12, ఏప్రిల్ 2021, సోమవారం

సోయగములు



నేటి ఛందస్సు అమ్మ ప్రార్ధన

అమ్మవు నీవే ను మనసుతో

కమ్మ నైన పిలుపు

సమ్మతి తెలుపుతూ పలుకులే

మమ్ము హాయి గుంచు 

కన్నీరు తడుచేటి అమ్మవీ

ఆన్ని నీ కృప యునె 

చేసెద పనులన్ని ప్రేమతో


అమ్మవు నీవె అయ్యవు నీవె

అమ్మ తనము చూపి

సమ్మోహ పరిచేటి మమతవు

మమ్ము కాపు కాయు 

నీ ప్రేమ పొందేటి మనసుయే

మాకు ఇచ్చు అమ్మ

చేసెద పనులన్ని ప్రేమతో

అమ్మలు గన్నమ్మ వై నీవు

మమ్ము రక్ష చేయు

నమ్మి కొలిచితిమే ఇపుడేను

మేము చేయు తప్పు

ఒప్పులు అన్నింటినీ చూపె

మేము చేయు పూజ

లన్నియు పనులన్ని ప్రేమతో


విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

-+(())--


02 . సాగరం సకలమ్ము యె భరించు  

వేగ మంత మవ్వు 

వేగమే నిర్లక్షము వలన 

ఆగ లేని బతుకు 

సాగెను పిల్లలపై ప్రేమ 

వేగ లేని బతుకు  

జగతిలో శుభపుసోయగముగా


01. మంచి తెలుపు కన్న తల్లియే   
ఎంచి బతుకు బిడ్డ 
వంచన వలదనే తల్లియే 
పంచ చేరి బతుకు 
నచ్చలేదు అనకు బిడ్డవై 
ఖచ్చి తమ్ము పలుకు  
జగతిలో శుభపుసోయగముగా     

ఉషోదయ సాహితీ వేదిక ద్వారా రూపొందించిన


ప్రక్రియ..సోయగము

మొత్తం ఏడు పాదాలు ప్రతిపాదంలో మూడేసి గణాలు.

--మొదటిపాదం..మూడుఇంద్రగణాలు

--రెండోపాదం.. సూర్య గణాలు మూడు

--మూడోపాదం..ఇంద్రగణాలుమూడు

--నాలుగోపాదం.. సూర్య గణాలు మూడు

--ఐదోపాదం..ఇంద్రగణాలుమూడు

--ఆరోపాదం.. సూర్య గణాలు మూడు

--ఏడోపాదం..ఇంద్రగణాలుమూడు

ప్రాస నియమం కలదు

--1 ,2,3,4,5,6 పాదాలల్లో మొదటి పదములో  రెండో అక్షరముకు ప్రాస నియమo గలదు

ఏడో పాదంలో చివరగణములో తప్పనిసరిగా సోయగము రావాలి.

శంకర శుభకర శరణము

సంకటములు బాపు

పార్వతీ నాథుఁడా! పరమేశ

సర్వమెఱుఁక నీకు

దండ ధరుడవు దయానిధి

దండమయ్య నీకు

సురులెల్ల మెచ్చు సోయగమును!!

       

అమ్మకు శతకోటి జేజేలు

కమ్మ దనము నిచ్చు

మమతలో మనిషిని నిల్పును

సమత ముచ్చటoదు

నిలిపెడి నిత్యపరిమళము

కలిమి లోన నిలుపు

మదిలోన సొగసుసోయగమగు


అందరి తోడువు భువిలోన

అందమైన రూపు

భవితను ఇచ్చెడి తల్లివి

కవిత నందు నిలిచి

కన్నీరు తుడిచితివి నిజము

అన్న దాత గాను

జగతిలో శుభపుసోయగముగా


💐💐💐💐💐💐💐


సాగరం సకలమ్ము యె భరించు  

వేగ మంత మవ్వు 

వేగమే నిర్లక్షము వలన 

ఆగ లేని బతుకు 

సాగెను పిల్లలపై ప్రేమ 

వేగా లేని బతుకు  

యోగమాయ అనియు ప్రేమతో 


 

01 మంచి తెలుపు కన్న తల్లియే   

ఎంచి బతుకు బిడ్డ 

వంచన వలదనే తల్లియే 

పంచ చేరి బతుకు 

నచ్చలేదు అనకు బిడ్డవై 

ఖచ్చి తమ్ము పలుకు  

జగతిలో శుభపుసోయగముగా

విధేయుడు 

ప్రాంజలి ప్రభ 

మల్లాప్రగడ రామకృష్ణ , విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్, 

ఏ పి మోడల్ స్కూల్ /ఆర్ .ఎమ్ .ఎస్ .ఏ 


మంచిని నమ్ముము ప్రేమతో  

     

శ్రీ సీతారామాంజనేయ .. ప్రేమ 


మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మ 

జరామరణాల నుండీ, మోక్షాన్ని ఇస్తాయి కాబట్టి   

ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానమే దొరకని జన్మ  .

ఎందుకంటే,  'ప్రశ్నించే వాడే' సమాధానం కాబట్టి.

లేనివాడికి ఇస్తే - దానం.చేస్తే జన్మ లేదు  

ఉన్నవాడికి ఇస్తే - అర్పణ  మగు జన్మ .


వెదకి తలచు కుంటే, విష్ణుడు కానవచ్చు

చేతకాదని కూర్చొంటే, లోకం చీకటవ్వచ్చు ...2  

పట్టుదలే నీలో ఉంటే, లోకం చుట్టి రావచ్చు     

నిదురించితే కాలము నిముషమై పోవచ్చు .... మా 


ఇష్టంగా చదివితే, వేద శాస్త్రజ్ఞుడవ్వచ్చు 

చదువు నాకెందు కనుకుంటే, మూర్ఖుడవ్వచ్చు... 2   

నిగ్రహంతో పనిచేస్తే, ఉత్తముడవ్వవచ్చు 

సోమరిగా కూర్చుంటే, గుణ హీనుడవ్వవచ్చు .... మా 


శ్రీసీతారామాంజనేయ    ప్రార్ధిస్తే మోక్షం రావచ్చు 

బద్దకించితే జీవితమే వ్యర్ధమై పోవచ్చు 

శరణంటే మనిషి జన్మ సార్ధకమవ్వచ్చు 

సందేహిస్తూ ఉంటే మనస్సే నాశన మవ్వచ్చు .... మా  


మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మ 

జరామరణాల నుండీ, మోక్షాన్ని ఇస్తాయి కాబట్టి   

ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానమే దొరకని జన్మ  .

ఎందుకంటే,  'ప్రశ్నించే వాడే' సమాధానం కాబట్టి.

లేనివాడికి ఇస్తే - దానం.చేస్తే జన్మ లేదు  

ఉన్నవాడికి ఇస్తే - అర్పణ  మగు జన్మ .


విధేయుడు   మల్లాప్రగడ రామకృష్ణ

--((**))--


సీతారామాంజనేయ ప్రేమ (6 )


వేరు ఆలోచన లెందుకు ....     

మీపై ఉన్న విశ్వాస మే  మాకు చాలు 

వేరు మార్గాలు ఎందుకు 

మీపై ప్రేమ అనే మాకు చాలు ... సీతారామాంజనేయ 


రక్షించుతావో,  లేదో అన్నది 

మాలో  సంశయం 

మనసు నందుంచక ఉంచా, 

మీ మీద  నమ్మకం .... సీతారామాంజనేయ


మిమ్ము ప్రార్ధిస్తూ ఉంటే కల్గు,  

మాలో కల్గు నిర్భయం  

మాలో కల్గు అసమాన, 

శక్తితో మనో ధైర్గ్యం ... సీతారామాంజనేయ  


నిత్యం మాపై ఉండు, 

మీ శుభ ప్రభావం 

ఎవ్వరిపై ఎప్పుడు ఉండదూ, 

మాలో గర్వం 

మీ లీలలు చెప్ప లేను , 

అవి కావు ఊహాతీతం 

మీపై భక్తితో  ఉంచి చేస్తున్నా, 

నిత్య కర్తవ్య  ప్రయత్నం ...  సీతారామాంజనేయ


మాలో ఎప్పుడు రాదూ, 

నీపై  నాస్తిక భావం 

మీపై పరిపూర్ణ విశ్వాసమే,  

మాలో ఉత్తేజ భావం 

స్వరూపాన్ని తెల్సు కొనే,  

నిత్యా ప్రయత్న ఆస్తికభావం 

మేము అందరిలో చూస్తాం 

ప్రత్యేక సమభావం ... సీతారామాంజనేయ 


ఆశయంతో కోరుతా, 

నిన్నే నిత్య సహాయం 

తప్పు తెలిపితే చేస్తా, 

ఇప్పుడే ఆత్మార్పణం  

సమర్పిస్తున్నా, 

మీకే సంపాదించిన పుణ్యం 

ఇదే  మా హృదయం ..    సీతారామాంజనేయ


వేరు ఆలోచన లెందుకు ....     

మీపై ఉన్న విశ్వాస మే  మాకు చాలు 

వేరు మార్గాలు ఎందుకు 

మీపై ప్రేమ అనే మాకు చాలు ... సీతారామాంజనేయ 


విధేయుడు   మల్లాప్రగడ రామకృష్ణ


--((**))--


సీతారామాంజనేయ ప్రేమ (5 )  


నన్ను నేను నమ్మలేను   

మిమ్ము నేను నమ్ముతాను సీతారామాంజనేయ 

నమ్మ కమ్ము అమ్మ లేను  

మిమ్ముఁ ఏమి అడుగ లేను సీతారామాంజనేయ


మనిషిని నమ్మాలో మానుని 

నమ్మాలో తెల్వదు 

సందిగ్ధంలో ఉన్న నాకు 

ఎలా తెల్పాలో తెల్వదు సీతారామాంజనేయ


మనిష్యుల మధ్య 

హింసాత్మకమో ప్రమో తెల్వదు 

సిగ్గు పడే విషయాల్ని 

ఎలా తెల్పాలో తెల్వదు..... సీతారామాంజనేయ   


ఆశతో చేసే పన్లు,  

పాపాలో పుణ్యాల్లో తెల్వదు     

ప్రేమంటూ చేసేటి మూర్ఖం, 

ఎలా తెల్పాలో తెల్వదు  .... సీతారామాంజనేయ

మేధస్సు యంత్రము లా, 

మారితే తెల్పాలో తెల్వదు 

భక్తి సర్దుపాట్లు కోసం, 

ఎలా తెల్పాలో తెల్వదు .... సీతారామాంజనేయ


కుత్తుకలు పడ్తు దేవుణ్ణి, 

కొలుస్తారో తెల్వదు

నిత్య రాగ ద్వేషాలతో, 

భక్తి ఉంటుందో తెల్వదు  ... సీతారామాంజనేయ

మనుష్యులు డబ్బుకోసం, 

హాత్యచేస్తరో  తెల్వదు 

మనస్సు మారకుండా, 

ఉంచుతావో లేదో తెల్వదు ..... సీతారామాంజనేయ  


నన్ను నేను నమ్మలేనూ, సీతారామాంజనేయ   

- మిమ్ము నేను నమ్ము తాను, సీతారామాంజనేయ


విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

--((**))--



మత్తేభవిక్రీడితము - స/భ/ర/న/మ/య/లగ IIUU IIUI UI IIU - UUI UUIU

20 /14

++

వినయాన్నీ వివరించి చెప్పు కధలే - వేదాలవల్లేనులే 

తనువంతా సహకారమే మనసుతో - తత్వాన్ని తెల్పే నులే  

చినికుల్లా  చిగురించి తృప్తి పరిచే - చైతన్య భావాలులే 

అనుమానం అనుకోక హాయి తలపే - ఆదర్శ భావాలులే   

సహనమ్మే మనసిచ్చే మార్గ మవుటే - సంభాషణాలన్నిటా 

తహ తాపం తనువిచ్చే కావ్య మవుటే - పొందేనుపాలన్నిటా

అహమంతా వదిలించే సేవ ఇదియే - ఆందోళనాలన్నిటా  

స్ప్రుహఉంచే చిరుహాసం తెల్పె మదియే - చిందేనుకాలన్నిటా 

మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల 

UUII UUI UIU - UUI IIUII UI

20 /11 

కాలం ఇదియే నీది నాదియే - సంఘంవదలదే మన ఆట 

వేలం మదియే మీది మాదియే - మౌనం వదలదే మనవెంట   

గాళం కథయే మాది మీదియే - గాధల్ తలుపులే మన వేట 

శీలం తలపే కాదు లేదులే  - శాస్త్రం తెలుపుటే మన మాట


 


ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

ప్రాంజలి ప్రభలు -26  

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం  మొదలైనది.  ఇది శుభప్రదమైన సంవత్సరం.

ప్లవ అంటే, దాటించునది అని అర్థం. 

   "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది   అని వరాహసంహిత వివరించింది. అంటే  చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.కష్టాలనుండి సుఖాలు తెచ్చునది.    

      శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి.

 ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని,  వికాసాన్ని కలిగిస్తాయి.  అభయాన్ని ప్రసాదిస్తాయి.

ఒక చిన్న పాత కధ గుర్తుకొస్తున్నది. ఇక్కడ ఉదాహరిస్తాను  

ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పసుపక్ష్యాదులను సృష్టించాను

అయినా తృప్తిగా లేదెందుకని

ఓ చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు

మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు.

ధైర్యం, సాహసం,నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నిండా నింపేశాడు.

భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది.

వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో.. వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.

"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద."మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.

"పోనీ ...

నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప. "మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."

"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.

"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."

అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది. "సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.

"మంచిది ....

మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు అన్నిటినీ గెలుస్తాడు.

కానీ

తన లోపలికి వెళ్లడు. తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం,"

అన్నాడు బ్రహ్మ.

అప్పటి నుంచీ బలం మనిషి తనలోనే ఉంచుకుని. బయట వెతుకుతూనే ఉన్నాడు.

అందుకే హనుమంతునికి తనబలం తనకు తెలియకూడదని శాపం ఉన్నా ఎవరన్నా ప్రోత్సహించితే విజృభించగలవు అని శాపవిమోచనముతెలిపారు. ఏది జరిగేనా అంట మనమంచికే అని భవించాలి ప్రతిఒక్కరూ కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మనసు మీ వెంటే ఉంటుంది. బ్రహ్మ అందించిన గుణాలను బట్టి మనిషి చేయలేని  దంటూ ఏదీ లేదు కేవలము ప్రోత్సాహం. 

ఉగాది పచ్చడి రుచుల్లా జీవితంలా అనుభవాలు నేర్పుతాయి పాఠాలు కొత్త నిర్ణయాలు ఉత్తేజానికి సంకేతాలు, నిత్య మనుగడకు సోపానాలు, బతుకు బండి కి జగన్నాధ రధ చక్రాలు అని భావించి, ధర్మాన్ని అనుకరించి, న్యాయాన్ని నిలబెట్టి, సత్యన్ని అనుకరిస్తూ ప్రతి ఒక్కరి జీవితం సాగాలని నా ఆకాంక్ష 

"ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకు 

మనసే మాదుర్యమని దేహంశాశ్వతమనియు చూడకు 

కరుణే కారుణ్యము మనోవేదమ్మని తలచి మాటకు 

కధగా ప్రారంభము అదే నిత్యము సుఖమను ఆటకు " 

    


మీ ప్రాంజలి ప్రభ 8  ఉగాదులు చూసి 9 వ తెలుగు ఉగాదిగా అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు     

అందుకే, ప్లవ నామ సంవత్సరానికి ఆందరికి శుభ స్వాగతం, సుస్వాగతం

మరొక్కసారి ధన్యవాదములు 

--(())--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి