27, మే 2024, సోమవారం

రచయితగా విన్నపములు 


పంచభూతాల సాక్షి గా , కీ।శే। తల్లి తండ్రుల (మల్లాప్రగడ లక్ష్మణరావు, ఊర్మిళాదేవి)  కుమారుడుగా 15-06-1959 నాడు గుంటూరు లో జన్మించి విద్య డిగ్రీ పొంది వివిధ కళాశాలల్లో లెక్కల పంతులుగా 1981 to 1989. మరియు వివాహము 21-08-1985, 1990 లో డైరెక్టరేట్ ట్రజరీస్ అండ్ అకౌంట్స్, హైదరాబాద్ లో  చేరి 30-06-2019) వరకు పనిచేసి నాడు అకౌంట్స్ ఆఫీసర్ పదవీ విరమణ పొంది  తర్వాత "తెలుగు భాషను వృద్ధి పరచాలని "   సాక్షి గా ఈ ప్రాంజలి ప్రభ 03--11--2012 నాడు మొట్ట మొదట నామరామాయణంతో ప్రారంభించి కధలు కవితలు పద్యాలు అంతర్జాల పత్రికగా గూగుల్ బ్లాగ్సు (11) ద్వార ప్రపంచ తెలుగు బిడ్డలంద రికి నాకు తెలిసినవి,  ఈరోజువరకు అందిస్తూ ఉన్నాను.  ప్రాంజలి ప్రభ వాట్సాప్ కూడా యున్నది.


" సమాజ గమనానికి గమ్యానికి చుక్కాని  

కష్టజీవి కన్నీరు తుడిచే చల్లని హస్తమవ్వాలని 

సమకాలీనసమస్యలకు సరిదిద్దాలని  

చీకటి తరిమే వెలుగు నవ్వాలని 

తెలుగు పంచపది పద్యాలు గా ఈశ్వర లీలలు  "

  

నేను నా  శ్రీ మతి శ్రీ దేవి, కుమార్తెల (సమీరా, జాహ్నవి, ప్రత్యూష) సహాయ సహకారాలతో, ఫేస్బుక్ లో పొందు పరుస్తూ వచ్చాను నేటికి 12 సంవత్సరములు నిండినవి. 


నా రచనలను నేడు మొదటగా అత్యను ప్రాస పంచ పది  శివ లీలలు గా పద్యాలు వ్రాసి రోజూ గూగుల్ ఫేస్బుక్ పొందుపరిచినవి,  ముద్రణకు ముందుకు వచ్చిన   ------- వారి  తెలుగు ప్రజలందరికీ అందించాలని సంకల్పించాను.  ఇది నాసంకల్పం కాదు నేను ఆరాధించే సీతారామాంజనేయ ఆంజనేయుని కృపతో వ్రాసినవి,- ఇందు 300 పై చిలుకు ప్రాంజలి ప్రభ లో (101) పంచపది  పద్యాలు పొందుపరిచాను 

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.  మీ ఆశీర్వచనాలను కోరుతూ 


మల్లాప్రగడ రామకృష్ణ , విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్,మరియు రచయత  

ప్రాంజలి ప్రభ 

ఇంటి నేఁ. 12-126, ఆదిత్యనగర్, 2వ లైన్, 

టిఆర్ ఆర్ టౌన్షిప్ -2 మీర్పేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్  

హైద్రాబాదు.97 ఫోన్ నో. 9849164250, 6281190539

 

ఇప్పుడు మరొక్క పుస్తకాన్ని ముద్రించదాలిచాను. 


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 

లలితా, విష్ణుసాహస్ర నామాలు స్వయముగా పుస్తకాలు పరిశీలించి బాష్యము 2016 లో 5 నెలలుగా రేజువారీగా తెలుగు టైపు కొట్టి బ్లాగులో ఉంచటం జరిగింది. కాలమార్పుల్లో ఇప్పుడు ముద్రించ డానికి నావంతు కృషికి ప్రాంజలి ప్రభ సభ్యులు, స్నేహితులు, మాశ్రీమతి పిల్లలతో 

మరెందరో సహకారం అందించారు 


తుర్లపాటి లక్ష్మీ కుటుంబ రావుగారు 

వెల్వడం విజయ విష్ణువర్ధన రావుగారు 

ఊటుకూరు కనకదుర్గ సత్యన్నారాయణ రావుగారు 

చుండి విజయశ్రీ అజయ్ కుమార్ గారు 

గోటేటి అన్న పూర్ణ కనకసుందరంగారు 

దిట్టకవి ఉమా దేవి గోపాల బాబుగారు 

దిట్టకవి గిరిజా వేంకట సుబ్రహ్మణ్యం గారు 

దిట్టకవి లక్ష్మీ ప్రసన్న, కీ. శే. రామశ్రీనివాసు గారు 

తురుమెల్ల కనక దుర్గ రామబ్రహ్మంగారు

వెలిదెండ్ల సువర్చల కోటేశ్వర శర్మ గారు


తప్పులు దొర్లినా సహృద్భావముతో అర్ధం చేసుకోనగలరు, 

ముద్రణ కు సహకరించిన వారికీ యీ పుస్తక రచనకు మూలపురషులైన పూర్వరచ యితులకు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియపర్చు కన్నాను 


మీ 

విధేయులు మల్లాప్రగడ రామకృష్ణ 

                                     శ్రీదేవి


 ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 

ప్రాంజలి ప్రభ -  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యము ...సర్వేజన సుఖినోభవంతు


ఎందరో మహానుభావులు అందరికి వందనములు (1)

ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంను వ్రాసి ఇందు పొందు పరుస్తున్నాను . 

ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

  

హరి: ఓం

విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:

భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!


ఓం = అనునీయక్షరమె బ్రహ్మము: ఇది సర్వ శ్రేష్టము, స్మరనచేసినచో  దేనిని కోరిన  అది,సిద్ధించును.    


విశ్వం = చరాచర జగత్తు నందు వ్యాపించు యున్నవాడు,

విష్ణుః = సర్వ వ్యాపకం గలవాడు,

వషట్కారః = వశము నందుంచు కున్నవాడు,

భూత భవ్య భవత్ప్రభుః = భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగా ఉన్నవాడు,

భూతకృత్ = సకల భూతాలను సృజించిన వాడు,

భూత భృత్ =. భూతాలను భరించేవాడు ,

భావః= సమతా భావం కలిగిన వాడు,

భూతాత్మా= భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు,

భూత భావన= భూతాలకు శుభము కల్పించు వాడు.

*

 పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి:

అవ్యయ: పురుష: సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!2!!


పూతాత్మ =పూత - పవిత్రమైన, ఆత్మ- స్వరూపముగలవాడు,

పరమాత్మ = నిత్య శుద్ధ బుద్ధ  ముక్త స్వాభావుడు,

ముక్తానాం పరమాంగతి:=ముక్తులగు వారికి సర్వోత్తముడు, పరమాంగతి= పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, 

అవ్యయ:=వినాశము గాని, వికారము గాని, లేనివాడు,

పురుష:=శరీరమనెడి పురమున సయనించు వాడు, గొప్పవి యగు ఫలములను ఇచ్చువాడు, 

సాక్షి =సాక్షాత్తుగా తన స్వరూపమే యైన జ్ఞానము చేత సమస్తమును చూయు వాడు, 

క్షేత్రజ్న: = శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మలను తెలిసి కొను చున్నవాడు,

అక్షర =తరుగులేనివాడు, నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు

*                      

 యోగో యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వర:

నారసింహవపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:!!3!!


యోగ:= ఉపాయమైన వాడు 

యోగవిదాంనేతా= జ్ఞానుల యోగ క్షేమాదులను వహించేడి వాడు,

ప్రధాన పురుషేశ్వర: = ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు   

నారసింహవపు:= నరుని బోలిన సింహమును బోలిన అవయవములు గల శరీరము గలవాడు,

శ్రీమాన్ = అత్యంత మనో హరుడు, తన వక్ష స్థలమున శ్రీదేవి సదా నివసించు చుండు నట్టి వాడు 

కేశవ: = మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు,  

పురుషోత్తమ:= పురుషులలో ఉత్తముడు,. 


*

సర్వశ్శర్వ: శ్శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ:

సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర: !!4!!


సర్వ: = సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండుట వలనను, సదా సర్వము తెలిసివనాడు, 

శ్శర్వ:= అసుభాలను పోగొట్టేవాడు,

 శివ: = సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగ చేయువాడు,

స్థాణు:= స్థాణువు స్తిరమైనవాడు,

భూతాది = సమస్త ప్రాణుల చేత గ్రహించ బడుచున్నాడు,

నిధిరవ్యయ:= నాశములేని నిధిని దాచి వాడు,

సంభవ: = అంతట అవతరించేవాడు,

భావన= సమస్త భోక్తలకు ఫలములను గలిగిన్చు వాడు,

 భర్త: = అధిష్టానముగా ఉంది ప్రపంచమును భరించు వాడు,

 ప్రభవ: = మహాభూతములు వీని నుండియే ఉద్భవించు చున్నవి, అందువలన ఉత్కృష్టమైన జన్మగలవాడు,

ప్రభు: = సమస్త కార్యములలో మహా సామర్ధ్యము గలవాడు,

ఈశ్వర: = నిరుపాదిక మైన ఐశ్వర్యము గలవాడు,


*

స్వయం భూ శ్శమ్బూరాదిత్య: పుష్కరాక్షో మహాస్వన:

 అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమ : !!5!!


స్వయం భూ: = ఇచ్ఛ చేతనే తనకే అసాధారణ మైనటు వంటి విదంగా అవతరించు వాడు,

శంభు := భక్తులకు సుఖమును కలిగించు వాడు,

ఆదిత్య: = ఆదిత్య మండలాంతర్గతుడైన హిరన్మయ పురుషుడు, 

పుష్కరాక్ష: = కమలముల వంటి కళ్ళు గలవాడు,

మహాస్వన:= గోప్పదియగు వేదరూపమైన శబ్దము గలవాడు,

అనాదినిధన:= జన్మము, వినాశము లేనివాడు,

ధాతా:= ప్రకృతి యందు బ్రహ్మాను గర్భము ధరించు వాడు,

విధాతా:=  గర్భాన్ని ఆవిర్భవింప చేసేవాడు,

ధాతు రుత్తమ := కార్యా కారణ రూపమైన సమస్త ప్రపంచమును ధరించుట వలన చైతన్యము పరుచువాడు,

*

అప్రమేయో హ్రుషీ కేశ: పద్మనాభో అమరప్రభు:

విశ్వకర్మా మనుస్త్వస్థా స్థనిష్ట : స్థవిరో ధ్రువ: !!6!!


అప్రమేయ= శబ్దాది గుణములు లేనివాడు, గావున ప్రత్యక్ష ప్రమాణము నకు గోచరింపడు, అనుమాన విషయము గాడు, ఏలన ఇయ్యది వ్యాపింప దగిన లింగమితని యందు లేదు, ఉపమాన ప్రమాణముచేతను సిద్ధించువాడు కాడు,  ఏమన ఒక భాగము అను నదే  వీనియందు లేదు , అందువలన సాదృశ్యమే కుదరదు, కనుక  బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాద్యము కానివాడు,

హ్రుషీ కేశ:= ఇంద్రియములకు క్షేత్రజ్ఞ రూపమున ప్రభువుగా ఉన్న వాడు,

పద్మనాభ = బ్రహ్మాదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మమునాభి యందు కలవాడు,

అమరప్రభు:= దేవతలందరికీ ప్రభువైన వాడు,

విశ్వకర్మ;= విశ్వము కర్మగా గలవాడు, విశ్వకర్మతో సాదృశ్యము గలవాడు,

మను= మననము సేయువాడు, సంకల్పం చేతనే పనులన్నీ చేసేవాడు,

తృష్టా = సంహార కాలమున సమస్త భూతములను కృసింప జేయు వాడు,

స్థనిష్ట = మిక్కిలి స్థూలమైన వాడు,

స్థవిర = స్థావిరుడు అనగా పురాణ పురుషుడు,

ధ్రువ:= స్థిరత్వము గలవాడు  

శ్లో. అగ్రాహ్య:  శాశ్వతః  కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః

ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్.!17!!


అగ్రాహ్య: = కర్మేన్ద్రియముల చేత గ్రహింప బడనివాడు,

శాశ్వతః = సర్వ కాలముల యందు యుండు వాడు,

కృష్ణ : = నీలి వర్ణము శరీరము గలవాడు,

లోహితాక్షః= ఎర్రని నేత్రములు కలవాడు,

ప్రతర్దనః = ప్రళయమున భూతముల హింసించువాడు,

ప్రభూత:= జ్ఞానైస్వర్యాది గుణ సంపన్నుడు,

త్రికకుబ్ధామ= అధో మద్య భేదము చేత  మూడు దిశలకును స్థానముగా  నున్నవాడు,

పవిత్రం= సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,

మంగళం పరమ్.= స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,

*

శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః

హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః!!8!!


ఈశాన: =  భూతములను శాసించే వాడు,

ప్రాణదః = ప్రాణదానము చేయువాడు,

ప్రాణ: = ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు,

జ్యేష్ఠ:= అత్యంత వృద్ధుడు,

 శ్రేష్ఠ: = అత్యంత ప్రశంసా పాత్రుడు

ప్రజాపతిః = సమస్త ప్రజలకు అధిపతియై  ఉన్నవాడు 

హిరణ్య గర్భ: = హిరణ్మయమైన అండము లోపల నుండు వాడు

భూగర్భ: = భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు

మాధవ := మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భరత యైన వాడు 

మధు సూదనః = మధు వనేడి అసురుని సంహరించిన వాడు 

భాష్యం:=  భూతములను శాసించే వాడు, ప్రాణదానము చేయువాడు, 

**


శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!9!!


ఈశ్వర:= సర్వ శక్తి సంపన్నుడు,

విక్రమీ: = శౌర్యము గలవాడు,

ధన్వీ: = ధనుస్సు ధరించినవాడు,

మేధావీ: = మేధబహుగ్రంధదారణ సామర్ద్యము గలవాడు,

విక్రమ:= జగత్తుని దాటి పోయినవాడు,

క్రమః= గమనము సేయు వాడు,

అనుత్తమ: = తనకంటే ఉత్తముడు లేనట్టివాడు,

దురాధర్షః = ఎవరి చేతను చలింప జాలని వాడు  

కృతజ్ఞః = ప్రాణులు చేసిన పుణ్య పాప రూపమైన కర్మను తెలిసి కొను వాడు,

కృతి: = పురుష  ప్రయత్నము నకు, సర్వాత్మకుడు అగుట వలన ఇట్టి కృ తికి ఆధారముగా నుండి కృతి శబ్దముచేత లక్షితు డగుచున్న వాడు,

ఆత్మవాన్ : = తన మహిమ యందే ప్రతిష్టితుడై ఉండు వాడు

*

శ్లో. సురేశః శరణం శర్మ విస్వరేతా ప్రజాభవః

అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!10!!


సురేశః = బ్రహ్మాదులకు కోరిన ఫలములు ఇచ్చువాడు,

శరణం = సమస్త ప్రాణులకును నిరుపాధికమగు ఉపాయమైన వాడు ,

శర్మ: = పరమ సుఖరూపుడు, 

విస్వరేతా: = విశ్వమునకు కారణమైనవాడు,

ప్రజాభవః అహః= సమాస ప్రజలు తన నుండి కలుగునట్టివాడు,

సంవత్సర:= కాలస్వరూపముతో నున్నట్టివాడు గావున యితడు సంవత్సర: అనబడినవాడు,    

వ్యాళః = అభయము నిచ్చి వారలను అణా ఆధీనము గావించు కొనువాడు,

ప్రత్యయః = వారాలకు తన యందు విశ్వాసము కలిగించు వాడు,

సర్వదర్శనః= అంతట కన్నులు గలవాడు, అంతటను ఇంద్రియములు గలవాడు, తన మహిమలన్నీ చూపు వాడు,

*

శ్లో. అజః సర్వేశ్వర స్సిద్దః సిద్ధిః సర్వాది రచ్యుతః

వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః!!11!!


అజః = తనను పొంద కుండా చేయు విరోధులను తొలగించు వాడు,

సర్వేశ్వర:= ఈశ్వరు లందరి పైన ఈశ్వరు డు,  

స్సిద్దః= సిద్దముగా నుండు వాడు,

 సిద్ధిః = సిద్దులను సాధించు వారికి సహాయపడువాడు,

సర్వాది:= సమస్త భూతములకు మూలకారణమైనవాడు, 

అచ్యుతః = శరను పొందిన వారిని విడవని వాడు,

వృషాకపి:= వృషా అనగా ధర్మమము, కపి అనగా వరాహమూర్తి, మరియు వానరశ్రేష్టుడు అందు వలన ధర్మ వరాహుడు అని పిలువబడినవాడు,

అమేయాత్మా:= పరిమితి నొందింప శక్యముగాని స్వరూపము గలవాడు,

సర్వయోగ వినిస్మృతః= సకల శాస్త్రములు వచించిన యోగము వలన బయల్పడెడివాడు,

*

 శ్లో. వసుర్వస్సుమనా స్సత్య: సమాత్మా సంమితస్సమ: 

అమోఘ: పుండరీ కాక్షో వృష కర్మావృషాకృతి:!!12!!


 వసు: = సమస్త భూతముల యందు వసించు చున్నవాడు,

వసుమనా:ప్రశస్తమైన (రాగద్వేషము లేని) మనస్సు గలవాడు,

సత్య:= సజ్జనుల పట్ల సాధువై ప్రవర్తించు వాడు,

సమాత్మా:= రాగ ద్వేషాది దూషితముగాని మనస్సు గలవాడు,

సంమిత:= సమస్తమైన  పదార్ధముల చేతను పరిచ్చిన్నుడుగా దోచువాడు,

సమ:= అన్ని కాలం లలో ఉండి ఎట్టి వికారము లేనివాడు ,

అమోఘ:= పూజించినను, స్తుతించినను, స్మరించినను సమస్త ఫలములను నొసంగు చున్నవాడు,

పుండరీ కాక్ష:= పుండరీక (పద్మము )మును బోలిన కన్నులు గలవాడు,  

వృష కర్మా:= ధర్మరూపమైన కర్మ గలవాడు,

వృషాకృతి:= ధర్మము కొరకై ఆక్రుతి (శరీరము) దాల్చునట్టివాడు, ధర్మస్థాపనకోసము యుగ యుగమున అవతరించు చున్నవాడు,

*

 శ్లో. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వ యోని శ్శుచి శ్రవః

అమృత శ్శాశ్వత స్థాణుర్వరారోహో మహా తపాః!!13!!


రుద్ర:= సంహార కాలమున సంహరించుచు ప్రజలకు రోదనము గలుగ జేయువాడు,

బహుశిర:= పెక్కు సిరస్సులు గలవాడు,

బభ్రుః= లోకములను భరించువాడు,

విశ్వ యోని:= విశ్వమునకు కారణమైన వాడు,

శ్శుచి శ్రవః= పవిత్రములైన శ్రవణము సేయుట దగియున్న నామములు గలవాడు,

అమృత:= మరణము లేని వాడు,

శ్శాశ్వత స్థాణం:= శాశ్వతుడును స్థాణువు వైన వాడు,

వరారోహ:= శ్రేష్టమైన అంకము (వడి ) గలవాడు,

మహా తపాః= సృష్టి విషయక మైన తపస్సు గలవాడు, 

*  

శ్లో. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః

వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విద్కవిః!!14!!


సర్వగః = కారణ రూపేణ  అంతటా వ్యాపించి ఉన్నవాడు,

 సర్వ: = సర్వమూ తెలిసిన వాడు,

విద్భానుః = సమస్త జగత్తును ప్రకాశింప చేయువాడు,

విష్వక్సేన:= నాలుగు దిక్కులా సేనలు గలవాడు,

జనార్దనః = అభ్యుదయము గూర్చియు, మోక్షము గూర్చియు జనులచేత యాచింప బడువాడు,

వేద: = వేద రూపుడు, 

వేదవిత్  = వేదమును,  వేదార్ధమును ఉన్నది ఉన్నట్లు తెలుసు కోన్నవాడు ,

వేదాంగ:= వేదములు అంగములుగా ఉన్నవాడు, 

వేదవిత్ := వేదములను విచారించువాడు,

కవిః= సర్వద్రష్ట తెలిసినవాడు,

*

శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః

చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః!!15!!


లోకాధ్యక్ష: = లోకములను నియ మించువాడు ,

సురాధ్యక్ష:= లోక పాలరులపై అధ్యక్షుడైన వాడు, 

ధర్మాధ్యక్ష : = తగిన ఫలము నొసగుటకై ధర్మా ధర్మమును సాక్షాత్తుగా చూచు నట్టివాడు, 

కృతా కృతః = కార్యరూపమున సృజింప బడినవాడు,

చతురాత్మా := సృష్ట్యాది కార్యముల యందు వేర్వేరుగా ఉన్న నాలుగు విభూతులు గలవాడు, 

 చతుర్వ్యూహ: = మనల్ని అనుగ్రహించుటకు నాలుగు విధముల వ్యూ హము గలవాడు,

 చతుర్దంష్ట్ర:=నాలుగు కోరల పండ్లు గలవాడు,

 చతుర్భుజః= నాలుగు చేతులు గల వాడు,

*

శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తాః సహిష్ణు ర్జగదాదిజః

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః!!16!!


భ్రాజిష్ణు:= ఏక రసమైన (అభిన్నస్వభావముగల) ప్రకాశ స్వరూపుడు, 

భోజనం:= భోజ్య రూపమైన దగుట చేత పకృతి (మాయ) "భోజనం" అనబడు చున్నవాడు, 

భోక్తాః = పురుష రూపముతో  దాని ననుభ వించువాడు,

సహిష్ణు:= అమితములైన సకల అపరాదములను సహించు వాడు,  

జగదాదిజః= జగత్తుకు మొదటి వారుగానుండు బ్రహ్మ విష్ణు మహెశ్వరులలో ఒకడుగా అవతరించినవాడు.,

అనఘ: =,  పాప రహితుడు,

విజయ: = జ్ఞానము, వైరాగ్యము, ఐస్వర్యము మొదలైన గుణములచేత సమస్తమును జయించి వాడు, 

జేతా:=సమస్త భూతములను మీరి పోయిన వాడు 

విశ్వయోనిః = బ్రహ్మాది మూలముగా నుండు కార్య ప్రపంచ మగు విశ్వమునకు కారణభూతుడు, 

పునర్వసుః = క్షేత్రజ్ఞాని (జీవుని) రూపమున మరల మరల శరీరముల యందు వసించు వాడు. 

*

 శ్లో. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః

అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః!!17!!

  

ఉపేంద్ర:= ఇంద్రునకు తమ్ముడుగా ప్రాప్తిమ్చినవాడు,

వామనః = ఇంద్ర రక్షనార్ధమై మహాబలి యాగమున తన దివ్య శరీర కాంతి చే చూపరులకు సుఖము నిచ్చువాడు,  

ప్రాంశు:= బలి చక్రవర్తి మూడడుగుల భూమిని ధారాదత్తము చేయ మన గానే ప్రభువగు వామనుడు చాలా పెద్దవాడై సర్వదేవ మయ మైన తన రూపమును కన బరచెను, అప్పుడు వానికి భూమి పాదములు గాను, ఆకాశము శిరస్సు గాను విశ్వరూపమును కనబరచినవాడు,

అమోఘః = అమోఘమైన (వ్యర్ధముకాని) పనులు గలవాడు

శుచి: = స్మరించినను, స్తుతిమ్చినను, పూజించినను పవిత్రము చేయు వాడు,

ఊర్జితః = శత్రువులను నిరసించుటకు తగిన బలము గలవాడు

అతీంద్రః = స్వాభావికములే యైన జ్ఞానైస్వర్యాదులచేత ఇంద్రుని మీరియున్నవాడు,

సంగ్రహః = ప్రళయకాలమును సమస్తమును ఒక్క చోటికి జేర్చువాడు,

సర్గ: = సృష్టి రూపుడు, సృష్టికి కారణమైనవాడు,  

ధృతాత్మా:= పుట్టుక మున్నగునవి లేకుండునట్లు ఒక్క రూపముతో  నిలిపి యుంచు కొనిన స్వరూపము గలవాడు,

నియమ: = తమ తమ అధికారములయందు ప్రజలను నిలుపువాడు,. 

యమః = లోపల నుండి నియమించు వాడు ,


*

 శ్లో. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః

అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహా బలః!!18!!


వేద్య: = మోక్షమును  తెలిసికొన దగి యున్నవాడు,

వైద్యః =   సమస్త విద్యలు తెలిసిన వాడు,

సదాయోగీ:= నిత్యమూ పత్యక్షమై యుండు స్వరూపము గల వాడు,

వీరహా: = ధర్మరక్షణకై వీరులైన అసురులను వధించు  వాడు,

మాధవ: = బ్రహ్మ విద్యకు అధిపతి యైనవాడు,

మధుః=  తేనే వలే యితడు గోప్పదియగు ప్రీతిని పుట్టించు వాడు,

అతీంద్రియ: = శబ్ద స్పర్సాది గుణములు లేనివాడు,

మహామాయ: =  మాయావి కి కూడ మాయావి అయిన వాడు,

మహోత్సాహ:= జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల జేయ నుద్య మించు వాడు,

మహా బలః= బలవంతు లకు కూడా బలవంతుడు, 

*

శ్లో. మహాబుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహా ద్యుతిః

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రి ధృక్ !!19!!


మహాబుద్ధి: = భుద్దిమంతులకు కూడా బుద్ధిమంతుడు,

మహా వీర్య: = సృష్టికి కారణమైన ఆ విద్యా స్వరూపమగు గొప్ప వీర్యము గలవాడు, 

మహాశక్తి: = గొప్పది యగు శక్తిగలవాడు,

మహా ద్యుతిః = లోపాలను వెలుపలను గొప్పదియగు ప్రకాశము   గలవాడు,

అనిర్దేశ్యవపుః= ఇతరులకు చెప్ప శక్యముగాని స్వరూపము గల వాడు

 శ్రీమాన్ :=   ఐ స్వర్యమైన సమగ్రమగు సిరి గలవాడు,

అమేయాత్మ: = సమస్త ప్రాణులకు ఊహించని బుద్ద్ధిగలవాడు,

మహాద్రి ధృక్ := గోవులను రక్షించు సమయమున  గోవర్ధన పర్వతమును ధరించినవాడు,

*   

.శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః!!20!!


మహేష్వాస: = గోప్పదియగు ధనుస్సు గలవాడు

మహీ భర్త: = ప్రళయకాల  సముద్రమున మునిగిన భూదేవిని భరించినవాడు, 

శ్రీనివాసః =  వక్షస్థలమున ఎడబాటులేకుండా శ్రీదేవికి నివాసము కల్పించిన శ్రీనివాసుడు,

సతాంగతిః= వేద ధర్మము నను సరించేది సాధువులకు పురుషా ర్ధములను సాధించి పెట్టువాడు,

అనిరుద్ధః= అవతారములలో ఎవని చేత గూడా నిరోధింప బడినవాడు కాడు 

సురానంద: = సురల నానందింప జేయువాడు,

గోవింద: = దేవతల స్తొత్ర రూపము లైన వాక్కులను పొందినవాడు,

గోవిదాం పతిః= విశేషించి వాక్కు నెరిగిన వారికి భర్తతో సమానుడు,

*

  శ్లో. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః 

హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః !!21!!


 మరీచి: = మొల్లపూలలా చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు

దమన: = సంసార తాపమును శమింప చేయువాడు,

హంసః= ఆకాశమున సూర్యరూపముతో సంచరించు వాడు,

సుపర్ణ:= సుందరములగు ధర్మా ధర్మ రూపములైన వర్ణములు గలవాడు,

భుజగోత్తమః= భుజగములలో ఉత్తముడు,

హిరణ్య నాభః= బంగారమువలె సుభంకరమైన బొడ్డుగలవాడు,

సుతప: = మంచి జ్ఞానము కలవాడు,

 పద్మనాభః = తామరను నాభిలో గలవాడు,

ప్రజాపతిః= సమస్త ప్రజలకు అధి నాయకుడు, 

*


అమృత్యుః సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః

అజో దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా!!22!!


అమృత్యుః= మృత్యువుగాని, మృత్యుకారణముగాని లేనివాడు,

సర్వదృక్ := స్వాభా వికమైన జ్ఞానముచేత ప్రాణులు చేసినది చేయని అంతయు జూచు చుండువాడు,

సింహ:=  హింసించు వాడు,

సంధాతా :=  జీవులను కర్మఫలములతో సంభందింప జేయువాడు,

సంధిమాన్ := అట్టి ఫలముల నను భావించువాడు, 

 స్థిర:= సదా ఏక రూపుడు, 

అజ:= గతి గలవాడు,

దుర్మర్షణ:= అసురులు మున్నగు వారికి సహింప శక్యముగాని వాడు,  

శాస్తా : శ్రుతి స్మ్రుత్యాదులచేత అందరకు హితము గరుపు వాడు,

విశ్రుతాత్మ := విషేశించి శ్రవణము చేయబడిన సత్య జ్ఞానాది లక్షణ లక్షితమైన ఆత్మ గలవాడు,

 సురారిహా := అసురలను సంహరించువాడు,  


  శ్లో. గురు ర్గురుతమో దామ సత్యః సత్య పరాక్రమః

నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః!!23!!


గురు:=  సర్వ విద్యలను ఉపదేసిమ్చు వాడు

గురుతమో:= బ్రహ్మాదులకు గూడ బ్రహ్మవిధ్యాసమ్ప్రదాయకుడైనవాడు,  

దామ:= సమస్త అభీష్టములకు స్థానముగా నున్నవాడు,

సత్యః= సత్య సంభాషణ రూపమైన ధర్మస్వరూపుడు, 

సత్య పరాక్రమః = అమోఘమైన పరాక్రమము గలవాడు,

నిమిష:= యోగ నిద్రారతుడై కన్నులు మూసికొనిన వాడు,

అనిమిషః= ఆత్మ రూపము గావున అనిమిషుడు, సదా మేలుకోనియే యున్న స్వరుపముగాలవాడు,

 స్రగ్వీ:= వైజాయంతి యనెడి పూలమాలను ఎల్లపుడు దాల్చియుండు వాడు,

వాచస్పతి:= సర్వార్ధ విషయిక మగు బుద్దిగలవాడు,

ఉదారధీః= ఘమ్భీరమైన బుద్ధి గలవాడు,



  శ్లో. అగ్రణీ ర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః

సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్ర పాత్...!!24!!


అగ్రణి:= ముముక్షువులను ఉత్తమ పదవికి దీసికొని పొవువాడు,

 గ్రామణీః = సమస్త భూతములకు నాయకుడు,

శ్రీమాన్:= సర్వోత్క్రుష్ట మైన కాంతి గలవాడు,

న్యాయ:= ప్రమాణములను గ్రహిమ్చున అభేదమును గలిగించెడి  వాడు,

నేతా =జగత్తనెడి యంత్రమును నడి పెడి వాడు,

సమీరణః= ప్రాణ వాయు రూపమున ప్రాణులను కదులు నట్లు చేయవాడు,

సహస్ర:మూర్ధా:= వేల కొలది శిరస్సులు గలవాడు,

విశ్వాత్మా:= విశ్వమునకు ఆత్మగా ఉండువాడు,

సహస్రాక్ష:= వేలకొలది కన్నులు, ఇంద్రియములు గలవాడు,

సహస్ర పాత్= వేలకొలది పాదములు గలవాడు,

*

శ్లో .ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః

అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః!!25!!


ఆవర్తన:= సంసార చక్రమును త్రిప్పునట్టివాడు,

నివృత్తాత్మా:= సంసార బంధమున దగుల్వడని స్వరూపముగలవాడు,  సంవృతః= ఆచ్చాదించెడి స్వభావముగల అవిద్య చేత కప్పి వేయ బడిన వాడు,  

సంప్రమర్దనః= రుద్రుడు కాలుడు మున్నగు విభూతుల చేత లెస్సగా మర్దిమ్చువాడు,

అహసంవర్తక:= చక్కగా దినముల నడిపెడి సూర్య రూపుడు,

వహ్ని= హవిస్సును మోసెడి అగ్ని లాంటి వాడు,

అనిల= స్థానము లేనివాడు,

ధరణీ ధరః= శేషుడు దిగ్గజములు మున్నగువాని రూపమునను వరాహ రూపమునను భూమిని మోయువాడు,

*

శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః

సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః!!26!!


సుప్రసాదః= అనకు అపకారము చేసిన (శిశుపాలుడు) మెదలైన వారికి మోక్షమునోసగినవాడు,

ప్రసన్నాత్మా= రజస్తామో గుణములచే కలుషితముగాని  అంత: కరణము గలవాడు,

 విశ్వ దృక్ := విశ్వరచన సేయు ప్రగల్బ్య ము గలవాడు,

విశ్వభుక్ := విశ్వమును పాలనము చేయువాడు

విభుః= అంతటా వ్యాపించు ఉండు వాడు,

సత్కర్త:= సత్కరించు వాడు,

సత్కృతః = పూజ్యులచెచేత కూడ పూజింప బడువాడు,

సాధు:= న్యాయ ప్రవర్తన గలవాడు,

జహ్ను:= ప్రళయకాలమున జనులను లీనము చేసికొనువాడు,

నారాయణ:= నారములనగా నిత్య వస్తువుల సమూహము వానిని ఆశ్రయముగా గలవాడు,

నరః=నాశములేని చేతనా చేతన విభూతి కలవాడు,


  శ్లో. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః

సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః!!27!!


 అసంఖ్యేయ:= సంఖ్య లేని వాడు,

 అప్రమేయాత్మా:= అప్రమేయమైన స్వరూపముగలవాడు, 

 విశిష్ట = సమస్తమును అతిశాఇంచి పోయినవాడు,

శిష్టకృత్ : =  అనుకూలముగా చేసుకొనువాడు,

శుచి := నింజనుడు,

సిద్ధార్థః = నెరవేరేది సంకల్పములు గలవాడు,

సిద్ది సంకల్ప := నెరవేరేది సంకల్పములు గలవాడు,

 సిద్ధిద := వారి వారి యధికారము ననుసరించి కార్తలకు సిద్ధిని ఇచ్చు వాడు,

సిద్ధిసాధన := సిద్ధికి సాధన మైనవాడు

*

 శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శుచి సాగరః!!28!!


వృషాహీ= యజ్ఞములు, వృషాహములు గలవాడు,

వృషభ:= భక్తజనుల కొరకు అభీష్టములను వర్షిమ్చు వాడు,

 విష్ణు: = విక్రమణము కలవాడు

వృష పర్వ:= పరమపదము నారోహించు నభిలాష గలవానికి వృష రూపములైన సర్వములు వక్కణించ గలవాడు,

 వృషోదరః= భక్తులు ఆదరముతో సమర్పించిన దాని నంతనూ విడువక స్వీకరించే వాడు,

వర్ధన:= తల్లి వలే వారి నందరినీ వృద్ధి పొందిమ్చేవాడు,

వర్ధమాన:= ప్రపంచ రూపమున వృద్ధి నొందు వాడు,

 వివిక్తః= ఇట్లు వృద్ధినొందినను విలక్షనముగానే ఉండు వాడు,

 శ్రుతిసాగర := సముద్రమువలేనే శ్రుతులకు విధియై యుండు వాడు,

  

. శ్లో. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః

నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః!!29!!


సుభుజ: = ఆశ్రితుల భారము నోర్వగలిగిన అందమైన భుజములు కలవాడు,

దుర్ధర: = ఒర్వజాలని వేగము కలవాడు,

వాగ్మీ = జయ శీలమైన వాక్కు గలవాడు,

మహేంద్ర: = మహత్తు గల ఇంద్రుడు,

వసుద: = మహిమ గలవాడైనా అల్పమైన ధనాదులు కోరువారికి వానినే ఇచ్చువాడు,

వసుః = క్షీర సముద్రమున వసించు వాడు,

నైకరూప: = ఒకటే రూపము లేనివాడు,

బృహద్రూపః = వరాహము మొదలైన మహారూపములు గలవాడు,

శిపివిష్టః = దిక్కులయందు ఆకాశ మందు కూడా వ్యాపొంచి యుండు వాడు,

ప్రకాశన:= సమస్తమును ప్రకాసింప జేయు స్వభావముగలవాడు,


 శ్లో. ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః

ఋద్ధః స్పష్టాక్షరో మంత్ర శ్చంద్రాంశు భాస్కర ద్యుతిః!!30!!


ఓజస్తేజోద్యుతి ధరః = ఓజస్సు,తేజస్సు, కాంతులను ధరించువాడు, ఓజస్సు అంటే బలము,. తేజస్సు తో శక్తి గలవాడు,

ప్రకాశాత్మా := ప్రకాశస్వరూపమైన ఆత్మ గలవాడు,

ప్రతాపనః = సూర్యదివిభూతుల చేత విశ్వమును లెస్సగా తపింప జేయు వాడు,

ఋద్ధః = ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, మొదలైన వానితో నిండి యుండు వాడు,

స్పష్టాక్షర:= ఉదాత్తమైన ఓంకారరూపమగు అక్షరము గలవాడు,

మంత్ర:=  చింతించు వారలన్లు రక్షించువాడు,

చంద్రాంశు:= చంద్రకిరణముల వంటి కాంతి గలవాడు,

భాస్కరద్యుతిః= సూర్యతేజము సామ్యముగా గలవాడు,

*

 శ్లో. అమృతాంశూద్భవో భానుః శశ బిన్దుః సురేశ్వరః

ఔషధం జగతస్సేతుః సత్య ధర్మ పరాక్రమః!!31!! 


అమృతాంశూద్భవ:= పాలసముద్రమును మధించు చుండగా ఉద్భవించిన చంద్రుని ఉత్పత్తికి కారణమైనవాడు,

భానుః = ప్రకాశిమ్చు వాడు,

శశ బిన్దుః=కుందేటిని బోలిన చిహ్నముగల చంద్రుని వలెనే ప్రజలను పోషించువాడు,

సురేశ్వరః= సురులకు ప్రభువైనవాడు, 

ఔషధం= సంసారం  నందు మందు  అందించు వాడు,

జగతస్సేతుః= లోకమునకు సేతువు వలే ఉండు వాడు,

సత్య ధర్మ పరాక్రమః= సత్యమైన ధర్మములు, జ్ఞానాది గుణములు పరాక్రమమును గలవాడు,


  శ్లో. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః

కామహా కామ కృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః!!32!!


భూత:భవ్య:భవన్నాథః = భూత భవిష్యద్ద్వార్తమానము లైన సమస్త భూతములకు నాధుడు,

పవనః = పవిత్రము చేయువాడు,

పావన:= వీచునట్లు చేయువాడు,

అనలః = అనేక విధములుగా నుప కరించియు చాలునని తృప్తి పొందనివాడు,

కామహా= హింసించు వారలయు ముముక్షువు లగు భక్తులయు కోరికలను నశిమ్ప చేయువాడు,.  

కామ కృత్ = సాత్వికు లైనా వారి కోరికలను సిద్దింప జేయువాడు,

కాంత : = మిక్కిలి రూపవంతుడు, 

కామః =  పురుషార్దమును గోరెడి వారిచేత కోరబడువాడు

కామప్రదః= భక్తుల కోరికలను చక్కగా నెరవేర్చువాడు,

 ప్రభుః = సర్వోత్కృష్టముగా ఉండువాడు,


 శ్లో. యుగాది కృత్యుగావర్తో నైకమాయో మహాశనః !

అదృశ్యో వ్యక్త రూపశ్చసహస్ర జిదనంత జిత్ !! 33 !!


యుగాది కృత్ : = యుగాది యనెడి కాల విశేషము నకు కర్త, అధవా యుగముల నారంభించువాడు,  

యుగావర్త:= కాలాత్మకుడై క్రుతాది యుగములను మరల మరల తిరుగునట్లు చేయువాడు,

 నైకమాయ:= ఒక్క మాయ గాదు వీనిది పెక్కు మాయల దాల్చువాడు,

 మహాశనః = కల్పాత్మున సర్వము భక్షిమ్చువాడగుటవలన గొప్ప భోజనముగలవాడు,

అదృశ్య:= ఎ జ్ఞానేంద్రియమునకును గోచరము కానివాడు,

వ్యక్త రూపశ్చ:= స్థూల రూపమున వ్యక్తమగు స్వరూపము గలవాడు, 

సహస్ర జిత్ := వేలకొలది అసురులను యుద్దమున జయించువాడు,

ఆనంతజిత్  = ఊహింప సక్యముగాని సామర్ద్యము గలవాడు,



  శ్లో. ఇష్టో విశిష్టః శిశ్టేష్టః శిఖండీ నహుషో వృషః !

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34 !!


 ఇష్ట:= పరమ సుఖ రూప డగుట చేత ప్రియమైనవాడు ,

విశిష్టః = అంతటా ఉండు వాడు,

శిశ్టేష్టః = శిష్టులకు ఇష్టమైనవాడు,

 శిఖండీ:= గోపాల వేషధారి ఆయన నెమలి పింఛమును అలంకారముగా ధరించినవాడు,

నహుష:= భూతములను మాయచేత బంధించు వాడు,

వృషః = తన కాంతిని, మాటలను చల్లగా వర్షిమ్చువాడు,

క్రోధహా:=సాధువుల కోపమును నసింప చేయువాడు,

క్రోధకృత్ =   క్షత్రియులందరికి క్రోధము కలిగించు వాడు,

కర్తా:= క్రోధమునకు మూలకారణమైన  కార్తవీర్యార్జునుని నరికినవాడు,

విశ్వబాహు := సమస్తప్రాణులకు ఆలంబనముగా నుండువాడు,

మహీధరః = పూజను లేదా భూమిని ధరించువాడు,


శ్లో. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః !

అపాం నిథి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః !! 35 !!


అచ్యుతః = తన ఐశ్వర్యము జారకుండా ఉండువాడు,

ప్రథితః = జగత్తునకు సంభందించిన సృష్టి మున్నగు కర్మల చేత ప్ర ఖ్యాతి నొందినవాడు,

ప్రాణః = సూత్రత్మగా ఉంది ప్రజలకు ప్రాణము గలవానిగా జేయువాడు,

ప్రాణద:= దేవతలకు బలము నిచ్చువాడు,

వాసవానుజః =కశ్యపుని వలన అదితి యందు బుట్టి దేవేంద్రునకు తమ్ముడైన వాడు,

అపాంనిథి = ఉదకములకు నిధియైన వాడు,

అధిష్ఠాన:= మధన కాలమున మంధర పర్వమునకు ఆధారమైన వాడు,

అప్రమత్తః = అధికారుల కొరకు కర్మలకు తగిన ఫలమును ఏమరుపాటు నొందక ఇచ్చు చుండు వాడు,

 ప్రతిష్ఠితః = తన మహిమ యందే యుండు వాడు,


శ్లో. స్కన్ద స్కన్దధరో ధుర్యో వరదో వాయు వాహనః !

వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురన్దరః !! 36 !!


స్కన్ద:= అమృత రూపమును శ్రవించువాడు, 

 స్కన్దధర:= ధర్మ మార్గామును నిలుపువాడు,

ధుర్య := సకల భూతముల ఉత్పత్తి మున్నగు లక్షణములుగల భారమును మోయువాడు,

వరద:= భాక్త జనులకు అభిమతమలైన వరములను ఇచ్చు చుండు వాడు,

వాయు వాహనః = వాయువును కుడా వీచునట్లు చేయువాడు,

వాసుదేవ:= తనకిరణముల చేత ప్రపంచమంతా వ్యాపించి క్రీడించు వాడు, 

 బృహద్భాను= పెద్దవైన కిరణములు గలవాడు,

 ఆదిదేవః= సమస్తమునకు కారణమును, ప్రకాశిమ్చుటకు మున్నగు లక్షనములు గలవాడు,

పురంధర= త్రిపురాసుర సంహారము చేసినవాడు,  



శ్లో . అశోకస్తారణరస్తారః శూరః శౌరిర్జనేశ్వరః !

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !!37!!


అశోక:= శోకము, మోహము, ఆకలి మొదలగు వానినుండి రక్షించు వాడు,

తారణ:= శత్రువులు, చోరులు, వ్యాధుల నుండి రక్షించువాడు,

తారః= సంసార భయమునుండి రక్షించు వాడు,

శూరః = జయించు స్వభావము కలవాడు,

శౌరి:= శూరుని పుత్రుడు,

జనేశ్వరః = జనులకు ఈశ్వరుడు, 

అనుకూలః = సకల భూతములకు ఆత్మగా, భక్తులకు అనుకూల మైన వాడు, 

శతావర్తః= ధర్మమును కాపాడుటకై వందలకొలది ప్రొదుర్భావములు జెందు వాడు,

 పద్మీ= చేతి యందు పద్మము కలవాడు,

 పద్మనిభేక్షణః= పద్మములను బోలియుండు నేత్రములు గలవాడు,


శ్లో. పద్మనాభోరవిందాక్షః పద్మ గర్భః శరీరభృత్ !

మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః !!38 !!


పద్మనాభ:= కమలము యోక్క నాభి యందుండు వాడు,

అరవిందాక్షః= తమర రేకుల వంటి కన్నులు గలవాడు,

 పద్మ గర్భః = హృదయకమల మధ్యమున ఉపాశింప దగినవాడు,

శరీరభృత్ = యోగుల ఉపాసనను పోషించు వాడు,

మహర్ధి : = మిగుల గొప్పదియగు విభూతి గలవాడు,

బుద్ధ:= ప్రపంచా కారముతో ఉండు వాడు,

వృద్ధాత్మా:= పురాతన మైన ఆత్మ గలవాడు,

 మహాక్ష:= గోప్పవియగు రెండు లేదా పెక్కు నెత్రముజ్లు గలవాడు,

 గరుడధ్వజః =గరుత్మంతుని చిహ్నముగల ధ్వజము గలవాడు,



శ్లో. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః !

సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !!39!!


అతులః = సాటి లేనివాడు,

శరభ:= తనమాట జవదాటినవారిని శిక్షించు వాడు, 

భీమః = హద్దు మీరిన వారిని శిక్షించును కనుక వారికి భయంకరుడు, 

సమయజ్ఞ:= ఎ కాలమున తననుతాను భక్తులకు ఇచ్చు కోవాలో ఎరిగి న వాడు,

హవిర్హరిః= యాగమున హవిర్భాగములను స్వీకరించువాడు, 

సర్వలక్షణ లక్షణ్యో:= సమస్త ప్రమాణముల చేత ఏ జ్ఞానమైతే సిద్ధించు చున్నదో అది సర్వలక్షణము లతో నిండియుండు వాడు,

లక్ష్మీవాన్:= వక్ష:స్థలమున నిరంతరము లక్ష్మీ దేవి నివసించు చుండు వాడు,

సమితింజయః = యుద్దమున గెలుపొందువాడు,


శ్లో. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః !

మహీధరో మహాభాగో వేగవానమితాశనః !! 40 !!


విక్షర:= నాశము లేని వాడు,

రోహిత:= రోహిత అనే మత్యము యొక్క ఆకారమును ధరించువాడు,

మార్గ:= ఉపాసకుల చే వెతుక బడువాడు,

హేతు:= అనతికి నీ ఉపాదాన కరణము, నిమిత్త కరణము నైనవాడు,

దామోదరః= సమస్త లోకములూ ఉదరము నందు కలవాడు,

 సహః = అందరను అతిక్రమించిన వాడు అథవా అంతయు సహించు వాడు,

మహీధరో:= భూమిని ధరించు వాడు,

మహాభాగ:= ఉత్తమోత్తమ కన్యలు ఎరికోరి వరింప దగిన సౌభాగ్యము గలవాడు,

వేగవాన్ := మానవా వతారంలో  మిక్కిలి వేగము కలవాడు,

అమితాశనః=సంహరకాలమున విశ్వమును భక్షిమ్చువాడు,



శ్లో. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః !

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41 !!


ఉద్భవః= ఉత్పత్తికి ఉపాదానకారణ మైనవాడు, 

క్షోభణ:= కలత పెట్టు వాడు

దేవః= మాయ అనే పాశములొ జీవులను బంధించి క్రీడించువాడు,

శ్రీగర్భః =క్రీడలతో లక్ష్మిని సంతసింప చేసి వృద్ది పొందించువాడు,

పరమేశ్వరః =లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్ధకత నొందినవాడు,

కరణం =  సాధనుముగా ఉండు వాడు,

కారణం = ఆయాకిరణములచే ఆయా పనులను చేయించు దేవతగా కూడ నుండు వాడు,

కర్తా = వాశ్చల్యమువలన సుఖ దుఖములను తాను కూడా  అను భవిస్తాడు,

వికర్తా:= జీవుని సుఖ దుఖములను చూచి వికారము పొందు వాడు,

గహన := విచిత్రమైన రీతిలొ బుద్దికి అగోచరముగా నుండు వాడు,

గుహః =లోకమంతాను రక్షించు వాడు,



శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః !

పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!


వ్యవసాయ:= నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరముగా కలవాడు,

వ్యవస్థానః = కాలమును తనయందే స్థాపించబడి ఉండువాడు,

సంస్థానః = సమస్తమును తనయందే ముంగించు నట్లుండు వాడు,  

స్థానద:= పరమ స్థానము నిచ్చు వాడు,

ధృవః = నాశములేనివాడు,

పరర్ధిః= సర్వోత్క్రుష్టమైన విభవము గలవాడు,

పరమస్పష్టః= మిక్కిలి గొప్ప ప్రకాశము గలవాడు,

తుష్టః= పరమానందమే ముఖ్యస్వరూపముగా గలవాడు,

పుష్టః=అన్నీ విషయముల యందును పరిపూర్ణుడు,  

శుభేక్షణః = శుభమైన దర్శనము కలవాడు,


శ్లో. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః !

వీరః శక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమః !!43!!


రామ:= రమింప చేయువాడు,

విరామ:= తనయందే సకల జీవులను విరామము నొందుట గలవాడు,

విరజ:= విషయములను సేవించుట యందలి ఆసక్తి నశించి నట్టివాడు,

మార్గ:= నిర్దోషమైన మార్గముములు చూపువాడు, 

నేయ:= నియ మింప దగినవాడు,తనవారికి అణిగి ఉండువాడు,

నయ:=ఆకర్షిమ్పబడి ఆశ్ర యించు వాడు, 

అనయః = మృదుత్వం లేనివాడు,

వీరః=శత్రువులను పారిపోవునట్లుచేయువాడు,

శక్తిమతాం శ్రేష్ఠ: =దేవడులచే మిక్కిలి కొని యాడబడువాడు,

ధర్మ:=  ధర్మములు చేత ఆరాధింప బడువాడు,

ధర్మవిదుత్తమః =ప్రతిఒక్కరికి ధర్మముల గురించి విశదీకరించువాడు,  


శ్లో.వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః !

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః !!44!!


వైకుంఠః = సమస్తము ఒకదానితో ఒకటి సంభందము కలుగు నట్లుగా చేయువాడు,

పురుషః = సమస్తమును పాలించువాడు ,

ప్రాణః=అందరును జీవించు నట్లుచేయువాడు,

ప్రాణదః= ప్రాణములను ఇచ్చువాడు,

ప్రణవః =ప్రణవ నాదం "ఓంకారం "సృష్టించినవాడు,

పృథుః =ప్రపంచ రూపమును విస్తరించువాడు,

హిరణ్యగర్భః=  ధ్యానించే వారి హృదయములు బంగారములు, వాటి యందు ప్రకాశించు వాడు,

శత్రుఘ్న:= దేవతలా శత్రువులను సంహరించువాడు,

వ్యాప్త:= కార్యములైన వాణి నన్నింటిని కారణ స్వరూపముతో వ్యాపించి యుండువాడు,

వాయు:= గంధమును కలుగ చేయవాడు

అధోక్షజః = అందరిచేతను అనుభవించ బడుతున్నను కొంచెము కూడ  తగ్గనివాడు,


 శ్లో. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః !

ఉగ్రః సంవత్సరో దక్ష విశ్రామో విశ్వ దక్షిణః !!45!!


ఋతుః = అందరకు ఉల్లాసకరములైన గుణములతో కూడినవాడు,

సుదర్శనః = తనగుణము లెరుగని వారికి తనదర్శనమే శుభముగా కలవాడు,

కాలః=సమస్త చరాచర గణనచేయు (లెక్కపెట్టు ) వాడు,

పరమేష్ఠీ= హ్రుదయాకాశములోపల ఉత్కుష్టమైన తన మహిమ యందే  ఉండునట్టి స్వభావముగలవాడు,

 పరిగ్రహః = సర్వవ్యాపి కావున తనను శరణు చోచ్చినవారికి అంతటను లభించువాడు,  భక్తులిచ్చునట్టి తులసీదలము పుష్పము మొదలైన వానిని చక్కగా గ్రహించువాడు,

ఉగ్రః= సూర్యుడు మొదలైన వారికిగూడ భయహేతువుగా ఉన్నవాడు,

సంవత్సర:= సకల భూతములు తనయందే నివసించుట గలవాడు,

దక్ష:=జగద్రూపమున వృద్ది నొందువాడు, అధవా సమస్త కర్మలను సీఘ్రముగా చేయునట్టివాడు,

విశ్రామ:= పాప ఫలము లనభవించి అలసిన వారు విశ్రాన్తి నొందు  స్థలముగా నున్నవాడు, 

విశ్వ దక్షిణః=అందరికంటే మిక్కిలి గొప్ప శక్తి గలవాడు,


శ్లో. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం !

అర్థో నర్థో మహా కోశో మహా భోగో మహాధనః !!46!!

  

విస్తారః =  సమస్త లోకములు తనయందే విసరించుట గలవాడు,

స్థావర స్థాణుః = ధర్మమును స్థాపించి తరువాత శాంతిచువాడు,

ప్రమాణం =జ్ఞాన స్వరూపుడు ,

బీజమవ్యయం = ఎట్టి మార్పులు లేని యట్టి కేవలసత్తా స్వరూపుడును జగత్తునకు కారణమును ఐనవాడు,

అర్థ:= సుఖస్వరూపుడగుట వలన అందరరచేతను కోరబడు నట్టివాడు,

అనర్థ:= పూర్ణ కాముడు గావున తనకేదియు అవసరము లేనివాడు,

మహా కోశ:= అన్నమయాది మహాకోశములు ఆవరణములుగా గలవాడు,

మహా భోగ:=  సుఖ స్వరూపమైన భోగముకలవాడు,

మహాధనః = భోగ సాధన రూపమైన గొప్ప ధనము గలవాడు,


శ్లో. అనిర్విణ్ణ స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః !

నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః !!47!!


అనిర్విణ్ణ:= సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము లేకుండువాడు,

స్థవిష్ఠో:= విరాడ్రూపముతో నున్నవాడు,

అభూ:= ద్రువునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు,

ధర్మయూప:= ధర్మమును తత్వమును శిరసుగా చేర్చుకొనువాడు,

మహామఖః = ధర్మ శరీరుడు కనుక  యజ్ఞమును అవయవముగా కలవాడు,

నక్షత్రనేమి : = జ్యొతిశ్చక్రమును ప్రవర్తింప చేయువాడు,

నక్షత్రీ:=నక్షత్ర రూపమును ధరించువాడు,  

క్షమః =సమస్త భూ భారమును అనాయాసముగా వహించువాడు,

క్షామః = సమస్త వికారములను శాసించి స్వస్వరూపమును నుండునట్టి జీవుడు,

సమీహనః =సృష్ట్యాదుల నిమిత్తము చక్కగా ప్రయత్నిమ్చువాడు,


శ్లో. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః !

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ !!48!!


యజ్ఞ:= సమస్త యజ్ఞ స్వరూపుడు, దేవతలనుసంతోశము పెట్టువాడు, ఇజ్య:= కామ్యఫలములను కోరువారలకు ఇంద్రాదుల ద్వారా ఆరాధింప బడువాడు, 

మహేజ్యశ్చ:= మోక్షమనేది మహాఫలము నిచ్చువడగుటచేత దేవత లందరలోను లెస్సగా పూజింప దాగి యున్నవాడు,. 

క్రతుః =యూపస్తంభముతో గూడిన యజ్నముగా నున్నవాడు,

సత్రం:=బహుకాలము చేయువలసిన సత్ర యాగాదులచే ఎల్లపుడు ఆరాధింప బడువాడు,

సతాంగ:= సజ్జనులకు యితడు దప్పమరొక గతిలేదు కావున ఆదు కొనేవాడు,

సర్వదర్శీ:= సమస్త ప్రాణులను ఎమేమిచేయునది,  చేయునది అంత యును స్వాభావికమైన జ్ఞానము చేత చూచు చుండువాడు,

విముక్తాత్మా:= స్వాభావికముగానే ముక్తి నొంది యున్న స్వరూపము గలవాడు,

సర్వజ్ఞ:= సర్వప్రకారముల చేత తన్నెరిగినవాడు,

జ్ఞాన ముత్తమమ్:=ఉతమములగు వైష్ణవ ధర్మములన్నియు ఎరిగిన వాడు 


శ్లో. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ః !

మనోహరో జిత క్రోధో వీరబాహు ర్విదారణః !!49!!


సువ్రతః=  మంచి నియమము గలవాడు, 

సుముఖః =వికారములేని అందమైన ముఖము కలవాడు,

సూక్ష్మః= శబ్దము మొదలైన స్థూలకరణములు లేనివాడు, 

సుఘోషః=సుందరమైన వేదరూపమగు ధ్వని గలవాడు,

సుఖదః = సత్ప్రవర్తన గలవారికి సుఖము పంచువాడు,

సుహృత్ః = ప్రత్యుపకరమును కోరకయే ఉపకారము చేయువాడు,

మనోహర:=అపకరించు వారి మనస్సును కూడా హరించువాడు,

జితక్రోధ:= క్రోధమును జయించువాడు,

వీరబాహు:= వేదమర్యాదాలను నిలబెట్టుటకై వీర బాహు రూపంతో  అసురలను సంహరించువాడు,

విదారణః= ధర్మము లేని వారిని చీల్చి వేయువాడు,


శ్లో. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్ !

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !!50!!


స్వాపనః = ప్రాణులను మాయచేత ఆత్మ జ్ఞాన రహితులునుగా చేయుచు నిద్ర  పుచ్చు నటివాడు,

స్వవశ:= జగత్తు యోక్క సృష్టి స్తితి లయములకు హేతువై స్వతంత్రుడు గా నుండువాడు,

వ్యాపీ:=అకాశమువలె సర్వము వ్యాప్తిచెందు యుండువాడు ,

నైకాత్మా:=జగత్తుయోక్క సృష్ట్యాదుల విషయమై వ్యక్తమగు నట్టి నిమిత్త  శక్తులగు విభూతులతో అనేక విధములుగా ఉండు వాడు,  

నైక కర్మ కృత్:= జగత్తును ఉత్పన్నము చేయుట వృద్ది నొందించు, ఆపదల నొందించుట మున్నగుకార్యముల్ను జేయువాడు,

వత్సర:= అనయుతనయందే నివసించుట గలవాడు,

వత్సల:= భక్తులైన వారియందు పరమ గలవాడు,

వత్సీ:= కోడెదూడలను కాపాడేవాడు,

రత్నగర్భ:= రత్నములే గర్భముగా గలిగియున్నవాడడగుటచేత రత్నగర్భుడైనాడు, 

ధనేశ్వరః= ధనములకు ప్రభువుగా ఉన్నవాడు, 



శ్లో. ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్ క్షరమ క్షరమ్ !

అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః !!51!!


ధర్మగుప్ := తానిచ్చిన ధర్మకామములు దుర్విషయమున పోకుండా కాచి ధర్మమును రక్షించువాడు,

 ధర్మకృత్ := తానూ అనుగ్రహించుటకు కారణమైన ధర్మమును చేతనులకు తానె లభింప చేయుటచే అనగా ధర్మమును చేయువాడు,

ధ్ర్మీ:=ధర్మము తప్పనివాడు

సత్ := ఎల్లపుడు ఉండువాడు,

అక్షరం := వికారము లేకుండు వాడు,

అసత్ := అసత్ గా ఉండు వాడు,

క్షరమ = వికారము గలవాడు

అవిజ్ఞాతా:= అనభాక్తులు అపకారములు చేసినా వానిని ఎరుంగక ఉండ ని వాడు,

 సహస్రాంశు:= అపరిమితము గలవాడు,లోకములో అపరాధి అయిన నాదృష్టిలో నాభాక్తుడైతే నిరపరాధి కలవాడు,

విధాతా:= సమస్త భూతములను ధరించునట్టి శేషుడు, దిగ్గజములు, పర్వతములు అను వీనిని సైతము విశేషించి ధరించు నట్టివాడు,

 కృతలక్షణః = నిత్య సిద్దమై యున్న చైతన్యమే స్వరూపముగా గలిగి యున్నవాడు ,


శ్లో. గభస్తినేమి సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః !

ఆది దేవో మహా దేవో దేవేశో దేవ భృద్గురుః !!52!!


గభస్తినేమి :=నడుమ సూర్యుని రూపముతో ఉండు వాడు ,

సత్త్వస్థః=సత్వగుణ ములచే ప్రధానముగా అధిష్టించి యుండువాడు ,

 సింహ:= సింహమువలే పరాక్రమ శాలియై ఉన్నవాడు,

భూతమహేశ్వరః =భూతములకుమహా ప్రభువియా ఉన్నవాడు ,

ఆది దేవ:=సమస్త భూతములకు ఆఅది దేవుడు ,

 మహా దేవ:=బ్రహాడులనుబంతుల వాలే ఆడువాడు,

 దేవేశ:=ముఖ్యముగా దేవతలకుప్రభువైన వాడు ,

 దేవ భృత్ =యదేచ్చగా వియోగించుచు భరించువాడు,

గురుః =వేదవాక్యములుతెలియపరుస్తూ గురువైనవాడు ,


శ్లో. ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞాన గమ్య పురాతనః !

శరీర భూత భృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః !!53!!


ఉత్తర := దేవతులకు అసురులచే గల్గు ఆపదలను తప్పించు వాడు, 

గోపతి:=గోవునకు, భూదేవికి, పాటి అయినవాడు,  

గుప్తా:= సమస్త భూతములను పోషించుచు జగద్రక్షుడై ఉండువాడు,

జ్ఞాన గమ్య:= కర్మచే గాని, జ్ఞానము మరియు కర్మ యనెడి యీ రెండింటిచే గాని లభింపక కేవల జ్ఞానముచేతనే లభించు నట్టివాడు,

పురాతనః =పూర్వమె యుండి ఉన్నవాడు,

శరీరభూత భృత్ := ప్రాణ  రూపమునుధరించిన వాడై శరీరము ఉత్పన్నము చేయు భూతములను పోషించు నాట్టివాడు ,

భోక్తా:= పాలన చేయునట్టివాడు

కపీంద్ర:= వానరరూపమైన మారువేషమును ధరించిన దేవతలకు ప్రభువైనవాడు,

 భూరి దక్షిణః = లోకులకు తెలియుటకై అశ్వ్మెధది యాగాములను తానూ చేసి, బ్రాహ్మణులకు విశేష దక్షినలు నిచ్చినవాడు,


శ్లో. సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః !

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః !!54!!


సోమప := సోమ పానము చేసినవాడు,

అమృతపః = అమృతమును పానము చేసినవాడు,

సోమః =అమృతముగా ఉండు వాడు,

పురుజిత్ := పలువురను జయించినవాడు,

పురుసత్తమః = మహనీయుల యందుడు వాడు,

వినయ:= మారీచాదులను తన వీర్యముచే అణచినవాడు,

 జయః = సకల భూతములను జయించినవాడు,

సత్యసంధ:= సత్యమైన సంకల్పము గలవాడు,

 దాశార్హః =దానమునకు అర్హుడైనవాడు,

సాత్వతాం పతి :=పరమ సాత్వికులకు రక్షకుడు,


 శ్లో. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !

అంభోనిథి రనంతాత్మా మహోదధి శయోన్తకః !!55!!


 జీవ := భాగావతోత్తములకు తన కైంకర్యము నిచ్చి జీవింప  చేయు వాడు,

 వినయితా:= భక్తులనుబుజ్జగించి రక్షించు వాడు,

 సాక్షీ:= భక్తులక్రుత్యములను వారినిసన్మాఅర్గవరనులుగ్గ చేయుటకు నేరుగా చూచు చుండెడివాడు,

 ముకుంద:=మోక్షము నిచ్చువాడు,

 అమిత విక్రమః = ఆధారశక్తి యను అపరిమిత బలమును ధరించిన వాడు,

అంభోనిథి := సముద్ర జలమున నుండు వాడు,

అనంతాత్మా:= ఆది కూర్మము పైన ఉండి సమస్త జగత్తును వహించు ఆది శేషువుకు అంతరాత్మగా నుండువాడు,

 మహోదధియ :=ప్రలయకాలంలున అ అనంతుపై సముద్రమున శయ నించు వాడు,

 అంతకః= భూతములకు అంతము కలుగ చేయువాడు,


శ్లో . అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర: ప్రమోదన:!

ఆనందో వందనో నంద:సత్యధర్మా త్రివిక్రమ: !!56!!


అజ:="అ " కారమునకు అర్ధమైన వాడు,

మహార్హ:= ఆకారము నుండి పుట్టి నందున ఓం కారముచే పూజిమ్ప దగినవాడు,

స్వాభావ్య:= నిత్యసిద్దమే యై ఉన్న  స్వభావముగనే భావింప బడనివాడు,

జితామిత్ర:= భక్తులయొక్క అహంకార మమకారాడులను తొలగించు వాడు,

ప్రమోదన:= తనను అనుసంధించిన క్షణములోనే ఆనందిప చేయువాడు,   

ఆనంద:= ఆనందమే తన రూపము గలవాడు,

వందన:=ఆనందమును ముక్తి దశలో చేతనులకిచ్చి ఆనందింప చేయు వాడు,

నంద:= ఆనందము కలుగ చేయువాడు,

సత్యధర్మా:= సత్యమైన వ్యాపారము గలవాడు,

త్రివిక్రమ:= మూదు వేదముల యందు ఉండి త్రివిక్రముడై నవాడు,  


శ్లో . మహర్షి: కపిలాచార్య: కృతజ్ఞో మేది నీపతి:!

త్రిపద త్రి దశా ధ్యక్షో మహశ్రుంగ: క్రుతాంతకృత్ !!57!!


మహర్షి:= మూడు వేదములను  ప్రత్యక్షముగా దర్శించువాడు,

కపిలాచార్య:=కపిల వర్ణము గలవాడు,

కృతజ్ఞ:= కార్య రూపమైన జగత్తు, జగత్తుయందు కృతజ్నుడుగా ఉండువాడు,

మేది నీపతి:=భూదేవికి భర్త అయిన వాడు,

త్రిపద:= మూడు అడుగులు కలవాడు,

 త్రిదశా ధ్యక్ష:=వరాహరూపమున ప్రలయాపాడలో బ్రహ్మాదులకు అధ్యక్షుడుగా నుండువాడు,

మహశ్రుంగ:= సాటిలేని పెద్ద కోరలుగలవాడు,

క్రుతాంతకృత్ :=యముని వంటి హిరణ్యాక్షుడిని సంహరించినవాడు 



శ్లో. మహా వరాహో గోవిందః సుషేణః కనకాంగదీ !

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః !! 58 !! 


మహా వరాహ:= మహాత్తుగల వాడును వరాహరూపియు నైనవాడు,

గోవిందః = వేద వాక్కు లచేత పొంద బడువాడు,

సుషేణః=పార్ష ద గణ రూపమైన చక్కని సేన గలవాడు,

కనకాంగదీ:= సువర్ణ మయము లైన  దివ్యాభరణ ములను ధరించిన వాడు,  

గుహ్య:= రహస్యములైన ఉపనిషత్తులచేత  తెలిసి కొనదగి యున్న వాడు 

గభీర:= జ్ఞానము, ఐశ్వర్యము, బలము వీర్యము మొదలైన వానిచేత గమ్భీరముగా ఉండువాడు,

గహన:= మిక్కిలి కష్టముగా ప్రవేశింప బడువాడు,

గుప్త:= మనోవక్కులకు అగోచర మైనవాడు,

చక్ర గదాధరః =  చక్రము, గద మొదలగు దివ్యాయుధములను ధరించిన వాడు,


శ్లో. వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః !

వరుణో వారణో వృక్షః పుష్కరాక్షో మహామనః !! 59!!


వేధాః =సృష్టి చేయువాడు,

స్వాంగ:=కార్యసాధనుమున తనకుతానే సహాయముగా గలవాడు,

అ జితః = అవతారములయన్దు ఎవనిచేత గూద అపజయమును పొందనివాడు,

కృష్ణ::=నల్లని శరీరము గలవాడు,

దృఢః= తనస్వరూపము, సామర్ద్యము మెదలైన వానినుండి జారుట  యనునది లేనివాడు,

సంకర్షణ:= ప్రళయకాలమున ప్రజల నందరను ఒక్కమారు తనలోనికి ఆకర్షించు కొనువాడు,

అ చ్యుతః = పరములో వలే ప్యూహమున కుడా తనస్తానము నుండి జారనివాడు,

వరుణ:=సమస్తమును ఆవరించి ఉండువాడు,

వారణ:= తనని వరించు వారలు కలవాడు,

వృక్షః= వృక్షమువలే చలన రహితుడై ఉండువాడు,

పుష్కరాక్ష:=హృదయ కమలమును వ్యాపొంచి యుండువాడు, కృపను వర్షించు నేత్రములు కలవాడు,

మహామనః =సృష్టి స్తిలల్యము లనేది కార్యములను మనస్సు తోనే చేయువాడు,


శ్లో. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః!

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః !! 60 !!


భగవాన్:= పరమ పూజ్యుడు, సమస్త కళ్యాణ గుణ స్వరూపుడు, సమస్త దోష రహితుడు,  

భగహా : సంహార కాలమున ఐశ్వర్యము మున్నగు వానిని కొట్టి వేయు వాడు,

ఆ నందీ:= సుఖస్వరూపుదిఅ ఉండువాడు, సంపదలతో సమృద్దిగా ఉండువాడు,

వనమాలీ:= పంచ తన్మాత్ర  రూపమైన వైజయంతి యను పేరుగల వనమాలను ధరించువాడు,

హలాయుధః=నాగలి ఆయుధముగా కలిగినవాడు,

ఆదిత్య:= కశ్యప మహర్షికి అదితియందు వామన రూపమున అవతరించి నట్టివాడు,

జ్యోతిరాదిత్యః=సూర్య మండలాంతర్గతమైన జ్యోతి యందు ఉండువాడు,

సహిష్ణు;=శీతోష్ణాది ద్వంద్వములను సహించు కొనువాడు,

గతిసత్తమః = ఎల్లరకును గతియును సర్వ శ్రేష్టుడును ఐ యున్నవాడు,


శ్లో. సుధన్వా ఖండ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః !

దివః స్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61 !!


సుధన్వా:= అసుర సంహరార్ధము మంచి ధనుస్సును  ధరించిన వాడు,

ఖండ పరశు: = ,రుద్ర సంబంధమైన యుద్దంలో ఖండిమ్చాడని భారతంలోనికథ, గండ్ర ద్ర  గొడ్డలిని ఖండించిన వాడు, 

దారుణ:= భాహ్య అంతర శత్రువులను ఖండించుటచే భయంకరుడు,

ద్రవిణ ప్రదః = ధనము వంటి సమస్త శాస్త్రములను జనములకిచ్చిన వాడు,

దివ స్పృక్= పరమార్ధము నేరింగినవాడు,

సర్వ దృక్ = సమస్తమును చూచువాదు,

వ్యాస:= వేదములను విభజించినవాడు,

వాచస్పతి:= మాతృ గర్భమున జన్మింపని వాడు,

అయోనిజః = భగవంతుని వాక్కు నుండి జనించినవాడు,


శ్లో. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ !

సన్న్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ !! 62 !!


త్రిసామా:= దేవ వ్రతము లనేడి మూడు సామములచేత  సామ గాయకుల ద్వారా స్తోత్రము చేబడినవాడు,

సామగః=సామగానము చేయువాడు,

సామ = తన్ను గానము చేయువారల పాపమును నాశము చేయువాడు,

నిర్వాణం= పాపము తొలగిన వారి పరగతికి కారణమైన వాడు,

భేషజం=సంసారమనే వ్యాధికి పరమౌషధమైన వాడు, 

భిషక్ = సంసారమును రోగమునకు చికిత్స చేయువాడు,

సన్న్యాసకృ త్ = విషయముల యందు  వైరాగ్యము కలిగించువాడు

శమ := కోపాదులను అనుచుటకు తగిన ఉపాయము నుపదేశించు వాడు

శాంత:= కొంచమైన అహంకారము లేక శాంతుడై ఉండువాడు,

నిష్ఠా:= ప్రళయమున సమస్త భూతములకు నివాస మైనవాడు,

శాంతిః =ఉపాసకులు గొప్ప సమాధి యందుండి తనను తలచునపుడు తాముండు స్థితిని వారు మరచునట్లు చేయువాడు , 

పరాయణమ్ = అట్టి సమాధి స్థితికి చేరిన వారికి పరమభక్తిని అను గ్రహించు వాడు 


శ్లో. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః !

గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృష ప్రియః !! 63 !! 


శుభాంగః = తనయందు భక్తి చేయుటకు అనువగు అష్టాంగాములను ఇచ్చువాడు,

శాంతిదః = తన సాయుజ్యమనే శాంతిని ఇచ్చువాడు,

స్రష్టా: = సృష్ట్యాదిని సమస్త భూతములను సృజించినవాడు,

కుముదః = భూమియన్దు ఆనందిచు వాడు,

కువలేశయః = కోరిక ప్రకారమే ఉండునట్లు చేసేవాడు కువలేశయుడు, 

గోహిత:= ప్రక్రుతిననాను వ్యవస్తాపించిన వాడు,

గోపతి := భొగభూమి అయిన స్వర్గానికి కుడా నాధుడు,

 గోప్తా := కర్మ ఫలమైన సంసార చక్రమును రక్షించు వాడు,

వృషభాక్ష:= సమస్తమైన అభీశములను వరించు నత్తి నేత్రములు గలవాడు,

వృష ప్రియః = ప్రవర్తక, నివర్తక  రూపములైన ధర్మములను ప్రియముగా కలవాడు,


శ్లో. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా కేమ కృచ్ఛివః !

శ్రీవత్స వక్షః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః !! 64 !! 


అనివర్తీ : = ధర్మ ప్రియుడు గావున ధర్మమునుండి తప్పిపోని వాడు,

నివృత్తాత్మా:= స్వభావముగనే విషయముల నుండిమరలిన ఘనస్సు గలవాడు,

సంక్షేప్తా:= విస్తారము నొంది యున్నజగత్తును సంహార కాలమున సూక్ష్మము గావించు వాడు,

క్షేమకృత్ := లభించి యున్న పదార్ధమును కాపాడు వాడు,

శివః = తన నామమును స్మరించిన మాత్రమున పావనము చేయు నట్టివాడు,

శ్రీవత్స వక్షః = శ్రీ వత్సమనెడి చిహ్నము వక్షస్థలమున గలవాడు,

శ్రీవాసః = తన వక్షస్థలమున ఎడబాటు లేక లక్ష్మీ దేవి నివసించు చుండునట్టి వాడు,

శ్రీపతిః =లక్ష్మి దేవికి తగిన నాయకుడు,

శ్రీమతాంవరః = శ్రీ మహాలక్ష్మి బ్రహ్మ మెదలు కాగా గల సమస్త

జీవులపై ఎప్పుడో ఒకింత తన అనుగ్రహ దృష్టిని ప్రసరింప చేసినవాడు,



శ్లో. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీ విభావనః !

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయః !! 65 !!


శ్రీదః =భక్తులకు సిరిని అనుగ్రహించు వాడు,

శ్రీశః= శ్రీదేవికి భర్త అయినవాడు,

శ్రీనివాసః= సిరిగల వారి యందు ఎల్లప్పుడూ ఉండువాడు,

శ్రీనిధిః = సర్వశక్తి సంపన్నుడై సమస్తమైన సిరులకు విధిగా 

ఉన్నవాడు,

శ్రీ విభావనః = సకల భూతములకు వాని వానికర్మల ననుసరించి అనేక  విధములైన సిరులనుకలుగ్ జేయువాడు. 

శ్రీధరః = సమస్త భూతములకు తల్లియగు శ్రీదేవిని వక్షస్థలమున నిలుపుకొనినవాడు. 

శ్రీకరః = స్మరణ చేయువారు, స్తోత్రము చేయువారు, పూజ చేయువారు 

నగు భక్తులకు సిరిని కలుగ జేయువాడు. 

శ్రేయః= నిత్య నిరతశయ సుఖప్రాప్తి రూపమైన శ్రేయస్సు గలవాడు,

శ్రీమాన్ = సిరులను గలవాడు,

లోక త్రయాశ్రయః =  ముల్లోకములకు ఆశ్రయ మైనవాడు,


శ్లో. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతి ర్గణేశ్వరః !

విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్ఛిన్నసంశయః !! 66 !!


స్వక్షః = పద్మములవంటి చక్కనైన కన్నులు కలవాడు,

స్వంగః = దివ్యములైన అవయవములు కలవాడు,

శతానంద:= నూరు విధములుగా పరమానందమును కల్పించువాడు,

నంది:= పరమానంద స్వరూపుడు, 

జ్యోతి ర్గణేశ్వరః = జ్యోతిర్గణములకు ప్రభువైనవాడు,

విజితాత్మా= మనస్సును జయించిన వాడు,

విధేయాత్మా = ఎవరినిచేత కూడా విభజింప బడని స్వరూపము గలవాడు,

సత్కీర్తి = సాయమైన కీర్తిగలవాడు, 

ఛిన్నసంశయః = కరతమామలకముగా సమాసమును ప్రత్యక్షముగా 

చూచు చుండువాడు, 


శ్లో. ఉదీర్ణః సర్వత శ్చక్షు రనీశః శాశ్వత స్థిరః !

భూశయో భూషణో భూతి ర్విశోకః శోక నాశనః !! 67 !! 


ఉదీర్ణః = సమస్త భూతముల కంటెను అధికుడు,

సర్వత శ్చక్షు = అణా చైఅన్యముచెఅ అన్నివైపుల నుండి అంతయును  తెలిసికోనువాడు,

అనీశః = తన కెవ్వాడును నియామకుడు లేనివాడు,

శాశ్వత స్థిరః = ఎల్లప్పుడు అవతరించు చుండియు ఎన్నాడును వికారము నొందని వాడు,

భూశయ= సముద్ర తీరమున భూమి పైన శయనిమ్చు వాడు,

భూషణ:= తన ఇష్టము వచ్చిన పెక్కుఅవతారములతో భూమిని అలంక రించు వాడు,

భూతి := సమస్త విభూతములకును కారణమై ఉండువాడు,

విశోకః = నిరతిశయమైన ఆనందమే ముఖ్య స్వరూపముగా  

గలిగియున్నందున దు:ఖమనునది ఎరుగనివాడు,

శోక నాశనః = స్మరణ మాత్రమున భక్తుల దు:ఖమును నశిమ్పచేయువాడు 


 శ్లో. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః !

అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మిత విక్రమః !! 68 !!


అర్చిష్మా= తన తెజస్సుచేతనే సూర్య చంద్రాదులు తేజో వంతులై ఉన్నారు గావున తానే ముఖ్యముగా తేజస్వరూపుడు,

అర్చితః =   సమస్త లోకముల చేతను పూజిమ్ప బడునట్టి బ్రహ్మాదు లచేత గూడ పూజిమ్ప బడునట్టివాడు,

కుంభ: = ఘటములో వలే తనయందే సమస్తము ఉండునట్టి వాడు,

విశుద్ధాత్మా= మూదు గుణములను దాటి పోయి ఉన్నందున పరిసుద్ద మైన ఆత్మా గలవాడు,

విశోధనః = ఈ స్మరించిన మాత్రముననే పాపములను నసింప చేయు వాడు,

అనిరుద్ధ := ప్యూహముల నాల్గింటిలో నాల్గవ ప్యూహముగా ఉన్నవాడు,

అ ప్రతిరథః = ప్రతి పక్షము లేనివాడు,

ప్రద్యుమ్నో:= మిక్కిలి గిప్పదియగు ధనము గలవాడు,

మిత విక్రమః = సాటిలేని పరాక్రమము గలవాడు,

  

శ్లో. కాలనేమినిహా వీరః శౌరిః శూర జనేశ్వరః !

త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః !! 69 !!


కాలనేమి నిహా := కాలనేమి యనెడి అసురుని వధించిన వాడు,

వీరః= శూరుడు,

శౌరిః =శూరుడను వాని వంశమున బుట్టినవాడు,

శూర జనేశ్వరః = శూరాత్వము యొక్క అధిక్యముచేత శూరులైనా ఇంద్రాదులను గూడ శాసించువాడు, 

త్రిలోకాత్మా=ముల్లోకములకు అంతర్యామి స్వరూపుపమున ఆత్మగా ఉన్నవాడు,

త్రిలోకేశ = ముల్లోకములునుతనచేత ఆజ్ఞాపించ బడియె తమ తమ కార్యముల యందు మేలగునట్లు చేయువాడు,

కేశవః =మధురలోను కశీలోను వేంచేసి ఉండు వాడు,

కేశిహా:= కేశి యనెడి రాక్షసుని వధించిన వాడు,

హరిః =సమూలముగ జనన మరరణ రూపమగు సంసారమును   హరించు వాడు,


శ్లో. కామ దేవః కామపాలః కామీ కాంత కృతాగమః !

అనిర్దేశ్యవపు ర్విష్ణుః ర్వీరోనంతో ధనంజయః !! 70 !!


కామ దేవః = ధర్మమూ మొదలైన పురుషార్ధములను నాల్గింటిని కోరునట్టి వారిచేత కోరబడెడి దేవుడు,

కామపాలః= కోరికలు గలవారి కోరికలను ఈ డేర్చువాడు,

 కామీ= అందరిచే కోరబడువాడు,

 కాంత=మిక్కిలి రమనీయమైన దేహమును ధరించినవాడు,

 కృతాగమః =మంరవిద్యలన్నింటిని రచించినవాడు,

అనిర్దేశ్యవపు= ఆయా యగాములకు తగిన శరీరములతో    నవారించుతచే ఇట్టిదనిచేప్పజాలని శరీరము కలవాడు,

విష్ణుః= తన సక్తిచే లోకమున వ్యాపించిన వాడు,

వీర :=  హింసిన్చువారిని నిరసించేవాడు,

అ నంత: = దేశ పరంగా కాని వస్తు పరంగా కాని అవధి లేనివాడు,

ధనంజయః = దిగ్విజయము చేసి నపుడు గొప్ప ధనమును జయించిన వాడు,



శ్లో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ వివర్ధనః !

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71 !!


 బ్రహ్మణ్య:=ప్రకృతికి, ఆత్మకు కుడా హితమైనవాడు,

బ్రహ్మకృత్ బ్రహ్మా= చతుర్ముఖ బ్రహ్మకున్ను నియామకుడు,

బ్రహ్మ వివర్ధనః =బ్రహ్మ అంటే  తపస్సు, దానిని వృద్ధి చేయువాడు,

బ్రహ్మవిత్  := బ్రహ్మ అంటే వేదము దానిని తెలిసిన వాడు,

బ్రాహ్మణ:= వేదమును పఠించిన వాడు,

బ్రహ్మీ :=సమస్త పదార్ధములు తనదిగా కలవాడు,

బ్రహ్మజ్ఞ:=వేదమును అర్ధ్యపర్యంతము తెలిసినవాడు,

బ్రాహ్మణప్రియః=వేదమును అధికరించిన వారి యందు ప్రీతి గలవాడు,



శ్లో. మహాక్రమో మహా కర్మా మహా తేజా మహోరగః !

మహా క్రతు ర్మహా యజ్వా మహా యజ్ఞో మహా హవిః !! 72 !!


మహాక్రమ:= మిక్కిలి గొప్పవైన అడుగులు కలవాడు,

మహా కర్మా:= ప్రాణులను కుడా ఉచ్చ స్థితికి తేగల గొప్ప పనులు గలవాడు,

మహా తేజా:=తమసులు అజ్ఞానమును కుడా తొలగించగల గొప్ప తేజస్సు గలవాడు,

మహోరగః=మహాసర్ప స్వరూపుడు,

మహా క్రతు:= మహా కృతు స్వరూపుడు, 

మహా యజ్వా:=లోక సంగ్రహము కొరకు యజ్ఞములు చేయునట్టి  మహనీయుడు.   

మహా యజ్ఞ:= మహా యజ్ఞ స్వరూపుడు, 

మహా హవిః = గొప్ప హవిస్సు గలవాడు,


శ్లో. స్తవ్య స్తవప్రియః స్తోత్రమ్ స్తుతిః స్తోతా రణప్రియః !

పూర్ణః పూరయితాః పుణ్యః పుణ్య కీర్తి రనామయః !! 73 !!


స్తవ్య:= అందరచేతను స్తుతింప బడువాడై ఎవనిని స్తుతింపని వాడు, 

స్తవప్రియః = ఇందువలననే స్తన ప్రియుడు,

స్తోత్రమ్:= తన స్తోత్రం తానే పూర్తికావించు కొనువాడు,

స్తుతిః= స్తోత్రము చేయుకు స్తుతి రూపుడు,

స్తోతా:= తానే స్తోత్రము చేయువాడు,

రణప్రియః = యుద్ధము ప్రీతి వాడు,

పూర్ణః = సమస్త అభీష్ఠములతోను సమస్త శక్తులతోను నిండుకొని యుండువాడు,

పూరయితాః= కేవలము తాను పూర్ణుడై ఉండుటయే కాక అందారను గూడ సంపదలతో నిండుకొని యుండు నట్లు చేయువాడు,

 పుణ్యః= స్మరించిన మాత్రమున పాపములను నసింప జేయువాడు,

పుణ్య కీర్తి= పరిశుద్ధమగు కీర్తి గలవాడు,

ఆనామయః =  వ్యాధిని తొలగించువాడు,


శ్లో.మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః !

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః !! 74 !!


మనోజవ:= సంసారమును వ్యాధిని తన భక్తులకు తొలగించుటలో మనసుకన్నా వేగము కలవాడు,

తీర్థకర:= పదునాల్గు విద్యలను, వేద విరుద్ధములైన విద్యలకు సంబందించిన సిద్ధాంతములను రచించిన వాడు,

వసురేతా:= తేజస్సు తన అవతారామునకు కారణముగా కలిగినవాడు, 

వసుప్రదః= ధనమును పుష్కలముగా ఇచ్చు నట్టివాఁడు,

వసుప్రద:= దేవకీ వసుదేవులకు తనకి తల్లిదండ్రులుగా నుండుటకు త గినంత తేజస్సును ఇచ్చినవాడు,

వాసుదేవ:= వాసుదేవుని కుమారుడు వాసుదేవుడు,

వసు:= నాయందు సకల భూతములను సమస్త  భూతముల యందు తానును నివ సించుటకు గలవాడు,

వసుమనా:= సమస్త విషయముల యందును సమానముగా ఉండునట్టి మనస్సు గలవాడు,

హవిః = బ్రహ్మమే హవిస్సు అనేది స్మృతి వాక్యమును ననుసరించిన వాడు,

 

శ్లో. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః !

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః !! 75 !!


సద్గతిః= వసుదేవాది సాధువులకు గతి అయినవాడు,

సత్ కృతిః = సత్కార్యములు కలవాడు,

సత్తా:= సత్తులకు తానే సత్తా అయినవాడు ,

సద్భూతిః= సాధకులకు పుత్ర, మిత్ర, బంధు, దూత, సారధి మెదలగు సమస్తము తానే అయి ఉండువాడు,

 సత్పరాయణః= సాధకులు తనకు పరమగతిగా తలచి ఉండువాడు,

శూరసేన:= యాదవులు పాండవులు సూరులు వంటి సేనలు గలవాడు,

యదుశ్రేష్ఠః= యాదవులలో ప్రధానుడై యున్నవాడు,

సన్నివాసః= సజ్జనులకు ఆశ్రయమై ఉన్నవాడు,

సుయామునః = తాను యమునా నదిలో కావించిన క్రీడలను పుణ్యము గా కలవాడు,


శ్లో. భూతా వాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః !

దర్పహా దర్పదా దృప్తో దుర్ధరో థాపరాజితః !! 76 !!


భూతావాస: = సమస్త భూతములకు వానస్థలమైనవాడు,

వాసుదేవః = వ్యూహవాసుదేవినిగా ప్రకాశించువాడు ,

సర్వాసు నిలయ:= అందరి ప్రాణములకు ఆధారముగా నుండువాడు ,

 అ నలః = భక్తుల కార్యములన్ని చేసినా రుపతి చెందనివాడు ,

దర్పహా:= ధర్మ విరుద్ధమైన మార్గమున నుండు వారి మద  మనుచు వాడు,

దర్పద:= ధర్మ మార్గమున ప్రవర్తించు వారికి గర్వము నిచ్చువాడు ,

దృప్త:= నిరంతరము స్వస్వరూపమునకు సంబందించిన అమృత్ రసమును ఆస్వాదించుట వలన మిక్కిలి సంతుష్టుడై ఉండు వాడు ,

దుర్ధర:= తన సంభంధం చేత యాదవులకు గర్వము కలిగించిన వాడు ,

అపరాజితః = లోపలి రాగాది శత్రువులచేతను వెలుపలి దానవాడి శత్రువులచేతను పరాజ్యము నొందనివాడు  ,


శ్లో. విశ్వ మూర్తి ర్మహా మూర్తి ర్దీప్త మూర్తి రమూర్తి మాన్ !

అనేక మూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః !! 77 !!


విశ్వమూర్తి:= సర్వమునకు ఆత్మగా ఉందువలన విశ్వమే ఆకారముగల వాడు,

మహా మూర్తి:= శేషశయ్యపై ఆపవళించునట్టి వీరిని యాకారము మిక్కిలి గొప్పది కావున మాహామూర్తి అనబడువాడు,

దీప్త మూర్తి:= జ్ఞాన స్వరూపమైన ఆకృతి గలవాడు,

రమూర్తి మాన్ := కర్మచేత ఏర్పడినట్టి దేహము లేనివాడు,

అనేక మూర్తి:= లోకోపకారము చేయునట్టి పెక్కు రూపములను అవతారముల యందు తన యిష్టానుసారముగా ధరించు వాడు,

అ వ్యక్తః=  తన మహిమ బయలు  పడకుండా దాచి ఉంచిన  వాడు,

శతమూర్తిః= జ్ఞాన స్వరూపుడగు విఇనికి కల్పితముగా ఏర్పడిన రూపములు అనేకములు గలవు, కావున శాతమూర్తి అనబడువాడు,

శతాననః != విస్వాది మూర్తులు గలవాడు,


శ్లో. ఏకో నైకః సవః కః కిమ్ యత్తత్పదమనుత్తమమ్ !

లోక బంధు ర్లోక నాథో మాధవో భక్త వత్సలః !! 78 !!


ఏక:= ఒక్కడు అద్వితీయుడు,

నైకః= తనకు విభూతి ఆయి తనచేత నియమింపబడేది, తనకన్నా విజాతీయ మైనది ఆయన అనేక పదార్ధములు గలవాడు ,

న:=  విషయము అందరిచేత నిశ్చయింప చేయువాడు,

వః = సమస్త భువములందును వసించువాడు,

కః = మాలిన పదార్థములందు వసించు చున్నాను ప్రకాశించువాడు,

కిమ్:= సమస్త పురుషార్థ స్వరూపమై ఉన్నందున బ్రహ్మమే విచారణ చేయదగి యున్నది గావున "కిమ్" అనబడు వాడు,

యత్:= భక్తులను రక్షించుటకై పయత్నించువాడు,

తత్  := భక్తులకు జ్ఞానము భక్తి అనువానిని కలిగించు వాడు,

పద మనుత్తమమ్ := ముముక్షవులైనవారిచేత పొందబడునది గాన పాద మనబడును, ఈ ఈబ్రహ్మమున కంటే ఉత్తమ్ మైనది ఏదియు   లేదు గావున ఇది అనుత్తము అనబడును, అందువలన పరమ ప్రాప్యమైన వాడు,

లోక బంధు := సమస్త లోకములు తన జనముగా కలవాడు,

లోక నాథ:= సమస్త లోకములకు నాధుడు,

మాధవ:= మధువని పేరుగల వంశమున పుట్టినవాడు,

భక్త వత్సలః = భక్తులయందు ప్రేమ గలవాడు,


శ్లో. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ !

వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః !! 79 !!


సువర్ణ వర్ణ:= బంగారము వంటి ప్రకాశించు వర్ణము గలవాడు,

హేమాంగ:= స్లాఘ్యమైన శరీరము గలవాడు

వరాంగ:= దివ్య మంగళ విగ్రము గలవాడు,

చందనాంగదీ:= ఆహ్లాదకరమైన చందనములతోను బాహుపురులతోను అలంకరింప బడినవాడు,

వీరహా:= ధర్మమును కాపాడుటకై వీరులైన అసుర ముఖ్యులను వధించిన వాడు,

విషమః= దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము చేయు చుండుటచే వైషమ్యము గలవాడు,

శూన్య:= ఎట్టి దోషము లేనివాడు,

ఘృతాశీ:= కోరికలు జారిపోయాయి నట్టి వాడు,

అచల:= స్వరూపము నుండి గాని, సామర్ధ్యమునుండి గాని, జ్ఞానాది గుణముల నుండి గాని చలనము నొందుట లేనివాడు,

చలః= రూపముతో కాలాడాలిక గలవాడు,


శ్లో. అమానీ మాన్యదో మన్యో లోకస్వామీ త్రిలోక ధృక్ !

సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరా ధరః !! 80 !!


అమానీ:= పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడగుటచేత అనాత్మ విషయముల యందు ఆత్మాబంహిమానము లేనివాడు,

మానద:= గౌరవము సంపాదించి ఇచ్చువాడు,

మాన్య:= గౌరవము తలంచు వాడు,

లోకస్వామీ:=సకల లోకాలకు నాయకుడైనవాడు,

త్రిలోక ధృత్ := ముల్లోకములను ధరించువాడు, 

సుమేధా:= మంచి తలంపు గలవాడు,

మేధజ:=యాగ ఫలముగా అవతరించిన వాడు,

ధన్య:=కృతార్థుడైన వాడు,

సత్యమేధా:= సత్యమైన మేధా శక్తిగలవాడు,

ధరా ధరః=! భూమి నాన్నను మోయు శక్తిగలవాడు,  


శ్లో. తేజో వృషో ద్యుతి ధరః సర్వ శస్త్ర భృతాం వరః !

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః !! 81 !! 


తేజో వృష:= సదాసూర్యుని రూపముతో నున్నవాడై ఉదకములను వర్షించువాడు,

ద్యుతి ధరః= సరికిరా కాంతిని ధరించి యుండువాడు,

సర్వ శస్త్ర భృతాం వరః = శ స్త్రములను ధరించిన అందరిలో శ్రేష్ఠుడు,

ప్రగ్రహ:= భక్తులకు తన వచనానుసారం స్వాధీనం గావించు కొనువాడు,

నిగ్రహ:= తన సారధ్య విశేషముచేతనే శ త్రువులను నిర సించువాడు,

వ్యగ్ర:= అంతము లేనివాడు,

నైక శృంగ:= అనేక విధములుగా శత్రువులను బాధించు సామర్ధ్యము కలవాడు,

గదాగ్రజః = మంత్రముద్వారా ఎదుట ఆవిర్భావం నొందువాడు,


శ్లో. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః !

చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్ !! 82 !!


చతుర్మూర్తి:= విరాట్, సూత్రాత్మ, అవ్యాకృత, తురీయాత్మకములైన నాలుగు రూపములు కలవాడు, అధవా తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వర్ణములైన నాలుగు ఆకారములు కలవాడు 

చతుర్బాహు:= నాలుగుబాహువులు కలవాడు 

చతుర్వ్యూహ:= శరీర రూపుడైనపురుషుడు, ఛందో రూపుడైన పురుషుడు, వేదరూపుడైన పురుషుడు, మహాదరూపుడైన పురుషుడు, అగు నలుగురు పురుషులు వ్యూహములుగా గలవాడు, 

 శ్చతుర్గతిః = ఇంద్రపదము, బ్రహ్మపదము, కైవళ్యము, మోక్షము అను  నాలుగు విధములగు గతులలు ఉపాసకులు తారతమ్యము నను సరించి ఇచ్చువాడు,

చతురాత్మా:= జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురికియావస్థ అని ఐనాలిగింటిలో నాలుగురూపములలో ప్రకాశించేవాడు,

చతుర్భావ:= ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనేది నాలుగు పురుషార్ధములు విని నుండే ఏర్పడుచున్నవి కావున చతుర్బావుడు,

శ్చతుర్వేద:= నాలు వేదముల అర్ధములు యదార్ధముగా ఎరిగినవాడు,

ఏకపాత్ := ఈ జగత్తునంతటిని నేను నాయొక్క ఒక్క అంశముచేతనే వ్యాపించి ఉన్న ఒక్క పాదముగాకలవాడు, 

  

శ్లో. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః !

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా....!! 83 !!


సమావర్త:= సంసార చక్రమును చక్కగా త్రిప్పునట్టివాఁడు,

అ నివృత్తాత్మా:= అంతటను ఉంది యున్నవాడు, తొలగిపోనట్టి  స్వరూపము గలవాడు,

దుర్జయ:= జాయింప శక్యముగాని వాడు,

దురతిక్రమః = ఏటివారి చేతనైన అతిక్రమింప శక్యము కానివాడు,

దుర్లభ:= దుర్లభమైన భక్తిచేత మాత్రమే లభించు వాడు,

దుర్గమ:= అతి కష్టముగా లభించు నట్టివాఁడు,

దుర్గ:= అనేక విఘ్నములచేత కొట్టబడిన వారికి మాత్రమే కష్టముగా లభించు నట్టివాఁడు,

దురావాస:= సమాధియందు యోగులచేత అతి కష్టముగా విత్తమున నిలుపు కొన బడునట్టివాఁడు,

దురారిహా:= దానవులు మొదలైన దుర్మార్గులను వదించువాడు,


శ్లో. శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతు వర్ధనః !

ఇంద్ర కర్మా మహా కర్మా కృత కర్మా కృతాగమః !! 84 !!


శుభాంగ:= దివ్యములైన అవయవములలో ధ్యానింప దగినవాడు,

లోకసారంగః= లోక సారములను భోగ,మోక్ష మృగముల నుపదేశించి మోహింపచేయువాడు,

సుతంతు= విస్తారమునొందిన ప్రపంచ మనెడి సుందరమైన తంతువు గలవాడు,

తంతువర్ధనః= అసురులకు పాపము మీద రుచి కలిగించి, దానిచే సంసారమనుఅంటువును వృద్దిచేసినవాడు,

ఇంద్ర కర్మా:= ఇంద్రుని కర్మ వంటి కర్మ కలవాడు, ఈశ్వరత్వము కలవాడు, 

మహా కర్మా:= ఆకాశము మొదలైన మహాభూతములు అనకార్యములుగా ఉన్నట్టివాడు, దుష్టశిక్షణార్థము, శిష్ట రక్షణార్ధము మహా న్యాయ కార్మ కలవాడు,

కృత కర్మా:= కృతార్థుడై యున్నందున చేయవలసిన దాని నంతయును చేస్తూ, ధర్మ రూపమైన కర్మను చేయువాడు,

కృతాగమః = వేదరూపమైన శాస్త్రములను రచించినవాడు,


శ్లో. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః !

ఆర్కో వాజనసః శృంగీ జయంతః సర్వ విజ్జయీ !! 85 !!


ఉద్భవః = తన  ఇష్టానుసారము ఉత్తమమైన జన్మను పొందు వాడు,

సుందరః = సమస్తమును మించిన సౌభాగ్యము కలవాడు,

సుంద:= బాగుగా చల్ల బడునట్లు చేయువాడు,

రత్ననాభః= రత్నము వలె సుందరమైన నాభి కలవాడు,

సులోచనః= చక్కని నేత్రములు కలవాడు,

ఆర్క:= మిక్కిలి పూజ్యులైన బ్రహ్మాదులచేత గుడా పూజింప దాగి యున్న వాడు,

వాజనసః = యాచకులకు అన్న దానము చేయువాడు,

శృంగీ:= ప్రళయ జలమున శృంగములు గల ఒకానొక రూపము గలవాడు,

జయంతః= శత్రువులను లెస్సగా జయించువాఁడు

సర్వ విజ్జయీ:= సమస్తము గోచరింప జేసికొని నట్టి జ్ఞానము గలవాడు,


శ్లో . సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:

మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!!


సువర్ణ బిందు:= సువర్ణము బోలిన అవయవములు గలవాడు,

అక్షోభ్య:= రాగద్వేషాదులచేతను, శబ్దాది విషయముల చేతను, దేవ విరోధుల చేతను క్షోభ పెట్టబడని వాడు,

సర్వ నాగీశ్వరేశ్వర:= వాక్కునకు అధిపతి అయిన బ్రహ్మాదుల కందఱకును ప్రభువుగా ఉన్నవాడు,

మహాహ్రాద:= మడుగు వలె ఉండువాడు,

మహాగర్త:= పెద్దగోతిలో పడవేయువాడు,

మహాభూత:= మూడు కాలములచేతను పరిచ్చేదనము పొందని వాడు,

మహానిధి:= సమస్త భూతములు, మహనీయులు తనసోత్తుగా గల వాడు  


శ్లో. కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోనిలః !

అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః!! 87!!


కుముదః= భారమును దించుచు భూదేవిని సంతోష పెట్టువాడు,

కుందరః= సుద్దములైన ఫలములను ఇచ్చువాడు,

కుంద: = శుద్ధమైన స్ఫటికము వలె స్వఛ్ఛమై ఉండువాడు,

పర్జన్యః= జ్ఞానుల తాపత్రయమును హరించువాడు,

పావన:= స్మరణ మాత్రమున పవిత్రము చేయువాడు,

అ నిలః = భక్తుల ననుగ్రహించు విషయమున ప్రేరకులులేనివాడు,

అమృతాశ:= స్వస్వరూపముతో అమృతమును  అవించు వాడు,

మృతవపుః= అమృతము వలె కోరదగిన దేహముకలవాడు,

 సర్వజ్ఞః= సమస్తము తెలిసికొనువాడు,

సర్వతో ముఖః= అన్నీ వైపుల నేత్రములు శిరస్సులు,ముఖములు గలవాడు,


శ్లో. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !

న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !!


సులభః= సుఖముగా వెల లేకయే పొంద దగినవాడు,

సువ్రతః = సుందరమైన వ్రతమును చేయువాడు,

సిద్ధః = ఇతరముపై ఆధారపడని సిద్ధిగలవాడు,

శత్రు జిత్ := దేవతల శత్రువులే తన శత్రువులు, అట్టి వారిని జయించిన వాడు,

శత్రు తాపనః = దేవతులకు విరోధులైన వారిని తపింప చేయువాడు,

న్యగ్రోధ:= చేతులెత్తి నమస్కరించిన వారిచేత అడ్డగింప గలవాడు,

దుంబర:= వారికి ఇవ్వడానికి తగిన పరమ పాదముకలవాడు,

అ శ్వత్థ:= ఇవాలన్నది రేపు ఉండక పోవచ్చు, అంతర్యామిగా నుండి ప్రవర్తింప చేయువాడు,

శ్చాణూరాంధ్ర నిషూదనః= చానూరుడనే ప్రేగుల ఆంధ్రుని సంహరించిన వాడు,


శ్లో. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !

అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !!


సహస్రార్చిః=  సూర్యునకు సహస్ర కిరణములు ఇచ్చినవాడు

సప్త జిహ్వః = ఏడు జ్వాలలలోతో నుండు అగ్ని యందు అణు ప్రవేశించిన వాడు,

సప్తైధాః = ఏడు దీప్తులు గలవాడు, 

సప్త వాహనః = ఏడు గుఱ్ఱములు వాహనములుండగా కలవాడు,

అమూర్తి:= ప్రాకృతిమైన మూర్తి కాక అప్రాకృత దివ్య మంగళ విగ్రహము కల వాడు,

అనఘ:= ఒక్క దోషము కూడా లేని వాడు,

అ చింత్య:= ముక్త పురుషులకు సముడుగా కూడా చింతింపజాలని వాడు,

భయకృత్ := భయమును కలిగించు వాడు,

భయనాశనః= భయమును తొలగించు వాడు,


శ్లో. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !!


అణు:= మిమిక్కిలి సూక్ష్మ స్వరూపుడు,

బృహత్ := అతి విస్తారమైన పరమాకాశమును కూడా తనయందుంచు కొనువాడు,

కృశః= దూది వాయువుల కన్నా తేలిక లైనవాడు కనుక అంతట  ఆంటంకం లేనట్లు చరించ తగినట్లు సన్నబడి యుండు వాడు,

స్థూల:= ఒక చోటనే ఉండి సమస్తమును స్పృసించగలవాడు,

గుణ భృత్ := సంకల్ప మాత్రముచే సమస్తమును ధరించగల ఈ సత్వము గలవాడు,

నిర్గుణ:= గుణములు లేనివాడు,

మహాన్:= ఉత్కృష్టుడు కనుక అవాప్త సమస్త కాముడు కనుక ప్రాకామ్యము అనుసిద్ధి కలవాడు,

అధృతః= ఎవరి చేయను కట్టబడకఉండువాడు,

స్వధృతః = ఒక సాధన వాలన లభించినవి కాక స్వాభావికంగా నున్న

ఐశ్వర్యములు కలవాడు,

స్వాస్యః= ఎల్లప్పుడూ ఆవిర్భవించి యుండు ఐశ్వర్యము కలవాడు,

ప్రాగ్వంశ:= అనాది అయిన నిత్య సూరులకు కూడా ఉత్పత్తి స్థానమైన వాడు,

వంశ వర్ధనః = నిత్యా సూరుల వంశమునువృద్ధి చేయువాడు,


శ్లో. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః !

ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణః వాయువాహనః !! 91 !!


భారభృత్ :=   ముక్తుల భారమును వహించువాడు,

కథిత:= పసిద్ధి నొందింప బడిన వాడు,

 యోగీ:= అఘటిత  కలవాడు ,

యోగీశః= యోగులని పరసిద్ధి నొందిన వారందరికీ యోగమును కలుగ చేయువాడు,

సర్వకామదః = యోగా బ్రష్టులైన వారికి కూడా వారు కోరిన సమస్త లోక  ఇచ్చు వాడు,

ఆశ్రమః= సంసార మనేది అరణ్యమున తిరుగులాడేడి వారి కందఱకును ఆశ్రయము వలననే విశ్రమ స్థానముగా ఉన్నవాడు,

శ్రమణః= వివేకా రహితులెల్లరను శ్రమ పెట్టువాడు,

క్షామః = సమస్త దుష్ట ప్రజలను క్షి నింప చేయువాడు,

సుపర్ణః= యోగమంలోకి సమాధి వరకు చేరినవారు ఈ తమస్సు అవతలి హద్దును చేరునట్లు చేయువాడు,

వాయువాహనః= ఏదైనా కారణము చేత పతితులైనచో గరుత్మంతుని ద్వారా తిరిగి సద్గతి నొంద జేయువాడు,


శ్లో. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !

అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః !! 92 !!


 ధనుర్ధర:= ఉపాసనా విరోధులను నిరసించుటకై ధనస్సును ధరించి ఉండువాడు,

 ధనుర్వేద:= ధనుర్వేదము తెలిసినవాడు,

 దండ:= దండ నీతిచే రాజుల ద్వారా దుష్టులను దండించువాడు,

 దమయితా:= తాను సాక్షాత్తుగా దండించినవాడు,

అదమః= తనను దండించువాడు లేకుండుటచే నిరంకుశుడుగా ఉండువాడు,

అపరాజితః = ఏ ప్రదేశమునందును ఎవరి చేతను అడ్డగింప బడనివాడు,

సర్వసహ:= సర్వ కార్యములలోను సమర్దుడు,

నియంతా:= ఇళ్ల్లరును తమ తమ కార్యములందు నియోగించువాడు,

నియమ:= సమస్తము నియమించువాడు,

 యమః= యమాదులనుకూడా స్వామిగా రక్షించువాడు,

 

శ్లో. సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః

అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతి వర్ధనః !! 93 !!


సత్త్వవాన్:= సుద్ద సత్య గుణము కలవాడు,

సాత్వికః = సత్వ గుణ ఫలమును ఇచ్చువాడు,

సత్యః= సజ్జనుల విషయమున సాదువుగా ఉండువాడు,

 సత్య ధర్మపరాయణః= సత్యము నందును విధిరూపమైన ధర్మము నందును నియమము గలవాడు,

అభిప్రాయః= సత్య ధర్మమున నిష్ఠగల మహానియులచే పరమ  ప్రయోజనము గా కోరబడువాడు,

ప్రియార్హ:= జ్ఞానులను అనుగ్రహిచువాడు,

అర్హ: = జ్ఞానులకు తగినవాడు,

ప్రియకృత్:= పయోజనాంతర పరులనుకూడా తనకు ప్రియులుగా చేసికొనువాడు,

ప్రీతి వర్ధనః= తన గుణముల యందు వాద్రికి ప్రీతి వర్ధిల్లు నాట్లు చేయువాడు,


 శ్లో. విహాయ సగతి ర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః !

రవి విరోచః సూర్యః సవితా రవిలోచనః !! 94 !!


 విహాయ సగతి:= భక్తి పరమావధి నొందిన మహానియులకు పరమ పదము నిచ్చువాడు,

జ్యోతిః= తనంతట ప్రకాశించు నట్టి వాడు,

సురుచి:= సుందరమైన ప్రకాశమును ఇచ్చువాడు,

హుతభుక్ := సమస్త హోమ ద్రవ్యములను భుజించువాడు

 విభుః = అనతనువుండు నట్టి వాడు,

రవి:= రవి అనగా ఉత్తరాయణము దానికి అభిమానిగా ఉండు వాడు,

విరోచన =అనేక విధములుగా ప్రకాశించువాడు,

 సూర్యః=శోభను కలిగించునట్టి సూర్యుడు,

 సవితా:=సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు,

 రవిలోచనః =సూర్యుడునేరముగా కలవాడు,


 . అనంతో హుతభుక్భోక్తా సుఖదో నైకజోగ్రజః !

అనిర్వణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః !! 95 !!


అనంత:= నిత్యుడును సర్వ వ్యాపియు నైనవాడు,

హుతభుక్ := హవిస్సును భుజించువాడు,

భోక్తా:= భోగ్యము, జడము నైనా ప్రకృతిని అనుభవించువాడు,

సుఖద:=భక్తులైన వారికి మోక్షము మనేది సుఖమును ఇచ్చువాడు,

నైకజ:= ధర్మమును కాపాడులకై పలుసార్లు అవతారము దాల్చు చుండువాడు,

అ గ్రజః= అందరి కంటే ముందుగా జన్మించినవాడు,

అనిర్వణ్ణః = లభింపకుండుటకు హేతువు లేనందున సమస్త  కామములు సిద్దించిన వాడగుట చేత ఖేదము లేనివాడు,

సదామర్షీ:= సజ్జనులను అనుకూల భావముతో క్షమించువాడు,

లోకాధిష్ఠానమ్ := ఉత్తమ లోకము లొసంగుటకు అధారభూతుడు

అద్భుతః= అప్పటిఒకప్పుడు నూతనముగా ఉందులచే ఆశ్చర్య భూతుడు,


శ్లో. సనాత్సనాతనతమః కపిలః కపి రవ్యయః

స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తిః స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః !! 96 !!


సనాత్ := ముక్తులందరూ పంచుకొనిమరియు అనుభవింప తగిన వాడు,

సనాతనతమః= ప్రాచీనుడైనఆప్పుడే జనించు నాట్లు భోగ్యముగా నుండువాడు,

 కపిలః= కల మేఘము వంటి వర్ణము కలవాడు,

 కపి రవ్యయః= అక్షయమగు ఆనందమును అనుభవించు చు సుఖముండు  వాడు

స్వస్తిదః = మహా మంగళమునిచ్చు వాడు,

స్వస్తి  కృత్:= కళ్యాణ గుణములచే తన భోగమునకు క్షేమమమును గావించు కొనువాడు,

 స్వస్తిః= అనే మహా మంగళ మూర్తిగా నుండు వాడు,

 స్వస్తి భుక్= మంగళాదులన్నింటిని పాలించు వాడు 

 స్వస్తి దక్షిణః= తన దివ్య సరికిరాదుల కైంకర్యమును భక్తుల కిచ్చువాడు,


శ్లో. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః !

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః !! 97 !!


అరౌద్రః= గొప్ప ఐశ్వర్యమున్న కళ్యాణగుణములచేత మిక్కిలి సౌమ్యుడు,  

కుండలీ= కుండలములను మరియు దివ్యాభరణములను ధరించిన వాడు,

 చక్రీ:= సమస్త లోక రక్షణకై సుదర్శనమనే చక్రమును ధరించిన వాడు,

విక్రమీ := గాంభీర్యమునకు తగిన మిక్కిలి చేష్టితములు గలవాడు 

యూర్జిత శాసనః= బ్రహ్మేంద్రాదులచే మీరజాలని దివ్యాజ్ఞలను జారీచేయువాడు,

శబ్దాతిగః = శబ్దము ప్రవర్తించుటకు హేతువులైన జాతి లేనివాడు,

శబ్దసహః = శబ్దమును మహాభారముతో మోయువాడు,

శిశిరః= అతి వేగముగా వచ్చిన వాడు,

శర్వరీ కరః= భక్తులను శత్రువుల నుండి రక్షించుటకు ఆయుధములను పట్టియుండు వాడు,


శ్లో. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః !

విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః !! 98 !!


అక్రూరః = ఆగ్రహము లేక అభిలాషతోకూడినవాడు, కామమూలేనందున క్రోధములేనివాడు, క్రోధము లేనందున క్రౌర్యము లేనివాడు,

పేశల:= కర్మ చేత మనస్సు చేత  వాక్కు చేత  శరీరముచేతను రమణీయముగా నుండు వాడు,

దక్ష:= అతి శీఘ్రముగా వచ్చిఆదుకొనువాడు

దక్షిణః = ప్రీతిని చూపిన వాడు,

క్షమిణాం వరః= ఓరిమి వహించిన వారిలోశ్రేష్ఠుడు,

విద్వత్తమ:= ఏ గాయమునకు ఏ మందు వేయాలో చక్కగా తెలిసినవాడు,

వీతభయః= సంసార లక్షణమైన భయములేనివాడు, 

 పుణ్య శ్రవణ  కీర్తనః= భక్తి భావముతో పుణ్యముచేసినను ,కీర్తణలను వినినను, తొలగించువాడు,


శ్లో. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుః స్వప్న నాశనః !

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః !! 99 !!


ఉత్తారణ:= సంసార సముద్రమునుండి దాటించు వాడు,

 దుష్కృతిహా:= పాపము లనబడు దుష్కర్మలను నశింప జేయువాడు, అథవా పాపకార్యముల నాచరించు వారిని వధించువాడు,

 పుణ్య:= కీర్తిచే అస్మదాదులను కూడా పాపములనుండి తొలగించు సుద్దులుగా చేయువాడు,

దుః స్వప్న నాశనః= చెడు స్వప్నములను తొలగించు వాడు,

వీరహా:= ముక్తినిచ్చుఅద్వారా సంసారుల యొక్క అనేక విధములైన దుర్గతులను తొలగించువాడు,

 రక్షణః= సత్వగుణమును ఆశ్రయించి ముల్లోకములను రక్షించు చుండు వాడు,

సంత:= ఆశ్రీతులను వృద్ధి చేయించువాడు,

జీవనః= సమస్త ప్రజలను ప్రాణము రూపముతో జీవింప చేయువాడు,

పర్యవస్థితః= ప్రపంచమున అన్ని వైపులా వ్యాపించి ఉన్నవాడు,


శ్లో. అనంత రూపోనంత శ్రీర్జితమన్యు ర్భయాపహః !

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100 !!


 అనంత రూపోనంత:= సమస్త ప్రపంచ రూపముతో ఉన్న విని రూపములు అనంతములు కావున అనంత రూపముగలవాడు, 

 అనంత శ్రీ:= ఆశ్రీతులకు ఇవ్వదగిన అనంతైశ్వర్యములు కలవాడు,

జితమన్యు:= క్రోధమును జయించిన వాడు,

 భయాపహః = జీవుల సంసార భయమును పోగొట్టువాడు,

చతురశ్ర:= జీవుల కర్మలకు తగిన ఫలమును న్యాయముగా ఇచ్చువాడు,

గభీరాత్మా:= పరిమాణమును నిర్ణయించుటకు అలవిగాక గంబీరమై యున్న స్వరూపము గలవాడు,

 విదిశ:= అధికారు లైనవారికి అనేక విధములగు ఫలములను విశేషముగా ఇచ్చువాడు,

వ్యాదిశ:= ఇంద్రుడు మొదలైనవాటిని అనేక విధముల ఆజ్ఞాపించువాడు,

 దిశః = సమస్త కర్మలకు గల ఫలములను వేదముద్వారా తెలియ జేయువాడు,


  శ్లో. అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః !

జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః !! 101 !!


  అనాది:= సమస్తమునకు కారణమై యున్నవాడు గావున తనకు పైన కారణము లేనివాడు,

భూర్భువ:= సమస్త భూతములకు ఆధారమైన భూమికి ఆధారమైన వాడు,

లక్ష్మీః= ఆత్మలాభము కోరిన భక్తులకు తనే సమస్త సంపదలుగా నుండువాడు,

 సువీర:= భక్తుల ఆపదలను పరిహరించుటకు తగిన గొప్ప శక్తి గలవాడు,

 రుచిరాంగదః= మంగళ కరములైన బాహు పురులు కలవాడు,

జనన:= ప్రాణులను ఉత్పత్తి చేయు వాడు,

జనజన్మాది:= జన్మించు స్వభావము గలవాని జన్మకు మూల కారణమై ఉన్నవాడు,

భీమ:= భయకారణమై ఉన్నవాడు,

భీమపరాక్రమః = లోకములను హింసించు హిరణ్య కశిపుడు మెదలగువారి విషయమున భయంకరమైన పరాక్రమము కలవాడు,


శ్లో. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః !

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102 !!


ఆధార నిలయ:= ఆధారముజేలైన భూమి మొదలగు పంచ  భూత ములకు ఆధారమై ఉన్నవాడు,

ధాత:= ధర్మానుష్టాణమునకై ఆచార్య పదమును తాను కూడ   నిర్వహించు వాడు,

పుష్పహాసః= మొగ్గలాగా ఉన్న పూలకు విచ్చుకొనే లక్షణమును కల్పించి పుష్పహాస: అనబడువాడు,

ప్రజాగరః= నిత్యజ్ఞాన స్వరూపముడై చక్కగా మేల్కొని యుండు వాడు,

ఊర్ధ్వగః= అందరకు, అన్నింటికి పైన ఉండు వాడు,

సత్పథాచారః= సజ్జనులు ఆచరించు నట్టి కర్మలను ఆచరించువాడు,

ప్రాణదః= మృతములైన పరీక్షితులు మున్నగు వారిని బ్రతికించిన వాడు,

ప్రణవః = ప్రణవ మనగా పరమాత్ముయొక్క నామమగు ఓంకారము, అట్టి  ప్రణవమునకు,వీనికిని ఔపచారికముగా అభేదముగలదు గావున ప్రణవ:అనబడువాడు,

పణః = వ్యవహారము సలుపు వాడు,


శ్లో . ప్రమాణం ప్రాణవిలయ: ప్రాణబృత్ప్రాణజీవన:

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగ:!!103!!



ప్రమాణమ్  := రహస్యమైన పరమార్ధమున విశ్వాసము కలిగించు వాడు,

ప్రాణవిలయ:= ప్రాణుల ఆత్మలు తనయందే ఉంచుకొని ప్రాణ నిలయు డైనాడు 

ప్రాణబృత్ := ప్రాణములను అన్నము రూపంతో పోషించువాడు,

ప్రాణజీవన:= అన్న పానాదుల వలె ఆ జీవులను జీవన హేతువుగా నుండి జీవింప చేయువాడు,

తత్త్వం;= పారమార్ధిక సత్యమైన బ్రహ్మముయొక్క వాచకములను నియమించు వాడు

తత్త్వవిత్ := తన తత్వమును తానే ఎరింగిన వాడు,

ఏ కాత్మా= చేతనా చేతనములన్నింటికీ తానొక్కడే శేషిగా నుండు వాడు,

జన్మమృత్యుజరాతిగ:= పుట్టుట, ఉండుట,,పెరుగుట,మార్పునొందుట,  కృశించుట, నశించుట,  షడ్వికారములకు అతీతమైనవాడు


శ్లో . భూర్భువస్సుస్తరుస్తార: సవితా ప్రపితా మహా:

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాజ్ఞాంగో యజ్నవాహన:!!104!!


భూర్భువస్సుస్తరు:=సువర్లోకములందు వసించు ప్రాణికోటులకు పారిజాత వృక్షమువలె ఆశ్రయముగా నుండువాడు,

తార:= వారాలను సంసారమును సముద్రము నుండి ఉత్తరింప చేయు వాడు,

 సవితా= సమస్తమును తానే ససృజించువాడు,

 ప్రపితా మహా:= పితామహుడని ప్రసిద్ధిపొందిన బ్రహ్మదేవునికి కూడా తండ్రి అయినవాడు,

యజ్ఞ:= తానే యఙ్ఞమై ఉండెడివాడు,

యజ్ఞపతి= యజ్ఞమునకు ఫలమునిచ్చువాడు,

యజ్వా:= యజ్ఞమును అనుసహింప శక్తి లేని వారలాకుతనే యాగముచేయు వాడు,

 యజ్ఞాoగా =యజ్ఞములే  అవయములుగా కలవాడు,

 యజ్నవాహన:=ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా గలవాడు,


శ్లో . యజ్ఞబృద్యజ్ఞ కృద్యజ్ఞీ యజ్ఞ భుగ్యజ్ఞసాధన:

యజ్ఞాంత కృద్యజ్న గుహ్యమన్నమన్నాద ఏవచ. !!105!!


యజ్ఞబృత్ = యజ్ఞమును భరించువాడు,

ద్యజ్ఞకృత్ = సృష్టి ఆరంభముననుచివరనుయజ్ఞము చేయువాడు,

యజ్ఞీ:= తన ఆరాధనారూపములైన యజ్ఞములకు శేషియైనవాడు,

యజ్ఞభుక్  = యజ్ఞమును రక్షించువాడు,

యజ్ఞ సాధన:= యజ్ఞమును సంప్రాప్తి సాధనముగ కలవాడు, 

యజ్ఞాంతకృత్=  యజ్ఞము నొనర్చుట తన తత్వమును తెలుపుటకు అణు సిద్ధాంతముచేసినవాడు ,

యఙ్ఞగుహ్యం: = యజ్ఞ విద్య నెరిగినవారికి తప్ప ఇతరులకు తానే యజ్ఞ రహస్యమును విషయమునునెఱిఁగింపఁ చేయనివాడు .

 అన్నం :=అన్నమువలె  అనుభవింప బడువాడు,

అ న్నాద:=తనను అనుభవించువారిని అనుభోగ్యముగా అనుభవించువాడు,

 ఏవచ.:=ఐగుణములన్ని పరమాత్మునకు ఉన్నాయి , మరి ఎవ్వరికి లేవు అని భీష్మపితామహుడు తె లియపరిచాడు , అటువంటి పరమాత్మునకు ప్రణామములు . 


శ్లో . ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయన: 

దేవకీ నందన స్ప్రష్టా క్షితీశ: పాపనాశన: !!106!!


ఆత్మయోని:= పాలతో చెక్కెరను చేర్చినట్లు తన్ననుభవించు వారలను తనతో చేర్చుకొనువాడు,

స్వ యంజాత:= తన సంకల్పము చేతనే అవతరించువాడు,

వైఖాన= భక్తుల యొక్క సంసార డు:ఖమును చీల్చి తొలగించువాడు,

సామగాయన:= భగవంతుడను మధువును ఆస్వాదించి హావు, హావు హావు అని  సామగానము చేయు ముక్తులు కలవాడు,

దేవకీ నందన:= మహా వైభవము కలవాడు,

స్ప్రష్టా =సమస్త లోకములను సృజించు వాడు,

క్షితీశ:=భూమికి ప్రభువైనవాడు గావున దశరథపుత్రుడైన శ్రీ రాముడు 'క్షితీశ:' అన బడినాడు 

 పాపనాశన:=తన దివ్య చేష్టితముల ననుభవించువారి పాపమును నాశనము చేయువాడు,


శ్లో. శంఖబృనందకీ చక్రీ సారంగాధన్వా గదాధర:

రదాంగ పాణి రక్షోభ్య: సర్వ ప్రహరణాయుధ: !!107!!


శంఖబృత్ :=  పంచ భూతములకు కాది ఆయన అహంకారాత్మకమగు 'పాంచజన్య ' మనెడి శంఖమును ధరించినవాడు    

నందకీ:= విద్యా స్వరూపమైన నందక మను పేరుగల ఖడ్గము గలవాడు,

 చక్రీ:= మనస్తత్వాత్మకమైన సుదర్శన మనేడి చక్రము గలవాడు, అథవా సంసారచక్రమును తన ఆజ్ఞ చేత తిరుగునట్లు చేయువాడు,

 సారంగాధన్వా:= శార్ఙ్గమను ధనస్సును సదా ధరించువాడు,

 గదాధర:= కౌమోదకి అను గదను ధరించి ఉండువాడు,

రదాంగ పాణి:= స్వ స్వామి భావ సంబంధము వలన సుదర్శన చక్రము ఎల్లప్పుడూ అన శ్రీ హస్త మందు కలవాడు,

 అ క్షోభ్య:= జాయింప శక్యము కానివాడు,

 సర్వ  ప్రహరణాయుధ: తనని రక్షకమని ఆశ్రయించినవారి ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి తగిన విధముగా సకల ఆయుధములను ధరించి ఉండెడివాడు,


శ్లో . శ్రీ సర్వప్రహనాయుధ ఒన్నమైతి!!

వనమాలీగదీ శార్గీ శమ్ఖీ చక్రీ చ నందకీ,

శ్రీ మన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు !!108!!

"శ్రీ వాసుదేవోభిరక్షత్వొంనమ ఇతి ""

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి