7, ఏప్రిల్ 2017, శుక్రవారం

Interent Telugu Magazine for the month of 4/2017/

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
బంబ అనగా=    ద్వి భవ్య హస్తములు ,
 భగము = జ్ఞానము ,యత్నము

Pastel Succulent Art Print
భంబ  భగము  పద్యాలు
1. ఎక్కడి వక్కడ తక్కువ చెప్పక ఎక్కువ చెప్పుట 
తప్పుల ఒప్పులు తిప్పల ముప్పులు వచ్చుట చెప్పుట 
అన్నలు అక్కలు కెప్పుడు అప్పులు గొప్పలు చెప్పుట 
చక్కని సుక్కలు మక్కువ చూపిన ఒప్పక తప్పదు 
 
2. వక్కల ముక్కలు, ఆకులు, కొబ్బరి చిప్పలు ఉంచుట
పచ్చని ఆకులు, మెచ్చిన బల్బులు, అక్కడ ఉంచుట
అక్షిత పువ్వులు, విచ్చిన మొగ్గలు, కుంకుమ ఉంచుట
గాజుల చప్పుడు, గజ్జల చప్పుడు, పెళ్ళిలొ ఉండుట
 
3. తెల్లని పాలను నల్లని నీళ్ళను నమ్మక తప్పదు
అల్లన చంద్రుడు చల్లని వెన్నెల వీచుట తప్పదు
పిల్లల నవ్వులు  ఏడ్పుల చూపులు చూడక తప్పదు
కుర్సిన వర్షపు నీరును భద్రము చేయక తప్పదు


4
. స్త్రీలకు మానము ప్రాణము, శీలము సౌఖ్యము సిద్ధము
నేర్చిన విద్యలు ఎప్పటి కప్పుడు పంచుట తధ్యము
చూపును సఖ్యత భావము, శాంతము ఓర్పుతొ ఉండును
ప్రేమను పంచుట మంచిని పెంచుట స్త్రీలకు సొంతము


5. తల్లియు తండ్రియు అత్తయు మామను చూడక తప్పదు
పెద్దలు చిన్నలు అందరు పుట్టుట మెట్టుట తప్పదు
మల్లెలు మొల్లలు జాజులు కొల్లలు పూజకు తప్పదు
కమ్మని తెమ్మెర గుమ్మని వాసన పీల్చక తప్పదు

6
. అట్టలు వేసిన, తట్టలు మోసిన, మట్టిని తవ్విన
గుంతలు పూడ్చిన, మొక్కను నాటిన, గుట్టలు కట్టిన
కష్టము తప్పదు, లాభము గిట్టదు, తిండికి కష్టమె
పేదల భాదలు, ఎవ్వరు చూడరు, లోకము తీరులె
lady desidia - Google Search:

7. నిందలు మోపుట, తప్పులు చేయుట, నమ్మక వమ్ములె
కొండలు కూల్చుట, మంటలు పెట్టుట, తొందర చేయుట
మోసము నేర్చుట, రోషము పెంచుట, తాపము నుండుట
ద్వేషము చూపుట, ద్రోహము చేయుట, కొందరి నేర్పులె
 
  8. నిత్యము సత్యము పల్కుట, అచట ముచ్చట వచ్చుట
విత్తము పొత్తుయు నష్టము, మచ్చిక మెచ్చిన మంచిది
భోగము రోగము వేగము, భాగము దానము నెమ్మది
గర్భము వచ్చుట మంచిది, నిర్భయ మిప్పుడు తప్పదు
 
9. మోహిని కామిత చూపులు, మానుష దారులు మార్చును
మాయను కమ్మియు, మౌనము వీడియు, ఆశకు పోవును
మీసము తిప్పియు, వేషము మార్చియు,  చూపెను
ప్రేమలొ ముంచియు, భాగ్యము దోచుట కొందరి నేర్పులె
 
10. నాదియు నీదియు ఏదియు కాదును వేదన వీడుము
వాదన చేయక రోగము పెంచక శాంతిని పొందుము
నిన్నటి మాటలు నమ్మిక పాలకులు మానస ఉంచుకు
మొనము వీడియు మంచిని నమ్ముట జీవిత సౌఖ్యమె
 
11. ఆపద పొంచి ఉన్నది తెల్సుకొ, నిబ్బర శక్తియు
ధైర్యము ఉంచుకొ, సోమరి  పోతుగ ఉండకు, కొంపకు
నిప్పును అంటిన బావిని త్రవ్వుట మూర్ఖుని భావము
అట్టిదె తల్చుట బుద్ధికి మంచిది కాదును మేలుకొ  
 
12. ముందున వెళ్ళెటి వారివి దోషము లెప్పుడు ఎంచకు
పోయిన వారిని  దోషిగ చెప్పకు, తప్పులు పట్టకు
నమ్మిన వారిని దోషిగ  మార్చకు, దోషము లెంచకు
వచ్చిన భాదలు తప్పవు భేదము చూడక మేలుకొ


Image may contain: 1 person


13. రేపటి కోర్కలు కోసము ఆశలు పెంచుట భావ్యము
 కాదులె, మాటల బట్టియు వేదన చెందుట భావ్యము
కాదులె, నాటక మాడుట మూర్ఖుని చేష్టలు భావ్యము
 కాదులె, మంచిని నమ్మియు సత్యము తెల్పుట భావ్యమె

 
13. ఇంటిని చక్కగ దిద్దుట, భర్తకు ప్రేమయు పంచుట
బిడ్డకు విద్యను నేర్పుట, తల్లికి  తండ్రికి అత్తకు
మామకు సేవలు చేయుట నేస్తము నమ్మియు  దేశము
భాద్యత కొంతయు తీర్చుట స్త్రీలకు నిత్యము  సొంతము

14. ఊహల  మాటున, బాసలు చేసిన, నేతల వేషము
రేపటి మాటలు ఈనాడె చెప్పుట, చేసేవి చెప్పక
నమ్మిక పల్కులు, ప్రేమల వర్షము, ఓట్లకు దండము
భాగ్యము పంచియు, నెయ్యము చేసియు, పేదకు దండము


15. విద్యయె మంచిని పంచెటి బుద్దిని,  శీలము సంపద
జాతికి సేవయు, ప్రేమకు బానిస, సజ్జన నెయ్యము
యోగ్యత భావము, నిర్మల నీతిని, దానము చేసియు
భారత పౌరుల శక్తికి మూలము, సత్యము ధర్మము


16. దేవుడు తెల్పిన విద్యకు, సరైన నేత్రము లేదులె 
నిత్యమ సత్యము పల్కుట,  సరైన పూజయు లేదులె   
ప్రేమకు మౌనము చూపుట, సరైన దు:ఖము కాదులె
కర్మల శోభను త్యాగము చేయుట, సౌఖ్యము కాదులె


17. సోఖ్యము త్యాగము చేసిన విద్యయు వచ్చుట తధ్యము
విద్యయె ఆశయ మైనను సౌఖ్యము తగ్గుట సత్యము
సఖ్యత కోరిన వారికి విద్యయు ఎప్పుడు తగ్గులె
విద్యయె కోరిన వారికి సఖ్యత సౌఖ్యము తక్కువ
Image may contain: 1 person, sitting
భంబ  భగము పద్యాలు -18

రాముని నామము నిత్యమ చేసిన బుద్ధిని పెంచును
మారుతి గానము చేసిన మంద మతీపొయి శోభయు  
రాముని చెంతయు అందరి ప్రార్ధన ప్రేమను కోరుట
రాముని గానము మానస సంతస వెన్నెల భావము

19. మానస వీణను మీటిన - ఓర్పుతొ ఉండిన ప్రేమయు ,
 కష్టము చేయక తప్పదు - ఆకలి తీర్చుట తప్పదు,
 స్త్రీయును వేదన పంచును - స్త్రీ యును ప్రేమను పెంచును,
ఏమని చెప్పెద ఇప్పుడు - స్త్రీలకు శాంతియు ఎప్పుడు,


20. లోకులు అన్నను, ఆశలు చూపిన, భాధలు పెట్టిన
 చాటున తిట్టిన, కోపము తెచ్చిన, సేవలు చేసెద
ఆశయ సాధన, శోధన నీపైన ప్రేమయు పంచెద
నన్నును నాప్రజ, పాపపు భావము, వెంటనె మార్చుము   
  
21. స్త్రీ సోభయే మన భాగ్యమె, విద్యయె సంతస సోభలె
స్త్రీ నిధి శ్రీ మతి సేవయె, నిర్మల శాంతము వల్లనె
స్త్రీ వడి జిక్కిన వక్కువె, సన్నుత ప్రేమను పంచియు
స్త్రీ యద చిత్తము నుండియె, ప్రజ్ఞను పొందుట సత్యము    


22. ఆకలి తీరదు, ఆశలు మారవు,  ఆమోర నమ్మరు
ఓపిక తగ్గదు, పోరును మార్చరు, నేతలు మారరు
కేకలు తగ్గవు, మాటలు ఎక్కువ, సేవలు తక్కువ
రోషము వచ్చును, దేహము ఊగును, నమ్మిక పల్కును


23. ఆంద్రయు అంతయు ఎండల వేడియు, బాగుగ పెర్గెను
స్నేహము పెంచియు, చల్లటి నీరును, మజ్జిగ పంచుము     
నందున ఉండియు తల్లిగ నీడను ఇవ్వుము
విశ్వమె వింతగఁ రేయి బవళ్లును వెచ్చనె పంచును

24. ఎండలొ తిర్గుట మంచిది కాదని పెద్దలు చెప్పెను
గర్వము చూపక వంచన చేయక సేవలు పంచుము
హాయిగా సాగును నాడువిహారము రాత్రుల వెన్నెల
శ్రేయము గూర్చును సేవలు చేసెడి వారికి నిత్యము 

25 .          
  


2, ఏప్రిల్ 2017, ఆదివారం

Internet Telugu Magazine for the month of 4/2017/61

ఓం శ్రీ రామ్ -  శ్రీ మాత్రేనమ:
శృంగార భగము శార్దూల పద్యాలు

1 .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే
    అంగాంగం సెగలు మనస్సు తలపే సంతోష సమ్మోహమే
    ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే      
    స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే

తాత్పర్యము : ఆకర్షణ ఒక వరము, మనసును దోచి సంసారం లో దించి సుఖాలందించేది, శరీరంలో ప్రతి భాగపు సెగలను చల్లపరిచి, మనసుకు సంతోష పరిచి సంమ్మో హపరిచేది, చూపుల్లొ సౌందర్యాన్ని చూపిన్చి, మనసు అంతా ప్రేమను వ్యక్త పరిచేది, ఒకరికొకరు కలువుటకు   స్నెహపూర్వకమైన వాతారణం కల్పించి, తనువే సుఖంగా అర్పించి సంతోషం కల్పించి సౌభాగ్యం అందించేది స్త్రీ మాత్రమే.    

2  గాఢాంద జ్వలయే సరాగ వలపే మాధుర్య వాత్సల్య మే
    భండారమ్ భగలే తజస్సు తొలిచే సాంగత్య సౌలభ్య మే
    బంధంతో కదిలే తేశస్సు కధలే కావ్యాల కారుణ్య మే
    నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే      .

తాత్పర్యము : వాత్సల్యమనే తీపిదనము అందించి సరాగాలతో వలపులను చూపిన్చి చీకటిలో వేడి సెగలను చల్లార్చేది, పట్టుదల్తో మొండిగా తపస్సు చేసిన బగ బగ సెగలు కమ్ముకొని సాంగత్యము ఒకరికొకరు కలవాలని అనుకొనే భావము చూపునది, ఒకరి కొకరు భంధంతో పెన వేసుకొని మనసులో ఏర్పడే అనుకోని తేజస్సు ప్రశాంత కధలతో కావ్య రచనకు సహకరించేది, ప్రతిరోజూ సుఘంధ పుష్పాల పరిమళాలను అందించి సుఖ సౌఖ్యం కల్పించేది, మనసుకు తత్వాలు భోదించేది స్త్రీ మాత్రమే.   

3. సాహిత్యా నుభవం, సువిద్యా, శ్రమయే, దిర్ఘాను భావత్వమే
    మొహత్వ శిరులే, సుసత్య పలుకే, సర్వోదయా పెన్నిదే
    ఆహ్వానం సుఖమే, సునేత్ర సహజం, సర్వోన్నతా సారమే
    స్నేహత్వం కలలే, సుఘంధ ప్రేమయే, సామాన్య సారూప్య మే


తాత్పర్యము:  విద్యను నేర్చుకొని, సాహిత్య సంపదను పెంచుకొని, విశ్రాంతి అనేదే లేకుండా  శ్రమించేది, ఆలోచనా పర్వంగా భావాలను వ్యక్త పరిచేది,  అందరి శ్రేయస్సు కొరకు, సత్యము పలుకుతూ, మనసులో ఉన్న మొహత్వాన్ని తగ్గించి శిరులను అందించేది, ప్రతి ఒక్కరిని ప్రీతితో పలకరిస్తూ, కళ్ళలో కరుణ చూపిస్తు, బిడ్డ లందరినీ ఉన్నతులుగా మార్చుటకు సహకరించేది, ఎమీ తెలియని వ్యక్తిగా, కళల సాకారము కల్పించి స్నేహమనే ప్రేమను అందిచేది, పరిమళాలను అందించే సుఘంధ పుష్పము స్త్రీ మాత్రమే.                 

heathersketcheroos:  An older illustration I came across while looking for some files..really want to finish it someday!:  

4. ఆనందం తెలిపే అనంత సుఖమే ఆలింగ సమ్మోహమే
    ఆంతర్యం పలికే అమోఘ మలుపే స్త్రీ సౌఖ్య వర్చస్సు యే
    ఆహ్లాదం కలిగే ఆనంద వలపే సౌసీల్య భావంబు లే
   ఆరోగ్య కులుకే మనస్సు  తలపే సంతోష సాఫల్యమే

తాత్పర్యము : భాహువులలో చిక్కి, ఆనందం అందించి, ఇదే అన్న సుఖమని తెలిపేది, వనితా శరీర మెరుపుతో, హావ భావాలను చూపుతూ, మగని మనస్సును అర్ధం చేసుకుంటూ, నవ్విస్తూ నవ్వులు పంచుతూ, తన శీలాన్ని భద్రంగా అందిచుతూ, ఆరోగ్యంగా ఉంటూ, ఎప్పుడు సంతోషాన్ని వక్తపరుస్తూ, అనిర్వచనము లైన పలుకులు పలక కుండా, ఉస్చాహము ఉల్లాసము వచ్చుటకు స్త్రీ సాఫల్యము మాత్రమే.
            
5. మాణిక్యం ఎరుపే, పెదాల మెరుపే, కావ్యాన్ని సృష్టించె లే
    బంగారం తనువే ఉగేటి నడుమే ఉల్లాస విజ్రుంభ ణే
    నాడెంతో తడిసే, సుఖాన్ని తెలిపే పాన్పును పంచేను లే
    వక్షోజాల కదల్చుట వల్ల మనసే ఆత్రంగా ఆరాటమే

తాత్పర్యం : పెదాల ఎర్రదనం, ఎర్రటి మానిక్య మెరుపు దనం, కవుల కావ్య రచనకు, సృష్టి జరుపుటకు దోహద కారి యగునది, శరీరం బంగారు ఆభరణాలుగా మెరుపుదనం తో ఆకర్షణగా మారి, ఉల్లాసంగా కవ్వించి సుఖాన్ని పొందేది, అసలే చక్కని పాన్పు ఉన్నది, తడిసిన బిగువ అందాలు చూపుతూ సుఖాన్ని పంచేది, స్థనాల బిగువులు తొలగించి, ఆత్రపు చూపులకు చిక్కి మనసును అర్పించేది స్త్రీ మాత్రమే

6. కోలాటం జరిపీ కోపంతో కొరికే కోపిష్టి మార్చేను లే
    కొమ్మంతా కుదిపీ  జ్వరంతొ తడిసీ చల్లాగ నిద్రించు లే
    మాగాణీ కలుపే అమోఘ కుదుపే కాదన్న ఒర్చుట యే
    పుష్పంలా నలిగే శుఘంధ పరువం అర్పించె ఆర్భాటమే

తాత్పర్యము : మొగవాడు ఎంత కోపంగా ఉన్నా, ఒకరికొకరు కోలాటం జరిపినా, కోపం పేరుగా కుండా జాగర్త పడేది, ఏంతో కష్టపడి, శారీర మంతా కదలి జ్వరం పోయి చల్లగా మార్చి  నిద్ర పుచ్చేది,  శారీర సౌష్ఠమునకు చిక్కి, బాగుగా నలిగి, ఇంకా కావాలన్న ఓర్పు వహించి, పువ్వు నలిగి నట్లు నలిగినా శుఘంధ పరిమళాలను అందించేది స్త్రీ మాత్రమే

  7. తెల్లారిందనగా శుభ్రంగ చెయుటే శ్రీ మాత  కార్యాణ్ముఖే
      బిడ్డలందరినీ  భద్రంగ చదివించే మాత   విద్యా యి నే
      ప్రశ్నల్నీ వెయకా సమాధ నమనే శ్రీ మాతా పంచేందుకే
      అన్యూ న్యత బలాన్ని తెల్పె ప్రక్రియే శ్రీమాత వాక్కులులే

      ఉషోదయ కాలమున తల్లి తనవంతుగా ఇంటి పరిసరాలను శుభ్రం చేయుటే కర్తవ్య భావముగా, తల్లి తనకున్న విద్యతో బిడ్డలందరినీ సమముగా చదివించే సరస్వతి దేవిగా, తన శక్తి నంత ధారపోసి ప్రశ్నలు వేయక అడిగినదానికి మంచి సలహాలు ఇచ్చేదిగా, తల్లి పలుకులు ఎప్పుడు అందరు కలసి మెలసి బ్రతకాలని తనవంతు సహాయ సహకారము ఎప్పుడు అందిస్తూ ఉండే శ్రీ మాతా పలుకులు ప్రతి ఒక్కరి బలాన్ని పెంచేవిగా ఉండేవే శ్రీ మాతా పలుకులు.   
   
    8. వడ్డాణం బలమే  నడుంకు మెరుపే ఆకర్ష విందేను లే
         జూకాలే కదిలే సుశబ్ద ప్రియదర్సే భావ ఉద్దేశ్య మే
        చంద్ర హారమునే ధరించి తరుణీ విశ్వా0త తేజస్సులే
        కట్టేవంకె  కారములందమునకే హృద్యాశ సంతోషమే


        స్త్రీ అంటేనే సౌందర్య దేవత, ప్రకృతి అందంతో తణ అందాన్ని ఇంకా చూపించాలని  ప్రేమను పొందాలని తహ తహ లాడుతూ  ఉంటుంది, తాను ఆభరణాలను ధరించి ఆకర్షితురాలుగా మారుతున్నది, నడుం అందం బలంగా ఆకర్షించేందుకు వడ్డాణం ధరించి అది ఒక మెరుపై చూసే వారికి ఆకర్షిత మవుతున్నది, చెవులకు పెట్టుకొన్న దిద్దుల కదలికలు ప్రియాతి ప్రియునకు శబ్దం చేస్తూ ఆకర్షితపు పిలుపుగా మారుతున్నది, చంద్రహారాన్ని ధరించి జగతిలో అమోఘమైన మెరుపును చూపించు చున్నది, చేతులకు కట్టే వంకే ధరించి హృదయాన్ని అందించి సంతోషాన్ని అందిచుచున్నది స్త్రీమాత్రమే .



9. కాదన్నా మనసే వెదింపు చిలికే హృద్యాస సందేహమే
లేదన్నా వయసే కుదించి పలికే వ్యత్యాస ఆరోగ్యమే
వద్దన్నా వలపే తపించి చిగురే చిందేను వైరాగ్య మే
తప్పదన్న మనో కమలమ్ము కడ విప్పారి సంతోషమే

తాత్పర్యం : కొందరు కొన్ని మాటలతో మనసును చిల్కి, తను కాదన్నా హృదయాన్ని సందేహములో ఉంచునది, వయస్సును చూడక, ఆరోగ్యాన్ని గమనించక, లేదన్నా వినక, భేదాన్ని తెలుసుకో లేక ప్రవర్తిన్చునది, వలపును చిగురించి వైరాగ్యముగా నటించి, వద్దన్నా వేదనకు దిన్చునది, చివరికి హృదయాన్ని విప్పి సంతోషాన్ని తెలిపి తప్పదు తప్పు తనలో ఉన్నాదని గమనించి సంతోషము చూపునది.            

10. ప్రేమావేసము నారదమ్ము తొలగున్ విశ్వాసమున్ విడగా
సామాన్యుం డటులేగా నాధుడెటకో సౌహార్ద సూన్యుమ్డవై
ప్రేమాదీనము లాదినమ్ము లేదలో వేమారు భావించియున్
ఏమోభిన్న ముకా దేడంద సతథా ఇచ్చోట నిప్పాటునన్

తాత్పర్యము: ఒకరి మీద ఒకరికి ప్రేమ తొలగిన, విస్వాసము లేకున్నా, ఆనందమును విడచి భర్తను గౌరవించక సామాన్య వనితలా ఉన్నా, నామీద ప్రేమ లేదులే, నన్ను మోసము చేసెనని భావించిన, ఎపుడు అదే తలచిన అక్కడ ఇరువురి మద్య నిప్పు రగిలిన చల్లటి నిరు చల్లినట్లు నిజము గమనించి బ్రతుకు సాగించునది.    

11. పొందేనో సహనం సుకీర్తి సేవలే సంతృప్తి వాసంబునన్
అందేనో పరులా సహాయ సహకార్యమ్మున్ను శాంతంమ్ముగన్
మెచ్చేనో కలిగే వికాస సేవలో మాతా పితా దీవెనే  
విచ్చేనో ప్రజ కాంతి పుంజ మనసే సంతోష నేత్రమ్ములే

తాత్పర్యము : సేవలలో సంతృప్తి చెంది, సహనం వహించి, ఉన్న ప్రాంతమున సేవలందించి కీర్తి పొందునది, శాంతముగా పరుల సహాయము, సహకారము పొందునది, అనారోగ్యులకు సేవలు చేస్తూ తల్లి తండ్రుల దీవెనలను పొందుతూ ఉండునది, ప్రజల మనసు కాంతి పుంజముగా మార్చి సంతోషము కల్గునట్లుగా చేసి సంతోష నేత్రమ్ములతో జీవించునది స్త్రీ మాత్రమే.

12. పిర్రల్తో కదిలే అనుంగ జడలే తన్మంత్ర ఆకర్ష లే
ఎఱ్ఱాటీ పెదవే, అమోఘ కతలే, తెల్పేటి మౌనంబు లే
కర్రోడైన శుభా శుభంగ లయతో ఉద్వేగ ప్రేమమ్ములే
సర్వోన్నతముగా తనంత తనువే పంచేది ఇష్టా సఖే

తాత్పర్యము: స్త్రీ సహజ సౌన్దర్యము జడలు, అవి పిరుదుల మధ్య కదులుతూ ఉంటే చూచువారికి అది ఒక ఆకర్షతముగా ఉండునది, మౌనంబుగా ఉండి, పెదవులు కదిలిస్తూ, అమోఘ కధలు తెల్పునది, మగవాడు ఎటువంటి వడైనా శుభములు కల్పిస్తూ, ప్రేమను పంచుతూ లయగా మారునది, ఉత్తమ లక్షనముతో శరీరము అర్పించునది ఇష్ట సఖి మాత్రమే.

13. ఒక్కానోక్క ప్రదేశమందు నోకపద్ధాతీ సౌఖ్యంబుయే
స్త్రీ పుర్షా కలిసే భుజించి బ్రతుకే శ్రేష్టంగ భావించుటే
దోచున్ ప్రేమ నిధీ, ధనాశ వలనే దుష్కార్య మార్గంబు ధ
ర్మా మోదంబుగ నాచరింతు ప్రియురాలా కొన్నిదేశంబులన్

తాత్పర్యము: కొన్ని ప్రాంతాలలో స్త్రీ పురుష సఖ్యత ఒక్కో విధముగా ఉండును, ఒకరి కొకరు కలసి భుజించి ఉన్న దానిలో తృప్తి పడుటే కోప్పదని భావించు వారు, పర వ్యామోహలో చిక్కి, ప్రేమను వంచించి, ధనాశ పెరిగీ, చేయరాని కార్యాలను చేయు వారుందురు, ధర్మాన్ని తప్పక, మగాడే ప్రత్యక్ష దైవముగా భావించి మనసుకు తగ్గ సుఖము లందించే ప్రియురాలుగా బ్రతికే వారు కొన్ని దేశంబు లందు ఉన్నారు.               
                           

  

Interenet telugu Magazine for the month of 3/2017/60.


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

నేటి కవిత్వం - విచికిలిత , యతి 12
న-న-న-న-న-న-న-గ - II I 
  తలపులు - భగము- పద్యాలు -1

కలువ కలవరము మదిని కొలిచి మెళుకువ తొ

ఎదురు చూపులు  కధ

భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు......భార్య భర్తను ఇలా అడిగింది.

" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? " భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?
భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ 
కాస్త భయంగానే అడిగింది.

భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే!
నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.
భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్ట లేదు కదా!
భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.
భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.
భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు......
అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు  ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య. 
ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన కళ్ళతో చదవసాగింది.
ప్రియమైన కుమారునికి......
ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.
కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......
మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.
బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా  ఉన్నది.
తరువాత అన్నీ ఎదురుచూపులే!
మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......మీ రాక కోసం ఎదురుచూపు.........ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడాసమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,
ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనానాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి
భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీచెప్పడానికి కూడా మీకు టైం ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్నినీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ అయిపోయావు.
నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది .
ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......
మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని
అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.
నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడుచెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతేపేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైంఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....
వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?
ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......
ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........
నాలా నీ కూతురో . నీ భార్యనోఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో
ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...
ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యనుబాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో! 
నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........ఇదే
నా చివరి కోరిక....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......
నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ
అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరు కుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు
యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని
వెళ్ళదీయనీయకు.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే
ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.
ఇట్లు 
ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరే నీ తల్లి.........
దయచేసి మీ కుటుంబంతో గడపండి......
వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే
గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..........
మీ సంసారమే మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దు.......

--((***))--

  
థళుకు బెళుకు తలపుల తపనల తమకముతొ
మరులు గొలుపు సుమధుర మధురిమ తలపుతొ
ఒకటిగ తనువులు కలవగ మనసుకు శుభములు    

2.కరుణ దయ కనికరము ఒక పయనముల పిలుపులనిన నే 
మనసు గెలుపు వరుసల మమ తడి పొడి పలుకులనిన నే     
మగువకు మగణితొ పరుషములతొ సరసముల నిన నే
తెగువ మరచి వగలు తలచి ఒక రొక రవుట   
లతల తొడిమలు కదలిక వయసు ఉరకలుతొ 
వెతలు తొలగి నయనములు కదిలి పిలుపులతొ
సొగసుళు మురిపములు కలుసుకొను సమయముతొ   
చిరు నగవు తలపు వలపు మెరుపు ఒకటవుట


myka jelina - Google Search:

  4. విభవములు లొసఁగును శుభములు కలుగును నితొ
మనుగడకు మమతలకు మనసు కరుగును నితొ
నొటికి  రుచులు వయసుకు వలపులు అనుకువతొ
తగువు కనపడక  చుముకముతొ కలిసి కొనుట  

5. రుచులు అరటి పనస పలురకముల ఫలములె
తినవలె నని మనసు కలవరముతొ పలుకులె
కదళులు తినవలెనని మగువల గల గల లె
ఫల మిడుచుట కుదరక మగని పరుగు పరుగె  

6.ని వలన మిత్ర శత్రువులు కలియుట మనుగడకె
ని కొరకు ఉదయ సమయము అణువణువువణికె   
ని పనులకు వగచి మతియు మరచి అలుగుటకె
ని తనువు మరులు గొలుపుచు ఉరక పిలుపులకె

Cameron Stewart:
7. చిలక పలుకులు చిలక, తగు పత్రములు తినకె
తరచు జలము కురియుటయు, తడుపుట కొరకె    
పలు రకముల నడక లతొ, ఉడుకును  తెలపకె
చిరు నగవులతొ, మది తలపులు తెరచి అలకె   

8. మరువము కుసుమము కలియుట పరిమళమె
సహనము ఒడుపు తనము మెరియు పరిమళమె
మమత సమత మెలుకువ మగువకు పరిమళమె
అనుకువతొ సుఖము కొరకు మెలగవలయునులె

9. మమతగని చెడుగుడు వదలి మెలగ వలయుటె
గురువు గరపెడి చదువులను పఠనము చెయుటె
అభినయ కరతళము సిరుల అనుభవ మగుటె   
చిరు నగవులు అను దినమున మన కవసరమె

  10కలదు కలదు అనిన తగువు బిగువు కనుల తొ
వలదు వలదు అనిన మతి పరుగు ఉరకల తొ
కలదు కల అనిన కనబడదు కనికరము తొ   
వలదొ ఎల అనిన ఎడ తెరిపి జలము తలపె

11. జనకులు తెలిపిన ఘనమును వినయముగ వినె
అనుకరణ తలపులు కుదురుగ ననయము గనె
మమతతొ కుదురుగ ముదమున పదిల పరచునె     
జనకులు పలుకులు తనయుల వినుట విదితమె

12. చరితలు చదువుము, చదువు బలిమిని తెలుసుకొ   
సుగుణములు గనుము, గుణముల మనసు తెలుసుకొ 
తిరుగ వలదు జత పడుటకు, మదిలో మలచు కొ
మరువ వలదు జనకుల వెతలు, మనకు సుతులె

13. మనిషికి జప తపము నకు కొలువలుగ గుడిలె
ఒకరి కొకరు కలియుటకు యద పరిమళము లె
మితము పరిమితముగ నలుపు తెలుపు బ్రతుకులె
పగలు రెయి సహచరి సహనముతొ యదకథ లె  
   
  14. మతి మతుల సతుల కధలు జదువ వలయునులె
చరితముల యిడుములు అనుభవముల కధలులె
వనిత బలిమి కలహములు తెలియని చెలిమిలె
ధనము వలన మది తలపు తరిగి పెరుగుట యె      

15. ఒడుదుడుకులు తెలిసికొను హిత మతి వలననె 
మనసున మమతను తెలుపు జనకుల  వలననె
నడతల పదిలము తెలుపు మగువల వలన నె
యతివల కెపుడు అణుకువ నటన అభినయన మె

16. మగువల మదిమెరుపు మనసు గెలిచు సహజమె
పడతుల పలుకు పలు రకముల పక పక లులె
గుణము తెలుసుకొని  సిరుల విలువ తెలపవలె
వరుడు దొరికితె వనితకు పరిణయము సబబె

17.నిజము అనృతము కలియుగ మనిషి కల పలుకె
జయము అపజయము మనుగడకు మలుపు పలుకె
పెరుగుట తిరుగుట విరుగుట వయసు ఉరకలె
వయసు పరుగులు ముసలితనము వరకు ఉరకె    

18. అహరహము సుఖము కొరకు సహనము వదలకు
వచన కళను దెలిపి రుచిగల కలలు కనుము
వయసుకు దడి మనసుకు దడ అనుకరణములె
జననము తరుణముతొ ఎదిగి కలియుట తొ ఒదుగు  

19. మగువ వలపుల మెరుపు మన మరుపు రుజువులె 
వనిత గలగల పలుకులె  రసిక రుసరుసలె
తరుణి  తనువు తపనలు మనసుకు గుసగుసలె
సహనము మనకు తెలుపు నిజాము కథలె


20
. నిధుల నిలయము సుఖ సహనముల ఒడుపె
వధువు నడకలు అణువణువు వెలుగుల మయమె
ధనము తగువుల తలపులె తెలుపుట నిజము లె 
పగలు వణకు రెయి కులుకు విధి మలుపు ఒకటి

21. ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి

22. మరులు గొలుపునది మది తలపు పరుగెడునది 
నయన మిది తనువు తపన మది సరిగమ లిది
నగవులిది మరులు గొనుపునిది తమకము నిధి
ఒకపరి తదుపరి తప నిధి కల గొలుపు విధి     

23ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి     

24.ధరణి ధగ ధగ భగభగ  మనిషి మనసు సెగ
తరుణి పక పక విక విక మగణి మనసు సెగ  
తహిని తనువ తహ తహ ప్రియుని మనసు సెగ
కమిని పలుకులు గజి బిజి వయసుకు పరుగు లె 






       

 

28, మార్చి 2017, మంగళవారం

ఇంటర్నెట్

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
Mandala Graphic Collection - colorful mandalas:
ప్రార్ధన శ్రీ తత్వ భగము పద్యాలు -1

శ్రీరంగ రంగా నోరారంగ పిల్వన్గ అత్యంత అర్ధంగ
అర్చించె ఆరాధ్య ప్రేమత్వ కళ్యాణ వైభోగ రాగంగ
ఆనంద మాధుర్య స్వప్నాల సాహిత్య తత్వంగ పాడంగ
 ఉత్తేజ దాక్షిణ్య సౌభాగ్య నేస్తంగ ఉన్నాను శ్రీరంగ       

శ్రీ తత్వ భగము పద్యాలు -2

భూదాన, గోదాన, కన్యత్వ దానము చేసాను శ్రీ రంగ
బంగారు దానము, గృహాల దానము చేసాను శ్రీ రంగ
సౌందర్య లాలిత్వ భావంగ అమ్మోరు ప్రార్ధించె శ్రీరంగ
రీయింబ వళ్లేను నీధ్యాన నీకీర్తి నేచెప్పె  శ్రీ రంగ

శ్రీ తత్వ భగము పద్యాలు - 3

శోకంబు వచ్చేను, శోకించ కున్నాను, జాతస్య భావంగ
బాహ్మణ తత్వంగ, ధీరత్వ సూరత్వ కర్తవ్య సాక్ష్యంగ
బిడ్డాలు కోడండ్రు భంధంతొ కొండంత భాద్యత భావంగ
నేనున్ నినున్ వేడితిన్ నీ ప్రెమమ్మూను పొందాలి శ్రీ రంగ
Illustration by Brigitte May:
ప్రేమ
శ్రీ తత్వ భగము పద్యాలు - 4
ఈ పూట నీవున్న నాకేమి పెడ్తావు ఈరాత్రి వచ్చాను 
వెన్నేల పంచాలి ఓసత్య, నవ్వించి కవ్వింపు రాత్రేగ 
నావెల్గు నీవేగ, నా తృప్తి నీవేగ, నా ఆశ నీవేగ
నాప్రాణ మంతాను నీమీద, నాప్రేమ నీదేగ ఓసత్య  



శ్రీ తత్వ భగము పద్యాలు - 5
 

ఏ కాల మొప్పుడొ, ఏవేష మెచ్చునొ , ఏ మాట పల్కునొ 
ఏ తీర్పు చెప్పునొ, ఏ ఆశ తీర్చునొ,  ఏ మాయ కల్గునొ 
ఏ బొమ్మ ఆడునొ , ఏ బొమ్మ ఏడ్చునొ , ఏరంగు వేసేనొ
ఏ లేఖ రాసేనొ, ఏ తప్పు చేసెనొ, నీ ప్రేమ నాప్రేమ  


శ్రీ తత్వ భగము పద్యాలు - 6


ప్రాణమ్ము నీమీద, ప్రాణమ్ము నీలీల, ప్రాణమ్ము మాయేగ
ప్రాణమ్ము బ్రహ్మమె, ప్రాణమ్ము సత్యంగ, ప్రాణమ్ము నిత్యంగ
ప్రాణమ్ము రాగంగ, ప్రాణమ్ము దేహంగ, ప్రాణమ్ము ధైర్యంగ
ప్రాణమ్ము వేదాంగ, ప్రాణమ్ము సఖ్యంగ, నీప్రేమ నా ప్రేమ  

Cute Baby Elephant Dj Wearing Headphones and Glasses on Blue. By Jeff Bartels:
ఆద్యాత్మికం 
శ్రీ తత్వ భగము పద్యాలు - 7
నిశ్శబ్ద సాహిత్య ప్రోత్సాహ భావాన్ని చెప్పేందు కేనేను

నాలోని ఆవేశ సారాంశ ఆధ్యాత్మ ఆరాధ్య మే శాంతి
ఆరోగ్య ఆనంద ఆకర్ష ఆత్మీయ తత్వాన్ని పంచేను
మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సుస్పంద ణాన్నిధి     
 

 శ్రీ తత్వ భగము పద్యాలు - 8

మానుష్య దుర్మార్గ మార్గాన్ని తప్పించి, సన్మార్గ కల్పించె 
లక్ష్యాన్ని కోల్పోక, ఉత్సాహ తత్వాన్ని, సంసార సౌఖ్యాల
భావాన్ని, సమోన్నత సఖ్యత కల్పించి, ఉత్తేజ నిర్మాణ
ఉద్బోధ ప్రీరేప ణాన్ని ప్రేరేపించి  ఆనందం అందించు

 శ్రీ తత్వ భగము పద్యాలు - 9

మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సద్బుద్ధి సహాయ
సారూప్య సుస్పందనాన్ని సుకల్పించి సాకార సౌశీల్య
సౌభాగ్య మార్గాన మస్తిష్క చెతన్య చాతుర్య స్నేహాన్ని
ప్రోత్సాహ ఉద్బోధ కల్పించి సంపాద మార్గాన్ని చూపించి
Tenemos 7 chakras principales, los cuales no son perceptibles físicamente ni los podemos ver, sólo SENTIR.:
 శ్రీ తత్వ భగము పద్యాలు - 10
నారింజ నేరేడు దానిమ్మ బత్తాయి జామా మరిఇంకెన్నొ
ఆరోగ్య ఆహార పండ్లను, రాచిల్క కొట్టిన పండూను
సంతోష కొద్దీ ఫలాసవాద లోలంను మెప్పించు ఇష్టంగ
మానుష్య పక్షాదు సైతంప సందైనా విందే విశేషంగ    

 శ్రీ తత్వ భగము పద్యాలు - 11
ఆహార వ్యాపార భాగంగ గాకుండా పెండ్లిళ్లు పేరెంట
మండెను ఉత్పాదితా కల్లోలమందూను ఆహార మత్యన్త
శీఘ్రంగ అందించి సంపాద మాసింపకా సేవ తాత్పర్య
భాగంగా క్షుద్బాధ తీర్చియు స్నేహాన్ని పెంచేది ఆరోగ్య

 శ్రీ తత్వ భగము పద్యాలు - 12
గిన్నెలో బియ్యంకి నిర్పోసి జ్వాలల్లో మండించి వచ్చేది
అన్నంగా చెప్తాము, తింటాము శాస్త్రంగ శక్తికే ఆహారం
ఇంకను పాళ్లల్లో నూసత్తా ఉన్నాది ధీటైన ఆరోగ్య
ఉత్పత్తి ప్రాచీన వాగ్మయ భోధల్లో చెప్పియు ఉన్నది

శ్రీ తత్వ భగము పద్యాలు - 13
ఈరోజు కారోజు పోట్లాట, ఈనాటి కానాటి మాట్లాట
లేరోక్క రీధాత్రి ఎందెందు, అందందు ఉన్నారు అంటారు
మౌనాన్ని వీడేందు కేనేమో, మానాన్ని రక్షించు కొనేందు
కేనేమో మార్తా౦డ వేడీని భందించి మంచూను గుప్పించే     

8, మార్చి 2017, బుధవారం

Internet Telugu Magazine for the month of 3/2017/58

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

Panda fofo meu deisiiuuuuuuu:
*ముముక్షువు

UUU-UUI-UIU-IUIIU

సందేశం సందర్భ త్యాగమే సమానముగా
సంతోషం సౌభాగ్య పండగే సమాజముగా
మేధావీ శ్రీ విద్య  శోభలే సుభిక్షముగా
విజ్ఞానం అత్యంత ఓర్పుతో ముముక్షువుగా

శీతోష్ణం ప్రత్యేక  భావమే జయంతునిగా
సంభావ్యం సందేహ తీర్పులే జయాలుకదా    
ప్రత్యక్షం ప్రభావ భాద్యతే సమర్ధతగా
క్షుద్బాదే లేకుండ చేయుటే సమంజసమే

 ఆరోగ్యం  ఆదుర్ద వద్దులే  సుధాలయగా 
ఆత్మీయం ప్రలోభ  పద్ధతే ముఖాలయగా   
సమ్మోహం సందర్భ సక్యతే  సమాంతరులుగా 
అస్యూన్యం అభ్యాస విద్యలే సుఖాలమయగా
--((*))--

ఛలోక్తి (ఛందస్సు)
IUU-UUU-UUI-UIU

మజాయే మామధ్య  బంధాలె విచ్చెనే
సుఖాలే పంచెనే  సంతోష వెల్లువే 
సరాగం సౌందర్యం శుశ్రూష చేసెనే
సుమాలీ శ్రీవిద్యా  తత్వాన్ని పంచనే 

కలాపం కావ్యమే కోపించె కోమలీ 
విలాసం విద్యయే వేదాన్ని చెప్పకే
సురేషా శ్రీపుష్ప శ్రీవాణి శ్రీఘ్రమే 
సునందా శృంగారం పంచాలి వెంటనే 

నివెంతా శోధించీ శోకించు టెందుకే
నె నున్నా సంతోషం పంచేందు నందుకే 
న కోసం పంతంతో పోరాడ వద్దులే
సురక్ష మమ్మేకం ఏకంగా మంచిదే      

   --((*))--

woman, portrait, poppy, poppies:

* తల్వాల్చు (కొత్త ఛందస్సు )
UIUU - UI - IUUI - UI - UUI

మానవుల్లో ఉండె దివ్యత్వాన్ని గూర్చి బోధించు
మౌనముల్తో ఉన్న శక్తిత్వాన్ని  గూర్చి శోధించు
యోగమార్గం జ్ఞాన కర్మత్వాన్ని గూర్చి పాటించు
సంభవంతో గ్రంథ సిద్ధాంతాన్ని గూర్చి బోధించు

భేదముతో  మన్షి మధ్యత్వాన్ని గూర్చి  తల్వాల్చు
ద్వేషముతో మన్షి అంధత్వాన్ని గూర్చి తల్వాల్చు
రోగముతో  మన్షి  వేదాంతాన్ని గూర్చి తల్వాల్చు
స్నేహముతో మన్షి బాల్యత్వాన్ని గూర్చి తల్వాల్చు

స్వచ్చతతో  మాట మృదుత్వాన్ని గూర్చి బోధించు
ఇష్ట ముతో   పల్కి బంధుత్వాన్ని గూర్చి శోధించు
ప్రేమల తో   చెప్పె  శక్తి త్వా న్ని  గూర్చి పాటి0చు
దీపముతో   చూపె  ధర్మత్వాన్ని  గూర్చి బోధించు  


వసంత పంచమి సందర్భంగా ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

 ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత

యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి
--((*))--
Pranjali praha.com

3. వీణాధర బింబోపమ 
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి
--((*))--

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మార్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీయవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనోత్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు పద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పావాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వానీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తకపాణిన్ శుకవాణి విపులభాసుర పులినశ్రోణి న్బలభిన్మణి జిద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగాత్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హాసము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీపాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశదక్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమైపరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీర్వాణికి నేణాంక శకలరత్నశలాకావేణికిఁ బుస్తక వీణాపాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాథ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేంద్రాణి మాయమ్మ నలువరాణి వీణాపాణి ఘనవేణి కల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మాపి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకతశ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేంద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రితశ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబుభావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణిజపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములుకుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తికాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞచంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి



15. శారద విద్యాజాల విశారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్శారద నీరద నారదపారద హారదరహీర పాండుశరీరన్ 

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణిపసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మయీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలువెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధిమందరాచల కందరామధ్యమానదుగ్ధపాదోధి లహరికాధూర్తయైనలలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగువరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీపతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీసతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమరబ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింపసంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలరసంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీనదేవగజదంతతుల్యమై దేహకాంతిచంద్రకాంతపీఠంబున సంగమింపవివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగువాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందువాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములనువిజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందుసాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములనుగుట్టుగాఁగాపురము సేసికొనుచు నేనుకోరినప్పుడు నానాల్కకొనను జేరినృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్మునధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుంబట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁబుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవాకట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీనఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెందదరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీననుపనిషత్తులుబోటులై యోలగింపబుండరీకాసనమునగూర్చుండి మదికినించు వేడుక వీణ వాయించు చెలువనలువరాణి మదాత్మలో వెలయుగాత.
అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

22.  నీ "తోడి" పొందికల్ నా తరమా యెంచ?, జాతు లేర్పఱచిన జాణ వౌదు
వీ "నాఁట" నీ పాటి నే నెచ్చటను గాన, ఘన రాగ సంగతి గాంచితి బళి!
"మోహన" లీలచే మొనసి బాగైతివి, నయములు పచరించు నటన నీది
కాంచి ఘంటారవ కలన ని న్మెచ్చెద, శ్రుతి వియ్యముగ ననుకృతివి గావె?

యనుచుఁ బతితోడ సర సోక్తు లాడునట్టివాణి,
శుక పాణి, పిక వాణి, వనద వేణి,
సీనయ ముఖాబ్జ పీఠి కాసీన యగుచు
"శ్రీ" నయ సమృద్ధి వర్ధిల్లఁ జేయుఁగాత
శేషము వేంకటపతి "శశాంక విజయము" నుండి 

 (ఇంకా ఉంది .........)


*కాలం
UU-UU-UII-UII-UU

కాలం మార్పే దిగ్విజయానికి గమ్యం
బ్రహ్మ సృష్టే బ్రతుకు జీవన గమ్యం
బాహ్య స్వెస్చే జీవిత విద్యకు గమ్యం
జన్మ సార్ధకం మన నెర్పుకు  గమ్యం

సూర్యం వీర్యం మానవ  జీవిత   కాలం
ధైర్యం ప్రేమా చూపును  ఆశల కాలం
శక్తీ  యుక్తీ  మార్పుకు నెర్పుకు కాలం
అందం ఓర్పూ స్త్రీలకు పెంచును కాలం  

హింసా ద్వేషం వ్యక్తికి భాదల కమ్ము
కోపం ఈర్ష్య మానస వత్తిడి  కమ్ము
భయం న్వయం శక్తికి నష్టము కమ్ము    
ప్రేమా భాష్యం ఇద్దరి కృషికె కాలం
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

*ముముక్షువు

UUU-UUI-UIU-IUIIU

సందేశం సందర్భ త్యాగమే సమానముగా
సంతోషం సౌభాగ్య పండగే సమాజముగా
మేధావీ శ్రీ విద్య  శోభలే సుభిక్షముగా
విజ్ఞానం అత్యంత ఓర్పుతో ముముక్షువుగా

శీతోష్ణం ప్రత్యేక  భావమే జయంతునిగా
సంభావ్యం సందేహ తీర్పులే జయాలుకదా    
ప్రత్యక్షం ప్రభావ భాద్యతే సమర్ధతగా
క్షుద్బాదే లేకుండ చేయుటే సమంజసమే

 ఆరోగ్యం  ఆదుర్ద వద్దులే  సుధాలయగా 
ఆత్మీయం ప్రలోభ  పద్ధతే ముఖాలయగా   
సమ్మోహం సందర్భ సక్యతే  సమాంతరులుగా 
అస్యూన్యం అభ్యాస విద్యలే సుఖాలమయగా
--((*))--

ఛలోక్తి (ఛందస్సు)
IUU-UUU-UUI-UIU

మజాయే మామధ్య  బంధాలె విచ్చెనే
సుఖాలే పంచెనే  సంతోష వెల్లువే 
సరాగం సౌందర్యం శుశ్రూష చేసెనే
సుమాలీ శ్రీవిద్యా  తత్వాన్ని పంచనే 

కలాపం కావ్యమే కోపించె కోమలీ 
విలాసం విద్యయే వేదాన్ని చెప్పకే
సురేషా శ్రీపుష్ప శ్రీవాణి శ్రీఘ్రమే 
సునందా శృంగారం పంచాలి వెంటనే 

నివెంతా శోధించీ శోకించు టెందుకే
నె నున్నా సంతోషం పంచేందు నందుకే 
న కోసం పంతంతో పోరాడ వద్దులే
సురక్ష మమ్మేకం ఏకంగా మంచిదే      

   --((*))--

* తల్వాల్చు (కొత్త ఛందస్సు )
UIUU - UI - IUUI - UI - UUI

మానవుల్లో ఉండె దివ్యత్వాన్ని గూర్చి బోధించు
మౌనముల్తో ఉన్న శక్తిత్వాన్ని  గూర్చి శోధించు
యోగమార్గం జ్ఞాన కర్మత్వాన్ని గూర్చి పాటించు
సంభవంతో గ్రంథ సిద్ధాంతాన్ని గూర్చి బోధించు

భేదముతో  మన్షి మధ్యత్వాన్ని గూర్చి  తల్వాల్చు
ద్వేషముతో మన్షి అంధత్వాన్ని గూర్చి తల్వాల్చు
రోగముతో  మన్షి  వేదాంతాన్ని గూర్చి తల్వాల్చు
స్నేహముతో మన్షి బాల్యత్వాన్ని గూర్చి తల్వాల్చు

స్వచ్చతతో  మాట మృదుత్వాన్ని గూర్చి బోధించు
ఇష్ట ముతో   పల్కి బంధుత్వాన్ని గూర్చి శోధించు
ప్రేమల తో   చెప్పె  శక్తి త్వా న్ని  గూర్చి పాటి0చు
దీపముతో   చూపె  ధర్మత్వాన్ని  గూర్చి బోధించు  


వసంత పంచమి సందర్భంగా ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

 ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత

యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి
--((*))--
Pranjali praha.com

3. వీణాధర బింబోపమ 
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి
--((*))--

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మార్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీయవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనోత్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు పద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పావాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వానీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తకపాణిన్ శుకవాణి విపులభాసుర పులినశ్రోణి న్బలభిన్మణి జిద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగాత్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హాసము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీపాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశదక్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమైపరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీర్వాణికి నేణాంక శకలరత్నశలాకావేణికిఁ బుస్తక వీణాపాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాథ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేంద్రాణి మాయమ్మ నలువరాణి వీణాపాణి ఘనవేణి కల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మాపి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకతశ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేంద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రితశ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబుభావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణిజపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములుకుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తికాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞచంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి



15. శారద విద్యాజాల విశారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్శారద నీరద నారదపారద హారదరహీర పాండుశరీరన్ 

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణిపసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మయీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలువెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధిమందరాచల కందరామధ్యమానదుగ్ధపాదోధి లహరికాధూర్తయైనలలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగువరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీపతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీసతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమరబ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింపసంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలరసంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీనదేవగజదంతతుల్యమై దేహకాంతిచంద్రకాంతపీఠంబున సంగమింపవివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగువాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందువాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములనువిజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందుసాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములనుగుట్టుగాఁగాపురము సేసికొనుచు నేనుకోరినప్పుడు నానాల్కకొనను జేరినృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్మునధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుంబట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁబుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవాకట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీనఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెందదరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీననుపనిషత్తులుబోటులై యోలగింపబుండరీకాసనమునగూర్చుండి మదికినించు వేడుక వీణ వాయించు చెలువనలువరాణి మదాత్మలో వెలయుగాత.
అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

22.  నీ "తోడి" పొందికల్ నా తరమా యెంచ?, జాతు లేర్పఱచిన జాణ వౌదు
వీ "నాఁట" నీ పాటి నే నెచ్చటను గాన, ఘన రాగ సంగతి గాంచితి బళి!
"మోహన" లీలచే మొనసి బాగైతివి, నయములు పచరించు నటన నీది
కాంచి ఘంటారవ కలన ని న్మెచ్చెద, శ్రుతి వియ్యముగ ననుకృతివి గావె?

యనుచుఁ బతితోడ సర సోక్తు లాడునట్టివాణి,
శుక పాణి, పిక వాణి, వనద వేణి,
సీనయ ముఖాబ్జ పీఠి కాసీన యగుచు
"శ్రీ" నయ సమృద్ధి వర్ధిల్లఁ జేయుఁగాత
శేషము వేంకటపతి "శశాంక విజయము" నుండి 

 (ఇంకా ఉంది .........)
ఓ మగువా  నీవేషము చూస్తే
నా మది తలపులను తట్టి లేపుతున్నది
నీ కళ్ళ నిషా చూపులు చూస్తే
కవ్వింత కాగడాల వెలుగు కనబడుతున్నది
నీ పయ్యెద కదలికలు చూస్తే
శృంగారభావం హృదయాన్ని తాకి మెరుస్తుంది  
నీ వాలు జడ కదలిక చూస్తే
మరిచిపోలేని నితంబులకదలిక కనబడుతుంది
నీ కొప్పులో విరజాజులు చూస్తే
పరిమళాల మత్తుకు చిక్కి ఉండి పోవాలిని ఉంది
గులాబి రేకలు రాలుట చూస్తే
వలువలు లేని వయ్యారిని చూడాలని పిస్తుంది

*కాలం
UU-UU-UII-UII-UU

కాలం మార్పే దిగ్విజయానికి గమ్యం
బ్రహ్మ సృష్టే బ్రతుకు జీవన గమ్యం
బాహ్య స్వెస్చే జీవిత విద్యకు గమ్యం
జన్మ సార్ధకం మన నెర్పుకు  గమ్యం

సూర్యం వీర్యం మానవ  జీవిత   కాలం
ధైర్యం ప్రేమా చూపును  ఆశల కాలం
శక్తీ  యుక్తీ  మార్పుకు నెర్పుకు కాలం
అందం ఓర్పూ స్త్రీలకు పెంచును కాలం  

హింసా ద్వేషం వ్యక్తికి భాదల కమ్ము
కోపం ఈర్ష్య మానస వత్తిడి  కమ్ము
భయం న్వయం శక్తికి నష్టము కమ్ము    
ప్రేమా భాష్యం ఇద్దరి కృషికె కాలం