17, డిసెంబర్ 2024, మంగళవారం

దేవీ.. శ్రీదేవీ నవ శతి 900 విడివిడిగా వృత్త పద్యాలు (ఛందస్సు )

 దేవీ.. శ్రీదేవీ నవ శతి

900 విడివిడిగా వృత్త పద్యాలు (ఛందస్సు )

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, విశ్రాంతి ఘనణాoకాధికారి మారియు ప్రాంజలి ప్రభ రచయిత 


..001. అ (న )ర్ధితం... (భభ భభ  భభ నయ.. యతి..10,19)

 అమ్మగ మీ కృప మీ దయ మాకును నొప్పిద జీవిత మనసుగు దేవీ

నెమ్మది పర్చెద పుణ్యము నేస్తము నిత్యము సత్యము నయనము దేవీ

సమ్మతి మీ దయు మీ విధి  శోధన నమ్మది వేడుక సాధన తరుణము దేవీ

ఉమ్మడి నీడన సేవిత ఉన్నతి చిత్తము నుంచియు సహన ము దేవీ


002.అంగన..... (భభ భభ భమ... యతి 7,13)

భారత మాతవు భాగ్యపు దాతగ బానిస బంధమ్మున్ 

ధీరుల పెన్నిధి ధీయుత సన్నిధి దీనుల దీపమ్మున్ 

నేరము చేయని నీడన నున్నటి నమ్మిన నేస్తమ్మున్ 

దారులు నీదియు ధన్యత నెమ్మది ధ్యానము శ్రీ దేవీ


.03. అంతర్యనితా... (మ.స మ  గగ.. యతి..7 )(2)

కారుణ్యం తలపే కర్తవ్యం నీదే. కామాక్క్షి హృదయం కర్తుత్వం దేవీ 

దారిద్యం మలుపే ధాత్రుత్వం నీదే, దాంపత్యం మెరుపే ధ్యానమ్మున్ దేవీ 

నారి ప్రేమగుటే నాణ్యత్వం నీదే, ఖ్యాతి క్షేమముగా కామ్యత్వం దేవీ 

మారమ్యత్వముగా మాతృత్వం నీదే, ప్రారబ్దమ్ము మదీ మాతా శ్రీదేవీ


004.అంబుజ... (భ జ స స గ...యతి..10)


కాలమున గీత పలుకే కళలేగా, దానముయు ధర్మ సహిదారి గతేలే 

పాలు జలమేను బ్రతుకే పఠమేగా, మానముయు మర్మ మన సమ్మది యేలే 

వీలు తలపేను పలుకే వరమేగా, ప్రాణముయు కర్మలగు పాఠ్యముగాలే 

మేలు మలుపేను చిలికే మది దేవీ, వాణియు వినమ్రత విధీ శృతి దేవీ


005. అగ్ర.. (తత తత త గగ... యతి...12)

 సత్యమ్ము ధర్మమ్ము  సంతృప్తి నిత్యాస విన్యాస మేలే

పైత్యమ్ము జీవమ్ము కర్మమ్ము సంప్రా ప్తి సంధిప్త మేలే

నిత్యమ్ము కార్యమ్ము వైనమ్ము కార్యర్థి తత్త్వమ్మి దేలే

పత్యమ్ము కాలమ్ము మోక్షమ్ము సామీప్య కావ్యక్త దేవీ


006. అచలపంక్తి : (ర న స గ.... 6)

 ధర్మరక్షణ ధరణి పైనే, సర్వదృష్టియు సమయమేలే

కర్మయన్నది మనసు పైనే, కార్యసంపద కరుణయేలే

నిర్మలమ్మగు నియమమేలే, నిర్వి రామము నిజముయేలే

మర్మ నీతి మమత దేవీ, పూర్వ నిర్ణయపుడమి దేవీ


007. అజపా .... జ ర భ జ న స గ.  యతి .10

తరాలు మారినా భాద్యత తపమ్ము నిజము పలుకే గా

స్వరాల పల్లవీ పాటగు సమర్ధ వినయ విలువే గా

ధరాతలమ్ముగా సేవలు ధనమ్ము బతుకు తలపే గా

పరాత్పరా నిజమ్మేనులె పెదాల పరిణ తిగ దేవీ


 009.అతిలేఖ (స జ జ న య :యతి -6)

మనసంత యీ మధనమ్ము  చిలుకుట యేలా

తణువంత యీ తపనమ్ము తలచుట యేలా

పనినందు యీ ప్రతిభాయె మరచుట యేలా

అణువంత యీ హృదయమ్ము యణుకువ దేవీ


010. అతిశాయినీ (సస తభ జగ గ  :యతి - 10)

వినదల్చిన పాఠమ్మేను విద్యలగు నేత్ర మోనే 

మనమన్నది మార్గమ్మేను మంత్రమగు చిత్రమోనే 

తృణమన్నది దేహమ్మే తత్వమగు తంత్రమోనే 

ప్రణమన్నది దాహమ్మే పాత్రలగుచుండు దేవీ 


011. అధీరకరీరం (మ న న భ స న జ య ... యతి 10 , 19 )        

సంతోషమ్ము వినయమగు సాక్షిగ సుఖమే జయము సతంత్రము నేర్పే

సంతాపమ్ము రుధిర మగుట  సాగియు భయమే సహజ సమర్ధత తీర్పే 

పంతాలన్ని మరుగుపడుట పాఠము తలపించుపలు ప్రధానము కూర్పే   

సంతానమ్ము నిజమగుటయె సాధన మలుపేపలు సహాయము దేవీ 

012. అనంగలేఖా: (న స మ మ య య .యతి 12 )               

కళలు విజయమ్మే నిత్యానందాకావ్యమేలే  సయుక్తీ

పలుకు కలయే బంధుత్వం సంఖ్యా ప్రాయమేలే  విముక్తీ

తలపు నటనే జీవమ్మే సంధిత్వా ను రక్తీ స శక్తీ 

మలుపు తలపే సంతోషం మార్గమ్మే సభావ్యమ్ము దేవీ             


013 . అనంతదామా (న న స జ గ గ ...10 )      

 

కనుల కలయకులుగా కధామృతమ్మున్ 

మనసు మలుపులగుటే మనోహరమ్మున్ 

వినయ వలపులగుటే వినమ్ర తమ్మున్       

చనువు తలపులగుటే జపమ్ము దేవీ  


 014 . అనింద గర్విందు: (న య త ర గ గ .. 8)  

వినయపు విద్యా ప్రావీణ్య సర్వ మార్గమ్మున్  

మునుగుట మార్గం మ్మేముఖ్య కాలవైనమ్మున్ 

వణకుట కాలమ్మే వ్యాపకాల తీర్ధమ్మున్      

కనుల కసాధ్యం వాక్యాల భాష్య  శ్రీదేవీ 


015  అనిర్బర: (స మ గ గ - యతి లేదు )  

పర మాత్మా సంసారమ్మున్, పరయోగీ సంభావ్యమ్మున్ 

గిరిధారీ గా ప్రేమమ్మున్, సిరి నేతాగా దేహమ్మున్ 

నరసింహా ఆరాధ్యమ్మున్ జయ సింహాప్రారబ్దమ్మున్ 

చెరితిన్ దాసుండన్ దేవీ నికృపా దేహమ్ శ్రీదేవీ 


016 ..అనిలోహా .. స భ త య స  గ .. యతి .. 10  

పలుకే విద్యల తన్మాయ పదాలే కదలే గా

మలుపే జీవిత పాఠమ్ము మనోనేత్రములే గా 

కలలే వచ్చెను నిత్యమ్ము కథల్లే చెదరే గా 

తలపే మానస వేదమ్ము దయాతత్వము దేవీ          


 017. అనురాగ.. (స జ త ర ర గ...యతి 9)

సహకా రమేగ విశ్వాస రంగ మార్తాండ తీర్పే

అహమే స్వరాగ విద్యా ననంద మధ్యంబు మార్పే

సహనమ్ము దీప్తి సర్వాస్వ దాహ తృప్తీ సకూర్పే

దహనమ్ము దుష్ట దుర్బుద్ధి మోహ మాత్యర్య దేవీ


018. అనుసారిణి ( స న య న న స గ.. యతి.10)

కమలాకర వినయమ్మున్ కరుణ నయన సుఖమేలే

సమరమ్ముయు సహనమ్మున్ సహజ సుమధురకళేలే

సముఖమ్మున తరుణమ్మున్ సరయు సుఖము విధియేలే

గమనమ్ముయె వినయమ్మున్ గళము కథలుగను దేవీ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి