18, జనవరి 2019, శుక్రవారం

ఆరాధ్య భక్తి లీల- 75




ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ

UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475
ఆరాధ్య భక్తి లీల- 75

రాముడే గుణమందు - రాముడే రణమందు 

రాముడే తనువందు - రాముడే ఱేఁడే

పాదుడే మనయందు - పాదుడే మనముందు 
పాదుడే కలనందు - పాదుడే ఱేఁడే

పాపమే మనకర్మ - శాపమే మన జన్మ 

రోగమే మన ప్రేమ - మానమే ఱేఁడే
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తత్త్వమే మనబోధ - నిత్యమే మన శోభ

భాగ్యమే మనఆశ - భారమే ఱేఁడే
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
  
మోక్షమే మన భక్తి - మోక్షమే మన రక్తి 
మోక్షమే మనశక్తి - మోక్షమే ఱేఁడే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
   
ప్రేమయే మన ఓర్పు - ప్రేమయే మననేర్పు 
ప్రేమయే మన తీర్పు - ప్రేమయే ఱేఁడే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
 --((**))--



ఆరాధ్య భక్తి లీల- 74 


మోసంబుజేసెడి-మురికికాయంబును

ముచ్చటగాజూచి-మురియకుండ
భక్తి మార్గంబున - నడకలు నేర్పావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మహిమాన్వితంబైన-మానవజన్మంబు

వ్యర్ధంబుగాజేసి-వదలకుండ
ధర్మ మార్గంబున - నడకలు నేర్పావా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

స్ధిరముగావివిజూడ-దేహాదులన్నియు
నీటిబుగ్గలనెడి-నిజముదెలిపి
న్యాయ మార్గంబున - నడకలు నేర్పావా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

చిన్మయరూపుని-చింతనంబునుజేసి

నిజతత్త్వమునుతెల్పి-నియతితోడ 
సతయం పల్కమని - నడకలు నేర్పావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఆత్మనాత్మనుతెలుపుచు-హంససూత్ర

మునుననుసరింపజేయుము-మూలరూప
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
--((**))--



ఆరాధ్య భక్తి లీల- 73   


ఏమి కాలంబు వచ్చినో-ఏమొదేవ! 

మంచి భావంబు నిలుపుచు-మమ్ము నడుపు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నాడులందునమేటి-నాడుతెలుగునాడు

వెలుగులీనెడివాడు-తెలుగువాడు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తెలుగురాదనువాడు-తెలుగువాడేకాడు
తల్లిపాలనుత్రావి-తన్నువాడు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తెలుగుజానపదాలు-వెలుగులీనుపదాలు

జానుతెల్గుపదాలు-జావళీలు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తెలుగుకట్టునుబొట్టుతెలుగుపంచియకట్టు

తెలుగుకేమణికట్టు-తెలుగుపట్టు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నాదుమనసునవెలిగెడి-నాదుతెలుగు

నాదుశ్వాసయుభాషయు-నాదుతెలుగు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తెలుగు గడ్డపై వెలసిల్లి మమ్ము ఆదుకుంటూ 

సకల ప్రాణులకు రక్షణగా నిల్చినావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ధర్మచింతనతో న్యాయమార్గమున 

సత్యం చెప్పుతూ నడుచువారు తెలుగువారు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తెలుగు భాషాభివృద్ధిని దశ దిశలు 
వ్యాపిపంచేసి రక్షణ కల్పించే సప్తగిరివాసా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--


ఆరాధ్య భక్తి లీల- 72  


ఆఖిలాండకోటికి-నాదిదేవుండవై

ఆడించుచుంటివి-అఘవినాశ! 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
  
నిఖిలజగత్తును-నిరుపమానంబుగా 
నిర్మించితివినీవు-నిర్వికార!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సకలభూతములందు-సాక్షివైవెలుగొంది

సంచరించెదవయ్య-సకలవేద్య!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సఖుడవై నిరతంబుసఖ్యంబుచేయుచు

చూచుచుంటివినీవు-సుందరాంగ! 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సృష్టి కర్తవు నీవెగా సృజనచేసి, 

పెంచి, పోషించి, తృంచి నీలో ఐక్యం చేసుకోవా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--


ఆరాధ్య భక్తి లీల -71  


పెంచి పెద్దనుజేసి-ప్రేమను పంచిన

తల్లిదండ్రుల ప్రేమ-తగదిదయ్యె
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కంటికి రెప్పలా-కాచి రక్షించిన

కన్నవారల ప్రేమ-కానిదయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

కాలు కందునటంచు-కలవర పడిపోయి

గుండెలపై మోయ-కూడదయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

బిడ్డపై నిండుగా-పెంచుకొనిన ప్రేమ

పనికిమాలినదయ్యె-పాపమయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మంచి చేసియు - చదువు చెప్పించియు 
గుర్తింపు కరువై కనికరం లేక ఉన్నామయ్యా   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

కన్నా బిడ్డలకే ప్రాణాన్ని - ధారపోసియు 

వయోభారంతో ఉన్నా భారమయ్యామయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--


ఆరాధ్య భక్తి లీల - 7 0 

రచయత: మాలాప్రగడ రామకృష్ణ 

పెద్దల పాదాలకు పూజ చేస్తున్నా   

హృదయాల్ని పరవశింప చేస్తున్నా 
 ప్రేమ పాలనలో లాలింప చేస్తున్నా
సంతోషాలతో ఆనందింప చేస్తున్నా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఇచ్చిపుచ్చుకొనే మాటనమ్మేసి చేస్తున్నా
నిత్యం సంక్రాంతి శోభను అందిస్తున్నా 
నదాల ఉపయోగం క్రమం చేస్తున్నా 
ప్రాణాన్ని నిలిచేట్లు కృషిచేస్తున్నా   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మట్టిలో ఖనిజాల్ని పైకితీస్తున్నా 

ఇంధన సంపదను పెంచేస్తున్నా    
హరితవనాల్ని పెంపచేస్తున్నా 
రోగాలకు విముక్తిని కల్పిస్తున్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సంద్రం అగ్నితో మరగింపచేస్తున్నా 

మేఘాన్ని సృష్టించి వర్షాన్నందిస్తున్నా
ఋతువుల గుణం తెలియచేస్తున్నా    
ఉత్తేజం ఉత్సాహం కల్పింపచేస్తున్నా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--


ఆరాధ్య భక్తి లీల-6 9    

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

“మడిసి బ్రోవ నిలకు వచ్చి మనుపు నొసగు సామి నీకు
ఒడిసి పట్టి గట్టి గాను నొదలు సేయు దేవ నీకు

వెన్న తిన్న మన్ను తిన్న వేడి వేడి బువ్వ నీకు

అన్ను మిన్న కంట పడ్డ యయ్యవంట కన్న నీకు

కుంతి మాత మధ్య సుతుని కోరి రధము నడుపు నీకు

ఇంతి కృష్ణ మాన మెంతొ కృపను నిజము నిల్ప నీకు

కఱకు కంసు దునిమి నట్టి కడిమి దొరకు వందనాలు

పెఱిమ గల్గు దేవ నీకు వేల వేల వందనాలు.”
--((**))--
ఆరాధ్య భక్తి లీల- 6 8  

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని-కీర్తన !

-
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
-
2) అలివేణి తురుమునకు 
హస్తకమలంబులకునిలువు
మాణిక్యముల నీరాజనం
-
3) చరణ కిసలయములకు 
సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు 
అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
-
4) పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
-((**))--


ఆరాధ్య భక్తీ లీల- 6 7  

రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ 

మల్లె పూల నగవది మత్తునే జల్లులే !

కల్లలేని మనసది కరుణనే జూపులే !
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

నల్ల కలువ కనుగవ నటనలే జేయులే !

విల్లు వంటి నడుమది విస్తులే గొల్పులే !
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పిల్ల పలుకదొలకును ప్రేమభరిత సుధలూ !

వెల్లు వెత్తియురుకును విరిసేటి మమతలూ !
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

చిన్న దాని నడకా చిలుకు హృదిని , పగలే !

వన్నె లాడి విరుపూ వలపు లొలుక ,సెగలే !
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
--((**))--
ఆరాధ్య భక్తి లీల - 6 6  
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

పల్లెలన్నీ పచ్చతోరణాల వెల్లువ 

రంగుల రంగవల్లితో పువ్వు లెల్లువ 
ముంగిళ్ళ గొబ్బెమ్మలతో ముచ్చట్లేళ్లువ
హరిదాసు గాణమ్ముతో భక్తి వెల్లువ
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

గంగిరెద్దు ఆటతో సన్నాయి వెల్లువ 

సంపదతో పుంజుపోరు పందాలెళ్లువ
పట్టన వీధులయందు ప్రభలెళ్లువ 
లోగిళ్ల వేడుకలతో హర్షం వెల్లువ
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

బావామరదుళ్లతో సందడి వెల్లువ 

కొత్తబట్టలతో కోరికల వెల్లువ 
కొత్తబియ్యంతో పొంగలి వెల్లువ 
గాలిపటాల పోటీ పిల్లల వెల్లువ
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--
ఆరాద్య భక్తి లీల - 65  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో 
- భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమే  
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

జలంలో పంట పండించే ఆశ ఎంత నిరుపయోగమో

- విష్ణునామము లేని చదువు అంతే నిరుపయోగమే  
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నీటిలో చింత పండుంచే నిజం ఎంత నిరుపయోగమో

మూర్ఖునిపై మొహం పెంచుకుంటే అంతే నిరుపయోగమే    
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో 

శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమే
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఆకాశ కురవని మేఘము ఎంత నిరుపయోగమో 

మాధవ కాక వేరే తలపు అంతే నిరుపయోగమే
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమో  

శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--


ఆరాద్య భక్తి లీల - 64  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అడవిని కాచిన వెన్నెల ఎంత నిరుపయోగమో 

- భక్తి లేని సంపాదన ఉన్నా అంతే నిరుపయోగమూ   
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఏనుగు స్నానం చేసి దొర్లటం ఎంత నిరుపయోగమో
- అశాంతితో ఏ కథ విన్ననూ అంతే నిరుపయోగమూ  
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ప్రకృతి పొందక వికృతితో ఎంత నిరుపయోగమో

- దైవముపై కాక అన్య ప్రేమ అంతే నిరుపయోగమూ
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మగడు లేని మగవ ప్రేమ ఎంత నిరుపయోగమో

- మాధవుని తప్ప అన్య ప్రేమ అంతే నిరుపయోగమూ
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఎడారి నీడ ఎండమావులు ఎంత నిరుపయోగమో
- తపం దానము చేయని ప్రేమ అంతే నిరుపయోగమే 
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సముద్రంలో పడేటి వానలు ఎంత నిరుపయోగమో

-వైకుంఠుని గోరని కోరిక అంతే నిరుపయోగమే
కదా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))__


వైకుంఠ ఏకాదశి విశిష్టత :
ఆరాధ్య భక్తి లీల- 63   
మల్లాప్రగడ రామకృష్ణ  

చిరునవ్వుల చిద్విలాసుని, చూదము రారండి 

జన్మ జన్మాల పాపములన్నీ, తొలగును రండి 
ముక్కోటి ఏకాదశికీ, మూడు కోట్ల దేవతలొస్తారండి
మహావిష్ణువు దర్శింస్తే, మది ఉల్లాసభరిత మండి

ఏకాదశి ఉపవాసం, ద్వాదశి భోజనం తినాలండి     

పూజ, జపం, ధ్యానం, పురాణ పఠనం చేయండి 
చిరునవ్వుల చిద్విలాసుని, చూదము రారండి 
జన్మ జన్మాల పాపములన్నీ, తొలగును రండి 

 స్త్రీ సాంగత్యం, పొందకుండా ఉండాలండి    

అబధ్ధం ఆడకుండా, ధర్మంగా నడవాలండి 
చెడ్డ ఆలోచనలు, దుష్ట పనులు చేయకండి 
ముక్కోటి రాత్రంతా, జాగరణ చేసి తరించండి 

చిరునవ్వుల చిద్విలాసుని, చూదము రారండి 

జన్మ జన్మాల పాపములన్నీ, తొలగును రండి 
అన్నదానం చేస్తే, పితృదేవతలకు సంతోషమండి 
వైఖాణుడనే రాజు, ఏకాదశ వ్రతం చేసి మోక్షమొందాడండి 

విష్ణువుకు అమ్మవారు తోడై, మురాసురున్నీ సంహరించినరోజండి 

దుష్టులను సంహరించిన రోజే ఏకాదశిగా మారిందండి 

చిరునవ్వుల చిద్విలాసుని, చూదము రారండి 

జన్మ జన్మాల పాపములన్నీ, తొలగును రండి 

--((**))--

1U1UU11U1U1U (ఛందస్సు )
ఆరాధ్య భక్తి లీల (62 )
మల్లాప్రగడ రామకృష్ణ  

భవాయ భవ్యాయ భజే భజే నమో 
ధరాయ ధర్మాయ భజే భజే నమో 
హరాయ హర్యాయ భజే భజే నమో
నమో నమస్తే స్తు నమో నమోస్తుతే
శ్రీశ్రీ శ్రీ తిరుమల తిరపతి వేంకటేశా 

కృపాయ కృష్ణాయ శుభా శుభే నమో

ఏకాదశీ దర్శన మోక్ష దీపమే 
సమస్త లోకం సుఖప్రాప్తి దివ్యవై  
నమో నమస్తే స్తు నమో నమోస్తు తే 
శ్రీశ్రీ శ్రీ తిరుమల తిరపతి వేంకటేశా 

తరించు రోజాయె మనస్సు వేదమై  

జపించు వైకుంఠ రమా ప్రియా ప్రియా 
తపించు తన్మాయ సుతా సుఖా మయా  
నమో నమస్తే స్తు నమో నమోస్తు తే 
శ్రీశ్రీ శ్రీ తిరుమల తిరపతి వేంకటేశా 
     
సమాయ సత్వాయ నమోగుణా నమో    
వరాయ వర్వేషు వరావరాయ వై
సురా సురాణాం వరదాయినే యనే
నమో నమస్తే స్తు నమో నమోస్తు తే 
శ్రీశ్రీ శ్రీ తిరుమల తిరపతి వేంకటేశా 
--((**))--



ఆరాధ్య భక్తి లీల 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నీటి కొలది తామర పువ్వు అయినట్లే, భక్తి కొలది ఫలం అందిస్తావు    

చెట్టు కొలది పక్షులు ఉండి కనునట్లే, శక్తి కొలది తపం అందిస్తావు 
మొగ్గ కొలది పువ్వులు ఉండి విరినట్లే, యుక్తి కొలది జపం అందిస్తావు 
భార్య కొలది నవ్వులు ఆశ పడినట్లే, ముక్తి కొలది వరం అందిస్తావు 

పిండి కొలది రొట్టెలు కోరి తినినట్లే, ప్రేమ కొలది ఫలం అందిస్తావు 

నూనె కొలది దీపము వెల్గి కనినట్లే, జన్మ కొలది ఫలం అందిస్తావు     
ఆశ కొలది కోపము కోరి అని నట్లే, కర్మ కొలది ఫలం అందిస్తావు 
త్రాసు కొలది సత్యము పల్కి కని నట్లే, కర్త కొలది ఫలం అందిస్తావు 

ఎంత కొలది నిత్యము అంతె వినినట్లే. విశ్వ కొలది ఫలం అందింస్తావు  

శాంతి కొలది పత్యము అంతె తిని నట్లే, దివ్య కొలది ఫలం అందిస్తావు   
కాంతి కొలది వెన్నెల నీడ చవి నట్లే, నీడ కొలది ఫలం అందిస్తావు 
బ్రాంతి కొలది కన్నెల వేట చవినట్లే, వేట కొలది ఫలం అందిస్తావు        

తలపులు కొలదుల భజింతురు 

నిముషము మనసున సేవింతురు
ఘనమని తలచిన ప్రేమింతురు  
మరువను మనసున వెంకటేశా 
--((**))--    




ఆరాధ్య భక్తి లీల- 61
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఆశ కొలది కోపము కోరి అని నట్లే,
కర్మ కొలది ఫలం అందిస్తావు
త్రాసు కొలది సత్యము పల్కి కని నట్లే,
కర్త కొలది ఫలం అందిస్తావు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఎంత కొలది నిత్యము అంతె వినినట్లే.
 విశ్వ కొలది ఫలం అందింస్తావు
శాంతి కొలది పత్యము అంతె తిని నట్లే,
దివ్య కొలది ఫలం అందిస్తావు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

కాంతి కొలది వెన్నెల నీడ చవి నట్లే,
 నీడ కొలది ఫలం అందిస్తావు
బ్రాంతి కొలది కన్నెల వేట చవినట్లే,
 వేట కొలది ఫలం అందిస్తావు      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తలపులు కొలదుల భజింతురు
నిముషము మనసున సేవింతురు
ఘనమని తలచిన ప్రేమింతురు
మరువను మనసున ఎప్పుడూ
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--  






ఆరాధ్య భక్తి లీల- 60  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నీటి కొలది తామర పువ్వు అయినట్లే,

 భక్తి కొలది ఫలం అందిస్తావు    
చెట్టు కొలది పక్షులు ఉండి నట్లే,
 శక్తి కొలది తపం అందిస్తావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మొగ్గ కొలది పువ్వులు ఉండి విరినట్లే,

 యుక్తి కొలది జపం అందిస్తావు 
భార్య కొలది నవ్వులు ఆశ పడినట్లే,
 ముక్తి కొలది వరం అందిస్తావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పిండి కొలది రొట్టెలు కోరి తినినట్లే, 

ప్రేమ కొలది ఫలం అందిస్తావు 
నూనె కొలది దీపము వెల్గి కనినట్లే, 
జన్మ కొలది ఫలం అందిస్తావు     
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా



ఆరాద్య భక్తి లీల - 59   

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

భావము : భగవంతుడు ఊరికే మనకు దర్శన మివ్వడు కదా. ఏదైన కారణం వుండాలి.

ఆశించి చేస్తారు కొన్ని, ఆశించకుండా ఇస్తారు కొన్నీ 

అనుకొన్న దొక్కటి, అయ్యే దొక్కటిగా వాపోతారు కొన్నీ   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా 
 దైవదర్శనం ఉట్టి పుణ్యాన రాదు, కారణాలు కొన్నీ 
అల్పలు, అధికులు, ప్రతిఒక్కరూ మొక్కుతారు కొన్నీ 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

అసురులు భూమిపై పుట్టి హింసాత్మక చేష్టలు కొన్నీ

అసురులను సంహరించుటకు అవతారాలు కొన్నీ     
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

నిత్యమూ కాంక్షించే, కన్నులకు శుభసూచనలు కొన్నీ

మనస్సున భ్రమలు తొలగి, ఆశయాల నీడలు కొన్నీ   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

--((**))--


ఆరాద్య భక్తి లీల - 58   


రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆచరించరు ఎప్పుడూ అన్నీ, ధర్మాలు వింటారు కొన్నీ
ధన్యులమై ధర్మంగా, నిలవాలని వేడుకలు కొన్నీ 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

శ్రీ వేంకటేశ్వరా, నీభక్తులు చేస్తారు పూజలు కొన్నీ 

నీ భక్తుల హృదయంలో, ఉంటావని నమ్మకాలు కొన్నీ  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

నీ కధలతో మన:శాంతిని, పొందే జీవితాలు కొన్నీ

అన్నీ నీవేనని నమ్మిన మనిషి ప్రార్దనలు కొన్నీ    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

ఆశించి చేస్తారు కొన్ని, ఆశించకుండా ఇస్తారు అన్నీ 

అనుకొన్న దొక్కటి, అయ్యే దొక్కటిగా వాపోతారు అన్నీ   


శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా

--((**))--
ఆరాద్య భక్తి లీల - 57   

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చూడు అటుచూడు 
ఆ కనిపించేది శ్రీ హరివాసము 
ఏడుకొండలా మయము 
సంతృప్తి పరిచే దైవమందిరము !!

అదే శ్రీ వేంకటేశ్వరా నిలయము  

అదియే దేవతల కపు రూపము 
అదియే  సకల ప్రపంచ ప్రజలకు 
మొక్కులు తీర్చే ఆనంద మయము 

చెంగట ఉండు సుఖ సంతోషము  

శాంతి సంపద అందించే సౌఖ్యము 
బంగారు శిఖరాల పుణ్య ధామము 
నిత్యకళ్యాణ నిర్మల ప్రాంతము 

కైవల్యము చెందే సుమ వాసము

సిరి సంపద లందించే నివాసము   
పాపములు తొలగించే పావన మయము 
నిత్య దర్శనమిచ్చే ఆనంద నిలయము 

చూడు అటుచూడు 

ఆ కనిపించేది శ్రీ హరివాసము 
ఏడుకొండల మయము 
సంతృప్తి పరిచే దైవమందిరము !!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల రుపతి వేంకటేశ

--((**))--
ఆరాద్య భక్తి లీల - 56   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఏమైతేనేమి, ఏదైతేనేమి, 
మనస్సు తృప్తి పరిచే హరి కీర్తనలే     

అల్లంత దూరాన ఆకాశ వీధిలో 

అలుపెరగని ఆదిత్యుని లా
అనంత సౌభాగ్య సీమలో  
అమృతం పంచే శ్రీపతిలా 
శ్రీ రి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

అనుకువతో ఉన్న నిర్మలత్వలో 

ఆదరణ చూపే హృదయంలా 
అచ్చమైన జ్ఞాని మనస్సులో 
ఆదినారాయణ రక్షణ లా 
శ్రీ రి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు

ఆశ్చర్యం పొందే సంఘటనలో 

అర్ధం కాని ప్రశ్నకు జవాబులా 
అక్కరకు రాని చుట్టపు వేధింపులో 
ఆశలు చిగురిమ్పచేసే సమాధానములా 
శ్రీ రి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు

అక్షర సందేశం వృద్ధిలో 

అఖండకోటి బ్రహ్మాండ నాయకునిలా
ఆరాధ్య హృదయ సీమలో 
ఆదినారాయణుని నిత్య దీవెనలే     
శ్రీ రి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు

ఏమైతేనేమి, ఏదైతేనేమి, 

మనస్సు తృప్తి పరిచేది 
శ్రీ రి శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు     



--((**))--
No photo description available.
ఆరాద్య భక్తి లీల - 55   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో 

- భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమూ  
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

జలంలో పంట పండించే ఆశ ఎంత నిరుపయోగమో

- విష్ణునామము లేని చదువు అంతే నిరుపయోగమూ  
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

నీటిలో చింత పండుంచే నిజం ఎంత నిరుపయోగమో

మూర్ఖునిపై మొహం పెంచుకుంటే అంతే నిరుపయోగమూ    
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో 

శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

ఆకాశ కురవని మేఘము ఎంత నిరుపయోగమో 

మాధవ కాక వేరే తలపు అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమో  

శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 
--((**))--


ఆరాద్య భక్తి లీల - 54   

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అడవిని కాచిన వెన్నెల ఎంత నిరుపయోగమో 

- భక్తి లేని సంపాదన ఉన్నా అంతే నిరుపయోగమూ   
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

ఏనుగు స్నానం చేసి దొర్లటం ఎంత నిరుపయోగమో

- అశాంతితో ఏ కథ విన్ననూ అంతే నిరుపయోగమూ  
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

ప్రకృతి పొందక వికృతితో ఎంత నిరుపయోగమో

- దైవముపై కాక అన్య ప్రేమ అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

మగడు లేని మగవ ప్రేమ ఎంత నిరుపయోగమో

- మాధవుని తప్ప అన్య ప్రేమ అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

ఎడారి నీడ ఎండమావులు ఎంత నిరుపయోగమో

- తపం దానము చేయని ప్రేమ అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 
  
సముద్రంలో పడేటి వానలు ఎంత నిరుపయోగమో
-వైకుంఠుని గోరని కోరిక అంతే నిరుపయోగమూ
అన్నారు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

--((**))--
ఆరాధ్య భక్తి లీల-53
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కిరణ చక్రములా విలసిల్లు వాడు 
నిగ్రహా నిగ్రహం కల్పించువాడు 
సత్యగుణ సంపన్నుడైన వాడు 
సర్వాంతర జ్ఞాన స్వరూపుడు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు  

సింహగర్జన చేయువాడు 

సూర్యరూపమున భాసిల్లు వాడు 
సత్యగుణ సంపన్నుడు 
సత్యము వళ్ళ జ్ఞానము ఇచ్చువాడు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు  

సకల భూతములందున్న వాడు

సాధకులను రంజింప చేయువాడు 
మృగాల్లో సింహం లాంటి వాడు 
దుర్మార్గులను భయ పెట్టువాడు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 

అవినీతి పరులను హింసించు వాడు 

క్రోదాది దుష్టగుణాల్ని చంపు వాడు 
సంకీర్తనా పరులను రక్షించువాడు
సమస్తలోకాలను జాయించినవాడు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు  

--((**))--




ఆరాధ్య భక్తి లీల- 51  
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

నిన్నే నమ్మి కోరుతున్నా  
మామద్యవత్యాసాన్ని కల్పించావు  
ఎన్నో ఎన్నెన్నో వింతలూ చూపినావు 
మీమీద భక్తి ఎప్పటికి మారదు, 
మీరే మాకు దైవం  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తొలి మలుపు మాయతో మన్నే కర్పించావు  
చెలి తలుపు సేవే జున్నే తిన్పించావు     
మలి గెలుపు నేర్పే వన్నే కల్పించావు   
కలి నుండి మనస్సును మార్చి ఆడించావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

లత సొయగము చూపి మత్తు కల్పించావు    
చిరు నగవుల రూపం నన్నాకర్షించావు  
తరు మెరుపుల రూపం కళ్ళే తెర్పించావు 
పలు పలుకుల మౌనం ముప్పే తెప్పించావు       
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

గగనకుసుమ కార్యం స్వేశ్చ కల్పించావు  

మగువతెలివి సౌర్యం ధైర్యం కల్పించావు  
మగనిమనసు మౌనం హాస్యం కల్పించావు  
మనిషి మనిషి మధ్య మౌడ్యం  కల్పించావు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నిన్నే నమ్మి కోరుతున్నా  

మామద్యవత్యాసాన్ని కల్పించావు  
ఎన్నో ఎన్నెన్నో వింతలూ చూపినావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 


--((**))--




ఆరాద్య భక్తి లీల - 52   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

దేవతలను రక్షించంచటం,

రాక్షసుల్ని శిక్షించటం నీవంతే  
శరణని ప్రార్ధించిన వారి బ్రతుకు
వ్యర్థం కాకుండా చూడుట నీవంతే     
వేదార్ధం తప్పుగా, అర్ధం చేసుకోన్నా 
స్వార్ధం చేరకుండా చూడుట నీవంతే
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశా 

పండితుడై సరిగా చదవక

తర్కానికి దిగినా రక్షించుట నీవంతే  
పాడిత్యం వంటిది బాగా తెల్సనీ 
అడవిలో దారి తప్పి తిరిగే తెల్వి నీవంతే  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశా 

శరణుజొచ్చి ఆరాధించని వాని 

బ్రతుకు స్వార్ధంతో ముంచినా నీవంతే  
దేవుడు లేకుండా ఖాళి జోలెతో చేసే పూజ  
ఫలమివ్వని తరువు కూడా నీవంతే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశా 

పంటకు నీరుపెట్టి, మందు వేయు వంటిది 

సముద్రం లో నడిపే, నావికుడు లేనీ, పడవ నీవంతే 
పరమేశ్వరునిపై భక్తీ,  కుదరనీ  బతుకు నీవంతే  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశా 

చక్కగా ధర్మం బోధించే, మంచివారు లేనీ  సభ నీవంతే  

శ్రీ వేంకటేశ్వరునీ మహిమలు చెప్పనీ  కధ నీవంతే 
సందడి చేసియు దక్షణలు చాలనీ యజ్ఞము నీవంతే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశా 

--((**))__








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి