7, డిసెంబర్ 2024, శనివారం

 మాతా పితా గురు కృపా కల్ప లహరీ..


వనిత తనంత తానుగను పాలనునీళ్లను కల్పి వేడిగన్ 

గణితముకొంత కూడిక సకామ్యముగాను సమర్థతేయగున్ 

ప్రణితప్రభావమేగతి యుపాయ మనస్సుయశస్సు చూపుటన్ 

క్షణికము కోపమైయననుకాల సహాయముతోను సుఖమ్ము జీవమున్ 


మార్గము ధర్మ వాక్కులగు మానస తృప్తియు యెల్లవేళలన్ 

భార్గవ రామలీలలగు బంధము నేస్తము భాగ్యమేయగున్ 

దుర్గము శాంతి లక్ష్యతము ధూర్థుల నుండియు రక్షణమ్ముగన్ 

స్వర్గము దానధర్మమగు సత్యసహాయములే శరణ్యముల్ 


ప్రకృతిప్రభావ లక్ష్యమగు పాశకుటుంబమనస్సు యేకమే యగుటన్ 

ప్రకృతి సహాయమేపుడమి పాత్రఫలమ్మగు నారునీరుగన్ 

ప్రకృతియు సేవవోరిమియు పాలనజీవముగాను నేస్తమున్ 

సుకృతియు దేహవాంఛలగు సూత్రముబత్కుయునీడ తోడుగన్


ఓటమి గెల్పుకే మనకు వోర్పు సమర్థత పెర్గగల్గగన్ 

కూటమితిండియున్ యగుటసూత్రముకర్ణునిధైర్య మోడుటన్ 

మాటల కృష్ణలీ లగుట మానస యర్జునగెల్పు మూలమున్

ఆటగ గట్టి పట్టుదల ఆశయ సిద్దియు సర్వమేయగున్ 


సజ్జన దుర్జనన్ కలవ సాగదు వాక్కుల విద్య నంతయిన్ 

సజ్జన దూరమైన కథ సాగును ప్రేమగ నేస్త ధర్మమున్ 

సజ్జన వాక్కు వర్షమగు సారము గాంచగ మేలు జర్గుటన్ 

సజ్జన తామరాకు జల సంఘట బట్టియు వెల్గు జీవమున్


ఉ.వేగము నుండునే మనసు వేకువ కాంతులు గన్న నిత్యమున్ 

యోగము పెద్ద పృద్వికళ యోగ్యత బట్టియు విశ్వమందునన్ 

భోగము ప్రేమయున్ మనిషి బోధలు యిష్టము నిద్రకన్ననున్ 

రోగము యాశచావకయు రోషము  నొప్పకు వాక్కులేయగున్


వాటం బట్టుచుముద్దు జేయుచుకళల్ వాశ్చల్యమే జూపగన్ 

త్రాటం గట్టుచు నోటద్రోయుదురిటన్ తత్సారమున్ వీడుచో 

తాటించున్ విధిగన్ సకామ్యమగుటన్ తాపమ్ము దాహమ్ముగన్ 

మోటించున్ మనసున్ కదల్ తెలపగన్ మోక్షమ్ము తీరేందుకున్


దక్కినదానితో కలసి దారుణమేయని చెప్పు చుండిరే 

చిక్కెను ఆడు దానికని చీకటి బత్కులు గాను సౌఖ్యమే 

ఎక్కడ జూచినం పురుషులెళ్లరు జేరిరి నాడు వారితోన్ 

మక్కువ తీర్చనేస్తమని మానస తృప్తికి ఆడదేయగున్


కరుణను జూపలేనిదగు కామిని జే ష్ట జపమ్ము యేలనో 

శరణము కోర కుండగను శక్తిని జూపెడి మాయ యేలనో 

 మరణము కోరి వచ్చినది మానిని నీవెటు లాద రించెదో 

తరుణము తృప్తి చాలనియు తాపము జూపెడి మోహి నీసుధీ


యాదేవీ కళ సర్వమంగళపు విద్యావాక్కులే మాయగన్ 

శ్రీదేవీ మది శక్తి యుక్తిగను శ్రీ విశ్వమ్ము మేలే యగున్ 

భూదేవీ దయకర్మలేయగుటయున్ భుక్త్యమ్ము భాగ్యమ్ముగన్

యాదేవీజయ వాంఛసిద్దిగనునున్ యాశ్చర్య సేవన్ గనున్ 


అమ్మలగన్నయమ్మ బహు యాశ్రిత శక్తిగ సర్వమంగళన్ 

అమ్మలగన్నయమ్మ కళ యాణతి యుక్తిగ సర్వసిద్ధిగన్ 

అమ్మలగన్న యమ్మ శుభ యాసయ లక్ష్యముతీర్పునేర్పు గన్

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ జీవమున్ 


చం.కరుణ యెలేనివానిగతి కర్ణుని గానుసహాయ మన్ననున్ 

శరణమె యన్నజూడకయు శాపముగానుయె కర్మ చేయటన్ 

తరుణము తృప్తిగాంచుటయు తన్మయమేను సకామ్య బుద్ధిగన్ 

చరణము పట్టినా ప్రకృతి ఛాయయు వెంబడిపోవ తప్పదున్


ఉ. చక్కని చుక్కగన్ పలుకు జాగృతి నిమ్మిద సంప దేయగున్ 

దక్కినచూపులన్ గలిపిదారులు మార్చక నెమ్మదింపుయున్

మక్కువ కళ్ళతిప్పకళ మానస యత్నము దేహతాపమున్ 

తక్కువ చేయకా కదల తాహత జూపుట యెల్లవేళలన్


చ.సతిగను  యేడిపించు పతి సాగుట జీవన ముఖ్యమేయగన్ 

గతిగను తప్పిపోవు మతి గమ్యము తీరుగ సేవలేయగున్ 

పతిగను బాధపెట్టు సతి పాశము మారుటు భూతలమ్మునన్ 

స్థితిగను కోలుపోవు గతి సీఘ్రము కాలము నీతి చెప్పునున్ 


మ.అగుపించాలిలె చూపులోచురుకుగన్ యాకర్ష సౌందర్యమున్ 

తగు చిందవ్వట తాను నేనుగనునున్ తాదృశ్య మాధుర్యమున్ 

నగుమోమేకళ గాను కాలమగుటన్ నాట్యమ్ము శృంగారమున్ 

తగునా నామది దోచు తృప్తిగనుటన్ తాత్పర్య బంధమ్ముగన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి