స్త్రీ ,పురుష శృంగారాన్ని శాసించే వారు ఎవ్వరూ లేరు, పెళ్ళికి ముందు శృంగారంపై ఒక ఆలోచన పెళ్లి ఆయన తర్వాత మరో ఆలోచనా, ఆలోచన ఏదైనా పెళ్ళికాకముందు బహిర్గతం పెళ్లైన తర్వాత అంతర్గతం దీనికి మూలం మదనుడు రతి మన్మధులు వీరు వయసుని బట్టి ప్రేరణ ప్రేరేపణ చేయఁటయే వీరి ముఖాయమైన కళ అదికూడా జీవ సృష్టికోసము మాత్రమే అది ఒక ప్రత్యేక కళ ... ఇక చంద్ర కళలు "శృంగార కలాధిపతి చంద్రుడు"
హృదయం చలిస్తుంది, ఆక ర్షించుతుంది, నిద్ద్రపట్టనీయదు, వీర్యస్ఖలనం అయిపోతుంది అనుకుంటారు అదికూడా సృష్టి ధర్మమే ఏది ఏమైనా వయసును బట్టి కొన్ని అలవాట్లు కోరికలు వెంబడిస్తాయి
శృంగార కళకు మనశరీరంలో ప్రేరేపణ ౧౬ భాగాలు ఉన్నాయి మన పూర్వికులు 16 కళలతో
పదహారు రోజులు సర్వ సుఖాలు అనుభవించినట్లు వాత్సాయ నుడు తెల్పినట్టు మనగ్రంధాలు ఉదాహరిస్తున్నాయి. { వాత్సయన శాస్త్రం నుండి }
స్త్రీ ,పురుష షోడశ {16} కళ స్థానములు
స్త్రీ ,పురుష శరీరాలలో ఎక్కడెక్కడ శృంగార కళ స్థానాలు ఉన్నాయో వాత్సయన ముని వివరంగా తెలియజేసారు .
{ 1} బొటన వేలు {2 } కాళీ మడిమ { ౩ } పిక్కలు { 4 } తొడలు { 5 } పిరుదులు {6 } భగము / శిశ్నము {7 } నాభి { 8 } భుజములు {9 } చన్నులు {1 ౦ } చంకలు { 1 1 } చెవులు { 1 2 } చెక్కిళ్ళు { 1 ౩ } ముక్కు { 1 4 } గొంతు [ 1 5 ] అధరములు { 1 6 } తల ఈ పదహారు స్థానాలను మన్మధ కళ స్తానములని పేర్కొన్నారు.
చంద్రుని ప్రేరణ మానవులపై ఉంటుంది అది 16 పురుషులపై 16 రోజులు స్త్రీలపై 16 కళలు
పనిచేస్తాయి అని మన కవులు తెలియ పరిచారు.
చంద్రుడు కృష్ణ పక్షమిలో ఉన్నప్పుడు పాడ్యమి నుండి పురుషులలో కుడి వైపు వరుసగా పైన తెలిపిన ఆయ అంగములలో మన్మధ ప్రేరణ జరుగుతూ ఉంటుంది . అదే విధంగా చంద్రుడు శుక్ల పక్షమిలో ఉన్నప్పుడు పురుషులలో ఎడమ వైపున పై నుండి వరుసగా క్రిందకి ఆయా అవయములలో ప్రేరణలు కలుగుతు దిగుతూ ఉంటాయ్. .
ఈ మన్మధ కళలను గమనించి సక్రమంగా అవగాహనా చేసుకొని భార్య , తన భర్త యొక్క శరీరములో ఆయా ప్రదేశంలో ప్రేరణలు కలిగించి తన వంతు సహకరం అందిస్తూ తును తృప్తి పొంది తన భర్తను కూడా తృప్తి పొందేలా చేయాలనీ మహర్షుల ఆజ్ఞ
1. స్వాధీనపతిక
స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక : (Svadhinabhartruka - "one having her husband in subjection"[2] or Svadhinapatika) "స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు.[3][5] చిత్రకళలో ఈ నాయికను నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు..[3] జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది.[5]
2. వాసకసజ్జిక
వాసకసజ్జిక : (Vasakasajja :"one dressed up for union") [2] వాసకసజ్జిక సుదీర్ఘ దూరప్రయాణం నుండి తిరిగివచ్చే ప్రియుని కోసం నిరీక్షిస్తుంది. చిత్రకళలో ఈమెను పడకగదిలో పద్మాలు, పూలదండలతో ఉన్నట్లు చూపిస్తారు.[3] "సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక". ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం నిరీక్షిస్తుంది.[5] ఈమె అందాన్ని రతీదేవితో పోలుస్తారు.[3] వాసవసజ్జిక శిల్పం ఖజురహో లోని లక్ష్మణ దేవాలయంలోను, జాతీయ సంగ్రహాలయాలలో కనిపిస్తాయి.[5]
3. విరహోత్కంఠిత
విరహోత్కంఠిత: Virahotkanthita - "One distressed by separation") [2] "విరహం వల్ల వేదనపడు నాయిక". ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది. ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు.[3]
4. విప్రలబ్ధ
విప్రలబ్ధ : (Vipralabdha - "one deceived by her lover") [2] "శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక.[3] ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రిస్తారు.[3]
5. ఖండిత
ఖండిత : (Khandita - "one enraged with her lover") [2] "ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక. ఈమెను ప్రియునిపై తిరగబడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు.[3][5]
6. కలహాంతరిత
కలహాంతరిత : (Kalahantarita - "one separated by quarrel") [2] or Abhisandhita) [3] కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక.[5] ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు.[3][5] మరికొన్ని సందర్భాలలో ఈమె ప్రియుని లేదా తానిచ్చిన మధువును తిరస్కరిస్తున్నట్లుగా చిత్రించబడింది. జయదేవుడు గీత గోవిందంలో ఒక సందర్భంలో రాధను కలహాంతరితగా వర్ణించాడు.[5]
7. ప్రోషితభర్తృక
ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక: Proshitabhartruka - "one with a sojourning husband") [2] or Proshitapatika) "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక. ఈమెను చెలికత్తెలు పరామర్శిస్తున్నా దుఃఖంతో చింతిస్తున్నట్లుగా చిత్రిస్తారు.[3]
8. అభిసారిక
అభిసారిక లేదా అభిసారిణి : (Abhisarika - "one who moves") [2] "ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక.[5] ఈమెను ఇంటి ద్వారం దగ్గర లేదా త్రోవలో అన్ని అడ్డంకులను అతిక్రమిస్తున్నట్లు చిత్రిస్తారు.[3][5] చిత్రకళలో అభిసారికను తొందరలో ప్రియున్ని కలవడానికి పోతున్నట్లు చూపిస్తారు.[5]
శృంగార సాహిత్య పద్యాలు 22-11-2020)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ..
కరుణామయ గాధలు కావ్యముగా
సుఖదా వరదా సమ సంతస మే
మనువాడు మనో మయమే కళగా
విరజాజి సుఘందము వేదముగా
మగువే మగధీరుని మచ్చికతో
సమరాన్ని జయించి యశస్సు సుఖా
ల మనస్సు ఉషస్సు లాస్య సమ
త్వ ముఖాలయ దాహము తత్వముగా
చరితం విపులం గ సుచిత్ర ముగా
సు మనోహరమేగ యశస్సు సుధా
మధురం కమతమ్ము సమత్వ విశా
లము విశ్వ జనిత్వ విలోలమ్ముయే
మాఘ మాసము మధురంతొ చరిత తెలుపు
బ్రహ్మ తెలిపేటి వేళలు కలల తలపు
వెన్నెల విరజిమ్ము ట వనిల్లొ హాయి
నేల పువ్వుల పాన్పుగా సుఖము పంచు
సమమైన వరుంది పసే ఒడుపే
సుమమాలనుగా మనసై ఇటురా
గమకాలువలే సరిగా పలుకే
తమకం మరిచే సుమమాధురమే
బిగువున్నది యే సమభోగముయే
తగువైనది యే సమతా వరమే
చిగురించిన దే తలచొచ్చినదే
రగడే వదలొద్దులె రమ్యముయే
వయసే వలపే సమవాదముతో
నయమై తరుణం పనియే ఇదియే
లయయేమియు కోరనులే ఇపుడే
భయమే వలదే ఇది భాష్యముయే
పడితే విలువైనది పంచుటయే
అడుగే పడితే మడుగే చెదురే
పిడుగై చలినే తడిపే కరుణే
పడితే తెలియోచ్చును పంతములే
మధుమాసము సాత్వికమే సమతు
ల్య దమత్వ సమాన కలే సమయో
జ ధనం మనసంత నిజాయితిగా
కదిలే చరితమ్ము నవాభ్యదయం
తరుణమ్ము వినోద కతా చరితం
పరువాల మనో తలపే భరితం
కర సేవలుకే పలికే వినయం
విరజాజుల కాంతి నవాభ్యుదయం
--(())--
*ఛందస్సు ఏకప్రాస వచనాలు
యమునమ్మ కెరటాలనెల రాజునవ్వె
వినయమ్ము మనసార మను రాజు నువ్వె
వచనమ్ము నవజాత కల రాజు నువ్వె
సమయమ్ము వినియోగ రసరాజు నువ్వె
సమయాన వినయమ్ము కల రాణి నువ్వె
విషయాన వచనమ్ము కళ రాణి నవ్వె
ఈడు కుదిరాక... నిన్నే చూస్తూ నిలవలేక
జోడు కలిసాక ... నిన్నే పిలుస్తూ గడపాలేక
మాడు పగిలాక ... నిన్నే అరుస్తూ ఉండలేక
తోడు వదిలాక ... నిన్నే తలుస్తూ బ్రతకలేక
నేడు కదిలాక ... చింత నంతా నిలుప లేక
నాడు ముదిరాక ... నమ్మ లేకా కదల లేక
పాడు పడలేక .. పాఠ్య మంతా తెలుప లేక
గోడు మరిచేను ... గోప్య మంతా మలుపు లేక
కొలమానం లేని ఉపమానాల్ని భరించా
అవమానం చెంది మనువాడిందాన్ని భరించా
శతమానం తిట్లు తిన్న వాడ్ని భరించా
తులామానం లా ఉండలేక ఓర్పు వహించా
నిర్లక్షపు మనుష్యులు నిశ్శబ్దం లోఉన్న
వివక్షత చూపే మనుషులు ఎగిరిపడుతున్న
అక్షరత పొందిన మనుష్యులు మాట్లాడుకున్న
దీక్షతో ధర్మ రక్షణ కోసం నేను వేచి ఉన్న
అంత రంగపు మాటలు అని వార్యమైనా
తరంగపు మాటలు నిలబడ లేకపొయినా
భహిరంగపు చేష్టలు భరించ లేకపోయినా
తురంగము వలే సేవలు అందిస్తూ ఉంటా
ఎప్పుడో నిను కల్సి నా నవ రూపమే నని పించెనే
ఇప్పుడే నిను తల్చినా యువ రూపమే కని పించెనే
చప్పుడే విని వచ్చినా మన మేకమే అని పించెనే
ఎందుకో నిను జూచినా మన మీయగా నని పించెనే
ఎందుకో విన గీతికన్ బ్రణయేశ్వరీ మనమెంచెనే
ఎందుకో ప్రణయమ్ములోఁ జిన నృత్యమున్ మనసాడెనే
సుందరీ నును వెల్గుగాఁ గను సొంపుగా నను గాంచ రా
వీణతోఁ గలరావముల్ దలపించుచున్ బలికించవా
వాణిగా లలితమ్ముగాఁ దెలి భావముల్ జిలికించవా
వేణువై వలయమ్ములో వలపించఁగా గులికించవా
ప్రాణమై యిలపై సదా తొలి శ్వాసగా నలరించవా
ప్రేమయై ఇలలో సదా తను వంతయూ జవిజూపవా
నేడు పుట్టినరోజు సందర్భముగా అందరికీ
ప్రాంజలి ప్రభ పద్య శుభాకాంక్షలు
ఆరుణ కిరణాల వెల్లువ తో
కరుణ కిరణాల చూపులతో
మరులు గొలిపేటి వేకువతో
నరులు పుడుతుండు ధర్మముతో
సర్వం జగద్గురు కృష్ణ మాయే
--(())--
మిశ్రగతి శ్రేణి (4-5) : I I U - I I U I - I U I - I U
మగువే మగధీరుని మచ్చికతో
సమరాన్ని జయించి యశస్సు సుఖా
ల మనస్సు ఉషస్సు లాస్య సమ
త్వ ముఖాలయ దాహము తత్వముగా
చరితం విపులం గ సుచిత్ర ముగా
సు మనోహర మేగ యశస్సు సుధా
మధురం కమతమ్ము సమత్వ విశా
లము విశ్వ జనిత్వ విలోలమ్ముయే
మాఘ మాసము మధురంతొ చరిత తెలుపు
బ్రహ్మ తెలిపేటి వేళలు కలల తలపు
వెన్నెల విరజిమ్ము ట వనిల్లొ హాయి
నేల పువ్వుల పాన్పుగా సుఖము పంచు
ఈ పద్య ఛందస్సుకే ఛిత్తక , భ్రమరావళి , నందినీ అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 1756 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I I U - I I U - I I U
చతుర్మాత్రా శ్రేణి: I I U - I I U - I I U - I I U
షణ్మాత్రా శ్రేణి: I I U I I - U I I U - I I U
మిశ్రగతి శ్రేణి (5-3) : I I U I - I U - I I U I - I U
మిశ్రగతి శ్రేణి (4-5) : I I U - I I U I - I U I - I U
మిశ్రగతి శ్రేణి (5-4) : I I U I - I U I - I U I I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , స , స , స గణములుండును.
శృంగార సాహిత్య పద్యాలు (1 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ..
కళలే కనువిందుయు కేకముగా
ఇలలో జరిపేదియు ఈశ్వరుడే
మలుపే గెలుపే సుకుమారముయే
అలుపే సమభోజన సంతసమే
వరుసే కలిపే మగువే మదనా
పరువే తలమానిక పెత్తనమే
చిరు హాసపు పల్కులు చింతలులే
తరుణాన సుఖమ్ములు తేలునులే
అలకే వలదే పలుకే తెలిపా
తలపే తలపా యుగమే ఇదియే
మలుపే కలలే సమమే వలపే
చిలకా ఇకచెప్పుము కాలమిదే
--(())--
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి