దేవీ.. శ్రీదేవీ నవ శతి
900 విడివిడిగా వృత్త పద్యాలు (ఛందస్సు )
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, విశ్రాంతి ఘనణాoకాధికారి మారియు ప్రాంజలి ప్రభ రచయిత
..001. అ (న )ర్ధితం... (భభ భభ భభ నయ.. యతి..10,19)
అమ్మగ మీ కృప మీ దయ మాకును నొప్పిద జీవిత మనసుగు దేవీ
నెమ్మది పర్చెద పుణ్యము నేస్తము నిత్యము సత్యము నయనము దేవీ
సమ్మతి మీ దయు మీ విధి శోధన నమ్మది వేడుక సాధన తరుణము దేవీ
ఉమ్మడి నీడన సేవిత ఉన్నతి చిత్తము నుంచియు సహన ము దేవీ
002.అంగన..... (భభ భభ భమ... యతి 7,13)
భారత మాతవు భాగ్యపు దాతగ బానిస బంధమ్మున్
ధీరుల పెన్నిధి ధీయుత సన్నిధి దీనుల దీపమ్మున్
నేరము చేయని నీడన నున్నటి నమ్మిన నేస్తమ్మున్
దారులు నీదియు ధన్యత నెమ్మది ధ్యానము శ్రీ దేవీ
.03. అంతర్యనితా... (మ.స మ గగ.. యతి..7 )(2)
కారుణ్యం తలపే కర్తవ్యం నీదే. కామాక్క్షి హృదయం కర్తుత్వం దేవీ
దారిద్యం మలుపే ధాత్రుత్వం నీదే, దాంపత్యం మెరుపే ధ్యానమ్మున్ దేవీ
నారి ప్రేమగుటే నాణ్యత్వం నీదే, ఖ్యాతి క్షేమముగా కామ్యత్వం దేవీ
మారమ్యత్వముగా మాతృత్వం నీదే, ప్రారబ్దమ్ము మదీ మాతా శ్రీదేవీ
004.అంబుజ... (భ జ స స గ...యతి..10)
కాలమున గీత పలుకే కళలేగా, దానముయు ధర్మ సహిదారి గతేలే
పాలు జలమేను బ్రతుకే పఠమేగా, మానముయు మర్మ మన సమ్మది యేలే
వీలు తలపేను పలుకే వరమేగా, ప్రాణముయు కర్మలగు పాఠ్యముగాలే
మేలు మలుపేను చిలికే మది దేవీ, వాణియు వినమ్రత విధీ శృతి దేవీ
005. అగ్ర.. (తత తత త గగ... యతి...12)
సత్యమ్ము ధర్మమ్ము సంతృప్తి నిత్యాస విన్యాస మేలే
పైత్యమ్ము జీవమ్ము కర్మమ్ము సంప్రా ప్తి సంధిప్త మేలే
నిత్యమ్ము కార్యమ్ము వైనమ్ము కార్యర్థి తత్త్వమ్మి దేలే
పత్యమ్ము కాలమ్ము మోక్షమ్ము సామీప్య కావ్యక్త దేవీ
006. అచలపంక్తి : (ర న స గ.... 6)
ధర్మరక్షణ ధరణి పైనే, సర్వదృష్టియు సమయమేలే
కర్మయన్నది మనసు పైనే, కార్యసంపద కరుణయేలే
నిర్మలమ్మగు నియమమేలే, నిర్వి రామము నిజముయేలే
మర్మ నీతి మమత దేవీ, పూర్వ నిర్ణయపుడమి దేవీ
007. అజపా .... జ ర భ జ న స గ. యతి .10
తరాలు మారినా భాద్యత తపమ్ము నిజము పలుకే గా
స్వరాల పల్లవీ పాటగు సమర్ధ వినయ విలువే గా
ధరాతలమ్ముగా సేవలు ధనమ్ము బతుకు తలపే గా
పరాత్పరా నిజమ్మేనులె పెదాల పరిణ తిగ దేవీ
009.అతిలేఖ (స జ జ న య :యతి -6)
మనసంత యీ మధనమ్ము చిలుకుట యేలా
తణువంత యీ తపనమ్ము తలచుట యేలా
పనినందు యీ ప్రతిభాయె మరచుట యేలా
అణువంత యీ హృదయమ్ము యణుకువ దేవీ
010. అతిశాయినీ (సస తభ జగ గ :యతి - 10)
వినదల్చిన పాఠమ్మేను విద్యలగు నేత్ర మోనే
మనమన్నది మార్గమ్మేను మంత్రమగు చిత్రమోనే
తృణమన్నది దేహమ్మే తత్వమగు తంత్రమోనే
ప్రణమన్నది దాహమ్మే పాత్రలగుచుండు దేవీ
011. అధీరకరీరం (మ న న భ స న జ య ... యతి 10 , 19 )
సంతోషమ్ము వినయమగు సాక్షిగ సుఖమే జయము సతంత్రము నేర్పే
సంతాపమ్ము రుధిర మగుట సాగియు భయమే సహజ సమర్ధత తీర్పే
పంతాలన్ని మరుగుపడుట పాఠము తలపించుపలు ప్రధానము కూర్పే
సంతానమ్ము నిజమగుటయె సాధన మలుపేపలు సహాయము దేవీ
012. అనంగలేఖా: (న స మ మ య య .యతి 12 )
కళలు విజయమ్మే నిత్యానందాకావ్యమేలే సయుక్తీ
పలుకు కలయే బంధుత్వం సంఖ్యా ప్రాయమేలే విముక్తీ
తలపు నటనే జీవమ్మే సంధిత్వా ను రక్తీ స శక్తీ
మలుపు తలపే సంతోషం మార్గమ్మే సభావ్యమ్ము దేవీ
013 . అనంతదామా (న న స జ గ గ ...10 )
కనుల కలయకులుగా కధామృతమ్మున్
మనసు మలుపులగుటే మనోహరమ్మున్
వినయ వలపులగుటే వినమ్ర తమ్మున్
చనువు తలపులగుటే జపమ్ము దేవీ
014 . అనింద గర్విందు: (న య త ర గ గ .. 8)
వినయపు విద్యా ప్రావీణ్య సర్వ మార్గమ్మున్
మునుగుట మార్గం మ్మేముఖ్య కాలవైనమ్మున్
వణకుట కాలమ్మే వ్యాపకాల తీర్ధమ్మున్
కనుల కసాధ్యం వాక్యాల భాష్య శ్రీదేవీ
015 అనిర్బర: (స మ గ గ - యతి లేదు )
పర మాత్మా సంసారమ్మున్, పరయోగీ సంభావ్యమ్మున్
గిరిధారీ గా ప్రేమమ్మున్, సిరి నేతాగా దేహమ్మున్
నరసింహా ఆరాధ్యమ్మున్ జయ సింహాప్రారబ్దమ్మున్
చెరితిన్ దాసుండన్ దేవీ నికృపా దేహమ్ శ్రీదేవీ
016 ..అనిలోహా .. స భ త య స గ .. యతి .. 10
పలుకే విద్యల తన్మాయ పదాలే కదలే గా
మలుపే జీవిత పాఠమ్ము మనోనేత్రములే గా
కలలే వచ్చెను నిత్యమ్ము కథల్లే చెదరే గా
తలపే మానస వేదమ్ము దయాతత్వము దేవీ
017. అనురాగ.. (స జ త ర ర గ...యతి 9)
సహకా రమేగ విశ్వాస రంగ మార్తాండ తీర్పే
అహమే స్వరాగ విద్యా ననంద మధ్యంబు మార్పే
సహనమ్ము దీప్తి సర్వాస్వ దాహ తృప్తీ సకూర్పే
దహనమ్ము దుష్ట దుర్బుద్ధి మోహ మాత్యర్య దేవీ
018. అనుసారిణి ( స న య న న స గ.. యతి.10)
కమలాకర వినయమ్మున్ కరుణ నయన సుఖమేలే
సమరమ్ముయు సహనమ్మున్ సహజ సుమధురకళేలే
సముఖమ్మున తరుణమ్మున్ సరయు సుఖము విధియేలే
గమనమ్ముయె వినయమ్మున్ గళము కథలుగను దేవీ
019. అపయోధా (స ర మ గ -7)
రమణీయమ్ము మార్పే దేహమ్మై, కలనేత్రమ్ముగా కాలమ్మేనున్
బ్రమణీ తత్త్వమే బ్రహ్మార్ధమ్మై, స్థల మోహమ్ముగా సాధ్యమ్మేనున్
నెమలీ సౌఖ్యమే నేత్రార్ధమ్మై, విలలాపమ్ముయే విజ్ఞానమ్మున్
కమణీయమ్ము మోక్షమ్మే దేవీ, కళ తీర్చే మనస్సే శ్రీదేవీ
020. అభిదాత్రీ (స స స జ ర గ యతి.10)
లిపికార సహాయపుజాలి సృష్టి దేహమే గా
విపులీకర వాదపు తావి దృష్టి దాహమే గా
ఉపవాసవిదీ సుమతోపు తృప్తి మో హమే గా
శుభధమ్మగు శోభిత వాసు దివ్య తేజ దేవీ
021.అభిరామా ( త జ య.. యతి లేదు )
కైలాస నివాస సుహాసీ, కైవల్యము పొంద సుభద్రా
ధీలోక వినమ్ర నివాసీ, ధీశక్తి సమర్ధ ప్రపర్ధా
మాలోన సహాయ పిపాసీ, మాయుక్తి వినోద నివాసీ
ఏలేమది నిత్యము దేవీ, యేలే మది సత్యము దేవీ
: 022. అమందపాద: (భ స జ గ గ..యతి 7)
ఖ్యాతి గనుటయే ఖజానచెంతన్, నాతి సహనమే సహాయ మొoదన్
జాతికి మెరుపే జయమ్ము చెంతన్ బ్రాంతిగ తలపే తపమ్ము నందున్
నాతికి మగడే ననేక తృప్తే, రాతికి సబబే కలౌను తృప్తే
స్వాతిచినుకులై సహాయ దేవీ ఖ్యాతిగమనమే జయమ్ము దేవీ
023. మాలతీమాల (య య మ గగ..7)
సమమ్మే జయమ్మే సంఘమ్మే శక్తీ సకాలమ్ సమానమ్ సమాజమ్ తీరే
సమర్ధ స్వయం విశ్వాసమ్మే వేడ్కన్, వికాసమ్ వివాదమ్ వినోదమ్ మారే
విమర్శ ద్విరుక్తా విజ్ఞానమ్మే మేల్ప్రకాశమ్ ప్రభావమ్ ప్రమోదమ్ చేరే
చమత్కార పూర్ణా జాడ్యమ్మేదేవీ స్వ కామ్యామ్ స్వలాభమ్ ప్రియమ్ శ్రీదేవీ
024. అమోఘ మాలిక.1(జ ర మ గ గ..7)
అనాది నుండి చెప్పే పాఠం వేదమ్ సహాయ మయ్యె విధ్యే సామర్ధ్యమున్
కణాల మార్పుమొక్కే పాఠం నాదమ్ క్షణాల నోర్పు విద్యా సాహిత్యమ్మున్
వినాలి చెప్పు తావి పాఠం మోదమ్ ప్రణమ్ము చేష్ట లన్నీ మోక్షంమౌనున్
క్షణాల తీర్పు దక్కే పాఠం దేవీ వినాసకాల మందే లే శ్రీదేవీ
025. అమోఘ మాలిక.2(జ ర య గ గ..7)
సహాయ బుద్దిగా ససేవా భాగ్యం, వినమ్ర శక్తిగన్ జయమ్మున్ శోభమ్
విహార మార్గమై వివాదం భోగం, క్షణమ్ము యుక్తిగన్ సమమ్మున్ లాభమ్
ప్రహాస వైనమే ప్రమాదం భోజ్యం, రుణమ్మున్ సముక్తిన్ ప్రణమ్మున్ మోహమ్
మహాను బావులై మనస్సే దేవీ, తృణ మ్మున్ మనమ్మున్ విదీ శ్రీదేవీ
026. అయనపతాక (మ న మ యతి లేదు )
సందర్భం సహజ భావ్యంమే కారుణ్యం కరుణ కర్తవ్యమ్
సద్భావ్యం తెలప కావ్యంమే దారిద్రమ్ తరుమ దాతృత్వమ్
సందేహం తెలుపు సత్యంమే చారిత్రమ్ తెలుప చాతుర్యమ్
సద్భాదా మనసుయె దేవీ పారాయన్ మనసు శ్రీదేవీ
027. ఆయమానం హరతకీ (స స స స స స స గ...12)
మనసా వినవే మదిలో పలుకే మమతే తెలిపే తరుణమ్మే
మనువే కలిపే సుఖమే దొరికే మనమే ఒకటై పరువమ్మే
తణువే తపనే వినతీ వినవే దరువే పెరిగే నటనమ్మే
వనుకే విధిగా వలపే కథగా వయసే బ్రతుకవ్వుటదేవీ
028. అర్కశేషా (ర జ ర జ గ గ.. యతి 8)
మన్ను తిన్న సాగ ప్రేమ మాయ కమ్మే
కన్ను రెప్ప వాల్చ నీక కాల ధమ్మే
మిన్ను నంటి యున్న రీతి మేఘ కమ్మే
తన్ను కున్న వాని కన్ను తృప్తి దేవీ
029. అర్చనా (ర భ త గ గ.. యతి..8)
సర్వమై బంధము విశ్వాస మేలే
కార్యమై కామ్యము సఖ్యమ్ము ఏలే
పర్వమై సాధన సా పాఠ్య మేలే
గర్వమే లేనిది యోగమ్ము దేవీ
030. అర్ధితపాదం (ర న జ య...యతి 10)
ఆశలే మనసును మార్చు యపోహే, పంచభూతముల వసించు పరాత్మా
మోసపు పలుకులు మాయ మపోహే, కాంచనాద్రి నిలయమిత్ర ఘనాత్మా
దేశము కొరకును కూర్పు దపోహే, పాంచభౌతిక లయ విశ్వ జనాత్మా
పాశము నిరతము ఓర్పుయు దేవీ, త్రెంచును అనవర శక్తిని దేవీ
031. అర్పిత మదన (భ స న య...7)
బంధపు మనసే భజనల మార్పే, కాలము తలపే కలకళ చేరున్
గంధపు హృదయం గమనపు నోర్పే, జ్వా లల వెలుగే జపమును చేరున్
మందుల బ్రతుకే మహిమగు నేర్పే, పాలన విలువే పలుకులు చేరున్
చందన చరితం జపముగ దేవీ, వందన విదితం వరుసకు దేవీ
032. అర్భకమాల (భ త న త న మ స గ..13)
తాండవ కృష్ణా మనసగు తత్త్వమ్ము తపము విశ్వమ్మై జయ మేలే
గండకి శిల్పా నగవుల రూపమ్ము గళము భాష్యమ్ము నిధియేలే
మెండుగ మోహం వినయపు సౌమ్యమ్ము మలుపు బంధమ్ము మదియేలే
డాండనినాదమ్ము కథలగు కావ్యమ్ము డలుపు సీఘ్రమ్ము విధి దేవీ
033. అలసగతి (న స న భ య...10)
తరుణి సహకారమగు తాండవ జయమ్మున్
కిరణ సహకారమగు కీలక గళమ్మున్
వరుణ సహకారమగు విశ్వము తపమ్మున్
మొరమొరహరీశ్వరని మేఘమగు దేవీ
034.అలోలా (మ స మ భ గ గ...7)
కీర్తీకారకమే కర్తవ్యం నామది గానే
అర్తీసంబరితం యాశ్చర్యం యీవిధి గానే
స్ఫూర్తీ ప్రార్ధనలే సూత్రమ్మే నాస్థితి గానే
మూర్తీ న్యాయముయే మూలమ్మో నాగతి దేవీ
035. అశోకలోకః (మ మ మ మ త ర మ....14)
ధర్మార్ధమ్మే సాంగత్యమ్మే సద్భావమ్మే ఆధ్యమ్ము తోడుగా స్నేహమ్మే
మర్మార్ధమ్మే మాధుర్యమ్మే మంగళ్యమ్మే సమ్మోహనం విధీ భాగ్యమ్మే
కర్మార్ధమ్మే కర్తవ్యమ్మే కళ్యాణమ్మే సౌకర్యమే మదీ కాలమ్మే
ధర్మాన్నీ సత్యాన్నీ న్యాయాన్నీ విశ్వాన్నీ ఆదర్శ సంపదే శ్రీదేవీ
036 అశోకా / గతవిశోకా (న స న గ గ - యతి ..7 )
మణిమయముగా మహిమ జూపే
గుణము వెలుగే కులము మాయే
రణము పిలుపే రగడ వేటే
పణము నిడగా బలము దేవీ
037. అశోకానోకహం (మభనభనరతత గ గ ..యతి.. 10,16)
శత్రూన్మత్తా చకితపు నిశాచరుడను విచారపాణంబందు నున్నఁటివాడన్
మిత్రోన్మత్తా సహచర సమేథలనిలుచు మేరువున్ శోకవిశోకాల లీలన్
ఛిత్రౌచిత్యమ్ము గ నిలుచు చింతల కలుపు జీవ చిత్రమ్మున్ వియోగిన్ విరాగిన్
నేత్రానందా తిరుమల వినీల నరహరి నిత్యసాకారాత్మ రక్షించు దేవీ
038. అష్టమూర్తి (మ న త స ర భా జ య ..యతి ..9, 17)
దేహమ్మే మమత తార్కాణ దయసారమ్ముతెల్పే ధరణి మానస తృప్తీ
మోహమ్మే సమయ సాహిత్య మధుసారమ్ము నిల్పే మహిమ మంగళ దీప్తీ
దాహమ్మే తరము దాంపత్య సుఖసారమ్ము ముప్పే వయసు మూలము ప్రేమే
స్నేహమ్ము జయము నిత్యమ్ము జయసారమ్ము విద్యా వినయ మార్గము దేవీ
039.అసంభంధా (మ త న స గ ...యతి.. 6 )
విజ్ఞానమ్మే భావి విలువ మనసేలే
అజ్ఞానమ్మే కాల తలపు వలపేలే
ప్రజ్ఞా పాఠమ్మే పలుకున నిజమేలే
యీజ్ఞానమ్మేలే యినకుల మది దేవీ
040.అసంభాధ (మ త న స గగ ...యతి.. 12 )
సేవాసంతృప్తీ సహనమగుట సేవేలే
ప్రావీణ్యంమేలే చదువుల మది ప్రాసేలే
భావావేశంమే అనుకువవిధి భ్రాంతేలే
భావాసందర్భం విజయముసబబే దేవీ
041. అసితధారా.( న స స గ :యతి.7)
చెడుగుడు మరచిధి వైనమ్, తరుణము మమత వినమ్రన్
ముడిపడు మనముగ దీనమ్, మురిపము కళ ముడిపౌనున్
తడిపొడి భరితము భావమ్, పరిధియు సమ పద లక్ష్యమ్
నడవడి నటనలు దేవీ, కరుణయు జయ కళ దేవీ
042. అసితధారా : (న న స గ ...యతి.. 7 )
సమర ముసుగు సమరమ్మే, కళల మనసు కమతమ్మే
విమల చెరిత విజయమ్మే, పలక కధలు పలుకాయే
అమర డగుట యధరమ్మే, తలపుల సమతగ ప్రేమా
సమయ తలపు వరదేవీ, విలువల కథ విధి దేవీ
043. అసుధారా (జర యయ .. యతి..7 )
సహాయ తృప్తియే సశేషం సమాయే
విహార వినమ్ర విధేయం సుఖాయే
ప్రహాస సుహాసామ్ ప్రధాన్యం ప్రమోదం
అహమ్ము సుదేహమ్అనన్యం సదేవీ
044 . అహి (భభ భభ భభ భభ మ ... యతి..13 )
జీవితమేసుఖమార్గపు బానిస జీతము లేనిది భేదము రానిది భంధమ్మే
జీవన సాధన శోధన లక్ష్యము జాడ్యము బొంగర మల్లెను తిర్గుట భాగ్యమ్మే
భావన ఎప్పుడు ఇప్పుడు చెప్పిన బాధ్యత చేయుట ధర్మము నిత్యము సత్యమ్మే
చావుకు పొంతన లేదులె చక్కటి చెక్కర తీపిగ నుండుట సంపద శ్రీదేవీ
045.. ఆందోళిక .. త త ర గ .. యతి .. 6
రావమ్మ లక్ష్మీగ యింటికేలే, కాలమ్ము నీదేగ సాయమేలే
సేవాసహాయంమె సాధ్యమే లే, గాలమ్ము నీదేగ సామమేలే
భావమ్ములన్నీ భయమ్ముగాలే, జ్వాలౌను నీదేగ సాధ్యమేలే
ఆవశ్యకమ్మే యనంతదేవీ, ఆనంద తత్వమ్ము ప్రేమే దేవీ
046 .. ఆది దైవీ .. యమయయ .. యతి .. 7
యదార్ధమ్మున్ యాత్రా యనేకమ్ము గానే
పదార్ధమ్మున్ పాత్రా ప్రమాణమ్ము గానే
సదానందా సాక్ష్యీ సమానమ్ముగానే
చిదానందాజీవా వివాదమ్ము దేవీ
047 .. ఆనంద .. స త యభ న న న య .. యతి .. 11 ,19
చిరునవ్వేలే సమ భాగ్యమ్మే స్థిరమగుటయుకల సిరులగు తీరే
దరహాసమ్మేను సహాయమ్మే దరియగుటయుకథ తరుణము చేరే
పరమార్దంమేను ప్రభావంమే పదమగుటయువిధి పలుకులు చేరే
వరదాతృత్వమ్ము నినాదంమే వరములమయమగు వరుసలు దేవీ
048 .. ఆనందకంద .. తరమజ గగ .. యతి .. తర మజ గ గ .. 8
మాలామనోమయమ్మేమానముగాను నిత్యం
మేళాలు మ్రోగగా సమ్మోహమ్ముగాను సత్యం
గాలాలు వేయగా భాగ్యంమేను సేవ ధర్మం
కాలమ్ము నీదిగా సౌకర్యంమ్ముగాను దేవీ
049 .. ఆనంద శబ్ద .. త త న ర గ .. యతి.. 6
మిధ్యా నినాదమ్ము సకలసేవలౌనే
విద్యా విహారంవినయము సర్వమౌనే
పద్యా లభావా పదములు తెల్పుటౌనే
గద్యాలు వల్లా గళమును తెల్పు దేవీ
050 .. ఆనతా .. మన ర ర గ .. యతి .. 9
సత్యా సత్యము లతీత సాధ్యమ్ము విశ్వా
దిత్యాజ్వాలవెలుగై సుదీప్తుల్ జగమ్మున్
నిత్యానిత్య తరళమ్ము నీచెంత దక్కున్
గత్యాగత్య శరణార్థి కారుణ్య దేవీ
051.. అనద్దం.. ర న స త మ.. యతి 11
మక్కువే మనసు గతిగా సమ్మోహ సద్భావం
దక్కుటే వయసు వడిలో సందర్బ సన్మానం
చక్కనీ సొగసు కళలే సంజాత సమ్మోహం
దక్కెనే వినయ పలుకే విందౌను శ్రీదేవీ
052. ఆననమూలం.. భ త య స గ.. యతి..10
సర్వము తానై సమప్రేమా సమయమ్మై
పర్వము యైనా సుఖ ప్రేమా భరితమ్మై
గర్వము లేకే విధి ప్రేమా గమనమ్మై
బర్వగు ప్రేమా మది సేవా కళ దేవీ
053.. ఆభాసమానం.. య య య య త త త త గ గ.. యతి..13, 22
నరేశా నటేశా నరోద్దారధారీ నామమ్ము సత్యమ్ము నిత్యమ్ము నమ్మాయ ధాత్రీ
సురేశా గిరీశా గణేశా గుణేశా సూత్రా ధరీ సాధ నేలే శుభాంగా సుధాత్రీ
పరేశా శిరీశా విరీశా మహేశా ప్రాధాన్యతా భావమై సేవ పాఠమ్ము ధాత్రీ
హరీశా కులాసాల నీయంగ దేవా యాశ్చర్య లక్ష్యమ్ము సర్వమ్ము యానంది దేవీ
054..ఆరభటీ.. భ భ న జ య గ.. యతి..12
శ్రీకర సుందర సమర గిరీశ సహాయమ్మే
శ్రీకర పార్వతి శ్రితజనవాస విధానమ్మే
శ్రీకర పాలన శుభకరదీస సుమత్వమ్మే
శ్రీకర లాలన కళల విభూషణ శ్రీదేవీ
055.. ఆరాధినీ.. త మ మ గ గ.. యతి 7
వైరాగ్య రాగమ్మే వైఖల్ప మ్మే లే, కాలమ్ము వైనమ్మున్ కర్తవ్యంగానే
కారమ్ము లౌ సేవే కర్తవ్యమ్మే లే , మూలమ్ము మార్గమ్మున్ ముఖ్యమున్ గానే
దారాళ గానమ్మే ధాత్రుత్వమ్మే లే, మేళమ్ము మంత్రమున్ మోక్షమ్మున్ గానే
ధ్యా సాధ్య మౌనమ్మే ధాత్రీ శ్రీదేవీ, జ్వాలేను తంత్రమున్ జాడ్యం శ్రీదేవీ
056..ఇంద్ర విమానం.. భ త న మ భ నన గ గ ..13
నమ్మికనీ వైతివి సహాయమ్మే నందనమగు కథలగు శోభల్
నేమ్మిగ నీ వుండ దుడుకు కర్మల్ గా నిర్మల మగు సతమత మందున్
వమ్మగు పాపమ్ములుచెర భీతిల్ సా రమ్మగు చిలక పలకు లేలున్
నెమ్మది నేస్తమ్ము సహన మార్గమ్మే నీడలు జరుప గలుగు దేవీ
057 .. ఇంద్ర .. జ జ య గ .. యతి ..6
మనోహరధామ వినోదమ్మున్, సహాయ ప్రకాశము వేదమ్మున్
అనాధలదాహ విదేహమ్మున్, ప్రహసము దీప కళే యౌవున్
వినాశకమైవేటలంతమ్మున్ , నిహారిగ వాని వీధీ కాలమ్
సనాతనధర్మము శ్రీదేవీ, విహరిగ సవిద్యయు శ్రీదేవీ
058 .. ఇంద్రఫలా .. భ మ గ గ .. యతి .. లేదు
కాలము నీదేలే స్వామీ, సాధన చేసేదే స్వామీ
మేళము వాయించా స్వామీ, వాదన చూపేదే స్వామీ
గాలము వేసాలే స్వామీ, రోదన మాటేలే స్వామీ
తాళము తీసే శ్రీదేవీ, పాదము నీదే శ్రీదేవీ
059 .. ఇంద్ర వజ్ర .. త త జ గ గ .. యతి ..8
దాహమ్ము పొంగేదిచిదాత్మ గానే,
దేహమ్ము హేయమ్మగు దీన మౌనే
సోహమ్ము దాస్యమ్ముల సొంత మోనే
నీహార భూతమ్ముగ నిల్చు దేవీ
060 .. ఈహామృగి .. త భ త గ గ .. యతి .. 7
నాలోకమేమది నాన్యత్వమేలే, సాకారమే విది సామాన్యమేలే
ఏలోకమైనను యేలేటి మేలే, స్వీకారమే నిధి సౌజన్యమేలే
కాలాంతమేకళ కామ్యమ్ము యేలే, యాకారమే స్థితి యానందమేలే
జ్వాలామయమ్మగు జాడ్యమ్ము దేవీ, ప్రాకారమే మది ప్రాధాన్య దేవీ
61 .. ఉంజిత కధనం .. భనజజజ ననన గగ .. యతి.. 13
62 .. ఉదరశ్రీ ..స స మ .. యతి లేదు
మనసే మమతే మాధుర్యమ్, మగువే పిలుపే మంధవ్యమ్
పనులే కదిలే చాతుర్యమ్, పగలే కదిలే ప్రాధాన్యమ్
క్షణమే మెరిసే వైడూర్యమ్, వగలే సెగలై మాణిక్యమ్
తృణమై ఫలమై శ్రీదేవీ, సగమే జగమై శ్రీదేవీ
63 .. ఊడితాడినేసము .. స న య గ గ .. యతి ..7
కమణీయమగు కళా నృత్యంమ్మై, వరుసే కధలు వరమ్మున్ పంచే
సమపోషణగ సమాధానమ్మై, సరిధారిగను సమర్ధమ్మున్ గా
సమపాలనయె సమానత్త్వమ్మై, నరమాయగను నమమ్మున్ గానే
మమతాను కళ మనో శ్రీదేవీ, చరణాల కథ సహా శ్రీదేవీ
----
064 .. ఉదితావిజోహా .. త త న గ గ .. యతి.. 6
తన్మాయ తత్వమ్ము తపము గానే, కారుణ్య భావమ్ము జయము గానే
సన్మాన సౌజన్య సరళ గానే, కర్తవ్య లక్ష్యమ్ము భయము గానే
ఉన్మాద దైర్యమ్ము యురుకు గానే, ప్రారంభ దేహమ్ము పరము గానే
మన్మాట మార్గమ్ము మనకు దేవీ, శ్రీరంగ భ ర్తౌను మనసు దేవీ
065 .. ఉద్ధతీకరీ .. మ య మ గ గ .. యతి .. 8
మౌనమ్మేను మార్గంమేలేమౌఖ్యమ్మే, కాలమ్మేను యర్ధంమౌ కావ్యమ్మేలే
ధ్యానమ్మేను సర్వార్ధమ్మే దాస్యమ్మే , నీలమ్మేను సన్మార్గం నిత్యమ్మేలే
గానమ్మేను గాంధర్వంమ్మే కాలమ్మే. మూలమ్మేను సంతోషమ్ ముఖ్యమ్మేలే
ప్రాణమ్మేను సామర్థ్యంబే శ్రీదేవీ , తాళమ్మేను సంభావ్యత్వం శ్రీదేవీ
066 .. ఉపధానం .. జన జయ .. యతి .. 9
చరించ గలుగు విదేశము నందున్, సమమ్ము మలుపులు జ్యాసయు కాంతిన్
భరించ గలుగు సకోపము నందున్, సమాధనమగుటయే సమ బ్రాంతిన్
ధరిత్రి మనకు ప్రజాధనమందున్ , క్షమాగుణమగుటయే క్షమ కోర్కేన్
స్మరింపగలుగు నిజస్మర దేవీ, విమానమగుటయే విధి దేవీ
067 .. ఉప ధాయ్యా .. భ న స గ .. యతి .. 7
నిర్దయవలన నియమమ్మే, ఆకలి వలపు తలపేలే
మర్దనలుగుట మహిమమ్మే,వాకిలి పిలుపు వలుపేలే
వర్ధన మగుట వదనమ్మే, చాకిరి వలన చలవేలే
దుర్దశ కలగ దులె దేవీ, నాకు మనసు యగుట దేవీ
068 .. ఉపయోధా .. స ర మ గ గ .. యతి ..7
నగుమోమందునన్ నాట్యంమ్మే సాగే, పలుకాయే పదాలన్నీలే గాత్రమ్
నాగుబాటుల్ కలిన్ నాదమ్మే సాగే, వల లౌనేసహాయమ్మేలే సూత్రమ్
తగుభక్తిన్ సదా తత్వమ్మై సాగే, జలగానేసహా తీర్ధంమ్మున్ పొందే
తగుమార్గంబిదీ ధాతా శ్రీదేవీ, కలనైనా సహాయమ్మౌశ్రీదేవీ
069 .. ఉపస్థిత .. జ సత స గ .. యతి .. 7
అనర్ద మగుటే ఆశ్చర్య పడుటే లే, విధానమగుటే విద్యాలయముగానే
ధనార్జనముగా దారుణ్య మగుటేలే, సదామనసుయే సాధ్యాసమయమేలే
ఘనార్ధముగనే గాయము యగుటేలే, విధీబ్రతుకుయే విశ్వాస మగుటేలే
నినాద ముగనే నిర్మలమగు దేవీ , కధాబలముయే కర్మార్ధమగు దేవీ
070 .. శేష .. జ స త గ గ .. యతి ..7
ప్రధానమగుటే ప్రాధాన్య తేలే, ప్రలోభమగుటే ప్రావిన్యమేలే
విధాన పరమే వాత్సల్యతే లే, విలోల కలలే వివాదంమ్మే లే
సుధాసమరమే సూత్రమ్ముగాలే , సులోచనములే సుఖంచూపే లే
కధా కదలికే కారుణ్య దేవీ, క లాకలయికే కామ్యమ్ము దేవీ
071 ..ఉపస్థితం .. త జ జ గ గ .. యతి .. 7
రమ్యా కృతిగాను భవమ్ముగానే, కాలాతిసయమ్ము కలమ్ముగానే
కామ్యాద్రువవైభవమార్గమేనే , మూ లామనసాయె ముభావమేలే
సౌమ్యా సహనమ్ము సమర్ధమేనే, జ్వాలాతపమాయె జపమ్ముయేలే
సమ్యా విశదీకరణమ్ము దేవీ, వేళావినయమ్ము విధాన దేవీ
072 .. ఉపహార .. మనననన త మ స గ గ .. యతి .. 10 ,16
గోళమ్మౌ కదలికలు తలపు కొలువులు కోపమ్ము తన్మాత్రే సహనంమౌనే
మేళమ్మౌ తకధిమయను మెలుకువ కళ మోక్షమ్ము విశ్వమ్మే సమరంమౌనే
తాళమ్మౌ సరిగమలు పదనిసలకళ తత్భావభూలోకం విజయం మౌనే
మేళమ్మౌ మనసు గతియు మమత మధుర మౌనమ్ము మార్గంమౌ జయశ్రీదేవీ
073 .. ఉపహితచండీ .. స భ స గ గ .. యతి .. 5
శరణార్థిన్ జగతిగనే దేహా , తరుణానేతపమగుటే విద్యా
కరుణాత్మా కలిమిగానే దేహా, విరజాజీవిజయముగా విద్యా
ధరనీశా దయ పరమౌ దేహా , ధరణీతత్వముగనే విద్యా
వరమీవైపరమ విధీ దేవీ , సరసాహిత్యమగుట శ్రీదేవీ
074 .. ఉపేంద్రవజ్ర .. జ త జ గ గ .. యతి .. 8
విధాన మార్గమ్మగు నేత యేలే, జగాన జాడ్యంమగుదారి యేలా
ప్రధాన విశ్వాసము గాను యేలే, ప్రగాఢ భావమ్మగు మార్గ మేళా
నిదాన నిర్మాణముగాను యేలే, సుఖాల లక్షమ్మగు తీర్ధమేళా
సుధామ ధూభావముగాను దేవీ , సకాలం వైనమ్మగు సేవ దేవీ
075 .. ఉల్కాభాస : మత సమగ .. యతి .. 10
యుత్తమ్మౌ జీవాత్మ సమయుద్దేస్యమ్మేలే
చిత్తమ్మున్ పొంగారు సువిధీ చిన్మాయేలే
విత్తంమౌ నీనామ విధిగా విశ్వంమేలే
చిత్తమ్మేలే స్వీయ పరమోజీ శ్రీదేవీ
076 .. ఋక్షపాద ..స జ జ ర గ .. యతి .. 8
కలలోనసాగు వికాస భావమేలే
ఇలలోన సాగు సకీర్తి ధ్యానమేలే
వలలోన సాగు వివాద లక్ష్యమేలే
తలలోన సాగు విధాత మేధ దేవీ
077 .. ఏకరూప .. మ భ జ గ గ .. యతి .. 8
ఆసాంతమున్ నిలు జయమ్ముగానే
కాసారమ్మౌనర సకామ్య మౌనే
భూసారమ్మే నిలు సపూజ్యమౌనే
వాసా విద్యాలయ నవాభ్యు దేవీ
078 .. ఏలా .. స జ న న న య .. యతి .. 13
విధివాక్కునెంచ బ్రతుకుకలలు వినయపు దారే
నిధికోరుటేను మనసు కధలు నిజమగు దారే
కధలే సహాయ మగుట నిజము కళలగు దారే
మధువే యుపాధి యగుట వలన మనసున దేవీ
079 .. రేఖా .. స జ న న య .. యతి .. 10
చరితమ్ముగాను పలుకు చలనము గానే
భరితమ్ముగాను కనులు భవభవగానే
విరజాజిగాను భజన వివరముగానే
తరుణమ్ముగాను తెలుపు తలపులు దేవీ
080 .. కంకణ క్వాన వాణి .. మ ర ర ర ర ర ర గ .. యతి ..10 , 17
భత్యాభత్యమ్ముగా దాహమే బంధమై సేవలే సోభయే విద్యలేలే
నిత్యానిత్యామనోమయమ్ము నీడలే సాగుటేలే నిధీ విద్యలేలే
సత్యా సత్యా సహాయభావ సాగుటే మేలుగానే సహీ విద్యలేలే
గత్యా గత్యా విధానలక్ష్య కాలమే దేహిసౌమ్యాకధా విద్య దేవీ
81 . కంకణక్వానః సర్వగామీ .. ర ర ర ర ర ర ర గ ..యతి 10 , 17
దుర్గుణమ్ముల్ సుడిన్ పోరుగన్ దొడ్డబుద్ధీ విధీ దుష్టులై దూరనిగ్గున్
వర్గకల్లోలముల్ యీకథల్ చెప్పుటన్ వాడిగా వేడిగా వాకిటై వెల్గు నిగ్గున్
దుర్గమౌ దేహముల్ యీమదీదూరమున్ వేటగన్ ధూర్తగన్ కాలనిగ్గున్
నిర్గుణా గమ్యముల్ సాగుటన్ నీడలై కావగా నిత్యమై సత్య దేవీ
082.కంఠ భూషణ (మ య య య..యతి.. 7)
మాయామర్మమోహం మనస్సే సుఖమ్మై, సేవాభావధర్మం సహాయం సమానమ్
ప్రాయమ్మై ప్రహాసం ప్రెమేయం ప్రదర్శ, భావాల్లోన కల్పౌనెదివ్యమ్ సమానమ్
మ్మై య్యానంద దాహం మమేకం జయమ్మై, మావళ్లే సమర్ధం వినమ్రం సమానమ్
ధ్యాయమ్మే ప్రదీప్తీ ధనంమౌను దేవీ, జీవమ్మే సుఖమ్మున్ సుధాశాంతి దేవీ
083 కంటీరము ( న య న గ గ...యతి..7)
అలకలు మార్చే అనుకువేలే, సకలము కోరే సమరమేలే
వలపులు తీర్చే వలపు లేలే, నఖశిఖమౌనే కదలుగానే
కలిసిడి వైనమ్ కలలు యేలే, ఒకనొకటౌనే పరిధిగానే
కళలను జూపే కథల దేవీ, సుఖముయు జూపే మనసు దేవీ
084. కందర్ప (త ర న ర య....యతి..9)
కొవ్వొత్తి కర్గియే వెలుగు కోపమేమి కాదే
నవ్వించి ఏడ్పుయే కలుగు నాట్యమేమి కాదే
కవ్వింపు కార్యమే కవిత కావ్యమేమి కాదే
జువ్వాలె వేగమే కదులె జాడ్యమేలె దేవీ
085. కందవినోద: (భ మ న గ గ....యతి..7 )
మద్దెల దర్వేలే మగువ చేరీ, చెప్పక ఒప్పేలే చెలిమి చేరీ
ముద్దుల వర్షంలో మునిగి పోయీ, ముప్పును మర్పేలే ముడుపు చేరీ
పద్దులు చూపాకే పలుకు మారీ, తప్పులు దొర్లేలే తపన చేరీ
పొద్దులు తెల్వకే సుఖము దేవీ, ఎప్పుడు మార్పూలె యదలు దేవీ
086. కందుక (య య య య గ...యతి..8)
యిదేమో ఎలాగో చెయించే ని కోసమ్మే
మదీయే విధీగా చెయూతే స వేగమ్మే
పదాలే వరాలై యపాధీ సమోదమ్మే
కథల్లే సయోధ్యా సకాలే నువే దేవీ
087. కడారము (య న య గగ...యతి..8)
మనోగీతమది సమానమ్మేలే, సహాయమ్ముగను ప్రశంసా పొందే
వినోదమ్మని విధి వేగమ్మే లే, ప్రహాసమ్ముగను యుపాయంపొందే
వినీలా దరువు సవిస్వమ్మేలే, అహంమేపలుకు నిదానం పొందే
మనస్సే మరుపు సమస్సేదేవీ, విహారీవిజయము విద్యా దేవీ
088.కనకగౌరి.( న న త స గ..యతి.. 9)
పగటి కలలె సాగే పదములే లే, కధలు కధలుగానే కలలుగానే
మగని తలపె తీర్చే మగువలే లే, వ్యధలు వలపుగానే వలలు గానే
సగము సగము కల్సే సమరమే లే, పదము పదముగానే పలుకు గానే
జగతి వెలుగు తీర్పే జయము దేవీ, సుధలు కళలు గానే సరయు దేవీ
089.కమలదళము (న న న జ స గ...యతి...10)
వొకటి కొకటి వొరుస వొనర్చు వొకటే లే
నొకటి నొసటి నొరువ నొనర్వ మునుగే లే
చకిట థకిట చొరువ చమత్కరము యేలే
సకల సహన తలపు సమమ్ము కలదేవీ
090. కమలబంధ :(మ స భ మ స గ... యతి 8)
ఈశావాస్య!* జయమ్మే యిళ వే ల్పేలే మనసాయే
ద్ధీశాలీ గ్రణువే సేవల ధర్మంమ్మే సమమాయే
యీశానీ నుత సత్ రూపిణి ఈశ్వ ర్యీ కళలాయే
నీ శక్తిన్ గను నే నీ కృప నిత్యంబై మది దేవీ
091 కామలవిలసితము: (న న న న గ గ ..యతి..9 )
శుభకర మధుకర సుఖము విజయమ్మే
అభినయ కళలగు అనుకర మకుటమ్మే
సభల కధలు సరస విధిసమమ్మే
ఉభయ పలకులు సహృదయము దేవీ
092. కమలాకర. (స న జ జ య.....యతి..11)
సంకటహరణ జయాలు ససంఖ్య సమమ్మే
శంకలుమానియు నిజాలు సుశాంతి జగమ్మే
వంకలులేనిది మనోమయ వాక్కు సుఖమ్మే
శంకర సాధన మనోహర శాంతి గను దేవీ
093. కుమారలలిత (స న గగ యతి లేదు )
నగువే పెరగ నిచ్చే, మనసై మదనుఁడొచ్చే
మగువై మనసు విచ్చే, అనువై అలక తీర్చే
తెగువై వలపు యిచ్చే, తనువే తపన కూర్చే
సెగలై కళలు దేవీ, కణమే కఫము దేవీ
o94. కరమాల:(స భ త య ....యతి...9 )
విధిమాయా కధ సాధ్యా వివరమ్మే, ధనమాయే మది సాధ్యంసహనమ్మున్
మదితీర్పే కళ విద్యా మమతమ్మే, మనసాయే విధి మార్గం పరువమ్మున్
అధరమ్మే విధిసాక్ష్యం సహితమ్మే, కనలేనీ గతి కావ్యం తరుణమ్మున్
మధురమ్మే విధి వైనం మహిదేవీ, వినసొంపే కథ ద్రాజ్యంమగు దేవీ
095 .కరరికా (నర గ గ ..యతి..)
విజయ వాంఛలే నీవీ, వినయ చూపులే నీవీ
సృజన గీతమే తావీ, క్షణము తృప్తియే తావీ
భజన లక్ష్యమే మావీ, ప్రణతి భావమే మావీ
నిజము తెల్పుటే దేవీ, మనని మార్చుమా దేవీ
096. కారాళి..( త త గ గ యతి లేదు )
రావమ్మ మాయింటి కేలే, రావమ్మ యేలేందు కేలే
కావమ్మ తోడ్పాటు కేలే, కావ్యమ్ము వ్రాసేందుకేలే
భావాలు తెల్పేందు కేలే, భావమ్ము నచ్చేందుకేలే
నావల్లె యుంచాలి దేవీ, నావాక్కు నమ్మాలి దేవీ
097.కార్మిష్ట పురుష ( భ స మ యతి లేదు )
మానసమును తంత్రంమేలే, కోపముయును జీవంమౌనున్
కానుకగను యంత్రంమేలే, పాపముయును పాశంమౌనున్
మేను తలపు మంత్రంమేలే, తాపముయును తత్వమ్మౌనున్
చేను గనుము నిత్యాదేవీ, చాపమగుటయే శ్రీదేవీ
098. కులదోషపదం (స స స స స గ. యతి 10)
మనసా వినుమా కనుమా మమతా విధిగానున్
తణువే కదిలే కణమై తపనై కధగానున్
పనులే చెదిరే ముదిరే పడకై గతిగానున్
చినుకే పడగా పొలమే చిగురై మది దేవీ
099. కలవల్లి (జ త య య.. యతి..6 )
సరాగ మారోగ్య సహాయం విజయమ్మున్
మురారి మోక్షమ్ము మొహమ్మే సమరమ్మున్
స్థిరమ్ము సత్యమ్ము శివోహం సమయమ్మున్
విరోధి ఆరాట నికేతన్ భయ దేవీ
100 .. కలహము .. స భ మ .. యతి లేదు
కలలౌనే సహ బంధుత్వా, కధలన్నీ సహ బాంధవ్యమ్
పలుకౌనే సహ బ్రహ్మత్వా, పదనేస్త౦ సహ బ్రహ్మాడమ్
అలుపౌనే విన స్నేహత్వా, అదనౌనే సహ స్వేచ్ఛార్ధమ్
జ్వాలలాయే కధ శ్రీదేవీ, అదుపాయే విధి శ్రీదేవీ
101.కళాపాంతరిత (య స య గ...యతి...7)
సమస్యా పరమై సమమ్మేలే,
జమాబంది వరం జపంమేలే
మమేకం వరమై మనస్సే లే
సమానం జనమే సహదేవీ
102. కలితకమలమాల (న న మ గ. యతి 9)
విజయము గను బ్రహ్మా విధ్యాన్, వినయముగను పొందే విద్యా
సృజన మయము విద్యా సంధ్యా, క్షణమగుటయు క్షేమా విద్యా
భజన జరుప విద్యా భోదా, తృణమగుటయు తృప్తీ విద్యా
నిజము తెలుప విద్యా దేవీ, కణములగుట విద్యా దేవీ
103 కల్పకాంతా (ర త త త గ గ.....యతి..9)
మాయ మోహమ్మే జయింపన్ మ నో నేత్ర రూపమ్ పా
నీ యశో ధర్మమ్మే సహాయమ్ము దేహమ్ము దీపమ్
నీ యశస్సే మాకు ప్రాణమ్ యి దాహమ్ము సృష్టీ
మాయ వీడన్ నీ మహత్యం మహా శక్తి దేవీ
104. కల్పాహరి. (న న న న మ గ.. యతి.11)
తకిట తకతకిట తకతకి తన్మాయే లున్
మకుట నిగమ వినుత నమక మర్మమ్మేలున్
ఒకరికొకరు జయమగు ఒక ధర్మమ్మే లున్
సకల గ్రహగతుల లయసమరమ్మే దేవీ
105.కల్హారము (నయ నయ నయ నయ ..యతి 7,13,19)
నరుడుగ కోరే నెలతగ తిండీ నటనగ రూపా నరకము నేర్పే
పరులను కోరే పదవిని కోరే పదనిస పాపీ పడకకు కూర్పే
గురువును చేరే గురకను పెట్టే గుడిబడి నేనే గుడిసెన మార్పే
దరువుల వల్లే ధిమిధిమి వాక్కే దమనక నీతీ దయగల దేవీ
106. కళాధామ భ భ జ మ గ.. యతి 8
కాలము నీదియు సకామ్య ధర్మమ్మేలున్
గాళము వేయుచు సగమ్య సత్యమ్మేలున్
మేళము శబ్దము మమేక రోగంమేలున్
తాళము తప్పదు సితార విద్యా దేవీ
107. కళావతి ( జ భ త జ గ గ....యతి..7)
జనమ్ము భాద్యత జాతస్య జయమ్ముగానున్
మనమ్ము సాధ్యము మానమ్ము భయమ్ము గానున్
కణాల ధైర్యము కాలమ్ము నిజమ్ముగానున్
అనాది నుండియు అస్తిత్వ సుఖమ్ము దేవీ
108 . కలిక.. (ర మ స గ....యతి..7)
రమ్యతే మాధుర్యం రణమేలే, కామ్యమౌ ధారుడ్యం ఫలమేలే
సౌమ్యతే సద్భావం సమతే లే, సామ్యమౌ సామాన్యం జతయేలే
గమ్యమే విశ్వాసం గతియేలే, గమ్యమౌ సౌలభ్యం విధియేలే
కామ్యమే కారుణ్యం కళ దేవీ, కామ్యమౌ ప్రారబ్ధ౦ మది దేవీ
109 .జలధరమాలా (భమ సమ ....యతి..7 )
తామస తారాటన్ తపమై దాహంమే
కామిత పోరాటం కనులై దేహంమే
సామజ భూరాటల్ సమమై దేశంమే
సాముగ విద్యా విస్వముగా శ్రీదేవీ
110. కాంసీకము (మ న య)
సామాన్యం విధిసహ విధ్యా, కాలమ్మే మదిపరబంధమ్
ప్రామాణ్యం కలమది సంధ్యా, మూలమ్మే చరణము సాక్షామ్
ప్రేమత్వం సహవిధి ప్రీతీ , గాలమ్మే గమనము ముఖ్యమ్
మామూల్యం మదినిధి దేవీ, మాళాసౌధమగుట దేవీ
111.కామరూపం (మ ర భ న త గ గ ...యతి...8 )
ప్రోత్సాహం వల్లనే చేబదులు కథ సాక్ష్యమ్ము గానే
నిత్యానందమ్ముగా కానిపలుకులు కామ్యమ్ము గానే
పైత్యంమే సాధనే పాదములకళ ధర్మమ్ము గానే
వ్యత్యాసం వల్లనే కారణముల విధి మర్మమ్ము దేవీ
112. కామా (తనయ )
దానమ్ము సహనము జూపే, మౌనమ్ము విధగను పెంచే
గానమ్ము పదములు మాటే, జ్ఞానమ్ము మనసుగ మారే
వైనమ్ము విధియగు ఆటే, ధ్యానమ్ము ప్రతిదిడినమాయే
ప్రాణమ్ము తలపులు దేవీ, మానమ్ము మహిమయు దేవీ
113. కామనంద (మమ మమ మమ మమ గ....యతి...13,19)
భావాతీతమ్మే, మోహావేశమ్మై, శ్రీసద్భావమ్మే, స్వేచ్చా ప్రాభల్యమ్మై, విశ్వాసమ్మున్
దేవీ మద్భాగ్యమ్మే, లబ్దమ్మై, శ్రీ విద్యా దేవమ్మై దీప్తమ్మై, దైవమ్మై, దీక్షత్వమ్మున్
కావమ్మా, నీవమ్మా, మాలోకం, చూడమ్మా, కామాక్ష్యీ, ధర్మమ్మే, కామ్యమ్మై, సర్వార్ధమ్మున్
సేవా లక్ష్యమ్మే, సత్యంమ్మై, శ్రీ మాకర్మే, సేధ్యమ్మై, మౌనంమ్మే, సేవాచేసే ఓదేవీ
114. కాల ధ్వానం (మ మ న య గ గ.....యతి..7)
స్నేహమ్మే జీవంమ్మై సహనము తోడై నీడై
మోహమ్మే మోక్ష్యమ్మై మనసుకు మాటే తోడై
దాహమ్మే ధర్మం మై ధరణికి సేవే తోడై
దేహమ్మే సర్వార్ధం దయ విషయంలో దేవీ
115. కాసార క్రాంతా (మత జయ....యతి.. 8 )
రక్షింపన్ జీవం మనసన్నది ప్రేమే, ప్రాబల్యమ్మున్ సేవ భావము గానున్
దీక్షా దీప్తీయే వయసన్నది ప్రేమే, సౌభాతృత్వమ్మగు విశాలము గానున్
ప్రక్షాళిం బేధమ్ము సమోన్నత ప్రేమే, శోభాభావమ్మున్ గణ శోభలు గానున్
రక్షాబంధమ్మే సహనమ్ముగ దేవీ, వైభోగమ్మున్ కాలమమైకము దేవీ
116 .కింశుకాస్థరణం (ర స మ య ....యతి... 7 )
కాలమే మనదీ కామ్యంమేను నేర్పే
గోలయే ననకే గోప్యమ్మేను ఓర్పే
జ్వాలయే వెలుగై జప్యంమేను కూర్పే
హేలనే ననకే హీనత్వమ్ము దేవీ
117. కిరలేఖా (న ర న ర గ ....యతి...7 )
ఒకటికోరితే ఒకటి యవ్వుటేలే, ఒకరికొక్కరూ వలపు రాగమేలే
సకల మేనులే సమర మవ్వుటేలే, సకల మొక్కటై సమయ మాటలే లే
ప్రకటి తేనులే ప్రతిభ చూపుటేలే, నకలు వల్లనే నటన చూపులేలే
రకములెన్నియో రభసగానుదేవీ. సుఖములెన్నియో శుభముగాను దేవీ
118. కీర్తి మేఘవితాన ( స న స గ ....యతి...6 )
నిగమాంతమగు నియమమ్మే, జగమంతబల మయమౌనే
వగ ముక్కలము విణయమ్మే, సగమాయగతి విధిగానే
త్రిగుణా చరిత తరుణంమే, నగసోభ ప్రగతి మది గానే
భగణా దయ నిజము దేవీ, సుగుణాల మయముగనుఁ దేవీ
119. కుమ్భోగ్ని (మ భ జ య .....యతి.. 6 )
మాయామోహమ్ముయు జయింప మనస్సే
మాయా!* నీ పాదము నుచేరితి మార్చున్
నీ యాజ్ఞన్ పొందితను సహించి సర్వంబున్
మాయన్ బాపమ్ము నినునె పూజలు దేవీ
120 . కుటిల ( స భా న య గ గ .....యతి.. 5 )
వివరమ్మే వివరణలగు చేయూతేలే
నవవిధ్యా నవమనసగు నేనమ్మేలే
భవభాగ్యా భజనగళము బంధంమేలే
యువలక్ష్యం ఉదయముగనె సర్వం దేవీ
121 . కుటిలం (జ భ న య గ ....యతి... 7 )
సకాల వర్షము సతత సుఖాలే
వికాస మార్గము వినయ గతేలే
ప్రకాశ భావము ప్రెతిభ పనేలే
అకాల మృత్యువు అణుకువ దేవీ
122 . కుటిల గతి: (న జ త మ గ ....యతి... 7 (8 )
సహనమునున్న సామర్ధ్య మంత్రంమేలే
అహమునయున్న యారాధ్య తంత్రమేలే
దహనము దప్పఁదే జీవి యంత్రమేలే
మొహమున రంగు కాకండి ప్రేమే దేవీ
123 .కుపురుషజనితా : (న న ర గ గ ...యతి...7 )
అడుగుల వడి ఆటలే రొప్పున్
తడబడునడత తత్వమే నొప్పున్
విడువక కథలు విశ్వమే గీతిన్
కడపటి నడక నాట్యమే దేవీ
124 .కుబేరకటిక :(స స జ స గ ....యతి...7 )
పవనమ్ములసావధాన ముగుశ్వాసన్
జవసత్వములే జనాంతర విరక్తి న్
భవసాగరమే భయమ్ము మథనంమే
నవనాడుల మంత్రమేను విధి దేవీ
125 .కుమారలీల: (మ న న ర య ....యతి... 11 )
అర్ధించే మనసు నరుడుగా సహాయమేలే
వృద్ధిన్చెందు దయ కరుణయేదృతం కలేలే
సిద్ధిన్ పొందు కళ వినయమే చిరాగ్ని లేలే
బుద్ధిన్ పొందు నరుడగుటయేసపూజ దేవీ
126 .కుమారి :(న జ భ జ గ గ ....యతి... 9 )
సమయ మనోమయమ్ము సహజమ్ము మేలే
అమర సహా జపమ్ము అనుభూతియేలే
సమర జయమ్ము భాగ్య సహనమ్ముయేలే
మమత మతానురాగ మహిమేను దేవీ
127 .కుముదప్రభా (ర య న య .....యతి.. 7 )
వేంకటేశ్వరాశోభిత విధి తేజా
సంకటాలనే బాసట మది పూజా
మంకు పట్టుయే వేమన నిధి తేజా
జంకకుండ ధ్యానమ్ జపము దేవీ
128 .కుముదనిభా (న య ర య ....యతి... 7 )
అవని తలమ్మే హాయిపొందికేలే
రవికిరణంమే రమ్య లక్ష్య మేలే
వివరములేలే విద్య భావమేలే
నవవిధమేలే నవ్య భక్తి దేవీ
129 .కుముదమాలా (న త స భ య న త స గ ...యతి... 6 ,11 ,16 ,21 )
సమయ సత్యా సమరభేదం సమర లక్ష్యం సహన భావం సకల మేలే
కమల నాధా కనుల జూపే కరుణ వైనం కలయు ధర్మం కధలు యేలే
మమత భాగ్యం మనసు మౌనం మరులు దాహం మగని సత్యం మగువ యేలే
విమల యానాం వలపు మార్గం వయసు మోహం వరుని శాపం వరుస దేవీ
130 .కుముది నీవికాశ: (జ త స య .....యతి... 7 )
విచార మోహా సవివరం వరమ్మే
సచేత పొత్తున్ వసముయే జయమ్మే
రచించు కావ్యమ్ము రసమై బాలమ్మే
వచించు వాక్యాలు వరసౌను దేవీ
131.మహా మాయా.. =(య ర గ గ )
మనస్సే రంగరించేలే, వయస్సే వేదనమ్మేలే
క్షణమ్మే సంత సమ్మేలే, ప్రయాణమ్మే సమమ్మేలే
మనమ్మే ఏక మయ్యేలే, జయమ్మే సేవభాగ్యంమే
కణమ్మే కల్యటే దేవీ, వ్యయమ్మే చూపు శ్రీదేవి
132. సదాగతి.( జ భ స జ గ గ యతి.10)
సకాల భత్యము వలెనే సకామ మేలే
అకాల యాటలు వలెనే సమంత్ర మేలే
వికాస బుద్ధియు కదిలే వివాద మేలే
ప్రకాశ మిచ్చియు మెదిలే ప్రభాస దేవీ
133. కుసుమ విచిత్ర. (న న య య....యతి..7)
తరుణము మమత సమ్మోహ మౌటే
చెరిత గుణము చె సంతోష మౌటే
భరిత భరణ పరమ్మే మౌ టే
నిరుపమ సుఖ నినాదమ్ము దేవీ
134. కుసుమ విచిత్రము. (నయ నయ...యతి...7)
నడకయు సాగే నరములు పొంగే
వడకుట సాగే వరములు పొందే
చెడుగుడు ఆటే చెరితము తెల్పే
తడిపొడి మాటే తపమగు దేవీ
135. చిత్రలేఖా (మ త న య య య....యతి..12)
సౌభాగ్యమ్మేలే స మసుఖ సమర్ధం సుసౌఖ్యమ్ము ప్రేమే
ప్రాబల్యమ్మేలే సమసుఖ ప్రమాణం ప్రభావమ్ము ప్రేమే
గంభీరంమ్మేలే సమసుఖ ప్రభావం గళమ్మేను ప్రేమే
స్వాభాగ్యమ్మేలే మనసు గుణ శాంతీ సమ మ్మేను దేవీ
136. కూరాశనం (త న త న స గ గ.....యతి...9)
సౌందర్యచిలుకు ప్రశంసా ప్రధమ గుణమే ప్రేమా
మాధుర్యమలుపు సమమ్మే సుఖమనుటయే ప్రేమా
ప్రాధాన్యమగుట సశోభా ప్రముఖమనుటే ప్రేమా
విద్యార్థి యగుట సతావీ వరమగుటాయే దేవీ
137. కూలచారణి (ర జ మ గ గ....యతి...6)
వేణుగాణశక్తి విధ్యారత్నమ్మే
స్థానువే జయోక్తి సాధ్యాముత్యమ్మే
ప్రాణమే స్థిరోక్తి ప్రాముఖ్యమ్మేలే
ధ్యానమే సహాయ దారుణ్యం దేవీ
138. కృతమాలం. (న జ య భ గ గ....యతి...9 )
సమయ యశస్సుయె సస్వా సామ్యము యేలే
గమన మనస్సుయె సఖ్యా బంధముయేలే
సమయ ఉషస్సు యె విశ్వాసంమ్ముయుయేలే
సమరముయేవిధియాసో భాగ్యము యెదేవీ
139. కృష్ణగతికా (భ జ గ గ...)
కాలమునయోగమేలే, ముక్తిగను మోక్షమేలే
తాళనముధన్యతేలే, యుక్తిగను యున్నతేలే
గాలమునెశఖ్యతేలే, శక్తిగను శాంతి యేలే
మాలలువిశాలి దేవీ, ముక్తిగను సాక్షి దేవీ
140.కేతన (భ య స స య.....యతి....7)
వేదన కతంబే విజయమ్ము వినమ్ర మేలే
కాదను మనస్సే గలశోక వనమ్ము యేలే
రాదను మహాత్తే ప్రణమే జయమమ్ము యేలే
మేదిని సహాయం మమతే వినయమ్ము దేవీ
141 .కేళీరవం (స య స య ....యతి...7 )
చిరుహాసమేలే చిరునామ నీదే
మరుమల్లెమాయే మనసౌను నీపై
తరుణం సహాయం దరియేను నీపై
కరుణాలమాయే కమనీయ దేవీ
142 .కేసర (మ భ న య ర ర గ ....యతి...13 )
శత్రూన్మత్తా చికితపు నిలయంమ్మే శాంతియై సంతసంమ్మే
మిత్రోన్మత్తా సహచర వినయమ్మే మేరువున్ నిత్యమేలే
ఛిత్రౌచిత్యం మ్ము జయము సమరమే చిత్తమౌ సత్యమేలే
నేత్రానందా సమయము సహనమ్మే నేర్పుగా రక్షా దేవీ
143 .కోతుంభ ... (మ త స ర గ .....యతి.. 6 )
స్వీతృత్వం స్నేహమ్ము సిరితా లక్ష్యమేలే
మాతృత్వం మాయేలె మనసా సౌఖ్యమేలే
భాతృత్వం సామర్ధ్య బలమే భాగ్యమేలే
స్వాతంత్య్రం సాహాయ సమమే సాక్షి దేవీ
144 .కోమలము (భ భ మ గ ....యతి.. 7 )
సాధన నిత్యము సామ్రాజ్యమ్మే
శోధన సత్యము స్వాతంత్రమ్మే
వేదపు విద్యయు విస్వాసమ్మే
వాదన మార్గము వాజ్యం దేవీ
145 . కోల. 1 (జ స స య ....యతి...7 )
అలౌకిక జనా సమయమ్ము నందే
అలౌక్య పిలుపే సమయమ్ము పొందే
ప్రలాప ముగనే పయనమ్ము చెందే
విలోల మలుపే విజయమ్ము దేవీ
146. కౌశితకుశలా (భ స స గ గ ....యతి...7 )
భావమునను సర్వసుఖా విధ్యే
సేవలు ఘటియించుటయే విధ్యే
భావుకములు గల్గుటయే విధ్యే
భావన నిడునమ్మ విధీ దేవీ
147. కౌచమారః (స త గ గ యతి లేదు )
పలుకే బంగార మేలే, పదవీ సౌభాగ్యమేలే
చిలికే సింగార మేలే , విధిగా సంతోషమేలే
వళికే వయ్యార మేలే , నదిగా గమ్యమ్ము గాలే
పలికే ప్రాముఖ్య దేవీ , చదువే స్నేహమ్ము దేవీ
148. క్రీడాచక్రం (య య య య య య య య ....యతి...13 )
అనేకమ్మునేకమ్ము మౌనమ్ము ధర్మం యలన్ నమ్మి సేవా సహాయం ప్రభావం
వినేవారు భోదించ విద్యా జయమ్మే విధిన్ నమ్మి లక్ష్యము తెల్పే ప్రమాణం
కనేవారు ఆనంద మొందా నిజమ్మే కనెన్ నమ్మి దేహమ్ము మార్పే ప్రయాణం
మనోనేత్ర తత్వమ్ము నిత్యమ్ము నుండే మనస్ నమ్మి దాహమ్ము తీర్పేను దేవీ
149. క్రీడిత కటకా ( భ స స మ మ ....యతి... 9 )
దేశము విధిగా మనదే బారంబుల్ క్లేశంబుల్
పాశము విధిగా సమప్రారబ్ధ0బుల్ కాలంబుల్
వాసన విధిగా సహ వాసంబుల్ విద్యాబుద్ధుల్
ఆశయ మదిగా మమకారంబుల్ శ్రీదేవీ
150 .హంసపదం ( భ మ స భ న న న య ..యతి.. 11 , 19 )
వెన్నెల రాత్రుల్లో సుఖమేభావతలపు కలలు వలుపుల జగంబున్
కన్నెల సౌఖ్యమ్మే సహనమ్మే కళలగు మలపులు కధలు సుఖంబున్
మన్నిక మార్గంమే మనసమ్మే మగని కొరకు మగువపులు యటంచున్
యున్నటి దేహాంమే విజయమ్మే యుగము చదవు తనయు విలువ దేవీ