12, అక్టోబర్ 2021, మంగళవారం

పంచపది

  పంచపది

కడలి పొంగులో కెరటాలు కదలి కదిలె

గాలుల వెల్లువే గల గలలు లె

బ్రతుకు తెరువు గా కదిలేను భయము లేలె 

పడవలో వేటకు పట్టులో చిక్కెలె 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---3


నెగ్గాలో ఓడాలో తెలియక తగ్గును జీవితాన

సిగ్గులేకయు బత్కు బండికి చిక్కులు తెచ్చి తినీ

ముగ్గులోదిగి ఆట కర్పూర మైపోయె జాతినేను

తగ్గలే కయె కథ వ్యధను తెలపకే కదిలేను

అగ్గిలావున్నను ఉదకము అర్పించె ఈశ్వరా ---04


వాయు పుత్రుండ హనుమను వచ్చి నాను

భాను పుత్రుడు సుగ్రీవ బంటు నేను

చెలిమి మీకును మీకును చేయ గాను

అతడు మీరున్న చోటికి నంప గాను

వందనమ్ములు మీకును విన్నపములు ఈశ్వరా --05 


 ఈ మనుష్యులు ఇంతేను।।ఇకను మారు

మానవత్వ మనుగడను।।మార్చ లేరు

మార్గ మనునది ప్రశ్నగా।।మాయ చేరు

తెల్ప లేని జవాబులో।।। తప్పు లేరు

బ్రతుకులో తటస్థమగును ఈశ్వరా ---06


 ఎంత చదివినా మిగులు చూ ।।ఉంచు వారు

వింతగా ఎన్నొ నేర్చియు।।  కిటుకు వారు

సొంత బుద్దియు చూపియు ।।సోకు లోరు 

కొంత తగవు లాటలు చూసి ।।కొట్టు వారు 

సంత కెళ్లియు బొమ్మలా ।। ఈశ్వరా ---07


 ప్రేమ వల్ల సుఖము పంచు కోనేదే  ఇచ్చి పొందేదీ  

మమత తోను బుధ్ధి చక్కని సంస్కారము తెలుగింట ఉంది 

మనసు కాని పరువు బాధ్య తవ్వు టేను బంధం మయ్యేదీ

సమర సన్నాహం సహజ బంధమ్మే స్వేచ్చ సకలమైంది

నమ్మ పలుకులన్ని నయన చూపుల్లా కలుగును ఈశ్వరా 098


నాన్న ప్రేమ కనులు అన్ని।।। నన్ను మార్ఛె

నాన్న  మనసు బాధ అనెది।।। నన్ను గూర్చె

నాన్న ఎదుగుదల కొరకు ।।। నేను నేర్చె

నాన్న సంతోషం కొరకునే ।। నటన చేర్చె

నాన్న నిలిచారు తోడు నాకు ఈశ్వరా ---09


అమ్మ పాలు అమృత మయము మనకు

పోతపాలు పోయ భయము మనకు

పిండి గున్న పాలు అరగ వనకు

చెట్టు పాలు చేష్ట లుడుకు అనకు

ఆవు పాలు అమృత మేఈశ్వరా---10


యెముక ఉనికి విరగనంత వరకే

గృహము ఉనికి ఒరగనంత వరకే

వయసు ఉనికి బలముఉన్న వరకే

లతల ఉనికి వాడు నంత వరకే

ఏమి విచిత్రమో తెలియదు ఈశ్వరా  ---11


గుండె ఉనికి చెదరనంత వరకే

బండ ఉనికి ఉలితగలనంత వరకే

సూర్య ఉనికి నళిని రాక వరకే

చెంద్ర ఉనికి ఉదయ రాక వరకే

ఏమి విచిత్రమో తెలియదు ఈశ్వరా --- 12


వచ్ఛిపోవు ను కష్టాల కడగళ్ళు

కరిగి పోవు ను నష్టాల వడగళ్ళు

మరిగి పోవు ను కడవారి కన్నీళ్ళు

ఆగిపోవు ను విధి విసిరిన సవాళ్ళు

ఈ కళ్లుతో చూడలేని కుళ్ళు ఈశ్వరా----- 13


పట్టిచ్చు కోకుండా దిగమింగే మోగాళ్ళు

పట్టించుకోక దిక్కు తెలియని మనోళ్ళు

బతుకు నే మార్చేందుకు ఉన్న మోసగాళ్ళు

అందకుండా ఆదరిస్తామంటున్న మోసగాళ్ళు

ఈ కళ్ళుతో చూడలేని కుళ్లు ఈశ్వరా ---- 14


బతికిస్తున్న కుక్కలు చింపిన ఇస్తళ్ళు

మనుష్యుల మధ్య గుర్తించే ఆనవాళ్ళు

యువజనులు ఇష్టంగా తిరుగు ళ్లు

పండుగల్లో చేసే సరదా చప్పుళ్ళు

ఈకళ్లతో చూడలేని కుళ్ళు ఈశ్వరా----- 15


జాప్య మందు జపము చిచ్చు వద్దు 

కామ్య మందు కష్ట పెట్ట వద్దు 

భావ్య మైన భవిత మరువ వద్దు 

శ్రావ్య మైన శాంతి వదల వద్దు 

ముంగి టందు ముగ్ధ మాయ ఈశ్వరా  --- 16


నడక తప్పి నాట్య మాడ వద్దు 

నడత మార్చు నిన్ను తెల్పు హద్దు 

పడక వల్ల పలక రింప వద్దు 

బడిత పూజ బోధ యగుట ముద్దు 

మడమ తిప్పి మాయ వద్దు ఇశ్వారా   ---- 17


మంచి జేయ మనిషి మాయ జేరు 

మంచి పనియె మనసు యశము మారు  

కత్తికంటె కలము గొప్ప తీరు 

ప్రేమదీప్తి ప్రియము అగుట వేరు ---

జనులకెపుడు శాంతి ధరణి ఈశ్వరా ----- 18


ఒకరి కొకరు ఓడి గెలుచు నిజము 

సాయ మనిన సాము అగుట శుభము

దయను పంచు ధర్మమగుట కలము   

బుద్ధి వళ్ళ భక్తి పెరిఁగి జయము

శుభము వల్ల శాంతి సౌఖ్య మీ ఈశ్వరా ------ 19


నాడు ఉన్న నాటి నోడు లేడు 

నేడు అన్న నేటి మేటి లేడు 

వాడు కున్న వాటి నొదల లేడు 

వేడు కున్న వరుస గలఁప లేడు 

నాడు నేడు ఆడి తప్పను ఈశ్వరా  ----- 20


నేను నన్న నేది నీది కాదు 

నీది నన్న నేది నాది కాదు    

నీది లేదు నిజము కానె కాదు 

నాది లేదు నటన కానె కాదు 

నాది నీది నరక మైనదే ఈశ్వరా  ----- 21


అందరి వలెను ఆడపిల్లను 

ఆదరణ అణుకువ నౌతాను 

దూషిస్తే కాళి నౌతాను

దుష్టులలో దుర్గ నౌతాను  

మనసు పంచి పెంచు ఈశ్వరా ----- 22


దారి చూపు లక్షణముగాను  

కౄర జనారణ్యము నందును 

దారి రక్షణ లాంతరు గాను 

తరుణిగా ధైర్య మపుతాను

రేపటి వెలుగు నీవే ఈశ్వరా    --23


వర్చస్సుగ శక్తి నౌతాను 

చీకటి తార మెరుపౌతాను

ప్రకృతి లో బ్రతుకు నౌతాను

పుడమి తల్లి జీవమౌతాను

కడలిన కలియు నదే ఈశ్వరా ---- 24


మనసులోన మమత నౌతాను

మనుగడకే మార్గ మౌతాను

మనస్సునే  స్థిరపరుస్తాను  

నిత్యము సత్యము పలుకుతాను

వివేకం పంచి పెంచు ఈశ్వరా    ---25


హృదయ మక్కటికమ్ము,  

చిదమర శిఖరమ్ము,

ఫక్కియు నజడమ్ము  

వరద కెపుడు ఇమ్ము 

నన్ను కావుము ఈశ్వరా -----26


నన్ను గనుమ యమ్మ  

నలువదేవుని గొమ్మ,

నిన్ను గొలుతు నమ్మ  

నిజము నమ్ము వమ్మ 

తెల్పుతున్న ఈశ్వరా    ----27


మనసులో మలినమ్ము తొలిగితే మనుగడే న్యాయముగా  

కన్నీటిలొ కఠిన శిలలన్ని  కరిగితే జయమేగా

హృదయాలు ఒకటిగా మారితే శృతులన్ని శోభలుగా 

మనిషి వేదన లన్ని  వేదాంతమైతేను ఆచార్య గా

ఊరు తండా గ్రామము నగరం ఊయలే ఈశ్వరా -- 28


అమ్మా బాబు నమ్మేదేదో

చూసే వారూ చెప్పే దేదో

చేసే వారు చేసే దే దో

డబ్బు చుట్టూ కదిలే దేదో

మనసు చుట్టూ కదిలేదే ఈశ్వరా --- 29


మోక్కుబడిగా గుడి దిబ్బెనలో

కానుకలుగా పెళ్లి  సంబరంలో

వరుడికి మట్ట చెప్పే కట్నం లో

కోర్టుకు కొట్టే జరిమానాలో

డబ్బే డబ్బు। డబ్బే డబ్బు ఈశ్వరా ---30


పని వాళ్ళకు కూలీలే

ఉద్యోగులకు జీతాలే

పనులకు పంచు లంచాలే

సర్వరుకు ఇచ్చే టిప్పులే

డబ్బే డబ్బు డబ్బే డబ్బు ఈశ్వరా ---31


కాలంతో బతకా లన్నా 

ప్రేమ లన్నీ చిగురించాలన్పా

పెద్దలను బతికించాలన్నా

జీవితం సాగాలన్పా

డబ్బే డబ్బు డబ్బే డబ్బు ఈశ్వరా ---32


అలుపెరుగని పోరాటము ఆశ చుట్టు

గాలి వాటము తోడు గాల లో పట్టు 

జీవి జలపు పుష్పాలు పెట్టె జయపు గుట్టు  

ఎండ వానలు వున్నయదను చూపెట్టు 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---33


ఒడిదుడుకులుగా ఎదురైన ఓర్పు 

పడవ లొదిలి పోక పలుకు పాట నేర్పు  

గగన మార్పులు గమనించి కదిలె కూర్పు 

పడవ లో అష్ట కష్టాలతో సాగు జీవి తీర్పు 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---34


నేడు ఆకాశము న మేఘ   నాట్యమయ్యె

గుండెజారి భయము గుబులు అయ్యె 

చినికు చినుకు పెద్దదిగా ను చింత లయ్యె 

కన్నీటి బొట్టుతో  కళ్ళు చెదిరె పొయ్యె 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---35


పడవను కడలి కాటేసె పగిలి తేలె

బతుకాలి జీవుడై భారముగా కదిలె 

దైవ నియమ ము ఈదుతూ  దరిని తేలె 

సతినిచేరి కధలు సెప్ప  బతుకు లేలె 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---36


మమత మత్యకారుల తెల్వి మహిని నమ్ము   

మనసును పంచియు  మేలు జేయు అమృతమ్ము 

నాని పోయేటి జీవితం  నాది కాదు అధరమ్ము 

నలుగురి తిండికే  నా తపనలు బతుకమ్ముఁ 

కడలిపై బతికే జీవలీల ఈశ్వరా ---37


అమ్మానాన్న ల ప్రేమలో నేను

అల్లరి ఎక్కువగా చేస్తాను

మా నాన్న కోపాన్ని తగ్గిస్తాను

మా అమ్మ ను మాటతో ఊరిస్తాను

అయినా నన్ను కొడతారెందుకో ఈశ్వరా।।।38


ఎంత అందంగా ఉందో అంబరము

మేఘాల తో నిండిపోయింది అంబరము

మేఘాలు కురవంగ అందరికీ సంబరము

బుగ్గలు పట్టి చెపుతున్నా ఈ సమయము

నామాట నమ్ము వారు లేరు ఈశ్వరా।।।।39


వెన్నెల వేళలో మేము ఆడు తాము

చల్లని గాలిలో మేము తిరుగుతాము

అల్లిబిల్లి అంటూ మేము పాడుతాము

కొట్టుకుంటూ ఆడుకుంటూ మేము వుంటాము

అయినా మాలో పోట్లాటలే ఈశ్వరా।।।।।40


 సాధ్య పడని సమయ మేమి లేదులే

యత్నమంత యావి రవ్వక ఉండులే

తలను మార్చ దలచతగువె లేదులే

బ్రహ్మ రాత పదును మారేది లేదులే

సాధ్యమైన సరళ జాడ లేదులే ఈశ్వరా।।।41


వినయ మెపుడు విలువ చూప లేరులే

ఎదుటి వ్యక్తి ఎపుడు గొడవ లేదులే

మౌన మిడువ మంచి పలుకు లేదులే

సౌమ్య మింక సాగ గుండు వేళలే

మనసు పెట్టి మమత లేదు ఈశ్వరా।।।।42


మనసున మల్లెల మాలలూగెనే

సొగసున జల్లెడ జాలి లూగెనే

వయసున చల్లని గాయలూగెనే

తెలిసిన వెల్లువ ఛాయలూగెనే

తెజస్సు మహత్యం భలే ఈశ్వరా।।।।43


ఎందుకే నీకింత తొందరా

చేయకు చిందర బందరా

ఆకలి తీర్చుము ముందరా

ఆశలు తీరును విందురా

బత్కులో వచ్చే మాయే ఈశ్వరా।।।44


అలలు కొలనులో గలగల మనినా

కధల మలుపు లో విలవిల అనినా

వెతల కొలువు లో ధగధగ కని నా

కలల తలుపు లో విధి నిధి వినినా

లోలక జీవితమే కదా ఈశ్వరా।।45


దసరా పద్యాలు - పంచపాది 

----------------------

ఇంటింటికి గుంపుగా విద్యార్థులు జయీభవా 

అంటూ వెళ్లి పాడుకున్నాము  విజయీభవా

పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టి దిగ్విజయీభవా!!

జయాభి జయీభవా, విజయీభవా, దిగ్విజయీభవా!!

జయీభవా, విజయీభవా, దిగ్విజయీభవా ఈశ్వరా !! ---46


దసరాకు వస్తిమని విసవిస మని అనక !

చేతిలో లేదనక  ఇవ్వలే మనక !

ఇప్పుడు లేదనక, అప్పివ్వరనక!

రేపురా,మాపురా ,మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులే ఈశ్వరా ---47


జయాభి జయీభవా, విజయీభవా, దిగ్విజయీభవా!!


పావలా,బేడైతె పట్టేది లేదు!

అర్థ రూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటామ్ ఈశ్వరా। ---48


అయ్య వారికి చాలు ఐదు వరహాలు!

పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు చాలు చాలు !

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులే పాలు 

జయీభవా, విజయీభవా, దిగ్విజయీభవా ఈశ్వరా !!--49

జయాభి జయీభవా, విజయీభవా,  దిగ్విజయీభవా!!


అమ్మ ప్రేమ ఎంత తెల్పి నా తక్కువే

ఆశలన్ని తీర్చు అమ్మలో ప్రేమ ఎక్కువే

భర్త పిల్లలపై ఉండు నిత్యము మక్కువే

మనస్సు బట్టి అమ్మ పలుకులు మక్కవే

సర్వం ఆదిశక్తి బిడ్డలమే ఈశ్వరా...  50


 జీవితంలో పరీక్షలు జిలుగు జిలుగు

గెలుపు ఓటముల ఫలము కలుగు కలుగు

మంచి చెడులలో మనసుయే మునుగు మునుగు

తప్పు ఒప్పులు మధ్యనే తపన కలుగు

మది లొమహిమయే  స్థిరత్వమగును ఈశ్వరా----- 51


ప్రేమ కార్య మెపుడు కమనీయం 

ఆచరణ కర్తవ్యం కఠినాతికఠినం  

సలహాలు తెల్పడం సులభతరం 

నిత్యమూ ఆచరణం మహాకఠినం

అయినా దైవాన్ని కొలవడం ఖాయం ఈశ్వరా  --- 52 


మాటల్లో దోష మెంచటం సులభం

మాటల దోషాన్ని తప్పించటం కఠినం

తెలివితో ప్రతి మనసు మరిపించటం 

మనసునే బతికించటం మాత్రం కఠినం 

అయినా దైవాన్ని కొలవడం ఖాయం ఈశ్వరా ---53


చాకచక్యంతో విషయాన్ని తప్పించటం 

ప్రేమ బంధంతోనే బంధ విముక్తి  కఠినం 

ఒక్కరొక్కరు ప్రేమతో మాట్లాడటం సులభం 

అందరిలో ప్రేమను నమ్మించటం కఠినం 

అయినా దైవాన్ని కొలవడం ఖాయం ఈశ్వరా --- 54


జీవ కణాలు మనోజ్ఞంగా 

నిరంతరం సహాయముగా 

సహకారం అందిస్తుండ గా 

ప్రేమను పంచే మనిషిగా

జీవిత పరమార్దమే ఈశ్వరా  ------ 55


ప్రాణం జీవంగా ఆత్మ తోడుగా 

నడవటం మృత్యువు పిలుపుగా 

నిత్య సజీవ కిరణంలా ఉండాగా 

స్నేహసంతకాన్ని సద్వినియోగంగా 

జీవిత కళలు పరమార్దమే ఈశ్వరా----56


జీవిత వలయం లో చిక్కాను 

ఆత్మ నీడలో బ్రతుకుతున్నానుఁ 

నేత్ర జ్వాలల్లో జ్వలిస్తున్నాను 

మనసు క్షేత్రాన్ని మధిస్తున్నాను   

మనసు గొప్పతనాన్ని తెల్పే ఈశ్వరా ----- 57


ప్రతి పుట్టుకకు సాక్షి ఎవరో తెలియదు  

పుట్టుకకు కామ్యం అనేది తెలియదు 

పుట్టుక ఎవ్వరికొరకో అస్సలు తెలియదు 

తెలిసిందల్లా తల్లిదండ్రులను మరవరాదు   

తెలిసిందల్లా సర్వకళలను నేర్పేది ఈశ్వరా ---58


మంచి జరుగు మహిని వెలుగు నీడ

నీడ గాను నిన్ను మార్చు జాడ

జాడ లేదు జాడ్య మయ్యె మాడ

మాడు లేక మడమ తిప్పె వాడ 

వాడ వదల లేక ఏడుపేల ఈశ్వరా......59


ధర్మ నిష్ఠ ధర్మ చింత నొసగు

నొసగు భార్య నంటి నడక ఒసగు

ఒసగు కధల ఓర్పు తెలిపి పిడుగు

పిడుగు వలెను భయము తెలిపి నడుగు

నడుగు లేక నరక మెంట ఈశ్వరా.....60


సాగు మేలు సర్వ జనులు కిడగ

కిడగ కదలి కీడు అనక ఒరగ

ఒరగ మేలు విశ్వ భావ మెరుగ

మెరుగ కదలి మెరుపు గొలుపు నిడగ

నిడగ వెంట నీడ నుండు పడగ

పడగ లాంటి బతుకు ఏల ఈశ్వరా....61


ఉపకరించు నొప్పి జగతి కెపుడు

కెపుడు అనకు కీడు పలుకు ఇపుడు

ఇపుడు నిన్ను ఈశ్వ రుండు చూడు

చూడు మనసు జడపు వయసు జూడు

జూడు బతుకు జతను ఇప్పుడు ఈశ్వరా....62

 

  శక్తి రూపిణీ దివ్య వరదాయ ఖడ్గ ప్రదాయిని

స్వర్ణ మాల విరాజి అపార తేజ విజృంభిణి

శ్యామ వర్ణశరీరిణి సువిశాల త్రినేత్రిణి

అగ్ని జ్వాల ప్రజ్వలిని గార్ధాభ విహారిణి

దుర్గా దేవికి అర్ధభాగం అర్పించిన ఈశ్వరా....63

 

అడగని వారికి ఇచ్చే సలహా లు 

ఆసక్తి లేనివారికి నేర్పే విద్య లు 

స్వార్థపరులకు చేసే సహాయాలు

సముద్రం మీద కురిసే వానలు 

ఇది ఏమి సృష్టి అర్థం కాలేదు ఈశ్వరా   .....64


 నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు,

తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు

ఉన్న నిజాన్ని తెలియ పరిస్తే  పిచ్చోళ్లు

ప్రేమ అంటూ తిరిగితే అట్టివారు వేర్రోళ్లు

నిజాలు ఉండని నటనలే వున్నాయి ఈశ్వరా...65


మనిషి  లో మంచిని పరిచయం

మంచిగా బతకటంలో  గొప్పతనం  

నిలపెట్టు కోవడంలోనే విజయం   

ఎక్కడ అహంకారం అక్కడ పతనం 

ఇది ఏమీ జీవి లీలలు ఈశ్వరా


బతుకమ్మ బతుకమ్మ ఊగేను ఉయ్యాల
బంగారు బతుకమ్మ చేసాము  ఉయ్యాల
ఆకాశ దేశాన ఊగేటి ఉయ్యాల
అలవి గానీ శక్తి పంచేటి ఉయ్యాల
పృథ్వి గా మారింది  ఉయ్యాలే ఈశ్వరా......67

ప్రాణమే దాల్చింది మా యింట ఉయ్యాల
జీవులై మెరిసింది ఉరికింది  ఉయ్యాల
సృష్ఠిగా చూసుకుని సాగేటి  ఉయ్యాల
బంగారు కాంతిలో వెలిగే టి ఉయ్యాల
బతుకమ్మ అయ్యింది మా యింట ఈశ్వరా....68

బ్రహ్మమే మెరిసె సత్యమైన ఉయ్యాల
ప్రాణి కోటిగతాను ఆనంద ఉయ్యాల
ఊపిరులె ఊదేను మాఅందరిలో ఉయ్యాల
ఆకాశమూ భూమి ఏకమయ్యె ఉయ్యాల
సయ్యాటలాడేను ఉయ్యాలే ఈశ్వరా....69

ఆకసమె వాయువై సుఖము గా ఉయ్యాల
ఊయలూపిందమ్మ మాయమ్మ  ఉయ్యాల
వాయువే అగ్నిగా మారేది ఉయ్యాల
తేజమై మెరిసింది సవ్యంగా ఉయ్యాల
తేజమే జలములై ఉయ్యాలే ఈశ్వరా....70

పరుగెత్తి కురిసింది మెరిసింది ఉయ్యాల
జలములే పృథ్వి కీ స్నహమైన ఉయ్యాల
పురుడు పోసిందమ్మ నిత్యము ఉయ్యాల
రూపమే దాల్చిందమ్మ మనసు ఉయ్యాల
బతుకమ్మ నిలిచింది ఉయ్యాలే ఈశ్వరా ...71

ఆకాశ పుష్పమై సాగింది ఉయ్యాల
భువి తాను వెలసింది కలలాగ ఉయ్యాల
గంధాలశక్తిలో సవాసన ఉయ్యాల
పరిమళించిందమ్మ విశ్వాస ఉయ్యాల
జలములా శక్తిగా అందించే ఈశ్వరా....72

రసనమే మేల్కొంది వెల్గుగా ఉయ్యాల
తేజపూ శక్తిగా  కవులుగా ఉయ్యాల
దృష్టి  నిలిచిందమ్మ కళలతో ఉయ్యాల
వాయువూ శక్తిగా అంబరాన ఉయ్యాల
స్పర్శనే చూపింది ఉయ్యాలై ఈశ్వరా.....73

ఆకాశ శక్తిగా పొందేటి ఉయ్యాల
శబ్దమై వెలసింది పృధ్విపై  ఉయ్యాల
బ్రహ్మ శక్తీ తానుగా వెలిగే ఉయ్యాల
బ్రాహ్మియై వెలసింది సౌఖ్యము ఉయ్యాల
పంచభూతములైదుగా ఉయ్యాలే ఈశ్వరా...74

పంచశక్తులకాదిగా ఉన్నాది ఉయ్యాల
దశ ఇంద్రియాలైనవీ పంచేటి ఉయ్యాల...
దేహమే దాల్చినాదీ సర్వమ్ము ఉయ్యాల
దేవతే వచ్చినాదీ పూజలే ఉయ్యాల...
జీవుడై దిగివచ్చినా అమ్మతోడు ఈశ్వరా...75

శివునకూ ప్రాణమే పోసీనదీ అమ్మ ఉయ్యాల...
స్థిరముగా నిలచినట్టీ అమ్మ ఉయ్యాల
శైలమే తానవ్వగా అమ్మ ఉయ్యాల..
మనసనే మహిమనూ పంచు అమ్మ ఉయ్యాల..
బుద్ధిగా తానైన అమ్మతో  ఈశ్వరా..76

సమయించి చూసినట్టీ అమ్మగా ఉయ్యాల
చిత్తముగ నిలచీనదీ అమ్మగా ఉయ్యాల
అహమంటు ఇహమంటునూ అమ్మగా ఉయ్యాల
అద్దాల ఆటాడగా అమ్మగా ఉయ్యాల...
వెలుగు చీకట్లు అమ్మతో ను ఈశ్వరా ..77

వేరు లేనీ ఆటలూ అమ్మ ఆడే  ఉయ్యాల
పాపాయిలే జోలపాడే ఆమ్మ ఉయ్యాల 
బతుకమ్మ మా కంటిలో దీపమైన ఉయ్యాల 
పాపాయి తానైనదీ అమ్మగా ఉయ్యాల 
ఈ భువిని పాలించె అమ్మకు తోడు ఈశ్వరా...78


 కౌముది : నతతగ
కలము తో కావ్య సంతృప్తి గా  
బలము తో ధైర్య సంఘర్షి గా 
కులము లో ముఖ్య జీవాత్మగా 
తలము లో విశ్వ సాహిత్య గా 
ఫలము లో మార్పులేల ఈశ్వరా ---79
నరజగ  -- మనోరమ --6

కలము తో లిఖిత్వమే సుఖం 
బలము తో సమత్వమే భయం 
కులము లో సమానమే జయం 
తలము లో విశాలమే నయం 
ఫలము లో మార్పులేల ఈశ్వరా ---80

న భ భ ర -6 
కలము చెల్లఁక ఇప్పుడు కష్టమే 
బలము దేహము యందునె నిల్వదే  
కులము మార్చక ఉండుట ఇష్టమే 
తలము తత్వత పోభయ మవ్వుటే 
ఫలము లో మార్పులేల ఈశ్వరా ----81

భక్తిచే శరీరము పులకాంకితము
ద్రవింపవలెను హృదయము. 
ఆనందాశ్రువులు స్రవించుము 
అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధము
భక్తిచే కంఠము గద్గదమగు టే ఈశ్వరా ----82. 

భక్తిచే చిత్తము ద్రవించును.
దర్శనమునకై గట్టిగా ఏడ్చును
బిగ్గరగా ఆ ప్రభువును కీర్తించును
దృఢభక్తిచిత్తుడు ఈ లోకము నమ్మును  
తనలోతాను నవ్వుకొనుటే ఈశ్వరా -------83     

ఒడలు మరచి నృత్యము చేయును
కాటుక తో నేత్ర దోషములు తొలగిపోవును
వస్తువులు స్పష్టముగా కనబడును
చిత్తమాలిన్యములు తొలగిపోవును 
వాస్తవతత్త్వము బోధపడుటే ఈశ్వరా ------84

శాస్త్రం లోకానికి సంబంధించింది. 
ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది
శాస్త్రంలో పరస్పర భేదాలతో నిండి ఉంది  
భేద భావాలను, భావ భేదాలతో విచారమైంది 
మనస్సు  భావముల సక్రమంగా ఉంచు ఈశ్వరా  ---- 85

ఆదర్శ భావనవల్ల కలిగే భయాలను, 
అహంకారం కల్పించే జీవ పరిమితులను  
మనసును బంధించే దేహాత్మబుద్ధిలను  
అఖండశాంతిని కోరే మనుష్యులను  
మాయాజాలం చేసే మనుష్యులే ఈశ్వరా   ---86


పెద్దదైనా, చిన్నదైనా కోరిక వంచన,
భ్రాంతి, వైరుధ్యం, కలల పంచన 
సాధించాలనే విజయకాంక్ష మనసున 
మంచి, చెడు చైతన్య ప్రక్రియ విధాన  
తృప్తి, అసంతృప్తి మధ్య మనుష్యుడే ఈశ్వరా ---- 87

ధృఢ నిశ్చయం పెంచు ధైర్యం 
నేర్పు జాగ్రత్తగా ఉంటేనే  ధైర్యం
అంతస్సాక్షిని నమ్మినా కల్గు ధైర్యం 
నీడ చూచి నేనే భయపడక పొందే ధైర్యం 
మానవ ప్రయత్న మీ ఫలము ఈశ్వరా    ------ 88

చింతనము స్వప్నమనోరథములు 
పురుషుడు చిత్తము ఎప్పుడూ భ్రమలు  
స్త్రీల సాంగత్యము వల్లనే క్లేశములు
ప్రేమ బంధ సాంగత్యము లంపటములు 
జితేంద్రియుడై సావధానముతోనే ఈశ్వరా ----89 

ఇంకుడు గుంతలు తవ్వేద్దాం 
చెరువులు పూడిక తీసేద్దాం 
వర్షపు చుక్కను వడిసి పడదాం 
పంటలు పండించు కుందాం 
వర్షం కోసం వేచి ఉంటాం ఈశ్వరా   ------- 90

మనశాంతి మంటల్లోను 
రైతు కళ్ళల్లో నీరేను   
మనుష్యులు జీవచ్ఛవంగాను 
నదులు కలల అలలుగాను 
కన్నీరే ఆవిరైపోతుంది ఈశ్వరా    ----- 91

సముద్రాన్ని తెప్పిస్తా 
ఆకాశాన్ని మీ కందిస్తా 
సూర్యచంద్రులను మార్చేస్తా 
గాలి, నీరు, నిప్పు, మీకు తోడు తెస్తా   
వినాయకుల వాగ్దానాలు గా ఈశ్వరా  ----92

దేశాలన్నీ తిరిగొచ్చాను 
భాషలన్నీ నేర్చు కొచ్చాను 
ఆంగ్లం గొప్పని మీపై రుద్దాను 
మాతృభాషను మంటలో దాస్తాను 
వినాయకుల వాగ్దానాలు గా ఈశ్వరా   ----93

శిలాఫలకాన్ని మాట్లాడిస్తా 
కొంపలార్పే రక్షణ ణిస్తా 
మనుషుల్లో మాయను తరిమేస్తా 
మాటల్లో మంటను సృష్టిస్తా 
వినాయకుల వాగ్దానాలు గా ఈశ్వరా  ----94

అచట ఆనాడు ముత్యాల జల్లు 
అచట ఆనాడు భాష్యాల జల్లు 
అచట ఆనాడు కావ్యాల జల్లు 
అచట ఆనాడు ప్రేమల జల్లు 
అచట ఈనాడు కత్తుల జల్లు ఈశ్వరా ----- 95

నా గీతం లోకం తిరుగుతుంది 
నా వైనం దేశం సహనమైంది 
నా మార్గం ప్రేమా విషయమైంది 
నా గమ్యం సేవా ప్రతిఫలమైంది 
న గుండెలో ఘూర్జనులైనవి ఈశ్వరా ----96

గురువు అంటే నేర్పించేవాడు కాదు
శిష్యుడు అంటే నేర్పించబడేవాడుకాదు 
నిజానికి ఎవ్వరూ ఎవ్వరికీ ఏ విద్య రాదు   
'నేర్పరితనం' చూసి నేర్చుకునేది కాదు 
సాధన క్రమంలో విద్య ప్రయాణం ఈశ్వరా ---97

 ప్రజా ప్రతినిధి అనగా
ప్రజల ప్రతి నిధి పొందటమే గా
ప్రజలకే సుఖమనగా
ఓట్లకు భిక్షమివ్వటమేగా
ప్రజారాజ్యం అంటే ఇదేనా ఈశ్వరా..........98

నూనే లేదు ఇంకా నలుగు పిండా
శాంపోతో జుట్టే ఊడె ఇంకా కుంకుడి పిండా
వయసు వచ్చి నా బుధ్ధి కంప్యూటర్ అండా
తినేది కృత్రిమ గుండె లాంటి అండా
ఈ మాయను మార్చేదెవరు ఈశ్వరా......99

గడిచిన సమయం కోసం సోకించకు
భవిష్యత్తు గూర్చి ఆలోచించకు
జరిగే దాన్ని గూర్చి విచారించకు
నమ్మక దృష్టి తో బ్రతికించి బ్రతుకు
సమయ తెలివిని మనిషిలో ఉంచు ఈశ్వరా...100

వయసు కు గౌరవం ఇచ్చుట
గుణాన్ని బట్టి ప్రేమ పంచుట
సత్య వాక్కు బట్టి నడుచుట
ధర్మాన్ని అనుసరించి బతుకుట
వంశం, కాదు మంచి గుణం పంచు ఈశ్వరా...101

గురువులనారాధిస్తూ  
మాతృభాషలో పలకరిస్తూ  
అమ్మనాన్నలనాదరిస్తూ
చదువులతల్లికి నమస్కరిస్తూ
సెల్ వల్ల చదువులు పోయే ఈశ్వరా --- 102

వనములో పూసిన మల్లె పూవల్లా 
నవ్వులొలికే సిరి సిరిమువ్వల్లా
ముద్దులొలికే ముద్దబంతిపువ్వల్లా 
మనసును మెచ్చే మందార పువ్వల్లా  
పువ్వుల్లా ఉండాలనుంటే ఉంచరు ఈశ్వరా---103

వెలుగు దివ్వెలయ్యాము 
గుండె చప్పుళ్ళయ్యాము  
ఇంట సిరిసంపదయ్యాము
విజ్ఞానమే పొద్దుగా అయ్యాము 
భావి భారతపౌరులయ్యాము ఈశ్వరా ---104

నే స్కూలు బట్టలూ వేసుకున్నా 
ముఖముకు పౌడరు అద్దుకున్నా
నేను టై బెల్టులు పెట్టుకున్నా 
షాక్సలు బూటులూ తొడుగుకున్నా
తెలుగు కావాలంటే చెప్పఁరే ఈశ్వరా --104
 
మేము దేశ పౌరులయ్యాము 
మేము స్వర్ణ మకుటమయ్యాము 
మేము కంటి రెప్పలయ్యాము
మేము వెన్నెల కాంతులయ్యాము 
శాంతి కాంతులయ్యాము ఈశ్వరా  ---105

తెలుగు భాషకు వెలుగునిద్దాం
ఆంగ్ల భాషను తరిమి వేద్దాం 
శాస్త్రాలన్నీ చదువుకుందాం 
నిత్యమూ జ్ఞానం సంపాదిద్దాం
చదువులో స్వేశ్చ లేదే ఈశ్వరా --106

ప్రేమ సాగరం.........!!!

వయసు వలపుల తలపు తలుపుల
తన్మయ తెరల లో దాగే తికమకలు  
తెరుచుకొని వేచి వున్న ఎగ సెకలు  
యుండె యవ్వనం లో ఉరకలు  
తీరాలు దాటే కెరటాలు మోహనా  --107

తీరికగా ప్రేమ గీతానికి రాగాలు 
శృతి మెత్తటి విపుల సూరాగలు   
తాళమైనా మనసును పల్లవులు 
పలకరింపులో పాదాల కదలికలు 
పల్లవించే మృదు మధురం మోహనా   ---108

మోహించే మదన మోహనరాగాలు 
సమ్మోహన పరిచే  శృతి స్వరాలు 
అనుభవించే శృంగారం గీతాలు 
తన్మయము చే రాగ బంధాలు 
వినిపించే ప్రియరాగలు మోహనా ---109

రతి కాలపు మన్మధ ఘడియలు  
మోహించే బిడియ పు పువ్వులు 
స్వీకరించ తన్మయంతో సిగ్గులు 
వలపించె వేణు గాన సంగీతాలు 
కలాపంలో కాలం తెలియదు మోహనా   110

వినిపించే ప్రేమరాగ మాలికలు 
కనిపించే హృదయరాగ జతలు   
సమ్మోహన భరిత  కదలికలు 
ఒక భావనకు మరో ఆలోచనలు  
సమ్మోహనంతో ఒకరికొకరు మోహనా  ---111

పంచపది -- ఆప్యాయత 

"అమ్మ" లో  ఆప్యాయత పిలుపు
"నాన్న"  నమ్మకం మలుపు 
"తాత" లో తన్మయత్వంచ తలపు
"అమ్మమ్మ" లో అభిమానం పిలుపు 
"నానమ్మ" లో నవ్వు ముఖం మెరుపు ఈశ్వరా...112

"అత్త" లో ఆదరణ అరుపు
"మామ" లో మమకారం మలుపు
"బాబాయ్" లో బంధుత్వం అరుపు 
"చిన్నమ్మ" లో చనువు జరుపు
"అన్నా" లో అభయం అదుపె ఈశ్వరా....113

"చెల్లి" లో "చేయూత" తెలుపు 
"తమ్ముడు" లో తీయదనం తెలుపు
"అక్క" లో అనురాగం సలుపు
"బావ" లో బాంధవ్యం జరుపు
"వదినా"లో "ఓర్పు" పిలుపె ఈశ్వరా....114

"మరదలు" లో మర్యాద తెలుపు
"మరిది" లో మానవత్వం మెరుపు
"గురువు"లో  "గౌరవం" మెరుపు
అతిధి లో ఆదరణ మలుపు
అందరిలోనూ నీవే ఈశ్వరా
.115
పంచపది 
తరువు కుండు తపన బతుకు దారి
తరువు వల్ల తెరువు కలుగు దారి
కరువు లోన కాయ లిచ్చు దారి
చెరువు ఒడ్డు చెట్లు ఇచ్చు దారి
పరువు తీయు పండ్లు ఏమి ఈశ్వరా ---116

కంటిలోని గుడ్డు తెల్ల పొరలు
కంట నీరు కార్చు పంట కలల 
కళ్ళ గుండు కళ్ళ జోడు పొరలు
కళ్ళు అలసి గురక పంట నిద్రలు  
కళ్ళ చూపు కన్ను కొట్టుటే ఈశ్వరా ---117

మనసు విప్పి మాట తెలుపు అమ్మ
మనవి చేయు మంచి మెరుపు అమ్మ
తనివి తీర తిండి పెట్టు అమ్మ
పనులు చేసి పాలు ఇచ్చు అమ్మ
మనల తప్పు మనకు చెప్పే నమ్మ ఈశ్వరా---118 

కన్నవారి కలలు తీర్చు తల్లి 
ఉన్న వారి ఉడుకు దించు తల్లి 
మన్ను నమ్మి మనసు తెల్పు తల్లి 
మిన్ను నమ్మి మమత పంచు తల్లి
విన్న పనులు తల్లి విజయమే ఈశ్వరా --119

గడచి పోవు కాల గమన మెపుడు
నడచి వెళ్తె నరము కదులు చుండు
పుడమి తల్లి బయట బడక వుండు 
కడుపు తీపి కాల మంత వుండు
పడక గదికి బలము వుండుటే ఈశ్వరా ---120

తల్లి గురువు తండ్రి దైవ మెండు
తల్లి పలుకు తల్లడిల్లి చుండు 
తల్లి మనసు ధర్మ మగుచు వుండు
తల్లి ఓర్పు ధనము సుఖము మెండు
తల్లి ఎపుడు ధైర్య మిచ్చు చుండుటే ఈశ్వరా ---121  

కష్ట సుఖము కలిసి పంచు నెపుడు
ఇష్ట మైన ఏది వున్న కొనుడు
సృష్టి కర్త సకల మేలు చూడు
నష్ట మైన నాడు ఓర్పు చూడు
పుష్టి కొరకు పుడమి ఫలమే ఈశ్వరా ---122

ప్రాణం ఇది దైవ తీర్పుకు లొంగ వలెను 
మానం మది భర్త నేర్పుకు లొంగ వలెను 
వైనం  కధ భార్య మార్పుకు చెప్పఁ వలెను 
ప్రేమే కళ  నిత్య సత్యము తెల్ప వలెను    
దేహం ఒక దాహ మవ్వుట ఏల ఈశ్వరా ---123

ఈ జాగృతి సృష్టి వ్యాప్తియు జీవి తముకు  
బాహ్య కళ దృష్టి పెర్గును  కాలమునకు
ధర్మాత్ముని సేవ  ఆ కలి  జీవమునకు 
సర్వార్ధము కర్మ బంధము  సౌమ్యమునకె  
కార్యార్థము ధర్మ మవ్వుట  నిత్య సమము ఈశ్వరా--- 124

చిత్తము,-- పంచ పది
 
మెల్ల మెల్లగా సాగు   
అంతర్ముఖమున వెలుగు 
చిత్తము, బుద్ధి లగ్నమగు  
చింతలు మనసున తొలగు 
ఇది ఏమి విచిత్రము ఈశ్వరా  ---- 125

బాహ్య ప్రపంచ వెలుగు  
దివ్యానుభూతి కలుగు 
చిత్త కాంతి స్థిరమగు  
దీర్ఘ ప్రశాంతి కలుగు  
అర్ధం కాని బ్రతుకు ఈశ్వరా ---- 126

మనిషిలో శక్తి కలుగు  
మనుగడకు రక్తి కలుగు 
ప్రేమకూ బలము కలుగు  
ధైర్యముతొ జీవి  సాగు 
ముక్తి లేని బ్రతుకు ఈశ్వరా ---- 127

శుభమైన స్థితి కలుగు  
సాధన శోధన వెలుగు 
నిత్య నగవులోన మునుగు  
జీవితంలో ఇక పరుగు 
కాలంతో బ్రతకాలి ఈశ్వరా ---- 128

--(())--
జగమే మాయ..పంచపది

పంచ పది 
తొమ్మిది కాంతుల తుత్తిని  
రాముడు రక్షణ మెత్తిని 
సోముడు అగ్నితొ వత్తిని 
బీముడు శబ్దపు గాలిని 
కాముడు చేరును మాలిని ఈశ్వరా...129

సూది గుచ్చి రెండును దారంతో కుట్టు
కత్తెర రెండుగా విడదీసి బాధ పెట్టు
స్వలాభం మనిషిని ఇరకాటం లో నెట్టు
రాజకీయం ఆశలతో చూపు రస పట్టు
వృత్తి విద్య కరువై వీధి నా పెట్టు ఈశ్వరా.....130

చీకటి వెలుగులివి .. చిరకాల బంధాలు
ఆకలి పరుగులివి..అరిటాకు వేషాలు
రోగపు కథలు ఇవి.. చిరిగేను దేహాలు
భోగపు కలలు ఇవి.. మెరుపాయె సౌఖ్యాలు
రవ్వల బ్రతుకులివి ... సుఖమేల ఈశ్వరా...131

మనిషి అవసరం .. గాలి నీరు ఆహారం
పనికి అవసరం.. న్యాయ బుధ్ధి ఆస్కారం
ఉనికి అవసరం... ధర్మ నిష్ఠ విజ్ఞానం
బలము అవసరం... యుక్తి రక్తి ఆహ్వానం
మహిళ అవసరం... ప్రేమ పంచు శక్తి ఈశ్వరా...132

మనసుకు కావాలి.. తెలివి, జ్ఞానం, ధ్యానం
వయసుకు కావాలి... బ్రతుకు విద్య, ధ్యాస
సొగసుకు కావాలి ... ప్రేమ పంచు కళ్ళు
బిగుసుకు కావాలి.. రెవిక, హావ భావం
తేజస్సు ఉన్నా సుఖం కరువే అగుట ఈశ్వరా...133

 దారి ఏదో ఉంటుంది .. ఎడారి లోనైన
పోరు ఏదో అయ్యింది... బికారి లోనైన
ఊరు ఏదో చెప్పింది... బినామి గా నైన
పేరు ఏదో చెప్పింది... సునామి గా నైన
ఆరు నూరైనా అర్థం.. మైదానమే ఈశ్వరా..134

మనిషి మనసులను చంపుకొని
దేహ లాభాలను పెంచుకొని
కోప తాపాలతో బ్రతుకే యని
కాల నిర్ణయం కదలిక మాకేనని
సమయాన్ని దుర్వినియోగం చేసే ఈశ్వరా.....136

నిశ్చలంగా నికార్సుగా నిలబడి
ఆకాశం నుండి పిడుగు లా పడి
నిప్పు రవ్వలా ఎగసి ఎగసి పడి
అనుమాన మనిషిగా తిరగబడి
కలల జీవితమైన బడి ఈశ్వరా..137

విత్తం దోచేటి గురువు వుండవచ్చు
చిత్తం దోచేటి గురువు లేకపోవచ్చు
బత్తెం దాచేటి గురువు వుండవచ్చు
బెత్తం చూపెట్టి గురువు లేకపోవచ్చు
లోకంలో గురుశిష్య బంధం తగ్గె ఈశ్వరా...138

 పెద్దల వచ్చినప్పుడు శిరస్సు వంచుతావు
తక్కు వవాళ్లు వచ్చినా ఉన్నతంగా ఉంటావు
నహులు వచ్చినప్పుడు సమానంగా ఉంటావు
అందరిలో న ఔచిత్యాన్ని గమనించే వాడవు
పుత్తడి కరిగినట్ల మనసు గరుగుతుంది ఈశ్వరా..139

 లక్ష్యం మారకుంటే జయం తధ్యం
ధ్యానం మార్చుకుంటే ధనం తధ్యం
సాద్యం అయ్యిందంటే సుఖం తధ్యం
భాగ్యం కల్గిందంటే గుణం తధ్యం
సవాళ్లు ఎదుర్కోవడానికి ఉండే మనిషి ఈశ్వరా....140

అమ్మలుగన్న ముగ్గురమ్మల మూలపు అమ్మ
కమ్మని మాటలే అహర్నిశమే  కళ లమ్మ 
నమ్మకమే నిరంతరం నిలిపే మమతమ్మ 
కమ్ముకొనే విషాద సంఘట మాపిన అమ్మ   
నమ్మకమును ఉంచిన అమ్మకు తోడు ఈశ్వరా  ---141

ధర్మము తెల్పి నిత్యశోభకు మూలము అమ్మ
అర్ధమువచ్చు సత్యమార్గము చూపునుఅమ్మ
కర్మ ను బట్టి ఓర్పు నేర్పును చూపిన అమ్మ
మర్మము యేలఉన్న పాపము చేయని అమ్మ 
నమ్మకమును ఉంచిన అమ్మకు తోడు ఈశ్వరా  ---142

ఆకలి తీర్చి సంతసమ్మును పంచును అమ్మ
సౌఖ్యము చూపి విద్య నేర్పిన దేవత అమ్మ
అక్కసు చూపకే నిరీక్షణతో మమతమ్మ  
మక్కువచూపియే అనేకము చెప్పిన అమ్మ  
నమ్మక ముంచెనే మనోమయ నేత్ర ఈశ్వరా  ---143

కష్టము తెల్పకే. వివేకము చూపును అమ్మ
ఇష్టము గా పనే సకాల ము చేయును అమ్మ
నష్టము అన్నదే ఎకాలము చెప్పదు అమ్మ 
సృష్టికి కారణం  ప్రెమమ్మును చూపెది అమ్మ 
నమ్మకమును ఉంచిన అమ్మకు తోడు ఈశ్వరా  --144

బిడ్డకు  సేవ యుక్తి ముక్తికి మూలము అమ్మ
నవ్వుల మాటలే సకాల ము తెల్పును అమ్మ
సవ్వడి చేయకే సుఖాలను పంచును అమ్మ
తల్లి కి తండ్రికీ సహాయము చేయును అమ్మ
నమ్మకమును ఉంచిన అమ్మకు తోడు ఈశ్వరా  ---145

--(())--
సొగసు చూడతరమా -- పంచ పది 

ఓ ముత్యాల రెమ్మవై  
ఓ మురిపాల కొమ్మవై 
ఓ పున్నమి బొమ్మ వై 
ఓ పుత్త్తడి గుమ్మవై 
సొగసు చూడతరమా ఈశ్వరా ---146

సూపులో అందమువై 
ఎగు సుక్కల్లో చుక్కవై 
సిరి నవ్వులో నవ్వువై  
వంకే లేని మెరుపువై 
సొగసు చూడతరమా ఈశ్వరా ----147

కరిమబ్బులో మబ్బువై  
వరిదొబ్బు లో దొబ్బువై 
కన్ను కన్ను కలిపితివై 
నువ్వు సింధుల్లో సింధువై 
సొగసు చూడతరమా ఈశ్వరా----148
 
సెంగు సెంగు కదలకవై  
జింక పిల్లలా పరుగువై  
నీటిపై తేలే తెప్పవై 
పైకి పైకి దూకే సింగమువై 
సొగసు చూడతరమా ఈశ్వరా---149

విఛ్చుకొన్న మొగ్గవై  
పచ్చిపాలా నిగ్గువై 
మీగడ మెరుపు సిగ్గువై 
వాగుల్లో కదిలే నదివై 
సొగసు చూడతరమా ఈశ్వరా ----150

భూమి తల్లి సాక్షివై 
బిడ్డలకే బిడ్డవై 
సూరీడుకె మెప్పువై 
జిగురు వయసు నీడవై 
సొగసు చూడతరమా ఈశ్వరా  ---151

పసుపు కుంకుమ మక్కువై 
పగలు రాత్రి ప్రియశివై 
చిరునగవు చుందువై 
చిన్మయానంద రూపువై
సొగసు చూడతరమా ఈశ్వరా----152

చక్కనైన చుక్కవై 
చామంతి పువ్వువై 
చెంగల్వ దండవై 
లేతచిగురు ఆకువై  
సొగసు చూడతరమా ఈశ్వరా--153

దేహానికి దాహమువై 
దాహానికి దారిగవై 
దారిగా ధర్మానివై 
ధర్మానికి సాక్షివై 
సొగసు చూడతరమా ఈశ్వరా---154

జగత్తు నందు మిధ్యవై 
మనసుకు బ్రహ్మ విద్యవై 
విద్యతో సత్యవతివై 
వినయంతో విమలవై 
సొగసు చూడతరమా ఈశ్వరా--- 155

((()))
స్త్రీ లో అందం చీరకట్టు 
సంప్రదాయానికి ఇదే మెట్టు
అందానికి అందం మంకు పాటపట్టు
అదే స్త్రీ లకు ఆయువుపట్టు
అమ్మ కు రోజు పట్టుచీర కట్టుటే ఈశ్వరా...156

యుగాలు మారినా మారని అలవాటు
చీరలో చిత్రం చూసే నిగ్రహం కలుగు పోటు
మనుగడకు ఆనవాయితీ అఘూతమంటు
ఏమన్నా భారత స్త్రీ లు అందం చీరెనంటు
సాంప్రదాయ గౌరవంగా ఉండే దేశం ఈశ్వరా....157

పరమేశా దాహ మగునె ఏమని కోరన్
పరమేశా తప్పు అనకు తప్పదు భక్తిన్
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
పరమేశా సేవ పిలుపు మేరకు భావమ్
మాకోర్కలను తీర్చాలి పరమేశా....158

 కలల సొగసు దొరికినంత వరకే
కడలి సొగసు తొణకనంత వరకే
చెలిమి సొగసు ఒలకనంత వరకే
మనసు సొగసు పలకనంత వరకే
చిలిపి తలపు మరగనంత వరకే ఈశ్వరా....159

 మనము గాంచు మహిమ పుణ్య శీలి
కరుణ గుణము కమల పుష్ప శైలి
శుభము కోర శోభ పంచు శీలి
సకల వెలుగు శోభ ఇచ్చు శైలి
ప్రేమ తత్వ ప్రియము పంచు ఘనత ఈశ్వరా...160


ఆకలి విలువ కాలేటి కడుపు‌ తెలుపు
నూకలు విలువ తెల్పేటి పక్షులు తెలుపు
ఆకులు విలువ ఉపయోగి వైద్యుడు తెలుపు
కాకుల విలువ పిండాలు రుచిని తెలుపు 
మేకలు గడ్డి తిని మనిషి ఆహారమా ఈశ్వరా --- 161

పెంచు కలుషరహితమగు ప్రేమ కాంతి
ధనకబీద ల పలుకలో దృశ్య కాంతి
తనివి తీరని పలుకులు ధరణి కాంతి
విశ్వ జళకళ జనితమై విజయ కాంతి
జనులు కోరేటి శాంతి నందించు ఈశ్వరా ---162

 బిడియ పడక భ్రమ పడక భీతి లేక
ఘడియ  సుఖము కోరు పడక ఘోరమనక
వడియము వల్లె వేగియు వేగ పడక
తొడిమ లాగ కులుకుటయే తప్పు నడక
ఆడి పాడి చురుకుగా ను కదిలే ఈశ్వరా ---163

లిం అనగా అన్నీ లయమగుట
గ అనగా బయటకు వచ్చుట
పుట్టు క అనగా ఋణమగుట
మరణం దైవంలో లయమగుట
లింగమై పూజలందు కొనుచున్నావు ఈశ్వరా ---164
(పగలు రాత్రి లా)

తన్నెఱుగుట నన్నెఱుగుట
కన్నెఱుగుట మన్నెఱుగుట  
వెన్నెఱుగుట  పన్నె ఱుగుట
మిన్నెఱుఁగుట చన్నెఱుగుట
విన్న పలుకులు ఎఱుగుటే ఈశ్వరా   ---165

ఆర్జనము లేక చేసెడి యప్పు రోత 
ఆర్జనకు మించి చేసెడి యప్పు వాత 
ఆర్జనను జూసి చేసెడి యప్పు హరిత 
అప్పునుదొరికించు కొనుట గొప్ప రాత 
అప్పలేని బతుకే మంచి అగు ఈశ్వరా ---166

నమ్మి చెడకయ్య కాదిది నవ్వు లాట 
నమ్మ కమ్ము యే జీవితం పువ్వులాట 
కమ్మ నైనట్టి తిండియే కామ్య లాట 
సమ్మతమ్ముగా బ్రతుకులో సొంపు లాట 
వమ్ము కాకుండ వున్న మనిషిగా ఈశ్వరా ---167

కాళికవై  కరుణించు తల్లి     
అమ్మలను గన్నఅమ్మగా తల్లి     
జగతి రక్షిత గను నున్న తల్లి  
భవ్య తెలివిని పంచేటి తల్లి   
సర్వ ప్రాణ రక్షగా ఉమా శంకరా ---- 168

సకల దేవతా రూపిగా తల్లి 
కనక దుర్గగా కామ్యపు తల్లి 
భాగ్యనగరాన్కి భద్రతా తల్లి   
భారమంతయు మోసేటి తల్లి 
సర్వ ప్రాణ రక్షగా ఉమా శంకరా ----169

మాకు శక్తి ధైర్యము పంచు తల్లి 
సుందర భవాని కరుణాల తల్లి   
సుమధుర సుజాత దయగల తల్లి 
వాణి గ సరస్వతియు గాను తల్లి 
సర్వ ప్రాణ రక్షగా ఉమా శంకరా ------ 170

విజయ రాణిగా విమలమ్ము తల్లి 
విశ్వ మాతగా చెలిమిగా తల్లి 
స్త్రీల లక్ష్మివై ఆశ్రీత తల్లి 
పురుష హృదయమ్ము వాసిగా తల్లి 
సర్వ ప్రాణ రక్షగా ఉమా శంకరా ---- 171
  
రూప స్వరూపిణీగాను తల్లి
సకల సంసార రక్షిత తల్లి 
నిత్య సత్యమ్ము తెల్పెటి తల్లి 
ధర్మ దేవత లహరిగా తల్లి 
సర్వ ప్రాణ రక్షగా ఉమా శంకరా ---- 172


మనిషి యద్భవ  తత్భావ  మేను  అనక 
మనసు భౌతిక వాస్తవ  మేది  గనక 
వినయ భావపు మర్మము తెల్సు కొనక 
విషయ  వాంఛల వెంటన ఉండు కనుక  
సర్వముగ్రహించి రక్షగా ఉండు ఈశ్వరా  --- 173

యుక్త  మధ్యమ వృద్ధాప్య  యజ్ఞ మగును  
త్యాగ బుద్ధియు ఉన్నదో  తత్వ మగును  
శక్తి అంతయు ఖర్చును  సేయు టగును  
తార తమ్యము తెలిసిన తపము యగును 
మనిషి జీవితంలో ఎన్ని మార్పులు ఈశ్వరా ---174

దేహ కాంతి వృద్ధాప్యం లో తగ్గు చుండు 
మేధ  శక్తియు  వృద్ధాప్య  పెర్గు చుండు  
మూడు కాళ్ళను మోసియు మౌన ముండు 
చూపు మంద గిస్తుందని చెప్పి ఉండు 
వృద్ధుల జీవితంలో సుఖము ఏదిఈశ్వరా . ---175

ప్రకృతి మౌనముండినదని పూజ చెయ్యి 
వికృతి  తాండవించినదని  వినతి చెయ్యి  
సుకృతి ఇదియును అదియును తెల్పు చెయ్యి  
ఎశృతి విన్నను మంచిని యదలొ  చెయ్యి  
సహాయమనే చెయ్యి మాకందించు ఈశ్వరా ---176

మనకు  నైతిక భౌతిక మహిమ గాను  
మనము అద్భుత ఆదర్శ మనసు గాను 
మనసు చట్రంలొ చిక్కితే మనము గాను 
మనమె  ఆచార ములయందు మేలుగాను  
మనము అను వారి హృదయంలోను ఈశ్వరా  177

నీలొ  నమ్మక వ్యవస్థ  నటన గాను  
కాల నిర్ణయ మార్పులు కలలు గాను        
హోళి ఆడేటి  కాంక్షయు హాయిగాను 
జాలి చూపియు సంపద జపము గాను 
జాలి దయ మాకు కల్పించు ఈశ్వరా ---178

ఒకరి కొక్కరు తోడుగ ఓర్పు గాను  
అకట ఆకలి తీర్చియు ఆట గాను  
అకము పంచియు పొందియు అర్ధ మగును  
శకము మారిన వృధాప్య శాంతి యగును  
వృద్ధుల మేధస్సుకు రక్షగాను ఈశ్వరా ---- 179

 
((()))
మౌన మేలనే - చిరు హాసినీ 
సేవ చేసితీ - సుఖ భోగినీ
పేరు మార్చకే - నవ మోహినీ  
పేరు తెల్పవే - మధు హాలినీ
మృదుహాస పలుకులుగా ఈశ్వరా ----- 180

ఆశ వద్దులే  - కల మొహినీ
కాల మడ్డులే - జవ రాలునీ    
జాలమేలరా - సర సమ్మునీ 
సాదనం ముందే - వయ సుందనీ  
మృదుహాస పలుకులుగా ఈశ్వరా  ---181

మారు పల్కగా - మది నింపరా
ఆరు నూరుగా - ఇది సత్యంరా 
కారు మబ్బులే - మన పొందురా
వాన చిన్కులే - మన హాయిరా   
మృదుహాస పలుకులుగా ఈశ్వరా ---- 182

మ్రోల రమ్మురా - మురిపెమ్ముతోఁ
గాల మయ్యెరా - కరుణమ్మతో 
ప్రేమ ఉందిరా - పదిలమ్ముతో  
పూల స్పర్శతో - మురిపింపుతో 
మృదుహాస పలుకులుగా ఈశ్వరా  ---- 183
--((**))--
పం చభూతాలు మన గమ్యం
చదువులే జీవితానికి గమ్యం
పదుగురి మేలు రక్షణే గమ్యం
దినదిన వర్ధమాన ప్రేమ గమ్యం
పంచ పది  మనఃశాంతి గమ్యం ఈశ్వరా -- 184
--(())--

రెప్ప వాల్చను నీ ముందరమ్ము నేను
చెప్పి న కలలు తీర్చేటీ చరిత నేను 
ఓప్పితి మనమధ్య తెరలు యన్ని నేను 
తప్పుల అనేవి సుఖములో తేల్చగలను  
ఎన్ని చెప్పిన కలలుగా తెల్సినే ఈశ్వరా ---- 185

రొప్పకు సమయ మంతను రవ్వ వెలుగు
తప్పు కాదులే దేవుడు తీరు తెలుగు 
విప్పి వివరించ వలెనని విశద పరుగు 
గొప్ప మాటలు మన మద్య గోల గలుగు 
గోల్ అనేక మార్గాలు పరిష్కారాలే ఈశ్వరా  ---186

వంపు వంపుకు వల లోన వడిసి పట్టు
తెంపి మల్లెలు కలుపుతూ దారి పట్టు
పంపిన ప్రేమ లేఖలు ప్రధమ పట్టు 
దప్పికను తీర్చు తరుణము దారి పట్టు
దారులు అనేకం అయినా తేడా ఈశ్వరా ---187

నిప్పు అనకు నీ మనసు న నీడ చాలు
గుప్పు గుప్పున వచ్చేటి గాలి చాలు
కొప్పు విప్పితి అందాలు కొమ్ము చాలు
చెప్పిన పలుకు వినుచున్న చెలియ చాలు
సుఖము కొరకుఏమైనా చేయు ఈశ్వరా ---- 188
******


విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


చిరు నగవులలె   
మురళి వెలుగులె 
గిరి వరదను లె    
తరుణ మాయలె   
లీలలుగా ఈశ్వరా 

త్రిపదలలితా  
ప్రణయ వరదా   
నవసుమలతా   
నిదుర పరదా  
కథలేల ఈశ్వరా 

మనసు లలితం  
వెలుగు విదితం  
హృదయచరితం  
జెలఁగఁగు తరుణం  
వినయం ఈశ్వరా 

స్వరము సవ్వడి  
మనసు జవ్వడి   
విదిత చావడి  
జిరునగవు జోడి  
సుఖం పెంచు ఈశ్వరా 

పిలుపు వినఁడే  
దరినిఁ గనఁడే 
గృహము జనఁడే 
మలయ పవనుడే   
మలుపులే ఈశ్వరా 

జెలియ యనునే  
కలికి యనునే    
ప్రియస యనునే  
చిలిపి మనసునే   
తనువు పంచు ఈశ్వరా 

నదియు మదిలో  
వెలుఁగు గదిలో  
మణుల సరిలో  
అలల ఉరవడిలో  
కళ నేర్పు ఈశ్వరా 

సరసుఁడతఁడే  
ప్రణయవరుఁడే 
కుసుమశరుఁడే  
కలల పండితుడే   
విద్య పంచె ఈశ్వరా 

ఘడియ సుగమే  
నగవు మొగమే
క్షణము యుగమే  
హరి చూపు ఫలమే   
జగతి మేలు ఈశ్వరా 

జెలిమి వరమే  
పొగడఁదరమే
స్మృతులు చిరమే 
చిరుతతనమే 
బతుకు తెలుపు ఈశ్వరా 

తపపు ఫలమే  
మనుపు బలమే
గనుల జలమే  
తరుణ సహనమే   
సుఖమిచ్చె ఈశ్వరా 

మనకొసఁగునే  
మనికి యగునే
తరువులగునే  
కరుణజరుగునే   
రసమాయె ఈశ్వరా 

బ్రహ్మ వేద మందించిన వెల్గు 
 నాదాంత సీమల నడచు వెల్గు
సాదు జనానంద పరిపూర్ణ వెల్గు 
 బోధకు నిలయమై పరిపూర్ణ వెల్గు
అయినా బతకలేని బ్రతుకు ఈశ్వరా 

సుషమ్న నాలంబున జొచ్చు వెల్గు 
 ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు
చూడు జూడగా మహాశోభితంబగు వెల్గు 
 నఖిలజగంబుల నిండు వెల్గు
అయినా బతకలేని బ్రతుకు ఈశ్వరా 

మేరుశిఖరంబు  తరువులతో వెల్గు
మోహావేశంబుతో  మంచిని పెంచు వెల్గు
మేను పులక రించి తన్మయించే వెల్గు
 నిత్య సత్యపు పలకరింపులతో వెల్గు 
అయినా బతకలేని బ్రతుకు ఈశ్వరా 
-(())--

తన్నెఱుగుట నన్నెఱుగుట
కన్నె బతుకు నిత్య వెగట 
ఉన్న కిటుకు అగ్ని వాకిట 
వన్నె గలుగు విశ్వ మగుట 
కన్న మనసు ఆటా ఈశ్వరా

విశ్వసేవలే స్వార్ధమైన ఆత్మగా 
ధర్మ నిర్ణయం సేవ వ్యాప్తి ఆత్మగా 
కార్య కర్తగా కర్మ చేయు ఆత్మగా 
సర్వదేవతా మూర్తియైన ఆత్మగా
ఆత్మలేని ప్రాంతమేది ఈశ్వరా   

నవగ్రహముల రాశి జరియించు 
చుండిన మంచి చెడుగు గానిపించు  
చున్న పురుష యత్నమునుచు 
పాంగుడు లేలరా జీవితమనుచు 
విధినెదిరించు శక్తి లేదు ఈశ్వరా 

" కష్ట సుఖాలూ - కాదనలేని చుట్టాలు
" ఇష్ట ప్రభావం - రాముడు తెల్పు చట్టాలు 
" నష్ట ప్రమోదం - కాముడు తెల్పు ఘట్టాలు 
" పుష్టి వివేకం - సోముడు పెంచు వెల్గులు  
" ఛష్టు సహాయం - నిత్యమూ తెల్పు ఈశ్వరా    

మనసు పెట్టి మమత మాట వినవు 
వయసు బట్టి వలపు పొంద గలవు
సొగసు చూపి సొమ్ము చేయ గలవు 
ఉరుసు నాడు ఊరు వాడ గలవు 
కలసి చూడు కాపురముననే ఈశ్వరా 

jజనుల కెపుడు సొమ్ము కొరకు భయము 
జనుల కెపుడు శాంతి పథము శుభము
పనుల కెపుడు ఓర్పు చూపు మనము 
పనుల కెపుడు మార్పు కోరు తనము
పనుల మాయ మర్మము గనుము ఈశ్వరా 

అన్న చెల్లెలు రక్ష అంటూనే రాఖి
కన్న వారిని రక్ష చేయుటే రాఖి
ఉన్న వారికే రక్ష గావుండే రాఖి
మిన్ను సాక్షిగా రక్ష దేశాన్కి రాఖి
మన్ను నమ్మాను రక్ష తల్లిగా ఈశ్వరా 

నువ్వు వచ్చి నవ్వు  తెచ్చి నావు
వచ్చి నువ్వు వెళ్ళి పోయి నావు
హృదయ మందు హాయి గొలుపి నావు
కన్న వారు కాక తెల్పి నావు
వృధ్ధు లమని వంత పలికితి ఈశ్వరా 

గాలి వంటి కవులు రచయి తలగు
భౌతి కమ్ము భయము తోడు గలుగు
సూక్ష్మ మైన సుగుణ భావ మెరుగు
ప్రేమ పిలుపు పగలు రేయి జరుగు
కాల మాయ మంటు తిరుగేను ఈశ్వరా 

చంద్రకాంతి చలన వెల్గులవ్వు
క్షణము శోభ క్షోభ మెరుపు లవ్వు
శ్రీ సతులకు శ్రీ పతులు గ నవ్వు
మనసు లోన మహిమ తెల్పు పువ్వు
మరులు గొల్పు మగువ కానుకే ఈశ్వరా 

కలము రాత గాజు పాత్ర పగులు
శూన్య దోష శాంతి నిర్ణయాలు
జ్ఞానము గను జాతి మనది మేలు
పుడమి నందు పువ్వు కలుపు కోలు
సత్య మగును సర్వ మంతనాలు.ఈశ్వరా 

పచ్చ గాను మెరియు పండు టాకు
శబ్ద ముగను సేయు ఎండు టాకు 
నిత్య మొచ్చు నిద్ర లోన గురకు  
సకల మందు సామరస్య పలుకు   
తలలు పండు దారి వెతుకు ఈశ్వరా 

కొరవ డింది కంటి లోన చూపు 
మంద గించు ముందు లోన చూపు 
అలసి పోవు ఆశ లందు చూపు 
దేహ మందు దాహ నిత్య చూపు 
మనసు లోన మేలు చూపు ఈశ్వరా 

రాలి పోవు రవ్వ వెలుగు నీడ 
నింగి తార నీకు చేర్చుపీడ 
వాడి పోవు వరస కున్న చీడ 
సౌర బాల సరస మాడ జాడ 
అనుభవ ఆర్తి ఉన్న అండ ఈశ్వరా 

ప్రేమ లేని మేకు జీవి వృధా
ప్రేమ వున్న మేకు మరియు వ్యధా
ప్రేమ తోను మేకు నిత్య సుధా
ప్రేమ చేరి పోతె మేకు మేధా
ప్రేమ కుళ్లి పోతె బాధేను ఈశ్వరా 

సర్వ కళలు సేతు వగు ట వాణి
నిర్వి రామ నిర్మలమ్ము తరుణి
కార్య జయము కదలు సత్య వాణి
ధర్మ కార్య ఋజువు కృష్ణ వేణి
సూర్య వెలుగు విశ్వ వాణి ఈశ్వరా   

ముత్యమంత ముద్దు ఇవ్వు ముందు
తత్వ బోధ తృప్తి నిచ్చు మందు
ముత్తు మాయ మెరుపు మచ్చ నందు
సత్య హరిశ్చంద్ర నమ్ము ముందు
నిత్య పూజ నేను చేయుట ఈశ్వరా 


మనసుకు భావమేది , 
భావానికి వయసు ఏది -  
వయసుకి  కోర్క ఏది , 
కోర్కలకు మనసు ఏది 
మనసుకు అర్ధం లేదు ఈశ్వరా 

చివరికి  నేస్తమేది   
నేస్తానికి  బంధము ఏది
భందముకి భాద్యతేది  
బాధ్యతకుఁ చివరి ఏది  
భాద్యత ఎంతవరకు ఈశ్వరా     

వయసుకు గాయమేది  
గాయానికి మరుపు ఏది   
మెరుపుకు తీర్పు ఏది  
తిరుపుకు లక్ష్యమేది
తీర్పుకు విలువ లేదు ఈశ్వరా 

భందానికి భాష ఏది   
భాషకు  ప్రేమ ఏది 
ప్రేమకు మార్గ మీది  
మార్గానికి అంత మేది  
మార్గం తెలియదు ఈశ్వరా 

మరపుకు  గానమేది  
గానానికి వలపు ఏది 
వలపుకు వయసు ఏది  
వయసుకి ధ్యాస ఏది 
ద్యాస అర్ధం తెలియదు ఈశ్వరా 

ప్రేమకు  మార్పు ఏది  
మార్పుకు ఓర్పు ఏది 
ఓర్పుకు మనసు ఏది  
మనస్సు కు మాట ఏది 
మాటల విలువ లేదు ఈశ్వరా 
 
వలపుకు  మాట ఏది   
మాటలకి  చివరి ఏది  
చివరికి దక్కే దేది  
దక్కిన దానికి దారి ఏది 
దారికి అంతం లేదు ఈశ్వరా 

ఓర్పుకు  తీర్పు ఏది   
తీర్పుకు నేర్పు ఏది 
నేర్పుకు మార్పు ఏది  
మార్పుకు ఓర్పు ఏది 
ఓర్పు తెలియదు ఈశ్వరా 
--(())--

కలలు పెంచు కాల మాయ దృష్టి
లాభ మిచ్చు లలన తెలుపు సృష్టి
అడుగు జాడ అడిగి వేయు ముష్టి
తిండి వలన దరువు బలము పుష్టి
ఆశ లేని ఆట బతుకు నష్టి ఈశ్వరా    

సవతి తల్లి సంప దలను కోరు
కన్న తల్లి కడుపు కోత మారు 
సవతి తల్లి సహజ మెప్పు కోరు
కన్న తల్లి కాపురమ్ము తీరు 
సవతి తల్లి మనసు కోరు ఈశ్వరా 

ఆడ పిల్ల అందము కళ నెరిగి
ఆడ పిల్ల లందరిలో ఎరిగి 
స్త్రీ ల కుండు శక్తి సకల మెలిగి
స్త్రీ ల తీర్పు శాంతి నిచ్చ కలిగి  
స్త్రీ ల మార్పు సేవ కలిమి ఈశ్వరా 

ప్రేమ లోన మునిగి తేలుతున్న
ప్రేమ వలన మనసు మాట లన్న
ప్రేమ పట్టు మలుపు తిప్ప నున్న
ప్రేమ లోన పిలుపు ఆట లన్న
ప్రేమ అంత మరుపు ఆశలన్ని ఈశ్వరా 

చెవుడు వుండె చెప్ప లేక ఉండె
పుట్టు మూగ పుండె నటన ఉండె
పుట్టు గుడ్డి వల్ల పుడమి నుండె
చెప్ప నోరు జారు తుండ గుండె
ఇంటి నంత ఓర్పు ఉండె ఈశ్వరా 

తన్ను కొచ్చు తపన ఎవరు ఆపు 
వెన్ను చూపి వెనక అడుగు వీపు
కన్న వారి కళ్లు చెదిరె ఆపు 
కన్నె చూపు కమ్ము కొచ్చు కైపు 
విన్న మాట వేద వాక్కు చెప్పు ఈశ్వరా 

చెప్ప వచ్చు చేత కాని మాట 
ముప్పు తెచ్చు మంట తోను ఆట 
ఒప్పు కొనియు ఓర్పు చూపు వేట 
తప్పు లన్ని తాడు లాగ బాట  
అప్పు లన్ని ఆశ పెంచు తోట ఈశ్వరా 

మరువ లేవు మనిషి మాట తీరు 
అరవ వద్దు అలక మార్పు చేరు  
చెరువు నీరు చేను మార్చు తీరు 
కరువు నాడు కాల మాయ వారు 
బరువు వున్న భాగ్య మిచ్చు వేరు ఈశ్వరా 

పోటి వల్ల పొట్ట నింప గలుగు 
లూటి వళ్ళ లొల్లి జరుగ గలుగు 
దాడి వళ్ళ దూర మైన పెరుగు 
వేడి వున్న వయసు చూపు కరుగు 
నాడి పట్టి  నడక సాగి పరుగు ఈశ్వరా 

పాల కొరకు పంత మసలు వద్దు 
గోల చేసి గొప్ప అనుట వద్దు 
వేళ కాని వేళ వలపు వద్దు 
మేళ మైన మేను కులుకు వద్దు 
గాల మైన గళము విప్ప వద్దు ఈశ్వరా 

ఓర్పు చూసి ఓటు వేయు ముందు 
నేర్పు వల్ల నటన చేయ వద్దు 
నేర్పు వల్ల నేత గెలుపు ముందు 
మార్పు వాళ్ళ మనసు మార్చ వద్దు 
తీర్పు వల్ల తీరు మార్చు ముందు ఈశ్వరా 


రాత్రి పెందరాళే నిద్ర పోయ్యే వాళ్ళు!
తెల్లవారు జామున నిద్ర లేచు వాళ్ళు.!
రోజు నడకను  అలవాటు ఉన్నవాళ్ళు.!_
రోజు కూరలకు నడిచి వెల్లె వాళ్ళు.!
రోజూ మారేటి ఈ బతుకెన్నళ్లు ఈశ్వరా 

రోజు వాకిట కళ్ళాపు చల్లె వాళ్ళు ! 
రోజు ముంగిటముగ్గులు పెట్టె వాళ్ళు!
రోజు మొక్కల కెనీళ్ళు పెట్టెవాళ్ళు!
రోజు పూజకు పూలన్ని కోయు వాళ్ళు !
రోజూ మారేటి ఈ బతుకెన్నళ్లు ఈశ్వరా 


మదవతుల మానచ్చెదమునకై 
చంద్రుడుదయించె ప్రేమలకై   
విషవలయ మౌనచ్చెదమునకై
మాటల మనస్సు మార్చుటకై 
చంద్రుని లీలలు ఇవేనా ఈశ్వరా 

కళలపరిశీలమ్ము మనసుకే 
మానవత పొందు సౌఖ్యముకై  
వినయ వినువాదమ్మె వయసుకై  
తలపుల పొంగు చోరుడు పలుకై 
చంద్రుని లీలలు ఇవేనా ఈశ్వరా 
 
సమత మమతా నోము విషయమే 
స్త్రీల విష వాంఛ తర్చు మయఁమై  
కరుణ దయ హృద్యమ్ము వినయమై  
స్త్రీల సుఖ మిచ్చు మోడ్యుని మౌనమై    
చంద్రుని లీలలు ఇవేనా ఈశ్వరా 

వేంకటేశ్వర కటాక్షములు 
సత్కవుల లక్ష్మీవిలాసములు 
రామభద్రుని కటాక్షములు 
భక్తపులకింతేమనోలతలు   
మనుష్యులలో సంతోషాలు ఈశ్వరా   

పూజ కాకుండ ఏమియు తినని వాళ్ళు !
మడిగా వంట  వండేటి ఉండె  వాళ్ళు!
దేవుడి గదిలో దీపమ్ము పెట్టు వాళ్ళు!
దేవుడి గుడికి ప్రతిరోజు  వెళ్ళే వాళ్ళు!
రోజూ మారేటి ఈ బతుకెన్నళ్లు ఈశ్వరా 

దవమునునమ్మి విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించేటి  వాళ్ళు.!!!
అందరినిఆప్య యముగమా ట్లాడె వాళ్ళు.!
చేతులకి గాజు లేసుకు నేటి వాళ్ళు.... !
రోజూ మారేటి ఈ బతుకెన్నళ్లు ఈశ్వరా 


జీవిత సంసారం ఒక నాటకమోరన్నా
జగన్నాటక సూత్రదారిని కనుమురోరన్నా  
ప్రకృతి పరిసీలన రహస్యం తెలుసుకోరన్నా 
వేషంతిసివేసి నిర్మల చిత్తంతో మెలగాలన్నా   
ఏదీ నీరు ఏదీ హోరు ఏదీ నోరు తెలవదు ఈశ్వరా 

ప్రపంచంలో ఉన్న మర్మం తెలుసుకోరన్నా  
మాయా మోసము ఎరిగి జాగర్త పడాలన్నా 
తలుకు బెళుకులు శాశ్వితము కాదన్నా 
మూడురోజులు ముచ్చటకే బాధపడకన్నా 
ఎన్నో బడబాగ్నులు చుట్టినా నీవే దిక్కు ఈశ్వరా 

మోక్షదామం కొరకు ధర్మం అనుసరించన్నా 
దైవకృపకు నిత్యం ప్రయత్నం చేయాలన్నా
బ్రహ్మజ్ఞానం పొందుటకు కృషి చేయాలన్నా
అందరిలో మానవత్వాన్ని బ్రతికించాలన్నా    
వెలుగునిచ్చే వత్తిగా బతకాలనివుంది ఈశ్వరా  

నరుని దేహము వచ్చుట అదృష్టమన్నా 
మానవత్వము ఎల్లవేళల రాదు రారన్నా 
దేహంలో పొందే విషయసౌక్యము వద్దన్నా 
సుఖాన్నిచ్చే ఆత్మబడసి ముక్తి నొందన్నా 
ఎప్పుడు మారునో తెలియని జీవితాలు ఈశ్వరా 
  
సత్ప్రవర్తన సత్సంకల్పం కలిగి ఉండన్నా 
మానసంబున మురికి లేకుండా  ఉండున్నా  
నిర్మలంబగు నీటిఅడుగు తెల్లగా ఉండున్నా
శుద్ధమైన చిత్తమందు ఆత్మవస్తువు ఉండున్నా 
కళలు తీర్చుకోలేని మనుష్యుల మధ్యే ఈశ్వరా 

పంచకోశములోన ఆత్మజ్యోతియే ఉండన్నా 
దేవదేవుడు నమ్మినవాని చెంతనే ఉండన్నా 
దూరదూరము పోయి పోయి వెతుకుటేలన్నా 
హృదయం లో ఆత్మజ్యోతిగా నిండి ఉండన్నా 
కాలమేదైనా మెలసి బాతుకుటే ఈశ్వరా   
--((**))-- 


మితిమీరిన స్నేహాలు అభిప్రాయ భేదాల పాలు 
మితిమీరిన గారాబం చెడు స్నేహాల పాలు 
మితిమీరిన వేదాంతం వెటకారం పాలు 
మితిమీరిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పాలు
మితిమీరిన ఋణం మరణం పాలు ఈశ్వరా 

మితిమీరిన ఖర్చు పేదరికం పాలు 
మితిమీరిన పొదుపు కష్టాల పాలు 
మితిమీరిన కర్తవ్యం అగచాట్ల పాలు
మితిమీరిన బాధ్యతలు అప్పుల పాలు
మితిమీరిన పోటీ నష్టాల పాలు ఇశ్వారా 

మితిమీరిన ఉపవాసాలు నిస్రాణతకు దారులు  
మితిమీరిన ప్రేమ అనుమానాలకు పాలు 
మితిమీరిన జనాభా పెరుగుదల ఇక్కట్లు పాలు
మితిమీరిన వ్యావసాయం భూమిని నిస్సారం పాలు 
హత్యా రాజకీయాల ప్రేరేపణ పెరిగాయి ఈశ్వరా 

మితిమీరిన విశ్వాసం లోకువ పాలు 
మితిమీరిన అభిరుచి దుబారాకు పాలు 
మితిమీరిన నమ్మకం ద్రోహానికి దోహదం పాలు
మితిమీరిన కీర్తి దాహం ఆదాయాన్ని మింగే పాలు
దేశ ప్రగతిని త్రొక్కేసే మనుష్యులేల ఈశ్వరా  

మితిమీరిన త్యాగం కడగండ్ల పాలు 
మితిమీరిన దారిద్రయం నేరాల పాలు
మితిమీరిన వ్యసనాలు అప మృత్యువు పాలు
మితిమీరిన సంపాదన శాంతి కరువు పాలు 
మితిమీరిన భక్తి మూర్ఛల పాలు ఈశ్వరా 

మితిమీరిన తీర్ధ యాత్రలు అనారోగ్య పాలు  
మితిమీరిన అధికార దాహం అభాస పాలు 
నిద్రా సుఖాన్ని దూరం అనుమానం పాలు 
మితిమీరిన క్రమ శిక్షణ రక్త సంబధీకుల పాలు 
మితిమీరిన కోపం శతృవులను వృద్ధిఏ ఈశ్వరా  
  
మితిమీరిన శృంగారం వైరాగ్యం పాలు 
మితిమీరిన ఆలోచనలు దుర్భరం పాలు 
మితిమీరిన గర్వాహంకారం ఆపద పాలు 
మితిమీరిన అలంకారం వెగటు పాలు 
నాస్తికత్వానికి నాంది పలుకు పాలు ఈశ్వరా

మితిమీరిన స్వార్ధం అందరి పాలు
మితిమీరిన కామాంధకార జీవచ్చవం పాలు 
మితిమీరిన లాభార్జన వ్యాపార మోసం పాలు 
మితిమీరిన వస్తూత్పత్తి నాణ్యతా దెబ్బ పాలు 
మితిమీరిన హాస్యం నవ్వుల పాలు ఈశ్వరా 

((()))ఆకాశంలో మేఘం ఉరుముతు కున్నది
నాయకుల వాగ్దానాలు పెరుగుతున్నవి 
ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నవి 
నిరుద్యోగుల ఆశలు మెరుపుల్లా ఉన్నవి
ఫలితాలు లేక బాధల మధ్య నలిగే ఈశ్వరా 

ఆకాశం నుండి జడివాన కురుస్తున్నది 
నాయకుల కోసం జీతాలు ప్రభుత్వం పెంచింది 
వర్షాన్ని అడవితల్లి అస్వా దించింది 
కాంట్రాక్టర్ల కడుపు నిండే మార్గము సులభమైనది
ఎంత పొందినా ఆశమాత్రం తగ్గదు ఈశ్వరా 

ఉప్పొంగుతున్నయి వాగులు ఉరకలేస్తూ 
నాయకులు కోట్లు  ఖర్చుతో ప్రజలని మరిపిస్తూ 
రోడ్లు అస్తవ్యస్తం, రవాణా మగ్యం మారుస్తూ  
అనారోగ్యం విస్తరణా, వైద్యం దూరం చేస్తూ 
ప్రభుత్వాలు మారుతున్నాయి ఈశ్వరా 

నడకతో, కావడిలతో, పయనం అనారోగ్యులు
సమయానికి హాస్పటల్ కు చేరిన రోగులు   
ఊపిరి పీల్చుటకు గాలి లేదు మరణాలు 
జ్వరానికి మందులు లేవు పోట్లాటలు 
పాలకుల అభివృద్ధి నినాదాలు ఈశ్వరా 
 
సజీవ సాక్షాలుగా ప్రాణంతో ఉన్న జీవులు 
ఆదరణ కోసం ఆరాటం ఒక వైపు పురుగులు  
ఆకలికోసం మరోవైపు, నాయకులు  
వచ్చి చూస్తున్నారు మీకు చేస్తాము మేలు  
వాగ్దానాలకు ప్రజల దండాలే ఈశ్వరా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి