17, జనవరి 2023, మంగళవారం

జనవరి 01 - 01 -2023 నుండి 31 -01 -2023 కవితలు


*ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*
         జై గోవింద🙏🙏🙏
ఇష్ట పది.. రధసప్తమి 28-01-2023
తూరుపు సింధూర తలుపులు కళలుగా 
ఘడియ ఘడియ తీరు  గమన వేళ కథలు 
తీరాన కెరటాలు తీరు మారి పరుగు 
కడలి గుండము కాదు ఖనిజసంపద నిధి
--- 
కదలివచ్చు నురుగు కలశమై బంగారం 
నిత్య సాక్షాత్కరించేటి నియమమై తరుణమై 
ప్రకృతి స్తంభించినా ప్రతిభయే మొత్తము
అతిశయమైనది కాంతి చూపు లవియు
---
తూరుపు కిరణాలు ఊరూర కదిలేను 
చిమ్ముతూ కాంతులు చిరుహస గమనమే 
కాలముకదలిక కావడి బంతాట 
రాత్రి మెరిసినవి రంగు చుక్కలవియు
---
కానుకగా ఇచ్చి నా నింగి పువ్వులనవ్వు 
మురిపించు మనసులు ముచ్చట విరిసేను
తరుణ మాయమదియు తకధిమి తకధిమి
తనువు ప్రే మచిగురు తీరు మారు జరుగు 
---
సాగరతీరాన సాగు వెలుగువేళ 
దినకరుడికళలు దర్శన అనుభవం
అందరికి దొరకు  అరుదైన వరమేను 
అనందతీరాల అద్భుత మదితేలు 
==
మధురమైన ఉదయ మనుగడ  ఆదిత్య
కిరణాల మయముయే అందరి ఆనంద
హృదయాల ప్రార్ధన ఆరాధ్య దైవమై
రధసప్తమి కళలు రాగయుక్త మగుట
---

తేటగీతి.. భార్య భర్తల గోల
ఆధునిక భార్య చూపేటి అలక ఇదియు 
భర్త పలుకు పురాతన బంధ య నుచు 
భార్య చూపుల వలలోన బాధ ఏల
భర్త నమ్మలేనివి ఇవి పలుక వద్దు 
.....
అలక మానవే చిలకామొ లకల గిలక 
తిరిగి చూడవే మొలకా థలుకుల గిలక 
నడక నాపవే అతివా సునయన మొలక 
మరుగు చేతునీ కినుకా విమాన మొలక 
......
కోపమెందుకేే కదలిక లోన నీవు 
 రోషమెందుకే కాంతాళమెందుకేను 
ఏమి జేస్తినే విసుకేల ఏలనీవు 
యాడ బోతినే నీతోడు వుంటినేను
....
ఏమి జేసినా మనసున ఏల నీవు 
ఊరకుంటినే నీకాపుగాస్తినాను                                           
చీర కట్టులూ కొత్తగా చేర వేయు 
కట్టుబాటులూ రోతైన వంటివేను
....
మోడ రన్నుగా కదులుతూ మోహ పడియు 
టెక్కునిక్కులా వుంటాను అంటివేను 
వంతపాడితీ విధిగాను విజయమగుట 
అమ్మనాన్నలా వొప్పించి జెప్పితేను 
----
వేరుకాపురం ఇదియేను వినయ మౌను 
పెట్టమంటివే జాయింటు ఫామిలీను 
కూడదంటినే చేరువలో న యుండె 
తిండిమానగా బాధంత మింగితీను
---
నీకుతోడుగా ఉండినా నిన్ను మార్చ 
వేరుకాపురం భారంగ బెడ్తినేను
పిల్లజల్లలూ పడిననే పేరు కోరె 
వద్దనంటివే దూరంగ బెడ్తివేను 
---
అందచందమూ నీసొత్తు ఆట ఏల 
తగ్గుతుందనీ కోరంగ వుంటినేను
ఇంకయేమిటే అనలేను ఇప్పుడిపుడు 
కోర్కెలేమిటో న్యాయంగ జెప్పవేను 
---
చెప్పినంతనే ఇంకేమి తీసుకొనుము 
చేయుచుంటినే దాస్యంబు చేయగాను 
ప్రాయమంతయూ తరిగెను ప్రాభవమ్ము 
వీడిపోవగాను త్యాగంబు చేసితీను
---
ప్రాణమీయగా బ్రతికెద పలుక నీది 
వుండిపోతినేను ఇంకేమి తీసుకోను
గాన మిదియేను కథలుగా గమ్య మగుట
వేళ ఏదయినా మది విజయమౌను
మీ విధేయుడు మల్లాప్రగడ
                    *****
0
సీస పద్యం
దాచాను కడలిలో దాహన్ని నిత్యమూ
ఓ మేఘమును దాచ ఓర్పు జూపి
చాల నమ్మితి విధి జాతర వైనమూ
నిందించ లేనులే దీప వెలుగు
నేర్పలేను మనసు నీడను చేరుమూ
అద్దలేను చదువు ఆద మరచు
మరువలేను మనసు మువ్వల శబ్దమూ 
వాసనలు తెలుపె వాకిటగుట

తే. జ్ఞాపకాన్ని తెలిపి జ్ఞానిగాను మార్చు
హృదయవాంచ తెలిపియు సహాయ మలుపు
కలలు తీర్చమని అలక కాల మిదియు
మృధుమధుర వాక్కు మోముయు మనుగడ కళ
*****
. నిజమా? .. అబద్ధమేరా ?

ఎందరో ఉన్నరా - అందులో నేనొక్కడ్ని రా 
ఎదలో ఉంటె చాలురా - ఏమీలేని బ్రతుకేరా 

ఇదే మన భరత భూమిరా  
భాగ్య సీమరా - వెలుగు పంచురా   
మేలు చేయురా - జాతి వుందిరా 
కరుణ శక్తి రా - కామ్య భుక్తి రా   
---
ఎందుకు తొందరా - ఆశలు వద్దురా 
కళలు చూడరా  - కష్టమే నీదిరా   
ముప్పు తెచ్చురా - అప్పు తేకరా  
దేశమే నీదిరా  - దేహమే నీదిరా  
---
కళ నీ దేరా  - కధ మనదేరా  
బ్రతుకు మార్గమేరా - బంధ మదేరా   
కలత వద్దురా - కరుణయే చూపరా  
మనసు ఉంచరా  - మనుగడ చేయరా  
---
చెలిని చూడరా - చెలిమి చేయరా   
అంద మేనురా  -  ఆశలు వద్దురా   
పెళ్ళికి ఒప్పరా - పెనుభూతమనకురా  
హృదయ మివ్వరా -  హాయిని పొందురా  
---
పండు చూడరా - పంచుకొని పండరా     
కావ్య పాందురా - కాల మంతరా   
కధలు హద్దురా  - కాలనిర్ణయమురా 
నీతి ఉందిరా - నిజము మహిళ శక్తిరా 
---
ఎందరో ఉన్నరా - అందులో నేనొక్కడ్ని రా 
ఎదలో ఉంటె చాలురా - ఏమీలేని బ్రతుకేరా 
**

నేటి కావిత : *నాపేరు నేనంటేనేనే .. 

నేనే అనంత జీవన మార్గాన్ని
నేనే అమృత వర్ష బాండాగారాన్ని
నేనే ఆస్రితులకు సహాకారాన్ని
నేనే అందరికి  అందించే అమృత జలాన్ని
---
నేనే బంధాలకు ఆధారాన్ని
నేనే నేనొక ప్రణయ ప్రభందాన్ని
నేనే వసంతంతో వికసించేవాన్ని
నేనే అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని
---
నేనే సరస సల్లాప సారాగాన్ని
నేనే ఆకట్టు కుంటున్న అను రాగాన్ని
నేనే అర విరిసిన అందాన్ని
నేనే అందరికి  ఆనందాన్ని అందించే గుణాన్ని
---
నేనే ప్రకృతిలో వైవిధ్యాన్ని
నేనే వైవిద్యంలో ఏకత్వాన్ని
నేనే సుందర స్వప్నాన్ని
నేనే అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని
---
నేనే దైవ దత్తమైన వరాన్ని
నేనే లలిత సంగీత స్వరాన్ని
నేనే వెదజల్లే చల్లని సమీరాన్ని
నేనే పంచ భూతాలకు సహకారాన్ని
---
నేనే మధుర భావాల్లో సత్యాన్ని
నేనే కవి హృదయంలో సాహిత్యాన్ని
నేనే స్మృతి సుమధర పరిమళాన్ని
నేనే  కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని
---
నేనే నొక ప్రేమ తత్వాన్ని
నేనే తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని
నేనే కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని
నేనే భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని
---
నేనే ఇంతకూ నేనెవరో తెలిసిందా
అధరాలలో ఉన్న లాలాజలాన్ని
కాదు నేనే జిహ్వాచాపాన్ని
కాదు కాదు నేనే  అమృత జలాన్ని
---
కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి నేనే  
--((*))--
నీటి ఉషోదయ పద్యాలు........

తే. కలువ పూవు లైన మనసు మాకు లయిన 
తమకు తాము తెలుపగల తప్పు లయిన
ఆలు మగల జంట కలయు ఒప్పు లయిన
సహన భయము తోడుయు నీడ సమయ మయిన
---
తే. తండ్రి గర్జనలో కళ తల్లి పలుకు
కొడుకు ఉచ్చస్వర పలుకు కొంప లదర
తల్లి మాట విన గలిగియు తప్పు కోక
ప్రియుడు ప్రియురాలి పలుకునే పరిధి యనుచు 
---
తే. చర్య ప్రతిచర్య సహజమే చతురత కళ
మంచి చెడుల కళయికయే మనుగడ కళ
వారు వీరు యనక కదులు కాలము కళ
పాలు నీళ్ల జీవితముయే నిజమగు కల 
---
తే. తనువు తెలియక అప్పగించ గలిగితిని
తృణము నేరముచేసియు తిరగ గలిగి
నీదు నేరము క్షమించ లేనిదగుట
గౌరవం లేని మనిషిని గౌరవించ
హృదయమా నీకు దండను హారతిగను
---
తే. ధ్వని తరంగాలు ద్రవములో ఎక్కువను చు
గాలి లో తేలి తక్కువ  కదలు కళలు 
గలుగు ప్రియురాలు పలుకులు గాలి వలెను
ప్రకృతి ద్రవము భక్తి ని పెంచు ప్రధమ కళలు
---
సీస పద్యమాల
స్వచ్ఛత లేకయే  స్నేహాల వెంటనే 
విలువ ఇవ్వని నిధి జీవి బాధ
బాధ్యతయే లేని బాంధవ్య వెంటనే 
ఆ అబద్ధాలుగా  బంధ వేట 
నువ్వు ఎంత అనిన నీమాట వినయము 
పరిగెత్తినా సహన ఫలము నీది
ఒంటికి ఆయాస ఓర్పు కలిగి యుండి 
మనసు ఆవేదనే మిగులు తుంది
మనసు చంపు కొనియే మమత అలాంటిదే 
బంధాల వెంటనే నడిచె యుండె 
మౌనంగ దూరమే మోక్షమ్ము పొందుటే 
ఉండటమే మంచి ఊహ యదియు 
---
కాల మార్పు... ఇదేనా 

అవని అనురాగానికి మురిసి ఆమని ముందే వచ్చేసిందా?
మోహిని పిలుపే రాగము వలపు ఊయల చిందే నచ్చేసిందా?

కామిని కలలో మౌనము మలుపు ఆశల పొందే గుచ్చేసిందా?
మాయని మనసే మాధురి పిలిపు కోయల వల్లే పిల్చేసిందా?

విచ్చిన కళ్ళతో విస్తుపోయి విరిబాలలు జగాన్ని చూస్తున్నదా?
మెచ్చిన మోముతో సంబరమ్ము సరిజేయుట సుఖాన్ని ఇస్తున్నదా?

నింగి ...నేలతో స్నేహం కోరి చుక్కలు పువ్వులుగా దోసిట్లో పోసిందా?
పాలు నీళ్లతో చెలిమి చేసి పొంగులు చూపెట్టి దోసిట్లో చిక్కిందా?

కొండలమీంచి చల్లగాలి చల్లని కబురు తెస్తోందా?
మల్లెలమాల పిల్లగాలి మెల్లని కధలు చెప్తుందా?

జలపాతాల సంగీతం లోయల్లో ప్రతిధ్వనిస్తోందా?
అలుపే లేని కాలమ్మే  మాయల్లో సమ ధ్వనిస్తుందా?

మొగ్గతొడిగిన తీగ తల్లికి సీమంతం చేసి హిమబిందువులు అక్షింతలుగా జారుతున్నదా?
కాలజగతిన కమ్ము కున్నవి శాంతమే కోరే సుఖభిందువులు శ్వేత బిందువులుగా జారుటున్నదా?

కలలను మోసుకుని రమ్మని కలతలు వదిలేయమనీ కమ్మని  కబురు చేసిందా?
జ్యోతికలశం రూపును కడుపున దాచిన ఏరు సంతోషం తో పొంగిపోతోందా?
తూరుపు తలుపు తెరువగనే ప్రశ్నలన్నిటికీ  ఒకటే జవాబు తెలియపరుస్తుందా?
పెదవంచుపై మెరిసే చిరునవ్వు అప్రయత్నంగా జోడించే చేతులు కలిపేస్తుందా?
****
పద్మనేత్రాలతో వర్ధిల్లావమ్మా  
అమ్మా ప్రణామాలర్పిస్తున్నా నమ్మా 
ఏకాక్షరీ రూపంతో క్షమించమ్మా    
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 44

మాతృకా పరమేశ్వరిని వమ్మా 
ఇంతే నిర్ణయం లేని దేవి వమ్మా 
నిశ్చయ రూపం లేని దేవి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 45

భక్తిభావంతో ప్రార్ధించి తి మమ్మా 
ఏకాగ్ర చిత్తం కల్పించితి వమ్మా 
ఆశ లేని భక్తికి లొంగవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 46

ఏకైక చైతన్య దేవత వమ్మా 
ఏకైక రస స్వరూపిణి వమ్మా 
స్వశక్తి కల్పించే దేవత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 47

ఏకాంతంగా పూజించే దేవీ వమ్మా 
వర్ధిల్లు తేజస్సు పంచే దేవీ వమ్మా
బ్రహ్మాండానికి  అధీశ్వరీ  వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 48

ధైర్య సాహస శక్తేశ్వరీ  వమ్మా 
సార్వభౌమ పరమేశ్వరీ వమ్మా  
ఈ కారం మాతకు వందనమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 49

యజమాని స్వరూపిణి వమ్మా 
ఈప్సితార్ధ ప్రదాయిణి వమ్మా 
ఈశ్వ రత్వ అభేదిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 50

పంచముఖేశ్వర ఈశ్వరి వమ్మా 
అష్టసిద్ధి పరమేశ్వరి వమ్మా 
దర్సనంతో సృజించే శక్తివమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 51

ఈశ్వరీ వల్లభా ఈశ్వరివమ్మా  
స్తుతింప తగిన దేవత వమ్మా 
ఈశ్వర ఆర్ధనారీశ్వర వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 52

కామేశ్వర అధి దేవత వమ్మా 
తాండవ సాక్షి స్వరూపిణి వమ్మా 
శివాంక నిలయ కామాక్షివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 53

ఈతిబాధ మాపే కారుణ్య వమ్మా 
ఈహ కల్గనీయని దేవి వమ్మా 
సర్వ వ్యాపకత్వ ఈశ్వరీ వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 54

మందస్మితతో విలసిల్లే అమ్మా    
పంచాక్షరీ లకార శక్తి వమ్మా 
లోకాశ్చర్యకర శక్తిని వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 55
0
శిద్ది...సందిగ్ధం 

విషయ విన్యాస ముగను విశ్వవిపంచి   
వినయ విశదీకరణము వెలుగువేళ ఇది 
మనసు రసగంగ పొంగి మాధుర్య మేల
మరుగున పడిన విధియు జ్ఞాపకాల మది 
---
గడచిపోయింది కాల గమన నిర్దయగ 
అవసరాలన్ని  కాల వాకిట ఉంచి 
వెలుగులు విభవం మరచి విజయమే యనెడి 
ధూళి రేణువు రిక్కలు దూరమై బ్రతుకు
---
శశివదనమేను లీల సమయమ్ము కళలు 
 కప్పుకున్నది మనసు కాలాన్ని బట్టి 
అంతరంగము ధీర్ఘ అంతరం కలిగె 
ఊహల కళ ఉత్తుంగ ఊయల వనము
---
రసమధురిమల స్వరము రమ్యత లేదు  
నిత్య హృదయమే కదలి విహరించెవేళ 
చిత్త చలిమంచు యదియు చెలిఅంచు చేర 
స్వప్న దొంతర కథలు సాగించు వెతలు
---
మెలకువ ప్రభాత మ్ము మోక్షమే యగుట 
 నిగ్రహం ఉంచి గుర్తు గీతభావమది 
గడచు వర్తమాన మది  ఎగుడు దిగుడులె 
భవిత ఏమిటో ఏమి భజనగా శిద్ధి 
***
 నేటి శీర్షిక - ప్రేమే
ఆర్కె మల్లాప్రగడ
ప్రేమకు ప్రేమే సాక్షి సాక్షి కి ప్రేమే శిక్షద్రోహము ప్రేమే చేయుద్వేషము ప్రేమే మార్పు
హేతువు ప్రేమే తోడుసేతువు ప్రేమే నీడకాలము ప్రేమే మార్చుజాతికి ప్రేమే తోడు
మార్పుకు ప్రేమే నేర్పునేర్పు కు ప్రేమే ఓర్పుమార్పుకు ప్రేమే తీర్పుతీర్పుకు ప్రేమే సాక్షి
సాక్షి కి ప్రేమే నీతినీతి కి ప్రేమే జాతిజాతి కి ప్రేమే ప్రీతిప్రీతి కి ప్రేమే ఖ్యాతి
నిర్లక్షం గా ఉన్నఆక్రమించాలనుకున్నాకాల్చి వేసేది ప్రేమేతప్పటడుగు వేస్తున్నా
తిప్పి అడుగేస్తున్నాక్ష మించలేదు ప్రేమగమనానికి అడ్డుగా ఉన్నాప్రతిభకు అడ్డు పడుతున్నా
పరిష్కరించేది ప్రేమనిచ్చెన పైకి పైకి ఎక్కాలన్నాచీపురు లా మారా లన్నాచేటు,జల్లెడ లా ఉండాలన్నా
ఇద్దరి లో ఉండాలి ఒకే ప్రేమ--(())--
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి