16, అక్టోబర్ 2021, శనివారం

సరస సంగీత chandassu

 నేటి నూతన పరవళ్లు 


వెన్నెల్లో దీపమై, ఆకాశంలో మేఘమై 

పుడమికి అంబరమై, సృష్టికి ప్రతిసృష్టినై 


వెన్నె లంతా కురిసే నేలపై, నిండు దనమే ఆనందానికి ఆధారమై  

విరహ వేదన తగ్గుటకై, మనసు మనసు ఏకమగుటకై 


రూప లావణ్య మెరుపుకు దాసుడునై, తనువంతా మధురాతి మధురమై

మౌనపు చీకట్లో కౌగిలింతల మయమై, చెలి చెంత చేరి వేడి దుప్పటి నై .


వలపుల కొలనులో  రాపిడి స్నానమై, నాట్య మయూరి నర్తనకు ఆలమై 

కలువ పూల రేకుల దరహాసమై, విచ్చుకున్న పువ్వులా వికసించే ఆనందమై .


మధుర స్మృతులకు మార్గమై, దోబూచులాటలకు నిలయమై 

విలుకాడు విసిరే అస్త్రమై, హృదయానంద భరిత ప్రేమ రసమై 


నడిరేయి స్వప్నాల మొహమై, చెంతచేరి బంధించే చెలి రూపమై 

అనురాగపు ఆత్మీయతాభావమై, తనువంతా సువాసనలు ఘంధమై 


ప్రకృతి తో కనువిందు అపురూపమై, ఆశల పల్లకిలో చెలి సంతోషమై 

ఇంద్రధనస్సు ఉయ్యాల్లో ఊహలై, మాటలెన్నో పూలమాలలా నలిగినవై  


 ప్రేమ రథములో కదలికనై, మగువ మనసుకు అర్ధమై 

మౌనంగా ఆశలు తీరినిదై, ఆధర మధురం ఆనందమై 


సృష్టికి శ్రీకారమై నూతన జంట ఏకమై 


****

   

నేటి నూతన పరవళ్లు --2 


ఇటు చూడవే, చూడవే మరదలా 

చూసి చూడక చూపులతో చంపకే ---2


తడి ముద్దయిన వయ్యారంలో 

నాట్య మయూరిలానడకతో చంపకే ---2


నన్ను చూసి అలిగినావా మరదలా  

కారణం సెప్పఁక దడ దడ పుట్టించకే 

ఒడ్డున పడ్డ చేపలా కదలికలే నాలో  

హృదయ శబ్దము పెరిగేనులే ఇపుడే  


తడి ముద్దయిన వయ్యారంలో 

నాట్య మయూరిలానడకతో చంపకే ---2


ఏమికావాలో చెప్పు ఎగిరెళ్ళి తెస్తా 

కాంతి పుంజాల్ని తెచ్చి కురువుల్లో చేరుస్తా 

అంబరాన్ని అరటిపండులా తెచ్చి తినిపిస్తా 

ఇంద్రధనస్సునై పూలబాణాన్ని సంధిస్తా 


ఇటు చూడవే, చూడవే మరదలా 

చూసి చూడక చూపులతో చంపకే ---2


తేనె తెట్ట తెచ్చి తినిపిస్తా 

తీయ తియ్యని ఆధరం అందిస్తా  

మల్లెతీగలా మనసు విప్పి చుట్టేస్తా

మాన్మధుని మించిన రతిలో తేలుస్తా 


ఇటు చూడవే, చూడవే మరదలా 

చూసి చూడక చూపులతో చంపకే ---2

తడి ముద్దయిన వయ్యారంలో 

నాట్య మయూరిలానడకతో చంపకే ---2

--((()))-

 




చీకటి మడుగు వస్తుంది చెప్పలేక 

మౌనముయె వీడి వీరంగ మొదలు కేక 

ఏక కన్నీటి సుడులన్ని ఏక మునక 

రాజ్యము పరువు రంగము రాటు చురక 

స్వప్నములు అన్ని కలలుగా నుండె ఈశ్వరా 


నేల నుండియే తీగలు నింగి చేరు 

కాంక్ష లన్నియు మలుపులు కాటి చేరు 

హృదయము ఘనీభ వించిన హాయి చేరు 

జ్ఞాప కాలతో సుతిమెత్త జపము చేరు 

కరగి పొనట్టి వేదన కాల తీర్పా ఈశ్వరా   


చిన్న నీటి ఊటలు దాహ తీర్చి వేళ 

మనసు చేకూరు స్వాంతన మార్చు వేళ  

కడలి నందువిశాలంగ ఉన్న వేళ 

ప్రశ్నలుగ ఎన్నొ ఎదలోన ప్రతిభ వేళ 

పుక్కిటన నీళ్లు పట్టియు పుడమి చేరి ఈశ్వరా 


ఆశలతొ నిచ్చె నల తోను ఎక్కుతారు.

ఖాళీ గాఉవ్న మమతగా ఖర్చ మారు   

రాపిడితొ నిప్పు పుట్టించు రాశి మారు 

జ్ఞానము అడవి వెన్నలే జాతి మారు 

మేత వేసి కొద్ది వికసి స్తుంది ఈశ్వరా  


కలము కాగితము చెలిమి కళలు తీర్చు 

నిత్య నూతన యవ్వనం నిన్నె మార్చు 

సర్వ అర్ధాన్ని తెలుపుచూ సమత కూర్చు 

విశ్వ వ్యాప్తిగ రోగము విజయ మార్పు 

లక్ష్య మేదైన రోగాన్ని తరిమి వేయు ఈశ్వరా 


*****   


నేటి కవిత్వం - అమ్మలుగన్నఅమ్మ

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

UII  UIU  IUI   IUI IUI..... 3002 

అమ్మలుగన్న ముగ్గురమ్మల మూలపు అమ్మ

కమ్మని మాటలే అహర్నిశమే  కళ లమ్మ 
నమ్మకమే నిరంతరం నిలిపే మమతమ్మ 
కమ్ముకొనే విషాద సంఘట మాపిన అమ్మ   

ధర్మము తెల్పి నిత్యశోభకు మూలము అమ్మ
అర్ధమువచ్చు సత్యమార్గము చూపునుఅమ్మ
కర్మ ను బట్టి ఓర్పు నేర్పును చూపిన అమ్మ
మర్మము యేలఉన్న పాపము చేయని అమ్మ 

ఆకలి తీర్చి సంతసమ్మును పంచును అమ్మ
సౌఖ్యము చూపి విద్య నేర్పిన దేవత అమ్మ
అక్కసు చూపకే నిరీక్షణతో మమతమ్మ  
మక్కువచూపియే అనేకము చెప్పిన అమ్మ  

కష్టము తెల్పకే. వివేకము చూపును అమ్మ
ఇష్టము గా పనే సకాల ము చేయును అమ్మ
నష్టము అన్నదే ఎకాలము చెప్పదు అమ్మ 
సృష్టికి కారణం  ప్రెమమ్మును చూపెది అమ్మ 

బిడ్డకు  సేవ యుక్తి ముక్తికి మూలము అమ్మ
నవ్వుల మాటలే సకాల ము తెల్పును అమ్మ
సవ్వడి చేయకే సుఖాలను పంచును అమ్మ
తల్లి కి తండ్రికీ సహాయము చేయును అమ్మ



--(())--


 యిది. క్రింద నా ఉదాహరణములు - 


UI IIIUI - UIU UIU 

UI III - III IIIUI 

UI IIIUI - UIU UIU 

UI IIIUI U 



చేరు తనువులోన - తాపమే  తృప్తిగా

కష్టములను - కళల వలపు గాను  

కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  

కాల కలలు తీర్చుటే  


వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా 

కన్నె మనసు - కలల కవనమయ్యె 

వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా 

నన్ను కనవదేల నీవు 


కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే 

ఇష్ట వయసు - చెలిమి తలపు గాను 

నష్ట మనునదేది - చేయకే ఉండుటే 

ఇష్ట మనునదే ఇదీ 



మౌన హంస అర్ధానికి అర్ధంగా అర్ధాంగి  

బంధానికి భంధమై ఆశయ కార్యోన్ముఖి 

ప్రేమ హంస స్నేహానికి స్నేహంగా స్నేహవతి

కాలానికి కాలమై చలిమితో ప్రేమసఖి 


రాజ హంస హృదయానికి హృద్యంగా వేదవతి   

ప్రేమకు ప్రేమయై  కళలతో  పిపాసి 

సత్య హంస  ధర్మానికి ధర్మంగా ధర్మదేవత 

న్యాయానికి న్యాయమై  రాజ్యమేలే భారతి 


నేటి కవిత - హంస
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
కల హంసల సయ్యాటలో కను విందు చేసే
మను వాడిన ముద్దాటలే మది పొందు కోరే
చిరు హాసపు ఉయ్యాలలో చను విచ్చి చేరే
మరు మల్లెపు సయ్యాటలో కధ లల్లి విప్పే
మౌన హంస అర్ధానికి అర్ధంగా అర్ధాంగి
బంధానికి భంధమై ఆశయ కార్యోన్ముఖి
ప్రేమ హంస స్నేహానికి స్నేహంగా స్నేహవతి
కాలానికి కాలమై చలిమితో ప్రేమసఖి
రాజ హంస హృదయానికి హృద్యంగా వేదవతి
ప్రేమకు ప్రేమయై కళలతో పిపాసి
సత్య హంస ధర్మానికి ధర్మంగా ధర్మదేవత
న్యాయానికి న్యాయమై రాజ్యమేలే భారతి
శా :: రాధా కృష్ణుడుగా ప్రభంజన కళో సాకార సామాన్యతా
==(()) ==

నేటి పద్య పుష్పాలు 20-03-2020
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా       
****
నేటి నూతన పరవళ్లు 

వెన్నెల్లో దీపమై బంధనాలు కలుపుటే 
ఆకాశంలో మేఘమై అల్లరిగా కదులుటే 
పుడమికి అంబరమై అలకలు తిర్చుటే 
సృష్టికి ప్రతిసృష్టినై సుఖమును పంచుటే  

వెన్నె లంతా కురిసే నేలపై చూపులగుటే  
నిండు దనమే ఆనందానికి ఆధార మగుటే    
విరహ వేదన తగ్గుటకై ఇద్దరం ఒకటగుటే   
మనసు మనసు వంపుల వయ్యారం మగుటే   

రూప లావణ్య మెరుపుకు దాసుడై మరుగుటే  
తనువంతా మధురాతి మధురమై కులుకుటే 
మౌనపు చీకట్లో కౌగిలింతల మయమై కలియుటే  
చెలి చెంత చేరి వేడి దుప్పటిగా తికమకయగుటే 

వలపుల కొలనులో  రాపిడి స్నానమై పాఠమగుటే 
నాట్య మయూరి నర్తనకు ఆలమై పరవశమగుటే  
కలువ పూల రేకుల దరహాసమై ఆలయమగుటే  
విచ్చుకున్న పువ్వులా వికసించి ఆనంద పరుచుటే  .

మధుర స్మృతులకు మార్గమై మనసు దోచుటే  
దోబూచులాటలకు నిలయమై చిందులాటయగుటే   
విలుకాడు విసిరే అస్త్రమై అంబులపొది యగుటే   
హృదయానంద భరిత ప్రేమ రసమై వికసించుటే  

నడిరేయి స్వప్నాల మొహమై నలిగి పోవుటే 
చెంతచేరి బంధించే చెలి రూపమై సేవలుగుటే  
అనురాగపు ఆత్మీయతాభావమై ప్రేమ పంచుటే  
తనువంతా సువాసనలు ఘంధమై అందించుటే  

ప్రకృతి తో కనువిందు అపురూపమై సృష్టి యగుటే   
ఆశల పల్లకిలో చెలి సంతోషమై వీణ కదిలించుటే  
ఇంద్రధనస్సు ఉయ్యాల్లో ఊహలై సొమ్మసిల్లుటే  
మాటలెన్నో పూలమాలలా నలిగినవై కనులుగుటే   

ప్రేమ రథములో కదలికనై  విరహగీతిగా మారుటే  
మగువ మనసుకు అర్ధమై తలపుల తపనయగుటే   
మౌనంగా ఆశలు తీరినిదై పలకలేక నిలువలేనిదగుటే   
ఆధర మధురం ఆనందమై బ్రతుకులో కదలగుటే  

సృష్టికి శ్రీకారమై నూతన జంట ఏకమై గాలియగుటే
చేరదీసి నీరుపోసి చిగురించే బ్రతుకుగా బలియగుటే   
అలముకున్నచీకటిలోన అలమటించే బ్రతుకఁగుటే
ధైర్య సాహసమనే జ్యోతిగా తెలిసికొనే జీవితమగుటే     
****

--(())-- 
కాలాంభోదకళాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశాం
ఆవృణ్వాన ముదార మందహసితస్యంద ప్రసన్నానం।
రాజత్కంబు గదారి పంకజధర శ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో! మద్రోగముద్వాసయేత్||

భావం:-


విభూ! కాలమేఘచ్చాయను నీలికలువపువ్వుల కోమలత్వమును కలిగిన నీ రూపమున ప్రకాశించు కాంతి, చక్రభ్రమణమై సకలదిశలను ఆవరించునది. మందహాసము నొలికించు ప్రసన్న వదనముతో, శంఖు, చక్ర, గదా, పద్మములతో విరాజిల్లు భుజమండలము కలగిన నీ రూపము, సృష్టికర్తకు ఆనందమును కలిగించినది. అట్టి నీ రూపమును, నా రోగమును హరింపజేయ మని ప్రార్ధించుచున్నాను.


19  - ౦౩-2020
ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు  



చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా 
కన్నె మనసు - కలల కవనమయ్యె 
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా 
నన్ను కనవదేల నీవు 

కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే 
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను 
నష్ట మనునదేది - చేయకే ఉండుటే 
ఇష్ట మనునదే ఇదీ 

ఒకనాటి కవిత - పట్టు      

సరిగమల సరాగం ప్రేమతో పుట్టు
చెరపలేని ప్రేమ మనసులో పుట్టు
ప్రేమార్ధం విశ్వ మంతటి లో గుట్టు
అంతుతెలియని మాధుర్యంతో పట్టు

అరిగిపోని అనురాగం పంచె పట్టు
కడలి పొంగును చల్లఁపరిచే పట్టు
ఆలింగనాల అభిరుచులతో పట్టు
తీపిగుర్తులు అందించి నలిగే పట్టు

నిరంతర త్యాగాలతో, ఓర్పుతో పట్టు
వివరించలేని సుఖం ఇచ్చిన  పట్టు
తెలియని ఆనందం అందించే పట్టు
వీడని నమ్మకం తో బ్రతికించే పట్టు

ఇరుహృదయాల సంగమమే ప్రేమ పట్టు
ఈశ్వరుని లీలలను తట్టుకొనే ప్రేమ పట్టు
ఆకలేస్తే అన్నంపెట్టు, కోరికను వడిసి పట్టు
క్షణమొక యుగంగా బ్రతుకు ఈడిస్తు పట్టు
--(())--


భ   ర  న   ర  స  స  న  గ - మద్రక - 10  
UII  UIU  III  UIU  IIU  IIU  III  U 

కాలము మారెనే మనసు కోరికే కళలే ఇక ఏ మగును లే 
శీలము భద్రమే మగువ సాహసం తలపే దయతో పలుకులే 
పాలకి తెచ్చినా హృదయ పాలవాగును పంచుటయే కళలుగా 
చాలిక అన్నను వయసు చాకచక్యముతో పదహారు కళలే 

చోద్యము  తెల్పుటే వినయ చోలమే విడిచీ వలువే వదలి వే 
సే దయ దాహమే తపన సారికా కలిసే సమయా సమయమే 
వాదము చేయకే మనసు అర్పనే మనువాడిన భర్తకు సహా 
యం దరి చేరియే కులుకు యంతయూ సరి చూపె మగడి కొరకే      

పాలను ముంచినా జలము పంచినా తనువే తప మాచరణ మే   
లాలన పాలనే వదలి లక్ష్మిగా చలనాలను ఆశ్రయముగా 
గాలిని నీటినీ కలిపి ఆకళై గడుసై విధినే మరచియే 
ఆలిగ ఉండకా తిరుగు సోద్యమే మగవానికి కలే    


-(())-- Photo

త య  త య  మ  త య  గ గ  
UUI  IUU   UUI  IUU   UUU  UUI  IUU   UU  
నేటి కవిత్వం - నిజమైన స్త్రీ సుఖం 
రచయత : :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రాగమ్ముల తోడన్ ప్రేమమ్ముల తోడన్  రమ్యమ్మే  విశ్వాస వివాహం కాదా 
నీ గానము నందున్ నీ సేవల నందున్  కామ్యమ్మే  విశ్లేష  వినోదం కాదా 
రాగేశ్వరవై దేవీ దీవెన తోడన్  రంజిల్లున్  సౌందర్య  సమూహం కాదా 
యోగార్థిని నేనే  స్నేహార్ధి వి నీవే   ప్రేమాబ్ధీ కోరేది సహాయం కాదా     

నాయాశల వాణీ  ఆనందపు బోదీ  ఆరోగ్యా  హాస్యమ్ము లయార్ధీయున్ 
సాయమ్మివనాయీ  సాయంత్రము నందున్  బోదత్వా  ప్రావిణ్య సహాయంమ్మేయున్ 
రేయిన్ గడు హాయిన్ - బ్రేమన్ కళ లాగా  సంతృప్తే కల్గేటి సుధామాధుర్యమ్  
తీయంగను పాటల్ - పాడన్  గను వచ్చే  ప్రేమమ్మున్  పంచేటి  సభామంత్రీయున్ 
       
ఆఘట్టన మందున్ హాహా కర కారమ్ముల్ ప్రావిణ్యమ్ముల్  సహ పాండిత్యమ్మున్  
మేఘధ్వనిపూరం  బీయా కర కాశమ్మే  ప్రాధాన్యమ్ముల్  కళ  సాహిత్యమ్మున్ 
మేఘాగమ వేళన్  జల్లేలుట జర్గున్  సౌభాగ్యమ్ముల్ వీచి సువాసంబుల్గాన్ 
మేఘాంబువులిచ్చున్  సంతోషమ్ము కల్గున్  హర్షమ్ముల్ మెండై సుఖ వాసంబేయున్  


--(())--
    



జీవిలో - ప్రపంచం (౧)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బాహ్య కాంతి శబ్ద కాలుష్య పెర్గేటి  
వింత మార్పు చోటు చేసె మాయ  
ఆత్మ శక్తి నంత సంకల్ప సందేహ 
మేను పుల్క రింత సంభ మేగ   

జీవి తాను భావ భవ్యత  ఎవ్వరి 
కోస మైన  ప్రశ్న బుద్ది శక్తి 
జీవి తాంత మంత ఉండేటి కర్తవ్య 
తీర్పు విశ్వ మంత ప్రజ్వ లించు 

మౌన కళ్ళ ముందు ఆలోచ నాలుగ 
తీవ్ర సంఘ  మందు  పోరాడు శిష్టత 
ఊహ ఆశ మధ్య  భౌతిక దేహమె        
పాశ బంధ మేగ  జివి బత్కు 

--(())--



భ  ర న ర న ర న యూ - సుభద్రకు -11   
UII  UIU  III  UIU  III  UIU  III U 
నేటి కవిత్వం - చిత్తరువు 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చిత్తరువే లిఖించి వగచే మనో మయము వేదనా పడిన గ 
మ్మత్తుగ ధీర వీర సుమమే కదా మనసు దోచినా వనితగా 
కొత్తవి తెల్పెదీ వయసుకే ఉపాయమును తెల్పెదీ  సొగసుతో 
విత్తును నాటుటే కళలు విప్పి వేగమున నీరుతో కలియుటే 

మన్మధుడో సుఖాలయము కామితార్దమగు భావమే మనసు కే  
మైనను హావభావములనే మదీయ కాహరితార్ధమే తలపుతో 
గానము చేసియే సుఖపు వేగమే వయసు తోడుగా వలపు నీ 
డన్నది పొందియే మగని మైకమే తొలగి చీకు చింత వదలే        

స్త్రీ కృపయే సుఖాలయముచేసి కోర్కలను తోడుగా తరుణమే 
స్త్రీ ధయ యే విశాలమయమై సుఖాలయము తృప్తిగా మదనమే 
స్త్రీ  చర ఆశలే వినయ వాసిగా వివిధ కారణాలు తెలిపే 
 స్త్రీ కర మాటలే మనసు వెన్నపూస కరిగేవిధాన కరిగే 
--(())--




 స    త త న   స  ర    ర   గ మహాస్రగ్దర ... 8 . 15  
IIU  UUI  UUI  III   IIU  UIU  UIU U 


నేటి కవిత - కౌమారం  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనసే మౌనంగ కౌమార దశలొ పరమానందమే ప్రోద్బలంగా 
పని చేసే విద్య  కోపాలతొ సరిగమపా ప్రేమ లక్ష్యమ్ముగా  తి 
ర్గును ఆర్భాటాల తో ప్రేమ కనుగుణమురే చేయు చైతన్య మూర్తే 
కను సైగల్లోకి చిక్కేటి మనిషి పలుకే స్వేశ్చ భావాలశక్తే 

అలకే ప్రేమమ్ముగా రాగమతిశయ మనోస్నేహమే శాంతిమార్గ 
మ్ములె సేవాపూర్వకమ్ముగకదిలె లయమే సామరస్యాలయ మ్మే 
కళ సంతోషమ్ముగా కాల మయము పరమై స్వేశ్చ హృద్యమ్ముగా పొం 
గులకారమ్మే  సమాగ్రాహ్య వలయములుగా  ఉండెదే జీవితమ్మే 

కమనీయం ప్రేమ వాక్కే మనకళలను  కారుణ్య భావాలుగా సే 
వ మహోత్సాహమ్ము దక్కే చిరునగవులులే  చిందులాటల్ల సాగే 
సమ భావ ప్రేమ విశ్వాసముతొ కలిసి సేవా సహాయమ్ము చేసే

మమ ఆశాపాశ సామాన్య వలపు మన మేకం సమోన్నత్వమేగా


Tanjore painting- Krishna

పంచభూతాలు 

భూమి 
అఖిల జీవ కోటి ఆధార భూతమ్ము 
శ్వామ లాంబ కరుణ  సుంద రమ్ము 
సకల సంప దల్కి మూలము భూమాత 
సర్గ మన్న నదియె తరచి చూడ 

ఆకాశం 
నింగి సూర్య చంద్ర నిత్యము సంచార
పగలు ఎండ రాత్రి నీడ  కల్గు  
తిధి వలన మేఘ మార్పుల ఆకసం 
ఋతువు లన్ని వరుస మారు చుండు   

వాయువు 
పరమ శివుని శక్తి  పవనమై జగమంత  
వ్యాప్తి చెంది జీవ కోటి కెల్ల 
రక్ష వాయు వగుచు జీవులు కాపాడు  
 గాలి లేక బతక లేము ఘడియ 

అగ్ని 
ప్రజ్వ లించు అగ్ని  లాభము నష్టము 
వేడి లేని మేను వ్యర్ధ మేగ 
అగ్ని తోడు తిండి  తయ్యారు కావచ్చు 
అగ్ని యజ్ఞ ఫలము దేవ తలకు     
  
నీరు 
నదుల జలధు లన్ని కలిగిన ఈభూమి 
అంద జేయు నాన్న పానములను
సకల జీవ కోటి  దాహము తీర్చేది 
వృష్టి లేక సృష్టి  సాగ లేదు 

విజ్ఞానం 

మొదట నమ్మియు దూషణ మూర్ఖ బుధ్ధి 
ఒకరి నర్ధించి వెరొకరి యాచ బుధ్ధి
మనిషి నర్ధము చేసుకో అన్న వాక్కు 
వినిన సహనము చూపించు నిత్య పలుకు

ఒకరిని అభివర్ణించేటి శక్తి చూడు
తెలుసు కొనుటముఖ్యం మంచి సేవ యుక్తి 
తగిన సమయంలొ ఉత్తమ సంఘ సేవ
మనిషి రోగిగ మారితే ఆదు కొనుము

విషయ వాంఛ లు వదలని మూర్ఖ బుధ్ధి
తెలియ నివి తెలుసునని పల్కేటి బుధ్ధి
తగిన రీతిలో తల్లి తండ్రల సేవ
మనిషి జన్మనిచ్చిన దైవ కరుణ బుధ్ధి

ఎలుక ఎదురైన ఏనుగు ఆగు బుధ్ధి
బలము ఉన్నను బలహీన బుధ్ధి కాదు
మనషి నొచ్చిన ఉత్తమ బుధ్ధి కోరు
మనసు చేతకాని తనము కానె కాదు

--(())--


నేటి కవిత్వం : నటుడు గానగంధర్వుడు 
బాలసుబ్రహ్మణ్యుని పుట్టినరోజు శుభాకాంక్షలు   

సీ ::   శ్రీ మాత కరుణయు శ్రీ వాణి దీవెన
          పండిత రాడ్యుల ప్రజ్ణ  కొరకు 
         చిత్ర సంగీత గంధర్వుడు పద్మశ్రీ 
         బాలసుబ్రహ్మణ్య గాయ కుండు
         అనితర సాధ్యమైనట్టివి కళలకు  
         నంది అవార్డులు పొంది  నారు     
         దేశబాష తెలుగు వృద్ధికి జీవితం
         అంకిత మిచ్చిన గాయకుండు 

తే :: ఎదురు లేనిసి నీసీమ లేలె రాజు 
        పలుకు పాటగా సంగీత  గాన రాజు
        నటుల గొంతుతన గొంతుగా  పలికె రాజు     
         నటుడు బాలుగారికి అభి నంద నాలు 

                       --(())--



స జ  స  జ  స  జ  స - మణిమాల 10 
IIU  IUI  IIU  IUI  IIU  IUI  IIU 

నేటి కావిత్వం - పరమేశ్వరుడు  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సుజనుండు చేయు పనులే సమస్త లోకమే సుగర్వముగ చె
ప్పు జనా వలీ సుఖము గా ప్రయోగములు గా ఉపాసనలు గా 
నిజమే ననీ పలుకు గా నిరంతరము సేవ చేయుట కదా     
ప్రజలే మహా మనిషిగా ప్రధాని అను నేతగా  తెలిపుటే 

ఎవడింద్రి యమ్ములు సహాయ పర్చునని ఉన్న తోత్తమునిగా   
అవనీ తలమ్మున మదీయ పాలనను ఇచ్చు కార్య ముఖిగా
అవధాన కర్త రజ రాజ కీయ సమ రోద్ధికా వినయ మే 
జవసత్వ మే సకల సేవ తత్పరుడు గా ప్రధాని పలుకే 

కళ లే సకాలమున ఏక మవ్వుటకు యోగ్యతా కలుగు నే 
పలుకే వినోద పరిచే, ప్రమాదము నకే సహాయ పరిచే 
తెలిపేటి మేలు హృదయం తపోజనముగా  నిరంతరము  సే 
వలు చేయునట్టి మనిషే విశాల హృదయమ్ముగా ప్రజలకే   
--(())--



విద్యుత్ వక్త విద్యా స్వరూప
సమ్మోహ్ శక్తి  విద్యా స్త్రీ రూప 
తన్మాయ్ తత్వ మేయీస్వరూప
ధర్మత్ విద్య వైద్యా స్వరూప

తగిన వాణ్ని చూసి దానము చేయుము 
తగని వాని తోను మంచి మాట 
తగని వాడె నన్న సత్యమె పల్కుము 
తగిన వాడి కైన పాత్ర తెల్పు 

ఎవరి కీని భాధ కల్పించ రాదులె 
నరుని నిత్య సత్య మార్గ మతము
మనము చేయ లేని దానిని మరొకరు 
చేసి చూపి వద్ద కొస్తె మెచ్చు 

ప్రేమ కరుణ దయ  సాధన సంపత్తి 
తోను  తప్పఁ  కుంచు  ధర్మ బుద్ధి     
ఉత్త మోత్త మమ్ము  తెల్యక దుర్బుద్ధి 
 పెర్గి  ధర్మ  మన్న   చిన్న చూపు  

జాలి దాన బుద్ధి ఏకొద్ది మందిలో 
ఉండి  సత్య  పల్కు వృద్ధి జరుగు
తృప్తి  ఉంటె ప్రశ్న ఉండదు ఎవ్వరికి 
పంచు నట్టి బుద్ది శాంతి కల్గు 

అంద మన్న దేది సాస్విత ముండదు 
పువ్వు పగలు రాత్రి శోభ పంచు
ఆకు రాలి పోవు ఎండిన తర్వాత 
జీవి వయసు పెరిగి రోగమాయె

కళ్ల నీళ్లు తిర్గు మంచిని చూడరు 
వల్లు గుళ్ళ అయిన ఓర్పు చేటు
బల్లి లాగ గోడ నక్కియు ఉండు
గుంట నక్కలు లాగ అరచు చుండు

మనిషి నడక మసక బారి ఖరీదైతె
ఎనక ముందు క్రింద పైన బతుకె
వయసు వేడి పడక చల్లగ ఉండుటే
కోప మేను ఉడికి రచ్చ రచ్చె
--(())--

feels connected to it













 "గణపతి ! కపిలుఁడ ! గిరిజజ !
గున - గున నడకల సొగసుల గురుగుహ నుతుఁడా !
మనమున నిలిపెద నిన్నున్
ఘనముగఁ గొలిచెఁద సతతము ' గణపా ! ' జోతల్ !!!"
 ऊँ!
----
"శరణు - శరణు..హరిహరసుత !
శరణమునిడు దైవమీవె సాయమునిమ్మా..
శరణునుఁ గోరెద సతతము
శరణమె సుమతిని బలమును శాంతినిఁ గూర్చున్ !!!" 
--(())--


తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
UUU   IIU  IUI  IIU  IUIU .... మ స జ స  జ గ 

కారుణ్యాలయమే మనస్సు మమతాను రాగ మా 
ధుర్యా ప్రేరణ పోషణా సమర సౌమ్య పాలనా    
ఆరుహ్యా కవితా సమాన సుమ మాలికా పరం 
ధారుఢ్యా పరమోన్నతా విదిత ఆలయమ్ముగా 

మౌనమ్మే పెనుమాయ ఛేదన కుపాయమేకదా 
గానమ్మే మదిమాయ తాపమును తుంచుటే కదా    
దానమ్మే సకలా యుధమ్ము లను రక్ష దే కదా
ప్రాణమ్మే మనసు మనస్సు ఏకమవ్వుటే కదా 
  
అన్యాక్రాంతము సేయు సంపదలు మేలు చేయునా 
ఉన్మాదం మనసంతయు  పాడుచెయు ఏల ఉన్ననూ  
సన్మానం జరిగిందని గొప్పయను కొంటె లాభమా 
తన్మాయే తనువంతయు కప్పియును ఉంటె గొప్పయా 
--(())--

III  UII  IUI UIU IUI UI ..    న   భ   జ  ర  జ  గల         

కడుపు కట్టుకుని గింజ గింజ నెంచి కూడు తిన్న ,
పడుపు వృత్తి అలవాటు పడ్డ డబ్బు కూడు తిన్న 
ముడుపు కట్టి పొరపాటు తోన మందుకూడు తిన్న 
కరువు ఉంది అని దాచి తెల్సి పప్పు కూడు తిన్న
   
బతుకు భారము మరేది ఎప్పుడో మనస్సు తెల్పె 
మెతుకు కోసము ఎదైన ఉద్యోగ మ్ము చేసియే న 
లతకు రోజులు గ మార్చ కుండగా మనస్సు బాధ 
వెతక కుండగ మనోవెదమ్ముగా  సహాయమిచ్చు 

మనసు పంచియు సుఖాన్ని పెంచియే విలాస సేవ 
తనము అర్పణము చేసి భోధ తత్వమే సుఖాలయమ్ము 
కణము లన్నియు మనోమయమ్ముగా సహాయ నేర్పు 
వినయ పల్కులు వినోదమేను తాపమూను పంచె   
    
--(())--


☀ SHRI KRISHNA ☀ Artist: Mahendra Dubey “O Krishna, always remembering the nectarous, low, soft sounds of Your flute, as well as Your eyes, doubly expanded with mercy, I pray that wherever my sight shall wander, You will always manifest Your beauty,...
భ   త  న  స   భా  భా  న  య - 12 
UII  UUI  III  IIU   UII UII  III iUU 
నేటి కవిత్వం - తన్వి 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ప్రేమను పంచేటి అవని సమపాదాలు చలించియు భయమును తెచ్చే 
ధామము ధారాళముగ విధి నిదానమ్ముగ తెల్పియు సమరము చేసే 
తన్మయ భావమ్ము కలిగి సమతా వాదము పెంచియు నలుగుచు ఉండే     
విస్మయ చూపుల్లొ వయసు అభివాదమ్ముగ సమ్మతి వినయము చూపే 

మారుతి తుల్యపు గమనము సమాజాన్కి బలాన్ని అభయమును పంచే 
మార్పులు సేవా పరముగ తనమాధుర్యపు హాయిని సమముగ పంచే 
ఓర్పును చూపించు వినయమును ఏభావము లేకయు కళలను పంచే 
తీర్పుగ నిత్యమ్ము సుఖము ను అతీతమ్ముగ పంచియు సకలము రక్షా 
  
ఆపద లెన్నైన మనసునకు ఆదుర్ద సమోన్నతిని మరుచుటయె కాదా 
పాపము లెన్నైన చెసిన తన పాపమ్ము మనస్సుకు మధనము కాదా 
కోపము వెంటాడిన మనసు చికాకే వయసే పరుగుపరుగు కాదా 
తాపము వెంటాడిన వికసము తప్పే వినయమ్ము కలకలము కాదా     

--(())--

గణములు-స,భ,ర త,త,గ యతి - 10    
IIU  UII  UIU  UUI  UUI  U -౧7  -౦౬-2020  
నేటి కవిత్వం - చిరునవ్వే 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చిరునవ్వే చిరుకోపమే చూపే మనస్సులో  
తిరునాళ్లే మన మధ్యపంతాలేలు తగ్గించులే  
చిరునామా మది తెల్పొచ్చే కాని సంతోషమే 
మరుమల్లే మనమధ్య కామ్యంమేను కల్పించులే 
  
కలకాలం దరహాస మేకాంతం మనోమందిరం 
చలిమాటే మనసంతసం చాతుర్య సామ్యమ్ములే 
అలుపే రాకయు రాగమే రమ్యమ్ముగా సాగెనే 
తలపేతన్మయ మాయగా తాపత్రియమ్మేనులే       

కరుణాపూరితదృష్టితో గమ్యార్ధి సంధాత్రివై 
చరితార్ధమ్మును తెల్పి యాగాలన్ని చేసెనులే   
పరిశీలమ్ముగ పాలనే పాపాల్ని తొల్గించులే  
యరవిందాసన సుందరీ యాత్మీయతా చూపెనే  

గురురూపమ్మున వెల్గుదో గోప్త్రీ విధానమ్మునో ! 
యరవిందాసన సుందరీ యాత్మీయ వాగీశ్వరీ 
యెఱుఁగం జాలను గాని నా హృత్పద్మ పీఠమ్ములో 
నిరతంబెంచెద భక్తితో నీదైన వాత్సల్యమున్ 
-- 
కరుణాపూరిత దృష్టితోఁ గామ్యార్థసంధాత్రివై 
మురిపెంబీయఁగ సర్వదా పొంగించి పద్యమ్ములున్ 
విరచింపంగను సన్నుతుల్ ప్రేమానురాగాలతో 
మఱి శంకేమిటికుండునే మాతా కృపాసాగరీ 
-- 
పరిపూర్ణంబగు భక్తితోఁ బ్రార్థించి నీ రూపమే 
త్వరలోఁ గూర్చెద నట్టులే ధాత్రీప్రమోదమ్ముగా 
మరువంజాలని రీతినే మాన్యంబునౌ పల్కుతోఁ 
గరముప్పొంగఁగ నీవునున్ గావించు స్తోత్రాలతో 
-- 
చిరకాలంబుగ నున్నదీ చిత్తంబులో వాంఛయున్ 
వరవీణాధరి కోసమై వ్రాయంగ నో కావ్యమే! 
గురుదత్తుండును దీవనల్ గుర్పించుచో సత్కృపన్ 
నెఱవేరంగను గష్టమే! నీ,నా మనోభీష్టముల్ ! 
-- 
మఱి యెన్నండతఁ డెంచునో మన్నించి దీవించఁగా 
నెఱుఁగంజాలను వాస్తవంబెట్లున్నదో భాగ్యమున్ 
కరముల్ మోడ్చుచు మ్రొక్కుటే గారమ్ముతో, భక్తితో 
దరిజేర్చంగను వేడుచున్ దత్తావధూతన్ సదా 
-- 





16-06-2020
మ  న  త  స  ర    భ   జ   య  ... అష్టమూర్తి ..8  ...16      
UUU  III  UUI  IIU  UII  IUI  IUU 
నేటి కవిత్వం .. సంతసం 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆశించే మనసు నీ రూపమును ఏనాటికి మరల్చ లేదంటే 
పాశాన్నే వదలి ప్రాణాన్ని పరువాన్నే చురుకుగా సమకూర్చే 
విశ్వాసం కనుల ఆకర్ష మునకే మునకే లొంగుననియే మదిభావం 
ఆశాపాశములు బత్కంత పెనవేసే పడచు ఆశలు తీర్చే   

కాలాన్నీ మరువ లేకే మదిలొ భావాలు ఒకటై మనువాడే 
ముల్లోకాల సుమసామిప్యమును ఆశించి  ఒకటై మనసంతా 
కల్లోలాల పలువాక్కుల్ని తెలిపీ హాయిని మనస్సుకు పంచే        
కోలాటాల్ జరిగి ఏకమ్ము అగుటే జీవితము సామము కాదే   

సంతోషం సగము ప్రస్ఫోట బలమే జీవిత సరాగములేగా  
ఛీత్కారం మరచి పంచే వలపు చెప్పేటి ప్రాతిభా తలపించే 
తాత్పర్యం తనువు తత్తాన్ని తెలిపే సాదు సహనమ్మును పంచే 
సత్యాన్నే కళలు గా సాగరమునే ఈదియు సమస్యల తీర్పే     

--(())--

నేటి ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్వేత ముఖపు దేహకాంతులు నొప్పిలేనివి కృష్ణుడా 
ఖ్యాతి వాక్కులు వెల్గు చూపులు తప్పుకానివి కృష్ణుడా 
జాతి ఆశలు భక్త సేవలు ఒప్పు అంటివి కృషుడా   
నీతి పల్కులు నిత్య సత్యము వేదమంటివి కృష్ణుడా ...... 

సృష్టి కర్తయు సృష్టి ధర్మము తెల్పి యుండెను కృష్ణుడా 
ఇష్ట మున్నను లేక ఉన్నను జీవి బత్కును కృష్ణుడా 
ముష్టి యుద్ధము తప్ప కున్ననుసేవ చేయుట కృష్ణుడా 
కష్టమొచ్చిన నష్టమొచ్చిన పూజ మానను కృష్ణుడా ..... 

దాన ధర్మము చేసి యుంటిని ఇష్ట సాక్షిగ కృష్ణుడా 
వాన వచ్చిన గాలి వచ్చిన పూజ చేసెద కృష్ణుడా 
కాన రానివి నావి కానివి నీవి యైనవె కృష్ణుడా 
ఎన్ని ఉన్నను దేహ బాధలు తపప్ వెందుకు కృష్ణుడా .....  
     

మ  న  న  న  న న న హ గగ -- 9 ..15 వరహ 
UUU  III III  III  III  III  III UIUU 
నేటి కవిత్వం - వరహ 
రాచాయట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆదర్శం వలన కళల కదలిక కలుగు అవి మన  మనోబలాన్నీ   
అధర్మం తరిమి అనుకరణ వదలి మనసు మనుగడ మారు నట్లే 
యుద్ధాన్నీ సమయమున తగు విధమున జరుపు కొనునది జీవితాన్కీ       
ఆధ్యంతం సుఖమునకు బలమునకు విధి ననుసరణ యదార్ధమేగా  

వ్యామోహం వలన జయము అపజయము కలుగు భయము సరాగమేగా
సమ్మోహం వలన సుఖము తరుణ కరుణ దయ మిళితము అమ్మ భాషా 
తన్మాయా చరిత కధల వెతలు ఒకటి తరఫు ఒకటి సమ్మతమ్మే     
ఉన్మాదం మరచి విధి వలపుల తలపుల తరుణ కృప జీవితమ్మే 

తప్పేంటీ అను పలుకు అహము తెలుపు నలుగు బతుకు అబద్దమేగా 
ఒప్పే౦టీ  నిజము తెలిపిన తెలియదు అను పలుకు విధి ఆడుటేగా 
అప్పుంటే బతుకు విలువ ఉపశమ నమలు కరువగును జీవితాంతం 
గొప్పల్కీ  సుఖము ఇది యనిన కలల నిజము గరళపు జీవితత్త్వం  
        

--(())--






మా  మా  త న న న న  ర  గాగ  8 --18  భుజంగవిజృంభిత   
UUU  UUU  UUI III  III   III   III UIU UU     
నేటి కవిత్వం - భుజంగవిజృంభిత   
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
సంఖ్యా శాస్త్రమ్ములే విశ్వాస చరణముల కదలిక వలె సకలము సంతసమ్మే గా 
కా ఖ్యాతి స్వార్జిత్తమ్మే కాల చరిత వినయ విధి కళల మనస్సుకే చెందే     
సఖ్యా భావమ్మే విశ్వాసమ్ము కలిగి సతతము పస వలన చారుహాసమ్మే 
విఖ్యాత ప్రోత్సాహమ్మే విశ్వ కళల కనుగుణము విజయము చెందుటే కాదా      
    
ఆరోగ్యాలయ్యమ్మే సాధారణ మనిషికి సముచిత కళలు సమ్మతమ్మేగా
ఆరాధ్యమ్మే ఆదర్శాల స్వరలయల వినయ గళము మదిభావ సారూప్య
మ్మే రాగాలాపమ్మే సమ్మోహ వలయ పవన సమము సుఖములేర్పడే శాంతీ 
సారధ్యమ్మే సేవాలాస్యమ్ము కధలు వెతలు సమసుఖమును పొందినట్టేదే  

ప్రేమమ్మే విద్యా ఉద్యోగమ్ము సహన చరిత సమకళల తొ జీవితమ్మేగా
సామమ్మే నిస్సత్తు న్నిస్సహణము వచనముల పస కనుక ధైర్యమే సేవా 
సామిప్యమ్మే సాదృశ్వాసా కలయక తలపు మనసు వినయసంపదా సాహి 
త్యమ్మే ఉద్బోదా వీరత్వమ్ము మనిషిగ నిలిపి వెతలు కనకా మనోతత్వం 
        
--(())--



న  న  న  న  న  న  న  న  గ  జలధరవ -14 
నేటి  కవిత్వం - శరాత్ సరసత  
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

తరుణి కిరణములు మెదలగ పతి హృదయము సరసత మెరయున్ 
విరిసిన కమల కనుగవ వలపు నలుపు దొర విదిత విరిసెన్   
కరకమలములను గదలవలి కినుకు లయ మురళి మధురమున్    
సరసత  బలుకుచు నమృతమును సలిపెడి చెలువపు వలపులన్ 
మద యువతుల రతి కలహపు  సుమ లయల హొయల మది విరిసెన్
మదముల జయమును కను గొనిన మురహరుడు చిరునగ వెపుడున్ 
వదన సుమ దళముల  పిలుపు నవ తలపుల మలుపులు మదిలోన్ 
హృదయము సతతము కరుణయు సహనము తెలుపు తరుణమగున్ 

కుసుమ శర శరసమరముల మకుటములు చలి గిలియు యనుచున్  
బిస రహ నయనముల పడచుల బిడియ కులుకుల చిరునగవుల్   
మిసిమిగల చనుల ఎరుపులు అమితముగ  కదలిక పిలుపులన్   
పస యురమున గలుగుదొరను ఉపకరములు వయసు బిగువుకున్ 

--(())--

image

  భ  న   జ  య   జ   న  న  స  గ ...12  భాస్కర విలసిత 
 UII III  IUI  IUU  IUI  III  III IIU U 
కాలము తిరుగుచు ఉండు మనోకాలమే చిలికి వణికి కదులుచుండూ 
పల్లమునకు జలమే జరిగే పంచవన్నె  చిలక పలుకు మనసంతా 
చల్లని పిలుపు వలే కలలే చిత్ర మాలికలుగ కదలి పెనవేసే     
ఎల్లరు  కలసి మనస్సు కథల్లే  తపించు తపనలు తెలుపుట కాదా 

మారదు మనసు తపించు మనోమాయవల్ల సకల విషయమును తెల్పే 
కోరెను వినయ విధేయత పక్కా సరాగ పలుకు తొ తనువును పంచే 
మారక వయసును పంచు కమతమ్మే సకాల సమయమున మనసు పంచే 
తోరణములుగ మనోవెలుగే తెల్పి నిత్య సుఖమును బడయుట కాదా   




WORLDSELFIEPAGE: God loves art painting

న  న  న న  న భ  భ భ  గ .... బంధుర ..15  
III III  III III  III UII  UII  UII  U   

కలకలమె కను మరుగవుట కనికరం కమణీయముగా సము పా 
ళ్లలొ కలకల నడుమ కల నగవుల కాపురముండుట కోమలి కు  
చ్చులకును వరుస వలపులను ఒకరి కోసము ఒక్కరు బత్కుటయే 
మలపముల తొ మునిగి మునిగి సగము పాలను తాగుటయే 

కదులు జలములొ తరువులు కదలి బింబము లాగయు జర్గుణులే 
కనులు తిరిగినప్పుడు పుడమి తిరిగినట్లును తెల్యక ఉండుటలే 
గుణకరుని విషయమున చెడు తిరుగు కాలము బట్టియు మార్పులులే 
మనసు చలనమువలె తిరుగుచునె ఆత్మయు గూడను తిప్పనులే 

कृष्ण माता यशोदा से - माता राधा संग जाँऊ मैं । राधा संग खैलुँ । राधा संग गाँऊ मैं । राधा संग खाँऊ।  माता यशोदा कृष्ण से - कृष्ण तु है भोला - भाला चालू  है  राधा । जबसे मिला राधा से बस राधा भाए।

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి