15, మార్చి 2019, శుక్రవారం





No photo description available.
ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (1 )

 మనిషిని జీవింప చేసేవి? - నాలుగు

1. నిగ్రహ శక్తితో ఉన్నప్పుడు
2. ప్రేమ ఇచ్చి పుచ్చు కొన్నప్పుడు
3.ప్రతివిషయంలో త్రృప్తి పడ్డప్పుడు
4. శక్తి, విద్యను త్యాగం చేసినప్పుడు

మనిషిని దహింప చేసేవి - నాలుగు

1. నాకులేనిది వారికుందని అసూయ
2.ఉన్నదిచాలక ఇంకాకావాలని అత్యాస
3. మంచి చెడు గమనించక ఉండే ద్వేషం
4.మనసును కష్టపెట్టి బాధపెట్టేది పగ

జీవితానికి చెరుపు చేసేవి - నాలుగు

1. తనంతటివాడు లేడనీ పొందే అహంకారం
2. తొందరపడి గమనించక చేసే అనాలోచన
3. నేనె గప్ప అనిఅనుకోవటం లో అధికారం
4. జీవితంలో తారసపడె వారిపై అపనమ్మకం

--((**))--
ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (2 )
మల్లాప్రగడ రామకృష్ణ 
జీవితంలో ఉండకూడనవి ? - నాలుగు 

1. ఏ పనిలోకూడ ఉండ కూడదు నిరుక్షాహం
2. చేసేపనిలో ఉండకూడదు నిర్లక్షం
3, ఏ స్థితిలోను ఎవ్వరిని చేయకు యాచన
4. ఎట్టి కష్టాలు వచ్చిన తీసుకోకు అప్పు

జీవితంలో చేయ కూడనివి -నాలుగు

1. ఏ మనిషిని నమ్మించి చేయకు వంచన
2. ఏ వ్యక్తిని ఏ స్థితిలో చేయకు దూషణ
3.నిరుక్షాహంతో చేసుకోకు ఆత్మహత్య
4. కోపంతో తొందరపడి చేయకు హత్య

జీవితంలో నేర్పరికి కావలసినవి - నాలుగు

1. మాటలలో ఎప్పుడూ చూపాలి వినయం
2. ప్రతి ఒక్కరితో ఉండాలి విధేయత
3. చేసే పనిలో ఎప్పుడూ ఉండాలి లక్ష్యం
4. ప్రతి సమయంలో ఉండాలి సహనం

--((**))--


ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (3 )
మల్లాప్రగడ రామకృష్ణ 

పరువు ప్రతిష్టకు భంగం కల్గించేవి ? - నాలుగు

1. ఉన్నదాన్ని తృప్తి పర్చక కొత్తవారిపై  వ్యామోహం
2. అన్ని అందుబాటులో ఉన్న  స్వార్థం
3. మంచి చేసే వారిపై ఉండకూడదు అనుమానం  
4. కులం మతం  వేరైనా చేసిన పెళ్లి

సహకరించ కూడని మార్గాలు ఏవి - నాలుగు 

1. అందరు ఉన్నా పట్టించుకొని ఒంటరితనం 
2. అవకాసము ఉన్న చేయకూడదు అవినీతి 
3. ధర్మానికి వ్యతిరేకంగా చేయకు అధర్మం 
4. ఏ స్థితిలో కుడా చేయకూడదు అన్యాయం  

ఆచరించి భోదించ దగినవి ? - నాలుగు 

1. ప్రతి ఒక్కరు ఆచరించాలి విదుర నీతులు 
2. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చాణిక్య నీతులు 
3. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి బ్రహ్మ సూత్రాలు 
4. ప్రతి ఒక్కరు ఆఅర్ధం చేసుకోవాలి సూక్తులు 

--((**))--


ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (4 )
మల్లాప్రగడ రామకృష్ణ 


నిత్యం ఆచరించ దగినవి ? - నాలుగు 

1. ఆచరించాలి కలియుగ ధర్మము  
2. ప్రతిఒక్కరి విషయంలో చూపాలి దయ 
3. బీద ధనిక మధ్య ఉండకూడదు దాక్షిణ్యం 
4. ప్రతిఒక్కరి విషయంలో చూపాలి కరుణ 

నిత్యం చేయదగినవి ఏవి? - నాలుగు 

1. ప్రతి ఒక్కరికే పంచాలి ప్రేమ 
2. నిత్యమూ పొందాలి ఆనందము 
3. ఉన్నదానితో చేయాలి దానము 
4. మన:శాంతికొరకు చేయాలి ధ్యానము 

నియమముగా పాటించ వలసినవి 

1. బ్రతుకులో ఉండాలి క్రమశిక్షణ 
2. నడవడికతో ఉండాలి ధర్మమార్గం 
3. ఎప్పుడు  మరువకు సత్యపలుకు 
4. అందరి దగ్గర ఉంచు న్యాయబుద్ధి  


--((**))--
ప్రకటన : కబుర్లు చెప్పేవారెవరో కడుపు నింపే వారెవరో తెలుసుకొని ఓటు వెయ్యండి  

ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (5 )
మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రత్యక్షం గా పూజించ దగిన వారు ఎవరు ? - నలుగురు 

1. స్తన్యం పాలు అందించి పోషించిన తల్లి 
2. చేయిపట్టుకుని నడిపించిన తండ్రి 
3. విద్యాబుద్ధులు నేర్పిన గురువు 
4. సర్వస్వం అర్పిచి సహకరించేది భార్య 

పరోక్షం గా పూజించదగినవారెవరు - నలుగురు 

1 మేలుకొలుపు చేసి సంచరించే సూర్యుడు 
2. వెన్నెల కురిపించి చక్కాయి చంద్రుడు 
3. సమస్తము భరిస్తున్న పుడమి తల్లి 
4. నమ్మి ఇత్యమ్ కొలిహీ దైవం 

చేయకూడని వృత్తులు ఏవి ? - నాలుగు 

1. ఎట్టిపరిస్థితిలో కుడా చేయకూడనిది చోరత్వం 
2. ఏ కాలంలో కూడా చేయకూడనిది వ్యభిచారిత్వం 
3. అదేపనిగా మనసులోఉండకూడనిది శృగారతత్వం 
4. పెళ్లి చేసుకొని ఉండకూడనిది నపుంసకత్వం 

--((**))-- 
ప్రకటన : నీవు ఎటువంటిఆకర్షణలకు లొంగక వెయ్యాలనుకున్నవారికి వెయ్యాలి ఓటు వెయ్యండి  


ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు (6 )
మల్లాప్రగడ రామకృష్ణ 

పలుక కూడనివి ఏవి? - నాలుగు  

1. స్త్రీల ముందు పలకకు అస్లీల వాక్యాలు 
2. శుభమా ని జరుపుకుంటూఉంటే పలుకకు అశుభములు 
3. ఏ విషయంలా యందు ఎప్పుడు పలుకకు అబద్ధాలు 
4. ఎవ్వరినీ ఒప్పించటానికి ప్రయత్నించకు అసత్యాలు 

నిత్యమూ కోరుకోదగినదియేది ? - నాలుగు 

1. అమ్మదీవనే జన్మకు సార్ధం 
2. నాన్న పాలనే జనంకు పరమార్ధం 
3. భార్య ఆనందమే పుసుషార్ధం 
4. పిల్లల భవిషత్తే  సకలార్ధం 

పనికి రావి ఏవి? నాలుగు 

ఏ స్థితిలో చేయకు  పరనింద 
చెలిసి తెలియక చేయకు పరవిమర్శ 
ఏ స్థితిలో కుడా ఎవ్వరిపై ఉంచకు ద్వేషం 
నీమనస్సును, కుంటుంబాన్ని నాశనం చేసేది ఈర్ష్య  

--((**))--

ప్రకటన : భారతదేశ సంస్కృతిని నిలబెట్టే వారెవరో తెలుసుకొని ఓటు వెయ్యండి 



ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు ( 7 )
మల్లాప్రగడ రామకృష్ణ 

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పినవి - నాలుగు 

1. స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
2. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు
3. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు
4. గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పినవి - నాలుగు 

1. గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు
2. రెండు చేతులతో తల గీరుకోరాదు
3. అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు.
4. స్త్రీలు ఇంటికి వచ్చినవారికి  పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వటం మరువరాదు 

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పినవి - నాలుగు

1. ఇళ్లు శుబ్రపరిస్తే ఇంట్లో లక్ష్మి ఉంటుంది 
2. అదీలేదు ఇదిలేదు అనుకోవటం మంచిది కాదు 
3. నిత్యదీపారాధన అందరికి శ్రేయస్కరం 
4. ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారం మనస్సుకు రానీయకూడదు  


--((**))--

ప్రకటన : స్వరాజ్యానికి అర్ధం ప్రజాశాంతి. ప్రజలందరికి మన:శాంతి కల్పించే పార్టీకే మీరు ఓటు వెయ్యండి  

ప్రాంజలి ప్రభ 
జీవిత సత్యాలు ( 8 )
మల్లాప్రగడ రామకృష్ణ 

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు 

1. పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది పూజ 
2. అభిలాష ఫలాన్ని ఇచ్చేది అర్చన 
3. జన్మ జన్మల పాపాన్ని పోగొట్టేది జపం 
4. మనస్సుకు ఆనందాన్ని కలిగించేది స్తోత్రమ్

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు  

1. ఇంద్రియ సంతాపాన్ని తెలిపేది ధ్యానం 
2. సంసార బంధాలను విముక్తి కల్పించేది దీక్ష 
3. మనలో ఉన్న అహంభావం పోగొట్టేది అభిషేకం 
4. తత్వంపై మననం చేయుటవల్ల వచ్చేది మత్రం 

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు

1. ఆత్మశుద్ధితో నవసిద్దులు కల్పించేది ఆసనం 
2. పరతత్వాన్ని ఆనందింప చేసింది తర్పణం 
3. అంతంలేని దౌర్భాగ్యాన్ని నశింప చేసేది గంధం 
4. పుణ్యాన్ని వృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది పుష్పం

--((**))--
ప్రకటన:  సమాజానికి నేను సేవచేస్తాను అన్న వాడికి ఓటు వేస్తారా, చేస్తున్న వాడికి ఓటు వేస్తారో మిరే ఆల్లచించి ఓటు వెయ్యండి.   


ప్రాంజలి ప్రభ
జీవిత సత్యాలు ( 9 )
మల్లాప్రగడ రామకృష్ణ

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు

1. చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది ధూపం
2. సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది దీపం 
3. ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలతో నైవేద్యం 
4. సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు

1. లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .   
2. పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
3. దేవతను కుశలప్రశ్నవేయుట స్వాగతం
4. చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం,

పూజ-పరమార్థాలు తెలపండి ? - నాలుగు

1. తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది మధుపర్కం.
2.  గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.
3. అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం 
4 . దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసన

(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).
--((**))--


ప్రాంజలి ప్రభ
జీవిత సత్యాలు ( 10 )
మల్లాప్రగడ రామకృష్ణ

ఓట్ల రాజకీయం - నాలుగు

1. తల్లి దొక పార్టీ, తండ్రి దొక పార్టీ
2. తనయులు వేరే పార్టీ ఎవ్వరు గెల్చిన
3. అందరు ఏకమై గెలిచిన వారి పక్షాన
4. తాతల రాజకీయం ఈవిధంగా మారే

ఓట్ల రాజకీయం - నాలుగు

1. నేతలు జనులపై సానుభూతి
2. దొరికినంత ప్రభుత్వపు సొమ్ము దోచు
3. రుణమాఫీ చేసి, చీరలు పంచు
4. గ్రద్దల్లా పీక్కుతినేవారికి రక్షణగా ఉండు

ఓట్ల రాజకీయం - నాలుగు

1. చిల్లు కుండలో నీరు తేలేము
2. శుద్ధజలము అందరి అందించలేము
3. వంచకునిలోని మంచి కాంచబోము
4. దీక్షతో ప్రజాసేవ చేస్తే గెలుపుఖాయము


--((**))--


ప్రాంజలి ప్రభ
జీవిత సత్యాలు (11 )
మల్లాప్రగడ రామకృష్ణ


కాలానికి విలువ ఉందా? - నాలుగు 

1. కాలానిది ఎప్పుడు ముందు చూపే 
2. నాయకుడు ఎపుడూ మార్తాడు పార్టీ 
3. గతం అనవసరం ప్రజలకోసం మాఱుతాడు  
4. రాజకీయ రసవిద్యలతో అందరినిమెప్పిస్తాడు  

కాలానికి విలువ ఉందా? - నాలుగు 

1. కాలం కొంగు బంగారం లేదంటే ఎడారి బ్రతుకు
2. ప్రశ్నలకు సమాధానము రాజకీయం 
3. ఎన్ని బూతులు తిట్టినా కాలంతో రాజీ
4. అలసిపోయేది, అనుభవించేది మనిషి

కాలానికి విలువ ఉందా? - నాలుగు 
      
1. ఉయ్యాల లాగా ఊగదు కాలం
2. నాయకుడు మాత్రం నిత్యం ఊగే ఉయ్యాలే 
3. నేనున్నానని భరోసా ఇచ్చేది రాజకీయం 
4. చేసిన శ్రమ కష్టం మాత్రమే కాలంలో బ్రతికిస్తుంది 

--((**))--
No photo description available.      
నేర్చుకోవలసిన నీతులు - నాలుగు 

1.  మంచిని వినుట నేర్చుకో 
2. మంచి మాట్లాడుట నేర్చుకో 
3. మంచివి చూచుట నేర్చుకో 
4. తల్లి తండి గురువు భార్య మాట విని నడుచుకో 

ఉండవలసిన విధానములు - నాలుగు

1. ఆలోచన తక్కువ చేయవలెను 
2. ఆచరణ ఎక్కువ ఉండవలెను 
3. కష్టమే ఫలితమని గమనించవలెను 
4. ఉన్నదానితో సన్దతృప్తి పది ఉండవలెను 

 మరువకుండా చేయవలసినవి - నాలుగు   

1. పాపకారం పరమ పవిత్రం అని భావించు 
2. దైవ చింతన మన:శాంతికి మూలం అని గ్రహించు 
3. ఆనంద పరచటంలో ఉన్నది తృప్తి అని తెలుసుకో 
4. ప్రేమించి ప్రేమ పొందుటలోనే అది సంతృప్తి 
  

2 కామెంట్‌లు: