22, సెప్టెంబర్ 2021, బుధవారం

పతంజలి యోగ సూత్రములు



















మానసమునందుఁగల - యాననము నీదె కద 
రా ననిటఁ జూడఁగను - రాణ నిపుడు 
నీనగవు కన్నులకుఁ - దేనెవలెఁ దీపి గద 
వానవలె నిచ్చు సుగ - మూన నెపుడు 
మానికము వద్దు పలు - కానుకలు వద్దు నీ 
గానమది చాలు నను-వైన  సిరిగ 
స్వానములు రసమయము - తానములు ధ్వనిమయము 
వేణువిడు క్రొత్త నుడు - లౌను నెఱిగ   
== 
నానభములో మబ్బు - లానగముపైన నుండె 
సూనములు వని నిండె - సూనములు మదిని నిండె 
గానమునఁగల యాశ - ప్రాణమున నాడు శ్వాస 
యీనాదు మాటలే - యానీదు మురళి బాస 

ఉత్పలమాల

ఇంపుగ సుందరాంగివియు ఈప్సిత బుధ్ధి ని చూపు టేలయున్
సొంపు లు ఓంపులే లలన సొమ్ము ను కోరు ట చిత్త శాంతిగన్
ముంపు ను ఆపియే వినయ మంతయు చూపుట ఎందు వల్లనన్
కంపును పక్కలో మనసు కాలము తీర్పుగ తప్ప దవ్వుటన్

శార్దూలం 
ఇంపున్ గన్ ఇలలో మనస్సు మయమై ఐశ్వర్య భావమ్ముగన్
సొంపున్ గన్ సమతా మనోభవము గా సౌమ్యమ్ము సౌందర్యమున్
ముంపున్ గన్ మనలో గణాతి గుణమే మాంధవ్య మాత్సర్యమున్
కంపున్ గన్ సహనం సతీ మతి గనే కార్యార్ధ వేదింపుగన్



20-10-2021 


 తారక వృత్తము...స న. జ జ న గ గ..11

పలుకే సహజ సుఖాల పిపాస మనుసు అయ్యే
పిలుపే వినయ విధేయత పేరు కళలు గయ్యే
చిలికే వయసు సుఖాలయ చింత కధలు తెల్పే
నలిగే తనువు విశాల వినే మలుపులు మెర్పే

యోగ్యతకు వస్త్ర ప్రధానం యతిగ నుండు
కడలి పీతాంబరుడు విష్ణు కూతు రిచ్చె
కడలి యేదిగంబరునకు కూర్చె విషము
కడలి ఖనిజాల రత్నము కలిగి యుండె

నీలి మబ్బుల మేఘము
జల్లు జల్లుగ కరిగి జారె కళల పుడమిపై
మేలి ముసుగు రవ్వల 
వెలుగే పురుడు పుణ్యాల ఫలితాలు గా

తోటకం

వీనుల భాగ్యము.. విందుగ నుండున్
కన్నుల చూపులు....  కామిత మందున్
జన్మము వల్లనె......జాతిగ నుండున్
మన్నన పొందుట... మానస మందున్
(()))
 

నానీల

భారత జాతి సంస్కారం
అందరూ పాటించడమే
శ్రేయస్కరం
((()))

 ఉత్పలమాల (పంచపాది)

ప్రేరణ భక్తి తో మనసు పేదది చింద్రెడి పేద బంధముల్
జీర్ణము శక్తి తో కళలు జిందెడి మర్పుల వృద్ధి తత్వ ముల్
భారతి భాగ్యమే ప్రధమ బంధము భక్తి గ శీలభావనన్
మారని యుక్తి యే మనిషి మర్మము తెల్పుటె తత్వ భావమున్
సారెకు సారెకున్ మదికి శాంతి నొసంగు మనోజ్ఞ కున్ నతుల్

"ఉత్పలమాల ( పంచపాది ) --
----
కారణజన్మురాలనఁగ కాంతనుఁజెప్పుటధాత్రిరూపమౌ
శారదమాతయేయరయ సంతుకు విద్యలఁగూర్చురీతిలో
నీరదకాంతలక్ష్మియనిరంతర భాగ్యసుశీలభావనన్
వారమువారమున్ కుమతివర్తనుఁద్రుంచెడి దుర్గయాకృతౌ
సారెకు సారెకున్ మదికి శాంతినొసంగుమనోజ్ఞకున్ నతుల్ !!! "

శార్దూలము 
ధర్మంబున్ దయకాదగున్ తరుణమున్ సద్విని యోగమ్ముగన్
కార్యమ్ముల్ కరుణా కటాక్ష విధియే కారుణ్య సద్భావముల్
కర్మంబుల్ తలపుల్ సుధీర్ఘ కళలే కర్తవ్య రాహిత్యముల్
ధర్మాధర్మ విశేష మే సుమధురం ధర్మాత్మ  మార్గంబుగన్

(((())))

నీవటు తెల్పుటే మనసు నాట్యము చేయుట సంభవమ్ముగన్
కావలి ఉండుటే వయసు కాలము ఖర్చుగ మారుటే యగున్
ఆవిరి పెర్గుటే అటుఇటా అని తిర్గుట కల్గుటే యగున్
నావల బత్కులా కదలి నాటిన చెట్టు ల మధ్య నవ్వుగన్

ఉత్పలమాల ( పంచపాది ) --
----
మానితభక్తితోఁగొలుచు మౌనమె పాఠ్యముగాతలంతురే
నీనిజశిష్యభక్తులయ।।నీమఁపుసేవలుచేయుచుండుచున్
పూనికతోడగౌరియును పూజలొనర్చుచు భర్తగ పొందెనయ్యరో
నేనిను వేడుకొందునిల నీమమునిష్టలతోడవిద్యలన్
శ్రీనిధరించివిశ్వముల సేమమునిచ్చిన నీకుదండముల్ !!!

భవానీజానిం మత్తకరివసనం ఫాలనయనం ,
పశూనామీశం స్వచ్ఛహృదయవిభావ్యం శుభకరమ్ !
మహావిష్ణోరంతఃకరణకలితం శ్రీగళధరం ,
జగత్స్తుత్యంసూర్యేందునయనధరం నౌమిశివమహమ్ !!! "
---------
 పంచ రవళి

పుట్టు చీర పట్టి పీట పెట్టె
పట్టె పడచు కాటు పెట్టె నెట్టె
పట్టు విడిచి పోటు పొడ్చి తిట్టె
మెట్టు ఎక్కి మాటు పెట్టి కొట్టె
అట్టు లాగ అతికి పిక్క బట్టె

మట్టి నమ్మె మనిషి మధన బతుకు
నీటి కొరకు నిజము తెల్పి పలుకు
గట్టు మీద కాపు గాయు థలుకు
చెట్టు నీడ చల్లనేల బెరుకు
తట్టు కోక కళ్ళకు కల గరుకు

సీస పద్యము

చరితము తెల్పెద।।। కరుణను జూపుము
విరినారు పోషించి।।।।నీరు లేదు
నూతిని తవ్వించి।।। నేతి నీరు కొరకు 
యాతన కల్గెను।।।।।। యెత్తు లేదు
వానలు వెల్లువై।।।।। చెనును ముంచి నదియును
ఎవరికి చెప్పెద।।। ఏమి ఫలము
ఆశలు మారెను।। పాశము వేదన
బతుకు తెరువు గాను।। చితికి పోయె

దైవ మాయయు ఇదియే ను।। సేవ గాను
కాల వైపరీత్యాలు గా।।।।బేల గాను
మాట అనునది కరువైన।।।వేటగాను
సేద తీర్చుము తప్పదు।।। వేదమాత

--((/)--
అలుసు చూపక కలల ఆశను తెలిపి
గొలుసు కట్టియు మనసు గోలను తెలిపి
పులుసు లోముక్క లాగ పిసికియు తెలిపి
తెలుసు నీ ఆట మాట తప్పులు తెలిపె
((()))

చెంపకమాల 
తగువు ను మర్చి తేలిక విధాన  మనస్సు సుఖమ్ము  తెల్పగా
మగతనమే తపస్సుగ సమాన యసస్సు సుఖాలు తెల్పగా
మగువ సుఖాలు కోరియు విమాన వినోద మహంతి తెల్పగా
మగనికి చీరకట్టె నొక మానిని మిక్కిలి సంతసించు చున్

 దత్తపది.....

అప్పుడు, అక్కడ, ఎక్కడ, ఏమిటి
((()))

అప్పుడు అనిన మాటల్లొ ఆర్తి యుంది
అక్కడ జరిగినది కొంత అలక ముప్పు
ఎక్కడ అనినా అక్కడే ఎరుక పరుచు
ఏమి టి అనిన ఫలములు ఎంత వరకు

 ఆటవెలది

అప్పుడప్పుడే ను ఆత్రము దేనికి
అక్కడకు ను దేని కంత దురద
ఎక్కడన్న బతుకు యదలోన నిద్రించు
ఏమిటేమిటి ఇది ఆపలేవ
((()))

మత్తకోకిల

ఏమిటన్నను చెప్పలేనులె ఏదిజర్గిన కష్టమే
అక్కడేఇక బత్కుసాగును ఆశదేనికి నష్టమే
ఎక్కడైనను తెల్పవచ్చును ఎన్ని మాటలు ఇష్టమై
ఏమిటేమిటి నీవు అన్నది ఏదొమాయయె తృప్తి గా

 సోయగాలు

అప్పుడు తెల్పావు నిజము గా..అప్పు చేసి చూడు
అక్కడ మాటలు ఇక్కడ.. అక్కరకు ను రావె
ఎక్కడ ప్రశ్న లు అక్కడే... ఎక్కు పెట్టారు చుండు
ఏమిటి అన్నాను తెలియదు.. కామితార్ధమందు

చంద్రిక

ఎక్కడ ఉన్ననూ ఏమి అనలేనులె యదలొ మంటలు న్న
మక్కువ అప్పుడే మదిలొ మాయ గాను ఇప్పుడు ఫలమేమి
అక్కడ సౌఖ్యము అక్కడె వదిలాను మనసు చెదిరి వుంది
చక్కనిచుక్కవే జపము చేసితివే ఏమి అనలేదులె
((())))

 తోటక వృత్తము

మనసైనదె అప్పుడు అక్కడలే 
వయసంతను నెప్పులె అప్పుడులే
సొగసంతయు ఖర్చుగ చిక్కెనులే
ఇది ఏమిటి ఎక్కడ చూసితివే

 ఉత్పలమాల

ఏమిటి అన్ననూ ఎదలొ ఏదియు మార్పులు లేక ఉండుటన్
కామిత బుధ్ధి యే మనసు కమ్మిన గొప్పకు పోక ఉండుటన్
స్వామిగ మంచిగా బతుకు సాగుట సాధ్యము కాక ఉండుటన్
మామిడి పూతగా జరిగి మాయను కమ్మియు మోహమవ్వుటన్

శార్దూలము

నాలోజూచితివా ఎదైన మరకా నమ్మించి మోసమ్ముయే
నీలోకోపముయే యెమైన కధగా నాట్యమ్ము సాగేనుయే
నాలో తప్పులు గా మనస్సు మరిగే నీళ్లళ్లొ కర్గేను లే
నీలో ఒప్పులు గా మనస్సు పెరిగే నిర్మాత నువ్వేనుగా

గజిల్... ఎందుకో

గుండెలోన దాచినావు రహస్యాన్ని ఎందుకో
నిఘానేత్ర ములేదేమి చిత్రంలో ఎందుకో
సూరీడే మండుతున్న చల్లగానె ఎందుకో
కళ్ల ఎరుపు చూపకుండ భయ్యమ్మే ఎందుకో

నిరాశతో నిశ్ప్రహలే వచ్చుట యే ఎందుకో
చీకటిలో వెలుగులు గా బతుకటయే ఎందుకో
సుఖదుఃఖాలు కల్గుటే జీవితంలొ ఎందుకో
కష్టనష్టాలు గా వెలసిల్లుటేను ఎందుకో

ఆరాటం ఆర్భాటం ఆత్రమ్ముయె ఎందుకో
పోరాటం ప్రోద్బలం ప్రోత్సాహం ఎందుకో
గారాబం గందర గోళంగానే ఎందుకో
భారమ్మే బాధ్యత యే బంధమ్మే ఎందుకో

ఆవేదన ఆందోళన అవగాహన ఎందుకో
ఆశతో ను సాధనాలు శోధనాలు ఎందుకో
అనిపిస్తూ అశిస్తూ మలుపు కథలు ఎందుకో
అలకలేల ఆకలేల ఆశ్రమేల ఎందుకో

అప్పుడే గా తెలిపాను మర్చావే ఎందుకో
అక్కడేకదా పోయే అవకాశం ఎందుకో
ఎక్కడ చూసినా నీకళతొ నవ్వే ఎందుకో
ఏమిటి అన్నాను అర్ధంచేసు కో వెందుకో
((()))
 అప్పుడే గా తెలిపాను మర్చావే ఎందుకో
అక్కడేకదా పోయే అవకాశం ఎందుకో
ఎక్కడ చూసినా నీకళతొ నవ్వే ఎందుకో
ఏమిటి అన్నాను అర్ధంచేసు కో వెందుకో

 నానీలు

నిందిస్తే ఫలమేమి 
గొంతు నెప్పి తప్పా
మౌనముంటే చాలని

కలలాయె బత్కు.. కలకాల మేలు...కిలరావ మయ్యె కీర్తి బతుకే
విలలాప సేవ.... వెలలాగ చిందు..వలలాగ జిక్కి వృధ్ధి బతుకే
అలకాయె జీవి... అలనాడు మాట.. అందుకే ది చెప్పి ప్రీతి బతుకే
జలకాలు ఆడి...జిలికేను మేలు .. చలిలాగ వేడు శాంతి బతుకే

దీక్ష ధారిగ ధీనబంధువు దీపవెల్గులు పంచనే
సాక్షి తేజము దైన్య పర్చియు ధైర్య మవ్వుట సత్యమే
శిక్ష రాజ్యము ధర్మమార్గము ధ్యానమవ్వుట సంభవం
కక్ష లేనిది దివ్యమైనది ప్రాణమవ్వుట లక్ష్యమే
(())

రైతుల రాజ్యమా బతుకు రాబడి లేకయె బత్కు గల్గుటన్
రైతులు ఇంకులా కరిగె రాసుకొ లేనిది పాళిళవ్వుటన్
రైతుల రాయితీ ముసుగు రవ్వల రాజ్యపు  వెల్గు లవ్వుటన్
రైతులు లేనిదే మనకు రెక్కలు రావులె తప్పదవ్వుటన్
((()))

"నీసోగ కనులభావాలు
నా మనసును దోచుకొన్నాయి
నా హృదయం తహ - తహలాడుతోంది
నీ తీయని పిలుపుకోసం
ఏనాడు కలలో వచ్చినావో..
ఆనాఁటినుండి నిరీక్షణే
వాసంత శోభాయమాన..
నీరాక కోసరము
వేకువ కల నిజమౌనఁట !!! "
----

 రాగ గీత

తప్పు దిగజార్చు కృషి యె తోడుబాధలు గ
ఉప్పు తగినంత కరిగి ఊత రుచిగల
ముప్పు కలిగించు ఆశ మాటలు కలిగి
నిప్పు లేనిదే మనసు నిద్రలు కరువె

దోచేను మనసు కళలన్ని
కనుల భావాలు తెల్పె లే
తహతహ హృదయ లక్ష్యాన్ని
తెలిపె తియ్యని పల్కు లే

ప్రేమల చరిత తత్త్వాన్ని
కలల వాసంత శోభ లే
మనసు అనురాగ బంధాన్ని
సహజ సంపద వేళ లే

"ఓహో.. డ్రీమ్ -  గర్ల్ - బ్యూటీ ..
ఆహా.. హార్ట్ - టచ్చింగాయితివి..యాహార్యముతో !
యాహూ..భలేగ కలలో
నా హార్టునుకొల్లఁగొట్టినావోయ్..చూడన్ !!! "
----

ప్రియమైన పలుకు పుడమిన
శాంతి నిజముగా ఉండులే
పూజ్య చింతలుగ జగము న
హితము కల్గుచూ నుండు లే

ప్రేమలో ప్రియము పుడమి నే
ధాతృగుణముయు అబ్బులే
మాతృ ప్రేమ మన కుండు నే
పిత్రుసేవ లుమన తీర్పు లే

 ఒక్కసారిగను నిర్ణయం
వెనకకు తిరిగి చూడకు
ముందడుగు గల లక్షణం
సౌఖ్యము పంచియు వెతుకు

సీస పద్యము

నీలి ఆకాశము ...నేత్రపర్వమనగ
నిజము నే చూపును.. నిలకడగను
మబ్బులతో కూడి .... మహిమను చూపుగా
మనసులో మాయతో... మలుపులుగను
గాలి వీస్తోంది లే...... గాత్రమ్ము పులకించె
వానజల్లు కురిసే.... వరద తెచ్చె
అదుపులో లేకయే..ఆత్ర మయ్యె
సహనమే స్నేహమై... సాధ్య మయ్యె

వాన చినుకులు పుడమి వాగులు నింపె
వరద పరుగులే పొలము వాకిల్లు ముంచె
చిత్త శుద్ధి గా తనను చైతన్య పరిచె
లక్ష్య సిద్ధి గా జనులు రక్షణ జరిపె

బిల్వ వృత్తము..భ.భ ..ప్రాస

రాగము తాళము... రమ్యము గుండును
వేగము పంతము ... వద్దులె నిత్యము
రోగము తప్పదు... రంగులు మారును
భోగము పొందుట... భోజన మవ్వును
(((())))


సమ్మోహనాలు

ఒకటి నీవు కోరెను
కోరింది చేసాను
చేసాక తెలిసింది దొంగపని ఈశ్వరా
రెండు కలిస్తే జత
జత కలిసే మేత
మేత ఆవులు గా మారె జనులు ఈశ్వరా
మూడు ముళ్ల వయసే
వయసు మెరుపు మనసే
మనసే మందిరం ఆయే సొగసు ఈశ్వరా
నాల్గు దిక్కులు తిరిగి
తిరిగి సుఖము ను మరిగి
మరిగి సహాయ సహకారామే ఈశ్వరా

ఉత్పలమాల
ఒక్కటి చెప్పితే మనసు ఓర్పుకు బానిస అవ్వుటేయగున్
చక్కని పల్కలే మనసు చిక్కులు తొల్చుట సంభవమ్ముగన్
మక్కవ కల్గుటే మనసు  మూడును రెండు గ సేవపొందుటన్
చుక్కలు చూపియే మనసు చుర్కుగ ఒప్పియు మార్పుచేయుటన్

సీస పద్యము
ఒకటి గా ఉండియు.. ఓర్పు ను చూపియు
ఒకటిగా నేర్పియు... ఒకటి చేసె
రెండు మనసులను..రమ్యపరుచుటయే
రాగ యుక్త జపము ...రమ్య మగుట
మూడు ముళ్లు వేసి.. మక్కువ  శ్రీ పతి
సేవలను చేసె..సహన మహిళ
నల్గురు తో వుండి.. నువ్వులు చూపకే
నటనలు చూపేటి.... నయన తార

తేటగీతి
ఆశు కధలన్ని విస్తరె అలక గాను
మధుర చిత్తము చిత్తరె మనసు గాను
దాక్షి ణాత్యసా హిత్యము దారిగాను
దేశి కవితలు వర్ధిల్లె ధరణి లోన
0
నేటి మనసు పద్యాలు
కందపద్యము 

ధర్మార్ధాలే సృష్టీ
సర్వార్ధాలే మహాత్మ. సద్భావమ్మే
కార్యార్ధాలే తృప్తీ
మర్యాద మ్మే .సుఖాలె.... మాధుర్యయే 

కనివిని ఎరుగని మనసున
కనులు గ మసలిన మమతలు కలలుగ కరిగెన్
కనికరమగుటయు కథలగు
అనుకరణలు అలలగు టయు అలసిన కనులన్

అరమరికలుగను అలలులె
చిరునగవుల పెదవులు కళె చిగురు కలలు గన్
మరి మరి తెలిపిన మగువలొ
పరిపరి విధమున మనసున పరుగులు జరుగున్

శాంతి సుఖమును ఇచ్చియు  సభలు ఏలు
భ్రాంతి తొలగించి చక్కని మమత నిచ్చు
కాంతి పంచియు విశ్రాంతి  కళలు నింపు
వాంతి వచ్చెటట్లు మనసు వలపు పంచు

తాను పుట్టు చోటు తత్వంబు తలపోయ
మేను మచ్చ లాగ మోక్షంబు తలపోయ
మాను అయిన జ్వాల మార్గంబు తలపోయ
నేను అనెటి అహముగాను జీవంబు తలపోయ

మనసు లోన సంకల్పములు మానగవలెర
మనము గానె సంతృప్తి గను నుండగ వలెర
క్షణిక మైన సౌఖ్య మే నిను మార్చగవలెర
తనువు తృప్తి తాప మై నిను కాల్చగ వలెర

మనసు దాను నిలుప మరియు దా బ్రహ్మం బు
ఎంత చెప్ప నలమి కాని బతుకు
వింత శోభ చెంది మనమున ముంచేయు
కాంత కనక కాంతి కావ్య చరిత

ఎవ్వ రెవ్వ రనిన ఏమెరుంగని లీల
నువ్వు నేను అనుట జీవ మాయ
తవ్విన జలములగు తత్వ మంతయు లీల
నవ్వలేని బతుకలోన మాయ

తానెవండని ఎరుగని మానవుండు
తన్ను తాను తెల్సుకొనని తాప సుండు
మన్ను లోన పుట్టి మనసు మాయ చేరు
మిన్ను చేరవలెనని యు మీగడగను

మాన సంబు కలిమి మాధ్యమం బు జరుగు
మీన వేష మగుట వింత మలుపు
నాను సంప దంత నటనగా కరిగే ను
మిన్ను విరిగి పడ్డ మిరప కోరు

తమరు చేసి మేమి తత్త్వం బు గనలేరు
విమల చరిత లలిత మగుట లీల
అమరు డగుట దేవ ఆత్రము గనుటేల
సమర మంత చేయ సమయ వేట

చెలిమి సెలయేరు లాసాగి చరిత మయ్యె
సర్వ సహనము చూపియు సహితు డయ్యె
గాయములు చేయకయె సేవ ఘనుడు అయ్యె
మనసులోన అసూయము మార్చ  గలుగు

ఓటమి మనిషిని చేయును ఒంటరి బ్రతుకు గా
తిరుగు లేని గుణం పాఠ తరుణము జ్నాపకమౌ
ఓర్పు నీవెంట ఉంటేను విజయమ్ము తధ్యమ్మె
ఈర్ష్య చేందక నేర్పుతో యీతగా కదలాలే

ఓప్రియ నా ప్రియ 
హృదయంలో హృదయం కలపవా
చూపుల్లో ప్రేమను చూపలేవా
నీవు నాకొరకు జ్నాపకంతో రాలేవా
నీ కళలన్నీ నాకు చూపలేవా..... ఓ
 కళ్లు కళ్లు కలిసాయన్నావు 
ఒళ్ళు వళ్ళు కలవిలన్నావు
అంతుచిక్కని కథ అన్నావు
అర్ధం కోస మైన వస్తానన్నావు....ఓ
0 Com


సమ్మోహనాలు

జాతి గౌరవం తో  గౌరవం చెలిమి తో
చెలిమి బలిమి కలిమి ఏకమ్ముయె ఈశ్వరా

రీతి ఏ ధై న సరె ఏది చెప్పినా సరె
చెప్పు విధానము మనసు దోచే ఈశ్వరా

మూతి చిన్నది యైన చిన్న పెద్ద కథైన
కథలు మనస్సును బట్టే నోరు  ఈశ్వరా

కోతి గంతులు వద్దు వద్దు మాటలు వద్దు
వద్దు అనక హద్దలో వుంటా ఈశ్వరా

((()))

సోయగాలు

జాతి కి వెలుగుల మనసులు... ప్రీతి కలుగ జేయు
రీతి మారిన కథ భ్రాంతి యే...నీతి తెల్ప లేక
మూతికి మద్దుల వర్షమే... నాతి కొరకు చెలిమి
కోతి బుధ్ధులని అనకు నీవు... ఖ్యాతి పెంచు మనిషి
((())))
నేటి పద్యాలు

4 ఇంద్ర 1 చంద్ర, 4యతి

విరహమే ప్రేమలుగ మరింత వికసించి విప్పారెను
విరజాజి విరిసింది అందాల విపులగా విప్పారెను
మరు మల్లె మాయలు మాలలు మదిలోన విప్పారెను
చిరుహాస చరితము చిందులు చిరుణామ విప్పారెను

సీసా పద్యము
మానస వీణ యు... మధురము పంచగా
మాధుర్య మంతయు.. మాయ మాయె
మగువగ మమతను ..మానవత్వముగను
మహిమను చూపిన... మాయ మాయె
మాంగల్య విలువను.. మానప్రాణములను 
ముందర నుంచితి... మాయ మాయె
ముదిరిన శక్తిగా. ... ముదమున వీలుగా
ముందర నీడగా... మాయ మాయె

ఆటవెలది
కొంద రుండు రంతె కోరుకున్న ది పోయె
కొంత బాధ కొంత పంత మగును
సౌఖ్య మన్న శాంతి శబ్దము కదిలే ను
కలల మాయ జగతి బతుకు లాయె
(((()))

పంచ రవళి (5 సూర్యగణాలు అంత్య ప్రాస) 
 
మంద బుద్ధి మాను లాగ అగును 
మోహ శక్తి మోస మగుటయగును  
మంచు లాగ మాయ కరగు టగును  
చిందు లాట చిమ్మ చీకటగును     
విద్య యుంటె విమల చరిత మగును
 
మధుర మంత మాయ లాగ కరిగె 
విధిగ తెల్పు వింత ఖర్చు మరిగె 
చెదలు పట్టి చెక్క యంత విరిగె 
కధలు చేరి ఓపి కంత వొరిగె     
అవని యందు అవతకవత జరిగె

అంద మైన ఆట బొమ్మ గాను 
సుంద రమ్మ శుభము చెప్పు టేను 
చెక్క లాట  చెమ్మ చెక్క గాను 
చక్క దనము చెక్కు లెక్క గాను 
మక్కు వైన మాన మాయ ఓను 

నవమల్లిక.. (స..13/24)

మరు మల్లెల మాలలు గా మనసే మమతల్తొ కధే కదిలే తరుణం
చిరు నవ్వల పుష్పములే మన చిత్తము మార్చియు పూర్ణత తల్పముగా
మరు మల్లెల గంధపు వెన్నెల సమ్మతి ముద్దుగ మన్నన వెల్గులుగా
అరుదై మెరుపై సుఖమై మనసై అర్పనే కళలై కధలే

మన భూమిని ఆక్రమ భర్తగనే మనసం పదగా వెలుగే పెరిగే
మన సాయెను నిద్రలొ  తెల్పెనులే మన మాయలుగా బానిస వెలుగే
మన పండుగగా సుఖమే నుహరించు మనో మహిమే కొలువై కరిగే
మన మాట మనో మయమై కళగా మధురం సమయాన్ని సమోన్నతగా

మనసే వయసే సొగసే కలిసే సమతా మమతా కధలే కదిలే 
అనువై తనువై పనిగా సుఖమై అధరం మధురం మృదులం సుఖదాం 
వినయం చరితం చరణం  విమలం సుజలాం సుభదాం విదితం విజయం 
కనులే కమళాలుగ కాంతులుగా కరణా సుమ భావము వెల్లువగా
నేటి పద్యాలు
"భద్ర" కందము: 29 U, 6 I

ప్రాయమ్మ ప్రాధాన్యం 
ధ్యేయమ్మే విద్య వాణి --- ధైర్యమ్మేగా ?
వ్యాయాయమ్మే విశ్వం 
భయ్యమ్ము గ కల్గుట  --- బ్రహ్మా0డంలో 

సంగ్రామాలే జర్గే 
నిగ్రహమ్మే కదిలె - నిర్ధేశ్యంమై 
ఆగమ్యమ్మే చేరే 
మాంగల్యాలే తొలగె -- మంధవ్యమ్మే 
 
"భద్ర" కందము: 29 U, 6 I
==
ఆధారము: ప్రాకృతపైంగలము
==
మాయాసంసారమ్మా? 
ధ్యేయమ్మేమో యెఱుంగఁ - దీరమ్మేదో? 
యీయంభోధిన్ మున్గన్ 
జేయూత నొసంగు నాదు - శ్రీశుండేడో?  
==
యుద్ధ మ్మెవ్వరితో సం- 
సిద్ధమ్మై యెప్పుడుండ - క్షేమమ్మేనా 
బద్ధ మ్మాధర్మమ్మా 
బుద్ధుల్ సెప్పంగ వాఁడు - బుద్ధుండేనా?
==
భద్రేశుండుండంగా 
భద్రమ్మే భూమిపైన - బాధల్ తగ్గున్ 
ముద్రించున్ నిక్కమ్మై 
యద్రీశ్వరుఁ డెప్డు ప్రేమ - నానందమ్మై 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
సీసపద్యము

కవికులం అను నది.. కారణ జన్మగా
అనుభవ సారము.. యదను తాకు
భావి పౌరులుగా ను .. భవితవ్యమును చూపు
భవ్వమై దివ్యమై ... భాగ్య మౌను
హృదయాన్ని కదిలించి... హృద్యము నందించి
హృదయకవిత్వమే ... హాయి గొలుపు
సస్త్రమై అస్త్రమై ... సమర భేరీగను
కవి కలం కదలాలి.. కవుల మాట

తేటగీతి
గుండెలోదాగి రక్తము గుప్పు మన్న
మండె గుండెగా మారిన మాడి వున్న
ఆశయమ్ముమరవకుండ ఆశతో ను
అంతిమ విజయం కవులలో ఆశ తీర్చు
((()))

ఉ::బంధము నీతొ మమ్ములను.. బాధకు బాధ్యత తెల్పు చుంటినన్
అందము ఏది నమ్మకము.... ఆదర మైనను ఆద్యమవ్వుటన్
విందులు చేయు సమ్మతము...వీధిన చేరుట యేలయవ్వుటన్
వేదన వల్లనే మనము ... వేషము వేసియు బత్కటేయగున్
(()))
బూరె గారెలు నూనెలో బుసలు కొట్టి
పూర్ణము వుడిక వుబ్బియు పులుపు చచ్చి
నేతి నందును నంచియు నాన్చి ఉంచి
పిండి వంటలు అన్నియు పుడమి చూపె
ఆరగించుట ఆరోగ్య ఆశ తీరు
(())
 మాయయే తెలుపు నే వ్యక్తిత్వ ఖర్చును
కాయమే కదులు నే సందర్భ గుర్తుగా
గాయమే చేయునో కర్మయే ఖర్చౌనొ
ధ్యేయము వదలుడు కవిగాను ఖర్చైనా
(())
చీకటిలో కధే కదులు చిత్తము చిత్రము అయ్యెనేలనో
చాకిరితో మతే చెదిరి జాత్యము పెర్గియు భయ్యమేలనో
వేకువ జామునే మనసు వేదన పర్చుట వంతు వచ్చెనో
మక్కువ వున్ననే అహము మందున ఓడుట మోహనమ్ముగన్
(())
 చెప్ప గానె చింత వీడు చుండ
ఒప్పు గానె ఓర్పు చూపు చుండ
తప్పు యైన తాటి తీయ కుండ
నెప్పి వున్న నెమ్మ ధనము ఉండ
అప్పు చేసి అరవ నీయ కుండ
(())
మంచి చేసి మాయ చేయ కుండ
వంచ నేది వేడి కాక వుండ
కుచ్చితమ్ము కంపు కొట్ట కుండ
మచ్చ యైన మంచ మవ్వ కుండ
స్వేచ్ఛ వున్న సత్య రూపు అండ

శ్రీకృష్ణ కర్ణామృతం...16
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సీస పద్యము

పుడమి తల్లి వలనే... పులకరింపులు కృష్ణ 
చరణ సవ్వడులకు ... చెందె తృప్తి
అందెల శబ్దాలు .... ఆనంద పరుచుటే
న్యాశాలు రేపల్లె నరులు తృప్తి
మణిమయ వివరణ.. మహిమలు చూపేను
అందెల రవళిలు కలిగె తృప్తి
నాహృదయము నందు నమ్మక భక్తియే
నాదాల్కు శిరమోడ్చి నయన  కృష్ణ

ఆటవెలది
వజ్ర భూమి లోన చరణ సవ్వడులతో
సర్వ సిధ్ధి పంచు సౌర్యకృష్ణ
అమృత మైశబ్ధము ఆశ్రితా నందము 
పరిచి హృదయ వెలుగు పంచు కృష్ణ

**(())**

 సమ్మోహనాలు

రామనామమ్ము గా నామ పఠణమ్ముగా
పఠణమే పారాయణం చేసె ఈశ్వరా

భీమ ధైర్యంగా ను  .. ధైర్య సంపదగాను
సంపద యే జీవనాధారం ఈశ్వరా

సోముడు మల్లె తిరిగి .. తిరిగి యు సుఖము మరిగి
మరిగి యే బతికి బతికించేను ఈశ్వరా

కాముడు వల్లె మనము  .. మనము గా జీవితము
జీవితం అంకితం ప్రేమకే ఈశ్వరా

చంపక మాల
మనసున రామ రామనుచు మానమె రక్ష గకోరు కొర్కుయే
తనువున భీమ శక్తి ని సుతార సమాజపు ధైర్య సంపదే
అణువు యె సోముడై కళ తొ ఆశ నుతీర్చియువెల్గు నిచ్చుటే
మనువుగ కాముడే కధ సమాన సుఖాల ను పంచు సంగమం

        మత్తకోకిల
        రాముడే మన దేవుడై మన రక్ష జేయును జన్మగా
        భీముడై మన ధైర్య సంపద పెంచ గల్గియు కర్తగా
        సోముడై మన లోన శక్తిని సర్వ యక్తిగ మార్చగా
        కాముడై మనలోన రక్తిగ కార్య మంతయు నేర్పగా

సీస పద్యము
రాముడై జగతిని.. రంగరించె ఘనుడు
రమ్య చరితము గా... రాజ్య మేలె
భీముడై విశ్వాస... బాధ్యత చూపియే
జనులకు రక్షగా... జయము పంచె
సోముడై సకలమ్ము... సుందర చెలిమి గా
ఆత్మకు రక్షగా... ఆది పురుష
కాముడై ప్రేమగా.. కార్యము సఫలమై
సంతృప్తి కలిగించు .. శాంతి దూత

తేటగీతి
ఉన్న వారును కలసియు ఉత్సవములు
అన్న మాటలు చేయుట ఆది వెలుగు
కన్న వారిని ప్రేమగా గాను కాసి
చిన్న పెద్దతేడ అనక చిత్త ముంచె
(()))

పంచ రవళి
శ్రమను నమ్మి సాగు చేసె రామ
యుక్తి తోడ యధ్ధ మేను భీమ
నిత్య మనసు నిన్ను కొలువు సోమ
కాపు రాన కలలు తీర్చు కామ
సర్వు లందు సహజ శక్తి మాత

కరిబృంహితము
రామ మహిమను చూడు మనసు తొ...రామ కధలను తెల్సుకో
భీమ బలమును పొందుదురు ఇక... భీమ కళలను తెల్సుకో
సోమ చరితము జీవితముగను .. సేయ యగుటను తెల్సుకో
కాముడు సహన బుధ్ధియు తెలిపి..కాముడు సుఖము తెల్సుకో
14  
నేటి పద్యాలు

4 ఇంద్ర 1 చంద్ర, 4యతి

విరహమే ప్రేమలుగ మరింత వికసించి విప్పారెను
విరజాజి విరిసింది అందాల విపులగా విప్పారెను
మరు మల్లె మాయలు మాలలు మదిలోన విప్పారెను
చిరుహాస చరితము చిందులు చిరుణామ విప్పారెను

సీసా పద్యము

మానస వీణ యు... మధురము పంచగా
మాధుర్య మంతయు.. మాయ మాయె
మగువగ మమతను ..మానవత్వముగను
మహిమను చూపిన... మాయ మాయె
మాంగల్య విలువను.. మానప్రాణములను 
ముందర నుంచితి... మాయ మాయె
ముదిరిన శక్తిగా. ... ముదమున వీలుగా
ముందర నీడగా... మాయ మాయె

ఆటవెలది
కొంద రుండు రంతె కోరుకున్న ది పోయె
కొంత బాధ కొంత పంత మగును
సౌఖ్య మన్న శాంతి శబ్దము కదిలే ను
కలల మాయ జగతి బతుకు లాయె
(((()))

పంచ రవళి (5 సూర్యగణాలు అంత్య ప్రాస) 
మంద బుద్ధి మాను లాగ అగును 
మోహ శక్తి మోస మగుటయగును  
మంచు లాగ మాయ కరగు టగును  
చిందు లాట చిమ్మ చీకటగును     

విద్య యుంటె విమల చరిత మగును
మధుర మంత మాయ లాగ కరిగె 
విధిగ తెల్పు వింత ఖర్చు మరిగె 
చెదలు పట్టి చెక్క యంత విరిగె 
కధలు చేరి ఓపి కంత వొరిగె     

అవని యందు అవతకవత జరిగె
అంద మైన ఆట బొమ్మ గాను 
సుంద రమ్మ శుభము చెప్పు టేను 

చెక్క లాట  చెమ్మ చెక్క గాను 
చక్క దనము చెక్కు లెక్క గాను 
మక్కు వైన మాన మాయ ఓను 

నవమల్లిక.. (స..13/24)

మరు మల్లెల మాలలు గా మనసే మమతల్తొ కధే కదిలే తరుణం
చిరు నవ్వల పుష్పములే మన చిత్తము మార్చియు పూర్ణత తల్పముగా
మరు మల్లెల గంధపు వెన్నెల సమ్మతి ముద్దుగ మన్నన వెల్గులుగా
అరుదై మెరుపై సుఖమై మనసై అర్పనే కళలై కధలే

మన భూమిని ఆక్రమ భర్తగనే మనసం పదగా వెలుగే పెరిగే
మన సాయెను నిద్రలొ  తెల్పెనులే మన మాయలుగా బానిస వెలుగే
మన పండుగగా సుఖమే నుహరించు మనో మహిమే కొలువై కరిగే
మన మాట మనో మయమై కళగా మధురం సమయాన్ని సమోన్నతగా

మనసే వయసే సొగసే కలిసే సమతా మమతా కధలే కదిలే 
అనువై తనువై పనిగా సుఖమై అధరం మధురం మృదులం సుఖదాం 
వినయం చరితం చరణం  విమలం సుజలాం సుభదాం విదితం విజయం 
కనులే కమళాలుగ కాంతులుగా కరణా సుమ భావము వెల్లువగా

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రక .్్్్ 22---09--2020
*సంస్కృతంలో పుష్పాల పేర్లు.!!* 

🕉🕉🕉

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుందం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను!!
OOOO 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి