10, ఫిబ్రవరి 2020, సోమవారం

మాతృశ్రీ వందన పుష్పాలు




Image may contain: 2 people

కృష్ణానీ తపనే మనస్సు చరితం చెప్పాలి ఆకాంక్షగా
ఇష్టంగా కథలే తపస్సు ఫలితం కల్పించి ఉన్నావులే 
కృష్ణాశక్తిని యుక్తినీ కళలనూ  తెల్సున్న రాముడ్ని మా 
ఇష్టాల్నే తెలిసే మనో ఫలమునే తీర్చేటి దేవుండివే     



Tanjore Painting Online - TTAGALLERY | Tamil Tanjore Art Gallery
మాతృశ్రీ వందన పుష్పాలు
మత్తకోకిల భావాలు 

శ్రీ మనోహరి భక్తితో నిను జిత్తమందు నుతించినన్
గామితార్దము లియకుండిన   కారణంబున గిన్క మై
ఏమి సేయుదు మత్తకోకిల వృత్తాభాషితమైన నా 
శ్రమ ఓ పరి నీ దయా మము కావుగా మది కోరెదన్

గౌరవంబుగ గీత మానస తెల్పుటే మమ శక్తియే
పేరు పేరున పూజ సేయఁగ బాధలే మమ భక్తిగా
ఖర్చు సంపదే ఎంత తెల్పినా నీకులే మమ యుక్తిగా
జేర్చి తెల్పితి దేవ దానవ కొల్చినట్లునె వేడి తీ

అందు చేతనె ఎంత తెల్పిన తక్కువే మమ వేదనా
పొందు కోరితి చిందు లేసితి మొనమే మమ మాయగా 
నింద చేయను తప్పు చేయను ఒప్పుగా మమ పూజలే
విందు చేసితి సద్దు చేయక మమ్ము కాచియు ఉందులే

పూన్కి నెంతగ వేడుచున్నను బ్రోవకుండిన నిన్ను నీ
వెన్క ముందవ తారమే మము కావుకాసిన మిమ్ము మా 
మన్ననే మది వాక్కులే సిరి సంపదున్నను తెల్పితీ
కన్ననేస్తము మర్చిపోయిన బాధలేదులె తల్లిగా 


Painting Indian Woman Canvases 65+ Ideas For 2019 #painting



చీకటైనను వెల్గుఉన్నను తల్లినామము సాగియే
మక్కువైనను కోపమున్నను మాతగా మము కాచితీ
చిక్కులున్నను తేలికైనను అమ్మగా మము మార్చుటే
తక్కువైనను ఎక్కువైనను కోపతాపము నీ కృపా

అన్ననైనను అక్కనైనను ఆదుకుంటుట నీకృపా
ఎన్నిచెప్పిన మబ్బులేకయు వర్షమే పడితే మనో
మన్ననే గుణ మార్పులే విధి భావమే నిను చూడకు
న్నాననే నెపమే ననే పలు మాటలే మనసే ఇదే

మంచిఅన్నను చెడ్డ అన్నను ఉన్నమాటను తెల్పితీ
పొంచి ఉన్నవి పందికొక్కులు గుంటనక్కలు ఎట్టగా
వచ్చిచెప్పితి నమ్మివాక్కును తల్లిగా మము చూచుటే
ఇచ్చమున్నను లేకున్నను మనోగతం విను మాతయే

మూడుకన్నులు ఉన్నవానికి తక్కువే అయినా మన
స్సీడుపంచియు చెప్పడానికి ఏమియూ అనకా. వయ
స్సీడు కల్పియు ఒప్పడానికి తెల్పియూ మము జూచి కా
పాడు పార్వతి విన్నవించితి తప్పుఒప్పులను తల్లిగా


Drawing sad sketches cartoon 24 Ideas 

పేరుతెచ్చిన దూరుతెచ్చిన పృథ్వినొక్కటి తల్లిగా
మారుపల్కగ మంచిమాటలు చెప్పెదొక్కటి మాటగా
తీరుతెన్నెలు ఒక్కమాదిరి ఉండునట్లుగ పల్కులే
శ్రీరమాధిప మేలుచేయుట నీవంతే భరతమ్ముగా

అల్పచర్యలె మంద బుద్ధులు చేయుటే మది బాధ్యతే
కల్పితంబులు  గావు తొల్లిటి గాధలన్ బరికింపగా
శిల్పమేర్పడి కష్టనష్టము తెచ్చుమార్పుల తల్లిగా

కల్పనా చతురత్వమే సుమ మాలికా మది భాగ్యమే 

చోరుడైనను వీరుడైనను అమ్మబిడ్డయె ఒప్పుకో
భీరుడైనను ధీరుడైనను తత్వమార్గమె ఒప్పుకో
చిన్నదైనను పెద్దదైనను ఆశసేవయె ఒప్పుకో
ఓర్పుఉండియె తీర్పు చెప్పియె అమ్మమాటయె ఒప్పుకో

స్వేదమేర్పడె మొహమేర్పడె దాహమేర్పడె బత్కులో
నిత్యసత్యమె నిత్యధర్మమె సౌమ్యవాదమె బత్కులో
వింతఆటలు వింత మాటలు వింతశోభలు బత్కులో
ఒప్పునేర్పులు తప్పుమార్పులు చిక్కుచింతలు బత్కులో
 

 Meerabai - (Wall Hanging) - Contemporary Hand Painted (Painting on Woven Bamboo Strands)


మానసం మమతానురాగము చుట్టునూ తిరిగేటిదే
మౌనరాగము తీర్పురోగము మాటిమాటికి ఒప్పునే 
వానమల్లెయు వచ్చిపోవుట మంచిచేసియు చెప్పుటే 
కన్నతల్లిగ సేవచేసియు రక్ష కల్పియు ఉండుటే 

రామకృష్ణను వేడుకుందును నిత్యపూజయు చేసెదన్
అమ్మకైనను నాన్నకైనను సేవచేసియు ఉండెదన్
మామఅత్తను అక్కబావను కాలమాయను కొల్చెదన్
క్షేమమేఇది దేహమేఇది కర్మమే ఇది తెల్పితిన్
 

మంచి పేరుగ  మందబుద్ధిని మార్చనంటివి  మోహనం 
నుంచి నేరుగ శంక బుద్ధిని మార్పుచేసితి మోహనా 
ఉంచి కాదనే స్థితిప్రఙ్ఞను నాకు నీకును కాదులే 
పొంచిఉన్నను ముప్పు నంతయు తప్పిదమ్ములే మోహనా 

సృష్టిలోకధ వేడినిచ్చియు చల్లగిచ్చియు నీడలో 
తృష్ణలో కధ సత్యబోధయు ధర్మమార్గము నీడలో 
ఇష్టిలో కధ పుణ్యపాపము మంచిచెడ్డలు నీడలో 
కృష్ణలో కధ మంచిచేసియు చెడ్డచాపియు నీడలో

Art - India: maritana — LiveJournal

భావతీక్షణ యుక్తధారలు తీవ్రమాస్రిత పొందుకే 
యావపొందియు మౌనదీక్షతొ నిగ్రహమ్ముతొ పొందుకే
సవ్యసాచిగ నిండు యవ్వన కౌగిలింతయు పొందుకే 
మువ్వచిందులు గువ్వగూటికి చేరినంతను పొందుకే 

వత్సరంబుయు పెర్గియున్నను దేహమాకృతి మారదే 
నిశ్చితంబుయు కల్గియున్నను కామితార్దము మారదే 
వచ్చిపోవును మబ్బువల్లెను శక్తియంతయు మారదే 
నిచ్చసత్యము చెప్పుతున్నను వేదభూమియు మారదే 


మల్లెతీగయు ఏకమల్లెను పూచియే సుమ అందమే 
తల్లిభాధయు అంతయూ సుమ గంధమే మరి అందమే 
వల్లి ఆకృతి వెన్నెలద్దియు సంధ్యవెల్గుగ అందమే 
వల్లిమల్లిగ  సద్దుచేయగ తల్లిమాటలొ అందమే

చీకటింకయు మార్పుతేకయు పృథ్వినంతయు విస్తరే 
చీకుచింతయు లేకయే మరి చల్లగాలితొ విస్తరే
ఆకు మారక వెల్గుకంతకు ధైర్య మొప్పఁక విస్తరే  
రేఖ మోహము తీవ్ర మెత్తగ దొంగలా జొర  విస్తరే


బిడ్డమాటకు జంకకుండగ  నిప్పుకోడిల వుండెనే 
అడ్డమొచ్చిన మాటమార్చక పూజచేయుట కుండనే 
నడ్డిపెర్గియు అందచందము ఉప్పుకారము అయ్యెనే 
దొడ్దిఅంతయు గుప్పుగుప్పున మళ్ళేవాసన ఉండనే 

ఉత్సవం మది  గుర్తుకొచ్చియు  గమ్ము కుండగ తొందరే 
మత్యమల్లెయు  పాఠమంతయు వేదమాయెగ తొందరే
సత్యపల్కుయు శాంతిమార్గము బిడ్డలేఖకు తొందరే 
నిత్యసత్యము బత్కునీడలో అమ్మతోడుకు తొందరే 

సంతసం ఒక ఆణిముత్యము సుస్వరస్వము హాయిగా
వింతమాయయు దేహమంతయు కమ్ముకోటము హాయిగా
చింతలేకయు సంతసమ్ముగ అమ్మపక్కన హాయిగా
నీతివల్లన విద్యసాధన అందచందము హాయిగా 

ఉన్నమాటకు మాటమాటయు కల్పకుండగ పల్కుటే 
అన్నమాటకు కట్టుబాటుకు తల్లితో లిఖి పల్కుటే 
కన్నవారికి కష్టనష్టము బిడ్దతీర్చియు పల్కుటే 
చిన్నెలన్నియు వన్నెలన్నియు కన్నెపల్కులు పల్కుటే     

A969
పాత్రుడంచు ప్రభుత్వమందలి ప్రౌఢులెందరొ యోగ్యతా 
పత్రముల్ దయ చేయుటే లిఖి ప్రజ్ఞతే బహుమానము పొందుటే
స్తోత్రముల్ విని చిత్తశుద్ధియు లెక్కవేసియు ఇచ్చుటే 
క్షేత్రగావుము ముద్దమల్లిక విద్యసొంతము పొందుటే  

 దేవుడే  నిజ భక్తినే కను లారగా గమ నించియే 
జీవుడే తమ వేదమే విను భావమే జయ మిచ్చుటే 
 రేవుకే చెరు సంద్రమే పలు ఉర్కళే లిఖి ఇష్టమే 
నీవునేను అనే పదం లత తల్లిమాటయె పల్కులే   

చిన్నబుచ్చుట అంబరం కళ మారుటే లిఖి ఊహాలే
కన్నమాటకి విచ్చు రెక్కలు కొత్తపొంతల ఊహాలే 
ముత్యమల్లెను రాత్రివెల్తురు మంచుబిందువు ఊహాలే
సప్తవర్ణపు కాంతిరేఖలు బిడ్డకళ్లకు ఊహాలే    

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 


ఏమిజర్గునొ ఎంతనొప్పునొ భాద్యతల్లును గుర్తుగా
మంచిచేసియు చెడ్డచేసియు తల్లిసేవల గుర్తుగా 
దెబ్బతిన్నను కష్టమున్నను బిడ్డపెంపక గుర్తుగా 
భర్తలోటును అగ్నిసాక్షిగ మభ్యపెట్టుచు గుర్తుగా 


అంబరం కదిలే మబ్బు లతొ ఉండిఉండక నీలమై 
సంబరం జరిపే మనుష్యులు బత్కి బత్కక నీలమై 
నిబ్బరం లెక కన్నవారును పెంచినారును నీలమై 
డబ్బులున్నను శాంతిలేకయు తిండియర్గక నీలమై 

అండమార్పిడి వచ్చుటె ఇక జాలిగుండెకు బాధయే 
తోడునీడన ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిండుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
చెడ్డచేసిన మృత్యవే మము ఏవగించుట ఎందుకో
  
కాలసర్పము కాటువేసియు రాక్షసీ వలె ఎందుకో 
ఆలుబిడ్డల ఆశపాశము అంటివుండుట ఎందుకో 
జోలపాలన  బీదవారిని మృత్యువే కబళించెనే 
కల్లలాడుట మృత్యురాతయు ఎవ్వరీ తరమవ్వునో




మంచిగా మృత్యు నీయవేయన మారుపల్కగ యిట్లుగా
వంచనే  గతి తెల్పకే మము కోపతాపమున ఎందుకో 
మంచు గడ్డల ఉండుటే మనజీవితం అనరెందుకో 
ఇంచుమించున ఒక్కరొక్కరు కల్సిమెల్సియు ఉందురో 

కాలసర్పమె వెంటవెంటనె మింగివేసిన తప్పెగా 
నీలిమేఘమె వెంటవెంటనె గాలిమింగిన తప్పెగా 
లాలిపాటయె వెంటవెంటనె జాలిమింగిన తప్పెగా 
గోలచేసిన వెంటవెంటనె     లొంగి పోవుట తప్పెగా

భక్తిభావమె ఉండవచ్చులె మారణం తొలగించునా 
చెక్కముక్కను పండుగే అని పుష్టిగా తిని ఉండినా 
ఏకమొత్తము సంబరమ్మన వచ్చినా తిని బత్కునా 
పక్కపక్కన ఆశపాశము కల్సిమెల్సిన నాశనం    


మంచిగా మృతినీయవేయన మారుపల్కగ యిట్లుగా
వంచనే  గతి తెల్పకే మము కోపతాపమున ఎందుకో 
మంచు గడ్డల ఉండుటే మనజీవితం అనరెందుకో 
ఇంచుమించున ఒక్కరొక్కరు కల్సిమెల్సియు ఉందురో 

"The heart is like a garden. It can grow seeds of compassion, or fear, resentment or love. What seeds will you plant there?" ~ Buddha ♥ Art by Dhananjay Mukherjee

భక్తిభావమె ఉండవచ్చులె మారణం తొలగించునా 
చెక్కముక్కను పండుగే అని పుష్టిగా తిని ఉండినా 
ఏకమొత్తము సంబరమ్మన వచ్చినా తిని బత్కునా 
పక్కపక్కన ఆశపాశము కల్సిమెల్సిన నాశనం    


చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో


నిన్నునీ మహిమం బెరుంగక  నిందచేసియు ఉండెనా 
కాన మాయకు చిక్కి ఉండితి చేయ లేకయు ఉండెనా 
మానుకున్నను ఆకలే మరి బత్కుమార్గము ఉండదే 
మానుమర్మము ఎంతచూసిన కాలధర్మము మారదే 


స్వాభిమానము విద్యమానము మండుటెండల మాదిరే 
ఆభిజాడ్యము అమ్మనాన్నల అత్తమామల మాదిరే 
భిభత్యమము వచ్చిపోవును మానుషం కథమాదిరే 
జెబ్బజర్చియు మొండిపట్టుగ బత్కుకోరుట కష్టమే


Near Emerald Lake Lodge, Timothy Sorsdahl, Art.com  Gotta love those blues and gold!
హానియే చెయ కుండినా  మది ఎవ్వరూ కన కుండాగా
ప్రాణియే ఇక లేదు అన్నను దీపమెత్తియు యుండగా 
మేనమామయు లేరులేరులె వంతపల్కిన అండగా 
అన్నపూర్ణయు లేరులేరులె అన్నపల్కులు బాధగా

 అమ్మఅమ్మని అన్న పట్టని లోకమే ఇది ఏంచెసా 
కో మనస్సుని వేదించితిని దారిదొర్కలె  ఏంచెసా 
కో మృదుత్వము ముంపుకే అని తల్చినానులె ఏంచెసా
కో మమేకము ఓర్పుతో విని ఓర్పుతో కనె జీవితం 

అమ్మబాబును పొట్టపెట్టిన వింతపాదము ఎందుకో 
నమ్ముకొన్నను ఉన్నవారిని చూడకుండగ ఎందుకో 
చిమ్మచీకటి కమ్మియున్నను ముందువెన్కన  ఎందుకో 
తుమ్మినా ఇక దగ్గినా అని అంటురోగిగ చూడుటే
   
 --(())--            

1 కామెంట్‌:

  1. If you're trying hard to burn fat then you certainly have to start using this totally brand new custom keto plan.

    To create this keto diet service, certified nutritionists, fitness trainers, and cooks have united to develop keto meal plans that are productive, convenient, economically-efficient, and fun.

    Since their grand opening in January 2019, 100's of clients have already remodeled their figure and well-being with the benefits a certified keto plan can give.

    Speaking of benefits: in this link, you'll discover 8 scientifically-proven ones given by the keto plan.

    రిప్లయితొలగించండి