2, మార్చి 2019, శనివారం

 ఓం శ్రీరామ్ - శ్రీమాత్రేనమ:
లలితా గీతం - ప్రాంజలి ప్రభ- 101 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
షకలక షకలక బేబి
షకలక షకలక బేబి
మరువకు మరువకు బేబి
మరువకు మరువకు బేబి

కనుల కైపుతో వేదించకు బేబి
చనువు మాటతో భాదించకు బేబి
చిరుతలా పరుగెత్తించకు బేబి
మనసుమీద కొట్టి కులకకు బేబి ..... షక  

యాత్రాభిలాషను పెంచకు బేబి
అనుభవం తెల్సి వదలకు బేబి
మనస్సు నిత్యలత్వంగా ఉంచు బేబి
మనోనిగ్రహం వదలి నటించకు బేబి.. షక 

ఆహారశుధ్ధిచే రక్తశుధ్ధి కలుగును బేబి
రక్తశుధ్ధిచే దైవస్ముతి కలుగును బేబి
దైవస్ముతిచే బంధవిముక్తి కల్గును బేబి
శరీరంలో స్వయం జ్యోతి ఉంది బేబి ..... షక 

ఒకవైపు మంచు ముక్కలా ఉంటావు బేబి
మరోవైపు నిప్పు కనికలా ఉంటావు బేబి
ముందువైపు ఆశచూపి నీరుకారుస్తావు బేబి
ప్రతి నిముషం నరకం గుర్తుచేసావు బేబి .... షక 

షకలక షకలక బేబి
షకలక షకలక బేబి
మరువకు మరువకు బేబి
మరువకు మరువకు బేబి
షకలక షకలక బేబి
మరువకు మరువకు బేబి...... ..
మరువకు మరువకు బేబి.....
ప్రాంజలి ప్రభ  
లలిత గీతం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కలువల రాయ కన్నె మనసు తెలుసుకోవా 
సొగసు అందాలు వచ్చి జుర్రు కోవా 
అందాల చందురుడ అందుకొన రావా 
అందుకో యీ కలువ అనురాగ ప్రేమ

మందార పువ్వులే సన్నాయి పాడగా
సంపెంగ నవ్వులే స్వాగతము పలుకగా 
గంధపు చెట్టులే సువాసన వెద చల్లగా 
కస్తూరి పరిమళాలు గుభాలింపితో పలుకు  

రావోయి నెల వంక రాతి రయ్యేను రా
రగిలిన నా మనస్సును రాస లీలలో దింపవా 
కళలెన్నో చూపి కామితార్ధం గ్రహించగా రా 
నా కంటిలో పున్నమి వెన్నెలను నింపవా   

ఈ చల్లని రేయిలో అందాలు విరబోసి ఉంచా  
చల్లని గాలితో వచ్చి చక్కగా పనిచేసిపోవా 
కలువల రాయ కన్నె మనసు తెలుసుకోవా 
సొగసు అందాలు వచ్చి జుర్రు కోవా

--((**))--


లలితగీతం
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

గాలి సాగింది - దూరంగా  -  ప్రవాహంగా
గాలి సోకింది - దగ్గరగా - సుతారంగా
లోనమోగింది - రంగంగా - వయారంగా
గుండె జల్లంది - తాకంగా -  ఆవేశంగా
గాలి సోకింది - గుండె జల్లంది
గుండె జల్లంది - గాలి సోకింది

చరణాలు
మనసులో దాగింది - మౌనంగా - మహాదొంగా
మమతతో పాడింది - కావ్యంగా - విలాసంగా
ఉరుకుతూ పలికింది - వేగంగా - ఆశగా
ఊహల్లో తిప్పింది- గుండె జల్లంది - గాలి సోకింది

చినుకై వచ్చింది -  రాగంగా, తాళంగా పల్లవిగా
కలలో పాడింది - సుతారంగా - కావ్యంగా
సుధలే పంచింది - తీయంగా - వరించంగా
ఊహల్లో తిప్పింది- గుండె జల్లంది - గాలి సోకింది

వయసు పిలిచింది - సిగ్గుగా - సుహాసినిగా
వలపు పండింది - ముభావంగా - మధురంగా
తనువు తడిసింది - ప్రేమగా - సందర్భోచితంగా
ఊహల్లో తిప్పింది- గుండె జల్లంది - గాలి సోకింది

గాలి సాగింది - దూరంగా  -  ప్రవాహంగా
గాలి సోకింది - దగ్గరగా - సుతారంగా
లోనమోగింది - రంగంగా - వయారంగా
గుండె జల్లంది - తాకంగా -  ఆవేశంగా
గాలి సోకింది - గుండె జల్లంది

--((**))--


లలిత గీతం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు
నీ పంట కన్నీరు కార్చుట నే చూడలేను !
నా శక్తి యుక్తి ఉన్నంత వరకు కాపాడగలను !
నీ మాట ఎప్పటి కీ జవదాటలేను !
నా ధర్మం తప్పకున్నతవరకును !..... నా
చినుకుల చేష్టలు దడ దడ ఏల !
ప్రేమంబు జలజల కురుయుట ఏల !
నడకలు నష్టాలు, నకనక మేల !
దేహంబు గలగల, దయచేయు వేళ! ... నా
గుండె శబ్దం పిల్చింది , ఆశల్ తీర్చేో !
మూగభాష మారింది , మౌనం విడింది !
వలపంత పొంగేది, దాహమున్ దీర్చ !
మనువంత కోరేది, మమతముప్పొంగ! .... నా
సేవలన్ని చేస్తాను వేచ్చిస్తాను సమయాన్ని !
కథ లేమి చెప్పనే పంచుతాను తరుణాన్ని !
కథ విని మనసు మార్చుతా గతాన్ని !
జతకూడి సేవలే మతులన్నిసన్ని ! .... నా
కర్మ బంధువు నేను హాయంత నీదె !
ఆత్మ సేవలు పంచె ప్రేమంత నీదె !
నీ పంట కన్నీరు కార్చుట నే చూడలేను !
నా శక్తి యుక్తి ఉన్నంత వరకు కాపాడగలను !
నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు
నా కంటి వెల్గువు నీవు, నా మనసులో ఉన్నావు
నా పరివర్తన మార్గం నీవు, నా బుద్ధికి ప్రధానివైనావు
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి