5, జనవరి 2021, మంగళవారం

(శీలం )


ఓ మనిషి సాధసలన్నింటిలోసు నామ సంకీర్తన చాలా సులభము. ఈ నామము జన్మజన్మాంతరాల పాపాలను భస్మము చేయగలదు. ప్రేమను పంచి పొందుటలో ఉన్న సంతృప్తి ఎక్కడా లేదు.  కష్టే ఫలితము అని గ్రహించి మనస్సు స్థిర పరచగలవు. 

రామ కృష్ణ హరి.. విళ్లల.. కేశవ అనే ఈ మంత్రమును సర్వకాలముల యందు జపించవలెను.
ఇంతకు మించి ఇతర సాధన ఏదీ లేదని నేను విఠలునిపై ఒట్టు వేసి చెప్పుచున్నాను.

వివేకశీలురు అన్ని మార్గములలోకి సులభమార్గమైన నామ సాధనను చేపట్టి తృప్తి చెందినారని తుకారాం మహారాజ్ తెలిపినాడు. నిత్యము హనుమ రామనామము చేయుటవల్ల మనం బతగ గలుగుతున్నాము. అందుకే నామ జపంక్షేమం అదే శీలానికి మూలం.    

--(())--


4..సంక్షిప్త ప్రాంజలి ప్రభ జీవిత సమాచారం 

ఈ రోజు లేవగానే ప్రతి వ్యక్తి ఆలోచించే విషయాలు నిత్యం
1. నేనెవరిని?
2.నేను ఎక్కడి నుంచి వచ్చాను?
3.నేను ఎందుకు వచ్చాను?
4.నేను ఎక్కడికి వెళ్ళాలి?

ఇంతలో వెనుక నుంచి భార్య మాటలు ఆకాశవాణి లా ఇలా వినిపించాయి.
1. నువ్వు నెంబర్ వన్ బద్ద కస్తుడివి.
2. ఏ లోకం నుంచి ఊడి పడ్డావో ఏమో.
3.నా ప్రాణాలు తీయడానికి వచ్చావు.
4.లే, లేచి స్నానానికి వెళ్లు.
ఆ విధంగా నాకు ఆత్మ జ్ఞానం 
అపుడే నాఆలోచనలు ఈవిధంగా మార్చుకున్నా
ఓమ్! ఓమ్ ఓమ్ అనుకుంటూ
----
ఆశతొ కొరికే  పండులా ఉండక
పాశమువల్ల ఘనకార్యము  బయట పడె విధముగా ఉండక
నాశన నవ్వులు నరికి
కశి కశీ అన్న మనిషియు ఫలహారమగు కాక
చేతల రాతలే చూపి 
విత్తము కొర్కు విను వీధులవెంట తిర్గి
చిత్తము అంటూ పలికియు 
కత్తెర లాంటి మనసు వేధించగ భాధపడి
పాపము చేయుట ఎరుగక 
కోపము వెంట చిక్కి కోరికయే మరిచి
శాపము దోషము అనుకొని 
తాపము తగ్గి శాంతము ఆయుధముగా జీవితము సాగిస్తున్నా తక్కువచేసి మాట్లాడకే భార్యామణి
-((***))--

5..సంక్షిప్త ప్రాంజలి ప్రభ జీవిత సమాచారం 
   
వాస్తవాల వెలుగులు కానరాకుండా వ్యాపిస్తున్నాయి, అనారోగ్య పరిసస్థితులు మెరుగౌతున్నాయి, రక్షకభటులు వ్యవస్థ తాకుమారౌతున్నది , లంచ గొండి తనం పెరుగుటవల్ల మనిషి మనిషి కి మధ్య బంధాలు దూరంగా పెరుగుతున్నాయి. అన్నిఆరోగ్య దశలలో భద్రత లోపిస్తున్నది. మన దేశంలో మన ఋషులు ధర్మాన్ని తెలిపి నారు. దానిప్రకారంగా నడుచుకొని పోయే దేశం మనది. 
సమాజంలో మేధస్సు గలవారిని ఆర్దరణ తగ్గి మిడిమిడి జ్ఞమఉన్నవారిని అందలం ఎక్కిస్తున్నారు.  మన దేశం బాగుపడా లంటే  మనదేశంలో మనుష్యులు ఎంతగొప్పవారైతే (ఆధునిక విజ్ణాణ సంపద )  ఆదేశం అంత గొప్పదౌతుంది. ఒక దేశం దిగజారి పోయిందంటే                  
దానికి అర్ధం ఆ సమాజం గొప్పవ్యక్తులను తయారుచేయలేకపోతున్నదని తెలుస్తున్నది. 
దేశంలోని మేధావుల్ని (విద్యర్థి దశలోనే) గుర్తించండి, వలసిపోకుండా చుడండి అదే దేశానికి రక్ష .    . 
--(())-- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి