6, ఏప్రిల్ 2021, మంగళవారం

[05:37, 04/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

774వ నామ మంత్రము 4.1.2021

ఓం మహత్యై నమః

 సర్వలోకపూజిత మరియు మహత్తైన పరిమాణంగలిగన పరబ్రహ్మస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహతీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం మహత్యై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు ఐహిక సుఖశాంతులు మరియు ఆముష్మిక సద్గతులను ప్రసాదించును.

భగవంతుడు అంటే అందరికన్నా పెద్దవాడు. అట్టి భగవంతుడిని మహాన్ అని పిలుస్తారు. మహాన్ అనే శబ్దం పుంలింగ శబ్దము. ఈ శబ్దానికీ మహతీ యనునది స్త్రీలింగ శబ్దము. భగవాన్ అని భగవంతుడిని అనినట్లే  భగవతీ అని అమ్మవారిని అంటాము. అలాగే ఈ మహతీ అనే శబ్దం అమ్మవారిని అందరికన్నా పెద్దది అని చెప్పునపుడు అంటాము. ఆ తల్లి మహనీయురాలు. దేవతలందరిచేత పూజ్యురాలు. సృష్టికి ముందే తానున్నది. త్రిమూర్తులకు కూడా ఆదిలోనే ఉన్నది గనుకనే అమ్మవారిని ఆదిపరాశక్తి అని అన్నాము. అలాగే ఇప్పుడు అమ్మవారిని మహతీ యని అన్నాము. బ్రహ్మాండం పరిమాణం ఒక కోటి ఎనబై ఏడులక్షల, డెబ్బై నాలుగువేల, తొమ్మిదివందలఇరవై (1,87,74,920) కోట్ల యోజనములు  ఉంటే, అమ్మవారు ఆ బ్రహ్మాండమంతా తన స్వరూపమై ఉన్నది. అలాంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఉన్నవి. అటువంటి బ్రహ్మాండము లన్నిటియందూ తానే ఆవరించినది గనుకనే అమ్మవారు మహతీ యని అనబడినది.

మనశరీరంలో గల వెన్నెముక వీణా దండమైతే, ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు తంత్రులు కాగా, మూలాధారంలోని కుండలినీ శక్తి ఆ వీణా తంత్రుల నాదమవగా, ఆ వీణానాదమే కచ్ఛపీ యను సరస్వతీ దేవి వీణ. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ (27వ నామ మంత్రము)    సరస్వతీ దేవి వీణయైన కచ్ఛపీ వీణానాదముకన్నా  అమ్మవారి మధురమైనసల్లాపములు మధురమైనవని అన్నాము. అంటే అక్కడ (27వ నామ మంత్రములో) సరస్వతీ వీణను (కచ్ఛపీ వీణను) ప్రస్తావిస్తే, ఇక్కడ అమ్మవారిని నారదమునీంద్రుని మహతీ వీణగా ప్రస్తావించాము. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓంమహత్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:37, 04/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

200వ నామ మంత్రము 4.1.2021 

ఓం సర్వమంగళాయై నమః

మంగళప్రదములైన వన్నింటినీ ప్రసాదించునది మరియు భక్తుల కష్టములను తొలగించి శుభములను కలిగించు సర్వమంగళస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమంగళా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమంగళాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతోను, నిశ్చలచిత్తముతోనూ ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ  పరమేశ్వరి వారి జీవనమంతయు మంగళప్రదమొనర్చును మరియు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించును.

సర్వమంగళా అనగా సర్వమంగళ స్వరూపిణి. జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలలో గయలో ఉన్న సర్వమంగళాదేవి ఒకటి.  పరమేశ్వరి అంటేనే మంగళస్వరూపిణి. స్త్రీలకు సకలసౌభాగ్యాలను చేకూర్చు సౌభాగ్యదేవత మంగళగౌరి. అందుకే వివాహంలో శుభముహూర్తానికి ముందు వధువుచేత గౌరీ పూజ చేయించడం  మన హిందూసాంప్రదాయం. 

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే|

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!

సమస్తములైన శుభములకును శుభ కరమగు దానా !శివుని అర్ధాంగి అయిన సమస్తములైన ప్రయోజనములను నెర వేర్చెడి శక్తి గలదానా భక్తులకు పెద్ద దిక్కు అయినదానా ! ముక్కంటి అర్ధాంగి విష్ణుమూర్తి సోదరీ ఓ పార్వతి మాతా ! నీకు నా యీ వందనము చెందును గాక !

భగదారాధన సమయంలో ప్రారంభంలో విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ, ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను కూడా సంస్మరిస్తు ఇలా అంటాము:-

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ 

నామము చేతగాని, రూపము చేతగాని ఏదేవుడు శివుడో, ఏదేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణము సర్వత్ర, సర్వలోకములకూ మంగళకరము. 

దేవాసురులు అమృతము కొఱకై సాగరమథన సమయంలో హాలాహలం ఉద్భవించగా, ఆ హాలాహలాగ్నికి లోకాలు అల్లాడిపోతుంటే జగన్మాత పరమేశ్వరుని ఆ హాలాహల భక్షణము చేయమనినప్పుడు బమ్మెరపోతనా మాత్యులవారు జగన్మాతను సర్వమంగళ యని అన్నారు.

కంద పద్యము

మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

భావము

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

బ్రాహ్మణుడు, ముత్తైదువ, గోవు, అగ్ని,  బంగారము, నేయి, ఆదిత్యుడు, జలము, రాజు, తులసీదళములు, పుష్పములు, చెరకు, చిక్కుడు, జీలకఱ్ఱ,  ధనియాలు, పాలు, కుంకుమ, ఉప్పు, నల్లపూసలు, పసుపు కొమ్ములు ఇత్యాదులు అన్నియును మంగళకరమైనవి. ఇటువంటివి అన్నియును సదా సమకూరి ఉండునట్లు జగన్మాత అనుగ్రహిస్తుంది గనుక అమ్మవారిని సర్వమంగళా యని అన్నాము. ధనధాన్యములు, పాడిపంటలు, సిరిసంపదలు, అలాగే స్త్రీలకు ఐదవతనమును ప్రసాదించును.

 ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట. ఆ అయిదు మంగళ కర వస్తువులు 1.మంగళసూత్రము, 2. పసుపు, 3.కుంకుమ, 4.గాజులు, 5. మట్టెలు. కనుకనే మన హిందూ స్త్రీలు సర్వదా ఈ ఐదు అలంకారములను ధరించి ఉంటారు.  మంగళకరమైస వీటిని స్త్రీలకు సదా కలిగియుండేలా జగన్మాత కరుణించును గనక అమ్మవారిని సర్వమంగళా యని  అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమంగళాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:37, 04/01/2021] +91 95058 13235: 4.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది మూడవ అధ్యాయము

శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

23.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఇత్యుక్తా ద్విజపత్న్యస్తా యజ్ఞవాటం పునర్గతాః|

తే చానసూయవః స్వాభిః స్త్రీభిః సత్రమపారయన్॥9221॥

శ్రీశుకుడు పలికెను  శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ ద్విజపత్నులు తిరిగి యజ్ఞశాలలకు చేరిరి. ఆ బ్రాహ్మణులును తమ భార్యలను ఎట్టి దోషదృష్టితో చూడక ప్రేమతో  ఆదరించిరి. పిమ్మట వారు తమ సతులతో గూడి యజ్ఞమును పూర్తిచేసిరి.

23.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

తత్రైకా విధృతా భర్త్రా భగవంతం యథాశ్రుతమ్|

హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనమ్॥9222॥

ఆ విప్రపత్నులలో ఒక వనిత తన భర్త అడ్డగింపగా ఇంటిలో ఉండిపోయెను. ఐనను ఆ భక్తురాలు తాను విన్నరీతిగా (తనకు తెలిసిన విధముగా) భగవంతుని తన హృదయమునందే నిలుపుకొని, పురాకృత కర్మఫలముగా తనకు లభించిన దేహమును త్యజించెను.

23.35 (ముప్పది ఐదవ శ్లోకము)

భగవానపి గోవిందస్తేనైవాన్నేన గోపకాన్|

చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః॥9223॥

శ్రీకృష్ణపరమాత్మ బ్రాహ్మణపత్నులు సమర్పించిన చతుర్విధములగు భోజన పదార్థములను ముందుగా గోపాలురచే భుజించేసెను. పిదప ఆ ప్రభువు తానును స్వయముగా ఆరగించెను.

23.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఏవం లీలానరవపుర్నృలోకమనుశీలయన్|

రేమే గోగోపగోపీనాం రమయన్ రూపవాక్కృతైః॥9224॥

ఇట్లు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు మానవలోకమర్యాదను అనుసరించుచు, తన రూపవైభవము చేతను, వాక్చాతుర్యములచేతను గోవులను, గోపాలురను, గోపికలను రంజింపజేయుచు విహరించెను. వారి అలౌకిక ప్రేమలకు తానును ఆనందించెను.

23.37 (ముప్పది ఏడవ శ్లోకము)

అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః|

యద్విశ్వేశ్వరయోర్యాచ్ఞామహన్మ నృవిడంబయోః॥9225॥

లోకకల్యాణార్థము అవతరించిన బలరామకృష్ణులు సామాన్య మానవులవలె మసలు కొనుచుండుటచే వారి మహత్త్వమును గుర్తింపలేక అజ్ఞానులైన ఆ బ్రాహ్మణులు ఆ దివ్యపురుషుల అభ్యర్థనను తిరస్కరించి, అపరాధమొనర్చిరి. పిమ్మట ఆ ద్విజులు తెలివితెచ్చుకొని, తామొనర్చిన అకృత్యమును (దోషమును) స్మరించుకొనుచు మిగుల పశ్చాత్తాపపడిరి.

23.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీమ్|

ఆత్మానం చ తయా హీనమనుతప్తా వ్యగర్హయన్॥9226॥

ఆ ద్విజులు శ్రీకృష్ణపరమాత్మునియెడ తమ పత్నులకు గల అలౌకికభక్తిని అర్థము చేసికొనిరి. పిదప వారు తమ భక్తిరాహిత్యమునకు నొచ్చుకొనుచు, పరితాపముతో తమను తాము ఇట్లు .నిందించుకొనిరి.

23.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ధిగ్జన్మ నస్త్రివృద్విద్యాం ధిగ్వ్రతం ధిగ్బహుజ్ఞతామ్|

ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖా యే త్వధోక్షజే॥9227॥

'మనము ఉత్తమ కులముస జన్మించితిమి. గాయత్రీ ఉపదేశమును పొంది, ద్విజులమైతిమి. వేదాధ్యయన మొనర్చి దీక్షాపూర్వకముగా గొప్ప గొప్ప యజ్ఞములను ఆచరించితిమి.  (ఈ విధముగా మనకు శౌక్ల్యము, సావిత్రము, దైక్షము, అను మూడు జన్మలు ప్రాప్తించినవి). వేదశాస్త్రములను సమగ్రముగా అధ్యయనము చేసితిమి. నియమనిష్ఠలతో బ్రహ్మచర్యమును పాటించితిమి. వైదిక (శ్రౌత) విజ్ఞానమును పుక్కిటబట్టితిమి. మనము పవిత్ర వంశమునకు చెందినవారము. యజ్ఞయాగాది కర్మలను నిర్వహించుటయందును, నిర్వహింపజేయుట యందును (యజనయాజనముల యందు) సర్వసమర్థులము. ఐనను కృష్ణభగవానుని యెడ భక్తిశ్రద్ధలు లేనట్టి మన ఈ జన్మాదుల ఔన్నత్యములన్నియును వ్యర్థములే.

23.40  (నలుబదియవ శ్లోకము)

నూనం భగవతో మాయా యోగినామపి మోహినీ|

యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః॥9228॥

భగవంతుని మాయ తిరుగులేనట్టిది. ఆ మాయ నిశ్చయముగా యోగీంద్రులను సైతము మోహింపజేయును. మనము ద్విజశ్రేష్ఠులమై మానవాళికి గురువులమైనప్పటికినీ దైవమాయామోహితులమై, మనకు ఏది శ్రేయస్కరమో ఎఱుగలేకపోయితిమి'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:41, 04/01/2021] +91 95058 13235: 4.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది మూడవ అధ్యాయము

శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

23.41 (నలుబది ఒకటవ శ్లోకము)

అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ|

దురంతభావం యోఽవిధ్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్॥9228॥

ఆహా! మనకున్నట్లుగా వేదశాస్త్రాదివిద్యా వైభవములలో ఏ ఒక్కటియును లేనప్పటికినీ, మన గృహిణులకు జగద్గురువైన శ్రీకృష్ణభగవానునియందు నిరవధికమైన భక్తిభావము అబ్బినది చూడుడు. ఇట్టి కృష్ణభక్తి ఇల్లు - వాకిలి అను పేరుగల మృత్యురూపములైన పాశములను త్రెంచివేయును (అనన్యమైన కృవ్ణ (దైవ)) భక్తివలన వీరి భవబంధములు విచ్ఛిన్నములైనవి).

23.42 (నలుబది రెండవ శ్లోకము)

నాఽసాం ద్విజాతిసంస్కారో న నివాసో గురావపి|

న తపో నాఽఽత్మమీమాంసా న శౌచం న క్రియాః శుభాః॥9230॥

23.43 (నలుబది మూడవ శ్లోకము)

అథాపి హ్యుత్తమశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే|

భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి॥9231॥

మన గృహిణులు ఉపనయనాది సంస్కారములకు నోచుకొనలేదు. వీరు గురుకులవాసము చేయలేదు (గురుకులమున విద్యాశిక్షణమును పొందలేదు). జపతపములను ఆచరింపలేదు. వీరికి ఆత్మవిచారము సున్న. పూర్తి పవిత్రత లేనెేలేదు. శుభకర్మలను నిర్వహింపలేదు. ఐనప్పటికిని వీరికి  పవిత్ర కీర్తిమంతుడైన యోగేశ్వరేశ్వరుడగు కృష్ణపరమాత్మయందు దృఢమైన భక్తి కుదురుకొనినది. ఉపనయనాది సంస్కారములు ఎన్ని ఉన్నప్పటికిని మనకు ఆ భక్తి మాత్రము ప్రాప్తించలేదు.

23.44 (నలుబది నాలుగవ శ్లోకము)

నను స్వార్థవిమూఢానాం ప్రమత్తానాం గృహేహయా|

అహో నః స్మారయామాస గోపవాక్యైః సతాం గతిః॥9232

మనము గృహకృత్యములలో  కొట్టుమిట్టాడుచు (తాపత్రయములో మునిగి) మంచిచెడులను మఱచిపోయితిమి (సదసద్విచక్షణను కోల్పోయితిమి). ఐనను సాధుపరిరక్షకుడైన ఆ పరమపురుషుడు గోపాలురద్వారా మనకు కనువిప్పు కలుగునట్లు చేసెను. ఆహా! ఆ ప్రభువు ఎంత దయామయుడో కదా!

23.45 (నలుబది ఐదవ శ్లోకము)

అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాం పతేః|

ఈశితవ్యైః కిమస్మాభిరీశస్యైతద్విడంబనమ్॥9233॥

భగవంతుడు (శ్రీకృష్ణుడు) పూర్ణకాముడు. ఆ స్వామి పొందనిదియులేదు. పొందవలసినదియు లేదు. అందఱికిని ఐహిక, ఆముష్మిక ఫలములను ప్రసాదించువాడు అతడే. కనుక ఆ స్వామి మనవంటి అల్పులనుండి ఆశించునది ఏముండును? మనలను చైతన్యవంతులను చేయుటకే (మనలో జాగృతిని కలిగించుటకే) లోకమర్యాదను అనుసరించి ఆహార పదార్థములను అర్థించు నెపముతో గోపాలురను మనకడకు పంపెను.

23.46 (నలుబది ఆరవ శ్లోకము)

హిత్వాన్యాన్ భజతే యం శ్రీః పాదస్పర్శాశయా సకృత్|

ఆత్మదోషాపవర్గేణ తద్యాచ్ఞా జనమోహినీ॥9234॥

సకలసంపదలకును నిధియైన లక్ష్మీదేవి తన చాంచల్యాది దోషముల నివృత్తికై బ్రహ్మాది దేవతలను కాదని, ఆ శ్రీహరి (శ్రీకృష్ణుని) చరణకమలములను నిరంతరము సేవించుచుండును. అట్టి పరమపురుషునకు భోజనపదార్థములను యాచింపవలసిన అవసరము ఉండునా? అట్లొనర్చుట కేవలము జనులను (లోకమును) మోహింపజేయుటకే.

23.47 (నలుబది ఏడవ శ్లోకము)

దేశః కాలః పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోఽగ్నయః|

దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః॥9235॥

దేశము, కాలము, వేర్వేఱు పదార్థములు, మంత్రతంత్రములు, ద్విజులు, అగ్నులు, దేవతలు, యజమాని, క్రతువు, ధర్మము మొదలగునవి అన్నియును ఆ భగవత్స్వరూపములే. 

23.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

స ఏష భగవాన్ సాక్షాద్విష్ణుర్యోగేశ్వరేశ్వరః|

జాతో యదుష్విత్యశృణ్మ హ్యపి మూఢా న విద్మహే॥9236॥

యోగేశ్వరేశ్వరుడు, పరమాత్ముడు ఐన సాక్షాత్తు శ్రీమహావిష్ణువే యదువంశమున శ్రీకృష్ణుడుగా అవతరించెనని వినియుంటిమి. కాని మూఢులమైన మనము ఆ ప్రభువును గుర్తింపలేకపోయితిమి.

23.49  (నలుబది తొమ్మిదవ శ్లోకము)

అహో వయం ధన్యతమా యేషాం నస్తాదృశీః స్త్రియః|

భక్త్యా యాసాం మతిర్జాతా అస్మాకం నిశ్చలా హరౌ॥9237॥

ఐనను ఇటువంటి సాధ్వీమణులు మనకు భార్యలైనందులకు మనము  ఎంతయు అదృష్టవంతులము. వీరియొక్క అనన్యభక్తివలననే గదా మనకు శ్రీహరి (శ్రీకృష్ణుని) యందు నిశ్చలమైన భక్తిభావము ఏర్పడినది.

23.50  (ఏబదియవ శ్లోకము)

నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధసే|

యన్మాయామోహితధియో భ్రమామః కర్మవర్త్మసు॥9238॥

పరమేశ్వరా! శ్రీకృష్ణా! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాయామోహితులమై, అస్థిరమైన స్వర్గ సుఖములను అపేక్షించుచు, మేము భ్రమలో పడి యజ్ఞయాగాది కర్మలలో మునిగి తేలుచున్నాము. స్వామీ! మాపై ఈ విధముగా అనుగ్రహము చూపినందులకు నీకు పదివేల నమస్కారములు.

23.51  (ఏబది ఒకటవ శ్లోకము)

స వై న ఆద్యః పురుషః స్వమాయామోహితాత్మనామ్|

అవిజ్ఞతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమమ్॥9239॥

ఆదిపురుషుడైన శ్రీకృష్ణభగవానుడు మా అపరాధములను క్షమించుగాక! ఏలయన మా బుద్ధి ఆ స్వామి మాయచే మోహితమైనది. అందువలన మేము అజ్ఞానులమై కృష్ణమహత్త్వమును ఎఱుంగమైతిమి. 

23.52 (ఏబది రెండవ శ్లోకము)

ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేలనాః|

దిదృక్షవోఽప్యచ్యుతయోః కంసాద్భీతా న చాచలన్॥9240॥

పరీక్షిన్మహారాజా! ఆ బ్రాహ్మణులు ఇదివఱలో శ్రీకృష్ణుని యెడ చులకన భావము వహించియుండిరి. ఇప్పుడు వారు తమ తప్పిదములను గుర్తించుచు ఈ విధముగా పశ్చాత్తాపపడసాగిరి. బలరామకృష్ణులను దర్శింపగోరుచున్నను వారు కంసునకు భయపడి వారిని దర్శింపలేకపోయిరి.

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే త్రయోవింశోఽధ్యాయః (23)

ఇది భాగవత  మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది మూడవ అధ్యాయము (23)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:49, 05/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

775వ నామ మంత్రము 5.1.2021

ఓం మేరునిలయాయై నమః

మేరు పర్వతము లేదా మేరుప్రస్తారము లేదా మేరు మంత్రము నివాసముగా విలసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మేరునిలయా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మేరునిలయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు ప్రసాదించును మరియు ఆత్మానందానుభూతిని కలుగజేయును.

పరమేశ్వరిని సుమేరుశృంగమధ్యస్థా యని అన్నాము. మేరు రేవ నిలయో యస్యాః సుమేరు శిఖరం మధ్యలో గొప్పకాంతిగలదై నివాసముగా ఉన్నది లలితాంబ.  ఈ సుమేరు శిఖరం చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారు. ఈ పర్వతశిఖరం మీద అమ్మవారు మాత్రమే కాకుండా దేవతలు కూడా ఉంటారు. ఈ శిఖరానికి చుట్టూగల సముద్రమధ్యమందు పదునలుగురు నిత్యాదేవతలు కూడా ఉంటారు. బయట పరమాకాశమందు చిత్రాదేవి యను నిత్య ఉంటుంది.

శ్రీచక్రమునకు భూప్రస్తారము, కైలాసప్రస్తారము, మేరుప్రస్తారము అని మూడు ప్రస్తారములు ఉన్నవి. ఈ మూడింటిలో వశిన్యాద్యష్టకముతో (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళినిలతో)  శ్రీచక్రమునకు ఐక్యభావనచేసినచో అది భూప్రస్తారము మాతృకావర్ణములకు (అకారాది క్షకారాంతములు) శ్రీచక్రమునకు ఐక్యభావన చేసినచో అది కైలాసప్రస్తారము. షోడశనిత్యలకు (కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, శ్రీవిద్యలకు) శ్రీచక్రమునకు ఐక్యభావనచేసినచో అది మేరుప్రస్తారము. ఇట్టి మేరువే నివాసమై అలరారుచున్నది షోడశనిత్యలలో శ్రీవిద్య అను నిత్యయే పరమేశ్వరి. ఈ మేరుప్రస్తారమే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ. ఈ విధంగా భావనచేయు విధానము జ్ఞానార్ణవతంత్రంలో తొమ్మిది అక్షరముల మంత్రము నవార్ణవమంత్రము అను పేరుతో మేరువు మంత్రం ఉద్ధరింపబడినది. అట్టి మేరువు మంత్రమే నివాసముగా విలసిల్లినది శ్రీమాత. 

భూమి శ్చంద్ర.శివో మాయా శక్తిః కృష్ణమాదనౌ|

అర్ధచంద్ర శ్చ బిందు శ్చ నవార్ణో మేరు రుచ్యతే॥ (సౌభాగ్యభాస్కరం, 872వ పుట)

1. భూమిః     -   లం

2. చన్ద్రః        -   సం

3. శివః           -   హం 

4.  మాయా    -    ఈం

5.   శక్తిః          -     ఏం

6.   కృష్ణమాద్య -  రం, 

7.   మాదనౌ      -   కం

8.   అర్ధచన్ద్రః -  అః

9.    బిందువు -  అం

ఈ తొమ్మిది వర్ణములు గలదే మేరు మంత్రము. అటువంటి మేరుమంత్ర స్వరూపిణి జగన్మాత. 

విష్ణుపాదాల వద్ద నుండి వెడలిన గంగానది ఈ మేరువునుండే ఉద్భవించినది. అక్కడ నుండి ప్రప్రధమంగా బ్రహ్మలోకానికి వెళ్ళినది. అక్కడ నుండి ధృవపదము, సప్తర్షి మండలాలకు ప్రదక్షిణంగా వెళ్ళి, పిదప చంద్రమండలము దర్శించి, సత్య (బ్రహ్మ) లోకంచేరినది. ఆ తరువాత సీత, అలకనంద, చతుర, భద్ర యను నాలుగు పాయలుగా చీలింది.  జగన్మాత ఈ మేరు శిఖరంమీదే నివాసమైనది గనుక మేరునిలయా యనిఅనబడినది.

ఈ మేరు మంత్రం నుండియే అమ్మవారి మంత్రములన్నియు పుట్టినవని చెప్పబడినది.

ఈ నవార్ణవములనుండి శ్రీచక్రము ఆవిర్భవించిన విధానము

1) ల కారము - పృథివీబీజము - భూపురము

2) స కారము - చంద్రబీజము - షోడశకళాత్మకము - షోడశదళపద్మము

3) హ కారము - శివబీజము - అష్టమూర్త్యాత్మకం - అష్టదళపద్మము

4) ఈ కారము - మాయాబీజము - చతుర్దశభువనాత్మకమైన చతుర్దశారం

5) ఏ కారము - శక్తిబీజము - దశావతారాలకు ప్రతీక అయిన బహుర్దిశారం

6) ర కారం - అగ్నిబీజము - అగ్నికళలతో కూడిన అంతర్దశారం

7) క కారం - మన్మథబీజము వసుకోణాత్మకము - అష్టకోణం

8) అర్ధచంద్రము - త్రిగుణాత్మకము - త్రికోణం

9) బిందువు - పరబ్రహ్మాత్మకము - బిందువు - పరమేశ్వరీ నివాసము.

ఇటువంటి నవార్ణవనిర్మితమైన  మేరువునందు పరమేశ్వరి ఉంటుంది గనుక మేరునిలయా అని అన్నాము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:49, 05/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

201వ నామ మంత్రము 05.01.2021

ఓం సద్గతిప్రదాయై నమః

భక్తులకు వారు చేసిన కర్మలననుసరించి, సాధనా పటిమను బట్టి ముక్తిని ప్రసాదించు పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సద్గతిప్రదా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సద్గతిప్రదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని అత్యంత భక్తితత్పరతతో ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరి భౌతికముగా సుఖశాంతులను ప్రసాదించి, ఆముష్మిక పరమైన సద్గతులకు కావలసిన ధ్యానదీక్షను ప్రసాదించి తరింపజేయును.

సద్గతులు రెండు రకాలు ఒకటి ఇహము, రెండవది పరము. ఐహికమైన వాంఛలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఇది ఐహికము. పరము అనగా భగవంతుడు ప్రసాదించి ముక్తి, మోక్షము, ఆత్మానందానుభూతి వంటివి.

పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు) దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై,

బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే అమ్మవారికి అతిసమీపంగా ఉండి ఆ తల్లిని

సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల అమ్మవారికి

సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆ తల్లి యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు.

ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంల వర్ణిస్తూగతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః

శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|

త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా

‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||

ఓ జగన్మాతా ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే

సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు. శ్రీచక్రంలో ఐదు ‌శక్తిచక్రాలు, నాలుగు శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది. మానవ శరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.

ఆధారచక్రానికి అధిదేవత - గణపతి

స్వాధిష్టానానికి అధిదేవత - బ్రహ్మ

మణిపూరానికి అధిదేవత - విష్ణువు

అనాహతానికి అధిదేవత - రుద్రుడు

విశుద్ధిచక్రానికి అధిదేవత - మహేశ్వరుడు

ఆజ్ఞాచక్రానికి అధిదేవత - సదాశివుడు

వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె

పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.

కర్మలఫలితముననుసరించియే సంస్కారము ఏర్పడుతుంది. భగవద్భక్తి అనేది, సత్ప్రవర్తన అనునదికూడా పూర్వజన్మ కర్మలవాసన ననుసరించియే మానవునిలో ఏర్పడుతుంది. హరిద్వేషియైన హిరణ్యకశిపునికి  హరిభక్తుడైన ప్రహ్లాదుడు పుత్రునిగా జన్మించాడు. బోయవాడు వాల్మీకిగా మారి మహాకావ్యాలను వ్రాశాడు. మేకలకాపరి కాళికాదేవిభక్తుడై మహాకవి కాళిదాసుగా సంస్కృతమహాప్రబంధములను సృష్టించాడు. ఇదంతా పూర్వజన్మవాసనేగదా. 

జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ. అందునా భగవద్భక్తితత్పరత కలిగియున్న జన్మ మరింత ఉత్తమం. జగన్మాత నామస్మరణతో జన్మసాఫల్యత సాధించడం అనేది ఉత్తమాతి ఉత్తమం. 

దుర్వాస మహాముని శ్రీచక్ర పూజాఫలాన్ని ఇలా చెప్పడం జరిగింది.

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది. ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు. పరం కావాలంటే ఇహం ఉండదు. అనగా భోగభోగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు. అలాగే ముక్తికావాలంటే భోగభాగ్యాలను త్యజించాలి.

యత్రా పిభోగో న చ తత్ర మోక్షః యత్రా పి మోక్షోన చ తత్ర భోగః

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

కాని పరమేశ్వరిని అర్చించిన వారికి భోగము, మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది. అందుకే ఆ పరమేశ్వరిని స్వర్గాపవర్గదా అని అన్నాము.

ఈ జగత్తులో చతుర్దశభువనాలున్నాయి. అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి. మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పైలోకాలకుపోతాడు. అవన్నీ సద్గతులే.

మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని బట్టి ఉత్తరజన్మ పొందుతాడు. లోకంలో 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, కుక్కలు, పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మలలోకి మానవజన్మ

దుర్లభమైనది.

జగన్మాతను అర్చించిన మానవుడు 

తాను చేసిన కర్మలనునసరించి సద్గతులు ఆ తల్లి ప్రసాదిస్తుంది.    ఆ  సద్గతులు ఐదు రకాలు గా వర్ణించబడినది.

అవి 1. సార్షిరూపముక్తి, 2. సాలోక్యముక్తి, 3. సామీప్యముక్తి, 4. సారూప్యముక్తి, 5. సాయుజ్యముక్తి.

మణిపూరం లో పరమేశ్వరిని అర్చించేవారు ఆ తల్లికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు

అనాహతం లో ఆ తల్లిని అర్చించేవారు శ్రీమన్నగరంలోనే నివసించగలుగుతారు.

దీన్ని సాలోక్యముక్తి అంటారు.

  విశుద్ధిచక్రం లో అమ్మవారిని అర్చించేవారు ఆ తల్లికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు.

దీనినే సామీప్యముక్తి

ఆజ్ఞాచక్రం లో లలితాంబను అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన

రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి

 సహస్రారం లో పరమేశ్వరిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ

ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. దీనినే సాయుజ్యం  అంటారు.

ఇవేకాక భక్తులకు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవించాలి ? తిరిగి ఎప్పుడు జన్మించాలి ? అనేది

నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరీ. ఈ రకంగా ఆ అమ్మ మానవులకు సద్దతులను ప్రసాదిస్తుంది.

పద్మపురాణంలో చతుర్దశినాడు మూడు కాలములందు శ్రీమాతను ఎవరైతే పూజిస్తారో వారు పరాస్థానము పొందుతారు అని చెప్పబడింది.

ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి (సద్గతి) లభిస్తుంది. కాబట్టి ఆ తల్లిని సద్గతిప్రదా అని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సద్గతిప్రదాయై నమః అని అనవలెను.

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:49, 05/01/2021] +91 95058 13235: 5.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట

శ్రీకృష్ణుడు ఇంద్రయాగమును నివారించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

24.1 (ప్రథమ శ్లోకము)

భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః|

అపశ్యన్నివసన్ గోపానింద్రయాగకృతోద్యమాన్॥9241॥

శ్రీశుకుడు నుడివెను శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి తన దివ్యలీలలను ప్రదర్శించుచు బృందావనమునందే నివసించుచుండెను. ఒకానొకనాడు అచటి గోపాలురు అందఱును ఇంద్రయాగమును నిర్వహించుటకు సన్నద్ధులగుచుండగా శ్రీకృష్ణుడు చూచెను.

24.2 (రెండవ శ్లోకము)

తదభిజ్ఞోఽపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః|

ప్రశ్రయావనతోఽపృచ్ఛద్ వృద్ధాన్ నందపురోగమాన్॥9242॥

సర్వాంతర్యామియు, సర్వజ్ఞుడును ఐన కృష్ణప్రభువు వారు చేయు ప్రయత్నములు అన్నియును ఇంద్రయాగమును నిర్వహించుటకై

జరుగుచున్నవని ఎఱుగును. ఐనను, ఏమియు తెలియనివానివలె ఆ స్వామి సవినయముగా నందుడు మొదలగు వృద్ధగోపాలురను ఇట్లడిగెను-

24.3 (మూడవ శ్లోకము)

కథ్యతాం మే పితః కోఽయం సంభ్రమో వ ఉపాగతః|

కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః॥9243॥

నాయనా! ఇప్పుడు జరుగుచున్న ఈ కోలాహలము అంతయు దేనికి? దీని ప్రయోజనము ఏమి? ఏ దేవత కొఱకై ఇది ఉద్దేశింపబడినది? దీనిని  నిర్వహించుటకై కావలసిన సాధన సంపత్తి ఎట్టిది? ఎవరు నిర్వహించెదరు? ఈ విషయములు నాకు విపులముగా తెలుపుము.

24.4 (నాలుగవ శ్లోకము)

ఏతద్బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః|

న హి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ॥9244॥

24.5 (ఐదవ శ్లోకము)

అస్త్యస్వపరదృష్టీనామమిత్రోదాస్తవిద్విషామ్|

ఉదాసీనోఽరివద్వర్జ్య ఆత్మవత్సుహృదుచ్యతే॥9245॥

తండ్రీ! వీటిని అన్నింటిని గూర్చి తెలిసికొనవలెనని నేను మిగుల కుతూహలపడుచున్నాను. స్వపరభేదములేనట్టి సత్పురుషులు 'ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు ఉదాసీనుడు' అని భావింపరుగదా! ఉదాసీనుని శత్రువువలె వర్జింపవలెను. మిత్రుని తన ఆత్మీయునిగా భావింపవలెను. కావున, మీ ప్రయత్నములు గోప్యములుగానిచో అన్నింటిని వివరముగా తెలుపుడు.

24.6 (ఆరవ శ్లోకము)

జ్ఞాత్వాజ్ఞాత్వా చ కర్మాణి జనోఽయమనుతిష్ఠతి|

విదుషః కర్మసిద్ధిః స్యాత్తథా నావిదుషో భవేత్॥9246॥

సాధారణముగా లోకములో కొందఱు జనులు తాము చేయు పనులను గూర్చి లోతుగా తెలిసికొని చేయుచుందురు, మఱికొందరు లోతుపాతులు తెలియకున్నను లోకాచారమును అనుసరించి ఆయా కార్యములను ఆచరించుచుండుట పరిపాటి. తెలిసి చేసినవారి కార్యములు సఫలమైనట్లుగా, తెలియక చేసినవారి కృత్యములు ఫలింపవు.

24.7 (ఏడవ శ్లోకము)

తత్ర తావత్క్రియాయోగో భవతాం కిం విచారితః|

అథ వా లౌకికస్తన్మే పృచ్ఛతః సాధు భణ్యతామ్॥9247॥

కావున మీరందఱును తలపెట్టిన ఈ  కార్యక్రమము శాస్త్రసమ్మతమేనా? పెద్దలను బాగుగా విచారించియే చేయుచున్నారా? లేక లౌకిక ఆచారమా? నేను జిజ్ఞాసతో అడుగుచున్నాను. స్పష్టముగా తెలుపుడు".

నంద ఉవాచ

24.8 (ఎనిమిదవ శ్లోకము)

పర్జన్యో భగవానింద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః|

తేఽభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః॥9248॥

అంతట నందుడు ఇట్లనెను "నాయనా! ఇంద్రుడు సకలదేవతలకును ప్రభువు. వర్షాధిదేవత అతడే. మేఘములు అన్నియును ఆ సురపతి ఆజ్ఞను అనుసరించియే ప్రవర్తించుచుండును. అవి ప్రాణులను సంతృప్తిపఱచుటకై అతని ఆదేశము ప్రకారము జలములను వర్షించుచుండుసు. జలములే ప్రాణులకు జీవనాధారములు గదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:43, 05/01/2021] +91 95058 13235: 5.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు బ్రాహ్మణపత్నులను అనుగ్రహించుట

శ్రీకృష్ణుడు ఇంద్రయాగమును నివారించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

24.9 (తొమ్మిదవ శ్లోకము)

తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరమ్|

ద్రవ్యైస్తద్రేతసా సిద్ధైర్యజంతే క్రతుభిర్నరాః॥9249॥

నాయనా! కృష్ణా! మేము అందఱమూ మేఘములకు అధిపతియైన ఆ దేవేంద్రుని సంతృప్తిపఱచుటకై ఈ యజ్ఞమును  ఆచరించుచున్నాము. ఆయన అనుగ్రహమున నడచుచున్న వర్షజలముల వలన పచ్చికలు పెఱుగుచున్నవి. పొలములు సస్యశ్యామలములు అగుచున్నవి. ఆ పచ్చికలను మేసి గోవులు సుదృఢములై ఆరోగ్యభాగ్యములతో వర్ధిల్లుచున్నవి. ఆ ఆవుల వలన లభించిన పాలు, పెఱుగు, నేయి మొదలగు ద్రవ్యములద్వారా జనులు ఈ ఇంద్రయాగమును ఆచరించుచున్నారు.

24.10 (పదియవ శ్లోకము)

తచ్ఛేషేణోపజీవంతి త్రివర్గఫలహేతవే|

పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః॥9250॥

ఇంద్రయాగమును ఆచరించుట వలన లభించిన పాడిపంటలవలన ప్రాణుల సుఖజీవనము కొనసాగుచున్నది. ఆ విధముగా మానవులయొక్క ధర్మార్థకామములు అనెడి పురుషార్థములకు యజ్ఞములు మూలకములగుచున్నవి. కావున మానవాళియొక్క వ్యవసాయాది కార్యములకు ఫలములను ఇచ్చుచున్నవాడు ఇంద్రుడే.

24.11 (పదకొండవ శ్లోకము)

య ఏవం విసృజేద్ధర్మం పారంపర్యాగతం నరః|

కామాల్లోభాద్భయాద్ద్వేషాత్స వై నాప్నోతి శోభనమ్॥9251॥

ఈ ధర్మము (ఇంద్రయాగమును నిర్వహించుట) మనకు వంశపరంపరగా (పెక్కుతరముల నుండి) వచ్చుచున్నది. కామము, లోభము, భయము, ద్వేషము మొదలగువాని కారణముగా జనులు ఈ ధర్మమును ఆచరింపనిచో వారికి శుభములు చేకూరవు".

శ్రీశుక ఉవాచ

24.12 (పండ్రెండవ శ్లోకము)

వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజౌకసామ్|

ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః॥9252॥

శ్రీశుకుడు వచించెను నందాది గోపాలురు చెప్పిన మాటలను విన్న పిమ్మట శ్రీకృష్ణుడు ఇంద్రునకు కోపము తెప్పించు విధముగా తన తండ్రితో ఇట్లనెను.

శ్రీభగవానువాచ24.13  ( పదమూడవ శ్లోకము)

కర్మణా జాయతే జంతుః కర్మణైవ విలీయతే|

సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే॥9253॥

శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను "ప్రాణులకు తామొనర్చిన సకృతదుష్కృతములను బట్టియే జననమరణములు ప్రాప్తించుచుండును. వారు ఆచరించిన కర్మలనుబట్టి సుఖదుఃఖములు, భయము, సకల శుభములును చేకూరుచుండును.

24.15 (పదునాలుగవ శ్లోకము)

అస్తి చేదీశ్వరః కశ్చిత్ఫలరూప్యన్యకర్మణామ్|

కర్తారం భజతే సోఽపి న హ్యకర్తుః ప్రభుర్హి సః॥9254॥

కర్మలకు తగిన ఫలములను ఇచ్చెడివాడు ఈశ్వరుడేయైనచో, జీవుల కర్మలకు తగిన ఫలములను (వారికి) అతడే ఒసంగును. అంతేగాని కర్మలు చేయనివారికి అతడు ఎట్టిఫలములనూ ఈయడుగదా!

24.15 (పదునైదవ శ్లోకము)

కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినామ్|

అనీశేనాన్యథా కర్తుం స్వభావవిహితం నృణామ్॥9255॥

ప్రాణులన్నియును తమ తమ కర్మలనుబట్టి తగిన ఫలములను అనుభవించుచున్నప్పుడు ఇంద్రునియొక్క అవసరమేముండును? పూర్వసంస్కారములను అనుసరించి మానవులు తమ కర్మఫలములను పొందుచుందురు.వాటిని మార్చుటకు ఆ ఇద్రునికి గూడ సాద్యము కాదు. కనుక అతని వలన  ప్రయోజనము ఏమి?

24.16 (తొమ్మిదవ శ్లోకము)

స్వభావతంత్రో హి జనః స్వభావమనువర్తతే|

స్వభావస్థమిదం సర్వం సదేవాసురమానుషమ్॥9256॥

మానవుడు తన స్వభావమునకు (పూర్వ సంస్కారమునకు) అధీనుడు. అతడు  దానినే అనుసరించుచుండును. దేవతలు, అసురులు, మానవులు మొదలగు ప్రాణులతో గూడిన జగత్తంతయును స్వభావము పైననే  (పూర్వసంస్కారముల మీదనే) ఆధారపడియున్నది. 

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:19, 06/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

776వ నామ మంత్రము 06.01.2021

ఓం మందార కుసుమ ప్రియాయై నమః

దేవ పుష్పమైన మందార పుష్పము లేదా తెల్లజిల్లేడు పువ్వు అనిన ప్రీతిగలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మందారకుసుమప్రియా యను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మందార కుసుమప్రియాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తిప్రపత్తులతో  ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరి బ్రహ్మజ్ఞానతత్త్వమును తెలియు విధముగా అనుగ్రహించి తరింపజేయును.

సిందూరారుణవిగ్రహాం,  సిందూరం మాదిరిగా ఎర్రని శరీరము గలగి - నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా - ఎర్రని శరీరకాంతితో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింపజేయునది,  రక్తోత్పలం బిభ్రతీం-  ఎర్రని కలువను ధరించినది. రత్నఘటస్థ రక్తచరణాం రత్నఘటమునందు ఎర్రని పాదాలు ఉంచినది, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్కత్కటీ తటీ-  కటిప్రదేశమున ఎర్రని వస్త్రముతో విరాజిల్లునది, ఇంద్రగోప పరిక్షిప్తస్మరతూణాభ జంఘికా-  ఎర్రని రంగుతో ఉన్న ఆరుద్రపురుగులచే చెక్కబడిన మన్మథుని అమ్ములపొదిలా ఉన్న జంఘకలు కలిగినది.  ఇలా సర్వారుణా దేహమంతయూ అరుణ వర్ణమై ప్రకాశించు జగన్మాతకు అదే అరుణవర్ణము గలిగిన మందార పుష్పము అంటే అత్యంత ప్రీతిగలిగియున్నది గనుకనే మందారకుసుమప్రియా యని అనబడినది.   జగన్మాతకు అరుణ వర్ణమనిన అంత ప్రీతిగలిగినది. మందార పుష్పాన్ని జపాకుసుమము అని కూడా అంటారు. ఇంతకు ముందు జపాపుష్పనిభాకృతిః అని 766వ నామ మంత్రముతో  అమ్మవారిని స్తుతించాము.

మందారకుసుమములు దేవఫుష్పములు. దేవతార్చనకు మందారములు అత్యంత ప్రాశస్త్యము గలిగియున్న పుష్పములు. దేవుని మందిరమునకు నిండుతనాన్ని కలిగిస్తుంది. పవిత్రతను చేకూరుస్తుంది. మందారపుష్పంతో చేయు అర్చనలో మనసు ఎంతో ఆనందమనుభవిస్తుంది. 

జగన్మాతకు మందారమనిన అత్యంత ప్రీతిదాయక మగుటచే మందార కుసుమప్రియా యని నామ ప్రసిద్ధమైనది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మందారకుసుమప్రియాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:19, 06/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

202వ నామ మంత్రము 06.01.2020

ఓం సర్వేశ్వర్యై నమః

సకలలోకాలకు ప్రభ్విణియు, త్రిమూర్తులను, త్రిశక్తులను, ఇంద్రాదిదేవతలను, దిక్పాలకులను వారి వారిస్థానములందు నియమించినదియు, వారిచేత ఆరాధింపబడునదియు అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు సకల సౌభాగ్యములు, సిరిసంపదలు ప్రసాదించుటయే గాక, సదా ఆ పరమేశ్వరి పాదసేవయే తన భక్తులకు జీవన పరమావధిగా అనుగ్రహించును.

సకల చరాచర జగత్తులకు తానే మూలప్రకృతియై విరాజిల్లుచున్నది ఆ జగన్మాత. సృష్టికి పూర్వమే ఆదిపరాశక్తిగా తానున్నది. సకల జగత్తులను సృష్టించు క్రమములో ప్రణాళిక రచన చేసినది ఆ తల్లియే. సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువును, లయకు పరమేశ్వరుడిని, అష్టదిక్కులకు దిక్పాలకులను,   జీవుల జీవనగతులను నియంత్రించ నవగ్రహములను నియోగించి సామ్రాజ్యదాయిని  (692వ నామ మంత్రము) యై వివిధ విభాగములలోని ఆయా లోకపాలుర కార్యక్రమములను తానే పర్యవేక్షణచేయ సమకట్టి రాజరాజేశ్వరి. (684వ నామమంత్రము - బ్రహ్మాది దేవతలకు, లోకపాలురకు ఈశ్వరి) గాను, రాజ్యవల్లభ గాను విరాజిల్లు పరమాత్మ అమ్మవారు.. పంచకోశములకు (అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ) అధికారిణిగా కోశనాథ గా విరాజిల్లుచున్నది ఆ పరమేశ్వరి. సూర్యచంద్రుల  ప్రకాశానికీ, నదీనదముల ప్రవాహానికి, సప్తసాగరములు హద్దులు దాటకుండుటకు, ఆకాశము అక్కడేయుండుటకు, భూమి కంపింపకుండుటకు తన ఆజ్ఞయే కారణము. భూమికంపించినా, వరుణుడు ప్రకోపించినా అది మితిమీరిన పాపంపై తన కోపంగా, తను తెరచిన మూడవకన్నని తెలియజేయు దురాచారశమని ఆ జగన్మాత.

సకలజగత్తును సృజించి, పోషించి, శాసించి పిదప తనయందే లయము  చేసుకొనుచున్నది.

అతఏవ సర్వస్వామిత్యాత్ సర్వేశ్వరీ  సర్వవిశ్వమునకు స్వామినియనది గనుక జగన్మాత సర్వేశ్వరీ యనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వేశ్వర్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:19, 06/01/2021] +91 95058 13235: 6.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ఇంద్రయాగమును నివారించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

24.17 (పదిహేడవ శ్లోకము)

దేహానుచ్చావచాంజంతుః ప్రాప్యోత్సృజతి కర్మణా|

శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః॥9257॥

జీవుడు తన కర్మలకు అనుగుణముగా ఉత్తమ-అధమ (మనుష్య తిర్యగాది) దేహములను పొందుచుండును, విడిచిపెట్టుచుండును. జనులు తమ కర్మలను అనుసరించియే - ఇతడు మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు అని వ్యవహరించెదరు. అంతెందుకు, కర్మయే గురువు. కర్మయే ఈశ్వరుడు.

24.18 (పదునెనిమిదవ శ్లోకము)

తస్మాత్సంపూజయేత్కర్మ స్వభావస్థః స్వకర్మకృత్|

అంజసా యేన వర్తేత తదేవాస్య హి దైవతమ్॥9258॥

అందువలన మానవుడు తన పూర్వసంస్కారములను అనుసరించి, తన వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు కర్మలను ఆచరింపవలెను. తద్ద్వారా మనుష్యుని జీవితము సుఖముగా గడచును. అదియే అతని పాలిటి దైవము.

24.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముపజీవతి|

న తస్మాద్విందతే క్షేమం జారం నార్యసతీ యథా49259॥

స్త్రీ తన భర్తను వంచించి, జారుని (విటుని) సేవించినచో, ఆ వ్యభిచారిణికి ఎన్నడును శాంతిచేకూరదు. అట్లే మనుష్యుడు తన జీవికకు (జీవనోపాధికి) ఆధారమైన దేవతను (స్వకర్మను) త్రోసిపుచ్చి, మఱియొక దేవతను (కర్మను) చేపట్టినచో అతనికి ఎన్నటికీ సుఖములు దక్కవు.

24.20 (ఇరువదియవ శ్లోకము)

వర్తేత బ్రహ్మణా విప్రో రాజన్యో రక్షయా భువః|

వైశ్యస్తు వార్తయా జీవేచ్ఛూద్రస్తు ద్విజసేవయా॥9260॥

బ్రాహ్మణులు వేదాధ్యయనము, అధ్యాపనము వలనను, క్షత్రియులు ప్రజాపాలనవలనను, వైశ్యులు తమ వృత్తులవలనను, శూద్రులు ద్విజులను సేవించుచును తమ జీవితములను కొనసాగింపవలయును.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్| పరిచర్యాత్మకం కర్మ శూద్రాస్యాపి స్వభావజమ్॥ (గీత 18/44). అనగా వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయ రూపసత్య వ్యవహారము - వైశ్యుల స్వాభావిక కర్మలు,అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావికకర్మ.

24.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

కృషివాణిజ్యగోరక్షా కుసీదం తుర్యముచ్యతే|

వార్తా చతుర్విధా తత్ర వయం గోవృత్తయోఽనిశమ్॥9261॥

వ్యవసాయము, వాణిజ్యము, గోరక్షణము, ధర్మవడ్డీ వ్యాపారము అని వైశ్యులయొక్క వార్తావృత్తి (జీవనోపాధి) నాలుగు విధములు. మనము ఈ నాల్గింటిలో కేవలము గోపాలననే (గోరక్షణమునే) నడపుచున్నాము.

24.22 (ఇరువది రెండవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంతహేతవః|

రజసోత్పద్యతే విశ్వమన్యోన్యం వివిధం జగత్॥9262॥

తండ్రీ! ఈ జగత్తుయొక్క స్థితికి సత్త్వగుణము, ఉత్పత్తికి రజోగుణము, లయమునకు తమోగుణము కారణములు. నానావిధ ప్రాణులతో గూడిన ఈ జగత్తుయొక్క ఉత్పత్తి రజోగుణప్రభావమున స్త్రీపురుషుల  సంయోగమువలన జరుగుచుండును.

24.23 (ఇరువది మూడవ శ్లోకము)

రజసా చోదితా మేఘా వర్షంత్యంబూని సర్వతః|

ప్రజాస్తైరేవ సిధ్యంతి మహేంద్రః కిం కరిష్యతి॥9263॥

ఆ రజోగుణ ప్రేరణచేతనే మేఘములు అంతటను జలములను వర్షించుచుండును. ఆ జలములవలన ఆహారోత్పత్తి జరుగుచుండును. తద్ద్వారా ప్రాణుల ఉత్పత్తియు, జీవనము కొనసాగుచుండును. ఇందులో ఇంద్రుని ప్రమేయము ఇసుమంతయును లేదు. కనుక అతడు మనకు ఏమి హాని చేయగలడు?

24.24  (ఇరువది నాలుగవ శ్లోకము)

న నః పురో జనపదా న గ్రామా న గృహా వయమ్|

నిత్యం వనౌకసస్తాత వనశైలనివాసినః॥9264॥

నాయనా! మొదటినుండియు రాజ్యములుగాని, నగరములుగాని మన అధీనములో లేవు. గ్రామములుగాని, గృహములుగాని మనకు లేవు. మనము సర్వదా వనవాసులమే. వనములు, పర్వతములే మన నివాసస్థానములు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:58, 06/01/2021] +91 95058 13235: 6.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ఇంద్రయాగమును నివారించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉24.25 (ఇరువది ఐదవ శ్లోకము)

తస్మాద్గవాం బ్రాహ్మణానామద్రేశ్చారభ్యతాం మఖః|

య ఇంద్రయాగసంభారాస్తైరయం సాధ్యతాం మఖః॥9266॥

గోవులు మనకు జీవనాధారములు. బ్రాహ్మణుల ఆశీర్వాద ప్రభావముననే మన వంశములు వృద్ధియగుచున్నవి. గోవర్ధనపర్వతము గోవులకును, మనకును తృణములను, జలములను అందించుచున్నది. కావున మనము గోవులను, బ్రాహ్మణులను, గోవర్ధనగిరిని సంతృప్తిపఱచుటకు యజ్ఞమును ఆచరింతము. ఇప్పుడు మనము ఇంద్రయాగము కొఱకు సమకూర్చుకొనిన వస్తువుల ద్వారా ఈ యజ్ఞమును నిర్వహించుదము.

24.26 (ఇరువది ఆరవ శ్లోకము)

పచ్యంతాం వివిధాః పాకాః సూపాంతాః పాయసాదయః|

సంయావాపూపశష్కుల్యః సర్వదోహశ్చ గృహ్యతామ్॥9266॥

24.27 (ఇరువది ఏడవ శ్లోకము)

హూయంతామగ్నయః సమ్యగ్బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః|

అన్నం బహువిధం తేభ్యో దేయం వో ధేనుదక్షిణాః॥9267॥

కనుక వెంటనే మనము వివిధములగు శాకపాకములను, పాయసము మొదలగు మధుర పదార్థములను, పప్పుకూరలను, జంతికలను, అపూపములను (బూరెలు, అరిసెలు మొదలగువానిని), చక్కిలములు వండింతము. వ్రజభూమి యందు లభించెడి పాలను (పాయసాదుల కొఱకు) ఒకచోట చేర్చుదము. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా హోమకార్యములను నడిపింతము. వారికి మృష్టాన్న భోజనములను పెట్టింతము. ఇంకను ఆ విప్రోత్తములకు పాడియావులను, దక్షిణలను సమర్పింతము.

24.28  (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

అన్యేభ్యశ్చాశ్వచాండాలపతితేభ్యో యథార్హతః|

యవసం చ గవాం దత్త్వా గిరయే దీయతాం బలిః॥9268॥

తండ్రీ! ఇంకను కుక్కలకు, చండాలురకు, పతితులకును తగినంతగా (సమృద్ధిగా) ఆహార పదార్థములను ఒసంగుదము. గోవులకు తృప్తికరముగా తృణములను సమకూర్చుదము. గోవర్ధనగిరికి బలిని (నైవేద్యమును)  సమర్పింతము.

24.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స్వలంకృతా భుక్తవంతః స్వనులిప్తాః సువాససః|

ప్రదక్షిణాం చ కురుత గోవిప్రానలపర్వతాన్॥9269॥

మనము తృప్తిగా భుజించిన పిమ్మట నూతన వస్త్రములను ధరించి, సుగంధలేపనములను అలదుకొని, ఆభరణాదులను అలంకరించుకొందము. పిదప మనము గోమాతలకును, విప్రోత్తములకును, అగ్నులకును, గోవర్ధనగిరికిని భక్తిపూర్వకముగా ప్రదక్షిణ నమస్కారములను ఆచరింతము.

24.30 (ముప్పదియవ శ్లోకము)

ఏతన్మమ మతం తాత క్రియతాం యది రోచతే|

అయం గోబ్రాహ్మణాద్రీణాం మహ్యం చ దయితో మఖః॥9270॥

తండ్రీ! ఇది నా అభిప్రాయము. మీ అందఱికిని నచ్చినచో ఇట్లు ఆచరించుదము. ఇట్టిది గోవులకు, విప్రులకు, గోవర్ధనగిరికిని సంతృప్తిని  గూర్చును. వాటికి అంతరాత్మనైన నాకును ఆనందదాయకము".

శ్రీశుక ఉవాచ

24.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

కాలాత్మనా భగవతా శక్రదర్పం జిఘాంసతా|

ప్రోక్తం నిశమ్య నందాద్యాః సాధ్వగృహ్ణంత తద్వచః॥9271॥

శ్రీశుకుడు నుడివెను కాలస్వరూపుడైన కృష్ణభగవానుడు ఇంద్రుని గర్వమును అణచగోరి ఇట్లు పలికిన ఆ స్వామి వచనములను నందాదులు శ్రద్ధగా ఆలకించిరి. వారు ఆయన మాటలను బాగు బాగు అనుచు మెచ్చుకొనిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:11, 07/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

777వ నామ మంత్రము 07.01.2021

ఓం వీరారాధ్యాయై నమః

శ్రీవిద్యోపాసకులలో శ్రేష్ఠులు, నిరంతరము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ద్వైతభావనలేనివారు, పరమజ్ఞానులు - వీరందరిచే ఆరాధింపబడు బ్రహ్మజ్ఞానస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి వీరారాధ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం వీరారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు  భౌతికముగా సకల సుఖసంతోషములు ప్రసాదిస్తూ, సద్గతులను పొందుటకు కావలసిన నిశ్చలచిత్తముతో కూడిన భగవధ్యాననిమగ్నతను కలిగేలా అనుగ్రహించి తరింపజేయును.

 నేను, ఇది, ఈ శరీరంనాది, ఇదంతా నాకు సంబంధించినదే అను     దేహాభిమానము లేకుండా, ఈ దేహంలోని ప్రాణశక్తే పరబ్రహ్మము అని తెలిసి, దానినే అనుభూతికి తెచ్చుకొనినవాడు వీరుడు. శ్రీవిద్యోపాసకులలో శ్రేష్ఠులు వీరులు అనబడతారు. నిరంతరము ఆత్మానందాన్ని అనుభవించువారు, జీవాత్మ పరమాత్మలు రెండూ ఒకటే అనే అద్యైత భావన కలవారు, పరమజ్ఞానులు వీరులనబడతారు. 

శ్రీవిద్యను మన వరకూ తీసుకువచ్చిన మహానుభావులు పదునాలుగు మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారి సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని  అమ్మవారిని అంటున్నాం. విష్ణువు, బ్రహ్మ,  మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వీళ్ళు ఎలా ఉపాసించారు అన్నది మనకు తెలియదు. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు కానీ వాళ్ళ పద్ధతులు ఏవో మనకు తెలియవు. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు. ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు వీరు కూడా శ్రీవిద్యోపాసకులుగా చెప్పుకుంటాము. కాని మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక వీరందరూ అమ్మవారిని ఆరాధించేవాళ్ళే.  ఇలా వీళ్ళందరి చేతా ఆరాధించబడినది. వీరందరూ మహావీరులుగా చెప్పుకుంటాము.

జగన్మాత ఇటువంటి వీరులచేత, మహావీరులచేత ఆరాధింప బడుతుంది గనుక వీరారాధ్యా యని అనబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వీరారాధ్యాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:11, 07/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

203వ నామ మంత్రము 07.01.2021

ఓం సర్వమయ్యై నమః

అన్ని తత్త్వములందును ఇమిడియుండి సర్వతత్త్వమయిగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమయీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమయ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధి కలుగజేయును.

ఇంతకు ముందు, 202వ నామ మంత్రము నందు జగన్మాతను సర్వేశ్వరీ - సకల జగత్తులకు ఆ తల్లియే ఈశ్వరి యని అన్నాము. సర్వాధిపత్యము కలిగినది ఆ జగన్మాత అని చెప్పుకున్నాము. సర్వమయీ యను  నామ మంత్రములో శివుని నుండి పృథివి వరకు గల ముప్పది ఆరు తత్త్వముల స్వరూపురాలుగా జగన్మాత విరాజిల్లుచున్నది యని తెలియజేయబడినది. అందుచే సర్వమయీ యని అనబడినది.

ముప్పది ఆరుతత్త్వములు

పంచభూతములు (5)

+

 1. పృథ్వీతత్త్వము, 2. ఆపస్తత్త్వము, 3. తేజస్తత్త్వము, 4. వాయుతత్త్వము, 5. ఆకాశతత్త్వము.

పంచతన్మాత్రలు (5)

1. శబ్దతత్త్వము, 2. రూపతత్త్వము, 3. రసతత్త్వము, 4. గంధతత్త్వము, 5. స్పర్శతత్త్వము, 

జ్ఞానేంద్రియములు (5)

1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక.

 కర్మేంద్రియములు (5)

 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.

సప్తధాతువులు (7)

 1. రక్తము, 2. మాంసము, 3. త్వక్కు, 4. మేదస్సు, 5. స్నాయువు, 6. అస్థి, 7. మజ్జ.

మనస్సు (1)

ప్రాగ్ పశ్చిమ దక్షిణ, ఉత్తర వాయువులు (4)

మాయాతత్త్వము,  శుద్ధవిద్యాతత్త్వము, మహేశ్వర తత్త్వము,  సదాశివతత్త్వము - (4)

పైన చెప్పిన పృథివి నుండి శివుని వరకూ గల ముప్పది ఆరు తత్త్వములలో జగన్మాత ఉన్నది గనుక అమ్మవారు సర్వమయీ అని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమయ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:11, 07/01/2021] +91 95058 13235: 7.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ఇంద్రయాగమును నివారించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

24.32 (ముప్పది రెండవ శ్లోకము)

తథా చ వ్యదధుః సర్వం యథాహ మధుసూదనః|

వాచయిత్వా స్వస్త్యయనం తద్ద్రవ్యేణ గిరిద్విజాన్॥9272॥

24.33 (ముప్పది మూడవ శ్లోకము)

ఉపహృత్య బలీన్ సర్వానాదృతా యవసం గవామ్|

గోధనాని పురస్కృత్య గిరిం చక్రుః ప్రదక్షిణమ్॥9273॥

అందులకు సమ్మతించిన నందాది గోపాలురు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారము యజ్ఞమును నిర్వహించిరి. బ్రాహ్మణోత్తములు స్వస్తివాచనములను (ఆశీర్వచనమును) పలికిరి. పిదప నందుడు మొదలగువారు గోవర్ధనగిరికిని, విప్రవరులకును భక్తిశ్రద్ధలతో ద్రవ్యములను ఇచ్చి ఆదరించిరి. గోవులకు ప్రేమపూర్వకముగా పచ్చికలను అందించిరి. గోవులను ముందుంచుకొని, గోవర్ధనగిరికి ప్రదక్షిణములను గావించిరి.

24.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అనాంస్యనడుద్యుక్తాని తే చారుహ్య స్వలంకృతాః|

గోప్యశ్చ కృష్ణవీర్యాణి గాయంత్యః సద్విజాశిషః॥9274॥

బ్రాహ్మణుల ఆశీర్వాదములను పొందిన పిమ్మట గోపాలురును, గోపికలును చక్కగా అలంకరించుకొని ఎడ్లబండ్లపై ఆసీనులైరి. అనంతరము వారు శ్రీకృష్ణుని మహిమలను కొనియాడుచు గోవర్ధనగిరికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించిరి.

24.35 (ముప్పది ఐదవ శ్లోకము)

కృష్ణస్త్వన్యతమం రూపం గోపవిశ్రంభణం గతః|

శైలోఽస్మీతి బ్రువన్ భూరి బలిమాదద్బృహద్వపుః॥9275॥

24.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తస్మై నమో వ్రజజనైః సహ చక్రే ఆత్మనాఽఽత్మనే|

అహో పశ్యత శైలోఽసౌ రూపీ నోఽనుగ్రహం వ్యధాత్॥9276॥

24.37 (ముప్పది ఏడవ శ్లోకము)

ఏషోఽవజానతో మర్త్యాన్ కామరూపీ వనౌకసః|

హంతి హ్యస్మై నమస్యామః శర్మణే ఆత్మనో గవామ్॥9277॥

పిదప గోపాలురకు అందఱికిని విశ్వాసమును కలిగించుటకై శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతము మీదికి చేరి, ఒక మహారూపమును దాల్చి అందఱికిని దర్శనమిచ్చెను. పిమ్మట ఇటు చూడుడు నేనే గోవర్ధనగిరిని అని పలుకుచు గిరికి నివేదించిన పదార్థములను అన్నింటిని తానే ఆరగించెను. అంతట ఆ మహాత్ముడు గోపాలుర మధ్యచేరి తన మహారూపమునకు తానే నమస్కరించెను. పిమ్మట శ్రీకృష్ణుడు ఈ శైలము మహారూపమున సాక్షాత్కరించి, అనుగ్రహించుచున్నది చూడుడు. ఇది మిగుల ఆశ్చర్యకరము. ఈ గోవర్ధనగిరికి కామరూపమును ధరించునట్టి శక్తిగలదు.

 🙏🙏🙏🙏🙏🕉️నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏🙏🙏🕉️ 

"దీని మహిమను ఎఱుగక అవహేళన చేయునట్టి వనవాసులను ఇది నశింపజేయును. కనుక మన అందఱి క్షేమమునకై, మనగోవుల క్షేమమునకై ఈ దివ్యగిరికి ప్రణమిల్లుదము" అని నుడివెను.

24.38 (ముప్పది రెండవ శ్లోకము)

ఇత్యద్రిగోద్విజమఖం వాసుదేవప్రణోదితాః|

యథా విధాయ తే గోపా సహ కృష్ణా వ్రజం యయుః॥9278॥

ఈ విధముగా శ్రీకృష్ణుడు ప్రేరేపింపగా నందాది గోపాలురు గోవర్ధనగిరిని, గోవులను, బ్రాహ్మణోత్తములను విధ్యుక్తముగా పూజించిరి. పిమ్మట వారు అందఱును శ్రీకృష్ణసహితులై బృందావనమునకు చేరిరి.

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే చతుర్వింశోఽధ్యాయః (24)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది నాలుగవ అధ్యాయము (24)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:15, 07/01/2021] +91 95058 13235: 7.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఐదవ అధ్యాయము

గోవర్ధనోద్ధరణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

25.1 (ప్రథమ శ్లోకము)

ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహతాం నృప|

గోపేభ్యః కృష్ణనాథేభ్యో నందాదిభ్యశ్చుకోప సః॥9279॥

శ్రీ శుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని పర్యవేక్షణలో నందుడు మున్నగు  గోపాలురు ఎల్లరును తనను పూజింపక, గోవర్ధనగిరిని ఆరాధించినందులకు ఇంద్రుడు వారియెడల మిగుల కుపితుడయ్యెను.

25.2 (రెండవ శ్లోకము)

గణం సాంవర్తకం నామ మేఘానాం చాంతకారిణామ్|

ఇంద్రః ప్రాచోదయత్క్రుద్ధో వాక్యం చాహేశమాన్యుత॥9280॥

ఇంద్రుడు తానే త్రిలోకాధిపతినని భావించుచు విర్రవీగుచుండెను.

 అందువలన గోపాలుర యెడ మిగుల క్రుద్ధుడైయున్న ఆ దేవేంద్రుడు జలప్రళయముద్వారా విలయమును సృష్టింపగల సంవర్తకనామ మేఘములను వ్రజభూమి వినాశమునకై ప్రేరేపించుచు ఇట్లనెను.

25.3 (మూడవ శ్లోకము)

అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాం కాననౌకసామ్|

కృష్ణం మర్త్యముపాశ్రిత్య యే చక్రుర్దేవహేలనమ్॥9281॥

"మేఘములారా! అడవులలో నివసించుచున్న ఈ గోపాలురకు ధనమదము నెత్తికెక్కినది. అందువలన వారు కన్నుమిన్నుగానక యున్నారు. మానవమాత్రుడైన కృష్ణుని నమ్ముకొని, వీరు దేవతలకు ప్రభుడనైన నన్నే అవమానించినారు.

25.4 (నాలుగవ శ్లోకము)

యథాఽదృఢైః కర్మమయైః క్రతుభిర్నామనౌనిభైః|

విద్యామాన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణవమ్॥9282॥

25.5 (ఐదవ శ్లోకము)

వాచాలం బాలిశం స్తబ్ధమజ్ఞం పండితమానినమ్|

కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపా మే చక్రురప్రియమ్॥9283॥

సంసారమనెడి సముద్రమును దాటుటకు అనువైన సాధనము బ్రహ్మవిద్యయే. దానిని త్యజించి, అజ్ఞానులు ఓటిపడవ వంటి కర్మమయములైన యజ్ఞములను ఆచరించుటద్వారా భవసాగరమును దాటగోరుదురు. ఈ కృష్ణుడు వాచాలుడు, మూర్ఖుడు, నీతిలేనివాడు, అజ్ఞాని తనను ఒక మహాపండితునిగా భావించుకొనువాడు. అట్టి మనుష్యమాత్రుడైన కృష్ణుని మాటలపై విశ్వాసము ఉంచి, నాకు అప్రియమును గూర్చినారు.

25.6 (ఆరవ శ్లోకము)

ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనామ్|

ధునుత శ్రీమదస్తంభం పశూన్ నయత సంక్షయమ్॥9284॥

25.7 (ఏడవ శ్లోకము)

అహం చైరావతం నాగమారుహ్యానువ్రజే వ్రజమ్|

మరుద్గణైర్మహావీర్యైర్నందగోష్ఠజిఘాంసయా॥9285॥

ఈ గోపాలురు ప్రస్తుతము ధనమదముచే గర్వితులైయున్నారు. దానికి తోడుగా కృష్ణుడు పెడదారి పట్టించుటచే వీరు ఇంకను  విర్రవీగుచున్నారు. కనుక, మీరు వెంటనే వ్రజభూమికి వెళ్ళి ధనమదము కారణముగా వీరిలో పెచ్చు పెఱిగిన అవినయమును తొలగింపుడు. అట్లే వీరి గోవులను హతమార్చుడు. ఆ నందగోకులమును రూపుమాపుటకై, నేనును ఐరావతమునెక్కి, మిగుల బలపరాక్రమములుగల మరుద్గణములతోగూడి, మీ వెనువెంటనే ఆ వ్రజభూమికి ఏతెంతును.

శ్రీశుక ఉవాచ

25.8 (ఎనిమిదవ శ్లోకము)

ఇత్థం మఘవతాఽఽజ్ఞప్తా మేఘా నిర్ముక్తబంధనాః|

నందగోకులమాసారైః పీడయామాసురోజసా॥9286॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! ఇంద్రుడు ఈ విధముగా ఆజ్ఞాపించి, సంవర్తాదిప్రళయకాల మేఘములకు స్వేచ్ఛనిచ్చెను. వెంటనే అవి నందగోకులముపై విజృంభించి, జడివానలతో ముంచెత్తి దానిని కకావికలమొనర్చసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:35, 08/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

204వ నామ మంత్రము 08.01.2021

ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః

మూలవిద్యనుండి పుట్టిన సప్తకోటి మంత్రములకు స్వరూపిణియై విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణియైన  జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమంత్రస్వరూపిణీ  యను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకునకు ఆ తల్లి కరుణచే సకలాభీష్టసిద్ధి కలుగును.

 అన్ని విద్యలకూ ఆదివిద్యను మూలవిద్య అందురు. అటువంటి మూలవిద్యనుండి ఉద్భవించిన సప్తకోటి మహామంత్రాలకు మంత్రాధ్వయని అనిపేరు. ఇట్టి మంత్రాధ్యయనియే పరమేశ్వరి స్వరూపము. అందుచే జగన్మాత సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము.

మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః - దేనిని మననం చేయుకొలదీ రక్షణ చేయగలదో దానిని మంత్రం అన్నాము. 

మంత్రం అనేది బీజాక్షరముల సముదాయముతో ఏర్పడినది.  ఉదాహరణకు మర్రిచెట్టు స్థూలపదార్థమయితే ఆ మర్రిచెట్టుకు మూలమయిన బీజము (మర్రివిత్తనము)  సూక్ష్మమయినది. ఈ సూక్ష్మమయినదే మంత్రము. 

మంత్రము అనేది బీజాక్షరము గాని బీజాక్షరముల సముదాయముగాని అవుతుంది అనుకున్నాంగదా! . ఉదాహరణకు బాలాత్రిపురసుందరీ మంత్రములో ఐం క్లీం  సౌ తీసుకుంటే ఇందులో మొదటి బీజము ఐం ఈ బీజం జపిస్తే వాక్ వస్తుంది. గనుక ఈ ఐం అనేది వాగ్బీజము. తరువాత క్లీం ఇది కామరాజ బీజము. అనగా కోరిన కోరికలు తీర్చు బీజము. ఈ బీజం జపిస్తే  కోరికలు సిద్ధిస్తాయి. మూడవది సౌ అనగా శక్తి బీజము. ఈ బీజం  జపిస్తే మనసుని, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. 

ఈవిధమైన బీజములు మూలవిద్యలో ఏడు కోట్లు ఉన్నాయి. ఇవి అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము.

జగన్మాత మూలప్రకృతిస్వరూపిణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, పంచభూతములు, జీవకోటి ఏర్పడ్డాయి. వీనిలో దేనిని ఆరాధించిననూ, జగన్మాతయే మూలమగుటచే,ఆ తల్లి మూలప్రకృతియనియు అన్నాము. ఏ మంత్రముతో ఏ దేవతను ఆరాధించిననూ, అన్నిటికీ శ్రీమాతయే మూలము గనుక ఆ తల్లిని సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:35, 08/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

778వ నామ మంత్రము 08.01.2021

ఓం విరాడ్రూపాయై నమః

చతుర్దశభువనములలో విస్తరిల్లిన సమిష్టిరూపమై, అదే విరాడ్రూపముగా (విశ్వరూపముగా)  విరాజిల్లు ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విరాడ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామమంత్రమును ఓం విరాడ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునకు పరబ్రహ్మతత్త్వాన్ని తెలియగలిగే దిశగా ధ్యాననిమగ్నుడై తరించును.

ఈ సమస్త విశ్వమే తన స్వరూపంగా విరాజిల్లుతుంది గనుక జగన్మాత విరాడ్రూపా యని అనబడినది. విశ్వము అంటే సృష్టి. గనుక ముందు సృష్టి గురుంచి తెలుసుకుందాము. సృష్టిక్రమంలో మొదట అజ్ఞానము లేక అవ్యక్తము సృష్టింపబడినది. దీనినే తమస్సు అన్నాము. తరువాత మహత్తత్త్వము ఉద్భవించినది. దీనినుండి అహంకారము పుట్టినది. ఈ అహంకారము సత్త్వరజస్తమోగుణాత్మకము.  అనగా  సత్త్వ గుణము - శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నత తో ఉంటుంది. రజో గుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తినొందని తృష్ణ, కలుగుతాయి. ఇక తమో గుణము వలన భ్రమ, సోమరితనం, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఇటువంటి త్రిగుణాత్మకమైన అహంకారమునుండి శబ్దస్పర్శరూపరసగంధములనెడి పంచతన్మాత్రలు వెలువడినవి. వీటిని సూక్ష్మభూతములనికూడా అంటారు. వీటిలోనే జ్ఞానశక్తులు అనగా జ్ఞానేంద్రియములు (శబ్దము నుండి చెవి, స్పర్శ నుండి చర్మము, రూపము నుండి కన్ను, రసము నుండి నాలుక, గంధము నుండి నాసిక) ఏర్పడినవి. జ్ఞానశక్తులయిదింటి సముదాయమునుండి అంతఃకరణము కలిగినది.  అలాగే ఒక్కొక్క క్రియాశక్తినుండి  ఒక్కొక్క ఇంద్రియము చొప్పున అయిదు కర్మేంద్రియములు ఏర్పడినవి. ఈ కర్మేంద్రియములను వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అని అంటారు. క్రియాశక్తులు అయిదింటినుండి పంచప్రాణములు కలిగినవి. సూక్ష్మభూతములయిన శబ్దాదులనుండి స్థూలములగు ఆకాశాది పంచభూతములు పుట్టినవి.  ఇది సృష్టియొక్క అసలైన స్థితి. ఆత్మచైతన్యము జీవుల స్థూలభూతములతో కలిసనప్పుడు విశ్వుడని. పిలువబడును. సూక్ష్మభూతములతో కలిసినప్పుడు తైజసుడని పిలువబడును. కారణోపాధితోగూడినప్పుడు ప్రాజ్ఞుడనబడును. ఇది జీవుల సృష్టి వివరము. ఆత్మచైతన్యము స్థూలభూతసమిష్టితో గలసినప్ఫుడు వైశ్వానరుడు (విరాట్టు) అనియు, సూక్ష్మభూతసమిష్టితో గూడినప్పుడు హిరణ్యగర్భుడనియు, కారణోపాధి సమిష్టితో గలసినప్పుడు ఈశ్వరుడనియు పిలువబడును. పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గూడినపుడు హిరణ్యగర్భుడనియు, ప్రాణములతో గూడినపుడు సూత్రాత్మయనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలసియున్నప్పుడు ఆ సముదాయముతో గూడిన పరమాత్మకు అంతర్యామి అనియు పేర్లు గలవు. మొత్తముగా 1) త్రిగుణాత్మిక, 2) ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి, 3) తమోమహదహంకారరూపిణి, 4) విశ్వతైజసప్రాజ్ఞాత్మిక, 5) వైశ్వానరహిరణ్యగర్భ, విరాడ్రూపిణి, 6) తిరోధానానుగ్రహరూపిణి, 7) జీవబ్రహ్మరూపిణి, 8) విశ్వరూపిణి, 9) సచ్చిదానందరూపిణి, 10) పంచదశీమంత్రరూపిణి, 11) సంజ్ఞానవిజ్ఞానాదిరూపిణి, 12) ప్రస్తుతాదితిథిరూపిణి యని ప్రస్తుతింపబడినది గనుక జగన్మాత విరాడ్రూపిణీ యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విరాడ్రూపాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:35, 08/01/2021] +91 95058 13235: 8.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఐదవ అధ్యాయము

గోవర్ధనోద్ధరణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉25.9 (తొమ్మిదవ శ్లోకము)

విద్యోతమానా విద్యుద్భిః స్తనంతః స్తనయిత్నుభిః|

తీవ్రైర్మరుద్గణైర్నున్నా వవృషుర్జలశర్కరాః॥9287॥

అప్పుడు నలుదిక్కులయందును మెఱుపులు విజృంభించుటతో దిక్కుతోచని స్థితి ఏర్పడెను. తీవ్రములైన మేఘముల ఉఱుములతో, పిడుగుపాటులతో భయావవహస్థితి ఏర్పడెను. చండప్రచండములైన వాయువులు తోడుకాగా ఆ మేఘములు వడగండ్ల వానలను కురిపించెను.

25.10 (పదియవ శ్లోకము)

స్థూణాస్థూలా వర్షధారా ముంచత్స్వభ్రేష్వభీక్ష్ణశః|

జలౌఘైః ప్లావ్యమానా భూర్నాదృశ్యత నతోన్నతమ్॥9288॥

మేఘములు ఎడతెఱపిలేకుండా స్తంభములవంటి వర్షధారలను కురుపింపసాగెను. ఆ దెబ్బతో భూమి అంతయు జలప్రవాహములతో నిండిపోయెను. ఆ వఱదల ప్రభావమునకు మిట్టపల్లములను గుర్తించుటకు వీలులేకుండెను.

25.11 (పదకొండవ శ్లోకము)

అత్యాసారాతివాతేన పశవో జాతవేపనాః|

గోపా గోప్యశ్చ శీతార్తా గోవిందం శరణం యయుః॥9289॥

కుండపోతవానల (కుంభవృష్టి) ధాటికిని, పెనుగాలుల తాకిడికిని తట్టుకొనలేక గోవులు గడగడవణుకుచు చెల్లాచెదరై పోసాగెను. గోపాలురును, గోపికలును తీవ్రమైన ఆ చలిబాధకు తాళలేక శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి.

25.12 (పండ్రెండవ శ్లోకము)

శిరః సుతాంశ్చ కాయేన ప్రచ్ఛాద్యాసారపీడితాః|

వేపమానా భగవతః పాదమూలముపాయయుః॥9290॥

కుంభవృష్టి కారణముగా కష్టములపాలైన వ్రజవాసులు తమ శిరస్సులను వస్త్రములతో కప్పుకొనిరి. పసిపిల్లలను తమ ఒడులలో దాచుకొనిరి. అంతట వారు అందఱును మిగుల వణకిపోవుచు రక్షణకై శ్రీకృష్ణభగవానుని చరణములను ఆశ్రయించి, ఆ స్వామికి ఇట్లు విన్నవించుకొనిరి.

25.13 (పదమూడవ శ్లోకము)

కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో|

త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్భక్తవత్సల॥9291॥

"కృష్ణా! ఓ కృష్ణా! పరమాత్మా! ఓ ప్రభూ! నీవు భక్తవత్సలుడవు. అన్ని విధములుగా ఈ గోకులమునకు నీవే దిక్కు, విజృంభించుచున్న ఈ మేఘముల బారినుండి మమ్ములను రక్షించుటకు నీవే సర్వసమర్థుడవు.

25.14 (పదునాలుగవ శ్లోకము)

శిలావర్షనిపాతేన హన్యమానమచేతనమ్|

నిరీక్ష్య భగవాన్మేనే కుపితేంద్రకృతం హరిః॥9292॥

మిగుల ప్రమాదకరమైన వడగండ్లవాన హఠాత్తుగా వచ్చి పడుటతో  గోకులమంతయును అతలాకుతలమై, దిక్కుతోచని స్థితికి గుఱియయ్యెను" వారి పరిస్థితిని గమనించి, కృష్ణభగవానుడు 'ఇది యంతయును క్రుద్ధుడై యున్న ఇంద్రునియొక్క నిర్వాకమే' అని తలపోసెను.

25.15 (పదునైదవ శ్లోకము)

అపర్త్వత్యుల్బణం వర్షమతివాతం శిలామయమ్|

స్వయాగే విహతేఽస్మాభిరింద్రో నాశాయ వర్షతి॥9293॥

25.16 (పదహారవ శ్లోకము)

తత్ర ప్రతివిధిం సమ్యగాత్మయోగేన సాధయే|

లోకేశమానినాం మౌఢ్యాద్ధరిష్యే శ్రీమదం తమః॥9294॥

అంతట ఆ ప్రభువు తనలో ఇట్లనుకొనెను "మనము ఇంద్రునిగూర్చి యజ్ఞము చేయనందులకు అతడు మిగుల కినుక వహించినాడు. అందులకు ప్రతీకారముగా మనపై దెబ్బతీయుటకై అతడు అకాలములో తీవ్రమైన గాలులతో కూడిన వడగండ్లవానను కురిపించుచున్నాడు. ఇప్పుడు నా యోగమాయచేత చక్కగా దీనికి ప్రతిక్రియ యొనర్చెదను. అతడు తన మూర్ఖత్వముచే తనను త్రిలోకాధిపతిగా భావించుకొనుచున్నాడు. కనుక, అతని ఐశ్వర్యమదమును, అజ్ఞానమును రూపుమాపి అతనికి బుద్ధి చెప్పెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:52, 08/01/2021] +91 95058 13235: 8.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఐదవ అధ్యాయము

గోవర్ధనోద్ధరణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

25.17 (పదిహేడవ శ్లోకము)

న హి సద్భావయుక్తానాం సురాణామీశవిస్మయః|

మత్తోఽసతాం మానభంగః ప్రశమాయోపకల్పతే॥9295॥

నా యెడల భక్తిశ్రద్ధలుగల దేవతలు ఎల్లప్పుడును సత్త్వగుణ ప్రధానులై యుండవలెను. ఎట్టి పరిస్థితిలోను వారు 'మేమే సర్వాధిపతులము' అని గర్వపడరాదు. సత్త్వగుణమునుండి భ్రష్టులైనట్టి వీరికి తగిన గుణపాఠమును నేర్పి, గర్వమును అణచెదను. దానివలన కడకు వీరు తమ తప్పును తెలిసికొని దారికి వత్తురు.

25.18 (పదునెనిమిదవ శ్లోకము)

తస్మాన్మచ్ఛరణం గోష్ఠం మన్నాథం మత్పరిగ్రహమ్|

గోపాయే స్వాత్మయోగేన సోఽయం మే వ్రత ఆహితః॥9296॥

ఈ వ్రజవాసులు అందఱును నన్ను శరణుజొచ్చిరి. వీరిని నా భక్తులుగా స్వీకరించితిని. వీరికి నేనే ఏకైక రక్షకుడను. కనుక, నేను నా యోగమాయచేత వీరిని కాపాడెదను. పరమభక్తులను రక్షించుటయే నా వ్రతము. అందులకు ఇప్పుడు అవసరము ఏర్పడినది".

వ్రతము

భగవంతుడు (శ్రీరామచంద్రుడు) ఇట్లు పలికియున్నాడు. శ్లో. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే| అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ॥ - వాల్మీకి రామాయణం యుద్ధకాండ సర్గ 18, శ్లో. 35. 'నేను నీవాడను' అని పలుకుచు ఎవ్వరైనను ఒక్కసారి ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి (సకల ప్రాణులకును) అభయమిచ్చెదను (వారిని రక్షించుదును).ఇది నా వ్రతము.

25.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలమ్|

దధార లీలయా కృష్ణశ్ఛత్రాకమివ బాలకః॥9297॥

ఇట్లు పలికిన శ్రీకృష్ణుడు ఒకే ఒక చేతితో గోవర్ధనగిరిని అవలీలగా పై కెత్తెను. బాలుడు పుట్టగొడుగువలె ఆ స్వామి దానిని చేత (చిటికెనవ్రేలిపై) ధరించెను.

25.20 (ఇరువదియవ శ్లోకము)

అథాహ భగవాన్ గోపాన్ హేఽమ్బ తాత వ్రజౌకసః|

యథోపజోషం విశత గిరిగర్తం సగోధనాః॥9298॥

25.21 (ఇరువదిఒకటవ శ్లోకము)

న త్రాస ఇహ వః కార్యో మద్ధస్తాద్రినిపాతనే|

వాతవర్షభయేనాలం తత్త్రాణం విహితం హి వః॥9299॥

పిమ్మట కృష్ణభగవానుడు గోపాలురతో ఇట్లు పలికెను- "తల్లులారా! తండ్రులారా! వ్రజవాసులారా! మీరు అందఱును మీ మీ గోవులను, ఇతర వస్తువులను తీసికొని, హాయిగా ఈ పర్వతము క్రిందికి చేరుడు. నా చేతినుండి ఈ గిరి జారిపడునేమో! అని మీరు ఏ మాత్రమూ భయపడవలదు. ఈ పెనుగాలుల నుండియు, ఈ తెంపులేని వానలనుండియు మిమ్ములను అందఱిని రక్షించుటకే నేను ఈ యుక్తిని పన్నితిని".

25.22 (ఇరువది రెండవ శ్లోకము)

తథా నిర్వివిశుర్గర్తం కృష్ణాశ్వాసితమానసాః|

యథావకాశం సధనాః సవ్రజాః సోపజీవినః॥9300॥

శ్రీకృష్ణుడు ఇట్లు అభయవచనములను పలికిన పిమ్మట గోపాలురు స్వస్థచిత్తులైరి. వెంటనే వారు ఎల్లరును తమ తమ గోవులతో, సామాగ్రితో, పుత్రపౌత్రులతో, భృత్యులతో, పురోహితులు మొదలగువారితో గూడి ప్రశాంతముగా ఆ కొండక్రిందికి చేరిరి.

25.23  (పదిహేడవ శ్లోకము)

క్షుత్తృడ్వ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః|

వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్పదాత్॥9301॥

గోపాలురు తమకు కొండంత అండగానున్న శ్రీకృష్ణునియొక్క చల్లని చూపులనెడి అమృతవర్షమును ఆస్వాదించుచు, ఆ ఆనందపారవశ్యములో తమ ఆకలిదప్ఫులను, సుఖాపేక్షను మఱచిరి.అప్పుడు కృష్ణపరమాత్మ ఏమాత్రమూ కాలు కదపకుండా ఏడు దినముల పాటు ఆ పర్వతమును ధరించి వారిని చక్కగా ఆదుకొనెను.

25.24 (పదిహేడవ శ్లోకము)

కృష్ణయోగానుభావం తం నిశామ్యేంద్రోఽతివిస్మితః|

నిఃస్తంభో భ్రష్టసంకల్పః స్వాన్మేఘాన్ సన్న్యవారయత్॥9302॥

అంతట ఇంద్రుడు శ్రీకృష్ణుని యోగమాయా ప్రభావమును వీక్షించి, ఎంతయు ఆశ్చర్యచకితుడయ్యెను. తన సంకల్పము నెఱవేఱక పోవుటతో (ప్రయత్నము నిరర్థకము అగుటతో) అహంభావమును వీడి సంవర్తాది మేఘములను పూర్తిగా నివారించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:42, 09/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

779వ నామ మంత్రము  09.01.2021

ఓం విరజసే నమః

విగతములైన అనగా పాపరహితురాలైన పరమేశ్వరికి నమస్కారము. 

రజోగుణములేని శుద్ధసత్త్వగుణప్రధానురాలైన శ్రీమాతకు నమస్కారము.

విరజాక్షేత్రాధిష్ఠాన దేవతా స్వరూపిణియైన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విరజా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం విరజసే నమః అని ఉచ్చరిస్తూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులు అరిషడ్వర్గములకు దూరమై, పాపరహితులై ఆ పరమేశ్వరి అనుగ్రహమును పొందగలరు.

విగతం రజః పాపం యస్యాః (సౌభాగ్యభాస్కరం, 876వ పుట). విగతమైనటువంటి అనగా పోయినటువంటి పాపములు గలది. అంటే పాపరహితురాలు. జగన్మాతను చిదగ్నికుండసంభూతా యని అన్నాము. శుద్ధచైతన్యం నుండి ఉద్భవించిన తల్లి జగన్మాత. అలాంటి అమ్మవారికి పాపములుంటాయా? ఆ పాపములు పోయాయా? కాదు. శుద్ధచైతన్యం అంటేనే పాపములనేవి దరిచేరనది. ఆ తల్లి ఇరు పార్శ్వములకు పాపములు రావు. అనగా పాపములు అమ్మవారిని తాకడానికి కూడా భయపడతాయి. 

రజోగుణం గురుంచి భగవానుడు ఇలా చెప్పడం జరిగింది.

రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |

తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ ||                          (భగవద్గీత)

ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.

అటువంటి రజోగుణం జగన్మాతవద్ద ఏమాత్రమును లేదు. ఆతల్లి శుద్ధసత్త్వగుణప్రధానురాలు.  అందుచేతనే జగన్నాతను విరజా యని అన్నాము.

విరజే విరజా మాతా బ్రహ్మాణీ సంప్రతిష్ఠితా|

యస్యాః సందర్శనాన్మర్త్యః పునాత్యాసప్తమం కులమ్||42-1||

విరజక్షేత్రమందు బ్రహ్మదేవుడు విరజ అను దేవిని ప్రతిష్ఠించెను. అట్టి దేవిని దర్శనము చేయు మనుష్యుడు ఏడు తరములవరకూ తనకులములోని వారిని పవిత్రులను చేయును అనిగలదు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విరజసే నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:42, 09/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

205వ నామ మంత్రము 09.01.2021

ఓం సర్వయంత్రాత్మికాయై నమః

సకల యంత్రముల స్వరూపమే ఆత్మగా గలిగిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వయంత్రాత్మికా యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం సర్వయంత్రాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు సమస్త గ్రహదోషములనుండియు, భూతప్రేతపిశాచ పీడలనుండియు, శత్రుబాధలనుండియు,  ఇంకను మరి ఏ ఇతర దుష్ప్రభావములనుండి రక్షింపబడుదురు.

సర్వేషాం ఘంటార్గళాదీనాం యంత్రాణాం ఆత్మ స్వరూపే వాత్మికా 

ఘంటార్గళాది సకల యంత్రములే ఆత్మగా గల పరమేశ్వరి.

యంత్రములో శక్తికీ శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరములు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని ఒక నమ్మకము. 

యంత్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటు వంటి బీజాక్షరాల ప్రభావం వలన ప్రతికూల శక్తులు పూర్తిగా తొలగిపోయి అనుకూలశక్తి పెరుగుతుంది.

ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి ప్రతికూల శక్తులు దూరమయి అనుకులశక్తి వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది.

మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యథా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి స్థాపితం చేస్తారు. అంతటి మాహత్మ్యం గల యంత్ర ప్రభావము చేతనే ఆ ప్రాంతం మొత్తం అనుకూల శక్తితో ఉంటుంది.

ఆ అనుకూల శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజ పరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలియ జేయడం శాస్త్రమును బాగా చదివియున్న  ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్యల నుండి విశ్రాంతి లభిస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది. యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత ఆవాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతా మూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తారు. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి పరిపూర్ణమైన పంచోపచార పూజ ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.

యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజ అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను 'కుతంత్రము' అంటారు. ఔషధ ప్రయోగమునకు గృహనిర్మాణమునకు, దేవాలయ నిర్మాణమునకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామాచారము వీటన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.

యంత్రములలో  ప్రతిష్ఠాయంత్రములు, పూజాయంత్రములు, ధారణయంత్రములు అని మూడువిధములు. 

యంత్రములన్నిటికీ యంత్రరాజము  శ్రీచక్రము. శ్రీచక్రము సమస్తసృష్టికి ప్రతీక. విశ్వమానవాళికి ప్రతీక.

శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున ''అగ్నిస్థానము'' అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. ''సూర్యస్థానము'' అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడోవ ఖండము ''చంద్రస్థానము'' అదియే (బ్రహ్మగ్రంథి)

ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. 

రెండోవఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండోవఖండమును వ్యాపింపజేయును.

మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును🌺🌺🌺పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.

అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 

ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.

శ్రీచక్రార్చన వలన చరాచర జగత్తునూ అర్చించినట్లవుతుంది. శ్రీచక్రంలోగల వివరణ మరియే ఇతర యంత్రము లందూ ఉండదు.అందుకే శ్రీచక్రము చక్రరాజము అందురు. ఏదైనా యంత్రమును అర్చిస్తే కార్యసిద్ధి కలుగవచ్చు. కాని శ్రీచక్రమును అర్చిస్తే విశ్వమానవ కల్యాణ కారకమవుతుంది.

 సర్వమంత్రస్వరూపిణి యని అమ్మవారిని ఎలా అన్నామో, మంత్రాత్మకమైన సర్వయంత్రములు అమ్మవారి హృదయంలోనే ఉంటాయి గనుక జగన్మాత సర్వయంత్రాత్మికా యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వయంత్రాత్మికాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:42, 09/01/2021] +91 95058 13235: 9.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఐదవ అధ్యాయము

గోవర్ధనోద్ధరణము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

25.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణమ్|

నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరోఽబ్రవీత్॥9303॥

పిమ్మట భయంకరమైన గాలులు, వర్షములు ఆగిపోయెను. ఆకాశమున మబ్బులు చెదరిపోవుటతో సూర్యదర్శనమయ్యెను. అప్పుడు గోవర్ధనగిరిధారి (శ్రీకృష్ణుడు) ఆ ప్రశాంత వాతావరణమును చూచి, గోపాలురతో ఇట్లనెను-

25.26 (ఇరువది ఆరవ శ్లోకము)

నిర్యాత త్యజత త్రాసం గోపాః సస్త్రీధనార్భకాః|

ఉపారతం వాతవర్షం వ్యుదప్రాయాశ్చ నిమ్నగాః॥9304॥

"గోపాలులారా! పెనుగాలులు, జడివానలు ఆగిపోయినవి. నదీజలములు సాధారణస్థాయికి చేరినవి. కనుక మీరు మీ గోవులతో, భార్యాపుత్రులతో, బంధుమిత్రులతో , సామాగ్రులతో గూడి నిర్భయముగా బయటికి చేరుడు".

25.27  (ఇరువది ఏడవ శ్లోకము)

తతస్తే నిర్యయుర్గోపాః స్వం స్వమాదాయ గోధనమ్|

శకటోఢోపకరణం స్త్రీబాలస్థవిరాః శనైః॥9305॥

శ్రీకృష్ణుని సూచనను అనుసరించి, గోపాలురు తమ గృహోపకరణములు, బండ్లపై చేర్చుకొని, స్త్రీ, బాల, వృద్ధులతో గూడి తిన్నగా కొండక్రిందినుండి బయటికి వచ్చిరి.

25.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

భగవానపి తం శైలం స్వస్థానే పూర్వవత్ప్రభుః|

పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా॥9306॥

అంతట కృష్ణభగవానుడు అందఱును చూచుచుండగా, అవలీలగా గోవర్ధనగిరిని యథాస్థానమున నిలిపెను.

25.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

తం ప్రేమవేగాన్నిభృతా వ్రజౌకసో యథా సమీయుః పరిరంభణాదిభిః|

గోప్యశ్చ సస్నేహమపూజయన్ముదా  దధ్యక్షతాద్భిర్యుయుజుః సదాశిషః॥9307॥

అప్పుడు వ్రజవాసుల హృదయము కృష్ణునియెడ ప్రేమాదరములతో నిండిపోయెను. పిమ్మట వారు ఆ స్వామిని కౌగిలింతలు మొదలగు వానితో ముంచెత్తిరి. గోపికలు స్నేహపూర్వకముగా సంతోషముతో ఆరాధించిరి. పెద్దలు పెఱుగుతో, అక్షతలతో, జలములతో పవిత్రమగు ఆశీస్సులను అందించి ఆ ప్రభువుయొక్క నొసట తిలకమును దిద్దిరి.

25.30  (ముప్పదియవ శ్లోకము)

యశోదా రోహిణీ నందో రామశ్చ బలినాం వరః|

కృష్ణమాలింగ్య యుయుజురాశిషః స్నేహకాతరాః॥9308॥

పిమ్మట యశోదామాతయు, రోహిణీదేవియు, నందగోపుడును, మిగుల పరాక్రమశాలియైన బలరాముడును అనురాగ పూర్వకముగా తమ కౌగిలింతలతో శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి.

25.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

దివి దేవగణాః సాధ్యాః సిద్ధగంధర్వచారణాః|

తుష్టువుర్ముముచుస్తుష్టాః పుష్పవర్షాణి పార్థివ॥9309॥

పరీక్షిన్మహారాజా! ఆ సమయమున దేవతలు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు సంతోషముతో ప్రస్తుతించుచు ఆకాశమునుండి పుష్పవర్షమును కురుపించిరి.

25.31 (ముప్పది రెండవ శ్లోకము)

శంఖదుందుభయో నేదుర్దివి దేవప్రణోదితాః|

జగుర్గంధర్వపతయస్తుంబురుప్రముఖా నృప॥9310॥

మహారాజా! అప్పుడు స్వర్గమున దేవతలు ఎల్లరును శంఖధ్వనులతో, దుందుభినాదములతో తమ ఆనందోత్సాహములను వెల్లివిరియచేసిరి. తుంబురుడు మొదలగు ప్రముఖ గాయకులు కృష్ణప్రభువులీలలను గూర్చి మధురముగా గానమొనర్చిరి.

25.32 (ముప్పది రెండవ శ్లోకము)

తతోఽనురక్తైః పశుపైః పరిశ్రితో  రాజన్ స గోష్ఠం సబలోఽవ్రజద్ధరిః|

తథావిధాన్యస్య కృతాని గోపికాః గాయంత్య ఈయుర్ముదితా హృదిస్పృశః॥9311॥

మహారాజా! అంతట ఆ కృష్ణుడు ప్రేమార్ధ్రహృదయులైన గోపాలురతో పరివృతుడై బలరామునితోగూడి, బృందావనమునకు చేరెను. గోపికలు సంతోషముతో మురిసిపోవుచు హృదయాలను దోచుకొనెడు శ్రీకృష్ణుని గోవర్ధనధారణాది లోకోత్తరమగు దివ్యలీలలను కొనియాడుచు ఆనందముతో పాడుకొనుచు అచటకు చేరిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పంచవింశోఽధ్యాయః (25)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఐదవ అధ్యాయము (25)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:45, 09/01/2021] +91 95058 13235: 9.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఆరవ అధ్యాయము

నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలురతో ముచ్చటించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

26.1 (ప్రథమ శ్లోకము)

ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్య తే|

అతద్వీర్యవిదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః॥9312॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! పూతన సంహారము మొదలుకొని గోవర్ధనోద్ధరణము వఱకు శ్రీకృష్ణుడు ఒనర్చిన అసాధారణ కృత్యములను గోపాలురు ఒక్కమాఱు స్మృతికి తెచ్చుకొని మిగుల ఆశ్చర్యపడిరి. కాని, వారికి ఆయన పరాక్రమము గురుంచి తెలియకుండెను. పిమ్మట వారు అందఱును, నందునికడకు చేరి ఇట్లు వచించిరి.

26.2 (రెండవ శ్లోకము)

బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై|

కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితమ్॥9313॥

26.3 (మూడవ శ్లోకము)

యః సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా|

కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ॥9314॥

"నందమహారాజా! ఈ బాలకుని (శ్రీకృష్ణుని) యొక్క కర్మలన్నియును అలౌకికములు, అత్యద్భుతములు. ఇట్టి మహిమాన్వితుడు మనవంటి సాధారణ గ్రామీణుల మధ్య జన్మించుట అపురూపము. ఏడేంఢ్ల ప్రాయముగల ఈ బాలకుడు గోవర్ధన మహాగిరిని గజేంద్రుడు పద్మమునువలె ఒక చేతితో అవలీలగా పైకెత్తి, ఎట్లు నిలుపగలిగెను?

26.4 (నాలుగవ శ్లోకము)

తోకేనామీలితాక్షేణ పూతనాయా మహౌజసః|

పీతః స్తనః సహ ప్రాణైః కాలేనేవ వయస్తనోః॥9315॥

మహాత్మా! మీ బిడ్డడు కనులు తెఱచియు, తెఱవని పసితనమునందే, మిగుల బలవంతురాలైన, భయంకర రాక్షసియగు పూతనయొక్క స్తన్యమును ఆమె ప్రాణములతో సహా కాలుడు దేహధారుల ప్రాణములను మ్రింగివేసినట్లుగా పీల్చివేసెను.

26.5 (ఐదవ శ్లోకము)

హిన్వతోఽధఃశయానస్య మాస్యస్య చరణావుదక్|

అనోఽపతద్విపర్యస్తం రుదతః ప్రపదాహతమ్॥9316॥

మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడే ఈ ముద్దుల బాలుడు బండి క్రిందభాగమున పండుకొని, కాళ్ళు పైకెత్తి, ఏడ్చుచు కాళ్ళను అటునిటు కదలించుచుండెను. అప్పుడు ఆ చిన్నారి పాదముల తాకిడికి ఆ బండి తలక్రిందులై పోయెను. ఇది ఎట్లు సంభవము? 

26.6 (ఆరవ శ్లోకము)

ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయసా|

దైత్యేన యస్తృణావర్తమహన్ కంఠగ్రహాతురమ్॥9317॥

ఒక సంవత్సర ప్రాయమునందున్నప్పుడే ఇతనిని తృణావర్తుడను రాక్షసుడు ఆకాశమునకు ఎత్తుకొనిపోయెను. అప్పుడు ఈ కుర్రవాడు ఆ దైత్యుని మెడపట్టుకొని, గట్టిగా నొక్కి అతనిని మట్టిగఱపించెను.

26.7 (ఏడవ శ్లోకము)

క్వచిద్ధైయంగవస్తైన్యే మాత్రా బద్ధ ఉదూఖలే|

గచ్ఛన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్॥9318॥

ఒకసారి వెన్నను దొంగిలించినాడని తల్లి యశోదాదేవి ఇతనిని ఱోటికి కట్టివేసెను. అంతట ఇతడు ఆ ఱోలును లాగికొనుచు రెండు మద్దిచెట్ల మధ్యగా దోగాడుచు వెళ్ళెను. ఆ ఱోలు తాకిడికి ఆ మహావృక్షములు నేలగూలెను. ఇది మీరు ఎఱిగిన విషయమే గదా!

26.8 (ఎనిమిదవ శ్లోకము)

వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః|

హంతుకామం బకం దోర్భ్యాం ముఖతోఽరిమపాటయత్॥9319॥

ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో, తోడి బాలురతో గూడి, వనమున ఆవుదూడలను మేపుచుండెను. ఇంతలో ఒక రాక్షసుడు కొంగరూపములో మన చిన్నికృష్ణుని చంపుటకై అచటికి వచ్చెను. అంతట కృష్ణుడు తన రెండు చేతులతో ఆ కొంగ (బకాసురుని) యొక్క ముక్కపుటములను పట్టుకొని ఒక గడ్డిపోచను చీల్చివేసినట్లు చీల్చివేసెను. నిజమునకు ఇది ఎంతో ఆశ్చర్యకరము గదా?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:22, 10/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

780వ నామ మంత్రము 10.01.2021

ఓం విశ్వతో ముఖ్యై నమః

ఎక్కడ ధ్యానించాలనుకుంటే అక్కడే, ఏరూపంలో కావాలంటే అలాగే ఆవిర్భవించు నటువంటి అఖిలాండేశ్వరియైన పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వతోముఖీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం విశ్వతోముఖ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే జగన్మాతను దర్శించినంత ఆనందానుభూతిచెందును మరియు సఖశాంతులతో జీవనము గడుపును.

విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖః అని వేదములో గలదు. అనగా విశ్వమంతయు నేత్రములు, ముఖములు, హస్తములు, పాదములు గలది భగవద్రూపం. ఉపాసకుడు  ఏ రూపమును మనసులో మనోనేత్రములందు ఉంచుకుని, ఏ ప్రదేశములో ధ్యానించినను పరమాత్మ ఆ ప్రదేశములో, అదే స్వరూపముతో ప్రత్యక్షమగును. అందుచే జగన్మాతను విశ్వతోముఖీ అన్నాము.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్

ఆ పరమాత్మ అనేకవేల శిరస్సులు, నయనములు, ముఖములు, చేతులు, పాదమములు గలవాడు అని వర్ణింపబడినది. జగత్తంతయూ  పరబ్రహ్మ స్వరూపమే.

అందుకే ప్రహ్లాదుడు ఇలా అన్నాడని పోతనామాత్యులవారు భాగవతంలో చెప్పారు.

మత్తేభ విక్రీడితము

"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం

గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం

గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!

కంద పద్యము

ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!

పరమేశ్వరి సాక్షాత్తు నారాయణ స్వరూపిణి. ఆ తల్లి సర్వాంతర్యామి. గనుక అమ్మ వారు విశ్వతోముఖీ యని అనబడుచున్నది.

అమ్మవారిని కులదేవతగా, గ్రామదేవతగా కొలవడం చాలా పరిపాటి. ప్రతీ ఊరిలోనూ దుర్గమ్మ, కోటసత్తెమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, అశిరమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, కనకమహాలక్ష్మి, నీలమ్మ, అంకాళమ్మ, చెంగాళమ్మ, పచ్చాలమ్మ, మజ్జిగౌరమ్మ, శంబరపోలమ్మ, పైడితల్లి, పోలిపల్లి, ఏగులమ్మ, పాదాలమ్మ అని ఇలా ఎన్నో నామములతో, ఎన్నో రూపాలతో ఆరాధిస్తున్నాము. ఇంట్లో చంటి బిడ్డపుడితే, దశరా, ఉగాది, సంక్రాంతి పండుగలకు నైవేద్యాలు, బలులు ఇస్తుంటారు. ఇదంతా ఏమిటి? అమ్మవారేగదా! అందుకే జగన్మాత విశ్వతోముఖీ యని అనబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విశ్వతోముఖ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:22, 10/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

206వ నామ మంత్రము 10.01.2021

ఓం సర్వతంత్రరూపాయై నమః

సర్వతంత్రాలను తన స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వతంత్రరూపా యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వతంత్రరూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సుఖసంతోషములను, ఆయురారోగ్యములను, సిరిసంపదలను ప్రసాదించును.

శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతున్నవి. శివుడు పార్వతికి తెలిపినవి ఆగమాలుగా, పార్వతి శివుడికి తెలిపినవి నిర్గమాలుగా తెలుపబడుతున్నవి. . హైందవ తంత్రములో శక్తి ముఖ్య దేవతగా కొలవబడుతుంది. ఈ సృష్టి, శివ-శక్తుల దివ్య సంగమముతోనే ఏర్పడినదని నమ్మబడుతుంది. తంత్ర సంప్రదాయాలు, వైదిక సంప్రదాయాలకి సమాంతరంగా ఉంటూనే, ఒక దానితో ఒకటి విడదీయరానివిగా ఉంటాయి. సులువుగా మనకు తెలియాలంటే తంత్రమనేది చేయవలసిన విధానము. సంకల్పం చేసిన దగ్గర నుండి ఆ కార్యక్రమము పరిసమాప్తి అయేవరకూ చేయవలసిన విధానమే తంత్రము అనబడుతుంది. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ పూర్తి అయిన తరువాత    చివరలో ఇతిశ్రీవామకేశ్వర తంత్రే, ఉమామహేశ్వర సంవాదే, శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రం సంపూర్ణమ్ అంటాము. అనగా ఈ ఖడ్గమాలాస్తోత్రము వామకేశ్వర తంత్రములోనిది. శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణ. 

దేవతలను తృప్తిపరచి, మన కోర్కెల సాధన కోసమే ఈ తంత్రములు చెప్పబడ్డాయి. ఇవి కేవలం ఐహికప్రయోజనముల కొరకు మాత్రమే. వీటి ద్వారా, ఈ లోకంలో మనకు కావలసినవి సంప్రాప్తింపజేసుకోవచ్చును. ఈ విషయాన్ని శంకర భగవత్పాదులవారు సౌందర్యలహరిలో ఇలా చెప్పారు.

చతుఃషష్టయా తంత్రైః -  సకల మతిసంధాయ భువనం

స్థిత స్తత్తత్సిద్ధి - ప్రసవ పరతంత్రైః పశుపతిః |

పునస్త్వన్నిర్బంధా - దఖిల పురుషార్థైక ఘటనా

స్వతంత్రం తే తంత్రం -  క్షితితల మవాతీతరదిదమ్ || 31 ||.

అమ్మా! జగన్మాతా! పశువులైన సకల ప్రాణులను పరిపాలించే, పశుపతియైన శివుడు,  భక్తజనులందరూ నిన్ను ఉపాసించి వారి వారి కామితార్ధములు తీర్చుకొనుటకు మాత్రమే ఉపయోగపడే మహామాయా శాంబర విద్యలైన 64 తంత్రములను నీ ఉపాసనలుగా శంకరుడు ఈ లోకమునకు ప్రసాదించెను. కానీ అవి వామాచార ప్రధానములై మోక్షమునకు ఏమాత్రము దోహద పడకుండా ఉండుటచేత, నీవు భక్తజనులను ఉద్దరింపదలచి ఇహలోకంలో పురుషార్ద ప్రదమైన సకల వాంచితార్ధములను తీర్చి పరలోకమున మోక్షమును ప్రసాదించు విద్యను అందివ్వమని నీవు పరమేశ్వరుని పట్టుపట్టి ప్రోత్సహించి ఆదేశించగా అపుడు ఆ శంకరుడు అన్ని విద్యలకన్నా పరమోత్కృష్టమైన శ్రీవిద్యా తంత్రమును ఈ భూతలమున అవతరింపచేసెను.

లోకంలో మనలను ఉద్దరింప తలచి అమ్మే పరమశివునిచే శ్రీవిద్యోపాసన అను మహా తంత్రమును అందించినది.

 అమ్మా! ఓపరమేశ్వరీ! పరమేశ్వరుడు అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని అనగా శ్రీవిద్యా తంత్రాన్ని ఈ లోకానికి ప్రసాదించాడు.

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి మనకు తెలియజేస్తున్నారు. పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మోహములో తమను తాము మరిచి వాటి వలన కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూఢులై పరమార్ధము తెలుసుకొనలేక, జీవన్ముక్తులు కాలేక కొట్టుమిట్టా డుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి. బిడ్డలకు తల్లియైన ఆ మహా జగన్మాత  ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి అడిగినది.

“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును ప్రసాదించే విద్యను  ఒక్కటి ఇవ్వండి చాలు నా బిడ్డలకు” అని.

“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని పరమేశ్వరుడు అనుగ్రహించినాడు.

ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని వంచిస్తాయని  శంకర భగవత్పాదులు పై శ్లోకములో చెప్పియున్నారు.

చతుష్షష్ఠి కళామయి,  చతుష్షష్ఠుపచారాడ్యా  ...అని పరమేశ్వరి పేర్లు. చతుష్షష్ఠి ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి. 

గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా తంత్రము అనే పరమేశ్వరిని  పట్టుకొన్న వాడికి జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుని దర్శనము లభిస్తుంది.

సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని సమిష్టిగా తంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు  (తంత్రములు) మూడు రకములు.

1. వైష్ణవ తంత్రములు,  2. శైవ తంత్రములు,3. శాక్తేయ తంత్రములు.

సాత్వికులు ఆరాధించేది వైదిక దేవతలను. రాజసులు ఆరాధించేది  యక్షరాక్షసులను , తామసులు ఆరాధించేది భూతప్రేత పిశాచాలను.

సాత్వికుల గ్రంథములు ఆగమాలు-ఇహపర సాధనకు తోడ్పడునవి (తంత్రములు), రాజసుల గ్రంథములు  యామళాలు. తామసుల గ్రంథములు డామరాలు అని అంటారు.

ఇహపరసాధనకు తోడ్పడే అరువది నాలుగు (చతుష్షష్టి) తంత్రముల స్వరూపమే జగన్మాత. కాబట్టి ఆ తల్లిని సర్వతంత్రరూపా అని యన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వతంత్రరూపాయై నమః  అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:22, 10/01/2021] +91 95058 13235: 10.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఆరవ అధ్యాయము

నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలురతో ముచ్చటించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

26.9 (తొమ్మిదవ శ్లోకము)

వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా|

హత్వా న్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా॥9320॥

మఱియొకసారి శ్రీకృష్ణుడు మిత్రులతోగూడి ఆవుదూడలను మేపుచుండగా ఒక దైత్యుడు కృష్ణుని చంపదలచి, గోవత్సరూపములో ఆ దూడల గుంపులో దూరెను. అంతట కృష్ణుడు అ వత్సాసురుని హతమార్చి వాని కళేబరమును అవలీలగా విసరివేసి ప్రక్కనగల వెలగచెట్లన్నిటిని పడగొట్టెను.

26.10 (పదియవ శ్లోకము)

హత్వా రాసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః|

చక్రే తాలవనం క్షేమం పరిపక్వఫలాన్వితమ్॥9321॥

ఒక పర్యాయము గోపాలుర కోరికపై   బలరామునితోగూడి శ్రీకృష్ణుడు ఒక తాళవనమును సమీపించెను. గార్ధభరూపములలో ఉన్న ధేనుకాసురుడు,  అతని అనుయాయులు ఆ వనమునకు వచ్చినవారిని హతమార్చుచుండిరి. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడును ఆ ధేనుకాసురుని, అతని అనుచరులను వధించి వేసిరి. ఆ విధముగా కృష్ణప్రభువు అచట రాక్షసబాధలేకుండచేసి, అందఱికిని ఉపయోగము కలుగునట్లు చేసెను.

26.11 (పదకొండవ శ్లోకము)

ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలినా|

అమోచయద్వ్రజపశూన్ గోపాంశ్చారణ్యవహ్నితః॥9322॥

మహానుభావుడైన శ్రీకృష్ణుడు మిగుల పరాక్రమశాలియైన బలరామునిద్వారా భయంకరుడైన ప్రలంబాసురుని వధింపచేసెను. అంతేగాక హఠాత్తుగా విఱచుకొనుచు మీదికి వచ్చిన దావాగ్ని ప్రమాదమునుండి ఆ స్వామి గోవులను, గోపాలురను రక్షించెను.

26.12  (పండ్రెండవ శ్లోకము)

ఆశీవిషతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్|

ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేఽసౌ నిర్విషోదకామ్॥9323॥

యమునానది మడుగులో నివసించుచున్న మహావిషసర్పమగు కాళియుడు ఆ జలములను విషపూరితములను గావించుచుండెను. అంతట శ్రీకృష్ణుడు దాని పడగలపై నిల్చి, వాటిని నుగ్గు నుగ్గు గావించుచు నృత్యమొనర్చి, ఆ కాళియుని మదమును అణచివేసెను. పిదప ఆ ప్రభువు దానిని ఆ మడుగునుండి వెడలగొట్టి, యమునా జలములను విషరహితములు (అమృతతుల్యములు) గావించి లోకోపకారమొనర్చెను.

26.13 (పదమూడవ శ్లోకము)

దుస్త్యజశ్చానురాగోఽస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసామ్|

నంద తే తనయేఽస్మాసు తస్యాప్యౌత్పత్తికః కథమ్॥9324॥

ఓ నందరాజా! గోకులమునందు నివసించే మాకందరికీ నీ తనయుడగు ఈ కన్నయ్యపై గల ప్రేమ విడువశక్యముగాకున్నది. అట్లే అతనికి కూడా మాపైన సహజసిద్ధమైన ప్రేమగలదు. దీనికి కారణము ఏమైయుండును?

26.14 (పదునాలుగవ శ్లోకము)

క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణమ్|

తతో నో జాయతే శంకా వ్రజనాథ తవాత్మజే॥9325॥

మహారాజా! ఏడు సంవత్సరముల వయస్సులో నున్న ఈ బాలుడెక్కడ? మహాపర్వతమైన ఆ గోవర్ధనగిరిని మోయుట ఎక్కడ? అందువలన నీ కుమారుడు సామాన్యమానవుడు కాడేమో? అని  మాకు అనుమానము కలుగుచున్నది".

నంద ఉవాచ

26.15 (పదిహేనవ శ్లోకము)

శ్రూయతాం మే వచో గోపా వ్యేతు శంకా చ వోఽర్భకే|

ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచ హ॥9326॥

అంతట నందుడు ఇట్లనెను "గోపాలులారా! మా చిన్నికృష్ణుని విషయమున మీకు ఎట్టి అనుమానము అవసరము లేదు. ఇదివఱలో గర్గమహాముని మా బాలుని గూర్చి నాతో చెప్పియుండెను. విపులముగా వివరించెదను, సావధానముగా వినుడు.

26.16 (పదహారవ శ్లోకము)

వర్ణాస్త్రయః కిలాస్యాసన్ గృహ్ణతోఽనుయుగం తనూః|

శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః॥9327॥

గర్గమహాముని నాతో మా శ్రీకృష్ణుని గూర్చి ఇట్లు వివరించెను-

"నందగోపా! ఈ నీ కుమారుడు ప్రతియుగమునందును శరీరధారియై అవతరించుచువచ్చెను. ఇంతవఱకును ఇతడు తెలుపు, ఎఱుపు, పసుపు వన్నెల తనువులను దాల్చియుండెను. ఇప్పుడు నలుపు వన్నె శరీరమును స్వీకరించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:24, 10/01/2021] +91 95058 13235: 10.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఆరవ అధ్యాయము

నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలురతో ముచ్చటించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

26.17 (పదిహేడవ శ్లోకము)

ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః|

వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సంప్రచక్షతే॥9328॥

26.18 (పదునెనిమిదవ శ్లోకము)

బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే|

గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః॥9329॥

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో ఇట్లు చెప్పదొడగెను:

ఈ నీకుమారుడు (శ్రీకృష్ణుడు) ఇంతకుమునుపు వసుదేవునకు పుత్రుడై జన్మించెను. అందువలన ఈ రహస్యమును ఎఱిగినవారుఇతనిని వాసుదేవుడు అని పేర్కొందురు. నీ కుమారుని గుణములకును, కర్మలకును అనుగుణముగా పెక్కురూపములు, పలు నామములు ఏర్పడెను. వాటిని నేను ఎఱుగుదును. సామాన్యజనులు ఎఱుగరు.

26.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనందనః|

అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ॥9330॥

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

ఈ మహాత్ముడు మీకు అందఱికిని శ్రేయస్సును గూర్చును. గోపాలురకును, గోవులకును ఆనందదాయకుడు.ఈ స్వామి అనుగ్రహమున మీరు పెక్కు కష్టములను సులభముగా దాటగలరు.

26.20 (ఇరువదియవ శ్లోకము)

పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః|

అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్ సమేధితాః॥9331॥

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

నందమహారాజా! పూర్వకాలమున ఒకసారి ఈ భూతలమున అరాజకము ఏర్పడెను. దొంగలు, దోపిడీదారులు చెలరేగి, సాధుపురుషులను పీడింపసాగిరి. ఈ నీ కుమారుడు సజ్జనులను రక్షించెను. నీ తనయుని అండదండలతో వారు ఆ దస్యులపై విజయమును సాధించిరి.

26.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

.య ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః|

నారయోఽభిభవంత్యేతాన్ విష్ణుపక్షానివాసురాః॥9332॥

26.22 (ఇరువది రెండవ శ్లోకము)

తస్మాన్నంద కుమారోఽయం నారాయణసమో గుణైః|

శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః॥9333॥

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

శ్రీమహావిష్ణువుయొక్క అనుగ్రహమునకు పాత్రులైన దేవతలను అసురులు ఎన్నడును, ఏవిధముగను జయింపజాలనట్లు, నీ కుమారునిపై ప్రేమానురాగములు గలవారై ఆయన కృపకు నోచుకొనిన భాగ్యశాలులకు శత్రుభయము (అంతశ్శత్రువుల వలనను, బాహ్యశత్రువుల వలనను భయము) ఏమాత్రమూ ఉండదు. అందువలన ఈ నీ సుతుడు గుణముల బట్టియు, ఐశ్వర్య, సౌందర్యము చేతను, కీర్తిప్రతిష్ఠల ప్రభావమువలనను శ్రీమన్నారాయణుని యంతటివాడు. కాబట్టి ఈతనియొక్క అద్భుతకర్మల (అలౌకిక కార్యముల)ను జూచి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు'

26.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఇత్యద్ధా మాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే|

మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణమ్॥9334॥

గర్గమహాముని శ్రీకృష్ణునిగూర్చి చెప్పిన వివరములను వివరించిన యనంతరము నందుడు గోపాలురతో ఇట్లనెను:

గర్గమహర్షి ఇట్లు నాకు స్పష్టముగా తెలిపి, తన ఆశ్రమమునకు వెళ్ళెను.అందువలన ఈ కృష్ణుని, ఎట్టి క్లిష్టకార్యములనైనను అవలీలగా నెఱవేర్చునట్టి శ్రీమన్నారాయణుని అవతారముగా నేను భావింతును"

26.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఇతి నందవచః శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః|

దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణస్యామితతేజసః|

ముదితా నందమానర్చుః కృష్ణం చ గతవిస్మయాః॥9335॥

గోపాలురు మిగుల తేజశ్శాలియైన శ్రీకృష్ణునియొక్క మహిమలను ఇదివఱలో స్వయముగా చూచినప్పుడు ఎంతయు ఆశ్చర్యచకితులైరి. ఇప్పుడు ఆ స్వామి తత్త్వమును గుఱించి గర్గమహర్షి పలుకులను నందునిద్వారా చెవులార విన్నపిమ్మట వారి ఆశ్చర్యములు తొలగిపోయెను. అంతేగాక వారు ఆనందభరితులై నందుని, శ్రీకృష్ణుని సాదరముగా కొనియాడిరి.

26.25 (ఇరువది ఐదవ శ్లోకము)

దేవే వర్షతి యజ్ఞవిప్లవరుషా వజ్రాశ్మపర్షానిలైః|

సీదత్పాలపశుస్త్రి ఆత్మశరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్|

ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచ్ఛిలీంధ్రం యథా|

 బిభ్రద్గోష్ఠమపాన్మహేంద్రమదభిత్ప్రీయాన్న ఇంద్రో గవామ్॥9336॥

తనకు తృప్తిని గూర్చుటకై గోపాలురు తలపెట్టిన యజ్ఞము శ్రీకృష్ణుని ప్రోద్బలముచే ఆగిపోవుటవలన ఇంద్రుడు మిగుల క్రుద్ధుడాయెను. అంతట అతడు (ఇంద్రుడు) సంవర్తాది మేఘములచే  కుంభవృష్టిని కురిపించెను. ఆ సమయమున పడిన పిడుగుపాటుల వలనను, వడగండ్లవానలవలనను, ఝంఝామారుతముల ధాటికిని బృందావనము నందలి బాలబాలికలు, గోవులు, స్త్రీలు, పురుషులు మిక్కిలి వ్యథలపాలైరి. అప్ఫుడు వారందఱును శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి. వారి దయనీయస్థితిని జూచి, ఆ ప్రభువు హృదయము ద్రవించెను. వెంటనే ఒక లీలను ప్రదర్శింపదలచి,ఆ స్వామి లోలోన నవ్వుకొనెను. పిదప  ఆటలలో బాలురు పుట్టగొడుగును చేబూనినట్లుగా, ఆ నందనందనుడు   గోవర్ధనగిరిని ఒకే ఒక చేతితో పెకలించి పట్టుకొని వ్రజవాసులను రక్షించెను. ఆ విధముగా ఇంద్రుని గర్వమునణచిన ఆ గోవిందుడు మనయెడల ప్రసన్నుడగుగాక!ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే షడ్వింశోఽధ్యాయః (26)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఆరవ అధ్యాయము (26)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:30, 11/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

207వ నామ మంత్రము 11.01.2021

ఓం మనోన్మన్యై నమః

ఉన్మని (మనస్సును హృదయమునందు నిలిపి ధ్యానించు) స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మనోన్మనీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మనోన్మన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణచే ఆధ్యాత్మికజ్ఞాన సంపదలను సంప్రాప్తింపజేసుకొని, ఆ పరమేశ్వరి పాదసేవలో తరించును.

మనోన్మనీ ఇది స్త్రీలింగ శబ్దము. మనోన్మనః - పుంలింగ శబ్దము - ఈ రెండు శివశక్తుల నామములే. ఈ శబ్దములు ఉపాధిగా చూస్తున్నాము  తప్ప శక్తి మాత్రం అమ్మవారే. మనోన్మనీ అను ఈ నామము  పరమేశ్వరునియొక్క పదిశక్తులు అని తెలుసుకోవాలి. అది రుద్రసూక్తంలో ఈ ప్రసక్తి వస్తుంది. 

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః  శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః  కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయనమో  బలప్రమథ నాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః|

వామదేవాయ, జ్యేష్ఠాయ, శ్రేష్ఠాయ, రుద్రాయ, కాలాయ, కలవికరణాయ, బలవికరణాయ, బలాయ, బలప్రమథనాయ, సర్వభుతదమనాయ, మనోన్మ అను ఈ శివునియొక్క పదిశక్తులు అమ్మవారే. గనుక ఈ పదింటినీ స్త్రీలింగ శబ్దములు చేస్తే...

వామా, జ్యేష్ఠా, శ్రేష్ఠా,రౌద్రీ, కాలా (కాళీ), కలవికరిణీ, బలవికరణీ, బలా, బలప్రమథనీ, సర్వభూతదమనీ, మనోన్మనీ.

ఈ పది శక్తులలోనే (పైన చెప్పిన మంత్రంలోనే) సృష్టి, స్థితి, లయకార్యములు ఇమిడి ఉన్నాయి. అవి ఎలాగో గమనిద్దాము.

1. సృష్టి

వామా - వమనత్వం - వెలిగ్రక్కుట అనగా తనలో ఉన్న సృష్టిని వెలికితీయుటచే వామా

2. స్థితి

జ్యేష్ఠా - తను సృష్టించిన ఈ సృష్టికే ప్రథమం గనుక జ్యేష్ఠా.

శ్రేష్ఠా - తను ప్రథమం మాత్రమేగాక శ్రేష్ఠము అగుటచే శ్రేష్ఠా

రౌద్రీ ఈ జగత్తునంతటినీ తన రౌద్రీ శక్తిచే నియంత్రించుటచే రౌద్రీ

కాలా జగత్తునంతటినీ కాలస్వరూపంగాగమనించుటచే కాలా

కలవికరణీ కాలాన్ని జగత్తులో ఒక్కొక్క జీవికి ఒక్కొక్కవిధంగా వెదజల్లడము లేదా పంచడము గనుక కలవికరణీ.

బలవికరణీ సృష్టిలో ఒక్కొక్క వస్తువుకు (ఉపాధికి) ఒక్కొక్క విధంగా ఇచ్చుటచే బలవికరణీ.

బలా ఇన్ని బలములు ఇచ్చిన శక్తిగనుక బలా

బలప్రమథనీ తను ఇచ్చిన బలాన్ని చూసుకొని, విర్రవీగుతూ, ఆ బలాన్నిదుర్వినియోగంచేస్తే ఆ బలాన్ని మథించుట (బలముచే వచ్చు విరగబాటును నిర్మూలించుట) చే బలప్రమథనీ

3. లయం

సర్వభూతదమనీ  కల్పాంతంలో సృష్టినంతటినీ తనలో లయంచేసికొనుటచే సర్వభూతదమనీ

ఈ విధంగా పైమంత్రంలోని పరమేశ్వరుని పదిశక్తులను నిర్వహించునదే మనోన్మనీ అను  నామము కలిగిన జగన్మాత.  గనుక మంత్రం చివరలో మనోన్మనః అని చెప్పబడినది.

ధ్యానధ్యాతృధ్యేయభావో యథా తశ్యతి నిర్భరం తదోన్మనత్త్వం భవతి జ్ఞానామృతనిషేవణా

ధ్యానము, ధ్యేయము (ధ్యానింపదగిన భగవత్స్వరూపము), ధ్యాత అనునది త్రిపుటి. అలాగే  జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ (తెలుసుకొనేవాడు, తెలియబడేది, తెలసికొనుట) ఈ త్రిపుటి యనునది ప్రతీ ఉపాధిలోనూ ఉంటుంది. ఈ (మూడింటి) త్రిపుటిలో జ్ఞాత, జ్ఞేయ అనునవి జ్ఞానములో లీనమైతే (ఏకత్వమైతే) కలిగే ఆనందమే త్రిపురసుందరి. ఈ త్రిపుటి నశించుటయే త్రిపురాసుర సంహారము .ఈ త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే (జ్ఞానమే) అని  తెలిసికొనేదే త్రివిక్రమ ఏ స్థితికి చేరాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడూ ఒక్కటైపోతాయో దానినే ఏకత్వము దీనినే జీవబ్రహ్మైక్యము అందురు. ఈ స్థితిలో జ్ఞానామృతమును సేవించుట వలన ఉపాసకునికి ఉన్మనీత్వస్థితి కలుగును. దీనినే మనస్సును ఉత్కృష్టజ్ఞానముతో గూడిన వానినిగా చేయుచున్నది గనుక మనోన్మని యని అనబడినది. ఇటువంటి స్థితిలో ఉండే జగన్మాత మనోన్మనీ అనబడినది.

ఈ మనోన్మనీ స్థితిలో అమ్మవారు ఉంటుంది. అలాగే సాధకుడు ఈ స్థితికి చేరితే ఎలా ఉండడం జరుగుతుంది అంటే...

యోగాభ్యాసంలో ఉన్మన గురుంచి

నేత్రే య యోన్మేషనిమేషయుక్తే

వాయుర్యయా వర్జితరేచపూరః|

మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం

మనోన్మనీ సా మయి సన్నిధత్తాం॥

ఉన్మనస్థితిలో కంటికి ఉన్మేషనిమేషములు (రెప్పపాటీలేకుండా) కళ్ళు తెరచియుండే ఉండిపోతాయి. ప్రపంచం చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని ఆ స్థితి అంతర్లక్ష్యం బహిర్దృష్టి అన్నట్లుంటుంది. ప్రాణాయామమందు రేచకము, పూరకములేక కుంభకస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ స్థితి సాధకునికి ఊహమాత్రమే.  కాని సిద్ధునికి అనుభవముగా ఉంటుంది.   మనస్సుకు సంకల్పవికల్పములు ఉండవు. అటువంటి స్థితిని సాధకుడు కోరుకుంటాడు అని భావము.

మన ఉన్మని స్థితి అనగా సాధకుడు పొందిన అత్యంత ఉత్కృష్టస్దితినే మనోన్మని అంటారు. 

 ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు నడుమ కొన్ని శక్తులు లేదా సూక్ష్మచక్రములు ఉన్నవి. ఆ శక్తులే పైన చెప్పిన వామదేవాయ నమో.....మనోన్మహః లో చెప్పిన శక్తులు.  ఆజ్ఞాచక్రం నుండి పైకివెళుతున్నకొలదీ సాధకుని ఆనందానుభూతి వర్ణనాతీతము.  అలా పైకి ఈ సూక్ష్మచక్రములను దాటి వెళ్ళగా సహస్రారంలో బిందువు క్రింద ఉన్న స్థానంలో ఉన్నదే మనోన్మనీ.  ఆ స్థితి దాటితే పరమాత్మసన్నిధియే సాధకునికి లభించునది. ఆ స్థితికి చేరితే సంకల్పవికల్ప శూన్యమై, శివశక్తి సమ్మిళితమై, అహోరాత్ర భేదరహితమై, చంద్రమండలమునకు చేరిన స్థితి, భ్రూమధ్యము నుండి ఎనిమిదవ స్థానమువద్ద ఉన్నదే ఉన్మని అదే మనోన్మని. ఆ పై స్థానమే బిందువు. మూలాధారంలో కుండలినీ శక్తిని జాగృతంచేసి, ఊర్ధ్వ ముఖంగా ప్రయాణింపజేస్తూ, గ్రంథిత్రయాన్ని భేదింపజేస్తూ, భ్రూమధ్యమునకు చేరినపిదప అక్కడ నుండి సూక్ష్మచక్రముల ద్వారా కుండలినీ శక్తి ప్రయాణిస్తుంది. ఎనిమిదవది అయిన సుమన దాటిన తరువాత ఉండునదే ఉన్మన. అచ్చట మనసు పనిచెయ్యదు. సంకల్పవికల్పా లుండవు.ఇంకేమియు ఉండని స్థితికి చేరడం జరుగుతుంది. ఆ స్థితి దాటిన తరువాత ఉండేది మహాబిందువు మాత్రమే. ఆ స్థితికి చేరిన తరువాత గోచరించేది పరమేశ్వరి మాత్రమే. మనసు కూడా ఆ స్థితిలో పనిచేయక అంత కన్నా అతీతమైన ఉన్మని స్థితికి చేరడం జరుగుతుంది గనుకనే పరమేశ్వరి  మనోన్మని యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మనోన్మన్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:30, 11/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

781వ నామ మంత్రము  11.01.2021

ఓం ప్రత్యగ్రూపాయై నమః

బహిర్ముఖములగు ఇంద్రియములకు ప్రతికూలముగా నడచునట్టి స్వరూపముగలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రత్యగ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రత్యగ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి    సుఖసంతోషములు, ఇష్టకామ్యసిద్ధియు లభించును.

 జ్ఞానేంద్రియములు (చెవి, 2. చర్మము, 3. కన్ను, 4. నాలుక, 5. ముక్కు),  కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ) ఇవి అన్నియు దేహమునకు సంబంధించినవి. బహిర్ముఖములు. బాహ్యజగత్తును మాత్రమే చూస్తాయి. బాహ్యజగత్తులోని అంశములనే పరిగణనలోనికి తీసుకుని తత్సంబంధమైన కార్యనిర్వహణనే చేస్తాయి. ఐహిక సుఖవ్యామోహములవైపు మాత్రమే మనసు లగ్నమై ఉంటుంది. వీటికి ఆత్మను దర్శించే శక్తి ఉండదు. దీనినే విషయోన్ముఖము అంటారు. దీనినే బహిర్ముఖత్వము, పరాఙ్ముకత్వము అనికూడా అంటారు. ఇంద్రియములు విషయములను విడిచిపెట్టి అంతరాత్మవైపు త్రిప్పినట్లైతే, అది అంతర్ముఖత్వము, ప్రత్యఙ్ముఖత్వము అంటారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఇంద్రియములను బాహ్యజగత్తును చూస్తున్నప్పటికిని ఆత్మను కూడా దర్శించగలవు. అందుకు ఇంద్రియస్వాధీనము అవసరము. కోతికొమ్మచ్చులాడే మనసును అదుపులో ఉంచితే ఆత్మసాక్షాత్కారమవుతుంది. దీనినే ప్రత్యఙ్ముఖము అంటారు. జీవుడు బహిర్ముఖమనుకుంటే ఆత్మ ప్రత్యఙ్ముఖము అవుతుంది. ఆత్మస్వరూపిణియైన జగన్మాత రూపము  ప్రత్యక్ గా అంతరాత్మయందు చూస్తాము గనుక జగన్మాత ప్రత్యగాత్మ,   ఆ  స్వరూపంలో ఉన్న జగన్మాత  ప్రత్యగ్రూపా యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రత్యగ్రూపాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:30, 11/01/2021] +91 95058 13235: 11.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

27.1 (ప్రథమ శ్లోకము)

గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే|

గోలోకాదావ్రజత్కృష్ణం సురభిః శక్ర ఏవ చ॥9337॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చేబూని, జడివాన ప్రమాదమునుండి వ్రజవాసులను రక్షించిన శుభసందర్భమున కామధేనువు ఆ ప్రభువును ప్రస్తుతించుటకై గోలోకమునుండి విచ్చేసెను. అట్లే తన అపరాధమును మన్నింపుమని వేడుకొనుటకై ఇంద్రుడు దేవలోకమునుండి వ్రజభూమికి ఏతెంచెను.

27.2 (రెండవ శ్లోకము)

వివిక్త ఉపసంగమ్య వ్రీడీతః కృతహేలనః|

పస్పర్శ పాదయోరేనం కిరీటేనార్కవర్చసా॥9338॥

శ్రీకృష్ణుని చులకనగా చూచిన కారణమున ఇంద్రుడు మిగుల పశ్చాత్తప్తుడయ్యెను, సిగ్గుపడెను. అందువలన అతడు ఏకాంతప్రదేశమున శ్రీకృష్ణుని కడకు చేరి, సూర్యకాంతులతో తేజరిల్లుచున్న తన కిరీటము ఆ ప్రభువు పాదములను స్పృశించునట్లుగా ప్రణమిల్లెను.

27.3  (మూడవ శ్లోకము)

దృష్టశ్రుతానుభావోఽస్య కృష్ణస్యామితతేజసః|

నష్టత్రిలోకేశమద ఇంద్ర ఆహ కృతాంజలిః॥9339॥

శ్రీకృష్ణునియొక్క అత్యుద్భుత ప్రతిభాపాటవములను గూర్చి ఇంద్రుడు ఇంతకు ముందు వినియుండుటయేగాక ఇప్పుడు స్వయముగా చూచెను. 'నేను త్రిలోకాధిపతిని' అని విర్రవీగుచున్న తన అహంభావమును అణచిపెట్టి ఆ కృష్ణప్రభువునకు అంజలి ఘటించి, దేవేంద్రుడు వినమ్రుడై ఇట్లు ప్రస్తుతించెను.

ఇంద్ర ఉవాచ

27.4 (నాలుగవ శ్లోకము)

విశుద్ధసత్త్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కమ్|

మాయామయోఽయం గుణసంప్రవాహో న విద్యతే తేఽగ్రహణానుబంధః॥9340॥

ఇంద్రుడు ఇట్లు స్తుతించెను కృష్ణపరమాత్మా! నీ స్వరూపము శుద్ధసత్త్వమయము. పరమశాంతమైనది. జ్ఞానస్వరూపము. త్రిగుణాతీతము. అజ్ఞానముచే ఉత్పన్నమగు మాయమయమైన గుణముల ప్రవాహరూపమగు ఈ సంసారము నీయందు లేదు.

27.5 (ఐదవ శ్లోకము)

కుతో ను తద్ధేతవ ఈశ తత్కృతా లోభాదయో యేఽబుధలింగభావాః|

తథాపి దండం భగవాన్ బిభర్తి  ధర్మస్య గుప్త్యై ఖలనిగ్రహాయ॥9341॥

కావున, ఓ ఈశ్వరా! లోభము, క్రోధము వంటి భావములు అజ్ఞానుల లక్షణములు. ఇవి అజ్ఞానమువలన జనించి సంసారబంధమునకు కారణములు అగును. అజ్ఞానమే లేనట్టి నీయందు  అవి ఎక్కడనుండి, ఎట్లు వచ్చును? అయినప్పటికినీ, ఓ ప్రభూ! దుష్టులను శిక్షించి, ధర్మమును రక్షించుటకొరకే నీవు దండమును ధరించెదవు.

27.6 (ఆరవ శ్లోకము)

పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్తదండః|

హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినామ్॥9342॥

జగత్తునకు తండ్రివి, గురుడవు, అధీశ్వరుడవు నీవే. సమస్త జగత్తును నియంత్రించుటకై దండమును ధరించిన దుస్తరమైన కాలస్వరూపుడవు. లోకములకు కళ్యాణమును చేకూర్చుటకుగాను " ఈ జగత్తునకు మేమే ప్రభువులము" అని విర్రవీగునట్టి వారి దురభిమానమును అణచివేయుటకు గాను, నీవు లీలారూపమును అవతరించి, అందరికి హితమును చేకూర్చెదవు.

27.7  (ఏడవ శ్లోకము)

యే మద్విధాజ్ఞా జగదీశ మానినస్త్వాం వీక్ష్య కాలేఽభయమాశు తన్మదమ్|

హిత్వాఽఽర్యమార్గం ప్రభజంత్యపస్మయా ఈహా ఖలానామపి తేఽనుశాసనమ్॥9343॥

స్వామీ! మా వంటి అజ్ఞానులు 'మేమే జగదీశులము' అని గర్వపడుచుందురు. అట్టివారు భయావహస్థితియందును నిర్భయుడనై యుండెడి నిన్ను చూచి, తమ జగదీశాభిమానమును పరిత్యజింతురు. అంతట వారు తమ గర్వమును వీడి సత్పురుషుల మార్గమును అనుసరించుదురు. కనుక నీ లీలలు అన్నియును దుష్టులను దండించి, వారిని సన్మార్గములకు మఱలించుటకే.

27.8 (ఎనిమిదవ శ్లోకము)

స త్వం మమైశ్వర్యమదప్లుతస్య  కృతాగసస్తేఽవిదుషః ప్రభావమ్|

క్షంతుం ప్రభోఽథార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశ మేఽసతీ॥9344॥

ప్రభూ! ఇంద్రాధిపత్య మదముతో నేను కన్నుమిన్ను గానక యుంటిని. అందువలన నీ ప్రభావమును ఎఱుంగక గొప్పతప్పిదమును చేసియుంటిని. నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు మూఢాత్ముడవైన నన్ను మన్నింపుము. అంతేగాక, దారితప్పిన (అపమార్గములను బట్టిన) నా మనస్సు మఱల పెడదారి పట్టకుండా దయజూడుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:22, 11/01/2021] +91 95058 13235: 11.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

27.9 (తొమ్మిదవ శ్లోకము)

తవావతారోఽయమధోక్షజేహ  స్వయంభరాణామురుభారజన్మనామ్|

చమూపతీనామభవాయ దేవ  భవాయ యుష్మచ్చరణానువర్తినామ్॥9345॥

అధోక్షజా! దుష్టులైన రాజులు దేహాభిమానము గలిగి, భూమికి భారముగా పరిణమింతురు. అట్టివారిని వధించి, వారికి ముక్తిని ఒసంగుచుందువు. నీ చరణకమలములను ఆశ్రయించిన భక్తులకు క్రమాభివృద్ధిని గూర్చుచు వారిని ఆదుకొనుచుందువు. ఓ దేవదేవా! నీ అవతారముల పరమలక్ష్యము ఇటువంటిదేగదా!

27.10 (పదియవ శ్లోకము)

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే|

వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః॥9346॥

శ్రీకృష్ణా! వాసుదేవా! నీవు షడ్గుణైశ్వర్యసంపన్నుడవు, పరమపురుషుడవు. భక్తవత్సలుడవు. నీకు పదే పదే నమస్కారములు.

27.11 (పదకొండవ శ్లోకము)

స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధజ్ఞానమూర్తయే|

సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః॥9347॥

ప్రభూ! నీవు యథేచ్ఛగా అవతారములను స్వీకరించెదవు. సర్వస్వరూపుడవు. శుద్ధజ్ఞానస్వరూపుడవు. సమస్త విశ్వమునకును కారణమైనవాడవు. సకలప్రాణుల యందును ఆత్మస్వరూపుడవు. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను.

27.12 (పండ్రెండవ శ్లోకము)

మయేదం భగవన్ గోష్ఠనాశాయాసారవాయుభిః|

చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా॥9348॥

27.13 (పదమూడవ శ్లోకము)

త్వయేశానుగృహీతోఽస్మి ధ్వస్తస్తంభో వృథోద్యమః|

ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః॥9349॥

సర్వేశ్వరా! నా నిమిత్తమై సంకల్పింపబడిన యజ్ఞము నిలిపివేయబడగా దేహాభిమానినైన నేను మిగుల కోపావిష్టుడను ఐతిని. అందులకు ప్రతిక్రియగా పెనుగాలులతోగూడిన జడివానులను కురిపించితిని. నీ అనుగ్రహమునకు పాత్రులైన వ్రజవాసులను నశింపజేయుటకై పూనుకొంటిని. నేను చేసిన మహాపరాధమిది. ఐనను, నాయెడ కినుక వహింపక నన్ను అనుగ్రహించితివి. స్వామీ! అన్నివిధములుగా మాకు నీవే దిక్కు. నాకు జ్ఞానోదయమును కలిగించిన గురుడవు నీవు. నా ఆత్మస్వరూపుడవైన పరమాత్మా! నిన్ను నేను శరణువేడుచున్నాను".

శ్రీశుక ఉవాచ

27.14 (పదునాలుగవ శ్లోకము)

ఏవం సంకీర్తితః కృష్ణో మఘోనా భగవానముమ్|

మేఘగంభీరయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్॥9350॥

శ్రీశుకుడు వచించెను ఇంద్రుడు శ్రీకృష్ణుని ప్రస్తుతించిన పిదప, ఆ పురుషోత్తముడు నవ్వుచు దేవేంద్రుని ఉద్దేశించి, మేఘగంభీర ధ్వనితో ఇట్లనెను.

శ్రీభగవానువాచ

27.15 (పదునైదవ శ్లోకము)

మయా తేఽకారి మఘవన్ మఖభంగోఽనుగృహ్ణతా|

మదనుస్మృతయే నిత్యం మత్తస్యేంద్రశ్రియా భృశమ్॥9351॥

27.16 (పదహారవ శ్లోకము)

మామైశ్వర్యశ్రీమదాంధో దండపాణిం న పశ్యతి|

తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహమ్॥9352॥

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను "మహేంద్రా! నీవు ఐశ్వర్యగర్వముతో కన్నుమిన్నుగానక యుంటిని. అట్టి నిన్ను అనుగ్రహించుట కొఱకే నీ యజ్ఞమును భంగపఱచితిని. అందువలన నీవు తెలివితెచ్చుకొని నిత్యము నన్ను స్మరించుచుందువు. ఐశ్వర్యమదముతో నిక్కుచున్నవారు దండధారియగు నన్ను విస్మరింతురు. అట్టి వారిని అనుగ్రహింపదలచినప్పుడు ముందుగా వారి సంపదలను పోగొట్టెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:11, 12/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

782వ నామ మంత్రము 12.01.2021

ఓం పరాకాశాయై నమః

ఉత్కృష్ట, బ్రహ్మాండ, పిండాండాకాశముల స్వరూపిణియు, సప్తసముద్రముల కావలగల పరాకాశ స్వరూపురాలైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాకాశా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరాకాశాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఐహిక సుఖసంతోషములతోబాటు, పరమపదసోపానములను చేరుటకు కావలసిన మనోనిగ్రహత సంప్రాప్తమగును.

ఉత్కృష్టమగు ఆకాశము నిర్గుణమైనది. పరబ్రహ్మస్వరూపమైనది. దీనినే పరాకాశము అందురు. బ్రహ్మసూత్రభాష్యములో ఆకాశము అనునది పరబ్రహ్మమే గాని పంచభూతములలో చెప్పబడిన ఆకాశముకాదు అని చెప్పబడినది. ఆ పరాశక్తి బ్రహ్మసూత్రభాష్యములో  చెప్ఫబడిన ఆకాశరూపమున ఉన్నది అనిగూడ కూర్మపురాణమందు గలదు. అందుచే ఆ పరాశక్తి పరాకాశా యని అనబడుచున్నది. సర్వజగత్తులకు కారణభూతురాలును,  సర్వాత్మకురాలును, సర్వనియామకురాలు అయిన మహేశ్వరశక్తి అనాదిగా ఆకాశనామముతో కలదై ప్రకాశించుచున్నదని కూడా చెప్పబడినది. ఇట్టి పరాకాశము బ్రహ్మాండమునందునూ గలదు మరియు పిండాండమందునూ (పాంచభౌతిక శరీరమందును) ఉండుటచే రెండుగా తోచుచున్నది. ఈ పరాకాశమందు పరబ్రహ్మ అభివ్యక్తముగుననియు, అందుచే అట్టిది పరాకాశము అనబడుచున్నదనియు చెప్పబడినది. 

ద్వాదశాంతం లలాటోర్థ్వం కపాలోర్థ్వా వసానకమ్|

ద్వ్యంగుళోర్థ్వం శిరోదేశాత్ పరంగ్యోమ ప్రకీర్తితా॥ (స్వచ్ఛంద తంత్రంలో చెప్పబడినది -  సౌభాగ్యభాస్కరం. 879వ పుట)

లలాటమునకు పైన గల ద్వాదశాంతములో గల కపాలము  పైభాగము అంతమయేచోట, శిరస్సుకు రెండంగుళాల పైభాగములో పరాకాశము గలదని చెప్పబడినది.  ఇంకోలా చెప్పాలంటే  సప్తసముద్రములకావల (మేరువు, సప్తద్వీపములు, సప్తసముద్రముల తరువాత) గల ఆకాశమునకు పరాకాశము అందురు. అందులో లలితాంబిక పదహారువర్షముల ప్రాయములో గలదని చెప్పబడినది. కాబట్టి జగన్మాత పరాకాశా యని అనబడినది.

ఇంకను ఇలాగ కూడా చెప్పబడినది:-

కృతయుగమునందు ప్రథమసంవత్సరముస  1.లలిత, 2. కామేశ్వరి, 3. భగమాలిని, 4. నిత్యక్లిన్న, 5. భేరుండి, 6. వహ్నివాసిని, 7. మహావజ్రేశ్వరి, 8. శివదూతి, 9. త్వరిత, 10. కులసుందరి, 11. నిత్య, 12. నీలపతాక, 13. విజయ, 14. సర్వమంగళ, 15. జ్వాలామాలిని, 16. చిత్ర. ఈ పదహారు నిత్యలు క్రమముగా  మహామేరువు, సప్తద్వీపములు, తరువాత సప్తసముద్రములు, పరాకాశము.  వీరు శుక్లపక్షమునందు ఆరోహణక్రమమున ఒక్కొక్కరు పైకి చేరి అచ్చట ఒక సంవత్సరము ఉండి రెండవ సంవత్సరమందు పై స్దానమునకు చేరుచూ, పదహారు వర్షములు పూర్తిఅయినప్పటికి ప్రతినిత్యయూ పరాకాశ స్థానమును  పొంది ఒక సంవత్సరముండి  మరల క్రిందకు దిగుదురు. క్రిందకు దిగునది కృష్ణపక్షమగును. ఈ క్రమము మొదట మేరుస్థితి, తరువాత ద్వీపస్థితి అనంతరము సముద్రస్థితి, ఆపైన పరాకాశస్థితిగా పరావర్తనము జరుగుచుండును. మేరువు, సప్తద్వీపములు, సప్తసముద్రములు  తరువాత ఉండునదే పరాకాశము. అక్కడకు చేరుసరికి పరమేశ్వరికి (లలితకు) పదహారు సంవత్సరముల కన్య అగును. గనుక లలితాంబ పరాకాశం ఉండునప్పటికి పదహారు వత్సరములు గనుక పరాకాశా యని అనబడినది. లేదా కఠినతరమైన, దుఃఖప్రదమైన (పరాకకృచ్ఛ్రవ్రతము అను) ఒకానొక తపస్సు పదహారు వత్సరములు (మేరువు, సప్తసముద్రములు,, సప్తసముద్రములు, చివరగా పరాకాశమును) ఉపలక్షణమనుకొని తపస్సుచే జగన్మాత అనుగ్రహమును పొందవలయును. అట్లైన ఉత్కృష్ఠమైన  పాపములు పోవును. దుఃఖములు శమింపబడును. గనుకనే జగన్మాత పరాకాశా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పరాకాశాయై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:11, 12/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

208వ నామ మంత్రము 12.01.2021

ఓం మహేశ్వర్యై నమః 

ప్రకృతి రూపంలో ఉన్నప్పుడు మాయగాను, ప్రకృతికి అతీతంగానున్నప్ఫుడు మహేశ్వరిగాను విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరునికి పత్ని కావున మహేశ్వరి అను నామముతో కీర్తింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహేశ్వరీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మహేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఉపాసించు సాధకునకు సుఖసంతోషములు, సర్వాభీష్టసిద్ధియు లభించును.

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్ 

అని ఈశ్వర తత్త్వమును శ్రుతి స్పష్టము చేస్తున్నది.  ప్రకృతి మాయా రూపమనియు మహేశ్వరుడే మాయను అధిష్ఠించి ఉన్న ప్రభువని తెలిసికొనవలెను. మహేశ్వరునికి, మహేశ్వరికి భేదములేదు గనుక జగన్మాత మహేశ్వరీ యని అనబడుచున్నది.

త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్త్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వీటి గురించి వివరణ ఉంది. రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి. భగవద్గీత ప్రకారం సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి. సత్వ గుణం కలిగిన వారు పై లోకాలకు వెళుతున్నారు. రజోగుణం కలిగిన వారు మానవ లోకంలో జన్మిస్తున్నారు. తమోగుణ ప్రవృత్తి గలవారు అథోలోకాలకు వెళుతున్నారు.

పరమాత్మ తమోగుణసహితుడైనప్పుడు  కాలరుద్రుడనియు, రజోగుణసహితుడైనప్పుడు హిరణ్యగర్భుడనియు, సత్వగుణసహితుడైనప్పుడు శ్రీమహావిష్ణువుగాను చెప్పుదురు. గుణత్రయశూన్యుడైనప్పుడు మహేశ్వరుడౌతాడు. అనగా మహేశ్వరుడు నిర్గుణస్వరూపుడు. అంటే త్రిగుణాతీతుడు. శివశక్తులిరువురికి అభేదమున్నది గనుక శక్తిస్వరూపిణియైన పరమేశ్వరి మహేశ్వరి యని అనబడినది.

ఓంకారము త్రిగుణాత్మకము. అ ఉ మ ఈ మూడక్షరముల సమన్వయమే ఓంకారము అయితే అ కారము సత్త్వగుణము, ఉ కారము  రజోగుణము, మ కారము తమోగుణము. ఆ పరమేశ్వరుడు త్రిగుణాత్మకుడు అయితే  మాయగాను, అలాగే త్రిగుణాతీతమైనప్ఫుడు మహేశ్వరునిగాను మరియు వాతులాగమమందు పంచవింశతి వ్యూహములు గల పరమేశ్వరుడు మహేశ్వరుడనియు, పరమేశ్వరునికి పరమేశ్వరికి అభేదమున్నది (శివశక్త్యైము చెప్పబడుటచే) గనుక అమ్మవారు మహేశ్వరి యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహేశ్వర్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:11, 12/01/2021] +91 95058 13235: 12.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

27.17 (పదిహేడవ శ్లోకము)

గమ్యతాం శక్ర భద్రం వః క్రియతాం మేఽనుశాసనమ్|

స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వః స్తంభవర్జితైః॥9353॥

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలుకుచుండెను

"సురపతీ! ఇకమీదట మీరు నన్ను అనుక్షణము స్మరించుచుందురు. తత్ప్రభావమున మీకు శుభములు చేకూరుచుండును. అహంభావమును వీడి, మీ మీ అధికారపరిధులకు లోబడి సముచితరీతిలో ప్రవర్తించుచుండుడు. ఈ నా ఆజ్ఞను   శిరసావహించుచు నడచుకొనుడు".

27.18 (పదునెనిమిదవ శ్లోకము)

అథాహ సురభిః కృష్ణమభివంద్య మనస్వినీ|

స్వసంతానైరుపామంత్ర్య గోపరూపిణమీశ్వరమ్॥9354॥

శ్రీకృష్ణుడు ఇంద్రుని ఇట్లు ఆజ్ఞాపించుచుండెను. ఇంతలో సాధుస్వభావముగల (కనికరముతో  భక్తుల వాంఛితార్థములను ఈడేర్చునట్టి) కామధేనువు తన సంతానముతోగూడి, గోపాలుని రూపములో నున్న ఆ సర్వేశ్వరుని సమీపించి, ఆ స్వామికి ఈ విధముగా విన్నవించెను.

సురభిరువాచ

27.19  (పందొమ్మిదవ శ్లోకము)

కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ|

భవతా లోకనాథేన సనాథా వయమచ్యుత॥9355॥

కామధేనువు ఇట్లు పలికెను "కృష్ణా! కృష్ణా! నీవు మహాయోగీశ్వరుడవు. ఈ విశ్వమునందలి సకలచరాచర ప్రాణులకు అంతరాత్మవు. విశ్వముయొక్క ఉత్పత్తికి నీవే కారణుడవు. సకలలోకములకు నాథుడవు నీవే. కనుక మేము సనాథులము ఐతిమి. అచ్యుతా! నీవే! మాకు అందఱిని సర్వదా శరణ్యుడవు.

27.20  (ఇరువదియవ శ్లోకము)

త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే|

భవాయ భవ గోవిప్రదేవానాం యే చ సాధవః॥9356॥

జగన్నాథా! నీవే మాకు పరమదైవము. నీవే మా ఇంద్రుడవు. సాధుస్వభావముగల గోవులకును, విప్రోత్తములకును, సకల దేవతలకును, ఆ అందఱికిని అభ్యుదయములను అనుగ్రహించెడి రక్షకుడవు నీవే (దేవా! మా అందఱికిని అభ్యుదయములను ప్రసాదించు చుండుము).

27.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

ఇంద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణా నోదితా వయమ్|

అవతీర్ణోఽసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తయే॥9357॥

విశ్వాత్మా! ఈ భూభారమును తొలగించుటకై అవతరించిన పరమపురుషుడవు నీవు. బ్రహ్మదేవుని ప్రేరణచే మేము నీ సన్నిధికి విచ్చేసితిమి. మా అందఱికిని ప్రభుడవైన నిన్ను గోక్షీరాదులతో అభిషేకించెదము".

శ్రీశుక ఉవాచ

27.22  (ఇరువది రెండవ శ్లోకము)

ఏవం కృష్ణముపామంత్ర్య సురభిః పయసాఽఽత్మ నః|

జలైరాకాశగంగాయా ఐరావతకరోద్ధృతైః॥9358॥

27.23  (ఇరువది మూడవ శ్లోకము)

ఇంద్రః సురర్షిభిః సాకం నోదితో దేవమాతృభిః|

అభ్యషించత దాశార్హం గోవింద ఇతి చాభ్యధాత్॥9359॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఆ కామధేనువు ఇట్లు ప్రార్థించి, తన క్షీరములతో శ్రీకృష్ణుని అభిషేకించెను.  అట్లే దేవతలచేతను, దేవమాతయైన అదితిచేతను ప్రేరితుడైన ఇంద్రుడు సురలతోడను, ఋషులతోడను గూడి, ఐరావతము తీసికొనివచ్చిన ఆకాశగంగా జలములతో శ్రీకృష్ణప్రభువునకు అభిషేకమొనర్చెను. పిదప గోవిందనామముతో ఆ స్వామిని కీర్తించెను.

27.24  (ఇరువది నాలుగవ శ్లోకము)

తత్రాగతాస్తుంబురునారదాదయో గంధర్వవిద్యాధరసిద్ధచారణాః|

జగుర్యశో లోకమలాపహం హరేః సురాంగనాః సన్ననృతుర్ముదాన్వితాః॥9360॥

అప్పుడు అచటికి విచ్చేసియున్న తుంబురుడు, నారదుడు మున్నగు గానకళాకోవిదులును, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు మొదలగు దివ్యజాతులవారును కలికల్మషములను హరించునట్టి (వినిన వారియొక్క, సంస్కరించిన వారియొక్క పాపములను రూపుమాపునట్టి) శ్రీకృష్ణుని యశోవైభవములను తనివిదీర కీర్తించిరి. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు (దివ్యాంగనలు) సంతోషముతో నృత్యములొనర్చిరి.

27.25 (ఇరువది నాలుగవ శ్లోకము)

తం తుష్టువుర్దేవనికాయకేతవో హ్యవాకిరంశ్చాద్భుతపుష్పవృష్టిభిః| .

లోకాః పరాం నిర్వృతిమాప్నువంస్త్రయో  గావస్తదా గామనయన్ పయోద్రుతామ్॥9361॥

అంతట ప్రముఖ దేవతలు ఎల్లరును అద్భుతములైన (నందనవనమునందలి) దివ్య పుష్పములను వర్షించిరి. ముల్లోకములను పరమానందభరితములయ్యెను. గోవులు శ్రీకృష్ణప్రభువును అభిషేకించిన పాలధారలతో భూతలమంతయును ఆర్ద్రమయ్యెను.

27.26 (ఇరువది ఆరవ శ్లోకము)

నానారసౌఘాః సరితో వృక్షా ఆసన్ మధుస్రవాః|

అకృష్టపచ్యౌషధయో గిరయోఽబిభ్రదున్మణీన్॥9362॥

ఆనందదాయకమైన శ్రీకృష్ణుని అభిషేక శుభసమయమున నదులన్నియును మధురజలములతో నిండారెను. వృక్షములయందలి పూవులనుండి మకరందములు స్రవించెను. వ్యవసాయాది దోహదక్రియలు లేకుండగనే ఓషధి సమృద్ధి ఏర్పడెను. సకల పర్వతములును, హర్షపులకితములై మణులకాంతులను విరజిమ్మెను.

27.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కృష్ణేఽభిషిక్త ఏతాని సత్త్వాని కురునందన|

నిర్వైరాణ్యభవంస్తాత క్రూరాణ్యపి నిసర్గతః॥9363॥

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు అభిషిక్తుడైన వేళ క్రూరమృగములు సైతము తమ సహజవైరములను మాని పరస్పర మైత్రితో మెలగసాగెను.

27.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఇతి గోగోకులపతిం గోవిందమభిషిచ్య సః|

అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివమ్॥9364॥

ఈ విధముగా గోవులకును, గోపాలురకును ప్రభువైన గోవిందుని అభిషేకించిన పిమ్మట దేవేంద్రుడు ఆ స్వామి అనుమతిని పొంది, దేవతలు మొదలగువారితో గూడి స్వర్గలోకమునకు చేరెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే సప్తవింశోఽధ్యాయః (27)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఏడవ అధ్యాయము (27)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:46, 12/01/2021] +91 95058 13235: 12.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఎనిమిద అధ్యాయము

శ్రీకృష్ణుడు వరుణలోకమునుండి నందుని తీసికొనివచ్చుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

28.1 (ప్రథమ శ్లోకము)

ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనమ్|

స్నాతుం నందస్తు కాలింద్యా ద్వాదశ్యాం జలమావిశత్॥9365॥

28.2 (రెండవ శ్లోకము)

తం గృహీత్వానయద్భృత్యో వరుణస్యాసురోఽన్తికమ్|

అవిజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి॥9366॥

శ్రీశుకుడు వచించెను నందుడు కార్తీకశుద్ధ ఏకాదశినాడు దీక్షాపూర్వకముగా ఉపవశించి, భక్తిశ్రద్ధలతో శ్రీహరిని అర్చించెను. పిమ్మట అతడు అది రాక్షసులు సంచరించెడి వేళయని ఎఱుగక ద్వాదశీస్నానమునకై యమునానదీ జలములలో అడుగిడెను. అప్పుడు వరుణ దేవుని భృత్యుడైన అసురుడు ఒకడు నందుని తీసికొని వరుణుని కడకు చేరెను.

28.3 (మూడవశ్లోకము)

చుక్రుశుస్తమపశ్యంతః కృష్ణ రామేతి గోపకాః|

భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతమ్|

తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః॥9367॥

పరీక్షిన్మహారాజా! అంతట గోపాలురు తమ ప్రభువైన నందుడు  కనబడకపోవుటచే 'శ్రీకృష్ణా! బలరామా! మీ తండ్రిగారైన నందప్రభువు కనబడుటలేదు. మీరే మాకు దిక్కు' అనుచు విలపింపసాగిరి. అప్పుడు తనను స్మరించిన వారికి అభయమిచ్చునట్టి    శ్రీకృష్ణప్రభువు తమ తండ్రిని (నందుని) వరుణుడు (వరుణుని సేవకుడు) అపహరించుకొని పోయినట్లుగా గ్రహించి, వెంటనే వరుణుని సమీపమునకు వెళ్ళెను.

28.4 (నాలుగ శ్లోకము)

ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయా|

మహత్యా పూజయిత్వాఽఽహ తద్దర్శనమహోత్సవః॥9368॥

అంతట లోకపాలురలో ఒకడైన వరుణుడు తన కడకు ఏతెంచిన శ్రీకృష్ణప్రభువును చూచి, ఆయన దర్శనభాగ్యమునకు మిగుల సంతుష్టుడయ్యెను. వెంటనే అతడు  గొప్ప సేవలొనర్చి, ఆ స్వామిని భక్తితో అర్చించి, ఇట్లనెను-

వరుణ ఉవాచ

28.5 (ఐదవ శ్లోకము)

అద్య మే నిభృతో దేహోఽద్యైవార్థోఽధిగతః ప్రభో|

త్వత్పాదభాజో భగవన్నవాపుః పారమధ్వనః॥9369॥

వరుణుడు ఇట్లు పలికెను "ప్రభూ! పరమపురుషా! నేడు నీ దర్శనము అబ్బుటతో నా జన్మ ధన్యమైనది. నా భాగ్యము ఫలించినది. నీ పాదములను సేవించినవారు సంసారసాగరము నుండి తరింతురు గదా! నిన్ను కనులార వీక్షించిన నా అదృష్టమును ఎంతని కొనియాడగలను?"

28.6 (ఆరవశ్లోకము)

నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే|

న యత్ర శ్రూయతే మాయా లోకసృష్టివికల్పనా॥9370॥

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

కృష్ణపరమాత్మా! 'నీవు షడ్గుణైశ్వర్యసంపన్నుడవు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడవు. దేవమనుష్యాది జీవులను సృష్టించునట్టి నీ యోగమాయ నిన్ను స్పృశింపజాలదు' అని శ్రుతులు (వేదములు) వక్కాణించు చున్నవి.

28.7 (ఏడవశ్లోకము)

అజానతా మామకేన మూఢేనాకార్యవేదినా|

ఆనీతోఽయం తవ పితా తద్భవాన్ క్షంతుమర్హతి॥9371॥

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

మూఢుడైన నా భృత్యుడు నీ తండ్రియగు నందుని ఇక్కడికి తీసికొనివచ్చెను. అతడు యుక్తాయుక్త విచక్షణలేనివాడు. సకలలోకపూజ్యుడవైన నీవు అతడు అజ్ఞానముచే ఒనర్చిన అపరాధమును మన్నింపుము.

28.8 (ఎనిమిదవ శ్లోకము)

మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్యశేషదృక్|

గోవింద నీయతామేష పితా తే పితృవత్సల॥9372॥

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

"శ్రీకృష్ణా! నీ పితృభక్తి అనన్యమైనది. నీవు సర్వజ్ఞుడవు. సర్వసాక్షివి. నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు ఈ    నా అపరాధమును మన్నించి, నన్ను  అనుగ్రహింపుము. గోవిందా! పూజ్యుడైన నీ తండ్రిని తీసికొని పొమ్ము. స్వామీ! నా భృత్యుడొనర్చిన అపరాధకారణముగా దుర్లభమైన నీ దర్శనము నాకు ప్రాప్తించినది. ఇది నా పురాకృత సకృతఫలము".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:19, 13/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

783వ నామ మంత్రము 13.01.2021

ఓం ప్రాణదాయై నమః

ప్రాణాపానవ్యానోదానసమాన వాయువులను అనుగ్రహించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఆయురారోగ్యములు ప్రసాదించి అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు పొందుటకు తగిన అర్హతలను అనుగ్రహించును.

చర్మము, రక్తము మాంసము,  ఎముకలు, రోమాలు, గోళ్ళు, మాలిన్యము, కఫము, పిత్తము, వాతము ఇవి అన్నియు శరీరంలోని పదార్థాలు కలిగి జీవించే శరీరము శివం అయితే, జీవించనిది శవం. అంటే జీవించడం అంటే ప్రాణం శరీరంలో ఉండుట. ప్రాణము అంటే పంచప్రాణములు. ఇవే పంచవాయువులు. అసలు మన శరీరమున దశ వాయువులు గలవు, వాయు సంచారమునకు అనువగు సూక్ష్మ నాడుల యందు ఈ వాయువులు వ్వాపించి యుండును. ఇవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అను ముఖ్యమగు ఐదు వాయువులు. వీనినే పంచ ప్రాణములు అందురు. మరియు ఇవి గాక ఐదు ఉప వాయువులు గలవు. ఇవి నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనునవి. ప్రాణ వాయువు హృదయము నందును, అపాన వాయువు మూలాధారమునను సమాన వాయువు నాభి స్థానమునను ఉదాన వాయువు కంఠ స్థానమునను వ్యాన వాయువు స్వాధిష్టాన చక్రమును ఆధారముగా చేసికొని సర్వాంగముల యందును ప్రసరించి యుండును. వాయువు అంతయు ఒకటియే అయినప్పటికీ స్థాన భేధముల చేత వివిధ కార్యములు చేయుచు ప్రవర్తిల్లినవి. నాగ వాయువు వలన ఎక్కిళ్ళు కలుగు చున్నవి. కూర్మ వాయువు కంటి రెప్పలను మూయుటకు తెరచుటకు ఉప యోగ పడు చున్నది. కృకుర వాయువు వలన ఆకలి దప్పులు ఏర్పదును. 

సమస్త జీవరాశులు  ప్రాణం ఉండుటవల్లనే జీవిస్తున్నాయి. శరీరాన్ని జీవింపజేసేవి పంచప్రాణాలు. ఒకవిధంగా చెప్పాలంటే శరీరాన్ని జీవించినప్పుడు నడిపించేవి పంచప్రాణాలు,  జీవం చాలించితే నడిపించేది కూడా ఐదే (పరుండబెట్టిన పాడె ఒకటి, ఆ పాడెను మోసే నలుగురు. వెరసి ఐదు).

ప్రాణం ఉంటేనే కర్మేంద్రియపంచకం, జ్ఞానేంద్రియపంచకం మరియు మనసు పనిజేసేది. ఆత్మ శరీరాన్ని ఆవహించినంతకాలం ప్రాణం ఆధారమవుతుంది. ఆత్మ శరీరాన్ని వదలునప్పుడు ప్రాణంకూడా బయటకు నడుస్తుంది. ఇదే ఆత్మకు, ప్రాణానికి గల అవినాభావబంధం. ఆత్మకు ఉఫాధి (శరీరం) కావాలి. ఆత్మ శరీరంలో ఉండాలంటే ప్రాణంకావాలి. అటువంటి ప్రాణాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది గనుక ఆ తల్లిని ప్రాణదా యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:19, 13/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

209వ నామ మంత్రము 13.01.2021

ఓం మహాదేవ్యై నమః

ప్రత్యక్షాది ప్రమాణాములచే అందనిది, తెలియనిది అయిన జగన్మాతకు నమస్కారము.

శివుని అష్టమూర్తులలో చంద్రమూర్తియగు మహాదేవుని భార్యగా తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

గండకీ నదియందలి చక్రాధిష్ఠానదేవతా స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాదేవీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మహాదేవ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శ్రీమాతను ఉపాసించు భక్తులకు సిరిసంపదలు,  సుఖసంతోషములు ప్రసాదించును  మరియు పునర్జన్మ రాహిత్యమైన మోక్షసాధనకు భగవధ్యాన సోపానమును అనుగ్రహించును.

జగన్మాతయొక్క మహత్తత్త్వమును   ఇంత లేదా అంత అని చెప్పు  కొలప్రమాణములు లేవు. ఆ తల్లి స్థూలశరీరము ఇంత అని చెప్పడానికి ఉపమాన శూన్యమైనది.

బృహదస్య శరీరం యత్ అప్రమేయం ప్రమాణతః|

ధాతుర్మహేతి పూజాయాం మహాదేవీ తతః స్మృతః॥

ప్రమాణములచే ఊహింప శక్యముకానంత పెద్దశరీరము గలది.  లేదా మహాపూజాయాం అను ధాతువును బట్టి పూజింపబడుచున్నది. కాబట్టి పరమేశ్వరి మహాదేవీ యని అనబడుచున్నది.

శివుని అష్టమూర్తులు

శివుని పంచభూత లింగములు (పథ్వీలింగము, జలలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగము) గురించి తెలుసు.   వీటితోబాటు ఇంకా మూడు లింగములను చేర్చితే

శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

1. శర్వ: భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 

2. భవ: జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 

3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 

4. ఉగ్ర వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 

5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 

6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 

7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 

8. మహాదేవ/చంద్ర : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు

పైన చెప్పిన అష్టమూర్తులలో  మహాదేవుని భార్య పేరు మహాదేవి కాబట్టి జగన్మాత మహాదేవీ యని అనబడుచున్నది.

శివుని అష్టమూర్తులలో మహాదేవునికి చంద్రమూర్తియను పేరుగలదు. ఈ చంద్రమూర్తి భార్య రోహిణిదేవి. రోహిణీదేవి కుమారుడు బుధుడు. ఈ రోహిణీదేవి గండకీనదీ తీరమునగల చక్రతీర్థానికి అధిష్ఠానదేవత.  కావున జగన్మాత  మహాదేవి యని అనబడుచున్నది. దేవియొక్క తీర్థములను లెక్కించు క్రమములో గండకీనదీతీరములో సాలగ్రామమునందు మహాదేవి గలదనియు పుష్కరఖండమందు చెప్పబడినది. ఆ మహాదేవిస్వరూపిణి  జగన్మాతయని పద్మపురాణములో పుష్కరఖండమందు చెప్పబడుటచే     జగన్మాత మహాదేవీ యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాదేవ్యై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:19, 13/01/2021] +91 95058 13235: 13.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు వరుణలోకమునుండి నందుని తీసికొనివచ్చుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

28.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏవం ప్రసాదితః కృష్ణో భగవానీశ్వరేశ్వరః|

ఆదాయాగాత్స్వపితరం బంధూనాం చావహన్ ముదమ్॥9373॥

శ్రీశుకుడు ఇట్లు నుడివెను పరీక్షిన్మహారాజా! వరుణుడు ఇట్లు వేడుకొనిన పిదప కృష్ణభగవానుడు అతనియెడ ప్రసన్నుడయ్యెను. ఆ సర్వేశ్వరుడు తన తండ్రిని తీసికొని బృందావనమునకు చేరగా బంధుమిత్రులు ఎల్లరును పరమానందభరితులైరి.

28.10 (పదియవ శ్లోకము)

నందస్త్వతీంద్రియం దృష్ట్వా లోకపాలమహోదయమ్|

కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితోఽబ్రవీత్॥9374॥

లోకపాలుడైన వరుణునియొక్క ఐశ్వర్యమునకును, శ్రీకృష్ణునియెడ అచటివారు (వరుణాదులు) చూపిన వినమ్రభావమునకును నందుడు మిగుల ఆశ్చర్యమునకు లోనయ్యెను. ఆయా విశేషములను నందగోపుడు తన ఆత్మీయులకు వివరించెను.

28.11 (పదకొండవ శ్లోకము)

తే త్వౌత్సుక్యధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరమ్|

అపి నః స్వగతిం సూక్ష్మాముపాధాస్యదధీశ్వరః॥9375॥

పరీక్షిన్మహారాజా! అంతట నందుని అనుయాయులైన ఆ గోపాలురు 'శ్రీకృష్ణుడు భగవంతుడే' అని భావించి, ఆ ప్రభువుయొక్క అతీంద్రియ (అలౌకిక) రూపమును దర్శించుటకై కుతూహలపడసాగిరి. అయితే ఆ జగదీశ్వరుడు తన దివ్యధామమును మనకు చూపునా?' అని వారు తమ మనస్సులలో అనుకొనసాగిరి.

28.12  (పండ్రెండవ శ్లోకము)

ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయాఖిలదృక్ స్వయమ్|

సంకల్పసిద్ధయే తేషాం కృపయైతదచింతయత్॥9376॥

అంతట సర్వజ్ఞుడు, సర్వసాక్షియు ఐన కృష్ణభగవానుడు తమవారి (గోపాలుర) అభిప్రాయములను గమనించెను. పిమ్మట ఆ స్వామి వారి మనోరథములను ఈడేర్చుటకై కనికరముతో స్వయముగా ఇట్లు తలపోసెను.

28.13 (పదమూడవ శ్లోకము)

జనో వై లోక ఏతస్మిన్నవిద్యాకామకర్మభిః|

ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్॥9377॥

'ఈ లోకములోని జీవులు అజ్ఞానవశమున దేహాత్మబుద్ధి గలిగి, వివిధ వాంఛలతో కొట్టుమిట్టాడుచుందురు. వాటిని పొందుటకై వారు నానావిధములైన కర్మలను ఆచరించుచుందురు. వాటి ఫలస్వరూపముగా దేవ, మనుష్య, పశుపక్ష్యాది జన్మలలో పరిభ్రమించుచుందురు. అందువలన వారు తమ ఆత్మస్వరూపమును ఎఱుగరు'.

28.14 (పదునాలుగవ శ్లోకము)

ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః|

దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరమ్॥9378॥

మిగుల కరుణాలయుడగు కృష్ణభగవానుడు ఈ విధముగా తలపోసి, మాయాంధకారమునకు అతీతమైన తన పరంధామమును ఆ గోపాలురకు చూపెను.

28.15 (పదునైదవ శ్లోకము)

సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ జ్యోతిః సనాతనమ్|

యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః॥9379॥

ఆ పరబ్రహ్మస్వరూపము నిర్వికారము (షడ్వికారహితము అనగా  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య రహితము), అపరిచ్ఛిన్నము (దేశ, కాల - అవధులు లేనిది), జ్ఞానాత్మకము, శాశ్వతము. తపస్సంపన్నులైన (సమాధి నిష్ఠితులైన) మునులు త్రిగుణాతీతులై (సత్త్వరజస్తమో గుణముల స్పర్శ లేనివారై) ఆ దివ్యస్వరూపమును దర్శింతురు.

28.16 (పదహారవ శ్లోకము)

తే తు బ్రహ్మహ్రదం నీతా మగ్నాః కృష్ణేన చోద్ధృతాః|

దదృశుర్బ్రహ్మణో లోకం యత్రాక్రూరోఽధ్యగాత్పురా॥9380॥

పూర్వము అక్రూరుడు బ్రహ్మహ్రదములో మునిగి ఆ పరబ్రహ్మ స్వరూపమును దర్శించియుండెను. శ్రీకృష్ణుడు గోపాలురను అదే బ్రహ్మహ్రదమునకు గొనిపోయెను. వారు అందు మునిగిరి. అప్పుడు కృష్ణుడు వారిని పైకి లేవనెత్తగా  వారు పరబ్రహ్మయొక్క వైకుంఠధామమును దర్శించిరి. 

28.17 (పదిహేడవ శ్లోకము)

నందాదయస్తు తం దృష్ట్వా పరమానందనివృతాః|

కృష్ణం చ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః॥9381॥

నందాది గోపాలురు ఆ లోకమును జూచి పరమానంద భరితులైరి. అంతట ఆ లోకమునందు వేదములు కూడ ఆ శ్రీకృష్ణుని స్తుతించుచుండుటను గాంచి మిగుల ఆశ్చర్యమగ్నులై మహదానందమునందు మునిగిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అష్టావింశోఽధ్యాయః (28)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఎనిమిదవ అధ్యాయము (28)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:43, 13/01/2021] +91 95058 13235: 13.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

29.1 (ప్రథమ శ్లోకము)

భగవానపి తా రాత్రీః శరదోత్ఫుల్లమల్లికాః|

వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః॥9382॥

శ్రీశుకుడు ఇట్లు వచించెను పరీక్షిన్మహారాజా! ఇదివఱలో కృష్ణభగవానుడు గోపికా వస్త్రాపహరణ సందర్భమున  వారికి 'కన్యలారా! మీ కాత్యాయనీ వ్రతదీక్ష ఫలించినది. ఇప్పుడు మీరు మీ ఇండ్లకు చేరుడు. రానున్న శరద్రాత్రులయందు నాతో విహరించెడి భాగ్యమును నేను మీకు ప్రసాదించెదను' అని మాట ఇచ్చియుండెను. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకొనుటకై స్వామి సంసిద్ధుడాయెను. ఇంతలో శరదృతువు రానే వచ్చెను. మల్లికాది పుష్పములు బాగుగా వికసించి, సుగంధములను వెదజల్లుచుండెను. ఆ రాత్రులయందలి రామణీయకమును జూచి, కృష్ణప్రభువు అచింత్యమహాశక్తియగు తన యోగమాయను ఆశ్రయించి, గోపికలను నిమిత్తమాత్రముగా చేసికొని, రాసక్రీడలను నెఱపుటకు సంకల్పించెను.

29.2 (రెండవ శ్లోకము)

తదోడురాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్యా విలింపన్నరుణేన శంతమైః|

స చర్షణీనాముదగాచ్ఛుచో మృజన్ ప్రియః ప్రియాయా ఇవ దీర్ఘదర్శనః॥9383॥

భగవంతుడు ఇట్లు సంకల్పించినంతనే చిరకాల వియోగమును పొందియున్న ప్రియుడు తన ప్రియురాలిని సంతోషపఱచుటకై ఆమె ముఖమున కుంకుమను దిద్దినట్లు, చంద్రుడు మిగుల హాయిని గూర్చెడితన చల్లని కిరణములతో కిరణములతో తూర్పుదిశయందు ఎర్రని రంగును పులిమెను. ఆ విధముగా జనుల తాపమును తొలగించుచు చంద్రుడు ఉదయించెను.

29.3 (మూడవ శ్లోకము)

దృష్ట్వా కుముద్వంతమఖండమండలం  రమాననాభం నవకుంకుమారుణమ్|

వనం చ తత్కోమలగోభిరంజితం జగౌ కలం వామదృశాం మనోహరమ్॥9384॥

ఆ పున్నమినాటి రాత్రి ఉదయించిన చందురుని బింబము కలువలకు వికాసమును గూర్చుచుండెను (భూతలమును ఆనందింపజేయుచుండెను),  లక్ష్మీదేవి ముఖమండలమువలె శోభాయమానముగా ఉండెను, నవకేసరములవలె అరుణకాంతులను విరజిమ్ముచుండెను. కోమలములైన    ఆ చంద్రకిరణముల స్పర్శతో ఆ వనమంతయును రాగరంజితమై కలకలలాడుచుండెను. ఆ వెన్నెల శోభలను, వనరామణీయకమును (మనోహర వాతావరణమును) గాంచి, శ్రీకృష్ణుడు ఆ గోపికల మనస్సులు పారవశ్యమును పొందునట్లు, మధురముగా వేణుగాన మొనర్చెను.

29.4 (నాలుగవ శ్లోకము)

నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీతమానసాః|

ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః స యత్ర కాంతో జవలోలకుండలాః॥9385॥

శ్రీకృష్ణుని యందే లగ్నమైయున్న మనస్సులుగల వ్రజభామినులు ఆ కమ్మని మురళీరవమును విన్నంతనే కృష్ణునిపై వారి ప్రేమానురాగములు పొంగిపొరలెను. అట్టి పారవశ్యమున ప్రభుదర్శనమునకై గోపకాంతలెల్లరు తోటివారితో చెప్పకయే ఆ స్వామిని చేరుటకు పరుగులు తీసిరి. అప్పుడు వారి కర్ణకుండలములు వేగముగా అటునిటు అల్లాడుచుండెను. 

29.5 (రెండవ శ్లోకము)

దుహంత్యోఽభియయుః కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకాః|

పయోఽధిశ్రిత్య సంయావమనుద్వాస్యాపరా యయుః॥9386॥

అప్పటి ఆ గోపికల తీరు ఆశ్చర్యకరముగా ఉండెను. ఆ గానము చెవి సోకినంతనే ఆ పారవశ్యములో వారికి ఏమి చేయుటకును తోచక యుండెను. పాలను పితుకుతున్న కొందరు గోపికలు, ఆ పనిని సగములో ఆపివేసి, పొయ్యిమీద పెట్టిన పాలను వదలిపెట్టి, పాయసమును చేయుచున్నవారు అట్లే విడిచిపెట్టి వెళ్ళిరి.

29.6 (ఆరవ శ్లోకము)

పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంత్యః శిశూన్ పయః|

శుశ్రూషంత్యః పతీన్ కాశ్చిదశ్నంత్యోఽపాస్య భోజనమ్॥9387॥

అన్నమును వడ్డించుచున్నవారు, పిల్లలకు పాలను త్రాగించుచున్నవారు, భర్తలకు సేవలు చేయుచున్నవారు, భోజనము చేయుచున్నవారు ఆయా పనులను సగములోనే విడిచిపెట్టిపోయిరి.

29.7 (ఏడవ శ్లోకము)

లింపంత్యః ప్రమృజంత్యోఽన్యా అంజంత్యః కాశ్చ లోచనే|

వ్యత్యస్తవస్త్రాభరణాః కాశ్చిత్కృష్ణాంతికం యయుః॥9388॥

చందనాదులను అలదుకొనుచున్న వారు, నలుగు పెట్టుకొనుచున్నవారు, కాటుకలు దిద్ధుకొనువారు అట్లే మధ్యలో వదలి పరుగెత్తిరి. వస్త్రములను, ఆభరణములను ధరించుచున్న మరికొందరు వాటిని వ్యత్యస్తములుగా (తిరగమరగలుగా) ధరించి శ్రీకృష్ణుని చేరుటకు పరుగులు తీసిరి.

29.8 (ఎనిమిదవ శ్లోకము)

తా వార్యమాణాః పతిభిః పితృభిర్భ్రాతృబంధుభిః|

గోవిందాపహృతాత్మానో న న్యవర్తంత మోహితాః॥9389॥

అంతేగాక! వారిని భర్తలు, తలిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు ఎంతగా వారించుచున్నను, గోవిందుడు తమ మనస్సులను దోచుకొనియున్నందున ఆ పారవశ్యములో వారు వెనుదిరుగక ముందునకు సాగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:00, 14/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

784వ నామ మంత్రము 14.01.2021

ఓం ప్రాణరూపిణ్యై నమః

ప్రాణమే బ్రహ్మణస్పతి. ప్రాణమే యజస్సులకు పతి. ప్రాణమే సామము. అట్టి బ్రహ్మస్వరూపమైన  ప్రాణమే తన స్వరూపంగా విరాజిల్లు అమ్మవారికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణరూపిణీ యను ఐదక్షరాల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి, జగత్తునందు సర్వప్రాణులకు ప్రాణముపోసి, పోషించి, సత్కర్మలనాచరించు విజ్ఞతనొసగే ఆ జగజ్జనని ఆయురారోగ్యములు ప్రసాదించి, భౌతిక పరమైన సుఖసంతోషములు, ఆముష్మికపరమైన బ్రహ్మజ్ఞాన సంపదలు సంప్రాప్తింపజేసుకునే ఆధ్యాత్మిక శక్తిసంపదలు ప్రసాదిస్తుంది.

జగత్తులోని జీవకోటి సజీవంగా ఉండడానికి కారణమయిన ప్రాణశక్తిని జగన్మాత ప్రసాదిస్తుంది. జీవాత్మ, పరమాత్మ ఒకటే అని చెప్పేదే అద్వైతము. జీవాత్మ, పరమాత్మల ఉపాధి ఈ శరీరము. పరమాత్మ ఉన్నచోటే జీవాత్మ ఉంటుందని దీని భావం గనుక, జీవాత్మ అనేదే ప్రాణశక్తి.   ప్రాణ అను శబ్దమునకు పరమాత్మ అను అర్థము సూత్రభాష్యములో ప్రాణిధికరణమందు నిర్ణయింపబడినది. అమ్మవారిని ప్రాణరూపిణి అన్నాము అంటే ఆ తల్లి పరబ్రహ్మరూపిణి యని అర్థము. అలాగే ప్రాణము, ఇంద్రియములు, ఆకాశము అనునవి బ్రహ్మము. బ్రహ్మస్వరూపురాలు గనుక ప్రాణరూపిణీ యని అనబడినది. నిత్యాతంత్రములో జగన్మాత ప్రాణస్వరూపురాలని ఒక విలక్షణమైన ప్రక్రియనుబట్టి చెప్పారు. అది ఎలాగ అంటే, నిత్యలు పదహారు. నిత్యలకు కాలమునుబట్టి ప్రాణత్వమున్నది. నిత్యలంటే తిథులు. ప్రతీ తిథికి ఇంతకాలము అని నిర్దిష్టత ఉన్నది. ఇదే ప్రాణత్వము అనబడినది. ఇది ఒక శ్వాసకాలము నుండి, దినములు, మాసములు మొదలైనవి లెక్కింపబడినవి. అలాగే ఇరువదిరెండున్నర శ్వాసలు  క్రమముగా పండ్రెండు మేషాదిరాశులు అగును. ఈ రాశులు (నక్షత్రముల వలన) చంద్రగతులు, సూర్యగతులు కూడ శ్వాసములను బట్టియే పుట్టినవి. గనుక శ్వాసకాలమునుబట్టి అమ్మవారికి ప్రాణాత్మత్వము ఉన్నదని తెలియుచున్నది. గనుక జగన్మాత ప్రాణస్వరూపిణీ యని అనబడినది.

అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!

అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను

మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం బ్రహ్మమే దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ  ఉపనిషత్తు వాక్యం చెబుతుంది. అంటే నీలో ఉన్నది. ప్రాణశక్తి అంటే బ్రహ్మము అనియు, సకల జీవకోటిలోను జగన్మాత ఆయారూపాలలో ప్రాణశక్తిగా  ఉంటున్నది గనుక అమ్మవారు ప్రాణరూపిణీ యని అనబడినది.  

 ఇంతకు ముందు నామ మంత్రంలో అమ్మవారు జీవులకు ప్రాణము పోసినది గనుక జీవుల ఉపాధులు (శరీరములు) కదులుతున్నాయి అని అన్నాము. శరీరంలోని ఇంద్రియముల జీవన వ్యాపారములు ప్రాణశక్తివలననే జరుగుతున్నాయి. ప్రాణశక్తిలేకుంటే ఆ శరీరం మట్టిలో కలవడమే! ప్రాణశక్తి రూపంలో  శరీరములలో ఉందిగనుక  ప్రాణరూపిణీ యని జగన్మాత అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణరూపిణ్యై నమః యని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:00, 14/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

210వ నామ మంత్రము 14.01.2021

ఓం మహాలక్ష్మ్యై నమః

సర్వసంపదలనూ ప్రసాదించునదియును, కరవీరపుర నివాసినియును,మహాలసుడను రాక్షసుణ్ణి సంహరించినదియు తానే అయి విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాలక్ష్మీః యను నామ మంత్రముసు ఓం మహాలక్ష్మ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకునకు సకల ఐశ్వర్యములతోబాటు, బ్రహ్మజ్ఞానసంపదలుకూడా సంప్రాప్తించును.

అష్టాదశ శక్తిపీఠాలలో కరవీరము (కొల్హాపూర్) ఒకటి. ఆ శక్తిపీఠం అధిదేవత మహాలక్ష్మీ. ఈ శక్తిపీఠాలపై ఒక పురాణగాథ కలదు.

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.  

అష్టాదశ శక్తిపీఠస్తోత్రం

లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.

ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.

వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.

మువురమ్మల మూలపుటమ్మ జగన్మాత. ఆ తల్లి పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె రూపాంతరాలే మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి.  ఈ మూడు శక్తులవల్లనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. కాబట్టి జగన్మాతను మహాలక్ష్మీః అని యన్నాము.

పార్వతీదేవి అంశచేతనే మహాలక్ష్మిగా వెలసినదని మైలార తంత్రమందు  గలదు. 

మహాలసనామకం దైత్యం స్యతి క్షపయతీతి చ|

మహాలసా మహాలక్ష్మీ రితి చ ఖ్యాతి మాగతా॥

పడమటి సముద్రపు ఒడ్డున ఉన్న సహ్యాద్రి సమీప ప్రదేశమందు మహాలసుడు అను రాక్షసుని సంహరించినది గనుక జగన్మాత మహాలక్ష్మి యను నామముతో ప్రసిద్ధి చెందినది.

శివవామాంకమున కూర్చున్న మహేశ్వరియే మహాలక్ష్మీ యని ప్రసిద్ధి చెందినదని శివపురాణమందు శివుని ప్రస్తావనలో చెప్పబడినది.  

ధౌమ్యుడు కన్యారూపం చెబుతూ త్రయోదశవర్షాత్మక కన్యారూపా - పదమూడు వత్సరముల కన్య అయిన బాలిక మహాలక్ష్మీ యని చెప్పడంజరిగినది. గాన జగన్మాత పదమూడు వత్సరముల మహాలక్ష్మీ యను కన్యాస్వరూపిణి.  

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాలక్ష్మ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:00, 14/01/2021] +91 95058 13235: 14.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉29.9 (తొమ్మిదవ శ్లోకము)

అంతర్గృహగతాః కాశ్చిద్గోప్యోఽలబ్ధవినిర్గమాః|

కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనాః॥9390॥

29.10  (పదియవ శ్లోకము)

దుఃసహప్రేష్ఠవిరహతీవ్రతాపధుతాశుభాః|

ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేషనిర్వృత్యా క్షీణమంగలాః॥9391॥

29.11 (పదకొండవ శ్లోకము)

తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః|

జహుర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాః॥9392॥

ఇండ్లలోపల ఉన్నట్టి కొందరు తరుణీమణులు బయటకు రాలేక ఇండ్లలోనే ఉండిపోయిరి. ఐనను, ఆ గోపికలు కృష్ణభావనలో మునిగిపోయి కన్నులు మూసికొని  ఆయననే ధ్యానించుచుండిరి. సహింపశక్యము గాని తీవ్రమైన కృష్ణవిరహతాపముచే వారిలోని  అశుభసంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన, అచ్యుతుని ఆలింగనమువలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలును క్షయమయ్యెను. అంతేగాక, ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసికొన్నవారలు త్రిగుణముల కార్యమగు దేహములను విడిచిపెట్టి, వెంటనే సమస్తకర్మబంధములనుండి విముక్తిని పొంది, భగవంతునిలో ఐక్యము నొందిరి.

రాజోవాచ

29.12 (పండ్రెండవ శ్లోకము)

కృష్ణం విదుః పరం కాంతం న తు బ్రహ్మతయా మునే|

గుణప్రవాహోపరమస్తాసాం గుణధియాం కథమ్॥9393॥

అంతట పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను "మహామునీ! గోపికలు శ్రీకృష్ణభగవానుని కేవలము తమ ప్రియతమునిగా భావించిరి. కాని, ఆయనయెడ వారికి బ్రహ్మభావము లేకుండెను. ఈ విధముగా వారి దృష్టి ప్రాకృతగుణములయందే ఆసక్తమైయున్నట్లుగా అనిపించును. కావున, గుణముల ప్రవాహరూపమగు ఈ సంసారమునుండి వారు విముక్తులగుట ఎట్లు సంభవించినది?

శ్రీశుక ఉవాచ

29.13 (పదమూడవ శ్లోకము)

ఉక్తం పురస్తాదేతత్తే చైద్యః సిద్ధిం యథా గతః|

ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజప్రియాః॥9394॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణునియెడ బ్రహ్మభావన లేనట్టి శిశుపాలుడు వైరభావముతోనైనను ఆ స్వామిని పదే పదే స్మరించుటవలన అతడు ఆ ప్రభువుయొక్క అనుగ్రహముచే ముక్తిని పొందెను. ఇక ప్రేమభావనతో నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుచుండెడి గోపికల విషయమును గూర్చి చెప్పవలసినది ఏమున్నది? ఈ సంగతిని గూర్చి నీకు ఇంతకుముందే వివరించి యుంటిని.

29.14 (పదునాలుగవ శ్లోకము)

నృణాం నిఃశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప|

అవ్యయస్యాప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః॥9395॥

29.15 (పదిహేనవ శ్లోకము)

కామం క్రోధం భయం స్నేహమైక్యం సౌహృదమేవ చ|

నిత్యం హరౌ విదధతో యాంతి తన్మయతాం హి తే॥9396॥

మహారాజా! శ్రీకృష్ణుడుషడ్గుణైశ్వర్యసంపన్నుడు. షడ్వికారరహితుడు. ప్రత్యక్ష-అనుమానాది ప్రమాణములకు అందనివాడు (అహాఙ్మానసగోచరుడు). సత్త్వాది ప్రాకృతములు లేనివాడు, అనంత కల్యాణ గుణసంపన్నుడు. అట్టి ఆ స్వామి మానవులకు ముక్తిని ప్రసాదించుటకై ఈ భూలోకమున అవతరించెను. కామము, క్రోధము, భయము, స్నేహము, బంధుత్వము, సౌహార్దముమున్నగు వానిలో ఏ భావముతోనైనను నిరంతరము శ్రీకృష్ణునితో సంబంధము కలిగియున్నచో అట్టివారు ఆ స్వామిలో లీనమగుదురు. అనగా అట్టివారికి తప్పక మోక్షము ప్రాప్తించును.

29.16 (పదహారవ శ్లోకము)

న చైవం విస్మయః కార్యో భవతా భగవత్యజే|

యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే॥9397॥

శ్రీహరి (కృష్ణుడు) జన్మరహితుడు, పరమయోగులకును ప్రభువు, అట్టి కృష్ణభగవానుని పాదస్పర్శ కలిగినంతనే చెట్లుచేమలు మొదలగు స్థావరములు సైతము ముక్తిని పొందును. ఇంక అనన్యభావముతో శ్రీకృష్ణుని స్మరించు చుండునట్టి గోపికల విషయమును చెప్పనేల? ఆ పరమాత్ము అనుగ్రహప్రభావము అట్టిది. కనుక నీ వంటి భాగవతోతత్తముడు ఈ విధముగా ఆశ్చర్య పడవలసిన పనియేలేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:46, 14/01/2021] +91 95058 13235: 14.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.17 (పదిహేడవ శ్లోకము)

తా దృష్ట్వాంతికమాయాతా భగవాన్ వ్రజయోషితః|

అవదద్వదతాం శ్రేష్ఠో వాచః పేశైర్విమోహయన్॥9398॥

మిగుల మాటకారియైన శ్రీకృష్ణుడు తనను దర్శించుటకై తన సమీపమునకు వచ్చిన వ్రజభామినులను తన ప్రేమపూరిత వాక్కులతో తనపట్లగల ప్రేమను మరింత గట్టిపరచుటకుగాను, వారి మనస్సులను తెలిసికొనుటకై ఇట్లు పలికెను-

శ్రీభగవానువాచ

29.18  (పదునెనిమిదవ శ్లోకము)

స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణి వః|

వ్రజస్యానామయం కచ్చిద్బ్రూతాగమనకారణమ్॥9399॥

శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను "భాగ్యశాలినులైన గోపికలారా! మీ శుభాగమనము నాకు సంతోషకరము. మీకు స్వాగతము. వ్రజమంతయును ఆరోగ్యముగ నున్నదికదా! అందఱును కుశలమేనా? ఇంతకును మీ ఆగమనకారణమేమి? మీ ప్రీతికొరకై  ఇప్పుడు నేను ఏమి చేయవలెను? తెల్పుడు.

29.19  (పందొమ్మిదవ శ్లోకము)

రజన్యేషా ఘోరరూపా ఘోరసత్త్వనిషేవితా|

ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమాః॥9400॥

సుందరీమణులారా! ఇది భయంకరమైన కాళరాత్రి. ఈ సమయమున ఇచ్చట సింహములు, పులులు మొదలగు క్రూరమృగములు స్వేచ్ఛగా సంచరించుచుండును. కనుక ఇట్టివేళ మీ వంటి కోమలాంగులు ఇచ్చట ఏమాత్రమూ నిలువరాదు. ఐనదేమో ఐనది. ఇక మీరు హాయిగా మీ ఇండ్లకు మఱలిపోవుట మంచిది.

29.20 (ఇరువదియవ శ్లోకము)

మాతరః పితరః పుత్రా భ్రాతరః పతయశ్చ వః|

విచిన్వంతి హ్యపశ్యంతో మా కృఢ్వం బంధుసాధ్వసమ్॥9401॥

మీరు అచట (వ్రజభూమియందు) కనబడకపోవుటవలన మీ తల్లిదండ్రులును, కుమారులును, సోదరులును, భర్తలును, , తదితరులైన మీ ఆత్మీయ బంధువులును మీ కొఱకై ఆందోళనపడుచు వెదకుచుందురు. బాధాకరమైన ఇట్టి సాహసకృత్యములకు దిగుట మీకు ఏమాత్రమూ తగదు.

29.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

దృష్టం వనం కుసుమితం రాకేశకరరంజితమ్|

యమునానిలలీలైజత్తరుపల్లవశోభితమ్॥9402॥

ఈ వనమునందు వృక్షలతాదులు అన్నియును చక్కగా వికసించిన పూవులతో నిండారియున్నవి. ఇది  చల్లని వెన్నెలతో ఆహ్లాదకరముగా నున్నది. యమునానదీ జలములమీదుగా వీచుచు వచ్చుచున్న మందమారుతముల కారణముగా కదలాడుచున్న చిగురుటాకుల సోయగములతో ఈ వనము మిగుల ఇంపు గొలుఫుచున్నది. దీని అందచందాలను మీరు చూచితిరిగదా! 

29.22  (ఇరువది రెండవ శ్లోకము)

తద్యాత మా చిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీః|

క్రందంతి వత్సా బాలాశ్చ తాన్పాయయత దుహ్యత9403॥

సాధ్వీమణులారా! ఇక ఏమాత్రమూ ఆలసింపక వ్రజభూమికి చేరుడు. మీ పతులకును, అత్తమామలకును సేవలొనర్పుడు. మీ గృహములలో పసిపిల్లలు ఏడ్చుచుందురు. స్తన్యములిచ్చి వారిని సముదాయింపుడు. ఆవుదూడలు అంబా అంటూ అరచుచుండును. వెంటనే వాటి సంగతి చూడుడు. పొదుగు భారములతో నున్న ఆవులను పితుకుడు.

29.23  (ఇరువది మూడవ శ్లోకము)

అథ వా మదభిస్నేహాద్భవత్యో యంత్రితాశయాః|

ఆగతా హ్యుపపన్నం వః ప్రీయంతే మయి జంతవః॥9404॥

ఆ మాటలను అట్లుంచుడు. మీరు నాపైగల ప్రేమ పారవశ్యముచే ఇచటికి వచ్చియున్నచో, మీ రాక ఎంతో సముచితమైనది. ఏలనన లోకములోని ప్రాణులన్నియును నన్ను ఎంతగానో ప్రేమించుచుండును.

29.24  (ఇరువది నాలుగ శ్లోకము)

భర్తుః శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా|

తద్బంధూనాం చ కల్యాణ్యః ప్రజానాం చానుపోషణమ్॥9405॥

సాధ్వీమణులారా! తమ భర్తలకును, వారి బంధువులకును (వారి తల్లిదండ్రులకును, సోదరులు మొదలగు వారికిని) నిష్కపటముగా సేవలొనర్చుట, సంతానమును అల్లారుముద్దుగా పెంచి పోషించుట స్త్రీలకు పరమధర్మము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:28, 15/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

211వ నామ మంత్రము 15.01.2021

ఓంమృడప్రియాయై నమః

మృడునకు (పరమశివునికి) ప్రియమును చేకూర్చు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మృడప్రియా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మృడప్రియాయై నమః యని ఉచ్చరించుచూ, ఎనలేని భక్తితత్పరతతో ఆ లలితాంబను  ఆరాధించు భక్తులకు, ఆ తల్లి సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, సుఖసంతోషములు ప్రసాదించును. 

భక్తులకు ఆనందము నొసగువాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సత్త్వగుణప్రధానుడు అనగా జ్ఞానగుణసంపన్నుడు.  సత్త్వగుణోద్రేకము కలిగినప్ఫుడు సకల ప్రాణులకు సుఖములను కలిగించు మృడునకు నమస్కారము అని శివమహిమ్నస్తవంలో  చెప్పబడినది. మృడ అంటే ఆనందము అను అర్థము గలదు. గనుక ఆనందాన్ని ఇష్టపడునది జగన్మాత అనికూడా భావించవచ్చును. హృదయంలోని దహరాకాశంలో అమ్మవారిని చిత్రించుకొని, ఆ రూపాన్ని దర్శిస్తూ ఆనందిస్తాము. దీన్ని రూపానందం అనవచ్చు. భక్తునికి భగవంతుని రూపం దర్శించితే రూపానందం. అలాగే రసానందం అనగా నవరసములలో అత్యంత ఆనందకరమైన హాస్యరస సన్నివేశం   చూచినప్పుడు కలిగేది రసానందం, భగవన్నామమును వినుట వలన కలిగేది శ్రవణానందము. అలాగే భగవత్స్వరూపులైన మాతాపితరుల పాదములు తాకినప్పుడు సత్పుత్రుడు ఆనందించేది స్పర్శానందం అవుతుంది. ఈ రసానందం, శ్రవణానందం, స్పర్శానందములు వ్యక్తులలోని సంస్కారాలనుబట్టి, సందర్భాలనుబట్టి కూడా ఉంటుంది. ఈ ఆనందము సత్ప్వరజస్తమో గుణాత్మకమైనది. శరీరంలో పంచకోశములు ఉన్నాయి. అవి, 1. అన్నమయము, 2. ప్రాణమయము, 3. మనోమయము, 4. విజ్ఞానమయము, 5. ఆనందమయము.  

ఆనందమయకోశంలో ఉండేవాడే పరబ్రహ్మ, అదే అమ్మ. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది.

ఆనందమయకోశంలో ఉండేది పరబ్రహ్మ. అంటే అమ్మవారు. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది. ఆనందమయకోశంలో లభించే ఆనందం శాశ్వతమైనది. దీనినే పరలోకానందం అంటారు. ఈ ఆనందం అనేకరకాలు. ఒకదానిని మించిన ఆనందం ఒకటి. అన్నిటికి పరాకాష్ఠ అయినది బ్రహ్మానందం. 

ఇక్కడ ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో పరిశీలించడం ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ   పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే 

1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.

2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.

3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.

4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.

5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.

6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.

7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.

8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.

9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.

10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము. 

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి గనుక  బ్రహ్మానందమనిన ప్రియముగా గలది గనుక మృడప్రియా యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మృడప్రియాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

- మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:28, 15/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

785వ నామ మంత్రము 15.01.2021

ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః

మార్తాండభైరవునిచే ఆరాధింపబడు పరమేశ్వరికి నమస్కారము.

మార్తాండునిచేతను, భైరవులచేతను ఆరాధింపబడు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మార్తాండ భైరవారాధ్యా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి అనంతమైన జ్ఞానసంపదలను ప్రసాదించి, పరమేశ్వరీ పాదసేవనమందు తరింపజేయును.

మణిద్వీపమునకు చుట్టుగల ఇరువది రెండవ, ఇరువది మూడవ ప్రాకారముల మధ్య మర్తాండభైరవుడు గలడు. ఇతడు దేవీ ఉపాసకుడు. మార్తాండభైరవునిచే ఆరాధింపబడినది గనుక శ్రీమాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. ఇతనికి చక్షుష్మతి, ఛాయాదేవి అను ఇద్దరు భార్యలు గలరు.

శివుడు మణిమల్లుడు అను రాక్షసుని సంహరించడానికి అశ్వారూఢుడై భూమిపై అవతరించి ఆ మణిమల్లుడుని సంహరించాడు. ఆ శివుడిని మల్లారి అనియు మార్తాండభైరవుడు అని అన్నారు. ఈ మార్తాండభరవుడను పేరుగల శివునిచే  ఆరాధింపబడుటచే పరమేశ్వరి మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. 

మార్తాండుడనగా సూర్యుడు. ఇతడు బ్రహ్మాండమునంతటిని రాత్రి మరణింపజేసి, మరల ఉదయమందు బ్రతికింపజేయబడుటచే సూర్యునకు మార్తాండుడు అని పేరు వచ్చినది. అటువంటి మార్తాండుడనే ఆదిత్యునిచే ఆరాధింపబడుటచే జగన్మాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. 

వటుకభైరవులు ఎనిమిదిమంది. వారు

1. అసితాంగ భైరవుడు బ్రాహ్మి శక్తీ సమేతం గా తూర్పు దిక్కును పాలిస్తుంటాడు.

2. రురు భైరవుడు మాహేశ్వరి శక్తి సమేతం గా ఆఘ్నేయ దిక్కును పాలిస్తుంటాడు.

3. చండ భైరవుడు కౌమారి శక్తి సమేతం గా దక్షిణ దిక్కును పాలిస్తుంటాడు.

4. క్రోధ భైరవుడు వైష్ణవి శక్తి సమేతం గా నైరుతీ దిక్కును పాలిస్తుంటాడు.

5. ఉన్మత్త భైరవుడు వారాహి శక్తి సమేతం గా పశ్చిమ దిక్కును పాలిస్తుంటాడు.

6. కపాల భైరవుడు ఇంద్రాణి  శక్తి సమేతంగా వాయువ్యం దిక్కున పాలిస్తుంటాడు.

7. భీషణ భైరవుడు చాముండీ శక్తి సమేతంగా ఉత్తర దిక్కును పాలిస్తుంటాడు.

8. సంహార భైరవుడు మహాలక్ష్మి  సమేతం గా ఈశాన్యం దిక్కును పాలిస్తుంటాడు.

సూర్యుని (మార్తాండుడు) చేతను పైన చెప్పిన అష్టభైరవుల చేతను ఆరాధింపబడుటచే జగన్మాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునఫుడు ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

786వ నామ మంత్రము 16.01.2021

ఓం మంత్రిణీ న్యస్త రాజ్యధురే నమః 

తన పదహారు మంత్రులలో అతిముఖ్యురాలైన మంత్రిణి శ్యామల యందు రాజ్య భారమంతయు ఉంచిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మంత్రిణీన్యస్తరాజ్యధూః యను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మంత్రిణీన్యస్త రాజ్యధురే నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి ఐహికంగా మంచి కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు సంప్రాప్తింపజేసి, ఆముష్మికపరమైన  మోక్షసామ్రాజ్యప్రవేశార్హతలకు కావలసిన ఉపాసనా దీక్షను ప్రసాదించి, దీక్షాబద్ధులను చేసి తరింపజేయును.

తనకున్న పదహారు మంది మంత్రులలో శ్యామలాదేవి యను మంత్రిణియందు జగన్మాత తనయొక్క రాజ్యకార్యా లోచనలను, ఇతర పరిపాలనాభారాన్ని ఉంచినది. గనుక జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

జగన్మాత యొక్క మంత్రిణులు వీరే:

1) సంగీతయోని, 2) శ్యామా, 3) శ్యామలా, 4) మంత్రనాయికి, 5) సచివేశానీ, 6) ప్రధానేశ, 7) కుశప్రియా, 9) వీణావతి, 10) వైణికీ, 11) మద్రిణీ, 12) ప్రియకప్రియా, 13) నీపప్రియా, 14) కదంబవేశ్యా, 15) కదంబవనవాసినీ, 16) సదామలా.

ఈ పదహారుమంది మంత్రిణులలో శ్యామల యను మంత్రిణిపై ముఖ్యపరిపాలనాభారమును, సమస్త అధికారములను కట్టబెట్టి, మిగిలినవారికి వారి శక్తి సామర్థ్యములననుసరించి శాఖలను ఇచ్చినది. అందుచే జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

ఇక మంత్రోపదేశముతో మంత్రము గలవారు మంత్రులు అనబడతారు. ఉపాసకులు అనికూడా అనబడతారు. మననము చేయుట రక్షించుటయను ధర్మముగల నిర్మలచిత్తమునకు మంత్రమని అంటారు. అటువంటి చిత్తముగలవారే మంత్రులు అంటే యోగులు. అట్టి యోగులను, ఆయోగుల యోగదీక్షాపటిమను అనుసరించి అమ్మవారియందు ఐక్యము చేయువారిని మంత్రిణియగును. అమ్మవారితో ఏకత్వమును పొందుట అనువిశేషమునకు మంత్రిణి అని అందురు. అట్టి మంత్రిణియందు అనగా ప్రయత్నమునందు ఉంచబడిన ఆత్మసామ్రాజ్యమనెడి ఐక్యరహస్యమును కలిగించు ధర్మముగలిగినది జగన్మాత.  ఈ ఐక్యముగూడ పరమేశ్వరియే ఇచ్చుచున్నది గనుక ఆ ప్రయత్నమంతయు పరమేశ్వరి అధీనమునందున్నదని భావము. ఈ విషయము మూడు శివసూత్రములలో చెప్పబడినది. అవి 1) చిత్తమే మంత్రము, ప్రయత్నమే సాధకుడు, 3) విద్యాశరీరస్ఫురత్తయే మంత్రరహస్యము. ఈ సూత్రములకు భాష్యము పరమమైన ఆత్మతత్త్వవిమర్శనమే చిత్తము అనగా పరమాత్మను, దాని స్ఫురత్తను (ప్రకాశించు చైతన్యమును) నిర్మలత్వాదిగుణములను విమర్శించుట అని భావము. అదే మంత్రము.  అనగా ఇట్టి విమర్శవలన పరమేశ్వరస్వరూపమునకు స్వస్వరూపమునకు భేదములేదను అర్థము ఉన్నది. అనగా మంత్రముగల ఉపాసకులను అమ్మవారితో ఐక్యము పొందించునది మంత్రిణి. నిర్మల చిత్తులను పరమేశ్వరితో ఐక్యము పొందించునది మంత్రిణి.  గాన జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మంత్రిణీన్యస్తరాజ్య ధురే నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

212వ నామ మంత్రము 16.01.2011

ఓం మహారూపాయై నమః

పరమాత్మయొక్క ఫురుషుడు, అవ్యక్తము, వ్యక్తము మరియు కాలము అను నాలుగు రూపములకు కారణము బృహత్స్వరూపము గలిగినట్టి పరబ్రహ్మస్వరూపిణియగు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహారూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహారూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు పరమేశ్వరియొక్క మహత్తత్త్వము తెలిసి, తన సాధనను మరింత దీక్షాబద్ధతతో కొనసాగిస్తూ, పరబ్రహ్మమును తెలిసికొనే ప్రయత్నంలో పురోగామియగును.

మహా అనగా మహత్తు. మహత్తత్త్వముగల పరమాత్మ. దీనిని బట్టి జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి.  విష్ణుపురాణంలో ఈ విషయం చెప్పబడినది.

పరస్య బ్రహ్మణో రూపం పురుషః ప్రథమం ద్విజ|

వ్యక్తావ్యక్తే తథైవాన్యే రూపే కాల స్థథాపరమ్॥ (సౌభాగ్య భాస్కరం, 389వ పుట)

పురుషుడు, అవ్యక్తము, వ్యక్తము, కాలము అని నాలుగురూపములు. ఇందులో పురుషుడు అను రూపమే  ఈ నాలుగింటిలో ఉత్కృష్టమైనది. ఈ  నాలుగు రూపములను పురుషుడు, వ్యక్తావ్యక్తము, కాలము అను  మూడుగా తీసుకుంటే, ఈ మూడు,  సృష్టిస్థితిలయలకు కారణములు. సృష్టికి ముందు జగత్తంతయు తనలో నిక్షిప్తముచేసుకొనిన విరాట్స్వరూపిణి అమ్మవారు. విరాట్స్వరూపమంటేనే మహారూపము. అందుకని అమ్మవారు మహారూపా యని అనబడినది.

ప్రకృతి నుండి మహత్తత్త్వము, మహత్తత్త్వము నుండి అహంకారము ఇట్లు ఈ క్రమముననుసరించి పరమాత్మ తేజస్సే జగద్రూపముగా విస్తరించును. సర్వజగత్తునకు సాక్షిభూతుడు కాలచక్ర ప్రవర్తకుడు హిరణ్య గర్భుడగు మార్తాండుడు (సూర్యుడు) కూడా పరమాత్మ దేహమునుండి పుట్టినవాడే యని కూర్మపురాణమునందు చెప్పబడినది. ఇదంతా మహద్రూపమనబడుతుంది. జగన్మాత పరమాత్మ, పరబ్రహ్మస్వరూపిణి గనుక పరమేశ్వరి మహారూపా యని అనబడినది.

జగన్మాత విరాడ్రూపముగలది యని   778వ నామ మంత్రములో చెప్పబడినది. విశ్వరూపము గలది. విశ్వంలోని జీవులన్నింటికీ ప్రతీకయైన వైశ్వానరుని రూపం గలిగినది. అంటే  బృహద్రూపిణి. కాబట్టి పరమేశ్వరి మహారూపా యని అనబడినది.

మత్తేభవిక్రీడితము

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

ఇది బమ్మెరవారి నారాయణ శతకంలోని పద్యము. మత్తేభవిక్రీడితము మేము చిన్నప్పుడు దసరాల్లో గురువులతో శిష్యుల ఇళ్ళకు వెళ్ళునపుడు గిలకలు (బాణములు) చేత ధరించి ఈ పద్యం చదివేవారము. ఇది విరాడ్రూపుని వర్ణన.

జగన్మాత విరాడ్రూపిణి. బృహద్రూపిణి. గనక మహారూపా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహారూపాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: 16.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.41 (నలుబది ఒకటవ శ్లోకము)

వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరోఽభిజాతో దేవో యథాఽఽదిపురుషః సురలోకగోప్తా|

తన్నో నిధేహి కరపంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరఃసు చ కింకరీణామ్॥9422॥

ప్రభూ! సురలోకమును (సమస్త దేవతలను) రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై (వామనుడై) అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి అనుమాట ముమ్మాటికి నిజము.  ఆర్తబంధూ! మేమందఱము నీకు దాసీలము. కనుక నీ కరస్పర్శసుఖమునకై తపన (తహతహ) పడుచున్న మా వక్షస్థలములయందును, మా శిరస్సుల పైనను కోమలములైన నీ చల్లని చేతులను ఉంచి, మా తాపములను చల్లార్చుము.

శ్రీశుక ఉవాచ

29.42 (నలుబది రెండవ శ్లోకము)

ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః|

ప్రహస్య సదయం గోపీరాత్మారామోఽప్యరీరమత్॥9423॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సనకాదిమహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమపారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాపవచనములను శ్రద్ధగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభువు ఆ గోపికలపై జాలిగొని, చిఱునవ్వును చిందించుచు అందఱిలోను శ్రీకృవ్ణరూపుడై వారితో క్రీడించెను.

29.43 (నలుబది మూడవ శ్లోకము)

తాభిః సమేతాభిరుదారచేష్టితః  ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుతః|

ఉదారహాసద్విజకుందదీధతిర్వ్యరోచతైణాంక ఇవోడుభిర్వృతః॥9424॥

చిరునవ్వును చిందించెడి శ్రీకృష్ణుని సుందర వీక్షణములు ప్రసరించుటతో గొపికల ముఖములు వికసించెను. అప్పుడు భగవానుడు తన భావ-భంగిమలను, చేష్టలను గోపికలకు అనుకూలముగ చేసెను. ఆ సమయమున మనోజ్ఞములైన దరహాసముతో, మల్లెమొగ్గలవంటి దంతదీప్తులతో తేజరిల్లుచు మండలాకారమున గోపికలతో కూడియున్న ఆ స్వామి నక్షత్రమండలమున శోభిల్లుచున్న చంద్రునివలె అలరారుచుండెను.

29.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఉపగీయమాన ఉద్గాయన్ వనితాశతయూథపః|

మాలాం బిభ్రద్వైజయంతీం వ్యచరన్మండయన్ వనమ్॥9425॥

వందలకొణది గోపికలకు స్వామియైన శ్రీకృష్ణుడు వెలుగులను  వెదజల్లుచున్న వైజయంతీ మాలను  ధరించి, వారితో (ఆ గోపాంగనలతో)  విహరించుచు ఆ బృందావనము యొక్క అందచందములను ఇనుమడింప చేయుచుండెను. అప్పుడు గోపవనితలు శ్రీకృష్ణుని గుణగణములను, లీలావైభవములను పారవశ్యముతో కీర్తించుచుండిరి. ఆ కృష్ణప్రభువుగూడ వారి ప్రేమాతిశయములను, రూపలావణ్యములను మెచ్చుకొనుచు గానము చేయుచుండెను.

29.45 (నలుబది ఐదవ శ్లోకము)

నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్|

రేమే తత్తరలానందకుముదామోదవాయునా॥9426॥

యమునానదీ తీరమునందు చల్లని ఇసుక తిన్నెలపై చేరి కృష్ణుడు గోపికలతో గూడి విహరింపసాగెను. అప్పుడు శీతలతరంగముల మీదుగా, పరిమళములను వెదజల్లుచున్న కలువలమీదుగా వీచుచు వచ్చుచున్న మందమారుతములు వారికి హాయిని గూర్చుచుండెను.

29.46 (నలుబది ఆరవ శ్లోకము)

బాహుప్రసారపరిరంభకరాలకోరునీవీస్తనాలభననర్మనఖాగ్రపాతైః|

క్ష్వేల్యావలోకహసితైర్వ్రజసుందరీణాముత్తంభయన్ రతిపతిం రమయాంచకార॥9427॥

అంతట కృష్ణప్రభువు చేతులను చాచుచు, కౌగలించుకొనుచు, చేతులతో చేతులు కలుపుచు, వారి ముంగురులను సవరించుచుండెను. ఊరువులను, వక్షస్థలముల యందును కరములతో స్పృశించుచు వారిని పరవశింపజేయుచుండెను. సరసాలాపములు, చల్లనిచూపులు మొదలగు చేష్టలతో ఆ తరుణీమణులను ఆనందింపజేసెను. 

29.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఏవం భగవతః కృష్ణాల్లబ్ధమానా మహాత్మనః|

ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోఽభ్యధికం భువి॥9428॥

గోపికలు మహాత్ముడైన కృష్ణభగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందిరి. వారి మనోరథములన్నియును ఈడేరెను. అంతట వారు ఈ లోకములోని స్త్రీలలో తమ యంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియు తలంచుచు పొంగిపోసాగిరి.

29.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

తాసాం తత్సౌభగమదం వీక్ష్య మానం చ కేశవః|

ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత॥9429॥

అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలయొక్క సౌభాగ్య మదమును, దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించుటకై అక్కడనే అంతర్ధానమయ్యెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనత్రింశోఽధ్యాయః (29)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది తొమ్మిదవ అధ్యాయము (29)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:39, 16/01/2021] +91 95058 13235: 16.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

30.1 (ప్రథమ శ్లోకము)

అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగనాః|

అతప్యంస్తమచక్షాణాః కరిణ్య ఇవ యూథపమ్॥9430॥

శ్రీశుకుడు పలికెను తాము చూచుచుండగనే శ్రీకృష్ణభగవానుడు  అంతర్హితుడు కాగా గోపికలు ఆ స్వామిని గానక గజరాజు కనబడకపోవుటవలన ఆడుఏనుగులవలె మిగుల తల్లడిల్లసాగిరి.

30.2 (రెండవ శ్లోకము)

గత్యానురాగస్మితవిభ్రమేక్షితైర్మనోరమాలాపవిహారవిభ్రమైః|

ఆక్షిప్తచిత్తాః ప్రమదా రమాపతేస్తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికాః॥9431॥

వ్రజభామినులు కృష్శప్రభువుయొక్క గజగమనములను, ప్రేమ దరహాసములను, మనోజ్ఞములైన సరసాలాపములను, చిత్రవిచిత్రములైన లీలలను, శృంగార రసస్ఫోరకములైన భావ భంగిమలను పదే పదే తలంచుకొనుచు మైమఱచియుండిరి. అట్లు ప్రేమోన్మత్తలై యున్న గోపికలు తమను తాము కృష్ణునిగా భావించుకొనుచు ఆ స్వామి లీలలను అనుకరింపసాగిరి.

30.3 (ప్రథమ శ్లోకము)

గతిస్మితప్రేక్షణభాషణాదిషు  ప్రియాః ప్రియస్య ప్రతిరూఢమూర్తయః|

అసావహం త్విత్యబలాస్తదాత్మికా  న్యవేదిషుః కృష్ణవిహారవిభ్రమాః॥9432॥

అప్పుడు గోపికలు తమకు ప్రియతముడైన శ్రీకృష్ణునియందు తాదాత్మ్యము చెంది, నడకలు, చిఱునవ్వులు, చూపులు, మాటలు మొదలగువాని యందు ఆ స్వామికి ప్రతిరూపులై మెలగసాగిరి. పిదప వారు 'నేనే కృష్ణుడను, నేనే కృష్ణుడను' అని పలవరించుచు, విలాసశోభితములైన కృష్ణలీలా వైభవములను  ప్రదర్శింపసాగిరి.

30.4 (నాలుగవ శ్లోకము)

గాయంత్య ఉచ్చైరముమేవ సంహతా  విచిక్యురున్మత్తకవద్వనాద్వనమ్|

పప్రచ్ఛురాకాశవదంతరం బహిర్భూతేషు సంతం పురుషం వనస్పతీన్॥9433॥

ఆ సమయమున ఆ వనితలు అందఱును గుమిగూడి, ఆ పరమపురుషుని గుణగణములను బిగ్గఱగా గానము చేయుచు పిచ్చివారివలె  ఆయా వనములయందు అంతటను తిరుగుచు ఆ స్వామిని వెదకసాగిరి. ఆ ప్రభువు సమస్త పదార్థముల యందును, వారి (ఆ గోపికల) యందును, ఆకాశమువలె సకలదిశల యందును వ్యాపించియుండెను. కాని వారు ఆయనను ఎచ్చటను చూడజాలక ఉన్మత్తులవలె ఆ కృష్ణుని జాడను గూర్చి చెట్లు చేమలను, పశుపక్ష్యాదులను సైతము అడుగుచుండిరి.

30.5 (ఐదవ శ్లోకము)

దృష్టో వః కచ్చిదశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ నో మనః|

నందసూనుర్గతో హృత్వా ప్రేమహాసావలోకనైః॥9434॥

అశ్వత్ద వృక్షములారా! జువ్విచెట్టులారా! మర్రి వృక్షములారా, నందనందనుడైన మా కృష్ణుడు ప్రేమపూరితములైన చిఱునవ్వులతో, విలాసవంతములైన చూపులతో మా మనస్సులను దోచుకొని వెళ్ళినాడు. మీరు ఆయనను చూచితిరా?

30.6 (ఆరవ శ్లోకము)

కచ్చిత్కురబకాశోకనాగపున్నాగచంపకాః|

రామానుజో మానినీనామితో దర్పహరస్మితః॥9435॥

కురవకములారా! అశోకవృక్షములారా! పొన్నలారా! పున్నాగములారా! సంపెంగలారా! ఇంపుగొలిపెడి తన దరహాసములతో అభిమానవతులమైన మా దర్పములను అణచి శ్రీకృష్ణుడు ఇటు వచ్చినాడా? 

30.7 (ఏడవ శ్లోకము)

కచ్చిత్తులసి కల్యాణి గోవిందచరణప్రియే|

సహ త్వాలికులైర్బిభ్రద్దృష్టస్తేఽతిప్రియోఽచ్యుతః॥9436॥

తులసీ! నీ హృదయము మిక్కిలి కోమలము. నీవు ఎల్లరకును శుభములను గూర్చుచుండెడి దానవు. గోవిందుని చరణములపై నీకుగల మక్కువ అపారమైనది. ఆ స్వామికిని నీవనిన ప్రాణము. నీ పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదలు ఎంతగా రొదచేయుచున్నను నిన్ను నిరంతరము ఆ స్వామి తన వక్షస్థలమున ధరించుచునే యుండును. ఆ పురుషోత్తముడు నీకు కనబడెనా?

30.8 (ఎనిమిదవ శ్లోకము)

మాలత్యదర్శి వః కచ్చిన్మల్లికే జాతి యూథికే|

ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవః॥9437॥

మాలతీలతలారా! మల్లికలారా! జాజిపూవులారా! అడవిమల్లెలారా! తన మృదుహస్తములతో మీకు సుఖస్పర్శను గూర్చుచుండెడి కృష్ణప్రభువు ఇటు వచ్చుటను గమనించితిరా?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:23, 17/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

787వ నామ మంత్రము 17.01.2021

ఓం త్రిపురేశ్యై నమః

స్థూల, సూక్ష్మ, కారణదేహాలకు ప్రభ్విగాను,  దేవశిల్పియైన మయునిచే నిర్మింపబడిన త్రిపురములకు ఈశ్వరిగాను విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్రిపురేశీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం త్రిపురేశ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే ఐహికపరముగా సకల సుఖసంతోషములు అనుభవించుచూ, ఆ తల్లికరుణచే బ్రహ్మజ్ఞానాన్వేషణయందు ఏవిధమైన అవరోధములు లేక ముందుకుసాగును.

శ్రీచక్రమునందు రెండవ ఆవరణను సర్వాశాపరిపూరకచక్రమనియు, అక్కడ ఉండే యోగినిని గుప్తయోగిని యని అందురు. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి ఈ దేవతతో భేదములేనిది కావున జగన్మాత త్రిపురేశీ యని అనబడినది. ఈ రెండవ ఆవరణమునందు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి యను యోగినులు ఉంటారు.

నామ, రూప, క్రియలనే ఈ మూడూ త్రిపురములు. ఇందులో జగన్మాత ముఖ్య ప్రాణరూపిణి. త్రిపురములను సృష్టించి, ఆనందమయంగా విహరించే మహోదాత్త శక్తి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి.  అందుచే జగన్మాతను త్రిపురేశీ యని అన్నాము.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు దేవశిల్పి మయుడు. ఇతడు మూడు పురములను నిర్మించాడు. ఈ మూడు పురములకు జగన్మాతయే ఈశ్వరి యగుటచే త్రిపురేశీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం త్రిపురేశ్యై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:23, 17/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

213వ నామ మంత్రము 17.01.2021

ఓం మహాపూజ్యాయై నమః

పూజ్యులైన బ్రహ్మోపేంద్రాదులు, మహేశ్వరుడు మొదలైనవారికిగూడా పూజ్యురాలైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపూజ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాపూజ్యాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ తల్లి శాంతిసౌఖ్యములను, సిరిసంపదలనూ ప్రసాదించి, నిత్యమైన, సత్యమైన మోక్షసాధనకు తగినంత సాధనాపటిమను కూడా అనుగ్రహించును.

సామాన్యులు దేవతలను పూజింతురు. ఆ దేవతలందరూ  త్రిమూర్తులను పూజింతురు. అట్టి త్రిమూర్తులే అమ్మవారిని పూజించుచున్నారు. గనుక అమ్మవారు మహాపూజ్యా యని స్తుతింపబడుచున్నది.

సకలజగత్తుల సృష్టికి ముందే తానున్నది. అందుకే జగన్మాత ఆదిపరాశక్తి. సృష్టిస్థితిలయకారిణి. ఆ తల్లి సర్వదేవతా స్వరూపిణి. సర్వమంత్రస్వరూపిణి. సకలయంత్రాత్మిక. ఏరూపంలో పూజించినా, ఏ నామంతో పూజించినా అన్నియు లలితాంబకే చెందుతాయి. దేశకాలాపరిచ్ఛిన్నా - దేశకాలములను అవధులులేకుండా  అన్నికాలములు, అన్ని ప్రదేశములలోనూ తానే విరాజిల్లుతూ పూజింపబడుచున్నది    గనుక మహాపూజ్యా యని అనబడినది.

83వ నామ మంత్రము బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా భండాసుర వధ సమయంలో లలితాంబిక చూపిన పరాక్రమానికి బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడినది.

231వ నామ మంత్రము మహాభైరవ పూజితా - మహాభైరవుడైైన పరమశివునిచే పూజింపబడినది. 

237వ నామ మంత్రము మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా అరవైనాలుగు కోట్ల యోగినుల (శక్తి గణాల) చే పూజింపబడుచున్నది.

297వ నామ మంత్రము - హరిబ్రహ్మేంద్ర సేవితా - హరి, బ్రహ్మ ఇంద్రాది దేవతలచే సేవింపబడినది.

305వ నామ మంత్రము - రాజరాజార్చితా రాజరాజులచే అనగా కుబేరుడు, మనువు మొదలైన వారిచే పూజింపబడునది.

545వ నామ మంత్రము - పులోమజార్చితా పులోముని పుత్రికయైన ఇంద్రాణి (ఇంద్రుని భార్య) చే పూజింపబడినది 

614వ నామ మంత్రము సచామర రమా వాణీ సవ్యదక్షిణ సేవితా ఎడమ, కుడి భాగాలలో వింజామరలతో కూడిన లక్ష్మీ సరస్వతీలచే సేవింపబడునది

636వ నామ మంత్రము గంధర్వ సేవితా అద్భుత గాయకులైన గంధర్వులుచే వారి గానంతో సేవింపబడునది.

647వ నామ మంత్రము లోపాముద్రార్చితా అగస్త్యుని భార్యయైన లోపాముద్రచే సేవింపబడినది.

726వ నామ మంత్రము సనకాది సమారాధ్యా సనక, సనందన,  సనత్కుమార, సనత్సుజాత అను బ్రహ్మ మానసపుత్రులచే పూజింపబడినది.

785వ నామ మంత్రము మార్తాండ భైరవారాధ్యా మార్తాండ, భైరవులచే పూజింపబడినది.

శ్రీచక్రాన్ని మననం చేస్తే మహాచతుష్షష్టికోటి యోగినీ గణమలన్నియు లలితాంబస్వరూపములై, అనేక విధములుగా మంత్ర, తంత్ర, యంత్ర  సహితముగా పూజలందుకొను మహాదేవి యై గోచరిస్తూ, అత్యంత దీక్షాబద్ధమైన పూజలందుకొనుచూ చతుష్షష్ట్యుపచారాధ్య గా విరాజిల్లుతూ మహాపూజ్యా యని  యనబడుచున్నది.

బ్రహ్మోపేంద్రాది దేవతలు అమ్మవారిని ఏవస్తువులతో చేసిన దేవీ ప్రతిమలతో పూజ చేశారో  ఇక్కడ వివరణ ఈయబడుచున్నది.

1) పరమేశ్వరుడు మంత్రము, 2)  బ్రహ్మ శైలము, 3) విష్ణువు ఇంద్రనీలమణి, 4)  కుబేరుడు - సువర్ణము, 5) విశ్వేదేవులు - వెండి, 6) వాయువు - ఇత్తడి, 7) వసువులు - కంచు, 8) వరుణుడు - స్ఫటికము, 9) అగ్ని - మాణిక్యము, 10) శుక్రుడు (ఇంద్రుడు) - ముత్యము, 11) సూర్యుడు - పగడము, 12) చంద్రుడు - వైడూర్యము, 13) నవగ్రహములలో మిగిలినవారు - తగరము 14) రాక్షసులు - సీసము, 15) పిశాచములు - వజ్రము, 16) మాతృగణము - లోహము ఈ విధముగా ఆయా వస్తువులతో అమ్మవారి రూపమును నిర్మించి పూజించుచున్నారు.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మహాపూజ్యాయై నమః  అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:23, 17/01/2021] +91 95058 13235: 17.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.9 (తొమ్మిదవ శ్లోకము)

చూతప్రియాలపనసాసనకోవిదారజంబ్వర్కబిల్వబకులామ్రకదంబనీపాః|

యేఽన్యే పరార్థభవకా యమునోపకూలాః శంసంతు కృష్ణపదవీం రహితాత్మనాం నః॥9438॥

ఎల్లరను ఆనందింపజేయుచుండెడి చూత వృక్షములారా! ద్రాక్షతీగెలారా! పనసచెట్టులారా! వేగిస వృక్షములారా! ఎర్రకాంచనములారా! నేరేడు చెట్టులారా! జిల్లేడు మొక్కలారా! మారేడు చెట్టులారా! పొగడలారా! మామిడివృక్షములారా! కడిమిచెట్టులారా! మంకెన చెట్టులారా! అట్లే యమునా తీరమున విలసిల్లుచున్న ఇతర వృక్షములారా! మీ జీవనమంతయు పరోపకారముకొరకే గడచును. శ్రీకృష్ణవిరహకారణముగా మా మనస్సులు ఏమాత్రమూ పనిచేయకున్నవి. కావున, మాకు ఆ ప్రభువు జాడను తెలిపి పుణ్యము గట్టుకొనుడు.

 30.10 (పదియవ శ్లోకము)

కిం తే కృతం క్షితి తపో బత కేశవాంఘ్రిస్పర్శోత్సవోత్పులకితాంగరుహైర్విభాసి|

అప్యంఘ్రిసంభవ ఉరుక్రమవిక్రమాద్వా ఆహో వరాహవపుషః పరిరంభణేన॥9439॥

భూదేవీ! నీవు ఎంతటి తపస్సు చేసితివోగదా! కోమలములైన శ్రీకృష్ణుని పాదముల సుఖస్పర్శచే పరమానందభరితవై, తృణములు, లతలు మొదలగువాని రూపములలో పులకాంకితవై యుంటివి. ఈ నీ ఆనందమునకు కారణము శ్రీహరి చరణస్పర్శయేనా? లేక వామనావతారమున త్రివిక్రముడై ఆ ప్రభువు తన చరణముతో నిన్ను ఆక్రమించినందులకా? లేక వరహావతారమున ఆ స్వామి తన కౌగిలి సుఖములలో నిన్ను ఓలలాడజేసినందులకా? కారణమేదైనను నీవు మిగుల భాగ్యశాలివి. మాకు కృష్ణుని జాడ తెలిపి మమ్ము ఆనందింపజేయుము.

 30.11 (పదకొండవ శ్లోకము)

అప్యేణపత్న్యుపగతః ప్రియయేహ గాత్రైస్తన్వన్ దృశాం సఖి సునిర్వృతిమచ్యుతో వః|

కాంతాంగసంగకుచకుంకుమరంజితాయాః కుందస్రజః కులపతేరిహ వాతి గంధః॥9440॥

తన కనులలో ఆనందాతిరేకమును ప్రదర్శించుచున్న ఒక హరిణిని జూచి, దానితో ఆ గోపికలు ఇట్లు పలికిరి- 'చెలీ! శ్రీకృష్ణుడు తన ప్రియురాలితోగూడి ఇచటికి వచ్చినట్లేయున్నాడు. ఏలయన, సర్వాంగసుందరుడైన ఆ ప్రభువుయొక్క దివ్యదర్శన భాగ్యమునకు నోచుకొనినందువలననే కాబోలు, నీ నేత్రములలో పరమసంతోషము పరవళ్ళు త్రొక్కుచున్నది. నీవు చెప్పుటలేదుగాని, ఆ కృష్ణుడు ఇచటికి వచ్చినాడనుటకు నీ నేత్రాంగమే ప్రబలసాక్షి. ఆ స్వామి తన ప్రియురాలిని కౌగిలింతల సుఖములలో ముంచెత్తునపుడు, ఆమె వక్షస్థలమునందలి కుంకుమలతో నిండిన ఆ ప్రభువు మల్లెపూలమాల పరిమళములను నింపుకొని ఇచటి వాయువులు గుబాళించుచు వీచుచున్నవి. మా మాటలు నిజమేగదా!

 30.12 (పండ్రెండవ శ్లోకము)

బాహుం ప్రియాంస ఉపధాయ గృహీతపద్మో  రామానుజస్తులసికాలికులైర్మదాంధైః|

అన్వీయమాన ఇహ వస్తరవః ప్రణామం కిం వాభినందతి చరన్ ప్రణయావలోకైః॥9441॥

అనంతరము వారు పండ్లబరువుతో వంగియున్న చెట్లనుజూచి, అవి శ్రీకృష్ణునకు నమస్కరించుటకై అట్లు  వినమ్రములై యున్నట్లు భావించి ఇట్లనిరి- "వృక్షములారా! కృష్ణప్రభువు తన కుడిచేతియందు లీలాపద్మమును ధరించి, ఎడమచేతిని తన ప్రియురాలి భుజముపై ఉంచి ఈ మార్గముననే వెళ్ళినట్లున్నది. తన  మెడలోని తులసిమాల పరిమళములకు ఆకర్షితములై తనను అనుసరించుచున్న తుమ్మెదల ఝంకారములకు ఆనందించుచు అతడు ప్రణయపూర్ణములైన తన చూపులను ప్రసరింపజేయుచు, ఇచట సంచరించుచున్నప్పుడు సవినయముగా మీరు ఒనర్చిన నమస్కారములను ఆ స్వామి స్వీకరించినాడా?

 30.13 (పదమూడవ శ్లోకము)

పృచ్ఛతేమా లతా బాహూనప్యాశ్లిష్టా వనస్పతేః|

నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పులకాన్యహో॥9442॥

అప్పుడు ఆ గోపికలు తమలో తాము ఇట్లు ముచ్చటించుకొనిరి- 'సఖులారా! ఈ లతలను ఒకసారి పరికించి చూడుడు. ఇవి శ్రీకృష్ణ సాంగత్య భాగ్యమును పొందినట్లేయున్నవి. ఇది ముమ్మాటికిని నిజము. ఏలయన, ఇవి తమ పతియగు వృక్షముయొక్క కొమ్మలను పెనవైచుకొనియున్నను, ఆ స్వామియొక్క గోటికొనల సుఖస్పర్శవలననే కాబోలు మొగ్గదొడిగి పులకితములైనట్లు కనబడుచున్నవి.

 30.14 (పదునాలుగవ శ్లోకము)

ఇత్యున్మత్తవచో గోప్యః కృష్ణాన్వేషణకాతరాః|

లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికాః॥9443॥

ఈ విధముగా కృష్ణునియెడబాటుతో నున్న గోపికలు ఆ స్వామిని వెదకుటలో మిగుల అలసిపోయిరి. విహ్వలలైయున్న ఆ గోపివనితలు కృష్ణునితో తాదాత్మ్యము చెందుచు (తమను కృష్ణునిగా భావించుకొనుచు) ఆ ప్రభువుయొక్క లీలలను అనుకరింపసాగిరి.

 30.15 (పదునైదవ శ్లోకము)

కస్యాశ్చిత్పూతనాయంత్యాః కృష్ణాయంత్యపిబత్స్తనమ్|

తోకాయిత్వా రుదత్యన్యా పదాహన్ శకటాయతీమ్॥9444॥

పరీక్షిన్మహారాజా! ఒక గోపిక పూతనగా నటించుచుండగా, మఱియొకతె బాలకృష్ణుడై ఆమె చనుబాలు త్రాగసాగెను. ఒక యువతి చిన్నికృష్ణుని భావముతో ఏడ్చుచు, బండిగా  (శకటాసురుడుగా) నటించుచున్న మఱియొకతెను కాలితో తన్నెను. 

 30.16  (పదహారవ శ్లోకము)

దైత్యాయిత్వా జహారాన్యామేకా కృష్ణార్భభావనామ్|

రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతీ ఘోషనిఃస్వనైః॥9445॥

ఒక సుందరి సుడిగాలిగా (తృణావర్తునిగా) ప్రవర్తించుచు బాలకృష్ణునివలె అనుసరించు వేఱొక గోపికను ఎత్తుకొనిపోయెను. ఒక గోపిక మోకాళ్ళపై దోగాడుచుండగా ఆమె కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:54, 17/01/2021] +91 95058 13235: 17.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.17 (పదిహేడవ శ్లోకము)

కృష్ణరామాయితే ద్వే తు గోపాయంత్యశ్చ కాశ్చన|

వత్సాయతీం హంతి చాన్యా తత్రైకా తు బకాయతీ॥9446॥

ఇద్దరు గోపికలు బలరామకృష్ణులైరి. కొందఱు గోపకాంతలు గోపాలురుగా, ఆవు దూడలుగా నటింపసాగిరి. ఒక గోపిక వత్సాసురునిగా, మఱియొక గోపిక బకాసురునిగా నటించుచుండగా, ఇతర గోపికలు వారిని హింసించుచున్నట్లుగా అభినయించిరి.

30.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఆహూయ దూరగా యద్వత్కృష్ణస్తమనుకుర్వతమ్|

వేణుం క్వణంతీం క్రీడంతీమన్యాః శంసంతి సాధ్వితి॥9447॥

కొందఱు గోపికలు గోవులుగా నటించుచు దూరమునకు వెళ్ళగా, ఒక గోపిక కృష్ణునివలె ప్రవర్తించుచు వారిని పిలువసాగెను. వేఱొక గోపిక కృష్ణునివలె వేణువును ఊరుచున్నట్లు అభినయించుచుండగా, ఇతర గోపికలు 'భలే భలే' అని పొగడుచుండిరి.

30.19 (పందొమ్మిదవ శ్లోకము)

కస్యాంచిత్స్వభుజం న్యస్య చలంత్యాహాపరా నను|

కృష్ణోఽహం పశ్యత గతిం లలితామితి తన్మనాః॥9448॥

ఒక గోపిక తనను కృష్ణునిగా భావించుకొనుచు, వేఱొక గోపిక భుజములపై చేతులు ఉంచి నడచుచు తక్కినవారితో 'గోపికలారా! నేను కృష్ణుడను. నా నడకల సోయగములను చూడుడు' అని పలుకుచుండెను.

30.20 (ఇరువదియవ శ్లోకము)

మా భైష్ట వాతవర్షాభ్యాం తత్త్రాణం విహితం మయా|

ఇత్యుక్త్వైకేన హస్తేన యతంత్యున్నిదధేఽమ్బరమ్॥9449॥

ఒక తరుణి కృష్ణునివలె ప్రవర్తించుచు 'వ్రజవాసులారా! ఈ సుడిగాలులకు, జడివానలకు మీరు ఏమాత్రమూ భయపడవలదు. వాటినుండి రక్షించుటకు నేను తగిన ఉపాయమును ఆలోచించి యున్నాను' అని పలుకుచు, ఒక చేతితో తన చీరెకొంగును పైకెత్తి నిలుచుండెను.

30.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఆరుహ్యైకా పదాఽఽక్రమ్య శిరస్యాహాపరాం నృప|

దుష్టాహే గచ్ఛ జాతోఽహం ఖలానాం నను దండధృక్॥9450॥

పరీక్షిన్మహారాజా! ఒక గోపిక కాళియసర్పముగా నటించుచుండగా, మఱొక వనిత కృష్ణునివలె ఆమె శిరస్సుపై పాదములనుంచి, 'క్రూరసర్పమా! ఇచటినుండి వెళ్ళిపొమ్ము. నేను దుష్టులను హతమార్చుటకే అవతరించితిని' అని పలికెను.

30.22 (ఇరువది రెండవ శ్లోకము)

తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణమ్|

చక్షూంష్యాశ్వపిదధ్వం వో విధాస్యే క్షేమమంజసా॥9451॥

ఇంతలో ఒక గోపయువతి ఇట్లు నుడివెను- "గోపాలకులారా! చూడుడు, వనములో భయంకరమైన దావాగ్ని చెలరేగినది. మీరు కనులు మూసికొనుడు. నేను మిమ్ములను అందఱిని దానినుండి (దావాగ్ని ప్రమాదమునుండి) అవలీలగా రక్షించెదను'.

30.23 (ఇరువది మూడవ శ్లోకము)

(బద్ధాన్యయా స్రజా కాచిత్తన్వీ తత్ర ఉలూఖలే|)

బధ్నామి భాండభేత్తారం హైయంగవముషం త్వితి|

భీతా సుదృక్ పిధాయాస్యం భేజే భీతివిడంబనమ్॥9452॥

యశోదగా నటించుచున్న మఱియొక గోపిక, 'కృష్ణా! వెన్నలను   దొంగిలించి, ఆ కుండలను పగులగొట్టిన నిన్ను ఇప్పుడే ఈ ఱోటికి కట్టివేసెదను' అని పలుకుచు, ఒక గోపికను పూలమాలతో బంధించెను.  అంతట ఆ రెండవ గోపికను భయపడుచున్నట్లు అభినయించుచు ముఖమును కప్పివేసికొనెను.

30.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఏవం కృష్ణం పృచ్ఛమానా వృందావనలతాస్తరూన్|

వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః॥9453॥

30.25 (ఇరువది ఐదవ శ్లోకము)

పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః|

లక్ష్యంతే హి ధ్వజాంభోజవజ్రాంకుశయవాదిభిః॥9454॥

ఈ విధముగా గోపికలు కృష్ణుని లీలలను ప్రదర్శించిన పిదప, మఱల వారు బృందావనమునందలి లతలను, వృక్షములను ఆ ప్రభువు జాడను గూర్చి అడుగుచు అంతటను తిరుగసాగిరి. ఇంతలో వారికి ఆ పరమాత్ముని పాదముల ముద్రలు కనబడెను. అప్పుడు వారు పరస్పరము ఇట్లనుకొనిరి- 'ఈ పాదచిహ్నములు తప్పక నందనందనుడైన ఆ మహాత్మునివే. ఏలనన ఈ కాలిగుర్తులలో ధ్వజము, పద్మము, వజ్రాయుధము, అంకుశము, యవలు, హలము మొదలగువాని రేఖలు స్పష్టముగా గోచరించుచున్నవి'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:41, 18/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

788వ నామ మంత్రము 18.01.2021

ఓం జయత్సేనాయై నమః

మహిషాసుర, భండాసురాది రాక్షసులను సంహరించి విజయము నందించగల పరాక్రమశీలులైన సేనలు కలిగియున్న జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి జయత్సేనా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం జయత్సేనాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఆరాధించు సాధకుడు           తను తలపెట్టిన సకల ప్రయత్నములందునూ విజయము సాధించును. 

భండాసురాది రాక్షసులను సంహరించుటలో జగన్మాతకు అత్యంత పరాక్రమము గలిగి, విజయము నందించగల శక్తిసేన ఉన్నది. 

గజసేనాధ్యక్షురాలు సంపత్కరి,  అశ్వసేన అధ్యక్షురాలు అశ్వారూఢ, అగ్నిప్రాకారములు నిర్మించిన జ్వాలామాలిని, భండాసురునితో యుద్ధంలో తిరులేని పరాక్రమము చూపించిన నిత్యాదేవతలు, ముప్పదిమంది  భండాసురుని పుత్రులు వారి సైన్యమును పటాపంచలు చేసిన బాలాత్రిపురసుందరీదేవి, విషంగుడనే రాక్షసుడిని, అతని సైన్యమును మట్టికరిపించిన మంత్రిణి శ్యామలాదేవి, విశుక్రుడిని అతని వివిధసేనా బలములను నిర్జీవులను చేసిన వారాహీ దేవి, రాక్షసులు ప్రయోగించిన జయవిఘ్నయంత్రాన్ని నాశనంచేసిన మహాగణేశ్వరుడు, భండాసురుడు ప్రయోగించిన వివిధ అస్త్రాలకు సప్తకోటి మహామంత్రయుక్తమైన ప్రత్యస్త్రములు, తన చేతి పదివ్రేళ్ళగోళ్ళసందులనుండి వెడలిన నారాయణుని దశాకృతులు, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము, మహాకామేశ్వరాస్త్రము మొదలైనవన్నియునూ శక్తిసేనలే. కాబట్టి జగన్మాత జయత్సేనా యని అనబడినది.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. సప్తకోటి మహామంత్రాలు, వాటితో చేయగలిగే యంత్రాలు, మహాచతుష్షష్టికోటియోగినీ గణములు - ఇవి అన్నియు అంతఃశత్రువులను అంతం చేయగల  సేనలు. ఆ తల్లికి అనాయాసముగా జయమునందించే ఇటువంటి శక్తిసేనలు ఉండుటచే అమ్మవారు జయత్సేనా యని అనబడినది. జగన్మాత భక్తులకు సప్తకోటి మహామంత్రాల అనుష్ఠానమే వారి అంతఃశత్రువులను జయించగల శక్తిసేనలు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జయత్సేనాయై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:41, 18/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

214వ నామ మంత్రము 18.01.2021

ఓం మహా పాతక నాశిన్యై నమః

పంచమహా పాతకములు (స్త్రీ, హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, స్వర్ణస్తేయము) అను పంచమహాపాతకములు కూడా తన నామస్మరణ మాత్రమున శమింపజేయు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపాతకనాశనీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపాతకనాశిన్యై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు పంచమహాపాతకములను సైతము శమింపజేసి సద్గతులను ప్రసాదించును.

తన ఉపాసకులకు ఏకారణముచేతనైనను పాపములంటిన వాటిని పోగొట్టునది జగన్మాత.  బ్రహ్మాండ పురాణములో ఇలాచెప్పబడినది.

తస్యచాఖిలపాపస్య జ్ఞానతోఽజ్ఞానతోఽపి వా|

ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి॥ (సౌభాగ్యభాస్కరం, 390వ పుట)

 వ్యాసులవారిలా చెప్పారు: పాతకములలో ఐదింటిని మహాపాతకాలు అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -

1. స్త్రీ హత్య,  2. శిశు హత్య, 3. గో హత్య, 4. బ్రహ్మ హత్య, 5. స్వర్ణస్తేయము (బంగారము దొంగిలించుట),

తెలియక చేసినను, తెలిసి చేసినను  ఫలితాన్ని అనుభవించ వలసినదే. కాని  ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాపాలు క్రమంగా హరిస్తాయి. 

తెలియక ఒకసారి కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో చిక్కుకున్నాడు. కోసలదేశంలో కరువు ఏర్పడినప్పుడు, ఆ రాజు ఇరుక్కొన్న వైనం ఇలా చెప్పబడినది.ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు భీమసేనుడు అను ఆ రాజు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. ఆయన ఆ బావికి చుట్టూ గోడ కట్టించలేదు.

ఆ నూతి చుట్టూ, దాహార్తియైన ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిది తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజు బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించుటచే ఆ పుణ్యం ఆయనకు దక్కును. కాని గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా ఆయనకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చునన్నారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్రలు చేసి, దానధర్మములు చేయవలెను. కానీ పరమేశ్వరి నామస్మరణ మాత్రమున ఇట్టి పాపములు తెలిసి చేసినను, తెలియక చేసినను పటాపంచలగును. కాబట్టి జగన్మాత  మహాపాతకనాశినీ యని అనబడినది.

అలాగే శివపూజ నూరు బ్రహ్మహత్యల పాపమును నశింపజేయును. పాపముల హెచ్చు తగ్గులను బట్టి పంచదశీమంత్ర సంఖ్యలో గూడ హెచ్చుతగ్గులు ప్రాయశ్చిత్తముగా జపము చేయవచ్చును.స్వల్ప పాపమునకు స్వల్పజపము, మహాపాపములకు అధికముగాను పంచదశీ జపము చేయవలయును అని సౌభాగ్యరత్నాకరమునందు చెప్పబడినది.

పాపములు పోవుటకు చేయు ప్రాయశ్చిత్తములను శాంతికర్మలు అని పెద్దలు చెప్పారు. సర్వదేవతా స్వరూపిణియైన జగన్మాతను ఆరాధిస్తే సర్వప్రాయశ్చిత్తములకు ఒక శాంతికర్మతో సరిపోవునుగాన జగన్మాతను మహాపాతక నాశనీ యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాపాతకనాశిన్యై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:41, 18/01/2021] +91 95058 13235: 18.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉30.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తైస్తైః పదైస్తత్పదవీమన్విచ్ఛంత్యోఽగ్రతోఽబలాః|

వధ్వాః పదైః సుపృక్తాని విలోక్యార్తాః సమబ్రువన్॥9455॥

ఆ పాదచిహ్నములనుబట్టి గోపికలు శ్రీకృష్ణుని వెదకుచు ముందునకు సాగిరి. అక్కడక్కడ వారు ఆ ప్రభువుయొక్క పాదముద్రలతోపాటు ఒక తరుణియొక్క కాలి గుర్తులు గూడ ఉండుట గమనించి, వారు మిగుల వ్యాకులచిత్తలై ఇట్లు సంభాషించుకొనిరి.

30.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కస్యాః పదాని చైతాని యాతాయా నందసూనునా|

అంసన్యస్తప్రకోష్ఠాయాః కరేణోః కరిణా యథా॥9456॥

గజరాజుతో గూడి ఒక ఆడు ఏనుగు నడచినట్లుగా ఒక యువతి శ్రీకృష్ణునితో కలిసి, ఇచట నడచినట్లున్నది. చూడుడు. ఆమె తన ముంజేతిని ఆ ప్రభువుయొక్క భుజములపై వేసి ముందునకు సాగినట్లున్నది. ఆ భాగ్యశాలినిఎవరై యుండును?

30.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

అనయాఽఽరాధితో నూనం భగవాన్ హరిరీశ్వరః|

యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయద్రహః॥9457॥

నిజముగా ఆ కాంత జగన్నాథుడైన కృష్ణపరమాత్ముని తన భక్తిపూర్వకముగా సేవించియే యుండును. ఏలనన, ఆ గోవిందుడు మనలను అందఱిని విడిచిపెట్టి, ఏకాంతముగా ఆమెతో కలిసి నడచివెళ్ళెను.

30.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ధన్యా అహో అమీ ఆల్యో గోవిందాంఘ్ర్యబ్జరేణవః|

యాన్ బ్రహ్మేశౌ రమాదేవీ దధుర్మూర్ధ్న్యఘనుత్తయే॥9458॥

సఖులారా! గోవిందుని యొక్క ఈ చరణకమల రేణువులు ఎంతయు పవిత్రములు, దివ్యములు. అందువలన బ్రహ్మ, పరమశివుడు మొదలగు దేవతలును, లక్ష్మీదేవియు ఆ పరమాత్ముని ప్రాప్తికి ఎదురగు ప్రతిబంధకములను అధిగమించుటకై వాటిని (ఆ చరణ ధూళులను) తమ శిరములపై ధరించుచున్నారు. మనముగూడ ఆ దివ్య రేణువులతో మన శిరస్సులను అభిషేకించుకొనినచో,  ఆ పరమ పురుషుని కలయిక సాధ్యమగును.

30.30 (ముప్పదియవ శ్లోకము)

తస్యా అమూని నః క్షోభం కుర్వంత్యుచ్చైః పదాని యత్|

యైకాపహృత్య గోపీనాం రహో భుంక్తేఽచ్యుతాధరమ్॥9459॥

గోవిందునితోగూడి క్రీడించిన ఆ విలాసవతియొక్క పాదచిహ్నములు మనలను మిగుల చిత్తక్షోభకు గుఱిచేయుచున్నవి. ఏలయన, మన గోపికలకు అందఱకును సొంతమైన కృష్ణుని అధరామృతమును ఏకాంతమున తాను ఒక్కతెయే అనుభవించుచున్నది.

30.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

న లక్ష్యంతే పదాన్యత్ర తస్యా నూనం తృణాంకురైః|

ఖిద్యత్సుజాతాంఘ్రితలామున్నిన్యే ప్రేయసీం ప్రియః॥9460॥

 అంతట మఱియొక గోపిక ఇట్లు పలికెను - 'చెలులారా! ఇటు చూడుడు. ఇచట ఆ యువతి యొక్క కాలి గుర్తులు  కనబడుటలేదు. కేవలము మన స్వామియొక్క పాదచిహ్నములే గోచరించుచున్నవి. దీనిని బట్టి చూడగా నిక్కపొడుచుకొనియున్న ఈ తృణములు సుకుమారములైన ఆమె అఱికాళ్ళకు గుచ్చుకొని బాధించునేమోయని తలంచి, ప్రభువు తన ప్రేయసిని భుజములపై చేర్చుకొనినట్లున్నది'.

30.32 (ముప్పది రెండవ శ్లోకము)

ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూమ్|

గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః॥9461॥

30.33 (ముప్పది మూడవ శ్లోకము)

అత్రావరోపితా కాంతా పుష్పహేతోర్మహాత్మనా|

అత్ర ప్రసూనాఽవచయః ప్రియార్థే ప్రేయసా కృతః|

ప్రపదాక్రమణే ఏతే పశ్యతాఽసకలే పదే॥9462॥

పిదప వేఱొక గోపిక ఇట్లు నుడివెను - 'వనితలారా! ఈ గోపిక చెప్పినది 'నిజమే' యనిపించుచున్నది. ఏలయన, కృష్ణుడు తనకు ప్రీతిపాత్రురాలైన తరుణియొక్క భారమును వహించుచుండుటచే కాబోలు, ఆచట ఆ స్వామి పాదములు పచ్చికలపై మిక్కిలి దిగబడినట్లు కనబడుచున్నవి. ఇచ్చట తాను పూవులను కోయుటకై  ఆ కాంతను భుజములపై నుండి క్రిందికి దింపినట్లు గోచరించుచున్నది. ఇచట ఆ గోపికాప్రియుడు తన కాళ్ళ మునివ్రేళ్ళపై నిలబడి తన ప్రియురాలి కొఱకై ఎగిరెగిరి పూలు తెంపినట్లున్నది. అందువలననే ఇచట ఆ స్వామి పాదముల గుర్తులు సగము మాత్రమే నేలపై కనిపించుచున్నవి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:05, 18/01/2021] +91 95058 13235: 18.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

కేశప్రసాధనం త్వత్ర కామిన్యాః కామినా కృతమ్|

తాని చూడయతా  కాంతాముపవిష్టమిహ ధ్రువమ్॥9463॥

ఈ ప్రదేశమునందు మన కృష్ణుడు ఆ తరుణిపై మరులుగొని, ఆమెను తన యొడిలో కూర్చుండబెట్టుకొని, చెదరియున్న ఆమె కేశములను సవరించి, కొప్పుపై పూలను అలంకరించినాడనుట నిశ్చయము. ఏలయన, అతడు ఇక్కడ కూర్చున్న గుర్తులు కనబడుచున్నవి.

30.35 (ముప్పది ఐదవ శ్లోకము)

రేమే తయా చాత్మరత ఆత్మారామోఽప్యఖండితః|

కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతామ్॥9464॥

శ్రీకృష్ణుడు ఆత్మారాముడు, పూర్ణకాముడు- (స్త్రీల విలాసచేష్టలకు చలించనివాడు). ఐనను విషయసుఖములను పొందుటకై ఆరాటపడుచుండెడి స్త్రీల పరవశత్వమును, దైన్యస్థితిని ప్రకటించుటకై ఆ ప్రభువు ఒక తరుణితో క్రీడించినట్లు లీలలను ప్రదర్శించెను.

30.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఇత్యేవం దర్శయంత్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః|

యాం గోపీమనయత్కృష్ణో విహాయాన్యాః స్త్రియో వనే॥9465॥

30.37 (ముప్పది ఏడవ శ్లోకము)

సా చ మేనే తదాఽఽత్మానం వరిష్ఠం సర్వయోషితామ్|

హిత్వా గోపీః కామయానా మామసౌ భజతే ప్రియః॥9466॥

ఈ విధముగా ఆ గోపికలు శ్రీకృష్ణుని పాదముద్రలను చూపించుచు, వివేకమును కోల్పోయి ఉన్మత్తలవలె  అటునిటు తిరుగసాగిరి. ఇంతవఱకును వనమునందు ఇతర గోపికలను అందఱిని విడిచిపెట్టి, శ్రీకృష్ణుడు ఏ గోపికను చేరదీసినాడో, ఆమె తనను గూర్చి ఇట్లనుకొనెను - 'గోపికలందఱిలో నేనే శ్రేష్ఠురాలను, ఆ ప్రభువునకు ప్రీతిపాత్రురాలను. అందువలననే  ఆ స్వామి తనపై మరులుగొన్న గోపికలను విడనాడి, నన్నే ఆదరించుచున్నాడు'.

30.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్|

న పారయేఽహం చలితుం నయ మాం యత్ర తే మనః॥9467॥

ఆ విధముగా గర్వితయై స్వోత్కర్షతోనున్న గోపిక కొంతదూరము వెళ్ళిన పిమ్మట శ్రీకృష్ణునితో 'స్వామీ! సుతిమెత్తని నా పాదములు మిగుల కందిపోయినవి. ఇంక నేను ఒక్క అడుగుకూడ వేయజాలకున్నాను. కనుక, నీవు నన్ను నీ ఇష్టము వచ్చినచోటికి తీసికొనిపొమ్ము' అని యనెను.

30.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఏవముక్తః ప్రియామాహ స్కంధ ఆరుహ్యతామితి|

తతశ్చాంతర్దధే కృష్ణః సా వధూరన్వతప్యత॥9468॥

ఆ గోపిక ఇట్లు పలికిన పిదప శ్రీకృష్ణుడు ఆమెతో 'ప్రియా! అట్లైనచో నా భుజములపై కూర్చుండుము' అని వచించెను. ఆ మాటలకు పొంగిపోయిన ఆ గోపిక ఆయన భుజములపై చేరుటకు సన్నద్ధురాలగు చుండగానే ఆ ప్రభువు అంతర్ధానమయ్యెను. అంతట గోపవనిత ఏడ్చుచు మిక్కిలి పశ్చాత్తాపపడెను.

30.40 (నలుబదియవ శ్లోకము)

హా నాథ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజ|

దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిమ్॥9469॥

"నాథా! ప్రియతమా! నీ దర్శనము, భాషణము నాకు ఆనందదాయకము. నీవు మిగుల భుజబలశాలివి. సఖుడా! నీవు ఎక్కడ ఉన్నావు? నేను దీనురాలను, నీ దాసిని. నీ దర్శనమును అనుగ్రహించి, నీ సన్నిధిని ప్రసాదింపుము".

30.41 (నలుబది ఒకటవ శ్లోకము)

అన్విచ్ఛంత్యో భగవతో మార్గం గోప్యోఽవిదూరితః|

దదృశుః ప్రియవిశ్లేషమోహితాం దుఃఖితాం సఖీమ్॥9470॥

30.42 (నలుబది రెండవ శ్లోకము)

తయా కథితమాకర్ణ్య మానప్రాప్తిం చ మాధవాత్|

అవమానం చ దౌరాత్మ్యాద్విస్మయం పరమం యయుః॥9471॥

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని చరణ చిహ్నములను బట్టి ఆ స్వామి కొఱకై అన్వేషించుచున్న గోపికలు ప్రియుని ఎడబాటు కారణముగా విహ్వలయై దుఃఖించుచున్న తమ సఖిని తమకు చేరువలోనే యుండుట గమనించిరి. క్రమముగా ఆ గోపిక విహ్వల స్థితినుండి తేరుకొనిన పిమ్మట మాధవుడు తనను ఆదరముతో చేరదీసి సంతోషపెట్టిన సంగతిని, తన అహంకార కారణమున ఆ ప్రభువు  అంతర్ధానమైన విషయమును ఆ గోపికలకు తెలిపెను. ఆమె మాటలను వినినంతనే వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

30.43 (నలుబది మూడవ శ్లోకము)

తతోఽవిశన్ వనం చంద్రజ్యోత్స్నా యావద్విభావ్యతే|

తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతుః స్త్రియః॥9472॥

అనంతరము ఆ సఖితోగూడి వారు వనమున వెన్నెల ప్రసరించు చున్నంతవఱకును శ్రీకృష్ణునికొఱకై వెదకిరి. క్రమముగా వెన్నెల కనుమరుగై చీకట్లు వ్యాపించుట గమనించి ఆ వనితలు అచటి నుండి వెనుదిరిగిరి.

30.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః|

తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుః॥9473॥

వారు కృష్ణుని నుండి తమ ధ్యాసను మళ్ళింపలేక ఆయన విషయమునే ప్రస్తావించుకొనుచు ఆ స్వామిలో తాదాత్మ్యము చెంది, ఆయన లీలలను, గుణవైభవములను కీర్తింపసాగిరి. ఆ స్థితిలో వారికి తమ దేహములపైగాని, గృహములపైగాని ఏమాత్రమూ ధ్యాసలేకుండెను.

30.45 (నలుబది ఐదవ శ్లోకము)

పునః పులినమాగత్య కాలింద్యాః కృష్ణభావనాః|

సమవేతా జగుః కృష్ణం తదాగమనకాంక్షితాః॥9474॥

తమ మనస్సులన్నియును కృష్ణభావనలతో నిండియుండుటవలన ఆ గోపికలు కాళిందీనదీతీరమున గల ఇసుక తిన్నెలపై చేరిరి. ఆ స్వామి రాకకై వేయికండ్లతో ఎదురుచూచుచు, వారు అందఱును గలసి, ఆ ప్రభువుయొక్క విశిష్టగుణములను గానము చేయసాగిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే త్రింశోఽధ్యాయః (30)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ముప్పదియవ అధ్యాయము (30)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:49, 19/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

789వ నామ మంత్రము 19.01.2021

ఓం నిస్త్రైగుణ్యాయై నమః

సత్వరజస్తమోగుణములకు (త్రిగుణములకు)  కారణమైయుండియు, త్రిగుణ రహితయైన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిస్త్రైగుణ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిస్త్రైగుణ్యాయై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు త్రిగుణరహితమైన ఆ పరమేశ్వరి కరుణచే ఐహికముగా అన్నవస్త్రములకు, సిరిసంపదలకు, కీర్తిప్రతిష్టలకు లోటులేకుండా అనుగ్రహిస్తూ, జ్ఞానసాధనవైపు మనసును నడిపించి నిత్యము,సత్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని తెలిసికొనే శక్తిని అనుగ్రహించును.

త్రిగుణములు అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తమోగుణం, రజో గుణం, సత్వ గుణం.    

రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి. సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి.

సృష్టియంతయు ఈ మూడుగుణముల సమ్మేళనమే. ప్రకృతి అంటే త్రిగుణాత్మకము. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత సృష్టిస్థితిలయకారిణి. అనగా త్రిగుణములకు కారణం తానే. కాని అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి గనుక ఈ మూడుగుణములు ఆ తల్లిని అంటవు. గనక పరమేశ్వరి నిస్త్రైగుణ్యా యని అనబడినది.

తామరాకు నీటిలో ఉంటుంది. తామరాకుపై నీటిబొట్టు ఆ నీటితో సంబంధంలేకుండా ఉంటుంది. 

సర్వసంగపరిత్యాగి అన్నీ వదలి కేవలం పరమాత్మ దర్శనంకోసమే సాధన చేయడం జరుగుతుంది.

సంసారికూడా సంసారంలో ఉంటూ, తనకు సంసారం అంటకుండా పరమాత్మను దర్శించుకోవచ్చు. దీనికి కొంతసాధన అవసరం. ఆ సాధనే అంతర్ముఖసాధన (అంతర్ముఖసమారాధ్యా) ద్వారా పరమేశ్వరి అనుగ్రహం పొందడం. 

భగవద్గీత 2-45

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥

 "ఓ అర్జునా ! వేదాలు త్రైగుణ్యవిషయాలను గురించే చెపుతున్నాయి ; నువ్వు త్రిగుణాతీతుడవుకమ్ము. ద్వంద్వాలనూ, యోగక్షేమాలనూ విడిచి సదా శుద్ధసత్వాన్ని అవలంబించి, ఆత్మజ్ఞానివి కావాలి; ఆత్మతత్త్వంలోనే స్థిరపడు". అని శ్రీకృష్ణ భగవానుడు అన్నారు

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. శుద్ధసత్త్వస్వరూపురాలు. ఆత్మజ్ఞాని. గనుక నిస్త్రైగుణ్యా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిస్త్రైగుణ్యాయై నమః యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:49, 19/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

215వ నామ మంత్రము 19.01.2021

ఓం మహామాయాయై నమః 

బ్రహ్మోపేంద్రాది దేవతలను సైతం మాయామోహితులను కావించగల పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహామాయా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహామాయాయై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు మాయామయమైన ఈ జగత్తులో పరబ్రహ్మమాత్రమే సత్యమనునది తెలిసికొని ఆ దిశగా తమ సాధనను  కొనసాగించగల దీక్షాదక్షతను ఆ పరమేశ్వరి అనుగ్రహించును.

 బ్రహ్మాది దేవతలను సైతం  మాయలో పడవేయగలదు పరమేశ్వరి.

జ్ఞానినా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా|

బలా దాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి॥ (సౌభాగ్యభాస్కరం, 391వ పుట)స

జీవుడు గర్భములో ఉన్నప్పుడు జ్ఞానముతోనే ఉండును. నవమాసములు నిండి గర్భమునుండి బయటకు వచ్చినతోడనే జ్ఞాని కాస్తా అజ్ఞాని యగును. దానికి కారణము ప్రసూతివాయువుచే మాసములు నిండిన పిదప బయటకు పంపబడతాడు.  ఆ ప్రసూతి వాయువుచే మాయకప్పబడి జీవుడు జ్ఞానంకోల్పోతాడు. ఇదే పరమాత్మ యొక్కమాయ. తదనంతరము పూర్వజన్మల కర్మలను బట్టి యోగ్యతలు ఏర్పడుతాయి. యోగ్యతననుసరించే తిండి, బట్ట, అరిషడ్వర్గములు అన్నీ పెరిగే క్రమంలో ఒకదాని వెంబడి ఒకటి చేరుతాయి. ఇదంతయు మాయాప్రభావమే. ఈ మాయ యొక్క స్థాయి ఆ జీవి పూర్వజన్మల కర్మఫలాలను అనుసరించి ఉంటుంది. ఇది యంతయు సృష్టిస్థితిలయకారిణియైన పరమేశ్వరి యొక్క మహామాయాతత్త్వం చేత జరుగుతుంది. సృష్టి మొత్తం మాయాకు లోబడునదే. 

జీవాత్మ ఎక్కడ ఉన్నదో అక్కడే పరమాత్మ ఉండడం జరుగుతుంది.  కాని జీవాత్మకు, పరమాత్మకు మధ్య మాయ అనేది ఉంటుంది. ఇది ఒకతెర వంటిది. ఈ మాయ అను తెరను తొలగించుకొనే పని జీవుడిదే. అది ఆ జీవుని పూర్వజన్మకర్మలు, ప్రస్తుతజన్మ సాంగత్యప్రభావము. పూర్వజన్మకర్మల ఫలం అనుకూలమైనది అయితే లభించే సాంగత్యం మంచిది అవుతుంది. అప్ఫుడు సాధన తోడవుతుంది. మాయ అనే తెర తొలగించగలగడం  జరుగుతుంది. పరమాత్మదర్శనం పొందడం సంభవిస్తుంది. 

విద్యా (జ్ఞాన) సంబంధమైనది, అవిద్యా (అజ్ఞాన) సంబంధమైనది అని మాయలో వైవిధ్యముగలదు. విద్యా సంబంధమైన మాయ అయితే ఆలోచించగలిగే వివేకము, వైరాగ్యము అనే రెండిటిలో వివేకము భగవధ్యానము, సత్కర్మలనాచరించడం, కర్మఫలాన్ని మెరుగు పరచుకోవడం జరుగుతుంది. వైరాగ్యము అనుననిది అయితే పునర్జన్మ రాహిత్యమైన మోక్షసాధన దిశగా సాధన సాగుతుంది. ఈ దశలో సర్వసంగ పరిత్యాగిగా కొనసాగుతాడు సాధకుడు. 

అవిద్యా సంబంధమైన మాయ అయితే కామక్రోధలోభాది అరిషడ్వర్గములకు బానిసగా జీవించుచూ, నేను, నాది, నా శరీరము అనే భావనలు, కర్మఫలాలు మరింత చెడ్డవిగా అయిపోతాయి. అకృత్యాలు, రాక్షసప్రవర్తన, అనృతములు పలకడం, అనాచారములు పాటించడం జరిగి మళ్ళీ జన్మలో పిల్లిగానో, బల్లిగానో లేదా అంతకన్నా ఘోరమైన క్రిమిగానో పుట్టడం జరుగుతుంది. పునరపి జననం, పునరపిమరణం అనే జననమరణపరిభ్రమణ వలయంలో  చిక్కుకోవడం జరిగిపోతుంది. 

శ్రీమాత మహామాయ. జ్ఞానుల మనస్సులను కూడా బలాత్కారముగా ఆకర్షించి మోహము (అజ్ఞానము) లో పడవేయును. ఆ మహామాయను అధిగమించాలంటే ఆ పరమేశ్వరినే శరణువేడుకోవాలి

కావున ఈ లలితా సహస్రనామ పారాయణయే విద్యామాయకు లోనవుతున్నారు అని అర్థం. ఈ మాయ  భక్తులను పరమేశ్వరీ ఆరాధనవైపు మనసును పయనింపజేయడం జరుగుతుంది. ఇందులో కొనసాగడం వివేకసంబంధిత మాయ అవుతుంది. కర్మఫలాలను మెరుగుపరచుకుంటూ సాధనలో కొనసాగుతూ, జన్మరాహిత్యమైన మోక్షసాధనను కూడా పొందవచ్చు.  

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహామాయాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:49, 19/01/2021] +91 95058 13235: 19.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గోప్య ఊచుః

31.1 (ప్రథమ శ్లోకము)

జయతి తేఽధికం జన్మనా వ్రజః  శ్రయత ఇందిరా శశ్వదత్ర హి|

దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే॥9475॥

గోపికలు ఇట్లు నుడివిరి "ప్రియతమా! కృష్ణా! నాథా! నీవు ఇచట అవతరించుటవలన ఈ వ్రజభూమి ఆ వైకుంఠముకంటెను ఎంతయు ప్రాభవమును సంతరించుకొనుచున్నది. శ్రీహరికి నిత్యానపాయినియైన లక్ష్మీదేవియు ఆ పరంధామమును వీడి ఇచట నివసించుచున్నది. అనగా ఈ బృందావనము పుష్కలమైన పాడిపంటలతో వర్ధిల్లుచున్నది. నీ వారమైన మేము నీ యందే ప్రాణములను నిలుపుకొని, నీ కొఱకై నలు దిక్కుల యందును వెదకుచున్నాము. కావున మాయెడ కనికరము చూపుచు మాకు నీ దర్శనమును అనుగ్రహింపుము.

31.2 (రెండవ శ్లోకము)

శరదుదాశయే సాధుజాతసత్సరసిజోదర శ్రీముషా దృశా|

సురతనాథ తేఽశుల్కదాసికా  వరద నిఘ్నతో నేహ కిం వధః॥9476॥

నిరంతరము ఆనందదాయుడవైన ఓ స్వామీ! మేము నీకు మూల్యములేని దాసీలము. నీ దివ్య నేత్రములు శరత్కాలమున సరస్సులలో బాగుగా వికసించిన కమలముల యందలి కర్ణికారముల (దుద్దుల) యొక్క అందచందాలను ధిక్కరించుచున్నవి. మనోజ్ఞములైన నీ చూపులతో మా ప్రాణములను హరించి యుంటివి. ఇది మమ్ము వధించుట కాదా? అస్త్రములతో వధించుటయే వధయగునా?

31.3 (మూడవ శ్లోకము)

విషజలాప్యయాద్వ్యాలరాక్షసద్వర్షమారుతాద్వైద్యుతానలాత్|

వృషమయాత్మజాద్విశ్వతోభయాదృషభ తే వయం రక్షితా ముహుః॥9477॥

పురుషోత్తమా! కాళీయుని వలన కలుషితములైన యమునానదీ విషజలములనుండియు, కొండచిలువ రూపములో వచ్చిన అఘాసురుని నుండియు మమ్ములను కాపాడితివి. ఇంద్రుని ప్రేరణతో ఉప్పతిల్లిన జడివానలవలసను, సుడిగాలులవలనను, అశనిపాతము వలనను సంభవించిన పెనుప్రమాదముల నుండియు, అట్లే దావానలము నుండియు మమ్ము రక్షించితివి. వృషభాసురుని నుండియు, మయుని కుమారుడైన వ్యోమాసురుని నుండియు, అట్లే ఎదురైన పలు విపత్తులనుండియు పదే పదే మమ్ములను ఆదుకొనుచు వచ్చితివి. ఇంతవఱకును మాకు ఆపద్భాందవుడవై నిలిచిన నీవు ఇప్పుడు నీ చూపులతో మమ్ము ఎందులకు బాధించుచున్నావు?

31.4 (నాలుగవ శ్లోకము)

న ఖలు గోపికానందనో  భవానఖిలదేహినామంతరాత్మదృక్|

విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే॥9478॥

సకలలోక పూజ్యుడవైన కృష్ణా! నీవు కేవలము యశోదాసుతుడవు మాత్రమేగాదు, సకలప్రాణుల హృదయములయందును అంతర్యామివై యుండి, సర్వసాక్షివై అలరారుచుందువు. సఖా! బ్రహ్మదేవుని అభ్యర్థనపై సమస్త జగత్తును రక్షించుటకు యదువంశమున అవతరించిన మహాత్ముడవు.

31.5 (ఐదవ శ్లోకము)

విరచితాభయం వృష్ణిధుర్య తే  చరణమీయుషాం సంసృతేర్భయాత్|

కరసరోరుహం కాంత కామదం  శిరసి ధేహి నః శ్రీకరగ్రహమ్॥9479॥

వృష్ణివంశోద్ధారకా! జననమరణరూప సంసార చక్రమునబడి భీతిల్లుచున్న జనులు  నీ చరణకమలములను ఆశ్రయింతురు. వారిని నీ అనుగ్రహవీక్షణములతో అభయమిచ్చి ఆదుకొనుచుందువు. జగన్నాథా! లక్ష్మీదేవిని చేపట్టిన దివ్యహస్తము నీది. ఆ అమృతహస్తము సకల జనుల మనోరథములను ఈడేర్చునట్టిది. అట్టి చల్లని నీ కరకమలమును మా శిరములపై నుంచి, మమ్ము అనుగ్రహింపుము.

 31.6  (ఆరవ శ్లోకము)

వ్రజజనార్తిహన్ వీరయోషితాం  నిజజనస్మయధ్వంసనస్మిత|

భజ సఖే భవత్కింకరీః స్మ నో  జలరుహాననం చారు దర్శయ॥9480॥

సఖా! నీవు వ్రజవాసుల ఆర్తిని నివారించునట్టి వీరశిరోమణివి. నీ దరహాసముతో నీ ఆత్మీయుల గర్వమును రూపు మాపుచు నీ మహత్త్వమును గ్రహించునట్లు చేయుచుందువు. స్వామీ! మేము నిన్నే ఆశ్రయించుకొనియున్న నీ దాసీలముగదా! అబలలమైన మాకు నీ సుందర ముఖారవిందమును దర్శింపజేసి మమ్ము ఆనందింపజేయుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:13, 19/01/2021] +91 95058 13235: 19.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

31.7 (ఏడవ శ్లోకము)

ప్రణతదేహినాం పాపకర్శనం  తృణచరానుగం శ్రీనికేతనమ్|

ఫణిఫణార్పితం తే పదాంబుజం  కృణు కుచేషు నః కృంధి హృచ్ఛయమ్॥9481॥

పరమపురుషా! నీ పాదాబ్జములు నిన్ను శరణుజొచ్చిన వారి పాపములను హరించివేయుచుండును. అవి శుభములకును పెన్నిధులు. లక్ష్మీదేవియే స్వయముగా వాటిని సేవించుచుండును. ఆ దివ్యపాదములతో నీవు అనుగమించుచుండుటతో గోవులు తృణములను మేయుచున్నను అమృతక్షీరములను ప్రసాదించుచుండును. కాళియుని పడగలపై నాట్యమాడిన నీ పవిత్రపాదములను మా వక్షస్థలములయందుంచి, మా హృదయతాపములను చల్లార్చుము.

 31.8 (ఎనిమిదవ శ్లోకము)

మధురయా గిరా వల్గువాక్యయాబుధమనోజ్ఞయా పుష్కరేక్షణ|

విధికరీరిమా వీర ముహ్యతీరధరసీధునాఽఽప్యాయయస్వ నః॥9482॥

కమలాక్షా! నీ పలుకులలోని ప్రతిపదము, ప్రతిశబ్దము, ప్రత్యక్షరము మధురాతి మధురము నీ తీయని వాక్కులలోని పరమార్థములను గ్రహించిన పండితులు పరవశించిపోవుచుందురు. నీ దాసీలమైన మేము ఆ స్వాదువచనములకు మోహములో మునిగిపోవు చుందుము. ప్రభూ! నీ అధరామృతమును మాచే ఆస్వాదింపజేసి, మా ప్రాణములను నిలుపుము.

 31.9 (తొమ్మిదవ శ్లోకము)

తవ కథామృతం తప్తజీవనం  కవిభిరీడితం కల్మషాపహమ్|

శ్రవణమంగలం శ్రీమదాతతం భువిగృణంతి తే భూరిదా జనాః॥9483॥ 

స్వామీ! నీ లీలాకథలు అమృతమయములు, తాపత్రయమగ్నులై  దిక్కుతోచక యున్నవారిని ఉద్ధరించునట్టివి. అవి బ్రహ్మాది దేవతలచే నిత్యము స్తుతింపబడుచుండును. నీ దివ్యగాథలను విన్నవారును, భజించినవారును, స్మరించినవారును సమస్త పాపముల నుండియు బయటపడుదురు. విన్నంత మాత్రముననే అవి శ్రేయస్సును ప్రసాదించుచుండును. అవి సకల కళ్యాణదాయకములు. మిక్కిలి సుందరము మరియు విస్తృతము అగు నీ కథామృతమును ఈ లోకములో వర్ణించువారలే, గొప్ప దాతలు (జ్లానదానము కంటే గొప్పదానము లేదు).

 31.10 (పదియవ శ్లోకము)

ప్రహసితం ప్రియప్రేమవీక్షణం  విహరణం చ తే ధ్యానమంగలమ్|

రహసి సంవిదో యా హృదిస్పృశః కుహక నో మనః క్షోభయంతి హి॥9484॥

ప్రియా! ఇదివఱలో నీ మధురదరహాసములును, ప్రేమపూరితములైన నీ చూపులును, క్రీడావిహారములును ధ్యానించినంత మాత్రమునే మమ్ములను ఆనందమున ముంచెత్తుచు శుభములను చేకూర్చుచుండెడివి. ఏకాంతమున వినోదవచనములతో నీవు మా హృదయములను దోచుకొనెడివాడవు. నయవంచకా! ఇప్పటికి నీ తీరుతెన్నులు వాటికి వ్యతిరేకముగా నున్నవి. అందువలన వాటిని స్మరించినంత మాత్రముసనే అవి మా మనస్సులను క్షోభకు గుఱిచేయుచున్నవి.

 31.11 (పదకొండవ శ్లోకము)

చలసి యద్వ్రజాచ్చారయన్ పశూన్ నలినసుందరం నాథ తే పదమ్|

శిలతృణాంకురైః సీదతీతి నః  కలిలతాం మనః కాంత గచ్ఛతి॥9485॥

నాథా! నీ చరణములు కుసుమ కోమలములు. పరమసుందరములు. నీవు గోవులను తోలుకొనుచు వ్రజభూమినుండి వెళ్ళునపుడు దారిలోగల కంకరరాళ్ళు, మొనదేలియుండెడి తృణములు, కుశలు గ్రుచ్చుకొని, నీ సుతిమెత్తని పాదములు ఎక్కడ కందిపోవునో యని మా మనస్సులు మిక్కిలి వ్యాకులపడు చుండును. అందువలన అట్టి మమ్ము నీవు వంచింపజాలవు.

 31.12 (పండ్రెండవ శ్లోకము)

దినపరిక్షయే నీలకుంతలైర్వనరుహాననం బిభ్రదావృతమ్|

ఘనరజస్వలం దర్శయన్ ముహుర్మనసి నః స్మరం వీర యచ్ఛసి9486॥

ఓ వీరుడా! సాయంకాలము నీవు వచ్చుచున్నప్పుడు పద్మమువంటి నీ  ముఖము రేగినజుట్టుతో కప్పబడి దట్టమైన గోధూళితో పులిమియుండును. అట్టి నీ ముఖమును మాకు పలుమార్లు చూపించి, మా మనస్సులయందు ప్రేమానురాగములను కలిగించుచున్నావు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:33, 20/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

790వ నామ మంత్రము 20.01.2021

ఓం పరాపరాయై నమః

పరబ్రహ్మతత్త్వాన్ని తెలిసికోవడానికి, మోక్షసాధనకు సంబంధించిన పరావిద్య, ఐహిక భోగములకు సంబంధించినది అపరావిద్య. తననాశ్రయించిన భక్తులకు ఏది కావాలంటే అదే ప్రసాదించి పరాపరస్వరూపిణి యైన  జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాపరా యను నాలుగక్షరముల (చతురక్షరీ)  నామ  మంత్రమును ఓం పరాపరాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఐహికమైనవి, ఆముష్మిక సంబంధమైనవి కూడా వారి వారి అర్హతలననుసరించి అనుగ్రహించును.

జగన్మాత పర, అపర అను ఈ రెండు శబ్దములను సంధిచేసిన పరాపరా అనగా పరా యను శబ్దము ఆధ్యాత్మికతత్త్వమునకు, భగవంతునిపై ధ్యాసవైపు మనసును మరల్చి కర్మఫలములను   మెరుగుపరచుకోవడానికి చేయు ప్రయత్నమే పరా శబ్దమునకు సంబంధించినది. అపరా అనగా  ఇహలోక బంధములలో కొట్టుమిట్టాడు జీవుడు తనకు, తనవాళ్ళకు కావలసిన సుఖసంతోషములు, తాత్కాలికమైన ఐహికసంబంధమైన కోర్కెలు నెరవేర్చుకొను దిశగా చేయు ప్రయత్నములో పరమేశ్వరిని ఆరాధించుట. జగన్మాత ఈ రెండిటికి కూడా పలుకుతుంది. సాధకుని సాధనా పటిమను అంచనా వేస్తుంది. ధర్మబద్ధతను పరిశీలిస్తుంది. అందుకు తగినవిధంగా అనుగ్రహిస్తుంది. అందుకే పరమేశ్వరి పరాపరా యని అనబడినది.

శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.

వేదవిద్య, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము నిరుక్తము ఇవి అన్నీ అపర విద్యయందురు ఈ విద్యలు వృత్తిపరంగా ఉపయోగించుకుని, ధనార్జనకు,  సంఘంలో కీర్తిప్రతిష్టలకు ఉపయోగపడి సంసారసుఖముల నుభవించడానికి ఉపయోగపడుతాయి. ఐహికంగా ఉన్నతస్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంఠే అపరవిద్య ఐహిక సంభంనంధమైన  సుఖసంతోషాలు పొందదగినదే.

పరావిద్య వలన పరమాత్మను తెలుసుకోవడానికి, బ్రహ్మలోక ప్రాప్తికి, మోక్షసిద్ధికి ఉపయోగపడుతుంది. పరావిద్య సాధించాలంటే లౌకిక బంధాలకు డూరంగా ఉందాలి. లైకిక లంపటమలున్నవారికి సాధసకష్టమే. ఈ సాధనకు మార్గము ముక్తిమార్గము. అకుంఠితమైన దీక్షకావాలి. మధ్యలో ఏర్పడే అవరోధాలను అధిగమించాలి.పరమాత్మను దర్శించాలంటే చర్మచక్షులు పనికిరావు. మనోనేత్రాలు మాత్రమే ఉపయోగిస్తాయి.ఇంద్రియాలకు. ఆత్మ సర్వవ్యాపకమైనది అనే భావన కలగించేది పరావిద్య. ఈ మాభావమే బ్రహ్నజ్లాసం.

పరమాత్మను ఆరాధిస్తూ సాష్థాంగపడి అమ్మా నా కుమార్తెకు కళ్యాణయోగం ప్రసాదించుతల్లి, ఉద్యోగంలో ఉన్నస్థితిని కలుగు నట్లు అనుగ్రహించు తల్లి, ఋణబాధలు తీరి ఆర్ధికాభివృధ్ధిని కలిగించుతల్లీ - ఇటువంటికోరికలు అపరవిద్యకు సంబంధింఛినవి.

అమ్మా నీపాదసేవ చేసుకుంటున్నాను. శరీరంలో శక్తియున్నంత వరకూ నిన్నే ఆరాధిస్తాను. ఐహికముగా నాకేవీ కోరికలు లేవు. ఎవరి చేతసేవలు చేయించుకోకుండా అనాయాస మరణము ప్రసాదించి, పునర్జన్మరాహిత్యమైన మోక్షమును ప్రసాదించుతల్లీ. ఇవి పరావిద్యకు సంబంధించినవి.

జగన్మాతకు నమస్కరించునపుదు ఓం పరాపరాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:33, 20/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

216వ నామ మంత్రము 20.01.2021

ఓం మహాసత్త్వాయై నమః

చరాచర జగత్తు పాలించుటకు కావలసిన శక్తి, పరిపాలన దక్షతకు కావలసిన గుణసంపత్తి, చరాచర జగత్తునందు వస్తువులన్నిటియందు   అంతర్లీనంగా ఉనికిని చాటగలిగే మహనీయత గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాసత్త్వా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాసత్త్వాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కారుణ్యమూర్తిని ఆరాధనచేయు భక్తులకు ఆ తల్లి సదా వారి వెంటనే ఉండి శత్రుభయము, దుష్టగ్రహపీడ వంటి ప్రతికూలతలునుండి కాపాడుతూ, తలపెట్టిన ధర్మబద్ధమైన, సత్కార్యములను నిర్విఘ్నముగా కొనసాగింపజేయును.

అత్యంత భక్తిశ్రద్ధలతో తననారాధించు భక్తుల వెంటే తానుంటూ, తన యునికి వారికి మంగళప్రదమగునదిగా కనికరించు మహా మహిమాన్వితమూర్తి గనుకనే జగన్మాత మహాసత్త్వా యని అనిపించుకొనుచున్నది. 

సత్త్వము అంటే బలము, స్వభావము, ద్రవ్రము, గుణము, పిశాచాది ప్రాణి అను అర్థములు గలవు.

సృష్టిస్థితిలయలకు కారణభూతురాలు జగన్మాత. జీవులయొక్క కర్మఫలానుసారం తదుపరి జన్మలు నిర్ణయించేది జగన్మాతయే. లోక కంటకులైన రాక్షసులు సజ్జనులను హింసలు పెట్టు తరుణంలో, అట్టి రాక్షసులను నాశనము చేయుటకనుగుణముగా  అవతరించి రాక్షసపీడను లేకుండా చేయు శక్తిగలిగనిది గనుకనే మహాసత్త్వా యని అనబడినది.

నిరక్షర కుక్షియైన కాళిదాసును ఒక అద్భుతమైన కవిగా మార్చి శ్యామలాదండకం, దేవిస్తోత్రములు వంటివి  ఎన్నియో సృజింజేసి వాటిని తమ అనుష్ఠానములో వినియోగించు దేవీ భక్తులననుగ్రహించినది. అంతకు మించి అమాయకంగా అతనిని వివాహమాడిన రాజకుమార్తె సౌభాగ్యాన్ని అత్యంత మంగళకరమొనర్చినది. 

ఆ తల్లి  త్రిగుణాత్మిక, గుణాతీక కూడా.  త్రిగుణాత్మికమైన జగత్తును సృష్టించి గుణాతీతయై జీవులకు కావలసినవి సమకూర్చినది. 

సూర్యచంద్రులు వారి గమనములను నియంత్రించుచు జగత్తుకు వైపరీత్యముల కంటకము  లేకుండ చేసినది. నవగ్రహములు జీవులనావహించునపుడు, జీవులకర్మఫలములకనుగుణముగా నవగ్రహముల స్థానములు నిర్దేశించినది.

ఋతుధర్మములు, కాలధర్మములు,  జీవధర్మములు, పురుషార్థముల నిర్వహణ అన్నియు తన కనుసన్నలలోనే జరుగునట్లు చేసినది.

సృష్టిస్థితిలయకార్యనిర్వహణ బ్రహ్మవిష్ణుమహేశ్వరులదైనను సృష్టిస్థితిలయలకు తానే కారణమైనది.

తన ఉనికిని, తన బలమును, తన గుణములను జగత్పరిపాలనానిర్వహణలో తగిన విధంగా వినియోగించింది గనుకనే జగత్తు విపరీతములు లేక, ధర్మసంస్థాపన కుంటుబడక, జీవులను వారి కర్మఫలములకనుగుణంగా ప్రవర్పింపజేయుచూ విశ్వకార్యములను చక్కబెట్!నది గనుకనే ఆ తల్లి మహాసత్త్వా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాసత్త్వాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:33, 20/01/2021] +91 95058 13235: 20.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

31.13 (పదమూడవ శ్లోకము)

ప్రణతకామదం పద్మజార్చితం  ధరణిమండనం ధ్యేయమాపది|

చరణపంకజం శంతమం చ తే  రమణ నః స్తనేష్వర్పయాధిహన్॥9487॥

మనోహరా! నీ పాదపద్మములు ప్రణమిల్లినవారియొక్క అభీష్టములను నెఱవేర్చుచుండును. లక్ష్మీదేవిచే అవి నిరంతరము సేవింపబడుచుండును. సమస్త భూమండలమునకును అవి అలంకారములు. ఆపన్నులకు సర్వదా శరణ్యములు. భక్తిశ్రద్ధలతో సేవించినవారికి అవి పరమ సుఖావహములు. కనుక, అట్టి నీ దివ్యపాదములను మా హృదయములపై ఉంచి, తీవ్రమైన  మా మనస్తాపమును చల్లార్చుము.

31.14 (పదునాలుగవ శ్లోకము)

సురతవర్ధనం శోకనాశన స్వరితవేణునా సుష్ఠు చుంబితమ్|

ఇతరరాగవిస్మారణం నృణాం వితర వీర నస్తేఽధరామృతమ్॥9488॥

యదువీరా! నీ అధరామృతము ఎల్లరకును నీ సాంగత్యాభిలాషను వృద్ధచేయును. తాపత్రయ దుఃఖములను తొలగించును. మృదుమధురనాద సమయమున ఆ వేణువు నీ అధరామృతమును తనివిదీర గ్రోలుచుండును. దానిని ఆస్వాదించిన మానవాళికి సార్వభౌమాధికారములు మొదలగు  లౌకిక వాంఛలపై మనస్సే పోదు. కావున, పురుషోత్తమా! తీయని నీ అధరసుధలను దయతో మాకు ప్రసాదింపుము.

31.15 (పదునైదవ శ్లోకము)

అటతి యద్భవానహ్ని కాననం  త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్| .

కుటిలకుంతలం శ్రీముఖం చ తే  జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్॥9489॥

మోహనాకారా! పగటివేళ నీవు గోవులను మేపుచు వనమునందు ఉన్నప్పుడు మేము నీ శుభదర్శనమునకు నోచుకొనమైతిమి. నిన్ను దర్శింపజాలని ఆ సమయమున ప్రతి అఱక్షణముగూడ మాకు ఒక యుగముగా అనిపించుచుండును. ముంగురుల శోభలతో అందములను చిందించుచుండు నీ ముఖసౌందర్యమును సాయంసమయమునందు నీవు తిరిగి వచ్చుచున్నప్పుడైనను తనివిదీర చూచుటకై తహతహపడుచుండెడి మాకు కనుఱెప్పపాటులు అడ్డము వచ్చుచున్నవి. దానికి మేమే ఓర్చుకొనలేకున్నాము. మాకు ఈ ఱెప్పపాటులను గూర్చిన ఆ బ్రహ్మ ఎంతటి మూర్ఖుడోగదా!

31.16 (పదహారవ శ్లోకము)

పతిసుతాన్వయభ్రాతృబాంధవానతివిలంఘ్య తేఽన్త్యచ్యుతాగతాః|

గతివిదస్తవోద్గీతమోహితాః  కితవ యోషితః కస్త్యజేన్నిశి॥9490॥

ఓ అచ్యుతా! మేము మా పతులను, సుతులను, సోదరులను, బంధువులను, మా వంశమువారిని అందఱిని త్యజించి, వారి ఆజ్ఞలను ధిక్కరించి, నీ సమీపమునకు వచ్చితిమి. నీ ప్రతి కదలికను మేము ఎఱుగుదుము (మేము వచ్చిస విషయముగూడ నీకు తెలియును). నీ మధురగానమును విని మేము పారవశ్యముతో ఇచటికి చేరితిమి. నయవంచకా! ఇట్టి రాత్రివేళ స్వయముగా వచ్చిన వనితలను నీవు తప్ప ఎవరు పరిత్యజించును? (ఎవరు పరిత్యజింపజాలరు).

31.17 (పదిహేడవ శ్లోకము)

రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణమ్|

బృహదురః శ్రియో వీక్ష్య ధామ తే ముహురతి స్పృహా ముహ్యతే మనః॥9491॥

ప్రియతమా! ఏకాంతమున నీవు సలుపుచుండెడి నర్మభాషణములు మా హృదయములయందు నీ కలయికయొక్క ఆకాంక్షను ఱెచ్చగొట్టుచుండెను. నీ ప్రసన్న ముఖమునకు శోభలనుగూర్చెడి నీ దరహాసమును, నీ క్రీగంటి చూపులను, లక్ష్మీదేవికి నివాసస్థానమైన నీ విశాల వక్షస్థలమును తిలకించి, పులకించి యుంటిమి. వాటిని గాంచినప్పటినుండియు నేటి వఱకును మా మనస్సులు నిన్ను పొందవలెనను కాంక్షతో మోహపరవశమగుచున్నవి.

31.18 (పదునెనిమిదవ శ్లోకము)

వ్రజవనౌకసాం వ్యక్తిరంగ తే  వృజినహంత్ర్యలం విశ్వమంగలమ్|

త్యజ మనాక్ చ నస్త్వత్స్పృహాత్మనాం  స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్ ॥9492॥

ఓ ప్రియతమా! నీ అవతారము గోకులవాసుల దుఃఖములను పూర్తిగా తొలగించునట్టిది. లోకకళ్యాణదాయక మైనది. మాహృదయములలో నీపైగల అనురాగము మెండైనది. నీవారమైన మా అందరి హృదయతాపములను తీర్చగలిగిన దివ్యౌషధమును కొంచమైననూ మా కొరకు దయచేయుము. అనగా నీ దర్శనమును ప్రసాదించి మా హృదయరోగమును నిర్మూలించుము.

31.19 (పందొమ్మిదవ శ్లోకము)

యత్తే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాః శనైః ప్రియ దధీమహి కర్కశేషు|

తేనాటవీమటసి తద్వ్యథతే న కింస్విత్కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః॥9493॥

ఓ ప్రియా! కృష్ణా! సుకుమారమైన నీ పాదపద్మములను, కఠినములైన మా వక్షస్థలములపై చేర్చినప్పుడు అవి ఎక్కడ కందిపోవునేమోయని భీతిల్లుచూ మెల్లగా ధరించెదము. అట్టి పాదములతో నీవు అడవిలో తిరుగుచున్నప్పుడు, మొనదేలిన రాళ్ళు గ్రుచ్చుకొని మెత్తని నీ పాదములకు నొప్పి కలుగుట లేదా అని, నీవే పంచప్రాణములుగా జీవించే మాకు నీగురుంచి ఆలోచించినప్పుడు మా మనస్సులు  మిగుల వ్యథ చెందుచున్నవి. మా జీవనసర్వస్వమూ నీవేసుమా!

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకత్రింశోఽధ్యాయః (31)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ముప్పది ఒకటవ అధ్యాయము (31)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:20, 20/01/2021] +91 95058 13235: 20.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము

శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

32.1 (ప్రథమ శ్లోకము)

ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా|

రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః॥9494॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! గోపికలు కృష్ణదర్శనమునకై ఇట్లు తహతహపడుచు ఆ స్వామియొక్క గుణలీలావైభవములను వివిధరీతులలో కీర్తించుచుండిరి. ఆయనకై పరితపించుచు, కరుణాపూరితమైన స్వరముతో వెక్కివెక్కి ఏడువసాగిరి.

32.2 (రెండవ శ్లోకము)

తాసామావిరభూచ్ఛౌరిః స్మయమానముఖాంబుజః|

పీతాంబరధరః స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః॥9495॥ 

దయాళువైన ఆ ప్రభువు ఆ సమయమున తన ముఖారవిందమునందు దరహాస శోభలను వెల్లివిరియ చేయుచు, వారి మధ్యలో ప్రత్యక్షమయ్యెను. పీతాంబరధారియైన ఆ మహాత్ముడు కంఠమున వనమాల కాంతులీనుచుండగా మన్మథునిగూడ పరవశింపజేయునట్టి అందచందాలతో అలరారు చుండెను.

32.3 (మూడవ శ్లోకము)

తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశోఽబలాః|

ఉత్తస్థుర్యుగపత్సర్వాస్తన్వః ప్రాణమివాగతమ్॥9496॥

తమకు అత్యంత ప్రియుడైన శ్రీకృష్ణుడు తమ కనుల యెదుట నిలిచినంతనే ఆ గోపికల ముఖములు సంతోషముతో వికాసమును పొందెను.అంతట ప్రాణములు తిరిగివచ్చినట్లుగా అవయవములు అన్నియును చైతన్యవంతములగుటతో వారు ఒక్కసారిగా లేచి నిలబడిరి. వారి కనులలో ఆనందము తొణికిసలాడెను.

32.4 (నాలుగవ శ్లోకము)

కాచిత్కరాంబుజం శౌరేర్జగృహేఽఞ్జలినా ముదా|

కాచిద్దధార తద్బాహుమంసే చందనరూషితమ్॥9497॥

అంతట ఒక గోపకాంత ఆ సంతోషములో శ్రీకృష్ణుని యొక్క కరకమలమును తన రెండు చేతులతో పట్టుకొని మురిసిపోయెను. మఱియొక గోపిక చందన పరిమళములతో ఒప్పుచున్న ఆ ప్రభువు బాహువును తన బుజమున చేర్చుకొని ఆనందించెను.

32.5 (ఐదవ శ్లోకము)

కాచిదంజలినాగృహ్ణాత్తన్వీ తాంబూలచర్వితమ్|

ఏకా తదంఘ్రికమలం సంతప్తా స్తనయోరధాత్॥9498॥

వేరొక గోపసుందరి ఆ మహాత్ముడు నమలచున్న తాంబూలమును తన దోసిలిలో తీసికొనెను. కృష్ణవిరహముతో నున్న ఇంకొక తరుణి ఆ పరమపురుషుని చల్లని పాదపద్మమును తన వక్షస్థలమున స్పృశించుచు తన తాపమును తీర్చుకొనెను.

32.6 (ఆరవ శ్లోకము)

ఏకా భ్రుకుటిమాబధ్య ప్రేమసంరంభవిహ్వలా|

ఘ్నంతీవైక్షత్కటాక్షేపైః సందష్టదశనచ్ఛదా॥9499॥

ప్రణయకోపములో విహ్వలయైయున్న మఱియొక భామిని బొమముడివైచి, దంతములతో తన అధరమును అదుముచు, చురుకైన చూపులతో ఆ స్వామిని కొట్టుచున్నదా యనునట్లు చూడసాగెను.

32.7 (ఏడవ శ్లోకము)

అపరానిమిషద్దృగ్భ్యాం జుషాణా తన్ముఖాంబుజమ్|

ఆపీతమపి నాతృప్యత్సంతస్తచ్చరణం యథా॥9500॥

భక్తులు శ్రీహరి చరణములను దర్శించుచు తృప్తిచెందనట్లు, వేరొక తరుణి ఱెప్పవాల్పక చూచుచు ఆ పరమపురుషుని ముఖారవింద మకరందమును ఎంతగా జుర్రుకొనుచున్నను ఆమె సంతృప్తి పడలేకుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:32, 21/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము్

791వ నామ మంత్రము  21.01.2011

ఓం సత్యజ్ఞానానంద రూపాయై నమః

భూతభవిష్యద్వర్తమాన కాలములకు అతీతమై, వృద్ధిక్షయాలు లేనిది, నిత్యమైనది అయిన పరబ్రహ్మస్వరూపమే తన స్వరూపముగా తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సత్యజ్ఞానానందరూపా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సత్యజ్ఞానానందరూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లలితాంబను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే సత్యము, జ్ఞానము, ఆనందము అను ఈ మూడు రూపముల సమిష్టిరూపమైన పరబ్రహ్మస్వరూపమును తెలియు మార్గాన్వేషణలో సఫలత సాధించుదిశగా ముందుకు సాగుదురు.

వేదాలలో 

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"

విజ్ఞాన మానందం బ్రహ్మ

సత్యము అనేది అక్షరము. భూతభవిష్యద్వర్తమానకాలములందు ఏవిధమైన మార్పులు చెందనిది.   అనశ్వరము అనగా నాశనము లేనిది. త్రికాలములందు మార్పులేని  సత్యమునకు నాశనము లేదు. ఎల్లప్పుడు సత్యమై,  సజీవమై ఉంటుంది.

పరమార్థమును పరిపూర్ణముగా తెలిసికొనుటయే జ్ఞానము. ఏవిధమైన లోటుపాట్లు, మార్పులు, చేర్పులు, అవసరంలేక, స్వయంప్రబోధకమై, స్వయంప్రచోదితమై, స్వయంప్రకాశ బుద్ధి వికాసమై ఉండేదే జ్ఞానము అని అనబడుతుంది. సత్యమై, నిత్యమై, జ్ఞానసమృద్ధమై యుండగా కలిగిన ఆనందమే 

 శాశ్వతమైనది,  ఇటువంటి ఆనందమేపరమోత్కృష్టమైనది. అటువంటి ఆనందానికి అవధులుండవు. ఈ ఆనందం పరమానందం. అదే బ్రహ్మానందం అని అంటారు. పరమోత్కృష్టమైన ఆనందాన్ని బ్రహ్మానందమనికూడా చెపుతారు. 

సృష్టికి ముందున్నది పరబ్రహ్మమొక్కటే. ఆ పరప్రహ్మము   స్వయంప్రకాశకము.సూర్యచంద్రులను కూడా ప్రకాశింపజేసినది. అగ్నిని కూడా జ్వలింపజేసినది. అన్నిజీవులయందు చైతన్యమై నిండినది. సంకల్పవికల్ప రహితమైనది. దీనినే సత్యము అని అంటారు. ఇదే జ్ఞానము, ఆనంద స్వరూపము అంటారు. ప్రేమస్వరూపం అనికూడా అంటారు.

ప్రియము అంటే తనవారిని చూసినప్పుడు కలిగేది ప్రియము. తనకు కావలసినది దొరికితే మోదము. కోరకమునుపే లభ్యమైతే  ప్రమోదము. ఈ ప్రియము, మోదము, ప్రమోదములకు అతీతమైనది ఆనందం. ఎల్లప్పుడు ఆనందపడేవాడు దేనినీ కోరడు. హెచ్చుతగ్గులైనా, సంతాపసంతోషములైనా ఒకటిగా భావించేవాడు ఆనందంతో ఉండుట జరుగుతుంది.ఈ ఆనందం మాటలలో చెప్పలేనిది. కేవలం అనుభవైకవేద్యము మాత్రమే. పరమేశ్వరి ఈ స్థితిలోనే ఉంటుంది గనుకు సత్యజ్ఞానానందరూపా యని అనబడుచున్నది.

అజ్ఞానులు గాఢాంధకారంలో ఉంటారు.  అంటే వారు తాత్కాలికానందానికి ఏవేవో కోరుతుంటారు. వాటివల్ల కోరికలు తీరవచ్చు. కాని తరువాత దుఃఖం తప్పదు. ఎందుకంటే ఆ ఆనందం శాశ్వతం కాదు గనుక.  శాశ్వతమైన  ఆనందంకావాలంటే కోరవలసింది కైవల్యము. అదే సాయుజ్యము. ఎవరైతే పరబ్రహ్మను తెలుసుకుంటారో వారు కూడా పరబ్రహ్మే. ఆ స్థితిలో పొందే అనందం బ్రహ్మానందం అనబడుతుంది.

జగన్మాత జీవకోటి పిపీలకంనుండి, బ్రహ్మపర్యంతం ప్రేమస్వరూపిణియై ఉంటుందిగనుకనే సత్యజ్ఞానానందరూపా యని అనబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు సత్యజ్ఞానానందరూపా యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:32, 21/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

217వ నామ మంత్రము  21.01.2021

ఓం మహాశక్త్యై నమః

సకలలోకములును నిర్వహింపగల అనేక విధములకు సామర్థ్యము గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాశక్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాశక్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో అమ్మవారిని ఆరాధించు భక్తజనులకు ఆ చల్లని తల్లి ఇష్టకామ్యములను సిద్ధింపజేస్తూ, పరమపదమునకు సోపానమార్గము  చేరుటకు ఉపాసనా శక్తినిగూడా కలుగజేయును.

జగన్మాత సకల విధములైన శక్తి సామర్థ్యములు కలది. దుష్టులైన రాక్షసులను ఏ ఆయుధము కూడా అవసరంలేకుండా భుజబలము నుపయోగించి ముష్టిఘాతములతోనే సంహరించగలదు. అంతటి శక్తిసంపదలు కలిగినది. అలాగే వారు ఎటువంటి క్షుద్రమంత్రాస్త్రములు ప్రయోగించినను,తనయొక్క సప్తకోటి మహామంత్ర బలముతో ప్రత్యస్త్రములను ప్రయోగించి నిర్జించగల సామర్థ్యము కలిగినది. ఇక పిపీలకాది బ్రహ్మపర్యంతము సృష్టిస్థితి లయకార్యములందు జీవుల కర్మానుసారము హెచ్చుతగ్గులు కనబడనీయక జీవకోటి జీవన వ్యవహారములు నిర్వహించు పాలనాశక్తి కూడా కలిగినది. అమ్మ ఆయుధశక్తి అంత ఇంత అనికాదు. చక్రరాజరథారూఢగాను, గేయచక్రరథారూఢగాను, కిరిచక్రరథారూఢగాను విరాజిల్లుచూ అటువంటి రథములలో అత్యంతమహిమాన్వితములైన ఆయుధశక్తి సంపదలు కలిగియున్నది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజముతో (గజబలముతో) నూ, అశ్వారూఢాధిష్టితాశ్వ కోటి కోటీభిరావృత యను అశ్వదళ ములతోను, రణరంగములో అగ్నిప్రాకారములు సృజించి శత్రుసేనలను నిలువరించగల జ్వాలామాలిని వంటి అగ్నిపుత్రికలతోను, అత్యంత పరాక్రమముతో రాక్షససైన్యములను మట్టుబెట్టగల నిత్యాదేవతల పదాతిదళములతోను, భండుని ముప్పది మందిపుత్రులను, వారిసైన్యములతో తుదముట్టించగలిగిన బాలాత్రిపురసుందరి (జగన్మాత అంశయందు జనించిన) యను మహాశక్తితోను, శత్రుసేనల యెత్తులకు పైయెత్తులు వేయు యుద్ధతంత్రమందు ఆరితేరిన శ్యామల మొదలైన పదహారు మంది మంత్రిణీ సమూహ శక్తితోను, రాక్షసులు ప్రయోగించిన మహాశక్తిప్రపూరితమైన జయవిఘ్నయంత్రాన్ని తుత్తునియలు గావించిన మహాశక్తిసంపన్నుడైన గణేశ్వరునితోను, కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతులు అను శక్తిసమూహముతోను, పాశుపతాస్త్రము మరియు కామేశ్వరాస్త్రము వంటి అస్త్ర సంపదతోను శత్రుకూటములకు భయకంపితయై తేజరిల్లు జగన్నాత మహాశక్తిః అని అనబడుచున్నది.   సృష్టిస్థితిలయల సమిష్టి శక్తి, నవావరణలందు యోగినీ శక్తుల సమిష్టి శక్తి, పరివార శక్తుల సమిష్టి శక్తి - ఈ సమిష్టిశక్తులతో ఏర్పడిన ఒక సమిష్టిశక్తియైన పరమేశ్వరియే మహా మహాశక్తి. గనుకనే ఆ అమ్మ మహాశక్తిః అని యనబడినది. కాలచక్రము విపరీత పోకడలకు పోకయుండుటకు, సముద్రములు హద్దులకే పరిమితమై యుండుటకు, నవగ్రహములు జీవుల కర్మఫలముల వరకే స్థానములు కలిగియుండుటకు, అష్టదిక్పాలకులు తమ కార్యనిర్వహణ అకాలముగాకాకుండా సకాలములే యగునట్లును నియంత్రించినశక్తి పరాశక్తియైన జగన్మాతయే. గనుకనే ఆ జగన్మాతయైన పరమేశ్వరి మహాశక్తిః అని యనబడినది.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మహాశక్త్యై నమః యని అసవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[21/01, 04:32] +91 95058 13235: *21.1.2021   ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*32.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తం కాచిన్నేత్రరంధ్రేణ హృదికృత్య నిమీల్య చ|*

*పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానందసంప్లుతా॥9501॥*

మఱియొక యువతి తన నేత్రరంధ్రములద్వారా ఆ ప్రభువును తన హృదయమున నిలుపుకొని, అచటినుండి ఆ స్వామి తిరిగిబయటపడకుండునట్లు కనులను మూసికొనెను. పిమ్మట ఆమె తన మనస్సుద్వారా ఆ పురుషోత్తముని తన అక్కునజేర్చుకొని, పులకించిపోవుచు ఒక మహాయోగినివలె పరమానందభరితురాలయ్యెను.

*32.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సర్వాస్తాః కేశవాలోకపరమోత్సవనిర్వృతాః|*

*జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః॥9502॥*

ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది, తాపత్రయమునుండి బయట పడినట్లుగా, ఆ గోపికలు అందఱును శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవుచు, తమ విరహతాపముల నుండి విముక్తలై ఎంతయు మనశ్శాంతిని పొందిరి.

*32.10 (పదియవ శ్లోకము)*

*తాభిర్విధూతశోకాభిర్భగవానచ్యుతో వృతః|*

*వ్యరోచతాధికం తాత పురుషః శక్తిభిర్యథా॥9503॥*

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని దర్శనభాగ్యముతో ఆ గోపికల శోకములన్నియును పటాపంచలయ్యెను. అంతట సహజముగనే సౌందర్య మాధుర్యాది గుణములతో  ఒప్పుచుండెడి శ్రీకృష్ణుడు వారితో పరివృతుడై, జ్ఞానబలాది శక్తులతో సేవింపబడుచున్న పరమాత్మవలె ఇంకను శోభాయమానుడై విరాజిల్లెను.

*32.11 (పదకొండవ శ్లోకము)*

*తాః సమాదాయ కాలింద్యా నిర్విశ్య పులినం విభుః|*

*వికసత్కుందమందారసురభ్యనిలషట్పదమ్॥9504॥*

పిమ్మట కృష్ణప్రభువు ఆ గోపికలను అందఱిని తీసికొని యమునానదీతీరమున గల ఇసుక తిన్నెపై చేరి, వారితో గూడి ఆనందించెను. ఆ సమయమున బాగుగా వికసించిన మల్లెలు, మందారములు మొదలగు పుష్పములమీదుగా వీచుచున్న గాలులు వాటి పరిమళములను అంతటను వెదజల్లుచుండెను. ఆ సువాసనలకు ఆకర్షితములైన తుమ్మెదలు ఝంకారముల నొనర్చుచు అటునిటు తిరుగుచుండెను.

*32.12  (పండ్రెండవ శ్లోకము)*

*శరచ్చంద్రాంశుసందోహధ్వస్తదోషాతమః శివమ్|*

*కృష్ణాయా హస్తతరలాచితకోమలవాలుకమ్॥9505॥*

శరత్కాల చంద్రునియొక్క పండువెన్నెల కాంతులతో అచటి చిమ్మచీకట్లు పూర్తిగా తొలగిపోగా, ఆ రాత్రి సుఖావహముగా (హాయిగా) నుండెను. అచటి మెత్తని ఇసుకతిన్నెలు శ్రీకృష్ణప్రభువుయొక్క లీలావిహారములకై యమునానది తన తరంగములనెడి హస్తములతో స్వయముగా సిద్ధపరచిన రంగస్థలమువలె తేజరిల్లుచుండెను.

*32.13  (పదమూడవ శ్లోకము)*

*తద్దర్శనాహ్లాదవిధూతహృద్రుజో  మనోరథాంతం శ్రుతయో యథా యయుః|*

*స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైరచీకౢపన్నాసనమాత్మబంధవే॥9506॥*

కర్మకాండలును, జ్ఞానకాండలును వేదప్రతిపాదితములే. జ్ఞానకాండ విభాగములోనివే ఉపనిషత్తులు. ఉపనిషద్విజ్ఞానమును పొందిన యోగులు కామ్యకర్మలను ప్రతిపాదించిన కర్మకాండలను ప్రక్కనబెట్టి జ్ఞానసాధనలతో పరమాత్ముని దర్శింతురు. అప్పుడు వారికి బ్రహ్మానందానుభూతి కలుగును. అట్లే శ్రుతుల అంశలతో జన్మించిన గోపికలు శ్రీకృష్ణదర్శనాహ్లాద ప్రభావమున లౌకికములైన తమ విరహవేదనలను అధిగమించి (వారి హృదయ తాపము లన్నియును మటుమాయము కాగా) పరమానందమును పొందిరి. అంతట ఆ గోపాంగనలు వక్షస్థలముల యందలి కుంకుమలచే ముద్రితములైన తమ పమిటెలను పఱచి ఆత్మబంధువైన (ఆత్మకంటెను ప్రియతముడగు) కృష్ణప్రభువు కూర్చుండుటకై ఆసనములను కల్పించిరి.

*32.14 (పదునాలుగవ శ్లోకము)*

*తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః|*

*చకాస గోపీపరిషద్గతోఽర్చితస్త్రైలోక్యలక్ష్మ్యేకపదం వపుర్దధత్॥9507॥*

మహాయోగీశ్వరులయొక్క హృదయములనెడి సింహాసనములపై అధివసించుచుండెడి శ్రీకృష్ణపరమాత్మ వేలకొలది గోపికలచే పరివృతుడై, వారి కొంగులచే ఏర్పఱచబడిన ఆసనములపై సుఖాసీనుడై కూర్చుండెను. అప్పుడు మూడులోకములలో గల దివ్యసౌందర్యములను అన్నింటిని ఒకే ఒక రాశిగాపోసిన దేహమును దాల్చిన ఆ ప్రభువు వారి పూజలను అందుకొనెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[21/01, 20:15] +91 95058 13235: *21.1.2021   సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*32.15 (పదునైదవ శ్లోకము)*

*సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణవిభ్రమభ్రువా|*

*సంస్పర్శనేనాంకకృతాంఘ్రిహస్తయోః సంస్తుత్య ఈషత్కుపితా బభాషిరే॥9508॥*

అంతట ఆ గోపికలు తమలో మరులును రేకెత్తింపజేసెడి ఆ దివ్యసుందరుని తమ చిఱునవ్వులతోను, ఒయ్యారపు చూపులతోను, చక్కని కనుబొమల కదలికలతోను గౌరవాదరములతో సమ్మానించిరి. పిమ్మట కొందఱు  సుకుమారములైన ఆ స్వామి పాదములను తమ ఒడులలో చేర్చుకొనుచు సుతిమెత్తని తమ చేతులతో ఒత్తుచు, మీదిమీదికి చేరుచు ఆ ప్రభువును మురిపింపజేయుచుండిరి. పిదప వారు అందఱును ఆయనతో చతురోక్తులాడుచు (సరసములాడుచు) చిఱుకోపములను ప్రకటించుచు ప్రేమపూర్వకముగా ఇట్లు పలికిరి.

*గోప్య ఊచుః*

 *32.16 (పదహారవ శ్లోకము)*

*భజతోఽనుభజంత్యేక ఏక ఏతద్విపర్యయమ్|*

*నోభయాంశ్చ భజంత్యేక ఏతన్నో బ్రూహి సాధు భోః॥9509॥*

*గోపికలు ఇట్లు పలికిరి* ఓ కృష్ణా! కొందరు తమను ప్రేమించేవారినే ప్రేమించెదరు. మరికొందరు ఇందుకు వ్యతిరేకముగా తమను ప్రేమించకున్ననూ, వారిని ప్రేమింతురు. ఇంకను కొij