28, జూన్ 2020, ఆదివారం



చెప్పు చుండెను మల్లాప్రగడ కథేల ?



శ్రీ కృష్ణ మందారము(7)
తేట గీతి పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వట్టి మనిషిగా పుట్టించి ఒప్పు తల్లి 
గట్టి మాటల ప్రేమతో బతకు తల్లి 
గడ్డి పరకగా పుట్టించి మూగ జీవి 
మట్టి మనిషిగా పుట్టించె  లోకమాయ 

సప్త సాగర సతతంబు నీదు శక్తి
సప్త పర్వత సతతంబు నీదు శక్తి
సప్త మారుత సతతంబు నీదు శక్తి
సప్త స్వరము లందించు తల్లి శక్తి 

 కీర్తి చరితంబు  లోకము లందు వెలుగు 
 శక్తి వినయంబు లోకము లందు వెలుగు 
 తృప్తి తరుణంబు లోకము లందు వెలుగు 
 దివ్య చరణంబు లోకము లందు రక్ష 

ఏడు రంగుల వేడుక జూపు వెలుగు 
ఏడు శక్తులు ఏకము జూపు వెలుగు 
ఏడు కొండలు వేడుక జేపు వెలుగు 
నిత్య సత్యము పల్కెటి తల్లి వెలుగు 

వేణు నాదమ్ము మాధుర్యం ప్రేమ వెలుగు 
ప్రేమ సాహిత్య మాధుర్యం కాల తలపు 
కాల సౌందర్య మాధుర్యం సేవ తెలుపు 
సేవ కారుణ్య మాధుర్యం తల్లి జరుపు
--(())--


Download Chaganti Pravachanalu Google Play softwares - awsp19zEazvP ...
గురుదేవులు, మన మార్గ దర్శకులు, వాచస్పతి బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వరరావు శర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

చాగంటి పలుకులు వెలలేని భాగ్యమ్ము 
దిశలెల్ల దీప్తి0చు తెలుగు వెలుగు   
మహిమాన్వితంబైన వాక్ధాటి  శక్తితొ  
భారత గాథలు తెలుపు వెలుగు 
కమనీయమౌ నీదుకారుణ్య లీలలన్,
పరమాత్మ భక్తితొ తెల్పు వెలుగు 
సంతోష మొసెగెడు శాంతి చేకూర్చేటి 
భారతరామాయణ కధ గీత వెలుగు  

ఎవరి కెవ్వరు బంధము తెల్పలేము 
తెలుగు వెల్గును పంచుట లక్ష్యమేగ 
భరత ఖండము వాక్ధాటి మరువలేదు 
తెల్పుచుండెను మల్లాప్రగడ మనస్సు  
--(())--


Oviyar K MADHAVAN ( 1906 - 1977 ) One of the Great Indian Artists and One of My Inspiration Artists in South India and Tamil Nadu - Artist Anikartick,Chennai,India
జీవన సత్యం 
సీసపద్యము 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అనురాగ ఆనంద కారుణ్య విక్షనల్ 
జీవితం లో ఏసమయయము నైన  
వెలలేని యానంద- అక్రమ సంపదల్
మురిపించు సౌఖ్యపు సృష్టి చూడు  
సరిలేని సౌందర్య-సద్గుణ తేజముల్
కళలను కల్లోల మవును చూడు 
ఎనలేని నిర్వేద-వృష్ణినిన్ జల్లార్చి
ప్రేమను పొందియు పంచు చుండు 

సిరులు నాదిక్కు నామొక్కు-నీవె తండ్రి.!
కళలు  నాజన్మ భాగ్యంబు-నీవె తల్లి !
ప్రభలు నాయాత్మ బంధువు-నీవె గుర్వు !
చెప్పు చుండెను మల్లాప్రగడ మనస్సు   

--(())--

శృంగారం (అందం )
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
సీస పద్యము  

ఐస్వర్యకాంక్షతో నారట పడనేల? 
పెదవుల కాంక్షల పెరగ నేల?  
విషయలోలుండవై వెఱ్ఱినై పోనేల?
అద్దమ్ము ఆడది భద్ర మేల? 
పంచేద్రియమ్ముల-వలజిక్కి పోనేల?
పరువము భద్రత కోరు టేల ?  
సిరులకు మహిళకు మోహమ్ము మారుటేల?   
చీకటి వెలుగులు మార్పు టేల ?   

చురుకు మాటల్లో చురకలు పెరుగు చుండు 
కరకు మాటల్లో దడదడ పుట్టుచుండు    
కళల కులుకులు వణకును పుట్టు చుండు 
చెప్పు చుండెను మల్లాప్రగడ కథేల ? ....6 

--(())--

ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
గురువు 
సీస పద్యము 

యువతను విశ్వవిజేతలు గామార్చి 
వినయము నేర్పే టి గురువు యుక్తి 
ధైర్యము తోకార్యము జయమును తెప్పించు 
విద్యయు సహనము నేర్పు గురువు 
నిన్ను నీవు పరిపూర్ణడవని అనుకోకు
దేశకుటుంబము రక్షనీవు
శాస్త్రవాక్యములను నమ్మక ములను 
విశ్వాసము తెలిపేటి గురువు బోధ

సాస్త్ర వాక్కు నందు నిజాన్ని గమనించు
యువత విద్య యందు మునిగి ఉండు
నేర్చుకున్న విద్య సద్విని యోగము 
చేసె బుధ్ధి గురువు చెప్పు విద్య ....  5
--(())--

సీస పద్యము 

యువతకు సాధ్యము అనుకుంటె ఆగదు
చెరగని చిరునవ్వు వెంట ఉండు
బండరాయి నయిన మార్చేటి మనసు 
కలిగిన యువతకు తోడు ఉండు
దీక్షతో సంకల్ప దృష్టితో విద్యాస
హాయము వల్లనే నేర్పు చూపె
తల్లి తండ్రుల వినయ వీధిలో యువతకు 
ప్రత్యేక రక్షణ చూపు చుండు

యువత భావాలు ఎప్పుడు స్నేహ ముంచు
కధలు చెప్పియు గొప్పలు చెప్ప కుండు
ప్రేమ సయ్యాట మోదలి లాలి పాడు
కలుషిత మనసు కానట్టి బాల కృష్ణ .......   4
--())) - -


సీసము
ఇప్పుడు వెతకాలి గుండెలోతుల్లోకి
బర్వైన భాష్ప బిందువుల విలువ
కనుగుడ్లు రక్షగా రెప్పలు ఉన్నాయి
కళ్లలో నీటిని తుడుపు ఏది
కన్నీటి సంద్రము యీదక తప్పదు
గమనించ బడలేక  మునక లేస్తు
హృదయంతో  ప్రేమను పంచియు ఆశలు 
తీర్చినా మిగిలిన రక్త చలువ

దిమ్మ తిరిగి చెమట పట్టించే టట్లున్న
శ్వాస విలువ తెలిసి కొనియు మనసు 
విప్పి పల్కు నేర్పు చూపిన కన్నీరు
పొంగు తుంది మార్గ మేది కృష్ణ... 3
--(()) - - 

సీస పద్యము 

చల్లని వెన్నల సవ్వడి గాలుల 
ఆకుల కదలిక హాయి నొసగి 
జాజుల ఘమఘమ వాసనకు పరవస 
మోందియు సుమధర హాస మోంది 
విరిసిన నవ్వులు అలలుగ ఎగసినే
మనసును దోచెను తృప్తి కొరకు
గాజులు గలగల మోహము పెంచెను
రాధిక హృద్యమే కృష్ణ చేరె

చిలిపి పనులకు తహతహ చెందు చుండె
వలపు తలపుకు కలియుట ప్రోత్స హించె
కులుకు చూపుల వలలో కి చిక్కి యుండె
కరుణ తోరాధ కృష్ణుల ప్రేమ లీల.... 2

--(())--

సీసము 
కాలాన్ని కరగించు ఆకలి కోర్కయు 
దాహాన్ని తీర్చేటి శక్తి నీకె
వేణు గానముతొ మనసులను రంజిల్ల
పరచుట సత్యపు కృష్ణ లీల
మురిసి ముచ్చట సరసపు సుమ శృంగార
రసమయి కృపధర కృష్ణ లీల
ముద్దుగా ముది తను ప్రేమించి వలపును
పంచేటి సౌందర్య కృష్ణ లీల

 ఆటవెలది 
ప్రేమ పంచి సౌఖ్య మందించు గోపాల
విశ్వ ధాత్రి సామ  వేద కర్త
స్నేహ మధుర భావ కల్పనా చాతుర్య
సర్వ మాయ సృష్టి కర్త తేజ....  1
--(()) - -


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి