23, నవంబర్ 2022, బుధవారం

 0001 న్యస్తాక్షరి.......... వై కుం ఠ ము పద్య పాదాది న రావాలి........

వైన తీయభవిత ఇదీ వైర మవని
కుంపటి సెగలు తప్పవు కూటి కళ ప
ఠము ఇదియగుట సహజము ఠంక శబ్ద
ము కదిలేనులే కలలకు ముఖ్య మౌను

0002 న్యస్తాక్షరి....... సు స్వా గ తం పద్య పాడాది న రావాలి...
సుమధుర పలుకులు పికము సుధలు చెల్లు
స్వాగతము పలికి వలపు సాధు వీచు
గతము వర్ధమాన జగము గారవిల్లు
తంత్ర మంత్రమగుట ఏను తల్లడిల్లు.
సుమతి మాట వినకశోభ సుఖము వదలి
స్వార్ధ పైత్యమే మనిషిగా సాగనీక
గతము తవ్వేగుణము మతి గమ్య మౌను
తంత్ర మంత్ర మనుచు బొంకు తరుణ మందు
* సు * రుచిరతనూవిలాస్యవిశోభితమ్ము
* స్వా * మిబాలకృష్ణునితాండవమ్ముఁగనఁగ
* గ * రుడవాహన శ్రీపతి గతియె మనకు
* తండ్రి * యు తల్లియు నాతఁడె త్రాతయుగద !!! "

0003 దత్తపది........ జొన్నలు కందులు పెసలు రాగులు
జొన్నలుడికించు అన్నము చొప్ప కాదు
కందులుడికించు పప్పుయు కధలు కాదు
పెసలు పిండిగా దోశలు పేద కాదు
రాగులు పిండిగా జావయు రక్ష కాదు
జొన్నరొట్టెలు బహురుచి జొల్లుకురియు
కందులపొడి గంధగుమలు కండ పెంచు
పెసలు పునుకులు నోటికి పెంచు రుచియు
రాగిజావయు బలమిచ్చి రమ్య మగుటె.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి