13, ఫిబ్రవరి 2020, గురువారం

ముద్దమందార మధురస్మృతి (7) (రోజువారీ కధ)



రక్తంలో ముంచి తీసినట్లున్న ఎరుపురంగు జడలు కట్టిన వెంట్రుకలు, వళ్ళంతా రాసుకున్న బూడిద, మురికి బారిన కాషాయరంగు వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు – చూడగానే భయం కొలిపే ఆకృతిలో వున్న ఒక సాధువులాంటి వ్యక్తి రామభద్రన్  ఎదురుగా నిలబడి వున్నాడు.
స్మశానాన్ని చూసి చలించని రామభద్రన్  లేత శరీరం అతన్ని చూసి చిన్నగా వణికింది. అతనదోలా నవ్వాడు.
“భయపడుతున్నావా?”
“ఊహూ” అబద్ధం చెబుతూ లేచి నిలబడ్డాడు రామభద్రన్ .


కొంతకష్టము వచ్చినా నెను కాళికా శృతి మర్వకా 
పంతమే మరి భక్తిశక్తియు ధారపోసిన రక్తమే 
చింతలే లెని మృత్యువున్నిజయించుటే కల కాదులే  
ఎంతకాలము కొల్చినందున కీప్సితార్ధము ఇచ్చునే 
 
“ఎవరు పోయేరు?”
“మా అత్త”
“అమ్మ లేదా?” ముందుకు నడుస్తూ అడిగేడతను.
“చచ్చిపోయింది.”
“నాన్న?”
“ఆయనా చచ్చిపోయేడు”
“ప్రస్తుతం ఎవరూ లేరన్నమాట!” అతను స్మశానానికి పక్కగా వున్న మర్రిచెట్టు క్రింద కూర్చుంటూ అన్నాడు.
రామభద్రన్  జవాబు చెప్పలేదు.
“రా!కూర్చో!”
అతని పక్కనే కూర్చున్నాడు రామభద్రన్ .

మూతిమీసాలు మిట్టగుడ్లను బుఱ్ఱముక్కుల గోరులున్ 
చేతిగోరులు జల్లిగడ్డము జిర్రనెత్తిని గాంచి నే 
భీతిచెందక బిచ్చగాడిగ ఉన్నవ్యక్తిని చూడగా 
తత్వపల్కులు అర్ధమవ్వుట కొంతకాలము పట్టెగా 

అతను తన జోలెలోంచి అన్నం, కూరలు బయటికి తీసి కొద్దిగా ఒక ఆకులో వేసిచ్చి “తిను” అన్నాడు.
“ఊహూ.. వద్దు” అన్నాడు రామభద్రన్  మొగమాటంగా.
“ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికినా ఆకలి, నిద్ర ఆగవు నాయినా! ఎన్నాళ్లని పొట్ట మాడ్చుకుంటావు తిను” అన్నాడతను తను తింటూ.
రామభద్రన్  అయిష్టంగానే ఆకు దగ్గరకి తీసుకుని మెల్లిగా అన్నం, కూర కలపసాగేడు.

వెన్నెల శ్వేత వర్ణమాలిక జీవంబునన చూడవా 
విన్నమాటలు నిన్నుబోలిన కష్టమే ఇక మారునా 
చిన్నపెద్దవి కోర్కలిమ్మని కాళికా శృతి చేసినా 
నిన్ను బంధ విమోచనం కలిపించుతా తిను అన్నమే

ఎక్కడో ముష్టెత్తి తెచ్చిన అన్నమది. అన్నం, కూరలు కలగాపులగంగా ఉన్నాయి. ఆకలనిపిస్తున్నా ఎప్పుడూ అలాంటి భోజనం తినలేదతను. అంతరాంతరాల్లో బాగా బతికిన భేషజమడ్డొచ్చినా ఆకలి అతన్ని తినేలా చేసింది. ఇద్దరూ ఆ పక్కనే వున్న చిన్న కుంటలో చేతులు కడుక్కున్నారు.
అతనా చెట్టు క్రిందే మేనిని వాల్చి గట్టిగా ఆవులించేడు.
రామభద్రన్ అతని పక్కనే కూర్చుని “మీరు తపస్సు చేసేరా?” అనడిగేడూ.
అతనవునన్నట్లుగా తల పంకించి “హరిద్వారం, ఋషికేష్ అన్నీ చుట్టొచ్చేం” అన్నాడు.
“దేని కోసం?”
రామభద్రన్  ప్రశ్నకి అతను తడబడినట్లుగా చూశాడు.
చివరికి “మనశ్శాంతి కోసం “అన్నాడూ నిదానంగా నవ్వి.

తరుణంలో శుభ సాధనే మనిషి ఆరోగ్యం సదానందమే
వినయంతో క్రమ సోధనే మమత మాధుర్యం సదాసుందరం
పద పల్కే  శ్రమ ఛేదనే యువత గాంభీర్యం సదావేదనం
గురువే చెప్పిన విద్యయే సమయ సందర్భం సమానం కదా      
 

ఆ జవాబు విని రామభద్రన్  నిరుత్సాహపడ్డాడు.

--(())-- 

అతని మొహంలోని ఆశాభంగాన్ని కనిపెట్టి “ఏదో అడగాలనుకుంటున్నావు కదూ!” అన్నాడు మెల్లిగా.
“మీకు మనశ్శాంతెందుకు లేదు?”
“అన్నీ పోగొట్టుకున్నాను కాబట్టి”
“అన్నీ అంటే… డబ్బా?”
“కాదు.. భార్యని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని.. అందర్నీ..”
“ఎలా?”
“ఉప్పెన. మహమ్మారిలాంటి ఉప్పెన ఆదమరచి నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒక్కసారి మీద
 పడి మమ్మనను ల్నందరినీ విడదీసింది. నాకొక్కడికే ఈత వచ్చు. ఎలాగో బతికి బయటపడ్డాను. 

ఉప్పెనే అని తక్కువచ్చెసి ఉన్ననూ గతి మార్చెనే 
చంపేనే ప్రాణులందరి చుట్ట చుట్టియు తర్మితర్మియే 
ఓపికున్నను భార్యబిడ్డను తల్లితండ్రిని నిద్రలో 
కప్పియే హరి ఈతవచ్చుట వల్లనే నను బత్కితీ 

 ఒక చెట్టు కొమ్మన మూడు రోజులు కూర్చున్నాను. పాములతో పాటూ. క్రింద కొట్టుకుపోతున్న శవాలు!”
“భయమెయ్యలేదూ?”
“ఎందుకు? అవి కూడా మనలాగే ప్రాణభయంతో వచ్చి చెట్ల మీద కూర్చున్నాయి. ఇక శవాలా? అంతకు ముందు క్షణం వరకు మనతో కలిసిమెలిసి తిరిగిన ఆప్తులవే కదా”
“మీవాళ్ల శవాలు దొరికేయా?”
“లేదు. వాళ్ల కోసం వెతుకుతుంటే వందలాది ఇతరుల శవాలు కనిపించేయి. 
దుఁఖంలోంచి విరక్తి ప్రవేశించింది. నాదనుకున్న పంట నాశనమైంది. నాదనుకున్న భూమి ఒండ్రుక కప్పేసింది. నాదనుకున్న ఇల్లు కూలిపోయింది. నాదనుకున్న మనుషులు కొట్టుకుపోయేరు. వైరాగ్యంతో రైలెక్కేను. ఎక్కడెక్కడో తిరిగేను. ఎవరెవరో స్వాముల్ని ఆశ్రయించేను. ఎంత తిరిగినా నాకా మనశ్శాంతి లభించనే లేదు నాయినా?”

ప్రేమనా త్రితులందు కొందరిబిల్చి సంతసమందగా 
భూములిచ్చెను గీములిచ్చెను భూరి దాతయగున్ సుమీ 
కామితార్దములిచ్చి నిత్యముగావుమా హనుమంనృపున్ 
శ్రీమనోహరి తల్లికాళిక సేవలే హనుమంనృపున్
 
అతని వైపు రామభద్రన్  సందేహంగా చూశాడు.
“మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలో మీకు తోచనేలేదా?”
అతను రామభద్రన్  కేసి అదోలా చూసి “ఏం చేయాలి?” అనడిగేడు.
“మరణం లేకుండా చెయ్యడం. ఆ విద్య మీకెవరూ నేర్పలేదా?”
అతను రామభద్రన్  వైపు విభ్రమంగా చూసి “అదెలా సాధ్యం?” అనడిగేడు.
“ఎందుకు సాధ్యం కాదు? రెండు సన్నని ఇనుప పట్టాలు పట్టుకుని రైలంత వేగంగా ఎలా పరుగు తీస్తోంది? అంత బరువైన విమానం గాలిలోకెలా లేచి అంత వేగంగా వేళ్తోంది. కొన్ని వేల మైళ్ల అవతల మనిషి మాట్లాడిన మాటలు టెలిఫోనులో అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నాయి. అలాగే చావులేని మందో, మంత్రమో ఒకటుండి తీరుతుంది. దాని కనుక్కోవాలన్న జిజ్ఞాస వస్తే తప్పకుండా సాధ్యమవుతుంది స్వామి!”
ఈసారి సాధువు కళ్లకి రామభద్రన్  ఒక పదమూడేళ్ళ పసికుర్రాడిలా కనిపించలేదు. 

వేలమైళ్ళలొ కల్గినట్టివి వింతవిడ్డుర గాధలే 
గాలిలో లెచి వేగంగా కదిలే విమానపు పర్గులే 
గోళరోగికి మందుమాకుయు ప్రాణమేరకు పోసియే 
కాలమాయయు మృత్యఆటకు మంత్రమో ఇకఆపదా 

అంతకంతకు లోతైన మరో మనిషి అతనిలో వున్నాడనిపించింది. అతను చాలాసేపు ఆలొచిస్తూ, నింగిలోని మిణుకుమిణుకుమనే నక్షత్రాల్ని తదేకంగా చూస్తూ పడుకున్నాడు.
ఆకలి కొద్దిగా తీరడంతో రామభద్రన్  కూడా అక్కడే ఒరిగి నిద్రపోయేడు.
తెలతెలవారుతుండగా రామభద్రన్ ని ఎవరో కుదిపి లేపటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
ఎదురుగా సాధువు!
“పద, పోదాం!”
“ఎక్కడికి?”
“మరణానికి మందు కనుక్కుందాం”
 
చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం  కదా 
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా         
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాధానమే  


ఆ మాట వినగానే రామభద్రన్  లో ఉత్సాహం చోటు చేసుకుంది. అతన్ని వెంబడించేడు.
తిన్నగా రైల్వే స్టేషనుకెళ్ళి ఇద్దరూ రైలెక్కేరు.
రైలు మద్రాసులో ఆగింది.
అక్కడ తిరిగి బస్సెక్కేరు. బస్సు సాయంత్రానికి కుంభకోణం దగ్గరున్న ఒక చిన్న కుగ్రామంలో ఆగింది. కాలినడకన ఆ దగ్గర ప్రాంతంలో వున్న చిన్న అడవిలోకి తీసుకెళ్ళేడతన్ని సాధువు.
 
సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే రిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా   


ఒక రెండు కిలోమీటర్లు నడిచేక ఒక చిన్న తాటాకు గుడిసె ముందాగాడు సాధువు. చిన్నగా గుమ్మాన్ని మూసివున్న తడిక మీద తట్టేడు.
అయిదు నిమిషాలనంతరం తడిక చిన్నగా తెరుచుకుంది.

--(())--

ఆకలితోనూ, ఎంతో దూరం కాలినడకన నడిచిన నీరసంతోనూ తూలుతున్నాడు రామభద్రన్ . తడిక తెరుచుకోగానే కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం జలదరించింది.
ఎదురుగా నాలుక బయటికి సాచి, జుట్టు విరబోసుకుని కపాలహారం మెడలో ధరించిన ఎనిమిది చేతుల కాళి విగ్రహం వికృతంగా బెదిరిస్తున్నట్లుగా కనిపించింది. అంతకంటే భయానక దృశ్యమేమిటంటే తెల్లని గడ్డమున్న ఒక నల్లని కంచు విగ్రహంలాంటి మనిషి ఒక గొర్రెపోతుని చంపి దాని తలని పట్టుకుని రక్తాన్ని ఒక గిన్నెలోకి పడుతున్నాడు.
కార్తి వణికిపోతూ సాధువు నడుంని గట్టిగా పట్టుకున్నాడు.
 సాధువు చిన్నగా నవ్వి “భయపడ్డావా?” అనడిగేడు.
రామభద్రన్  జవాబు చెప్పలేదు.

                బూరుగు మాని యున్నతియు, బూవులు బిందెలు జూచి యాసతో
                గీరము లాఱునెల్లు తమకించుచునుండి ఫలాభిలాషితన్
                జేరి రసంబు గ్రోలుటకు జించిన దూదియు రేగునట్టు, లా
                కూరిమిలేని రాజులను గొల్చుట ; బెమ్మయసింగధీమణీ!

                భావము:--బూరుగు చెట్టు పెద్దగా వుండి పూవులు పిందెలు బాగా ఉండుట చూసి చిలుకలు ఆరునెలలు ఆత్రుతతో ఎదురు చూసి ఆ ఫలముల రసమును గ్రోలుటకు ఆకాయలను కొట్టగాబూరుగు దూది రేగి అవి ఉక్కిరిబిక్కిరి అగునట్లు దానగుణము లేని రాజులను కొలుచుటకూడా ఇటువంటి ప్రయోజనము లేనిదే.
 


ఎర్రని, చిక్కని రక్తంతో పాత్ర నిండుతుంటే పక్కనే పడివున్న గొర్రెపోతు మొండెం చాలాసేపు కొట్టుకుని నిటారుగా బిగిసిపోయింది.
ప్రాణం పంచభూతాలలో కలిసిపోతూ, పోతూ చేసిన పోరాటం హృదయవిదారకంగా మనసుని తీవ్రంగా చలింపచేసేదిగా వుంది.
రామభద్రన్  పెదవులు సన్నగా వనికేయి.
అప్పటికప్పుడే అతని శరీరం వేడెక్కి జ్వరమొచ్చినట్లయింది.
సాధువు కార్తి నడుం చుట్టూ చెయ్యేసి చిన్నగా తడుతూ”నమస్తే ” అన్నాడు.
కంచు విగ్రహం తల తిప్పి సాధువు వైపు, రామభద్రన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి “కూర్చో! దేవికి హారతి చేసి మాట్లాడతాను” అన్నాడు తెలుగు లోనే.
చూస్తుండగానే సాధువు  అరచేతిలో కర్పూరముంచుకొని శంఖాన్ని పూరిస్తూ దేవికి హారతిచ్చేడు. అతని శిష్యుడు గంట వాయించేడు. క్షణాల్లో ఆ ప్రడేశమంతా ఏదో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లనిపించింది. కర్పూరహారతి కాంతిలో కాళి విగ్రహం ఎర్రగా మరింత భయానకంగా కనిపించింది.
హారతికాగానే సాధువు  గిన్నెలో పట్టిన రక్తానంతా గడగడా తాగేసేడు.
రామభద్రన్  అతన్ని మరింత భయంగా చూసేడు.

                అతడును మందహాస సహితాలవంబును, సత్యభాషణ
                వ్రతమును సంవిభాగ నిరవద్యతయున్ వి
                జ్ఞతయు, జితేంద్రియత్వము, ప్రసాదగుణంబును గల్గి భూమికి౦
                పితృ సముడై విరోధి జన భీషణ సారత నొప్ప పెంపగున్
              
శాంతంగా ఉండటం, సత్యాన్నే పలకడం, స్వచ్చతతో జీవించడం, ద్రోహచింతన లేకపోవడం,అనేవి తిక్కన ఉపదేశించిన ఉత్తమ గుణాలు.పాలకుల మోమున చిరునవ్వు కనపడాలి, సత్యవ్రతాచరణలో వారు నిమగ్నులై ఉండాలి.తన పాలనలో అన్ని వర్గాలవారికి సమాన ప్రతిఫలాలు లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.యిదే పరిపాలనా దక్షతంటే. సుస్థిర రాజ్యపాలన లేని రాజ్యంలో దోపిడీలు,దొంగతనాలు, మహిళల పై మ్రింగినట్లు అలావంతులు బలహీనుల్ని హింసిస్తారనేది కవి హెచ్చరిక.
 

అని పలుకుతూ
రక్తతీర్థం తీసుకున్నాక మూతి తుడుచుకుంటూ పక్కనే వున్న చాపమీద కూర్చుని “ఎందుకొచ్చేవు? అప్పుడు కాదని వెళ్ళిపోయేవుగా?” అనడిగేడు సాధువుని.
“అప్పుడెందుకో భయపడ్డాను. అనుకోకుండా వీడు కనపడ్డాడు. తిరిగి ఆశ కల్గింది.”
సాధువు రామభద్రన్ తేరిపార చూసేడు.

--(())--

“అంటే వీడికి రక్తసంబంధీకులెవరూ లేరా?”
“అందరూ పోయేరు. మావయ్య వున్నాడంట కాని అతను రక్తసంబంధీకుడు కాదు. మేనత్త మొగుడు. వీడి వయసు పదిహేనులోపునే”
 తల పంకించేడు.
“ఇది కార్తీకం. క్షుద్రోపాసనకి పనికిరాదు. మార్గశిరంలో వచ్చే అమావాస్య ఘడియలు కాళీ ఉపాసనకి బహు మంచి ముహూర్తం. వీడికేం చెప్పలేదు కదూ!”
“లేదు. మరణాన్ని జయించాలని వాడి కోరిక.”
“మంచిది. ఈ పది రోజులూ వీడు రెండు సంధ్యలలోనూ తలార స్నానం చేసి పూజలో కూర్చోవాలి. ఇదంతా మరణరాహిత్యం కోసమేనని వీడు గట్టిగా నమ్మాలి. నేను రేపొచ్చే ఆదివారం రాహుకాలంలో భైరవ పూజ మొదలుపెడతాను. జాగ్రత్త!”
సాధువు తల పంకించేడు.
సంభాషణంతా తెలుగు లో సాగడం వలన రామభద్రన్ ఏమీ ఆర్ధం చేసుకోలేకపోయేడు.
కార్తిని తీసుకొని గుడిసె బయటకొచ్చేడు సాధువు.
“నాకు భయమేస్తుంది!” అన్నాడు చిన్నగా వణుకుతూ.
“దేనికి? ఏం చేయకుండానే చావుని జయింపడమెలా? పద, నదిలో స్నానం చేసి పూజలో కూర్చుందువుగాని!” సాధువు ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించేడు కార్తి, చావుని జయించబోతున్నానన్న నమ్మకము, సంతోషంలో.

*****

ఎదురుగా హోమగుండం జ్వలితజ్వాలమై శాఖోపశాఖలుగా, శిఖోపశిఖలుగా వేయి నాలుకలు చాపి సిరియక్కారన్ చెక్క తెడ్డుతో పోస్తున్న ఆవు నేతిని ఎగిరెగిరి అందుకుంటూ మండుతోంది.
ఆ హోమజ్వాలలో సిరియక్కారన్ నేరేడు పండు రంగు మొహంలో కళ్ళు ఎర్రని పత్తికాయల్లా ఒక దారుణాన్ని చేయబోయే ముందు మనిషి భావాలకి దర్పణం పడుతున్నట్లు క్రౌర్యంగా ఉన్నాయి.
హోమగుండానికెదురుగా కార్తికేయన్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎర్రని పంచె కట్టుకుని మెడలో పూలదండ, నుదుట రుద్రుడి లయనేత్రం లాంటి ఎర్రని బొట్టు. హోమకాంతి అతని పచ్చని శరీరం మీద పడి పరావర్తనం చెంది ఆ గదంతా చెదిరిపోతున్నది.
సాధువు మరో పక్కన కూర్చుని హోమగుండంలో సమిధలు వేస్తున్నాడు.
“ఇప్పుడు నేనన్నట్లుగా చెప్పు” సిరయక్కారన్ మాటలర్ధం కాక సాధువు వైపు చూసేడు కార్తికేయన్.
“ఆయనేమంటే అదను” అని సాధువు తర్జుమా చేసేడు.
కార్తి తలూపేడు.
అతని మొహంలో వచ్చిన నాటి భయం లేదు. నాలుక సాచి వికృతంగా గుడ్లురిమి చూస్తున్న కాళికా విగ్రహాన్ని చూసినా, శంఖానాదం, ఘంటారవాల ఘోషల మధ్య మేకపోతుని బలిచ్చి ఆ రక్తాన్ని నారికేళపాకంలా స్వీకరిస్తున్న సిరియక్కారన్‌ని చూసినా, కత్తివ్రేటు పడి గిలగిలా తన్నుకుంటున్న మూగజీవాన్ని చూసినా కార్తి ఏమాత్రం చలించడం లేదు. అంతే కాదు. ఉభయసంధ్యలలో అతడు వేలు తగిలినా జివ్వున లాగేసే నదీ మధ్య భాగంలో నిలబడి సాధువు చెప్పిన స్తోత్రాన్ని వల్లిస్తున్నాడు.
కటిక నేల మీద పడుకుంటున్నాడు. ఏకభుక్తంగా జీవిస్తున్నాడు.
అన్నింటికి మించి అర్ధరాత్రి స్మశానంలో జరిపే క్షుద్ర పూజలకి సిరియక్కారన్‌తో హాజరవుతున్నాడు.
కారణం – తను మరణాన్ని జయించే మహారహస్యాన్ని తెలుసుకు తీరాలనే తీవ్ర తపన.
కొద్ది క్షణాల్లో ఆ రహస్యం తనకి తెలిసిపోతుంది.
ఓం, హైం హ్రీం, క్లీం భం భం భం భైరవాయ నమః
ఓం హైం హ్రీం, శ్రీం క్లీం దుం దుం దుం దుర్గాయ నమః
నీచోపాసక సౌలభ్యీ, వికార రూపధారిణి
అతి భయంకర విరూపాక్షి ప్రసన్నేకాళీ!
నిధి నిమిత్తే స్వప్రాణం దారాధత్తం!
ఓం! ఓం! ఓం!
కార్తి సిరియక్కారన్ చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించేడు.
అతని మంత్రానికి బలాన్ని, శక్తిని యిచ్చి దేవిని ప్రసన్నం చేసుకోవడానికన్నట్లుగా సిరియక్కారన్ శిష్యుడు గంటని ఆ అడవంతా దద్దరిల్లేలా వాయించేడు. సాధువు శంఖాన్ని పూరించేడు. ఆ నాదం శబ్ద తరంగాలుగా మారి దశదిశలూ వ్యాపించి ఆ అడవినంతా ఠారెత్తించింది.
అసలే ఆర్ధరాత్రి – కీచురాళ్ల ధ్వనులు – అప్పుడప్పుడు పక్షుల కలకలరావాలు తప్ప మరే శబ్దమూ లేని ఆ నీరవ స్తబ్దరాత్రి ఆ శబ్దానికే భూకంపం వచ్చినట్లు కదిలింది.
ఎక్కడో ఒక ఏనుగు నిద్రాభంగమై ఘీంకరించింది.
పక్షుల సముదాయం గూళ్ళలో మేల్కొని భయంతో రెక్కలు టపటపలాడించేయి. లేళ్ళూ, కుందేళ్ళూ వణికేయి. పేరు తెలీని ఎన్నో ప్రాణులు భయోత్పాతానికి లోనయి ముడుచుకుని ఆ శబ్దం వచ్చిన వేపుకి దృష్టిని సారించేయి. సరిగ్గా అప్పుడే సిరియక్కారన్ లేచి నిలబడ్డాడు.
కార్తి దీర్ఘంగా కళ్ళు మూసుకొని కాళి జపం చేస్తూనే ఉన్నాడు.
సాధువు లేచి గొడ్డలిని అందించేడు సిరియక్కారన్‌కి.
“జై కాళి మాతా! జై భైరవే!” అంటూ గొడ్డలిని ఎత్తేడు సిరియక్కారన్ మహావేశంతో.
పైకి లేచిన గొడ్డలి ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలీని కార్తికేయన్ మెడని ఒక్క వ్రేటుతో నరకడానికి సిద్ధపడుతున్న ఆ భయంకర క్షణంలో ఆ గుడిసె తలుపులు తెరుచుకోవడమూ, బయట నిలబడిన వ్యక్తి కాల్చిన రైఫిల్‌లోని తూటా సిరియక్కారన్ ముంజేతిలోంచి దూసుకుపోవడం ఒక్కసారే జరిగేయి.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి కార్తి కళ్ళు తెరిచేడు.
“అబ్బా!” అంటూ ముంజేతిని పట్టుకుని సిరియక్కారన్ నేలమీదికి కూలిపోయేడు.
ఏం జరిగిందో తెలుసుకునే లోపున ఆ ప్రాంతమంతా శక్తివంతమైన టార్చిలైట్ల కాంతితో నిండిపోయింది.
టకటకా బూట్ల శబ్దంతో ఆ గుడిసెని చుట్టుముట్టేరు పోలీసులు. క్షణాల్లో సిరియక్కారన్‌కి, సాధువుకి, అతని శిష్యుడికి బేడీలు పడ్డాయి. అందర్నీ ఎక్కించుకున్న పోలీసు వేన్ కుంభకోణం వైపు శబ్దం చేస్తూ పరుగెట్టింది.

******************



చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం  కదా 
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా         
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాధానమే

సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే రిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా   


 

1 కామెంట్‌:

  1. As reported by Stanford Medical, It is in fact the ONLY reason women in this country get to live 10 years longer and weigh an average of 19 kilos less than us.

    (Just so you know, it has totally NOTHING to do with genetics or some secret-exercise and EVERYTHING to do with "how" they eat.)

    BTW, I said "HOW", and not "WHAT"...

    TAP on this link to find out if this quick questionnaire can help you unlock your real weight loss potential

    రిప్లయితొలగించండి