25, జులై 2020, శనివారం


✨ RADHA KRISHNA ✨ Artist: Nirmala Hare Krishna Hare Krishna Krishna Krishna Hare…
ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు(తేటగీతి )  
శ్రీ కృష్ణ అష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

మతి మరుపు దానను మన్నించు మాధవా
యద పిలుపు తెల్పి,  విశ్వాస ముంచితీ 
అణువణువు అర్చన అర్పించె భక్తి తో
కనికరము కోసము వేచున్నా మాధవా.. ... ... 2  

సిరి కొరకు కోరను,  కోపమ్ము వద్దులే
కళ నిజము చేయుము, కారుణ్య మాధవా
చిరు నగవు చూపుతు కాలమ్ము నీదిలే
అణువణువు పంచేటి ఆకర్ష మాధవా  ... ... 2    

నళిన లోచన దృష్టికి కప్పి ఉన్న 
కలల విననెంచి నకనక లాడు చున్న 
నాచి నంగ నాచియు మాట వళ్ళ చిక్కి 
నాతి తికమక పలుకుకు భాద మాధవా ... .. 2 
 ...  
కధల కళ వింతయు ఆశ్చర్య మవ్వుతూ 
వినయ విధి ఆటలొ చూసాను మాధవా
నెలఁత నమ్మకపు నటనకు చిక్కి ఉన్న 
చూపు చల్లని నెచ్చెలి పిలుపు మాధవా 

విభూతి చ్ఛందము (1 )
ర  జ  గ   - ర జ  గ = UIU  IUI  U = UIU  IUI  U  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మౌనమే మనస్సు లే = జీవితం వయస్సు లే 
నిత్యమే ఉషస్సు లే  = రాగమే యశస్సు లే 

కాలమే కదళ్లు లే  = కాలమే వసంత మే 
గాధలే చిగుళ్లు లే  = గాధలే సరాగ  మే 

మాధవా ముకుంద మా = శ్రీధరా సు శీల మా 
ప్రేరణా సునంద మా  = వేషమే అనంత మా  

జీవితం వినోద మే  = జీవితం విషాద మే 
జీవితం ప్రభావ మే = జీవితం ప్రధాన మే 

శ్రీ మహేశ్వరీయె లే = శ్రీ మహా అశోక మే
శ్రీ విశాలమే యెలే  = శ్రీ ప్రభావమే యెలే


--(())--





నీ ఆలోచన నాకు నచ్చింది    ఛందస్సు               
సర్వేశి నూతన వృత్తము
గణములు - మ,స,న,స,త,జ,న,లఘువు  UU U II U  II II  UU U II U  II II
యతి -12
కాలాలెన్నయినా  కళకళము వేదాలున్నయినా కలకలము   
సామాన్యాన్ని  

వేదోద్ధారణ సేసినదెవరు? విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు? నాట్యానందము నొందెడిదెవరు?
ఆధారంబయి యుండెడిదెవరు? అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు? ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?

అంతా తానయి నిండెడిదెవరు ? ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ? శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు? కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు? స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

బోధన్‌ జేయుచుఁ దెల్పెడిదెవరు? ముక్తన్‌ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు? నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు? నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు? నీవే నేనని యన్నది యెవరు?

కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు?  కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు?  స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

--((***))--



దేవదత్త - ర/న/న/జ/ర/లగ UI UI III III - UI UI UIU
17 అత్యష్టి 44027


ప్రేమ పొంది తనువు మనసు - ధర్మ తత్వ దీవెనే
ప్రేమ కల్గి మగువ వయసు - మంచి మార్గ దీవెనే
ప్రేమ చింది చిలుక సొగసు - సేవ భావ దీవెనే
ప్రేమ దక్షత మగణి కల - నిత్య సత్య దీవెనే

మ్రోఁగె శంఖ రవము సమర - భూమియందుఁ బెద్దగా
తేఁగె శత్రు జనము నరుని - దేవదత్తమున్ వినన్
సాఁగె రథము భటుల నడుమ - సవ్యసాచి యమ్ములన్
వేగవేగ విడిచె నపుడు - వింటినుండి ధారగా

దేవదత్తమయిన వరము - దేవి దాను వాడఁగా
దేవదత్తమయిన శిశువు - దేవికిన్ జనించఁగా
దేవి దాను కలఁగి కలఁగి - తెల్లబోయె నప్పుడున్
పూవుఁ బోలు నిసుఁగు ననిచె - బుట్ట నుంచి నీటిపై

పాడ నొక్క తెలుఁగు పదము - పంకజాళి పూయుఁగా
పాడ నొక్క తెలుఁగు పదము - పాము లెల్ల నాడుఁగా
పాడ నొక్క తెలుఁగు పదము - పాయసమ్ము వద్దుగా
పాడ నొక్క తెలుఁగు పదము - వాణి యాలకించుఁగా

దేవదత్త వృత్తపు గణముల అమరికలో పంచమాత్రల నడక కూడ దాగియున్నది. ఒక విధముగా ఇది కూడ గర్భ కవిత్వమే, గతి గర్భ కవిత్వము. ఛందస్సులో పరిశోధనలు ఎందుకు చేయాలని ప్రశ్నించేవారికి ఇది కూడ ఒక జవాబు. ఖండగతిలో రెండు -



UIU IIIII - IIUI UIUIU

సుందరీ నిను గనఁగ - సొబగెల్ల నిండె నామదిన్
విందులే స్వరములను - విన నాకు తేనియల్ గదా
చిందవా యమృతమును - సెలవోలె పార నీ హృదిన్
ముందు రా ముదమియఁగ - పులకింతు మోహినీ సదా

నింగిలో నుడుపములు - నిశిలోన భాసిలెన్ గదా
దొంగలా జలదములు - దొగఱేని గప్పెఁ జూడఁగా
శృంగమం దతి సితము - హిమరాశి చెల్వముల్ గదా
రంగనిన్ గన మనము - రవళించి రాజిలున్ సదా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

హరవిలాస - ర/జ/ర/జ/న/గ 

UI UI UI UI - UI UI III U 
16 అష్టి 31403 

అంద మైన చంద మామ - యాకసాన వెలుగురా   

పండు గైన  సూర్య మామ - నింగి లోన వెలుగురా
పిల్ల పాప లందు మామ  - తల్లి తండ్రి వెలుగురా 
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా   

వెల్గు పంచె వేళ పూలు - కన్ను లోన యలరెగా 

చేను వీచే గాలి వచ్చె - కన్ను  రెప్ప యలరెగా   
వాన జల్లు మారుతమ్ము - సీత లమ్ము యలరెగా 
పిండి వంట వింత శోభ - పండు గాన  యలరెగా  

సఖ్య మేఘ పూల జల్లు -  మై రమించఁ గదలెఁగా

విశ్వ ధాత  సేవ గాధ - గోప్య భావ గదలెఁగా 
స్వశ్చ భాష వెల్గు లూగి - ప్రేమ భంధ గదలెఁగా
స్నేహ శాంతి పల్కు లేగ - పండ గంత గదలెఁగా
        
జాల శీత లమ్ము గాలి - సర్వమయ్యె జడముగాఁ 
ప్రేమ భావ సంత సమ్ము - ఇంటి యంత జడముగా 
రాగ తాళ పాట లందు - వింత ఆట జడముగా 
కల్సి మెల్సి పంచు కొందు - అంద రూను జడముగా 

వచ్చి పొయ్యె వారి మాట - సద్ది మూట అనుటయే
మంచి చేసి చెప్పు మాట  మంచి నీళ్లు అనుటయే
రాగ తాళ పాట లందు వింత ఆట అనుటయే
ఉండి లేదు అన్న ఉన్న - దంత పోవు అనుటయే 

తప్పు చేసి ఒప్పు వాద   -  మాట నీటి బుడగయే
సేవ భావ మున్న చేత కాని వాని మాట పడుటయే 
కల్సి మెల్సి పంచు కొందు సంబ రాన తినుటయే
ప్రేమ భావ సంత సమ్ము ఇంటి యంత వినుటయే

--((*))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి