30, సెప్టెంబర్ 2021, గురువారం

chandasssu

 


యథా సునిపుణః సమ్యక్ పరదోషేక్షణే రతఃl

తథా చేద్విశ్వకర్తారం కో న ముచ్యేత బంధానాత్ll।---- 1


"ఇతరుల దోషాలనెంచుటలో చూపించే సహజచాకచక్యము, తెలివిని తమ దోషములను గుర్తించుటలో వినియోగించినచో యెవడు సారబంధనాలనుండి విముక్తి చెందడు?

“అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!! --- 2
ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..


నేటి సమస్యా పూరకం --- ప్రాంజలి ప్రభ 


మనముగ కల్సి కోరుట సమాన మనస్సు యశస్సు సౌఖ్యముల్ 

వినయము గాను పల్కియు నవాభ్యు దయాన నె శాంతి కల్గుటన్ 

ఋణమును తీర్చిభాగ్యముయె రాగము యుక్తి యుశక్తి  నిచ్చుయౌ

వనమున సంతతిన్,బడయువానికి గల్గును సౌఖ్యముల్ గడున్

"ఉత్పలమాల ( పంచపాది ) --
----
సామజసూక్తపూజ్యుఁడగుశ్యామలకాంతతనుండువిష్ణుఁడే

భామనుఁదమ్ములున్ విమలభావఁపు ప్రేముడి నిచ్చువాఁడగున్

ప్రేమఁపుసౌహృదమ్మునగురీతినిఁగొల్చినవాఁడునౌ ధరన్

సామఁపుమార్గయానమునుసల్పుచు ధర్మముఁగోరునాతఁడే

రాముఁడు , కుంతినందనుఁడు రాధకుమారుఁడు భీష్ముఁడేగదా !!! "
----------------------------------------
(ఇందులో చివరి పాదమే..సమస్య )
----------------------------------------

భ-గణ కందము

==

కుఱుచ పాదములో మూడు, నిడుద పాదములో మూడు భగణములను ఉంచి కంద పద్యమును వ్రాయ వీలగును. సరి పాదముల చివరి గణము, నల/జ గణము భ-గణము కాజాలదు. క్రింద నా ఉదాహరణములు - 

==

ఛందములందున నిష్టము 

కందమె స్కంధునికిఁ గాన - స్కంధకమయ్యెన్ 

వందన మిత్తును వానికి 

నందముగా నిపుడు కంద - మందునఁ గృపకై 

==

తారకుఁ జంపిన వాని, కు-

మారుని, సేనలకుఁ బతిని, - మారుని యరికిన్ 

గూరిమి పుత్రుని, స్కంధుని, 

ధీరుని, షణ్ముఖుని, నమల - దీక్షితు గొలుతున్ 

==

ఆఱు మొగమ్ముల వానిని, 

హేరుకు సోదరుని, త్రిజగ-దీశ్వర తనయున్ 

భారము దూరము చేసెడు 

కారణ దైవమును గొలుతుఁ - గారుణమునకై 

==


భ-గణ కందము

==

కుఱుచ పాదములో మూడు, నిడుద పాదములో మూడు భగణములను ఉంచి కంద పద్యమును వ్రాయ వీలగును. సరి పాదముల చివరి గణము, నల/జ గణము భ-గణము కాజాలదు. క్రింద నా ఉదాహరణములు - 


రాముడు సోముడు దేవుడు 

భీముడు బాధ్యత కలిగుండి -- భీకర మగుటన్ 

కాముడు జీవిత ముఖ్యడు 

క్షేమము కోరియు కొలిచేను --   కామ్యత కలుగున్ 


గంధపు పూతలు పూసియు 

సుందర రూపుని కొలిచెద --- సోఖ్యము కొరకున్ 

వందన మిత్తుని వానికి 

కందము చెప్పెద మనసాయె --- మందమురళికిన్ 

 

చీటికి మాటికి చేరితి  

నీటిన ముంచిన నయమమే -- నమ్మియు నళీగెన్

నేటికీ తీరిక లేకయు 

కూటికి గుడ్డకు బతికితే  --- కూలిపో యితినన్    


దత్తపది---- నాధారముగా నేను వ్రాసిన పద్యాలు ---- ప్రాంజలి ప్రభ నచ్చినవి నచ్చనివి తెల్పి షేర్ చెయ్యగలరు

,

నీ, నా, నే, నో


సీస పద్యము 


నీ మోము నీ గాము నీ మోవి నీ తావి 

ని సౌరు ని తీరు నీకు తగును 

నా గుట్టు నా బెట్టు నా పాట నా పట్టు 

నా చెల్మి నా తాల్మి నాకు దగును 

నీ చనుల్ నీ కనుల్నీకౌను నీ మేను 

నీ తొడ ల్నీనడల్ నీకు దగును 

నా తల్కు నావెల్గు నా నీటు నా మోటు 

నాహోయల్ నాలయల్ నాకు దగును    

  

తేటగీతి 


నేను తగినట్టు పురుషుండు నేను నీకు 

మంచి తో నుండి నోడితి మేను  నీకు 

దగిన వాడుగా నేనుకా దలచె చాలు 

వలచి వేడుక చాలును వద్దు అనకు 


((()))

     

పంచ రవళి 

         

నీదు భక్తి నీకు రాత్రి పగలు  

నాణ్యమైన నటన యుక్తి ఘనము 

నేత సేవ నేయి కరుగు సెగలు 

నోటి మాట నయన చూపు ఘనము 

భవ్య మైన భరత దేశ చరిత


((()))


 కందపద్యము 


నీదు మొగము చెమట లొత్తి 

నాదు కళలను కవ్వింపు లేని నటన నాడిగా 

కాదు లేదను నేతల పలుకు  

చేదును జనులలొ సృష్టించెదననగా


చంద్రిక 


నీడ నిన్నుగాను నీదు గుర్తుగాను తెల్పుచుండు చుండెఁ 

నాడి పట్టు చూడు నాలొ రోగమంత తెలియ గల్గు చుండెఁ 

నేడు అన్నమాట నేత నేర్పు మాట నీటి లోన తేలు 

ఆడినోడువోడు  ఆట మరు చున్న ఆశ లేని వాడు

(())

 ఉత్పలమాల 


నీకును నీడయే నిజము నిర్ణయ మవ్వుట కార్యసాధనమ్ 

నాకును బత్కులో నిజము నాణ్యత తెల్పుట ధర్మసాధనమ్ 

నేకము అవ్వుటే నిజము నేర్పుయు కల్గుట యుక్తి సాధనమ్ 

సోకము కల్గుటే నిజము సేవల పల్కులు నోట్ల సాధనమ్

(()))


 తేటగీతి 

 

నీదు భక్తియే ప్రేమకు నీడ వెలుగు

నాలొ శక్తికి మూలము నటన వెలుగు 

నేత పలుకులు ఎప్పుడూ  నమ్మ వెలుగు  

నోటి మాటలు గాలిలో నవ్వు వెలుగు

(*())

 నేటి నాని 


గురిగింజ కు,   

రాజకీయం కు సిగ్గుయే లేదు  

మిడిసిపడు

(())

 ఆటవెలది 

నాది నాదనుటయు నటనల బతుకు యే  

నీవు నేను నటన బతుకు లేలు 

నోటి మాట ఎపుడు నటన వలదు 

నేను అన్న మాట మీద ఉండె

(())

 శార్దూలం 


క్షేమమ్మే విజయం పరంగ వినయం క్షామమ్ము లేకుండుటన్  

ప్రేమమ్మే ప్రణయం ప్రమాద విదితం ప్రాధాన్య సాహిత్యమే 

కామమ్మే మనలో సుఖాన్ని సలిపే కల్లోల జీవత్వమే 

శ్రీమాతే  మనలోన మనసై  శ్రీ రక్ష గానుండుటన్

((()))

"శార్దూలః।।

----

ఆర్యాంబాం హరిరాజవాహనయుతాం నీహారరూపాత్మజాం ,

గౌర్యాంబాం కరుణార్ద్రవీక్షణశుభాం శ్రీకామ్యసంధాయినీమ్ !

స్థైర్యాదిప్రవిభూతిదాం దనుజహంత్రీం శక్తిం మహానాయికీం ( / మహానాయకీం ) ,

కార్యాకార్యవిచక్షణాంచితకళాం భోగప్రదాంసంస్తువే !!! 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి