1, ఆగస్టు 2024, గురువారం

 

బాల సాహిత్యం 


సీ..ఎదుటివారి పలుకు  ఎదను తట్టగలుగు - పదును చూప కలుగు పదనిసగను 

వదులు వదలనకు వరుసగలపు యింతి - పదులసంతసము గా పాఠ మగును

అదుపు తప్పక సాగు అదునుగా సుఖమయి - మృదుల మద్దెల కళ శృతి లయలగు 

కుదురుగా కుమ్ముటే కుందనపు కళలు - పొదల మాటున పోటు కలుగు 


తే..చదువు లేని సుఖము చూడు చలవ చేయు - అదుపు లెక్కయున్నను కష్ట పాలు చేయు 

వధువు వయ్యారములు చూపు వరద చేయు - మది మదనపు కళలగు మంద బుద్ధి 


****

సీ..ఎగిరేపతంగము ఎదురుచూపుల గాలి - జీవితము తతంగ జీవ జాలి 

చదరంగ పఠముగా సలుప చేష్టల గాలి -గమ్యమ్ము భద్రమ్ము గమన తీరు 

జీవన స్వేచ్ఛయె మది చిత్రవిచిత్రము -సూత్రదారం విధి చూపు పఠము 

వలయముగను తిర్గి వయ్యారమును జూపు -పట్టువిడవ కుండ పఠము యెగురు 


ఆ.. పరుగు పిల్ల పాప పఠము పట్టనులేక -దొరక పుచ్చ గలుగు దొరగ నేడు 

జీవితాన జరుగు జీవయాత్ర పఠము -మనిషి గాలి పఠము మనసు పఠన 

***


సీ..సుందరి శిల్పము చూపులతొ పసందు -

సందడి చేయుట సంక నెక్క 

పందెము కాదులే పంతము ముద్దుకై -

సాందర్య మౌనము సాధు పక్క 

అంద పసందును అందియందకచేయు -

మందమారుత మగు మధువు దక్క 

చందన చర్చిత జప హావ భావమే -

కుందనపు మహిళా కూడు కక్క 


ఏమి లావణ్య లలనవు యేల మొక్క -

కామి తార్ధ యధరములు కాచు దక్క 

సామి తీర్ధపొందికయగు సాకు ముక్క -

తిమిర తాపము తీర్చేడి తెగువ దక్క 


***


సీ..పెట్టిన దినమున పెనవేయు చుట్టము=

నట్టడవుల కైన నడచి వచ్చు

బెట్టని దినములు బెట్టుగా సాగును -

గట్టెక్కిన మనిషి గాన వచ్చు 

ముట్టననుచు చెప్పు ముచ్చట్ల తోముంచు -

వట్టి మాటలనుచు వళ్ళు దోచు 

గిట్టు ధనముకోరు గెంతు లేసెడిబుద్ధి -

వట్టి మాటలు కావు వొట్టు చెప్ప


తే..కట్టి కొట్టెడి మనిషిగా కాటు వేయు -

చిట్టి చూపు చిన్నదనుచు చేటు చేయు 

మట్టి మిన్ను మధ్య బతుకు మాయ చేయు -

పట్టి పట్టని మనసుగా పాట తెలుపు 


***


సీ..అందునిందును నెందు? సందేహ మెందుకు? -

సందుసందున మత్తు మందు చిందె

మందు పొందిన మంది మందులై కీడును -

విందులతొ సునందు వింత చెందె 

చిందునందునుపొందు చిందులేసెడి చెందు -

మందు ముద్దు ముందు మనసు చిందె 

ఇందు యందన సందు ఇంతులతొ పసందు -

బందులున్నను పొందు బంధ మందు 


ఆ..తక్కువగను నీరు త్రాగుట యేమందు? -

నిద్ర లేక తిరుగు నీడకేమియు మందు?

మందు ఎక్కవగుట మనుగడేది యు పొందు? -

చిందు లేయ విందు చిన్ని కోపము చెందు 


****


ఉ..అంకిత భావమే వదిలి అన్నము కోరిడి ఆశ జీవిగన్ 

సంకటమయ్య యవ్వనము శాంతినికోరుట సాధు మార్గమున్

వంకలు చెప్పు నీతిరతి వాక్కుల మాయల మోసపు బుద్ధిగన్ 

బంకుల నుండలే ననియు బాదర బందియు యేలనాకుగన్

***


సీ..మంచి కవిత యన్న మంచి కవియటన్న -

మంచి యనగ నేది మంచి దగును 

మనిషి మనిషి వోలె మసలునటుల జేయ  -

మానవత్వము జూపు మహిమ గాను 

మారుతున్నా కాల మనసు మాయను కమ్ము -

మనిషి చెలిమి వల్ల మమత చెడును 

మస్తకాల వలనా మనుగడ ప్రశ్నయే -

పచ్చదనము గున్న పంత మేను 


చిలుము పట్ట తోము పలుకు చెంబు బతుకు -

గలుషితముయున్న కుంపటి కాల బతుకు 

బలిమి యున్ననూ బంధము బట్టి బతుకు -

మలిన మైన బుద్ధి గనుమా మాను బతుకు 

****


సీ..నిజయబద్ధము తెల్ప నియమపాప మగుట -

ఎన్నెన్నొ యందాలు యేల యనకు 

ప్రాయశ్చితము నున్న పాపమె మారను -

మరణంచినాకీర్తి మార కుండు 

ఆత్మపీడన వల్ల ఆత్మీయతలు మారు -

అరుణకిరణ మల్లె ఆశ బతుకు 

శాశ్వతమ్ము యనినా జగతి యందున లేదు -

యీ శరీర ఋణము తీర్చ యిచ్ఛ 


తే..ఆశ యనెడి పిశాచిగా ఆత్ర మేల =

విధి నమస్కార దూషణ వింత యేల

ఏడుస్తూ ప్రశంసిస్తాడు యిoదు యేల -

నవ్వి నవ్వుల మనిషియే నటన బతుకు

***


సీ..మనిషివిలువమారు మనసుకలిగి నాక -

కాలం విలువ తీరు కళలు చేరు 

మనది కానిది యేది మనదైన బ్రతుకేది -

మనదనే జీవితమ్ మనసు కళలు 

ప్రేమ పలకరింపు ప్రీతి గా చిరునవ్వు -

ఆప్యాయత కళలు ఆది పిలుపు 

మనకష్ట యిష్టము మనవాళ్ళు నేస్తము -

గౌరవించే వాళ్ళు గళము తీరు


తే..దేహ మాతృడిగానుండు దివ్య గురువు -

దేహ భావము పోగొట్ట దీక్ష గురువు

స్పష్ట సత్యాన్ని యనుభవ సాధ్య గురువు -

మార్గదర్శనం మాయను మాప గురువు 

***


సీ..నీరు పల్లమెరుగు నిజము దేముడెరుగు -

నీరు సూత్రమెరుగు నిప్పు వెలుగు 

నోరు ఓర్పు పరుగు నోము పూజ జరుగు -

కోరు మార్పు పెరుగు కోర్కె వెలుగు 

పోరు నిత్య కలుగు పోకచెక్క వెలుగు -

యేరు పొంగ గలుగు యేల వెలుగు 

ఊరు పాట జరుగు ఊపిరి కథలగు -

జోరు బుద్ధి గలుగు జోగి వెలుగు 


తే..తప్పదు వెలుగు చీకటి తల్లి తండ్రి =

ఒప్పు తప్పులు తప్పవు ఓర్పు నేర్పు 

నిప్పని తెలిసి కదులుటా నిష్ట బల్కె -

తిప్పల మనసు తిరుగుటే తెల్పు జీవి 

***


సీ..కలవారు యనువారు కాలమందు పలుకు -

కల్లాఖపటముగా కాంచు వారు

ధనమున్న ధరణిలో దరిద్రమనెడివారు -

హితమెల్ల తెలిపెడి హితులు కారు

బంధము ధనమైన బాధ్యత కనలేరు -

ప్రేమ పరిమళము పెర్చలేరు

మనిషి విలువ గూర్చి మదిలోన తెలపరు -

పలుమారు పనిలేక బలుకు వారు


తే..గాల వశమున సర్వంబు గోల వారు -

సుగుణ వంతుని ప్రేమతో జూచు వారు

ధనమదముతో జలగలుగా దాత లేరు  -

వినరు నెవ్వరు చెప్పగలుగు వింత పోరు 


***-

సీ..చిన్నప్పుడు చదువు చిన్నబుచ్చవలదు -

కన్న వారి పలుకు కనుల తీరు 

మన్నుతినెడి పాము మత్తుపెంచును యన్న -

మిన్ను తీరు చెలిమి మెచ్చ లేరు 

చన్నులు కుదిసినా చెపల బుద్ధి కలుగు =

మెన్ను విరిగి పడ్డ మేలు రారు 

తన్నులెన్ని తినినా తప్పులెరుగ లేరు -

ఉన్న మాట తెలప ఊరు కోరు 


తే..యున్న నాళ్ళు నిజము పల్కు యుద్ధ భూమి -

పన్ను కట్టి పలుకు చుండు పాప భీతి 

పెన్నిధి మనసు గమనించు పేరు కాదు -

చిన్నది యనకు కష్టము చింతలనకు 


***

సీ..చల్లని కెరటాలు చక్కని చుక్కలు =

అల్లిక జీవాలు ఆశ కళలు 

మల్లిక మహిమలు మక్కువ చూపులు -

తుల్లిన మమతలు సుఖపు కళలు 

జల్లెడ వినయాలు జారెడి పయనాలు =

వెల్లువ పలుకులు విశ్వ కళలు 

కల్లలు కథలేలు కావ్యపు గులికలు =

పల్లవి రాగాలు పలుకు కళలు 


తే..చిల్లర బతుకుల కళలు చేరు కలలు -

ఎల్లలగుట దశ దిశలు యాశ కలలు 

పల్లకి కళ కదలికలు పారు కలలు -

పల్లవి పదనిస లతలు భావ కలలు 

***

సీ.. ఇరుగుపొరుగు పోరు ఇష్ట నష్టము జోరు -

తలచు కడలి హోరు తనము తీరు 

విశ్వశాంతినికోరు విజయానికి కబురు =

విసిగిస్తె బేజారు వింత చేరు 

మాట తీరు తెలుపు మాయ తెలుప నోరు -

ఈ పరిస్థితుమారు ఇంటి పేరు 

బద్దకం ఉంటేను బంధతీరును మారు -

ఆణిముత్యము తీరు ఆర్తి మారు 


తే..గౌరవించ మూలము చూడు గొప్ప తీరు -

అదుపు చేయాలి నోరునే ఆశ తీరు 

మంచి పేరుఊరు పలుకు మనసు చేరు -

మరెవరూ సాటి రాలేరు మాయపోరు

***

సీ..మనమనుకున్నను మనవాళ్ళు కాలేరు -

మన యిష్టమును బట్టి మనకు రారు

మనకష్టపు మనసు మమత పంచను లేరు -

మన నష్టముయె మార్పు మాయ తీరు 

మన గౌరవపు విద్య మంచి మలుపు కోరు =

మనయాస్తి గుణముయే మంత్ర తీరు 

మన ప్రియ నేస్తము మనుగడ మనవారు -

మనపలుకే విధి మనుషి తీరు


తే..సేవలన్ని చేయ తలపు చిత్రమగుట =

చేవ లేనట్టి వారికి సేవ చేయ 

తోవయేదైన నడుచుటే టో ట్రుపాటు -

నావ కదలికే జీవితమ్ నటన తీరు

**-

సీ..కనుగొన లేనును గాయపు హృదయాన్ని - మనమని లేనట్టి మానసమ్ము 

ధనమున్న ఫలముయు ధరణినా పొసగదు - గొనకొని వెల్లువ గోరు పోటు 

కనలేని పకృతియే కనికరమే చూపు - గొనలిడు కాలము గూలు చుండు 

వినలేని తనముయె వింత వాకిటగుటే - అనలేని అసలు అదురు పట్టు 


క్షణమొక యుగమగుట క్షణ్తవ్యుని బతుకు - కనుల చూపు లేని కావ్య జగతి 

మనసు మర్మ మేను మనుగడ యాటలే - ఇనుము లాంటిబతుకు యీశ్వ రేచ్ఛ

*****

సీ..తిండి లేక వొకడు  తినలేక మరొకడు - ఉండి లేదనువాడు ఉండలేడు

మొండిగా బతికాడు మోజుతో నసిగాడు - దండిగా తినువాడు దండ గోడు 

గుండిగా పొట్టోడు గుండుగలిగినోడు- బండిలా కదిలాడు బండ లోడు 

వండి వార్చెడివాడు వరుడి యాట ల వాడు - రండి యనెడు వాడు రండ మొగుడు 


ఆ..ఉండ బట్ట లేదు ఉరికెడి వాడులే - కనులు లేని  వాడు కండ లోడు 

కుండలున్నవాడు  గూడు మూకుడు తిండి - బండ బతుకు యెoడ పండ బుద్ధి

***

సీ..డబ్బుతో పొందేది డాంబిక బతుకుయే - డబ్బులో మునిగియే డప్పు కొట్టు 

డబ్బు నిలకడేది ఢమఢమా ఖర్చులే - డబ్బు రోగ మయము ఢమరకమగు 

డబ్బు కే పరుగులు డ్రమ్ము మోతలు గాను- డబ్బు లేకయు తంట ఢoక మోత 

డబ్బు జబ్బువదలు డబ్బువిద్య బతుకు - డబ్బు చిన్నాచూపు డబ్బు కేల


తే..సబ్బులా కరుగేబుద్ధి సమయ ధనము - గబ్బు వున్న డబ్బునుచేరు గమ్య మేను 

మబ్బు లాడబ్బు ఆశలు మార్గ మౌను - డబ్బు కదలికే ఙివితం డచ్చి లచ్చి 

***

సీ..తెలుగు మాట్లాడరా తెగులు ఆంగ్లము వద్దు- తెలుగు చిదంబరం తీరు చదువు 

తెలుగు బ్రాహ్మణ విద్య తెలుసుకో జాతకం - తెలుగు అర్ధమ్ము గా తీరు చదువు 

తెలుగు తల్లీ దేవి తక్షణ శోకమౌ - తెలుగు గౌరవమేను తీరు చదువు 

తెలుగు కథలుగాను తెలపగలుగు విద్య - తెలుగు భూమి యిదియు తీరు చదువు 


ఆ..తెలుగు బాష వెలుగు తేట తెలుగు విద్య - తెలుగు నాడి గతియు తెల్ప చదువు 

తెలుగు దేశమిదియు తెలుపగలుగు విద్య - తెలుగు బాష యేను తిష్ట చదువు

***

సీ..  రాజిల్లు భాషయే రాష్ట్రమంతట విద్య - భాజా భజంత్రీగ బంధ తెలుగు 

పెద్దయు చిన్నయు పేర్మితొ జదువంగ - రాజకీయము వద్దు రవ్వ వెలుగు విద్య 

వాజి విజయ మగు  వాగ్దేవి యొసగిన = కాజ తీపి కనికరమ్ము తెలుగు  

 అదియెను తెలుగను అధికార భాషగా - అక్షరా లధికము అంధ చదువు 


ఆ..కానగలుగు చుండు కాంచనంబు తెలుగు - అమృత భాష తెలుగు అమ్మ తలపు 

విజ్ఞ తెరిగి జదువ వినయంబు జేకూర్చు = తెలుగు తేజ మదియ తెలియ చుండ 

***

సి..మాట మంచిగనుమా మనసు ఘనము చూడు - మాటే మనసు అద్ధమౌను నిజము 

మాట తెలుపు జీవి మాయ అహమగుటే - మాట బేధము యుద్ధ మనసు నిజము 

మాట ధార వెలుగు మాతా పితురు లౌను - మాట మలుపు ధార మమత నిజము 

మాట గురువు బోధ మంత్ర చెలిమి గాను - మాట జీవితమేను మాయ నిజము


ఆ..మాట విలువ జూడ మంత్రమౌను విధిగా - మాట మంచి చూడు మార్గ మౌను

మాట నిత్య సత్య మానసమ్ము గనులే - మాట మంచి చెడుకు మాయ తలపు

***

సీ..హద్దులు గీస్తున్న హోదా యహమ్మగు - ఈర్ష్య యసూయల ఇచ్ఛ యేల

సమరమ్మ సుఖమగు సమయమే జీవితమ్ - ఎదురీత ప్రళయమే యదల లీల

తెలివితో వ్యూహమ్ము తెగువతో జీవితమ్ - ఓయదృష్టముపొంద ఓర్పు లీల

సుడిగుండమున పడ్డ సృష్టిగ జీవితమ్ - నవ్వుల బహుమాన నయన లీల


గీ..త్యాగము పరమోన్నతమౌను కాల బుద్ధి -నిలయ రాజీవ యానంద నిత్య బుద్ధి 

భాగ సంజీవనముగాను భాగ్య బుద్ధి - నాగరికత నడక జూప నయన బుద్ధి

 

***


సీ..మకరంద సుమధుర మాధుర్య మధులత - ప్రతి యెదలోననె ప్రభల గీత

మది భాషణంగాను మనుగడగ సమత - రసవాహిని పలుకు రాస గీత 

నిత్య అంతర్వాహినిగను సాగు మమత - ప్రణవ ప్రకరణమె ప్రకృతి గీత

మేధోమథన మేఘమథనమై చతురత - ఉరిమి మెరుపులై ఊహ గీత


గీ..ఆత్మ అవినాశ నిత్యమై ఆశయమగు - కళలు పంట వీనుల విందు కాల మయము 

కలలు తీరు జయముగాను కనుల తీరు - కథలు కావ్య మగుట నెంచ కామ్య చరిత


****


సీ..ఎంత బ్రతుకు నందు నంత సంతోషమ్ము - ఎంత చెట్టుకునైన నంత గాలి

అంత యింతని యెంతైన నొక్కటే - చింత పడగరాదు చెంత గాలి 

కొంత భక్తిని జూపి కొంత రక్తిగా జూపు - ముంత నాకుడులోన ముంపు గాలి 

బొంత బతుకుగాను బోధచదువు గాను - శాంతి లేని బతుకు శాప గాలి 


గీ.కాల నిర్ణయమే యిది కావ్య జగతి - ఎంత చెప్పినా తక్కువే యేల జగతి 

జాలి అహము కోప పలుకు జాతి జగతి - మారు మాటలేని బతుకు మాయ జగతి 

***


సి. రమ్యంపు పలుకులై రాయంచ ములుకులై -అలరారి విలసిల్లు అలక జూపు 

కాకలీ రవములై  కనువిందు భవములై - తెలివెల్గు లందించు  తిక్క జూపు 

జాబిల్లి వెన్నెలై  జలతారు వెల్గులై - తిలకమై వెలుగొందు తెలపు జూపు 

హిమశైల శిఖరమై హీరంపు నికరమై - తేనియల్ చిందించు తెలుగు కవిత 


తే . కమ్మకమ్మని రుచులూరి కానుకలవి -మధు సుధారలు కురిపించి మాయలు యవి 

పొద్దు పొడుపులై నిత్యమ్ము పోరు లవియు - దేశ వాసులన్మేల్కొల్పు తెలుగు కవిత


****


సీ..ఆర్యవర్ధన గను ఆయుష్ విధి పరమై -సర్వ శక్తి గమన సాధు బుద్ధి 

నిర్వి రామకృషియు నిజనిజాల పలుకు - కార్య నిర్వహణ కాల గుణము 

సౌర్య సహన విద్య సౌకుమార మెరుపు - ధైర్యమే సంపద ధరణి యందు 

పర్యావరణ రక్ష పాఠ్య భోద తెలుప - చర్యా వినయ వాంఛ చరణ రీతి 


తే..కానుక మది తలపు లౌను కామ్య మగుట -కవి చరణమే కళలు తీరు కాంచనమ్ము 

సమయ సద్వినియోగము సరళ రీతి -తెల్పు మల్లాప్రగడ రామ తేట ముద్దు 


****

సీ..నాలుగు దిక్కులు నయన కళల చూపు - ప్రతిపదము శ్రమించ  ప్రగతి కోరి 

త్రిగుణాల విషయాన తీవ్ర తపన తోడ - సత్వ గుణము వైపు సాగు కళయు 

ద్వంద్వాల విషయాన ద్వంద మేల నీకు - రెంటి కతీతమే రెప్ప బతుకు 

నీటిలో బుడగలే నీడలో వెలుగులే 

చినిగిన కాగితం చేరు చెలిమి 


తే.గీ.  మర్మ మెరిగియు జీవితం మనసు పంచు 

ధర్మ మార్గాన బ్రతుకుము ధరణి యందు 

అర్ధ పరమార్ధ సూత్రాలు నాచరించ

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

***

చిరునవ్వు మీవెంట చరితమార్చగలుగు -

ధరణి నీడ మనసు ధర్మ మార్గ

కరుణ చూపుకలయు కాలానుభవమగు -

తరుణ దుఃఖ సుఖము తనువు తీర్పు

మరులుగొల్పుమమతమానవత్వమగుట 

తరువు లాంటి బతుకు తమక జపము 

పరువు కోసమనియే పదములె విప్పకు

అరువు బరువుగుటే ఆశ వలదు


గీ..నమ్మకం సమ పాలన నయన తీరు

వమ్ము చేయని జీవితం వలపు తీరు

చెమ్మ రానీక కలతీర్చ చింత మారు

సమత మమత తీర్చ తలపు సహన చరిత

***

సీ..చిక్కులన్నియు చుట్టి చిత్తమందు జేరు

ఘర్షనల్ నొసగుచు ఘడియ ఘడియ

చేయగ ధ్యానమే చెలిమిచే కురుటయు 

ధైర్య ధనము నున్న ధరణి నీకు రక్ష

బద్ధక మంతయున్ బదులు చెప్ప లేదు

ఆత్మబంధువెపుడు నాదరించు

నిత్య శాంతపు నీడ కమ్ము కొనుట 

జగడమొద్దు మనకు సాగవోయి


తే. గీ.వినయ శంకారమై నిత్య విజయ మేను 

ప్రణవ మోంకారమై గతి ప్రగతి జూపు 

కులికి ఆడెడి పాడెడి కూర్పు గలుగు 

విశ్వ మాయకృష్ణునిలీల విజయ మేను

***

సీ..ఆకారమై త్రిగుణాకార సాకార - మై కన, నీ మది మౌనమేను 

రాకారమై మది శ్రీకారమై గతి - హుంకారమైవిధి హాస్యమౌను 

శ్రీకార భాంకార శ్రీ శక్తి కర్తవ్య - వెలయ టంకారమై వేదనౌను 

 శ్రీకార ఢంకార శ్రీ విద్య ఘీంకార - హంకారమైశోభ హారతౌను


తే. గీ మనసు ఝంకారమై కేకి మగ్గిపోవు 

వయసు క్రీంకారమై సిరి వడలి పోవు 

సొగసు ప్రాకారమై కళ సోకు పోవు 

 కలికి హ్రీకారమై చెలగ కాల మౌను

***


1 కామెంట్‌:

  1. మహత్వ పూర్ణ ప్రాంజలి ప్రభ చాలా బాగున్నది కొనసాగించండి. వీలయితే చక్కటి జాలగూడుగా పెట్టండి. ఇది నడుపుతున్న మాన్య! అబినంద పూర్వక శుభాశీస్సులు -భాగవత గణనాధ్యాయి.

    రిప్లయితొలగించండి