23, ఏప్రిల్ 2021, శుక్రవారం

 

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---1--- 

             మనం నిత్యం చేసే పనులలో ఒకటి ధ్యానం. అదికూడా అమృతఘడియలలో నిత్య పారాయణంలా చేస్తూ ఉన్నట్లైతే మనసుకు శాంతి, అన్య ఆలోచనలు రావు. మనసులో ఒకే దైవాన్ని తలచితే ఇంకా మంచిది (విష్ణువు, శివుడు, హనుమంతుడు ...) 

ఒక మంత్రమో, రూపమో, నామమో మరేదైనా సులభమైన మార్గమో ఎంచుకొని మన ధ్యాసను దానిపై నిలిపే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రారంభంలో అనేక ఆలోచనలు వస్తునేవుంటాయి. వాటి నుండి ధ్యాసను మరల్చుకుంటూ మనం పెట్టుకున్న ధ్యేయంపైనే మనసు నిలిచేలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతకాలానికి అది సిద్ధించి మనసు ఆలోచనలులేని స్వల్ప విరామాన్ని పొందుతుంది. అక్కడ జరిగిందేమిటంటే తాత్కాలికంగా ఆ ఆలోచనలకు కారణమైన కోరికల నుండి మనసు విముక్తి పొందుతుంది. అలా అనేక కోరికల నుండి విముక్తి పొందే ప్రయత్నంలోనే తాను ధ్యానం పొందటం కోసం ధ్యేయంగా పెట్టుకున్న విషయంపై కూడా కోరిక పోతుంది. అప్పుడు ఏ కోరిక లేనిస్థితిలో ఉండటం వల్ల దానికి ఏ ఆలోచనా రాదు. అట్టి వాని వాక్కు ఖచ్చితంగా జరుగుడుతుంది. 

పెదాలతో నామాన్ని, మనసులో ఆయన దివ్యత్వాన్ని సదా స్మరణ చేయడంద్వారానే మనలోని శాంతి వ్యక్తమౌతుంది. ఎందుకంటే మనం స్మరించే దివ్యత్వం ఎవరిదో కాదు, మనదే. మనం ఆ దైవానికి భిన్నం కాదు కనుక ఆ విశిష్టతలన్నీ మనవే 

నిజమైన విజయానికి, నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది; ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్ధపరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు.

ఏ పనైనా చెయ్యమని చెప్పగలరుగాని, చేసి చుపించినా అర్ధం చేసుకొనే శక్తి అవతల వ్యక్తికీ ఉన్నదా లేదా ఆలోచించాలి. అందుకే గురువుగారు అందరికి పాఠాలు బోధిస్తారు కానీ అందులో ఎవరో ఒకరు మంచిపేరుతెచ్చుకుంటారు దానికి కారణం అతనిలో ఉన్న పట్టుదల, ధ్యానం ఇక్కడ ధ్యానం పాఠము అవగాహన అని గమనించాలి. అలాగే వయసు ను బట్టి ప్రతిఒక్కరు శక్తికి కొద్ది దైవాన్ని ప్రార్ధించి కర్తవ్య సాధనకు ఉపక్రమించాలి.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---2--- 

 మనకు " అనేక ఆలోచనలు వెంబడిస్తాయి అవి ఒక్కో సమయం నిద్రపోనియ్యవు, నిద్రలో  కూడ కలల రూపంలో చేరి ఏడిపిస్తాయి అవే " ఊహ, ప్రణాలిక, అంచనా, భయం ఇలా మనసు యొక్క సమస్త కదలికలు ఆలోచనలో భాగమే."  ఆలోచనలు రాకుండా చేయాలనుకుంటున్నాం. టివి చూడటం, పుస్తకం చదవడం, సంగీతం వినటం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తూనే ఉన్నాయి. కానీ ఇది చాలకనే ఆలోచనలు ఆపేందుకు ధ్యానప్రక్రియను మొదలుపెడుతున్నాం

సుఖం, దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే! అందుకే మనిషిలో ఓర్పు ఓదార్పు ఉండితీరాలి అప్పుడే మనసుకు శాంతి. 

మనుషుల్లో మార్పులు ఎవ్వరూ చెప్పలేరు ధనవంతుడైన భూకంపాలకు బీదవాడే, బీదవాడైన అదృష్టానికి గొప్పవాడే, మార్పులు ఎవ్వరు చేసారు అనేది ఎవ్వరికీ తెలియదు.  వ్యాపారంలో . లాభనష్టాలు వారి చేతిలోనే ఉండాలి. కానీ సాగినంతకాలం అలా అనిపించినా ఏదో ఒకరోజు అదంతా తన ప్రతిభాపాటవం కాదని తెలుస్తుంది. అది తెలుసుకొనే లోపే మనిషి మారిపోతాడు. అందుకే . రైతు తాను ఎంత పండించగలడో చెప్పలేడు. ఒక కళాకారుడు తాను రూపొందించే కళాఖండం పూర్తయ్యే వరకూ అది ఎంత అందంగా ఉంటుందో చెప్పలేడు. పూర్తిచేసిన తర్వాత అది తనకు కూడా కొత్తదిగానే ఉంటుంది. కడుపులో పెరిగే పిండం ఏరంగులో పుడుతుందో, ఎలాంటి ముఖ కవళికలతో పుడుతుందో మోసే తల్లికీ, కారణమైన తండ్రికి ఇద్దరికీ తెలియదు. ఇలా చేతులు మనవైనా, మనతో చేయించే శక్తి వేరే ఉందని తెలియడమే ధ్యాన  భక్తి 

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

ప్రాంజలి ప్రభ 23 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---3--- 
మనిషి యవ్వనంలో ఒక విధమైన జిహ్వతాపం ఉద్భవించు. అది పరుగెత్తే గుఱ్ఱంలాగా సాగుతుంది.దాన్ని ఒడిసి పెట్టె విధము గ్రహించగల బుద్ధి సంక్రమించు దానికి తోడు సహాయ సహకారం ఎక్కువగానే ఉండు. అప్పడే మంచి చెప్పినా బుర్రకెక్కదు. తాను చెయ్యాలనుకున్నది చేస్తారు. అది ప్రేమవ్వచ్చు,చదువు అవ్వచ్చు లేదా చేదుఅలావాటులు అవ్వచ్చు.         

అప్పుడే సంకల్పములు అనేవి ప్రవాహము లాగా వస్తూ ఉంటాయి. ప్రవాహములో మునగకుండా గమనిస్తూ ఉండాలి. ప్రవాహములో పడిపోతే అది నిన్ను పట్టుకుపోతుంది. అక్కరలేని తిరుగుళ్లు, తిండి, మాట లేకపోతే అక్కరలేని ఆలోచనలు గూడా రావు.

సముద్రపు ఒడ్డున కూర్చుని అనంతమైన అలలను చూస్తున్నట్లుగా,  మనసులో  కలిగే భావాలను గమనిస్తూ ఉండడమే. ఇదే ధ్యానానికి ప్రాథమికమైన స్థితి. అప్పుడే స్థిరమైన మనస్సు ఏర్పడుతుంది. మూడు గుణములకు లోబడని ప్రజ్ఞగా ఉంటాము. ఉన్న స్థితి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిన మనస్సు గుణములకు లోబడినదని అర్ధము.

ఆత్మజ్యోతి తన ప్రకాశాన్ని సర్వత్రా ప్రసరింపజేస్తుంది. మనం దివ్యాత్మ స్వరూపులం. ఆ దివ్యాత్మభావాన్ని విస్తరించవచ్చును.

ఆవయసులో మనిషి  విద్యఅనే  దృష్టిని కోల్పోతే అంతకన్నా దురదృష్టకరం మరొకటి ఉండదు. దివ్యత్వాన్ని ఎవరూ మన నుండి దోచుకోలేరు.
మనస్సులో ఉదయించే మలినాలే ఆ దివ్యత్వాన్ని కప్పివేస్తాయి. ఆ దివ్యత్వ ప్రకాశాన్ని సర్వులలోనూ దర్శించవచ్చు.
మన నిజమైన శత్రువులు ఆ మలినాలే. అవి మన ఆధ్యాత్మిక వారసత్వం నుండి మనల్ని దూరం చేస్తున్నాయి.
కనుక అంతఃశత్రువుల ఎడల అప్రమత్తతను కలిగి ఉండాలి.

1. నీ యందు ధర్మానుష్ఠాన బుద్ధి యున్నదా? లేక పొతే బుద్ధిని మార్చుకో 
2. అవసర సమయమునందు కూడ అధర్మము ప్రోత్సహించ బడదా? నీ ఆలోచన మార్చుకో  
3. గురువునందు, దైవమునందు ఎప్పుడైన సందేహము వచ్చునా, రాదా? సందేహాన్ని తీర్చుకో 
4. నీవు పరనింద చేయుదువా? చేయవా? నిందా అనేది మర్చిపో 
5. అసత్య భాషణమునకు జంకుదువా? జంకవా? అసత్యము దేనికి 
6. సంవత్సరమున అసహనము ఎన్నిసార్లు కలుగును ?  సహనముతోనే ఉండు 
7. మనస్సునకు స్థిరము ఏర్పడినదా? లేక చంచలత్వ మున్నదా? మనస్సు స్థిరపరచు 
8. పనులయందు శ్రద్ధ, భక్తి యున్నదా? లేక అశ్రద్ధ, నిర్లక్ష్యము 
9. నీవు శరీర శ్రమకు సిద్ధమేనా? సిద్ముగా ఉండు 
10. నీకు దైవమన్న భయమా? భయమనవసరం అది మన:శాంతికి దారి అని తెలుసుకో 

సంకల్ప బలం కు దైవ బలం తోడవుతుంది అప్పుడే బుద్ధిబలం వికసించి దేశానికి సహాయపడే మనస్సు అవుతుంది అదే ఎక్కువ ఇవ్వనదశలో 

--(())-- 

ప్రాంజలి ప్రభ 24 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---4--- 

 మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు. మన పునాదులు అస్తిత్వంలో వుంటే మనం సంపూర్ణంగా, ఆరోగ్యంగా వుంటాం. 

మనం అస్తిత్వ సంబంధం లేకుండా ఒంటరిగా వుంటే, పునాదులు లేకుంటే ఎట్లాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రాణం లేకుండా వుంటాం. 

అస్తిత్వమన్నది భూమి, మన బలవర్థకమయిన ఆహారం, మన ఆరోగ్యం, సమజీవితం అంటే విస్ఫోటన మినహా మరేం కాదు. అది మన సజీవత్వానికి సంబంధించిన విస్ఫోటన.
దానినే ప్రేమబంధం అంటారు 

మనకున్నది ఒక్కటే మనసు.  ధ్యాన ప్రయత్నానికి, ఆలోచనలకు కారణం ఆశ అనే గుణం. ఆలోచనలు తెప్పిస్తుంది.  ఉన్నది ఒక్క మనసే కనుక అది అన్ని కోరికలతో పాటు ఏదో సాధించాలన్న కోరికను కూడా ఒక రోజు మర్చిపోతుంది. అలా కోరిక పోయిన క్షణంలో కలిగే దివ్యానుభూతే నిజమైన "ధ్యానం".  అందుకే ఆత్మజ్ఞానులైన పెద్దలంతా 'ధ్యానం చేసేది కాదు, కొనసాగుతున్నదే' అని చెప్తున్నారు. టివి చూసేప్పుడు, పేపర్ చదివేప్పుడు ఇతర ఆలోచనలతోపాటు తాను ఆ పని చేయాలన్న ఆశ కూడా పోతుంది. అందుకే అందులో లీనం కాగలుగుతున్నారు. జపంలో ఎలాగైతే తాను 'రామరామ' అంటున్న విషయం కూడా తెలియకుండానే అనేస్తున్నాడో, ఇక్కడ తాను చేస్తున్న పని తెలియకుండానే దాన్ని అనుభవిస్తున్నాడు. జపంలో అయితే దాన్ని "సమాధిస్థితి" అంటారు. సాధారణ పనుల్లో అయితే దాన్నే తాదాత్మ్యత అంటారు !

మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే! అనగా మనం నిర్వహనాసక్తితో ఏదైనా చదించవచ్చు అని అందరూ తెలుసుకోవాలి. 
 
--(())--


ప్రాంజలి ప్రభ 25 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---5--- 

 మనసు త్రిపుటిగా విభజన చెందటానికి కారణమేమిటో సూక్ష్మంగా పరిశీలించగలిగితే అది కోరిక అని అర్థమవుతుంది. కోరికే మనసును సాఫీగా సాగకుండా కర్త, కర్మ, క్రియలను సృష్టిస్తుంది. ఈ విభజనే అశాంతికి మూల కారణం అవుతుంది. విభజన చెందని మనసు సహజమైన గ్రహింపుతో సదా ఆనందస్థితిలోనే సాగుతుంది.  . ప్రతీరోజూ నియమం తప్పక ధ్యానం చేయగలిగితే అది మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదు. 

నైతిక వర్తనమే శ్రేష్ఠమార్గం. పుణ్యాత్ముడు చివరకు జయించి తీరుతాడు.

అందరిలోనూ అనుభవాలతో పాటు ఈ అనుకూలత, ప్రతికూలతలు సంభవిస్తాయి. అంత  మాత్రాన చేయలేను అని అధైర్య పడకూడదనే నమ్మకం.  
  
బాహ్యంతరాలు లౌకిక ప్రపంచానికే కానీ పరమశాంతికి కాదు. పరమశాంతి సంకల్ప రహితంగా ఉంటుంది. రూపం లేనిదిగా ఉంటుంది. సత్యం అర్థమైన తర్వాత ఈ సకలచరాచర సృష్టిలో అంతర్భాగమని తెలిసి తనకంటూ ప్రత్యేకమైన ఉనికిని వెతుక్కోకుండా ఉంటాము. ఏదైనా త్యజించాలంటే మనం దాన్ని పట్టుకోవడమో, అది మనను పట్టుకోవడమో జరగాలి. 

తనమన బేధము గురించి ఆలోచన వస్తే జీవితం దుర్భరం, బేధము లేని మనసు ఉంటే సుఖమయం.   

1. "భగవంతుడు:-  ప్రతిచోట నుండి సమస్తమును చేయుచున్నాడు. , 2. భగవంతుడు:- మనలో నుండి సమస్తమును తెలిసి కొనుచున్నాడు. 3. భగవంతుడు:- మనకు వెలుపల నుండి సర్వమును చూచూచున్నాడు.4. భగవంతుడు:- మనకు ఆవల నుండి సర్వము తానై యున్నాడు."

సత్యమును అనుభవింప వలెను. భగవంతుని దివ్యత్వమును పొందవలెను. దివ్యత్వములో బ్రతుకవలెను. ఇదియే సత్యధర్మము.



ప్రాంజలి ప్రభ 26 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---6--- 

కధ కాదు జీవిత హితోక్తులు (1 )

మనుష్యులలో చాలావరకు ఉచిత సలహాలు ఇవ్వటానికి వుంటారు, కానీ " సలహా " అనేది ఎవరికి అవసరమో, వారికే రుచించదు". ఎందుకనగా తన్ను తాను ఆచరణ లేని వ్యక్తి  సలహాలిస్తారు.  
అందుకే "తనను తాను "సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం " "అందుతుంది.

సంతోషం అనేది ఎప్పుడు పడితే అపుడు రాదు, అది కూడా ఒక కళే, చెప్పే వ్యక్తిలోనూ, వినే  వ్యక్తిలోనూ అభిలాష ఒక్కటే అయినప్పుడు ఆపనిలో నిజమైనప్పుడు కలుగుతుంది అందుకే   
"మన సంతోషం మన తెలివితేటలపై అధారపడి వుంటుంది".

ప్రతి మనిషి శ్రమిస్తాడు కానీ ఫలితం మంచిగా ఉండొచ్చు, చెడు గా ఉండొచ్చు, ఏది ఏమైనా శ్రమ ముఖ్యము.  అందుకే  "కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంటుంది".

మనుష్యులలో సాధించగలవు, ప్రయత్నం చేయి అనే ప్రోత్సాహము సగము బలం ఇస్తుంది, దానికి బుద్ది తోడైతే విజయం తధ్యం "దానికి థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు."
 
ఒక పని విషయంలో దానిలో ఉన్న మర్మాలన్నీ తెలుకున్న వ్యక్తే బాధ్యత వహిస్తాడు అదే అతనికి జీవనాధారము అవుతుంది అప్పడు  "బాధ్యతా నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది".

ప్రతి వ్యక్తిలో ఎదో ఒక బలహీనత ఉంటుంది, అది మనసు పై పనిచేస్తుంది, అప్పడు అతనిలో ఎదో తెలియాని నిస్సహాయాత చోటు చేసుకుంటుంది, అలాంటప్పుడు బలహీనత ఎదో తెలుసుకొని దానిని తొలగించు ముందు,  అప్పుడే "మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది".
                      
అందుకే నేను చెపుతున్నా  "కోరిక - ఐహికమైనది". ప్రతి వ్యక్తిలో రగిలే సంకల్పం - పారమార్థిక మైనది. ప్రతి వ్యక్తిలో ఒక విధమైన శక్తి ఉంటుంది అదే "శక్తి యొక్క అంతర్ముఖం - ఆత్మ".
శక్తి యొక్క బహిర్ముఖం - ప్రకృతి. అందుకే రెండు మీ వెంటే ఉన్నాయి అవి మిమ్ములను గుర్తి0చుకోవటానికి పనికి వస్తాయి ఇదే లోకం తీరు  
                                                                         
                                                                               ఇంకా ఉంది ( రేపటి రోజు చదవండి) 
                                                                             విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ 27 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---7--- 

కధ కాదు జీవిత హితోక్తులు (2 )

 ప్రతి మనిషిలో మంచి -చెడు, శ్రద్ధ - అశ్రద్ధ , భయము- నిర్భయం , ఖచ్చితంగా ఉండి తీరుతాయి అవి ప్రకృతి బట్టి, సమయాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సహధర్మచారిణి బట్టి, మనసును బట్టి  కొన్ని పరిస్థితులలో మార్చు కోవాల్సిన పరిస్థితి ఉండాలి, ఈ లోకంలో బతకాలి కదా అందుకే  "మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ."     

నీలో  అజ్ఞానం భిన్నత్వానికి, నీలో జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపు తుంది. అజ్ఞానం తాత్కలిక సుఖము నివ్వచ్చు, అది ఎప్పటికైనా ప్రమాదమే, నిదానంగా అర్ధమయ్యేది జ్ఞాననమ్ అది శరీరంలో కలసి పొయ్యే రక్తం లాంటిది ఇది అందరికీ ఉపయోగపడుతుంది.   

ప్రతి పనిలో  వైఫల్యం ముందు వచ్చినా  నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు, కొత్త ఆలోచనలకు, కొత్త విధానాలకు, కొత్త ప్రోత్సాహానికి పునాది కావాలి.

అందుకే ప్రతిఒక్కరు నియమ పద్దతిలో పెరిగి, దేశకాల పద్ధతిని అవగాహన చేసుకొనే జీవితంలో    
"నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది".
రాలిన ఆకూ ఎగిరెగిరి పడుతుంది, నాట్యమాడలేని స్త్రీ మద్దెల ఓడి అంటుంది, ఏమిలేనివాడు డబ్బాలో రాయిలాగా గలగలా అంటూ ఉంటాడు, క్షణిక సుఖ సౌఖ్యముకోసం పరుగెడుతూ ఉంటారు వారి నడక ఎప్పుడూ ప్రశ్న ప్రశ్నగా మిగిలి పోతుంది అందుకే "సత్యమార్గంలో నడిచేవాడే సంపన్నుడు".    

మనం సౌందర్య పిపాసలుం, ఏది చూసినా యిట్టె ఆకర్షితులం, మంచిగా చూసినా, చెడుగా చూసిన లెక్క ప్రకారము తప్పు తప్పే. చూపు అనేది హృదయాన్ని తాకాలి ఆత్మానందం పొందాలి అందుకే " ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్యసాధనం మరొకటి లేదు".

రోగాలు వస్తాయని తెలిసి తెరిగితే తప్పు, రోగం నన్ను చేరదు నాది దృఢమైన శరీరం అనుకున్న తప్పే, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పఁలేరు, క్షణ క్షణానికి మారె లోకంలో మనం ఉన్నాం అందుకే "దుఃఖం అనేది శిక్ష కాదు. సంతోషం అనేది వరమూ కాదు. రెండూ ఫలితాలే". 
రెండూ అనుభవించనవాడే నిజమైన మనిషి జీవతమనేది పరమపద సోపాన పఠము  " పాముకు చిక్కవచ్చు, చిక్కినా తప్పించుకొని దాటవచ్చు అదే ఈ లోక ధర్మం.           

ప్రతిఒక్కరు ఈరోజు చేసే విధి విధానాలు ఆరోజే చేసినప్పుడు మనసు ప్రశాంతముగా ఉంటుంది. రేపు అనే భావానికి వస్తే అవే మన మనస్సును తినేస్తాయి, అందువల్ల నీతో ఉన్నవారికి కూడా నీవే అశాంతికి కార భూతుడవుతా అందుకే 
" ఏ ఆలోచన అయినా,  ఏ క్షణానికి ఆ క్షణం మనసు నుండి శూన్యం అవ్వాలి.అప్పుడు ఆ మనస్సే -- సాక్షాత్తూ "పరబ్రహ్మం" అనబడుతుంది. అదే నీకు, లోకానికి, కుటుంబానికి శాంతి నిస్తుంది.   
(క్లాసు అయిపోగానే, బ్లాక్ బోర్డును డస్టర్ తో తుడిచేసినట్లు, తుడిచేయాలి.) ఒకనాటి లెక్కల మాష్టార్ గా చెపుతున్నా పాతనీరు పోయి కొత్తనీరువస్తేనే మనిషి బ్రతుకు నిత్యమూ సంతోషమే 
                            
                                            ఇంకా ఉంది ( రేపటి రోజు చదవండి) 
                                    విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                                    

----
ప్రాంజలి ప్రభ 28 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---8--- 

కధ కాదు జీవిత హితోక్తులు (3 )

మన మనసు పువ్వు లాంటింది అది పగలు వికసించి రాత్రి వాసన వెదజల్లి చివరకి ముకుళించింది. అదేవిధముగా పువ్వులు లాగా ఆశలు పుట్టి మారుతూ ఉంటాయి    
అనగా  "స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే".

ఏ నిర్ణయానికైనా ఆలోచనా సమయము పాటించాలి, సంప్రదించి నిజ నిర్ధారణ చేసుకోవాలి అప్పుడే  నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.

మనము ఒక కుటుంబ వ్యవస్థ లో జీవిస్తున్నాము, సంప్రదాయ పద్ధతిలో సంచరిస్తున్నాము     
అందువల్ల "సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్కృతి". నిటాయ్ జీవిత మార్గముగా ఎన్నుకోవాలి అదే ప్రతిఒక్కరి శ్రేయస్సు అవుతుంది.  

చెప్పేందుకే సలహా ఉండకూడదు అది ఆచరణ యోగ్యమై ఉండాలి ఆచరించి అనుభవ పూర్వకముగా తెలియపరచాలి అందుకే గుర్రాన్ని నీటి గుంటదాకా తీసుకెళ్లవచ్చు నీటిని తాగించలేవు. "మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం".

మనిషిలో నిజమైన వైద్యులు ఎవరో తెలుసుకోవాలి ప్రతిఒక్కరు అవి ." ధైర్యం, కాలం, ప్రకృతి... ఈ మూడూ ఉత్తమమైన గొప్ప వైద్యులు". ఇందులో ఏ ఒక్కటీ తప్పినా లోకం తల్లకింద లవు తుంది.  

ఇప్పుడు రోగాలు విజృంభిస్తున్నాయి దానికి కారణం మానవుల నిర్లక్షము, వారిలో పెరిగిన ఆశావాదం. "పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది. మానవుడే పరిస్థితుల్ని సృష్టించు కున్నాడు.
 
ప్రతి ఒక్కరిలో గ్రహింపు సమయంలో మనసు శుద్ధతకు అడ్డురాని సంతోషం, దుఃఖం స్మృతి ద్వారా వ్యక్తమైనప్పుడే అనుభవాలను కావాలనుకోవటం, వద్దనుకోవటం అనేవి కోరికగా పరిణమిస్తాయి. 'నేను - నా అనుభవం' అనే విభజన లేనప్పుడు గ్రహింపునకు సంతోషం, బాధ, సుఖం, దుఃఖం అనేవి ఏవీలేవు. లడ్డూలో తియ్యదనం, కాకరకాయలో చేదుతనం గ్రహింపు సమయంలో తెలుస్తున్నాయి. కానీ కావాలనటం, వద్దనటం అనే ప్రక్రియ అక్కడ జరుగటం లేదు. స్మృతిగా నమోదైన చేదు, తీపి తిరిగి కార్యంలో అనుకూలత, ప్రతికూలత అనే భావాన్ని కలిగించి, కావాలి, వద్దు అనిపించేలా చేస్తున్నాయి 

--(())--
 
                                        ఇంకా ఉంది ( రేపటి రోజు చదవండి) 
                                    విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                                    
ప్రాంజలి ప్రభ 29 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---9--- 

కధ కాదు జీవిత హితోక్తులు (4 చివరిది )


మనిషిలో ఖర్చు కానిది, ఇష్టమున్న లేకున్నా వచ్చి చేరేది సంతోషం ఒక్కటే సంతోషం ఉన్నచోట ఏమిలేకపోయినా సంసారం సహాయం అవుతుంది అట్లే  " సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం."

అందరూ తప్పులు చేస్తారు, తప్పులు చేసేవారు తమతప్పులు ఎరుగరు,  టాపులుసహాయకుండా జాగర్తపడినప్పుడే జీవితము సాఫీగా సాగుతుంది  అసలు  మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు. 

ప్రతి మనిషిలో ఒక లక్ష్యం ఉండాలి,  లక్ష్యంతో సమయ లక్ష్య నిర్ధారణ చెయ్యాలి, వ్యర్ధమనేది లేకుండా జాగర్తపడాలి అందుకే   "లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు".

ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు. మంచి అన్నది నిలకడగా ఉండి మనిషి ఆశల విజయానికి తోడ్పడుతుంది.   
జీవితంలో బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా. అందుకే బద్దకంలేని వారు ఏమైనా సాధించవచ్చు అనిఅన్నారు.   
మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి. అప్పుడే కుటుంబానికి దేశానికి మంచిజరుగుతుంది.
  
చితి నిర్జీవులను కాలుస్తుంది… చింత సజీవులను దహిస్తుంది. కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి. సంసార సాగరం దాటాలంటే…సంస్కారముల పరివర్తన కావాలి. కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది.
                                                        విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి