ఓం శ్రీరామ .. శ్రీ మాత్రేనమః .. ఓం నమః శివాయ
అనంతమైన భగవంతుని స్వరూపమును వర్ణించడానికిఉపాసించడానికి స్మరించడానికి సహస్రనామాలు చెప్పబడినవి. భగవంతుడు అనంతుడు. 'శతమనంతం భవతి'. నామము అంటే ఆ దేవత జ్ఞానము. ఇది ఉపనిషత్తు. ఈ సహస్ర నామ పారాయణము శివుని సంకల్ప శక్తిని ఉపాసించుట. మనిషికి ఎన్ని అవసరాలో అన్ని దేవతా రూపాలు. ఉదా: విధ్యకి సరస్వతి, ధనము కొరకు లక్ష్మి. లలిత అంటే లావణ్యము, లాలించేది మొదలగు అర్థములు చెప్పవచ్చు. లలిత ఉపాసన అంటే సౌందర్యమును ఉపాసించుట. లోకాతీత లావణ్యము లలిత. లోకాతీత లావణ్యముతో అన్ని లోకములయందు వ్యాపించి యున్నది, ప్రపంచానికి కారణమైనది పోషకమైనది, రక్షకమైనది అయిన అమ్మనే లలితాంబ
ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది
01.గాయత్రి దేవి అంటే..!!
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...
మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ...
తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా....ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపమని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు.
నా నుండి అగ్ని..
అగ్ని నుండి వాయువు..
వాయువు నుండి ఓంకారం..
ఓంకారంతో హృతి..
హ్రుతితో వ్యాహృతి..
వ్యాహృతితో గాయత్రి..
గాయత్రితో సావిత్రి..
సావిత్రితో వేదాలు..
వేదాలలో సమస్త క్రియలు..
ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
1. వినాయకుడు:.
సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. నృసింహ స్వామి:.
పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. విష్ణుమూర్తి:.
పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
4. ఈశ్వరుడు:.
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. శ్రీకృష్ణుడు:.
యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
6. రాధాదేవి:.
ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
7. లక్ష్మీదేవి:.
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
8. అగ్నిదేవుడు:.
తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
9. మహేంద్రుడు:.
రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి:.
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి:.
దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు:.
నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి:.
ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు:.
ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు:.
ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి:.
తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు:.
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు:.
కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ:.
సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు:.
భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు:.
ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు:.
సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస:.
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత:.
సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం..
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలాలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.
ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం.
ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
గాయత్రి మంత్రాక్షరాలు...
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు.
‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు.
వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
***
లలితా సహస్రనామాలు 1 నుండి 1000 వరకు మరియు వాటి అర్ధాలు
ప్రార్థన
చతుర్భుజే చంద్ర కలావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ధ్యానమ్
*అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్
*అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానిమ్
*ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం పద్మపత్రాయతాక్ష్మీం
* హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధెమ పద్మాం వరాంగీమ్
* సర్వాలంకారయుక్తాం సకల మభయదాం భక్తనమ్రాం భవానీం
* శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్ర దాత్రీమ్
సకుంకుమవిలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాo
సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభుషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరేద్దమ్బికామ్
1. శ్రీమాతా:- మంగళకరమైన, శుభప్రథమైన తల్లి
2. శ్రీ మహారాజ్ఞి:- శుభకరమైన గొప్పదైన రాణి
3. శ్రీ మత్సిం హసనేశ్వరి:- శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
4. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది
5. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది
6. ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది
7. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
8. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
9. క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
10. మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
11. పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
13. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
14. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
15. అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
16. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.
17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.
19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
22. తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.
23. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది
24. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.
25. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
26. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది
28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
30. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
31. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.
33. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది
34. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
35. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది
36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది
37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
38. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది
39. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.
41. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
42. గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.
43. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
44. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.
45. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.
46. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
47. మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.
48. మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి
49. సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
50. అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
51. సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
52. శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
53. శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.
54. స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది.
55. సుమేరు శృంగమధ్యస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
56. శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.
57. చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
58. పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
59.మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
60. కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
61. సుధాసాగర మధ్యస్థా - చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.
62. కామాక్షీ - అందమైన కన్నులు గలది.
63. కామదాయినీ - కోరికలను నెరవేర్చునది.
64. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది
71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
82. కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.
83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
85. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
88. మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
89. మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
90. కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
91. కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.
92. కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
93. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.
94. కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
95. కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
96. అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.
97. సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.
98. సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.
99. మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
100. బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది...
101. మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
102. విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.
103. ఆజ్ఞాచక్రాంతళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
104. రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.
105. సహస్త్రారాంభుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
106. సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
107. తటిల్లతా సమరుచిః - మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
108. షట్చక్రోపరి సంస్థితా - ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.
109. మహాసక్తిః - బ్రహ్మమునందు ఆసక్తి గలది.
110. కుండలినీ - పాము వంటి ఆకారము గలది.
111. బిసతంతు తనీయసీ - తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.
112.; భవానీ - భవుని భార్య.
113. భావనాగమ్యా - భావన చేత పొంద శక్యము గానిది.
114. భవారణ్య కుఠారికా - సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.
115. భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
116. భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.
117. భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.
118. భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.
119. భక్తిగమ్యా - భక్తికి గమ్యమైనటువంటిది.
120. భక్తివశ్యా - భక్తికి స్వాధీనురాలు.
121. భయాపహా - భయములను పోగొట్టునది.
122. శాంభవీ - శంభుని భార్య.
123. శారదారాధ్యా - సరస్వతిచే ఆరాధింపబడునది.
124. శర్వాణీ - శర్వుని భార్య.
125. శర్మదాయినీ - శాంతిని, సుఖమును ఇచ్చునది.
126. శాంకరీ - శంకరుని భార్య.
127. శ్రీకరీ - ఐశ్వర్యమును ఇచ్చునది.
128. సాధ్వీ - సాధు ప్రవర్తన గల పతివ్రత.
129. శరచ్చంద్ర నిభాననా - శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
130. శాతోదరీ - కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.
131. శాంతిమతీ - శాంతి గలది.
132. నిరాధారా - ఆధారము లేనిది.
133. నిరంజనా - మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.
134. నిర్లేపా - కర్మ బంధములు అంటనిది.
135. నిర్మలా - ఏ విధమైన మలినము లేనిది.
136. నిత్యా - నిత్య సత్య స్వరూపిణి.
137. నిరాకారా - ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.
138. నిరాకులా - భావ వికారములు లేనిది.
139. నిర్గుణా - గుణములు అంటనిది.
140. నిష్కలా - విభాగములు లేనిది.
141. శాంతా - ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.
142. నిష్కామా - కామము, అనగా ఏ కోరికలు లేనిది.
143. నిరుపప్లవా - హద్దులు ఉల్లంఘించుట లేనిది
144. నిత్యముక్తా - ఎప్పుడును సంగము లేనిది.
145. నిర్వికారా - ఏ విధమైన వికారములు లేనిది.
146. నిష్ప్రపంచా - ప్రపంచముతో ముడి లేనిది.
147. నిరాశ్రయా - ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
148. నిత్యశుద్ధా - ఎల్లప్పుడు శుద్ధమైనది.
149. నిత్యబుద్ధా - ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
150. నిరవద్యా - చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
151. నిరంతరా - ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది.
152. నిష్కారణా - ఏ కారణము లేనిది.
153. నిష్కళంకా - ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
154. నిరుపాధిః - ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
155. నిరీశ్వరా - ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
156. నిరాగా - రాగము అనగా కోరికలు లేనిది.
157. రాగమథనీ - రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
158. నిర్మదా - మదము లేనిది.
159. మదనాశినీ - మదమును పోగొట్టునది.
160. నిశ్చింతా - ఏ చింతలూ లేనిది.
161. నిరహంకారా - ఏ విధమైన అహంకారము లేనిది.
162. నిర్మోహా - అవగాహనలో పొరపాటు లేనిది.
163. మోహనాశినీ - మోహమును పోగొట్టునది.
164. నిర్మమా - మమకారము లేనిది.
165. మమతాహంత్రీ - మమకారమును పోగొట్టునది.
166. నిష్పాపా - పాపము లేనిది.
167. పాపనాశినీ - పాపములను పోగొట్టునది.
168. నిష్క్రోధా - క్రోధము లేనిది.
169. క్రోధశమనీ - క్రోధమును పోగొట్టునది.
170. నిర్లోభా - లోభము లేనిది.
171. లోభనాశినీ - లోభమును పోగొట్టునది.
172. నిస్సంశయా - సందేహములు, సంశయములు లేనిది.
173. సంశయఘ్నీ - సంశయములను పోగొట్టునది.
174. నిర్భవా - పుట్టుక లేనిది.
175. భవనాశినీ - పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.
176. నిర్వికల్పా - వికల్పములు లేనిది.
177. నిరాబాధా - బాధలు, వేధలు లేనిది.
178. నిర్భేదా - భేదములు లేనిది.
179. భేదనాశినీ - భేదములను పోగొట్టునది.
180. నిర్నాశా - నాశము లేనిది.
181. మృత్యుమథనీ - మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.
182. నిష్క్రియా - క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.
183. నిష్పరిగ్రహా - స్వీకరణ, పరిజనాదులు లేనిది.
184. నిస్తులా - సాటి లేనిది.
185. నీలచికురా - చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది.
186. నిరపాయా - అపాయములు లేనిది.
187. నిరత్యయా - అతిక్రమింప వీలులేనిది.
188. దుర్లభా - పొందశక్యము కానిది.
189. దుర్గమా - గమింప శక్యము గానిది.
190. దుర్గా - దుర్గాదేవి.
191. దుఃఖహంత్రీ - దుఃఖములను తొలగించునది.
192. సుఖప్రదా - సుఖములను ఇచ్చునది.
193. దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.
194. దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.
195. దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.
196. సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.
197. సాంద్రకరుణా - గొప్ప దయ గలది.
198. సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.
199. సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
200. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.ఓం శనైశ్చరాయనమః
201. సద్గతిప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
202. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
203. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
204. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.
205. సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.
206. సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది.
207. మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
208. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.
209. మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.
210. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.
211. మృడప్రియా - శివుని ప్రియురాలు.
212. మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.
213. మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది.
214. మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
215. మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.
216. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.
217. మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.
218. మహారతిః - గొప్ప ఆసక్తి గలది
219. మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
220. మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.
221. మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.
222. మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు.
223. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.
224. మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది.
225. మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.
226. మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి.
227. మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి.
228. మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి.
229. మహాసనా - గొప్పదైన ఆసనము గలది.
230. మహాయోగ క్రమారాధ్యా - గొప్పదైన యోగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో రాధింపబడునది.
231. మహాభైరవ పూజితా - ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.
232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే 233. మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.
233. మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి.
234. మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి.
235. చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
236. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.
237. కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.
238. మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
239. చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
240. చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది.
241. చారురూపా - మనోహరమైన రూపము కలిగినది.
242. చారుహాసా - అందమైన మందహాసము కలది.
243. చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది.
244. చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
245. చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
246. పార్వతీ - పర్వతరాజ పుత్రి.
247. పద్మనయనా - పద్మములవంటి నయనములు కలది.
248. పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.
249. పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
250. పంచబ్రహ్మస్వరూపిణీ - పంచబ్రహ్మల స్వరూపమైనది.
251. చిన్మయీ - జ్ఞానముతో నిండినది.
252. పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
253. విజ్ఞానఘనరూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.
254. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
255. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
256. విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
257. జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
258. స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
259. తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.
260. సుప్తా - నిద్రావస్థను సూచించునది.
261. ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
262. తుర్యా - తుర్యావస్థను సూచించునది.
263. సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
264. సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది.
265. బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
266. గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
267. గోవిందరూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది
268. సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
269. రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది.
270. తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది.
271. ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
272. సదాశివా - సదాశివ స్వరూపిణి.
273. అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది.
274. పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.
275. భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
276. భైరవీ - భైరవీ స్వరూపిణి.
277. భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
278. పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది.
279. భగవతీ - భగశబ్ద స్వరూపిణి.
280. పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి.
281. ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
282. సహస్రశీర్షవదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
283. సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
284. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.
285. ఆ బ్రహ్మకీటజననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
286. వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
287. నిజాజ్ఞారూపనిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
288. పుణ్యాపుణ్యఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.
289. శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
290. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.
291. పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
292. పూర్ణా - పూర్ణురాలు.
293. భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
294. భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు.
295. అంబికా - తల్లి.
296. అనాదినిధనా - ఆది, అంతము లేనిది.
297. హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.
298. నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
299. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
300. నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది
301. హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
302. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
303. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
304. హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.
305. రాజరాజార్చితా - రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
306. రాజ్ఞఈ - రాణి.
307. రమ్యా - మనోహరమైనది.
308. రాజీవలోచనా - పద్మములవంటి కన్నులు కలది.
309. రంజనీ - రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
310. రమణీ - రమింపచేయునది.
311. రస్యా - రస స్వరూపిణి.
312. రణత్కింకిణి మేఖలా - మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.
313. రమా - లక్ష్మీదేవి.
314. రాకేందువదనా - పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
315. రతిరూపా - ఆసక్తి రూపమైనది.
316. రతిప్రియా - ఆసక్తి యందు ప్రీతి కలది.
317. రక్షాకరీ - రక్షించునది.
318. రాక్షసఘ్నీ - రాక్షసులను సంహరించునది.
319. రామా - ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
320. రమణ లంపటా - రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.
321. కామ్యా - కోరదగినటువంటిది.
322. కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
323. కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
324. కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
325. జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.
326. కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.
327. కళావతీ -కళా స్వరూపిణీ.
328. కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
329. కాంతా - కామింపబడినటువంటిది.
330. కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది.
331. వరదా - వరములను ఇచ్చునది.
332. వామనయనా - అందమైన నేత్రములు గలది.
333. వారుణీమదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.
334. విశ్వాధికా - ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
335. వేదవేద్యా - వేదముల చేత తెలియదగినది.
336. వింధ్యాచలనివాసినీ - వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
337. విధాత్రీ - విధానమును చేయునది.
338. వేదజననీ - వేదములకు తల్లి.
339. విష్ణుమాయా - విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
340. విలాసినీ - వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.
341. క్షేత్రస్వరూపా - క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.
343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
344. క్షయవృద్ధివినిర్ముక్తా - తరుగుదల, పెరుగుదల లేనిది.
345. క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.
346. విజయా - విశేషమైన జయమును కలిగినది.
347. విమలా - మలినములు స్పృశింపనిది.
248. వంద్యా - నమస్కరింపతగినది.
349. వందారుజనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
350. వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
351. వామకేశీ - వామకేశ్వరుని భార్య.
352. వహ్నిమండవాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.
353. భక్తిమత్కల్పలతికా - భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
354. పశుపాశ విమోచనీ - వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
355. సంహృతాశేషపాషండా - సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.
356. సదాచారప్రవర్తికా - సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.
357. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
358. తరుణీ - ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
359. తాపసారాధ్యా - తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
360. తనుమధ్యా - కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
361. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.
362. చితిః - కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
363. తత్పదలక్ష్యార్థా - తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
354. చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
365. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.
366. పరా - పరాస్థితిలోని వాగ్రూపము.
367. ప్రత్యక్చితీరూపా - స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
368. పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
369. పరదేవతా - పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
370. మధ్యమా - పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
371. వైఖరీరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
372. భక్తమానసహంసికా - భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.
373. కామేశ్వరప్రాణనాడీ - శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
374. కృతజ్ఞా - చేయబడే పనులన్నీ తెలిసింది.
375. కామపూజితా - కామునిచే పూజింపబడునది.
376. శృంగారరససంపూర్ణా - శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
377. జయా - జయస్వరూపిణి.
378. జాలంధరస్థితా - జాలంధరసూచిత స్థానము నందున్నది.
379. ఓడ్యాణపీఠనిలయా - ఓడ్యాణ పీఠమునందు ఉంది.
380. బిందుమండలవాసినీ - బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
381. రహోయాగక్రమారాధ్యా - ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
382. రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.
383. సద్యఃప్రసాదినీ - తక్షణములోనే అనుగ్రహించునది.
384. విశ్వసాక్షిణీ - విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
385. సాక్షివర్జితా - సాక్షి లేనిది.
386. షడంగదేవతాయుక్తా - ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
387. షాడ్గుణ్య పరిపూరితా - ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.
388. నిత్యక్లిన్నా - ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
389. నిరుపమా - పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.
390. నిర్వాణసుఖదాయినీ - సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.
391. నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.
392. శ్రీకంఠార్థశరీరిణీ - శివుని సగము శరీరముగా నున్నది.
393. ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
394. ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
395. ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
396. పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
397. మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
398. అవ్యక్తా - వ్యక్తము కానిది.
399. వ్యక్తావ్యక్తస్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.
400. వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.ఓం శనైశ్చరాయనమః
401. వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
402. విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
403. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.
404. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
405. శివదూతీ - శివుని వద్దకు పంపిన దూతిక.
406. శివారాధ్యా - శివునిచే ఆరాధింపబడునది.
407. శివమూర్తిః - శివునియొక్క స్వరూపము.
408. శివంకరీ - శుభములు చేకూర్చునది.
409. శివప్రియా - శివునికి ఇష్టమైనది.
410. శివపరా - శివుని పరమావధిగా కలిగినది.
411. శిష్టేష్టా - శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
412. శిష్టపూజితా - శిష్టజనుల చేత పూజింపబడునది.
413. అప్రమేయా - ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
414. స్వప్రకాశా - తనంతట తానే ప్రకాశించునది.
415. మనోవాచామగోచరా - మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.
416. చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
417. చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
418. జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
419. జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
420. గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
421. వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
422. సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
423. ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.
424. తత్త్వాసనా - తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
425. తత్ - ఆ పరమాత్మను సూచించు పదము.
426. త్వమ్ - నీవు.
427. అయీ - అమ్మవారిని సంబోధించు పదము.
428. పంచకోశాంతరస్థితా - ఐదు కోశముల మధ్యన ఉండునది.
429. నిస్సీమ మహిమా - హద్దులు లేని మహిమ గలది.
430. నిత్యయౌవనా - సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.
431. మదశాలినీ - పరవశత్వముతో కూడిన శీలము కలది.
432. మదఘూర్ణితరక్తాక్షీ - పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
433. మదపాటల గండభూః - ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
434. చందనద్రవదిగ్ధాంగీ - మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
435. చంపేయకుసుమప్రియా - సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.
436. కుశలా - క్షేమము, కౌశల్యమును గలది.
437. కోమలాకారా - సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
438. కురుకుల్లా - ఆసనాన్ని అలంకరించిన
439. కులేశ్వరీ - కులమార్గమునకు ఈశ్వరి.
440. కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.
441. కులమార్గతత్పరసేవితా - కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.
442. కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.
443. తుష్టిః - తృప్తి, సంతోషముల రూపము.
444. పుష్టిః - సమృద్ధి స్వరూపము.
445. మతిః - బుద్ధి
446. ధృతిః - ధైర్యము.
447. శాంతిః - తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
448. స్వస్తిమతీ - మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
449. కాంతిః - కోరదగినది.
450. నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
451. విఘ్ననాశినీ - విఘ్నములను నాశము చేయునది.
452. తేజోవతీ - తేజస్సు కలది.
453. త్రినయనా - మూడు కన్నులు కలది.
454. లోకాక్షీ కామరూపిణీ - స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
455. మాలినీ - మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
456. హంసినీ - హంసను (శ్వాసను) గలిగినది.
457. మాతా - తల్లి.
458. మలయాచలవాసినీ - మలయపర్వమున వసించునది.
459. సుముఖీ - మంగళకరమైన ముఖము కలది.
460. నళినీ - నాళము గలిగినది.
461. సుభ్రూః - శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
462. శోభనా - సౌందర్యశోభ కలిగినది.
463. సురనాయికా - దేవతలకు నాయకురాలు.
464. కాలకంఠీ - నల్లని కంఠము గలది.
465. కాంతిమతీ - ప్రకాశవంతమైన శరీరము కలది.
466. క్షోభిణీ - క్షోభింపచేయునది అనగా మథించునది.
467. సూక్ష్మరూపిణీ - సూక్ష్మశక్తి స్వరూపిణి.
468. వజ్రేశ్వరీ - వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.
469. వామదేవీ - అందముగా నున్న దేవత.
470. వయోవస్థావివర్జితా - వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
471. సిద్ధేశ్వరీ - సిద్ధులకు అధికారిణి.
472. సిద్ధవిద్యా - సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.
473. సిద్ధమాతా - సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
474. యశస్వినీ - యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.
475. విశుద్ధి చక్రనిలయా - విశుద్ధి చక్రములో వసించునది.
476. ఆరక్తవర్ణా - రక్తవర్ణములో నుండునది.
477. త్రిలోచనా - మూడు లోచనములు కలది.
478. ఖట్వంగాది ప్రహరణా - ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
479. వదనైక సమన్వితా - ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.
480. పాయసాన్న ప్రియా - పాయసాన్నములో ప్రీతి గలది.
481. త్వక్ స్థా - చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
482. పశులోక భయంకరీ - పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
483. అమృతాది మహాశక్తి సంవృతా - అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
484. ఢాకినీశ్వరీ - ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.
485. అనాహతాబ్జ నిలయా - అనాహత పద్మములో వసించునది.
486. శ్యామభా - శ్యామల వర్ణములో వెలుగొందునది.
487. వదనద్వయా - రెండు వదనములు కలది.
488. దంష్ట్రోజ్వలా - కోరలతో ప్రకాశించునది.
489. అక్ష్మమాలాదిధరా - అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
490. రుధిర సంస్థితా - రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.
491. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
492. స్నిగ్థౌదన ప్రియా - నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
493. మహావీరేంద్ర వరదా - శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
494. రాకిణ్యంబా స్వరూపిణీ - రాకిణీ దేవతా స్వరూపిణి.
495. మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో వసించునది.
496. వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.
497. వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
498. డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది
499. రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
500. మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.ఓం శనైశ్చరాయనమః
501. గుడాన్నప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది.
502. సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
503. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.
504. స్వాధిష్ఠానాంబుజగతా - స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
505. చతుత్వక్త్ర మనోహరా - నాలుగు వదనములతో అందముగా నుండునది.
506. శూలాధ్యాయుధ సంపన్నా - శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
507. పీతవర్ణా - పసుపు పచ్చని రంగులో ఉండునది.
508. అతిగర్వితా - మిక్కిలి గర్వంతో నుండునది.
509. మేదోనిష్ఠా - మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.
510. మధుప్రీతా - మధువులో ప్రీతి కలిగినది.
511. బందిన్యాది సమన్వితా - బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.
512. దధ్యన్నాసక్త హృదయా - పెరుగు అన్నం ఇష్టపడునది.
513. కాకినీ రూపధారిణీ - కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.
514. మూలాధారాంభుజారూఢా - మూలాధార పద్మములో అధివసించునది.
515. పంచ వక్త్రా - ఐదు ముఖములతో నుండునది.
516. అస్థి సంస్థితా - ఎముకలను ఆశ్రయించి ఉండునది.
517. అంకుశాది ప్రహరణా - అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
518. వరదాది నిషేవితా - వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.
519. ముద్గౌదనాసక్తచిత్తా - పులగములో ప్రీతి కలది.
520. సాకిన్యంబా స్వరూపిణీ - సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.
521. ఆజ్ఞా చక్రాబ్జనిలయా - ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.
522. శుక్లవర్ణా - తెలుపురంగులో ఉండునది.
523. షడాసనా - ఆరు ముఖములు కలది.
524. మజ్జా సంస్థా - మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.
535. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా - హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.
526. హరిద్రాన్నైక రసికా - పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.
527. హాకినీ రూపధారిణీ - హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.
528. సహస్రదళ పద్మస్థా - సహస్రార కమలములో ఉండునది.
529. సర్వవర్ణోప శోభితా - అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.
530. సర్వాయుధ ధరా - అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.
531. శుక్ల సంస్థితా - శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.
532. సర్వతోముఖీ - సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.
533. సర్వౌదన ప్రీత చిత్తా - అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది.
534. యాకిన్యంబా స్వరూపిణీ - యాకినీ దేవతా స్వరూపములో ఉండునది.
535. స్వాహా - చక్కగా ఆహ్వానించునది.
536. స్వధా - శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వాగత వచనము.
537. అమతిః - మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.
538. మేధా - ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది.
539. శ్రుతిః - చెవులతో సంబంధము కలిగినది.
540. స్మృతిః - మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.
541. అనుత్తమా - తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.
542. పుణ్యకీర్తి - మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
543. పుణ్యలభ్యా - సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
544. పుణ్య శ్రవణ కీర్తనా - పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.
545. పులోమజార్చితా - పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.
546. బంధమోచనీ - అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
547. బంధురాలకా - అందమైన చిక్కనైన ముంగురులు కలది.
548. విమర్శరూపిణీ - జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.
549. విద్యా - జ్ఞాన రూపిణి.
550. వియదాది జగత్ప్రసూ - ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.
551. సర్వవ్యాధి ప్రశమనీ - అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.
552. సర్వమృత్యు నివారిణీ - సకల మృత్యుభయాలను పోగొట్టునది.
553. అగ్రగణ్యా - దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
554. అచింత్యరూపా - చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
555. కలికల్మషనాశినీ - కలియుగ మలినములను పోగొట్టునది.
556. కాత్యాయనీ - కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
557. కాలహంత్రీ - కాలమును హరించునది.
558. కమలాక్ష నిషేవితా - విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.
559. తాంబూల పూరితముఖీ - తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
560. దాడిమీ కుసుమప్రభా - దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.
561. మృగాక్షీ - ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
562. మోహినీ - మోహనమును కలుగజేయునది.
563. ముఖ్యా - ముఖ్యురాలు.
564. మృడానీ - మృడుని పత్ని.
565. మిత్రరూపిణీ - మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.
566. నిత్యతృప్తా - నిత్యసంతుష్టి స్వభావము కలది.
567. భక్తనిధిః - భక్తులకు నిధి వంటిది.
568. నియంత్రీ - సర్వమును నియమించునది.
569. నిఖిలేశ్వరీ - సమస్తమునకు ఈశ్వరి.
570. మైత్ర్యాది వాసనాలభ్యా - మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.
571. మహాప్రళయ సాక్షిణీ - మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.
572. పరాశక్తిః - అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.
573. పరానిష్ఠా - సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.
574. ప్రజ్ఞాన ఘనరూపిణీ - ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.
575. మాధ్వీపానాలసా - మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.
576. మత్తా - నిత్యము పరవశత్వములో ఉండునది.
577. మాతృకావర్ణరూపిణీ - అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.
578. మహాకైలాస నిలయా - గొప్పదైన కైలసమే నిలయముగా గలది.
579. మృణాల మృదుదోర్లతా - తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
580. మహనీయా - గొప్పగా ఆరాధింపబడునది.
581. దయామూర్తిః - మూర్తీభవించిన దయాలక్షణము గలది.
582. మహాసామ్రాజ్యశాలినీ - పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.
583. ఆత్మవిద్యా - ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
584. మహావిద్యా - గొప్పదైన విద్యా స్వరూపురాలు.
585. శ్రీవిద్యా - శ్రీ విద్యా స్వరూపిణి.
586. కామసేవితా - కాముని చేత సేవింపబడునది.
587. శ్రీ షోడశాక్షరీ విద్యా - సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
588. త్రికూటా - మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
589. కామకోటికా - కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.
590. కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా - అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.
591. శిరఃస్థితా - తలమిద పెట్టుకోవలసినది.
592. చంద్రనిభా - చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.
593. ఫాలస్థా - ఫాల భాగమునందు ఉండునది.
594. ఇంద్రధనుఃప్రభా - ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.
595. హృదయస్థా - హృదయమునందు ఉండునది.
596. రవిప్రఖ్యా - సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.
587. త్రికోణాంతర దీపికా - మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మద్యమున వెలుగుచుండునది.
598. దాక్షాయణీ - దక్షుని కుమార్తె.
599. దైత్యహంత్రీ - రాక్షసులను సంహరించింది.
600. దక్షయజ్ఞవినాశినీ - దక్షయజ్ఞమును నాశము చేసినది.ఓం శనైశ్చరాయనమః
601. దరాందోళితదీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
602. దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
603. గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది.
604. గుణనిధిః - గుణములకు గని వంటిది.
605. గోమాతా - గోవులకు తల్లి వంటిది.
606. గుహజన్మభూః - కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.
607. దేవేశీ - దేవతలకు పాలకురాలు.
608. దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
609. దహరాకాశరూపిణి - హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
610. ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
611. కళాత్మికా - కళల యొక్క రూపమైనది.
612. కళానాథా - కళలకు అధినాథురాలు.
613. కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.
614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.
615. ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
616. అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
617. ఆత్మా - ఆత్మ స్వరూపిణి.
618. పరమా - సర్వీత్కృష్టమైనది.
619. పావనాకృతిః - పవిత్రమైన స్వరూపము గలది.
620. అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
621. దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.
622. క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
623. కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
624. గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
625. కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
626. త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
627. త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
628. త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
629. త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.
630. త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
631. దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
632. సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
633. ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
634. శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
635. గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
636. గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.
637. విశ్వగర్భా - విశ్వమును గర్భమునందు ధరించునది.
638. స్వర్ణగర్భా - బంగారు గర్భము గలది.
639. అవరదా - తనకు మించిన వరదాతలు లేనిది.
640. వాగధీశ్వరీ - వాక్కునకు అధిదేవత.
641. ధ్యానగమ్యా - ధ్యానము చేత పొందబడునది.
642. అపరిచ్ఛేద్యా - విభజింప వీలులేనిది.
643. జ్ఞానదా - జ్ఞానమును ఇచ్చునది.
644. జ్ఞానవిగ్రహా - జ్ఞానమును మూర్తిగా దాల్చింది.
645. సర్వవేదాంత సంవేద్యా - అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
646. సత్యానంద స్వరూపిణీ - నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
647. లోపాముద్రార్చితా - లోపాముద్రచే అర్చింపబడింది.
648. లీలాక్లుప్త బ్రహ్మాండమండలా - క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.
649. అదృశ్యా - చూడబడనిది.
650. దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
651. విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
652. వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
653. యోగినీ - యోగముతో కూడి ఉంది.
654. యోగదా - యోగమును ఇచ్చునది.
655. యోగ్యా - యోగ్యమైనది.
656. యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
657. యుగంధరా - జంటను ధరించునది.
658. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
659. సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
660. సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
661. సదసద్రూపధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.
662. అష్టమూర్తి: : 8రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
663. అజా : పుట్టుకలేనిది
664. జైత్రీ : సర్వమును జయించినది
665. లోకయాత్రావిధాయినీ : లోకములను నియమించునది
666. ఏకాకినీ : ఏకస్వరూపిణీ
667. భూమరూపా : భూదేవిరూపము ధరించునది
668. నిర్ద్వైతా : అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
669. ద్వైత వర్జితా : ద్వైతభావము లేనిది
670. అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
671. వసుదా : సంపదలిచ్చునది
672. వృద్ధా : ప్రాచీనమైనది
673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ : ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
674. బృహతీ : అన్నిటికన్న పెద్దది
675. బ్రాహ్మణీ : బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
676. బ్రాహ్మీ : సరస్వతీ
677. బ్రహ్మానందా : బ్రహ్మానందస్వరూపిణీ
678. బలిప్రియా : బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది
679. భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
680. బృహత్సేనా : గొప్ప సైన్యము కలిగినది
681. భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
682. సుఖారాధ్యా : సుఖులైనవారిచే(నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
683. శుభంకరీ : శుభములను కలిగినది
684. శోభనా : వైభవములను కలిగినది
685. సులభాగతి: : తేలికగా చేరతగినది
686. రాజరాజేశ్వరీ : ఈశ్వరుని హృదయేశ్వరీ
687. రాజ్యదాయినీ : రాజ్యములను ఇచ్చునది
688. రాజ్యవల్లభా : రాజ్యమునకు అధికారిణీ
689. రాజత్కృపా : అధికమైన కరుణ కలది
690. రాజపీఠనిశేవితనిజాశ్రితా : తనను ఆశ్రయించినవారిని సిం హాసనము పైన కూర్చొండపెట్టునది
691. రాజ్యలక్ష్మి: : రాజ్యలక్ష్మీ రూపిణీ
692. కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
693. చతురంగబలేశ్వరీ : చతురంగ బలాలకు (రధ,గజ,తురగ,పదాదులు) అధిపతి
694. సామ్రాజ్యదాయినీ : సామ్రాజ్యమును ఇచ్చునది
695. సత్యసంధా : సత్యస్వరూపిణి
696. సాగరమేఘలా : సముద్రములే వడ్డాణముగా కలిగినది
697. దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
698. దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
699. సర్వలోకవశంకరీ : సమస్తలోకములను వశము చేసుకొనునది
700. సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది.ఓం శనైశ్చరాయనమః
701. దేశకాలపరిచ్చిన్నా ; ఒక కాలమునకు కాని ఒక లోకమునకు కాని పరిమితముకాక మూడు కాలములయందు భూత వర్తమాన, భవిష్యత్,- మూడు లోకములయందు- స్వర్గము,భూలోకము,పాతాళము - శాశ్వతముగా ఉండును
702. సర్వగా ; విశ్వములో జీవులలో సంచరించుచు చైతన్యముగా (సర్వవ్యాపిని)
703. సర్వమోహినీ ; అందరిని మోహింప చేయగల రూపములొ
704. సరస్వతీ; విధ్యా, జ్ఞాన శక్తి స్వరూపిణి
705. శాస్త్రమయి ; శాస్త్రముల ప్రతిరూపమైన స్వరూపము
706. గుహంబా; కుమారస్వామి తల్లి
707. గుహ్యరూపిణి ; రహస్య అద్వైత రూపము
708. సర్వొపాధి వినిర్ముక్తా; అన్ని అపాయములనుoడి కాపాడుచు
709. సదాశివ పతివ్రతా; సదాశివుని సతిగా మహాపతివ్రతగా ప్రఖ్యాతి చెందిన
710. సంప్రదాయేశ్వరీ : సంప్రదాయ స్వరూపిణి
711. సాద్వీ : అన్నియు సంపూర్ణముగా అర్థము చేసుకోను శక్తి అయిన మాతకు
712. గురుమండల: గురుప్రంపరాస్వరూపిణి
713. రూపిణీ: స్వరూపము కలిగినట్టి మాత
714. కులోత్తిర్ణా: సుషుమ్న మార్గమున పైకిపోవునది
715. భగారాధ్యా: సూర్యమoడల వాసులచే ఆరాధింపబడు
716. మయా: మాయా శక్తిగా
717. మధుమతి: మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
718. మహీ: మహి రూపిణి
719. గణాంబా : గణములకు తల్లి , గణపతి తల్లి
720. గుహ్యకారాధ్యా: గుహ్యులు అను దేవతలచే ఆరాధింపబడు
721. కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
722. గురుప్రియా : గురువునకు ప్రియమైనది
723. స్వతంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
724. సర్వతంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
725. దక్షిణామూర్తిరూపిణీ : దక్షిణామూర్తి రూపము ధరించినది
726. సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
727. శివఙ్ఞానప్రదాయినీ : ఆత్మఙ్ఞానమును ఇచ్చునది
728. చిత్కళా : ఙ్ఞానము అను జ్యోతిస్వరూపిణీ
729. నందకలికా : ఆనందమయి
730. ప్రేమరూపా : ప్రేమమూర్తి
731. ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
732. నామపారాయణప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
733. నందివిద్యా : అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశెషము
734. నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి
735. మిధ్యాజగదధిష్టానా : మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది
736. ముక్తిదా : విముక్తి నిచ్చునది
737. ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
738. లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
739. లయకరీ : జగత్తును లయము చేయునది
740. లజ్జా : లజ్జాస్వరూపిణీ
741. రంభాదివందితా : రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది.
742. భవదావసుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
743. పాపారణ్యదవానలా : పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
744. దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
745. జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది
746. భాగ్యాబ్ధిచంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
747. భక్తచిత్తకేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
748. రోగపర్వతదంభొళి : పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
749. ర్మృత్యుదారుకుఠారికా : మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది.
750. మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు.
751. మహాకాళీ : కాళికాదేవిరూపము దాల్చినది
752. మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
753. మహాశనా : లయకారిణి
754. అపర్ణా : పార్వతీ దేవి
755. చండికా : చండికాస్వరూపిణి
756. చండముండాసురనిషూదిని : చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది.
757. క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది
758. సర్వలోకేశీ : అన్ని లొకములకు అధీశ్వరి
759. విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
760. త్రివర్గదాత్రీ ; దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
761. సుభగా : సౌభాగ్యవతి
762. త్ర్యంబకా : మూడు కన్నులు కలది
763. త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది
764. స్వర్గాపవర్గదా : స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది
765. శుద్ధా : పరిశుద్ధమైనది
766. జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆక్ర్తి కలది
767. ఓజోవతీ : తేజస్సు కలిగినది
768. ద్యుతిధరా : కాంతిని ధరించినది
769. యఙ్ఞరూపా : యఙ్ఞము రూపముగా కలిగినది
770. ప్రియవ్రతా : ప్రియమే వ్రతముగా కలిగినది.
771. దురారాధ్యా ; కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది
772. దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్యమైనది
773. పాటలీకుసుమప్రియా : పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
774. మహతీ : గొప్పదైనది
775. మేరునిలయా : మేరుపర్వతము నివాసముగా కలిగినది
776. మందారకుసుమప్రియా : మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది.
777. వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
778. విరాద్రూపా : అన్నింతికీ మూలమైనది
779. విరజా : రజోగుణము లేనిది
780. విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
781. ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
782. పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
783. ప్రణదా : సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
784. ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది.
785. మార్తాండభైరవారాధ్యా : మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
786. మంత్రిణీ న్యస్తరాజ్యధూః : రాజ్యాధికారము ఇచ్చు శ్యామలాదేవి
787. త్రిపురేశీ ; త్రిపురములకు అధికారిణి
788. జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
799. నిస్త్రైగుణ్యా : త్రిగుణాతీతురాలు
790. పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది.
791. సత్యఙ్ఞానానందరూపా : సచ్చిదానందరూపిణీ
792. సామరస్యాపరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
793. కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)
794. కళామాలా : కళల యొక్క సమూహము
795. కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
796. కామరూపిణీ : కోరిన రూపము ధరించునది.
797. కళానిధి: : కళలకు నిధి వంటిది
798. కావ్యకళా : కవితారూపిణి
799. రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
800. రసశేవధి: : రసమునకు పరాకాష్ట
801 . పుష్టా :: మూతిపదిముడుతత్వములుగల విగ్రహం కలది, పూర్ణత్వం కలది
802. పురాతనా :: సృష్టికిపూర్వమే విధ్యమానత్వముకలది, పురాతనగుణము కలది
803. పూజ్యా :: సర్వులకు పూజ్యురాలు
804 . పుష్కరా :: పుష్కరమున పోషణము, పుష్కరతీర్ధ స్వరూపరాలు
805 .పుష్కరేక్షణా :: పద్మలువంటి కన్నులు కలది
806 . పరంజ్యోతి:: ఉత్కృష్టమైన బ్రహ్మాత్మిక జ్యోతి
807 .పరంధామా :: ఉత్కృష్ట తేజము కలది
808 .పరమాణు: పరమమగు అనురూపిణి
809 .పరాత్పరా :: త్రిమూర్తులకంటే శ్రేష్టదాతరమైనది
810. పాశ హస్తా :: వామభాగమున క్రింది హస్తమున పాశము ధరించినది
811. పాశ హంత్రీ :: పాశ ములను నశింపచేయునది
812. పరమంత్రవిభేదినీ :: ప రమైన ఉత్కృష్టమైన పంచదశీ మంత్రమును భేదించినది
813. మూర్తా :: రూపమును కలిగినది మూర్తము, పరమేశ్వరి ఉపాస్యరూపము కలది.
814. అమూర్తా :: జ్నేయ రూపము కలది, వాయువు ఆకాశము స్వరూపము కలది.
815.. అనిత్య తృప్తా :: భక్తి మాత్ర ప్రయత్నం చే ఉపచారాదుల వలన తృప్తిని చెందినది.
816. ముని మానస హంసికా :: మనవుల మనసునందు హంస మంత్రార్థ స్వరూపిణి కలది.
817..సత్య వ్రతా :: సత్యమే వ్రతముగా గలది సత్య వచనము నందు ప్రీతి గలది.
818.. సత్య రూపా :: సత్యమును రక్షించ సర్వ వ్యాపి యైన రూపమును గలది.
819.. సర్వాంతర్యామినీ :: సకల హృదయములో ఉండి ఇంద్రియమున ప్రేరేపించబడుతూ సర్వ అంతఃకరణములను నియమించినది.
820. సతీ :: దుర్గా సప్తసతి యందు ఖాళీ తార, చిన్నమస్తా, సుముఖీ, భువనేశ్వరి, బాలా, కొబ్జా.. ఏడుగురు సతులు ప్రధమ చరిత్ర. లక్ష్మీ, లలితా, కాళీ, దుర్గా, గాయత్రీ, అరుంధతీ , సరస్వతీ మధ్యమ చరిత్ర 7 సతులు... బ్రహ్మీ, మహేశ్వరీ , కుమారీ , వైష్ణవీ , వారాహీ , మహేంద్రీ, చాముండా.... ఏడుగురు వీరి సమిష్టి నందా, శతాక్షి శాకాంబరీ భీమా, రక్త దంతికా,దుర్గా, బ్రామరీ వీరందరి సమిష్టి రూపము దేవి సతీ
821.. బ్రహ్మాణీ :: బ్రహ్మ జనని య గుట వలన బ్రాహ్మిని అయినది
822.. బ్రహ్మణి :: ఆత్మచే నెరుగ దగినది బ్రహ్మ జ్ఞానము పొందినది.
823.. జనణీ :: సర్వలోకములకు తల్లి అయినది.
824..బహు రూప:: ప్రపంచమున జనన కారణమగుట చేత బహు రూపమైనది.
825.. బుధార్చిత.. బుధులు అనడి జ్ఞానులు చేత పూజింపబడినది.
826.. ప్రసవిత్రీ.. ప్రపంచ మన ప్రజలను గొప్పగా ప్రసవించునది.
827.. ప్రచండా :: మిక్కిలి కోప స్వభావము కలది సేనలు కలది తీవ్ర మైనా ఆజ్ఞ కలది.
828..అజ్ఞా.. విధి నిషేధ రూపమైన ఆజ్ఞను స్వరూపముగా కలది.
829.. ప్రతిష్ట.. సకల జగదాశిష్టమైన ప్రపంచాన్ని సృష్టించినది,ప్రతిష్టించినది.
830.. ప్రకటకృతి:.. చర్వులకు అనుభూయమైన ఆకృతి కలది.
831..ప్రాణేశ్వరీ :: ప్రాణ ఇంద్రియములను అధిష్టించి యుండు ఈశ్వరి
832.. ప్రాణధాత్రీ :: సర్వ జగత్తును జీవింపచేయునది
833.. పంచాసత్పీఠరూపిణీ :: బిందు పీఠమే రూపముగా గలది
834.. విశ్వంఖళా :: భక్తుల సంసార శృంఖములను జ్ఞాన భావముచే పోగొట్టబడినది
835..వివిక్తస్థా :: జగజ్జననాధులందు సర్వత్ర నిమిత్తో పాదనముగా నుండినది.
836.. వీరమాతా :: వీరులనగా ఉపాసనా ఫలముగా సాక్షాత్కారవంతులని వారికి తల్లి హితము చేయునది.
837.. వియత్ ప్రసూ: ఆకాశమును ప్రసవించునది
838.. ముకుందా :: ముక్తిని ప్రధానము చేయగలిగినది విష్ణు రూపము కలది.
839.. ముక్తి నిలయా :: 5 విధములైన మోక్షములకు మోక్షముల ఆకారము కలది
840.. మూల విగ్రహ రూపిణీ :: ప్రపంచమునకు మూలభూతమైన విగ్రహము, సచ్చిన్మయీ మూర్తి మూలముగా కలది. మాయా ప్రతిఫలిత చైతన్యము
841.. భావజ్ఞా :: భావార్ధ, సంప్రదాయార్ధ, నిగర్భ, కౌశిక, సర్వ రహస్య, మహా తత్వార్థములు ఆరు విధములుగా భావం తెలియపరచుట
842.. భవరోగఘ్నీ :: అవరోగమనగా సంసార రోగం నాశనం చేయునది
843.. భవచక్ర ప్రవర్తినీ :: సంసార మండలమును భవ చక్రము తెప్పునది
844.. ఛంద స్సారా :: చందస్సు వేదపరము గాయత్రీ ఫలము.
845.. శాస్త్రసాల :: ప్రవృత్తి గాని, నివృత్తి గాని నిత్యము గాని కు త్రికము గాని.. దేనిచే ఉపదేశింపబడునో అది ఏ శాస్త్రము శాస్త్రములకు సారభూతమైనది దేవి.
846 .మంత్రసారా :: శ్రీవిద్యావర్గమంత్రములు అర్ధము మంత్రసార మంత్రార్ధ స్వరూపిణి
847 .తలోదరీ :: తాళము పరిష్కృతభూతలము సమానమైన ఉదరముకలది
848 .ఉదారకీర్తి:: అంతటావ్యాప్తిచెందిన మహోత్తరకీర్తిగలది
849 .ఉద్దామవైభవా :: వైభవము ఐశ్వర్యము అపరిమితముగా కలది
850 ..వర్ణ రూపిణీ :: చతుషష్టి వర్ణముల రూపము కలది
851.. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ :: స్వరూప జ్ఞాన ఆత్మ విశ్రాంతల నిచ్చునది
852.. సర్వోపనిష దుద్ఘుష్టా :: సర్వోపనిషత్తుల పర్యవసానము పరాదేవియని భావితము
853.. శాంత్య తీత కళాత్మికా :: సర్వతీత సర్వకారణ మోక్షప్రద సదాశివ నామక బ్రహ్మ శక్తియే శాంత్యతీత కళా శబ్ద వాచ్యము.
854.. గంభీరా :: గమ్ గణపతి బీజం కావున గణపతి అతనిది భయమును రాత్రి పోగొట్టుకున్నది దేవి అని అర్థము.
855. గగనాంతస్థా :: గగనము వలె బ్రహ్మాండ అంతర్ బహిష్తులందు అదివ్యాప్తమై నిర్లేపతతో నుండునది
856.. గర్వితా :: విశ్వ నిర్మాణ వృషయికమైన పరహంత గర్వము అపరాహాంత ఈమె యందు పుట్టినది
857.. గానలోలపా :: దేవి సకల కళ స్వరూపిణి ఎగుట కానలోలుప ఐనది.
858.. కల్పనా రహితా :: వికల్ప రహిత శరీర సర్వకాలమునందు ఏకాకారముగా నుండునది మాయా ప్రకృతి కల్పనలను వర్ణించినది
859.. కాష్టా :: వేదాంత వాఖ్యార్ధ తత్వ నిష్కర్ష కాష్ట, అష్టాదశ నిమేషాత్మక కాలము కాష్ట.
860.. ఆకాంతా :: ఆకమనగా పాపము దుఃఖము వాటి యొక్క అంతము నాశనం కలది
861 .కాంతార్ధ విగ్రహా :: శివశక్తుల సామార్స్యముచే సునికి సమభాగిని
862 ..కార్యకారణనిర్ముక్తా :: కార్య మున మహ త్వాదులు కారణమూ మూలా ప్రకృతి
863 ..కామకేళితరంగితా:: కామేశ్వరుని క్రీడా విలాస పరంపరలు గలది
864 .. కనత్కనక తాటంకా ::దేదీప్యమానములైన స్వ ర్ణాభరణములు కలది
865 ..లీలా విగ్రహ ధారినీ అవతార విశేషములనుఇలాగా అనాయాసముగా ధరించునది
866 ..అజా :: పుట్టుకలేని దేవి
867 .. క్షయవినిర్ముక్తా:: జనన మరణ రహిత వికార రహిత నిత్య సత్య స్వరూపము
868 ..ముగ్ధా :: కొత్తదియని వైజయన్తి కోశము కర్మఫలము అపూర్వం
869 ..క్షిప్రప్రసాది నీ:: స్వల్ప వ్యవధిలో శీఘ్రముగా అనుగ్రహమును ప్రసాదించునది
870 .. అంతర్ముఖ సమారాధ్యా::ఆత్మాభిముఖమైనట్టి చిత్తవృత్తి వారిచేత విశేషముగా ఆరాధింపదగినది
871 ..బహిర్ముకః సుదుర్లభా :: స్వర్గాది కములకు సుదుర్లభా అంధ చితక న్యాయముచేత లబ్ధియైనపప్టికి బాహ్యవిషయలక్ష్యముగల వారికీ దేవి సురుర్లభా
872 ..త్రయీ :: వేదములు శబ్దాత్మకములగుట జడత్వము తద్రూపము అసంభవం త్రయీఅనగా త్రిగుణముల సమాహారము
873 ..త్రివర్గనిలయా: ధర్మ అర్ధ కామముల్లదు ఆకర ఉకార మకార ములందు ఉనికి గలది
874 ..త్రిస్థా :: త్రిలోకములందు బేధ రహితముగానుండునది
875 ..త్రిపురమాలినీ :: స్థూల సూక్ష కారణ శరీరములు అంతర్దసారచక్ర అభిమానిని దేవత
876 ..నిరామయా :: నిర్గతములైన వ్యాధులు కలది
877 ..నిరాలంబా ::సర్వమునకు ఆలంబనమైన దేనికి వేరుగా ఆలంబనం లేదు, అవజ్ఞానస గోచరత్వము వాన నిరాలంబా
878 ..స్వాత్మారామా :: పరమేశ్వరి జీవుల దహరాకాశమే విహార భూమిగా కలది
879 .. సుధాశ్రుతిః :: తృప్తి కలిగించు అమృత స్రవక్రియాయే భగవతి యని యర్థము
880 సంసారపంక నిర్మగ్న సముద్దరణ పండితా ::సంసారమును బురదలో మునిగిన వారిని లెస్సుగా ఉద్దరించుటలో పండితురాలు
881..యజ్ఞప్రియా :: యజ్ఞము లు ప్రియము కాగలది, నిత్యాచరణీయములగు దేవా పితృ, భూత మనుష్య బ్రహ్మ జపయజ్ఞ, శ్రీ యాగ, చండీయాగ రుద్రయాగములందును సప్త పాకయాగ, సప్త హవిర్యాగ, సప్త సోమయ్యగా, సమస్త యాగాచరడము నందు ప్రీతికలది.
882..యజ్ఞ కార్తీ ::యజ్ఞమునకు కర్తగా నున్నది.
883.. యజమానస్వరూపిణి :: యజమానాత్మక దీక్షితమూర్తి పరమశివుడు.
884.. ధర్మాధారా :: ధర్మం వేద నష్టము కావున వేదస్వరూపిణి ధర్మ రక్షణ చేయను గనుక ధర్మాధారా.
885.. ధనా ధ్యక్షా :: మహాలక్ష్మి స్వరూపములు సర్వశ్రీ స్వరూపినియపు దేవి ధనాధ్యక్ష.
886.. ధన ధాన్య వివర్దినీ :: ధనధాన్య సంపదలను విశేషముగా వృద్ధిచేయునది.
887..విప్రప్రియా ::వేదశాస్త్ర విద్యావంతుడుగు బ్రహ్మణుడు విప్రుడు.
888..విప్రరూపా :: విప్రులు రూపముగా గలది
889.. విశ్వభ్రమణ కారిణీ :: బ్రహ్మాండమునకు సృష్టి స్థితి నాశనం చేయగలది
890.. విశ్వగ్రాసా :: చరాచరమైన విశ్వమును మృంగునది.
891.. విద్రు మాభా ::పగడము వలే రక్త కాంతి గలది
892.. వైష్ణవి ::విష్ణువునకు సంబందించినది
893.. విష్ణురూపిణి ::విష్ణువుతో అభిన్నమైన రూపము కలది
894.. అయోని :కారణము లేనట్టిది, యోనిశబ్దము స్థానపరము.
895.. యోని నిలయా :: ఈమె యందు భయమై ఉన్నవి కావున నిలయ దేవియే నిలయ అని అందరూ
896.. కూటస్తా :: మోసం చేయనిది
897.. కుల రూపిణీ ::కౌలమార్గ బ్రహ్మపూజ వంశాచారముల కులము తద్రూపిణీ
898.. విరాఘోష్టి ప్రియ ::వీరుల ఘోష్టి సభయాందు ప్రీతిని కలది
899.. వీరా :: వీర్యము కలది
900.. నై ష్కర్యా :: నిర్గతమైన వదలబడిన కర్మలను కలది
901. నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
902. విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి
903. కల్యా : మూలకారణము
904. విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
905. బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది
906. తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి
907. తత్త్వమైయీ : తత్వస్వరూపిణి
908. తత్త్వమర్ధస్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది
909. సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది
910. సౌమ్యా : సౌమ్యస్వభావము కలిగినది
911. సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి
912. సవ్యాపసవ్యమార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
913. సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది
914. స్వస్థా : మార్పులేకుండా ఉండునది
915. స్వభావమధురా : సహజమైన మధురస్వభావము కలది
916. ధీరా : ధైర్యము కలది
917. ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది
918. చైతన్యార్ఘ్య సమారాధ్యా : ఙ్ఞానులచే పూజింపబడునది
919. చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది
920. సదొదితా : సత్యస్వరూపిణీ
921. సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది
922. తరుణాదిత్యపాటలా : ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది
923. దక్షిణా జ్ఞానముతో కాని అజ్ఞానముతో కాని పూజిoచిన తృప్తి పడును : దాక్షిణ్యము కలిగినది
924. దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
925. కౌళినీ కేవలా : కౌళమార్గమున ఉపాసించబదుచూ సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
926. అనర్ఘ్య కైవల్యపదదాయినీ : అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును
927 స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
928. స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
929. శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
930. మనస్వినీ : మనస్సు కలిగినది
931. మానవతీ : అభిమానము కలిగినది
932. మహేశే : మహేశ్వర శక్తి
933. మంగాళాకృతి: : మంగలప్రదమైన రూపము కలిగినది.
934. విశ్వమాతా : విశ్వమునకు తల్లి
935. జద్ధాత్రీ : జగత్తును రక్షించునది
936. విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
937. విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
938. ప్రగల్భా : సర్వసమర్ధురాలు
939. పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
940. మరామోదా : పరమానందము కలిగినది
941. మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది
942. వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది
943. విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
944. వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
945. వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి
946. పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
947. పంచప్రేతమంచాధిశాయినీ : పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది
948. పంచమే : పంచకృత్యపరాయణి
949. పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞాపించునది
950. పంచసంఖ్యోపచారిణి : శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
951. శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
952. శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
953. శర్మదా : ఓర్పు ను ఇచ్చునది
954. శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది
955. ధరా : ధరించునది
956. ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
957. ధన్యా : పవిత్రమైనది
958. ధర్మిణీ : ధర్మస్వరూపిణి
959. ధర్మవర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది
960. లోకాతీతా : లోకమునకు అతీతమైనది
961. గుణాతీతా ; గుణములకు అతీతమైనది
962. సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
963. శమాత్మికా : క్షమాగుణము కలిగినది
964. బంధూకకుసుమప్రఖ్యా : మంకెనపూలవంటి కాంతి కలిగినది
965. బాలా : 12సంవత్సరముల లోపు బాలిక,,,,బాల
966. లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది
967. సుమంగళి : మంగళకరమైన రూపము కలిగినది
968. సుఖకరీ : సుఖమును కలిగించునది
969. సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది
970. సువాసినీ : సుమంగళి
971. సువాసిన్యర్చనప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది
972. శోభనా ; శోభ కలిగినది
973. శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
974. బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది
975. పూర్వజా : అనాదిగా ఉన్నది
976. త్రిపురాంబికా : త్రిపురములందు ఉండు అమ్మ
977. దశముద్రాసమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
978. త్రిపురా శ్రీవశంకరీ : త్రిపురసుందరీ సంపదలను వశము చేయునది
979. ఙ్ఞానముద్రా : బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట
980. ఙ్ఞానగమ్యా : ఙ్ఞానము చే చేరదగినది
981. ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ : ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది
982. యోనిముద్రా : యోగముద్రలలో ఓకటి
983. త్రికండేశీ : 3ఖండములకు అధికారిణి
984. త్రిగుణా : 3గుణములు కలిగినది
985. అంబా : అమ్మ
986. త్రికోణగా : త్రికోణమునందు ఉండునది
987. అనఘా : పవిత్రమైన
988. ద్భుత చారిత్రా : అద్భుత చరిత్ర కలిగినది
989. వాంఛితార్ధప్రదాయినీ : కోరిన కోర్కెలు ఇచ్చునది
990. అభ్యాసాతియఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును
991. షడధ్వాతీతరూపిణీ ; 6మార్గములకు అతీతమైన రూపము కలిగినది
992. అవ్యాజకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
993. రఙ్ఞానధ్వాంతదీపికా : అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది
994. ఆబాల గోపవిదితా : సర్వజనులచే తెలిసినది
995. సర్వానుల్లంఘ్యశాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
996. శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
997. శ్రీమత్త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి
998. శ్రీశివా : సుభములను కల్గినది
999. శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది
1000. లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత
*
ఓం శ్రీ రామ .. శ్రీ మాత్రేనమః .. ఓం నమఃశివాయ
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ -
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!! 1 !!
యస్యద్విరదవక్త్రాద్యా: పారిషధ్యా: పరశ్శతమ్ !
విఘ్నం నిఘ్నన్తి సతతం విశ్వక్సేనమ్ తమాశ్రయే !! 2 !!
పూర్వపీఠికా::
వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తే: పౌత్ర మకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !! 3 !!
వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాస రూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిధయే, వాసిష్టాయ నమోనమ: !!4 !!
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే !
సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే !! 5 !!
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ !
విముచ్యతే నమస్త స్మై ప్రభవిష్ణవే . !!6 !!
ఓం నమో విష్ణవే ప్రభావిష్ణవే
శ్రీ వై సంపాయన ఉవాచ:-
శృత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశ: !
యుధిష్టర: శాంతనవం పునరేవ అభ్యభాషత.!!7 !!
యుధిష్టర ఉవాచ :-
కి మేకం దైవతం లోకే కిం వాప్యేకం పారాయ ణమ్ !
స్తువంత: కం కమర్చంత: ప్రాప్ను యు: మానవా: శుభం !! 8 !!
కోధర్మ: సర్వ ధర్మాణాం భవత: పరమో మత: !
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ !! 9 !!
శ్రీ భీష్మ ఉవాచ"-
జగత్ ప్రభుమ్ దేవదేవం అనంతం పురుషోత్తమమ్ !
స్తువ న్నామసహస్రేణ పురుషః: సతతోత్తిత: !! 10 !!
తమేవ చార్చ యన్నిత్యం భక్త్వా పురుషమవ్యయమ్ !
ధ్యాయన్ స్తువన్ నమశ్యంశ్చ యజమానస్త మేవచ. !!11 !!
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ !
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్.!!12 !!
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ !
లోకనాధం మహాద్భూతం సర్వభూత భవోద్బవమ్ !!13 !!
ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధిక తమోమత: !
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చేన్నర : స్సదా. !! 14 !!
పరమం యో మహాత్తేజ: పరమం యో మహత్తపః:
పరమం యో మహాద్బ్రహ్మ పరమంయ: పరాయనమ్ !!15 !! .
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ !
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయ: పితా. !! 16 !!
యత: సర్వాణి భూతాని భవన్త్యాది యుగాగమే !
యస్మిం శ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. !!17 !!
తస్య లోక ప్రధానస్య జగనాథస్య భూపతే !
విష్ణో న్నామ సహస్రం మే శృణు పాప భయావహమ్ !!-18 !!
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన: !
ఋషిభి:పెరిగితాని తాని వక్ష్యామి భూతయే. !! 19 !!
విష్ణో ర్నామ సహస్రస్య వేదవ్యాసో మహా నృషి: !
ఛందో నుష్టుప్ తథా దేవ: భగవాన్ దేవకీ సుత: !! 20 !!
అమృతాం సూద్భవో బీజం శక్తి ర్దేవకి నందన: !
త్రిసామా హృదయం తస్య శాంత్యర్దే వినియుజ్యతే. !! 21 !!
విష్ణుం జిష్ణుమ్ మహావిష్ణుం ప్రభవిష్ణుమ్ మహేశ్వరమ్
అనేక రూపదైత్యాంతమ్ నమామి పురుషోత్తమమ్ !! 22 !!.
--((*))-
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
హరి: ఓం
విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి:
అవ్యయ: పురుష: సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!2!!
యోగో యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వర:
నారసింహవపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:!!3!!
సర్వశ్శర్వ: శ్శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ:
సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర: !!4!!
స్వయం భూ శ్శమ్బూరాదిత్య: పుష్కరాక్షో మహాస్వన:
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమ : !!5!!
అప్రమేయో హ్రుషీ కేశ: పద్మనాభో అమరప్రభు:
విశ్వకర్మా మనుస్త్వస్థా స్థనిష్ట : స్థవిరో ధ్రువ: !!6!!
శ్లో. అగ్రాహ్య: శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్.117!!
శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః!!8!!
శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!9!!
శ్లో. సురేశః శరణం శర్మ విస్వరేతా ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!10!!
శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః!!11!!
శ్లో. వసుర్వస్సుమనా స్సత్య: సమాత్మా సంమితస్సమ:
అమోఘ: పుండరీ కాక్షో వృష కర్మావృషాకృతి:!!12!!
శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః
అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః!!13!!
శ్లో. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవిః!!14!!
శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః
చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః!!15!!
శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తాః సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః!!16!!
శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః!!17!!
శ్లో. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః!!18!!
శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!
. శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః!!20!!
శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః !!21!!
అమృత్యుః సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా!!22!!
శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః
నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః!!23!!
శ్లో. అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్ర పాత్...!!24!!
శ్లో .ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః!!25!!
శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః
సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః!!26!!
శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః
సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః!!27!!
శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శుచి సాగరః!!28!!
. శ్లో. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః!!29!!
శ్లో. ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు భాస్కర ద్యుతిః!!30!!
శ్లో. అమృతాంశూద్భవో భానుః శశ బిన్దుః సురేశ్వరః
ఔషధం జగతస్సేతుః సత్య ధర్మ పరాక్రమః!!31!!
శ్లో. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామ కృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః!!32!!
శ్లో. యుగాది కృత్యుగావర్తో నైకమాయో మహాశనః !
అదృశ్యో వ్యక్త రూపశ్చసహస్ర జిదనంత జిత్ !! 33 !!
శ్లో. ఇష్టో విశిష్టః శిశ్టేష్టః శిఖండీ నహుషో వృషః !
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34 !!
శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః !
అపాం నిథి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః !! 35 !!
శ్లో. స్కన్ద స్కన్దధరో ధుర్యో వరదో వాయు వాహనః !
వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురన్దరః !! 36 !!
శ్లో . అశోకస్తారణరస్తారః శూరః శౌరిర్జనేశ్వరః !
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !!37!!
శ్లో. పద్మనాభోరవిందాక్షః పద్మ గర్భః శరీరభృత్ !
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః !!38 !!
శ్లో. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః !
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !!39!!
శ్లో. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః !
మహీధరో మహాభాగో వేగవానమితాశనః !! 40 !!
శ్లో. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః !
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41 !!
శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః !
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!
శ్లో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః !
వీరః శక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమః !!43!!
శ్లో.వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః !
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః !!44!!
శ్లో. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః !
ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వ దక్షిణః !!45!!
శ్లో. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం !
అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!46!!
శ్లో. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః !
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః !!47!!
శ్లో. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః !
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ !!48!!
శ్లో. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ః !
మనోహరో జిత క్రోధో వీరబాహు ర్విదారణః !!49!!
శ్లో. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్ !
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !!50!!
శ్లో. ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్ క్షరమ క్షరమ్ !
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః !!51!!
శ్లో. గభస్తినేమి సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః !
ఆది దేవో మహా దేవో దేవేశో దేవ భృద్గురుః !!52!!
శ్లో. ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞాన గమ్య పురాతనః !
శరీర భూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః !!53!!
శ్లో. సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః !
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః !!54!!
శ్లో. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !
అంభోనిథి రనంతాత్మా మహోదధి శయోన్తకః !!55!!
శ్లో . అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర: ప్రమోదన:!
ఆనందో వందనో నంద:సత్యధర్మా త్రివిక్రమ: !!56!!
శ్లో . మహర్షి: కపిలాచార్య: కృతజ్ఞో మేది నీపతి:!
త్రిపద త్రి దశా ధ్యక్షో మహశ్రుంగ: క్రుతాంతకృత్ !!57!!
శ్లో. మహా వరాహో గోవిందః సుషేణః కనకాంగదీ !
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః !! 58 !!
శ్లో. వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః !
వరుణో వారణో వృక్షః పుష్కరాక్షో మహామనః !! 59!!
శ్లో. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః !
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః !! 60 !!
శ్లో. సుధన్వా ఖండ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః !
దివః స్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61 !!
శ్లో. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ !
సన్న్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !! 62 !!
శ్లో. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః !
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృష ప్రియః !! 63 !!
శ్లో. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా కేమ కృచ్ఛివః !
శ్రీవత్స వక్షః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః !! 64 !!
శ్లో. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీ విభావనః !
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయః !! 65 !!
శ్లో. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః !
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః !! 66 !!
శ్లో. ఉదీర్ణః సర్వత శ్చక్షు రనీశః శాశ్వత స్థిరః !
భూశయో భూషణో భూతి ర్విశోకః శోక నాశనః !! 67 !!
శ్లో. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః !
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మిత విక్రమః !! 68 !!
శ్లో. కాలనేమినిహా వీరః శౌరిః శూర జనేశ్వరః !
త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః !! 69 !!
శ్లో. కామ దేవః కామపాలః కామీ కాంత కృతాగమః !
అనిర్దేశ్యవపు ర్విష్ణుః ర్వీరోనంతో ధనంజయః !! 70 !!
శ్లో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ వివర్ధనః !
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71 !!
శ్లో. మహాక్రమో మహా కర్మా మహా తేజా మహోరగః !
మహా క్రతు ర్మహా యజ్వా మహా యజ్ఞో మహా హవిః !! 72 !!
శ్లో. స్తవ్య స్తవప్రియః స్తోత్రమ్ స్తుతిః స్తోతా రణప్రియః !
పూర్ణః పూరయితాః పుణ్యః పుణ్య కీర్తి రనామయః !! 73 !!
శ్లో.మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః !
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !! 74 !!
శ్లో. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః !
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః !! 75 !!
శ్లో. భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః !
దర్పహా దర్పదా దృప్తో దుర్ధరో థాపరాజితః !! 76 !!
శ్లో. విశ్వ మూర్తి ర్మహా మూర్తి ర్దీప్త మూర్తి రమూర్తి మాన్ !
అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః !! 77 !!
శ్లో. ఏకో నైకః సవః కః కిమ్ యత్తత్పదమనుత్తమమ్ !
లోక బంధు ర్లోక నాథో మాధవో భక్త వత్సలః !! 78 !!
శ్లో. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ !
వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః !! 79 !!
శ్లో. అమానీ మాన్యదో మన్యో లోకస్వామీ త్రిలోక ధృక్ !
సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరా ధరః !! 80 !!
శ్లో. తేజో వృషో ద్యుతి ధరః సర్వ శస్త్ర భృతాం వరః !
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః !! 81 !!
శ్లో. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః !
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్ !! 82 !!
శ్లో. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః !
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా....!! 83 !!
శ్లో. శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతు వర్ధనః !
ఇంద్ర కర్మా మహా కర్మా కృత కర్మా కృతాగమః !! 84 !!
శ్లో. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !
ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !!
శ్లో . సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:
మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!!
శ్లో. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!!
శ్లో. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !
న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !!
శ్లో. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !!
శ్లో. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !!
శ్లో. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః !
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః !! 91 !!
శ్లో. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః !! 92 !!
శ్లో. సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతి వర్ధనః !! 93 !!
శ్లో. విహాయ సగతి ర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః !
రవి విరోచః సూర్యః సవితా రవిలోచనః !! 94 !!
శ్లో. అనంతో హుతభుక్భోక్తా సుఖదో నైకజోగ్రజః !
అనిర్వణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః !! 95 !!
శ్లో. సనాత్సనాతనతమః కపిలః కపి రవ్యయః
స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః !! 96 !!
శ్లో. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః !
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః !! 97 !!
శ్లో. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః !
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః !! 98 !!
శ్లో. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుః స్వప్న నాశనః !
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః !! 99 !!
శ్లో. అనంత రూపోనంత శ్రీర్జితమన్యు ర్భయాపహః !
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100 !!
శ్లో. అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః !
జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః !! 101 !!
శ్లో. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః !
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102 !!
శ్లో . ప్రమాణం ప్రాణవిలయ: ప్రాణబృత్ప్రాణజీవన:
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగ:!!103!!
శ్లో . భూర్భువస్సుస్తరుస్తార: సవితా ప్రపితా మహా:
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాజ్ఞాంగో యజ్నవాహన:!!104!!
శ్లో . యజ్ఞబృద్యజ్ఞ కృద్యజ్ఞీ యజ్ఞ భుగ్యజ్ఞసాధన:
యజ్ఞాంత కృద్యజ్న గుహ్యమన్నమన్నాద ఏవచ. !!105!!
శ్లో . ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయన:
దేవకీ నందన స్ప్రష్టా క్షితీశ: పాపనాశన: !!106!!
శ్లో. శంఖబృనందకీ చక్రీ సారంగాధన్వా గదాధర:
రదాంగ పాణి రక్షోభ్య: సర్వ ప్రహరణాయుధ: !!107!!
శ్లో . శ్రీ సర్వప్రహనాయుధ ఒన్నమైతి!!
వనమాలీగదీ శార్గీ శమ్ఖీ చక్రీ చ నందకీ,
శ్రీ మన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు !!108!!
"శ్రీ వాసుదేవోభిరక్షత్వొంనమ ఇతి ""
సర్వేజనా సుఖినోభవంతు
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి చదువుటకు, వీలుగా పొందుపరుస్తున్నాను
ఉత్తర పీఠిక
ఇతీదం కీర్త నీయస్య కేశవస్య మహాత్మన :!
నామ్నామ్ సహస్రం దివ్యానం అశేషేణ ప్రకీర్తితమ్!!1!!
య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరి కీర్త యేత్!
నా శుభం ప్రాప్నుయాత్ కించిత్ సో అముత్రేచహచ మానవ:!!2!"
వేదాంతగో బ్రాహ్మణ స్స్యా త్ క్షత్రియో విజయీ భవేత్!
వై స్యో ధనసమృద్ధ స్స్యా త్ సూద్ర స్సుఖ మవాప్నుయాత్!!3!!
ధర్మార్ధీ ప్రాప్ను యాద్ధర్మం అర్ధార్ధీ చార్ధ మాప్నుయాత్
కామాన వాప్నుయాత్ కామీప్రజార్ధీ చాప్నుయాత్ప్రజా: !!4!!
భక్తిమాన్య స్సదోత్థాయ శుచిస్తద్గత మానస:!
సహస్ర౦ వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్ !!5!!
యశ: ప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్య మేవచా !
అచలామ్ శ్రియా మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్య నుత్తమమ్ !!6 !!
నభయం క్వచి దాప్ణోతి వీర్యం తేజశ్చ విన్దతి !
భవత్య రోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః !!7 !!
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత భందనాత్ !
భయా న్ముచ్యతే భీతస్తు ముచ్యే తాపన్న అపధ !! 8 !!
దుర్గాణ్య తితర త్యాశు పురుషః పురుషోత్తమమ్ !
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః !! 9 !!
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః !
సర్వ పాప విశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ !!10 !!
న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ !
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నై వోప జాయతే !! 11 !!
ఇమం స్తవ మదీయాన: శ్రద్ధా భక్తి సమన్వితః !
యజ్యే తాత్మ సుఖక్షాన్తి: శ్రీ ధృతి స్మృతి కీర్తిభి : !! 12 !!
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా అశుభామతిః !
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమమ్ !!13 !!
ద్వౌ స్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహో దధి: !
వాసుదేవస్య వీర్యేణ విద్రుతాని మహాత్మనః !!14 !!
ససురాసుర గంధర్వం సయోక్షోరగ రాక్షసమ్ !
జగద్వశే వర్త తేద: కృష్ణస్య సచరాచరమ్ !! 15 !!
ఇంద్రియాణి మనోబుద్ధి: సత్త్వం తేజో బలం ధృతిః
వాసుదేవాత్మ కాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏ వచ !! 16 !!
సర్వాగమనా మాచారః ప్రథమం పరికల్పితః !
ఆచార: ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః !!17 !!
ఋషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః !
జంగమాజంగమం చేదం జగన్నారాయ ణోద్భవం !! 18 !!
యోగోజ్ఞానమ్ తథా సా౦ఖ్యం విద్యా స్సిల్పాది కర్మచ !
వేద స్సాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్ధనాత్ !! 19 !!
ఏకోవిష్ణుర్మహాద్భూతం పృథగ్భూతా ననేకశ : !
త్రీన్ లోకాన్ వ్యాప్యభూతాత్మ భుజ్కే విశ్వభుగవ్యయ:!! 20 !!
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ !
పాఠెద్య ఇచ్చేత్ పురుష: శ్రేయః ప్రాప్తం సుఖానిచ !! 21 !!
విశేశ్వర మజం దేవం జగత: ప్రభు మవ్యయమ్ !
భజన్తి యే పుష్కరాక్షం నతే యాన్తి పరాభవమ్
నతే యాన్తి పరాభవమ్ నమ ఇతి !!22 !!
అర్జున ఉవాచ:: పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సరోత్తమ!
భక్తానాం మనురక్తానాం త్రాతాభవ జనార్ధన !! 23 !!
శ్రీ భగవాన్ ఉవాచ :: యోమానామ సహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ !
సో యహ మే కేన శ్లోకేనా స్తుత ఏవ న సంశయ:
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి !!24!!
వ్యాస ఉవాచ : వాసనాత్ వసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్ !
సర్వభూత నివాసో ఆసి వాసుదేవ నమో అస్తుతే
శ్రీ వాసుదేవ నమో అస్తుతే ఓం నమ ఇతి !!25 !!
పార్వత్యువాచ :: కేనో పాయేన లఘునా విష్టోర్నామ సహస్రకమ్ !
పఠ్యతే పండితై: నిత్యం శ్రోతు మిచ్ఛా మ్యహం ప్రభో !! 26 !!
ఈశ్వర ఉవాచ :: శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్త్ర నామ తత్తుల్యం రామనామ వరాననే !!
శ్రీ రామనామ వరానన ఓంనమ ఇతి !!27 !!
బ్రహ్మోవాచ :: నమోస్త్వనన్తాయ సహస్త్ర మూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్త్ర నామ్నే పురుషాయ శాశ్వతే శహస్ర కోటియుగధారినే నమ:
శ్రీ శహస్ర కోటియుగధారిన ఓం నమ ఇతి !! 28 !!
సంజయ ఉవాచ:: యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
తత్రశ్రీ విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ !! !!29 !!
శ్రీ భగవాన్ ఉవాచ :: అనన్యాశ్చింత యంతో మాం యే జనా: పర్యుపాసతే !
తేషామ్ నిత్యాభియుక్తానాం వినాశాయ చ దుష్కృతామ్ !! ౩౦ !!
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ !
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే !! 31 !!
ఆర్తావిషన్నా స్శిధిలాశ్చ భీతా: ఘోరేషుచ వ్యాధిషువర్తమానా: !
సంకీర్త్యనారాయణశబ్దమాత్రం విముక్త దుఃఖా: సుఖినోభవంతి !! 32 !!
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భ వేత్ !
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే !! ౩౩ !!
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్ద్వాత్మనావా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్ శకలం పరస్మై నారాయానా యేటి సమర్పయామి !!
ఓం నమో భగవతే వాసుదేవాయ
పేరు :: మల్లాప్రగడ రామకృష్ణ
పుట్టిన ఊరు :: గుంటూరు
ఇప్పుడున్న ఊరు :: హైదరాబాద్
శ్రీమతి :: మల్లాప్రగడ శ్రీదేవి
పిల్లలు :: పుత్రికలు: సమీరా, జాహ్నవి, ప్రత్యూష
అల్లుళ్ళు..ఊటుకూరు ప్రదీప్,.. చుండి కిరణ్,.. గోటేటి శ్రీకాంత్
మనవళ్ళు.. అభయ్... అక్షజ్.. అర్ణవ్...రిశాంక్
మనవరాలు.. ఆద్విక
చిరునామా :: H .No . 12 -126 , ఆదిత్యనగర్, 2 nd లైన్ , మీర్పేట్, బాలాపూర్ మండల్
R .R .Dist . బాలాపూర్ మండల్, హైదరాబాద్ .500097
విద్య :: B . Sc .
చరవాణి నెం .. :: 6281190539 , 9849164250
తల్లితండ్రులు :: కీర్తి శేషులు . మల్లాప్రగడ ఊర్మిళా లక్ష్మణరావు
వృత్తి :: విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్, D.T.A .మంగళగిరి , ఆంధ్రప్రదేశ్
ప్రవృత్తి :: తెలుగు రచనలు ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక నిర్వాహణ
రచనలు :: శివలీలలు, వెంకటేశ్వర శతకం, లలిత, నమ: శివాయ శతకం
ముద్రించవలసినవి :: ఈశ్వర, ఈశ్వరి, దత్త పదులు, కధలు పద్యాలు
బిరుదు :: సహజ కవి
****
రచయితగా విన్నపములు
పంచభూతాల సాక్షి గా , కీ।శే। తల్లి తండ్రుల (మల్లాప్రగడ లక్ష్మణరావు, ఊర్మిళాదేవి) కుమారుడుగా 15-06-1959 నాడు గుంటూరు లో జన్మించి విద్య డిగ్రీ పొంది వివిధ కళాశాలల్లో లెక్కల పంతులుగా 1981 to 1989. మరియు వివాహము 21-08-1985, 1990 లో డైరెక్టరేట్ ట్రజరీస్ అండ్ అకౌంట్స్, హైదరాబాద్ లో చేరి 30-06-2019) వరకు పనిచేసి నాడు అకౌంట్స్ ఆఫీసర్ పదవీ విరమణ పొంది తర్వాత "తెలుగు భాషను వృద్ధి పరచాలని " సాక్షి గా ఈ ప్రాంజలి ప్రభ 03--11--2012 నాడు మొట్ట మొదట నామరామాయణంతో ప్రారంభించి కధలు కవితలు పద్యాలు అంతర్జాల పత్రికగా గూగుల్ బ్లాగ్సు (11) ద్వార ప్రపంచ తెలుగు బిడ్డలంద రికి నాకు తెలిసినవి, ఈరోజువరకు అందిస్తూ ఉన్నాను. ప్రాంజలి ప్రభ వాట్సాప్ కూడా యున్నది.
" సమాజ గమనానికి గమ్యానికి చుక్కాని
కష్టజీవి కన్నీరు తుడిచే చల్లని హస్తమవ్వాలని
సమకాలీనసమస్యలకు సరిదిద్దాలని
చీకటి తరిమే వెలుగు నవ్వాలని
తెలుగు పంచపది పద్యాలు గా ఈశ్వర లీలలు "
నేను నా శ్రీ మతి శ్రీ దేవి, కుమార్తెల (సమీరా, జాహ్నవి, ప్రత్యూష) సహాయ సహకారాలతో, ఫేస్బుక్ లో పొందు పరుస్తూ వచ్చాను నేటికి 12 సంవత్సరములు నిండినవి.
నా రచనలను నేడు మొదటగా అత్యను ప్రాస పంచ పది శివ లీలలు గా పద్యాలు వ్రాసి రోజూ గూగుల్ ఫేస్బుక్ పొందుపరిచినవి, ముద్రణకు ముందుకు వచ్చిన ------- వారి తెలుగు ప్రజలందరికీ అందించాలని సంకల్పించాను. ఇది నాసంకల్పం కాదు నేను ఆరాధించే సీతారామాంజనేయ ఆంజనేయుని కృపతో వ్రాసినవి,- ఇందు 300 పై చిలుకు ప్రాంజలి ప్రభ లో (101) పంచపది పద్యాలు పొందుపరిచాను
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మీ ఆశీర్వచనాలను కోరుతూ
మల్లాప్రగడ రామకృష్ణ , విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్,మరియు రచయత
ప్రాంజలి ప్రభ
ఇంటి నేఁ. 12-126, ఆదిత్యనగర్, 2వ లైన్,
టిఆర్ ఆర్ టౌన్షిప్ -2 మీర్పేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్
హైద్రాబాదు.97 ఫోన్ నో. 9849164250, 6281190539
ఇప్పుడు మరొక్క పుస్తకాన్ని ముద్రించదాలిచాను.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
లలితా, విష్ణుసాహస్ర నామాలు స్వయముగా పుస్తకాలు పరిశీలించి బాష్యము 2016 లో 5 నెలలుగా రేజువారీగా తెలుగు టైపు కొట్టి బ్లాగులో ఉంచటం జరిగింది. కాలమార్పుల్లో ఇప్పుడు ముద్రించ డానికి నావంతు కృషికి ప్రాంజలి ప్రభ సభ్యులు, స్నేహితులు, మాశ్రీమతి పిల్లలతో
మరెందరో సహకారం అందించారు
సర్వశ్రీ
తుర్లపాటి లక్ష్మీ కుటుంబ రావుగారు
వెల్వడం విజయ విష్ణువర్ధన రావుగారు
ఊటుకూరు కనకదుర్గ సత్యన్నారాయణ రావుగారు
చుండి విజయశ్రీ అజయ్ కుమార్ గారు
గోటేటి అన్న పూర్ణ కనకసుందరంగారు
దిట్టకవి ఉమా దేవి గోపాల బాబుగారు
దిట్టకవి గిరిజా వేంకట సుబ్రహ్మణ్యం గారు
దిట్టకవి లక్ష్మీ ప్రసన్న, కీ. శే. రామశ్రీనివాసు గారు
తురుమెల్ల కనక దుర్గ రామబ్రహ్మంగారు
వెలిదెండ్ల సువర్చల కోటేశ్వర శర్మ గారు
తప్పులు దొర్లినా సహృద్భావముతో అర్ధం చేసుకోనగలరు,
ముద్రణ కు సహకరించిన వారికీ యీ పుస్తక రచనకు మూలపురషులైన పూర్వరచ యితులకు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియపర్చు తు న్నాను
మీ
విధేయులు మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీదేవి