18, మే 2023, గురువారం

యీశ్వరీ

రచయిత ముందు మాట :::ఓం శ్రీరామ ... శ్రీ మాత్రేనమః  .. యీశ్వర, యీశ్వరీ శతకము 

యీశ్వర .. యీశ్వరీ సంకల్పము నేను శతకం లా వ్రాయగలిగినను, ఆ హనుమంతుడు నావెంట ఉండి, వ్రాయించాడని 11  రోజల్లో పూర్తిచేయ గలిగినాను, ఆదరించిన ప్రతిఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు (ఇది ఆవేశంతో వ్రాసాను తప్పులు దొర్లవచ్చు మేధావులు తెలియ పర్చగలరు మీకు ఋణపడి వున్నాను, ప్రాంజలి ప్రభ 103 పుస్తకం గా ముద్రించదలిచాను )              

నా మనస్సనేది చలములో ఊరుతున్న భావ  ప్రవాహాలు, నేత్ర ద్వయకాంతుల ద్వారా వ్యక్త పరచ దలిచాను. నేను మిక్కిలి గాఢంగా ప్రేమిస్తున్న గోగుల్,  ఫేస్బుక్, వాడ్స్ ప్ సభ్యులందరికి ఋణ పడియున్నాను.  ప్రతిఒక్కరి  కరుణా కటాక్ష వీక్షణాలనే కాంతులతో  నేను మనస్పూర్తిగా మీ అందరి సహాయము కోరుతున్నాను, నా వ్రాతలకు, ఆరాటాలకు తోడుగా సహకరించిన శ్రీమతి శ్రీదేవికి కృతజ్ఞతలు.     

నా రచనలకు మూలం సంతోషాంత రంగతరంగాలతో, బాధాతప్త హృదయ శోకాలతో, నిత్య దైవప్రార్థలతో,  నే నిప్పుడెట్టి అలజడులులేక అరిషడ్వర్గా లకు లోనుగాక నిర్మలంగా శాంతంగా చెమ్మగిల్లిన నేత్రాలతో జాలి చూపులతో, వ్యక్తపరచవచ్చు, నేను ఆగ్రహంతో అక్షరాలు దొర్లవచ్చు అర్ధం పరమార్ధం ఆలోచనలతో సాగె ప్రయాణ మే, నేనిప్పుడెన్నో సమస్యల వలయంలో చిక్కక, కష్టాలనెడి సుడిగుండా లలో మునగక,  బాధా తప్తమనో భావాన్ని తెలుపక అందరూ ప్రశాంతి వదనంలో చదవాలని వ్యావహారిక తెలుగుపదాలతో కొన్ని పద్యాలు ధ్రువకోకిల మరికొన్ని మత్తకోకిల ఆధారంగా వ్రాయటం జరిగింది.     

   ***

ధ్రు.. కో:: సమయ లక్ష్య సహాయమే యగు శాంతి భద్రత రాజిలన్ సమ సుసౌఖ్యము నూగు చుండెడి సాక్షి తంబున నెప్పుడున్ సమత తుల్యము వచ్చి పోవును సంఘ ముందున గాంచుమా సమయ మేను మనోమయమ్మగు శాంతినివ్వవె యీశ్వరా .......1 ....
ధ్రు.. కో:: చెలిమి నీడన నాడు బొంగియు చేష్ట లన్నియు వేడుకల్
చెలిమి శాశ్వత నిర్ణయమ్ముగ చింత బాపదలంచునే చెలిమి యుక్తియు భక్తి శక్తియు చేరువేయగు నెప్పుడున్ చెలిమి జీవిత మందు ఖచ్చిత చెంత బేలగు నీశ్వరా ..... .... .. .2 ....
ధ్రు.. కో:: క్రమము దప్పక సేవ లన్నియు కాంతి వంతము జూడగా
శ్రమను పంచియు సేవ మార్గము సంపదే మది శక్తిగా సమము నెంచియు సత్య బోధను సామ రస్యము చేయగా క్షమను నమ్మితి విశ్వ మందున క్షామ మాపవె యీశ్వరా...... .. .3 ....
ధ్రు.. కో:: పదము లేలను నిన్ను కొల్వగ భక్తి నీయవె బద్ధుడన్
సదన మందున నీదు జపము సాధనమ్మున వేడెదన్ మదన మేమతి నేలమాకును మాయకమ్ముటదేల నీ పదములేప్రభు పట్టియుంటిని పావనాంగమహేశ్వరా..... ... .... .4 ...... గుడ గుడా యని శబ్దమాయెది గుర్తు రాకయు వాసనై మడత రంబగు సేవతల్పుట మంచి చేయుట బాధ్యతౌ మడమ తిప్పక కాఫి నిచ్చియు మంచి బేలగ దారిగన్ విడువ లేనిక నిన్ను నేను సవిస్తరేమది యీశ్వరా............. .... . 5 .......
ధ్రు.. కో:: నిదుర లేకయు జీవితమ్మున నింద లేలుట ఏలనో బెదురు చూపుల మోహ కాంక్షల బేల నేస్తము ఏలనో ఎదురు మాటలు సేవలే యగు ఎప్పుడప్పుడు మారునో మది గతిన్ నడయాడు వేళలు మార్గమే యగు యీశ్వరా....... .6 .......
ధ్రు.. కో:: కటకటంబడమందు పిచ్చియు కష్ట జీవుల కెప్పుడున్
పటుత రంబగు బుద్దినేంచక పాడు మందుకు బానిసై అటుల నీడల కాల నిర్ణయ ఆత్ర బేలగ భార్యయే కుటిలతన్ మనోమయ మార్చ గల్గుట గొప్ప విద్యాయె యీశ్వరా...7 .....
ధ్రు.. కో:: చతుర భావము జీవ శాంతికి చర్చ లన్నియు టంతియే
ప్రతి విధీబల సర్వ పాలన వార జోక్యము వింతగా గత విధానము నేడు చూడుము కాల మెక్కడి కక్కడే శతవిధానము సృష్టి ధర్మము శాంతి లక్ష్యము యీశ్వరా.... ... . .8 ....
ధ్రు.. కో:: పసి తనమ్ము న తెల్సు కోకయు పడ్డ పాట్లుయు జీవితం
కసికసే వయ సే వినోదము కామ యవ్వన జీవితం యిసుక లాగ కధేను సంగమ ఇష్ట తృప్తియు జీవితం మసక చీకటి వచ్చిచేరును మాయ కమ్ముట యీశ్వరా ... ... ... .. 9 ......
ధ్రు.. కో:: కటువు మాటలు బల్కు టేలను కాల మందున నెప్పుడున్
బుటము పెట్టిన హేమ మట్టుల పూని యుండుట నొప్పునో
కటిక నేలను నమ్మి నానిక కాల మందున వేడ్క గా
చిటిక చప్పుడు హృద్య మందున చేష్ట లేలనొ యీశ్వరా.... . . .10
......
ధ్రు.. కో::కడలి పొంగుల జీవితమ్మున కల్ల లేలను వొప్పుగన్
బడలి బత్కున కష్ట మున్నను భాగ్యమేదియు తెల్పగన్
వెడలు నీడలు నెల్ల వేళను వేడు కౌనటట వేగమున్
దడలవేలను బంధ మందున దారి తప్పుట యీశ్వరా.... .... ... 11
.....
ధ్రు.. కో::కఠినమైన మనస్సు నాటయు కాల యాపన దేనికోయ్
మఠము నీడ సునాయసంబగు మంది రమ్మగు మార్గమున్ 
జఠిలమైన సమస్య లైనను సాయ మవ్వుట వీలుగా 
పఠితుడౌ విధి మార్గ మందున పట్టు బట్టితి యీశ్వరా.. ... ....12
.....
జన్మ రాహితి మోక్ష లక్ష్యము జాతి కంతకు నిత్యమై
జన్మ యర్ధము సేవ భావము  జ్ఞానముత్యమునిత్యమై
జన్మ శబ్దము విద్య మార్గము జ్ఞాన దుఃఖము నిత్యమై
జన్మ శాంతియు నాది భౌతిక మాది దైవిక యీశ్వరా.... .. ... ... 1౩
.....
ధ్రు.. కో::సరిగమే మన జీవితానికి సాగరమ్మగు వింతయౌ
  చెరిసగం బిదివెంట నేనువు చేరువే యగు కాలమే
పరుగు తీయుట నేల జీవన పాలునీళ్లగ బత్కుటన్
కరుణ చూపుము సర్వవేళల గాంచ సత్యము నీశ్వరా... .... .... ..14
......
ధ్రు.. కో:: వెలుగు నీడలు చావు పుట్టుక విశ్వ వాప్యత సంభవం
బలుకులే మది వేటకే గురి పాఠమే విధి లక్ష్యమో
తలపు లన్నియు సత్య భావ ము తారు మారు సదాశివా
విలువ లే బతు కౌను సాహస వేద బంధము నీశ్వరా..... .... ..... .15
......
కార్యమేయిది జేయనెంచిన కన్య దాసియ నే మనో 
చౌర్యమే యగు యుద్దవిధ్యయు సంబరమ్మగు వో మనో 
పర్యమై కది లేటి వక్త్రము బద్ధనెంచి సహాయ మే 
భార్య సాధన నిత్య సత్యము భర్తయే యగు యీశ్వరా. ... ... ... . 16
......
ధ్రు.. కో:: క్రమము బంధము న్యాయబద్ధము కాదు తీర్పులు లెంతకున్ 
దెమల సాగును దీర్పులన్నియు తీర్చ గల్గుట వింతగన్             
గమన మార్గము గైకొనేటిది తెల్ప గల్గుట తీర్పుగన్ 
సమము నిత్యము సత్యమే యగు ధర్మ మార్గము యీశ్వరా.... 17
.......
ధ్రు.. కో:: తలప దీర్ఘము విశ్వ మందున జాప్య ఒప్పని దేల్చుటన్         
తలప వోట్లను నమ్మ దప్పక తారు మారగు వేళలన్ 
తలప నీతియె బాహ్యమవ్వుట నేత పాలన దివ్యగన్ 
తలతు భక్తియు దేశ మందున తేజ మే మది యీశ్వరా.. ... ... ..18
.....
మ .. కో::అమ్మ నెప్పులు తియ్యనవ్వవు ఆశ చూపుల కాలమై
అమ్మ నేస్తము వెన్నె లైనను ఆది కార్యము వేదమై
అమ్మ ఆత్రుత రక్త మార్పిడి రక్ష బానిస రాగమై
అమ్మ బిడ్డకు జన్మ నిచ్చుట కష్టమాయను యీశ్వరా. .. ... ... ..19
.....
మ .. కో:: నింద మూలము డైన యంతట నేరఘోరము ఎందుకో
తొందరైనను చర్యలేయగు దూక రక్షణ లేకయే
కొందరుందురు మెప్పు కోరియు కోలుకుందురు ఎందుకో
ముందు జూడక కొందరందురు ముఖ్య మేనని యీశ్వరా ... ..20
.....
మ .. కో:: చక్కనైనది మేధతోనును శ్రద్ధ గల్గియు జీవితం
మక్కు వైనది ప్రజ్ఞతోనును మేలగున్నది జీవితం
నిక్కమైనది వజ్రమున్ గను నీతి తెల్పుట జీవితం
జిక్కియుంటినిదాజ్ఞనీదియు సేవలే మది యీశ్వరా. ... .... .... 21
.....
మ .. కో:: యోగి తన్మయ అక్షయమ్మున యోగ్య దర్శన భాగ్యమై
భోగి అద్దములోక్షయమ్మగు శోభ చేరిన భోగమై
రోగి యైనను కోప తాపము రోష ముండును రమ్యమై
ఆగి యుండక తొందరవ్వుట ఆశ చేరుటె యీశ్వరా.. ... .... ... 22
......
మ .. కో:: లేని దానిని ఉన్న దేయని లేశ మైనను చూడకా
కాని దానిని ఔను యేయని కామ్య పాశము చెప్పుటే
దేని నైనను తేల్చి చెప్పుత దేశమందున గొప్పయే
వాని బంధము రాజ కీయము వాని నేస్తము యీశ్వరా.. ... ... .. 23
.......
మ .. కో:: జ్ఞాన మోక్షము కొత్త కోర్కలు జ్ఞప్తి కొచ్చును నిత్యమై
జ్ఞాన తత్త్వము సామ రస్యము జ్ఞాతి జీవిత సత్యమై
జ్ఞాన మార్గము నిత్య సత్యము జాతి కంతకు ధర్మమై
జ్ఞాన తృప్తియు విద్య వ్యాప్తియు జ్ఞాన ధర్మము యీశ్వరా.. ... ..24
......
మ .. కో:: వాగు లన్నియు పొంగి పోర్లియు వాహినీ కళ నుత్సవమ్
సాగుచూ కళ పొంగి పొర్లుచు సాగరమ్మున గల్సుటే
వేగమార్పులు ఎంత చేసిన విస్తృతమ్మగు లక్ష్యమే
ఆగలేకయు కాలచక్రమ నా విదీ యిది యీ శ్వరా... ... .... .... ... 25
.....
మ .. కో:: ప్రేమ నాత్రితులందు గొందరి పిల్చి సంతసమందగా
భూములిచ్చెను గీములిచ్చెను భూరిదాతయగున్ సుమీ
కామి తార్ధము లిచ్చి నిత్యము గావుమా హనుమన్నృపన్
శ్రీ మనోహర దేవ దేవర శ్రీ నివాసవు యీశ్వరా... ... .... .... .... .. 26
...
మ .. కో:: దాన శీల యశో విశాలుని ధర్మ పాలు సుధీ మణిన్
దీన పోషుని సత్య భాషుని దివ్య వేషుని ధీరునిన్
మాననీయుడు రామకృష్ణుని మంత భావుని బ్రోవుమా
వాణి నిన్నెపు డంచెదన్ మది వాత్సవామ్మగు యీశ్వరా ... ... 27
......
మ .. కో:: ఎంత కాలమొ కొల్చి నందుల కీప్సి తార్ధము లీక నా
కంతు లేనటులన్ ఋణస్తుడవైతి వీవల బాకి ని
ట్లింత దాక యొ సంగ కుండిన నెట్టు లోర్చి యునిన్ను హ
ర్షింతు దెల్పుము నిన్ను కొల్తును శిక్ష నీదయ యీశ్వరా ... ... 28
......
మ .. కో:: ప్రేమ తృప్తియు ఆశ పాశము పేగు బంధ సుధా మదీ
ప్రేమ లక్ష్యము అన్ని వేళల పేర్మి తోడును కోరుటే
ప్రేమ భాష్యము చెప్పలేనిది పెన్నిధీ యగు నిత్యమై
ప్రేమ నేత్రము న్యాయమజ్ఞడ ప్రీతి నుంచుము యీశ్వరా.. ... 29
......
ధ్రు.. కో:: భుజము బాధ్యత తెల్ప గల్గియు బుద్ధి చూపెను గొప్పగా
సృజన శక్తియు దివ్య తేజము పృద్వి నంతట జూపగా
భజన భక్తికి ప్రేమ పంచును భాగ్య పౌరుల శక్తిగా
విజయ వాంఛలు ప్రేమ కోర్కెగ విశ్వ సృష్టియె ఈశ్వరా ... .... 30
.....
ధ్రు.. కో::స్పటిక కాంతి సహాయమే కను సేకరించిట విజ్నులై
పటిక తిప్పిన నీటి పాచిని పార్రద్రోలును సత్యమై
చిటిక వేసి సమాధనమ్మును చేతి కిచ్చెడ జీవమై
కటిక వృత్తిగ జీవనంబగు కల్మషం మది యీశ్వరా ... ... . 31
......
మ .. కో:: అంద మైనది కోరు కున్నది అందు లోనిది అర్ధమే
పొంది కైన మనస్సు వున్నది పొంగి పోనిది బంధమే
వందనమ్ము యశస్సు యన్నది వ్యాధి కానిది అర్ధమే
గంధ పుష్ప వయస్సు యన్నది గమ్య భక్తిగ యీశ్వరా ... .. 32
.....
ధ్రు.. కో:: సిరులు యున్నను బుద్ది లేకను చింత లోచ్చుట కాలమై
పురులు విప్పియు నాట్య మాడెడి పూజ్య మైనది పుష్పమై
తరుణ జీవము నిత్య కష్టము తారు మారగు లక్షమై
మురియు జీవన మార్గ మంతయు ముచ్చటేయగు యీశ్వరా,,. 33
....
ధ్రు.. కో::కడకు చేరు మనో విహంగము కాల నిర్ణయ లక్ష్యమై
చెడుగుడే మది సర్వ వేళల చేరు వవ్వుట నేస్తమై
మడుగు లోదిగి యీద లేకయు మంచు గడ్డగ మారి నీ
యడుగులే పరమార్గ మౌచు జయంబు చేర్చుము యీశ్వరా ... ..34
......
ధ్రు.. కో:: బెదిరి పోకయు ధైర్యముంచియు బీద మాటలు లేకయే
చెదిరె హృద్యము కర్మయేనని చేష్ట నామది భావమే
ముదిరె మూర్ఖుని చేరువైనను ముంపు కమ్మిన ఓర్పుయే
విధిగ పాపము చేసి యుంటిని విన్న వింపిది యీశ్వరా ... .... ... 35
....
ధ్రు.. కో:: కటకటా విధి వైపరీత్యము కాపు గాసెడి పద్ధ తే
యెటుల చెప్పెద మంచి బుద్ధి వియోగమేయగు టేలనో
పటిమ జూప సహాయమే విధి బాపలేనిది ఏలనో
వటము వోలెను నీడ నిచ్చుచు భాద్యతేదియు యీశ్వరా ... ... ..36
...

ధ్రు.. కో::గెలుపు ఓటమి సాధనే యగు గెల్వ లేకను వింతగా 

మలుపు లెన్నియు వచ్చి చేరును మాయ మోహపు బుద్దిగా
మలుపు ఆఖరి కాదు ఎందున జీవి తానన ఆశగా
పలుకుతోమది విద్య నేర్పుము పాద పూజగ యీశ్వరా ... ....37
.....
ధ్రు.. కో::కెరటమే కదిలేను నిత్యము కీలకం యగు ఎందుకో
చెరకు పిప్పిగతే విధమ్ము సుచేష్ట యైనది ఎందుకో
ఎరుక కష్టము నేర్పుటేకళ ఏల పాఠము ఎందుకో 
మరువ లేకయు చెప్పుచుంటిని మంద బుద్ధిది యీశ్వరా.  38
.....
ధ్రు.. కో:: కలియుగమ్మున కొత్త పోకడ కావడే యగు ఏలనో
కలి చెసే విధి నాట కమ్ముయు ఖర్చులేయగు ఏలనో
బలి కధే యిది ఇవ్వరే మన బాని సమ్ముయు ఏలనో
మలి మనోభవ మార్పు లన్నియు మార్గమేయగు యీశ్వరా.39
......
మ .. కో:: నేత తీరు సుఖమ్ము కోరుట నేటి నైజము మంతటన్
తాత చెప్పిన నాటివైభవ తాహతే మది పాలకుల్
చేత నైనది చాచువారిట,చేయనెంచగ  నంతయున్ 
రాతమార్చును దేశ భక్తియు రాజ్య మేలును యీశ్వరా.... ... 40
......
మ .. కో:: కాంతి పుంజము విస్తరించియు కన్ను చేరుట దేనికో
శాంతి నిచ్చె మనస్సు చేరుట సాధనే యగు దేనికో
బ్రాంతి తొల్చి వెసేది వర్ణన రాశి నెంచుట దేనికో
జాతి కంతకు అర్ధమవ్వక జాడ్జ్య మయ్యెను యీశ్వరా..... .... 41
.....
ధ్రు.. కో:: కనుల లోని జలంబు ఖర్చగు కామబుద్దిన నావిరై
మనసు పైనను వ్రాలు వ్యర్థపు మార్గ తీరుగ దుర్జనుమ్ 
తనువు ఆశయదీ నధర్మము తంతు ఔటను ధర్మమీ
కనుము సత్యము నిక్కమేకద కర్త ఎవ్వరు యీశ్వరా..  ... .... 42
....
మ .. కో:: అన్ని నీవుగ కల్సి పోతివి ఆత్మలో నన నుండితీ
అన్నమే బ్రతుకయ్యి కామ్యము ఆశ చుట్టున ఉంచితీ
వెన్న లాగ సహాయ మైతిని వేళ కళ్ళని వేడితీ
కన్న ప్రేమ మనస్సు నుంచుము కార్య సిద్ధివి యీశ్వరా..... .43
.....
ధ్రు.. కో:: తళతళా మెరిసే కళా మది తారయే విధి ఆటగా 
కళకళా కళలన్ని వెన్నెల కాంతులే విధి ఆటగా 
మిలమిళా కదిలేటి కన్నులు మెల్ల మెల్లగ ఆటగా
కలలు కల్లలు చేయుటేలను కాల మాయయు యీశ్వరా.... ..44
......
ధ్రు.. కో:: గలగ ళా కదిలేటి నీరును గానమల్లెను ఆటగా
పలుకులే తలవంపు తెచ్చుట భావ గధ్యము ఆటగా
తలపులే కథ మేలుకోర్కలు తప్పు ఒప్పులు ఆటగా
వలపులే సహ జీవనమ్ముకు వేల్పుల వ్వుట యీశ్వరా.... .... .45
.....
మ .. కో:: నోట్ల కట్ట మదీయ భారము నోచు కోవుట ఎందుకో
కట్ల పాముయు రూపయే విధి కోట్ల కట్టలు ఎందుకో
చెట్ల వెంబడి రెండు వేలవి చిత్తు కట్టలె ఎందుకో
పొట్ల గిత్తల రాజకీయము పోరు పెట్టెను యీశ్వరా.. ... .... ... ..46
.....
మ .. కో:: లెక్క లేకయు సంప దయ్యెను లెక్క చూడుట ఎందుకో
కుక్క పిందెలు చూసి నంతన నక్క బుద్దియు ఎందుకో
చుక్క కోరియు రెండు వేళ్ళను చుక్క కేనని ఎందుకో
ఒక్క మాటయు చెప్పకుండగ చెల్లదే యన యీశ్వరా..  ... ...  47
......
మ .. కో:: ఎత్తు లేయు కుయుట్టు బుద్దియు ఎల్లవేళల ఎందుకో
మత్తులే మది జిత్తులే యగు మానసమ్ముయు ఎందుకో
పొత్తు లే సుర కత్తులే యగు పోరు జీవిత మెందుకో
చిత్త మంతయు తారు మారగు చేష్ట లేమియు యీశ్వరా.. .. ..48
.......
మ .. కో:: దత్తులే మది చిత్తు లేయగు దారి తప్పుట ఎందుకో
తొత్తులే ను గమత్తు చేయట తోడు కోరుట ఎందుకో
తిత్తులై విధి చెత్తలై సహ తీరు మారుట ఎందుకో
మత్తులే మది చేరి మారుట మాయ కమ్మెను యీశ్వరా.  ... ... 49
.....
మ .. కో:: మొత్తు కోకుము విత్తు మొల్చుట మోజు మారును ఎందుకో
హత్తు కోకుము ఎల్లవేళల హాయి మారుట ఎందుకో
వత్తు వత్తియు చెప్ప గల్గుట విద్య మారుట ఎందుకో
సత్తు వే యని చెప్ప గల్గుట సౌమ్య మాయయు యీశ్వరా... ..50
.....
ధ్రు.. కో:: ప్రకృతితో విధి నాట లాడుట పాఠమే యగు దేనికో
వికృత చేష్టలు వింత పోకడ విజ్ఞతన్ మది దేనికో 
సకలమున్ తరుణమ్ము మాటయి చంపి నా కృతి దేనికో 
వికలతన్ మది బాటనెంచియు వీడకుండిరి యీశ్వరా. .. .. . 51
.....
ధ్రు.. కో:: నిరసనే యది కాదుకదన నేటి దేశము రూపమై 
తరుణమేయది తత్త్వమాయయు తారతమ్యత దేహమై 
కరుణ లేనిది నిత్య సత్యము గమ్య మౌనును దాహమై 
చిరుత బుద్దియు మారె దెప్పుడు చిత్త చేష్టలు యీశ్వరా.  .. ..52
......
ధ్రు.. కో:: తన మనో పరి పూర్ణమైనది తవ భావము తెల్పుటే    
కనకబిందువు ముఖ్యక్షేత్రము కావ్య మార్గము తెల్పుటే  
దినక రుండు కళే మనోమయ దీక్ష తత్వము తెల్పుటే    
తనువు సిద్ధియు సంతసమ్ముయు తెల్పమా మది యీ స్వరా.53
.....
ధ్రు.. కో:: హరియుగా మది వేద మంత్రము ఆత్రమేయగు ఏలనో 
గరిమ ధర్మము శాస్త్ర పుణ్యము కామ్య మార్గము ఏలనో 
పరమ పావని యోగ భావము పాద మూలము  ఏలనో 
పరిపరీవిధి బట్ట కట్టుట భాగ మేలను యీశ్వరా.  ... .... .... ..... 54
...
ధ్రు.. కో:: హరిహరా యని వేడు చుంటిమి హావ భావమనస్సు గా
ధరణి తీర్పుగ బాధ తీర్చుము ధ్యాన పల్కు యశస్సు గా
అరుణ నేత్రము విశ్వ మార్పుకు అగ్ని సాక్షి ఉషస్సు గా
కరుణ జూపుము ఒక్కరొక్క సకాల కర్తగ యీశ్వరా..   ...  .....   .. 55
......
మ .. కో:: కాలు తున్నది అగ్ని చేరగ కౌగిలించిన పృథ్వియే
జాలి జూపక ఉష్ణ తాపము జాతి కంతకు భాగ్యమై
కూలి లేకయు పిల్లపాపలు కూడు లేకయు ఏలనో
ఆలి మాటలు నమ్మకమ్మున ఆత్రమేలను యీశ్వరా.  ... .... .. 56
......
ధ్రు.. కో:: కులము లన్నయు మాయమై సరి కూటి  చేరుట మాకు మీ 
కళను జూపియు నిత్య సత్యము కాంక్షయే గుణ మార్గ మీ 
పిలుపు క్రొత్తదనంబు కెప్పుడు పీఠమవ్వుట గల్గు మీ 
పలుకు మాకును క్రొత్త యోచనకై సతంబున యీశ్వరా.  ... .... 57
.....
ధ్రు.. కో:: మధుర భావన మౌన రూపము మంద హాసము ఏలనో 
అధర నేస్తము నివ్వ నెంచియు ఆశ లన్నియు ఏలనో 
మధుర నవ్వు సుగంధ మల్లెలు మానసమ్మున ఏలనో 
వ్యధలు మాయము ప్రేమపంచుట వ్యక్తి ఇచ్ఛయు యీశ్వ రా.58
...
ధ్రు.. కో:: అలిగి దాచెను రెండు వేళ్ళను నాతడే నని ప్రశ్నగా
కలిమిలేదని చెప్పు చుండియు కాల్చబుద్ధియు కోపమై 
విలువలేదని తెల్సి నాకను వీడ కుండగ మార్చగా
పలుచ నెంచక నోట్ల కట్టను పంచ గల్గితి యీశ్వరా.  ... .... ....   59
......
మ .. కో:: ద్యాస వీడను తండ్రి దండము తప్పు లెన్నక బ్రోవుమా
జ్యాస యే పవమాన మందిర జా డ్జ్య మే నని బ్రోవుమా
వాసవే మది హృద్య మయ్యెను వందనమ్ముయు బ్రోవుమా
ఆశ పాశము వెంట నుంటిని ఆత్ర విన్నప మీశ్వరా.  .. .... .... ...60
.....
ధ్రు.. కో:: కమల శోభ దిశా వివేకము కావ్య గ్రంథ మనోన్నతీ
సమయ తృప్తి సమాన సంతస సౌమ్యభావ సమోన్నతీ
విమల విశ్వ వినోద భావము విద్య ఉన్నతి సన్నుతీ
అమరసౌఖ్యము అందజేయుము ఆది దైవము యీశ్వరా. ... ...61
.....
ధ్రు.. కో:: విమల శోభిత విశ్వ వాణిగ విన్నపమ్ము సురేశ్వరీ
ప్రమద వందిత వందనమ్ముయు ప్రీతి నిచ్చు కృపామయీ
భ్రమలు బాపుమి వాక్యదోషము బ్రాంతి నైనము బ్రోవుమా
సమయ మంతయు తప్పులెన్నక సాధనే యిది యీశ్వరీ. ... ...62
......
ధ్రు.. కో:: తెలుగు సాంస్కృతి పండగే యిది తేటపర్చట విశ్వమై
వెలుగు నింపుట కావ్య సంపద వెన్నెలయ్యిడి పండగై 
చలిత పద్యము గధ్య భావము చెప్ప దల్చితి నిత్యమై
లలిత లక్ష్యము సర్వులందున లౌక్య మీవుము యీశ్వరా.  ... ..63.
....
ధ్రు.. కో:: చలము నీరును దాహమాపు విచార మాపును యిప్పుడే          
బలము తోడగు చేర గల్గుట బంధమే యగు యిప్పుడే 
కలము బెట్టియు తానె వ్రాసెను కాల మార్పులు యిప్పుడే            
ఖలులు తద్గతి మార్చ వైతివి కర్మ లేయగు యీశ్వరీ . ... .... ... .64
.....
మ .. కో:: నీదు హాస్యము హంస నాట్యము నమ్మ కాలగు యేలనో 
నీదు కన్నులు నవ్వు తెచ్చుట నిర్మ లమ్మగు యేలనో 
నీదు లోగిలి సవ్య మాయెను నవ్య వైనము యేలనో
నీదు భక్తియు నీదు శక్తియు నీదు యుక్తియు యీశ్వరీ . ... .... .... 65
....
మ .. కో:: దేవరా నను బ్రోవరా గతి దైవ మాయరా మానస
మ్మే వరా రమ రమ్య తే సిరి మోక్ష మివ్వ విశాల 
మ్మో వరా విధి రాజ్య మేలు సుమాయ చూపెర విశా ల
క్ష్మీ వరా నిజ శక్తి నివ్వర కీల కమ్ముర యీశ్వరీ ... ... .... .... .... .... 66
......
ధ్రు.. కో:: ప్రగతి శీల మనో రధమ్ము సుచిత్ర మైన సుఖా శుభం
బుగతి నిత్యము ఇంద్రియమ్ము బుధా చరిత్రల పాటయే 
ను గతి సత్యము విశ్వమంతయు నున్న తీరును విద్యయే
జగతి నేలును సర్వు లందున జాగృతీ విధి యీశ్వరీ .  ... ..... ...67
...
మ .. కో:: తల్లి శాశ్విత కల్ప వల్లి సుతాంగ వల్లి కృపా కరా
వల్లి ప్రేమలతాంగ వల్లి వర్ష జల్లు నిరంతరం
మల్లి యిల్లను పాల వెల్లియు జాచి చూపుల చల్లగా
జల్లి కోర్కెలు తీర్చుటే సకలమ్ము తృప్తియు యీశ్వరీ. ... .... .... .68
.....
మ .. కో:: మాట చేదుగ నున్న సత్య సమాన వేష విధానమే
మాట విజ్ఞత పెంచ కల్గి సమాధనమ్ము నిదానమే
మాట అక్కర కొచ్చి ఆశయమే మనో మయ దానమే
మాట నేస్తము ప్రాణ మెచ్చెడి మానసమ్ముయు యీశ్వరీ.  ... .... 69
....
ధ్రు.. కో::  త్రిజగ వెల్గులు నీలకాంతియు తీవ్ర భావము చెందుటే 
రజను కాంతులు బంధు వైనను రమ్య రాజము చెందుటే 
వ్రజపు మెర్పుయు ప్రేమ మార్గము వెల్గు చీకటి చెందుటే 
విజయమే విధి  నెల్ల నెప్పుడు వన్నెలాడుట యీశ్వరీ.  ... .... ... 70
.......
ధ్రు.. కో:: ధనము మున్గియు తేలు చుండుట ,ధర్మ మార్గము రందరున్
కనమిదే విధి పాప మే యని ,కన్నుముందరి రూపమున్
వినుటకే విధి వింత యేయన వీనులే యగు కాలమున్ 
కునుకుగూడను రాక కుండును నుండ గల్గుట ఈశ్వరీ.  ... .... ... 71
.......
మ .. కో:: సామదానము భేద బుద్దియు సర్వమేయగు జీవితం 
కామకళ్ళతొ పెచ్చు మీరియు కాని చేష్టల జీవితం 
సేమమే కరువయ్యెను నిత్యము చింత లేమది జీవితం 
కామ లోభము మోహ మార్గము కామ్య లక్ష్యము యీశ్వరీ  ... .... ... 72
...
మ .. కో:: దేహ వాంఛలు విశ్వ హృద్యము దేవ సృష్టియు శ్రీపతీ
మోహ సంకెల ప్రేమ భావము మూర్ఖ మవ్వక శ్రీమతీ
ప్యూహ మేమియు లేకయుండు సపూజ్య లక్ష్యము శ్రీపతీ
ఊహలన్నియు తీర్చి దిద్దుట ఊయలే యగు ఈశ్వరీ  ... .. ... ...  73
.....
మ .. కో:: కాలకంఠునిఁదల్చినంతనెగౌ రవంబనుభావమున్
కీలనేత్రునిఁగొల్చినంతనెకీడుపోవునునంద్రుగా
వ్యాళభూషికిసేవఁజేయగవంతలుండవు యూహకున్
శూలపాణినినమ్మినంతనెశోభఁగల్గుట తథ్యమౌ         ... .... ... .... 74
.....
మ .. కో:: సందడెట్టుల నీవు బల్కక చక్కనైనది నవ్వుతో
నందజేయుచు నల్లినట్టిది హారమొక్కటి ప్రీతిగా
‌వందనమ్ములఁ జేతు వేలుగ, పట్టు వీడవె వెంటనే
వందితాఖిల లోకపావని భక్తపాలిని యీశ్వరీ         ... ... . ... .... ... 75
.....
మ .. కో:: చెప్పవచ్చును దల్లి నీవికఁ జెప్పఁదల్చిన దేమిటో
విప్పనా ముఖపుస్తకమ్మును వేడ్కనొందియుఁ జూడఁగా
తప్పుఁ జేసితి నిన్నుఁ గొంచెము తాళమంచును బల్కుచున్‌
తప్పలేదట పల్కులాడక తన్వి తోడను యీశ్వరీ    ... ... ... ..... ..76
....
మ .. కో:: మార్గదర్శిని యంచు వ్రాయఁగ మాటలాడితిఁ బద్యమున్‌
వర్గమందున సఖ్యముండుటఁ బల్కితాగతి, నైననున్‌
దుర్గమాంబిక గూర్చియే కద తోషమొప్పఁగఁ బల్కితిన్‌
నిర్గమించిన వెంటనే తను నిన్నుఁ జేరఁగ యీశ్వరీ  ..   ... ..... ..77
....
మ .. కో:: మెచ్చునో, కలలందు వచ్చును మేలు చేయుట నిత్యమూ   
దెచ్చునో, యనురాగ  మిచ్చును దేవ పూజలు సత్యమూ  
మెచ్చునో, నను జూడ  వచ్చును మీద మాయయు ధర్మమూ 
దెచ్చునో, యొక ముద్దు  నిచ్చును దీక్ష మాతయు యీశ్వరీ .. 78  
.....
మ .. కో:: మెచ్చునో, దరి జేర వచ్చును మోక్షమేనని నిత్యమూ 
దెచ్చునో, పరిరంభ మిచ్చును దేవ శక్తియు సత్యమూ  
మెచ్చునో, వనమాలి వచ్చును మేలు యుక్తియు ధర్మమూ  
దెచ్చునో, పులకింత లిచ్చును ధర్మ మార్గము యీశ్వరీ .. ... ...79
.....
మ .. కో:: ఇందిరాలయమేమొ నందన ఇచ్చ మవ్వుట సత్యమూ    
లందమై కదలాడ  డెందము లాస్యమవ్వుట నిత్యమూ    
మందమందముగాను గంధము ముద్దులవ్వుట ధర్మమూ     
విందు లీయఁగఁ దావి  డెందము విద్య వెలుగు యీశ్వరీ ... ...  80    
.....
మ .. కో:: చిందుచుండెను వంశి సుందర చిన్మయా మది సత్యమూ       
బృంద మందెను హాయి డెందము భందమవ్వుట నిత్యమూ   
ఇందుకాంతులలోన నెందుగ  యీప్సి తమ్ముయు ధర్మమూ     
మందు నృత్యపు చిందు డెందము ముద్దు ముచ్చట యీశ్వరీ. 81  
......
మ .. కో:: తోడు తోడని చెప్పలేకయు తోట్పడేది సమాధియే
లేడు లేడని వాద నొద్దు కలే విదీయని నిద్రయే
కాడు కాడని చెప్పు టేలను కాల తీర్పు ఉషోదయం
వేడు కొంటిని విన్న వింపులు  వేకు వైనను యీశ్వరీ..   ... .... ...82
......
మ .. కో:: వాలిపోవుట పొద్దుగూగుట వ్యాధికాదు విదీ మదీ
జాలి చూపుట నెక్కిరించుట జాడ్జ్య మావదు లే గతీ
ఆలి మాటలు నిత్య సత్య సుహాసనే యగు వింతగా
ఏలి మౌనపు మంద హాసము ఎల్ల వేళల యీశ్వరీ ...   ... .... .... 83
......
మ .. కో:: ప్రేమకున్నబలమ్ముమాత్రము ప్రేయసీ మది తీక్షణం
ప్రేమపంచియు స్వేచ్ఛ నిచ్చియు ప్రేమపొందియు వీక్షణం
ప్రేమ నిత్యము బేధ భావము ప్రేమ సత్యము బక్షణం
ప్రేమ ధర్మము ప్రేమ శక్తియు ప్రేమ మోక్షము యీశ్వరీ .. ... ..84
......
ధ్రు.. కో:: పుడమి తల్లికి నీరు పెట్టియు విత్తనాలను చల్లితీ 
కడలి పొంగుల గాలి చేరక చేను రక్షణ చేసితీ 
వడలి వంచియు కష్ట పెట్టియు చేను కాంచగ ఉండితీ       
పడక చేనుగ నీవు దిక్కని పేద బత్కుయు యీశ్వరీ  ...  .... .....85    
....
ధ్రు.. కో:: కనులు మూసియు సహన ముంచియు కాల నిర్ణయ తీర్పుగా
తొనకు సృష్టియు సర్వమాయయు తోడు మార్పులు నేర్పుగా
చినికు మాదిరి స్వేచ్ఛ నిచ్చియు చింత మాపియు కూర్పుగా
తనువు దాహము దేశదేహము తరుణమేను యీశ్వరీ.  ... .... .. 86
....
ధ్రు.. కో:: పదిలమాయెను శిష్యబృందము పద ఉపాసన నేర్వగా
నదిన నుండియు వల్లెపాఠము నవ్య విద్యను నేర్వగా
మదిని దోచియు జయమునిచ్చియు   మార్గ దర్శియు దైవమే 
గదిన నిద్రయు గురువు బోధయు గమ్యమేను యీశ్వరీ ... .... ..87
.....
మ .. కో:: జన్మ జన్మల బంధ మాయెను జ్ఞాన మిచ్చుట నేస్తమై
జన్మ సార్ధక నెంచగల్గియు జాతి మేలుగ నేస్తమై
జన్మ కార్యము నిర్వహించుట జ్ఞాతి ధర్మము నేస్తమై
జన్మ శోధన నిర్వి రామము జ్ఞాన వృద్ధియు యీశ్వరీ .  ... .... ..88
....
మ .. కో:: చూపు మంచిది చేయ నెంచియు చూసె నన్నియు చెప్పవా
కాపు కాయుని నీడ నుండియు కాల దీపము చూపవా
నాప లేనును బుద్ది మార్పును నాశ నవ్వుట మార్చవా
కోప తాపము మార్పు చేయుము కొరికేయిది యీశ్వరీ .... .... ...89
.....
మ .. కో:: కోటి విద్యలు కూటి నెంచియు కొల్ల గొట్టుట దేని కో
చేటు విద్యయు నీదు కూడును చెరచు నిత్యము సత్యమై
నీట ముంచిన పాల ముంచిన నీదు మార్గము నిత్యమై
ఆట పాఠము పాట నిత్యము ఆశ దేనికి యీశ్వరీ . ... .... .... .. .90
--
ధ్రు.. కో:: తరుణమే విధి భావమే రస తాప బుద్దియు కార్యదా
సురవరా భవ బంధము సన్ని దానము సర్వదా
సిరిని విద్యను సర్వ సృష్టికి క్షేమమేయగు ధర్మదా
గిరులు తోటలు సౌఖ్య తుష్టికి విశ్వ మందున యీశ్వరీ. ... ...  91
.....
మ .. కో:: తీర్ధ యాత్రలు రోగ మార్పిడి తీర్చ నెంచియు చేయుటే
స్వార్ధ బుద్ధియు కాదు కాదును సామరస్యము కోరుటే
అర్ధమే వీధి నీరు మార్చును ఆశ తోడున చేరుటే
వ్యర్థ మేదియు లేనె లేదులె వేద పాఠము యీశ్వరీ.. ... ... ... 92
....
మ .. కో:: కంఠ మందున నాగహారము గంగయే తల పైననే
పాఠమే జగతంత నేస్తము పాల నెత్రుని వర్ణనే
పీఠమందున పార్వతీపర మేశ్వరా మది కాలమే
కంఠ వాక్కులు  చేదు బత్కున కామ్య సుందర ఈశ్వరీ.. ... .. 93
......
ధ్రు.. కో:: కవి కులం శివమెత్తగా కథ కావ్యమే యగు సూత్రమై
కవి కవిత్వము ధర్మ మార్గము కన్నులేయగు చూపులై
కవుల హృధ్యము రక్త తర్పణ గ్రంథమే యగు నిత్యమై
కవి సమాజము సృష్టి వర్ణన కష్ట నష్టము యీశ్వరీ.. ... .... .... 94
......
ధ్రు.. కో:: మనము చూపెది ప్రేమ బంధము తోను మానస తత్వమే
మనకు పుట్టిన పిల్ల లందరి మాయ జీవిత బంధమే
క్షణము తృప్తియు సేవభావము కాల నిర్ణయ లక్ష్యమే
తృణము రీతిన సౌక్యమే యిది తృప్తి లేదును యీశ్వరీ.... ..95
......
ధ్రు.. కో:: కపట బుద్దియు కాటు వేయును కాని తత్త్వము చెప్పకే
చెపల లుల్ గుణ హీన చోరులు చేయు చేష్టలు పొట్టకే 
కృపయు లేకయు యీర్ష్య యుండియు కోప మెక్కువ తిండికే
నెపుడు వ్యర్థము సత్యమేయిది నేటి నైజము యీశ్వరీ.  ... ..96
.....
ధ్రు.. కో:: కబల మింతయు ఎవ్వరివ్వరు కష్ట కాలము దేనికో
సబబు టంచును సాయమన్నది సల్ప లేరును దేనికో
ప్రబల శక్తియు ఉన్నలాభము బాధ్యతన్ కరువే మదీ
సబల నైతిని ఏమిలేకయు సూత్రమేదియు యీశ్వరీ. ... ...  97
.....
ధ్రు.. కో:: అసలు అన్నది ఏమిటోమరి ఆశకన్నను మించునా
కొసరి చెప్పుట చక్కచేయుట కోలు కొమ్మని మాటలా
ఎసరు పెట్టియు మాట తప్పియు ఎల్లవేళలు ఆటలా
పసరు యీ బతుకే మనస్సును పాడుచేసెను యీశ్వరీ. ... ..98.
....
మ .. కో:: దేవిశారద దివ్య తేజము దేవి పార్వతి శాంతిగా
భావ నామము సర్వనామము  భాగ్య నామము శంకరం
భవ్య సోదర తత్వ మేయిది బంధు మిత్రుల ప్రేమకై 
దివ్య మైనది వాణి పల్కులు దివ్య తేజము యీశ్వరీ   ... .... 
.....
ధ్రు.. కో:: తెలుగు జాతికి కల్పవల్లివి తేట పర్చిన కాళివే
వెలుగు నింపిన విశ్వ మందున విద్య వాణివి కాళివే
తెలుపు పెక్కు శతాబ్ద భద్రము తేరు తిన్నెలు కాళియే
మలుపు దాయిని శిష్ట రక్షణ మానసమ్మగు యీశ్వరీ..... ..... 100

***
మ. కో. అన్న పూర్ణ మనో బలమ్మగు ఆది శక్తివి నీవులే
కన్న బిడ్డల ఆశయమ్ముగ కామ్య యుక్తివి నీవులే
ఉన్నదంతయు ఉజ్వళమ్మగు ఉష్ణ శక్తివి నీవులే
మన్ను మిన్నుకు మధ్య జీవిత మాయ కమ్మిన యీశ్వరీ101

ధ్రు. కో. పదము పేర్చుచు పంక్తి వ్రాయగ పద్య కావ్యము నీదయే 
సదము  భక్తియు  చాలు నిప్పుడు సాధనమ్ముకు నీదయే 
ముదము గాంచితి తత్వ భావము మోహనమ్ముయు నీదయే 
హృదయమందున నీవు తల్లివి హృష్టి పొందెద  యీశ్వరీ102

ధ్రు. కో. సగము దేహమనో బలమ్ముగ సంతసమ్మున తృప్తిగా
నగవు చూపుల ఎల్లవేళలు నమ్మ పల్కులు తృప్తిగా
పగలు కష్టము రాత్రి ఇష్టము పంచి పొందుట తృప్తిగా
వగల మారిగ ధైర్యమే మది వాంఛ తీర్చును యీశ్వరీ103

ధ్రు.కో. మగువ చుపులు నిత్యసత్యము మార్చగల్గుట యేలనో 
దిగులు కొంతయు తగ్గి సంతస తృప్తిమాయలు యేలనో 
తగువు రానిది హాయి నిచ్చెడి తత్త్వబానిస యేలనో 
మగని కెప్పుడు శాంతి చేర్చుట మానసంబుగ యీశ్వరీ104

ప్రాంజలి ప్రభ..22/15/06/2023
మల్లా ప్రగ్గడ 

మ. కో. అంబ శారద నిత్య వేడ్కనవాంబుజోత్పల నీడలై
శంభు సృష్టియు భూషనాంబర సమ్మతే యగు వెడ్కలై
చుంబితా మది దిగ్విభాగము సూక్తి యుక్తము కోరికై
సంభవమ్ము విహారిణీ మది శాంతి కోరు యీశ్వరీ.105

మ. కో. హస్తమౌధ్యము శోభితమ్మది హవ్య భాష్యము తన్మయా
విస్తు సత్పల ప్రోత్సహమ్ముయు విశ్వ మందు నావభ్యు దా
మస్తు రమ్యత వాదమవ్వుత మోహ మత్యర నిత్య భూ
శిస్తు యాచన యోచనవ్వుట సీఘ్ర శాంతికి యీశ్వరీ.106

మ. కో. పల్లెలే ప్రకృతీ పరమ్మగు ప్రీతి నిచ్చు శుభమ్ముయే
కల్లలాటలు లేని నిష్ఠయు కామ్య సాగును చేయుచున్
చల్ల చల్లగ వెచ్చగా మరి చక్క భోజ్యము నుండిలే
ఎల్ల మానము మన్ననేయగు ఎన్ని చెప్పెద యీశ్వరీ.107

మ. కో. వేగమే మరి నాట్య మాడుట వేద్యులీలలు నీవనిన్!
సాగుణే మరి నీదుపూరణ సాగరమ్మగు తీరుణా 
మూగు ముచ్చట విద్యలన్నియు ముఖ్యమవ్వుత నేస్తమై 
పాగ వేయుచు మేధయేయిది  పండితోత్తమ యీశ్వరీ.108

మ. కో. కన్న వారికి రోగమిచ్చెడి కాని వైద్యము గొప్పగా
యున్న నాడిని చూడ గుండగ  యుత్తమమ్ము పరీక్షలే
చిన్న రోగము పెద్ద చేయుచు చింత పెట్టుట డబ్బుకై
యున్న వైద్యము కొత్త పధ్ధతి యూక దంపగు యీ శ్వరీ.109

మ. కో. భోజ్యమేగతి గాగ సంపద పోరు సల్పుచు  భూమిపై
ఆజ్యమేయగు యన్ని వేళల యాత్మ శాంతికి సర్వమై 
సజ్యు సౌఖ్యము చింత వీడుము సాధ్యమేయిక నేస్తమై 
త్యాజ్యమేగణ ధైర్యమేమది త్యాగ బుద్దియు యీశ్వ రీ
110

మ. కో. ఉప్పు కప్పుర మొక్క పోలిక  ఉన్న తమ్ముయు వేరులే 
చెప్పు కున్నను పోలికైనను చిన్న తమ్ముయు కాదులే 
పప్ప నందున కూర నందున పాక మవ్వును ఉప్పుయే 
అప్పు ఉప్పను తెస్తె ఆకలి ఆశ పెర్గును యీశ్వరీ.111

మ. కో.చింత కాదును జాడ్య మేనని చేష్టలన్నియు చిత్రమై
వింత కావ్యము చెప్ప దల్చితి విద్య యున్నను నేస్తమై
బొంత లాంటిది మానసమ్ముయు బోధ చేయుట ధర్మమై
ఎంత చెప్పిన కాంత దాసులు ఏలనో మరి యీశ్వరీ.112

మ. కో.గాలి వచ్చియు పక్షి గూడును కానగుండగ చేసెనే
ఆలి వచ్చియు వేరు కాపుర కార్యమేనని చెప్పేనే
జాలి లేకయు పక్షి గోడును రాతి గోడుగ లెక్కయే
ఆలి తెచ్చిన మార్పు నేటికి  ఆశయం కథ యీశ్వరీ.113

మ. కో.చుక్క చుక్కగ జార గల్గును చూపు జల్లుల వర్షమై
చక్కనైన మనసున్న చిన్నది చిక్కి తెల్పెడి వర్షమై
వక్క మాటకు పక్కనుండక వప్ప చెప్పుట వర్షమై
చక్కనైనవి స్వాతి చిన్కులు చల్లబర్చెను యీశ్వరీ.114

ధ్రు. కో. మరువలేరు మదీయ లక్ష్య మనమ్ము నీడలు ఉండుటే
చిరుసహాయపు గుర్తు లన్ని చరిత్ర కాలము తెల్పుటే
అరుణ వెల్గులు నిత్య ముండు అనంత మార్గము చూపుటే
తరుణమంతయు సేవలేసతి దేహమే విధి యీశ్వరీ.115

మకో. వద్దుయిద్దరు భార్యలేమరి వాంఛలున్నను తీర్పుగా  
ముద్దు చేసిన మోక్షమే మరి మోదమే ఇక దీర్చినా   
ఇద్దఱున్నను సఖ్యతైనను స్థిరమౌ సుఖశాంతులే   
పెద్ద చిన్ననకేసమానము పేరు నిల్పును యీశ్వరీ.116

త. చెలిమి గ్రోలుచు ధాత్రినందు చెయూత నిచ్చుట నిత్యమూ
బలము గర్వము తోడు నీడ భయమ్ము వెంటన నిత్యమూ
ఫలము లన్నియు చేయు కర్మ ప్రభావ దీపము నిత్యమూ
యిలను వెన్నెల శోభలన్ని విశాల లక్ష్యము యీశ్వరీ.117

మ. కో.శుక్ర రూపము వీర్యసంపద సూత్ర మవ్వుట పుట్టుకే
పుత్ర పుత్రిక బింబ సృష్టియు పూజ్య తల్లియు తండ్రియే
శత్రు భావము నెంచ గుండక సాక్షి దైవము తోడుయే
చిత్ర భాగవతమ్ము లీలలు చేరువే యగు యీశ్వరీ.118

మ. కో. నీతి పాఠము విద్యపీఠము నేర్ప గల్గిన చోటనే
నీతి చేష్టలు ఆలవాలము నెంచ లేనివి సర్వమూ
నీతి ఆర్ధిక సంపదేయగు నిత్య సత్యము మార్పులే
నీతి లక్ష్యము విశ్వ మాయయు విద్య నందున యీశ్వరీ119

ధ్రు. కో. వికట జీవియు వింత జేయగ వ్రాత నెల్లది ప్రొద్దునే 
సకల నేస్తము తీరు కామిత సాంతమే మది భావుడా
వికలమేయగు గమ్యమైనను  విచ్చనేత్రపు భానుడా 
మకిలి రూపుము మొక్కె దే యను మాన్యపుత్రుడు యీశ్వరీ120

ధ్రు. కో. ఉచిత మన్నది ఎందుకందుకు ఉయలేయగు జీవితం
వచన నేస్తము చేర గల్గిన వాస్తమై మది జీవితం
రచన లన్నియు దేశవృద్ధికి రాష్ట్ర సేవల జీవితం
వచన వ్యర్థము చేయ లేనిది చెప్ప గల్గును యీశ్వరీ.121

ధ్రు. కో.కరుణ భాస్కర ధర్మపాల క శాంతి దూతవు నిత్యమూ
వరుణ దారియు తీర్చి దిద్దు వరాలు యిచ్చెడి దైవమా
విరివి నేత్రము వర్ష ధారివి విద్య లెళ్లను చూపుటే
ధరణి మాతను తృప్తి పర్చె ద ధన్య జీవిగ యీశ్వరీ122

ధ్రు.కో. చిరము ఏదియ జీవితానన చిత్రమైనది లోకమే
తెరుగు లేనిది కాల మాయెను తేట తత్త్వము లోకమే
నిరత మున్ మనసున్నమార్గము నీవు సాగెడి లోకమే
పరమ పావన తత్త్వమేయిది ప్రేమ నింపుము యీశ్వరీ123

ధ్రు.కో. జిదుము టేలను ఆశపాశము చిన్నబుచ్చును లోకమే
కుదుప రాదిక జీవనమ్ముయు గుర్తు మార్చును లోకమే
పొదుపు చేయక అప్పుచేయుట పోరు చేసెడి లోకమే
విధిత మౌ సమయమ్ము మాటలు విజ్ఞతన్ మది యీశ్వరీ124

త. అదుపు తప్పుట నిత్య సత్య సమాధనమ్మగు లోకమే
చెదరగొట్టుట చేష్ట లైన చిదంబరం మది లోకమే
బెదిరి పోవుట ఎవ్వరైనభయమ్ము వల్లన లోకమే
ముదర పెట్టిన ముఖ్యమైన ముగింపు తెల్పుము యీశ్వరీ125

త. తిరుమలేగతి వెంకటేశ తపమ్ము జేసెద నీ దరీ
మరువలేనులె మార్గమిచ్చు మహాను భావుడవే దయా
కరుణయే మది లోన యుంచు కధల్ని చెప్పెద నిత్యమూ
తరుణమే తప బుద్దిగాను తమస్సు మార్చుము యీశ్వరీ126

త. కరములే గతి శృంగమందు గళమ్ము తెల్పు సహాయమై
కరుణ సేవలు మధ్య నుండు గణమ్ము తీరును తెల్పు టే 
చరణమేవిధి మూల మందు చెకోర పక్షుల నీడలై
శరణమే మది గాంచు మా దిశ భక్తిసేవలు యీశ్వరీ.127

త. పరుల యాశ్రయ మేను జీవి పరుగుల పధ్ధతి నిత్యమూ 
పర వధూటిగ  సౌఖ్యమేను పరుల యడే మది భాగ్యమే
వరుసగాగతి చిత్తమేను వలపుల నీడలు లక్ష్యమే 
తరుణమందున  నెవ్విధిమ్ము దరికధ నిక్కము యీశ్వరీ.128

త. చాటుగా సరసాలు గాను చె మంతి పువ్వల కావ్య మే
దీటుగా విరహాలు గాను తపస్సు యిక్కడ ప్రేమగా
యోటమే అనునాధమేది యశస్సు చేరుట లక్ష్య సా
పాటు గా కలిసేటి నీడ ప్రభావ జంటయు ఈశ్వరీ.129

త. మనిషి యోగ్యుడు భక్తి భయ్యమనో మయమ్ము నివాసియే
మనిషి మార్గము ఉన్నతోత్తమ శక్తి పంచు నివాసియే
మనిషి యోగము భోగి మోహ మనస్సు మోక్షము నెంచుటే
మనిషి జన్మయు చేయు దాన మహా సహాయమె యీశ్వరీ.130

మ. కో. పార్వతీపర మేశ్వరా సము పార్జితమ్ముగ నివ్వరా
పూర్వపుణ్యము వచ్చిచేరెగ పూజ్యలక్ష్యము నివ్వరా
సర్వ సృష్టియు ధర్మమార్గము సాధ్యసాధ్యము తెల్పరా
ఆర్య నీతియు శుక్ర గీతియు భార్య ప్రేమయు యీశ్వరీ.131

మ. కో.దీక్షతో మనిషే కధా మది గీత లా అను కంపనం
కక్షతో మది తొల్చియే సమ కాలయున్నత కంపనం
తక్షణం ఇది మార్చుటేయగు తత్వమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము యీశ్వరీ.132

మ. కో.బాల్యమంతయు దోచిదాచుకొ బత్కువేటల వల్లనే  
శల్యమైనను భవ్యమైనను శ్రావ్య మైనను నిత్యమై  
అల్పమైనను పాణమైనను నాశయంమ్మగు వెంటనే  
వల్లమాలిన భక్తికైనను వ్యక్తి కైనను యీశ్వరీ.133

మ. కో.అక్కచెల్లెలు తల్లి తండ్రులు అన్నదమ్ములు దాతలే
మక్కువైన ధనమ్ము పిల్లలు మిధ్యయేయగు జీవితం
మొక్క పెర్గుట దుఃఖ భారము పువ్వుకాయగా రాలుటే
ఒక్క ఆశకు చిక్కి పోవుట ఓటమేయగు యీశ్వరీ.134

మ. కో.సీత రామ నె చేయ నేరము ఏది ఇప్పుడు చెప్పుమా
గీత పల్కు లు చెప్ప గల్గు ట నేర మేమియు చెప్పుమా
రాత నీ దయ చెప్ప టేమిటి రాశి నీ కృప చెప్పుమా
మాత నీ దయ మాకు చూపుము ఎల్ల వేళల యీశ్వరీ.135

మ. కో. రామనామము నిత్య ధామము రమ్య మైనది నీ దయే
సీమ భక్తియు విద్య శక్తియు సేతు బంధన నీ దయే
నామమేగతి నిత్యసత్యము నమ్మ కమ్ము నినాదమై
ధీమ మేలను నిష్ఠగుండుట దీన మార్గము ఈశ్వరీ.136

మ. కో.పచ్చ పచ్చని పువ్వులన్నియు పంచ దల్చితి నిత్యమూ
మచ్చ లేనివి ఏరి తెచ్చితి మంచి పువ్వులు నిత్యమూ
స్వేచ్ఛ గంధము సర్వముందున సీఘ్ర మవ్వుట నిత్యమూ
విచ్చి రాలెను పారిజాత స విద్య లక్ష్యము యీశ్వరీ.137

మ.కో.దీన రక్షక సుప్ర భాతము దీక్ష నిచ్చెడి దైవమా
మానసమ్ము నమస్సులే విధి మంత్రమేగతి దైవమా
దాన ధర్మము తెల్ప గల్గెడి ధర్మ మూర్తివి దైవమా
వైన తీయని లీలలన్నియు వైద్య మవ్వుట యీశ్వరీ.138

మ. కో.భాగమే మదినందు నుంచుట బంధమాయయు తప్పదే
రాగమే అనురాగ నేస్తము రమ్యతే గతి నిత్యమే 
యోగమే విధి ధర్మ నిర్ణయ యోగ్యతే యగు సత్యమే 
రోగమే ఇతి హాస మవ్వదు పోల్చకాలము యీశ్వరీ.139

ధ్రు. కో.ప్రకృతి దృక్పద ఇష్ట ముబ్బడి ప్రాభ వమ్మగు దృష్టిగా
ప్రకృతి వల్లన అంకురాలుగ పక్వ మవ్వుట దృష్టిగా
ప్రకృతి ఎత్తు సమస్య దీర్చ విపత్తు నుంచియు దృష్టిగా
ప్రకృతి లక్ష్యము ప్రాణ రక్షయు ప్రీతి చెందుట యీశ్వరీ140

నా అభిమాన నటుని మరలా గుర్తు చేస్తున్నా 

మ. కో. నందమూరి మనస్సు రాజస నమ్మకమ్మగు హృద్యమై
వంద నమ్ములు చెప్పగల్గు సవాదమేయగు ధర్మమై
విందు చిత్ర సమర్ధ భావము విద్య రావణ లక్ష్యమై
అంద నంత మహాను భావుడు ఆత్ర చిత్రము యీశ్వరీ141

మ. కో. దీన రక్షక సుప్ర భాతము దీక్ష నిచ్చెడి దైవమా
మానసమ్ము నమస్సులే విధి మంత్రమేగతి దైవమా
దాన ధర్మము తెల్ప గల్గెడి ధర్మ మూర్తివి దైవమా
వైన తీయని లీలలన్నియు వైద్య మవ్వుట యీశ్వరీ.142

మ. కో. రామనామము నిత్య ధామము రమ్య మైనది నీ దయే
సీమ భక్తియు విద్య శక్తియు సేతు బంధన నీ దయే
నామమేగతి నిత్యసత్యము నమ్మ కమ్ము నినాదమై
ధీమ మేలను నిష్ఠగుండుట దీన మార్గము ఈశ్వరీ.143

ధ్రు. కో.విలువ పోయెడి మాట లేలను విలవలా యగు జీవితం 
నెలవు నందున పోక యున్నను  నేరమే యగు జీవితం
నిలకడే గతి అర్ధ మందున నిర్ణయమ్మగు జీవితం 
సులువుకాదిది దుఃఖ సౌఖ్యము సూర్య నీడలు యీశ్వరీ 144

ధ్రు. కో.నిజమనేదియు తత్త్వమాయయు నేర్ప నానుడి జీవితం 
సుజనులే పరమాత్మ చెంతన సూత్ర మావ్వుట జీవితం 
కుజనులే గతి దేహమే స్థితి కూడు గుడ్డకు జీవితం 
గజిబిజీ యగు కాల మందున కట్టివేసెది యీశ్వరీ.145

మ. కో.అంతమే స్థితి కొమ్మ యూగక ఆకురాలక దారిగా
పంత మాయెను ఉక్కపోతయు పాడు కాలము మౌనమే 
వింత గాలులు కంఠనీరును విశ్వ వేడియు నేస్తమై 
శాంతి యన్నది లేక యుండెను సంఘ మందున యీశ్వరీ146

ధ్రు. కో తలుపు తెర్చియు కాచి చూచియు   తట్టు చాటుగ ఏలనో
వలపు పంచియు మత్తు మార్పుకు వారధీ యగు టేలనో
మలుపు మేలు సహాయ సౌఖ్యము మందిరానన ఏలనో
చిలిపి చేష్టలు నిక్కమవ్వుట చింత తెచ్చును యీశ్వరీ.147

***




*శ్రీ శివ మంగళాష్టకం*
ఓంశ్రీమాత్రే నమః


*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*

*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||*


*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*

*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||*


*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*

*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||*


*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*

*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||*


*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*

*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ||*


*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*

*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||*


*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*

*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ||*


*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*

*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||*


*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*

*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*

🕉🌞🌏🌙🌟🚩



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి