22, మే 2023, సోమవారం

జనార్ధనా

రచయిత ముందు మాట :::ఓం శ్రీరామ ... శ్రీ మాత్రేనమః  .. 

*జనార్దనా శతకం*

 నా ఆలోచనలు రోజూ ఒక విధంగా వుండవు, ఎదో వ్రాయాలని ఉద్దేశ్యము అందుకే యీ జనార్ధన శతకాన్ని వ్రాసాను, కేవలం 10 రోజుల్లో 100 పద్యాలు వ్రాయగలిగాను అంతా సీతా రామాంజనేయ సహకారం. మరియు అంజయ్యగౌడ్, రామిరెడ్డిగారు, ప్రభాశాస్త్రి జోస్యులు గారు సహకరించించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పవిత్రతా రాజ్యంలో కపటత్వాన్ని కలిగి ఉండలేం. దైవసాన్నిధ్యాన్ని మనలో అనుభూతి చెందడానికి సాధన చేయాలంటే కపటాన్ని మరియు సంక్లిష్టతలను వదిలించుకోవాలి. అప్పుడే ఎదో చదుకోవాలి, పవిత్రంగా, నిజాయితీగా, పట్టుదలతో ఉండాలి. అందుకే ఏకనిష్ఠతో ముందుకు సాగాలని పదే పదే వక్కా నించి, మన ఆలోచనలు స్వచ్ఛంగా, సరళంగా ఉండాలని భావించి, మన హృదయం నిష్కాపట్యాన్ని పొందే వరకు భగవత్ సాన్నిధ్యాన్ని కనుగొనడం ఒక మార్గం, హృదయాన్ని శుద్ధంగా, సరళంగా చేసుకోవాలంటే, మనం ప్రపంచంలో ఉన్న నామ రూపాలను పట్టించుకోకూడదు. అప్పుడు మన అనుభూతులు స్పష్టమై భగవంతుని సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తాం. ప్రతి పద్యంలో నా ఆలోచనలు మీరు చదవగలరు, మీరు చదవండి. నాకు సహకరించిన శ్రీమతి శ్రీదేవికి రుణపడియున్నాను, నన్ను ప్రోత్సహించుచున్న నా కుమార్తెలు 1. సమీరా, అల్లుడు: ఆతుకూరి ప్రదీప్, 2 .జాహ్నవి, అల్లడు: చుండి కిరణ్ కుమార్ కుమార్, 3 . ప్రత్యూష, అల్లుడు: గోటేటి శ్రీకాంత్ మరియు ప్రాంజలి ప్రభ స్నేహితులు సహకారము.
మీ మల్లాప్రగడ రామకృష్ణ, విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్, మరియు రచయిత, హైద్రాబాదు *** 
***
*రామకృష్ణగారి పద్యాలపై నా స్పందన జల్లులు * ఓం జనార్దనయే నమః మల్లాప్రగడ రామకృష్ణగారు తెలుగు పద్య సాహిత్యంలో శ్రేష్ఠులు.వారి పద్య రచనలు గురించి స్పందించే గుణం నా చిన్న గుండకు ఉంది. నేనేమి వారికన్నా సాహిత్య రచనలో పెద్దదాన్ని కాదు.అయితే నా అభిమానిగా నేను ఏ రచన చేసిన ప్రశంసలు కురిపించే ఉత్తమోత్తులు రామకృష్ణ గారు. వారి పద్య రచన చాలా సరళంగా ఉంటుంది.సామాన్యులు కూడా సులభంగా చదివి భావాలు అర్ధం చేసుకోవచ్చు. గంటలో ఓ పది పద్యాలు ఆశువుగా రాయగల దిట్ఠ. అంతే కాదు,వారికి అబ్బిన శ్రీవాణి కృపాకటాక్షములతో పద్య రచనలలో గొప్పవారు. ఎన్నో సార్లు,ఎటువంటి గర్వం లేకుండా, నాకుకూడా పద్య రచనలో ఎంతో సహాయం చేసారు.ధన్యవాదాలు సర్. శ్రీరామకృష్ణగారు రాసిన ఈ జనార్ధన శతకంలో మొత్తం 54 పద్యాలు ఉన్నాయి. ఒక్కక్క పద్యం ఒక భావనతో ఉన్నాయి.చాలా భక్తి పూర్వకంగా రసవత్తరంగా ఉండి చదువుతుంటే పాఠకులకు ఎంతో ఆనందం కలుగుతుంది.అందరూ తప్పకుండా చదవండి. పద్య రచన చాలా క్లిష్టమైనది.పాత పద్దతిలో నియమాలు,పాద నిర్మాణంలో ఛందోబద్ధమైన నియమం పాటించాలి.దీన్ని పాదం యొక్క అంతర్నిర్మాణం అని పెద్దలు చెబుతారు.గతి,పరిమితి,గురు-లఘువుల పద్దతి,గణపద్దతి చందశ్శాస్త్ర ప్రకారం పద్యాలు రచించాలి, అలాంటి రచన అల్లిక జిగిబిగి రామకృష్ణగారి పద్యాలలో ఒక సంప్రదాయ పద్దతిలో ఉన్నాయి. మొదటి పద్యంలో ' ఓర చూపుల మాయగాడు జనార్దనా ' అంటూనే భారతీయుల గీత బోధనతో పోల్చేరు. ఆ జనార్ధన అందం జిలుగు వెలుగుల పావడా,చంద్రకాంతుల దేహం,గరుడ వాహనుడంటూ సొగసుగా వర్ణించారు.అలాగే,రామకృష్ణగారు కట్టిన 15 పద్యం ' మనసు పువ్వుల పరిమళంతో చల్లగా ఉంటుందని,మనసు రెక్కలు అంబరాన మధురంగా మాయ మయ్యాయి ' అన్న పోలిక బాగుంది.ఆధునిక పద్య రచన మిళితం చేసి 32 పద్యంలో ' అక్క గొన్నది గోళి షోడాను త్రాగి పాటను పాడుటే...బ్రక్క యింటిన వారు కూడను బంధ పాటను పాడుటే ' అని రాసినది నాకు నచ్చింది. 41 పద్యంలో ' నన్ను వీడని సత్యసంధత నాదు యుక్తికి మార్గమై ' అనేది కూడా ముక్తి మార్గమైందని చెప్పిన పోలిక బాగుంది.' నిండుకుండగ కృష్ణ మేఘము నేలపై కరుణించున్ ' అనే పద్యం,ఇలా ఒక్కక్క పద్యం ఒక్కక్క అలౌకిక అర్ధ-భావ వశంగా బాగా రాసారు.కొంచం పద్యాలు చదువుతుంటే శుద్ధపద్యం కాకుండా వచన పద్య రూపంలో ఉండి భావం సులభంగా అర్ధమవుతుంది అని చెప్పవచ్చు. వారి పద్య రచనపై నాకు ఏదో నాల్గు అక్షరాలు గీకే అవకాశం ఇచ్చిన మల్లాది రామకృష్ణగారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
7349392037

*జనార్దనా శతకం*
మ.కో. ఓర చూపుల మాయగాడులె ఓర్పు చూపు మహాత్మయే ద్వారకాది పతీ మనస్సు పంచు దానశీల మహాత్మయే వైర వీరుల మట్టు పెట్టిన వైన తీయ మహాత్మయే భార తీయుల గీత బోధతొ భాగ్య ధీర జనార్ధనా .. ... 1 .. సిరులు మించిన పసిడి బంగరు జిలుగు పావడ జారగా చరణ పద్మము మీదదేహము చంద్రకాంతులు చేరగా మురువు చూపగ వచ్చినావులె మోహనాకృతి మీరగా గరుడ వాహన దనుజ మర్ధన కార్య సూర జనార్ధనా ... .. 2 ....... మ.కో. ఆట పిల్చితి కాన రావులె ఆశ తీర్చవు నిన్ననూ మాట పిలవగ వినకపోతివి మాయ చేసితి నిన్ననూ చాటు చూపుల తాప మంతయు చూపి పోతివి నిన్ననూ నీటు చేసితి మనసు మర్ధన నేడు తీర్చు జనార్ధనా ... . ..3 ....... మ.కో. నిన్న రాతిరి కలను జేరియు నీదు నే కనుగొంటిరా ఉన్న మార్గము ఎంచు కొంటివి ఊయలూపియు పోతివీ విన్న మాత్రము దాహ తృప్తియు వేగు చుక్కను నేనురా కన్ను లారగ చూడ గల్గెడి కామ్య దృష్టి జనార్ధనా ... .. 4 ....... మ.కో. బిత్త రంబున దొంగ చూపుల పెదవి నవ్వుల ఆటరా చిత్త మంతయు కొల్ల గొట్టితి చెక్కిలివ్వతె నొక్కెరా గుత్త మైన గుటారి గుబ్బల గుమ్మమోహము పెంచెరా కొత్త కోర్కెలు కోరు చిన్నది కోక చూపె జనార్ధనా . .. . 5 ...... మ.కో. దబ్బు లన్నియు తెల్సు కొంటిని తప్పు బాసలు యేలనూ ఉబ్బి తబ్బియు చేయు తేలను ఊయ లూపుట యేలనూ మబ్బు మాదిరి రంగు మార్చుట మాటి మాటికి యేలనూ దబ్బ పండిది తీపి పుల్లన దారి చూపు జనార్ధనా .... . ... 6 ....... అలక ఏలను పాలు తాగుము ఆద మర్చియు యుంటినీ చిలక రింపుల దేహ మిప్పుడు చిత్త చేష్టలు చేసుకో వలచి గూరిమి ఆశ తీర్చుము వదల కెప్పుడు నన్నులే కలసి వేడుక చేసు కొందుము కార్య ధీర జనార్ధనా ... . . 7 ....... మ.కో. కట్ట బట్టయు వాడె పూలుయు కట్టు మాయయు దేనికో డెట్టి సమర్ధుడ వయ్యనీవును యెట్టి మాటలు దేనికో మట్టి మాటయు వట్టి కోతలు మత్తు పెంచుట దేనికో కట్టి వేసియు ముద్దు చేసియు కౌగలించు జనార్ధనా ... .. 8 .... కరుణ జూపుము కాలు దువ్వకు కాదు మంచిది చూడ నా తరుణ మందున సౌఖ్య మిచ్చెద కాపురంబుగ చూడుమా చరణ తన్ మది శాంతి సౌఖ్యపు సత్ప్రవర్తన తోడనా అరుణ కాంతులు నింపి వేయుము అలక ఏల జనార్ధనా . 9 .... పగలు రాత్రులు కలలు గంటిని పాదపూజకు నిత్యమూ సెగల దేహము ఆపలేకయు చేరు మార్గము తెల్పుమా వగల మారిని ఎన్ని యన్నను వదల నేనును నిత్యమూ సెగల దేహము నీదు దాహము సామరశ్య జనార్ధనా .. 10 ...... మ.కో. మాటరానిది మహిమ జూపియు మాయ ఏలను నీవుగా కాట లాగున కదులు చుంటివి కాల మందున నీవుగా వాట మైనవి గుండె లోనిన వలపు చూపులు నీవుగా బాట చూపియు ఆట నీదియు భక్తి పంచు జనార్ధనా .. ... ... 11 ...... మ.కో. అక్షరే మది సేవభావము ఆశయమ్మగు సత్యమై సాక్షిగా విధి ప్రేమలక్ష్యము సాధనే యని నిత్యమై వీక్షణమ్మిది స్వాభి మానము వెయ్యి కాంతులు మూలమై శిక్ష వేయుము బుద్ధి మారదు శీఘ్ర సృష్టి జనార్ధనా .. .. .... 12 .... మ.కో. చంచలత్వపు రూపమాయెను స్థాననీడల మార్పులో అంచలంచలు అందమంతయు నంత మారును పొందులో సంచితమ్మున పాపమైనను శా పమైనను బందియై వంచనేలను ప్రేమ పొందుట పర్వమేగ జనార్ధనా .. .. ... 13 .....
ధ్రు.. కో:: మనసు రూపము లోకమంతయి మందహాసము ఏలనో
మనసు పంజరమందు చిక్కియు పక్షిలా గిల ఏలనో మనసు చీకటి దాటి వచ్చియు మార్గ కాంతిగ ఏలనో మనసు బంధము తెంచు కోనిది మార్గ మవ్వు జనార్ధనా .... 14 ......
ధ్రు.. కో:: మనసు పువ్వుయు పరిమళాలను మలచి చల్లగనుంచునే
మనసు మాటలు కట్టతెంచిన మార్గ నీరగు నెందుకో మనసు మొక్కను నాట గల్గిన మహిమ వృక్షము ఎందుకో మనసు రెక్కలు అంబరానన మధుర మాయె జనార్ధనా ..... 15 ..... మ.కో. నిన్ను చూడగ పద్య ప్రౌఢిమ నాటి నుండియు స్ఫూర్తియే మిన్ను శబ్దము మించి పోయిన మేల్మి ధారన స్ఫూర్తియే మిన్న మన్నున ప్రేమ పుట్టెను మెచ్చి ఏలుట స్ఫూర్తియే సన్నుతించుము రాధ ప్రేమను సౌమ్య భావ జనార్ధనా ..... 16 ..... మ.కో. ఉష్ణ శీతల లెట్లు సాగిన నుర్వి భాగము ప్రేమయే జిష్ణు మాత్రము భావనమ్ముయు జీవ శాస్త్రము ప్రేమయే తృష్ణ భక్తియు సేవ భావము తృప్తి నిచ్చుట ప్రేమయే ఉష్ణ శక్తియు చల్లగానును విశ్వశాంతి జనార్ధనా ... .. .. 17 ...... మ.కో. పచ్చ పచ్చని చేలు కాలవ పారు నీరున పువ్వులున్, పచ్చ చేలును గోవు మాతలు పాల బర్రెలు నీడగన్ నచ్చు చిందులు లేగదూడలు నాట్యకత్తెలు ఆటలున్ మచ్చి కాగల మూగజీవులు మనసు చేర్చు జనార్దనా .. ... .. 18 .....
మ.కో. నీవు లేకయు దారి లేకయు నేను లేకను నీవులే
నీవు నేనును నమ్మి ఉంటిమి నీడలాగును నేనులే
నీవు నన్నును నేను నిన్నును నిత్య మాటల మేనులే
నీవు నాకును తోడు నీడవు నీదు భక్తి జనార్ధనా.... ... ... .. 19
......
మ.కో. వెన్నపూసను తెచ్చియుంచితి వేడుకే మదినీ కులే
ఎన్ని యున్నను వెన్నకన్నను ఇష్టమేదియు లేదులే
చన్నులైనను జున్నునైనను చక్క పెట్టెద నీకులే
మన్ను నేనును మిన్ను నీవువు మానసమ్ము జనార్ధనా. ... ... 20
.......
ధ్రు.. కో:: ఎదురు చూపులు పగలు రాత్రులు ఎన్ని రోజులు నీదుకై
బెదురు మోముయు సలప రింతయు బేర మేలను నీదుకై
చెదర లేదును అధర మిచ్చెద చింత లేదును నీదుకై
ముదురు నైనను మధుర మిత్తును నిత్య సత్య జనార్ధనా. ... . 21
....
ధ్రు.. కో:: దిగులు లేదును దాచ లేనును దీన బంధువు నీవులే
పగలు రాత్రులు వేచి వుందును పాలు ఇచ్చెద నీకులే
సెగల నన్నియు చల్ల బర్చుయు చెలిమి బంధము నీవులే
మగువ నైనను ప్రేమ నీదయ మానసమ్ము జనార్ధనా. ... .. .. 22
......
ధ్రు.. కో:: కొదువలేదిక సేవ లక్ష్యము కోర్కెలే యని రెందరో
విధి విధానము ప్రేమయే నని విజ్ఞులందురు తెల్పిరే
సదమలంబగు సేవజేయుచు సాగుచుండిరి నిత్యమై
విదితమైనది ప్రేమ తత్త్వము వీడలేను జనార్ధనా. ... ... ... 23
.....
మ.కో. ప్రేమ సాక్షిగ శరము వేసెద ప్రీతి నిచ్చుట లక్ష్యమై
క్షేమ మెంచియు పూర్తి బాధ్యత కీలకమ్మగు ధ్యేయమై
సామ దానము తప్పదే మది సాధనమ్మగు ధర్మమై
ప్రేమ పంచెద తృప్తి పర్చెద ప్రేరణమ్ము జనార్ధనా. ... .... .... .24
.......
మ.కో. సంధి పత్రము చేయు చుంటిని శాంతి భద్రము దైవమా
వంది మాదిత వింతచేష్టలు వాక్కులన్నియు దైవమా
వందనమ్మును తెల్ప గల్గితి వరుసగానును దైవమా
పొందు కోరియు మాటలన్నియు పోరు కాదు జనార్ధనా. ... .... . 25
......
మ.కో. శ్రీ గుణా జన దేవ దేవర శేఖరా మది సుందరా
శ్రీ దయా విధి భక్త బాంధవ శ్రీ సహాయపు సుందరా
శ్రీ క్రియా శృత శిష్ట రక్షక శ్రీ విశారద సుందరా
శ్రీ సుధా స్థితి నామనో గతి శ్రీ దయార్ది జనార్ధనా... ... .... ... ..26
.....
ధ్రు.. కో:: పురము నందున స్ఫూర్తి దాతయు పూజ్యమే యగు వీధి దు
న్యరత వేదము నిత్యసత్యము న్యాయ మేనని దక్షతా
వరద నాయక సర్వ మంగళ విశ్వ నాయక ధీరుడా
తిరుమలేశ సుధా యశోదకు పుత్రుడైతి జనార్ధనా... ... .... .... ... 27
.....
ధ్రు.. కో:: మధువు తీపిని పొందగల్గుట మానసమ్ముగ తృప్తియే
చదువు వున్నచొ జ్ఞానవృద్ధియు చెలిమి గుండుట తృప్తియే
పొదుపు వాక్కులు జీవనంబుయు పోరు జర్గుట తృప్తియే
అదుపు లేనిది ప్రేమ ఒక్కటి ఆశయేను జనార్ధనా ... .. ... .... ... . 28
......
మ.కో. కంటి చూపులు ఒదిగి పొమ్మని కదల నిచ్చెను తృప్తిగా
చంటి బిడ్డల చెలిమి చేయును చలువ నీరుల తృప్తిగా
అంటి అంటని తామరాకున నీటి బొట్టుగ తృప్తిగా
వంటి బాధలు సహజమేయగు వేల్పులేను జనార్ధనా.. ... .... .... .29
.....
మ.కో. భామ నీతులు వేడుకవ్వుట భాగ్యమేలను ఇప్పుడే
శోమ కాంతులు లన్ని తెచ్చుట శోకమేలను ఇప్పుడే
కామ క్రోధము నష్టమేయని కష్టమే యగు ఇప్పుడే
గమ్య తీర్ధము దేహ తాపము గమ్యమౌను జనార్దనా ... ... .... ..... .. 30
***
మ.కో. చక్క నేనది ప్రాస వున్నది చెలిమి తెల్పియు పాడుటే
మక్క వైనది నమ్మ కమ్మున మధుర పాటయు పాడుటే
చుక్క త్రాగియు చిక్కు లున్నను చురక పాటయు పాడుటే
ఒక్క రాధయు చెప్పి పాటను ఓర్పుగాను జనార్దనా ... ... ..... .... 31
......
మ.కో. అక్క గొన్నది గోళి షోడను త్రాగి పాటను పాడుటే
నుక్క పోతగ యున్న నూలును చుట్టి పాటను పాడుటే
బ్రక్క యింటిన వారు కూడను బంధ పాటను పాడుటే
జుక్క లై మది రాధ పాటను జుట్టుజేరె జనార్దనా .. ... .... .... ....32
......
మ.కో. దిక్క లన్నియు ప్రజ్వలించియు దిట్ట పాటను పాడుటే
నొక్కు లున్నయు వీణ పట్టియు నొక్కి పాటను పాడుటే
కక్కు లొచ్చిన ఏడ్పు తెచ్చెన గొప్ప పాటను పాడుటే
ఒక్క మాటగ గొంతు విప్పియు ఒప్పుతేను జనార్దనా .. ... ..... .... ...33
......
మ.కో. బిక్క మోఖము మెట్టి ఏడ్పుయు చిక్క కున్నది పాడుటే
చెక్క కోసిన శబ్ధ మళ్లెను చెలిమి పాటను పాడుటే
మోక్క ఏ వలె పెరుగు నట్లుగ మోక్ష పాటను పాడుటే
రెక్కలుండిన పక్షి ఓలెను ఎగురు పాటను పాడుటే .. ... .... ...... 34
........
మ.కో. లక్క బొమ్మగ లాగ ఊగిన లయల పాటను పాడుటే
ఎక్క లేనివి మెట్లు వున్నను ఎగురు పాటను పాడుటే
తొక్క లేనిది సైకి లెక్కిన తోడు పాటను పాడుటే
ఒక్క వేల్పుగ నీతి గద్యగు పాటగాను జనార్దనా .. ... ... .... .... . 35
.....
మ.కో. అమ్మ పల్కును ఆదరమ్ము గ ఆలకించియు యీ సహా
యమ్ము తెల్పియు సర్వ కాలము నందునా సహనమ్ము గా
బొమ్మ యైనను కొమ్మయైనను భక్తి నిమ్మియు నిత్యమూ
ప్రేమ పంచియు కృష్ణ తీర్పును సావధాన జనార్దనా .. ... ..... .... ..36
.......
మ.కో. వాక్కు లే గతి హృధ్యమందున వ్యాధి మార్చగ సవ్యమై మొక్క లే స్థితి చల్ల గుంచును మోక్ష వాయువు మార్గమై చక్క నైనవి చిక్క గున్నవి చక్రి నీడలు గమ్యమై ఒక్క మాటను ఒక్క పత్నియు ఒక్క బాణ జనార్ధనా. ... .... ..... .... ..37 ......
ధ్రు.. కో:: సరస వీధికి నెంచ గల్గియు శాంతి సౌఖ్యము నీదుగా
వరుస నెంచిన కౌగిలింతకు వాస ప్రేమయు నీదుగా మరువ లేనిది సర్వ సౌఖ్యము మానసమ్ముయు నీదుగా తరువు లాగనె తార జీవిత తారు మారె జనార్ధనా. ... .... .... .... . 38 ...... మ.కో. అంద చందము కాల మాయయు ఆడ తోడును నిత్యమై నంద నందని సేవ దృష్టియు నేత్ర వైనము సత్యమై మంద మారుత వేగ మంతయి మధ్యమేయగు భవ్యమై సుందరాంగియు వైరి నాట్యము సంతసమ్ము జనార్ధనా. ... ... ... 39 ...... మ.కో. కంట నీరును తిండి లేకయు కాపు మారెను దేనికో వంట బట్టని సంపదంతయి వాద మవ్వుట ఎందుకో పంట యున్నను ఆకలుండుట పాడు నవ్వులు ఎందుకో అంట నీయని ఆత్రమేయిది ఆశ ఏల జనార్ధనా.. ... ..... ......... .... 40 ..... మ.కో. నన్ను వీడని సత్యసంధత నాదు యుక్తికి మార్గమై నన్ను చేరిన స్నేహ బంధము నాదు శక్తికి మార్గమై నన్ను మార్చిన పేగు తృప్తియు నాదు ముక్తికి మార్గమై నన్ను చేరిన ప్రేమ వైనము నాదు భక్తి జనార్ధనా.. ... .... .... ... 41 ...... మ.కో. పాత మాటని అర్ధ భేదము పట్టు బట్టుట దేనికో పాత బంధము కొత్త పొంతలు పాచి బట్టుట దేనికో పాత దారుల వింత పోకడ పాశ మవ్వుట దేనికో పాత కొత్తది ప్రేమ ఒక్కటి కాలమెంచు జనార్ధనా. ... .... ... .... 42 ......
ధ్రు.. కో:: కనిన వారలె తల్లిదండ్రులు గాదు లోకమునందునన్
కనకపోయిన పెంచువారలు కన్నవారి సమానమో మును యశోదయు నందుడున్ వర ముద్దుకృష్ణుని బెంచియున్ ఘనతరంబగు ప్రేమ బంచిరి గాదె ధాత్రి జనార్ధనా. ... ... ... ... ... .43 ...... మ.కో. నిండుకుండగ కృష్ణ మేఘము నేలపై కరుణించుచున్ దండిగా గురియంగ పంటలు ధర్మభూమిని రాశులై వెండికొండను బుట్టు గంగయు వేదనాద విహారియై యండదండల నీయ భారతి ఆశయమ్ము జనార్ధనా. ... .... .... .... ... 44. ....
ధ్రు.. కో:: ఒరిగి పోవును ఆశ లన్నియు ఓర్పు చుట్టును నిత్యమై
కరిగి పోవును నిత్య సత్యము కాల మార్పుల మంచుగా జరిగి పోయెది జీవి తమ్ముయు జాతి కంతకు మేలుగా మరిగి కొందరు చెడ్డ బుద్దియు ముఖ్య మౌను జనార్ధనా. ... .... .... ... 45 ......
ధ్రు.. కో:: తెలియ రానిది రాగ మేదియొ తీగ మల్లెను చుట్టెనో
చెలిమి కోరిన ప్రేమ బంధము చెంత చేరుట వైనమో బలిమి అందము పువ్వు పువ్వున బంధ మవ్వుట ఏలనో కలిమి లేములు కావడే యగు కాల మార్పు జనార్ధనా. ... .... .... .... ...46 ...... మ.కో. ప్రేమ పొంగుకు లొంగి పోవుట పొంగ నీయక కాలమై ప్రేమ యింటను రాను రానని ప్రేమ నవ్వుల శీలమై ప్రేమ పంచెడి సిగ్గు పువ్వులు ప్రేయసీ కళ నేస్తమై ప్రేమ చూపుల మేనిగంధము ప్రీతి గాను జనార్ధనా . ... .... .... ..... ....47 .... మ.కో. తప్పు చేయడ మెందు కో మది ఓర్పు నంతయు చూడకూ అప్పు చేసియు గొప్ప చెప్పుట ఆశ అంచును చూడకూ నెప్పులున్నను ఒప్పు మాటలు నెయ్య మైనను వీడకూ తప్పు ఒప్పుల జీవితమ్మిది తృప్తి లేదు జనార్ధనా.... ... ..... ..... ..... .. 48 ....... నేరుగా మది తెల్పు నానుడి నిన్ను మార్చును స్నేహమై పేరుకోసము చేయ కుండుము పేద వారును మిత్రులే చేరు వైనది మంచి నే గమనించి చేయుము చిత్రమే వారు వీరగు వీరు వారగు వాదనేల జనార్ధనా..... ... .... ..... ..... ..... .... 49 .... మ.కో. ఎంత చెప్పిన తక్కువేయగు ఎల్ల వేళల జీవితం కొంత కోరిక కొంత తీరిక కొంత వేదన జీవితం సంత సమ్మున చుట్టు తిర్గుమనో మయమ్ముయె జీవితం వింత కొంత విదీ మదీ మమతాను రాగ జనార్ధనా. ... .... .... .... .... .. 50 ......
ధ్రు.. కో:: సమయ పాలన లేని వైనము సాధనంతయు వ్యర్థమే
సమయ ధర్మము అడ్డు పెర్గెను స ఖ్యతే కరువే మదీ సమయ లక్ష్యము చెప్పలేకయు సాధ్య సాధ్యము ఏదియో సమయ శోభయు వింత వైనము సాధనేది జనార్ధనా. .. ..... ..... ...... .. 51 ......
ధ్రు.. కో:: జనన శక్తియు సర్వ మోక్షము జాడ్జ్య మేలను సంతస
మ్మునన వేదన కానరాదును ముందు కోర్కెయు సాగుటే అనను లేకయు చెప్పలేనిది ఆశ వల్లన సాహసం మ్మునన ప్రేమయు చూపగల్గుట ముఖ్య మౌను జనార్ధనా. ... .... .... .... 52 ..... మ.కో. గుండె చాటున ఆశ లన్నియు గుర్తు చేయక నుండుటే మండె గుండెకు చెప్ప లేము సమాన సేవలు తప్పవే అండె వాకిట హద్దు చేరుట ఆశ యమ్మగు మూలమై నుండె వేడియు ఊపి రాడని నూతనమ్ము జనార్ధనా. ... ..... ..... ..... .... 53 ....
ధ్రు.. కో:: క్రమము నే విధి జన్మమొందిన కార్యధీక్షత గల్గినన్
రమణతన్ మనుజండు రాజిలు లక్ష్యమున్ కళ గల్గినన్ సమయ తృప్తియు తోడు నీడగ సామరస్యము గల్గినన్ కమల నాబుని నిత్య ప్రార్ధన కార్య శక్తి జనార్ధనా. ... .... ..... ..... ..... .... .. 54 .....
మ.కో. ముద్దుగా పిలిచింది తీర్చగ ముచ్చటే నని ముందుగా సద్దు చేయక తేన తీపియు చక్క బెట్టుము వేడ్కగా వద్దు వద్దని చేతు లాపియు వాలుc చూపులు చూచెగా హద్దు హద్దను రాధ వాక్కులు హాయి గొల్పు జనార్ధనా.. ... .... .... ... ..... ..55 ....... మ.కో. అంత రంగము పూలపాన్పయి యాశపెంచెను ముందుగా పంత మైనను వీడి చల్లని పాలుత్రాగుము వేడ్కగా వింత కాదిది యింతి కోరిక వేడుకే యగు ముందుగా సొంతమైనది రాధ వాక్కులు చూడవోయి జనార్ధనా. ... ..... ..... ..... .....56 ......
ధ్రు.. కో:: పరిమళాలను జల్లి సౌఖ్యము పంచవోయి పసందుగా
సరి సరీ యని నీదు భక్తిని సల్పుచుండెద ముందుగా గురియిదే మన మధ్య నిత్యము గుప్తమేనులె ముందుగా గరిమ శక్తియు రాధకేలను గమ్య మాయె జనార్ధనా.. ... .... .... .... .... ...... 57 ......
ధ్రు.. కో:: తలపు రాతలు మంచి చెడ్డలు తారుమారగు ముందుగా
వలపు రాగము రాగ యుక్తము వాలుచూపులు పొందుదుగా మలుపు తెచ్చుట ప్రేమ జంటకు మాయ రోగము ముందుగా తలుపు తీసియు కొల్చుటేమది తన్విదీర జనార్ధనా. ... .... .... .... .... .. 58 .....
ధ్రు.. కో:: వినయ వాంఛలు పెచ్చు పెర్గును విశ్వ మందున ముందుగా
కనుల చూపుల హావ భావము కావ్య కాంక్షకు ముందుగా చనువు చూపియు మంచి చేసియు చక్కచేయుట ముందుగా తనువు తాపము తెల్పుచుం టిని తాళలేను జనార్ధనా. ... .... .... ..... .... .... ..59 ... మ.కో. గుండెలో విధి నాటగా సుడి గుండ మున్నను ముందుగా నండగా మది నుండగల్గుటె యాశయమ్మగు ముందుగా నెండ నున్నను నీడ నిచ్చుట నెల్లసౌఖ్యత ముందుగా దండనైనను దండి మొక్కను దండమేను జనార్ధనా.. ... .... .... .... .... .... 60 ......
ధ్రు.. కో:: పుటల కెక్కియు నీదు మాయలుపూజ్య మౌనిక ముందుగా
కటకటా యని చెప్పు చుంటిని కాల తీర్పుగ ముందుగా నటుల సూచన లన్ని యున్నవి యాశ వెల్లువ ముందుగా చిటిక జీవిత మౌనుగా యిది చింత యేను జనార్ధనా. ..... .... .... .... .... ... 61. ..... మ.కో. ధ్యాన మన్నది యంతరాత్మగ దాగి యున్నది సత్యమై జ్ఞాన దానము సర్వ క్షేమము జ్ఞాని వృద్ధికి ధర్మమై జ్ఞాన సంపద లెక్కడైనను నాకతృప్తియె న్యాయమై జ్ఞాన వాణియు హృద్య మందున జ్ఞప్తి నిచ్చు జనార్ధనా. ... .... .... .... .... ... . 62 ......
ధ్రు.. కో:: కదలి వచ్చెను గంగగా కలకాలముండుట కార్యమై
హృదయ తాపము చల్లగాబడ సృష్టి నందున ధర్మమై
విధిగ పచ్చద నాన్ని నింపుచు వేడుకే జల సత్యమై నదిగ సాగియు దాహముడ్గగ నమ్మకమ్ము జనార్ధనా. ... .... .... .... ..... ........63 ....... మ.కో. కంచు గంటగ శబ్దమే విధి కానుకే యగు దేనికో మంచి మాటలు గుర్తు రాకయు మాయ జేరుట దేనికో నెంచ లేనిది బుద్ధి మార్పుల వెన్ని యున్నను దేనికో పంచనే పడియుండి వేచెడి భాగ్య మేను జనార్ధనా. ... ..... ..... ..... ..... ......64 ..... ధ్రు.. కో::కరుణ చూపెడి జన్మ మందిన కాల మేయిది వీడకున్
మరణ మార్గము జేర్చ గల్గుట మానవత్వము వీడియున్ తరుణమే యిది యేమిచిత్రమొ దానవాకృతి యెందుకో పరమ లక్ష్యము నందులేదిక భవ్యవీర జనార్ధనా ... ... ... ... ... 65 ...... మ.కో. ఒక్కభార్యయు పృథ్వి యైనది ఒక్క భార్యయు చంచలం బొక్క పుత్రుడు మన్మధాకర మొక్క నస్సర రూపుడే యొక్క సర్పము పాన్పు పొందియు నొక్క వాహనమే యగున్ ఒక్క రూపము కానె కాదులె యొక్క మూర్తి జనార్ధనా ... ... ... ... ... 66 ...... మ.కో. రాధ వల్లభ ధర్మ బద్ధుడె రమ్య మౌనముగా నులే గాధ మాధురి మోహ మాయయు గాన కాంతల లీలలే సౌధ మందున నిల్చి గాంచను సన్నిధానము వేళలే బాధతప్తను నాదరించుమి బంధువౌచు జనార్ధనా .. . ... ... ... ... 67 ..... మ.కో. నీదు పద్యము లాల కించుచు నిత్య సత్యము తెల్పెదన్ నీదు లక్ష్యము సేవ మార్గము నిత్య స్పూరిగ చూపులున్ నీదు మ్రొక్కెద సేవ చిత్తము నిత్య సత్యము వేడుకల్ నీదు బుద్దులు మాకు నిమ్ము కనీసమేను జనార్ధనా ... ... .... ..... .... 68 .... మ.కో. సామ సామియు కృష్ణ మూర్తిగ సన్నుతింపును నిత్యమై నీమమే వదలా కళే నిజ నీదు భక్తిని కోరుటే రోమ రోమము దైవ ప్రార్ధన రోజు చేయుట సత్యమై సామరస్యము కోరుచుంటిని సంఘముందు జనార్ధనా ... ... ... ... 69 * మ.కో. రెప్ప మాటున చేయు చేష్టలురేయి నందున మోదమున్ చెప్ప లేనిది యేక మవ్వుట చెప్ప కూడని విద్యయే తప్పు కాదది జీవ సృష్టికి తంతు యౌ నది ప్రేమగా నొప్పుకొన్న మనో మయమ్మది యోర్పు చూపె జనార్ధనా. ... ..... ... ...... ... ..70 
....
ధ్రు.. కో:: బురద లేనిది లేనె లేదులె బుద్ది తక్కువ యెక్కువై
న రతి వర్ణన లేని కావ్యము నాడి లేనిది యౌనులే చరిత దుర్జన లేనిదే సభ చంచలా యగు నమ్రతై భరణ శక్తివి ధీ మనస్సది భాగ్యమేన జనార్ధనా........... .. .... .... ..... .... ..... 71 ....
ధ్రు.. కో:: కలము నున్నను వ్రాత తగ్గెను కాల నిర్ణయ మైనదే
కలము లేకను యంత్ర మోహము కానుకయ్యెను నెందుకో కలము వద్దని వీధి చట్టము కాల మాయగ నుండెనే కలము తోరచనా మనోభవ కామ్య గాంచు జనార్ధనా....... .... ..... ... .... ......... 72 ...... మ.కో. క్రూర మూర్ఖులు నీతి దారులు కూల్చ నెంచిరి రెందరో పారె పాపము శక్తిగర్విత బాధ పెట్టుట రెందరో ఘోర హంతక దుష్ట బుద్దియు గూ ర్చె హానిగ నెందరో కారణమ్ముయు తెల్ప గల్గెడి కాన రాదు జనార్ధనా..... ... 73 .....
ధ్రు.. కో:: కలుపు తీసియు నీరు పెట్టియు కాల చక్రము లాగనే
హలము బట్టియు దున్ని నేలల హంబు మొక్కెను కర్షకై పొలము రక్షగ నిద్ర లేకయు పోరు మాదిరి కాపలా తలపు లన్నియు నేలతల్లిని తట్టి తెల్పె జనార్ధనా.......... 74 ...... మ.కో. హద్దు వున్నది జీవితమ్మున హాయి పొందడ మెక్కడా వద్దు వద్దని చేర నిచ్చిన వన్నె తగ్గును తక్కెడా ముద్దు చేసియు బంధ మాయెను ముప్పు తెచ్చెను ముందరా రద్దు చేయక సర్దు కొమ్మని లక్ష్య మేది జనార్ధనా........ 75 ...... మ.కో. కాలి లోనిది ముళ్ళు తీసెది కాంత యే యగు నీదుగా జాలి చూపియు కంటి రెప్పగ సాకుచుండును నిక్కమో తాళి కట్టిన భర్తవౌటను దానినున్ విడనాడదో కాళి రూపమునెత్తునిక్కము కష్టబెట్ట జనార్ధనా...... 76 ...... మ.కో. తెల్లనైనవి శంఖు పూవులు తీరుగా నరవిందమై మల్లెపూవుల రీతి జేర్చగ మంచిగా సిరి చక్రమై యల్లనీలపుశంఖు పూవులె యందమై తిలకమ్ముగా పల్లవించెను మానసమ్మది పద్మమై విలసిల్లగా 77 వల్లమాలిన కాంక్ష కల్గెను వైభవమ్ము జనార్ధనా.... .......77 ...... మ.కో. చల్లనైనవి మంచు పూవులు చక్కనై కరగించగా నెల్లవేళలు రీతి కూర్చగ నెంచి యున్నది చిత్రమై పల్లవించె సమాన కాలమె పద్మమై విల సిల్లగా వల్ల మాలిన కల్ల మాటలు వైభవమ్ము జనార్ధనా.......... 78 ...... మ.కో. ఆజ్ఞ యిచ్చిరి చెప్ప నెంచిస దాశయమ్మున యిప్పుడే యాజ్ఞ యే మన నేత్ర చూపుల కత్రమే యగు యప్పుడే యాజ్ఞ మానస మందునే భయ మాశ వెల్లువ జెందుటే యాజ్ఞ పాఠము మార్పుకోరగ నాత్రమౌను జనార్ధనా 79 ......
ధ్రు.. కో:: కలసి పోవు గుణంబు వైనము కాంచనంబది విద్యగా
కలసి చర్చలు సర్వమంగళ కామితార్ధము నేస్తమై కలయు కాలము ప్రేమయందున గల్గు బల్గము సర్వమై కలలు తీర్చెది ప్రేమ యందును కల్వబుద్ధి జనార్ధనా... 80 ......
ధ్రు.. కో::క్షణము నొక్కటి శంగరమ్మది క్షామమే యగు ఎందుకో
క్షణము తృప్తికి బానిసవ్వుట క్షేమ మే యగు ఎందుకో
క్షణము భద్దక లక్ష్య మే మది క్షా మమే యగు ఎందుకో క్షణము నుత్సవ భావ సంపద యున్నతమ్ము జనార్ధనా 81 ......
ధ్రు.. కో:: తమమనోభవ సంపదే సహనా గతమ్మగు చుండుటన్
హిమవిశాల సుఖమ్ము శీతల హేమ సుందర మవ్వుటన్ క్షమకు మేలు తలంపులేయగు గాద నెవ్వడు ముందుగన్ విమల తత్త్వము విశ్వముందున విన్నపమ్ము జనార్ధనా 82 ...... మ.కో. వచ్చెనేసుఖ విద్య పొందిన వాద లక్షణ మేనులే
వచ్చునేకల తొల్త యేడ్చిన నవ్వినా కథ మారులే వచ్చె పాలన భారతమ్మున వల్ల మాలిన రీతినా వచ్చె పౌరులె తెల్ప గల్గుట వంత పల్కు జనార్ధనా 83 ...... మ.కో. దేశమందున గెల్వ గల్గుట దీన మార్గము నెల్లరున్ క్రోశమవ్వుట యింటి వీధిన గొప్పతెల్పుట నెల్లరున్ ఆశ పాశమదెంత నిప్పుల యాట లాడుట నెల్లరున్ దేశ మాతను నమ్మి కొల్చుట దేశ భక్తి జనార్ధనా 84 ..... మ.కో. అక్రమార్జిత వచ్చు సంపద లాశ పాశము పెంచుటే వక్ర బుద్దియు దారి తప్పుట వాదనే యగు నేతగా చక్రమల్లెను తిర్గ గల్గుట సైన్యమే యగు కాలమై సక్ర మొప్పయు గాంచ గల్గుట సాధనమ్ము జనార్ధనా 85 ...... మ.కో. హేల యీ కుసుమా పరాగము హేతు వవ్వుట దేనికో బేల యీ విరి దృశ్య కావ్యము వేడ్కగానగు ప్రేమ గా రాల వైనము మోహనాస్త్రము రవ్వ వెల్గుల పొందుకే పూల మత్తు వసంతశోభయు పూజ్య మౌను జనార్ధనా ... ... ... 86 ....
ధ్రు.. కో:: వణకు లేలను చెప్పకుండగ వంతు లాటలవేలనో
చినుకు లే పడి చిన్న బుచ్చియు చిత్రమాయెను నెందుకే తనువు తంత్రమదేలల చెప్పెద తప్పులే యగు నెందుకో మనుజ మర్మము పల్కులేయగు మంచిగాను జనార్ధనా ... .... ... 87 ..... మ.కో. తావి లేనిది పువ్వు లేదిల తామ సమ్మదియేలనో ఆవిరే యగు కోపతాపము నాలకించకు మిప్పుడే సావధానము నిత్యసత్యము సన్నిధానపు శోభతో నేవ గించకు మానసమ్మది యెల్ల మాట జనార్ధనా ... .... .... 88 ....
ధ్రు.. కో:: కులము నఘస్థితి పంతమే గతి కూర్పు మార్పుల తీర్పుయే
గెలుపు నోటమి తీవ్ర దాహము కీడు మార్చును ఓర్పుయే నిలుపు లక్ష్యము నిత్య మై వరనిత్య నీడల తోడుగా మలుపు లన్నియు కుర్ర చేష్టలు మార్పు ఓర్పు జనార్ధనా ... ... 89 ...... మ.కో. చేర కన్యక కోటి యాశల చేదు భావము తెల్పుటే ప్రేరనే విరి మాల శోభల ప్రేమ వెల్లువ పొంగులే ధారణా మధురామృతమ్మది ధన్యతే నవ దీప్తిగా వారు వీరగు వీరు వారగు వాంఛ లన్ని జనార్ధనా ... .... .... 90

ధ్రు.. కో:: సతము నిన్నుభజించెదన్ వర సత్య మాధవి సామ ర
స్యతసమానము అంబుజాసన శాంతిభూషలు నిత్యమై కతలు పుట్టియు స్వేచ్ఛ నిచ్చెడి కామ్య పార్థివి శ్రేష్ఠమై హతవిదీ సిరి మాయయే యగు హావ్య భావ జనార్ధనా ... .... .. ... 91 వ్యాసు పూజిత వ్యాసు పూజిత వ్యాసు పూజిత పాహిమాం బాస చాలదు స్వామి నీదగు ప్రజ్ఞ తెల్పగ నల్పుడన్ వీసమెత్తును సాటి లేదన విశ్వ మందున మ్రొక్కెదన్. బాస లన్నియు చేసి యుంటిని బంధ మౌను జనార్ధనా . ... .... 92 చెడ్డ ధారియు నీటయీదుచు చేరియుంటిని మౌనమై రెడ్డి గారికి రెక్కడెక్కలు రేటు చెప్పియు అమ్మగా కడ్డి చేతను బట్టి మోటుగ ఘాటు గాటుగ పల్కులై మడ్డి బత్కున గొప్ప వెల్గుల మానసమ్ము జనార్ధనా. ... .... ..... 93 ఎవ్వడన్నది చెప్పలేవు లె నిమ్మకుండుట మేలులే నవ్వు టేలను సృష్టికర్త మనమ్ము చేష్టలు నాటలే యివ్వ జూపియు నాశపెట్టుట నీప్సి తమ్మది వేళలే కెవ్వడున్ విధి భావమున్ గన నెట్టులౌను జనార్ధనా. ... ..... ..... 94 ...... ఎంత కంతకు నాశ చావక నెల్ల వేళల నాశయం బింత పక్కన బెట్టియూహలు నేల వెంటన మాయలై శాంతి కోరెడి బిడ్డ లున్నను సాహసమ్మును చూపుటే వింత చూపుల ప్రేమ దక్కిన వీధి యాట జనార్ధనా .... .... .. 95 ....... మిష్ట మేయిది యెవ్వరై ననను మేలు కోరుట లక్ష్యమే అష్ట చేష్టలు నుండ వచ్చును ఆశలే యగు సత్యమై నిష్ఠ యున్నను చేదు కానదు నీడలే యగు కాలమై దృష్టి యేయిది మీయభీష్టము తృప్తి గాను జనార్ధనా ... ... 96 .... పిల్లలే సహనమ్ము చూపుచు పెచ్చు పెర్గిన యాడుచున్ పిల్లలేసుఖ మైన యాటలు పిల్వ కాడుట సంభవం బిల్లు వాకిలి విద్యయే మది యిష్ట మవ్వుట నిత్యమున్ డొల్ల బుద్దియు సేవ చేయుచు దోచుకొండ్రు జనార్ధనా ... ... .... 97 .... విద్యలెళ్లను నొజ్జు కావులె విజ్ఞ తిచ్చిను మాతగా పద్యమేయిది మెప్పుకోసము పండితోత్తము కాదుగా మద్య మత్తుకు చిక్కి యుంటిని మామదీయము తెల్పగా సద్యవాణిగ నీకు చెప్పెద సంతసమ్ము జనార్ధనా ... ... ... 98 .... పద్మ నేత్ర ముఖార విందము పాల నావిధి ధర్మమై పద్మ గంధము చల్లగా కళ పావనమ్మగు నిత్యమై పద్మ హృధ్య సులక్షణా మది పాధ్య భావము కత్తిలా పద్మ శ్రీ గుణ మాట ధూర్థుల భావమేను జనార్ధనా .... ... .. 99 .... వ్యాసు పూజిత వ్యాసు పూజిత వ్యాసు పూజిత పాహిమాం బాస చాలదు స్వామి నీదగు ప్రజ్ఞ తెల్పగ నల్పుడన్ వీసమెత్తును సాటి లేదన విశ్వ మందున మ్రొక్కెదన్. బాస లన్నియు చేసి యుంటిని బంధ మౌను జనార్ధనా .... .... ... 100

మ.కో. నీతిలేకను చావలేకను నేతలేయగు ఎందుకో ఖ్యాతి కోరియు దొడ్డి దారియు కాల మార్పులు ఎందుకో నేతలే గతి చేపలే యగు నిమ్మ కుండుట ఎందుకో జాత కమ్మగు కొంగవైనము జాడ్జ్యమేను జనార్ధనా..101 మ.కో. చాటు మాటున దొంగ చూపులు జాన నేర్పుయు చూడుమా వేటు కాదిది పల్కు లన్నియు విశ్వ మాయను చూపునే కాటు వేయుట బేల బుద్ధియు కాంత మోహపు కోర్కయే మాటు నుండియు తృప్తి పర్చియు మాయలేను జనార్దనా..102 కనుల చూపులు శుష్క వాద వికాస లక్ష్యమనో మయమ్ ఘనత కెక్కుకృపాబ్ది నెంచుట గమ్య ధారి సహాయమే చినుకు అక్షయ మే మనోబల చిత్తమార్పుకు వెల్గు లై తనువు రాగము గౌరవమ్మగు తత్వ బోధ జనార్ధనా..103 క్రూరతన్ మది ధ్రుంచివేయుము కూప మయ్యడి బుద్దియే భారమే విధి బంధ తత్త్వము భాగ్య మవ్వుట ఏలనో ద్వారబంధ షడాస్య భద్రత దాస్యమే యగు జీవితం పోరు తప్పదు నిత్య సత్యము ప్రో ద్బ లమ్ము జనార్ధనా..104

మ. కో.నీవుగ చెప్పినామమత నీడల రూపము విశ్వ మందునన్
నీవుగ చెప్ప సత్యమిది నేస్తము మార్చుట లక్షణమ్ముగా నీవుగ భక్త తత్పరుల నెంచియు శాంతిగ ప్రీతి పాత్రగన్ నీవుగ కోరుచుంటిని మనస్సును సత్యముగా జనార్ధనా.. 105 మంచిని పెంచ వంచనను మాపియు సౌఖ్యపు శాంతి నిచ్చుటన్ ఎంచిన లక్ష్య సాధనలను ఎల్లలు దాటక చూప గల్గుటన్ వంచన లేని జీవితము వర్షము మాదిరి కాక శోభగన్ సంచిత భావమే వయసు సేవల భాగ్యమదీ జనార్ధనా.. 106 మ.కో. అందిన ప్రేమపొంద మది నాశయ సాధన గార్యదీక్షగా పొందిన తృప్తి నెంచకయు పోరును సల్పక జీవితమ్ముగా వందన తత్వ మాయలగు వానల మల్లెను వచ్చు బంధువుల్ ముందు మనోభవమ్ము గతి ముఖ్యము సంతసమే జనార్ధనా.. 107 మ.కో. దాహమేయి కుటుంబ ఖర్చులు మార్చలేముయు ఎందుకో స్నేహమే మది శాంతిసౌఖ్యము సేతు బంధము ఎందుకో మోహమే ప్రగతీ కధామయ మోక్షమార్గము ఎందుకో ప్యూహమేయిది నీవు నేర్పిన పూజ్యమేను జనార్ధనా.. 108 మ.కో. హంస మేలును చూడలేవు సహించలేవుయు ఎందుకో మాంస మైనను పక్షియేయది వల్లమాలిన ప్రేమ మీ మాంస మేలను శ్వేతవర్ణ సమాన పక్షియు నేత్రమై హంసవాహన వాగ్దేవీ మది విద్యగాను జనార్ధనా.. 109 మ.కో. నీతిలేకను చావలేకను నేతలేయగు ఎందుకో ఖ్యాతి కోరియు దొడ్డి దారియు కాల మార్పులు ఎందుకో నేతలే గతి చేపలే యగు నిమ్మ కుండుట ఎందుకో జాత కమ్మగు కొంగవైనము జాడ్జ్యమేను జనార్ధనా.. 110
మ. కో. మోతకాలము మోయు వారును మోట్టు టేలను మానసమ్ చేత లేకను చెంప దెబ్బలు చేష్ట లేలను మానసమ్ దాతలేనని బ్రాతలేనని దారిదోపిడి మానసమ్ జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లజనార్ధనా.. 111 మ. కో. ఎంత తిన్నను దేహశుద్ధియు యె0త యున్నాను మానసమ్ నెంత భాగ్యము కర్మమార్గము నెన్ని తప్పులు మానసమ్ కెంత ఓర్పు మరెంత మార్పులు నీవు పొందుట మానసమ్ పంతమో బతుకే సమ ప్రార్ధనేల జనార్ధనా.. 112 ధ్రు. కో. ఘటము లోని ధనమ్ము కన్నను కా లతీర్పు ల వాని క న్న టటు లేనని మోస పద్దతి న్యాయమేనన మూర్ఖ డే పుటము బెట్టిమహాత్మకన్నను పూర్తినమ్మకమేను యె ప్పటికి వాంఛలు తెల్పుటే మది పాప మౌను జనార్ధనా.. 113 మ.కో. అన్య భాషలు ఏలమార్గము లాస్యమాడుట దేనికో ధాన్య మైనది మాతృ భాషయు ద్యాస లేదు మ రెందుకో మాన్య తీర్పుయు మంచి చిత్తము మానసమ్ముయు మారినో కన్య కోర్కెలు కావడేయగు కాల మార్పు జనార్ధనా..114 ధ్రు. కో. ఒకరి జీవనమే మరో విధి ఓర్పు లేక సహాయమే ఒకరి మాటలు ఎల్లవేళలు ఒప్పు కో యన భావమే ఒకరి ఆపద ఇంకొ బాధ్యత నొప్పి యైనను బంధమే ఒకరి సంపద పంచబుద్ధియు ఓట మేల జనార్ధనా.. 115 ధ్రు. కో. వినుమయా మమ విన్న పాలను విఘ్ననాయక యిప్పుడే గుణమజ్ఞానము కోపతాపము గుర్తు మాపుము యిప్పుడే మనసు నైజము వేగమేయగు మార్చు మామది యిప్పుడే ఘనమగా నిను మొక్కెదామది గమ్యమౌను జనార్ధనా..116 మ. కో. క్షేత్ర నాయక భౌతికార్ధము క్షేమమే మది ఓర్పుగా క్షేత్ర పాలక మమ్ము కావుము క్షేత్ర ధర్మము చేసెదా క్షేత్ర మార్గము దేహ తత్త్వము క్షేమ మవ్వదు మార్చుమా క్షేత్ర దైవము క్షేత్ర సత్యము క్షేత్రమేను జనార్ధనా.. 117 మ. కో. వీణ చేతను బట్టి విద్యల వాణి వసుధన్ మదీ వీణ యే స్వరముల్ కమనీయ కీర్తన వేద్య గా రాణి బ్రహ్మపు వాణి సాక్ష్యము లాలి యే యగు తృప్తిగా ఆణి పట్టపు హంసవాహిని అక్షయమ్ము జనార్ధనా..118 మ. కో. భారతమ్మున నేను క్షేత్రము భాగ్యమే యగు బంధమై చేరు వారకు హిందు తత్త్వము కీలకమ్మగు నిత్యమై ఆరు నూరగు జ్ఞాన సంపద అక్షరీ కర సత్యమై ప్రార్ధనేయిది వాక్కు లెళ్లను పాదమేను జనార్ధనా.. 119 మ. కో. మొగ్గ గున్నను అక్కరేనని మోజు పెర్గుయు త్రాగిరే సిగ్గులేకయు వృత్తి ధర్మము విస్మరించియు త్రాగిరే ఎగ్గు లేకయు విద్య వున్నను ఏరి కోరియు త్రాగిరే తగ్గ కుండగ దేహరోగము తొట్రు పాటు జనార్ధనా..120 మ. కో. మక్కువే కలిగేను మిక్కుటమౌను చల్లని జిహ్వకున్ ముక్క కొర్కియు ఎఱ్ఱ నెఱ్ఱని పుచ్చ తీపియు లూరియున్ చక్క నీ రస పుష్టి కల్గుగ చింత మార్చును చల్లగా చక్కి లింతయు ఎండవేడికి చెమ్మ చెక్క జనార్ధనా.. 121 మ.కో. పాంచభౌతిక దేహతత్త్వము ద్వారమున్ బరి కింపుటే ఎంచ యోగులు తోలుతిత్తియు ఎల్ల వేళలు దేహమై వాంఛ యున్నను కామినీ కళ కాముకేయగు మానమై పంచ జూపును మాంస ఖండము పాలదేహజనార్ధనా
122 మ.కో. కాల నిర్ణయ సర్వ సృష్టికి కామ్య మార్గము చూపిటే కాల మన్నది సత్యమార్గము కావ్య తృప్తిని పెంచుటే కాల లక్ష్యము ధర్మబద్దము కార్యమేయగు ఇప్పుడే కాల సద్వినియోగ నీ అవ కాస పృథ్వియేను జనార్ధనా..123 మ.కో. కప్పి చెప్పెది జీవమేను విశిష్ట మేయగు ఉత్కృతమ్ విప్పి చెప్పెది గమ్య సత్య విమర్శ గాను సమ్మతమ్ తప్పి పొయ్యెడి కాల మంతయు తృప్తియే యగు నిర్మలమ్ నొప్పి లేనిది ప్రేమతో పలు కొక్కటేను జనార్ధనా..124

మ. కో. యంతరార్ధము తెల్ప లేకయు యాత్మ యే గతి సూణ్యమై
యంతరమ్మున మంట క్రాగగ నంత నిండెను మర్మమై
యంత తెల్పిన గంగమాదిరి నమ్మ కమ్ముయు జీవమై
యంతరాలు మనోవిధీ కథయే సమాధి జనార్ధనా..125

ధ్రు. కో. కపట సూత్రము ద్రోహపూరిత  కన్ను మాయయు యేలనో
తపము వేషము నేరముల్ మది తప్పు మార్గము యేలనో
చపల చిత్తము నమ్మచేష్టలు స్వార్ధ బుద్దియు యేలనో
తపన దేహము దాహమేయగు తత్త్వమౌను జనార్ధనా.126

మ. కో. పైన పూజలు లోన లైంగిక పైరవీ గతి దుర్బరం
పైన భక్తుడు నమ్మలాకులు నైతికమ్మగు గర్వమై
కాన రాని సుఖమ్ము కోరెను కాటి చెర్చెను ఇంతినే
వైన తేయ మృదంగ మేయిది వైపరీత్య జనార్ధనా..127

మ.కో. మోయు జాహ్నవి పాపముల్ విషమౌను ఏలను ఇప్పుడే
మోయలేకయు సంద్రమా అని మోపె భారము యప్పుడే
స్వీయ నేస్తము సూర్య ప్రాభవ శీఘ్ర మెర్పడ అంబరం
మోయ వర్షము పృద్వి పంటకు మోప ధాన్య మేను జనార్ధనా.128

అలక కోప శుధా మనస్సుయు హర్ష మెందియు సాగుటే
అలల మాదిరి పర్గు లవ్వుట యాశ పాశము సాగుటే
కలలు తీర్చెడి సేవతత్పర కాలమే నని సాగుటే
పలక రింపుసహాయ పెన్నిధి ప్రార్ధనేను జనార్ధనా..129

నడక మేలు తలంపు నిశ్చయ నమ్మకమ్మగు మార్గమై
పడక లేలు జయమ్ము సన్నిధి ప్రాభ వమ్ముయు జీవితం
కడలి పొంగులు తెల్లవార్లును కామ్యలక్ష్యము దేహమై
వడలె పువ్వుయు నిత్యజీవము వాదమీను జనార్ధనా
.130

మ.కో. గుర్రు పెట్టుట యేల నీకును గుర్తు చేసుకొ రీతులన్ 
బిర్రు గా పలికే ఒ మాటయు బీర మవ్వుట వింతగన్
జిర్రు బుర్రున సాగ గల్గుట జీవ మార్గము మాత్రమున్
జుర్రు కోవుట నిత్య బుద్దులు జున్ను వోలె జనార్ధనా..131

మ.కో. సత్యమేపతి ధర్మమైసతి సమ్మతీగతి సాదు సాం
గత్యమేస్థితి సర్వరక్షణ కాంక్షయే మతిశత్రు రా
హిత్యమే శృతి విశ్వ మందున నీదయా గమనం బుదా
నిత్యమూ సుమి నిర్ణయాలగు నిక్క మేను జనార్ధనా..132

మ.కో. ధన్యవాదము తెల్పు చుంటిని ధ్యాన మూర్తికి నిత్యమూ
మాన్య వర్యుల సేవ చేయుట మానసమ్ముయు సత్యమూ
అన్య మేమన విద్య యే గతి నాదు జీవిత ధర్మ సా
మాన్య సంఘము నందు భావము మార్పు చేయు జనార్ధనా.133

ధ్రు.కో.గురుకటాక్షము సత్యభాహ్యము గుప్తధానము నేస్తమున్ 
సరస భాషణ ధర్మరక్షణ సాదు వాద వినోదమున్ 
మరవ రానిది నమ్మప్రేమయు మంగళమ్మగు ఆశయమ్ 
తిరుపతే మతి మార్చు దైవము తీపి నిచ్చు జనార్ధనా..134

మ.కో.స్వర్ణ మవ్వదు ఏది యైనను సర్వ యిష్టము వాక్కులే
వర్ణ శాస్త్రము మేధ సంపద వాక్కు వల్లన మేలులే
అర్ణవేసకలమ్ము దృష్టియు నమ్మనేస్తము నిత్యమై
పూర్ణతత్వము దీర్చ గల్గును పూజ్యులేను జనార్ధనా..135
   
ధ్రు.కో. గడచి నట్టిది ధర్మమైనది కాలమే గతి నేర్చుకో
విడవకేఅను వంతమైనను నీదు రక్షకు నేర్చుకో 
పడవ మాదిరి ముందు చూపుయు ప్రశ్న తీర్పులు నేర్చుకో 
కడవ బత్కులు నాశ తోడుయు కాలమందు జనార్ధనా.136

మ.కో. చుట్టు చూడుము మంచి చెడ్డను జూడు కళ్ళతొ నిప్పుడే 
మెట్టు వాస్తవ మే నెరుంగుము మేలు చేయుము నిప్పుడే 
ఒట్టు దృష్టియు అంతరంగము ఓర్పు చూపుము నిప్పుడే 
మట్టు పెట్టుట బుద్ధి మార్చుము మానసమ్ము జనార్ధనా.137

మ. కో. భారతీ మది ధర్మతత్వము  భావి మార్గము తీయగా 
మారె కాలము మానమేయగు  మాన సమ్ముయు కమ్మగా 
తీరుగామది తీర్థ వోలెను తీపి గుర్తులు హాయిగా 
గౌరవమ్ము సయుత్తమోత్తమ  గమ్యమేను జనార్ధనా..138

మ.కో.మల్లె మాలలు లాలి నవ్వులు మంచు పువ్వులు వాటికన్
చల్ల చల్లని గాలి తెమ్మర చక్క బర్చును శ్రీకరా
వల్లమాలిన భక్తి తత్పర వేణుమాధ వ లీలలే 
దుల్లమేస్థితి గాంచితీ మది నోయ్య కోయి జనార్ధనా..139

మ. కో.ఈక్షితిన్ మది నర్ధ కాంక్షయు నీ శ్వరేశ్చయు లెల్ల సం
రక్షయే సహనమ్ము దీక్షల రమ్యతా విధి చంద్రి కా
పేక్షయే సహకార లక్ష్యము ప్రేయసీ ప్రియ చూపులన్ 
కాంక్షయే తప జీవితమ్ముయు కాలమాయ జనార్ధనా.. 140

మ. కో.తిక్క పల్కులు లేల పల్కుట నీరజాక్షుని లీలలున్
చిక్కకుండియు చక్కచేయుట చింత మాపుట లీలలున్
కెక్కడా నన కక్కడక్కడ ఇప్పుడిప్పుడు లీలలున్
నక్కడక్కడ నవ్వులన్నియు నచ్చచెప్పు జనార్ధనా.. 141

మ. కో. దుఃఖమేమది గల్గజేయుట దోవ బెట్టగ కష్టముల్ 
దుఃఖమౌ విధి ఓర్పు జూపక  దుష్టు లున్నను కష్టముల్ 
దుఃఖమేగతి చెడ్డ బుద్ధుల దుర్మతీకథ కష్టముల్  
దుఃఖమాపుము సేవ చేసెద దుష్ట తత్వ జనార్ధనా.. 142

మ. కో.వాలు జిక్కియు వీలు దక్కియు వాస్తవమ్మున లెక్కలున్ 
కాలు మొక్కియు నీడ్చగల్గియు ఖంగుజూపెడి లెక్కలున్ 
మూల చేర్చియు మొత్తబుద్ధియు మూక మార్చెడి లెక్కలున్ 
పాలునిచ్చియు  నాల్గలెక్కల పంచగల్గు జనార్ధనా..143

మ.కో. ఏనరుండును విత్త మొందియు తప్పుచేయట ఏలనున్
ఈనిధీ మరిగీ గతమ్ముయు యిప్సి తమ్మును కోరునున్
దీన ధన్యుడు నేర్పరీనని దీక్ష తెల్పు సకాలమున్
దాన కర్ణుడు దద్భవమ్మున ధర్మ దాత  జనార్ధనా..144

ధ్రు. కో.కడుపు కాలిన నాశ పెర్గిన కమ్ము కొచ్చును కోపమే
ఒడిన చేరిన ప్రేమ పుట్టిన వల్ల మాలిన కోపమే
మడిన నున్నను రంకె వేసిడి మానవుండుని కోపమే
దడిన చేరియు ప్రేమకోరియు తప్పు తెల్పె జనార్ధనా..145

ధ్రు. కో.గుణము గోప్యము గమ్యమేర్పడ గుర్తు చేయును ఎల్లరుణ్
తనము తెల్పియు సర్వులందున తప్పు దిద్దియు నిశ్చమున్r
మనము భావము హృద్య మందున మార్పు నేర్పుయు తెల్పుటే
ఋణము తీర్చియు రూపు మాపెడి ఋష్య తీర్పు జనార్ధనా.146

మ.కో. రివ్వునా కదలాడె శక్తియు రీధ్వనేమది చుట్టగా
గువ్వ నవ్విన మబ్బుమారిన కూడు వెల్లువ కెంపులై
నవ్వులే మది గూడుచేరగ నాణ్యతే విధి దోచగా
నవ్వి నానను మార్పు కోరుట నిత్య సత్య జనార్ధనా.. 147

మ. కో.భిన్నమై రుచి భాషవేరు స భిన్న మైనను ధైర్యమై
ఉన్న మార్పులు తెల్పలేకన యున్న మార్గము నేస్తమై
సన్ను తించుట సుప్రభాతము సాగ నిచ్చుట గమ్యమై
మన్ను మిన్నును నమ్ముటే మది భావనమ్ము జనార్ధనా..148

ధ్రు. కో.అతిరహస్యము సర్వ లక్ష్యము నమ్మ విద్యయు బోధయే
గతివివేకము ఆత్మ విద్యయు గాధ తొల్పుట నిత్యమై 
శృతి గుణంబుయు తొల్లి నుండియు సర్వ శ్రేష్ఠము పొందుటే
ప్రతి వినమ్రత సేవ తత్త్వము పట్ట బోధ జనార్ధనా.. 149

ధ్రు.కో.గెలుపు ఓటమ టంచు నెంచియు గేలి సేయదలెందరో పలువురున్ సమయమ్ము జూతురు పాడు వేడుక నందురో విలవలన్నియు మంచిమార్గము వేగ నీయక నుందురో తలపు లన్నియు నీదు కీర్తియు తెల్ప గల్గు జనార్ధనా..150 మ.కో. తల్లి తండ్రుల పుట్టుకే సమతమ్ము మూలము పృద్వియే మల్లి మల్లక గాలి చేరియు మానసమ్ముకు ఊరటే వల్ల మాలిన అగ్ని నిచ్చియు వాంఛ నిర్ణయ వర్షమై నల్ల నైనది శబ్ద మున్నది నాకశమే జనార్ధనా.... 151 ధ్రు.కో. తృణము నైనను బందు వర్గము తృప్తి పర్చుట మార్గమున్ క్షణము నైనను సేవచేయుశి క్షనేమది మార్గమున్ గొణగ బోకుము నీచ బుద్దిగ కోరి చేరిన మార్గమున్ ఋణము తీర్చును నిత్య సత్యము ప్రేమతోడ జనార్ధనా.152 మ.కో. దానమే విధి సంపదే గతి ధాన్యమేస్థితి శిష్ట సం తానమే మతి వంశమే గతి తాళి నీడయు నాత్మ వి జ్ఞాన విద్యయు చేయు ధర్మము జ్ఞప్తి జేయుచు సేవయున్ మానమే నిధి మోక్షమే శృతి మానసమ్ము జనార్ధనా ... 153
ధ్రు.కో. దయయు తల్లియు ధర్మ దేవత దాత తండ్రియు నిత్యమున్ పయన మైనను జేయకమ్మని పావనమ్ముయు సత్యమున్ వయసు వచ్చిన శాంతి నిచ్చియు వంక జూడక ధర్మమున్ భయము మాపుము దాడి జేయక బంధ మేను జనార్ధనా.154 ధ్రు.కో. ఎవరి నైనను అడ్డగించుట ఎల్ల వేళలు రక్షనే ఎవరి నీడను ప్రశ్న వేయుట ఎంచ గల్గుట ధర్మమే సవరణే యని వృత్తిధర్మము సాగ నిచ్చుట లక్ష్యమే ఎవడు దొంగయు నెంచ గల్గును ఇట్టిదైన జనార్ధనా..155

ధ్రు.కో.బ్రతుకు లోనన జంకబోకుము బాధ్యతే మది బంధమౌ వెతుకు లాటలు నిన్ను మార్చును వెర్రి చేష్టల వళ్లనౌ అతుకు బొంతల జీవితమ్మిది నాశలన్నియు చెల్లవో మెతుకు కోసము కాయకష్టము మెప్పు కాదు జనార్ధనా .. 156 ధ్రు. కో. వినయమున్ విధి మంచి కార్యము విశ్వమందున వేడ్క నీ వినయమున్ సహనమ్ము చేరియు విద్య మెట్టుల గాక నీ వినయమున్ విమలత్వ విజ్ఞత విద్య నేర్పు కు మూల నీ వినయమున్ నిధి పొంద గల్గుట వీలు గాను జనార్ధనా ..157 మ. కో. మగ్న భీతిన దిక్కు తోచక మాయ కమ్మిన చేష్టలై భగ్న మానస మొంది యుండియు భాస్కరుండుల తిర్గుటే విఘ్న మొందుచు వేదనుండగ వింత చేష్టలు వచ్చెనే నగ్ని చేరుట కాలనీడలు నాకు నేడు జనార్ధనా .. 158 మ. కో. నిప్పు రవ్వలు ఏమిటోమరి నెత్తి కెక్కగ మాడ్చెనే చెప్ప లేనిక ఎండలోనన చింత ఏడ్పుయు వచ్చెనే తప్ప లేదిక బాధ నున్న వెతల్ని పొందెను వెంటనే ఉప్పు కారము తిన్నవాడ్ని స ఉడ్కు ఏల జనార్ధనా .. 159 ధ్రు. కో. అడుగు మార్చకు తోడు యున్నను నాశచేర్చకు సౌఖ్యముల్ బడలి సాగకు బంధమున్నను బాధ్యతే గతి నీకునున్ కడలి మాదిరి నిండుకుండగ కార్యభారము తప్పదూ పడక చేరెడి ధైర్యముంచుము పాము వెంట జనార్ధనా .. 160

ధ్రు.కో.గెలుపు ఓటమ టంచు నెంచియు గేలి సేయదలెందరో

పలువురున్ సమయమ్ము జూతురు పాడు వేడుక నందురో
విలవలన్నియు మంచిమార్గము వేగ నీయక నుందురో
తలపు లన్నియు నీదు కీర్తియు తెల్ప గల్గు జనార్ధనా .. 161

మ.కో. తల్లి తండ్రుల పుట్టుకే సమతమ్ము మూలము పృద్వియే
మల్లి మల్లక గాలి చేరియు మానసమ్ముకు ఊరటే
వల్ల మాలిన అగ్ని నిచ్చియు వాంఛ నిర్ణయ వర్షమై
నల్ల నైనది శబ్ద మున్నది నాకశమే జనార్ధనా .. 162

ధ్రు.కో. తృణము నైనను బందు వర్గము తృప్తి పర్చుట మార్గమున్
క్షణము నైనను సేవచేయుశి క్షనేమది మార్గమున్
గొణగ బోకుము నీచ బుద్దిగ కోరి చేరిన మార్గమున్
ఋణము తీర్చును నిత్య సత్యము ప్రేమతోడ జనార్ధనా 163

మ.కో. దానమే విధి సంపదే గతి ధాన్యమేస్థితి శిష్ట సం
తానమే మతి వంశమే గతి తాళి నీడయు నాత్మ వి
జ్ఞాన విద్యయు చేయు ధర్మము జ్ఞప్తి జేయుచు సేవయున్
మానమే నిధి మోక్షమే శృతి మానసమ్ము జనార్ధనా .. 164

ధ్రు.కో. దయయు తల్లియు ధర్మ దేవత దాత తండ్రియు నిత్యమున్
పయన మైనను జేయకమ్మని పావనమ్ముయు సత్యమున్
వయసు వచ్చిన శాంతి నిచ్చియు వంక జూడక ధర్మమున్
భయము మాపుము దాడి జేయక బంధ మేను జనార్ధనా .. 165

ధ్రు.కో. ఎవరి నైనను అడ్డగించుట ఎల్ల వేళలు రక్షనే
ఎవరి నీడను ప్రశ్న వేయుట ఎంచ గల్గుట ధర్మమే
సవరణే యని వృత్తిధర్మము సాగ నిచ్చుట లక్ష్యమే
ఎవడు దొంగయు నెంచ గల్గును ఇట్టిదైన జనార్ధనా .. 166

మ.కో. చిన్న బోయె ముఖార విందము చింత చూపుల నీడలై
వన్నె తెచ్చెడి కాంత కోరిక వేణుమాధవు నీడకై
నన్ను గానగ లేక యున్నను నా మనస్సుయు నీడగా
మన్ను మిన్నుయు రాధ ప్రేమను మాయ జేసె జనార్ధనా ..167

మ.కో. చూచి మాటలు నంత మాత్రమ సుందరంగుని లీలలే
వేచె కన్నులు దివ్య తేజము వెన్నెలవ్వుట లీలలై
కాచినంతన గోపకన్నెయు గాఢ కోర్కెల లీలలై
యోచనా మది రాధయే యగు యోగ్య రాశి జనార్ధనా ..168

మ.కో. వేణు నాదవినోద మోద నవీణ నాదము తెల్పెనే
కానుకే కథ గోపకాంతుల కామ్య చేష్టలు నేర్పెనే
కాన లేని మనస్సు పంచియు కార్య దీక్షలు పంచెనే
మాను నైనను సృష్టి ధర్మము మార్చ గల్గు జనార్ధనా .. 169

మ. కో.పండితా పరమాత్మ డయ్యెను భాను చెంగట విద్యగన్ నిండుగా మతి దేహధారియు కాంచనాద్రియు నిర్మలమ్ అండగా గతి శౌర్య శాలియు మంగళమ్ముయు భక్తికిన్ భండనే విధి నందు రక్కసు భంజనమ్ము జనార్ధనా .. 170 ధ్రు.కో. మదిన నుండిన యంజనీ సుత మంగళా కర దైవమై విధిగ కొల్చెద ముక్తి కోరియు విశ్వ ముందున దైవమై అదును తప్పక రక్ష చేసిన ఆద మర్వని దైవమై పదము మొక్కెద నిత్య సత్యము ప్రేమ జూపు జనార్ధనా .. 171 ధ్రు.కో.నెమలి నేత్రము కృష్ణ పింఛము నెమ్మదిచ్చును సౌర్య శా లి మది మంగళ మే జయించగ లీల మాధవ తేజ మౌ నముని కారణ జన్మ శ్రద్దలు నిర్మలమ్ముయు దివ్య నా మముయు వల్లను కీడు పీడలు మంచు గాను జనార్ధనా .. 172


"नर्तकी..भ भ भ भ न न न न ग--25/13.. -- శ్రీపవనాత్మజ కేసరినందన జితదనుజనికర ! సురవినుతా ! ఆపదఁదీర్చిమహాకపి ! స్వర్ణమయతను ..శుభఁపువరఫలనిడుమా.. శాపసమానపరిస్థితులన్నియుఁ జనుల టులుగఁ గనుమయ నిధిదా .. పాపఁపుబుద్ధులఁద్రెళ్ళుమ మారుతి! బలముసుమతులడిగెద..నభయదా !!! " నీచరితమ్ముయు తెల్పసహాయము నిరతము విదితము సుమధురమే యోచిత భావమహాకపి జీవన యుదయ ప్రకృతి శుభపు ఫలము యే సూచన మానపరిస్థితులన్నియు శుభము సుఖము జనుల నభయదా చూచెను మారుతి లీలలు నిత్యము చురుకు చెలిమి బలము వినయమే

*స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః* *గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖీనో భవంతు॥*
*కాలే వర్ష తు పర్జన్యః పృథివీ సస్యశాలినీ|* *దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః॥* *అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః|* *అధనాః సధనాః సంతు జీవాంశు శరదాం శతమ్॥*
*ఇదం భగవతా పూర్వం బ్రహ్మణే నాభి పంకజే|* *స్థితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రకాశితమ్॥*
*య ఏనం శ్రావయేన్నిత్యం యామక్షణమనన్యధీః|* *శ్రద్ధవాన్ యోఽనుశ్రుణుయాత్ పునాత్యాత్మానమేనసః॥*
*ఏతాం యో నియతయా శ్రుణోతి భక్త్యా యశ్చైనాం కథయతి శుద్ధవైష్ణవాగ్రే|* *తౌ సమ్యగ్విధికరణాత్ఫలం లభేతే యాథార్ధ్యాన్న హి భువనే కిమప్యసాధ్యమ్॥*
*సర్వవేదాంతసారం హి శ్రీభాగవతమిష్యతే|* *తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్॥*
*భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే|* *తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభుః॥* *నామ సంకీర్తనం యస్య సర్వపాపప్రణాశనమ్|* *ప్రణమో దుఃఖశమనః తం నమామి హరిం పరమ్॥* *యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్|* *తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే॥* *కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్|* *కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి॥* .....
నారాయణోపనిషత్* ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై!! తా: సర్వ జీవులు రక్షింప బడు గాక. సర్వ జీవులు పోషింప బడు గాక. అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి. ( సమాజ ఉద్ధరణ కోసం) మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక. ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక. ఓం శాంతి: శాంతి: శాంతి:!
*॥శ్రమన్నారాయణ చరణారవిందార్పణమస్తు॥*
May be an image of flute and temple
All reactions:



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి