13, మే 2017, శనివారం

Mallapragada Ramakrishna Telugu Stories -11

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రేమతో - ప్రేమ లేఖ (2)


నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా                  

  
  

12, మే 2017, శుక్రవారం

Mallapragada Ramakrishna telugu Stories-10*****

ప్రేమతో - ప్రేమ లేఖ (1)
చూడు రాధ నిన్ను మరవలేకున్నాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంట బడు తున్నాయి, మనం కలసిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయి, నీ నవ్వును ఒక అక్షర మాలాగా వర్ణించాలని ఉన్నది, నీ నవ్వే చీకటిలో వెన్నెలను పంచె ఒక నక్షత్రం లాగా నాకు కనబడింది, నీ అమృత భాష్యం ఎంత మరవాలన్న మరువ లేకున్నా నంటే  అంత అద్భుత శ్రవణా నందముతో,  సత్య స్పూర్తితో, కరుణ రసముతో, కావ్య భావాలతో  వక్తపరిచి మనసును దోచిన, జ్ఞాపకాల వలయ సుందరివి నీవు.

తొలిసారి నిన్ను చూశా, నీ చిరునవ్వులో కలిశా, నీ సౌందర్యాన్ని ఆస్వాదించా, నీ కళ్ళల్లో నా నీడను చూశా, నీ పెదాల విరుపు చూశా, నా హృదయ స్పందన తెలియ పరిచా, నీ ఓర కంటిలో నిలిచా, నీ పెదాలలో తడిశా, నిన్ను నేను మరువ లేక నీపై పెంచుకున్నాను ఆశా

నాకు తెలుసు నీ కవ్వింత, నేను గమనించా నీ పులక రింత, వలపు చూపుతూ చూపించావు నాకు తుళ్లింత, నీ పులకరింత నాలో పెంచును తపనంత, నీకె పంచాలని నాలో పరుగును గిలిగింత, చెప్పాలని ఉన్నది నాకు ఇంకా కొంత, నీ సంతోషము కొరకు వేచి ఉంటాను జీవితమంతా

నీ పరిచయముతో పరవశించా, నిను దగ్గరగా పరికించా, నీకు కావలసినవన్నీ చేయించి  ఉంచా, జతగా అందించి తరించా, కలవరింత తొలగించి ఆనంద పరిచా, నీ విచ్చిన వింతను గ్రహించా, హమేషా నీకు తోడుగా నడిచా, నీ మనసును బట్టి ప్రవర్తించా, నా తనువును నీకె అర్పించా, నిను వదలి కొంత కాలం జీవించా, ఇక బ్రతుకంతా నీకోసం వేచి ఉండ దలిచా

ఓ మాధవా నీ ఉత్తరమునకు నా ప్రత్యుత్తరము నా హృదయాంతరములో ఉన్న భావాలను ఒక్కసారి నీకోసం వక్త పరుస్తున్నాను, నీవు చదివి నీ ప్రేరణలను నాకు తెలియ పరుచు                                            

నీవు నామనసులో నిలిచిన ఒక గిరి, అదే నాకు నిరంతరము కల్పిస్తుంది సిరి, అందుకే నీవంటే నాకు ఎప్పుడు గురి, నీకోసం నేను వేచి ఉంటా తప్పని సరి, నీవు నామనసులో నిలిచి పోయిన పోకిరి, గుర్తుకొస్తున్నది నీవు చేసిన అల్లరి, నీతో వేగ లేక ఎప్పుడూ అంటాను సరి సరి,  అందుకే నీతో కలిసే దాకా ఉంటుంది నా ఊపిరి.

నా కల్లల్లో ఎప్పుడు ఉంటుంది నీ ఆకృతి, అదే నేర్పింది నాకు సంస్కృతి, అది ఒక కృతి, అందుకే నాకు నిత్య సంక్రాంతి, నీ తలపుల వల్లే నాకు నిర్మల  ప్రకృతి, అందుకే నన్ను బ్రతికిస్తుంది కొత్త అనుభూతి.

నా కళ్ళలో నిలిచి పోయినది మెరుపు, నాకు గుర్తు తెస్తుంది తొలివలపు, అదే మన ఇద్దరి మధ్య నిలిచిన మలుపు, ఇది ఓటమి కాదు మన ఇద్దరి గెలుపు, కాలమే మన మధ్య చూపుతున్న మేలుకొలుపు  

సరసం మనల్ని త్తేజ పరిచింది, విరహం మనల్ని ఏకం చేసింది, ఆశయాల మార్గంలో నడిపించింది, మధుర క్షణాల సాఫల్యం ఫలించింది, మధురాతి మధురం మన మధ్య దాపత్య సుఖం.  దాన్నే గుర్తు చేస్తూ మనమధ్య ఎడబాటు ఉన్న ప్రేమలేఖలు మనల్ని బ్రతికిస్తుంది. 
అంటూ ముగించింది రాధ మాధవకు ప్రేమలేఖ.  

__(())--       

 

10, మే 2017, బుధవారం

Mallapragada Ramakrishna Telugu Stories- 9

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

Learn English is fun!
ఎందుకే  అంత కష్టపడతావ్, అంతా  నీ తాపత్రయం తప్పా, నిన్నెవరు గుర్తించరు, ఇంకా విమర్శిస్తారు తెలుసుకో అన్నాడు మధవ్  రాధతో
ఏదోనండి నాతృప్తి నాది, మీరు మాత్రం ఏమన కుండా నాకు సహకరిస్తే చాలు, అదే నాకు ఎనలేని సంతృప్తి.
అందుకే అన్నారు కష్ట బడే వారిని కష్టపెడతారు, సుఖ పడే వారిని పట్టించుకోరు అన్నాడు మాధవ్
ఇప్పుడు మనం తినలేం ఆవకాయ, మాగాయ, గోంగూర, చింతకాయ పచ్చడ్లు పెట్టి మరీ ఇద్దరు కొడుకు, కోడళ్ల కు ఇద్దరు  కూతురూ అల్లులకు కొరియర్ ద్వారా పంపిస్తు న్నావు,  పచ్చళ్ళు దేవు డెరుగు కనీసం మనల్ని గుర్తించే పరిస్థితే లేదు, అంతా నీ శ్రమ తప్ప .
ఏ మోనండి పిల్లలు మనల్ని గుర్తించక పోయినా మనం వారిని మరిచి ఉండలేమండీ.
ఇప్పుడు మరచి పోయానని చెప్పానా, లేదే వాళ్ళ గుణాలను గుర్తించి చెపుతున్నాను. 
       
నమస్కార మండి అంటూ కొందరు ఉద్యోగులు కలిశారు మాధవ్ గారిని, అందరిని సానుకూలంగా ఆహ్ఫానించి వారికి తగు అల్పాహారములు ఏర్పాటు చేసింది శ్రీమతి రాధా.
వచ్చిన విషయము తెలియపరుస్తు, మీరు వ్రాసిన "లోకమింతే "  అనే కావ్యానికి భాష ప్రాతిపది కముగా మొదటి బహుమతి కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించారు, కాశీ లో జరిగే ప్రత్యేక ఉత్సవము నందు రాష్ట్ర పతి చేతులు మీదగా మీరు అందు కోబోతున్నందుకు మా టీచర్ అసోసియేషన్ ద్వారా సంతోషము వక్త పరుచుటకు వచ్చామని చెప్పారు. మీరు అవార్డు తీసుకోని తిరిగి వచ్చుటకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము మీ తరుఫున ఎవరైనా వస్తానంటే మాకు తెలియ పరచండి ఏర్పాటు చేసుకోవాలి అని తీలియపరిచారు.

వారి మాటలకూ ఒక్కసారి మాధవ్ గారికి కళ్ళు చెమ్మగిల్లినాయ్ ఇప్పుడే ఉండండి అంటూ లోపలకు పోయి వచ్చినవారికి తాను రచించిన కావ్యాన్ని తలా ఒకటి చేతిలో పెట్టాడు.
మీకు అన్ని వివరముగా రెండు రోజుల్లో తెలియపరుస్తా అని అందరికి నమస్కార బాణాలు చెప్పాడు మాధవ్

రాధా అంతా  విన్నావు కదా కొడుకుల్లకు, కూతుర్లకు కబురు  చేయి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని చెప్పు అన్నాడు, నేను ఆ హనుమంతుని గుడిదాకా పోయి నమస్కరించి వస్తా అని గుడికి నడిచాడు మాధవ్.

కొడుకులు కూతుర్ల మాటలు విని ఓక్కసారి  బాధపడింది, భర్తకు ఏమిచెప్పాలో తెలియక ఉండి పోయినది.
మాధవ్ అడుగు పెడుతూనే ఏమన్నారు మనబిడ్డలు అని అడిగారు, తడబడుతూ ఈ అవార్డు తీసుకోకపోయినా పోష్టులోవస్తుంది నాన్న శ్రమ పడి పోవుట ఎందుకు ?

అవునే కష్టం విలువ వాళ్లకు తెలియదు, ఎదో కంప్యూటర్ విద్యనేర్చుకొని లక్షలు సంపాయించు తున్నారు, నేను లక్షలు సంపాదించ లేక పోయిన ప్రశంసా బహుమతితో ధనం పొందుట నాకు గొప్ప.
పిల్లలు వచ్చినా రాక పోయినా మన ఇద్దరం కాశీకి బయలు దేరుదాము,  నీకు నామీద నమ్మకం లేకపోతే నీవు రావద్దు.
అంత మాట అనకండి నేను మీతో వస్తాను, నా పిల్లల కన్నా మీరే ముఖ్యం
సరే రెండు రోజుల్లో మనం కాశీకి పోదాం, బహుమతి తీసుకోని పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దాం, అన్నాడు.

అను కోని విధముగా బహుమతి ప్రధానము తారీఖు మార్చటం జరిగింది. అనుకున్న ప్రకారముగా ఉపాధ్యాయ పదవీ విరమణ జరిగింది. కొడుకులు కూతుర్లు ఎదో ఆశించి విరమణ సమయమున హంగామా చేశారు.

మాధవ్ మాత్రం లాయర్ పిలిపించి తనఆస్తి వివరాలు, రొక్ఖం వివరాలు తెలిపి వీలునామా రిజిస్ట్రేషన్ చేసాడు, ఆవిషయమే పిల్లలకు తెలియ పరిచాడు, నాన్న వచ్చిన డబ్బు ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ పెడుతున్నాడో, నీకు తెలియకుండా, మాకు ఇవ్వ కుండా ఉన్నాడు. అమ్మా నీవు జాగర్త పడాలి అని హెచ్చరించి వెళ్లారు.

 అనుకున్న ప్రకారముగా రాధా మాధవ్ కాశీలో బహుమతి తీసుకున్నారు, గంగలో స్నానమాచరించి పరమేశ్వరుని దర్శించి, గంగా హారతి చూడాలని పడవలో కూర్చున్నారు. ఒకవైపు హారతి మరోవైపు మాధవ్ కు  గుండె దడ పెరిగింది, పడవలోనుండి గంగలోకి విరిగి ప్రాణాలు అనంత వాయువులో కలిసాయి. 

మాధవ్ అకాల ముర్చువుని తట్టుకోలేక ఒక్కసారి మూర్ఛ పోయింది రాధ. తమతో పాటు వచ్చిన ఉపాద్యాయులు కొడుకులకు, కూతుర్లకు కబురుచేయక అందరూ వచ్చారు కర్మలు చేశారు, ఆస్తి వివరాలు అడిగారు. 

లాయర్ ద్వారా వీలునామా చదివించారు, దానిలో " నేనుకాని నాభార్య కానీ ముందుగా ఎవరు చనిపోయినా రెండవనారికి పూర్తి అధికారము వచ్చును, ఇరువురము చని పోయిన తర్వాత కొడుకులకు కూతుర్లకు సమాన భాగముల్లాగా పంచు కొన వలెను. లాకర్ లో ఉన్న డబ్బు ఈ ఇల్లు వృద్ధులకు నివాసమునకు మందులకు, వ్యాయామ శాలకు వాడవలెను. అనివ్రాసిన దాన్ని వివరించారు                     
కొడుకులు, కూతుర్లు ఆస్తి రాదని తెలుసుకొని తల్లిని అడిగి వెనుతిరిగారు ఫలితములేక. 

మాధవ్ రచించిన కవిత్వాలను ముద్రికవల్లా, వృద్దాశ్రమము వల్ల దినదినాభి వృద్దిగా మాధవ్ గారి పేరుతో అభివృద్ధి దిశలో తీసుకొచ్చింది రాధా 

ఇద్దరు కొడుకులు సంపాదన తారుమారై తల్లి పంచన చేరారు, అల్లుళ్ళ కోరికపై కూతుర్లు ఇంటికి వచ్చారు. ఎవ్వరిని వద్దనకుండా  పని పురమా యించి అభివృద్ధి దశలో కొచ్చారు, మాధవ్ ఆబ్దికం ఘనంగా ఏర్పాటు చేసారు. 

దు:ఖము వచ్చిన, సంతోషము పెరిగిన, గుండె ఆగి పోతుంది మరణ శాసనం అనే నిజం అదే రోజు రాధను వెంబ డించింది  అట్లు జరుగుట ఎవరి వళ్ళ ఏమో తెలియదు - డబ్బుకోసం కొందరి ఆశపరుల చర్యే     .......   



mallapragada Ramakrishna Kadhalu -8

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:


రాధ యేప్పుడు పని పని అంటూ అలా చేస్తూనే ఉన్నావు, కాస్త తీరిక చేసుకొని నాతొ మాట్లాడవచ్చు కదా, నేను ఏదన్న పుస్తకము చదువుతున్నాననుకో అప్పుడే వచ్చి ఎప్పుడూ పుస్తకాల చదవటం తప్ప పెళ్ళాం ఒకటున్నది దాన్ని మంచి చెడ్డ చూడాలని ఒక ఆలోచన మీకు రాదు, మీరు మొగవారండి మీసం తిప్పుతూ ఎదో పెద్ద ఘనకార్యము చేసినట్లు ఒక ఫోజు ఇస్తూ ఉంటారు అంటావు నీవు, అన్నాడు మాధవ్, మీరు ఏమైనా అనుకోండి నాకు ఇప్పుడు  మూడు లేదు అన్నాది. మొగవాడికి మూడొచ్చి నప్పుడు ఆడదానికి సుఖము ఎక్కువ పంచవచ్చునట అన్నాడు ఒక కవి, అబ్బో మీకోరికల కోసం ఎన్నో కధలు చెపుతారు, ఇదుగో చూడు నామాటలు కొంచం అర్ధం చేసుకో అంటూ పాత పాడటం మొదలు పెట్టాడు మాధవ్     

ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి చూస్తే ,  అనురాగపు తంచులు చూస్తాం  ఆనందపు లోతులు తీస్తాం. 

నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో , నీ మదిలో డోలలు తూగీ,  నా హృదిలో జ్వాలలు రేగీ, నీ తలపున రేకులు పూస్తే,  నా వలపున బాకులు దూస్తే, నూతన తేజానికి  ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం

నానికి రాణివి నీవై, వ్యసనానికి బానిస నేనై,  వాసంత సమీరం నీవై,  హేమంత తుషారం నేనై 
నీ ఎగిరిన జీవవిహంగం, నా జత హృదయ తరంగం, 

చిగురించిన తోటలలోనో,  వికసించిన పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు,  కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని పాట పాడాడు మాధవ్ 

ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి ,  అనురాగపు తంచులు చూస్తాం  ఆనందపు లోతులు చూ స్తాం. నవ వసంతపు నిర్మాణానికి పునాది వేద్దాం 

చూడండి మీరు రచయితలని నాకు తెలుసు, నీ పాటకు లొంగే మనస్తత్వ నాది కాదు అయినా వేళాపాళా ఉండదా, అయినా మీ మొగవారు ఎలా ఉంటారో నేను చెపుతా వినండి అంటూ ఒక పాట గా చెపుతాను. ఆ ... ఆ .. చెప్పు  
ఆమ్మో నీకు కవిత్వం వస్తున్నదా
ఎంతైనా మీ భార్యను కదండీ, మీలో సగ భాగం నేను, మీ నాలుకపై నేనే ఉన్నాను, మీ  హృదయంలో ఉన్నాను, నన్ను వదలి మీరెక్కడకు పోలేరు, అయినా మీకు నేను ఎప్పుడో  సొంతం అయినాను, మీకు సుఖం అందించటమే నా జీవన మాధుర్యం అయినా వినండి    

నన్ను మృదువుగా నిమురుతూవు నీవు, దగ్గరగా తీసుకున్నపుడు నీలో నాప్రేమను చూసా నంటావు

పుట్టిన నాటినుండి నీ ప్రేమకోసం నీ చుట్టు తిరిగానని అంటావు,  నీవే ప్రాణమని నీవు లేకపోతే బ్రతకలేనని అంటావు, కొద్ది ఆలస్యమైతే చాలు ఎక్కడ లేని కోపం ప్రవర్తిస్తావు, దగ్గర వచ్చేదాకా చిన్న పిల్లడు గొడవ చేసినట్లు గొడవ చేస్తావు.

అధికంగా తినటం  అజీర్తి యంటూ, శ్రద్ధగా దగ్గరగా వచ్చి తినిపిస్తావు,  నీవు భారం కాదని నీవు నమ్మ పలుకుతావు,   ఈమాట అంటే ఆమాట, ఆమాట అంటే ఈమాట వాదిస్తావు,  ఏపని అంటే ఆపని క్షణంలో చేస్తానంటావు, పూలు, సువాసన ద్రవ్యాలు  పూటపూటా దెచ్చి, ఉత్తేజ పరుస్తావు


కన్న బిడ్డ కన్నా ఎక్కవ ప్రేమను నా మీద చూపిస్తావు, మానవతను చూపి అనురాగము ఆత్మీయం ఆనందము పంచుతావు, నామీద ప్రేమా నమ్మకము చూపుతావు.


నీలో ఉన్న దానవుడ్ని కట్టేసి మానవున్నే నాకు చూపుతావు, అధర్మమంపై రెచ్చి పోతావు,    

నా విశ్వాసం నీవు కొల్ల గొడతావు, నానోటి ఈమాట రాకుండా ముద్దులతో ముంచేస్తావు, నా మీద ఉంచుకున్న ప్రేమను కెరటం లా కప్పేసి చల్ల పడతావు, కొన్ని సార్లు నటనలుకు నేను తప్పక లొంగి  పోతాను, తర్వాత తెలిసిన ఇది పెద్ద తప్పు కాదులే అని సర్దుకొని పోమంటావు, మౌనం వీడి  బ్రతుకు వేదంలో మనం పావులవుదా మంటావు.

అంటూ కిల కిలా నవ్వు కుంటూ ముందు స్నానము చేద్దాం పందండి, ఆతర్వాత భోజనం ఆతర్వాత మీ సొంతం అనగానే

మాధవ్ రాధ దగ్గరకు చేరి గట్టిగా కౌగలించుకొని ఇది అడ్వాంస్ తర్వాత ఫుల్ అన్నాడు 


అప్పుడే రాధ నవ్వుకుంటూ నోటితో ద్రాక్ష పళ్ళు అందిస్తూ ..................
              

5, మే 2017, శుక్రవారం

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -7

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 

 http://vocaroo.com/i/s1iHkl8CQMGw
వివాహమనేది మానవులకు తప్పనిసరి ఎందుకనగా వయస్సు పెరిగిన కొద్దీ మనలో ఉన్న జవ సత్వాలు తగ్గుతూ ఉంటాయి, వయసులో ఉన్నప్పుడే మన కోరికలకు పదును పెట్టి, సక్రమ    మార్గాన ప్రయాణమే మానవుల సత్ సంకల్పము, సుఖ దు:ఖాలు మనల్ని వెంబడిస్తాయి  అయినప్పటికీ మనలో ఉన్న నిక్షిప్తముగా ఉన్న జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలతో పంచుకుంటే,  సభ్యులతో పంచుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది.

             కాల గమనాన్ని బట్టి మనప్రవర్తనను మార్చుకుంటూ, జీవితము గడపాలి, అసలు నా దృష్టిలో నరుడు ఏడ్చేవాడు నారాయణుడు నవ్వేవాడు, నరుడు  ఏడుస్తాడు పోయేటప్పుడు ఏడుస్తాడు.  కాని జీవితాంతం ఒకరికొకరు కలసి ఉండటం తప్పదు. 

అసలు మానవుల మనసులో  ఎక్కడో అసంతృప్తి ఉంటుంది.   కారణం సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడే చెప్పాలీ. మంచి విద్య నేర్చుకున్న  ఇంకా నేర్చుకోవాలని,  డబ్బు సంపాదించిన ఇంకా సంపాదించాలని, సంసారంలో  సుఖ మున్నా ఎక్కడో  ఉన్న సుఖం కోసం  వెంపర్లాడటం,   ఇంకా ఎన్నో మానవ జీవితానికి ఈ ఆలోచనలు అవసరమా, అనవసరమా  ఒక్కసారి ఆలోచించండి.

నిత్య ధ్యానంతో మిద్ధ్యా వాదాన్ని విడిచిపెట్టి ప్రకృతి ననుసరించి కాలాన్ని బట్టి   నిగ్రహ శక్తితో బ్రతికి బ్రతికించు కోవటమే మానవజన్మ సార్ధకం                  

 అసలు దు:ఖం అంటే  ...    ఏడుపు ... వెలితి ... కొరత ... శోకం ... చింత ...  విచారము ... నిర్లిప్తత ... అయిష్టత ... చంచలత్వం ... ఘర్షణ ... వత్తిడి ..... ఇంకా ఎన్నో  వీటికి విరుగుడు ఆనందం ఒక్కటే అదే సహజానందం ...      నిత్యానందం ...  పరమానందం ... బ్రహ్మానందం ... వీటిని అందుకోవాలనుంటే ప్రతి విషయాన్ని (+)వ్ గా  తీసుకోవాలి,     (-)వ్  ఆలోచనలు మనసులోకి రాకుండా జాగర్త పడాలి . మనం విచక్షణా వివేకంతో జీవితాన్ని మార్చుకోవాలి.

జీవన ప్రవాహం అంటే  వచ్చేవారు లేనివారే ... .. ఉన్నవారు లేకుండా పోయేవారు అయినప్పటికీ వివాహబంధం కలియుగ జీవనంలో ఒక భాగము అదే మన మనస్సును మేధావంతునిగా మార్చేది, సంతృప్తి లేకుండా జీవిస్తే పిచ్చివాళ్ళగా మార్చేది.
అందుకనే తృప్తిలోనే సంతృప్తిగా భావించి సాగేదే నిజమైన జీవితం.

 నూతన వధువరులకు నేను వ్రాస్తున్న అక్షరమాల (పువ్వులమాల) ఒక్కసారి చదివి అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను,   అందరికి అభినందనలు,  శుభాకాంక్షలు.

"అ "ప్పటి ఎవరికీ వారే "వివాహం అనేటప్పటి కల్లా ఒకరి కొకరు వారి వారి   అభిప్రాయాలు ఏకం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చయ తాంబూలం ప్రధానానికి తార్కాణం.

"ఆ " కాశమంత పందిరివేసి  భూదేవి యంత పీటవేసి   వధువు మేడలో మంగళసూత్ర ధారణ వరుడు కట్టినతర్వాత,  తలంబ్రాలు పెద్దల దీవెనలు చదివింపులు భోజనాలతో ముగిస్తుంది పెళ్ళి, ఇదియే ఇరువురిమద్య కొత్త ఉరవడికి తోడ్పడే బం ధం.

"ఇ" ల్లాలుగా  అడుగు పెట్టి అత్తమామలకు సేవలందించి వారి ఆదరణతో, భర్త అనురాగంతో  ఇల్లాలుగా పేరు తెచ్చుకోవటం పుట్టినిల్లికి, మెట్టినిల్లికి పేరుతెచ్చుటే   ధర్మం. 
"ఈ" నాటి బంధం ఏనాటిదో అని భావించి, ఈ బందమే శాశ్వితముగా భావించి సకర్మ మార్గంలో ఉండుటకు స్త్రీ - పురుషులు ఒకటిగా ఏకమై చేయాలి స్థిర కాపురం 

"ఉ"ల్లాసంగా .....     ఉత్సాహంగా  ...   స్వర్గ  సుఖాలు అనుభవించటమే తక్షణ కర్తవ్యం.. 

"ఊ" హల సఫలీకృతముగా ఊయలులో  ఊగి మనసు ప్రశాంత పరుచుకొని ఒకరి కొకరు పొందాలి ఆనంద పారవశ్యం. 
"ఋ " ణాలు లేకుండా ధనాశకు పోకుండా ఉన్న దానితో తృప్తి పడటమే ప్రేమికుల జీవిత ఆశయంగా ఉండటం. 
      
"ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి, ఓర్పుతో పెద్దలను గౌరవించి మన్ననలను పొందటమే ప్రకృతి
 ప్రభావంతో ఏకీభవించడం. 
"ఏనాడు తొందర పడకుండా ఎదుటి వ్యక్తిని అనుసరించి చక్కటి మాటలతో మనసును అర్ధం చేసుకొని వారి భావాలను అర్ధం చేసుకుని నిదానంగా మాట్లాడటం. 
"ఐకమత్యంతో  జీవితాంతం కలసి ఉండటం, ఐకమత్యంతో దేశానికి సేవచేయడం.  

"ఒ "కే మాట, ఒకే బాటగా జీవితాంతము ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఎవరు గొప్ప అని మనసులోకి రాకుండా జాగర్త పడటం. 
"ఓ"టమి ఎరుగక జీవితము గడపాలి, ఓటమి ఎదురైనా మన జయమునకు నాంది అని భావించటం ఎదుగుదలకు ఇదే ప్రధానం అని భావించడం 

"ఔ"న్నత్యం తో జీవించాలి , ప్రతి ఒక్కరు భావించాలి  జీవితమే  సహజ ఆనందం, జీవితమే నిత్యానందం, జీవితమే  బ్రహ్మానందం,  జీవితమే పరమానందం 

"అం" తరాలు లేకుండా మమతానూ రాగాలతో సుఖ సంతోషాలతో నవ తేజంతో సుఖాలను భవించటమే ప్రేమికులు ఉద్దేశ్యం 

"అ:హంకారాన్ని కరగించుకొని  ప్రేమ, దయ, కరుణ తో నిత్య  అనంత సౌభాగ్యాలు అనుభవిస్తూ దేశానికి సహయ సహకారాలు అందిస్తూ అనాథలను ఆదుకుంటూ మనో నిగ్రహ శక్తి తో నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచటమే నిజమైన బంధం.          ప్రేమ ఉంటే సుఖం - ప్రేమ తగ్గితే సాధింపే              



4, మే 2017, గురువారం

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -6

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

http://vocaroo.com/i/s1x6glE18C6s  
పిల్లలపై ప్రేమ ?

ఏమిటి రామచంద్ర రావుగారు అంత దిగులుగా ఉన్నారు, ఏమీ లేదండి మాధవ్ గారు ఆధునిక ఎలక్ట్రానిక్ మరియు కంప్యూటర్ వచ్చినప్పడి నుండి పిల్లలు చెడి పోతున్నారు. ఎందు కండి అట్లా అంటారు, మీరే మనవళ్ళకు ఆడుకొనే వస్తువుగా సెల్ కొని బెడుతున్నారు, వాళ్ళముందే మాపిల్లలు యిట్టె సెల్లు లాక్కొని ఆడుకుంటారు, మాకు కూడా రాదు అదేదో గొప్ప విద్యగా చెప్పుకుంటారు వాళ్లకు తెలియటంలేదు చిన్నప్పుడే కళ్ళు దెబ్బతింటాయని, అది ఒక వ్యసనంగా మారుతుందని,కఖరీదైనవి కొని ఇవ్వడం  చిన్నవాళ్లకు అవసరమా, టివి చూడమని చెప్పటం అవసరమా, మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలకు సరిఅయిన వ్యాయామమం లేకుండా మార్కులు రావాలని అదేపనిగా చదివిస్తునారు. చివరికి చిన్నపిల్లలకు కళ్లజోడులు, పెద్దవాళ్ళు మాట్లాడినట్లు మాటలు వస్తున్నాయి. మనం కష్ట పడుతున్నాము పిల్లలు కష్టపడకూడదని అడిగిందల్లా కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది,
ఇదీ నిజమే ఏమిటో, నా చిన్నతనంలో మా ఊళ్ళోనే విద్యుత్తు లేదు. అటువంటిది ఈ నాడు అరచేతిలో సెల్ ఫోను పెట్టుకుని అన్ని టి.వి.ఛానెల్స్ చూసెయ్యగలుగుతున్నాను. ప్రపంచంలో ఎక్కడున్న
వాళ్ళనైనా ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడెయ్య గలుగుతున్నాను. మానవా, నీ జిజ్జాసకు, మేథాశక్తికి జోహార్లు. ఆవకాయ పచ్చడి నుంచి ఆకాశంలోకి దూసుకెళ్ళే రాకెట్లదాకా కనిపెట్టేసావు. ఇంకా నువ్వు ఎన్నెన్ని అద్భుతాలను ఆవిష్కరించబోతున్నావో!అంటూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

ఒక చెట్టు క్రింద ఒక వ్యాను పై చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి  పిల్లద్వారా ఈ పాతపాట పాడిస్తూ యాచిస్తున్నాడు. 

నేటి పాట 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా
 
అభం శుభం తెలియని  పసి కూనలం
అమ్మా నాన్న తెలియని పుడమి బిడ్డలం
ఆశా పాశములేని ప్రకృతి అనాధ పుత్రులం
ఆకలి తట్టుకొనే ఉండే చితికిన బతుకులం
ఆదరణ కరువై బిక్షమె ఆధార జీవులం
జక్కగా ఉన్నా సుబ్రములేని చిన్నారులం        
వీధి వీధి తిరుగుతున్న దిక్కులేని ప్రాణులం
కాలవ వొడ్డున గుడిసెలలో వన్నెదగ్గిన బాలలం  
తెగిన గాలిపటం వలే ఎగిరే ఎంగిలి ఇస్తరాకులం
    

ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

సూర్య కిరణాల వెలుగులే మాకు మార్గాలు
చంద్ర కిరణాల వెన్నెలే మాకు శయనాలు
చెట్ల ఫలాలు, గాలులు మాకు ఆహారాలు
పుడమి తల్లి మాకు నిత్యా నిత్య ఆశ్రమాలు
నీలి ఆకాశ పక్షులు మేఘాలే మాకు చుట్టాలు
మా బ్రతుకంతా నిత్యా అగ్ని హోత్రాలు


ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

సూర్యుడు తూర్పునే ఉదయించును
నీరు అడ్డంకులు వచ్చినపల్లమునకు జారును
చెట్ల గాలి సమస్త ప్రాణులను రక్షించును
పుడమితల్లి సమస్తము తనలో దాచును
పైవాటి ధర్మాలు మార్చే వారు ఎవ్వరు లేరు
మమ్ము ఆదుకొనే వారు అసలు ఈజగతి లో లేరా        
 
ఇంతేనా మా జీవితం మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ, ఆశ్రమం, కల్పించేవారు లేరా

వెంటనే ఆర్గనైజర్ వద్దకు మాధవ్ రామచంద్ర రావు చేరారు, నీవు పిల్లలతో పాటలు పాడించి అడుక్కోవటం తప్పు మేము పోలీసులకు చెప్పి నిన్ను అరెష్టు చేసి పిల్లలను ఎదో ఆశ్రమంలో చెరిపిస్తాము, నీకు ఆశ్రమం కల్పిస్తాము అన్నారు.
Image may contain: 1 person
తొందర పడకండి మా ప్రధాన గీతము విన్నారు, తర్వాత చిన్న నాటికలు ఏకపాత్రాభినయనాలు ఉన్నాయి చూడగలరు.

ఏది ఏమైనా మీరు చేసేది తప్పు అని ముక్తఖంఠముగా అన్నారు.  
 
అయితే మీరు మీ ఉద్యోగాలు మానేసి నాతోబాటు ఉండండి, నేను చేసే వృత్తిని గమనించండి అప్పుడు నన్ను పోలీసులకు అప్పచెప్పండి అని వినయంగా చెప్పాడు ఆర్గనైజర్ .
బుర్ర ఉండి మాట్లాడుతున్నావా మమ్మల్ని ఉండమంటావా అని కోపంగా అడిగాడు రామచంద్రరావు
రామచంద్ర రావు కోపం తెచ్చుకోకు అన్నాడు మాధవ్. అతను చెప్పిన విషయంలో ఏదైనా మంచి ఉండొచ్చు నిదానం అన్నాడు.

అవును పెద్దలారా మీ పనులు మానుకొని ఒక్కసారి గమనించండి అంటేనే అంత కోపం వచ్చింది, నిత్యం మీలాంటి వారి సూటి పోటీ మాటలు విని రూపాయి రూపాయి సేకరించటం మాకు ఎంత కష్టమో మీకు తెలుసా, ఇవ్వాళా ఇక్కడ మరోరోజు వేరోచోట మాకు చేతనైన విద్యను చూపించి ప్రజలను నవ్వించి బ్రతుకు తున్నాము అన్నాడు.
      
ఈ పిల్లలెవరు ఆనాధలు కాదు, చదువుకున్న విద్యార్థులు, వారికి నేను రోజుకూలి ఇస్తాను భోజనం, ఆశ్రమం కల్పిస్తాను. వారికి ఉద్యోగమూ వచ్చేవరకే మావద్ద ఉంటారు తర్వాత వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ప్రేమించుకున్నవారికి ఉచితముగా పెళ్లి చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేస్తాము, ఇక్కడకొచ్చేవారు ఒకనాటి నటుల బిడ్డలు, వారి కులవృత్తి వదులు కోలేక నటన ప్రవర్తిస్తున్నారు. మేము స్కూలల్లో, కాలేజీలల్లో ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాటిమీద వచ్చే ఆదాయము చదువుకొనే విద్యార్థుల పారితోషికంగా అందిస్తున్నాము, మేము నిత్యా కష్ట జీవులం, ఇతరుల కష్టాలను ఆదుకొని
జీవించే డబ్బులు లేని జీవులం. ఇక్కడ ఆగి చూస్తున్న వారిని చందాల రూపములో అడుగుతాము కాని మరోవిధము కాదు అని తెలియపరిచారు.  

 ఈయన చెప్పిన విషయం బట్టి వీరికి పెద్ద నెట్ వర్కు ఉన్నట్లు ఉన్నది, మనం కలగ చేసు కుంటే మనమే ఇరుక్కుంటాం, కోర్టు చుట్టూ తిరగాల్సి పని ఉంటుంది అన్నాడు రామచంద్రరావు.

తొందర పడకు కొంత విషయం తెలిసింది, నాకేదో అనుమానంగా ఉన్నది అసలు మీరెవరో మాకు తెలుపుతారా నిజంగా అన్నాడు మాధవ్ , మీరెక్కడ ఉంటారో చిరునామా తెలపండి అన్నాడు.

అప్పుడే ఆర్గనైజర్ పిల్లలకు డబ్బులిచ్చి తర్వాత కార్యక్రమము నిర్వహించమని పురమాయించి    అలారండి ఆ హోటల్ ల్లో కూర్చొని మాట్లాడు కుందాం అన్నాడు

అప్పుడే మాధవ్ కు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి 
ఏమిటి విషయం అని అడుగగా శ్రీమతి రాధ ఏమండి మన బాబు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడకు పోయాడో తెలియటు లేదు అని ఏడుస్తూ తెలిపింది. ఏడవకు ఏడ్చి అన్న చెప్పు, చెప్పి అన్న ఏడువు ఎప్పటి నుంచి కనపడ లేదు. పొద్దున్న స్కూలులో దించి వచ్చా తర్వాత ఇంటికి రాలేదు, మరలా  స్కూలుకు ఫోన్ చేస్తే ఈ రోజు స్కూల్ కు రాలేదని తెలిసింది. నాకు భయముగా ఉన్నది నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను ధైర్యంగా ఉండు అని సమాధానము చెప్పాడు. 

ఏమిటండి కంగారుగా ఉన్నారు ఏమీ లేదు మాబాబు కనబడుట లేదుట, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 8 ఏళ్ళు ఉన్నాయి అన్నాడు. 
ఏది మీ అబ్బాయి ఫోటో ఇవ్వండి చూస్తాను ఫోటో చూసి వెంటనే ఎవరికో ఫోన్ చేసాడు. పిల్లవాణ్ణి తీసుకొచ్చాడు. 
చూడండి నేను అన్నానని అనుకోవద్దు మీపిల్లవాడి అభిరుచి అనుకరించి విద్య నేర్పించండి, ఈనాడు పిల్లల ఆలోచనలు చాలా మారినాయి, నేను డాక్టర్ చదివాను, నీవు డాక్టర్ చదవాలి అని వయసు తగ్గ జ్ఞానాన్ని కన్నా ఎక్కవ జ్ఞానం నేర్పించాలని ఆశించటం తప్పు. పిల్లలు అటు చదువుకోలేక యిటు వారి అభిరుచి ప్రకారము ఉండలేక ఈ చిన్న వయసులో భాధ పెడుతున్నారు తల్లి తండ్రులు. 
ఇంతకీ మా పిల్లవాడు మీకు ఎక్కడ దొరికాడు. 
చెప్పాం గదండీ మాపొట్ట నింపుకోవటానికి పిల్లలు వస్తున్నారు వారికి మాకు వచ్చిన విద్యలు నేర్పుతున్నాము పిల్లల అడ్రస్సులు అన్నీ మాదగ్గర ఉంటాయి ఏరోజుకారోజు పెద్దలకు తెలియ పరుస్తాము. 
ఈరోజు మాదగ్గరున్న పిల్లలు బ్రేక్ డాన్సు చేస్తుంటే మీబాబు చూస్తూ ఉన్నాడు అందువల్ల వెంటనే మీకు చెప్ప గలిగాను అన్నాడు ఆర్గనైజర్. 
మీరు అక్కడ ఇక్కడా తీరుగా కుండా ఉండేందుకు నేను ఒక స్కూలు పెడతాను దానికి మిరే మానేజర్, అయినా మీదగ్గర వచ్చిన పిల్లలకు డాన్సు చేయించి వాళ్లకు డబ్బులివ్వడం మంచిదా, క్షమించండి మా దగ్గరకు అందరూ బీదవాళ్ళ పిల్లలే వస్తారు అన్నాడు. 
ఏది ఏమైనా తప్పు ఈరోజుతో నీదగ్గర ఉన్న పిల్లలందరి చిరునామాలతో నాదగ్గరకు ఈ అడ్రస్సుకు వచ్చేయ్.పిల్లల అభిరుచి బట్టి మంచి విద్య నేర్పించే వయసు డబ్బు నాదగ్గర ఉన్నది వెంటనే కలవు. 
అట్లాగే సార్ . 
ఏమిటి మాధవ్ నీవు అన్నమాటలు నాకర్ధం కాలేదు, నీదగ్గర డబ్బు ఉందా, వాళ్ళను నీవు చదివిస్తావా 
చూడు రామచంద్రరావు గారు మనం మంచి తలంపుతో  చేసిన పనికి విఘ్నము ఉండదు అదే నా నమ్మకము, అప్పుడే ఫోన్ ఏమండి బాబు 
బాబును తీసుకోని వస్తున్నాను గాబరా పడకు వస్తున్నాను అన్నాడు రాధతో మాధవ్ . 
--((*))--                       

మల్లాప్రగడ రామకృష్ణ కధలు



ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:

నేటి ప్రభ ప్రపంచం 
౧. నేటి పాట
౨. నేటి కవిత 


నేటి పాట
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

ఓ చెలి.... ఒ ఓ చెలి... ఒ ఓ ఓచెలి.....
బిగి కౌగిలి అందించి ఓనామాలు నేర్పవా
ఓ చెలి ..... ఒ ఓ చెలి ..... ఒ ఓ ఓ చెలి

పలుకే బంగారాన్ని లింకు బెడితే కష్టమే
పిలుపే వయ్యారాన్ని లింకు బెడితే కష్టమే
వలపే శృంగారాన్ని లింకు బెడితే కఫ్టమే
తనువే తపిస్తుంటే పట్టించకోక పోతే కష్టమే

ఒ చెలి..... ఒ ఓ చెలి..... ఒ ఓ ఓ చెలి
బిగి కౌగిలి అందించి ఒనామాలు నేర్పవా
ఒ చెలి ..... ఒ ఓ చెలి .... ఒ ఓ ఓ చెలి

ఒ గిరి.... ఒ ఓ గిరి.......ఒ ఓ ఓ గిరి
ఈ కౌగిలి నీ సొంతమని తెలిసి యెగిరెగిరి పడతావా
ఒ గిరి ..... ఒ ఓ గిరి ..... ఒ ఓ ఓ గిరి

కష్టము నష్టము లేదులే, 
ఇష్టము సోంతము అవునులే
పుత్తడి వత్తిడి వద్దులే
ఆకారములో ప్రేమ లేదులే 
మమకారంలో ప్రేమ ఉందిలే

ఒ గిరి.... ఒ ఓ గిరి ..... ఒ ఓ ఓగిరి

ఒ చెలి .... ఒ ఓ చెలి ..... ఒ ఓ ఓ చెలి

చెరుకు తీపి రుచి చూడక పోతే నీకే 
నష్టమే
బెరుకు తనంతో దూరంగా ఉంటే నీకే నష్టమే
గరుకు గా గుండెను మార్చు కుంటే ఇద్దరకీ నష్టమే
సరుకు ఉన్నప్పుడే తెలివితో సుఖబడపోతే నష్టమే

ఒ చెలి ..... ఒ ఓ చెలి .... ఒ ఓ ఓ చెలి
ఒ ఓ గిరి .....‌‌ఒ ఓ ఓ గిరి ..... ఒ ఓ ఓ గిరి

సంసార సుఖమలో నష్ట మనేది లేదులే
సంతాన వ్యయంలో నష్ట మనేది లేదులే
సౌభాగ్య మిచ్చుటలో నఫ్ట మనేది లేదులే
ఇద్దరం ఒక్కమాటపై ఉంటే అంతా ప్రేమలే

ఒ గిరి..... ఒ ఓ గిరి...... ఒ ఓ ఓ గిరి
ఒ చెలి..... ఒ ఓ చెలి..... ఒ ఓ ఓ చెలి
--((*))--

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

కళ్ళలోని నీరు కరుణకు తెలుసు
భూమిలోని నీరు నింగికి తెలుసు
నదిలోని నీరు సముద్రునికి తెలుసు 
నీలో ఉన్న నీరు నాకేమి తెలుసు

వ్యాపారంలో కిటుకు యజమానికి తెలుసు
వ్యవసాయములో కిటుకు రైతుకి తెలుసు
వయ్యారంలో కిటుకు వగలరాణికి తెలుసు
నీలో ఉన్న కిటుకు నాకేం తెలుసు

పుత్తడి లో కల్తీ కంసాలికి‌ తెలుసు
కుండలలో కల్తీ కుమ్మరికి తెలుసు
బట్టలలో కల్తీ చాకలికి తెలుసు
నీలో ఉన్న కల్తీ నాకేం తెలుసు

మోసంచేసే తెలివి నాయకులకు తెలుసు
దొంగను పట్టుకొనే తెలివి రక్షకులకు తెలుసు
వటులను ఆకర్షించే తెలివి వెలయాలికి తెలుసు
నీలో ఉన్న తెలివి నాకేం తెలంసు

హోలి ఆడాక యేమవుతుందో తెలుసు
జోలి మోసాక యేమవుతుందో తెలుసు
కూలి ఇచ్చాక యెంతౌతుందో తెలుసు
ఆలి అయ్యాక యెంజరుగుతుందో నాకేం తెలుసు

--((*))--

నేటి కధ 

పంజలి ప్రభ - పాత కథకు జ్ఞాన భాష్యం




















అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగురు కొడుకులు... 

(ఈ కధ (పరమా)అర్ధం ) 
కథ: 
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమోపు అడ్డమొచ్చింది. గడ్డిమోపు ... గడ్డిమోపు  ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవు  ఆవు  ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు... పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది. 
రాజుగారు అంటే మనిషి.



ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు.



వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట.



ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు 
(కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)). 

ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది. 

ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.



ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది.



కామాన్ని జయించటము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము.



చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక.



మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.



గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. 
వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.



ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.



"కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.



గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము. 
అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు.



పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. 
పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది.



చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.



చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును. 



కథ సారాంశము: 
సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును. 
కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.



ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు, సమయానుకూలంగా నాబ్లాగులో ఉన్న 2014 లో సేకరించిన కథను పొందు పరుస్తున్నాను, మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియపరచగలరు, ఇట్లు మీ విధేయుడు . 
--(())--