9, మార్చి 2019, శనివారం

చిన్న కధ (1) 
మల్లాప్రగడ రామకృష్ణ 
ఒక్కరోజు ప్రయాణం 

పేపరు చదువుతూ నాలో నేనే నవ్వుకుంటున్నా. ఆ నవ్వుకు కారణం నా ముందూ వెనకా కూర్చున్న హిందీవాళ్లూహించుకోలేక పోతున్నారు. క్యాబయ్యా, క్యా దోస్తు  

కూర్చున్న మూడోక్లాసు బండి కోటప్ప కొండ తిరణాల కన్నా జనం ఎక్కువగా  ఉన్నారు, ఎటు చూసిన జనం రైలు పైభాగాన జనం, అసలు కదులుతునట్లు తెలియటం లేదు.  

బిచ్చ గాళ్ళు తోసుకుంటూ పాడుకుంటూ జొరబడ్డారు . "అనాది వాణ్ణమ్మా! అంధుణ్ణి తల్లీ!" అంటూ మధ్య మధ్య ఆర్తనాదాల్ని మా మొహన్ని విసరేస్తూ, "కల్ల నిజమౌతాది - నిజము కల్లౌతాది - బ్రహ్మమూ!", "కలనిజమాయే బ్రతుకు వేదమాయే " అంటూ పాడేసుకుంటున్నాడు, మా పెట్టెలోకెక్కిన గుడ్డాడు. మరో బిచ్చగాడు. 

దాంతో నా నరాల్లో, నిబిడీభూతమైన ఫిలాసఫీ దొంతర్లు నా ఆజ్ఞలేకుండానే పైకి ఉబికి వచ్చేస్తున్నై. ఆత్మధైర్యం సడలిస్తున్నది, మన పరిస్థితి కూడా ఇలా మారుతుందా దేవుడా ... 

కళ్లెత్తేను. జనం గేట్లను కుమ్ముకొని నుంచున్నారు. పురాణాలు - హరికథలూ- సంసారాలూ - కరువులు - యుద్ధం - ఒకటేమిటి మా పెట్టి అంతా ఒక సంసారమై పోయింది. సియురా అన్నట్టు "ఈ ప్రయాణం ఒక సంస్థ". ఇద్దరు తెలుగువాళ్లు గుప్తాగారి మరణానికి వాపోతున్నారు. ఒకరు మరిచెంబు కధ చెపుతున్నారు, పూర్వం నేలమానికల్లో ధనం దాచేవారు, మరలా అదే వస్తుంది ఎందుకంటే బ్యాంకుల్లో తెలియకుండా డబ్బులు కాజేసే వ్యవస్థ వచ్చింది ఎవరు పట్టుకోలేని ఆపరి స్థితి వస్తున్నది. ఇప్పుడు ఓటర్లు తీస్తున్నారు, రేపు డబ్బు తీయరని నమ్మకం ఏమిటి ?    

నా వూహలు తాళ్లు తెంచుకు పరుగెత్తుత్తున్నై గిత్తదూడల్లా. దారం తెగిన గాలిపటం లా, తీగ తెగిన వీణలా, ఒకవైపు చవట, మరోవైపు తిరగని పంఖాలు .....   

నా చూపుల్లో యేదో అన్వేషణ వుందని అనుమానించాడు గాబోలు రెప్పవాల్చక చూస్తున్నాడు వంకీమీసాల హిందీసోదరుడు, పిల్లవాన్ని ఎత్తుకొని స్థలం అడుగగా నేను నుంచోవటం తప్పని పరిస్థితి.     

సాధారణంగా రైలులో అవలంబించే మౌనం నా స్వాధీనంలోనేవుంది. మరోవైపు గుండె లదిరేటట్లు పెద్దగ అరుస్తూ కడలి కెరటం లా ఉరకలేస్తుంది.   

నాలోని యేదో శక్తి నన్ను చూచి నవ్వింది - నిస్సహాయంగా తలొంచి.

"అయినా ధీరులు ముందుకే పోతారు" అనే ఫులుస్టాపులు పూర్తిచెయ్యకుండానే నా పయనం, మధ్యలో "పోర్షను మఱచిన డ్రామా యేక్టరుకు మల్లె" దిక్కులు చూస్తూ నిలబడి ఉండి పోవాల్సిన స్థితి ఏర్పడింది. 

స్త్రీలుగూడా యెంతోమంది వుంటంచేత కోమల కంఠాల కోలాహలంగూడా రేగింది. స్వస్థిక్‌లోలకులు చెమక్‌గా కదులుతున్నై. వాటి మెరుపులు పలుచని, తెల్లని స్నిగ్ధకపోలాలమీద వెలుగుతున్నాయి. ఆ సుందరాంగి ముంగురులు వినిపించని సందేశాలు గాలిలోకి వదులుతున్నై. అవి వేషాలు కాదు, అలసిన ఆడవారు.   

అంతలో ఎదో అవాంతరం వచ్చినట్లుగా ఒకసారి రైలు ఆగింది. చెట్లపై నుండి  పూలు రాలినట్లు ఒక్కసారి అందరు దిగారు. 

కారణం ఏమిటా అని అందరు అనుకుంటున్నారు, ఏమిటో, ఎం జరిగిందో.  ఏది తెలియక క్రిందకు దిగలేక ఆ రైలు పెట్టెలో ఒక్కడ్నే ఉండిపోయాను 

--((**))--

రైలు ప్రయాణంలో ఒకరోజు (2)
ప్రాంజలి ప్రభ - చిన్న కధ 
మల్లాప్రగడ రామకృష్ణ 

రైలు కదులుతున్నది, కాలక్షేపం మొదలైనది, 
అక్కడ కొందరు స్త్రీలు టి.వి. గురించి మాట్లాడు కుంటున్నారు   

ఒక స్త్రీ ని స్త్రీ గా గౌరవించగలిగినప్పుడు... ఈ దేశం ఈ విధంగా ఉండదు, స్త్రీలకోసం ప్రాత్యేక రైళ్ళు వేసే వారు.    

ఒక స్త్రీ ని అత్యంత క్రూరమైన విలన్ గా చూపించె  సీరియల్స్ వస్తున్నాయి కేవలం వ్యాపారం కోసం ఉద్రేకాలను చూపడం అవసరమా, మనిషి మేధస్సును బలిచేయటం అవసరమా  ....

ఒక స్త్రీ ని సినిమా పాటల్లో అసభ్యకరంగా చూపించి డబ్బు చేసుకుంటున్నారు ఇది దేనికి స్త్రీ అంటే అంత చులకనా ...

ఒక స్త్రీ ని సబ్బులపైన, పౌడర్ లపైన  Product Advertisement కోసం అసభ్య అభ్యంతరకరంగా చూపిస్తున్నారు ఎందుకని ....

ఒక స్త్రీ జగుప్సాకరమయిన, వికృతమయిన, అభినయంతో కూడిన పాత్రలను సినిమా, సీరియల్స్ లో నటింప చేయుచున్నారు ఎందుకని ....

ఒక స్త్రీ ని స్త్రీ, పురుషులిద్దరూ మానవీయ కోణంతో చూడగలిగినప్పుడు.....

అప్పుడు... అప్పుడే స్త్రీ కి విలువ యుంటుంది. 

పక్కనే ఒక కవి గారు కూర్చున్నారు, అందరి మాటలు వింటున్నారు, 

అందంగా ఉన్నారు అంటే మొఖం అదోలా పెడతారు, అందంగా లేరంటే మరోరఖంగా పెడతారు ఎందుకని అన్నాడు. 

అక్కడ ఒక స్త్రీ మాకు మొగవారిని గౌరవించే లక్షణం మాకు ఉంది అదే మా బలహీనత దానినే ఆధారంగా మమ్ము అడిన్చే లక్షణం మొగవారికి ఉన్నది అన్న ది పౌరుషంగా.    
అవును స్త్రీ లు చాలా గొప్పవారు అందుకే నేను ఎప్పుడూ గౌరవిస్తాను 

అవునండి వారి కష్టాలు ఎవ్వరూ గమనించరు, నిముషములో అందివ్వలేదని అలిగే మొగవారు, అసలు స్త్రీ లంటే 

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చేది 
రక్తాన్ని పాలుగా మార్చి ప్రాణాన్ని బ్రతికిచ్చేది  
ప్రాణాలు ఇవ్వటం కాని పుచ్చుకోవటం తెలియనిది 
ఏ చీడపీడలు శోకకుండా అమ్మ కంచెగా ఉంటుంది
నీ భవిష్యత్తును తీర్చి దిద్దే చదువుల తల్లి అవుతుంది 
అమ్మగా, అత్తగా, అక్కగా, చెల్లిగా, భార్యగా సహకరించేది 
మాన  ప్రాణాలను గుప్పెడులో పెట్టుకొని నడిపించేది 
అది మొగవాడు గుర్తించి తే అదే మాకు పదివేలు 
అంటూ ఆవేశంగా చెప్పింది మరో వనితా       

అప్పుడు ఒక స్త్రీ టిక్కెట్ కలెక్టర్ గా అడుగుపెట్టింది 
చదువు కున్నవారు కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు 
వీల్లని ఏమి చెయ్యాలి ఒక ఖైదిల్లు లాగా స్టేషన్లో అప్ప చెప్పటం భాదగా ఉన్నది 
ఈ విధానం ఎప్పుడూ మారుతుందో, ఇక్కడ కూడా బయోమెట్రిక్ పెడితే ఎంత బాగుంటుందో అంతా నిజాయితి పరులే ఎక్కుతారు కదా మాష్టార్ గారు 
అవును 

ఇప్పుడే కంపూటర్ అంటూ వచ్చి అనేక ఉద్యోగాలు పోయినాయి, అవికూడా ఇక్కడ పెడితే మీ కూడు పోతుంది తెలుసా 

ఆ  ...  టిక్కెట్టు టిక్కెట్టు అంటూ కదిలింది 

రైలు కూతలో ఒక్కసారి నిద్రనుండి లేచినవారు ఎం జరిగింది 
స్టేషన్ వస్తే లేపండి అంటూ పడుకున్నాడు ఒక మహానుభావుడు ..  


--((**))--             

ఒక రోజు రైలు ప్రయాణం (3 )
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
    
రైలు కదులు తుంది, ఒక బోగీలో విద్యార్ధులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటు  న్నారు. 
అదులో ఓఅక విద్యార్ధి   

రైలు పట్టాలకూ, కాలిపట్టాలకూ అనుబంధం ఏమిటి?
రైలుపయాణానికి పట్టాలు పట్టు అవసరం, కాలి పట్టాలు అమ్మాయికి అందం అన్నాడు.   

రైలు పట్టాల మీద వుంటుంది, కాలి మీద పట్టాలుంటాయి. అన్నాడు మరొకడు 

కనలేని స్త్రీమూర్తి ఎవరు?
స్వార్ధపు ఆలోచనలతో ధనం ఉందని అహం భావంతో ఉండే స్త్రీ అన్నాడు 

న్యాయస్థానము లో వున్న న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా! అన్నాడు మరొకడు 

సోమవారాన్ని 'మండే' అనెందుకంటారు?
సండే అన కూడదు కాబట్టి, మండే చోట ఉద్యోగం చెయ్యాలి కాబాట్టి అన్నాడు ఒకడు     

ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము  కదా! సోమవారం పొద్దున్నే పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! అందుకని 'మండే' అంటారు. అన్నాడు మరొకడు 

ఈ రోజుల్లో పిల్లలు తల్లిని Head Cook గా చూస్తున్నారు . మరి తండ్రిని
ఎలాచూస్తున్నారు?
తండ్రిని నమ్మించి మోసం చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు అన్నడు ఒక డు 
ATM లాగా చూస్తున్నారు. అన్నాడు మరొకడు 

సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు?
చిటికేస్తా అన్నాడు ఒకడు 
పాలిచ్చేవైతే అవధానం అయ్యాక యింటికి తోలుకెళ్తా తిసికేల్తా అన్నాడు మరొ కడు   .

మనిషికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
క్యూరియాసిటీ అన్నాడు ఒకడు 
---- 'పబ్లిసిటీ ' అన్నాడు మరొకడు 

తుద+ తుద =తుట్టతుద, కడ +కడ = కట్టకడ, అవుతుంది కదా! 
అర టీ+ అరటీ , ఏమవుతువుంది?

అర టీ+ అర టీ = ఫుల్ టీ అవుతుంది అన్నాడు ఒకడు .

క్రికెట్ ప్లేయరుకీ, అవధానికీ సామ్యం ఉందా?

వాళ్ళు world play కి వెళ్తారు, మేము words play కి వెళ్తారు .

అద్దంముందున్న ఆడువారికీ, మైకుముందున్న అమాత్యులకీ 
తేడా ఏమిటి?

ఇద్దరికీ సమయం తెలియదు.

ఇలా సమయం తెలియకుండా మాటల మధ్య కాలం జరిగి పోతున్నది, రైలు ప్రయాణం వేగం పుంజు కుంటున్నది. 
వీరి మాటలు కొందరికి ఇబ్బంది కరం గా ఉన్నది, ఎందుకనగా మాటలు కడుపులో ఆకలి తీర్చవుకదా....  
అందరూ బాక్సలు తీయండర్రా పిల్లలు అన్న బామ్మ గారి మాటలకూ అందరూ నిశ్శబ్దం గా మారారు. 

అప్పుడే ఎదో స్టేషన్ వచ్చినట్లుంది గబగబా అందరు బ్యాగులు అందు కుంటున్నారు. 
      
ఒక అబ్బాయి వచ్చి గబాగబా కాలు ఎత్తండి పెట్టి తియ్యాలి అన్నాడు ఒక స్త్రీ తో  
అందరూ ఒక్కటే నవ్వారు, అట్లాగే ఉండు ఇప్పుడే నేను తీసి ఇస్తా అంటూ వంగి లాగి ఇచ్చింది. 
పెట్టెను నెత్తిమీద పెట్టుకొని నడిచాడు గేటు వైపు అంతటితోనే రైలు కదిలింది, నేను దిగాలి, నేను దిగాలి అంటూ తోసుకువచ్చినా రైలు కదిలాక దిగనియ్యక ఆపారు అందరూ .... 
--((**))--      

రైలు ప్రయాణంలో ఒకరోజు (4 ) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )  

రైలు కదులుతున్నది ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు ఆజానుబాహుడు పెద్ద ముళ్ళు కర్ర చేత ధరించి ఉన్నాడు గోచి తప్ప వేరే వస్త్రం లేదు. ఏవేవో పా డుతున్నాడు ఎక్కడున్నవారు కొందరు పిచ్చోడని అన్నారు, మారికొందరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఎవ్వరు ఏమన్నా పాట పాడుకుంటూ పోతున్నాడు ఆ రైలు పెట్టెలో ....      

మిలో 
  
గర్వభావము వదిలి వేయన్నా 
సృష్టి లోన భూమియంతో స్వల్పమగునన్నా ...

దైవచింతన కలిగి  యుండన్నా 
నిద్ద్రలేవగా దైవనామము స్మరణ చేయన్నా .... 

ఎట్టిప్రాణికి కీడు వలదన్నా 
కీడుచేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా ....

దేహమందున సొగసు లేదన్నా
సొగసు అంతయు ఆత్మలోఁ కలదురోరన్నా ....  

క్షణికమైనది జీవితంబన్నా 
పరమార్థ తత్వము జాగుచేయక తెలుసుకోరన్నా ...

దివ్యమంత్రము జపము చేయన్నా 
పరమాత్మ కృపచే సాధనంబులు సుళువు అగునన్నా ...

కాలమెంతో విలువ కలదన్నా 
క్షణమైనా దానిని ఖచేయకు భోగమందన్నా 

గీతవిద్యను చదువు కోరన్నా 
అద్దానియందున, ఉపనిషత్తుల సారముందన్నా ...

సాధనంబును చేయవలెనన్నా 
అనుభూతియంతయు సాధనంబుచె గట్టిపడునన్నా ...  

చాలా చక్కగా పడుతున్నారు, ఈ రైల్లో అడుక్కోవటం నీకు సిగ్గు గా లేదు అన్నాడు ఒక విద్యార్ధి నవ్వుతూ.

మీరు చేస్తున్నదేమిటో అనిఅడిగాడు 
ఆ మాటలకు నోరు రాలేదు ఎవ్వరికి      

మీ తల్లి తండ్రులు మిమ్మల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, ప్రపంచాన్ని చూడండి అని పంపితే వారిని మర్చిపోయి అహంకారంతో నేను ఎక్కువచదు వు కున్నాను కనుక ఉద్యోగము వచ్చింది అని గర్వపడుతున్నావు, దాని వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించ లేకపోతున్నావు.   

నీలో ఉన్నా గర్వాన్ని తొలగిస్తే అంతా సృష్టి నీకే అర్ధ అవుతుంది. భూమిమీద ఆవగింజ అంతా ఉన్న ఇల్లు ఉద్యోగం చూసి మురిసి పోతావు. 

సత్వరము జీవితం సార్ధకం చేసుకొనుము, నిత్య దైవాలను పూజించి అరా ధించుము. హింస భావము వదలి అహింసా పరమోధర్మ: అని భావించి
జీవించుము.    

దేహమందు జిహ్వ చాపల్యము ఆ బ్రహ్మ కైన తప్పలేదు, మనం మానవ మాత్రులం, క్షణిక సౌందర్యానికి  లోన్గిపోతాం అది తప్పు కాదు ప్రకృతి మాయ 
లీలలకు ఆ పరమాత్ముడైన శ్రీ కృష్ణుడే లొంగక తప్పలేదు. 

కాలయాపన చేయక గురుచెంతన చేరి ధర్మ మార్గం తెలుసుకొని జీవించటమే అందరి లక్షణం, వయసుడికిన తర్వాత నాలాగా భొదలు చేసి బతకటమే బాబు.
ఇది అంతా మిధ్యా, నేటి పువ్వు రేపటికి వాడిపోవును అది మాత్రం గుర్తించుకోండి నేడు ఇక్కడ రేపు ఎక్కడో ఎవ్వరు చెప్పలేరు, ఇక్కడ మీరున్నారను కుంటున్నారు రేపు ఎక్కడ ఉంటారో ఎవ్వరికి తెలియదు  అంటూ చెప్పుకుంటూ వెళ్లి పొయ్యాడు ఒక సాధువు. 
                
గాలి నీరు వెలుతురు అందరికి అందించటమే నాలక్ష్యం హరహరమహదేవ్ 
శంభో శంకరా అంటూ ఒక్కసారి ట్రైన్ నుండి దూకాడు.

అందరు చూస్తు ఉండిపోయారు, ట్రైన్ గొలుసు లాగారు ట్రైన్ ఆగింది కానీ సాధువు కనిపించలేదు.
అప్పుడే పోలీసులు రైలు పెట్టెలోకి  ఒచ్చారు ఎవరు చైన్ లాగారు అని అడిగారు, ఎవ్వరూ మాట్లాడలేదు. 
ఏది ఏమైనా వేలమంది ప్రాణాలు కాపాడారు చైన్ లాగి
ముందు పట్టాలు ఎవ్వరో పీకేసారు పెద్ద ప్రమాదం నుండి తప్పించారు అన్నారు
అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..... 


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి