22, నవంబర్ 2019, శుక్రవారం


మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

"దేహిమే పరమేశ్వరం"
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.

3.  నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.

ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.

దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ

" లోకా సమస్తా  సుఖినో భవంతు..!!
--(())--
ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..
--(())--

ప్రాంజలి ప్రభ

మంగళాచరణ పద్యమును చదువుకుందాము.

మేఘైర్మేదురమంబరం వనభువ: శ్యామా: తమాలద్రుమై:,
నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే! గృహం ప్రాపయ |
ఇత్థం నందనిదేశతశ్చలితయో: ప్రత్యధ్వకుంజద్రుమం,
రాధామాధవయోర్జయంతి యమునాకూలే రహ: కేళయ: ||

వాక్యాన్వయరీతిలో ప్రతిపదార్థము
అంబరం = ఆకాశము
మేఘై: = మబ్బులచేత
మేదురం = దట్టముగా క్రమ్ముకొనబడియున్నది.
వనభువ: = అడవి ప్రదేశములు
తమాలద్రుమై: = చీకటి చెట్లచే
శ్యామా: = నల్లగా
( సంతి ) = ఉన్నవి
అయం = వీడు
నక్తం = రాత్రియందు
భీరు: = భయపడు స్వభావము గల వాడు
తత్ = అందువలన
త్వమ్ ఏవ = నీవే
ఇమం = వీనిని
గృహం = ఇంటికి
ప్రాపయ = చేర్చుము.
ఇత్థం = ఈ విధముగా
నంద నిదేశత: = నందుని ఆజ్ఞ వలన
చలితయో: = బయలుదేరినటువంటి
రాధా మాధవయో: = రాధా కృష్ణుల యొక్క
యమునా కూలే = యమునానది యొక్క ఒడ్డునందు ( ఉన్నటువంటి )
ప్రత్యధ్వకుంజద్రుమం = దారిలోని ప్రతి ఒక్క పొదరింటి లోను మరియు ప్రతి ఒక్క చెట్టు క్రిందను
రహ:కేళయ: = ఏకాంతపు విహారములు
జయంతి = జయించుచున్నవి ( సర్వశ్రేష్ఠములై విలసిల్లుచున్నవి ).
భావము
నందుడు  మొదలైన వ్రేపల్లె లోనివారి పరివారములు అన్నియు ఏదో దూరప్రదేశమునకు వనభోజనాలకో లేక విశిష్ట దేవతాపూజలకో వెళ్ళియుండిన సందర్భంలో సూర్యాస్తమానము కాబోవుచున్న సమయమందు నందుడు తన మేనకోడలు అయిన రాధను పిలిచి ఇలా చెప్పాడు. " ఆకాశమునందు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ అడవులన్నియు కూడా చీకటి చెట్లచే నిండియన్నందున నల్లగా చీకటిగా ఉన్నవి. వీడికి ( కృష్ణునికి ) రాత్రియంటే చాలా భయము ( చీకటిగా ఉంటుంది గనుక ). అందువలన ఓ రాధా! నీవే వీనిని ఇంటికి తీసుకుని పొమ్ము. " ఇట్లు నందుడు ఆజ్ఞాపించినందున రాధ కృష్ణుని తీసుకుని బయలుదేరింది. దారిలో యమునానది యొక్క ఒడ్డునందు ఉన్నటువంటి బృందావనమందలి ప్రతి ఒక్క పొదరింటిలోను ప్రతి ఒక్క చెట్టు కింద వారు ఇద్దరూ ఆడుకొనిన రహస్య క్రీడలు సర్వశ్రేష్ఠములై విలసిల్లుచున్నవి.
--(())--

కోవిదో నిధిరాఖ్యాతః  కోప కృష్టోభవేత్పుమాన్
ఇతి ప్రశ్నేను రూపం యత్ ఉత్తరం తత్ ఉదీర్యతాం

కః  విదః  నిధి:  ఆఖ్యాతః   కః = ఎవరు   విదః =జ్ఞానానికి,  నిధి:= నిధి యని
ఆఖ్యాతః = చెప్పబడ్డాడు. జ్ఞానానికి  నిధి ఎవరు?
కః=ఏ,  పుమాన్= పురుషుడు, అపకృష్ట: =హీనుడుగా, భవేత్= అవగలడు? అంటే ఎవడు హీనుడైన పురుషుడు? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానాలు కూడా ఈ వాక్యాలే.
అవేమంటారా? కః, విదః అనే రెండు పదాలను కలిపితే   కోవిదః  అని సమాధానం
జ్ఞానానికి నిధి ఎవరు?కోవిదః అంటే పండితుడు.జ్ఞానానికి నిధిగా చెప్పబడ్డాడు.
అని  సమాధానం.
కః, అపకృష్ట:  అనే రెండు పదాలకూ కోపకృష్ట: =కోపమునకు లొంగిపోయినవాడు లేక దాసుడైపోయినవాడు  అని అర్థం. అనగా కోపమునకు దాసుడైపోయినవాడు హీనుడు.
 అని సమాధానం వస్తుంది. ఈ రెండు ప్రశ్నలకూ రెండు సమాధానాలూ ఆ వాక్యాలే అవుతాయి.ప్రశ్నలే సమాధానాలుగా మారడం ఇందులోని చమత్కారము.
  ('చమత్కారశతం' పుస్తకము నుండి.)

---(())--
దరువేస్కో దెబ్బేస్కో అనే
దడ దడ లాడించే దయావతి
దమ్ముచూపి దుమ్ము లేపుకే
ధన ధన పిపాసి దయావతి

టక్కు టిక్కు చూసి ఠక్కున ఓకే
టిప్ టాపును చూసి చెక్కును ఓకే
ఠిక్ ఠిక్ అంటూ కదిలే గుండె ఓకే
చెక చెకా పని పూర్తి చేస్తే డబల్ ఓకే

కాకున్నా  కైపులో ఉన్నా ఓకేనా
దగ్గున్నా బొగ్గుగున్నా ఓకేనా
గజ్జి ఉన్నా బొజ్జ ఉన్నా ఓకేనా
వియ్యానికి కయ్యినికి ఓకేనా

తప్పు ఒప్పు అనుకోను ఓకే
చెప్పు దెబ్బలు తింటానికి ఓకే
సిగ్గున్న ఆడదానిగా నేను ఓకే
విత్తముంటే చాలు డబుల్ ఓకే

పువ్వులా నల్గినా ఓకేనా
మంచులా కర్గించినా ఓకేనా
అగ్నిలా దహించినా ఓకేనా
అణువణువు అణగతొక్కినా ఓకేనా

ఓకే ఓకే ఓకే ఓకే
మాబతుకుకు ఎప్పుడూ ఓకే
మా జాతి మీ సుఖానికి
ఓకే ఓకే ఓకే ఓకే
--(())+-

వల్లమాలిన ధర్మం నీకొద్దురా
వళ్లు వంచే శ్రమ శక్తి చాలురా
వద్దన్న దాని కోసం ఆరాటం ఎందుకురా
అందు బాటులో  ఉన్న ఆనందం చూడరా

వచ్చేదో రానిదో నీకెందుకురా
వచ్చిన దానిలో తృప్తిని గమనించరా
పరువు అని పాకు లాడకురా
తిండి కూడా దొరకని రోజు వచ్చురా

అతి వినయం చూపుట ఎందుకురా
గుర్తింపు ఉండేటట్లు ఉంటే చాలురా
ఆందరినీ నమ్ముట ఎందుకురా
నమ్మకం వమ్ము చేయక బతకరా

తప్పులు చేయటం సహజంరా
తప్పుని ఒప్పుకోవటం నిజాయితీరా
సలహాలు చెప్పేవారు వెంబడించురా
సందర్భ సలహాలో మంచిని పాటించరా
--(())--

ప్రాంజలి
 ప్రభ  - ఝల్లు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మువ్వ ఘల్లు ఘల్లన్నది
గుండె ఝల్లు ఝల్లన్నది

మంజిర నాదం మైమరి పించే
మయూరి నాట్యం మనస్సు ఊరించే
మత్తు గమ్మత్తుగా చిత్తు చిత్తనిపించే
మంగళకరమైన శుభవేళ అనిపించే

నూతనోత్సాహం పెల్లుబికించే
నవ నారీ హృదయ స్పందన కనిపించే
నవోత్తేజం నరనరాల్లో ఉడికించే
నిర్మల మనస్సు నావలా కదిలించే

మువ్వ ఘల్లు ఘల్లన్నది
గుండె ఝల్లు ఝల్లన్నది

ప్రమదా వనంలో ప్రమిదై
ప్రకృతి ప్రేమకు ప్రధమై
ప్రపంచానికే నవ వెలుగై
ప్రావిన్యతలో మెరుగై

పదనిసలతో పదమై
పలకరింపులో మెరుపై
పల్లకీలో పెళ్లి కూతురే
పరమ పవిత్ర పావనియే

మువ్వ ఘల్లు ఘల్లన్నది
గుండె ఝల్లు ఝల్లన్నది

సమయాన్ని సద్వినియోగం చేసి
సందర్భాన్ని సమన్వయ పరిచి
సమ్మోహాన్ని కన్నుల్లో చూపి
సంశయాన్ని మరిపించే సుందరి

సరిగమలతో స్వరాలు కలిపి
సమయోచిత తెల్విని చూపి
సల్పరింత మనస్సుకు తెలిపి
సన్నిహిత సంబంధం కలిపే

మువ్వ ఘల్లు ఘల్లన్నది
గుండె ఝల్లు ఝల్లన్నది

--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి