2, జనవరి 2021, శనివారం

 హనుమంతుడు సముద్రమును లంఘించుట 

మైనాకుడు అతనిని గౌరవించుట 

సురసను హనుమంతుడు ఓడించుట 

సోంహికను చంపి లంక శోభ చూచుట 


సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (01.... 10)

 

 ఆకాశ మార్గాన

మార్గాన తరుణాన

తరుణాన హనుమ లంకకు కదిలె ఈశ్వరా


సీతా న్వేషణ కే

అన్వేషణ కొరకే 

కొరకే వానరుల ప్రోత్సాహం చేసేను


సీతయోక్క జాడకు

జాడ తెలిసి కొనుటకు

తెలిసికొను ఉద్దేశ్యంతో కదిలె హనుమంతు


సముద్ర లంఘణమే

లంఘణ దుష్కరమే

దుష్కరమే అయిన సాగె హనుమ ఈశ్వరా


తలను మెడను పెంచి

పెంచీ  ప్రకాశించి

ప్రకాశించి ఆబోతువలె హనుమ ఈశ్వరా


పచ్చిక బీళ్ళయందు

బీళ్ళ కదిలే ముందు

కదిలే ధైర్యశాలి హనుమంతు ఈశ్వరా


వక్షస్థలము చేత

చేత తరువుల చెంత

చెంత సింహము విజ్రుంభన వలె హనుమంతు


సహజధాతువులతో

ధాతువులందమతో

అందము కిన్నర గంధర్వ లే ఈశ్వరా


మహేంద్ర పర్వతము

పర్వతము ప్రాంతము

ప్రాంతమే అద్భుతము

అద్భుతమేన గజము

గజము వలె ప్రకాశించెను హనుమంతు


హనుమాన్ సూర్యునకే

సూర్యునకె, ఇంద్రకే

ఇంద్ర వాయువు కు నమస్కరించే ఈశ్వరా

--(())--

బ్రహ్మ కు నమస్కారం

నమస్కార భూతాం

భూతాం ప్రాంజలి ఘటించె హనుమ ఈశ్వరా


హనుమ తూర్పుకు తిరిగి

తిరిగి సంతస పెరిగి

పెరిగి తండ్రి కి ఒదిగి

ఒదిగి నమస్కారం చేసేను హనుమంతు 


దక్షణాన తిర్గేను

తిర్గి దేహ మంతను

మంతను పర్వతం నొక్కె హనుమ ఈశ్వరా


కొలుచుటకు శక్యమ్ము

శక్యమవని దేహమ్ము

దేహమ్ము హష్తమ్ము

హస్తమ్ము పాదమ్ము

పాదమ్మతో పర్వతం నొక్కె హనుమంతు


పాద స్పర్శకు పూలు 

పూలు జలజలా రాలు 

రాలినవి హనుమంతుని కప్పే ఈశ్వరా 


పుష్పా కొండ వలెను

వలే పరిమళములను  

పరిమళ మయమైనది పర్వతము ఈశ్వరా 


ఏనుగులు మదాన్ని 

మదంతో గర్వాన్ని 

గర్వంతో విహరించే కరిగ హనుమంతు 


వెండి శిలలు నలిగియు 

నలిగి మెరుపు కలిగియు 

కలిగి నీలిరంగు గీతలు గా ఈశ్వరా 

 

మధ్యమ జ్వాలలతో   

జ్వాల ధూమములతో  

ధూమము వల్ల మణిశిలలు మెరయు ఈశ్వరా 


వికృత స్వరములతో 

స్వరము శబ్దముతో 

శబ్దఘోషకు మృగముల అరుపులు ఈశ్వరా 

--(())-- 


పుడమి పైన అడవులు 

అడవులు పర్వతములు 

పర్వతములు కంపించు శబ్దము ఈశ్వరా 

   

సర్పములన్ని  విషము

విషము కక్కె సమయము 

సమయము వృక్షాలు అగ్ని మాల ఈశ్వరా 


విష సంహారక మగ 

అగువృక్ష ములలొ సెగ

సెగలు విషసర్పాలు ఉండేను  ఈశ్వరా 

    

భూతాల పని ఇదని

ఇదని మునులు ఋషులని 

ఋషులు విద్యాధరులు భయపడెను ఈశ్వరా 

 

కట్టు బట్టలు వదలి 

వదలి పిల్లల నొదలి

నొదలి ప్రాణముతొ అంబరమునే ఈశ్వరా


వదలేను లేహ్యాలు   

లేహ్య భక్ష్యమ్ములను

భక్ష్య పాత్ర  మాంసములను వదలె ఈశ్వరా 

     

ఖంఠముకు హారములు 

హారము లేపనములు 

లేపన సుఘందములు  

సుఘంధ పు మాలలు

మాలలు వదలిన విద్యాధరులు ఈశ్వరా 

  

మేడలో హారములు 

హారములో  మెరుపులు 

పాదాలకు అందెలు 

అందెలు కదలికలు 

కదలికల కడియాలు 

కడియా కంకణాలు 

కంకణాలతొ స్త్రీలు 

స్త్రీలు తమప్రియులతో ఎగిరే ఈశ్వరా 


సిద్ధుల మహావిద్య 

విద్య ప్రదర్శ విద్య 

విద్య ఆకాశమునుండి చూసె ఈశ్వరా 


వినిరి అమృతపలుకులు

పలుకుల లో  చారులు

చారులు తో సిద్ధులు 

సిద్ధుల తోను ఋషులు

ఋషుల పలుకే హనుమ సముద్రము పై కెగిరె  

--(())--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (31.... 40)


యితడు  రాముని కొరకు 

కొరకు వానర కొరకు 

కొరకు సంద్రము దాటుటకు ఎగిరె ఈశ్వరా          


హనుమ మహా గర్జన

గర్జన తొ ప్రకంపన

ప్రకంపన తో హనుమ లంఘించె ఈశ్వరా 

  

అద్భుతమైన శోభ 

శోభ పరాక్ర ప్రభ 

ప్రభ తొ బలము తేజస్సు వీర్యము ఈశ్వరా 


నేత్రములు తిప్పేను 

తిప్పే ఊపిరి పట్టెను 

పట్టెను అంబరముపై పక్షిలా ఈశ్వరా 


 పలికె వానరు లతో

హనుమ ధైర్యమ్ముతో

ధైర్యము చూపి పోయి వచ్చెను ఈశ్వరా 


రామ బాణము వలే  

బాణ వేగము వలే    

వేగముతో రావణ లంకకే  ఈశ్వరా 

     

లంకలో వెతికెదా 

వెతికాక తెచ్చెదా 

తెచ్చెద సీతలేక రావణని బంధిస్త ఈశ్వరా    


హనుమ వెనుక తరువులు 

తరువులే కదిలికలు  

కదలి జారి సంద్రములో మునకలు ఈశ్వరా   

 

రాజు వెనుక సేనలు     

సేనలలొ కష్టాలు   

కష్టాలులా వెనుకవృక్షాలు ఈశ్వరా 


హనుమపై పుస్పాలు 

పుష్పా అంకురములు

అంకురాల మొగ్గలు 

మొగ్గలు హనుమపై మినుగురుపురుగై మెర్సె ఈశ్వరా 

    

--(())--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (21.... 30)


తరువులు సముద్రము లొ 

సంద్ర మంత మెరుపులొ   

మెరుపులు నక్షత్రాలు వలె ఉండే ఈశ్వరా 


హనుమ హస్తమ్ములే  

చేతులు సర్పాలే 

సర్పాల వలే భయంగ ఉండే ఈశ్వరా 


హనుమ కళ్ళు రెండూ 

రెండు నిప్పు ఉండూ 

నిప్పు కనికల్లా కదిలేనూ  ఈశ్వరా 


సూర్య చంద్రుని వలే 

వలే కన్ను లే లే  

లేలు చున్న హనుమ మేఘమల్లె ఈశ్వరా


ఎఱ్ఱగా నే ముక్కె  

ముక్కు సూర్య చుక్కె

సూర్య బింబము వలె హనుమ వుండె ఈశ్వరా 


 వినువీధిన గడగడ

గడగడ వణుకును దడ

దడపెరిగేరీతిగ  అంబరం ఈశ్వరా


కడలి తరంగములె

తరంగాల పొంగులె 

పొంగు ఎగసిపడి లోతునకేగె ఈశ్వరా


జలచరములే దాగె

దాగె నాచునసాగె

సాగె ఆంజనేయుని వేగముకు ఈశ్వరా


సముద్ర దృశ్యమ్ముయె

దృశ్యమద్భుతముయె

అద్భుత మేఘముల మధ్య హనుమ ఈశ్వరా


కనివిని ఎరుగనట్టి 

ఎరుగకను భయపెట్టి

భయముతొ సర్పములు గరుడనుకొనె ఈశ్వరా


సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (31.... 40)


పవన పుత్రుని తీరు

తీరు చూసి కొందరు

కొందరు యక్ష  కిన్నరులు హేళ ఈశ్వరా


అనిలు డుప్పొంగియే 

పొంగి ఆశి స్సుయే

ఆశిస్సులు  హనుమకు పంచేను ఈశ్వరా


వాలము చక్రము గా 

చక్రము వెలుగులు  గా 

వెలుగులతో  సూర్యుడు వలె ఉండే ఈశ్వరా 

   

పర్వతమును బోలే  

బోలేను  పిరుదులే 

పిరుదులే ఎఱ్ఱగ మెరియు చుండె  ఈశ్వరా 


చంకల మధ్య నుండి 

మధ్య గాలుల  నుండి 

నుండి అద్భుత మేఘ గర్జనలె ఈశ్వరా


ఉల్క వేగము వలే 

వలే గగన మేలే 

మేలే వేగంగా సంచారి ఈశ్వరా


గొలుసుకు కట్టినట్లు

కట్టె కరి యైనట్లు  

కరిలాగా భీకరశబ్దముతొ ఈశ్వరా


గాలికి కదులు ఓడ 

ఓడల హనుమ నీడ  

హనుమ నీడ అద్భుతముగుండెను ఈశ్వరా


ఉన్మాద మనిషి వలె 

వలె సముద్రము లేలె

సముద్రము పొంగి నింగిని తాకె ఈశ్వరా 

  

వక్షస్థలమును తాకె 

తాకు సంద్రపు మొకె 

మోకు అదిమి సాగె ముందుకు హనుమ ఈశ్వరా 

--(())--


సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (41.... 50)

   

తరంగాలు ఎగసే 

ఎగసె లెక్క చూసే 

లెక్క గా దాటుతున్నాడు హనుమ ఈశ్వరా


సముద్ర జలము పైనే 

పైనె మొసళ్ళు గనే 

గనే చేపలూ గనే 

గనే తాబేళ్లు నే 

నే దిగంబరమునే

దిగంబర జలచరా లుండేను ఈశ్వరా


జలము పైన నీడయు 

నీడలే వెడల్పుయు  

వెడల్పు పది యోజనయు     

యోజన ముప్పై పొడవుయు  

పొడవు ఐన నీడ సంద్రంపైన ఈశ్వరా


వాయు మార్గము నందు 

మార్గము మేఘమందు

మేఘపు పంక్తు లందు 

పంక్తులు పోటీగా ప్రయాణము ఈశ్వరా


రంగు తెల్లా రంగు 

రంగు నల్లా రంగు 

రంగు యర్రా రంగు 

రంగు  పచ్ఛా రంగు 

రంగు మేఘాలు వెంట లాగుతు ఈశ్వరా


మెఘా లెనుక దాగి   

దాగె సూర్య డాగి

డాగి బయట వచ్చి నట్లు హనుమ ఈశ్వరా

 

సూర్యవేడి వీచు  

వీచు వాయువు వీచు 

వీచు చల్లని గాలి వేడిగా ఈశ్వరా


పుష్పా ల జల్లులే 

జళ్లే గంధ ర్వులే

గంధర్వ దానవ దేవతలే ఈశ్వరా  

   

కలుగ కుండే టట్లు

ఉండే సూర్య డట్లు 

సూర్యడు వేడి తగల కుండేను ఈశ్వరా


చల్లఁ వాయువు పంచె 

పంచె సుఖమును పెంచె 

పెంచె వాయుదేవుడు హనుమకే ఈశ్వరా

--(())--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (51.... 60)


యక్షులే కిన్నరులు

కిన్నర గంధర్వులు 

గంధర్వ దేవతలు 

దేవతలు రాక్షసులు 

రాక్షసులు పక్షులు కొనియాడె ఈశ్వరా


చూచేను సముద్రుడు 

సముద్రుడు తెల్పాడు 

తెల్పే ఇక్ష్వాకువంశాన్నీ ఈశ్వరా 


వంశ సత్కారాన్ని 

సత్కార వివరాన్ని 

వివరంతో సహాయాన్ని పంచె ఈశ్వరా 


సహాయము చెయ్యాలి 
చేసి ఆదు కొనాలి 
ఆదుకొను చేసిన సహాయముకు ఈశ్వరా 
   
హనుమ అలసట వద్దు 
వద్దు సుఖమును సద్దు 
సద్దు మైనాకునితొ సముద్రుడు ఈశ్వరా 

పాతాళ పర్వతము 
పర్వతము శ్రేష్టము 
శ్రేష్ఠ మైనాకునుంచె ఇంద్రుడు ఈశ్వరా  

పర్వత శ్రేష్టమా 
శ్రేష్ఠమై లేచుమా
లేచుమా అందుకే ప్రేరణా ఈశ్వరా 
 
వచ్చు చున్నాడులే 
చున్న హనుమంతులే 
హనుమ చూడు పరాక్రమశాలిగ ఈశ్వరా

రాముని పని మీదను 
మీద సంద్ర మందును 
మందు వచ్చు హనుమ పూజ్యులగును ఈశ్వరా 
 
మంచి పని చేయాలి 
చేసి పూజించాలి
పూజ లేక సత్పురుషులకు కోపము ఈశ్వరా 

--(())--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (61.... 70)

   
ఉదకము నుండి పైకి 
పై పైకి ఎగబాకి
ఎగబాకి  నీమీద  నిలుచుటకు ఈశ్వరా 

నీపై విశ్ర మించి 
విశ్ర మించి పోవూ 
పోవూ హనుమకు సహకరించే ఈశ్వరా 
   

రాముని సాధుత్వము 

సీత కున్న   కష్టము  

హనుమంతుని ధర్మము 

ధర్మమును చూసి  సహాయముగా ఈశ్వరా 


మహా వృక్ష లతలతొ  

లతల బంగారముతొ 

బంగారపు పర్వత మైనాక ఈశ్వరా 

   

మైనాక పర్వతము 

పర్వత ప్రకాశము

ప్రకాశము సముద్రజలము పైకి ఈశ్వరా 

 

పర్వతాన  కిం నర  

కిం నర మహోరగర 

మహో రగలతొ సూర్యుడు మెరిసే ఈశ్వరా

 

నీలి వర్ణ గగనం 

గగనం ఎఱ్ఱ దనం 

ఎఱ్ఱని బంగారం  ఆకాశం ఈశ్వరా 

 

కోటి సూర్య ప్రభగ 

ప్రభ దివ్య వెలుగుగ 

వెలుగు చూసి హనుమ ఆశ్చర్యపడే ఈశ్వరా 

 

హనుమ నిశ్చయముగా 

నిశ్చయ విఘ్నముగా 

విఘ్నమని హనుమ భావించేను ఈశ్వరా


పుత్తడి పర్వతము ను 

పర్వతము శిఖరమును 

శిఖరము వక్షస్థలము అదిమే ఈశ్వరా 

 --(()))--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (71.... 80)

 
మైనాక పర్వతము
పర్వతమ్ము  ప్రేమము
ప్రేమ చూపి హనుమతో పలికెను ఈశ్వరా

హనుమా నీవెవరవు 
నీవు వెలుతున్నావు
వెళ్ళేటప్పుడు విశ్రాంతి కోరె ఈశ్వరా
  
రామ వంశం వారు 
వారు వృద్ధి సాగరు 
సాగర కోరికమీద పూజలు ఈశ్వరా 
 
ఉపకారికి ఉపకార 
ఉపకార సహకార 
సహకార ప్రత్యుపకార మే ఈశ్వరా 

వానరోత్తమా ఆగి   
ఆగి శాంతే కలిగి  
శాంతి విశ్రాంతి పొంది వెళ్లుము ఈశ్వరా 
 
కందమూలఫలములు 
ఫలము తీపి జలములు 
జలమును తీసుకొని యే వెళ్లుము ఇశ్వారా

మూడు లోకముల్లోను  
లోక ప్రసిద్ధి గను 
ప్రసిద్ధి చెందిన వారకి  పూజ ఈశ్వరా 
 
గొప్పగుణముల తోను  
గుణ సంబంధముగను 
సంబంధం ధర్మంగా కలిసె ఈశ్వరా

మహా పురుషుడుగాని 
పురుష మేధావి గను
మేధావికి గౌరవ మర్యాద ఈశ్వరా 
   
అతిధిని గౌరవించి  
గౌరవము అందించి 
అందిన విధముగా ఆదరించె ఈశ్వరా

--(())--

సమ్మోహనాల ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (81.... 90)

 
వాయు దేవ పుత్రుడు 
పుత్రుడు హనుమంతుడు 
హనుమయు వాయుదేవ సమానుడు ఈశ్వరా 
  
నిన్ను పూజించె కధ 
కధ చెప్పాల్సిన కథ
కధను తెల్పుట మొదలుపెట్టేను ఈశ్వరా 
 

గిరుల కుండు రెక్కలు  
రెక్కలతొ చలనాలు    
చలనాలతొ భయాలు 
భయాలు లో ఋషులు 
ఋషులు వెళ్ళి ఇంద్రుణ్ణి కోరెను  ఈశ్వరా    
    
దేవ సంఘములన్ని 
లన్ని ప్రాణులన్ని
 ప్రాణులన్ని శ0కచేత కోరె ఈశ్వరా 

వజ్రాయుధమ్ము చేత
చేత నరికెను చేత 
చేత ఇంద్రుడు పర్వత రెక్కలు ఈశ్వరా 
 
నా చెంతకే వచ్చె  
వచ్చే ఇంద్రుడొచ్చె
డొచ్చీ నరక జొచ్చె     
జొచ్చె సమయమున నీ సహాయమె ఈశ్వరా

పాతాళ లోకముకు
లోకముకు ఆడ్డుకు 
అడ్డుగా వాయుదేవ ఉంచే ఈశ్వరా 
 
అప్పటి నుండి నేను  
నేను సంద్రమ్మునను
సముద్రుని కోరికతో వచ్చితి ఈశ్వరా 
  
నీతండ్రి రక్షించె 
రక్షణతొ జీవించె    
జీవిగా సహాయ పడాలనియె ఈశ్వరా 
 
సంతోషమే బలము 
బలమే కూర్చు జయము 
జయము కు విశ్రాంతి అవసరమే ఈశ్వరా

--(())--


మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (90.... 100)

 
నాకూ సముద్రునికి 
సముద్రసంతసముకి
సంతస ఆతిధ్యము పొందాలి ఈశ్వరా
  
నా కార్య సమయమే  
సమయ ఆలస్యమే 
ఆలస్యము చేయుట తగదిపుడు ఈశ్వరా

ప్రతిజ్ఞ చేసి యున్న  
యున్నా కదులు తున్న  
ఉన్న ఆగుటకు వీలు కాదును ఈశ్వరా 
 
పగలు గడచిపోవును 
ప్రతిజ్ఞ పలికినాను 
పలికే హనుమ మైనాకునితో ఈశ్వరా
 
పర్వతము స్పృశించి 
స్పృశించి దీవించి 
దీవించి గగనమ్ము  ప్రయాణం ఈశ్వరా

గౌరవ భావముతో 
భావ ప్రభావంతో 
ప్రభావ ఆశీర్వాదము తోను ఈశ్వరా 
 
సముద్రము న ఎగిరె  
ఎగిరే పైకి ఎగిరె 
ఎగిరె నిర్మలాకాశమునందు ఈశ్వరా

ఇంకా పైకి వెళ్లి 
వెళ్లి చూసే మళ్లి 
మళ్లి అంబరమ్మున వేగముగ ఈశ్వరా 

దేవతలు కిన్నరులు 
కిన్నర గంధర్వులు 
గంధర్వులు ప్రశంసించిరి ఈశ్వరా
 
బంగారు వికరమై 
వికారము మాయమై  
మాయమైనది పర్వతమ్ము యే ఈశ్వరా  

--(())-- 

మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (101.... 110)


రాముని హితము కొరకు 
ప్రయాణించు హనుమకు 
సన్మానము చేయుటకు 
శోభ సంతోషముకు  

పర్వత శ్రేష్టము యే 
ఆనందమయముయే 
ఇంద్ర సంతసముయే 
సముద్రుడు తృప్తియే 

దేవత, గంధర్వులు
యక్ష, కిన్నర ఋషులు 
సిద్ధులు మహా మునులు 
సురసతోను  పలుకులు 

నీవు రాక్షస రూపముతో 
భయంకరమై కోరలతో 
పచ్చని కళ్ళ చూపులతో 
హనుమకు విఘ్నము చేయుమూ  
 
దేవతలు పలికేను 
పలికే ముహూర్తమును
హనుమనే క్షణ మ్మును 
మాతతొ ఆప మనెను 
 
ఉపాయముతో జయించునా 
భయముతోను వెనుదిరుగునా 
చూడవలె కుతూహలమునా 
దేవతలుండె గగనమునా 

పలికె సురస హనుమతోను 
నిన్ను నే  భక్షించెదను 
దేవతలు తెల్పుట తోను  
ముఖము నుండి పోవలేను

నమస్కరించి సురసతో 
తండ్రి కోరిన మాటతో    
రామ లక్ష్మణ  సీతతో  
దండ కారణ్యముకు వచ్చె    

రాక్షసులతో వైరమున 
రాముడు లేని సమయాన 
దశఖంఠా మాయ వలన  
భార్య సీతా  అపహరణ 
 
నేను రాముని ఆజ్ఞచే 
రామ భార్యను వెతుకుటకు    
సంపాతీ  తెలుపుటచే
వెళ్ళు చున్నాను లంకకు  

నీవు చేయవలె సహాయము 
రామరాజ్యమునందు ఉండె 
తెల్పుమ్ము అంగీకారము  
సురసతొ మనసు  మాటలుండె 


--(())-

మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (111.... 120)


సత్య మైన పలుకులు 

పలుకు లతొ వినయములు 

వినయముగా ఒట్టేసి పలికే ఈశ్వరా


సీతను చూసి వచ్చి 

వచ్చి రాముని కిచ్చి 

కిచ్చాక నోటిలొ చేరుతాను ఈశ్వరా


హనుమా నాకు వరము 

వరము బ్రహ్మా వరము     

వరమువల్ల నా ముఖము నుండే ఈశ్వరా 

 

పెద్ద నోరు తెరువుము 

తెరిసి నీవు చూపుము

చూపుము హనుమ అనగా తెరిచే ఈశ్వరా


సురస నోరు పెద్దదిగ తెరచే  

నోరు పదియోజనాలు మించే   

మించే హనుమ 20 యోజనాలుంచే 

సురస ముప్పది యోజనాలుంచే 

హనుమ నలభై యోజనాలుంచే 

సురస ఏభై యోజనాలుంచే 

హనుమ అరవై యోజనాలుంచే 

సురస డెబ్భై యోజనాలుంచే 

హనుమ ఎనభై యోజనాలుంచే 

సురస తొంబయ్ యోజనాలుంచే 

హనుమ అంగుష్ట ప్రమాణము మారి 

 సురస నోటిలోదూకి పైకెగరే 


హనుమ గగనము చేరి  

చేరి దేహము  మారి సురసతొ  

మారి సురసతొ వందనం తెలిపె ఈశ్వరా 


సురస రూపము మార్చి

మార్చీ  హనుమ గూర్చి  

గూర్చి తెలిపే కార్యసిద్ధిగా ఈశ్వరా 


హనుమ సీతను వెతికి 

వెతికి కలుపు రాముకి 

రామసీత ఏకముగు ననేను  ఈశ్వరా 

--(())--

మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (121.... 130)

 హనుమ గగనము చేరి 

చేరీ  పైకి ఎగిరి  

ఎగిరి ఆకాశమార్గము చీరె ఈశ్వరా  


గగనమున మేఘములు 

మేఘములు సింహములు 

సింహములు ఏనుగులు 

ఏనుగు పెద్ద పులులు 

పులులు ఆచార్యులు 

ఆచర్యలు పక్షులు 

పక్షులు విమానములు 

విమానా  సర్పములు

సర్పములు ఉన్న ఆకాశమున ఈశ్వరా 

 

వృత్త అగ్నిగుండము

అగ్ని వజ్ర పిండము 

పిండములు ఢీకొనుచూ  శబ్దము  ఈశ్వరా 

 

మహాభాగ్య నరులు 

నరులు చే యజ్ఞాలు 

యజ్ఞాల హవిస్సు ను మోయుచూ ఈశ్వరా


గగనమునా  సూర్యుడు 

సూర్యుడు తో చంద్రుడు 

చంద్రుడి తోను మహర్షి గణములు ఈశ్వరా


గగనము నక్షత్రాలు 

నక్షత్రా గ్రహాలు 

గ్రహాలూ యక్షలు 

యక్షులు మహాఋషులు

ఋషి తారాగణములు 

తారలతో ఆకాశము వెలుగు ఈశ్వరా 

 

దేవేంద్రుని గజములు 

గజ శ్వేతాశ్వములు  

అశ్వములు గగనము సంచరించె ఈశ్వరా


రెక్కలుతో ఎగిరే 

ఎగిరె పక్షి ఎగిరే 

ఎగిరేను హనుమ వేగము పెంచే ఈశ్వరా 

   

శ్వేశ్చాను సారమ్ము  

సారమ్ము రూపమ్ము 

రూపము మార్చు సింహిక చూసే ఈశ్వరా 

--(())--

మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (131.... 140)


హనుమ నీడను బట్టి 

బట్టి లా గుట బట్టి 

బట్టిన హనుమ వేగము తగ్గేను ఈశ్వరా 

 

వికృత ముఖము కలిగిన 

కలిగి హనుమ చూసిన

చూసే సంద్రముపై సింహిక ఈశ్వరా 

   

వర్ష కాల మేఘము 

మేఘ మల్లె దేహము

దేహము పెంచే హనుమంతుండు ఈశ్వరా


సింహిక నోరు తెరచె  

తెరవగ హనుమ చూచె 

చూసి భీకర రూపము దాల్చే ఈశ్వరా


దేహము చిన్నది గా 

చిన్నది వేగముగా  

వేగంతో  దుమికే నోటిలో ఈశ్వరా 


మర్మస్థానములను

స్దానము తునకలుగను 

తునకులుచేసి వేగముతొ వచ్చె ఈశ్వరా

 

సింహిక ను ధైర్యముతొ    

ధైర్యముతో నేర్పుతొ   

నేర్పుతో రాక్షసి సంహరించె ఈశ్వరా 

    

గంధర్వులు పాడిరి 

పాడి సంతసించిరి 

సంతోషము సింహిక మరణమ్ము ఈశ్వరా 

    

మంగళ కరమయ్యే 

అయ్యె శుభమయ్యే 

శుభము కలుగును అనే దేవతలు ఈశ్వరా

 

హనుమంతుని వేగము 

వేగము తో పయనము   

పయనము ఆవలివడ్డు చేరే ఈశ్వరా 

--(())--

మధురిమల  ప్రక్రియ "సుందరకాండ" 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరునికే తెలియపరుస్తూ సుందరాకాండ రామాయణము ఇది  

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు (141.... 148)


చూచె హనుమ వనములు 

వనములు పర్వతములు 

పర్వతములతొ, నదులు, సెలయేరులు ఈశ్వరా 


సముద్రతీరములను 

తీరాన వనములను  

వనములతో పెద్ద  వృక్షములను ఈశ్వరా 

 

మేఘ శరీరము తో 

శరీరము చూపుతో 

చూపులను రాక్షసులు కు భయమా ఈశ్వరా 

   

శరీరమ్ము చిన్నది 

చిన్నది గా అయినది 

అయిన హనుమ ఆత్మజ్ఞానిగా ఈశ్వరా


వామనావతామున

అవతార లక్ష్యమున  

లక్ష్యముగా బలి ఐశ్వర్యమే ఈశ్వరా 


సీతాన్వేషణగా 

లంకనే చేరగా   

చేరి నిజరూపమున ఉండేను ఈశ్వరా 

 

తరంగముల పంక్తులు 

పంక్తులలొ  దానవులు  

దానవులు ఉన్నా లంక చూసె ఈశ్వరా 


సకలైశ్వర్యముతో

ఐశ్వర్య లంకతో 

లంకే అమరావతి అనిపించె ఈశ్వరా  


వాల్మీకి వ్రాసిన రామాయణం లో 210 శ్లోకాల భావం ఆధారంగా  సమ్మోహనాల ప్రక్రియ  

సుందరకాండ మొదటి సర్గ సమాప్తము

 

--(())--


--(())--


   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి