27, మార్చి 2021, శనివారం

 



నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (2)


" శ్రీ మతి గారు ఏమిటి" ఈరోజు ప్రత్యేకత ముందు ఆ "గారు" లు తీయండి ఎంచక్కా పేరుపెట్టి పిలవండి అది కాదే

ఏదీ కాదన కండీ మీరను కుంటే అన్నీ అవుతాయి

సరే ఈరోజు అల్పాహారం ఏమిటీ "అట్టు అండి"

పెసరట్టా, మినపట్టా మీకు ఏది కావాలో చెప్పండి 

నీ మాటలతో నాకు కవిత్వం పుట్టు కొస్తుంది

ఏది చు "ట్టూ "అంత్యప్రాసతో చెప్పండి 

అసలు నిన్ను అర్ధం చేసు కోవటం నావల్ల కాదు అందుకే మధురిమలు చెపుతా విను అంటూ మొదలు పెట్టాడు శ్రీపతి 


వేడి ఉప్మా తింటే  - అల్లము తగిలినట్టూ

పెసరట్టూ తింటే   - ఉల్లియె ఇరుకున్నట్టూ 

మిర్చిబజ్జీ తింటే  - నాలిక సుర్రన్నట్టూ

మైసూర్ బజ్జి తింటే -  మైసూర్ చూసినట్టూ 


మరవరాలను తింటే - నాలిక చుట్టి నట్టూ    

మామిడి బద్ద తింటే  - పళ్లే గుంజి నట్టూ 

బఠాణీలను  తింటే  - పళ్లే  అది నట్టూ

ఇక బబుల్గమ్  తింటే - నాలిక చుట్టి నట్టూ   


పెరుగన్నమే తింటే  - ఉల్లి కొరుక్కున్నట్టూ

సెనగలు నములుతుంటే - గుప్పెడు బొక్కినట్టూ

ఎండలు పెరిగి ఉంటే - మజ్జిగ తాగి నట్టూ   

దిబ్బ రొట్టె తింటే -  మత్తు ఎక్కి నట్టూ  


అబ్బో బాగాచెప్పారండి  

అట్టు అట్టూ అనుచు అధిరేట్టు అరుపు  

పెట్టు పెట్టూ అనుచు బెదిరేట్టు అరుపు 

తట్టు తట్టూ అనుచు కాలి నట్టు అరుపు 

అట్టు పెట్టాను తనిపెట్టు అనుచు అరుపు 


అరుపుకు కళ్ళు తెరిచాడు శ్రీవారు ఎందుకే అంత పెద్దగా అరువు, కాస్త నెమ్మదిగా చెప్పవచ్చుగా  

అసలు మీకా చెవుడు నాకా అర్ధం కావటమే లేదు, ఇద్దరం డాక్టర్ వద్దకుపోదాము ముందు అట్టు తినండి ఇంకో అట్టు వేస్తా, నువ్వుకూడా తెచ్చుకో ఇద్దరం కలసి తిందాం, నీమాటకాదనను తొందరగా తెచ్చుకో        

అలా సాగినాయి సంభాషణలు ఇరువురి మధ్య  

అబ్బా మంట మంట పచ్చిమిరపకాయ తిన్నా అన్నిటికీ తొందరే ఇదిగో త్రాగండి అంటుగ్లాసు అందించింది. మంటా ముందు అక్కడ పెట్టు పంచదార తీసుకురా

ఏమిటండి అంత పెద్దగా అరిచావు 

మంచినీళ్ళనుకొని కాఫీ త్రాగా నాలిక కాలింది 

మీకు అన్నివిషయాలలో ఆత్రుత ఎక్కువే, ఆ ఆత్రుత అంతమంచిదికాదు అన్నది శ్రీమతి 

నాలిక కరుచుకున్నారు  శ్రీవారు .   

__(())_-

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (3)


చూడండి మనుష్యులందరూ జన్యపరంగా సమానము కానీ బుద్ధి, గుణము, నడవడి వారి తల్లితండ్రుల నుండి చేరుతుంది. మీరు మీనాన్నగారులాగా ఉంటారు అంటే నీవు మీ అమ్మ లాగా ఉంటావా అన్నాడు శ్రీవారు. 

ఏం కుండకూడదా,  మీరైనా నేనైనా బొడ్డు కోత కోసి భూమి మీదకు చేర్చారు, ఆ తర్వాత ఏడుపుతో ప్రారంభించి ఏడుపుతో ముగిస్తుందికదా " పుట్టేడప్పుడు గిట్టేటప్పుడు" నీకు గాని నాకు గని ఏమి తెలియదు నడిమధ్య ఉండేది నాది అనేది ఉంటుంది అది మీకు వేరే చెప్పాలా నేను.  నాది అనేది పోయి మనది అనుకుంటే కొంత తృప్తి. 

అది తెలుసనుకో మనుష్యుల మర్మం అర్ధం కావటం లేదే, ఎందుకో, కాదు అర్దహ్మ్ సెహెసుకోవటానికి ప్రయత్నించితే అంతా తెలుస్తుంది తెలియంది లేదు, తెలుసు కోవలసింది ఉండదు, ఆ పరమాత్ముడు నడిపినట్లు నడుచుకోవటమే. 

మరి         

మరి "శాస్త్రం ఏమి చెప్పిందో అది తప్పక చేయాలి". ఒక జ్ఞాని చెప్పిందానికి, మీ బుద్ధికి తోచిందానికి మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే, మీరు జ్ఞాని చెప్పిందాన్నీ ఎన్నుకోవాలి. చీకటి లో వెళ్లడం కన్నా, అప్పు తెచ్చుకున్న వెలుగులో వెళ్లడం మేలు. ఏ రోజు మీరు మేలు కుంటారో, ఆరోజు మీరు దాన్ని వదలి వేయవచ్చు. కానీ అలా ఎవరూ వదల లేదు. చేయడం అనేది ఒక కర్తవ్యం గా భావించి, శాస్త్రవిధులను అనుసరించి చేయవలసిన కర్మలుగా వేటిని పేర్కొన్నారో, వాటి మీద ఆసక్తిని, ఫలకాంక్షని వదలి, ఆ కర్మలు చేసుకుంటూ పోవాలి.

శాస్త్రం దగ్గరకు మీరు ఒక చిన్నపిల్ల వానిలా, ఒక అజ్ఞానిలా వెళ్లారు అంటే, శాస్త్రం మిమ్మల్ని మేలు కొలపగలదు. కానీ మీరు శాస్త్రముల దగ్గరకు, జీవించివున్న గురువుల దగ్గరకు ఒక జ్ఞానిగా వెడుతూ వుంటారు. అప్పుడు మిమ్మల్ని మేలు కొలపడం ఎవరికీ సాధ్యం కాదు.

మీరు మొదటి అడుగు వేసినప్పుడు మీకు గురువు కలుస్తాడు. చివరి అడుగులో పరమాత్మ కలుస్తాడు. అంటే గురువు మీతో నిరంతరం ఉంటాడు. అందుకే నీవు గురువు ద్వారానే పరమాత్మ చేరుకోవలసి ఉంటుంది.

ఏమిటో పొద్దున్నే నీ బోధ అర్ధ మయినట్టు ఉంటుంది అర్ధం కానట్టు ఉంటుంది 

మా గురువుగారు వ్రాసిన పద్యం పద్య గుర్తుకొస్తున్నది 

"మణిభూషణశ్రీః ( ర న భ భ ర..15/10 )..

----

రామచంద్ర శరణంమమ రమ్యత మాశ్రయే !

రామచంద్ర చరణౌ మమ రవ్వ ఫలాప్తిదౌ !

రామచంద్ర పరమాత్మని రంజిత సేవనం ,

రామ నం నమతమానస రామస పీఠినమ్ !!! 

అన్నారండి అంతా  రామనామము సఖ్యత చేర్చును మనము నిమిత్తమాత్రులం.   


మనస్సే లొకంలో సమానం సుఖాంతమ్ము

వినోదం విధానం వివాదం విశాలమ్ము

రుణమ్మే భయమ్మే సరాగం సహాయమ్ము 

గణాలే ప్రభావం‌ సకాలం ప్రధాణమ్ము  ....... అని తెలుసుకుంటే చాలు లోకం తీరు అర్ధం  అవుతుంది  

మనిషి అనేవాడు ఎలా మారుతాడు దానికి కారణం ఒక్కటే "జిహ్వతాపంతో ప్రేమకుచిక్కి గిలగిలా కొట్టు కుంటాడు . 

నేను కూడానా 

మీరేమన్నా తక్కువా అరవై దాటినా పౌరుషం, మైధునం ఎమన్నా తాగ్గాయా 

అది నిజమేననుకో 

అది తప్పా, ఏంటి తప్పు కానే కాదు అది ఉంటేనే మనిషిగా బతకగలుగుతారు లేదా 

లేదా ఇట్లా ఉంటాడు  

     

మనిషి అనురాగము పంచి - మతి లేకయు తిర్గు  వాడు  

విధి మాయ రోగము పంచి   - గతి లేకయు చిక్కు వాడు

 

కుల మంతయు గోల చేసి - కను మాయకు చిక్కు వాడు  

విధి బోధయు కొంత చేసి  - తనువంతయు పంచు వాడు

 

మది మాయ వేలము వేసి - మది తప్పియు పలుకే వాడు   

విధి లేక  గాలము వేసి  - కల కాలము రోగి వాడు 


చిరు దీపము వెలుగుచూసి - చిరు నవ్వుల మాయ లోడు 

శిఖ పట్టు తన్నులు చూసి  - గురు సేవయు చేయు వాడు 


సమ సేవలు తెల్పి చేసి - సమభావము పంచు వాడు 

సమ భోగము కలగ చేసి  - సమ యోచన తెల్పు వాడు 


అన్న దాన్ని తెలియ చేసి - ఆదు కొనుచుండెడి వాడు

తప్పులన్ని తెలియ చేసి - జీవితాన్ని నడుపు వాడు 

--(())--

మనుషుల్లో ఉండే కొన్ని రకాలు చెప్పావు  కాఫీ ఎలాచెయ్యాలో చెప్పవే అది మాత్రం చెప్పఁను నేను కలిపి తెస్తా హాయిగా త్రాగి సంతోష పడితేనే మీకు పౌరుషం పెరుగుతుంది 

అవునూ రాత్రి భజన జరుగుతుందిక దా ముసి ముసి నవ్వులమధ్య కాఫీ జుర్రుతున్నారు ఇద్దరు. 

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (4)


మనిషిలో ఆశలు మెండు అయినా అనుభవాలు చెప్పుకొని హాయిగా కాలక్షేప చేసికుంటూ రామకృష్ణ అనుకుంటూ 

ఏమిటే ఈరోజు నన్ను పిలుస్తున్నావు 

రామకృష్ణ అంటే మీరేనా "ఆదేవుడ్ని తలచానను కోవచ్చు కదా"

నన్ను పిలవకపోయినా ఆ దేవుడ్ని తలిచావ్ సంతోషం   

ఏమిటో చెప్ప బొయ్యారు 

మానాన్న గారు చెప్పిన చిన్ననాటి అనుభవాలు గుర్తుకొచ్చాయి 

నాకు చెప్పి కొంత బరువు తగ్గించుకోవచ్చుగా 

అవుననుకో 

ఇంకేమిటండి గుర్తునన్వి తెలపండి 

వేపచెట్టు కింద మడతమంచమెక్కి -  చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకునేవాడు. 

చద్దన్నంలో - ఆవకాయ కలిపి మీగడ పెరుగు వేసుకొని తినేవాడు. 

చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు పప్పుచారులో - వడియాలు అప్పడాలు నంచుకుని తినేవాడు.  

లేత కొబ్బరి కోసం కొబ్బరి బొండాం కొట్టించి దానిలో బెల్లముక్కపెట్టించుకొని - మరీ తినేవాడు.  


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని రసాన్ని జుర్రుకొని ముక్కలు తిని పిల్లలకు పెట్టించేవాడు 

కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి ఆవకాయ, కందిపచ్చడి తో నేయి కలిపి తినేవాడు   

వేడివేడిగా చేసిన చపాతీ లలో కుతకుతలాడుతున్న చుక్కకూర పప్పు నంచుకుని తినేవాడు 

నూకలన్నంలో  వెన్న తీయని మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ కొరుక్కొని తినేవాడు 


పులగం అన్నంలోకి ఘాటుగా పచ్చిపులుసు పోసుకొని ఊరి మిరపకాయలు కొరుక్కొని తినేవాడు 

పొడుగు వంకాయలు తెచ్చి బొగ్గుల పొయ్యి కాల్చి పొరలు తీసి గుజ్జులో ఉప్పు కల్పి తినేవాడు    

చెట్టు నుంచి తెంపుకొచ్చిన గుండు లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి తెచ్చి పొడి పెట్టుకొని తినేవాడు 

సావిట్లో గేదెలతో పోటీపడి " తేగలు " తెచ్చి దానిలో ఉన్న చందమామ తీసి ఈనెలు తీసి తినేవాడు 


దోర పచ్చికొబ్బరి లోకి బెల్లం గెడ్డ జత చేసి తినేవాడు 

తిరుపతి లడ్డూ మొత్తం అచ్చంగా ప్రసాదంగా పెట్టి తినేవాడు 

పరపరలాడే పచ్చిమామిడికాయలో ఉప్పూ కారం దట్టించి కొరికి తినేవాడు 

పండిన వేపకాయ ఎవరూ చూడకుండా చీకిపారేసి వాడు 


ఓమ్మో ఇన్ని యున్న వంటకాల, ఇన్ని రుచులా, ఇందులో కొన్ని నాకసలు తెలియదు అందుకనే పూర్వ వారు 80 ఏళ్లకు కళ్ళలో శుక్లాలు తీసుకొనేవాళ్లట అస్సలు మందులు  వాడేవారు కాదుట ఏదన్న చిన్న రోగం వచ్చిన లంఖణం ఆయుర్వేద మందు వాడేవారట. 

 ఇప్పటి పరిస్థితి వేరు చిన్న పిల్లవాడికి లోకజ్ఞానం రావాలని సెల్లు ఇస్తున్నారు, తిండి పెడుతున్నారు  ఈ అలవాటు ఎప్పుడు మారుతుందో 

పిల్లలని ఏమి అనకు కోపం రావచ్చు పిల్లలకు మన సలహాలు నచ్చవు, మనతిండ్లు ఇష్టపడరు 

మీ నాన్న గారంటూ చక్కటి ఆహార పదార్ధాలు గురించి వివరించారు సంతోషం.

ఇంకా ఉన్నాయే, ఇప్పటికి ఈరోజుతో ఆపాను అంతే 

చిక్కటి కాఫీ తెస్తాను త్రాగి స్నానం చేసిరండి మీరు చెప్పిన వంటకం చేస్తాను 

ఏమిటి గుత్తోన్కాయ కూరచేస్తావా, ఆ చేస్తానండి మీకు ఏది ఇష్టమైతే అదేచేస్తాను అంటూ నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది శ్రీమతి.    

          --(())--

 నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (5)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు అలా ఉన్నారు, ఏమిలేదు ఏమి రాయలేదని అనిపించింది. ఈ వయసులో   

అవసరమా, డాక్టర్ గారుకూడా ఆలోచించ వద్దన్నారు కదా 

అది కాదే 

ఏది కాదు ఈ తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు, నీ వక్కడివేమి చేయగలవు అంతా నీ అహం తప్పా 

అవునే అవునూ 

తెలుగు బతికించాలని నాలో అహం పెరిగింది, ఆలోచనపెరిగింది దానితో వయసు పెరిగింది. 

అంట కోపముదేనికి 

చూడలేని వాటిని చూసినట్లు కల్పించి కవిత్వం వ్రాస్తారు, కధలు చెపుతారు ఎవరికోసం. 


నేను ఒకటే చెప్పగలను ముందుతరాలవారికి ఆన్లైన్ లో పనికొస్తుందని నా ఆలోచనా 

అవునండి ఈరోజు నాభావం చెపుతా విని వ్రాయండి 

కనిపించనివి అవి "గాలి, ప్రకృతి, ప్రేమ, మనసు" అవునా కాదా 

అవునే కనిపించేవి ఏమిటి మనిషిలో స్వార్ధం, అహంకారం, ఏడుపు, నవ్వు ఇంకా ఉన్నాయి 

అయితే నీవేమంటావు          

కాలల్ని బట్టి వయసును బట్టి వ్రాయండి నేను వద్దనుటలేదుగా       


ఆ చూపుల వెనుక  - భావం మేమిటో

మది పలికు తెలియక - ఆత్రం మేమిటో

నీహృదయం వెనుక - స్వప్నం యేమిటో 

పలకరింపు వెనుక - మొహం ఏమిటో 

నీ స్నేహం వెనుక - ప్రేమే ఏమిటో 

నీ దాహము వెనుక - తియ్యటి దేమిటో 

నీ పిలుపుల వెనుక - కోరిక ఏమిటో 

నీ అరుపులు వెనుక - ఆకలి ఏమిటో 

నీ తలపుల వెనుక - హద్దులు ఏమిటో 

నీ వేషము వెనుక - స్నేహము ఏమిటో 

మధుర వాక్కు వెనుక - మహిమలు ఏమిటో 

చిలక పలుకు వెనుక - ఉద్దేశ మేమిటో 

పెదవి విరుచు వెనుక - లౌక్యము ఏమిటో 

ప్రీతి వలపు వెనుక - ప్రేమ ఏమిటో  


చాలా చక్కగా చెప్పావు 

"మనసుకు కమ్మిన మాయ పొరలను ఎలా తొలగించాలో " తెలియక ఇలా ఉన్నాను 

అనుకుంటే మాయపొరలు లేదంటే ప్రేమ పొరలు అవి ప్రేమను మార్చలేవని  మీకూ తెలుసు.  

అయినా 

భగవంతునికి నమస్కరించుదాము  "తాము మంచిదనుకొను దానిని పొందుటకై" నమస్కరించు దాము .  కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు.  (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు మోసాలు చేస్తున్నారు)  నిత్యమూ భగవంతుని కోరేవారు మన:శాంతి పొంది ఉండగలరని నా నమ్మకం.     

అయినా మనసు మధించే హక్కు ఎవరకూ లేదు, మనుగడకు ప్రేమధర్మాన్ని పాటిస్తూ క్రమశి క్షణతో నిత్య సత్యాలు తెలుపుతూ న్యాయాన్ని బతికిస్తూ దేశానికి రక్షణ కలిగిస్తూ జీవించేవారు 

మానవసేవచేసే నిజమైన మానవులు 

మరి మానవులం కాదా 

అనుకుంటే అందఱు చేసేవి, తప్పులే దేవుడొకడున్నాడు వాడ్ని నమ్మి బతుకుదాం 

ఈరోజు కాఫీ వొద్దులే ... వద్దులే అనుకోవటం దేనికి మీ అలవాట్లు మార్చుకోమనటంలేదు నేను 

కాఫీ తెస్తాను కాస్త పేపరు చదువుతూ ఉండండి 

తప్పుతుందా మీ మాటకు ఎదురుచెప్పటం కూడానా మాటలకు నవ్వుతు కదిలింది శ్రీమతి. 

--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (6)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనుష్యులలో బుద్ధులు వేరుగా ఉన్నాయి, అవి కొందరిని బతికిస్తాయి, కొందరిని నాశనం చేస్తాయి కుటుంబమే నాశనమై పోతుంది.

అసలు బుద్ధి    

నిర్ణయ శక్తితో కూడిన బుద్ది  సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది. 

 ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన ప్రభావము వలన విజ్ఞానమయ కోశము, చిత్తము ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా రూపొందుతాయి. 

జ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి. 

బుద్ది ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ భావన. 

అందుకే నేను చెపుతున్నా అంటూ శ్రీవారు తెలియపరిచారు 

 జీవమ్ ఒక్కటే -  జీవితమ్  వేరు

 రూపమ్ ఒక్కటే -  గుణం వేరు

 కాలం ఒక్కటే -  గమ్యం   వేరు

వనం ఒక్కటే - ఔషదాలు  వేరు..... .... ..


 ఆశ ఒక్కటే -  ఆశయం వేరు

 ఆకలి ఒక్కటే -  రుచులు వేరు

ఆరాటాలు ఒక్కటే - ఆదరనే లేని వేరు

 కలం ఒక్కటే -  కావ్యాలు వేరు   .... ... ...


కత్తి  ఒక్కటే - ఉపయోగం వేరు

ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు

భాష ఒక్కటే - భావాలు వేరు

బంధం ఒక్కటే  - బాధ్యతలు వేరు ..... ..


తపస్సు ఒక్కటే - కోరిక వేరు

తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు

బలం ఒక్కటే - ఉపయోగం వేరు

మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు .... ....


తరుణం ఒక్కటే -  తమకం వేరు

చరణం ఒక్కటే - చరిత్ర వేరు

ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు

ప్రాణం ఒక్కటే - మరణం వేరు  .... ....


నవ్వులు ఒక్కటే - ఫలితం వేరు

ఏడుపు ఒక్కటే  -- రోగాలు వేరు

తుమ్ములు ఒక్కటే -- కష్టాలు వేరు

తుమ్ములు ఒక్కటే -- ఫలితాలు వేరు

--((*))--

          నూతన చిత్తముతో బుద్ధి బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లు మలిన స్వభావము దైవీ స్వభావమై వెలు గొందును.అప్పుడు మనస్సు శాంతి కలుగుతుంది. బుద్ధి మారకున్నచో , గొంగళి పురుగుగనే జీవించి నశించును. 

అందుకే జీవితం నిలకడ నిజ నిర్ణయాలపై చిత్తమే గమ్యము. సాధనయే మార్గము అవుతుంది 

 

--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (7)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి కాస్త ఇంట్లోకి వచ్చి చీదొచ్చుకదా రోడ్డుమీద చీదితే ఏమనుకుంటారు 
చీదిన చోట కాస్త ఇసక చల్లండి. కాసేపున్నాక ఎండిపోతుంది. నిధ్ర్మం నీవు నిర్వహించు అసలే ఇది కరోనా కాలము. 
ఏమిటి వేపాకు తెచ్చావు 
వేపాకు, పసుపు, పచ్చకర్పూరం వేసి మరిగించి వచ్చిన రసాన్ని వడపోసి చెంచా తీసుకుంటే చాలు అన్ని రోగాలు పోతాయి.
యూట్యూబులో రోజుకొకటిచెబుతారు అవి అన్ని పాటిస్తే ఆరోగ్యం కాస్త అనారోగ్యమవుతుంది తెలుసా 
ఈరోజుకి ఇది చాలు        

పరిశుద్ధ జీవనము ఒక్కటియే మార్గమున పురోగతి నివ్వజాలదు.  పాత్రను పరిశుద్ధి చేయుట సద్వినియోగపరచుటకే కదా! కేవలము ప్రతిదినము తోమి, కడిగి, భద్రముగ వుంచిన పాత్ర వలన వినియోగము, ఆహార పదార్థములను వండుటకు పాత్రను వినియోగించినట్లే నీవు కూడ పరహితమను తెలిసిన విద్యను అందరికి పంచియు,  యజ్ఞము గా సమర్పణ చేయవలెను . 

పాత్ర అగ్ని తాకిడి భరించి, రుచికరమైన పదార్థములను తయారుచేసి పదిమందికి పోషణము కలిగించును. నీవును అట్లే జీవితపు ఆటుపోటులను భరించుచు, పదిమందికి వినియోగపడు పద్ధతిలో  విద్యను [పంచియు జీవించుట ముఖ్యము. కేవలము సదాచారమే సమస్తము అను భ్రమనందు జీవింపకుము. సదాచారమవసరమే. అది లేనివారు సత్కార్యములను నిర్వర్తించలేరు. అందరూ ఒక్కటే, భేదమును చూపక జీవించాలి  
మంచిని పంచి స్వార్థరహిత జీవితం గడిపే జీవాన్ని అని భావించు.   
III UUI UUI  
పరుగు తీసేటి కాలాన్ని   
వెలుగు పంచేటి ధర్మాన్ని 
తనువు మెచ్చేటి యోగాన్ని 
విషయ మేర్పర్చు వేదాన్ని 
తెలిసి పొందేటి జీవాన్ని 

సెగలు కమ్మాయి నా వెంట 
పొగలు చుట్టాయి నీ చుట్టు 
కధలు మారాయి నా బత్కు 
మడత కాజాను  ఆసించు
తెలిసి పొందేటి జీవాన్ని 

పనులు కల్పించి జీవిస్తు   
కళలు పంచేసి  బోధిస్తు   
క్రమము కల్పించి సేవిస్తు  
మనసు  చైతన్య పర్చేస్తు  
తెలిసి పొందేటి జీవాన్ని 

సొగసు చూపిస్తు ఏర్పాటు   
వయసు పొంగిస్తు తోడ్పాటు   
జిగురు కార్చేస్తు  దొంగాటు   
నిజము చెప్పేస్తు సాపాటు  
తెలిసి పొందేటి జీవాన్ని 

ఇది నిజం ప్రేమ మాధుర్య 
 కలసి సంతృప్తి పొందేది  
సహన ఓదార్య మే సాము  
స్య కళ ఉద్దేశ్య రేతస్సు  
తెలిసి పొందేటి జీవాన్ని
   
లెదుగ నా శక్తి  నీ ప్రేమ
మనలొ నీ శక్తి నా ప్రేమ 
కళలు తీర్చేటి నీ భక్తి 
కధలు తెల్పెటి నీయుక్తి 
--(())--
చాలా చక్కగా కవితను తెల్పావు, మనం నాలుగురుకోసం బతుకుదాం, తెలుగు భాషతో మంచి నడవడిక తెలుపుదాం.    
__(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (8)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

భార్య గురించి తక్కువ చేసి మాట్లాడకండి 
ఎవరి కష్టం వారిది 
అవునా 
భార్య  లోపల పిల్ల లందరి యందు  జీవపరమైన ఆదరణ  ఒకే రకముగా ఉంటుంది. శిక్షణ వైవిధ్యముతో కూడి ఉండదు . కానీ ఎవరెవరి స్వభావమును బట్టి, ఎవరికి ఏవిధమైన శిక్షణ ఇస్తే  వారు సంస్కరింపబడతారో దాని ప్రకారముఒక తల్లిగా శిక్షణ ఉంటుంది. ఆదరణ విషయములో భర్తకు చేదోడుగా ఉంటుంది.  అందరి యందు దయార్ద్ర హృదయురాలుగా, కలుపుకోలుతనముగా  సర్వమూ ధారపోసే ఒక యంత్రముగా అవసరానికి సలహా ఇచ్చే మంత్రిగా, ధైర్యాన్ని ఉసిగొల్పి ధర్మాన్ని తెలిపి ఆచరణ సిద్ధిగా, అందరికీ సంతోషం కల్పించే ఒక నవ్వుల కల్పవల్లిగా ఆమెకు  ప్రియులు, అప్రియులు అనేవారుండరు .
 
ఆమె బలమే మన బలంగా మనలో సాధన జరగాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఆమె నిండా అమ్మవారు వ్యాపించి ఉంటుంది. తల్లి పిల్లల బంధం, భార్య భర్తల బంధం,   ఎప్పుడైతే మరుగవుతుందో నేర్చుకున్న విద్య కళలు రాణించవు . 

అందుకే నే చెపుతున్నా 

మనలో అసహనం చోటు చేసుకున్నప్పుడు చేజేతులా అవకాశాలను జారవిడుస్తాం.
సంసార జీవనానికి  కొలబద్ధ మౌనం, సహనం, ఓరిమి మొదలైన గుణాలను ప్రదర్శించడం ద్వారా వ్యక్తమౌతుంది. అతను విధికి ఎదురీదక స్థిరంగా నిలిచి ఉండగలుగుతుంది. ధర్మం తెలపగలుగుతుంది 

భగవత్సంకల్పం ప్రకారమే ప్రతీది జరుగుతుందని నిస్సంశయంగా నమ్ముతుంది . అందువలన ఉన్నత స్థితిలో సదా నెలకొని ఉంటుంది .
కోపం, అసహనత, లెక్కలు, వాదాలు, పోట్లాటలు ప్రపంచంలో ఇవే మనకు కనిపిస్తాయి. ప్రేమ క జీవనం గడపదలచిన వారు వీటి జోలికి వెళ్ళరు.

ఏమిటే ఈరోజు ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు అన్ని ఒక్క చిన్నకథగా చాలా చక్కగా చెప్పావు అసలు మనిషికే వెంటాడే లక్షణాలు ఏవి  
ఒక కవితగా తెలుపుతాను వినండి 

నిర్మాణ లక్ష్యమే - బంధమై వెంటాడు  
నిత్యము ప్రేమయే - సౌఖ్యమ్ము వెంటాడు 
ధర్మమ్ము నీడ యే  - తర్ముతూ వెంటాడు 
న్యాయమ్ము వల్లనే -  కాలమ్ము వెంటాడు 

ఆరోగ్య భావమే - సంసార మెంటాడు 
ఆనంద రోగమే - సంతోష మెంటాడు 
ఆలస్య  వేగమే - ఆదుర్ద వెంటాడు 
ఆకర్ష వేగమే  - ముగ్గులో వెంటాడు 

బాల్యంబు నీడలే - భాగ్యమై వెంటాడు 
భాగ్యమ్ము ఆశ యే - రోగమ్ము వెంటాడు 
రోగమ్ము వల్లనే  - గర్వమ్ము వెంటాడు 
గర్వమ్ము వచ్చుటే - దారిద్ర వెంటాడు 

వేదాంత పల్కులే - ఆశ్రయ వెంటాడు 
సౌందర్య పోషణ -  స్త్రీలలో  వెంటాడు  
కారుణ్య భావన  - శ్రీ రామ వెంటాడు 
ఆరాధ్య రోదనా - ఆత్మతో వెంటాడు  
 
కర్తృత్వ భావనే బంధం - తొలగితేనే మోక్షం.
తోలగక పోతే ఏర్పడు - జన్మ జన్మల బంధం  
ముక్తి సంపద ఉంటేనే - జన్మల సౌలభ్యం 
భక్తి ముక్తి యుక్తి శక్తి లేకపోతే - జన్మము వ్యర్థం 

ఎలా గుర్తుకొస్తా యే ఈ వాక్యాలు, కవితలు నీకు 
మీ ప్రోద్బలం, మీ ప్రోత్సాహం, మీ ఆరోగ్య ఉత్త్సాహం ఎదో తెలుసుకొని మీకొరకు ఈ చిన్న ఆలోచలే చెపుతున్నా రాసేవారు మీరు, రాయించేవారు మీరు నేను నిమిత్త మాతృరాలును మాత్రమే, మీ పాద దాసిని, మీ ప్రియాతి ప్రియమైన ప్రియురాలని, పిల్లలను కనే ఒక యంత్రమును. 
అబ్బా అన్ని వాక్యాలు బాగున్నాయి ఆ చివరి వాక్యమే బాగుండలేదు. ఏచేద్దాం ఆ బ్రహ్మ దేవుడు మాతలరాత అట్లారాసాడు, మీకు సుఖము అందించడమే మాలక్ష్యం, మాధేయం, మా ధర్మం  
అంట పెద్ద మాటలు వద్దులేవే ఈ రోజు కాఫీ ఇచ్చేది ఏ మన్నా ఉందా ? లేదా ?
చూసారా మీ మొగబుద్ధి చూపించారు 
ఆ ......... అంటూ .......... నాలిక కర్చుకున్నాడు .. శ్రీపతి 
             
--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (9)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్రీవారు మీకు ఓకే విషయం చెప్పాలి 
ఏమిటే "ఈవయసులో చెయ్యాల్సింది ఆ వయస్సులో చెయ్యాలి కదా " అవును అది నిజము 
మనబ్బాయి చదువుపూర్తయినది పెళ్ళిచేస్తే బాగుంటుంది 
ఉద్యోగం రాలేదు కదా 
ఉద్యోగం వచ్చే లోపు ప్రేమ పుట్టితే మీరు ఆపగలరా 
అదేమిటీ అట్లాంటావు 
తల్లి తండ్రులు పిల్లలను చదివించాలి మాత్రమే తర్వాత వివాహము చెయ్యాలి వల్లకాలల్మీద వాళ్ళు నిలబడేటట్లు ధైర్యం చెప్పాలి, వారి సంపాదనమీద ఆధారాపడకూడదు , కట్నం ఇవ్వగలము అని ఆడపిల్ల పిల్లల పెళ్లి చేయక పోవటం కూడా తప్పు. వాళ్లలో విశ్వాసం కలిగించటమే తల్లి తండ్రుల కర్తవ్యము.    
లేని యడల 
మందారం తొ సంవ్యాప్తి - సింగారం తొ సంప్రాప్తి
సిందూరం  సంవ్యాప్తి  - వయ్యారంతొ  సంప్రాప్తి

నాంచారి దైవప్రాప్తి - బంగారి దైర్య ప్రాప్తి
వయ్యారి భావ్య ప్రాప్తి - సింగారి సౌర్య ప్రాప్తి

ఉద్వేగం తోను తృప్తి - ఉత్సాహం తో ప్రాప్తి
ఉన్మాదం తోను తృప్తి - ఉల్లాసం తో ప్రాప్తి
ఇలా పిల్లలు మారితే ఎవరు బాధ్యలు 
అందుకే 
దృఢ విశ్వాసములు -   అయిదు విధములైన జ్ఞానములు 
 
 1. ప్రాపంచిక జ్ఞానము = పిల్లల పెళ్లి మంచివారని తలంచి వారికి వివాహం చెయ్యాలని నిర్ణయం.  అనగా బావిని త్రవ్వకయే, ఇచ్చట మంచి నీరున్నదని భావించుటయు, భూమిని త్రవ్వుకొనుచు లోపలికి చొచ్చుకొని పోవుటయు మొదటి విశ్వాసము.

2. ధర్మశాస్త్ర జ్ఞానము= తల్లి తండ్రులు ఇటువారు అటువారు ఇచ్చి పుచ్చుకొని పిల్లల పెళ్లి చేసి ఏకం చెయ్యాలి . అనగా  నీటిని కన్నులార చూచుట రెండవ విశ్వాసము.

3. ఆధ్యాత్మిక జ్ఞానము= కొత్తగా పెళ్లిఅయినవారికి పూర్తిగా స్వశ్చ ఇచ్చి వారి సంతోషానికి అడ్డు లేకుండా ఉండాలి.   నీటిని రుచి చూచుట మూడవ విశ్వాసము.

4. బ్రహ్మ జ్ఞానము= సంసార సుఖము వల్ల పిల్లలు పుట్టి వారికి కర్తవ్యదీక్షగా పెంచి నలుగురిలో మంచివారు అనుకున్నప్పుడే తల్లితండ్రులగుర్తింపు  అనగా  ఆ నీటిని గూర్చి ఇతరులకు వర్ణించి చెప్పుట నాల్గవ విశ్వాసము. 

5 . విశ్వ విజ్ఞానము = కుటుంబములో సభ్యులందరూ కలసి ఒకేచోట ఉండటమే నిజమైన జీవితం అనగా   జ్ఞానము, సర్వజ్ఞత్వము నీరులేనిదే బతకలేరని ప్రాణుల విశ్వాసము 

ఆస్వాదించే అందం - ఇదే ప్రకృతి ప్రభంజనం
ఇక స్త్రీ ముఖార విందాం - ఆకర్షణ తోనె బంధం

చూసె రమణీయ దృశ్యం - పుడమితల్లి సింగారం
బతికించు తల్లి సహనం - తల్లీ తండ్రి బంధనం

నేలపైన బంగారం - అణువణువున పచ్చదనం
జీవితముకు వెచ్చదనం - ఆరోగ్యానికి తరుణం

నిజము తెలిపేటి వర్ణం - బతుకు వర్ణించె చిత్రం
హృదయం పెంచే కిరణం - పంచే మలయమారుతం

--((()))--

ప్రతిఒక్కరిలో విశ్వాసం, దృఢసంకల్పం కలిగిస్తే భయమనేది ఎట్టి స్థితిలో చేరదు, అధైర్యమనేది నీలో ఏర్పడదు    
మొత్తానికి పిల్లోడి పెళ్లంటూ జ్ఞానవంతమైన ఇషయాలు తెలిపావు, కవితలు కూడా తెలిపావు అందుకే నేనంటా " పంచే హృదయకిరణం - పంచే మలయమారుతం "

--(())--

 నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (10)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    
తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   
వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 
నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 
నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  
కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   
ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9
సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  
తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  
ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 
అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 
*ప్రశ్న : జ్ణానం : ప్రజ్ఞానం అంటే ఏమిటి ?*_
*శ్రీరమణమహర్షి గారు తెలియ పరిచారు "
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం. దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం !*_
_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుంది. ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణల సాయంలేక తానై ఎరుకగా ఉండగలదా ?*_
 అవునట్లే అది తర్కసహం కూడా !*_
_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల సంవిత్ తెలియనైన వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాసించదు. అట్టిచో అది నిద్రలో గోచరించవలె కదా ?*_
 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_
_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !*_
_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-
కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 
అదే ......  ....... .అదే ........  ...... 
--(())--

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (11)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు.
ఇమిలేదు నీరసం లేదు కానీ నువ్వొక్కదానివే కష్టబడుతుంటే కొంత బాధనిపించింది. నీకు ఎటువంటి సహాయము చేయకుండా ఊరికినే కూర్చొని తింటున్నా అందుకనే 
అట్లా అనుకోకండి స్త్రీ పురుషుల ధర్మాలు ఉన్నాయి. ధర్మాలనేవి అందరికీ సమానము కానీ శ్రీ పురుష శరీరసౌష్టమును బట్టి  కొన్ని ధర్మాలు ఎవరికీ వారు పొందేవి ఉన్నాయి 
అందుకే  నే చెపుతున్నా   
అనుకోని సంఘటనలు (కొందరి వల్ల చెడుగా)  జరిగినప్పుడు మనమంచికే జరిగాయని భావించాలి 
ప్రతీకారవాంఛ జోలికి పోకండి జరిగేవన్ని కర్మ అని భావించండి.   
శ్రీవారు వింటున్నారా 
ఆ వింటున్నా 
ప్రతీకార వాంఛ నీ మనసుకు రానీకు, నీకున్న అమూల్యమైన   సమయం వృధా చేసుకోవద్దు 
వాటికోసం అనగా నిన్ను మానసిక ఇబ్బంది చేసినా దయా గుణం వహించు మనిషి కర్మ తనపని తను చేసుకుంటుంది.

చీమలను పక్షి తింటుంది అది చనిపోతే పక్షిని చీమలు తింటాయి

 ఎవరు బలవంతులూ అంటే ఇద్దరూ కాదు అందరికంటే సమయమే బలవంతుడు.

ఒక మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు

 మనుష్యుల మంచిచెడుల ద్వారా చేసిన ఫలితమే మీకు స్వర్గానికి అయినా నరకానికి అయినా కర్మ ఆధారంగానే వెళ్తాడు
ఒక మంచి ఆటగాడు కూడా ఒకసారి ఒక అద్భుత ఆటగాడి ముందు బొమ్మలా మారిపోతాడు 
అదే కర్మ
నువ్వు వెళ్లిపోవాలి చెడు నుండి మంచికి, నువ్వు మంచిగా ఉంటే ఎప్పుడు అన్నీ నిన్నే అనుసరిస్థాయి, నీ మంచే నీకు గెలుపును ఇస్తుంది దురదృష్టం పైన.
నువ్వు ప్రపంచానికి మంచిని ఇస్తే అది తిరిగి మళ్లీ మంచిగానే నీ దెగ్గరకు తెస్తుంది.

మంచిఆ జీవనమంటే తెలియపరుస్తావా ... ఆ తెలియపరుస్తాను మధురిమలుగా వినండి 

*పవిత్రుడే నిజమైన - జీవితాన్ని సాగిస్తు 
ఇతరుల మేలుకోరైన - నిస్వార్థంగ సేవిస్తు

*పావనాత్ముడై అయిన - అధికారాన్ని చూపిస్తు 
తన మాటె వినాలనిన -  వత్తిడి నిరాకరిస్తు 
 
*సత్యము అనుష్ఠించిన -   అందరికి సహకరిస్తు 
స్వార్ధమే లే కుండిన -  వాంఛించేది యు చూస్తు
 
* ఆధ్యాత్మికము వలన -  బాధను వ్యక్త పరుస్తు
 సహజంగా తరుణాన -  ఉన్నతమైనది చేస్తు 

*పవిత్రమైనది కరుణ -  దివ్యమై సహకరిస్తు
 ఆకాంక్ష యే ఉండిన - అంతరమే మర్ధిస్తు

*ఈ సారవంతమైన - భూమాతను సేవిస్తు
 ఆధ్యాత్మిక రంగాన - విత్తనమై  జీవిస్తు

*ఫలితమే లేకుండిన - సంసారం సాగిస్తు 
  నిర్మలమైన మనసున - నిజ ప్రేమ చూపిస్తా
  
అసలు 

ధర్మమును పాటించకుండా, ధర్మానికి వ్యతిరేకముగా పనిచేయడం వలన బలము తగ్గి,  మనలో ఉన్న శక్తి తిరోధానము చెందుతూ ఉంటుంది. ప్రేమ అంటూ చుట్టూ తిరగకుండా ఎంత దైవారాధన చేస్తుంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. మన శక్తిని పదార్ధము వైపు గాకుండా పరమార్ధము వైపు మరల్చాలి.

*పరమార్ధము వైపు మన ప్రజ్ఞను పెంచుకోవాలంటే మనము ఏ మూలము నుంచి వచ్చామో, ఆ మూలముతో అనుసంధానం చెందాలి. ఆరాధన వలన, చక్కని ప్రవచనము వినడము వలన మనకు శక్తి పెరుగుతుంది. ధర్మముతో కూడిన కార్యక్రమముల వలన  మనలో చైతన్యము వికాసము చెంది, శక్తికి బలము చేకూరుతుంది. 
శుభం భూయాత్

చిన్న మాటకు పెద్ద సందేశమే తెలియపరిచావు  
అంతా మీరు నేర్పిన విధ్యే కదండీ 
మాటలు బాగా నేర్చావే 
అన్ని మీ దగ్గరేనండి అసలు విషయం మరిచా కొబ్బరికాయ తెచ్చారా షాపుకు పోయివచ్చారుగా 
ఆ మర్చి పోయానే ఇప్పుడేతెస్తా టి త్రాగిరాకండి కాఫీ కలుపుతా 
అలాగే ......................... అలాగే  

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (12)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమండి బతుకులో స్వేచ్ఛ, బానిస,  కు తేడా ఏమిటో తెలుపుతారా మీరు? 
నీవన్న ప్రశ్నకు జవాబు కష్టతరమైనది అయినా ఒకరు చెప్పేది కాదు, చెప్పలేనిది కాదు ఎవరికీ వారు ఆలోచనబట్టి రెండు ఒకదానితర్వాత మారుతూ వచ్చేవి .    

"పూల సువాసన మట్టికి అంటుతుంది, కానీ మట్టి వాసన పూలకి అంటుకోదు. అలాగే మంచివారి సహవాసంతో  చెడ్డవాడు సజ్జనుడుగా మారవచ్చు కానీ...దుర్మార్గుడి దుర్గుణాలు మంచి వానికి అంటవు."

అట్లాగే స్వేచ్ఛ అనుకుంటే రోటికి రోకలి పోటు తప్పదు కదా, రోలు నేను బానిసను నన్ను బాదు తారు అనుకోదు, అట్లాగే స్త్రీలు నేనే చెయ్యాలా వంట, నేను మీకు బానిసనా, అనుకుంటే తప్పా,  నిజమో మీకే తెలియాలి, మొగవారు వంటచేసి ఆడవారిని సుఖపెట్టే లోకం వచ్చింది కారణాల అనేకం. ఒకరకంగా చెప్పాలంటే భార్యాభర్తలు అనుకుంటే బానిసలు, సర్దుకుబోతే స్వేచ్ఛ జీవులు.        

ఏది అసలైన స్వేచ్ఛ?... చాలావరకు రాజకీయ పరమైన, ఆర్థికపరమైన, బాహ్య స్వేచ్ఛలు మీకు ఎవరో ఇచ్చినవే కాబట్టి, అవి ఏ క్షణంలోనైనా మీ నుంచి పోయేవే. అందుకే అవి ఎప్పుడూ మీ చేతుల్లో ఉండవు. మీ చేతుల్లో ఉండేది "కన్న ప్రేమ, మంచి జ్ఞాపకాలు ".  

మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా  ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. కోపమొస్తే (బడుద్దాయి, పిర్ర బద్దలు కొడతా అని తెట్టెవాడు నాకు అర్ధమయ్యేది కాదు అప్పుడు)   అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను. నాకు నేనుగా ఆలోచించే శక్తి తెలపండి, యుక్తి నేర్పండి అనేవాడ్ని.   

కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనేవారు నిదానించి . ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నీ  ఇష్టం కానీ, నా  ఇష్టం కాదు. మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించు కోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అనేవాడ్ని అప్పుడే కోపం వచ్చేది బెల్టు తీసేవాడు, నేను పారిపొయ్యేవాడ్ని ఇది యదార్ధం.  

నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆ హక్కు నాకుంది. మీరు చాలా అనుభవజ్ఞులే. కాబట్టి, మీరు నాకు మంచి సలహాలు ఇవ్వవచ్చు, సూచనలు చెయ్యవచ్చు. అంతేకానీ, నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని. యవ్వన కోపంతో.  

వెంటనే నాన్నగారు 
గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు. స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయట పడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.
బంధనాలన్నింటినీ తెంచు కోవడం తప్ప మీకు మరొక దారి లేదు. 

చిన్నప్పటి నుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించు కోవడం మొదలుపెట్టు అదే నిన్ను మంచిమార్గ నడిపిస్తుంది. నీలో ధైర్యం నింపుతుంది, నీలో ప్రేమ పుట్టిస్తుంది ఆప్రేమే నీకు ఒక కుటుంబం ఏర్పాటు చేస్తుంది అప్పుడు నీవు నాన్నవవుతావు నీ పిల్లలకు ఆజ్ఞలివ్వాలనుకుంటావు అప్పుడు ఈ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అనేవాడు. 

నాకు ఇప్పడికీ గుర్తు ఉంది మన్నగారి మాటలు "నేను మాములు వాహన డ్రైవర్ని, మానాన్నగారు చదువుకోమంటే చదవక తిరిగాను ఒకరి వద్ద బానిసగా బతకక స్వంత వాహనాల వల్ల నష్టపొ య్యాను అంతమాత్రాన అధైర్య పడక ముసిపాలిటి అత్తర్ బట్టి నడిపి పిల్లలను పోషించాను. మీరు చదువుకుంటే బగుబడతారు, అదృష్టముంటే ప్రభుత్వానికి సేవచేసే ఉద్యోగులవుతారు బానిస అని ఎప్పుడు మనసుకు రానీకు నేను చదివిన చదువుకు ఉద్యోగమూ అని భావించి స్వేచ్ఛ గా బతుకు అనేవాడు.           

కలం కాలం మారుతున్నవి సంపాదన పెరుగుతున్నది, స్వేచ్ఛ అంటూ ఆడమొగ తేడాలేకుండా తిరుగుడు మొదలైనది. ప్రకృతి సౌందర్యమును మరచి కుత్రిమ సౌందర్యానికి స్వేచ్ఛ అంటూ బానిసలవుతున్నారు అది అవసరమా చెప్పు శ్రీమతి 

నేనేమి చెప్పేది అన్ని మిరే చెప్పారు 

నేను ఒకటే చెపుతా "ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు " తల్లి తండ్రులుగా పిల్లల్ని చదీవించ గలము కానీ వారి బుద్ధులను మార్చలేము కదా.
మరి మనిద్దరం బానిసలమా స్వేచ్చా జీవులమా 
ఈ వయసులో చెప్పాలంటే మనిద్దరం బానిసలమే ఎవరికీ మనపిల్లలకా 
కాదు ఆదేవునికి    
చాలండి ఈ జీవితం " మీకు నేను, నాకు మీరు" కలసి ఆదైవాన్ని పార్ధిద్దాం పుడమితల్లి భరించి నంతకాలం ధర్మాన్నిరక్షించుదాం. మీరేమంటారు 
ఇక నేనదేముంది ఆదేవుని లీలల్లో మనము ఒక భాగమే అనుకుంటా ?
అవునా 
అవునంటే అవును కాదంటే కాదు అంతా మీయిష్టమే    
అంతా బాగ చెప్పావు మల్లా మొదలకొచ్చావు
 
నేను మీకు బానిసకదండీ అంటూ కాఫీ తెస్తా అని లోపలకువెళ్లింది శ్రీమతి 
అమ్మయ్యా ఇప్పడికి నాకు స్వేచ్ఛ వచ్చింది అంటూ నాలిక కొరుక్కొని అరిచారు శ్రీవారు  

--(())--
 

నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (15)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమండి మన మనవుడు మనవరాలు వచ్చారండి. 
వస్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు 
ముద్దుగా ఉన్నాయి అయితే ముద్దు  పెట్టుకో, కాని వాళ్ళ ఇంగ్లీషు నేర్చు కోవటానికి మాత్రం ప్రయత్నిచకు.  
పిల్లలను అలా పార్కుకు తీసుకెళ్తాను 
అప్పుడే ఇంగ్లీసు మాటొచ్చింది ఎంచక్కగా తోటకు తీసుకెళ్తున్నాను  చెప్పొచ్చుగా 
సరే అట్లాగేనండి 
మీరు ఆయితే 
డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ❓
అప్పడే తలుపుకు తాళం వేయకండి అని చెప్పే బదులు ఇంగ్లీషు ఒకటి 
 
’ఇందులో ‘కీస్’ కు( తాళం ) అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.
ఇదో పిచ్చి ఎవర్ని ఉద్దరించటానికి 

చక్కగా అమ్మ అని పిలిపించుకొనే రోజులు తగ్గి పోయినాయి, మమ్మి డాడీ  అని పిలిపించు కుంటున్నారు కాలం మారుతున్నది మనతెలుగు చచ్చి పోతున్నది రామచంద్ర ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి. 
ఏమండి పిలిచారా   
పిలవలేదు నేను చెపుతా విను 
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, తలుపుకు  తాళం  వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాటిని తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ? 
 దీనికి కారణం బానిస బతుకుకు ఇంగ్లీషు అవసరమని ప్రభుత్వం చెప్పుటయే, తెలుగుని వాడక పోవుటయే అంతా  మన ఖర్మ.  

మన తెలుగులో మాటలు లేవా ఎందుకు లేవు, చక్క గా  ఉన్నాయి 
కానీ మనం పలకం.

వంటింటిని......కిచెన్ చేసాం. వసారా.....వరండాగా మారింది.ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.
ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు 
ఇంకా వేళ్ళ లేదా 

వెళ్ళలేదండి మీరు ఎందుకో బాధపడుతున్నారండి 
బాధ పడక ఏంచెయ్యాలి కట్టుకున్న పెళ్ళామే బంధువుల్ని గెష్టు లని, భోజనాన్ని లంచ్    అని నేర్చు కొని అంటున్నది .    
మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు అనడం,  .
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు.
భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం.
అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం.బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

సరే నేనొక్కడ్నే ఇక్కడ కూర్చొని ఏమి చేసేది, నేను కూడా  ఆ తోటకొస్తాలే పా 
మా ఆయన ఎంత మంచి వారో 
శ్రీమతి మాట వినకపోతే శ్రీవారికి పస్తు అని ఎవరో కవి చెప్పారు. 
ఎంచక్కా ఆడుకోక ఆ  సెల్లో ఆడుతున్నారు, 
ఏమిటి 
ఏమోనండి వచ్చినపపడి నుండి ఎదో నవ్వుతున్నారు, అరుస్తున్నారు ఎదో గేమ్ ఆ టండి
అదుగో గేమ్ అనకు ఆట అను  
క్షమించండి తప్పు దొర్లింది 
ఎమ్ చ్చేద్దాం పిల్లలని అనలేం, పెద్దవాళ్ళను అనలేం ఎదో కాలం జరిగిపోతుంది కదా 
అవునండి పిల్లలు వెళ్ళేదాకా ఆ ఇంగ్లీసు గొడవ పక్కన పెట్టండి, పిల్లలకు కోపం వస్తుంది. 
అట్లాగేలే వాళ్ళ ముందు ఏమననులే 

మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం పిల్లలు ఆడుకుంటున్నారుగా వాళ్ళని అలా వదిలేద్దామా ఆ ఆటలు మానమని చెప్పొద్దూ 
తల్లి తండ్రులే ఆడ మంటున్నారు మనమే చేయగలం, అమ్మోమ్మా తాతాయ్య అనిపించుకుంటే చాలు 
అది నిజమే 
మీరేదో చెప్పా బొయ్యారు 
నిన్న మన  పక్కింటాయన సీతా రామయ్యగారు  వచ్చి ‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? 

ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్నఅందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

అవునండి మీరన్నది అక్షరాల నిజం 
పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోవాటం లేదండి. 
మనభాషను మరచిపోవద్దని గట్టిగా చెప్పు "మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ" ని మరచినవారు బాగుపడరు అని చెప్పు.   .    
అవునండి 

 ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన.
అవునే పూర్వం పిట్టలదొర ఒకడొచ్చేవాడు నాలుగు బాషాలుమాట్లాడి నమ్మబలికి పాతగుడ్డలుంటే ఇవ్వమని, కొన్ని డబ్బులి ఇవ్వమని అడిగే వాడు, ఇవ్వకపోతే ఎదో రకం గొణిగేవాడు అలావుంది. .
 
ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.
ఏది మారాలంటే ఏంచెయ్యాలి మిరే చెప్పండి 

అందరూ తెలుగుభాషలో చదవాలి, చదివినవారికి ఉద్యోగాలు, ఇవ్వాలి, అమ్మతల్లి (కంప్యూటర్ ) లో తెలుగులోనే వాడాలి ఉత్తరప్రత్యుత్తరాలు మన పాతగ్రంధాలు పిల్లలకు నేర్పాలి "కాశీమజిలీకధలు, తెనాలి రామకృష్ణకధలు, వివేకానంద బోధలు, భారతం, భాగవతం రామాయణం  కధలు అందరికీ చెప్పాలి అదే నాకోరిక 
కలలు కనకండి ఇది అక్షరాల నిజం 
ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది తెలుగుదేశం దద్దరిల్లి పోతుంది. 
ఏమిటండి అలా మాట్టాడుతున్నారు నిద్దరలోనా 
తోటలోకూడా నిద్దరా 
ఒక బాధ  ఉన్న వాడికి నిద్ర ఎక్కడొస్తుందే, ఇది తెలుగు తల్లి ఆత్మ ఘోష నేను నిమిత్తమాత్రుడ్ని 
మీరు బాధపడకండి 
రోజులు మారుతాయి, మంచిరోజులొస్తాయి మన దేశాభివృద్ధికి మనపిల్లలు మనదేశానికే సేవ చేసే రోజులొస్తాయి, ఇక్కడే చదువుతాం, ఇక్కడే బతుకుతాం ఇక్కడ భాషనే మాట్లాడుతాం అని ప్రతిజ్ఞ చేస్తారండి 
ఆరోజులొస్తాయా 
వస్తాయండి 
మిరే చూస్తారు 
చూస్తానా 
దిగుల పడకండి ఆ రాముణ్ణి తలచుకొని హనుమంతుని పిలవండి అన్ని ఆయనే చూసు కుంటాడు అందరికీ మాతృభాషపై ధైర్యం నూరిపోస్తాడు 
ఓం శ్రీరామ్ .. శ్రీ మాత్రేనమ: ...ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా;.. ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమా: 

--(())--   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి