16, ఆగస్టు 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ - భావకవిత్వం -3

ఓం శ్రీ రాo ఓం శ్రీ రాo     ఓం శ్రీ రాo 
ప్రాంజలి ప్రభ - భావకవిత్వం

సర్వేజనాసుఖినోభవంతు

నేల పై నడిచే వెన్నెలమ్మవు నీవు
నింగిపై గాలికి తేలే మెఘానివి నీవు
పృధ్వి పై వెంటాడే ఎండ నీడవు నీవు
ప్రేమతో ప్రత్యుపకారము చేయాలని నేను   

కళ్ళ భాష్యాలేందుకు - చెక్కిళ్ళ వాపెందుకు
గుళ్ళ పై మక్కువెందుకు - ముళ్ళపై శయనమెందుకు
గల్లము ఇచ్చుటెందుకు - వల్లప్ప గిన్చుటెందుకు
కళ్ళ కపటం ఎరుగ నందుకా - కళ్ళు మైకంలో చిక్కినందుకా


తల్లి చేసేది పెళ్ళాం చేయగలదు
పెళ్ళాం చేసేది మాత్రం తల్లి చేయ లేదు
అమ్మని అన్నం అడగటం తప్పులేదు
పెళ్ళాం కొంగు వదిలితే తప్పనక తప్పదు 


నెత్తుటి  కోరల ఎత్తులు చిత్తు  చెయ్
మెత్తటి కురుల వత్తును మత్తు చెయ్ 

కత్తిలాంటి మాటలు చిత్తు  చిత్తు  చెయ్

ఎంతటి వారైనా కాంతా దాసులని గుర్తు చెయ్    


నడక చూస్తె  చిక్ భుక్ రైలా అనిపించింది 
పెదాలు చూస్తె లిప్ లిప్ అంటూ పల్సు రేటు పెరిగింది 

ముఖం చూస్తె లబ్ డబ్ అంటూ హర్టుబీట్ పెరిగింది 

వళ్ళు చూస్తె లవ్ లవ్ అంటూ హెడ్  తిరిగింది  



చిన్న నాటి జ్ఞాపకాలు - మరువలేని తీపి గుర్తులు 
కన్న  వారి ఆశయాలు - తీర్చ వలసిన కోరికలు 

అన్నగారి అమృత పల్కులు - ఆచరణకు మార్గాలు 

కట్టుకున్న వారికోరికలు - తీర్చుటే దాంపత్య ధర్మాలు  


ఎంకి ఇటు రాయే - రాములోరిగుడి ఎల్లోద్దాం 
ఆవుల్ని దూడల్ని కట్టేయే - అత్తోరికి చెప్పి ఎల్లోద్దాం 
 సద్దిమూట కట్టుకొని రాయే - సరదాగా ఎల్లోద్దాం 
సల్లంగా చూడమని అడగాలి రాయే - సామికి చెప్పుకుందాం 


 'యామినిని'  తరిమై - ' ముత్య మై'  వెలుగు
' కడలిని ' వెతికై  - ' యంత్ర మై ' పరుగు 

'శాంతిని ' కల్పిం చై - 'వెన్న లై'  నలుగు

' కష్టాలన్నీ'  మన మై - 'సుఖా లై' కరుగు

ఊహల్లొ కురిసే పూల జళ్ళు 
మాటల్లో చూపే పన్నీటి జళ్ళు

చేతల్లో చూసి జలధరించే వళ్ళు 

చూసి చూడకుండా  ఉండేవి కళ్ళు  


ఆశలెన్నో  పొంగి  పూస్తున్నాయి 
తలపులెన్నో పరిమళిస్తున్నాయి
కవితలన్నో కదలు చెపుతున్నాయి
తనువు లెన్నో దగ్గిరవు తున్నాయి     


ఇక్కడ అక్కడ ఎందుకు  ప్రేమ
ఎక్కడ కక్కడ ఆగదు ప్రేమ 

మక్కువ తక్కెడ లా ఉండు ప్రేమ 

ఎక్కములా వక్కానిమ్చలేవు ప్రేమ 


ప్రేత్యేక హోదా కోసం ఎందుకు రాజకీయం 
ప్రజాసామ్యంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం 

చేయలేని వారి మాటలకు ఎందుకు ఇస్తారు ప్రాదాణ్యం

ఓర్పు వహిస్తే ప్రేత్యేక హొదా ఇవ్వటం కేంద్రప్రభుత్వ లక్ష్యం 


హోదా వస్తుందో రాదో  అనే శంక కీటకం మీలొ చేర్చద్దు
తల్లి తండ్రులు ఎదిరించి రాజకీయముల్లో పాల్గొనవద్దు 
రాజకీయ చదరంగంలో మీరు పావులు కావద్దు 
అమరావతి నగరం ఏర్పడుతుంది అనుమానం వద్దు    
 --((*))--

ప్రేమతో పలకరింపు(ఇది నా పాట )



రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా 
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా



మబ్బుల వర్షం కరిచింది - మనసు జలదరించింది 

మబ్బుల వర్షం కరిచింది - మనసు జలదరించింది
మరులు కొన్న విరికన్నె - వినయంగా తెలిపింది 
మరులు కొన్న కలువా  - మనసుతో  పలికింది 
  
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా 
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా

లోకమంతా వెతికాను - కళ్ళకు నీవె నచ్చావు 
లోకమంతా వెతికాను - కళ్ళకు నీవె నచ్చావు 
కళ్ళవత్తులతో వెతికాను - కళ్ళను దాటి పోలేవు 
కలవపూలవలె విరిసాను- పరిమళాలు పొందక పోలేవు 
  
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా 
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా

తీరని కోరికలు - తీపి తేనీయులు
వదలని ఆశలు - మరువలేని కలలు 
దొంగలా ఎందుకు - దొబూచులు  
వదలవు లే నిన్ను - వెన్నెల కన్నులు
  
రాక రాక వచ్చావు  - రాత్రి ఉండి పోతావా 
లేక లేక నచ్చావు  - నన్నువదలి పోతావా
--((*))--



   
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి