9, ఏప్రిల్ 2023, ఆదివారం

***14/07/


నాలో నీవు .. నీలో నేను కథానిక.. (1 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

అంబరానన మేఘ మాలలు ఆద మర్వక వేగమై, సంబరమ్ముగ వాన జల్లులు సాక్షి వెల్లువ ఎక్కువై, చుంబ నమ్ముల చల్ల దారియు చూప గల్గిన, పంబ రేగిన వర్షపాతము పాడు చేసెడి బుద్ధిగా, అలా సాగేను రంగులు మార్చు కుంటూ మేఘాలు గగన మందు విహారము చేయగా గాలి తోడైనది. 

ఉదయ వేళన సాగు కామ్యము ఉజ్వలమ్మగు, దారి తెన్నులు తెలియక, జనులు ఆహారము లేక, ఉప్పెనలా వచ్చి పడుతున్న, వరద ధాటికి తట్టు కోలేక భయం గుప్పెట్టిన చిక్కి హా హా కారాలు చేయగా , వింజామరములు వీచి నట్లుగా, చెట్లు కొమ్మలు గాలిలో ఎగురుతూ స్వారీ చేయు చుండెను,   అదే సమయాన న్యాయవాది (జైలర్) రామారావు, ప్రాంజలి ప్రభ సేవా సంఘ అధ్యక్షుడు హనుమంతుడు (అందరిదృష్టిలో ఆపద్భా0ధవుడు నిత్యా రామ నామము   రాగ సేవ తత్పరుడు)  తోటలో చిక్కగా ఒక చెట్టు నీడన చేరగా చెట్టు కొమ్మ విరిగి పడే సమయాన హనుమంతుడు అడ్డుకొని రక్షణ దిశగా ఇద్దరు ప్రక్కన ఉన్న భవన సముదాయమును చేరిరి. 

మనసు కొలనులోన మనసును కనలేను, తామర పత్రము థలుకు బెలుకు లా ఆదుకున్న వాడివి, తపము, జపము  తోనున్న నాకు రక్షగా నీ లక్ష్యము నిర్వహించావు,    తీర్చలేను నీ ఋణమును, పలుకు లన్ని వాన చినుకుల మధ్య కలసి పోయి, బ్రతుకు తెరువు అంటూ కదలిక 

మధ్యన, కీలక మగుటయే, వర్షమునకు చిక్కి,  పెదవుల మధువులు హృదయ స్పందన హాయి గొలుపు నట్లు నీతోడు  భావన ప్రేమయే భాగ్యరేఖ అన్నాడు రామారావు. 

సన్నజాజి థలుకు సమయ మందు,  సన్నాయి రాగము సరపడ నీయని, కనలేని కష్టము కామ్య మిదియు, తన్మయ మిది, తాపము తారుమారు,  తత్వముయిది సృష్టి మలుపు, సంతృప్తి జీవితం వాన వళ్ళ కొద్ధి ఆటంకమే అన్నారు హనుమంతరావు 

                                                                                            ఇంకా వుంది..(2 )

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

*నాలో నీవు .. నీలో నేను కధానిక.. (2 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

మేలి ముసుగులో మేలిమి బంగారం, కలువ పువ్వులా వికసించింది సూర్య బింబము, తీవ్రమైన కాంతి కిరణాలు తెల్లటి మంచుని కరిగించి, సౌందర్యం కనులెత్తి చూసి కొంటెగా నవ్వింది    

గుండెల్లో కళలు నింపే వెలుతురులో ప్రేమ గంట మ్రోగించిందిలా కల కల లాడుతూ పచ్చతోరణమై  నిలిచింది, కోయల కూత ఆరంభమైనది   

కొండ వాగులు గలగల పారుచు నవ్వులే నవ్వులు, నిండు జలములు నిలిచిపోక కదలిక సాగుతున్నది, పుష్పరాజము సంతసమ్ముగా కదలికలు చూపుచున్నది.  

గుసగుసగా  ముసిముసిగా నవ్వుల పువ్వుల వనితలు శృతి గా లయగా అల్లరిగా  పల్లవి గా, ఆశగా శ్వాసగా గీతా లాపము మొదలైనది. కాంతి, శాంతి మంత్రము మాయచూపి చిత్త మంతా చిత్తు చేసి, మోహ మాయలో ముంచేసి, ఏమి తెలియనిదానిలా కదిలింది  

తోటలో యదావిధిగా నడవ  కుండా  పరిగెత్తుతూ వయసు కూడా గుర్తించకనే హనుమంతరావు, అక్కడ వున్నా కొందరితో కలసి పాడు తుంటున్నాడు, అప్పుడే రామారావు వస్తూనే చూస్తున్నాడు, అక్కడ ఉన్న అంబేత్కర్ విగ్రహము వద్దకు చేరారు అందరు పుష్పమాలలవుట్ అలంకరించారు కొందరు. తప్పెట వాయిస్తూ భావాలు తెలిపారు నినాదాలతో మారుమోగింది  స్థానిక మంత్రుల కోలాహలం ఏర్పడింది రక్షక భటుల వలయం అక్కడ అందరికి రక్షణగా యున్నది. ఒకతను మైకు పట్టుకొని పద్యం పడుతున్నాడు అంబేత్కర్ గురించి  

  

ఉ.యోధుడు ధర్మరక్షకుడు యోగ్యత వెల్గులు పంచు ధీరుడే

సాధువు దీక్ష కంకణుడు సాధన శోధన బీద విద్య కో

రే ధవుడే మనో నియమ రాజ్యపు రక్షణ దీక్ష సహాయ మూ

ర్తీ దయ విశ్వ విద్య యను దీనుల సేవల లక్ష్యమేనుగా

అప్పుడే అవేశము ఆపుకోలేక హనుమంతుడు అంబేత్కర్ గురించి గజల్  వినిపించాడు             

నావెనుకే ఉంటివనే యోచనలే అంబేత్కర్ 

నీఊపిరి సోకినదను భావనయే అంబేత్కర్ 

నిలువెత్తున వెంటాడుతు నను వదలదు నీ రూపం 

దూరమాయె మనసులోని వేదనలే  అంబేత్కర్ 

ఏ చోటను నీవున్నా మాలో నీ రూపమ్ము    

హృదయ వీణ తంత్రి మీటు రాగములే అంబేత్కర్ 

రాజ్యాంగం నేతగా మామేలు  యినుమడించె 

ప్రేమరాగ సుధలొలుకగ సంతసమే అంబేత్కర్ 

నిండుగున్న పున్నమిలో  వెన్నెలొలుకు చంద్రునిగా 

నీదు చెలిమి వలన కలిగె సంబరమే అంబేత్కర్ 

నా కన్నుల లోగిలిలో హరివిల్లుల వర్ణాలే 

నిను వరించి నిలువరించు సయ్యాటలే అంబేత్కర్ 

మనోరథపు వేగానికి కళ్ళెమేసె అంబేత్కర్ 

మనస్సాక్షి కోరుకున్న పరిణయమే అంబేత్కర్ 

......

అందరు ఆనందంగా కరతళ ధ్వనులు మారుమ్రోగినాయ 

                                                                   ఇంకా వుంది .. (త్రీ)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

.....

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (3 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    


ఆసంబరాలకు కొందరు స్త్రీలు ఆ పార్కుకు చేరినారు, వారి గురించి కవిత్వ పాఠము ఇలా సాగింది.
     
ఒకవైపు పురుషుల కోలాహలం, మరోవైపు స్త్రీలు అందమైన దుస్తులలో వికసించే పువ్వుల్లా కనబడెను,   కన్నుల్లో రవ్వ కలత రేపుతుంటే, మమతల్లో మానవతా కధలు చెప్పు తుంటే, కంకణాల జల్లు జిహ్వ రేపుతుంటే, జడకుప్పులు పిరుదులపై కదులుతుంటే, వయసుడికిన యవ్వనాల కమ్ముచుంటే, చిరునవ్వు చెక్కిలి గిలిగింత కెంపులై కళలు తిప్పుతుంటే, చెప్పలేని చణుకేదో నను రువ్వు తుంటే, సిగ్గుల సింధూరం సిగన సితారలై మల్లె మాలలుంటే, సన్నజాజి సక్కిలి సుర సుర మంటుంటే, కనక మణిహారం కులుకు కంఠ కోకిల కుహు కుహూ రాగమే కూస్తుంటే,
తరువులన్ని కదలి వచ్చి ఆహా ఓహో అని ఆనంద పడుతుంటే, దరహాస దర్పణ ధగ ధగసెగలై మకర మాణిక్యాల రత్నాల వెలుగులే చిమ్ముతుంటే, దక్షిణ దిక్కు దివ్య తేజమై మెరుస్తుంటే, ఉత్తరదిక్కు వారు ఉర్రుతలు ముగించే విధముగా జతకలపాలని ఆలోచనల పర్వము పెనఁవేయుచుంటే,  శీర్షాసన సిరిమల్లి సిగ్గు మొగ్గలే శరమై సింహబల సిన్నోడిని కాటేస్తుంటే, మనసు మనసు కలుపుకొని ఆనంద పారవశ్యం అధునాతనంగా సాగుతుంటే  
అధర మధువుల మర్మ సుధలే అల్లిబిల్లి అంతరంగ ఆకలై వాటేస్తుంటే అక్కడ చేరిన ఆడవారి హావ భావాల విన్యాసమునకు అందరూ పరవశంలో ముని తేలుతున్నారు  

అక్కడ కోపంలో ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు అప్పుడు 
 
పలుకులో పద పేద బీదయు పాలు పంచుట ఏలనో
మలుపులో మద చేష్ట భీకర మానసమ్ముగ ఏలనో
తలపులో తడి వేడి చూపుట తాప బుద్దియు ఏలనో
కొలువులో మది నాడి తెల్పియు కోప నష్టము తెల్సుకో
.......
అక్కడ ఒకనికి లంచము ఇస్తూ మాటలు బట్టి 
 
లంచమే కల లాయె భత్కున లాస్యమైనను ఏలనో
కంచమే తిన బుద్ధి నీకును కాల తీర్పుగ ఏలనో
మంచమే మది శాంతి కోరుట మాయ జోలికి ఏలనో
పంచ ముఖ్యముగాను ధర్మము పాంచ జణ్యము తెల్సుకో
.......
భర్య భర్తలమధ్య సంఘర్షణలు 

ముడిపడే సతి బాధ తీర్చుము మూడు లేదను టేలనో
తడిక బుద్ధిగ అడ్డుచెప్పుట తప్పు వెత్కుట నేలనో
నడవ తోడును చూడకుండియు నాట్య మాడుట ఏలనో
ఒడిన చేరియు దృష్టి నుంచియు ఓర్పు చూపుట తెల్సుకో
.......
అక్కడ కొందరి మాటలు బట్టి 

చెట్టు చాటున నక్కి దోచుట చెడ్డ బుద్దియు ఏలనో
పుట్ట చేసిన చీమలుండవు గూడు పాముకు ఏలనో
గుట్ట ధాన్యము దోచు సంపద గుర్తు బత్కుగ ఏలనో
మెట్ట పళ్ళము జీవ తత్త్వము మోక్షమార్గము తెల్సుకో
........
భార్యను పక్కన బెట్టుకొని వేరేదానికోసం పరిగెత్తడం 

మక్కువైనను త్రాగు డేలను మచ్చరమ్ముయు ఏలనో
చక్కచుక్కని చెక్కెరే సతి చెడ్డ దారిగ ఏలనో
పక్కపక్కన జేరియున్నను పాడు బుద్దులు ఏలనో
చిక్కు తీర్చిమనస్సుపంచెడి నీదు పత్నియు ఏలుకో
......
అక్కడ ఉన్న వారు సంబరమ్ముగా పాడుకుంటూ కలి వెళ్లి పొయ్యారు, అప్పుడే జన్మంతా  నాతోడుగా  ఉండమని నాలో నీవని నీలో నేనని అంటూ రామారావు హనుమంతరావు ని ఆలింగనం చేసుకున్నాడు ఆసమయాన. 

                                                                   ఇంకా వుంది .. (4)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (4) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

నేను  ఒక ప్రత్యేక తరానికి చెందిన వాన్ని. మన చెలిమి వల్ల అనుభవాలు  మరొక్కసారి గుర్తు చేసుకుందాం, చల్లగా కూర్చో చెపుతాను అంటూ రామారావు 

చాలా సాధారణ స్థాయి బళ్ళో అనగా తెలుగు భాషలో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

నేను చదువు తప్ప నేను చూడలేదు వేరెవ్వరిని, కన్ను మిన్ను కాన రాక శక్తి ని దుర్విని యోగము చేయలేదు,  విశ్వాస ముంచి కష్ట పడ్డాను, ఒక్కోసారి కొత్తగా మలిచిన రెక్కల సిద్ది,  ఒక్కోసారి ఆకాశం మది నడవాలని బుద్ధి,  ఒక్కోసారి ఆశయా లన్ని బతకాలని సిద్ది, ఒక్కోసారి మనోభవము కధలల్లెడి బుద్ధి.

విధి వాంఛలే ప్రాణ  నమ్మకమ్మని, చిరు హాసమే కాల నిర్ణయమ్మని, మది భావమే సేవ లక్షణమ్మని నమ్మిన వాడిని. నడిచే దారిలో నవరత్నాలు వున్నా చూడలేదు, తలచే ప్రతి నిముషము చదువుపై తన్మయ భావముండేది, కర్తవ్యమేధర్మమని తలంచేవాడిని.  

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

సీ:: నువ్వుల హృదయము నవనీత మయము గా మారియు ప్రేరణతో ను ఉండు

నవ్వుల వల్లనే ఆరోగ్య మంతయు మార్పులు చేర్పులు జరుగు చుండు

సంభాషణల మధ్య జరిగే టి విషయము విన్నను నవ్వులు వచ్చి తీరు

వింత వేషము చూసి మనసును ఉంచక వేంటనే తెల్పి యు నవ్వు చుండు


ఆ:: చెప్పి నంత మాట నవ్వులు విరజిమ్మి, హాయి బతుకు వెల్ల బుచ్చు చుండు

చెప్ప లేని మాట విన్న ను చెప్పుతూ, హాస్య మంత కుమ్మరించి ఉండే

నీలినింగి నిగలలో నక్షత్ర, రవ్వవై శ్వాస రమ్యతయగు, శ్వేత హంస యగుట స్వేచ్ఛ బ్రతుకు,అలా నవ్వుకుంటూ సాగింది ఆనాటి కధ    

                                                                   ఇంకా వుంది .. (5)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

ఉంటి లోకమందె గాని యీ లోకమన్న బ్రీతి నాకు లేదు, లోకమందు నడచి వెళ్లితినే గాని వస్తు వేది కొనెడి వాంఛ లేదు. మనసుతో నేను ప్రయాణము చేసిన రోజులెన్నో చెప్పినా చెప్పకపోయినా నామనసు వెతుకుతూ వుంటుంది, బ్రతికి బ్రతుకున రుచి చూసి,  బ్రతికిం చాలనియే, యుంటినీ, కొంచె మైనను గూడ విశ్రాంతి ఎరుగను, ఎల్లరకు నైన వాడనే సహాయ స్పృహ గలిగిన వాడిని, శూన్యహస్తములతోనె, గోడపై గనబడు వట్టి నీడ నేను, అయినా నిదానముగా  విలువలను పెంచితిని, ఎవ్వరికి కంటకమ్మును మాత్రము కాను నేను

శ్లో.యుక్తి యుక్తం వచోగ్రాహ్యం     బాలాదపి సుభాషితమ్ ,

    వచనం తత్తు నగ్రాహ్యం     అయుక్తం తు బృహస్పతేః.

తా.లోకము మెచ్చునట్టి మాటను, బాలుడు చెప్పినను గ్రహింపవలెను. లోకములో సరిపడని మాటలను  బృహస్పతి చెప్పినను గ్రహింపరాదు.

 హనుమంతా నీకుచెపుతున్నాను ఇది కధ కాదు అనుభవాల సారము, ఈ కధ ఎటు ముసుస్తుం దో, ఎలా మార్పు వస్తుందో నాకే తెలియదు, నేను నిమిత్త మాత్రుడిని అంట కాలమే నడిపిస్తుంది నన్ను నిన్ను రామారావు హనూమన్తరావుకు తనఅనుభవ పాఠాలు చెప్పు కుంటున్నాడు  

అప్పుడే హనుమంతుడు అవునండి కాలం మనతోనే ప్రారంభం కాలేదు. మన ముందు ఎందరో గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి మనకు ఒక దారి చూపించారు. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళి పోదాం మన బుద్ధికుశలతతో  అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను పరిష్కరించి,  మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నా మంటే రాబోయే తరాలకు మనము కూడా ఆదర్శాలమవుతా కదా రామారావు.

  అవును మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మన ఊపిరి మాతృ దేశ,మాతృభూమి, మాతృభాష    వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

అపూర్వ: కోపి కోషోsయం  .. విద్యతే తవ భారతి ౹ 

వ్యయతో వృద్ధిమాయాతి ...  క్షయమాయాతి సంచయాత్ ౹౹

       దేవి విద్యాభారతి నీ ఈ జ్ఞాన కోసము అపూర్వమైనది.దీన్ని ఉపయోగించినంతగా అభివృద్ధి అవుతోనే ఉంటుంది.అలాగే,సంగ్రహించినంతా క్షీణిస్తుంది

                                                                                                           ఇంకా వుంది..5  

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (6) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

ఆతోటలో ఎందరో మహానుహవులు విశ్రాంతి తీసుకుంటున్నారు, వారిలో ఒక సన్యాసి మంచి మంచి విషయాలు చెపుతూ గంతులేస్తూపడుతున్నాడు, రక్షకభటులు ఆపుదామని వచ్చారు, అక్కడ వున్నా జనులు వాక్ స్వాతంత్రయాన్నీ హరించకండి అనగా ప్రేక్షలకుగా చూస్తూవున్నారు వారు .  పిల్లలు పెద్దలు చూస్తున్నారు, అక్కడికి రామారావు హనుమంతుచేరారు. చెప్పే విషయాలు వింటున్నారు.    

మారాలి మారాలి ఈలోకం, దేహం రాచపుండుగా మారినా గుర్తించరు, ప్రజాహంతకులు కళ్ళ ముందు తిరుగుతున్నా పాటించుకోరు, నేరసామ్రాజ్యాన్నిఎన్నుకున్నారు, దివాణం సొమ్ము కాజేసిన పట్టించుకోలేరు, చెదలకు మందు, చెడు ఆలోచనకుమందు, మంచికి పొందు,              

దుర్మార్గుల చిందు, మరి ఘోరంగా మారుతుతున్నది, రోగం లేనివారికి రాగం, ఉన్నవాడికి ధనం పిండుకొనే రోగం, మనుష్యులకు సగం మందులని ఆరోగ్యం పాడుచేసే లోకం,      సన్మార్గుల పొందు, మనల్ని రక్షించడంలో దేవుడు లేక ప్రకృతి అలక్ష్యం చేయదు.  ప్రకృతో దేవుడో ఎవరైతేనేం ధర్మసంస్థాపన జరగటం ఖాయం, అధికారం కాలసర్పం, అహంకారం కారు మేఘం, మోసం వినాశనచక్రం, కుట్ర , హత్య, నమ్మకద్రోహాలు,  మనిషిని వెంటాడే వేటకుక్కలు. కక్షలకు శిక్షలు తప్పవు. 

మనిషంటేనే ప్రేమరూపంలో ఉన్నదైవం, ప్రేమలేని మనిషి బతికున్నశవం, నటించే ప్రతివాడూ నేరస్తుడే, కాలపరీక్షలో శిక్షార్హుడే, మనిషిని ఈ భూగోళంపై ఏ దుష్టశక్తులు అడ్డుకోలేవు, అందరికీ ఆనందం పంచే ఆత్మను ఏ అణుబాంబులు ధ్వంసం చేయలేవు, బాధించే జాతి నాశనమై పోతుంది, బోధించే జ్ఞానజ్యోతి బ్రహ్మాండాన్ని వెలిగిస్తుంది.

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

మందహాసమే,  మధుర గానమా ఏ తీరునా , 

నందనందనా,  నవ కవిత్వమా ఏ వ్రాతనా 

ముందురమ్ము కాపురుష భంజితా ఏ లాభమా, 

ఎందు నీవెగా, హృదయ రంజితా ఓ దేవ దేవా 

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే. నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

పూలమాలలే, పులకరింపుగా చుపించావే 

ఈల పాటలే , యెపుడు హాయిగా కల్పించావే  

తాళ వృత్తమై, తనరు చిత్తమే చదివించావే  

నీలమోహనా, నెనరు ముత్తెమే ఓ దేవ దేవా

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

చుక్క చుక్కగా, సుమదళమ్ములై వికసించెనులే   

యక్కజమ్ముగా, నవని సొమ్ములై తరిలించునులే 

దిక్కుదిక్కులందెలి హిమమ్ములే మరిగించునులే 

యెక్కడుంటివో, యిచట నిమ్ములే ఓ దేవ దేవా

వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా   

కొందరికి పాట అర్ధమయ్యే, కొందరికి పిచ్చి పాటలుగా అనుకున్నారు ఏది ఏమైనా గౌరవించటం తగ్గిపోయింది అప్పుడే రామారావు తన జేబులోంచి 500 రూపాయలు నోటు ఇవ్వగా సన్యాసి నాకు వద్దండి మీచేతులతో నాకు భోజనం పెట్టించండి నాకు అదే తృప్తిగా ఉంటుంది, నా దేవ దేవుని పాడుకొనుటకు ఓపికవస్తుంది, నాకు ఏరోజుకారోజు ఆహారం అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు ఈ రోజు మీ వంతు, హనుమ ఈయన బాగా చదివిన వాడిలాగున్నాడు కదా, పదా ముందు వీరికి భోజనం పెటిద్దాం మంచి భోజన సాలయందు మరలా రేపు అనేది నున్నది కదా, అవునవును పదా పదా అంటూ బయలుదేరారు ముగ్గురు   

                                                                   ఇంకా వుంది .. (7)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (7) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

  ఆ వచ్చిన సన్యాసి  ఆతోటలో వున్నా గణపతి విగ్రహం వద్దకుచేరి ఐ విధముగా ప్రార్ధన చేసాడు 

శ్రీ గణపతి అథర్వ శీర్షము 

త్వంగుణత్రయాతీతః । త్వం అవస్థాత్రయాతీతః ।

త్వం దేహత్రయాతీతః । త్వం కాలత్రయాతీతః ।

త్వం మూలాధారస్థితోఽసి నిత్యం । త్వం శక్తిత్రయాత్మకః ।

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం । త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం 

సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువఃస్వరోం

తే.గీ. మాలిక

మూడు గుణములు మించిన మూర్తి వగుచు, మూడ వస్థలు మించిన మూర్తి వగుచు 

మూడు దేహముల్ మించిన మూర్తి వగుచు, మూడు కాలముల్ మించిన మూర్తి వగుచు

మూలమందున స్థితుడగు మూర్తి వగుచు, మూడు శక్తుల మూలపు మూర్తి వగుచు

మునులు నిత్యము ధ్యానించు మూర్తి వగుచు, బ్రహ్మ విష్ణు రుద్రుల పరబ్రహ్మ వగుచు

ఇంద్రు డగ్నియు వాయువు నినుడు శశియు, నగుచు సర్వత్ర వ్యాపించి నట్టి విఘ్న 

పతివి నిను ముందు  ప్రార్థింతు వరము లీయ, ఆ పరబ్రహ్మ పరమాత్మ  వగుచు బ్రోవు

అప్పుడే రామారావు హనుమంతు నమస్కారం పెట్టుతూ నిల్చున్నారు, అప్పుడే మీరు నాకోసం ఆహారం అంటున్నారు నేను ఎక్కడా భోంచెయ్య నండి, అందుబాటులో దొరికిన ఫలాలు తిని గాలి నీరు ద్వారా సంచారి జీవిగా కాల గడుపుతున్నాను. మీ సహృదయాంకి వందనాలు,మీరు నాకు ఏమన్న ఆహారము పెట్ట దలుచు కుంటే మైక్ శ్రమ వద్దు ఆ కనబడుతున్న అరటి పండు కొనిపెట్టండి చాలు ఈ జానెడు పొట్టకు 

ఆమాటలకు హనుమంతుడు ఆ బండిలో వున్న పళ్ళని కొని బట్ ముందు పెట్టాడు, భలేవాడివయ్యా అట్లయితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడదాకా మోసుకురా అంటూ నడుచుకుంటూ బయలుదేరారు ముందుకు. 

ముగ్గురు కలసి అక్కడ ఉన్న వారికీ మూడు పళ్ళు మిగిల్చి మొత్తం పంచారు వారు. 

వెంటనే బైరాగి మీరిద్దరూ ఈ పండు తీసుకోండి ఈ పండు నాకు చాలు అంటూ గబగబా తినేస్తూ మీరు తినండి అంటూ గంతులేస్తున్నాడు బైరాగి 

వీళ్లకు అర్ధం కాలేదు ఆ ఒకపండు తిన్నాక ఎక్కడలేని బలం వచ్చింది అందరిలో 

                                                                  ...                                              ఇంకా వుంది .. (8)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (8) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

       గురువుగారు మీరు మాకు ఉపదేశం ఇవ్వండి మేము మీ శిష్యులు అవుతాము అన్నాడు హనుమంతుడు, 

స్వేచ్ఛ హరించే శక్తి లేదు నాకు, నాకు ఇల్లూ వాకిలి లేదు, ఇక మీరెందుకు మీ సంసారాలను వదలి నాకు సేవలనవసరం, ఇది కలియుగం మీ లాంటి వారు ఈ దేశానికి అవసరం, నా లాంటివారు భక్తిని పంచటం, పెంచటం ఈ జన్మకు చాలు అలా కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ చెట్టుదగ్గ చేరి పీఠముపై కూర్చున్నాడు బైరాగి, క్రింద రాళ్లపై కూర్చున్నారు ఇద్దరు, చెప్పేవి వింటున్నారు.            

శ్లో𝕝𝕝 ప్రభూతం కార్యమల్పం వా  యన్నరః కర్తు మిచ్ఛతి |

సర్వారమ్భేణ తత్కార్యం సింహా దేకం ప్రచక్షతే ||

తా𝕝𝕝 మనుష్యుడు తాను చేయదలచిన పని పెద్దదికాని చిన్నదికాని దానిని పూర్తిచేయుటకు సర్వశక్తి నుపయోగించి యన్నివిధముల ప్రయత్నము చేయవలెను. ఈ విషయము సింహమునుండి నేర్చుకొనవలెను.

పరమాత్మ శక్తి యొక్క సర్వవ్యాప్త స్వభావం కారణంగా, ఒక వ్యక్తికి కనిపించే ప్రతి వస్తువు దైవికంగా మారుతుంది. ఇది స్వచ్ఛమైన జ్ఞానం యొక్క ప్రాథమిక వివరణ. చైతన్యం యొక్క స్వచ్ఛత రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ‘నేను అది కూడా’ అని అనిపిస్తుంది. ఇది రెండవ దశ అయిన 'నేను అది' నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది. మొదటి దశలో, వ్యక్తిగత గుర్తింపు పూర్తిగా కరిగిపోదు, రెండవ దశలో వ్యక్తిగత ఉనికి ఉండదు.

జీవితం అష్ట దొంతరల ఆట, జీవి భావాల ఆశ కళ ఆట,  ముదిరిందా పలుకు పైమాట, కుదిరిందా బ్రతుకు సైయ్యాట, బలిమి వేషము మత్తుల ఆట, కలిమి లేముల జిత్తుల పుట,గోళం తిరుగుటలో ఓ ఆట, కాలం చెడుగుడులో ఓ బాట, గీతము మది నిధాన పోపు లాట, జీవన విధి విధాన  తోపులాట, లాంతర్ వెల్గుల్ కిటికి ఆట, జంతర్ మంతర్ సుడుల బాట.

కనివిని తెల్పనిది కొమ్మ లాట, దిన దిన సూచికల బొమ్మలాట, చుక్కల నొక్కులలో దమ్ము లాట, దిక్కుల పిక్కలలో కుమ్ము లాట, చెడుగుడు మడుగు చేతు లాట, అడుగడుగు గొడుగు మూతలాట, నిక్షేప కారకుల మది ధీరత్వాల కోట, అక్షేపణావధుల విధివీరంగాల కోట, నిషన్న నటనాల నిర్మల జీవాలాట, విషన్న వదనాల విప్లవ గీతాలాట, సంత ధర్మాల ధరణి మనసున ఆట, వింత వర్ణాల వికసిత విరుల తోట, మనసు మంజరి సిరు ఝరుల వేట, అణువు ఆటలు మురిపముల వేట, సంద్ర అల మలుపు వలల సమ్మెట, చంద్ర కళలు తలపు వల సొమ్మెట 

దుర్జనః ప్రియవాదీతి .. నైతద్విశ్వాస కారణం ౹

మధుతిష్ఠతి జిహ్వాగ్రే ..  హృదయేతు హాలాహలమ్ ౹౹

         దుర్జనుడు మధురంగా మాట్లాడ వచ్చు.అయినా ఆ మాత్రముచే వానిని విశ్వ సింప రాదు. వానికి నాలుక చివరన తేనెయూ, మనసులో హాలాహలమైన విషము ఉండును. అది గుర్తుంచుకోండి మీరు అన్నాడు బైరాగి.                         ఇంకా వుంది .. (9)                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****

*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (9) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ    

అసలు దేవుడే  ఉన్నాడని మనసుకు శాంతి నిచ్చేవాడని, కర్తవై దీక్షకు తోడుతుంటాడని మనుష్యులను  నమ్మి అనుసరించి ఆచరించు వారే నిజ భక్తులు, మొక్కుకున్న ప్రతివారూ కాలేరు నిజ భక్తులు, కలియుగధర్మాలు కదులుతున్నాయి, స్వార్ధ, నిస్వార్ధాలు, పుణ్యపాపాలు, మంచి చెడులు, వెంటాడుతూ  చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్ధము, కర్మాను సారమే పూజా ఫలము.

సర్చరిత్రము, జ్ఞాన విజ్ఞానము, సద్బొధలు వారికి వినపడవు, పరమాత్మతత్వమును, దివ్య లీలలు గ్రహించ లేరు                         

మనిషి కన్నా విలువైనది మనస్సు దీనికి బుద్ది తోడైతే మరోరకం అనగా ఎండలో కొబ్బరిబొండం (మనసు ) నీరు త్రాగాలి అనేది (బుద్ది ),  ఆవేశం కన్నా విలువైనది ఆలోచన వయసుని బట్టి మాటలు ఆలోచన (బాధ వద్దు బాధ పెట్టవద్దు ), కోపం కన్నా విలువైనది జాలి నిగ్రహించుకొని (విని ఆచరణ జాలి ), స్వార్ధం కన్నా విలువైనది త్యాగం నీవంతు సహాయమే (ఫలితం ఆశించకుండా).

*యత్ర వేదధ్వని శ్రాంతం  న చ గోభిరలంకృతమ్

యన్నబాలైః పరివృతం  శ్మశానమివ తద్గృహమ్!! 

తా𝕝𝕝 ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది.....

నమ్మకం ఒక బలం అది నీవు పోగొట్టుకున్న రోజున ఏ బంధం నీకు తోడు రాదు .(అనగా నవ్వుకు కూడా ఆపణమ్మకం అనకండి ),  మనం ఎంత ఎత్తుకి  ఎదిగినా మనం సాధారణంగా గడిపిన  జీవితాన్ని మర్చి పోకూడదు (తల్లితండ్రులను మరచి నడమత్రసిరి తో వేంపర్లాడవద్దు).  గతంలో మనతో కలిసి బ్రతికిన  వారినీ మనకు సహాయం  చేసిన  వారిని మనకు తోడుగా  నిలిచిన వారినీ ఎప్పుడూ  మర్చి పోకూడదు. (చెలిమిని నమ్మినవాడు ఎప్పటికి చెడిపోడు)

*రూప యౌవనసంపన్నా:   విశాలకుల సంభవా:

     విద్యాహీనా: న శోభన్తే   నిర్గంధా ఇవ కింశుకాః

       అపురూపమైన రూప లావణ్యాలతో ఉన్నా,యౌవనములో ఉన్నా,మంచి వంశములో పుట్టినా,విద్యావిహీనులై ఉంటే మాత్రం ఏ విధముగా శోభించరు.చదువు లేనివారిని ఎవరూ గౌరవించరు.మోదుగు పువ్వువలె రాణించరు.

భయం ఓటమికి చిరునామా, అనారోగ్యానికి నిజరానా, పట్టుదల విజయానికి చిరునామా, సఖ్యతకు విలునామా, మన లక్ష్యం ఉన్నత మైనది అయినప్పుడు మనసులో భయం వీడి పట్టుదలతో ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి.  రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి.

   ఇంకా వుంది .. ( 10  )                 

ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

****
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (10) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
సన్యాసి మరలా అందరినుద్దేశించి పలులివి.
తల్లితండ్రులకు పిల్లలపై అమిత ప్రేమ, వుంటుంది, పాఠశాలలో చేర్చగానే 

" మా అబ్బాయి/ అమ్మాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నారు . కొంతకాలం అక్కడ అంతా వాళ్ళకి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.

అందుకే వాళ్ళతో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

ఈ ఆలోచనలు, మీరు తెలివితేటలు పిల్లలకు  సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు, మంచి క్రమ శిక్షణ సాయపడవచ్చు.

ఆ సాహసాల  కథలు, సత్యమైన యుద్ధాలూ,రాజనీతి విషాదాలూ, కుటుంబ దుఃఖాలూ  అనుభవంలోకిరావచ్చు. అలాంటి జీవితంలో వాళ్ళకి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? అని మీరు అడిగినా మందలో మజ్జిగపల్చన అనే విధంగా చదువు అబ్బుతుంది, గురువులతో పాటు తల్లితండ్రులు శ్రద్దతీసుకున్న అందరికీ మంచిది
అని చెపుతున్నాడు సన్యాసి 

పిల్లలకు మీరు 
.ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.

జరుగుతున్న కాలమార్పులు పిల్లలకు తెలపండి 
అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.

లోక రాజకీయ నీతిని 
.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ  జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.

పిల్లలకు కష్టంగురించి, సంపాదగురించి విశదీకరించండి

.అప్పనంగా దొరికిన ₹100 కన్నా సొంతంగా సంపాదించుకున్న ₹10  ఎక్కువ విలువైనవని నేర్పండి.

స్కూల్లో మోసం  చేసి గెలవటం కన్నా తక్కువ మార్కులలో నిజాయితీ, నమ్మకము, ఎక్కువ మార్కులకోసం కృషి చేయగలనని నమ్మకం గౌరవంగా ఉంటుందని నేర్పండి.

ఆట పాటలలో, గెలుపు ఓటములు సహజమని తెలపండి

 ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.

.ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.

బుద్ధులను బట్టి నడవడిక తెలపండి

.అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.

ఈర్ష్య, ద్వేషాలు, చెడులు , కులాలు మతాలు పిల్లల దృష్టి లో తేకండి 

.అసూయకు పిల్లల్ని దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.

సంఘటన ప్రభావాలు పిల్లలపై చూపకండి 
.వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.

*. పుస్తకాల చదువు మనోబలాన్ని ఇస్తాయని తెలపండి 

.అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

. తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.

. అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.

.ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం పిల్లలకు నేర్పండి,అప్పుడే మానవాళి మీదా పిల్లలకు ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

అలా పిల్లల గురించి సన్యాసి తెలియపరిచారు. ఆ తరువాత చల్లని నిమ్మ కాయరసం అక్కడ ఉన్న వారందరికీ హనుమ అందించాడు సర్వేజనా సుఖినోభవంతు అంటూ విశ్రాంతికి లేచారు అందరూ

  ఇంకా వుంది... (11)
ఈ కథపై మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు.
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
****
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (11) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

తోటలో గాలులు ఎక్కువగా పెరుగుతున్నాయి, చెట్ల మధ్య కిరణాలు తొంగి చూస్తున్నాయి, చల్లటి నీరు అందరికీ అందిస్తున్న ఎండ తీవ్రత బాగా నుండుటవలన
నిదానంగా వచ్చినవారికందరికి భానుని కిరణ ప్రభావాల గురించి సన్యాసి  వివరంగా తెలియ పరచటం మొదల పెట్టారు.

ఇప్పుడే 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. మే మాసంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది మనందరికి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు
, గురువులు, వైద్యులు సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరిగితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి  సత్వర వైద్యం అందించాలి.

ప్రాథమిక చికిత్స

● వడదెబ్బ తగిలిన వ్య క్తిని వెంటనే నీడకు తీ సుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి.

● ఫ్యాను గాలి లేదా చల్ల ని గాలి తగిలేలా ఉంచాలి.

● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్‌ ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.

● ఫ్యాను గాలి లేదా చల్ల ని గాలి తగిలేలా ఉంచాలి.

● ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజ్‌ ద్రావణం లేదా ఓరల్‌ రీ హైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌) తాగించవచ్చు.

● వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో దగ్గరలో వున్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.

తేలికపాటి ఆహారం ఉత్తమం
వేసవిలో సాధ్యమైనంత వరకు నూనెతో తయారు చేసిన పదార్థాలు, వేపుళ్లు, చిప్స్‌, జంక్‌ఫుడ్‌ వంటి వాటి జోలికి 
వెళ్లకపోవడం ఉత్తమం. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలను బయటకు పంపించవద్దు. వేసవి వేడిని తట్టుకునేందుకు నూనెలేని, తేలికపాటి ఆహారాన్ని పిల్ల లకు అందించాలి.   డీఫ్రిజ్‌లో ఉంచిన వాటిని వెంటనే తినడం, తాగడం వంటివి చేయవద్దు. సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. బాగా చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి .

నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం మేలు..
● నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, పుచ్చ కాయ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. 

వడదెబ్బ అంటే..
ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకై న పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.  అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది.

ఈ వేసవిలో నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం మేలు..
● నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీరదోస, బ్ కర్బూజ, తాటి ముంజలు, బీరకాయలు, పొట్లకాయలు వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీని వల్ల కడుపు నిండినట్లుగా ఉండి, డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.

● శీతల పానీయాలు, అధికంగా షుగర్‌ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.

● వేసవిలో ఆకలి తక్కువగానూ దాహం ఎక్కువగానూ ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండి బరువును నియంత్రించవచ్చు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.

వడ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే...
● వేసవిలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉండటం వాళ్ల రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి.

● ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఉండేందుకు ప్రయత్నించండి.

● గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి.

● ఆల్కహాల్‌, సిగరేట్‌, కార్బోనేటెడ్‌ వంటి ద్రావకాలకు దూరంగా ఉండాలి.

● ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాసెస్‌, తలకు టోపీ వంటివి ధరించాలి.

● వేసవిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి.
 
● వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 5 నిమి షాలు నీడలో ఉండేలా చూసుకోవాలి.

చేయకూడని పనులు
● మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో బయట ఎక్కువగా తిరగరాదు.

● రోడ్లపై విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగవద్దు.

● రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినడం మంచిది.

● ఆహారంలో మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

 జాగ్రత్తలు 
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరమైతే తలకు టోపీ ధరించి వెళ్లాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చక్కెర, నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి.  నవజాత శిశువులను పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా
 జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవిలో రోజుకు ఎనిమిది లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. తెల్లని కాటన్‌ దుస్తులను మాత్రమే ధరించాలి. బీపీ, షుగర్‌, గుండెజబ్బులు ఉన్న వారు ఎండలో ప్రయాణం చేయడం మంచిదికాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే తలకు టోపీ, తల పాగా ధరించాలి. వడదెబ్బకు గురైనట్లు గుర్తించిన వెంటనే సమీపంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.

 సర్వే జనా సుఖినోభవంతు అంటూ ముగించారు.

ఇంకా వుంది  (12)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
........

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (12) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

సన్యాసి యధాప్రకారముగా అక్కడ తోటలో వున్న వారందరు వింటున్నారు   

అమితశ్రమ పనికిరాదు - జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 

మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు.  

ఉత్పలస్యారవిందస్య మత్స్యాస్య కుముదస్య చ ౹

 ఏకయోనిప్రసూతానాం  తేషాo రూపః పృథక్ పృథక్ ౹

      ఒకే నీటిలో పుట్టినా నీల తామర పువ్వు,తెల్ల తామర పువ్వు,చేపలు వీటి రూపాలలో వేరే వేరేగా ఉంటాయి.

చిత్తస్థాయి - సత్వర సాధనకు ముఖ్యంగా చిత్తస్థాయి కావాలి. ఫలితాల కొరకు వేగిపడడం, మితిమీరి శ్రమ చేయడం తగదు. అనుభూతులు పొందగల యోగ్యతను పెంపొందించు కోడానికి చిత్తానికి వ్యవధి యివ్వాలి. లోపలి నుండి కవిత్వం, సంగీతం పుట్టుకు వచ్చినంత సహజంగా ఆ అనుభూతుల నతడు పొందవలసి వుంటుంది.  

భగవంతుడు చాలా అందంగా ఉన్నాడని, భక్తుడు-యోగి ఇంకేమీ చూడకూడదనుకుంటాడు. అందమైన వస్తువులను చూడాలనే అతని కోరిక భగవంతుని దర్శనంతో పూర్తిగా తీరుతుంది. భౌతిక ప్రపంచంలో మనం అందాన్ని చూడాలనుకుంటున్నాము, కానీ కోరిక ఎప్పుడూ సంతృప్తి చెందదు. భౌతిక కలుషితం కారణంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే అన్ని ప్రవృత్తులు ఎప్పుడూ సంతృప్తి చెందవు. కానీ మన కోరికలు చూడటం, వినడం, స్పర్శించడం మొదలైనవాటిని భగవంతుని తృప్తి కోసం ఉపయోగించినప్పుడు, అవి అత్యున్నతమైన పరిపూర్ణత స్థాయిలో ఉంటాయి.

*నాస్తి మాతృ సమం దైవం నాస్తి పితృ సమో గురుః। 

నాస్తి మాతృ సమో బంధు ర్జంతూనా మస్తి భూతలే।।

తల్లితో సమానురాలైన దేవత లేదు. తండ్రితో సమానుడైన గురువు లేడు.ఇంకా చెప్పాలంటే.... తల్లితో సమానమైన హితులు బంధువులు లేరు గాక లేరు.

ఇంకా వుంది  (14)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
........

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (13) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

        సన్యాసి తెలియపరిచారు నా బాల్యం అందరిలాగా సాగింది, మానాన్నగారికి కోపం తెప్పిచ్చాను అప్పుడే నన్ను తీసికెళ్ళి ఆశ్రమంలో పడేసాడు అప్పటి నుండి వేదాంత విషయాలు తెలుసుకొని ప్రజలకు తెలియపరుస్తూ కాల యాపన చెతున్నాను. 

    దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. కట్టెల పొయ్యిలో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో, ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే. మాథమెటిక్ లో చేరితే చదివేవారులేక ఫిజిక్సు మెయిన్ చదివి పాసయినాను నేను.   

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

చాణిక్య చంద్రగుప్త సినిమా నాచదువు మలుపు తిప్పింది, ఆరాధన సినమా నాకు ప్రేమ నేర్పింది, పెత్తందార్ల సినిమా నా వాచ్ పోగొట్టింది, ఇలా చెప్పుకుంటూ పొతే నందమూరి రామారావు సినిమాలే ఎక్కువగా చూసేవాణ్ణి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో సైకిల్ పోగొట్టుకున్నాను, ఇలా న జీవితం సనసముగా మారింది మా తల్లితండ్రులు చనిపోయిన తర్వాత నా దారే మార్చుకొని కష్టపడ్డాను, అప్పుడే నాకు తోడు ఆ పరమాత్ముని కధలు చెప్పుకుంటూ కదులుతున్నాను.       ఇలా ఎన్నో మరెన్నో మల్లి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం 

ఇంకా వుంది  (14)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (14) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

ఇది పరివర్తన, అంతర్గత పరివర్తన యొక్క రసవాదం. అంగీకరించి, క్షణంతో కదలండి. మీరు నిజంగా కదిలితే, మీపై మత్తు ఉండదు. మీరు నిజంగా కోపంలోకి వెళితే, మీరు దానితో పూర్తి అవుతారు, ఎందుకంటే మీరు దానిలోకి వెళ్ళినప్పుడు అది సంపూర్ణంగా పూర్తయింది. ఆపై మీరు దాని నుండి బయటపడ్డారు, దాని నుండి పూర్తిగా బయటపడ్డారు, నిష్కళంకంగా. సమాజం ద్వారా భ్రష్టు పట్టని చిన్న పిల్లాడిని గమనించండి.

*వనేsపి సింహాః మృగమాంస భక్షిణో బుభుక్షితాః నైవ తృణం చరన్తి|
ఏవం కులీనాః వ్యసనాభిభూతాః న నీచ కర్మాణి సమాచరన్తి ||

తా𝕝𝕝 "ఆకలిగొన్న సింహాలు మృగమాంసాన్నే భక్షిస్తాయి తప్ప గడ్డిని ఆరగించవు..... అలాగే సజ్జనులకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు నీచకర్మలు ఆచరించరు "..... 

పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడో చూడు. అతను ఆడుతూ మరియు నవ్వుతున్న మరుసటి క్షణం - కోపం ఇక ఉండదు. ఒక క్షణం ముందు అతను కోపంగా ఉన్నాడని మీరు నమ్మలేరు. ఇప్పుడు అతను చాలా ప్రేమగా ఉన్నాడు, చాలా పువ్వులా ఉన్నాడు. ఒక క్షణం ముందు అతను ఒక జ్వాలగా ఉన్నాడు! జీవించడానికి ఇదే మార్గం. మీరు, పూర్తిగా ఉండాలి. అప్పుడు ఏ క్షణం నుండి మత్తు మిగిలి ఉండదు. మీరు ఎల్లప్పుడూ తాజాగా మరియు యవ్వనంగా ఉంటారు మరియు గతం మీపై భారం కాదు. దీనినే నేను ఆధ్యాత్మిక జీవితం అంటాను. ఆధ్యాత్మికం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం కాదు. ఇది సహజమైన జీవితం.

*యావదస్పలితం తావత్సుఖం యాతి సమే పథి ౹
  స్పలితే చ సముత్పన్నే విషమం చ పదే పదే ౹౹
 
     మనిషి ఎక్కడిదాకా ఒక్కసారి కూడా తడబాటు లేకుండా  నడవగలడో అక్కడిదాకా సుఖంగా సమమైన దారిలో నడుస్తాడు.ఒకసారి భయపడితే చాలు ముందు మళ్ళీ మళ్ళీ అడుగు అడుగుకు దారి ఎంతో కష్టంగా మారుతుంది.

ఉదాహరణకు బ్రహ్మర్షి యగు వశిష్ఠుడు అట్టి స్వస్తిమతి. విశ్వామిత్రుడు చేయు విన్యాసములను అతడు చిరునవ్వుతో దర్శించెను గాని ప్రతిస్పందించ లేదు. అట్లే పట్టాభిషేక సమయమున రాముడు వనవాసముల కేగుచున్నప్పుడు కూడా అడ్డుపడలేదు. విపత్కర పరిస్థితులలో కూడ అతడు చలించలేదు. తన నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరించినపుడు చలింపక స్థిరమతియై యుండెను. స్వస్తికి శ్రీమాతయే మూలము. ఆమెయే గురువు. ఆమె చైతన్యమే బ్రహ్మర్షుల యందు మరియు క్రూర మృగముల యందు కూడ యున్నది. ఎందున్నను తాను తానుగనే యుండును. కాలము దేశము రూపము తనపై ప్రభావము చూపవు.

*త్రీణైవ తు పదాన్యాహు :   పురుషస్యోత్తమం ప్రతి ౹
  న ద్రుహ్యేచైవ దద్యాచ్చ   సత్యం చైవ పరం వదేత్ ౹౹ 

       మనిషి అత్యున్నత స్థానం పొందాలంటే మూడు మెట్లు ఉన్నాయి. ఎవరికీ వంచన చేయరాదు. ఇతరులకు దానం చెయ్యాలి మరియు మంచి ఫలితం ఇచ్చేలా సత్యం వచనాలు మాట్లాడాలి.
ఇంకా వుంది  (15)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (15) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

*సన్యాసి ఇంకా ఇలా తెలియపరుస్తున్నారు 

ప్రతి మనిషిలో అవగాహన లోపమే ఈ ప్రశ్నే తలెత్తడానికి కారణం. ఎలాగంటే బంగారంతో నగ తయారవుతుంది. అంటే బంగారమే నగ రూపంగా మారుతుంది. ఆ 'రూపం' బంగారాన్ని మార్చడం కానీ, 'రూపమే' బంగారంగా మారటం గాని జరగలేదు. నగరూపంలో 'ఉన్నా లేకున్నా' బంగారానికంటూ ఒక శాశ్వత ఉనికి ఉంది. అలాగే ఇప్పుడు నిజంగా కనిపించే మన బాహ్యరూపం ఉన్నా, లేకున్నా మనకు కూడా ఒక ఉనికి ఉంది. విలువ ఎప్పుడూ బంగారానికే ఉంటుంది.  మన అభిరుచి మాత్రమే వస్తువుపై ఉంటుంది. 'నాకు బంగారపు ఉంగరం చేయించుకోవాలని ఉంది, ఏ దేవుడి రూపంతో చేయించుకోమంటారు ? అని అడుగుతారు. ఇక్కడ మొదటి విలువ శాశ్వతమైన బంగారానికే ఇచ్చారు. రెండవ విలువ తన అభిరుచి అయిన దాని రూపానికి ఇచ్చారు. మనం కూడా బంగారంలా ఉన్న హృదయంలోని శాశ్వతమైన పరమాత్మ గుర్తించాలి. అప్పుడు ప్రాపంచిక విషయాల ప్రయోజనం అర్థమై, మనమే వాటికి ఇచ్చే ప్రాధాన్యతను తగ్గిస్తాము !

ప్రతిఒక్కరి మనసును బట్టి ఉంటుంది. అద్ధం ఎప్పుడూ తాజా ప్రతిబింబాన్నే చూపుతుంది. అది ప్రతిరూపాలను తనలో దాచుకోదు. అభ్యాసం చేసి మన మనసును కూడా నిరంతరంగా అలా ఉంచుకోగలిగితే అది సన్యాస జీవితంతో సమానం అవుతుంది. నిజానికి మన మనసు అనేక విషయాలను సహజంగానే సన్యసిస్తుంది. ఆఫీసు పనిలో మునిగిన మనసు ఇల్లు, ఇల్లాలు, పిల్లలను జ్ఞాపకమైనా తెచ్చుకోదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసును స్మరిస్తూ కూర్చోదు. టీవీ సీరియల్ చూసే గృహిణి ఎవరైనా పరిచయస్తులు వస్తే అయిష్టంగానే టీవీ కట్టేస్తుంది. కానీ టీవీ చూస్తున్నప్పుడే తన కొడుకు మేడపై నుండి పడితే కనీసం టీవీని పట్టించుకోకుండానే పరుగు పెడుతుంది. ఇలా మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను సహజంగానే వదలుగలుగుతున్నాం . మనసును అలా మలుచుకోగలిగినప్పుడు సంసారికి కూడా అది సన్యాస జీవితంతో సమానమే !

ఇంకా వుంది  (16)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (16) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ

* ఓం శ్రీ రామ, శ్రీ మాత్రే నమః అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు, ప్రకృతి ప్రభంజనం అందరికీ అందు బాటులో  ఉంటుంది, ఋతువులు బట్టి మారుతూ గుణాల్ని వట్టి కదులుతుంది.  ప్రతిఒక్కరు ప్రతి పనిలో ధైర్యంగా, పట్టుదలగా, ప్రయత్నం వదలకుండా చేసేపనిలో నిజాయితీ ఉంటెచాలు *నిజం గెలిచి తీరుతుంది ... ( సత్యమేవ జయతే )

* ప్రతి ఒక్కరూ ఇతరులకి ఉపయోగ పడటానికే ఈ దేహం సుమా, బతికి బతికించు కొనెడి శరీర సహాయం చెయ్యాలి అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది.   (  పరోపకారర్ధంమిదం శరీరం )

* జీవితానికి మూలం డబ్బే ప్రధానం, డబ్బేవుంటే కొండమీద కోతి నైనా కొనవచ్చు అనెడి నానుడి, డబ్బుకులోకం దాసోహం, డబ్బులేనివాడు డబ్బుకి కొరగాడు నానుడి, 10 కోట్లుపెట్టి కారుకొన్న టైర్లువుండాలి, బంగారం కంచంలో అన్నమే తినగలము బంగారం తినలేము, ధనం ఉన్నాకష్టమే, లేకున్నా కష్టమే డబ్బే ప్రపంచమట   ( ధన మూల మిదం జగత్)

* ఎక్కడైనా మితిమీరి ప్రవర్తించకూడదు కదా !ప్రవర్తన బట్టి మనుష్యులకు గుర్తింపు ఉంటుంది. ప్రవర్తనం మార్చుకున్న జీవితం ఆగమ్యగోచారం, అందుకే  (అతి సర్వత్ర వర్జయేత్) అన్నారు 

*.అనుకున్నవి చెయ్యలేరు, అనుకోనివి జరుగు జండు, కాలం కలిసిరానప్పుడు   పనికిమాలిన ఆలోచనలే వస్తాయట..అందుకే  (వినాశకాలే విపరీత బుద్ధిః)

*మనం మంచిగా ఉంటే ఆ మంచే మనల్ని కాపాడుతుంది అని చెప్పిన మాట నిజమండీ...
  మన నడవడి ధర్మముగా వున్నట్లైతే ఆ ధర్మమే మనల్ని నడిపిస్తుంది (ధర్మో రక్షితి రక్షితః). 

* మనిషిలో భయం ఉండాలి పూర్వం ఇప్పుడు కూడా  దెబ్బలకు భయం ఉండేది,   దెబ్బకి దెయ్యం  వదిలిపోతుంది అని నమ్మేవారు అనేమాట (దండం దశగునో భవత్)

*.అతిగా ‌కాకా పడ్తున్నాడంటే అర్థమవుతోంది కదా వాడు ఎటువంటివాడో. నమ్మించి మోసం చేసేవారు లోకంలో వున్నారు జాగర్త పెద్దలు చెప్పనే చెప్పారు కదా..  (అతివినయం దూర్త లక్షణమ్)

*..పాలకులని అనుసరిస్తారుకదా జనం. మూర్ఖుని మాటలు మూర్ఖుడే వింటాడు, మంచివాని మాటలు వినటానికి అందరు ముందుకు రావాలి అదే లోకం (యధా రాజా తథా ప్రజాః)

*. ముసలితనంలో నీతులు చెప్తే ఇలా కూడా అంటారు బాబోయ్.. (వృద్ద నారీ పతివ్రతాః)

*.. బద్దకిస్తే కొన్ని పనులు చెడతాయని ఇలా అంటారు.. ఈరోజు చేయాల్సినవి ఆరోజు చేస్తే అందరికి  ఆరోగ్యం  (ఆలస్యం అమృతం విషం)

*.మీ  మేధస్సు వలన మీరు ఎక్కడైనా గౌరవింపబడతారు  సుమండీ.. ( విద్వాన్ సర్వత్ర పూజ్యతే) సంస్కృత సూక్తులను వివరిస్తూ తెలియపరిచారు సన్యాసిగారు.   

ఇంకా వుంది  (17)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***
***

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (17) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ..26/04
సన్యాసి భక్తులు రోజువారి భోదచేయటం మొదలుపెట్టాడు.
* జగన్మిథ్య అన్నారు - శంకరాచార్యులు.
* సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు - వేద ఋషులు. 
రెండింటిలో ఏది సత్యం?
రెండు సత్యమే.
* మొదటిది సాధనావస్థలో చెప్పబడింది. అనగా ఒకతల్లి తనబిడ్డకు చందమామచూపి జాబిల్లి రావే అనిపిలుస్తూ చల్లని గాలిలో నిద్రపుచ్చుతుంది. 
* రెండవది సిధ్ధ్యావస్థలో చెప్పబడింది. ఒక తండ్రి సూర్యని ప్రార్ధిస్తూ జలం ఆర్గ్యం ఇస్తాడు.
అలాగే ఒక సైన్టిస్ట్ లెక్కలు తెల్పుతూ ఆధునిక విధానాలకు తనవంతు కృషి చేస్తాడు.
ఇందులో తెలుసుకోవలసినది తల్లిప్రయత్నం ఉచితం, తండ్రి ప్రయత్నం ఇంగిత జ్ఞానము, ఇక సైన్టిస్ట్ ప్రయత్నం శాస్త్రీయం.
ఏది మిధ్య, ఏది ఉచితం, ఏది అనుచితం అని కూర్చుంటే జీవితం అగమ్యగోచారం.
మేలుకొన్న తర్వాత స్వప్నం ఉండదు.
మరణం తర్వాత ప్రపంచం ఉండదు.
 ఎవడి కల వాడిదే., ఎవడి లోకం వాడిదే.
ప్రతి మనిషి నా పరిమితులు నాకు తెలుసు; 
నా అపరిమితులు నాకు తెలియదు. అని అంటాడు, లోకాన్ని బట్టి ప్రకృతిని బట్టి మనిషి కదులుతూడేతప్ప, అంతా నావల్లే అనుకున్నా వ్యర్థమే.
ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం.
 అక్కడ (అపరిమితం) తెలియకపోవడం  జ్ఞానం.
"వట వృక్షం , సమస్త జీవకోటికి తండ్రి లాంటి తరువు, కూపస్థ జలం సర్వ సృష్టికి ప్రాణం నిలిపే జలము,
నారి కుచద్వయాలు సహజ స్త్రీ యవ్వన చిహ్నలు, ఆకర్షణ
జీవిత భాగస్వామికి ఉపరణ, ఏ ఎండ కాగొడుగు పట్టు 
శీతేషు ఉష్ణం , ప్రాణిలో కదలిక తెలపగలిగేది 
ఉష్ణేషు శీతలం "  .చల్లని భార్యతోడు ఉన్నట్లయితే .. అన్నారు .
ఆంటే మర్రిచెట్టు నీడ, బావిలో నీరు   , మగువ ఎదలు ... 
చలి కాలం వెచ్చగాను , వేసవి కాలం చల్లగా ఉంటాయని
తెలుసు కోవటమే 
ఇక్కడ కదిలించేది ఉండేది దైవ సంకల్పమే.
మన సంకల్పం కూడా దైవ సంకల్పంలో భాగమే. అని తెలుసుకోవాలి.
మనం గుణానికి  మనకంటే  ఎక్కువ  ఉన్న  వారితోనూ 
ధనానికి మనకంటే  తక్కువ ఉన్నవారితోనూ  పోల్చుకోవాలి.
సరైన జోడీ లేకుంటే ఎంత ఖరీదైన చెప్పు అయినా చెత్త బుట్టలోకే.
 సరైన భార్య లేకుంటే జీవితం కూడా అంతే.
అందుకని కొన్ని కీటక, జలచరాల గురించి తెలుసుకుందాం.
సద్గురువు - అక్కడికొచ్చిన వారందరికీ 1. విహాంగం, 2.భ్రమరం,3. మీనం 4. తాబేలు వాటి ప్రవర్తనా న్యాయాలు తెలుపుతాను వినగలరు
 1. విహంగ న్యాయం:-
 పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.
 అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత భక్తులకు శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.
( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)
2. భ్రమర కీటక న్యాయం:-
 భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. 
 అలాగే సద్గురువు శిష్యులకు, భక్తులకు  'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.
( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )
3. మీన న్యాయం :-
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.
 ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యులు, భక్తులు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.
4. తాబేటి తలపు న్యాయము :-
 తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. 
ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.
 అలాగే శిష్యులు, భక్తులు ఎక్కడ ఉన్నా వారు పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. 
ఆ దివ్య సంకల్పంతో శిష్యులు భక్తులు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.
     ఇంకావుంది..18
మీ అభిప్రాయాలు తెలపండి, మీ విధేయుడు
  

ప్రాంజలి ప్రభ...నాలో నీవు .. నీలో నేను కథానిక.. (18) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ..27/04

మనలో మనము ఒక విధముగా ఉండలేము, మన మనసు మారి, గుణము మారి పలు పలువిధాలు మారు అంటూ సన్యాస ఉపన్యాసము తెలిపాడు.      
 
ఏదో జరుగుతుంది, మరియు ద్వంద్వత్వం పుడుతుంది. సృష్టికర్తలం... “ శైశవ దశ ”లో వున్నా, “ వృద్ధ దశ ” లో వున్నా... “ జ్ఞాని ”గా వున్నా, “ అజ్ఞాని ”గా వున్నా...“ పండితుడు ”గా వున్నా, “ పామరుడు ”గా వున్నా...మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం... ఇది అక్షరాల నిజము,  మీకు నచ్చినది ఏదైనా జరిగినప్పుడు, అది మరింత ఎక్కువగా ఉండాలనే కోరిక పుడుతుంది.  మీకు అందంగా అనిపించే ఏదైనా జరిగినప్పుడు, మీరు దానిని కోల్పోతారనే భయం పుడుతుంది, కాబట్టి అవినీతి అంతా అత్యాశ, భయంతో వస్తుంది. అనుభవంతో, మనస్సులోని ప్రతిదీ తిరిగి వస్తుంది మరియు మళ్లీ మీరు చిక్కుకుపోతారు ... ఇది లోక సహజం.   
       మన నోటిలోని మాటే మన నుదుటి మీద వ్రాత, మన భావాలే మన అనుభవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ వుంటాయి, మన ఆలోచనలతోనే, మన మాటలతోనే, మన చేతలతోనే , మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము లేదా దిగజార్చుకుంటున్నాం...

ప్రతి క్షణాన్నీ జీవితమంతా ఎవరికివారు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నా ప్రయత్నమంతా మిమ్మల్ని అనుభవానికి మించి, అంతకు మించి ముందుకు తీసుకెళ్లడమే. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మనస్సుకు అతీతంగా ఉంటారు మరియు అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. అనుభవం లేనప్పుడు నిశ్శబ్దం ఉంటుంది.

ఆనందం లేనప్పుడు కూడా ఆనందం ఉంటుంది, ఎందుకంటే ఆనందం అనేది అనుభవం కాదు, మీరు ఆనందంగా ఉన్నారని మీకు అనిపించదు. మీరు భావిస్తే, అది కేవలం ఆనందం. ఇది కాసేపు వుండి వెళ్లి పోతుంది మరియు మీరు చీకటిలో వదిలివేయబడతారు. మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి...మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి...అలా కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నామంటే... మనల్ని మనమే అవసానదశకు తీసుకువెళ్తున్నట్టు...అలాంటప్పుడు మనకు మనమే శతృవుగా అవుతాం. మీరు ఈ విషయం అర్థం  చేసుకుంటే, ఏ పద్దతి ఆధ్యాత్మికం కాదు, ఎందుకంటే అన్ని పద్ధతులు మీకు అనుభవాలను ఇస్తాయి. ఒక రోజు అన్నీ తొలగించ బడతాయి. ఇదే మీ లక్ష్యం కావాలి. ఫర్నీచర్ లేకుండా, అనుభవాలు లేకుండా, మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు అంతిమంగా అనుభవాన్ని పొందుతారు. కానీ అది 'అనుభవం' కాదు, అది చెప్పే మార్గం మాత్రమే.

ఇంకా వుంది  (17)

ఈ కధతో మీ అభిప్రాయాలు సూచనలు తెలపగలరు మీ విధేయులు  మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ
***


" సరదాగా నవ్వుకోండి.." 
         
*చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది తెలుసా ! 

*అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం... నేనంటే వాళ్ళకి అంత గౌరవం...అంతే!

* నేను చదువుకునే రోజుల్లో మా గురువులు నాలుగురోజులకొకసారి మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు!

*నేను రాసినవి చదవడానికి మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!

*మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.

*మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన బాగా బలంగా ఉండేది.అందుకే వాళ్ళంతా,"ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా. పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు! అంటే... చిన్నప్పుడే నేను ఉద్యోగం చేసే తెలివి తేటలు సమర్ధత ఉన్నాయి అని ముందుగానే గ్రహించారు అన్నమాట..

అందుకే, నా చిన్నతనం నిజంగా ఒక స్వర్ణ యుగం! 
****


ఆశతో కూడిన ఆలోచనలు లేనప్పుడు త్రివిధావస్ధలు సమంగా, సహజంగా, శాంతిగా.. ఉంటాయి !!


సాధారణ వ్యక్తికి జాగృతిలోని ఆలోచనలే కలలకు కారణం అవుతాయి. జాగృతి ఆలోచనలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఆశతో కూడుకున్న ఆలోచనలే శాంతికి భిన్నంగా మనకు కనిపిస్తాయి. జీవనంలో భాగంగా సాగే ఆలోచన మనను బాధించదు. కోరికతో నిండిన ఆలోచనలే జాగృతిలో అశాంతికి, నిద్రలో తీవ్ర స్వప్నాలకు కారణం అవుతాయి. ఆశతో కూడిన ఆలోచనలు లేనప్పుడు జాగృతి, స్వప్నం కూడా గాఢ నిద్రలోని సుషుప్తితో సమానంగా, సహజంగా సాగుతాయి. అప్పుడు త్రివిధావస్థల్లో శాంతి నిండి ఉంటుంది.  మంచి కలలు, చెడ్డ కలలు మనఊహాలే. మనసు సమస్ధితిని పొందితే మూడు అవస్థల్లోనూ శాంతిగా ఉంటుందని చూపేందుకే జాగృతి, స్వప్న, సుషుప్తులు లేవని జనకుడు నిర్ధారిస్తున్నాడు !

   మన మీద మనకే నమ్మకం లేని సమయంలో కూడా మనల్ని *నమ్మే వాడే మనకు నిజమైన స్నేహితుడు ఆశ మనల్ని జాతకాలను నమ్మేలా చేస్తే కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. అంతేకాదు బాధ మనిషిని నమ్మేలా చేస్తే మన ధైర్యం ఒక్కటే మనల్ని మనం నమ్మేలా చేస్తుంది. ధైర్యంగా ఉండండి. మీ జీవితాన్ని సంతోషంగా గడపండి. 
      
మీరెవరో మరి నేనెవరో
ఒకరి కొకరు ఏమౌతారో
భయంకర స్థితిన మారేదె వరో
తోడై నీడై కలసి ఉండేదేవరో

అర్ధం కానిదే అద్భుత సౌదర్యం కోసమో 
స్వార్ధం లోనిదే సద్భుద్ధి మాధుర్యం కోసమో 
తీర్ధం తాగితే పూజర్ధ కైకర్యం కోసమో
వ్యర్థం కానిదే విధ్వక్త  ఆశ్చర్యం ఎవరికో

ముసుగు తొలగగా వీధి నిర్మానుష్యం దేనికో 
పలుకు పలకగా తీరు మర్మానుష్యం దేనికో 
బలము పెరగగా భీతి కర్మానుష్యం దేనికో 
జలము చిలకగా జాతి ధర్మానుష్యం ఎందుకో

పరుగులు తీసే ఒక ప్రయాణం దేనికో 
బరువులు మోసే దయ ప్రయాణం దేనికో 
చిరుగులు మూసే చిరు ప్రయాణం దేనికో 
పురుగుల జాసే భయ ప్రయాణం మానుకో

గొడవలు మార్చాలి గుణపాఠం ఎవరికో 
మనుషులు మార్చాలి విధి పాఠం ఎవరికో 
గురువులు మార్చాలి బడి పాఠం ఎవరికో 
తరువులు మార్చాలి మది పాఠం బ్రతుకుకో

నా వాళ్లు నాకు అప నమ్మకం ఎందుకో 
నా నీడ  నాకు కళ నమ్మకం ఎందుకో 
నా తోడు నాకు విధి సమ్మతం ఎందుకో 
నా ఆట నాకు కల అమ్మకం మానుకో

ఏ శ్వాస లో ముడిపడేటి మిలితం దేనికో 
ఏ వాంఛ లో తడి పడేటి కలుషం దేనికో 
ఏ బ్రాంతి లో తల పడేటి తపనం దేనికో 
ఏ స్వేఛ లో  గతి పడేటి గమనం చేరుకో

వెతకకు నువ్వెందుకు కారణం మర్చిపో 
బతుకున నవ్వెందుకు మూలకం మారిపో 
అతుకులు కవ్వించుట వాలకం  మర్చిపో 
ఋతువులు రువ్వెందుకు జీవితం సర్దుకో

మీరెవరో మరి నేనెవరో
ఒకరి కొకరు ఏమౌతారో
భయంకర స్థితిన మారేదె వరో
తోడై నీడై కలసి ఉండేదేవరో
......
సర్వేజనా సుఖినోభవంతూ 
అలా పాడుకుంటూ అందరికి నమస్కారం చేసుకుంటూ కదులుతున్నాడు బైరాగి   
       


ఆలోచనామృతం విని అర్ధం చేసుకొని ఆచరిస్తే అందరికి శ్రేయస్కరం  

రామారావు ఇంటికి చేరగానే భార్య శ్రీమతి జానకి జమ్బుతో నీళ్లు తెచ్చి చేతికి కండువా అందించింది, ఏమిటో ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు మీరు అన్నది నవ్వుతు 

 నేను యధాప్రకారముగా నడక సాగగా నాతో  హనుమంతు కలిసాడు, కూర్చొని కధలు చప్పుకుంటుంటే ఒక బైరాగి పాట్ పడుతూ వచ్చాడు అతనితో కాలక్షేపం ఇంట సమయం పట్టింది, ఆయనను ఇక్కడి లి తే పోయ్యారా ఎమన్నా సహాయం చేద్దాం అవునే నేనుకూడా ఏంతో అభినయించా వప్పుకోనంటే పండు ఇచ్చి సాగనంపాను . 

పండు పండు ఇచ్చి పంపావా ఏమిటి అంట్లా  అంటావు,  అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పదా లోపలకి అని బదులు చెప్పాడు రామారావు.   

సరదాగా సరసమాడుతూ రామారావు మాటలు 

సఖీ:: నీకిష్టమైతే, చెంతకొస్తావు, చేయిచాస్తావు ,  చెలిమిచేస్తావు, సలహాలిస్తావు, సహకరిస్తావు, కానీ నాకిష్టమైతే పట్టించుకోవు, పలుకరించవు, ప్రతిస్పందించవు, ఎరగనట్లు ఉంటావు. 


సఖీ: నీకునచ్చితే నవ్వుతావు, నవ్విస్తావు,  నమ్మిస్తావు, నటన చూపుతావు, కానీ నాకునచ్చితే నసుగుతావు, నటిస్తావు, నాలుకవెళ్ళబెడతావు, తెలియనట్లు చూస్తావు.   


సఖీ: నీవుమెచ్చితే  ఇంద్రుడవంటావు,  చంద్రుడువంటావు, చప్పట్లుకొడతావు, సంబరపడతావు 

కానీ నేనుమెచ్చితే, గమ్ముగుంటావు, వమ్ముచేస్తావు, పొమ్మనంటావు, అలక ప్రవర్తిస్తావు. 


సఖీ: నేనుపిలిస్తే, ఉలకవు, పలకవు, కదలవు, ఇకన్నా రుబ్బురోలు నయమనిపిస్తావు కానీ 

నీవు పిలిస్తే బరాబరారావాలి, బదులివ్వాలి, బద్ధకంవీడాలి, లేదా భద్రకాళివైపోతావు. 


సఖీ : నీవుకోరితే కాసులివ్వాలి, కొనిపెట్టాలి, కష్టపడాలి, కాదనకుండా ఒప్పుకోవాలి కానీ

నేను కోరితే బెట్టుచేస్తావు, బదనాంచేస్తావు, బ్రతిమాలించుకుంటావు, గాంభీర్యం ప్రదర్శిస్తావు 


సఖీ: నీవుమెడవంచితే, తాళికట్టాలి, తోడుగుండాలి, తృప్తిపరచాలి కానీ నేనుమెడవంచితే గేళిచేస్తావు గంతులేస్తావు గడుసుగుంటావు


సఖీ : నీకు షోకులుకావాలి, సుఖంకావాలి, సంసారంకావాలి, అందరిలో గోపా అనిపించుకోవాలి 

కానీ నేను పాట్లుపడాలి, పోషించాలి, పరిరక్షించాలి, అని హుకుం జారీ చేస్తావు 


సఖీ : మనం బాగుపడాలంటే అన్యోన్యంగా యుండాలి, కలసిముందుకుసాగాలి సంసార సాగరము నీదాలి, కలసి మెలసి నలుగురికి, దేశానికి సహాయంచేస్తూ జీవించాలి కానీ

మనమెప్పుడు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, రట్టుచేసు కోకూడదు, కలసుండాలంటావు.  


సఖీ: మనకుకుదిరితే ముందుకెళ్దాం, లేకపోతే వెనుకడుగేద్దాం, ఆలోచించు నిర్ణయం చెప్పు ఔనంటే బంగారుభవితకు పూలబాట వేసుకుందాము. 

ఏమిటండి ఎంత ఉపోద్ఘాతము వెలువరించారునేను మీదగ్గర అట్లా ప్రవర్తించానా, మీదగ్గర పిల్లల దగ్గర తప్పుచేసినా ఇన్ని మాటలన్నారు. 

ఇప్పుడు నేను చదివినదంతా నమ్మవా మరి నాగురించేగా మీరు వ్రాసింది అవును కాదననుకో      

ఎదో సరదాగా వ్రాస్తే ఎలాఉంటుందో అని హనుమంతు అడిగితె వ్రాసాను,నీకు చదివి విని పించాను . 

ఆ అంతే

అయితే మీ మాటలు నమ్మవచ్చా, 

వెళ్లి కాఫీ పెట్టి తీసుకురా తాగుదాం, రండి ఇద్దరం కలసి పెట్టుకుందాం, ఎన్నాళ్ళ కెన్నాల్లకు         

వయసులో వేషాలు గుర్తు కొస్తున్నాయి, ఆ వస్తాయి వస్తాయి 

ఆ ... అ ... ఆ  

ఇతకముందే మీ తాతమ్మగారు వచ్చింది, ఆవిడకు పాతలవాట్లు మాత్రం మారలేదు, పలకరించండి, ఈరోజు మధ్యాన్నం మీ స్నేహితుని ఇంటికి వెళదాం. 

తాతమ్మ వచ్చిందికదే, అందుకనే వెల్దామంది, ఏమనుకుంటుందో అంటా నేను చూసుకుంటాగా మీరు రడీగా వుండండి, తాతమ్మకు చెప్పి వెళదాం. 

మాటల్తో భోజనాలు ఆయినాయి, తతమ్ముకు చెప్పారు, వెళుతున్నామని, అనగా తలుపేసుకొని లోపలకు నడిచినది, బయట జానకి రామారావు కార్ కదిలింది.                 

తాతమ్మ టివి పెట్టుకొని చూస్తున్నది.  

అప్పుడే కళింబెల్ నొక్కగా 


బామ్మగారు బామ్మగారు ..  ఎం బాబు ఆ అరుపు 
.....

* త్యాగం ఒక గొప్ప శక్తి

ఓంశ్రీమాత్రే నమః

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం.

ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమన బడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమన బడుతుంది.

చాలాసార్లు వ్యక్తి స్వార్థానికి లోబడి త్యాగం చేస్తాడు. నేను కొద్దిగా త్యాగం చేస్తే ఎంతో గొప్ప లాభం దొరుకుతుందనుకోవడం రజోగుణ త్యాగం. కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు. నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది, విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం.

మోహాలోభాలలో దేనికైనా లోబడి ఉన్నవారు మనస్ఫూర్తిగా త్యాగం చేయడం వారి భాగ్యానికి నిదర్శనం. ఇందులో కష్టమనేమీ ఉండదు. ఎందుకంటే దీని ఆధారంతో ఆత్మకు అసలైన సుఖం లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.

త్యాగం చాలా గొప్ప శక్తి కావటం వల్ల వ్యక్తి ఎంతో శక్తివంతుడవటమే గాక ఎందరో ఆత్మలకు ప్రేరణ నిచ్చిన వాడవుతాడు. యోగ  సాధన చేసే ఆత్మలో త్యాగమనే శక్తి నిండుతూ ఉంటుంది. వారి మనసు బుద్ధిలో ఎల్లప్పుడూ నేనొక పవిత్రమైన ఆత్మననే శ్రేష్ఠ చింతన ఉంటుంది. ఈశ్వరుని పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారు దేన్నైనా సహజంగానే త్యాగం చేస్తారు.ఈ ప్రపంచాన్ని వదిలి సన్యసించడం అనేది పిరికితనం లేక పలాయనవాదం. 

రాజయోగం మనకిచ్చే శిక్షణ ఏమంటే ఈ సమస్తమైన వస్తువైభవాలు, వ్యక్తులు మన మధ్య ఉన్నప్పటికీ మన దృష్టి వాటిని ఆకర్షించరాదు. వేటిపైనా లోభమోహాలు ఉత్పన్నంకానపుడే సాత్విక త్యాగం చేయగలం. తనను తాను సుఖంగా ఉంచుకోవడానికి ఎందరినో బాధ పెట్టడం నిజమైన సుఖం కాదు. ఇతరుల సుఖంలోనే మన సుఖముందని గ్రహించి మనం ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగితే మనం వారి ఆశీస్సులను పొందగలం. 

మనమిపుడు మానసిక  విషయవికారాలు మొదలైన అపవిత్రతను త్యజించాలనే దృఢ సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భాగ్యం తయారవుతుంది.

....



బామ్మగారూ!జనాభా లెక్కల సేకరణ కు వచ్చిన  అధికారిని,
దయచేసి ఇంట్లో వాళ్ళని పిలవండి!
";;;;;;;;;;;;;;;;;"
 ఏవండీ, ఇంట్లో ఎవరూ లేరా? 
ఏరా  భడవా?
నేనెవర్నీ?
పని మనిషినను కున్నావా? లేక ఇంకేమనుకుంటున్నావో చెప్పు త్రాష్టుడా? 
అయ్యో  బామ్మగారూ, నన్ను క్షమించండి,  ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు? 
డజన్ డజనా? ఓహ్, పన్నెండు మందా. సరే, పెద్దాయన ఏంజేస్తుంటారు? 
జైలు కెళ్ళాడు జైలు కెళ్ళారా? 
ఏం నేరం చేసారు? 
ఎన్నేళ్ళు శిక్ష పడింది?
కఠిన శిక్షా లేక సాధారణ శిక్షా?
నీ మెుహం మండా, వాడు జైలరు, న్యాయాధికారి  
ఓహ్ ! అలానా, ఆయనకు ఎంతమంది పిల్లలు?
ఓక పోతు, రెండు పెంటి పోతు,పెంటి ఏంటండీ?
వెధవా! 
అదికూడా తెలవకుండా ఎలా ఆఫీసర్వయ్యావు? ఆఫ్రాచ్రుడా! 
ఓ మగ, ఇద్దరు ఆడబామ్మగారూ!
 మీరు మరీ అమర్యాదగా  మట్లాడుతున్నారు, ఇప్పుడు చెప్పండి, వారి అబ్బాయి ఏం జేస్తుంటాడు? 
 కొంపలార్పుతుంటాడు 
ఛ ఛ  
అదేం పనండీ? మీరైనా చెప్పలేక పోయారా? 
నువ్వు పరీక్ష పేసయ్యేవా?
దొడ్డిదారిన అధికారివయ్యావా బడుద్దాయ్?
వాడు  ఫైర్ డిపార్ట్ మెంట్ రా అరకాణీ వెధవా ! 
బామ్మ గారూ!
మీరు సరిగ్గా చెప్పండి, ఇలా డొంకతిరుగుడు నాకర్థం కాదండీ, మీరు మరీ తిట్టేస్తున్నారు, 
ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువురా? పింజారీ వెధవ బామ్మ గారూ!
ఇక చాలు, మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి, దయచేసి.. 
ఒకత్తేమో  ఊడబెరుకు తుంటుంది, ఇంకోకత్తేమో తైతక్కలాడుతుంది. 
బామ్మగారూ!ఊడబెరకడం, తైతక్కలాడడం ఏందండీ? 
ఒకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం మాస్టర్ రా నెలతక్కువ వెధవా! 
";;;;;;;;;;;;;;;;"
అయ్యో పాపం స్ప్రహ తప్పేట్టున్నావే, ఇలా కూర్చుని తగలడు, ఇంత చద్దన్నం, రవ్వంత ఆవకాయ పెడతాను తిని చావు 
*****
    
"పిలుపు విని బాల్య మిత్రులను కలవాలని"  

విచ్చేశారు అందరూ బానపొట్టలు,  బట్టతలలతో, నెరసిన జుత్తుతో, పురుష పుంగవులు, వయసు చూపుతున్న వృద్ధులు నవ్వులమధ్య, సెలయేరు శబ్దముగా కూనిరాగాలు తరువుల కొమ్మల కదలికలుగా, ఆయాస పడుతూ పరిగెడుతున్న పిల్లవాడిలాగా కదలిక   !
బారెడుజడలూ, మూరెడుకాగా, సోడాబుడ్డి, కళ్ళద్దాలతో మహిళా మణులు !!

వాడు వీడేనా ?, వీడు  వాడేనా?, ఆమె ఈమేనా ?, ఈమె ఆమేనా ?, గుర్తింపుల గుబాళింపు !
పలకరింపులూ, నమస్కారాలూ, కరచాలనాలు, కౌగిలింతలూ, పరామర్శలూ, వర్ణనలూ, మార్పు చూపుతున్న కాల రాజకీయ ముచ్చట్లు, పిల్లలుపెడుతున్న అగచాట్లు, చాటుమాటున కన్నీరు దిగమింగిన చివాట్లు, నిత్యము జరుగుతున్న సిగపట్లు, మరచిపోలేని ఉడుం పట్లు,        
సాగుతున్నాయి ముచ్చట్లు 

తాతలుగా మారిన, అలనాటి అబ్బాయిలు, అమ్మమ్మలూ నానమ్మలుగా మారిన ఆరోజుల అమ్మాయిలు,  కొత్త కొత్త వేషాలతో, మెడ నిండా పుత్తడి తళుకుబెళుకులతో, హావభావవిన్యాసములతో పదహారేళ్ళ పడచుపిల్లలా గంతులు ఆ సమయాన     

మరోవైపు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో
జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి

అలనాటి  అల్లర్లు, కొట్లాటలు, ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, పదవతరగతి చదివిన పాట మాజేటి గురవయ్య పాఠశాల, గుంటూరు, కలయ తిరుగుతూ, నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆనాటి గురువులను, అధ్యాపకులను, ఉపాధ్యాయినులను, కలసి ఆనాటి   విద్యార్థులందరూ నేటి వృద్దులై వివిధ ఉద్యోగ వ్యాపార నిష్నాతులుగా ఏకమయ్యారు            

తమకలల రాణి కోసం, గుంపులో వెతుకులాడుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలలో, మరెన్నో మార్పుల వాస్తవాలు. 

బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే, పోగొట్టుకున్న వారు మరికొందరు, అందరి మోములోనూ, చెరగని చిరునవ్వు , నాటిమేటి విద్యార్ధి, ఏదో సాధిస్తాడనుకున్నవాడు
బడుగు జీవిలా, సంసార సాగరాన్ని, ఈదుతూ అలసిపోగా, ఎందుకూపనికిరాడనుకున్నవాడు
గొప్పవాడై కనుల ముందు, అరేయ్ ఒరేయ్ మావ బావ నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో
సార్, గారు మర్యాదల మార్పులు !!!

కాలగర్భంలో జారిపోయి, కరిగిపోయిన కొందరు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు, 

ఏదైతేనేం సుఖదుఃఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, చేరుకున్నావా ? జాగ్రత్త !
చరవాణి హెచ్చరికల మోత ! తెలియకుండానే కరిగి పోయిన కాలం !

బాధాతప్త హృదయాలతో, అడ్డుపడే కన్నీటిపొరల, మసకచూపుల తడిలో, వీడ్కోలు తీసుకునే సమయం !
మరలా కలిసే మరోరోజుకు అందరూ కలవాలనే ఆశతో  !

కాలగమనంలో ఎందరో  చదువులు ముగించి, వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ , ఏమార్పూలేని పాఠశాల , చిద్విలాసంగా నవ్వుకుంటూ, వెళ్ళి రండని  ఆప్యాయంగాఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ  !!!

 



సన్యాసి ఉపన్యాసం విపులీకరించే టప్పుడు తన ఉదేశ్యము తెలియ పరచాలని, రామారావు దగ్గరకు వచ్చాడు. నేటి పిల్లల ప్రేమ గురించి తెలపగలరు. అనగా అనాదిగా వస్తున్నా సంప్రదాయాలు మారుతున్నాయి అని చెప్పారు 

*సన్యాసి, ముఖ్యంగా నేను చెప్పేది స్త్రీలు పురుషులు (యువతీయువకులు) చదువులంటూ వయసొచ్చిన తర్వాత కూడా ఆ సుఖాన్ని పొందక, కామాన్ని అదుపులో పెట్టుకొని జీవించటం మొదల పెట్టడము, ఉద్యోగాలు సంపాదన, పెరగటం, తల్లితండ్రుల ప్రోత్సాహం,  బిడ్డలు పెళ్లి వద్దన్నా ఊరుకోవడం, సంపాదన వున్నా సరిపోదని, ఆడవారుకూడా పనులు చేయడం, ఎన్నో ఆశలను పెట్టుకొని పిలల్లను పెంచడం మనం అందరం చూస్తున్నాము.  

                 

ప్రస్తుతసమాజం లో ఆధునిక పరికరాలు వచ్చాయి, క్షణంలో లోకంలో వింతలూ విడ్డురాలు తెలుసుకుంటున్నారు, ఎంత తెలుసుకున్న ప్రేమ అనేది యువ తీ యువకుల్లో పుడుతుంది.  వాసుల్లో జరిగే ముచ్చట ఆవసువు జరగాలి అప్పుడే అందరికి ఆరోగ్యం. అందుకే సంభాషణలు. 


అందాన్ని చూశాక ఆనందాన్ని పొందాలని ఆశ, అధరాన్ని పొందాలని ప్రేమరుచి చూడాలని, చూపుల వలను విసిరాలని,  మగువ అనే గులాబీని పొందాలని, పూలను వర్ణిస్తూ మనసు లక్షణాలను తెల్పి, ఇచ్చా ప్రేమనుకోరా,  మనసు విప్పా హృదయ ముచ్చట పరచా, చెంతకు పిలిచా చెలిమిని కోరా, ఆమెను మెచ్చా ఆమెకు నచ్చా, విషయాన్ని విశదీకరించా, ఒంటరిగా పిలిచా తుంటరిగా మాట్లాడా, అనుభవాలను, ఆశయాలను, తెలియపరిచా, నవ్వులు పంచా ముగ్గులోకి దించా, మనసు, మనసు కలిపా, మమతాను రాగాలను పంచా, మతి పోగొట్టా మత్తులో పడవేశా, హృదయ శబ్దాన్ని అర్ధం పరమార్ధ మనితెలిపా, సమయస్ఫూర్తి గా సహాయాన్ని అందించి,  ఆరోగ్యం పెంచేటి పోషకాహారం అందించి, నిద్ర సుఖాన్ని కల్పించి, సమస్యలు లేని కాపురంగా సాగుతున్నది.  

   

ఈడు కుదిరింది జోడు కొచ్చింది, తోడుగా నిలిచింది నీడగా మారింది, కల నిజమయ్యింది కోరిక

నెరవేరింది, చేరువయ్యింది స్వర్గం చూపించింది, సుఖము ఇచ్చింది శాంతి కూర్చింది, బంధం పడింది బంధీ అయ్యింది, కాలనిర్ణయాలను తెల్పింది, స్వప్న్మం సార్ధకమయ్యింది

సమస్య పరిష్కారమయ్యింది, ఆనందాల సంద్రమయింది, కాపురం కలిసొచ్చింది కుటుంబం

వృద్ధిచెందింది, బ్రతుకు బంగారమయ్యింది జీవితం సుఖమయమయ్యింది


దివ్యప్రేమానుభవం - మానవ ప్రేమ వలె దివ్య ప్రేమ ఒక భావావేశం కాదు. భావావేశాలకు అతీతులమై అంతర హృదయం ద్వారా పరమాత్మతో ఏకత్వం భజించి నప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధమైన భావావేశపు పరుగులు దాని నెంత మాత్రమూ అందుకొనజాలవు.  అలా ప్రేమ గురించి సన్నాసి గారు తెలియపరిచారు, రామారావు మైక్ వద్దకు వచ్చి ఈరోజు మనకు మంచి విషయాలు తెలియపరిచారు మరలా అందరు కలుద్దాం సెలవు అనుటు ముగించాడు.      


నాయకుడనేవాడు గతాన్ని వదిలివేసి, క్షణ క్షణ మార్పులను గమనించి, ఎవరి లక్షణాలు ఎలాంటి ఓ తెలిసికొని, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకుండా, మనసులో ఉన్న విషయం బయటకు చెప్పి, ఈగో వదిలేసి, బాద్యత సక్రమంగా నిర్వర్తించి, తప్పును కూడ శాoతoగ చెప్పి, పరిష్కారంకూడా తెలియపఱచి, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు చూపి, బరోస ఇచ్చి, అన్నీ సందర్భాలనీ స్వీకరించి, ఎంత కఠిన నిర్ణయం ఆయన  తీసుకునే దైర్యం చూపి, జనులకు మార్గ దర్శకుడు గా మారి,  ఎల్లప్పుడూ నవ్వుతూ పలకరింపు ఉంచి, సమస్యలపై ఆందోళన తెలపక, పరిశీలనచేసి, తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండి, తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలిపేటట్లు, సహాయ సహకారం అందింస్తు, తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ, సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండి, అనుచరుల ఎదుగుదలను కోరుకునే. వాడైఉండి, కానీ వారి ఎదుగుదలను అడ్డుకో కుండా, తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరికోసం  పనిచేసి, ఇలా ఎన్నో ఉండాల్సిన లక్షణా లున్న నాయకుడి ఎన్నుకోవాలి -

బ్రహ్మవేదముతోను బ్రహ్మాండమున  వెల్గు  ..  బోధకు నిలయమై పడచు వెల్గు    

పరమాత్మ నాలంబ నతొ జొచ్చు నిజవెల్గు ..  నఖిలజగంబుల నిండు వెల్గు

ఆది మధ్యాంతర  ప్రేమ వెల్గు  .. నాదాంత సీమల నడచు వెల్గు

చూడు జూడగ మహా శోభితంబగు వెల్గు .. సాదు జనానంద సంఘములో వెల్గు ..

  

మేరు శిఖరంబు నిండిన మేలు  వెల్గు ..     ప్రేమ మోహము వేషము పెంచు వెల్గు

మేను పులక రించేదియు మనసు  వెల్గు ..      ప్రాంజ లిప్రభ నాయక   ప్రేమ వెల్గు 

                      

వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత .. వేదాంతి రాజుగా యోగి కాడు  

కుండకళ్ళునుత్రాగి  తెలియక వాగినంత .. పూర్వపు శాస్త్రవేక్తగను  కాడు 

మనిషిగా ఉన్నంత మాత్రాన ఎప్పటికి ..   అసలు గుణాన్నియే   మార్చలేడు 

స్త్రీల  వెంట తిరిగి  స్థిరమైన నాయక  ..       సీఘ్రము నిజమైన వాడు  కాడు


ఎంత చదివిన గుణహీను డెంచ లేడు ..   సింహము జయించె నంతనే సిరులు తేడు  

నమ్మ పల్కులతో వాడు నటనకాడు ..    ప్రాంజలిప్రభ నాయక   ప్రేమ వెల్గు 

***                      

40 దాటిన తరువాత ఏ పని మీద మనసు లగ్నం కాదు. గడప దాటి బయటకు వెళ్లడానికే మనస్కరించదు.28 - 30 లో అయితే చాలా బాగుండేది. ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్లినా అలసటే అనిపించేది కాదు.మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. 20-25 లో అయితే వసంతంలా ఉండేది. జీవితపు ఆనందం వేరేలా ఉండేది. మజా మస్తీ తిరగడం. గాభరా అస్సలు ఉండదు. 42-45 దాటితే ఏమవుతుందో నన్న ఆందోళన. ఆలోచిస్తూ ఉంటేనే భయంగా ఉంటుంది.

*

నేను చెప్పేది వయస్సు గురించి కాదు.

ఉష్ణోగ్రత (Temparature) గురించి చెబుతున్నా.  వేసవి వచ్చింది కదా! మరి.😂😀👍🏻

   ***   


సంగీతం ఆపాత మధురం, సద్భావం సమ్మోహ అధరం 

సాహిత్యం ఆలోచనామృతం, సామీప్యం సందేహనివృతం 


రెక్కలు విచ్చుకుంటేనే, విహంగాలు ఎగురగలవు

కోర్కలు మానుకంటెనే, కుటుంబాలు మనగలవు 


మబ్బులు ముసురుకుంటేనే, వానజల్లులు కురువగలవు

ఒప్పులు సరిలేకుంటేనే, గిల్లికజ్జాలు పెరగగలవు 


సూర్యుడు ఉదయించితేనే, తూరుపు తెల్లవారుతుంది

చంద్రుడు అస్తమించుతేనే, వెల్గుల కళ్ళు కదులుతుంది 

  

చంద్రుడు పొడిస్తేనే, వెన్నెల వ్యాపిస్తుంది

తారలు మేరిస్తేనే, థళుకు ఆవహిస్తుంది 

 

పూలు పూస్తేనే, తోటకు అందంవస్తుంది

కాయలుంటేనే, సిహత్తుకు అందం వస్తుంది 


పిల్లలు ఉంటేనే, ఇల్లు కళకళలాడుతుంది

స్త్రీలు ఉంటేనే, సుఖము నిత్యమై ఉంటుంది 


కాంతలకు కురులుంటేనే, కొప్పేదైనా అందాన్నిస్తుంది

శాంతి కొరకు మనసుంటేనే, బంధమే అందాన్నిస్తుంది  

 

ఆలోచన తడితేనే, భావము బయటకొస్తుంది

పోరాటం పుడితేనే, నామాంకం బయఁటకొస్తుంది 

 

ఆవేదన కలిగితేనే, అద్భుతరచన అవతరిస్తుంది

సహకారం కుదిరితేనే, సమయ రచన అద్భుతమౌతుంది 


మనసు ముచ్చటపడితేనే, మంచికవిత ముందుకొస్తుంది

వయసు తాపత్రయంతగ్గితేనే, మనసు కవిత ముందుకొస్తుంది 


చక్కనికైత చదివితేనే, చదువరులకు సంతోషంకలుగుతుంది

చుక్కల కాంతి మక్కువ ఐతేనే, చూపరులకు సంతోషం కల్గుతుంది 


డబ్బులు జేబులోయుంటేనే, కడుపులు నిండుతాయి

జబ్బులు లేకయుంటేనే, సుఖాలు నిండుతాయి 


విరులు విచ్చుకుంటేనే, సౌరభాలు వెదజల్లుతాయి

కురుల విచ్చుకుంటేనే, మల్లెపూలు గుబాలిస్తాయి 


కవితకు ప్రాసలేకపోతే, కూరలో ఉప్పులేనట్లుచప్పనే

హృదయానికి శబ్దం లేకపోతే, జీవం ఉన్నా జీవితమ్ లేనట్లునే

   

సరుకున్నకవి చక్కనికవితను, అనునిత్యము అందించగలడు

బ్రతికున్న కవి గుర్తింపు కవితను, నిత్య సత్యమును పంచగలడు 


దినదినం కవితలుచదవండి, ప్రతిదినం  పరవశించిపోండి

తెలుగును చదివి చదవమనండి, మాతృ భాషను గౌరవించండి 





       

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*



*****


*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!*

                         

విద్యా విధానం లో తాజా వార్తలు


కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.

 కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం-

 కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


ఐదు సంవత్సరాల ప్రాథమిక


 1. నర్సరీ @ 4 సంవత్సరాలు

 2. Jr KG @ 5 సంవత్సరాలు

 3. Sr KG @ 6 సంవత్సరాలు

 4. స్టడీ 1వ @ 7 సంవత్సరాలు

 5. Std 2nd @ 8 సంవత్సరాలు


మూడు సంవత్సరాల ప్రిపరేటరీ


 6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు

 7. 4వ తరగతి @10 సంవత్సరాలు

 8. 5వ తరగతి @11 సంవత్సరాలు


మూడు సంవత్సరాలు మిడిల్


 9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు

 10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు

 11. 8వ తరగతి @ 14 సంవత్సరాలు


 నాలుగేళ్ల సెకండరీ


 12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు

 13.Std SSC @ 16 సంవత్సరాలు

14.Std FYJC @17ఇయర్స్

15.Std SYJC @18ఇయర్స్


 ప్రత్యేక లక్షణాలు:

 #బోర్డు పరీక్ష 12వ తరగతిలో మాత్రమే జరుగుతుంది


ఎంఫిల్ డిగ్రీ రద్దు చేయబడుతుంది 4 సంవత్సరాలు

 ■ 10వ బోర్డు పరీక్షలు లేవు

 ◆ 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష మరియు జాతీయ భాషలలో మాత్రమే బోధించబడుతుంది. మిగిలిన సబ్జెక్టు ఇంగ్లిష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు.

● ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు చేయబడుతుంది.

★ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్య 5+3+3+4 ఫార్ములా కింద బోధించబడుతుంది.

కళాశాల డిగ్రీ 3 మరియు 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా, మూడవ సంవత్సరంలో డిగ్రీ.

◆ ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ. మరోవైపు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు.

●MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.

★విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలనుకుంటే, అతను ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుండి విరామం.

ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించబడ్డాయి. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభించబడతాయి. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF) ప్రారంభించబడుతుంది. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి.

● అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమాలు ఉంటాయి.



 ధర్మేంద్ర ప్రధాన్

 విద్యా మంత్రి,

 భారత ప్రభుత్వం



"పిలుపు విని బాల్య మిత్రులను కలవాలని"  

విచ్చేశారు అందరూ బానపొట్టలు,  బట్టతలలతో, నెరసిన జుత్తుతో, పురుష పుంగవులు, వయసు చూపుతున్న వృద్ధులు నవ్వులమధ్య, సెలయేరు శబ్దముగా కూనిరాగాలు తరువుల కొమ్మల కదలికలుగా, ఆయాస పడుతూ పరిగెడుతున్న పిల్లవాడిలాగా కదలిక   !

బారెడుజడలూ, మూరెడుకాగా, సోడాబుడ్డి, కళ్ళద్దాలతో మహిళా మణులు !!

వాడు వీడేనా ?, వీడు  వాడేనా?, ఆమె ఈమేనా ?, ఈమె ఆమేనా ?, గుర్తింపుల గుబాళింపు !

పలకరింపులూ, నమస్కారాలూ, కరచాలనాలు, కౌగిలింతలూ, పరామర్శలూ, వర్ణనలూ, మార్పు చూపుతున్న కాల రాజకీయ ముచ్చట్లు, పిల్లలుపెడుతున్న అగచాట్లు, చాటుమాటున కన్నీరు దిగమింగిన చివాట్లు, నిత్యము జరుగుతున్న సిగపట్లు, మరచిపోలేని ఉడుం పట్లు,        

సాగుతున్నాయి ముచ్చట్లు 

తాతలుగా మారిన, అలనాటి అబ్బాయిలు, అమ్మమ్మలూ నానమ్మలుగా మారిన ఆరోజుల అమ్మాయిలు,  కొత్త కొత్త వేషాలతో, మెడ నిండా పుత్తడి తళుకుబెళుకులతో, హావభావవిన్యాసములతో పదహారేళ్ళ పడచుపిల్లలా గంతులు ఆ సమయాన     

మరోవైపు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో

జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి

అలనాటి  అల్లర్లు, కొట్లాటలు, ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, పదవతరగతి చదివిన పాట మాజేటి గురవయ్య పాఠశాల, గుంటూరు, కలయ తిరుగుతూ, నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆనాటి గురువులను, అధ్యాపకులను, ఉపాధ్యాయినులను, కలసి ఆనాటి   విద్యార్థులందరూ నేటి వృద్దులై వివిధ ఉద్యోగ వ్యాపార నిష్నాతులుగా ఏకమయ్యారు            

తమకలల రాణి కోసం, గుంపులో వెతుకులాడుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలలో, మరెన్నో మార్పుల వాస్తవాలు. 

బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే, పోగొట్టుకున్న వారు మరికొందరు, అందరి మోములోనూ, చెరగని చిరునవ్వు , నాటిమేటి విద్యార్ధి, ఏదో సాధిస్తాడనుకున్నవాడు

బడుగు జీవిలా, సంసార సాగరాన్ని, ఈదుతూ అలసిపోగా, ఎందుకూపనికిరాడనుకున్నవాడు

గొప్పవాడై కనుల ముందు, అరేయ్ ఒరేయ్ మావ బావ నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో

సార్, గారు మర్యాదల మార్పులు !!!

కాలగర్భంలో జారిపోయి, కరిగిపోయిన కొందరు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు, 

ఏదైతేనేం సుఖదుఃఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, చేరుకున్నావా ? జాగ్రత్త !

చరవాణి హెచ్చరికల మోత ! తెలియకుండానే కరిగి పోయిన కాలం !

బాధాతప్త హృదయాలతో, అడ్డుపడే కన్నీటిపొరల, మసకచూపుల తడిలో, వీడ్కోలు తీసుకునే సమయం !

మరలా కలిసే మరోరోజుకు అందరూ కలవాలనే ఆశతో  !

కాలగమనంలో ఎందరో  చదువులు ముగించి, వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ , ఏమార్పూలేని పాఠశాల , చిద్విలాసంగా నవ్వుకుంటూ, వెళ్ళి రండని  ఆప్యాయంగాఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ  !!!

            🙏🙏🙏                                       


ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   


5, ఫిబ్రవరి 2023, ఆదివారం

హారతి కర్పూరం.. కధ.


 

హారతి కర్పూరం.. కధ..1


వందనాలు గురువుగారు

ఎవరు నాయనా అంటూ కళ్ల జోడు సర్దుకుంటూ

చేతి కర్ర కదిలిస్తూ అసలు మీరెవరు నాయనా,

 నేను మీశిష్యుడునండి, మంచిది కాలాన్ని బట్టి మనము బ్రతుకు నేర్చుకోవాలి, ఏదినిజమో ఏది అబద్దమో తెలుసుకొనే జ్ఞానము భగవంతుడు మనకిచ్చాడు.

నన్ను గుర్తించినందుకు ణీ అవసరమేమిటో తెలుపు తీర్చగల స్థోమత ఉన్నదోలేదో 

ఈ వయసులో ముందు నీవు మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'

మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము',  పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము". అర్థం లో పరమార్ధం తెలుసుకో  తరువాత అనుభవాలు పంచుకుందాం.

ముందు వాతావరణం వేడిగావుంది నీడజెరుదాం, మనిషికి ఓర్పు మనసుకు నేర్పు అవసరం, కాస్త అలా నడుచుకుంటూ పోదాం రాగలవా

అయ్యో వస్తా నండీ

సరే నడువు


                ఇంకావుంది....2

.......

హారతి కర్పూరం...2

ఇంతకీ నీపేరు చెప్పనేలేదు

నా పేరు నాపేరు

అసలు నీపేరు ఉన్నట్టా, లేనట్టా

అదేంటండి అట్లా అన్నారు

ఏమిలేదు మాటలు ప్రకృతి, అనుకరణ ఆచరణ వికృతి, పేరుకుమాత్రం ఆక్రతి కదా

ఎంతమాటన్నారు గురువుగారు, మీశిష్యుడుగా ఒకపేరు ఉండేది, తర్వాత పేరు మార్చుకున్నా అంతే 

నన్ను నన్ను

ఆ... ఆ...

నన్ను బెత్తం విరిగేదాకా కొట్టేవారు మొద్దబ్బాయి అని తిట్టేవారు కదండీ.

నీవు పొరబడినట్లు వున్నావు, ఎవరిని చూసి ఎవరనుకున్నావు, ప్రేమించే హృదయాన్ని బాధపెట్టకు, సూటిపోటి మాటలతో చిత్రవధ చేయకు, కాలాన్ని వ్యర్థ పరచి సమయాన్ని దుర్వినియోగం చేసి సంబరపడటం దేనికి, వాడుకొని వదిలేయటానికి నేను ఒక వస్తువు కాదు, నాగుండెకు వత్తిడి తీసుకు రాకు ఈ వయసులో నేను భరించలేను. నీ మాటలు నమ్మేంత మూర్ఖుని గాను, నీ మాటలు నన్ను మోహ పెట్టుటలేదు, అసలు నీపేరు చెప్పు నాకు గుర్తుకు వస్తుందో ఆలోచిస్తాను.  నాపేరు శ్రీరామ్

నీపేరు రంగయ్య సనుకున్నానే 

బాగా గుర్తుందండి మీకు నా అసలు పేరు అదియే

తర్వాత మార్చుకున్నాను

సంతోషం 

నీవు నన్ను కలవటంలో అర్ధం మాత్రం తెలపలేదు, మీరు నిదానంగా ఒకచోట ఆగాక మాట్లాడుకుందాం గురువుగారు.

చూడు బాబు మనలో మంచి గుణాలున్నా, ఎదుటివారిలోఉన్న గుణాలను తెలుసుకొని ఆనంద ప్రవర్తనే ముఖ్యం, ఆలస్యం అమృతం విషం, విషయం తెలుపు,

నిదానమే ప్రధానం అనికూడా అన్నారుకదా గురువుగారు,మాటలు నేర్చావు ఎవరికోసమో.....

                  ఇంకావుంది....3

.....

హారతి కర్పూరం....3

శ్రీ రామ్ నాలాగ కూడా నడవలేక పోతున్నావు, వయసులోఉన్నావు ఆవేశ పడుతున్నావు, మిమ్మల్ని చుస్తే ఏదొ భయము ఆవహిస్తున్నది, నీ మాటలకు బాధ కలిగి నెమ్మదిగా నడక సాగింది.

గురువుగారు నడుస్తూ బాధపడుతున్నారెందుకు

ఏమని చెప్పేది చెట్లునరుకుతున్నారు, గాలి వెలుతురు లేని గృహములలో కాపురాలు సంపద చుట్టు తిరగడం ఒక ఎత్తు,   *పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో.* *మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.*

ఎవరికి తెల్పిన ఫలితము లేనిస్థితి

శ్రీ రామ్ తనూ పలకాలనీ

అంతా పరుగుల లోకమండి, ఆధునికయుగమంటూ, సంస్కృతి సంప్రదాయాలు ప్రశ్నలుగా మారుతున్నాయండి.

చూడు నాయనా భూమి గుండ్రముగా తిరుగుతుంది, ఏమీ మారలేదు మూర్ఖుల వాదమేయిది, కొందరు భ్రమలు సృష్టించి పబ్బం గటిస్తారు.

అలలు కలలుగా 

అర్థం కాలేదు గురువుగారు

అలల కలల పరుగు పరుగు... అలలు గట్టును దాటలేక వెనక్కివచ్చి కడలిలో కలసిపోతాయి, అట్లాగే నిద్రలో కలలు వచ్చి నిద్రలో కలసిపోతాయి, నిత్యమూ వెంబడిస్తాయి ఆలోచనలో కలసిపోతాయి.

వయసు ఉడికిన మనసులో బంధాలు అనుబంధాలు ఆలోచన చక్రాలుగా తిరుగుతుంటాయి, బిడ్డలను వదులుకోలేరు, వారివద్ద ఉండలేరు. కడలిలో అలలుగా, నిద్రలో కలలుగా అట్లాగే వయసుడికిన వారిలో ప్రేమ ఉట్టి పడుతుంది, జగతి నందు ఇదెప్రకారము ఉంటుంది

గురువు గారు మీరడిగిన దుకాణము వచ్చింది అంటుండగానే    రక్షక భట వాహన శబ్దముతో ముందు కొచ్చింది

...... ఇంకావుంది......4

.....

హారతి కర్పూరం....4

సుఖంగా ఉన్న వాళ్లకు కష్టాలు తెలియవు

కష్టాలలో ఉన్న వాళ్ళకు సుఖాలు తెలియవు  

మనిషికి కాలం కాటు ఎంత భయంకరమో

మనసుకు  గాయంవేటు ఎంత నరకమో

          అన్న గురువు గారి మాటలు వింటున్నాడు శ్రీ రామ్, ఏమీ తెలియని అమాయకుడుగా రక్షక భట వాహనమునుండి ఒక స్త్రీ కోపంగా వచ్చి శ్రీ రామ్ చొక్కా పట్టుకుంది. ఏమిటి ఈ ఆవేశం ఇతను ఏమిచేసాడు, మీరు దగ్గరుండి చేస్తున్నారా, మీరు సూత్రధారలా శ్రీ రామ్ పాత్రధారుడా. 

ఇతనికి నాకు సంబంధము ఏమిలేదు

అప్పుడే శ్రీరామ్ పరిగెత్త boyydu  భటులు వెంటాడి పట్టుకున్నారు.

ఆ వచ్చిన శ్రీ పూనకం వచ్చినదానిలా అరవడం మొదలుపెట్టింది

గురువుగారు నోటమాట రాక అలా నిలబడి జరుగుతున్నది చూస్తున్నారు ఏమీ చెయ్యలేక

మల్లెపూనై వస్తే నలిపేసావురా, మంచి గంధం ఇస్తే  పారబోసావురా, మనిషి గా మార్చుదామంటే మాట వినకున్నావురా, ఎట్టరా నీతో   నా జీవితం సాగించనురా, సెప్పరా నా ఆవేదన వినరా, కాలమంతా కర్పూరమవ్వగా, మానసంతా గాయమయిందిరా, అగ్గి లా  దహించుతుంటే మొగ్గలోనే బుగ్గి చేసావురా, సిగ్గుసచ్చినా ఈ సిన్నదాని మనసు వేదన చూడవేమిరా, సెప్పు కుంటే తీరని ఈ  ఆవేదనా, నీతో బ్రతకాలి లేదా సావుతోనైనా చెలిమి చెయ్యాలి.  ఈ  జన్మంతా  ఇట్టా బతకలేనురా, కొంతైనా కనికరం చూపించాలిరా,

వీసమెత్తైనా దయచూయించరా, జాలి లేకుండా దాటిపోకురా,గాలిలో కలిసి పోయేలా చేసిపోకురా, రేపటి వెలుగును  చూసేలా సాయం సేయరా, నే సేసిన సాయం  మరిసి పోయావురా,  నీ వెలుగుకు కారణం ఈ సీకటేనురా, నీ కలల జ్యోతిని ఆరిపోకుండా అడ్డునిలిచిన ఆడదాన్నినేనురా!!

లోకం తీరే ఇంతేనని చాటావురా, నా శోకానీకి ఆజ్యం పోస్తున్నావురా, అందరూ అందరే

అంటూ నోటికి వచ్చినట్లుగా అంటుండగా శ్రీరామ్ ను బంధించి వాహనం ఎక్కించారు రక్షక భటులు 

ఇంకేవుంది...... ........5

.....

హారతి కర్పూరం...5.. రోజువారి కధ 

ఉడుకు రక్తం ఉప్పొంగినట్లు, గాలి వేగనికి చెట్లే వాలినట్లు, పొగల సెగలమధ్య రంకెలు పెరిగినట్లు, కాళుతున్న సేవం ఒక్కసారి పగిలి నట్లు, సముద్ర కేరటాలు ఊరవడి ఉరకలు వచ్చి వెనక్కు మళ్ళినట్లు, పోలీసులు వెనక్కి వచ్చి గురువుగారు మీరు ఎక్కాలి వాహనం అనంటం జరిగింది.

శ్రీరామ్ కూ సహకరించారుకాబట్టి నడవండి స్టేషన్క్.

మీతో నేను వస్తా " మీ మాటను ధి క్కరించను, అతనేవరో నాకుతెలవదు, దారినపోయే దరిద్ర తీగను తగిలించు కున్నా, ఎదో కాలక్షేపం కోసం సహకరించాను, మొహమాటంకు పోయి ఎదో తగిలించుక్కున్నట్లు నా పరిస్థితి అయ్యింది. ఈ తప్పంతా నాది.

నిరంతరం ఉన్నతమైన ఆలోచనలు మరియు భావాలతో తోటివానికి సహాయం చేసే వ్యక్తిత్వం నాది.

అవును పదపద అంటూ పోలీస్ అధికారి హుకుం జారీ చేసినట్లు అరిచే.

మా దగ్గర మీకు జీవితాంతం  తృప్తిని ఎనలేని ఆనందాన్నిస్తుంది.* స్టేషన్లో ఉంచి నాలుగు అంటిస్తే అంతా బయటపడుతుంది.

అధికారం అర్భాట అర్పులు దేనికి మీతో వస్తానన్నానుగా.

మీ ప్రవర్తన నాయకుల వద్ద ఒకరకం, సామాన్య జనులతో మరోరకం పదవి అహం చూపిస్తారు.  

ఆపవయ్యా, ఉపన్యాసం అందరూ చెప్పేవి నీతులు దూరేది దొమ్మరి గుడిసెలన్నారుట ఎవరో నడువు  నడువు అనడం.

మీరు జీవితంలో ప్రవర్తన మార్చుకోవాలి, ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన తెలివి తేటలు పని చేయక పోవచ్చు. కానీ మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది, గుర్తుపెట్టు కుంటే మంచిది. కాని కనిపించేది  పైకి అందర్లో ముఖం, కానీ కనిపించని అంతరమ్ముఖం ఉండి తీరుతుంది.

నాది పేజీకీ ఓ కథ ఎన్ని పేజీలు వ్రాసినా తరగదు నా వ్యధ, గుర్తుంచుకోవాలి 

విసిరేసిన పుస్తకం కాదు జీవితం ఎంతో విలువైనది ప్రతి కాగితం *తెలుసుకోవాలి ప్రతిఒక్కరు "ప్రతి అక్షరం నీ గురువు, తరువు, పరువు తెలియకుంటే బ్రతుకే బరువు, కరువు" 

కళ్లజోడు సర్దుకుంటూ వచ్చిన ఇన్నోవా ఎక్కారు గురువుగారు.

ఇంకావుంది ..... 6

***

హారతి కర్పూరం...6.. రోజువారి కధ 

అదే రోజు పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసి కోర్టులో హాజరు పరిచారు, కేసుపెట్టిన స్త్రీ, శ్రీ రామ్ గురువుగారు కోర్టులో హాజరు అయ్యారు.    

జడ్జ్ గారు కేస్ నెంబరు చెప్పుతూ వాడి ప్రతివాదములను పిలిపించారు, కేసు సూక్ష్మ వివరాలు " భార్యను మోసం చేసి 5 గురుని వివాహం చేసుకున్న ఘనుడి వివరాలు"     

౩వ భార్య భామామణి పెట్టిన కేసు 

లాయరు : ముందు గురువుగారిని ప్రశ్నలు వెయ్యడానికి అనుమతి కోరారు  

గురువు గారు, గురువు గారు, గురువు గారు, అప్పుడే జడ్జ్ గారు లేచి నిలబడి గా అందరు లేచారు 

గురువుగారు మీరు ఈ కేసులో  

గురువుగారు భగవద్గీతపై ప్రమాణము చేసి చెపుతున్నాను 

మీకు తెలిసిన వివరాలు తెలపండి,  అన్న లాయరు గారి మాటలకూ 

 ఎంచేద్దాం, కలి ప్రవేశము చాలా ఎక్కువైంది, ఎవరి నమ్మాలో, ఎవ్వరి నమ్మకూడదో తెలియుటలేదు, లోకం అంతా అగమ్యగోచరం, ఎం చెప్పాలో ఏమి చెప్పఁకూడదో తెలియుటలేదు.   

ఉపోద్గాతము కాదండి మీకు శ్రీ రామ్ కు మధ్య సంభంధం 

అదే చెప్పఁ పోతున్నాను మీరు అడ్డు పడ్డారు 

జడ్జ్ గారు కలగ చేసుకుంటూ వారి చెప్పనీయండి 

మనిషికి జీవితంలో శాంతి చేకూరడం ప్రధానం. అది రావాలంటే ఏకాగ్రత అవసరం, మంచి చెడులు అర్ధం గ్రహించే శక్తి దానికితోడు ఆచరణ శక్తి ఉండాలి, ఇది ఒకరి వళ్ళ  అయ్యే ది కాదు,  శాంతి నెలకొనడం ముమ్మాటికీ అసాధ్యం.  ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యం,  యువతి యువకుల ప్రేమ మధ్య  కుటుంబాల్లో అంతఃకలహాలకు ఇదే మూలకారణం.

లాయరు : మీ మాటలలో అర్ధ ఏమిటి ? 

మనమందరం మనుషులమేననే సంగతి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పరస్పర సమానతా భావం ఉండాలి. వారి మనసుల్లో ఎక్కడైనా వెలితి అనిపిస్తే, అది వారిని లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. వేదనకు గురవుతారు. ఆ ఆక్రోశాన్ని ఇంట్లో ఉన్నవారి మీద చూపిస్తారు. బయటి వాళ్ళమీద చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసు, కాబట్టి ప్రేమగా చూడాల్సిన కన్న బిడ్డల మీద ప్రదర్శిస్తారు. అలాంటి వారితో ఎలా మసలుకోవాలో తెలియక... కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అసహనానికి లోనవుతూ ఉంటారు. అటువంటి మనిషి ఈ శ్రీ రామ్ అతడు ఎం చేసాడో, ఎవరిని మోసం చేసాడో తెలుపుట లేదు కారణం ఆ కనిపిస్తున్న అమ్మాయి అక్రన్దనమాత్రం పరిశీలించాల్సిందే అని చెప్పారు గురువుగారు.     

నాకు మాత్రం దారిలో తటస్థపడ్డాడు అంతవరకు నిజం, ఇతను, ఈమె చేసినది మోసమో నిజమో మీరు తేల్చగలరు, నేను చెప్పఁల్సినది కూడా ఏమి లేదు. 

నేను ఇక్కడ నుండి వెళ్ళుటకు మీ అనుమతి కోరుతున్నాను. 

జడ్జ్ గారు: వీరిని ఇంకేమన్నా ప్రశ్నలు అడగాలా 

లేవండి : అనుమతి ఇవ్వగలరు 

ముందు పోలీస్ వ్యవస్థను హెచ్చ రిస్తూ ఎవరు నేరస్తులో గమనించి ప్రవర్తించాలని మీరు ఎప్పుడు పిలిస్తే,  అప్పుడు  వచ్చే  విధముగా  వ్రాయించుకొని  పంపగలరు, శ్రీరామ్ మరియు భామామణి విచారించుటకు రేపు ఉదయం అనుమతించబడినది ఈ రోజు కోర్టు ముగింపు.                

ఇంకావుంది ..... 7

.......

హారతి కర్పూరం.....7 వ రోజువారి కథ

గురువు గారికి క్షమాపణ చెప్పె, రక్షక భట్టు వినయ పూర్వకము గా జరిగిన సంఘటన మనసు తలచి.
పువ్వు విచ్చుకొని ఘుబాలించి ఆకర్షంచుటే ప్రకృతి, మేము  విధి విధానం అనుకరణ, మాకున్న పెద్దల వత్తిడి మమ్ము తెలియని ఆవేశములో దించుతుంది.  బంగార మెంత యున్నా, సంపద యున్నా, లవణ అన్నమే ఆకలి తీర్చును. తప్పులు దొర్లినా సరిచేసు కొను మనసు మా కుంది అన్యధా భావించ వద్దు మీరు.

మీరు కూడా 
క్షమాపణ అనెడి పెద్ద పదాలు మనమధ్య అనవసరము, మీరు ప్రస్తుత కార్యదీక్ష రక్షకులు, నేను విశ్రాంతి గణాoకాధికారి ని, నిర్వి రామ కృషి గా చేత నయిన సహాయము చేయు చున్నాను.
హృదయంలో ద్వేషం లేకుండా, స్వార్ధం లేకుండా, మనసులో చికాకు రాకుండా, కోపము చూపకుండా,ఆనందంగా ఉండడంమే జీవితం, ధర్మ నిర్వాహన లోను ఉండి, ప్రలోభాలకు లొంగి, నాయకులు మాటలకు లొంగి పనిచేయడం మంచిది కాదు. 
నియంత్రణ లేని మనస్సు, మనల్ని పతనమొందిస్తుంది, నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు, విజయ శిఖరాలను అధి రోహింప జేస్తుంది, అదే నేను చెప్పగలను
సంస్కృత శ్లోకం గురుకొస్తుంది. 

🌺పథిచ్యుతం తిష్ఠతి దిష్ట రక్షితం
     గృహే స్థితం తద్విహతం వినశ్యతి ౹
     జీవత్యనాథోsపి తదీక్షీతో వనే
     గృహేsపి గుత్పోsస్య హతో న జీవతి ౹౹🌺

          దేవుడి కృప ఉంటే దారిలో పడిపోయినది మిగులుతుంది.లేకపోతే ఇంట్లో ఉన్నా నాశనము అవుతుంది.అడవిలో అనాథగా ఉన్నా దైవ దృష్టి ఉంటే జీవిస్తాడు.లేనపుడు ఇంట్లో రక్షించి జాగ్రత్త పడినా మరణిస్తాడే కానీ జీవించలేడు.

*ఎదుటివారు మిమ్మల్ని తలచినా* *తలవకపోయినా* *మీరు మాత్రం తలుచుకోండి*
*ఎందుకంటే* *బంధం చాలా అందమైనది* *అందులో పోటీ ఉండకూడదు*
*ప్రేమ ఆప్యాయతలు* *మాత్రమే ఉండాలి.* 

తే..స్తూల దేహము పంచ భూతాల మయము
నిత్య దుఃఖోప శమనమే నేతి మనసు 
ప్రీతి సాధణ సుఖ ప్రాప్తి ప్రేమయగుట
కదలికమహా శివును లీల కామ్య చరిత

ధన్యవాదాలు శెలవిస్తే
మంచిది మీరు ఎప్పడు రమ్మన్నా రాగలను మీకు ధన్యవాదాలు
ఇంకావుంది.....8
----

హారతి కర్పూరం....8 వ రోజు వారికధ
మీరు ఒక్క రోజు కనబడక బోతే నా మనసు అయ్యో మయంగా, అల్ల కల్లోలంగా వున్నది, ఎం జరిగిందో  అని ఆలోచిస్తూ మీకోసం ఉండి పొయ్యాను.
నిజమే దేవి నీకు చెప్పితే బాధ ఎక్కువవుతుందని చెప్ప లేదు, వచ్చేసాగా విధి లీల ఇదే. 
ఇదిగో కాఫీ తీసుకోండి
నీవు కూడా త్రాగుతూ కూర్చో, నేను చెప్పేవి విను అన్నారు గురువుగారు.

చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లో నూ  ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి. ప్రతిఒక్కరు.

తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.

వరాహం లా ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో,  అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి ప్రతిఒక్కరు.

సింహం లా మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.

మన మొదటి అడుగు భౌతికంగానూ,  రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;  
మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.

వానరుడిలా 'నిత్య లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.

శిబి లా 'నిత్య ధర్మా 'యుతంగా జీవించాలి.

రాముడిలా ప్రతిఒక్కరు ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.

'ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని' పంచాలి.

సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'. సహాయ సహకారాలతో జీవితం సాగిపోవాలి.
ప్రాణాలను నిల్పుకొనుటకు ప్రాణులను ఉదహరిస్తూ చాక్కగా జీవితం సాగె లక్షణాలు తెలిపారు. సంతోషం, ఇక విశ్రాంతి తీసుకోండి.
 నేను వంట చేసి పిలుస్తా అన్న పలుకు నే వినకుండా పడక కుర్చీలో గురక పెడ్తు పగటి నిద్ర....
నవ్వుతూ కదిలింది శ్రీమతి శ్రీదేవి
......
ఇంకావుంది.....9...

హారతి కర్పూరం....9.. వరోజు కథ ❤️
గురువుగారు, గురువుగారు నేను ఇన్స్పెక్టర్ ని ఇక్కడ శ్రీరామ్ తలకాయను జైలు గోడకు కొట్టుకుంటున్నాడు ఎందుకు అంటే ఏమీ. మాట్లాడడు, మిమ్మల్ని కలవాలని, ఏదొ చెప్పాలని అంటున్నాడు
అతని ప్రవర్తన చుస్తే మాకు భయమ్ వేస్తున్నది ఎందుకంటే జైల్లో చనిపోతే పెద్ద కేసు అవు తుంది ముఖ్యం గా భోజనం చేయుటలేదు, చొక్కా చింపు కున్నాడు, ప్యాంటూ చింపే 
మొరొక్క సారి వస్తే కొంత సర్దు కుంటుంది, రేపు కోర్టుకు తీసి కెళ్లాలి, శ్రీ రామ్ మామీద అబద్ధం చెప్పితే కష్టం, దయచేసి మీరు రా గలరు అన్న ఫోన్ పలుకు
విన్నాడు.
విషయ మేదైనా డ్రైవర్ దగ్గరే ఉంటాడు కాబట్టి వెంటనే పిలిచాడు  జైల్ దాకా పోవాలని కారు తిప్పు అని ఫోన్ చేసి  చెప్పి మరియు శ్రీమతి దేవి, నేను ఇప్పుడే జైల్ దాకా వెళ్లి వస్తా అన్ని వివరాలు తర్వాత తెలియపరుస్తా అంటూ కదిలాడు గురువుగారు.
మనసులో అనుకుంటున్నాడు కాలం ఎంత విచిత్రమైనది అతనేవరో నాకు తెలియదు, కానీ ఏదొ బంధం సహాయం చేయ మంటున్నది, ఏ నాటి ఋణాను బంధమో అర్థం కావటం లేదు, ఈ సమస్యనైనా కాలం పరిష్కారం చూపుతుంది మనలో ఉండాలసింది  ఓర్పు, ధైర్యము మాత్రమే.
 యోగా యొక్క తత్వశాస్త్రం లో చెప్పినట్లు 
*మన జీవితం, అది అంతరంలో అయినా లేదా బాహ్యమైనా, ఒక శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది ఘన పదార్థం కాదు. మన ఉనికి కదలని గట్టి రాయి లాంటిది కాదు. ఇది ఒక ప్రవాహం. ధోరణుల, కదలికల, సంస్థల యొక్క శ్రేణి. ఇది ఆచరణాత్మకంగా లోపలి మరియు బాహ్య దశలుగా విభజించబడింది. స్వతహాగా జీవితం అంతరమైనది లేదా బాహ్యమైనది కాదు. ఇది ప్రతిచోటా ఉంది. కానీ సౌలభ్యం కొరకు మనం గది లోపల ఉన్నామని చెప్పుకున్నట్లే, లోపల మరియు బయట అనే తేడాను చూపుతాము.*
*కానీ ఈ 'లోపల' అనే ఆలోచన చుట్టూ గోడ కారణంగా పుడుతుంది; గోడ ఉండకపోతే లోపల ఉన్నామని చెప్పుకోము. మనం భూమి యొక్క ఉపరితలంపై మాత్రమే ఉన్నాము, కానీ నాలుగు వైపులా గోడలు ఉన్నాయనే స్పృహ ఉన్నందున, లోపల అనే ఒక స్పృహ మరియు వెలుపలి అనే ఒక స్పృహ కూడా ఉన్నాయి. బయటి నుండి లోపలిని వేరుచేసే గోడ ఉంటే తప్ప, లోపల లేదా వెలుపల నిజంగా లేనట్లే, అంతర్గత జీవితం మరియు బాహ్య జీవితం వంటివి నిజంగా లేవు.*
ఏమిటి ఈ ఆలోచనలు నా మెదడును తినేస్తున్నాయి కారులో కూర్చొని అనుకుంటున్నాడు గురువుగారు, ఈ జీవితాల మలుపులు ఆ బ్రహ్మ ఎలా మొగుంచాడో మాత్రం ఎవ్వరికీ తెలవదు కాలం తిరిగినట్లు తిరగటమే అనుకుంటుండగా జైల్ వద్దకు చేరగా ఎదురుగా ఇన్స్పెక్టర్ వచ్చి లోపలకు తీసుకెళ్లాడు...
ఇంకావుంది..  10...
---
హారతి కర్పూరం 🌹.....10 వ రోజు 
గురువుగారు మిమ్మల్ని చూసాక నాకు కొండంత బలము వచ్చినట్లుంది నా ఆలోచనలు 
 ప్రతిసారి నన్ను వేధిస్తూ 
నా మనసు నాపై తిరగబడే టట్లు తయారు చేస్తున్నది, ఇది ఎందుకో 
మంత్రమో తంత్రమో నేర్చుకుని రమ్మంటుంది, ఎవరో పిలుస్తున్నట్లు, ఆలాపన 
 విడవడకుండా నన్ను కట్టి వేయ్యాలను కుంటుంది.
మృదుత్వపు భావాలన్ని పక్కకు పెట్టమంటుంది, దుర్మార్గపు ఆలోచనలు చేయమంటూ 
కర్క సత్వాన్ని మరి కొంత అరువు తెచ్చు కో మంటుంది. ఎందుకో మారేందుకో. ప్రేమ అని దగా చేయలేదే ఈ భయ మెందుకో.
అమృత భాండాల సంగతి మరిచి పొమ్మంటుంది, 
కాల కూట విషం మేదో అందుకొని రమ్మంటుంది, ఇద్దరం కలసి త్రాగుదామంటుంది, 
కఠినంగా .. క్రూరంగా....
మాయా ముసుగు ధరించి
నిన్ను శిక్షించ మంటుంది, ఇదెక్కడి సోద్యం 
ఆకాశమంత ప్రేమించానన్న మనసుకి 
యీ నల్లని మేఘం ఎక్కడిదో ఆ వచ్చిన స్త్రీ ఎవరో నాకు అసలు తెలవదు ఆవిడ నా భార్యను కాదు, నన్ను అంటుకున్న జిగురు, ఏం చెయ్యాలో నాకు తోచుట లేదు అందుకే తలకాయ ను గోడకు కొట్టు కున్న సమస్యకు సమాధానము దొరకలేదు తలకు రక్తము కారుతున్నది గురువుగారు, నేనే పిచ్చి పట్టినట్లు కదిలాను, ఇపుడు గత్యంతరం లేక మిమ్మల్ని కలసి చెప్పాలని ఎన్నో ఆశలు నన్ను తాకుతున్నాయ్, భామామణి ఎవరో నాకు తెలవదు, ఈ కేసు నుండి నన్ను రక్షించండి ఇంతకన్నా నేను ఏమికోరను అన్నమాటలకు గురువుగారికీ, ప్రక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ కు కళ్లంబడి నీళ్లు
 తిరిగినాయి 
🌺ఇదం లబ్ధ ఇదం నష్టం
     ఇదం లప్లేస్య పునర్థియా౹
     ఇతి చింతయతామేవ
     జీర్ణమాయుః శరీరిణామ్ ౹౹🌺
        ఇది దొరికింది,అది నష్టమైనది,దీన్ని మళ్ళీ పొందుతాను అని చింతలు పడుతోనే మనుష్యుల ఆయుష్యు క్షీణిస్తూ వెళ్లిపోయేది.
కాలం దానిగురించి ఆలోచన ఎందుకు
అసలు నీ విషయం తెలిస్తేనే కాని నిన్ను రక్షించలేను
నా విషయము ఇప్పుడు చెప్పను కోర్టు వారు చెప్పేదానిబట్టి నేను తెలుపుతాను ఇందులో వున్న గుట్టు విప్పుతాను, నాకు శిక్ష బడ్డ బరిస్తాను అన్నాడు.
శ్రీరామ్ నీమాటలు రక్షించమంటావ్ నిజం చెప్పనంటావ్
రేపు కోర్టుకు రండి మీకు తెలుస్తుంది, మ్మల్ని చూసాక నిరపరాదికి శిక్ష పడదని నా నమ్మకం
 సరే ఆ నమ్మకం మీదేవుండు ఎటువంటి అఘాయిచ్యం చేయకు, చేయను మీమీద ఒట్టుపెట్టి చెపుతున్నాను.
అంతే నిగ్రహంగా వుండు మేము సహాయం చేస్తామ, ఆహారం తీసుకో అట్లాగే
మరి నన్ను వెళ్ళమంటావా,
రేపువస్తారుగా కోర్టుకి
వస్తానని చెప్పి ఇన్స్పెక్టర్ తో కదిలారు.....
ఇంకావుంది.......11
----
హారతి కర్పూరం...11 వ రోజు కథ                                                   
ఏమండి పోయిన పని అయ్యినదా, ఏమీ అవ్వటమో రేపు కోర్టుకు పోవాలి
తప్పదా
తప్పదు 
సరే భోజనానికి రండి
ఎం చేసావ్
గోంగూర పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, చీకుడు, వంకాయ, ఉల్లిపాయ కలిపినకూర, కాకర వేపుడు, దొండ, బెండ, గుమ్మడి, క్యారెట్ బిట్రోట్, కోతిమేరా కరి వేపాకు పులుసు ఇంకా ఉన్నాయా,
ఇవి చాలవా మీకు
ఆశలు వీటి లక్షణాలు తెలుసా
మీరసలే గురువుగారు నాదగ్గరకూడా పాఠాలు చెప్పండి
వింటాను
అంత కోపమొద్దే
సరే వద్దులే
నిజంగా కోపం వస్తుంది చెప్పండి ముందు గరిట పట్టింది
ఏమిటే ఆ.. ఆ...
ఇది పులుసుకండి చెప్పండి 
కూరగాయల మనోభావాలు
ఆ మనోభావాలు
అబ్బా ఉండవే అంత తొందరొద్దు
సరే....
*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
*పొట్లకాయకి* పొగరు ఎక్కువ.. 
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
*చిక్కుడుకు* చికాకు ఎక్కువ.. 
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
*కందకి*..వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
*వంకాయకి* గర్వమెక్కువ ..
కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
*బెండకాయకి* ఆనందమెక్కువ..
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
*దొండకాయకి* ఆందోళనెక్కువ.. 
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
*కాకరకాయకి* శాంతమెక్కువ.. 
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
*బంగాళాదుంపకి* సహనమెక్కువ..
కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
*ఉల్లిపాయకి* టెక్కు ఎక్కున..
తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
*మిర్చికి* కోపమెక్కువ..
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
*బీరకాయకి* దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని...
కూరగాయల గురించి  బాగా చెప్పానా
చెప్పారు 
విన్నావా అనగానే..
విన్నాను 
అయిపోయిందా తిందామా మీ మాటలకు మంచిగా నిద్రపట్టింది
ఆ... ఆ... అన్నాడు గురువుగారు
ఇంకావుంది........12..
****

హారతి కర్పూరం --- 12  వ రోజు కథ 
కాగితంలో రాయి పెట్టి జైల్లో విసిరారు  ఎవరో, గబ గబ కాగితం తీసి చదివాడు శ్రీరామ్ 
గుర్తు పెట్టుకో ముసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలు ఉండవు, పీతలకు తలవుండదు, పాముకు చెవులుండవు, చేపలకు జీర్ణ శక్తి ఉండదు, మనుష్యులకు మనసు స్థిరముండదు అందుకే నేను చెపుతున్నా, నీవు గొంతు విప్పకుకోర్టులో, విప్పావో నీగతం మొత్తం నేను బయట పెడతాము
ఇట్లు మీ శ్రేయోభిలాషి
కాగితంలో రాయి పెట్టి జైల్లో విసిరారు  ఎవరో, గబ గబ కాగితం తీసి చదివాడు శ్రీరామ్

దేహంలో తాను ఉండడం- జడ స్త్రీ గా, ప్రేమంతో ఉండి ఒప్పడం - నిత్య  స్త్రీ గా, మనలో మర్మం ఉండటం - మంత్ర  స్త్రీ గా,  తనలో దేహం ఉండడం - జీవ  స్త్రీ గా
ఆమె ఆత్మ సౌందర్యం చూపు స్త్రీ గా, తోసు కొచ్చె వైరాగ్యం  చూపు స్త్రీ గా,  కాని దంటు కారుణ్యం చూపు స్త్రీ గా, ఉండే లేక వచ్చేంతా చూపు స్త్రీ గా
నిత్య ప్రేమ కుర్పించే చూపు స్త్రీ గా,  దిక్కు లన్ని కమ్మేసే ప్రేమ స్త్రీ గా, దాగి ఉన్న భావాన్నే తెల్పు స్త్రీ గా, చెప్పుకోని జీవమ్మే మార్చు స్త్రీ గా
దేహ మంత ముద్దుల్తో ముంచు స్త్రీ గా, ప్రేమ తోను ఆడించే  నిత్య  స్త్రీ గా,  మర్మ మాయ తో వేదిం చేటి స్త్రీ గా,  జీవ ధర్మ భావంగా  ప్రేమ స్త్రీ గా
దేహ త్యాగ మాధుర్యం  జీవ  స్త్రీ గా, నిత్య యవ్వ నమ్మేనూ పెంచు స్త్రీ గా, నిర్మ లత్వ సౌభాగ్యం పంచు స్త్రీ గా, నగ్న తత్వ శాస్త్రంమ్మే తెల్పు స్త్రీ గా
సర్వ మిచ్చి దోచేటీ కావ్య స్త్రీ గా, కొన్న బిడ్డ ఆరోగ్యం చూడు స్త్రీ గా, కన్న వారి ధర్మాన్నీ నిల్పు స్త్రీ గా, కన్న తల్లి తండ్రుల్లా చూచు స్త్రీ గా
ప్రేమించిన స్త్రీని వదలి తిరిగే వాడివి భామా మణి ఒప్పుకొని కాపురం చెయ్యి, అట్లా చేయకుండా తిరిగేవనుకో నీకు శ్రీకృష్ణ జన్మ స్థానమే దిక్కు జాగర్త 
మీ శ్రేయోభి లాషి      
ఎం చెయ్యాలో అర్ధం కాక ఈ ఉత్తరాలు గురువుగారికి చూపాలి అనుకున్నాడు శ్రీరామ్ 
--(())--


హారతి కర్పూరం......13వ రోజు కధానిక

శ్రీ దేవి ఈ రోజు కోర్టుకు పోవాలి, ఏమి జరుగుతుందో నాకు అర్ధమవుటలేదు.
శ్రీమతి పలికె మీరు ఎవరి గురించి, దేని గురించి, ఎక్కువ ఆలోచించకండి, బాధ పడకండి. 
  జీవితంలో మనకు తారసపడిన ప్రతి ఒక్కరు   మనం ఏదో జన్మలో కోరుకున్న బంధమే. 
 వారివల్ల  ఇబ్బంధులు ఎదురైనా ఎక్కువ ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోకండి. కర్తవ్యం అని భావించండి.
 ఏ జన్మ కర్మ ఫలలో అలా చేయించాయి  అనుకొని సర్దుకోండి మనసుకు చెప్పండి. శాంతిని పొంది శాంతిని పంచండి.  మనం వేసుకున్న ప్రణాళిక కంటే 
మన గురించి ఆ పరమాత్మ చేసిన  ప్రణాళిక గొప్పది మంచిది. 
 ఆ తండ్రి పై నమ్మకంతో ప్రతిక్షణం ఆనందంగా జీవించండి. అదే మనల్ని తృప్తి పరిస్తుంది. దేహములో ప్రాణమున్నంత వరకే జీవితము. 
ఏదైనా సాధన చేయవలెనంటే ఈ దేహము  ఉన్నంత వరకే. 
బంధుమిత్రులు, సిరి సంపదలంటూ సమయమంతా వాటి కొరకే వెచ్చిస్తే మానవ జీవితమును వ్యర్థం చేసుకున్నట్లే.  ప్రాణముతో కూడిన దేహములో దైవత్వము తాండవించుటకు అవకాశం ఉంటుంది. ఎన్ని అవమానములు, కష్టనష్టములు
 పడినామో తెలియదు.  దీనిని సచ్ఛింతనలతోనూ, సదాలోచనలతోనూ, 
సరైన సాధనలతో సద్వినియోగ పరచుకుంటామో లేదా వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ చేష్టలతో వృథా పరచుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి.  ఎంత ఆలోచించినా ఎంత బాధ పడిన  జరిగేది జరుగుతుంది జరగనిది ఎలాగు జరగదు. ఆ తండ్రి పరమాత్మపై భారం వేసి 
మీకు నచ్చిన భగవన్నామ స్మరణం చేసుకుంటూ ప్రతిక్షణం ఆనందంగా ఉండండీ..
అందరికీ నేను గురువయితే నీవు నాకు గురువ, నీ వాక్కు వేదవాక్కుతో సమానము, అందు కనే అన్నారు స్త్రీ వాక్కు, జీవిత పరమార్ధం అన్నారు.
ఇంకా వుంది......14
***
హారతి కర్పూరం...14 వ రోజు కధానిక..
శ్రీ రామ్ నీ ప్రవర్తన అనుమానస్పదముగా వున్నది  నీవు ఎందుకో భయపడుతున్నావు, నిజాలు చెపితే కొంతవరకు ఉపశాంతి కలుగుతుంది. ఒకనాటి గురువుగా భావించివున్నా విషయాలు వివరించి, ఎవరో వచ్చి  నీ సమస్యలన్నీ  పరిష్కరిస్తారని /
నీ కూడా నిలుస్తారని అసలు ఎదురు చూడకు, దానివల్ల ఫలితము లేదు.
నీ సమస్యల  పరిష్కారంలో....అర్ధం చేసుకుని ..నిన్ను  ఒంటరి చేయక
సాయం నిలిచే తోడు నీ..  
ఎంతో ఆలోచించి... ఎ న్నుకో ఎవరూ దొరకక పోతే...
నీ స్వశక్తి  నే నమ్ముకో పని వదిలేసి..పారిపోవడం..
.నీకే అవమానం అని  గ్రహించు కో, ఎదురు దెబ్బలు  తట్టుకుంటేనే ఆత్మ విశ్వాసం వస్తుంది.. 
గమ్యం సుగమం అవుతుంది వెనక్కి లాగే వారిని...చిన్నబుచ్చే  వారిని  పట్టించుకోక .. 
 దీరత్వాన సాగిపో విజేత వై....వెలుగు అందుకో...
బ్రతకనేది సంద్రముపై పడవ లాంటిది అయిన గమ్యాన్ని చేరటానికి, చేర్చటానికి నాయకుడు అవసరం  ఏకకాలంలో ఒకే మనంగా జీవిస్తున్న మన రెండు జీవితాలలోని
'జీవవత్ కర్మపూరిత కోణం' బయటికి కనబడితే 'సాక్షివత్ కర్మతీత కోణం' మాత్రం బయటకి కనబడకుండా (లోపలకి) ఉంటుంది.  ముందు నీవు తెలుసుకో
అనిగురువుగారు కోర్టుకు వెళ్లేముందు హెచ్చరించాడు నీ నిజాన్ని బట్టే నీ జీవితం, అది గమనించు అనారోగ్యం రెండు రకాలు - శారీరకం, మానసికం మొదటిది - మనల్ని చావుకి దగ్గర చేస్తుంది.  రెండవది - మనల్ని ఆనందానికి దూరం చేస్తుంది.
నీవు మంచివాడవని తలచి నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తాను
ముఖ్యంగా జీవునికి  జయం అన్నది  ఉత్సాహాన్ని అందిస్తే,  అపజయం అన్నది  సహనాన్ని పెంచుతుంది అందుకే జీవుని ఆత్మ పురోగతికి రెండు సరిసమానమైన కీలక అంశాలే. అర్థం చేసుకొనే మనిషి జీవనం సులభతరం,
ఇంకావుంది....15..
***
హారతి కర్పూరం..15  వ రోజు కధానిక 
*అబద్ధం అరచు కుక్కలాంటిది, కరవ లేదు కానీ భయ పెడుతుంది. నిజం నిగురుగప్పిన నిప్పు నిలకడగా వుంటుంది, చాపకింద నీరుల జారుతుంది, నిజం అర్ధ మవ్వక పోయినా నమ్మదగినది, అబద్ధం అర్ధమయినా అప్పడి కప్పుడు తృప్తి పరచు, అబద్ధం అద్దం కాజాలదు, సూర్య చెంద్ర నక్షత్ర గమనాలను మార్చ జాలదు, కేవలం కొన్ని పరిస్థితులలో అబద్ధం నిజంపై గెలవ గలదు. సత్యం జ్వలిస్తూనే ఉంటుంది, ధ్వనించే అబద్ధాన్ని దహిస్తూ నే వుంటుంది*.

*ఏది ఏమైనా అబద్ద మాడినా, నిజం దాచినా ఆకలిగా నున్నప్పుడు ఆహారం దొరకదు, అలసట వున్నప్పుడు నిద్రరాదు, కష్టాల్లో స్నేహము ఆదుకోదు, మృత్యువు వచ్చినా బంధువులు బ్రతికించ లేరు, కనుక శ్రీ రామ్ నీవు నిజాన్ని దాచుతున్నావు, అబద్దాన్ని నమ్ముతున్నావు*.

నీవు జైల్ నుండి బయటకు రావాలంటే నీలో వున్న నిజాన్ని కక్కితేనే ఎవరయినా సహాయము చేస్తారు, అందరూ డబ్బుకోసం పనులు చేస్తారని అనుకోకు, పరిస్థితులను బట్టి గుణమును బట్టి, తల్లి తండ్రుల బట్టి సహాయము చేస్తారు అదిమాత్రం గమనించు, గురువుగారు గురువుగారు అన్న మాత్రాన గురువుగారు ఆపదలో సలహాలిస్తారు, ఎవరికీ వారు నెమరు వేసు కొనే జంతువులాగ ఉండక అసలు విషయం తెలిపిత మంచిది.
 *వివక్షత చూపే లోకంలో అమానుషత్వం పెరిగి పోతున్నది, సమానత్వం, సమాజసేవ, సహజ తత్వం అనే వారు కానరారు. స్వార్ధం దుర్బద్ది రాజ్యం ఏలుతుంది.*
*ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. వాటిని పట్టించు కోక దులుపుకొనుటే*
         *జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. మంచిగా మారుటకు మూలమౌతుంది*
         *ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. భవిష్యత్తుకు పునాది అవుతుంది*
         *చెడుని దులుపుకు పోవాలే గాని నుదుటికి రాసు కోకూడదు.స్థిరమైనది ఏదీ లేదు*
           *నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచు కుంటుoది. పతనమవకుండా జాగర్తగా ఉండటమే మూలమౌతుంది*
           *కానీ అందమైన వ్యక్తిత్వం చుట్టూ వున్న వారి మనసును కూడా దోచు కుంటుoది.*
ఇంకా వుంది.....  16   
****
హారతి కర్పూరం...16.... వ రోజు 
మల్లాప్రగడ రామకృష్ణ 

గురువు గారు కోర్టుకు తెచ్చిన భామామణి, శ్రీ రామ్ ను  కలిశారు, మీరు నిజాలు కోర్టుకు తెలపగలరు. మీ మధ్య ప్రేమ వివరాలు  అందులో నిజా నిజాలు బయట పడ గలవు.

ప్రేమంటే బంధం, అది  కన్న వారి నడుమ, తోడ బుట్టిన  వారి నడుమ, రక్త సంబందీకుల  నడుమ, స్నేహ సంబంధాలా నడుమ, చుట్టు పక్కల వారి నడుమ, సమాజము పట్ల, భక్తి పట్ల, దేశము పట్ల, చేసే వృత్తి పట్ల ఇలా  రకరకాల  దాని  ఒక  ఆకర్షణ, ఆత్మ బంధమే,   ఒక ఇష్టం  ఒక ప్రత్యేక  అభిమానం  ఏర్పడడమే ప్రేమ.

ఇక ప్రేమికుల విషయాని కొస్తే అపరిచితులను   కాలక్షేపం కొరకు, అవసరాలకు  ప్రేమ అనే ముసుగును తగిలించుకొని అలాంటి వారితో  పెళ్లి అనే బంధము  వేసు కుంటే  పొరపాటు మనసులు కలవాలి, ఇరువురి అభిప్రాయాలూ, ఆదర్సాలు ఒక టవ్వాలి కలిసి జీవిద్దాము  అనుకుని పెళ్లిచేసుకుని, ఎన్ని  కష్టాలు  ఎదురైనా, జీవితము  పూలబాట  కాదు,  ముళ్ళు కూడా  వుంటాయని  తెలుసుకుని, ఇరువురు ఒక్కటిగా  కలిసి జీవించడానికి  సిద్దపడాలి, అదీ  నిజమైన  ప్రేమ.

నేటితరం   ప్రేమంటే  తాత్కాలిక సుఖం  అనుభవించడం ప్రేమ  అనుకుని  తరువాత బ్రేకప్ అంటూ  పాచ్ఛాత్య  పదం వాడుతూ, విడిపోవడమో పెళ్లిచేసుకుని  కాళ్ల పారాణి అరకుండానే  కోర్టు మెట్లు  ఎక్కడం నిజమైన  ప్రేమ అని పించు కోదు.

ప్రేమకు చిహ్నం  పావురాలు అంటారు, హృదయాలు కళయక అంటారు.   
కారణం  ఆడ మొగ  పావురాలు  ఒక్కసారి  కలిసి  జీవించాయంటే  పొరపాటున  కూడా  విడిపోవు మరణించేoత వరకు కలిసి వుంటాయి. అందుకే  అన్యోన్య oగా వుండే  ప్రేమికులను  చిలుక గోరింకా అంటారు. అవికూడా కలిసాయి అంటే విడిపోరు.
అదీ ప్రేమ అంటే. మీరిద్దరూ నిజమైన ప్రేమికులని భావించ గలను కానీ నాకు మీఇద్దర మధ్య ఏదో రహస్యం ఉందని నేను అను కుంటున్నాను. కోర్టులో నిజాలు చెప్పండి అంతకన్నా నేను కోరేది ఏమిలేదు అంటూ గురువుగారు కదిలారు.

ఇంకావుంది...17  ...
 
***
హారతి కర్పూరం --- 17  వరోజు  

ప్రార్థించే ముందు.. నమ్ము. నమ్మకమే నిజమైన ప్రేమ 
మాట్లాడే ముందు.. ఆలకించు.. అప్పుడే మాటలలో పటుత్వం ప్రేమ 
పొందే ముందు.. సంపాదించు.. అదియే నిన్ను ఆదుకొనే ప్రేమ  
రాసే ముందు.. ఆలోచించు..వ్రాతలు హృదయాన్ని తాకే ప్రేమ   
నిర్జీవమయ్యేలోపు.. అందరి గుండెల్లో జీవించు... అదే ప్రేమ,  ప్రేమ, ప్రేమ 

   *మనమే ప్రేమ... మనం పొందేది ప్రేమ... మనం కోరుకునేది ప్రేమ... మనం పంచేది ప్రేమే...* అంటే *మనం  ప్రేమ కొరకు ప్రేమ కోసం ప్రేమమయమై ఉన్నాము..* అనేది నిర్వివాదాంశం... *మనచే వ్యక్తీకరణ జరుపుతున్నదంతా ప్రేమే ... విశ్వజనీనమైన ప్రేమ ద్వారా...

            విశ్వజనీనమైన ప్రేమ,  ప్రేమ గురించి తెలియని వారు ఉండరేమో బహుశా ఈ ప్రంచంలో... 
             కానీ మనము అనుభూతి చెందే ప్రేమ విశ్వజనీనమైన ప్రేమ ఒక్కటేనా...?? 
ఒక్కటే అనుకుంటే ఇన్ని అంతరాలు ఎందుకున్నాయి ..?? అసలు ప్రేమలో ఉన్నతమైన స్థితి ఏమిటి...?? 

        ఉత్పత్తి ఉనికి వృద్ధి పక్వము క్షీణము అంతము అనే ఆరు వికారాలు, శరీరంలో ఏర్పరిచి తాను ఏవీ పొందనివాడు, మజ్జ అస్థి శుక్ల రక్త చర్మ మాంస అనబడే ఆరు సంచులతో తోలుబొమ్మను సృష్టించి,  ఆట ఆడించి, సాక్షిగా ఉన్నవాడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు  అనే ఆరు శత్రువులు నశించే దేహంలో దాచేసి, జీవులు వాటితో చేసే యుద్ధాన్ని వీక్షించేందుకు తాను కూడా దేహంలో దాగుకొని.  హృదయమందు స్థితి(చైతన్యంమై) కలిగి ఉన్నవాడు విచారణకు అనుజ్ఞ ఇచ్చి సందేహం తొలగించు పరమాత్మా అదియే ప్రేమ అదియే నమో విఘ్నేశ్వరాయ,  నమఃశివాయ ,నమోనారాయణాయ అది కూడా భక్తి ప్రేమ 

          మనకు తెలిసిన ప్రేమను గురించి చూద్దాం... మొదటిగా మనకు ప్రేమ పరిచయం అయ్యేది తల్లితండ్రుల నుండి తరువాత కుటుంబ సభ్యుల నుండి ఆ తర్వాత స్నేహితుల నుండి... ఇంకా ముందుకు వెళితే మనం ఏర్పాటు చేసుకునే కుటుంభం నుండి.. వీరి మధ్య ఉన్న బంధం ఎలాంటి చర్యలైనా అంగీకరించే స్థితి ఉంటే లేదా క్షమించే స్థితి ఉంటే అక్కడ ఆ బంధాన్ని ప్రేమ అని మనం అనుకుంటున్నాం... ప్రేమ అనేది వస్తువు కాదు, రూపు లేదు, శేబ్దం చేయదు,  ప్రేమకు ఎలాంటి వాసనా లేదు... మరి ప్రేమను ఎలా దర్శించుట ఎలా...? 
చెప్పనలవి కాదు... మరి  ప్రేమ, వయసే ప్రేమ, వలపేప్రేమ, వనుకే ప్రేమ,  

ఇంకా వుంది....18 ... 
***

హారతి కర్పూరం...18 .. రోజువారి కధ

కోర్టులో సమయం 10 -౦౦ గంటలు కావస్తున్నది, అప్పుడే జడ్జ్గారు రావటం జరిగింది 
వేనని కేసు వివరాలు తెలియ చేశారు లాయర్ గారు 
కేసు వివరాలు తెలియపరచి భామామని పిలవని చెప్పగా 
     
భామామణి, భామామణి, భామామణి  అని పిలవగా 
భామామణి : భగవద్గీత ప్రమాణం చేసి,  చేయిపెట్టి అంతా నిజమే చెపుతాను, అబద్ధం చెప్పను   
లాయరు : శ్రీ రామ్ మిమ్మల్ని మోసం చేసాడా?
భామామణి: నన్ను పెళ్లి చేసుకొని నరక యాతన బెట్టి, హింసించి, ఇష్టారాజ్యంగా వాడుకొని, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి,  నాకు కనబడ కుండా తిరుగుతున్నాడు 
నాకు న్యాయం చేయ మన్నది. 
న్యాయ మంటే ? 
భామామణి: నాభర్త నాతోనే ఉండాలని కోరుతున్నాను. 
లాయరు : ఎవరియిప్రేమించాడు వారి వివరాలు చెప్తారా ?
భామామణి : నాకు తెలవదు, ఒక సారి సినిమాకు వెళ్ళినపుడు చూసాను 
లాయరు : మీరు వెళ్ళారా 
భామామణి  : ఇట్రవెల్ ల్లో ఆ అమ్మాయితో మాట్లాడటం చూసాను 
లాయరు: నివ్వెమ్ తప్పు చేసావు, ఆ అమ్మాయి తో తిరగటానికి ?       
భామామణి  : ఆ అమ్మాయితో తిరిగితే సస్తానని బెదిరించాను, కానీ మర లేదు. 
లాయరు: మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయినది ?
భామామణి : 8 సంవత్సరాలు      
లాయరు : పిల్లలు న్నారా    
భామామణి: ఉన్నారిద్దరు 
లాయరు : వారి పోషణకు డబ్బు అడుగుతున్నావా 
భామామణి: లేదు జీవిత భాగస్వామి కొరకు మాత్రమే?
లాయరు : ఇక మీరు వేళ్ళ వచ్చు 
ఇన్ స్పెక్టర్: భగవద్గీత ప్రమాణము చేసి,  చేయిపెట్టి అంతా నిజమే చెపుతాను, అబద్ధము  చెప్పను.  
లాయర్ : భార్య ఉద్దేస్వయం తెలిపింది కదా మీరు శ్రీరాంకు శిక్ష వేయమని అన్నారు దేనికి?  
ఇన్ స్పెక్టర్: ముందు నలుగురు భార్యలను రకరకాల విధముగా చంపినట్లు మాకు గతంలో హత్య చేసినట్లుగా మాకు కొన్ని ఆధారాలు దొరికినాయి, అవి పొందు పరిచాము, అవి పరిశీలించి సరిఅయిన శిక్ష వెయ్యాలని కోరినము, 
లాయర్ : ఇతను ఇంకేమైనా మోసం చేశాడ 
ఇన్ స్పెక్టర్: అన్ని వివరముగా కోర్టులో పొందుపరచాము  
లాయర్:   ఇక వెళ్ళవచ్చు  
లాయర్ : ఇప్పుడు ఆమె భర్తను కోరుతున్నది, కాపురం చేయటానికి విడిచి వెళ్ళద్దన్నది, ఆమె ఎటువంటి సంపద కొరతలేదు అనిచెప్పి వాదన ముగించారు. 

 హారతి కర్పూరం ... 19-- . 

గురువుగారు  (శీలం ) గురించి ఈ విధంగా తెలియయపరిచారు 

మనిషిలో కళల చేతలు, మాటలు, సక్రమ పద్ధతిగా ఉన్న విలువలు పెరుగుతాయి,. దీనికి ప్రకృతి సహకారం ఉంటుంది. మనసు ప్రశాంతిగా ఉండి, దైవ కృపతో, ఆరోగ్యంగా, ఉండ గలుగుతారు. లోకంలో జరిగే విషయాలకన్నా మనలో ఉన్న జ్ఞానము, ఎంతమందికి అందించగలిగాము, ఎంతమందికి, ఉపయోగపడింది అనేది గ్రహించి, నడక సాగిస్తే అంతా శుభమే         

అంద చందా లంటూ ప్రకృతి అందించిన అందాలు మరచి కుత్రిమముకు ఆశపడుతున్నారు లోకపు జనులు ఉదా : పూల (వంటి స్త్రీల) ను చూసి నలిపి మింగేయాలని ఆశపడుతున్నారు అందుకే నేను చెపుతున్నా 

"తరువుల ఎంత అవసరమో స్త్రీలు అంతకన్నా ఎక్కవ అవసరము అది తెలుసుకోండి 
ఆనందం, ఆరోగ్యం, ఆద్యాత్మికం అందాలంటే ఆ శ్రీ పరమాత్ముని ప్రేమిద్దాం, ఈ సృష్టి అందించిన వాటిని ప్రేమించి ఆదరించి బ్రతికి బ్రతికించు కుందాం అదే నీకు సంతృప్తి నిస్తుంది అదే లక్ష్యం నిన్ను ముందు నడిపిస్తుంది.

ఓ మనిషి నీవు చెంత లేదని తగినంత జ్ఞాన సంపద అనవద్దు, అనుకోవద్దు,  చింత పడుచు వింత చేష్టలతో కాలంబును వృధా చేయుటకంటె, నీకున్న జ్ఞాన సంపదతో, ఒక్కరికైనా నీలోని మాటలు తెలుపు, అదే నీకు రక్ష, నీలో ధైర్యం నింపటానికి అదే మార్గం.     

అందుకే నేను చెపుతున్నా గురువుని మించిన దేవుడు లేడు, తల్లిని మించిన దైవంలేదు నీలో ఉన్న బలహీనతను బయట పెట్టు, దానిని మరచి తల్లితండ్రులు,  గురువు చెప్పిన సలహాను  చదువుతో వృద్ధిలోకి రాగలను నమ్మకంతో నడుం బిగించి ముందుకు సాగు అదే నీకు రక్ష 
(అందుకే నేను చెపుతున్నా చేతలు, మాటలు, ఆలోచనలు ఒకటిగా ఉంటే శీలం ఎప్పటికి చెడిపోదు ఆ దిశగా మారండి  ) 
ఇంకా వుంది.... 20  
******

 

    
శ్రీరామ్ : భగవద్గీత ప్రమాణం చేసి,  చేయిపెట్టి అంతా నిజమే చెపుతాను, అబద్ధం చెప్పను లాయర్ :  నలుగురి భార్యలను చంపావా                  
శ్రీరామ్ : నాకు గుర్తు లేదు 
లాయర్ : ఉన్న భార్య భామామణి కి న్యాయం చెయ్యాలని లేదా ? 
శ్రీరామ్ : ఉంది అది మీ పని  
లాయర్ : అర్ధం కాలేదు 
శ్రీరామ్ : శ్రద్ధగా వింటే మీకె అర్ధం అవుతుంది 
లాయర్ : తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా 
శ్రీరామ్ : నేను మీకు చెప్పనా  
లాయర్ : సరే నీ భార్యతో కాపురం చెయ్యక తిరుగుటం దేనికి   
శ్రీరామ్ :  కుటుంబ విషయాలు కోర్టులో చెప్పాలా ?
లాయర్ : హత్య చేసినట్లు ఆధారాలు వున్నాయి, ఒప్పుకుంటున్నావా
శ్రీరామ్ : అంతా నమ్మకముంద0టే శిక్ష వేసే హక్కు మీకుంది కదా     
 ఈ కేసువిచారించుటకు రేపు ఉదయం అనుమతించబడినది ఈ రోజు కోర్టు ముగింపు. 

ఇంకావుంది ..... 11

.....

హారతి కర్పూరం...11 .. రోజువారి కధ

లాయరు:  భార్యలను చంపుట కారణం ప్రేమ అని అనచ్చా 
శ్రీ రామ్: ప్రేమ గురించి కొన్ని వాక్యాలు తెలుపుతాను అనుమతిస్తారా ? 
జడ్జ్ : అనుమతి ఇస్తున్నాము
శ్రీ రామ్:   ప్రేమంటేనే స్త్రీ . స్త్రీ అంటేనే ప్రేమ. అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకేఒక్క స్త్రీమూర్తి . ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని అనుకుంటారు భ్రమిస్తారు.అంతే. లోకంలో ఉన్నవి కామమూ స్వార్ధమూ మాత్రమే. ప్రేమనేది ఈలోకంలో లేనేలేదు. లోకులకెవ్వరికీ ప్రేమ అనేది తెలియనే తెలియదు. తెలుసనుకుంటే అది పిచ్చిభ్రమ మాత్రమె. కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు. కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరి కొంతమంది అభిమానాన్ని ప్రేమనుకుంటారు. ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువ మంది కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నిటి వెనుకా ఉండేది మాత్రం స్వార్ధమే.
 
"లోకంలో భర్తను ప్రేమించేది భర్తకోసం కాదు. ఆత్మ కోసమే. భార్యను ప్రేమించేది భార్యకోసం కాదు. ఆత్మకోసమె. సంతానాన్ని ప్రేమించేది సంతానంకోసం కాదు. ఆత్మ కోసమే."
లాయర్ : ప్రేమను ద్వేషిస్తున్నావా ?
శ్రీ రామ్: నేను అనలేదు 
లాయర్ : మీ మానసిక ఆరోగ్యంగా లేరనుకోవచ్చా ? 
శ్రీ రామ్: మీ వైధ్యుణ్ణి పరిశీలించుకోండి నేను పూర్తీ ఆరోగ్యంగా వున్నాను , మీరడిన వాటికీ సమాధానములు చెపుతున్నాను 
లాయర్ : కావాలని కావాలని కోర్టుని తప్పు త్రోవ పట్టుస్తున్నాడు మరలా విచారించుటకు గడువు కోరుతున్నాము          
ఈ కేసువిచారించుటకు 7  రోజులు అనుమతించబడినది ఈ రోజు కోర్టు ముగింపు. 

***

మీవిధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

1, ఫిబ్రవరి 2023, బుధవారం

***



నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (1)


ఏదొ నీకును చెప్ప కుండగ ఏదొ దాచిన బాధ్యతే, అందుకే మన మధ్య శోద్యము అంతకంతకు మారునే, నాకు నీవును అర్ధ మవ్వక నేను నీకును బంధమా, నిద్ర పోయిన లేప కుండిన నాది తప్పుయె అందువే అంటూ భార్యతో పలికాను సర్వ యంత్రము మౌన మవ్వును సర్వతంత్రము లీనమై, గొప్ప వైనను తెల్ప లేకను గోప్య మవ్వుట తీవ్రమై, సంఘ మందును వాడు కొందుకు సమ్మ తమ్ముగ ఉందిలే, విశ్వ మాయను మార్చ లేకయు విశ్వ మోహము తప్పదే నాతో పలికే నా శ్రీ మతి నిద్రలో 'మనిషి' ఉండడు., మెలకువలో 'దేవుడు' ఉండడు. నాకు అర్ధంకాలేదు  కొద్దిగా తెలిస్తే వివరించగా తలుపులే శ్రీ మతీ అంతలేదు అయినా తెలిసింది తెలియ పరుస్తాను లే నీదు కోవెల లోపలే లును నీదు భావము నిన్ను లో, నిద్ర పోకయు ఉధ్ధ రించుట నగ్న మవ్వుట కోర్కలే, నిర్మ లమ్ముగ ఉంచ నియ్యక నిన్ను నన్నును హాయిగా, ఉండ నియ్యదు మన్షిమన్షిగ ఉర్కు పర్గులు గుండెకే. అందుకే నిద్రలో మనిషి ఉండడు. మరిమెలుకువలో దేవుడు ఉండడు అంటే అదీ చెప్పు ఈ మట్టి బుర్ర కు కొద్దిగా ఆయినా అర్ధమవుతుంది.  కాస్త ఓపిక పెట్టండి శ్రీ వారు తొందరపడితే ఏమీ అర్ధంకాదు, ఇదేమి తొందర చేస్తే కరగిపొయ్యేటి మనసు కాదు. ఏదైన దేవుని లీలలు మనకర్ధం కావు.

మానవ జన్మలో - మనుగడ ముఖ్యము, మనసును మాయతొ - ముంచి వేయు

విశ్వాసపు పరీక్ష - వింతగా మారును , విజయము ప్రశ్న గా - వీధి పడును

జయము నిన్నునుఆపు - జాడ్యము నీవెంట, ప్రేమయనునది యే - పాద్య మవ్వు

అభిమాన భావమ్మ - అందరిలో ఉండు, అయినను కాలము - బట్టి మార్చు

గౌరవముతో ను పెరిగియు - గాధ తెల్పి , గమ్యము ఇదియే వాదన - వద్దు ఎపుడు

ఆత్మ విశ్వాసం వ్యక్తిపై - మరులు కురిసి, పంచభూతాల సాక్షిగా - పగలు రేయి

అందుకే మెలుకువలో దేవుడు ఉండడు పగలు రేయి కష్ట పడుతూ నిద్రపోతాడు ప్రాణుల గుండెలో అని తెలిపే శ్రీ మతిగారు శ్రీ పతితో కాస్త కాఫీ ఇస్తావా అయ్యో రామా మర్చా, ఃఃఇప్పుడు తీసుకొస్తా

......

నీ మాటల కన్నా కాఫీ రుచిగా ఉంది  అవునా....అయితే కాఫీ త్రాగండి మాటలతో పనియేమిటి. నీవు అలా చెపుతూ ఉంటే మనసు ఎటో పోతుంది అంతపని చేయకండి, మీ మనసు నాకు తెలియదా అవునే నామనసు నీకు తెలుసా....... ఏదో చెప్పు  ముసి నవ్వులు తో మురిపిస్తూ కదిలింది శ్రీ మతి *****

***


ఉద్యంతు శతమాదిత్యా ఉద్యంతు శతమిందవః ౹

న వినా విదుషాం వాక్యేర్నశ్యత్యాభ్యంతరం తమః ౹౹🌺

       వంద సూర్య చంద్రులు పుట్టిరానీ, విద్వాంసులైన జ్ఞానుల మాటలు వినకుండా ఆత్మ జ్ఞానానికి అంటిన చీకట్లు తొలగిపోవు.

           29-5-2023...

*ఒక చక్కని ఏకాక్షర శ్గ్లోకము 

యాయాయాయాయాయాయాయా  యాయాయాయాయాయాయాయా |

యాయాయాయాయాయాయాయా  యాయాయాయాయాయాయాయా ||

పదవిభాగం 

యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా. 

తాత్పర్యం

భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు  మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం. 

(శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి)

చక్కని పై  శ్లోకాన్ని అందించిన శ్రీ కంది శంకరార్యులకు నమస్కారములు

***

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమే కాంత మియంత మర్ధం!

అవిస్మృతి స్త్వ చ్చరణార విందే భవేభవే మేస్తు భవత్ప్రసాదాత్!!

భావం:-

( శ్రీ కులశేఖర మహారాజు - మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి , రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము  పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీ కులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు ఈ శ్లోకం "ముకుంద"తో ప్రారంభమగుట వలన "ముకుందమాల" అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై   ఉంది అని  పెద్దలు చెప్పుదురు ).

ఓ ముకుందా ! నీ పాదార విందములను జన్మ జన్మ మూల నేను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నీ ఎదుట శిరస్సు వంచి, మోకరిల్లి ఈ కోరికను కోరుకుచున్నాను. 

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

......

శ్లో𝕝𝕝 విపత్తౌ కిం విషాదేన  సమ్పత్తౌ హర్షణేన కిమ్।

భవితవ్యం భవత్యేవ కర్మణో గహనా గతిః॥

తా𝕝𝕝 ఆపదలలో దుఃఖించడం ఎందుకు, సంపదలలో సంతోషించడం ఎందుకు? ఏది జరగనున్నదో అది జరిగితీరుతుంది....కర్మగతిని ( ఏ కర్మ ఎపుడు ఏ ఫలం ఇస్తుందో ) తెలుసుకోవడం కష్టం....

----


*శ్లో𝕝𝕝 ఏక ఏవ పదార్థస్తు* *త్రిధా భవతి వీక్షితః|*

*కుణపం కామినీ మాంసం* *యోగిభిః కామిభిః శ్వభిః||*

*తా𝕝𝕝 మానవ శరీరాన్ని... కనుక పరికించి చూస్తే యోగికి తోలుతిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసపు ముద్దగా ఎలా కనిపిస్తుందో, అదే విధముగా పదార్థము ఒక్కటే అయినా, వారి చూపును/ భావనము బట్టి పలురకాలుగా కనిపిస్తుంది/అనిపిస్తుంది .... అనగా అంతా మన చూపులోనే/భావనలోనే ఉంది అని భావము.*

---------------

🌺షట్కరణో భిద్యతే మంత్రశ్చ       తుష్కర్ణ: స్థిరో భవేత్ ౹

     తస్మాత్సర్వ ప్రయత్నేనః      షట్కర్ణం వర్జయేత్సుధీ ౹౹🌺

     ఆరు చెవులలో మాటలు పడితే అది రట్టువడమే.అయితే నాల్గు చెవులకు పడినది కాబట్టి గట్టి రహస్యమవుతుంది.అందువల్ల బుద్దిమంతుడైన వాడు చేసే ప్రయత్నాలన్నీ చేసి ఆరు చెవులను తప్పించాలి.

---------------

🌺నాపృష్ఠహ కశ్యతదబోయాత్      న చాన్యాయేన పృచ్ఛతః ౹

     జానన్నపి హి మేధావి      జడవల్లోక ఆచరేత్ ౹౹🌺

     నిన్ను ఏమి అడగనపుడు ఏమి చెప్పకూడదు.అహంకారంతో అడిగేవాడికి జవాబు చెప్పరాదు.అలాగే,విద్యావంతుడు చాలా విషయాలు తెలిసిన వాడైనప్పటికీ లోకంలో ఏది తెలియనట్టే మౌనంగా ఉండాలి.

---------------

🌺న యత్రాస్తి గతిర్వా      రష్మీనాం చ వివస్వతః ౹

     తత్రాపి ప్రవిసత్యాశు      బుద్దిర్బుద్ధిమతాం సదా ౹౹🌺

     గాలి చలనం ఎక్కడెక్కడ ఉండదో,ఎక్కడ సూర్యుడి కిరణముల ప్రవేశము ఉండదో అక్కడకూడా బుద్దిమంతుల బుద్ధి ఎపుడైనా సరే వేగంగా ప్రవేశిస్తుంది.

---------------

🌺న యత్రాస్తి గతిర్వా      రశ్మీనాం చ వివస్వతః ౹

     తత్రాపి ప్రవిసత్యాశు      బుద్దిర్బుద్ధిమతాం సదా ౹౹🌺

     గాలి చలనం ఎక్కడెక్కడ ఉండదో,ఎక్కడ సూర్యుడి కిరణముల ప్రవేశము ఉండదో అక్కడకూడా బుద్దిమంతుల బుద్ధి ఎపుడైనా సరే వేగంగా ప్రవేశిస్తుంది.

---------------

🌺పంకోద్భవం న చ విమర్దసహంసద్భవ      శైవాలజాలసహవాస విడంబితం చ౹

     ఇందీవరం దినకరేణ మహాశయేన      సంభావితం భవతిభాజనమిందిరాయా: ౹౹🌺

     తామర పువ్వు బురదలో పుడుతుంది.చాలా మృదువు.కేవలం స్పర్శతో ముడుచుకుంటుంది.పాచిలో ఉండటంతో అవమానమే.అయితే సూర్యుడితో గౌరవించడమువల్ల లక్ష్మికి కూడా ఆశ్రయంగా ఉంది.సూర్యుడివలన వికసించి చూడటానికి అందంగా ఉంటుంది.అలాగే మహావ్యక్తుల ఆశ్రయం పొందినవారు ఎటువంటి హీనస్థితిలో ఉన్నా గౌరవం పొందటానికి అర్హులే.

---------------

🌺బాలో వా యది వా వృద్ధో      యువా గృహమాగతః ౹

     తస్య పూజా విధాతవ్యా      సర్వత్రాభ్యాగతో గురుః ౹🌺 

                    బాలుడవని,వృద్ధుడవని,యువకుడవని ఇంటికి వచ్చిన వాడికి సత్కారం చెయ్యాలి.అభాగ్యుతుడైన వాడు ఎప్పుడు గురుతో సమానము అవుతాడు.

----------------

🌺పూర్వ జన్మకృతం కర్మ       తద్దైవమితి కథ్యతే ౹

      తస్మాత్పురుష కారేణ       యత్నం కుర్యాదతంద్రితః ౹🌺

       పూర్వ జన్మలో చేసిన కర్మ ఏదైనా దాన్ని దేముడు ఇచ్చిన అదృష్టంగా చెపుతారు.కావున  సోమారితనము లేకుండా పురుష ప్రయత్నాలు చెయ్యాలి.

----------------

🌺దోషాకరోsపి కుటిలోsపి       కలంకితోపి       మిత్రావసాన సమయే 

      విహిత్యోదయోsపి౹       చంద్రాస్తథాపి హారవల్లభ       తాముపైతి

      నైవాశ్రితేషు మహతాం దోషాశంకా ౹౹🌺

           చంద్రుడు వక్రుడై ఉండవచ్చు,కళంకితుడై ఉండ వచ్చు,స్నేహితుడైన సూర్యుడు అస్తమించే సమయములో పుట్టవచ్చు,అయినా...అతను శివుడికి ప్రియమైనవాడే.పెద్దవాళ్ళు ఆశ్రయం ఇచ్చిన మీదట ఆశ్రితులలో ఉన్న దోషాలను గురించి ఎవరూ సందేహించ రాదు. 

---------------

🌺దాతా లఘురపి సేవ్యో భవతి      న కృపణో మహానపి సమృద్ధ్యా ౹

     కూపోsతః స్వాదుజలః       ప్రిత్యేఐ లోకస్య న సముద్రః ౹౹🌺

     దానము చేసేవాడు తక్కువైనా తీసుకుందుకు తగినవాడు.సిరి సంపదలలో పెద్దవాడైనా లోభి అర్హుడుకాడు.నూతిలో ఉన్న తీపి నీరు ప్రపంచానికి ప్రేమతో మెప్పించ వచ్చు.అయితే సముద్రపు నీరు అలా మెప్పించలేదు

---------------

🌺క్లేశో మహాన్ విలంబే స్యాత్      ప్రజానాం న్యాయనిర్ణయే ౹

     గరిష్టo కాలమానం స్యాద్      ద్విమాసం న తతోsధికమ్౹౹🌺

       సకాలములో న్యాయాన్ని ఇవ్వకపోతే ప్రజలు చాలా కష్టములు ఎదిరించాల్సి వస్తుంది.అందుచేత కేవలం రెండు నెలల్లో తీర్పు చెప్పే రీతిలో న్యాయ వ్యవస్థను ప్రతిష్టాపించాలి.దానికన్నా ఎక్కువ ఆలస్యం అవ్వకూడదు.

..........

🌺ఘాతయితు మేవ నీచ      పరకార్యంవేత్తి నా ప్రసాదయితుమ్ ౹

     పాతయితుమస్తి శక్తి:      వాయోవృక్షం నా చోన్నమితుం ౹౹🌺

   నీచులకు పరర కార్యాలను పాడు చేసేది ఎలా అనేది మాత్రం తెలిసి ఉంటుంది,అంతే కానీ దాన్ని ఎలా ఉత్తమంగా చేసేది అనేది తెలియదు.చండమారుతానికి వృక్షాన్ని కూల్చే శక్తి ఉందేకానీ  వృక్షాన్ని నిల్పే శక్తి ఉండదు.

...........

🌺అశనాదింద్రియాణీవ స్యు:      కార్యాణ్య ఖిలాన్యపి ౹

     ఏతస్మాత్కారణాద్విత్తం      సర్వసాధనముచ్యతే ౹౹🌺

        ఇంద్రియాలు ఆహారం సేవించుటవల్ల ఎలా పనులు చేస్తాయో అలా అన్ని పనులు డబ్బుతో నడుస్తాయి. అలాగని డబ్బే ప్రతి పనులకు సాధన అని చెపుతారు.

.........

🌺సర్వం కర్మేదమాయత్తం      విధానే దైవమానుషే ౹

     తయోరదైవ మాచింత్యం తు      మానుషే విద్యతే క్రియా ౹౹🌺

      అన్ని రకాల మంచి చెడ్డలు  అదృష్టం మరియు మానవ ప్రయత్నాలను అనుసరించి ఉంటాయి.వాటిల్లో ఏది అదృష్టమనే విషయం మనిషి తెలుసుకోలేడు.అయితే,మనిషి తన ప్రయత్నాలను ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చు.

....

**శ్లో* 𝕝𝕝 *పృచ్ఛకో మార్గదర్శీ చ*   *ధైర్యశాలీ విదూషకఃl*

*విశ్వాసీతి సుహృద్భేదాః*  *నరస్యావశ్యకా ఇహl|*

తా𝕝𝕝 *ప్రశ్నించేవాడు, సన్మార్గం చూపువాడు, ధైర్యం చెప్పేవాడు, నవ్వుతూ నవ్వించేవాడు, నమ్మకస్తుడు అను ఈ అయిదు రకాలైన మిత్రులు ఈ లోకంలో మానవుడికి ఉండాలి.*.....

.........

🌺కాలశాస్త్ర వినోదేన      కాలో గచ్ఛతి ధీమతాం ౹

     వ్యసనేన తు మూర్ఖణాం      నిద్రయా కలహేన వా౹౹🌺

        బుద్దిమంతులు కావ్య శాస్త్రాలను చదవడం వల్ల కాలం గడిపితే,మూర్ఖులు వ్యసనాలతో,నిద్రతో,పొట్లాటలతో కాలం గడుపుతారు.ప్ర్రాచిన ఒక కవి అభిప్రాయ ప్రకారం ప్రజలు తాము వెళ్లలేని ప్రాంతములలో,తమకు అయ్యేవి,అవ్వని అనుకూలాలు గురించి ఎవరో అధికారి చేసిన,చెయ్యని పనుల గురించి చర్చలు చేస్తూ కాలాన్ని సదుపయోగం చెయ్యకుండా కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ వుంటారు అని అన్నారు.

........

🌺కాలశాస్త్ర వినోదేన      కాలో గచ్ఛతి ధీమతాం ౹

     వ్యసనేన తు మూర్ఖణాం      నిద్రయా కలహేన వా౹౹🌺

        బుద్దిమంతులు కావ్య శాస్త్రాలను చదవడం వల్ల కాలం గడిపితే,మూర్ఖులు వ్యసనాలతో,నిద్రతో,పొట్లాటలతో కాలం గడుపుతారు.ప్ర్రాచిన ఒక కవి అభిప్రాయ ప్రకారం ప్రజలు తాము వెళ్లలేని ప్రాంతములలో,తమకు అయ్యేవి,అవ్వని అనుకూలాలు గురించి ఎవరో అధికారి చేసిన,చెయ్యని పనుల గురించి చర్చలు చేస్తూ కాలాన్ని సదుపయోగం చెయ్యకుండా కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ వుంటారు అని అన్నారు.

     .......   

🌺నమస్కురమో దేవన్నాను      హతవిదేస్తేపి వశగా:

     సోని ప్రతినియతకరమైక ఫలదః 

     ఫలం కర్మాయత్తం కిమమరగణై :

     కిం చ విధినా నమస్తత్కర్మభ్యో

     విధిరపి నా యేభః ప్రభవతి🌺

       దేవతలకు నమస్కరిద్దాం అంటే వాళ్ళు విధికి (బ్రహ్మ) అధీనులు.ఆ విధికే నమస్కరిద్దాం అంటే అతనూ కర్మకు నియమైన ఫలం మాత్రం ఇస్తాడు.అన్ని ఫలములు కర్మకు అధీనం  అయిందన్న తరువాత దేవతలకు,విధికి,ఆ కర్మలకు నమస్కరిద్దాం.

      .......

🌺అనుభవేన వినాధిగతం శ్రుతం       భవతి నైవ నృణాముపకారకం ౹

      దధిని వర్తన ఏవ హవి : పునః       న మథనేన వినా తదవాప్యతే ౹౹🌺

         చదివి నేర్చుకున్నదికాని,విని తెలిసుకున్నది కానీ,స్వంత అనుభవం లేకుండా ప్రజలకు ఉపయోగము అవ్వదు.పెరుగులో వెన్న ఉంటుంది.అయితే,పెరుగు చిలకనిదే వెన్న కానీ,నెయ్యి కానీ రాదు.

      ........

*శ్లో𝕝𝕝 యత్నో హి సతతం*కార్యః తతో దైవేన సిద్ధ్యతి*|
*దైవం పురుషకారశ్చ*కృతాన్తేనోపపద్యతే||*

తా𝕝𝕝 " *తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే... అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది.... దైవానుగ్రహం, మానవప్రయత్నం, కాలం వల్లనే సిద్ధిస్తాయి*"...
.......

🌺ఏక ఏవ న భుంజియాత్      యదీచ్చేచ్చుభమాత్మనః ౹
      ద్విత్రిభీరబహుభిః సార్ధహం       భోజనం కారయేనరః ౹౹🌺

       తనకు మంచిది అవ్వాలన్న కోరిక ఉంటే ఒక్కడే భోజనం చెయ్యరాదు.ఇద్దరు ముగ్గురితో,లేక కొంతమందితో చేరి భోజనం చెయ్యాలి.అప్పుడు మంచి జరుగుతుంది.       
.......

🌺తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి      నస్తి న చ కించిత్సుఖాత్మకం ౹
     మనసః పరిణామోsయం      సుఖదుఃఖాదిలక్షణం ౹౹🌺

           సుఖానికైనా దుఃఖానికైనా ఏది కారణం కాదు.సుఖం దుఃఖాలు మన మనసుల పరిణామాన్ని అనుసరించి ఉంటాయి.
........           

అర్థా గృహే నివర్తన్తి స్మ శానే మిత్ర బాంధవా

సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి

అర్థము:--మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు. మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.

......

యౌవ్వనం ధన సంపత్తి ప్రభుత్వ మవివేకతా

ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయః

అర్థము:-- యౌవ్వన ప్రాయము,ధనసంపత్తి,అధికారప్రాప్తి,వివేకము లేకపోవుట వీటిలో ఒకటి వుంటేనే ఎన్నో అనర్థములు కలుగును కదా! ఏ నాలుగూ ఒకే చోట వున్నచో యేమి జరుగునో చెప్పవలిసిన పనిలేదు.

........