16, అక్టోబర్ 2018, మంగళవారం

నేటి సాహిత్యం -2



ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

మధురమైన మాటలు చాలు పసిడి వీణ కదలటానికి
మనస్సుకు సుస్వరాలు చాలు హృదయవీణ కదలటానికి

మౌనగానం ఆచ్చాదన చాలు తనువు వీణ  కదలటానికి
పరిమళించు లతలు చాలు మానస వీణ కదలటానికి     

ఆనందపరిచే పదాలు చాలు ప్రేమ వీణ కదలటానికి 
మైమరిపించే చూపులు చాలు చెలిమి వీణ కదలాటానికి 

కళ నెరవేరితే చాలు శక్తి కళా వీణ కదలటానికి  
కల సమభావము ఐతే చాలు ముక్తి వీణ కదలటానికి  

వేణుగాణ రవళి చాలు 
సోయగ మెరుపులు చాలు 
మనస్సు అర్దముచేసుకుంటే చాలు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా   


నేటి సాహిత్యం: pranjali prabha .com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఇష్టం లేని సమయంలో ఏది పెట్టినా గరళం లా ఉంటుంది  

కష్టం ఉన్న సమయంలో ఏది పెట్టినా అమృతంలా ఉంటుంది   
నష్టం ఉన్న సమయంలో అదుకోనినా దైవంలా ఉంటుంది 
పట్నంలో ఉన్న సమయంలో చూపులైనా స్వర్గం లా ఉంటుంది

మనిషి గాయానికి మందు కాయానికి అద్దంలా ఉంటుంది    

జననీ జనకుల మాట కొందరికి శాపంలా ఉంటుంది 
కుటుంబం బ్రతికిచే అమ్రుతభావమే బంధంలా ఉంటుంది  
మాయకు లొంగే వానికి ఎన్ని విన్న ఎడారిలా ఉంటుంది  

విరహంతో మొహానికి దాసోహమే  ప్రేమలా ఉంటుంది 

నమ్మకంతో చేసేపని కష్టంలో కూడా ఇష్టంలా ఉంటుంది
తల్లి తండ్రుల ప్రేమ బిడ్డలపైన విశ్రాంతిలా ఉంటుంది   
బార్యమాట భర్తకు నిత్యం చింతామణి మకుటంలా ఉంటుంది  

--((**))--





నేటి కవిత:నేటి సాహిత్యం / Pranjali Prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

కోపానికి మందేదో తాపానికే సరిగ తెలుసు   

తాపానికి మందేదో మనసుకే సరిగ తెలుసు 
మనసుకి మందేదో వయసుకే సరిగ తెలుసు 
వయసుకి మందేదో మహిళకే సరిగ తెలుసు 

అసలు సరుకేదో వ్యాపారికే సరిగ తెలుసు  

ప్రశాంతత చోటేదో ఖాళీకే సరిగ తెలుసు 
సిగ్గుల అలజడేదో ఓనీకే సరిగ తెలుసు   
కమ్మని రుచియేదో నాలుకకే సరిగ తెలుసు 

పెళ్లి సందడేదో ప్రేమికులకే సరిగ తెలుసు   

సంతోష ఉత్సవమేదో రాజీకే సరిగ తెలుసు  
చీకట్లో సందడేదో వెన్నలకే సరిగ తెలుసు 
పువ్వుల వాసనేదో నాసికకే సరిగ తెలుసు 

మగణి  దాహమేదో భార్యకే సరిగ తెలుసు  

పాల నీల్ల శాతమేదో హంసకే సరిగ తెలుసు 
బిడ్డలలో  లక్ష్యమేదో తండ్రికే  సరిగ తెలుసు  
బిడ్డలలో ఆకలేదో తల్లికే సరిగ తెలుసు

 --((**))--





ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

పెదాల మధురం పంచుకొని మత్తెక్కించే తొలిముద్దు 

తనువు అణువణువు  తాకి గగుర్పాటు తొలిముద్దు 

గుప్పెడంత గుండెలో రక్తంలా కలిసింది తొలిముద్దు  

తనువును నిలువెల్ల వణికించింది నీ తొలిముద్దు

జీవితం దాసోహం ప్రేమగా మంత్రంవేసేది తొలిముద్దు 

ఏరోజుకారోజు తమకం పెంచేది ఆధరాల తొలిముద్దు   

సహజీవనం తన్మయంగా మార్చేది మన తొలిముద్దు

నేటికీ ఇద్దరు రేపు ముగ్గురు మార్చేది తొలిముద్దు 

ఆశలు తీర్చేది, తొలిముద్దు

ఆశయాలు నిలిపేది తొలిముద్దు
ఆరోగ్యాన్నిచ్చేది తొలిముద్దు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--



స్వయంచాలక ప్రత్యామ్నాయ వచనం ఏదీ అందుబాటులో లేదు.
నేటి సాహిత్యం 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

యవ్వన జఘనాలు విరహంతో పవలింపు గా మారే

వెన్నలలో తనువుపై వలువలు పుత్తడి గా మారే
సరస సల్లాపము కొరకు చిలుక సందడి మారే…
సమ్మోహనా అస్త్రంగా వయ్యారి వలపు సొంపుగా మారే

నితంబాలు ఉవ్వెత్తు ఎగసి పిలుస్తున్నట్లుగా మారే  

ద్రాక్షాగుత్తులు పిండుకోమన్నట్లుగా కులుకుగా మారే
మోకాళ్ళ మడచి పైకెత్తి అందుకోమన్నట్లుగా మారే    
చిరుమందహాస మొముతో వెన్నెల మెరుపుగా మారే

మర్మాలను నేర్చుకో మన్మధా దాహం తీర్చుకో దా మరే   

కేశాలమధ్య ఉన్న పాపిడి బిళ్ళను చూడవా మరే  
ముక్కున ఉన్న ముక్కెర అందం చూసి తరించవా మరే  
వెన్నెల పాన్పులో సుందరాంగి విరహవేదనా మరే  

సరస సల్లాపములతో  మది పులకించాలి మరే

క్రీడా సమ్మతియే నీకు సందేహము వలదు రామరే
ఊహలు నిజం చేస్తా, నిన్ను ఉరృతలూగిస్తా రామరే     
వేడితో కరిగించవా తనువు మంచు గడ్డలా మారే   

మక్కువతో మల్లెలగుబాళింపులను ఆస్వాదించగా  

తనువు తాకినా తపనతో వలువ  జఱిగి పోగా 
చిలక కొట్టుడుకు చిన్నదానిది పలక మారగా 
ఆలింగనముల సవ్వడికి సంతృప్తితో తారుమారే

--((**))--




Pranjali Prabha.com
నేటి సాహిత్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మేఘంలా కదిలే మనసు నాకే ఉంటే

ఇష్టానుసారం కార్చే గుణం  నాకు వస్తుంది
అద్దంలా మారని మనసు నాకే ఉంటే
మాటలు తప్పని పరి స్థితి నాకే ఉంటుంది

నిత్యమూ నవ్వుల మనసు నాకే ఉంటే

బద్ధకం వదిలించే గుణం నాకే ఉంటుంది
దీపంలా వెలిగే మనసు నాకే ఉంటే
చీకటిని తొలగించే గుణం నాకే ఉంటుంది

పరిమళంలా పంచే మనసు నాకే ఉంటే

భ్రమలను తొలగించే గుణం నాకే ఉంటుంది
మధురం పంచే ఈగ మనసు నాకే ఉంటే
నాకు ప్రాణాన్నే రక్షింక్షే గుణం నాకే ఉంటుంది
 
సాలె పురుగులాంటి మనసు నాకే ఉంటే
తప్పకుండా కష్టపడే గుణం నాకే ఉంటుంది
తలితండ్రుల లాంటి మనసు నాకే ఉంటే 
ప్రేమ ధర్మం నిలబెట్టే గుణం నాకే ఉంటుంది

సంసారాన్ని చూసే మనసు నాకే ఉంటే

దేశానికి సేవ చేసే గుణం నాకే ఉంటుంది   
శ్రీమతిని ప్రేమించే మనసు నాకే ఉంటే
 జనకుల ప్రేమపొందే గుణం నాకే ఉంటుంది

--((**))--


నేటి సాహిత్యం
రచయత: మల్లాప్రగడ ఆమకృష్ణ

దుష్ట బుద్ధి, పాపభీతి, తర్క నీతి, ఎవరికొరకు

ద్వేషి ప్రేమ, ద్రోహి చింత, మోసమాయ, ఎవరికొరకు

కాలాన్ని సద్వినియోగం నీ ధర్మం

బంధాన్ని తృప్తి పర్చటం నీ లక్ష్యం
దేశాన్ని రక్షించుకోవటం నీ ధైర్యం
తల్లి తండ్రులను పూజించటమే నీ శక్తి

దుష్ట బుద్ధి, పాపభీతి, తర్క నీతి, ఎవరికొరకు

ద్వేషి ప్రేమ, ద్రోహి చింత, మోసమాయ, ఎవరికొరకు

స్త్రీ రక్షే తృప్తికి మార్గ దీక్ష

స్త్రీ శక్తే  సంతాన మార్గ దీక్ష
స్త్రీ యుక్తే సంపాద మార్గ దీక్ష
స్త్రీ తీర్పే కుటుంబ మార్గ దీక్ష 

దుష్ట బుద్ధి, పాపభీతి, తర్క నీతి, ఎవరికొరకు

ద్వేషి ప్రేమ, ద్రోహి చింత, మోసమాయ, ఎవరికొరకు

నీ నిర్మలత్వం జీవితానికి మలుపు

నీ సహజత్వం ప్రేమించుటకు మలుపు
నీ ఆత్మతత్త్వం ఆరాధించుటకు మలుపు
నీ ప్రేమతత్వం బ్రతికించుటకు మలుపు

దుష్ట బుద్ధి, పాపభీతి, తర్క నీతి, ఎవరికొరకు

ద్వేషి ప్రేమ, ద్రోహి చింత, మోసమాయ, ఎవరికొరకు

--((**))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి