26, ఆగస్టు 2014, మంగళవారం

172. Romantic Comedy story 76 (Prema sagaram-1)

                                      
                     

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

లవ్ కామెడీ కథ ప్రేమ సాగరం (1) .       
జగన్నాధం గారు  ఆఊరిలొ  ఒక వ్యాపారి, అతనికి ఒక్కడే కొడుకు, అతనిని డాక్టర్  చదివించాడు,  తన వ్యాపారాలను చూసుకుంటాడని గంపెడు ఆశతో ఉన్నాడు.  కాని ఆతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని పట్టు  పట్టాడు. తండ్రి మాత్రము కాదనలేక ప్రేమించిన అమెనిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు. ఒక్క ఆరు నెలలు ఉండమని ఆతార్వత మంచి లగ్గాలు ఉంటాయని చెప్పటం వళ్ళ ఆగ వలసి వచ్చింది  ప్రేమికులకు.

వీల్లకు  తోడుగా, కాపలాగా, నీడలాగ,  వెన్నంటి  ఉండమని జగన్నాదం గారు బ్రహ్మానందం డ్రైవర్ ను  ఆజ్ఞాపించారు. ప్రేమికులు ఎక్కడకు  పోయినా వారి వెంట ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అనుకోని విధముగా ఊరు కానీ ఊరు  పోవలసి వచ్చింది జగదీశ్  కు. ప్రమికురాలు జగదీశ్వరి దారిలో బస్సు చెడి పోవుటవలన లిఫ్ట్ అడిగింది. బ్రహ్మా నందం నడపడం వల్ల  కారు ఆపకుండా వేగంగా పోనిచ్చాడు, కాని జగదీశ్ మాత్రము ప్రియురాలిని చూసి  కారును వెనక్కు తిప్పమని గట్టిగా అరిచాడు. గత్యంతరం లేక కారును వెనక్కి తిప్పి ఆమె ముందు ఆపాడు. సాదరంగా ఆహ్ఫానించాడు జగదీష్ లవర్ని. మేహమాటంగా ఎక్కింది, నేను మా ఊరు  వెళ్ళాలి మీరు ఎక్కడకు వెళుతున్నారు అని అడిగింది, మేము కూడా మీ ఊరు  మీద నుండి  వెళ్ళాలి ఎక్కమని అడిగాడు.

ఇద్దరు ప్రక్క ప్రక్కనే  కరుచుకొని కూర్చున్నారు, బ్రహ్మానందం మాత్రము కారు నడుపుతూ అద్దంలో నుండి  వెనుక సీటులొ  ఏమి జరుగుతున్నదో గమనిస్తున్నాడు. జగదీశ్  చేతులు వెంటనే ఆమె నడుం పై పడ్డాయి, అది గమనించిన జగదీశ్వరి గట్టిగా ఒక దెబ్బ కొట్టింది, ఆ దెబ్బకు జగదీశ్   అరిచాడు, ఆ అరుపుకు  నవ్వు వచ్చింది అందరికి,  ఊరుకోకుండా  తొడ మీద చెయి  వేసాడు అంతే  ఈసారి తోడను గట్టిగా కొట్టింది  కేక పెట్టింది ( కారణం చెయ్ తీసాడు  జగదీశ్) కళ్ళంబడి నీరు తిరిగాయి కోపం వచ్చింది,    వెంటనే చేతులు తీసాడు "జేగదీశ్  " ఇది తప్పు  కాదు మనం కాబోయే భార్య భార్తలం అని చేయి లాక్కొని మరీ హత్తుకో బోయినాడు .  అంతే   " బ్రంహ్మానందం   " షడన్ బ్రేక్ వేసాడు, అంతే  ఒకరి మీద ఒకరు పడ్డారు, ఇదిగో నా ప్రియాతి ప్రియ  మీరు చేసే పనులు చూడ లేకున్నాను, నా మనసు అదుపులో పెట్టలేక పోతున్నాను అన్నది, మీ డ్రైవర్ కు  ఇబ్బందిగా ఉన్నదను కుంటా  నేను  పోతా దగ్గరే మావూరు అన్నది కోపంగా    దిగారు ఇద్దరు, రుస రుసలాడుతూ ముందుకు నడుచు కుంటూ బయలు దేరింది జగదీశ్వరి. వెనుక జగదీశ్ పాట పాడుతూ వెంబడించాడు, కారు నడుపుకుంటూ వెనుక బ్రహ్మానందం వచ్చాడు.              .   

ఓ హేళ, ఓ బేళ, ఓ లైలా , నా మీద కొపమేళ
నీ కళ్ళలో ఉన్నది ఓ మెరుపు
నీ నడుములో ఉన్నది ఓ వలపు
నీ నడకల్లో ఉన్నది ఓ గెలుపు

ఓ తేజ, ఓ నా మన్మధ  రాజ, లేదు లేదు కొపమీవేళ
నీ నవ్వులు నన్ను ఉడికిస్తాయి
నీ చేష్టలు నన్ను మురిపిస్తాయి
నీ మాటలు నాకు వినాలనిపిస్తాయి

ఓ హెళ, ఓ బేళ, ఓ లైలా , నా మీద కొపమేళ
నీ మాటల్లో ఉన్నది ఓ ఎత్తి పొడుపు 
నీ చేతల్లో  ఉన్నది ఓ  మైమరుపు
నీ గుండెల్లో ఉన్నది ఓ తలపు 
    
ఓ తేజ, ఓ నా మన్మధ  రాజ, లేదు లేదు కొపమీవేళ
నీ తోడుగా నేనెప్పుడు ఉంటా
నీ నీడగా నిన్ను అనుకరిస్తూ ఉంటా 
నీకు సర్వ సుఖాలు అందిస్తూ ఉంటా

ఓ హెళ, ఓ బేళ, ఓ లైలా , నా మీద కొపమేళ
నన్ను ఉడికించి మాట్లాడ కుంటావు
నన్ను చూసి నవ్వుతూ కోపగిస్తావు
నన్ను పిలిచి  పిలవ నట్లే ఉంటావు

ఓ తేజ, ఓ నా మన్మధ  రాజ, లేదు లేదు కొపమీవేళ
మూడు  ముళ్ళు భందాన్ని గౌరవిస్తాను
అగ్ని సాక్షిగా నిన్ను వీడి ఎక్కడికి పోను
పెళ్లితో  ఏడడుగుల  భంధంగా  జీవిస్తాను

ఓ హెళ, ఓ బేళ, ఓ లైలా , నా మీద కొపమేళ
నన్ను కనికరించే కన్యా కుమారివి నీవు
నన్ను నవ్వించే నవ్వుల రస రంజనివి  నీవు
నా తల రాతను మార్చే రాజ రాజేశ్వరివి నీవు     

ఓ తేజ, ఓ నా మన్మధ  రాజ, లేదు లేదు కొపమీవేళ
కృష్ణుడిలా చిలిపి చేష్టలు చేస్తున్నావు
నవ్వులతో నా మనసును తోచేస్తున్నావు
నా రాతను మార్చే జగదీశ్వరుడవు నీవు
 .
ఇద్దరు ఒక చెట్టు క్రిందకు  చేరారు,  నామీద నీకు కోపం వద్దు, నీ మీద నాకు కోపం  లేదు అని అన్నడు జగదీశ్,  నేను కూడా అదే చెపుదామను కున్నాను . అప్పుడే రాజేశ్వరి తండ్రి శ్రీ పతిరావుగారు అటు రావటం వీల్లని చూడటం, బాబు నీకు అబ్యంతరం లేకపోతె  ప్రక్కన  స్నేహితుని కూతురి పెళ్లి   జరుగుతున్నది, అక్కడకే మేము వచ్చింది, మీరు రండి అన్నాడు. మావగారు మీరు మరీ వత్తిడి పెడుతున్నారు, అక్కడ వారు ఏమనుకుంటారు మాకు ఇంకా పెళ్లి కాలేదు  అన్నాడు,  గమనించా నేనే నా భందువు అని అందరికి చెపుతాను అన్నాడు. 
 
బ్రహ్మానందం , జగదీశ్ , జగదీశ్వరి తండ్రితో కలసి పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళిలో ఆర్కెష్ట్రా మొదలైంది. వారు పాడుతున్నాప్పుడు బ్రహ్మానందానికి జగదీశ్ మరియు జగదీశ్వరి పాటపాడుతూ ఆడినట్లు ఊహిమ్చుకున్నాడు

నీఒకటి  నేనొకటి కాదులే,  నీ మనసు నామనసు ఒక్కటిలే
కన్నవారి ప్రేమకోరకు నాకోసం ఆగావులే
కన్న కలలు నెరవేర్చు కోక   తప్పవులే
కన్నీరు కనబడక  సంతోషము కనబడునులే .

నీఒకటి  నేనొకటి కాదులే, నీ మనసు నామనసు ఒక్కటిలే
వ్యాపారం వ్యవహారం కోసం ఆగానులే
వలలో చిక్కక వలపు నీకొసమ్ దాచానులే
వయసు మీరక మునుపే నిన్ను చేపడుతానులే

నీఒకటి  నేనొకటి కాదులే, నీ మనసు నామనసు ఒక్కటిలే
నీ ప్రేమకోసం నిద్రలేని రాత్రులు గడిపానులే
నీ నవ్వుల పువ్వుల పరిమాళాలు నా కొసములే
అలల పరుగుల్లా  నా మనసు నీ చుట్టూ ఉరకలే

నీఒకటి  నేనొకటి కాదులే, నీ మనసు నామనసు ఒక్కటిలే
స్తిరమైన కడలిలా, నాకొరకు ఉన్నావులే
మంచితనంతో మనసు నాకొరకు దాచావులే
ఓర్పుతో, ప్రేమతో నాకొరకు వేచి ఉన్నావులే  
నీఒకటి  నేనొకటి కాదులే, నీ మనసు నామనసు ఒక్కటిలే

అప్పుడే ఆర్క్ స్ట్రా ఆపి బ్రహ్మానందం మీకొసమ్ భద్దకస్తుని గురించి ఒక జోకు చెపుతారు, మీరు నవ్వ కండి మరి మరీ చెపుతున్నా నవ్వకండి అన్నారు.

ఇద్దరు భద్దకస్తులు అడవిలో నడుస్తూ అలసి పోయారు, ఒక వైపు ఆకలేస్తుంది, నీరసంగా  ఉన్నాది అందుకని ఒక నేరేడు చెట్టు క్రింద పడుకున్నారు, పైనుంచి పండ్లు  క్రిందకు పడుతున్నాయి, ఇద్దరు కదలక మెదలక అట్లాగే పడు కున్నారు. దారిన పొయ్యే ఒక వ్యాపారి వారిని చూసి దగ్గరకొచ్చి పడిపోయారని ఊహించి పండ్లను ఏరి దగ్గరకొచ్చి ఇవ్వ బోయాడు ఒకతనుకు, ఆతను వెంటనే నోరు తెరచి నోట్లో పెట్టమని మరి చెప్పాడు, ఆ చూపులకు కోప కొమొచ్చి నాలుగు  ఉతికాడు వచ్చినవాడు, రెండవ వాడు ఇంకా ఉతకండి వీడు వట్టి భద్దకస్తుడు,  నా మూతి కుక్క  నాకుతున్నప్పుడు కనీసము అరవనూ లేదు, కొట్టాను లేదు అన్నాడు. 

అంతే  అందరు ఒకటే నవ్వులు కురిపించారు, ఒకటే చప్పట్లు
ఒక దెబ్బల జోకు చెప్పమని కాగితం వ్రాసి ఇచ్చారు ఎవరో, వెంటనే బ్రహ్మానందం జోక్ చెప్పడం మొదలు పెట్టాడు

ఈ పెళ్లి కొడుకు మేడి పండు లాంటి వాడు అన్నాడు,  చెప్పులు విసిరేశారు, ఈ పెళ్ళికొడుకు ఆడపిల్లలను మోసం చేసి అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నాడు అంతే అందరు   వచ్చి బ్రహ్మానందాన్ని ఒక దెబ్బ వేసి వెళ్ళారు, నన్ను జోకు చెప్పనిస్తారా లేదా అని గట్టిగా అరిచాడు,  పెళ్ళికొడుకు ఒక అమ్మాయి తండ్రిని మోసగించటానికి ఇక్కడకు వచ్చాడు అన్నాడు గట్టిగా ఇది నిజం ఇదినిజం అన్నాడు, అక్కడున్న మొగవాళ్ళు వచ్చి నాలుగు ఉతికారు, అప్పుడే పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది, దానిలో నుండి పెళ్లి కూతురు దిగి  ఈ పెళ్ళికొడుకును అరెస్టు చేయండి అన్నాది. పెళ్ళికొడుకుని,  డబ్బుకోసం వాళ్ళతో వచ్చిన నాటకాలు వేసేవారిని అరెష్టు చేసారు.
అప్పుడే పెళ్లి కూతురు తండ్రి ఏమిటమ్మ ఇది అంతా  నాకేమి అర్ధం కావటం లేదు అన్నాడు, నాన్న మా స్నేహితురాలు రాజేశ్వరి నా పెళ్లి గురించి తెలుపగా పెళ్ళికొడుకు గురించి కొన్ని విషయాలు తెలిపింది అవి నిజం అవటం వళ్ళ అతన్ని అరెష్టు చేయాల్సి వచ్చింది, నా పెళ్లి ఆగిందని నీవు దిగులు పడకునాన్న అన్నది, కూతురె ధైర్యముగా నిర్ణయము తీసుకున్న తండ్రికి భయమనేది ఉండదు అన్నాడు.

అప్పుడే రాజేశ్వరి, రాజేశ్,  బ్రహ్మానందం వద్దకు వచ్చారు. ఇదిగో నాలుగు లడ్డులన్నా  తిని వస్తాను అన్నాడు, ఇప్పటిదాకా తిన్నవి సరిపోలేదా అన్నారు.   
పెళ్లి కూతురు తండ్రి మా అమ్మాయి పెళ్లి ఆపి నందుకు నాకు  సంతోషంగా ఉన్నది, మీరు భోజనం చేసి వెళ్ళమన్న వినటం లేదు, అందుకని ఈ ప్యాకెట్లు మీ కారులో ఉంచుతాను, మీరు వీలు చూసుకొని తినండి అన్నాడు , అప్పుడే పెళ్లి కూతురు వచ్చి  ధన్యవాదాలు తెలిపింది.
అప్పుడే కారులో ఎక్కి బయలు దేరారు, అక్కడే ఉన్న ఒక బైరాగి ఈ పాట  పాడుతున్నాడు.   .   

నగ్న సత్యం తెలుసుకోవటానికి శ్రమ పడాలి యువతా
సంపాదన  కాదు కుటుంబాన్ని ఆదుకోవాలి యువతా
పసిడి పై ఆశవద్దు మనసే ముఖ్యం  కావాలి యువతా
లోకం కోసం నీ బ్రతుకును  వ్యర్ధం చేయకు  యువతా

ప్రేమే  సర్వస్వమని నమ్మి భాద పడకు  యువతా       
ఒకరికోసం నలుగుర్ని వదులుట కాదు  యువతా
తల్లి తండ్రులు మాటలు దేవునివాక్కులు యువతా
పెద్దలు, గురువులు చెప్పినవి ఆచరించాలి యువతా .
     
నిగ్రహ శక్తి  పెంచుకొనుటకు ప్రయత్నించు యువతా
నవగ్రహశక్తిని నిగ్రహించుటకు  ధ్యానంచేయు యువతా
బహిర్గత శక్తులకు భయపడి వెను కాడకు  యువతా
అంతర్గత శక్తిని నమ్ముకొని ధైర్యముగా ఉండు యువతా
 .
సంతృప్తిలో సంతోషము ఉన్నాదని  తెలుసుకో యువతా
ఇష్ట పడి చేస్తే కష్టం అనేది లేకుండునని తెలుసుకో యువతా
ఇతరులను పోల్చుకుంటే జీవితం నరకమని తెలుసుకో యువతా
 ఆశలకుపోతే  సంసారం వీధిన పడుతుందని తెలుసుకో యువతా      


--((***))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి