము తాకిడి దాహము దానమునకులె 


4. నురగ గావెలు గూకల కాన్కుయే

     బుడగ లావేరు పూవాలా కాన్కుయే

     తడిక లా సమ  భాగము  కాన్కుయే

     కలువ పువ్వులు నీటిలొ కాన్కుయే


5. మనుజ భాద్యత ప్రేమల తీరుయే

    మమత భాద్యత శాంతుల తీరుయే

    యువత భాద్యత విద్యల తీరుయే    

    కలత భాద్యత కష్టము తీరుయే


6 .ఎదురు గాలికి వేగము ఆగునా

    సదరు ఖర్చులు చేసిన సాగునే   

    వగరు కాయలు తీపియు వేరునే

    పొగరు మాటలు తోచుట వేరునే


7 .పడవ సాగుట నీటికి తెల్సునా

    నడక సాగుట కాళ్లకు తెల్సునా

    మునక తేలుట జీవికి తెల్సునా

    అలక ఏడ్చుట నవ్వుకి తెల్సునా


8. మగువ మాటలు నమ్మిన శోభయే       

    వనిత వాదన విన్నను శోభయే

    మహిళ మాటలు అర్ధము శోభయే  

    పడచు చేష్టలు ఇష్టము శోభయే


9. మరచి పోవును విన్నవి చెప్పటం

     వలచి ప్రేమను పెళ్ళియు ఒప్పటం

     సుఖము సత్యము భోదని  తెల్పటం

      వగచి ధర్మము తప్పక బ్రత్కటం


10 . జగతి కీహిత మాటలు తెల్పుతూ

     మనిషి కీసమ శాంతులు తెల్పుతూ

     మమత కీమను వాక్యము తెల్పుతూ

     చదువు కీ సమ భావము తెల్పుమూ 

ని మనసు ప్రశాంతతకు అహాన్ని అంటే నేను అన్న భావాన్ని పక్కన పెట్టు. కేవల శూన్యంగా మారు. స్వీకార భావంతో వుంటే నీ శూన్యత్వం సంపూర్ణమవుతుంది. అప్పుడు అనంతం లక్షల ఆనందాల్ని  ప్రదర్శిస్తుంది. లక్షల పూలని వికసిస్తుంది. అప్పుడు ఆనందం శాశ్వతమవుతుంది.

గురుశిష్యుల ప్రాధాన్యత చాలా గొప్పది అది అర్ధ చేసుకోవడం కొంచము కష్టమే 

శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను.

గురువున కలవి గాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని  గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను.

పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును.  సుఖ దుఃఖములు పుట్టక తప్పవు.  ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు.  సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.

                                                                                   సశేషం 

ప్రాంజలి ప్రభ : రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఆరోగ్యం బ్రహ్మ...ఆనందం..బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ..003
అబ్బబ్బ వెధవ బండి' ...ప్రాంజలి ప్రభ
(వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం)
   ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.
 బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.
 పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. 
కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.
 దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).
దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.
*
ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.
 ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.
రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.
అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.
దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.
పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.
ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.
అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.
ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.
 మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.
చదివినందుకు ధన్యవాదాలు.
0

ఆరోగ్య బ్రహ్మ...ఆనంద బ్రహ్మ.. ఆద్యాత్మిక బ్రహ్మ 004
మజ్జిగ అన్నం vs పెరుగు అన్నం: ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకోండి
పెరుగు అన్నం మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే మజ్జిగ అన్నం మరింత మంచి ఎంపిక. పెరుగును నీటిలో కలిపి, అన్నంలో కలపడం "కేలరీలను తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మరియు కడుపు నిండిన అనుభూతికి" మంచి మార్గం.
మజ్జిగ (ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది) మరియు ఒక చిన్నసైజు  ఉల్లిపాయ (ప్రీబయోటిక్స్ సమృద్ధిగా ఉండేవి) కలయిక అనువైనది: మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఉల్లిపాయలు (ముడి మరియు వండినవి) ప్రీబయోటిక్స్ కలిగి ఉంటాయి. ప్రీబయోటిక్స్ అనేది ప్రాథమికంగా జీర్ణించుకోలేని మొక్కల ఫైబర్‌లు, ఇవి ప్రోబయోటిక్స్‌కు ఆహారం ఇస్తాయి మరియు మీ గట్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి" 
పోషకాహార నిపుణులు   ఆరోగ్యానికి ప్రీ మరియు ప్రోబయోటిక్స్ యొక్క ఆదర్శ కలయికను నొక్కి చెప్పారు. "ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ రెండూ గట్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ప్రోబయోటిక్స్ గట్ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, అయితే ప్రీబయోటిక్స్ ఈ బ్యాక్టీరియాకు ఆహారం. ప్రోబయోటిక్స్ లైవ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, గట్ ఆరోగ్యానికి మంచిది.పేగులను ప్రేమించే బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్స్ ఆహారంగా మారతాయి మరియు మంచి జీర్ణక్రియ కోసం వాటిని పోషిస్తాయి, ”.
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ప్రీబయోటిక్స్ మరియు పెరుగు వంటి ప్రోబయోటిక్స్, పులియబెట్టిన క్యారెట్లు మరియు బీట్‌రూట్‌లు వంటి రూట్ వెజ్జీలు, కంజి, ఇడ్లీలు మరియు అప్పమ్‌ల రూపంలో తీసుకోవడం మంచిది.
ప్రతి భోజనంలో భాగంగా ముడి ఫైబర్, చిన్న మొత్తాలు కూడా మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి మరియు భోజనం యొక్క గ్లైసెమిక్ సూచికను తగ్గిస్తాయి..
వండిన అన్నం లేదా బార్లీతో పాటు మజ్జిగ తరిగిన ఉల్లిపాయలతో ఊరగాయ, నిమ్మరసం, ఉప్పు, తరిగిన కొత్తిమీర ఆకులు మరియు ఓవెన్‌లో కాల్చిన వేరుశెనగతో కలిపి ఆరోగ్యకరమైన భోజనం.
ప్రాంజలి ప్రభ
0





ఆనందం బ్రహ్మ -- ఆత్మానందం బ్రహ్మ 


సూర్య వరుణ ఇంద్ర ఆర్య సర్వ వ్యాప్తి దేవతా 

ఎల్ల వేళ సుఖము నిచ్చు ఏది అదియు మాకులే 

సూర్య దేవ మాకు నిత్య స్థిరము వాయు కాంతిగా 

శాస్త్ర సమ్మతముగ వేద శాస్త్ర ఆత్మ విద్యయే   

          

సత్యముననె పలుకు మేము సర్వ వేళ లందులే 

తల్లి, తండ్రి, గురువు, రక్ష తోడు నీడ మేములే 

వర్ణ, స్వర, మాత్ర, బలము, వేద విధము బోధలే 

సామ బిడ్డల ప్ర భవము సంక్షిప్తము యె బోధగా 


లోకమున తేజము యు విద్య లోలకమ్ము

దేహ వాంఛ సంతానము దారి తెచ్చు 

 విద్య సంధాన కర్తగ విధిగ మార్చు 

భూమి ఆకాశ వాయువు భుక్తి తీర్చు 

    

అగ్ని జలముతో విద్యుత్తు ఆస్రి తముగ 

తల్లి తండ్రి కలయికయే తృప్తి బిడ్డ 

సృష్టి సంధాన ప్రకృతియే స్థిరము దీక్ష 

ప్రేమ కలయిక సంతాన పుడమి రక్ష 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి