నేటి ఛందస్సు పాఠము.. 101
*
మనస్సే నీకై - మథించెంగాదా,
మనమ్మున్ పొందే - మనోనేత్రమ్మున్
దినమ్మందుంటిన్ - దివాంధమ్మై నేన్,
ప్రణామ్మందుంటిన్ - ప్రభావమ్మైనేన్
జనించెన్ నాలో - స్వనమ్ముల్ శుక్కై,
ధ్వనించెన్ నాలో - ధనమ్ముల్ శుక్కల్
కనంగా లేవే - కరమ్ముల్ కాంతుల్,
ఫణంగా పెట్టా -క్షణమ్ముల్ దేవీ
*
ఇదేనా నీయా - కృపాలోకమ్ముల్,
విధానమ్మేనా - వినోదమ్ముల్
ముదమ్మే లేదే - భువిం జూడంగా,
కదం తొక్కేలే - కణం జూడంగన్
సదా శోకమ్మే - సదా భీతమ్మే,
సమావైనమ్మే - సఖీ లక్ష్యమ్మున్
చిదానందమ్మా - శివుండే లేఁడే, ప్ర
ధానమ్మెలే - బావుండున్ దేవీ
*
ఇలా నీవేనా - యిలా నేనేనా
కళా నీదేనా - కథా నాదేనా
కులాసాలేనా - గుమాయింపేనా,
జాలాశాలేనా - జమాయింపేనా
విలాసాలేనా - విహారాలేనా,
వినోదాలేనా - వివాదాలేనా
చలాకీలేనా - జమాఖర్చేనా,
ప్రమోదాలేనా - ప్రియమ్మున్ దేవీ
*
గుమాయింపు - య/త/మ/గ
విధేయుడు -మల్లాప్రగడ రామకృష్ణ
నేటి చందస్సు పాఠము.. 102..ఇష్టపది. మందారం
ఎంతప్రేమ నీదంటే.. చెప్పలేదు మనసు గోల
చెప్పలేదు ఏ గగనం.. ఎందుకో తెలవగ నేను
ఎంతకరుణ నీదంటే.. చెప్పలేని వయసు గోల
కురియలేదు ఏ మేఘం.. ఎందుకోనె తెలపలేను
అందమెలా ఉంటుందో.. అక్షరాల తెలియదేల
ఏ మాటల కందేనట.. ఏమాయలు చేయలేను
వర్ణించే పెదవులేవొ..వరుస జేయ వలపులేల
చూడలేదు ఏ నయనం.. చూపే కధలు గయ్యేను
ఓడిపోవు భాషలతో..ఓర్పులేని మలుపు లేల
భావుకతకు అభిషేకం.. భాగ్యమ్ముగాయేమౌను
ఆశ్చర్యం ఏమంటే..ఆధరనే సుఖము లేల
చేయలేదు ఏ కవనం.. చెప్పలేనిదియీమేను
మనసుతోటి పోరాటం..మనుగడ ఆరాట మేల
అజ్ఞానం వల్లేలే..ఆలస్యమ్ము చూపౌను
జన్మకర్మ చక్రమేదొ..జాతరయే జేయు టేల
ఆపలేదు ఏ కాలం.. ఏ నిముషమ్ మైనాను
శ్వాసలేక జ్ఞానమిడే..శాంతి లేని సౌఖ్య మేల
గురువెవ్వరు దొరకరులే.. గుర్తులేని జీవముగను
నీ రాతను నీవుగాక..నీ మాయలు నాకుయేల
మార్చలేదు ఏ కావ్యం.. మేసజేరా యీమేను
తిరిగేపని వెతికేపని.. తప్పలేని విధిగ యేల
మానుతీరు తెలియాలోయ్.. మహిమేదీ మాయగాను
రూపానికి పరిమితమై.. ఋణముగాను రొక్ఖంమెల
జీవముగను ఉండలేదు ఏ దైవం.. యెమ్ చలేను
ప్రాంజలి ప్రభ..
విధేయుడు.. మల్లప్రగడ రామకృష్ణ