10, ఫిబ్రవరి 2020, సోమవారం

మాతృశ్రీ వందన పుష్పాలు




Image may contain: 2 people

కృష్ణానీ తపనే మనస్సు చరితం చెప్పాలి ఆకాంక్షగా
ఇష్టంగా కథలే తపస్సు ఫలితం కల్పించి ఉన్నావులే 
కృష్ణాశక్తిని యుక్తినీ కళలనూ  తెల్సున్న రాముడ్ని మా 
ఇష్టాల్నే తెలిసే మనో ఫలమునే తీర్చేటి దేవుండివే     



Tanjore Painting Online - TTAGALLERY | Tamil Tanjore Art Gallery
మాతృశ్రీ వందన పుష్పాలు
మత్తకోకిల భావాలు 

శ్రీ మనోహరి భక్తితో నిను జిత్తమందు నుతించినన్
గామితార్దము లియకుండిన   కారణంబున గిన్క మై
ఏమి సేయుదు మత్తకోకిల వృత్తాభాషితమైన నా 
శ్రమ ఓ పరి నీ దయా మము కావుగా మది కోరెదన్

గౌరవంబుగ గీత మానస తెల్పుటే మమ శక్తియే
పేరు పేరున పూజ సేయఁగ బాధలే మమ భక్తిగా
ఖర్చు సంపదే ఎంత తెల్పినా నీకులే మమ యుక్తిగా
జేర్చి తెల్పితి దేవ దానవ కొల్చినట్లునె వేడి తీ

అందు చేతనె ఎంత తెల్పిన తక్కువే మమ వేదనా
పొందు కోరితి చిందు లేసితి మొనమే మమ మాయగా 
నింద చేయను తప్పు చేయను ఒప్పుగా మమ పూజలే
విందు చేసితి సద్దు చేయక మమ్ము కాచియు ఉందులే

పూన్కి నెంతగ వేడుచున్నను బ్రోవకుండిన నిన్ను నీ
వెన్క ముందవ తారమే మము కావుకాసిన మిమ్ము మా 
మన్ననే మది వాక్కులే సిరి సంపదున్నను తెల్పితీ
కన్ననేస్తము మర్చిపోయిన బాధలేదులె తల్లిగా 


Painting Indian Woman Canvases 65+ Ideas For 2019 #painting



చీకటైనను వెల్గుఉన్నను తల్లినామము సాగియే
మక్కువైనను కోపమున్నను మాతగా మము కాచితీ
చిక్కులున్నను తేలికైనను అమ్మగా మము మార్చుటే
తక్కువైనను ఎక్కువైనను కోపతాపము నీ కృపా

అన్ననైనను అక్కనైనను ఆదుకుంటుట నీకృపా
ఎన్నిచెప్పిన మబ్బులేకయు వర్షమే పడితే మనో
మన్ననే గుణ మార్పులే విధి భావమే నిను చూడకు
న్నాననే నెపమే ననే పలు మాటలే మనసే ఇదే

మంచిఅన్నను చెడ్డ అన్నను ఉన్నమాటను తెల్పితీ
పొంచి ఉన్నవి పందికొక్కులు గుంటనక్కలు ఎట్టగా
వచ్చిచెప్పితి నమ్మివాక్కును తల్లిగా మము చూచుటే
ఇచ్చమున్నను లేకున్నను మనోగతం విను మాతయే

మూడుకన్నులు ఉన్నవానికి తక్కువే అయినా మన
స్సీడుపంచియు చెప్పడానికి ఏమియూ అనకా. వయ
స్సీడు కల్పియు ఒప్పడానికి తెల్పియూ మము జూచి కా
పాడు పార్వతి విన్నవించితి తప్పుఒప్పులను తల్లిగా


Drawing sad sketches cartoon 24 Ideas 

పేరుతెచ్చిన దూరుతెచ్చిన పృథ్వినొక్కటి తల్లిగా
మారుపల్కగ మంచిమాటలు చెప్పెదొక్కటి మాటగా
తీరుతెన్నెలు ఒక్కమాదిరి ఉండునట్లుగ పల్కులే
శ్రీరమాధిప మేలుచేయుట నీవంతే భరతమ్ముగా

అల్పచర్యలె మంద బుద్ధులు చేయుటే మది బాధ్యతే
కల్పితంబులు  గావు తొల్లిటి గాధలన్ బరికింపగా
శిల్పమేర్పడి కష్టనష్టము తెచ్చుమార్పుల తల్లిగా

కల్పనా చతురత్వమే సుమ మాలికా మది భాగ్యమే 

చోరుడైనను వీరుడైనను అమ్మబిడ్డయె ఒప్పుకో
భీరుడైనను ధీరుడైనను తత్వమార్గమె ఒప్పుకో
చిన్నదైనను పెద్దదైనను ఆశసేవయె ఒప్పుకో
ఓర్పుఉండియె తీర్పు చెప్పియె అమ్మమాటయె ఒప్పుకో

స్వేదమేర్పడె మొహమేర్పడె దాహమేర్పడె బత్కులో
నిత్యసత్యమె నిత్యధర్మమె సౌమ్యవాదమె బత్కులో
వింతఆటలు వింత మాటలు వింతశోభలు బత్కులో
ఒప్పునేర్పులు తప్పుమార్పులు చిక్కుచింతలు బత్కులో
 

 Meerabai - (Wall Hanging) - Contemporary Hand Painted (Painting on Woven Bamboo Strands)


మానసం మమతానురాగము చుట్టునూ తిరిగేటిదే
మౌనరాగము తీర్పురోగము మాటిమాటికి ఒప్పునే 
వానమల్లెయు వచ్చిపోవుట మంచిచేసియు చెప్పుటే 
కన్నతల్లిగ సేవచేసియు రక్ష కల్పియు ఉండుటే 

రామకృష్ణను వేడుకుందును నిత్యపూజయు చేసెదన్
అమ్మకైనను నాన్నకైనను సేవచేసియు ఉండెదన్
మామఅత్తను అక్కబావను కాలమాయను కొల్చెదన్
క్షేమమేఇది దేహమేఇది కర్మమే ఇది తెల్పితిన్
 

మంచి పేరుగ  మందబుద్ధిని మార్చనంటివి  మోహనం 
నుంచి నేరుగ శంక బుద్ధిని మార్పుచేసితి మోహనా 
ఉంచి కాదనే స్థితిప్రఙ్ఞను నాకు నీకును కాదులే 
పొంచిఉన్నను ముప్పు నంతయు తప్పిదమ్ములే మోహనా 

సృష్టిలోకధ వేడినిచ్చియు చల్లగిచ్చియు నీడలో 
తృష్ణలో కధ సత్యబోధయు ధర్మమార్గము నీడలో 
ఇష్టిలో కధ పుణ్యపాపము మంచిచెడ్డలు నీడలో 
కృష్ణలో కధ మంచిచేసియు చెడ్డచాపియు నీడలో

Art - India: maritana — LiveJournal

భావతీక్షణ యుక్తధారలు తీవ్రమాస్రిత పొందుకే 
యావపొందియు మౌనదీక్షతొ నిగ్రహమ్ముతొ పొందుకే
సవ్యసాచిగ నిండు యవ్వన కౌగిలింతయు పొందుకే 
మువ్వచిందులు గువ్వగూటికి చేరినంతను పొందుకే 

వత్సరంబుయు పెర్గియున్నను దేహమాకృతి మారదే 
నిశ్చితంబుయు కల్గియున్నను కామితార్దము మారదే 
వచ్చిపోవును మబ్బువల్లెను శక్తియంతయు మారదే 
నిచ్చసత్యము చెప్పుతున్నను వేదభూమియు మారదే 


మల్లెతీగయు ఏకమల్లెను పూచియే సుమ అందమే 
తల్లిభాధయు అంతయూ సుమ గంధమే మరి అందమే 
వల్లి ఆకృతి వెన్నెలద్దియు సంధ్యవెల్గుగ అందమే 
వల్లిమల్లిగ  సద్దుచేయగ తల్లిమాటలొ అందమే

చీకటింకయు మార్పుతేకయు పృథ్వినంతయు విస్తరే 
చీకుచింతయు లేకయే మరి చల్లగాలితొ విస్తరే
ఆకు మారక వెల్గుకంతకు ధైర్య మొప్పఁక విస్తరే  
రేఖ మోహము తీవ్ర మెత్తగ దొంగలా జొర  విస్తరే


బిడ్డమాటకు జంకకుండగ  నిప్పుకోడిల వుండెనే 
అడ్డమొచ్చిన మాటమార్చక పూజచేయుట కుండనే 
నడ్డిపెర్గియు అందచందము ఉప్పుకారము అయ్యెనే 
దొడ్దిఅంతయు గుప్పుగుప్పున మళ్ళేవాసన ఉండనే 

ఉత్సవం మది  గుర్తుకొచ్చియు  గమ్ము కుండగ తొందరే 
మత్యమల్లెయు  పాఠమంతయు వేదమాయెగ తొందరే
సత్యపల్కుయు శాంతిమార్గము బిడ్డలేఖకు తొందరే 
నిత్యసత్యము బత్కునీడలో అమ్మతోడుకు తొందరే 

సంతసం ఒక ఆణిముత్యము సుస్వరస్వము హాయిగా
వింతమాయయు దేహమంతయు కమ్ముకోటము హాయిగా
చింతలేకయు సంతసమ్ముగ అమ్మపక్కన హాయిగా
నీతివల్లన విద్యసాధన అందచందము హాయిగా 

ఉన్నమాటకు మాటమాటయు కల్పకుండగ పల్కుటే 
అన్నమాటకు కట్టుబాటుకు తల్లితో లిఖి పల్కుటే 
కన్నవారికి కష్టనష్టము బిడ్దతీర్చియు పల్కుటే 
చిన్నెలన్నియు వన్నెలన్నియు కన్నెపల్కులు పల్కుటే     

A969
పాత్రుడంచు ప్రభుత్వమందలి ప్రౌఢులెందరొ యోగ్యతా 
పత్రముల్ దయ చేయుటే లిఖి ప్రజ్ఞతే బహుమానము పొందుటే
స్తోత్రముల్ విని చిత్తశుద్ధియు లెక్కవేసియు ఇచ్చుటే 
క్షేత్రగావుము ముద్దమల్లిక విద్యసొంతము పొందుటే  

 దేవుడే  నిజ భక్తినే కను లారగా గమ నించియే 
జీవుడే తమ వేదమే విను భావమే జయ మిచ్చుటే 
 రేవుకే చెరు సంద్రమే పలు ఉర్కళే లిఖి ఇష్టమే 
నీవునేను అనే పదం లత తల్లిమాటయె పల్కులే   

చిన్నబుచ్చుట అంబరం కళ మారుటే లిఖి ఊహాలే
కన్నమాటకి విచ్చు రెక్కలు కొత్తపొంతల ఊహాలే 
ముత్యమల్లెను రాత్రివెల్తురు మంచుబిందువు ఊహాలే
సప్తవర్ణపు కాంతిరేఖలు బిడ్డకళ్లకు ఊహాలే    

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 


ఏమిజర్గునొ ఎంతనొప్పునొ భాద్యతల్లును గుర్తుగా
మంచిచేసియు చెడ్డచేసియు తల్లిసేవల గుర్తుగా 
దెబ్బతిన్నను కష్టమున్నను బిడ్డపెంపక గుర్తుగా 
భర్తలోటును అగ్నిసాక్షిగ మభ్యపెట్టుచు గుర్తుగా 


అంబరం కదిలే మబ్బు లతొ ఉండిఉండక నీలమై 
సంబరం జరిపే మనుష్యులు బత్కి బత్కక నీలమై 
నిబ్బరం లెక కన్నవారును పెంచినారును నీలమై 
డబ్బులున్నను శాంతిలేకయు తిండియర్గక నీలమై 

అండమార్పిడి వచ్చుటె ఇక జాలిగుండెకు బాధయే 
తోడునీడన ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిండుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
చెడ్డచేసిన మృత్యవే మము ఏవగించుట ఎందుకో
  
కాలసర్పము కాటువేసియు రాక్షసీ వలె ఎందుకో 
ఆలుబిడ్డల ఆశపాశము అంటివుండుట ఎందుకో 
జోలపాలన  బీదవారిని మృత్యువే కబళించెనే 
కల్లలాడుట మృత్యురాతయు ఎవ్వరీ తరమవ్వునో




మంచిగా మృత్యు నీయవేయన మారుపల్కగ యిట్లుగా
వంచనే  గతి తెల్పకే మము కోపతాపమున ఎందుకో 
మంచు గడ్డల ఉండుటే మనజీవితం అనరెందుకో 
ఇంచుమించున ఒక్కరొక్కరు కల్సిమెల్సియు ఉందురో 

కాలసర్పమె వెంటవెంటనె మింగివేసిన తప్పెగా 
నీలిమేఘమె వెంటవెంటనె గాలిమింగిన తప్పెగా 
లాలిపాటయె వెంటవెంటనె జాలిమింగిన తప్పెగా 
గోలచేసిన వెంటవెంటనె     లొంగి పోవుట తప్పెగా

భక్తిభావమె ఉండవచ్చులె మారణం తొలగించునా 
చెక్కముక్కను పండుగే అని పుష్టిగా తిని ఉండినా 
ఏకమొత్తము సంబరమ్మన వచ్చినా తిని బత్కునా 
పక్కపక్కన ఆశపాశము కల్సిమెల్సిన నాశనం    


మంచిగా మృతినీయవేయన మారుపల్కగ యిట్లుగా
వంచనే  గతి తెల్పకే మము కోపతాపమున ఎందుకో 
మంచు గడ్డల ఉండుటే మనజీవితం అనరెందుకో 
ఇంచుమించున ఒక్కరొక్కరు కల్సిమెల్సియు ఉందురో 

"The heart is like a garden. It can grow seeds of compassion, or fear, resentment or love. What seeds will you plant there?" ~ Buddha ♥ Art by Dhananjay Mukherjee

భక్తిభావమె ఉండవచ్చులె మారణం తొలగించునా 
చెక్కముక్కను పండుగే అని పుష్టిగా తిని ఉండినా 
ఏకమొత్తము సంబరమ్మన వచ్చినా తిని బత్కునా 
పక్కపక్కన ఆశపాశము కల్సిమెల్సిన నాశనం    


చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో


నిన్నునీ మహిమం బెరుంగక  నిందచేసియు ఉండెనా 
కాన మాయకు చిక్కి ఉండితి చేయ లేకయు ఉండెనా 
మానుకున్నను ఆకలే మరి బత్కుమార్గము ఉండదే 
మానుమర్మము ఎంతచూసిన కాలధర్మము మారదే 


స్వాభిమానము విద్యమానము మండుటెండల మాదిరే 
ఆభిజాడ్యము అమ్మనాన్నల అత్తమామల మాదిరే 
భిభత్యమము వచ్చిపోవును మానుషం కథమాదిరే 
జెబ్బజర్చియు మొండిపట్టుగ బత్కుకోరుట కష్టమే


Near Emerald Lake Lodge, Timothy Sorsdahl, Art.com  Gotta love those blues and gold!
హానియే చెయ కుండినా  మది ఎవ్వరూ కన కుండాగా
ప్రాణియే ఇక లేదు అన్నను దీపమెత్తియు యుండగా 
మేనమామయు లేరులేరులె వంతపల్కిన అండగా 
అన్నపూర్ణయు లేరులేరులె అన్నపల్కులు బాధగా

 అమ్మఅమ్మని అన్న పట్టని లోకమే ఇది ఏంచెసా 
కో మనస్సుని వేదించితిని దారిదొర్కలె  ఏంచెసా 
కో మృదుత్వము ముంపుకే అని తల్చినానులె ఏంచెసా
కో మమేకము ఓర్పుతో విని ఓర్పుతో కనె జీవితం 

అమ్మబాబును పొట్టపెట్టిన వింతపాదము ఎందుకో 
నమ్ముకొన్నను ఉన్నవారిని చూడకుండగ ఎందుకో 
చిమ్మచీకటి కమ్మియున్నను ముందువెన్కన  ఎందుకో 
తుమ్మినా ఇక దగ్గినా అని అంటురోగిగ చూడుటే
   
 --(())--            

6, ఫిబ్రవరి 2020, గురువారం

మాతృ శ్రీ వందన పుష్పాలు


మాతృ శ్రీ వందన పుష్పాలు-21

కలువలే జలములో ను - నగవులే మమతలో ను
లతలులే తరువులో ను - ఉరకలే మనసులో ను
పదవులే  బతుకులో ను - చిరుగులే ఉతుకులో ను
శుభము లే కలుపులో ను - మెరుపులే జగతి లోను

ఉండులే అమ్మా ఉండులే అమ్మా ఉండులే అమ్మా ప్రేమ

పలుకు లోను వినుట లోను - పగలు లోను నళిని లోను
సెగలు లోను మెరుపులో ను - కధల లోను కవిత లోని
వలపు లోను తలపు లోను - మలుపు లోను కులుకు లోను
గిలక లోను చరఖ లోను - తలుపు లోను తడిక లోను
  
ఉండులే అమ్మా ఉండులే అమ్మా ఉండులే అమ్మా ప్రేమ


వయసు లోను సొగసు లోను - చిగురు లోను చిరుత లోను
కరువు లోను చెరువు లోను - పరువు లోను గిరుల లోను
సిరుల లోను వెతల లోను - కలువ లోను కణత లోను
పరిధి లోను వినతి లోను - విదియ లోను టైయ లోను
    
ఉండులే అమ్మా ఉండులే అమ్మా ఉండులే అమ్మా ప్రేమ

మాతృ శ్రీ వందన పుష్పాలు-20

తెలుగుకు తెగులు పట్టిస్తున్న మూర్ఖపు పురుగులు
వెలుగుల తెలుగు వేధిస్తున్న  రాక్షస పురుగులు
అభిరుచి తెలుగు నిందిస్తున్న నాయక పురుగులు
జననికి  దిగులు తెప్పిస్తున్న తక్షక పురుగులు

కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలు
మరిగి మశివుతున్న సంతోష సంధర్బాళ్లూలె 
తెలుగు తెలుగన్న పోరాట యుద్ధమార్గాలె
నరము తెలుగన్న జీర్ణించు కోలేకున్నాము

ఆత్మగౌరవాన్ని నిలుపు తెలుగుతనాన్ని మరిచాం
మాతృగౌరవాన్ని నలిపి వెలుగుతనాన్ని చితిపాం
భాతృగౌరవాన్ని చదువు మమతవనాన్ని నలిపాం
పితృ గౌరవాన్ని నిలిపె తెలుగు కళల్నీ వదిలాం

ఓ తల్లితండ్రులారా తెలుగు వైభవాన్ని గమనించండి
ఓ బిడ్డపాపల్లారా వెలుగు వైభవాన్ని బతికించండి
ఓ రాజకీయులారా కడుపు మీదెకొట్టి సుఖపడండి
ఓ భాషావ్యామోహులా జనని  వైభవాన్ని మరవకండి


అమ్మా ఏమిటమ్మా మీ హృదయం అలా కొట్టుకుంటుంది 
అవును కృష్ణ నేచేష్టలకు నాయనా ఏమో నమ్మా నాతొ ఆడవారి హృదయాలు వేరేవిధముగా ఉన్నాయమ్మా 
అవిఏమిటి బాబు అవా అవే ఇవి  
 

సహజమ్ము తోను అలసియే సేవ హృదయం  
శోకము తరిమి తెచ్చేను  శోక హృదయం  
పోట్లాట వల్ల మనసులో పోరె హృదయం 
ప్రత్యక్ష మైన ప్రశ్నల పరిధి హృదయం  

అభిలాష తోను తరిమేటి యముని హృదయం
శాంతిని  పొందె సంతోష ప్రభ హృదయం 
దయపొంది ఆశ కాలంతో దాగె  హృదయం
వయసొచ్చి యువతి అందంతో వలపు హృదయం

భోధకు పరవ శించిన పడతి హృదయం
భావము నలిగి పోయిన నళిని హృదయం
లాభంకు విసిగి పోయిన లోభి హృదయం
ఆకాశం అలిగి ఆర్భాటం అరుపు హృదయం

మనసంత తట్టి లేపిన మహిమ హృదయం
వయసంత శక్తి నింపిన వలపు హృదయం
సొగసే పంచి పెట్టిన సుమతి  హృదయం
జన్మంత మందు పంచిన జాతి హృదయం

--///--

మాతృశ్రీ వందన పుష్పాలు -  18

ఒకసారి మనసార నిను తలచినంతనే
తనువంత పులకిస్తు మది మరచినంతనే
చిగురంత తిలకిస్తు చర కరచినంతనే
వలపంత వలికిస్తు పలుకు అని నంతనే

తేనె పాలును ద్రాక్ష ఫలరసమ్ముల బోలు
ఆశ తాపము కాంక్ష చలి తపమ్ముల బోలు
ఆలి ఆరాట బావ సెగ జపమ్ముల బోలు
మేధ మాత్సర్య భోగ భవ భావమ్ముల బోలు

వాక్సుధల ప్రకృతి వసుధలో యశమిచ్చి
దీక్షతల తలపు మనసులో యశమిచ్చి
మన్ననల మలుపు మగువలో యశమిచ్చి
ముచ్చికల మెఱుపు మగనిలో యశమిచ్చె

సేవించెను తల్లి విజ్ఞాన రమవల్లి
పోషించెను తల్లి ఆదర్శ భవమల్లి
ఆశించెను తల్లి విద్యార్థి విధిమల్లి
దీవించెను తల్లి సుజ్ఞాన సుమవల్లి 


  మాతృశ్రీ వందన పుష్పాలు -  17

అదును కనిపెట్టి పనిచేయు మాతృశ్రీ
నిజము తెలిపేటి సుమజీవి మాతృశ్రీ
తగిన తరుణాన్కి కృషిజీవి మాతృశ్రీ
పగలు చిరుహాస పతితృప్తి మాతృశ్రీ

వేదాంత సార తాదాత్మ్యజ్ఞాన ప్రదాత"
శ్రీరంగ సేవ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాత
వేదోప వేద గమ్యా త్మిక జ్ఞానప్రదాత
విశ్వాస సత్య నిత్యాత్మిక జ్ఞాన మాతృశ్రీ

ఏబదియు నారైన భూతత్వమును పొంది
ఏబదియు రెండైన జలతత్వము నిండి
అరువదియు రెండైన అలసత్వము కూడి
డెబ్బదియుఁ రెండైన హృదయత్వము తల్లి 

"విశ్వము మురిసెను పచ్చగ మాతృశ్రీ చలవే  
విశ్వసతి కరుణను గల్గి సుతామృధు చ్చలవే
విశ్వములయ కర ముగల్గిన మాతృశ్రీ చలవే
నశ్వరహితసహజహసమ్ములు మాతృశ్రీ చలవే


మాతృశ్రీ వందన పుష్పాలు -  16

అల్లమే తింటె మనిషి పైత్యమును గాచు
పృద్విగా మోసి మనసు పుణ్యమును గాచు
చల్లనౌ చూపు నిఖిల విశ్వమును గాచు
తల్లిగా సేవ జగతి విద్యయును గాచు

అమృతమ్ము వర్షించు ఆనందమున ముంచు  
తరుణమ్ము వర్ణించి కాలానుగుణ ముంచు
వినయమ్ము నఠించి శోభానుగుణ ముంచు
విషయమ్ము మన్నించి మాతృశ్రీ గుణముంచు

ఆచూపు పడినంత అత్యంత వృద్ధుడు చలించు
ఆమాట వినినంత పాండిత్య మూఢుడు చలించు
ఆ ఆశ కనినంత ఉత్త్సాహ ధీరుడు చలించు
ఆమార్పు బతుకంత మాతృశ్రీ బాధ్యత చలించు

యవ్వనంలో ఉన్న సౌందర్యవతులెల్ల ప్రేరేపించు
సద్భక్తిలో ఉన్న సౌందర్యమును లెల్ల ప్రేరేపించు
పుష్ప0దములో ఉన్న మాధుర్యమును లెల్ల ప్రేరేపించు
మాతృశ్రీ ఏమన్న బిడ్డల్లో గుణమెల్ల ప్రేరేపించు 
 


మాతృశ్రీ వందన పుష్పాలు -  15

రూప లావణ్య శోభ గనలేరు ఏనాటికి
దీప సౌందర్య కాంతి గనలేరు ఏనాటికి
సృష్టి శృంగార ప్రభ గనలేరు ఏనాటికి
అమ్మ కళ్యాణ ప్రభ గనవచ్చు ఈనాటికి

అంద చందము వర్ణింప ఎవరి తరము
కర్మ బంధము తెల్పుట ఎవరి తరము
మాయ బుద్ధిని మార్చుట ఎవరి తరము
అమ్మ లౌక్యము తెల్పుట మనసు తరము

 
జపతపంబులు కలిగి ఉండుట భరతజాతి
మనసుఇచ్చుట మమత పంచుట భరతజాతి
కలసిఉండుట చెలిమి చేయుట భరతజాతి
జనని ఓర్పుతొ శుభము పల్కుట భరతజాతి
 


సాయుజ్యపదవిని పొందు చిన్నారి మనసుతో
ప్రావిణ్యపదవిని పొందు మేధావి మనసుతో
ప్రాధాన్య పదవిని పొందు కారుణ్య మనసుతో
మాతృశ్రీ పదవిని పొందు దైవత్వ వలననే 


మాతృ శ్రీ వందన పుష్పాలు  - 14
 ద్వయం కాని ఆనంద స్వరూపం
వ్యయం కాని విశ్వాస స్వరూపం
ప్రియం కాని హాసిన్య స్వరూపం
స్వయం అయ్యె సౌందర్య స్వరూపం

సత్య మార్గం తెల్పే ప్రపంచ స్వరూపం
నిత్య సత్యం తెల్పే ప్రబోధ స్వరూపం
సృష్టి ధర్మం తెల్పే ప్రచండ స్వరూపం
అన్న పూర్ణా అయ్యె సౌందర్య స్వరూపం

నాల్గు శక్తి చక్రాలు కల్గిన స్వరూపం
లైదు మూల ప్రకృతి తత్వాల స్వరూపం
మూడు కోణ రేఖల సామాన్య స్వరూపం
అష్ట పద్మ జ్యోతుల సౌందర్య స్వరూపం

అందమునకు నిలయమైన శ్రీ చక్ర స్వరూపం
ప్రభవమునకు నిలయమైన శ్రీ మాత స్వరూపం
ఆత్మసమమునకు నిలయమైన శ్రీ వాస స్వరూపం
ఆత్మవరమునకు నిలయమైన మాతృశ్రీ స్వరూపం

 --(())--
మాతృ శ్రీ వందన పుష్పాలు  - 13

వనమందుఁ పువ్వులే - మనయందు గువ్వలే-
తరమందు నవ్వులే - మన తల్లి మాటే
మనసంత వన్నెలే - వయసంత చిందులే 
తనువంత మెర్పులే - మన తల్లి మాటే

కనులందుఁ గావ్యమే - కనులందు భవ్యమే -
కనులందు భావ్యమే - మన తల్లి మాటే
స్వనమందు గీతులే - స్వనమందుఁ బ్రీతులే -
స్వనమందు భ్రాతులే - మన తల్లి మాటే

మనమందు దాహమే - మనమందు మోహమే -
మనమందు వ్యూహమే - మన తల్లి మాటే
కనువిందు చేయునే - కనువిందు చూపునే
కనువిందు ఆశలే - మన తల్లి మాటే

చిరునవ్వు చూపు టే - చిరునవ్వు పంచు టే
మది పంచి  పెంచు టే - మన తల్లి మాటే
కధ చెప్పి మెచ్చు టే- మన సిచ్చి చెప్పుటే
తలవంచి ఉండు టే -మన తల్లి మాటే

మాతృశ్రీ వందన పుష్పాలు -12

వెచ్చని వెలుగుల సుఖం అందించి
మచ్చిక చేయు బలం గా మారి
ఐచ్ఛిక పోరాటమే చేసి జయించి
తుచ్ఛమైన కోరికే నాశనం గా మారి 

అచ్చపు సోయగము జగమన్తా విస్తరించి 
మచ్చగా మిగిల్చిన అనుభవం వింతగా మారి
వెచ్చగ వెంటాడిన స్త్రీ నయనం ఆవహించి
విచ్చలవిడిగా ఖర్చు చేయడం గా మారి

నచ్చు కదరా అని సహృదిని ఆవహించి
మెచ్చు కదరా అని ప్రకృతి గా మారి  
తెచ్చు కదరా అని ఆతృత గా ఆవహించి  
అంకితం మాతృదేవోభవ గా మారి

పచ్చని పూవుల  ప్రకృతిని అందించి
నచ్చిన  విషయ జాగృతి గా మారి
విచ్చిన ఆశల ఆకృతి ని అందించి
మెచ్చిన మనిషి స్వీకృతి గ తల్లి

--(())--

మాతృశ్రీ వందన పుష్పాలు -11

రసరూప తేజమున అలరారు చున్నట్టి 
మదిలోన భావమును తెలిపేందు కున్నట్టి 
కళలోని రాగమును పలికేందు కున్నట్టి 
మమతాను పాఠముల తెలిపేటి మాతృశ్రీ..... 

చందురుని నెలవైన ఆధారమున చేరి 
 అంబరుని కలలైన సాకారమున చేరి 
తుంబురుని గుణమైన సంగీతమును చేరి 
అంబ అని కొలిచైన ప్రార్ధనలను చేసె ...... 

జీవుని శరీరమున బ్రహ్మాండమును తడిపి 
ప్రేమలొ సుదీర్ఘముగా ధర్మార్ధమును తెలిపి 
సేవలొ పరీక్షలుగా సత్యార్ధమును మలచి 
మాతగ మనోమయమే  తెల్పేందుకు కుహరణి ... 
     
 

మాతృశ్రీ వందన పుష్పాలు -10

సూర్యుడు పలకరింపుగా దినచర్య శ్రీ కారం
చంద్రుడు పులక రింపుగా మది తొల్చు శ్రీ కారం
అమ్మయె కడుపు నింపుటే ప్రతిరోజు శ్రీ కారం
నాన్నయె మనసు పూర్తిగా పనిచేయు శ్రీ కారం

వల్లప్ప గించి పని చేసిన ఎటకారం
పల్లమె నీరు పరు గెట్టిన ఎటకారం
అందము లేక గుణ ముండిన ఎటకారం
సేవలు చేసి సహకారము ఎటకారం

బతికి బతికించేందుకు ఆకారం
తెలిసి వెతికించేదుకు ఆకారం
వినియు వినిపించేందుకు ఆకారం
కనియు కనిపించేందుకు ఆకారం

నవరసములు పలికించుట ఉపకారం
మమత మనసు బతికించుట ఉపకారం
విజయ కధలు వినుపించుట ఉపకారం
జనని పలుకు పఠియించుట ఉపకారం

--(())--

పురాతన నెల్లయ్యప్పర్ ఆలయం, తిరునెల్వేలి, తమిళనాడు. ఈ ఆలయం 7 వ శతాబ్దం లో నిర్మించ బడింది.
పైకప్పుకు త్రిభుజాకారం లో తోరణాలు ను అద్భుతం గ చెక్కారు.



--(())--

మాతృశ్రీ వందన పుష్పాలు -9


పాలతో కడుపునింపిన కామధేనువు
డబ్బుతో బతుకునేర్పిన విఘ్నదేవత 
పల్కుతో మనసు నింపిన ధర్మదేవత
ప్రేమతో వరుస కల్పిన మాతృదేవత

వేదాలు వెలసిన వేదభూమిలో 
ధర్మాలు బతికిన ధర్మభూమిలో 
కావ్యాలు బతికిన కర్మభూమిలో 
భూతాలు తరిమిన తల్లిసేవలో 

సనాతన ధర్మాన్ని బతికిస్తున్న దేశం
అనాదిగ కావ్యాల్ని వినిపిస్తున్న దేశం
పురాతన భావాల్ని తలపిస్తున్న దేశం
మనోమయ తత్వాన్ని పాలిస్తున్న మాతే 

భూమితత్వం మూలాధార చక్రంగా
నీటితత్వం మణిపూరా చక్రంగా
అగ్నితత్వం స్వాదిష్టాన చక్రంగా
వాయుతత్వం అనాహత చక్రంగా
అంబరతత్వం విశుద్ధ చక్రంగా
విశ్వాకారణ శక్తిగా పరిభ్రమించేది మాతే

--(())--


మాతృశ్రీ వందన పుష్పాలు -8

సంద్రపు కెరటంలా ఉరకలే ఉరక
ఆశల వలయంలా పరుగులే పరుగు
నాయక పదవుల్లా మెరుపులే మెరుపు
శ్రీమతి పలుకుల్లో చురకలే చురక

పరివేష్టింబైన మాయ సీమ బతుకు
సిరివేష్టింబైన ఆశ కామ చితుపు 
మదివేష్టింబైన దివ్య భవ్య వెలుగు
ఇది మాత సేవ నిత్య సత్య పలుకు

వరుసల ఉద్యాన వనమందు ఆకర్షణ
తనువులు ఆరాట తనమందు ఆకర్షణ
వలపులు పెళ్ళాట పవళింపు ఆకర్షణ
జనకుల ఇష్టాలు పుడమందు ఆకర్షణ  

తల్లి పిల్పుకు ధన్యులగుదురు అందరు
తల్లి మాటకు పూజ్యులగుదురు అందరు
తల్లి కోర్కతొ  బిడ్డలగుదురు అందరు
తల్లి పూజతొ బాగుపడుదురు అందరు


మాతృశ్రీ వందన పుష్పాలు -7

కీడు మేలు ద్వందములు జీవితానికి మార్గం
మంచి చెడ్డ ద్వందములు భారతానికి మార్గం
నువ్వు నేను ద్వందములు కాపురానికి మార్గం
ఈడు జోడు ద్వందములు తల్లిపెంపక మార్గం

కోప ప్రభావము తెల్పే చూపరులకు విందుగా
నీతి ప్రసన్నము తెల్పే కాలమునకు ముందుగా
వేద ప్రమాణము తెల్పే సోమరసము విందుగా
తల్లి ప్రధానము తెల్పే సత్య పలుకు ముందుగా   

నిండు చంద్రుని బోలు వెలుగొందు మొముతో
వెండి వెన్నెల బోలు వెలుగొందు మొఖమే
ఆశ పాశము తోనె వెలుగొందు సత్యమే 
నిత్య కాలము తెల్పి వెలుగొందు తల్లియే

గలగలల అపరంజి మొలనూలు ధరియించి
చిరునగవు మరుమల్లె విథియాట భరియించి
మదితెలుపు సిరిమల్లె కధవేట  తొలగించి 
మనమలుపు తెలిపేది మనతల్లి పలుకుల్లొ 
 

--(())-- 
మాతృశ్రీ వందన పుష్పాలు -6

అంగాంగ విన్యాసములు కళ కొఱకు
కల్లోల ఉద్భోధనలు సిరి కొఱకు 
విశ్లేష విద్వేషణలు మది కొఱకు
ఎన్నెన్నొ నేర్పే మహిళ మన కొఱకు

కమలాది కుసుమంబులు బాణములాయె  
మదితొల్చు కరుణంబులు పాఠములాయె
విదితెల్పు కిరణంబులు పోషణలాయె
చిరునవ్వు జననీ పలుకే క్షమ లాయె

పూవింటి గుణమయ్యే బ్రమర సముదాయమ్ము
పేదింటి మదిమయ్యే శ్రమకు సముదాయమ్ము
ఇంటింట కథలయ్యే త్రివిధ సముదాయమ్ము
మాఇంట మమతయ్యే తృణము జననీయమ్ము    
 

మలయమారుతము కదిలే రధముగా
వినయపౌరుషము కదిలే విధులుగా
సమయ శోధనయు కదిలే తిధులుగా
మనసు బోధనలను తెలిపే జననీ
 

--(())-


మాతృశ్రీ వందన పుష్పాలు -5

మోహముతో ఆకార్షణ కల్పించి
మొనముతో ఆదర్శము చూపించి
హాస్యముతో ఆనందము కల్పించి 
వేదముతో  వాక్కందము చూపించె
  
పూజకే సౌభాగ్య సంపదలు అందించి
మాటకే కారుణ్య భావములు కల్పించి
నిత్యమూ సద్బుద్ధి కల్పనలు కల్పించి
ధైర్యమూ సౌఖ్యము శక్తియును కల్పించె

మన్మధుడు ఆవహించి రతిని ప్రొద్భవించిన
తన్మయము చెంది వచ్చి పతిని తృప్తిపర్చిన
విస్మయము తెల్పి మంచి చేసియు మభ్యపర్చిన
సంఘమును బాగు చేసె తల్లిగ ఉద్భవించుట

స్త్రీ పురుష భేదము చూపక సమస్తము కాపాడి
మంచి చెడు చూడక నిత్యము నిమిత్తము కాపాడి
వచ్చిపొవు వారల సౌఖ్యము సమస్యను కాపాడి
సేవ సహ వాసము బలిమిని తల్లిగ కాపాడె

--(())--




మోహముతో ఆకార్షణ కల్పించి
మొనముతో ఆదర్శము చూపించి
హాస్యముతో ఆనందము కల్పించి 
వేదముతో  వాక్కందము చూపించె
  
పూజకే సౌభాగ్య సంపదలు అందించి
మాటకే కారుణ్య భావములు కల్పించి
నిత్యమూ సద్బుద్ధి కల్పనలు కల్పించి
ధైర్యమూ సౌఖ్యము శక్తియును కల్పించె

మన్మధుడు ఆవహించి రతిని ప్రొద్భవించిన
తన్మయము చెంది వచ్చి పతిని తృప్తిపర్చిన
విస్మయము తెల్పి మంచి చేసియు మభ్యపర్చిన
సంఘమును బాగు చేసె తల్లిగ ఉద్భవించుట

స్త్రీ పురుష భేదము చూపక సమస్తము కాపాడి
మంచి చెడు చూడక నిత్యము నిమిత్తము కాపాడి
వచ్చిపొవు వారల సౌఖ్యము సమస్యను కాపాడి
సేవ సహ వాసము బలిమిని తల్లిగ కాపాడె

--(())--


మాతృశ్రీ వందన పుష్పాలు -4 
వరము లభయము లిచ్చి
సమము శుభములు లిచ్చి
బలము సుఖములు లిచ్చి
చిరు నగవుల లొ తల్లి
  
భయశోకము నుండి బిడ్డలను కాపాడి
భవబంధము నుండి శక్తులను కాపాడి
సుఖ శాంతియు ఇచ్చి భక్తులను కాపాడి
చిరు హాసము పంచి నిత్య మతి కాపాడె

ఈప్సితము లీడేర్చి అధికఫలము ఇచ్చు
సేవలను అందించి అధికసుఖము ఇచ్చు
కాలమున జాగ్రత్తగ అనుకరణ చేసి
బాధలను తగ్గించు అధికబలము పెంచు     

ఆడంబరములేని అతి సహజ రూపము
ఆనందమును పంచి జత కలిపె వేదము     
ఆరోగ్యమును పంచి కళ తెలుపె శీలము
దారుడ్యమును శక్తిని దయ కరుణ తల్లిదె

--(())--
మాతృశ్రీ వందన పుష్పాలు -3

మందార మకరంద మాధురీ వీవు
సంపెంగి సుకుమార సుందరీ వీవు
ఉషస్సు వెలుగుల్ల సాంభవీ వీవు
తమస్సు కలుగుల్లొ బిడ్డనే నేను
 

చింతామణీ దివ్య రత్నమ్ము నీవమ్మ
కాత్యాయనీ భవ్వ దీపమ్ము నీవమ్మ
సూర్యామణీ శక్తి లక్ష్యమ్ము నీవమ్మ
చంద్రామణీ చల్ల వెన్నెల్లు నీవమ్మ


రవి మండలాకార తేజమ్ము నీదమ్మ
కవి ఊహ ఆకార వర్ణమ్ము నీదమ్మ    
శిబి దాన భక్తియె సత్యమ్ము నీదమ్మ
మది సేవ కర్తగా నిత్యమ్ము తల్లిగా
 

అజ్ఞాన హృదయాల తిమిరాలు తొలగించు
విజ్ఞాన శృతిలీల చదువంత కలిగించు
సుజ్ఞాన మతిలీల సుగుణమ్ము బతికించు
జిజ్ఞాస మనసంత తొలగించు తల్లివమ్మ


ప్రేమ జలధిలో మునిగి అలమటించే  
 ద్వేష పరిధిలో జిలిగి భయము నుంచే 
క్రోధ తపనలో నలిగి తనువునుంచే 
బిడ్డ మనసులో జననీ కలుపు మంచీ 

మందబుద్దుల మతుల పరిశుద్ధం గావించు
భక్త సిద్ధుల గతుల పరిపక్వ0 గావించు
నిత్య భక్తుల వెతల సిరికల్పం గావించు
సర్వ విద్యల కళలు సమకూర్చే మాతృశ్రీ


నిరుపేద లగువారి దారిద్రమును బాపు
నరకాన పడువారి శాపమ్ములను బాపు
తిరకాసు పలికేటి కోపమ్ములను బాపు
మనసైన కలలన్ని తీర్చుమ్ము మము తల్లి




   --(())--


పలుకులు మెత్త ముద్దులు పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు వేరు  

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది నిత్యం

అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టక 
ధర్మ నియమముతో సత్యమె తెల్పి బ్రతక 

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు   

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి,
తప్పులెన్నొ చెసియు జీవించ గల్గి  

త్యాగభావమున తరువులే గురువులు
రాజకీయమున పదవులే గురువులు
ప్రేమపాకమున పెదవులే గురువులు
సేవ సాధనకు జనకులే గురువులు   

 చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె
భార్యకాని చెలిమి చిచ్చువోలె
భార్యాభర్త  బలిమి  మంచు వోలె      

 మందమతులకెపుడు ఉండదు ముందుచూపు
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు   

పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం        

--(())--

మాతృ శ్రీ వందన పుష్పాలు

పుడమి పచ్చదనం మానవాభ్యతనానికి నిండు తనం
రవియు వెచ్చదనం సమ్మోహాభ్యుతనానికి నిత్య ఫలం 
తరువు చల్లదనం నిత్యానందవాసానికి ఇచ్చుతనం
జనని హృధ్యతనం సంస్కారం నివాసానికి పంచుతనం ---1

పలుకులు మెత్త ముద్దులు పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి  ....  2

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే......  3

అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ.... 4

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు         ... 5
 ******


జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి,
తప్పులెన్నొ చెసియు జీవించుటయు తప్పు..... 6. 

త్యాగభావమున తరువులే గురువులు
రాజకీయమున పదవులే గురువులు
ప్రేమపాకమున పెదవులే గురువులు
సేవ సాధనకు జనకులే గురువులు      .... 7

 చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె
భార్యకాని చెలిమి చిచ్చువోలె
భార్యాభర్త  బలిమి  మంచు వోలె      .... 8

 మందమతులకెపుడు ఉండదు ముందుచూపు
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు    ... 9 

పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం        .....  10

--(())--



చైతన్య రహితుడై నిర్వీర్యుడైన పెంచెను  
కారుణ్య రహితుడై దుర్మార్గుడైన పెంచెను 
సద్బుద్ధి రహితుడై దుర్వార్తుడైన  పెంచెను 
వేదాంత రహితుడై సంఘర్షుడైన పెంచెను .....

నీ శక్తి లేకున్న కుశలత నీలొ  గోల్పోయి
నీ యుక్తి లేకున్న మనసులో బాధ  గోల్పోయి
నీ భక్తి లేకున్న జననము వల్ల గోల్పోయి
నీ ముక్తి లేకున్న మరణము వచ్చి వీక్షించు .....

నిను కొల్చు భాగ్యము పొందునే పాతకుడు
నిను కొల్చు సౌర్యము పొందునే పామరుడు
నిను కొల్చు మౌఢ్యము మానునే పాఠకుడు
నిను కొల్చు భాగ్యము  మామనస్సే జనని  .....
 
సుకుమారి గా పెరిగి మృదుత్వము అందించి
బిడ్డకు మృదు స్వభావము అందించు తల్లి
ధర్మ విరుద్ధమగు కార్యములు చేయ కుండగ
యుద్దాలు చేసినా సమర్ధించక తిరస్కరించే తల్లి

చంచల స్వభావము లేని ప్రేమ నందించి
బిడ్డలో చంచల స్వభావము రాకుండా చూసే తల్లి 
వంశాకురంగా వచ్చిన ప్రకృతి జ్ఞానయజ్ఞమును
బిడ్డలకు పంచి నిష్ణాతులుగా మార్చుటకు కష్టిం,చే తల్లి

శాస్త్రాదుల అధ్యయనము నిరంతరం జరిపి
బిడ్డలకు వయసుకు అగ్గ కధలను తెలిపే తల్లి
నిత్యమూ భారతసుఖం కోసం తపస్సు చేసి
తపస్సు గా బిడ్డలందరికి హృదయాన్ని అందించే తల్లి

ఏ ప్రాణికి బాధ కల్గించ కుండా భర్తకు, సౌకర్యాలు 
కల్పించి,  బిడ్డను  ప్రాణప్రదముగాపెంచేది తల్లి
నిజము పలుకుట  అక్షర సాహిత్యాన్ని తెలిపి
అనుకువ నేర్పిచి ఆశలు తీర్చి ఆనందించేది తల్లి    

--(())--

వేయి పడగలు కమ్మి  ఉన్న ఈ లోకంలో
చేయి కలిపియి కొల్చి ఉన్న ఈ ధర్మంలో
నేయి కలిపియు భిక్ష పెట్టు ఈ మర్మంలో
ఓయి అనియు చేసె తప్పు ఈ సత్యంలో

నీ పాద పద్మాల ధూళియే నిన్ను మార్చేను  
నీ మంచి వాక్యాలు విన్నాక నీతొ కల్సేను 
నీ శక్తి సౌర్యాలు చూసాక నాకు ఆశలే 
నీ నమ్మ కమ్ముయు జయముగా నిన్ను మార్చేను 

ధూళిని ఒడలెల్ల అలదుకో దైవము నీలోన 
పాపిని తలపెల్ల తలచుకో పుడమిపై కొలువుము 
రోగిని  బతుకెల్ల మలచుకో రోగము తగ్గులే  
వాదిని ఋతులెల్ల కొలిచెద వ్యాధి రాదులే 

భయము లేకుండా బిడ్డ పెంచును తల్లి 
భయమనే దియులేని వానిగా పెంచును తల్లి
అంతఃకరణ సిధ్ధితో మదనపడి
ఆత్మ సిధ్ధి ప్రభోధాన్ని తెలియ పరిచేది తల్లి

నవమాసాలు మోసి యోగ సిధ్ధితో బిడ్డను సృష్టంచి
బ్రతుకులో జ్ణాన యోగాన్ని నేర్పేది తల్లి
నిత్యము చెయ్యగల సహాయముతో బిడ్డను పెంచి
ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలని తెల్పేది తల్లి

బాహ్యేంద్రియ నిగ్రహముతో తల్లిగా ఉండి
బిడ్డకు ఇంద్రియ సుఖాలను అందించేది తల్లి
ఇతరుల దోషము లెంచక, దోషము లేని ప్రేమను పంచి
బిడ్డకు దోషము చేసిన ముప్పు వచ్చునని తెల్పేది తల్లి

ఏ పనికైన దయయే ఆయుధంగా ఉపయోగించి
బిడ్డకు త్యాగ గుణం నేర్పేది తల్లి
ప్రపంచ విషయాశక్తి లేకుండి
ప్రపంచ జ్ణానాన్ని బిడ్డకు పంచేది తల్లి

--(())--


(1)
వేయి పడగలు కమ్మి  ఉన్న ఈ లోకంలో
చేయి కలిపియి కొల్చి ఉన్న ఈ ధర్మంలో
నేయి కలిపియు భిక్ష పెట్టు ఈ మర్మంలో
ఓయి అనియు చేసె తప్పు ఈ సత్యంలో
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(2)
నీ పాద పద్మాల ధూళియే నిన్ను మార్చేను  
నీ మంచి వాక్యాలు విన్నాక నిన్నే కొల్చాను  
నీ శక్తి సౌర్యాలు చూసాక నాకు ఆశయసిద్ధిగాను  
నీ నమ్మ కమ్ముయు జయముగా నేను చేరాను  
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(3)
ధూళిని ఒడలెల్ల అలదుకో దైవము నీలోన 
పాపిని తలపెల్ల తలచుకో పుడమిపై నీడన  
రోగిని  బతుకెల్ల మలచుకో రోగాన పడిన   
వాదిని ఋతులెల్ల కొలిచెద వ్యాధి లోన 
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(4)
భయము లేకుండా బిడ్డ పెంచును తల్లి 
భయమనే దియులేని వానిగా పెంచును తల్లి
అంతఃకరణ సిధ్ధితో మదనపడే తల్లి 
ఆత్మ సిధ్ధి ప్రభోధాన్ని తెలియ పరిచేది తల్లి
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(5)
నవమాసాలు మోసి యోగ సిధ్ధితో బిడ్డ తో తల్లి 
బ్రతుకులో జ్ణాన యోగాన్ని నేర్పేది తల్లి
నిత్యము చెయ్యగల సహాయముతో బిడ్డతో తల్లి 
ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలని తెల్పేది తల్లి
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(6)
బాహ్యేంద్రియ నిగ్రహముతో ఉండేది తల్లి 
బిడ్డకు ఇంద్రియ సుఖాలను అందించేది తల్లి
ఇతరుల దోషము లెంచక, దోషము లేని ప్రేమ తో తల్లి 
బిడ్డకు దోషము చేసిన ముప్పు వచ్చునని తెల్పేది తల్లి
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(7)
ఏ పనికైన దయ యను ఆయుధంగా తల్లి 
బిడ్డకు త్యాగ గుణాన్ని నేర్పేది తల్లి
ప్రపంచ విషయాశక్తి తో ప్రేమించే తల్లి  
ప్రపంచ జ్ణానాన్ని బిడ్డకు పంచేది తల్లి
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(8)
చైతన్య రహితుడై నిర్వీర్యుడైన పెంచెను  
కారుణ్య రహితుడై దుర్మార్గుడైన పెంచెను 
సద్బుద్ధి రహితుడై దుర్వార్తుడైన  పెంచెను 
వేదాంత రహితుడై సంఘర్షుడైన పెంచెను .....
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(9)
నీ శక్తి కోరినా కుశలత నాలొ  గోల్పోయి
నీ యుక్తి కోరినా మనసులో బాధ  గోల్పోయి
నీ భక్తి కోరినా జననము వల్ల గోల్పోయి
నీ ముక్తి కోరినా మరణము వచ్చి చేరాయి  .....
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(10)
నిను కొల్చు భాగ్యము పొందే పాతకుడ్ని 
నిను కొల్చు సౌర్యము పొందే పామరుడ్ని 
నిను కొల్చు మౌఢ్యము పొందే పాఠకుడ్ని 
నిను కొల్చు భాగ్యము  పొందే  మానవుడ్ని  .
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(11) 
సుకుమారి గా పెరిగి మృదుత్వము అందించు 
బిడ్డకు మృదు స్వభావము తల్లి అందించు 
ధర్మ విరుద్ధమగు కార్యములు నిషేదించు 
యుద్దాలు చేసినా సమర్ధించక తిరస్కరించు 
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(12)
చంచల స్వభావము లేని ప్రేమ నందించి
బిడ్డలో మార్పు స్వభావము రాకుండా చూచి  
వంశాకురంగా వచ్చిన ప్రకృతి జ్ఞానము పంచి 
బిడ్డల్ని నిష్ణాతులుగా మార్చుటకు కష్టించి 
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా 
(13)
శాస్త్రాదుల అధ్యయనము నిరంతరం జరిపి
బిడ్డలకు వయసుకు తగ్గ కధలను తెలిపి 
నిత్యమూ భారత దేశ సుఖం కోసం తపము జరిపి 
తపస్సు గా బిడ్డలందరికి హృదయాన్ని తెలిపి  
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
(14)
ఏ ప్రాణికి బాధ కల్గించ కుండా భర్తకు, సౌకర్యాలు 
కల్పించి,  బిడ్డను  ప్రాణప్రదముగా నేర్పే కళలు  
నిజము పలుకుట  అక్షర సాహిత్య తీపి గురుతులు 
అనుకువ నేర్పిచి తీర్చి ఆనందించేది తల్లి ఆశలు   
తల్లి తండ్రి గురువు కు జ్ఞానాన్ని పంచె ఈశ్వరా
--(())--


1, ఫిబ్రవరి 2020, శనివారం

యవనాశ్వుని కథ ఆంజనేయ కధలు

యవనాశ్వుని కథ

పూర్వం కాంభోజ నగరంలో, యవనాశ్వుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు.
జటాజూటధారి శివ పూజా దురంధరుడు .ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి, శక్తి క్షేత్రానికి వెళ్లి, చాలా కాలమ్ అక్కడ వున్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ, పంచ గవ్యాలను నివేదనగా పెడుతూ, తాను తినకుండా ,ఇతరులకు 
ఇవ్వకుండా, దగ్గరలో వున్ననీరు లేని బావిలో పడవేసేవాడు .

తేనే , పళ్ళు , పాలు , పెరుగు తింటూ, చాలా కాలం  గడిపాడు .

దేవుడికి పెట్టిన వస్తువులు, దివ్యమైనవి అవుతాయి .వాటిని తాను 
 తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే, మూర్చరోగం వస్తుంది . అతడికి ఆ జబ్బు వచ్చి, చాలా బాధ పడుతున్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే, తన బాధ వెళ్ళబోసుకొన్నాడు.  ఆయన దయ తలచి ”సువర్చలా దేవి దివ్య మంత్రాన్ని" ఉపదేశించి,  ఆంజనేయుని సప్త వింశతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు .

”ఆంజనేయ మతి పాటలాననం -కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తారు మూల వాసినం -భావయామి పవ మాన నందనం

హనుమానంజనా సునూః వాయు పుత్రో మహా బలః
 -కపీన్ద్రః పింగాలాక్ష సచ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతో వీరః -సీతా శోక వినాశకః
 -ఆకాశ హన్తా రామ సఖః -రామ కార్య దురంధరః
మహౌశాదిగిరేర్హారీ -వానర ప్రాణ దాయకః 
-వారీ శాతార కస్చైవ -మైనాక గిరి భంజనః
నిరంజనో జిత క్రోధః కదళీ వన సంవృతః 
-ఊర్ధ్వ రేతా మహా సత్వః -సర్వ మంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్టాతా -భాష్య క్రుజ్జగాతాం వరః
 -శివ ధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయణః ”

అనే  నామాలే, సప్త వింశతి నామాలు. అవి హనుమంతుడు, అంజనా సూనుడు, వాయుపుత్రుడు, మహా బలుడు, కపీన్ద్రుడు, పింగాలాక్షుడు, లంకా ద్వీప భయంకరుడు, ప్రభంజన సుతుడు, వీరుడు, సీతాశోక వినాశకుడు, అక్ష హంత, రామసఖుడు, రామ కార్య దురంధరుడు, మహౌషధి గిరి హారి, వానర ప్రాణ దాయకుడు, వారీశాతారకుడు, మైనాక గిరి భంజనుడు, నిరంజనుడు,  జిత క్రోధుడు ,కదళీ వన సంవ్రుతుడు, ఊర్ధ్వరేతస్కుడు,  మహాసత్వుడు, సర్వ మంత్ర ప్రవర్తకుడు, మహా లింగ ప్రతిష్టాత, భాష్యకారుడు, జగద్వారుడు, నిత్య శివ ధ్యాన పరుడు, శివపూజా పరాయణుడు.

విశ్వా మిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని ,జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ, కొంత కాలo  గడిపాడు.వాటి మహాత్మ్యంతో అతని మూర్చవ్యాధి కనిపించ కుండాపోయి, మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయాడు యవనాశ్వుడు . చాలా కాలo, ఆరోగ్యంగా జీవించి, హనుమంతుని నిత్యం పూజిస్తూ , భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ, చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు.

కనుక హనుమ నామానికి అంతటి శక్తి, మహాత్మ్యం వున్నాయి.
అందరు కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది .అయితే చిత్త శుద్ధితో చేయాలి .హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు సాయుజ్యాన్ని కల్గిస్తాడు.


--((**))--

22, జనవరి 2020, బుధవారం


మాతృశ్రీ వందన పుష్పాలు  


పలుకులు మెత్త ముద్దులు పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే
 
అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి,
తప్పులెన్నొ చెసియు జీవించుటయు తప్పు

త్యాగభావమున తరువులే గురువులు
రాజకీయమున పదవులే గురువులు
ప్రేమపాకమున పెదవులే గురువులు
సేవ సాధనకు జనకులే గురువులు

చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె
భార్యకాని చెలిమి చిచ్చువోలె
భార్యాభర్త  బలిమి  మంచు వోలె

మందమతులకెపుడు ఉండదు ముందుచూపు
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు

పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం 
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం
--(())--

మాతృ శ్రీ వందనం

బిడ్డా ఆకార్షణ అనేది మన మనస్సును బట్టి ఉంటుంది
కేవలం స్త్రీలను ఆకర్షించటమే కాదు ఆకర్షణకు కానివారు లేరు ఈ జగత్తులో


కాలమే గాలమేసి ఆకర్షించు
మోహమే బంధమల్లె ఆకర్షించు
స్త్రీ శ్రమే దీపమల్లె ఆకర్షించు
ప్రేమయే జీవితాన్ని ఆకర్షించె

కోరికలే కొరగానివైన ఆకర్షించు
జీవితమే కొరగానిదైన ఆకర్షించు
మాటలలో మనసొప్పించిన ఆకర్షించు
ఆశలతో బతుకీడ్పించిన ఆకర్షించె

స్వగతానికి వినికిడి దూరమైన ఆకర్షించు
స్వతసిధ్ధికి మనుగడ భారమైన ఆకర్షించు
స్వరగానపు తలపులు బాధయైన ఆకర్షించు
స్వచ్ఛభారతి బహుమతి పొందకైన ఆకర్షించె

కన్నీటి వరదల్లో చిక్కుకుపోయిన ఆకర్షించు
పన్నీరు జలముల్లో స్నానముచేసిన ఆకర్షించు
సంతృప్తి తలపుల్లో వేదన చూపిన ఆకర్షించి
ఉద్యోగ పనులల్లో శోధన సాధన ఆకర్షించె

--(())--



మాతృశ్రీ వందనము 

మధుర మంజుల వాక్కులు మంగళముగా
వినయ సంపద పల్కులు రాగములుగా
కళల సంద్రపు ఘోషలు వేదములుగా
కళలు సాధన కోర్కలు తల్లి చలవే

వినయ వినమ్రత వివేక విశ్వ భావములుగా
సమయ సమున్నత సమాన సశ్య సాధనలుగా
కరుణ కమనీయ విశాల దృశ్య వేదికలుగా
తెలుగు వెలుగే టి విభాగ స్మృతి అమ్మ చలవే

మదము, దొంగతనము, మంకుబుద్ది,  చురుకుగా
విసుకు, లేకితనము, మొండిబుద్ధి , గరుకుగా
చవట, గొప్పతనము, జంకుబుద్ధి , తళుకుగా
సహజ, పెంపుతనము, తల్లిబుద్ధి , తెలివికె

మొరటువాని తోడ సరసమాడుట రోతగా
పిరికివాని తోడ నడకసాగుట రోతగా
గుణము లేని వాని చెలిమి సాగుట రోతగా
ఫలము లేక తల్లి బలము పెంచుట తెల్వియె

--(())--

మాతృ శ్రీ వందనం

పల్లవీ జనముల వాలు చూపుల చేత
వెన్నెలా వెలుగులు జాలు వారిన వేళ
పల్లకీ మెరుపులు ఆశ తీరిన వేళ
స్వేచ్ఛ గా తెలుగును తెల్పె వేదిక వేళ

ఆంధ్ర మాతను బ్రతికించుకొనే వేళ
విద్యా వెల్గులే కొనిపించు కొనే వేళ
కావ్యం వ్రాయుట మరణాన్ని కొనే వేళ
బంధం తెల్పియు కళ పంచుకొనే వేళ

అక్షర ప్రేమచూపు కవివర్యులు కల్సేవేళ
పావని ప్రేమపంచు జనసమ్మోహ కల్సేవేళ
కాలము ప్రేమపంచి విధితత్వమె ఉండే వేళ
మాతయు ప్రేమపంచు పురుషత్వమె ఉండే వేళ

సార్వజీవులు నొక్కసమముగా రక్షించే కవిత్వ మేళ
భాగ్యసీమలొ సంతసమముగా వీక్షించే కవిత్వ మేళ
దివ్యభావమె తెల్గుతనముగా ప్రేమించే కవిత్వ మేళ
తల్లి తండ్రులు ఏకసమముగా వచ్చేసే కవిత్వ వేళ

--(())--

మాతృశ్రీ వందనము

తల్లి తండ్రులన్న దైవ సన్నిభులురా 
పాప పుణ్యాలన్న  కర్మ  దీక్షపనిరా 
తప్పు ఒప్పూ లన్న క్రియ శక్తి విధిరా
మంచి చెడ్డా లన్న ప్రియ యుక్తి కళరా  

సానుభూతి కంటే స్వర్గంబు లేదురా
ఆత్మవంచ నంటే నర్కంబు ఉందిరా
దేహ భీతి ఉంటే మోక్షంబు  లేదురా
అన్య దృష్టి ఉంటే అర్ధంబు వేరురా  

స్వార్ధపరతుకంటే చావు మేలురా
దొంగతనము కంటే అగ్ని పట్టరా
జాణతనము ఉంటే రోగ మొచ్చురా
ఆశ పాశము ఉంటే కొంప కొల్లేరే

కష్టపెట్టబోకు తల్లి మనస్సు ఎప్పుడూ
నష్టపెట్టబోకు తండ్రి యశస్సు ఎప్పుడూ
ఇష్టముండి చేయి దానం ఉషస్సు ఎప్పుడూ
పట్టుబట్టి చేయు మంచి శాంతియు ఎప్పుడూ

--(())--


మాతృశ్రీ వందనము

అమ్మ సాధుజన అమృత వళ్లి
అమ్మ ఆదరణ తరువు మల్లె
అమ్మ కోమలము కలువ మల్లె
అమ్మ అందరికినీ  కల్పవల్లి

కష్టపడదు కన్న తల్లి మనసు
ఇష్టపడదు చెడ్డ తల్లి మనసు
నష్టపడదు దారి తప్పి మనసు
చేష్టలుడికి కాల మాయ తనము

అమ్మతనము లో ఉన్నది తీయందనము
ఉన్న మహిమ తో అన్నది కాలందనము
కన్న పలుకు తో  చెప్పెను బిడ్డాదరము
ఎన్ని తెలిపి నా చూడరు  తల్లీ దనము

అమ్మ పలుకుని వినని ఘనులు లేరు
అమ్మ  తలవని మనసు తిధులు లేవు
అమ్మ తనమును అడుగు కధలు లేవు
అమ్మను మారచిన మనుగడయు లేదు  

--(())--


మృదుత్వము, ధర్మవిరుద్ధమగు కార్యములు చేయకుండుట, చంచల స్వభావము లేకుండుట, జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏప్రాణికి బాధ జేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ధి కలిగి యుండుట, శాంతి స్వభావము, ప్రతిభ,  బ్రహ్మతేజస్సు, ఓర్పు, ధైర్యము, బాహ్యాంతర శుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట ఇవన్నియు సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొనవలెను. 

మాతృశ్రీ వందనం




 మాతృశ్రీ వందనం

మాతృశ్రీ వందనం

బాల మానసముల మేలుకొల్పు
శక్తి పంచి పనుల మేలుకొల్పు
యుక్తి తెల్పి చదువు మేలుకొల్పు
తీర్పు చెప్పి వెతలు మేలుకొల్పు 

సూక్తి లేని మాట శ్రుతిలేని పాట
యుక్తి లేని ఆట జాతి కాని ఆట
భక్తి లేని పాట గడ్డి పూల తోట
తప్పు చూపు కాట మొండి బత్కు మాట

రక్తి లేని ఆట రాత్రి నిద్దుర చేటు 
శక్తి లేని అట దేశ నిద్దుర చేటు
భక్తి లేని పాట ధాత్రి నిద్దుర చేటు
యుక్తి లేని మాట తల్లి తండ్రుల పోటు

వంటి కింపు శాంతి తరుణోదయం
ఇంటి కింపు భార్య  కరుణోదయం
చంటి కింపు బొమ్మ చిరునవ్వుయే
కంటి కింపు కాంతి అరుణోదయం

--(())--


మాతృ శ్రీ వందనం

మానవత్వ రధానికి సారధ్యం వహించి
దానవత్వ ఆలోచన లేకుండా సహించి
వృక్షతత్వ సహాయము కారుణ్యం వహించి
భేధభావ సాహిత్యము లేకుండా గ్రహించె


అస్ప్రశ్యతను కూకటి వేళ్లతో పెకలించి
హేరామ్ అనుచు చీకటి కళ్లనే వెలిగించి
కల్లోల్లతను చూపిన వాళ్లనే తరిమేసి
సత్యత్వమును నిల్పిన చౌటనే బతికించె

నిద్రావస్థలో ఉన్న జాడ్యాన్ని తొలగించి
ఆదర్శమ్ముగా సన్ని ధానాన్ని కలిగించి
నిర్భాగ్యుల్ని రామన్న సాక్షిగ బతికించి
దుష్టా శిక్షణ గావించి తల్లిగ కలిసుండె

ధర్మరక్షణ కొరకు నిత్యమూ బోధ చేసి
దుష్టశిక్షణ కొరకు సత్యమూ సేవ చేసి
అమ్మకోరిక అవని ధర్మమూ నిర్వ హించి
నాన్నమాటలె మనసు మర్మమూ తెల్పి చేసె


మాతృశ్రీ వందనము

అమ్మ సాధుజన అమృత వళ్లి
అమ్మ ఆదరణ తరువు మల్లె
అమ్మ కోమలము కలువ మల్లె
అమ్మ అందరికినీ కల్పవల్లి

కష్టపడదు కన్న తల్లి మనసు
ఇష్టపడదు చెడ్డ తల్లి మనసు
నష్టపడదు దారి తప్పి మనసు
చేష్టలుడికి కాల మాయ తనము


అమ్మతనము లో ఉన్నది తీయందనము
ఉన్న మహిమ తో అన్నది కాలందనము
కన్న పలుకు తో చెప్పెను బిడ్డాదరము
ఎన్ని తెలిపి నా చూడరు తల్లీ దనము


అమ్మ పలుకుని వినని ఘనులు లేరు
అమ్మ తలవని మనసు తిధులు లేవు
అమ్మ తనమును అడుగు కధలు లేవు
అమ్మను మరచిన మనుగడయు లేదు


--(())--


మాతృ శ్రీ వందనం

పల్లవీ జనముల వాలు చూపుల చేత
వెన్నెలా వెలుగులు జాలు వారిన వేళ
పల్లకీ మెరుపులు ఆశ తీరిన వేళ
స్వేచ్ఛ గా తెలుగును తెల్పె వేదిక వేళ

ఆంధ్ర మాతను బ్రతికించుకొనే వేళ
విద్యా వెల్గులే కొనిపించు కొనే వేళ
కావ్యం వ్రాయుట మరణాన్ని కొనే వేళ
బంధం తెల్పియు కళ పంచుకొనే వేళ

అక్షర ప్రేమచూపు కవివర్యులు కల్సేవేళ
పావని ప్రేమపంచు జనసమ్మోహ కల్సేవేళ
కాలము ప్రేమపంచి విధితత్వమె ఉండే వేళ
మాతయు ప్రేమపంచు పురుషత్వమె ఉండే వేళ

సర్వజీవులు నొక్కసమముగా రక్షించే కవిత్వ మేళ
భాగ్యసీమలొ సంతసమముగా వీక్షించే కవిత్వ మేళ
దివ్యభావమె తెల్గుతనముగా ప్రేమించే కవిత్వ మేళ
తల్లి తండ్రులు ఏకసమముగా వచ్చేసే కవిత్వ వేళ

--(())--

మట్టి మనిషిగా పుట్టిన కరుణలేని
మూర్ఖున్ని వాల్మీకి గా మార్చావమ్మా
పుట్టి మనిషిగా పెరిగిన హలముచేత
ఉన్నట్టి బల్రామ్ ని కాపాడావమ్మా


స్వేదము కాలవ కట్టేట్లు శ్రమించితినమ్మా
తల్లిని తండ్రిని సేవిస్తూ శ్రమించితినమ్మా
రెక్కలు ముక్కలు చేసేసి శ్రమించితినమ్మా
నిద్రను మానియు భక్తీతొ పూజించితినమ్మా


అంతరాళంబెల్ల నావరించిన నిన్ను
ధర్మమార్గంబెల్ల పూజ చేసిన నిన్ను
గంగతీర్ధంబెల్ల మాకు పంచిన నిన్ను
దేవమాయంబెల్ల మాకు రక్షణ తల్లి


పూజ్యతగొన్నట్టి పురుషోత్తముకు సతివమ్మా
బాధ్యత ఉన్నట్టి పరమాత్మునకు‌ సతివమ్మా
ప్రాధాణ్యమైనట్టి పరమేశ్వరుని సతివమ్మా
దేవత గున్నట్టి నిను గొల్చుటయు సమమమ్మా


మట్టి మనిషిగా పుట్టిన కరుణలేని ఎం
మూర్ఖున్ని వాల్మీకి గా మార్చావమ్మా
పుట్టి మనిషిగా పెరిగిన హలముచేత
ఉన్నట్టి బల్రామ్ ని కాపాడావమ్మా

--(())--
మాతృ శ్రీ వందనం

ప్రేమ ఎంత మధురమో, విరహమెంత భారమో
దేహ మెంత పదిలమో, తపన ఎంత వేదనౌ
సేవ ఎంత జటిలమో, ఉదయ మెంత సాధనౌ
తల్లి సేవ పదిలమే, హృదయ మంత శోధనే


డబ్బు కాదు ముఖ్యం, జబ్బు లేని సుఖం
హర్షం కాదు ముఖ్యం, వర్షం నిండె సుఖం
శౌర్యం కాదు ముఖ్యం, వీర్యం పొందె సుఖం
గమ్యం కాదు ముఖ్యం, లక్ష్యం తల్లి సుఖం


వినయం లేని విద్య, సుగుణం లేని రూపం
శరళం కాని పని, చరితం లేని జీవి
మకుటం లేని రాజు, మరువం లేని దండ
పదిలం లేని ‌‌‌శేవ, మధురం లేని లడ్డె


లవణం లేని తిండి, కారణం లేని ఊరు
శబధం చేసె భార్య, తమకం లేని తంతు
మరణం పొందు రోగం, మురిపెం లేని వింత
తరుణం పోతె రాదు, జననీ చూపె మోనం

--//***//--
మాతృ శ్రీ వందనం
బాబు తెలుసుకో

ఆకాశాన మామ ఉన్నా వెన్నెల గాను
పృధ్వినందు తల్లి విత్తే విస్తరి గాను
సంద్రమ్మున ఉన్న ఉప్పు జీవము గాను
ఆంద్రమ్మున మాట నిండు పున్నమి గాను

కాలము పరిభ్రమిస్తూ సమయానికి గాను
వాదము చలనంఇస్తూ విజయానికి గాను
వేదము పఠనం ఇస్తూ సహనానికి గాను
దేశము వినయంఇస్తూ కరుణానికి గాను


జీవితానికి ప్రయాణం మలుపులు గాను
సాహసానికి ప్రెరేపం గెలుపులు గాను
తాపసానికి ఉత్పేరం కలియుట గాను
సాగరానికి గంగమ్మా కలియుట గాను


వసంత కాలములో పుష్పరాశి గాను
విశాల శాఖలలో పక్షిగూడు గాను
అనేక మాటలలో మంచితీర్ప గాను
సమస్త లోకములో తల్లి సేవ గాను

--(())--



ఆదిత్యుని ప్రవేశానికి గవాక్షాలు తెరచి
భాధిత్యుని ధాక్షిణ్యానికి ఉపాయాన్ని తెలిపి
సాదుబుధ్ధి సాహిత్యానికి సహాయాన్ని తెలిపి
భర్త్ర శక్తి సామీప్యానికి వివేకాన్ని తెలిపె


దేహకాంతి విస్తీర్ణమై ఉజ్వలమై విస్తరించి
మోహశాంతి మధ్యస్తమై సీతలమై సమ్మోహించి
దేవకాంతి సంతృప్తమై నిత్యతమై విస్వసించి
చారురూప సంఘర్షణై నిద్రితమై సంతసించె


స్వప్నాల సాకారం పొంది కాఱుణ్యాన్ని అందించి
విజ్ఞాన ఆహ్వానం పొంది సమ్మోహ్యాన్ని అందించి
సంతృప్తి అవ్యక్తం చెంది కర్మస్సాక్షి చిందించి
సద్భావ సద్భుధ్ధీ చెంది సంతోషాన్ని చిందిచె


బుధ్ధి వికసనం చెంది విద్యుక్త ధర్మాన్ని నిర్వహించి
సిధ్ధి మధురసం పొంది సద్భక్తి లక్ష్యాన్ని నిర్వహించి

--(())--

 మాతృ శ్రీ వందనం

నడక నేర్చక మునుపే తివాచీలాగా
మనసు తెల్పక మునుపే అమాలీలాగా
చదువు నేర్చక మునుపే మేధావీలాగా
బతుకు పండెటు చెసెటీ మాతృ శ్రీ నీవే

ఊహ తెలియక మునుపే చూపే భవిష్యత్తువి
ఆశ అనునది తెలిసే లోపే సమర్ధత్తువి
ఆట అనునది ముగిసే లోపే మెధస్సుతల్లి
కళ అనునది తెలిసే లోపే తరున్మయ్యవి

జడి  వానలా కలయిక నీ వంతంటూ
మరు మల్లెలా వలచుట నీ వంతంటూ
సిరి ఆశలా తలచుట నీ వంతంటూ
వరి నాటులో కలుపును తీసే తల్లీ

మా సుఖం కోసం నే నున్నానీ అంటూ
మా దుఃఖం తీర్చే మీ అమ్మానీ అంటూ
మా తరం నేర్పే మీ విద్యానీ అంటూ
మా మతం అర్ధం మీ తల్లీ ప్రేమమ్మే

--(())--

మాతృ శ్రీ వందనం

లక్షల రూకలు కష్టానికి ఫలితం మైతే
కక్షలు మానియు ఇష్టానికి తరుణం మైతే
అప్పు లేకయు సంఘానికి సహనం మైతే
చెప్పె పల్కులు నిరంతరము సహజం ఐతే

మస్తిష్కం మండ వచ్చు  కళ్ళు కన్నీరుకు
విస్మయం చెంద వచ్చు నీళ్లు పన్నీరు కు
తన్మయం పొంద వచ్చు గుళ్ళో‌ ప్రార్ధనను
నిర్మలం అమ్మ పల్కు ఊళ్లో సంక్రాంతి యు

హృదయం హర్షించ వచ్చు చేసిన పనిలో
వినయం చూపించ వచ్చు చెప్పిన పనిలో
సహనం కోల్పోవ వచ్చు చేసిన పనిలో
సహజం గా తల్లి వచ్చి పల్కిన పలుకే

ధర్మము రక్షించు మనుష్యుల్లో దాన గుణం
సత్యము అహింస మనుష్యుల్లో బత్కు గుణం
న్యాయము ధర్మము మనుష్యుల్లో జీవ గుణం
తల్లియు తండ్రియు భవిష్యత్తే ప్రేమ గుణం

--//*//--
--(())-- 

: మాతృ శ్రీ వందనం-19
ఊపిరెలా తిరుగుతుందో  అంతా నీ కృప
రాతిరెలా  కలుగుతుందో  అంతా నీ కృప
చుక్కలెలా వెలుగుతాయో అంతా నీ కృప
మోనమెలా పగులుతుందో అంతా నీ కృప

గుండె కదిలి స్రవించు ధార అంతా నీ కృప
మంట ఎగసి జీర్ణించు ధార అంతా నీ కృప
నేడు కదిలి మెప్పించు మాయ అంతా నీ కృప
మంచి పలుకు వర్ణించి చెప్పు టంతా నీ కృప

ఏకాంతపు ఎడారిలో దాహం తీరుట నీ కృప
కార్చిచ్చును పొగొట్టుటే వర్షం వచ్చుట‌ నీ కృప
మూర్ఖత్వాన్ని మార్చేటుయే జ్ణానం పెంచుట నీ కృప
ప్రేమత్వాన్ని తెల్పేటుయే ప్రేమం పెంచుట నీ కృప

నిదుర రాని నయనాలకు మెరుపు నీ కృప
మధుర మాట పయనానికి తలుపు నీ కృప
వయసు వేట సహనానికి మలుపు నీ కృప
మనసు సేవ తరుణానికి విజయమే కృప

--//*//--

: మాతృ శ్రీ వందనం-


కవి నిద్రించిన కవిత్వం బతుకు
రవి నిద్రించిన సుఖత్వం నిలుపు
ఋషి నిద్రించిన సమత్వం తెలుపు
సిరి నిద్రించిన చలత్వం కలుపు

తిధి నిద్రించదు ప్రకృతి తో మలుపు
విధి నిద్రించదు ఆకృతి తో కలుపు
నిధి నిద్రించదు జాగృతి తో మెరుపు
కల నిద్రించదు ప్రగతి తో తలపు

మతి నిద్రించదు ఆకర్షణ తో కుదుపు
సతి నిద్రించదు ఆలోచన తో వలపు
గతి నిద్రించదు ఆదర్శాలు తో నిలుపు
పతి నిద్రించడు అధ్యాయన తో తెలుపు

రుచి నిద్రించును ఆకలిగా ఉన్నప్పుడు
శుచి నిద్రించును  జోడులెకా ఉన్నప్పుడు
జెజి నిద్రించును భాధతొనూ ఉన్నప్పుడు
పెజి నిద్రించును రాతతొను ఉన్నప్పుడు

--//--

మాతృశ్రీ వందనం

మదిర నీకేలరా - మధువు నేనిత్తు
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా
- వనిత నేనుండ - వలపుతో నిండ

మనసు నీదేనురా - మగువ నీసొత్తు
- కామితమ్మిత్తు - సొమ్ములు నీకేలరా
- మగని నేనుండ - మధిరతో నిండ  

తక్కువ చేయనురా - తాపము చూడుమురా
 - తమకం విడుమురా  - భాధలు ఎందుకురా
 - భద్యత నాదియురా - భారము నాదియురా

ఎక్కువ కోరకురా - కోపము చూడకురా
- విముఖం అనకురా - సేవలు ఎందుకురా
- లక్ష్యము నాదియురా - నాణ్యత నాదియురా

ఆకలి అణకురా - అసలు నీకేనురా
 - అంతయు పొందుమురా -దాహము తీర్చుకోరా
  - దాపరికం వద్దురా  - దావాలనం తగ్గునురా       

రాగము ఇదియులే - రాతిరి నీకేనులే
- అంతయు పొందువులే - దాహము తీర్చునులే
- దాపరికం దేనికీ - చల్లదనం పంచునులే

సుఖాలు మనవిరా  - సంతోషాలు మనవిరా
  - సంబరం మనదిరా - కోపాలు మరువురా
- కోలాట ఆడుమురా  - కోరిక తీరునురా

దేహాలు మణివిరా - సందేహాలు అనకురా
- సంబరం మనదిలే - తాపాలు తొలగురా
- కోలాట అడుతలే - కోరిక తీరునులే

మదిర నీకేలరా - మధువు నేనిత్తు
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా
 - వనిత నేనుండ - వలపుతో నిండ

మనసు నీదేనురా - మగువ నీసొత్తు
- కామితమ్మిత్తు - సొమ్ములు నీకేలరా
- మగని నేనుండ - మధిరతో నిండ  

పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు
 - వలపు అందిస్థా - లేదని అనుకోకురా
- లోకాన్ని చూడరా - లోకులను గమనించారా   

పక్క చూపు లేదేనులే - పరువం నాసొత్తు
- గిలక చూపిస్తా -  మొద్దని అనుకోకుమా 
- మోనాన్ని వీడరా - లోకులను గమనించాలే

కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా
 - కనువిందు చేస్తుండగా - పలకరింపు చూపరా
 - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా

కలవరింపు లేదులే - కనులముందు ఉందిలే
- మనసంత ఇస్తుండగా - సలరింప దీనికే
- పక్కను మరవనులే - పదిలంగా

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ
 - బొదరింటిలోన -నాగవేషణ యెల్ల
- నన్ను కన్గొనుట - నగుచు నే మనుట

ఓపట్టు పట్టరా - పొగమంచులోన
- బొదరింటిలోన - వేగవేశాన యెల్ల
- నన్ను కన్గొనుట - నగుచు నే ననుట

సాన పట్టుమురా - సతతము కలవరా
- సరిగమ అనరా - వేషము వద్దురా
 - వేగిర రమ్మురా - వెతలు తీరునురా

ఆశ చూపుమురా - ఆధరము కలుపురా
- పదనిస పదవే - మోసము వద్దులే 
 - వేగిర వచ్చితీ - కధలు తీర్చునురా  

రాగవీణను మీటె - రమణి రంజిల్ల
- రవము రాజిల్ల - యోగ మేమిటొ నాది
- యురికి యొప్పారె - నురము విప్పారె

కామబాణము మీటె - రమణ రంజిల్లి
- రతియు శోభిల్లె - వేగ మేమిటొ నాది
- నరము విప్పారి - రసము యొప్పారె 

రామకీర్తన పాడే - రవళి రంగరించి
 - రసము శోభిల్లే - వేగము మరిచా
- వేకువ చేరితి - వేదన తీర్చితి

కామ కీర్తన పాడే - మురళి రంగరించి
- రతియు శోభిల్లే - కోపము మరిచా  
- మాపున చేరితి - ఆకలి తీర్చితి

--(())--

మాతృశ్రీ వందనం (17)

విజ్ఞాన వినోద సంపద ఔనత్యాలు  
అజ్ఞాన సుభోద సంపద ఔనత్యాలు
నిర్మాణ పునాది సంపద ఔనత్యాలు
సన్మార్గ అనాది సంపద మౌనత్వాలు

కోల్పోయిన జీవనోపాదుల కళలు
కోల్పోయిన భోధనాపద్ధతి  దశలు
కోల్పోయిన తండ్రి దీవెన కధలు
కోల్పోయిన అమ్మఆశిస్సుల కధలు

ఆహారం కోసం నిత్యం  కేరింతలు
ప్రోత్సాహం కోసం నిత్యం పోరాటము
ఉత్త్సాహం   కోసం నిత్యం ఆరాటము
సందేహం తీర్చే కోసం మాతృశ్రీయె

పరవశింపచేసే కళారూపాలు ప్రభోధం
కలవరింపచేసే భయాందోళన్న ప్రభావం
సలపరింపచేసే జపాందోళన్న త్రినేత్రం
పలకరింపుచూపే మనస్సే అమ్మ స్త్రీతత్త్వం 

--(())--
 

 మాతృశ్రీ వందనం-16

మానవ నాగరికతకు దర్పణం
మానస పక్వదశదిశ దర్పణం
లాలస రామసుమరమ దర్పణం
అంబర దీపకదలిక దర్పణం

సంస్కృతిక పరిరక్షక దర్పణం
సంఘటిక సమలోచన దర్పణం  
సంతసము సమజోడిల దర్పణం
అమ్మదయ కనురెప్పల దర్పణం

కర్తవ్య ప్రభోదాలు చూపే దర్పణం
కారుణ్య ప్రాధాన్యాలు చూపే దర్పణం
ఉద్భోద ఉత్సాహాలు చూపే దర్పణం  
ఆదిత్య ఆరాటాలు చూపే దర్పణం

పాటకు పరవశించే దర్పణం
మాటకు కలవరించే దర్పణం
ఆశను తెలియపరిచే దర్పణం
అమ్మను పలకరించే దర్పణం

--(())--

మాతృశ్రీ వందనం - 15
 
మంచి చెడ్డలు జ్ఞానంబు మందబుద్ధి
పుణ్య పాపము గ్రామంబు చిత్తశుద్ధి 
అక్క చెల్లెలి ప్రేమంబు  మైత్రి బుద్ధి 
తల్లి తండ్రుల ధర్మంబు పెంచబుద్ధి

ధ్యాన సిద్ధిని గాంచె సంతసము తోడ
ప్రేమ బుద్ధిని గాంచె వేగసము తోడ 
సత్య పల్కును గాంచె వేదసము తోడ 
న్యాయ లక్ష్యము తోను మాట సిరి తల్లి  

అయోమయంగా ఏ స్థితిలో ఉండకు
మనోమయంగా ఉన్నది తెల్పేందుకు
తిరోమయంగా ఎప్పుడు మాట్లాడకు
బలోమయంగా తల్లియె కల్పించెను

మనం అనుకొని మదిశాంతి చేకూర్చి
అహం అదుపులొ జతచేసి చేకూర్చి
గుణం అదుపులొ మనసిచ్చి చేకూర్చి
జనం పరుగలొ చెయికల్పె తల్లీవి


--(())--

మాతృశ్రీ వందనం - 14

పచ్చని పూదోట హృదయాకర్షణ
వెచ్చని వేన్నీళ్లు చలి యాకర్షణ
నచ్చిన కన్నీళ్లు మగువాకర్షణ
మెచ్చిన ఇల్లాలు సుఖమాకర్షణ


అక్కర కొచ్చిన చుట్టమాకర్షణ
చెక్కర పాకము కోవకాకర్షణ
ముక్కెర ముక్కుతొ నాట్యమాకర్షణ
మక్కువ కొద్ది మనస్సె ఆకర్షణ


గలాబి గుభాలింపు ఆకర్షణ
వినోద కళాకారి ఆకర్షణ
మదీయ శుభంకారి ఆకర్షణ
మనోమయ విజ్ఞాన ఆకర్షణ


సర్వలోకాల సంపదాకర్షణ
ధర్మపీఠాల బోధలాకర్షణ
జన్మభావల పోషణాకర్షణ
అమ్మతత్వ ఉషోదయాకర్షణ


--(())--

మాతృశ్రీ వందనం - 13


తెలిసీ తెలియని యవ్వనప్రాయము
ఎగసే కెరటపు ఉన్నత ప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

వర్షపు చినుకుల తడిపిన భూమే
మొక్కకు ఎదుగుట అడుగులు సాగే
మక్కువ పెరిగియు తరువులు ఊగే 
చక్కని తనువులు తడిసియు మెచ్చే

విలువలు పెంచే నడవడి జగతికి
మనసును దోచే జగతికి వినయతి 
సొగసును దాచే మగనికి అనుమతి  
మగువకు పంచే అవయవ బహుమతి 

పలుకు చున్నారు వివిధ భావమ్ములతో
చిలుకు తున్నారు వివిధ హృధ్యమ్ములతో 
పెరుగు తున్నారు వివిధ వాత్త్సల్యములతో
జరుగు సంభాషణ మదియే  తల్లి కారునే  

--(())--
మాతృశ్రీ వందనం - 12
 
నలుగురు నడిచే బాట భద్రము 
పదుగురు పలుకే వేద మంత్రము 
చెడుగుడు కులుకే ప్రేమ సూత్రము 
తనమన మనసే తల్లి మార్గము

తొలి బుడి అడుగులు పడిలేచుటయే 
తొలకరి చినుకులు  పడి పారుటయే
తడిపొడి పలుకులు మది మార్చుటయే 
మగసిరి కులుకులు రమ ఓర్పులులే 

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
మరణము బిగువున కదిలె శాపముకు 
చరణపు పలుకులు కులుకె తాపముకు 

తడబడి చేసే తప్పులు కనుగొని
అనుభవ భావం వప్పులు తెలిపియు 
మనసుతొ చేసే ముప్పును కనుగొని 
మమతను పంచే తల్లియు తెలిపెను 

--(())--


మాతృశ్రీ వందనం - 11  
నాగుల మల్లెలు ప్రతికలవుతూ 
వాసన పుష్పాలు ప్రతిభలవుతూ 
వేసవి గాలులు ప్రగతి లవుతూ 
కాలపు గానము ప్రతిజ్ఞ లవుతూ 

ఉన్నచోటు ఉంటే విజ్ఞానం తెలియదు 
అన్నచోటు పోతే అజ్ఞానము తెలియదు 
కన్నచోటు పోతే గుర్తింపుయు తెలియదు 
మొన్ననేమి లేకే మర్యాదయు తెలియదు

విలువలు పెంచె నడవడి జగతికి
మనసును పంచె మగువకు గడబిడి 
తరుణము చూపి పలికెడి పలుకులు 
వినయము చూపి చిలికెడి చినుకులు 

తప్పక జరిపే కార్య నిర్వాహణకు 
ఒప్పియు కదిలే సౌర్య పరాక్రమము 
గోప్యమువలనే ఆర్యనిర్వాహణకు 
శాంతము తెలిపే మాతృశ్రీ నిర్ణయము 

--(())--


మాతృశ్రీ వందనం - 10

భావాలు అక్షరములతో పోటీపడి
నేస్తాలు అద్భుత పలుకే పోటీపడి
నీలాల నింగిలొ శశితో పోటీపడి
రాగాల పాటలె మదిలో పోటీపడి

ఆరాట ప్రశ్నలు యదలో పోటీపడి
కాలాల చేష్టలు గతితో పోటీపడి
పాపాల మాయలు యతితో పోటీపడి
వాదాల గాలులు సతితో పోటీపడి

బంగారు మాటల గుణమే పోటీపడి
సింగార చేష్టల బలమే పోటీపడి
పంతాల గాలమె శిలగా పోటీపడి
వింతాట జీవిత మజలీ పోటీపడి

సంచార జీవుల బతుకే పోటీపడి
విందారు వింతలు మెరుపే పోటీపడి
ఎన్నెన్నొ మాటలు పడినా మాతృశ్రీ కి
ప్రేమంత పంచుట ఒకటే భావమ్మలె

--(())--


మాతృశ్రీ వందనం (9)

నేనట ధైర్యశాలినట అని భావించి
నేనట ప్రేమభక్తునట అని కల్పించి
నేనట దేశభక్తునట అని దీవించి
నేనట గర్వపడ్డ మది తప తల్లీదె


లోకంల్లో సలహాలివ్వడం తేలికేనని
లోకంల్లో నిజమాటివ్వడం తేలికేనని
లోకంల్లో మనిషేనమ్మడం తేలికేనని
లోకంల్లో జననీ నమ్మడం కష్టమేనని

అవగాహన అవసరం ఉంది తెలుసుకో
సమపోషణ సుమధురం ఉంది మసలుకో
చిరుహాసము మదిభావం ఉంచి కదిలిపో
కధకానిది విలువైన కళ జననిదే

ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకు
వినాశ ప్రబోధాలకు ఆశపడకు
విదేశ విద్యాబోధకు ఆశపడకు
చలించి సత్యాన్వేషణ చేయు జనని

--(())-

మాతృశ్రీ వందనం (8)

రాజధాని అంటూ తొందర వద్దుర బిడ్డా
రాజధాని ఆశే నిద్దుర రాదుర బిడ్డా
రాజధాని అంటే ముద్దుగ చూడుము బిడ్డా
రాజధాని కూడూ పెట్టెటి వాసము బిడ్డా


రావమ్మా లక్ష్మమ్మా అనుకోవాలిరా బిడ్డా
భావమ్మూ తెల్పుమ్మూ విని వేదమ్ములా బిడ్డా
దేహమ్మూ నిత్యమ్మూ విధి వేటమ్ములే బిడ్డా
స్నేహమ్మూ తత్వమ్మూ తిధి దాహమ్ములే బిడ్డా

కావుము దేవా మమ్మని అనాలిరా బిడ్డా
కాలము నీదే ఇమ్మని అనాలిరా బిడ్డా
మోసము లేదే దమ్మిది చెప్పాలిరా బిడ్డా
దానము చేసీ నమ్మియు బత్కాలిరా బిడ్డా

సేవలు చేసి అందర్నీ మెప్పించిలిరా బిడ్డా
కోపము లేక సంతృప్తీ కల్పించాలిరా బిడ్డా
నేరము చేసె వైనమ్ము మాన్పించాలిరా బిడ్డా
ప్రమను చూపి స్నేహమ్ము చెయ్యాలిరా బిడ్డా

కులం అంటూ మనుష్యులలో చిచ్చు పెట్టకురా బిడ్డా
కలం అంటూ మనస్సు కధా మంట పెట్టకురా బిడ్డా
గళం అంటూ యశస్సు మనో దెబ్బ తీయునురా బిడ్డా
మనం అంటూ ఉషస్సు వలే తల్లినీ కనరా బిడ్డా

--(())--

మాతృశ్రీ వందనం (7)

తల్లిగ పాఠాలెన్నో చెప్పేనులే
మంచిగ మోహాలెన్నో చూపేనులే
బిడ్డకు ఊహ్యాలెన్నో తెల్చేనులే
గుర్వుగ సత్యాలెన్నో తెల్పేనులే

బతికేందుకు నేరాలెన్నో నేర్పేనులే
కదిలేందుకు లౌక్యాలెన్నో సెప్పేనులే
వెతికేందుకు సూత్రాలెన్నో మార్చేనులే
కళలన్నియు సూత్రప్రాయం నిల్పేనులే

కలకానివి కావ్యాలెన్నో వ్రాసేనులే
పలుమాటల పద్యాలెన్నో పాడేనులే
దరహాసపు భాష్యాలెన్నో చిందేనులే
ధనమాయతొ కోపాలెన్నో వచ్చేనులే

సమభావాల సోకులెన్నో శోభించులే
సమరాగాల పాటలెన్నో పాడాలిలే
పలువేషాలు వేయాలెన్నో వేయాలిలే
జననీ మాట తప్పో ఒప్పో నమ్మాలిలే

--(())--


మాతృశ్రీ వందనం (6)
 
మది తలపులు పులకింతలగా అందించి
సిరి మెరుపులు చిరుకాంతులుగా దీవించి
కళ మలుపులు బతికే బతుకుగా తెల్పియు
కధ కధలుగ కదిపే తరుణము తల్లీయె

ఆలోచనలలో నిజాయితీ ని చూపించి
మనోకలలలో తరించుటే ను తెల్పియు
నిజానిజములే కళాపిపాశ నేర్పేలె
మదీయవచనం తలంచితెల్పె తల్లేలె

ప్రతి ఒక్కరు పచ్చని చేనులా ఎదగాలని
ప్రతి కోర్కను చల్లని నీడలో తెలపాలని
ప్రతి విద్యను చక్కని బాటలో నడపాలని
ప్రతి తీర్పులొ సత్యము తల్లిగా తెలిపేనులె

ఎడా పెడా వాయించిన చీకట్లు కమ్మాయని
కొపీ లొభీ వేదించిన చిక్కుల్లు ఉన్నాయని
ఒసై ఎమే తిట్లిచ్చిన మబ్బుల్లె తర్మాయని
సదా విధీ భావించిన తల్లీయె తన్మూర్తిగ


 మాతృశ్రీ వందనం (. 5)

కొంత విజ్ణాన సంపద దాహం తీర్చి
వింత అజ్ణాన సంపద తొల్గిం చేసి
కొంత సంతృప్తి పంచియు సేవా చేసి
సంతతీ అంత కొల్చెటి అమ్మావమ్మా


గురువే దైవంగా పూజించి ప్రోత్సాహం కల్పించి
వయసే వైనంగా భావించి ప్రావిణ్యం కల్పించి
తనువే ధైర్యంగా చూపించి ప్రోద్బలం చేయించి
మనసే ప్రేమంగా ఉంచేటి మాతృశ్రీ నీవేను


పొంచి ఉన్న ప్రమాదాన్ని వ్యక్తపరచి
పెంచి యున్న ప్రభావాన్ని ధైర్యపరచి
సంచి లాగ ప్రభోదాన్ని తెల్యపరచి
మంచి పంచు ప్రపంచాన్కి తల్లితెలివి


కదం త్రొక్కి విధి విధాన్నాన్ని వ్యక్తపరిచి
మదం అన్చి తిధి వినోదాన్ని తెల్యపరచి
పదం తెల్పి నిధి ఉద్యమాన్ని సవ్వ పరచి
జపం చేసి మది వివాదాన్ని తొల్చెజనని


--(())--


మాతృ శ్రీ వందనం (4)

స్వాతంత్ర్యం వచ్చెగాని స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సామ్రాజ్య ం ఆశలేని స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ప్రాధాణ్యం కోరనట్టి స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ప్రేమత్వం పంచునట్టి స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


లెక్కలు మారినా ప్రాధాన్య స్త్రీ కి లేదు స్వేచ్ఛ
మొక్కులు తీర్చినా శక్తున్నా స్త్రీ కి లేదు స్వేచ్ఛ
చిక్కులు లేకనే యుక్తున్నా స్త్రీ కి లేదు స్వేచ్ఛ
తక్కవ ఎక్కువా ప్రేమున్నా స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


నానా దేవుళ్ళ బీజానాం తో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
చూసీ పొమ్మనే పుత్రాణాంతో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ఉండి లేదనే ఎకోనాంతో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సేవ భావంతో వినోదం లో స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


సంక్షేమ సౌభాగ్య స్ధితిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సాంబ్రాజ్య సౌందర్య స్ధతిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ఎడ్పాటు తోడ్పాటు స్ధితిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
మర్యాద సౌలభ్య స్ధితిలో స్త్రీ కి ఉంది స్వేచ్చ


--(())-+
మాతృశ్రీ వందనం (3)
రక్షణాపేక్ష సతతము ప్రత్యక్షమమ్మా
శిక్షణాపేక్ష నియమిత ప్రభుత్వమమ్మా
కక్షసాధింపు మరచియు ప్రెమత్వమమ్మా
లక్షణం తిద్ది మనుగడ ప్రభావమమ్మా

పాలించు నట్టి సౌభాగ్య మూర్తివమ్మా
దీవించు నట్టి సౌలభ్య శక్తివమ్మా
శిక్షించు నట్టి  నిర్మోహ దివ్వెవమ్మా
శాశించు నట్టి తల్లీవి నువ్వెనమ్మా

చల్లదనం బిచ్చు  చతుర మూర్తివమ్మా
వెచ్చదనం పంచు మమత మూర్తివమ్మా
కమ్మదనం విందు తొ సమవర్తి వమ్మా
తియ్యదనం పొందె తెలుగుధాత్రి వమ్మా

కిన్నర గంధర్వ కింపురుషాదులే కొల్చితిరమ్మా
భవ్యత భందుత్వ భాద్యతవాదులే కొల్చితిరమ్మా
మన్నన మౌనత్వ మంధరదాసులే కొల్చితిరమ్మా
చిన్మయ రూపత్వ సుందరతల్లిగా కొల్చితిరమ్మా

--(())--

మాతృశ్రీ వందనం (2)

అన్నీ నేర్పులు నీయందే ఉన్నవమ్మా
ధైర్యం సాహస మాకిచ్చే తల్లివమ్మా
లౌక్యం నేర్పియు సేవించే మాతవమ్మా
ప్రేమమ్ అందించి ఓర్పేఅన్నావుగమ్మా

ప్రాణి కోటులందు వినయమ్ము చూపావమ్మా
ప్రేమ పక్షులందు కరుణమ్ము పంచావమ్మా
దేశ భాషలందు తెలుగమ్ము పల్కావమ్మా
దేహ వాంఛలందు సహణమ్ము తెల్పావమ్మా

ప్రియులకు ప్రియురాండ్ర ప్రేమ సందేశముల్ని
శ్రోతలకు శ్రమ శక్తీ ప్రేమ సందేశముల్ని
వ్రాతలకు గ్రహ రాశి ప్రేమ సందేశముల్ని
ప్రేరణకు శృతి హాస ప్రేమ పంచేటితల్లి

మహిత మైనట్టి విజ్ణాన మతి నొసంగే తల్లి
చపల చాపమ్ము తగ్గించి మతి నొసంగే తల్లి
వినయ భావమ్ము కల్పించి మతి నొసంగే తల్లి
సమయ పోషణే నెర్పించి మతి నొసంగే తల్లి

అన్నీ నేర్పులు నీయందే ఉన్నవమ్మా
ధైర్యం సాహస మాకిచ్చే తల్లివమ్మా
లౌక్యం నేర్పియు సేవించే మాతవమ్మా
ప్రేమమ్ అందించి ఓర్పేఅన్నావుగమ్మా


--(())-

మాతృ వందనం (1)


బ్రహ్మాండ సంసార వారధి నీ యది
ప్రాపంచ శాంతే యరుంగును నీ మది
దేహంబు గోళంబుగా కదిలే విధి
భాష్యమ్ము అందించుటే జననీ నిధి

సద్గుణంబులు నేర్పెడి చతురమతి
ధర్మబోధలు చేసెడి మధుర మతి
భక్తిపాటలు పాడెడి సుగుణవతి
ఎన్ని పోట్లను తెల్పని మదిలొ మతి

కడుపులో జలువల కదలకుండగ  జేసి
మనసులో తలపులు పదిలముండుగ జేసి
వయసులో వలపులు పెరుగుచుండగా జేసి  
భయమునె తరిమియు తరువులాగయే తల్లి

మందమతియును మంచులా యున్న కావుమా
శాంతికలిగియు రక్షలా యుండి కావుమా
వేదమతియును అందించి మమ్ము కావుమా

యెట్టిదయగల తల్లివో ఎన్ని కన్నులున్నవో

బ్రహ్మాండ సంసార వారధి నీ యది
ప్రాపంచ శాంతే యరుంగును నీ మది
దేహంబు గోళంబుగా కదిలే విధి
భాష్యమ్ము అందించుటే జననీ నిధి

--(())--