301.. పవనః.. భ స స జ గ గ...యతి.. 8
అప్పుల వలనే అవకాశమేను పోవన్
తప్పుల వలనే వెతలే మనస్సు మార్పుల్
మెప్పును కొరకే మమేక తపస్సు చేసెన్
ఒప్పుగ పలికేను ఓర్పు చరిత్ర దేవీ
302.. పాంచాలాగ్రి.. న య గ గ ..యతి..లేదు
గడువుల జన్మల్ సాగెన్ ,
ఘడియల లెక్కల్ తేల్చెన్ ,
ముడివడు నీడల్ చేరెన్ ,
తడిపొడి మాటల్ దేవీ ,
303.. పాటీర.. స న న స గ....యతి..7
చిరునవ్వు పిలిచె వినయముసాగెన్
ధరహాసపు యధరము పిలుపే లే
వరదాతలకు వరము శుభమోనే
పరమార్ధములు పరమగుట దేవీ
304.. పాణీ . నర భజ ర గ....యతి..10
కలలు తీర్చెమార్గకాల నిర్ణయం మే
మలుపులన్నితెల్పమధ్యమార్గమే లే
వలపులన్ని తీర్చ విద్వా వాహిణీ గతేలే
తలపులన్ని పండు తత్వ బోధ దేవీ
305.. పా రా వా రాహ. త న న య గ గ ..యతి..9
రాగమ్ము మదిన మధుర సుఖమే వీలున్
వేగమ్ము కదులు సమవిజయమే వీ లిన్
సౌగంధపు మది కళ సహనమే వీలున్
గూర్చి సమయమున చిగురుయే దేవీ
306.. పార్షతశరణం. భ ణ య మ న న న య...యతి..13
తత్వము తెలుపుట సాక్షి భూతం మే తనువు తలపు కులుకులు జన్మన్
సాత్విక గుణములు శక్తీ పెంచేలే సమయ సహనపు పలుకు తేజా
నత్వము దునువుట విద్యా సంతృప్తీ నటన మలుపు తెలుపు శున్డే
రిత్విజుడగుటయు సౌరీ సత్యమ్మై రెప రెపలు కదులుట దేవీ
307.. వసుధారా.. న న న న న గ గ ..యతి..11
పదవి కొరకు మలుపులు పలకులగు యిచ్ఛా
మొదలు చివర అనక యు మెరుపులగు యిచ్ఛా
విధి విజయము తెలుపుట వివరములు యిచ్చా
మది తలుపులు పిలుపులు మమత యగు దేవీ
308.. పినాకీ.. త ర త మ య...యతి..10
కాలంబు నీదియే సద్భావ కావ్యంమే ను రాసే
జ్వాలా ప్రదీప్తియే విన్యాస జా డ్జ్యమ్మేను తెల్పే
ప్రేలాపనేమదీ సంకల్ప పీయూషమ్ము మార్పే
ఆలాపనే గతీ సంతోష సద్భావమ్ము దేవీ
309.. పీన శ్రోనీ .. మ భ స గ గ....యతి..7
స్వేచ్చాభావమ్ముగు సమరమ్మేలే, దేహమ్మున్ చూడుము దరిసోభేలే
యిచ్ఛా కార్యమ్మగు నిలయమ్మేలే, దాహమ్మున్ పొందుట ధన మార్గమ్మున్
రచ్చా చేసేదియు రసరాజ్యమ్మే, మోహమ్మున్ వీడుట మొన లక్ష్యమ్మున్
స్వేచ్ఛ లక్ష్యంమ్మగు సమయ దేవీ, స్నేహమ్మున్ నెంచుట సహ శ్రీదేవీ
310.. పుండరీక.. మ భ ర య....యతి..7
మోహ మ్మే లక్ష్య మై మోక్షమేను సాధన్
దాహం మే విద్య గా దక్షతేను సాధన్
దేహం మే స్వేచ్ఛగా ధన్యతేను సాధన్
స్నేహమ్మే నిత్యమై కీర్తి గాను దేవీ
311. పులకాంచితం.. భ స న య న న భ గ గ....యతి..7,16
కాలము మదిగా కలుగుట శాంతీ సహన కళలు బంధము నెంచే
జ్వాలలు విధిగా జరుగుట కాంతీ మెరుపు జపము నిత్యము పంచే
మాల పరిమళం మనసుకు బ్రాంతీ సుఖపు మయము సత్యము నెంచే
వేళ పులకరింపు జయము నెంచే సమయ వరుస ప్రేమయు దేవీ
312.. పుష్పధామ.. మ త న స ర ర గ.. ..యతి..13
ప్రేరత్వమ్మేలే సహనము విధి సాపేక్ష నెంమ్మావి మాయే
దారుడ్యoమ్మేలే ప్రకృతియు మనసే దారిగా ఓర్పు జూపే
ప్రారంభంమేలే నియమము కళయే పాఠ మై నేర్పు కూర్పే
ధీరత్వమ్మే లే జయమగుటయు దేదీ ప్య మా నమ్ము దేవీ
313..పుష్ప మాలా.. న న ర ర గ.. ..యతి..9
ఒకటి కొకటి తోడు ఓర్పే ను నేర్పే
సకల మనుట చెప్ప సంఘమ్ము తీర్పే
నకలు అసలు చెప్ప నాట్యమ్ము కూర్పే
మహిమ కలిగి మోహ మార్గమ్ము దేవీ
314.. లక్ష్మీ వృత్తం.. భ స త త గ గ....యతి..8
పాపపు పనులే చెప్పంగ చేసేటి వాడే
శాపము లనుటే మోసమ్ము చేసేటి వాడే
తాపము యనుటే మొత్తమ్ము చూసేటి వాడే
రూపము వలనే చేయూత చూపేది దేవీ
315.. పుష్ప సమృద్ధా.. భ మ న భ నన నన గగ....యతి..13
నీతి సురక్షించే మనసు జాగృతి నిజము గనుత విజయమగుట యేలే
ఖ్యాతి నెంచే బుద్ది గన ధారణ కలము గతము తెలుపు కథలు ఏలే
నాతి చూపే మోహమగు కారణ నటన నయన మలుపు పిలుపు ఏలే
జాతి రక్షనెంచ మది కాలపు గమన మలుపు తెలుప గలుగు దేవీ
316.. పుష్పా .. త మ య య....యతి..7
అర్చింతునమ్మా నీ దయా ప్రాప్తి మాపై, ఆరాధ్యతే యానంద లక్ష్యం మయమ్మున్
తీర్చేలె, నమ్మా నీ కృపా బ్రోవు మమ్మా, తీరమ్మునే తిష్టాతపమ్మున్ శుభమ్మున్
మార్చేలె , మాబుద్ధీ విదీ తీర్చు మమ్మా, ప్రారంభమే విద్యాప్రభల్ గా సమమ్ముఁన్
చేర్చేలె, మాటల్తో వివేకమ్ము దేవీ, ప్రారబ్ధమే శోభా ప్రభావం శ్రీదేవీ
317.. పృద్వి తిలకా.. జ స జ న స య. ..యతి..13
అనాది పిలిపే మనోమయమగు సహనంమ్ము గానే
వినాలి పలుకే ప్రభావముగను వినయంమ్ము గానే
కనాలి పటమే చరిత్ర తెలిపె కథ పూర్తి గానే
మనస్సు విధిగానుకూర్చు విజయ మరిపించు దేవీ
318.. ప్రజ్ఞా.. న య మ మ భ మ....యతి..11
తెలివిగ సేవా భాగ్యమ్మే ఉత్తీర్ణం బంధము తోడ్పాటే
మలుపుల మార్గం ఇష్టంమై తన్మాయా స్నేహము తోడ్పాటే
కలతలు పొయ్యే మార్గమ్మే సంకేతం కోర్కెలు తోడ్పాటే
వలపులు పెంచే లక్ష్యమ్మే విశ్వాసం చూపే శ్రీదేవీ
319.. భద్రా ..మ భ న య గ....యతి..9
కాలమ్మే బంధము కధకళ యోగమ్మే,
కాలాతీతమ్ముగు కనుక సమానమ్మే,
ప్రేలాపమ్మే మది తెలిపెడి ప్రేమమ్మే,
కాలక్షేపమ్ముగు విధి కధ శ్రీ దేవీ
320.. ప్రతిభ.. ర మ న స జ ర గ....యతి..10
అమ్మ నీ వే మా రక్షగను అనుకూల తీర్పు యిమ్ము మాకే
మమ్ము యేలే శక్తి విధి మమతాను రాగ మిమ్ము మాకే
నమ్మ కమ్మేమాకూ కలల నటనా మనోమయమ్ము మాకే
సమ్మతమ్మే ఓర్పే మనసు సహనమ్ము నుంచె తీర్పు దేవీ
321.. ప్రతిభా దర్శనం.. స భ త న గ గ....యతి..9
సకలమ్మే పలు కాయే కథలు చెప్పా
వికసించే లత లాయే విరిసి నుండే
మకుటమ్మే మది భావం మనసు నందే
తక ధిమ్మై కథ నాట్యం తపసు దేవీ
322.. ప్రతీపవల్లీ.. స స భ ర య గ....యతి..10
మహిషాసురులై భాధల మంత్రమేను ప్రాణమ్మే
దహనార్తివడిన్ మూర్ఖుల దాహమేను ధ్యేయమ్మే
సహకార వికాసమ్ముయు సాధ్య సాధ్యమే వైనం
అహమే తరిమే బంధపు ఆత్రమేను శ్రీదేవీ
323.. ప్రపన్న పానీయం.. త య త ర గ గ....యతి..9
సన్మానముపొందా సమాఖ్యా స్వేచ్ఛ భావమ్మే
తన్మాయలు చూపే ససేవా తంత్ర లక్ష్యమ్మే
జ్ఞాన్మాంతయు కష్టాలు నష్టం జబ్బు కర్మమ్మే
యీ న్మాయలు చేస్తుండి నిత్యం ఇష్టము దేవీ
324.. ప్రఫుల్ల కదళి.. జ స మ గ గ....యతి..8
అలౌకిక జనా వాసమ్మేప్రేమా ,
చలంగు విధమే దాల్ చేరన్ సేవా ,
విలోల కధలే ప్రావీణ్యం యేలే ,
స్వలాభ మవనీ విశ్వాసం దేవీ ,
325.. విధమాలా..స జ స గ....యతి..7
అనుశక్తి భక్తి పదమూలన్ ,
ఘన రక్తి యుక్తి జయమేలున్ ,
పెను ముక్తి నిచ్చు హరి సేవన్ ,
పెనవేయు దాస్యమిడు దేవీ ,
326.. ప్రసర ఉన్నత.. మ స స గ....యతి..7
చామంతీ వలితిన్ చతురత్మా ,
సామన్తమ్ముగ శేష విలాసా ,
ధీ మంతమ్మగు వైదిక మూర్తీ ,
ప్రేమాత్మా యగుటే విధి దేవీ
327.. ప్రహర్షిణీ.. మ న జ ర గ....యతి..8
నిక్షిప్తమ్ముగన ననేక కష్ట మౌనే
రక్షించే ప్రక్రియ పరాన్న భూతమౌనే
కాంక్షించే మనసు వికల్ప శుద్ధి పొందే
విక్షించే అవగత విద్య ఆత్మ దేవీ
328.. మలిణీ శ్రీ పుట.. న న మ య....యతి..8
అభయ వలయ మోహమ్మేను ప్రేమా
శుభములు గల ప్రాముఖ్యమ్ము ప్రేమా
రభముల మది ప్రారంభమ్ము ప్రేమా
యుభయ కళలు చేయున్నత్వ దేవీ
329..ప్రహ్లాధ.. సభ సభ సభ ర గ....యతి..7,13
భవ బంధమ్ముల భయ హేలల్ విన బడు నేలన్ నర జన్మ మూలన్
భవ శాపమ్ముల భయ రోగమ్ములు బడు భూమిన్ విధి కర్మ మూలన్
భవ రూపమ్ముల పరమార్ధమ్మున భగవన్నామము భక్తి మూలన్
భవదీయమ్మగు భవసారమ్ముల పర శక్తీ సహనమ్ము దేవీ
330.. ప్రాకార బంధః..త త త గ గ....యతి..7
దాహమ్ము ఏర్పాటు దాత్రుత్వ మేలే
దేహమ్ము తోడ్పాటు దీనత్వ మేలే
సోహమ్ము దాస్యమ్ము సూత్రమ్ము మేలే
నీ హార లక్ష్యమ్ము నీ భక్తి దేవీ
331.. ప్రియ కాంత.. న య న య స గ ..యతి..11
నటనల నాట్యం నయన నినాదం సమయమ్మే
అటుకుల శబ్దం చటకు నిదానం సహనమ్మే
చిటికల శబ్దం తలపు విలీనం ప్రభవమ్మే
కిటుకుల వైనం మనసు న కీర్తి దేవీ
332.. ప్రియ జీవితం.. భ భ భ భ భ భ భ భ గ గ ..యతి..13
లెక్కలు జూచిది నిత్యము నిల్చెడు లీలల గుక్కలు తిప్పక నుండుట యేలే
చిక్కుల చుక్కుల కర్మలు దీర్చెడు చిక్కెడు భారము లన్నియు దీర్చటయేలే
దిక్కుల దిక్కుగ చక్కగ దక్కుచు దీనుల సాయము పొందుట సత్యము యేలే
మ్రొక్కుల మాయెన దాగెడు నిశ్చల మోక్షము నిచ్చెడి జీవన సారధి దేవీ
333.. ప్రియ వచనము.. న య మ గ....యతి..7
మెలుకువ నెంచే మాధుర్యమ్మే , తనువును పొందే తాత్పర్యంమ్మున్
తెలివిని జూపే చాతుర్యమ్మే , కణమును పంచే కర్తవ్యమ్మున్
అలసట చేందే ఆత్మీయమ్మే , క్షణమున పొందే క్షంతవ్యమ్మున్
మెలుకువ వల్లే మోక్షం దేవీ , అణువణువౌనేలే శ్రీదేవీ
334.. శిశు భరణం.. నన నన సగ....యతి..10
కలక కరుగు కలియుగము సుఖముగాలే
నిల నిలయ దినకర నికర మేలే
కలతల నెలవు తరగనిదేలే
స్వలితలపు మదిమన సహదేవీ
335.. బంధక.. భ న మ గ....యతి..6
గట్టున మెలగ చింతాక్రాంతిన్ , కాలము జరగ కర్తవ్యమ్మున్
పట్టున తడుప శాంతావాసిన్, మేళము పరమె మాధుర్యమ్మున్
కట్టుగ మెరగ శీలా సౌరీ , తాళము కలత తాత్పర్యమున్
పట్టున సలప దివ్యా దేవీ, గాలము కలగ నే శ్రీదేవీ
336..భదిరా..2.. సభరయ....యతి..7
చిరుహాసమ్మగు చింతలేలు టేల్లా
అరుణా కాంతియు ఆత్మతత్వమ్మే
పరువే నానచు పంతమే తెల్పే
కరువే తీర్చియు కాలమై దేవీ
337.. బలోర్జితా.. న జ ర య....యతి..8
కళలను జూప పక్క తత్త్వమ్మే
కలలను సాగ నెక్కు బావ్యమ్మే
అలలుగ సాగు సంద్ర లక్ష్య మ్మే
మెలికలు బంధ నెమ్మొ శ్రీదేవీ
338.. బహుళభ్రం.. సభ సభ మ....యతి..10
మనసాయే పదనిసలే మానవ శ్రీశక్తీ
వినసొంపే విధి వెతలే వేదన శ్రీరక్తీ
కన లేకే మది పలుకే కావ్యము శ్రీయుక్తీ
అనలేకే పెదవులగా ఆనతి శ్రీదేవీ
339.. బాలా.. త న భ త య గ....యతి..7
శ్రీ లక్ష్మి సకల శ్రీకర తత్భావము సంస్థానా
శ్రీ లక్ష్మి వినయ శ్రీ శర్మ రమ్యమ్ముయు సత్కీర్తీ
శ్రీ లక్ష్మి సహన శ్రీ మూర్తి గ్రహ్యస్తాం సంతృప్తీ
శ్రీలక్ష్మి లలిత శ్రీ చండి శ్రీవాణీ శ్రీదేవీ
340..బింబం.. న స య ..యతి లేదు
సరిగమలు గాను విద్యా , పరి పరి విధాల మధ్యా ,
శిరుల పలు కాయ మిధ్యా , కరుణ మనసాయ దేవీ ,
తరుణ తపమాయె దారే , చరణ జపమా సుఖమ్మున్
అరుణ కిరణమ్మున్ సర్వం , కరుణ మహిమాయె దేవీ
341..బింబా లక్ష్యం.. మ ర త త గ గ....యతి..7
శ్రీరంగం శ్రీకరం శ్రీ రాగము శాం తాకారం
శ్రీరక్షా శ్రీ వాణీ శ్రీ దివ్య మహా కర్తవ్యా
శ్రీ విద్యా శ్రీ బుద్యై శ్రీ లక్ష్మి మహా మాయవ్యా
వారాహీ చంచలా వాసవి మహా శ్రీ దేవీ
342.. భోదాతారా.. య మ య గ....యతి..5
స్వరాగమ్మే సాక్ష్యమ్ము సత్యమ్మే ,
స్వరాష్ట్రమ్మే సాహిత్య సంతృప్తే ,
స్వరోగమ్మే సానిత్య కష్టమ్మే ,
పరానమ్మే ప్రాబల్యమే దేవీ ,
343.. బ్రహ్మానంద.. మమ మమ మమ మ...యతి...9..16
ఉర్విన్ నిత్యమ్మేలే దాత్రుత్యుత్సాహంమ్మే విద్యార్ధీ ఉన్మాయే శ్రీ వాణీ
సర్వమ్మున్ జీవమ్మున్ విశ్వాస మ్మే నావ శ్యమ్మేలే సంతృప్తీ శ్రీ లక్ష్మీ
పర్వంమందే సర్వమ్ సర్వా సంపాదమ్మే యానందం ప్రామాన్యం శ్రీవిద్యా
సర్వే లౌక్యమ్మేలే విశ్వా సాక్ష్యమ్మే లే ప్రేమమ్మే సాహిత్యం శ్రీదేవీ
344.. భంగి.. భభ భభ నయ....యతి..13
ఎవ్వని పిల్పులు నెంచియు యాడు ట యెరుకయు నీవే
నవ్వుల కొల్వుల మధ్యన నెంచుట నటనలు నీవే
బేవ్వని మాటలు పట్టియు నుండిన బడలిక నీదే
సవ్వడి చేసియు మోజును మా ర్చియు సహనము దేవీ
345.. భసల శలాకా.. మభ సమ మయ తన గగ....యతి..9,17
సౌందర్యం నేర్పుకు మెరుపౌ సౌజన్యం సామ్రాజ్యమ్ము సౌకర్యము బట్టే
వేదాంతం వెల్లువిరియుటే విశ్వాసం విన్యాసమ్ము వీరత్వము బట్టే
మాధుర్యం ఆశ తలపు మార్గంమేలే న్యాయమ్ము మా పల్లెల బట్టే
మాంధవ్యం మానసమగు మచ్చే లేనీ విద్యార్థ మాక్షేమము దేవీ
346.. భసలసలాక.. స భ స మ న య త న గగ....యతి..9,17
మలుపే బంధ మగుట మాంగల్యం మే మనసగు మార్గమ్మే జ్ఞానమగుట ప్రేమా
పలుకే సత్య మగుట ప్రారంభమే స కలము ప్రేరత్వం సర్వ మగుట ప్రేమా
వలపే దాహమగుట వాచల్యమ్మే సమయము యారోగ్యం నిత్య మగుట ప్రేమా
అలుకే ఆనతియగు ఆశ్చర్యమ్మే వినయము యానందం విద్య యగుట దేవీ
347..భస్త్రనిస్తరణం.. మస జ ర స గ....యతి..15
విశ్వమ్మంతయు రక్షసేయు దైవమే తరువై నీ
శశ్వచ్ఛుండపరాక్రమోద్ధ తిష్టయే మనసై యీ
విశ్వశ్రేయము గూర్చు తల్లి సేవ యే కరుణా ణీ
విశ్వాసమ్మునకున్ బలమ్మి కూర్మి గావిన దేవీ
348.. భారావతార: న స జ న న త గగ....యతి..13
అవసరము గా సహాయ పలుకు అనుభవమ్మేను ఓర్పే
నవవిధములేను భక్తి వినయ నయనాల నేర్పే
యువకుల విద్య లనేర్పు సహన యువలోక తీర్పే
భవ భవము భారతీ విజయము భవ నేస్త దేవీ
349..భాజనశీలా.. త య ర ర గ...యతి...7..
సంతోషము యుర్వీ సామ రస్యమ్ము గానే
పంతమ్ములు సర్వమ్ ప్రాణ రక్షత్వ మేలే
శాంతమ్ములు పొందే సాహసమ్మేనులే ప్రే
మత్వమ్ముయు కోరే మానసమ్మేను దేవీ
350 ..భారంగి ..జ స గ గ .. యతి లేదు
వినాశ కధలే సాగే , ప్రలోభ మనసే సాగే
యనాది విలువే తగ్గే , స్వలాభ తపమే సాగే
గణాల తెలివే పెర్గే , కలోల జయమే సాగే
క్షణాల కరుణే దేవీ , కులాలు భయమే దేవీ
351.. భాసమానబింబం.. ర జ భ స జ భ స య....యతి..7,16
అల్ల నల్లనయ్య సాహస మనుటేను దివ్యమై నిజమగుటేను మాయా
పల్లవించు బావ భాగ్యము యగుటేను నిత్య బాధ్యత యగుటేను మాయా
చల్లనైన లక్ష్య చేష్టలు తలపే సహాయ శాంతియు తలపించు మాయే
మెల్లగాను సాగు మోక్షము కలలే విధాన మేలును కలిపించు దేవీ
352.. భాసితభరణం... భ స మ మ.. ..యతి..09
ఆమని పిలుపు ఆత్మా ఆశ్చర్యమ్మే
భామిని కులుకు భాగ్య బంధవ్యమ్మే
కామిని కళలు సేవ్యా కర్తవ్యమ్మే
శోముని వెలుగు సవ్యా సౌజన్యమ్మే
353.. భాస్కర వెలసితము.. భ న జ య బ న న స గ...యతి...13
నిర్దయ వలనను కష్టము నిత్యా నిష్టలు నలిగి చెరిగే లే
మర్దన కలుగుట నష్టము విద్యా మిధ్యయు కలిగి మనసేలే
దుర్దశలు మలుపున జీవిత మంతా దుర్గుణముల వలననే లే
వర్ధనము నిలిపి వరాలను ఇచ్చే వాంఛల మలుపులలొ దేవీ
354. భీమా భోగ :. మ త త మ మ ర ర గ....యతి..13
కాలంమేలే భాగ్యపరమ్మే నిత్యం మై కామాక్ష్కీ కోర్కెలన్నీ కళాత్మే
మూలంమ్మే లే ముఖ్యపరమ్మే సత్యమ్మే ముఖ్యమై మార్పులన్నీ జయమ్మే
మేళం శబ్దం సర్వపరమ్మై నిత్యాయై మోక్షమ్మై ఓర్పులన్నీ భయమ్మే
గాలంవైనం విశ్వ పరమ్మై విద్యా యై దీక్షమ్మే నేర్పులన్నీ
355..భీమావర్త:. మ భ న న స గ..యతి ....యతి..11
వేదంమ్ముల్ యోగము విజయసభ సమయమేలే
మోదమ్ముల్ రోగము విముఖసముఖ ముగనేలే
నాదమ్ముల్ రాగము సహజము నటన మదినేలే
ఖేదమ్ముల్ దీర్చుట నియమము కళలు దేవీ
356..య య య య..యతి ....యతి..8
నియోగమ్ములన్ సంఘ నిర్మాణ మేలే
వియోగమ్ములన్ సంఘ విజ్ఞాన మేలే
దయామూర్తిగన్ ధర్మ జిజ్ఞాస యేలే
నయమ్మై జనానంద నాదమ్ము దేవీ
357..బుజంగ:.. యయ యయ యయ యయ..యతి .. 8,21
గుణాత్మా సుఖాత్మా సగుణ్యాత్మ భూతాత్మ పూతాత్మ సంచార సా గుణ్య రూపా
ధనాత్మా నవాత్మా విధాతాత్మ భా వ్యమ్ము సంఘమ్ము ధర్మమ్ము సంతాన రూపా
జనాత్మా సురాత్మా విసుద్దాత్మ దేహాత్మ జీవాత్మ దివ్యాత్మ నాదాత్మ రూపా
ఘనాత్మా శివాత్మా ప్రకాశాత్మ లక్ష్యాల కాలమ్ము వైనమ్ము వైగాచు దేవీ
358.. మధుకరీ.. న న మ యతి లేదు
కనులు కలియు భాగ్యమ్మే , కధలు తెలుప సౌఖ్యమ్మే
తనువు రగిలి దుఃఖమ్మే , మదన మలుపు మోహమ్మే
క్షనిక సుఖము బంధమ్మే , వదన కళలు భావమ్మే
మనము తెలుపు శ్రీదేవీ , కధలు కళలు శ్రీదేవీ
359.. భుజంగ శిశురుతము .న న య యతి లేదు
చిలక పలుకుల యందున్ ,
కలత చిలికెడి నందున్ ,
మలుపు తిరిగెడి చిందున్ ,
కలము కలలగు దేవీ ,
360.. భూధరా.. మమ నన భయ య..యతి ..7,14
లోపంబుల్ నేరంబుల్ లలిత మగుట లోకమున బంధాలు నిల్పున్
శాపమ్ముల్ సోకమ్ముల్ సరళ మగుట శాంతమున రక్షా రీతిన్
పాపమ్ముల్ పాశమ్ముల్ పలుకు లగుట సంఘమున హర్షా శక్తిన్
తాపమ్ముల్ దోషమ్ముల్ తరుణ మగుట తాండవము మార్చే దేవీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి