1, మార్చి 2022, మంగళవారం

శివరాత్రి

 10. త్రిగుణములు 

 ప్రతీ జీవిలో త్రిగుణాలు ఉంటాయి. ఆ మూడు గుణాలు......

 తమో గుణం

 రజో గుణం

 సత్వ గుణం. 

 వీటిలో *తామస గుణం - అధమం. అది జంతు గుణం.

 రజో గుణం - మధ్యమం. అది మనుష్య గుణం. *సత్వ గుణం -  ఉత్తమం.ఇది దైవ గుణం. ఈ త్రిగుణాలే నిజానికి ఓ జీవి చేత కర్మలని చేయించి, కర్మ బంధాన్ని కలిగించేవి.

నతదన్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః!

సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేబిస్స్యాత్తృభిర్గుణైః!!

 భావం:-  

ప్రకృతి (మాయ) నించి పుట్టే ఈ మూడు గుణాలు లేనివారు దేవతల్లో కాని, మనుషుల్లో కాని, ఇతర జీవుల్లో కాని లేరు.

సత్వత్సంజాయనే జ్ఞానం రజసోలోభ ఏవచ 

ప్రమాదమోహౌ తమసోభవతో జ్ఞానమేవచ

భావం:- 

సత్వగుణంతో జ్ఞానం ఉత్పన్నమవుతుంది. రజోగుణంతో నిస్సందేహంగా లోభం ఉత్పన్నమవుతుంది. అలాగే తమో గుణంతో పొరపాటు, వ్యామోహం, అజ్ఞానం ఉత్పన్నమవుతాయి.

 ఈ మూడు గుణాలు స్వల్పంగా కూడా లేనిది, అందువల్ల కర్మ అంటనిది,  కేవలం ఒక్క పరమాత్మలోనే. - (గీత 7-12)

 దైవానికున్న నామాల్లో ఒకటి త్రిగుణాతీతుడు. అంటే ఆ మూడు గుణాలు లేనివాడు.

 సాధారణంగా ఈ మూడు గుణాల్లో ఒకటి అధికంగాను, మిగిలిన రెండూ మొదటి దానికన్నా తక్కువ పాళ్ళల్లోనూ వుంటాయి. అంటే కొందరిలో తామస గుణం పాళ్ళు అధికంగా వుండి, సత్వ, రజో గుణాలు తక్కువ పాళ్ళల్లో వుండచ్చు. మరి కొందరిలో రజో గుణం అధికంగా వుండి సత్వ, తమో గుణాలు తక్కువ సాంద్రతలో వుండచ్చు.

ఇంకొందరిలో సాత్విక గుణం ఎక్కువ వుండి, తమో, రజో గుణాలు తక్కువ నిష్పత్తిలో వుండచ్చు. లేదా కొందరిలో వీటి మిశ్రమం సమతూకంలో వుండచ్చు, మనిషి మనిషికీ ఈ గుణాల సాంద్రత నిష్పత్తి మారి, కొందరిలో తమో గుణం అధికంగా, మరి కొందరిలో రజో గుణం అధికంగా, ఇంకొందరిలో సత్వ గుణం అధికంగా వుంటాయి.

 ఇందువల్ల కొన్ని సందర్భాల్లో మనం ఓ గుణానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం. ఇంకొన్ని సందర్భాల్లో ఇంకో గుణానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం. ఉదాహరణకి,  సత్వగుణ ప్రధానుడు, ఆ విషయంలో అతనిలో తామసగుణం ప్రధానంగా పని చేసి, గుప్తదానం ఇవ్వకపోవచ్చు. తామస లేదా రాజసిక దానం చేయచ్చు.

 అలాగే తామస గుణ ప్రధానుడు పాచిపోయిన, పండని, వుడకనివి కాక శుచికరమైనది తినచ్చు. సాత్విక గుణం గలవారు రాజసిక ఆహారాన్ని ఇష్టపడచ్చు. ఇలా త్రిగుణాలు మనిషిలో ఏక కాలంలో పనిచేస్తూండబట్టే ఏ మనిషీ పూర్తిగా మంచివాడు కాడు, పూర్తిగా చెడ్డవాడూ కాడు.

ప్రతీవారిలో రజస్తమో గుణాల ప్రభావంతో కొంత చెడు, సత్వ గుణ ప్రభావంతో కొంత మంచి ఏకకాలంలో వుంటాయి. త్రిగుణాలతో కూడిన ప్రకృతినే మాయ అంటారు.

 పూర్తిగా కర్మలు తొలగి జీవన్ముక్తులైన వారికి, తాము కాక తమలోని గుణాలే కర్మలని చేస్తున్నాయని తెలుస్తుంది. వారు ఆ గుణాలు చేసే కర్మలని సాక్షుల్లా ఉదాశీనంగా చూస్తూంటారు కాబట్టి వారికి ఆ కర్మ బంధం అంటదు.

 భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణత్రయ విభాగ, మోక్షసన్న్యాస యోగాల్లో ఏ గుణం అధికంగా వుంటే ఎలాంటి స్వభావం వుంటుందో వివరించాడు.

(తదుపరి భాగంలో తామస గుణ ప్రభావం గల వారి గురించి...)

*****


🕉️🌞🌏🌙🌟🚩*ఓం నమః శివాయ*

*శ్రీరుద్రాష్టకమ్*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!*


*అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!*



*2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!*


*కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!*



*3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!*


*స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!*



*4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!*


*మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!*



*5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!*


*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!*



*6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!*


*చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!*

 


*7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!*


*న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!* 



*8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!*


*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!*



*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!*



*ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.*


🕉️🌞🌏🌙🌟🚩


*1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!*

*అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!*


*1) నిర్వాణ రూపమైన ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం, వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివసించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.*



*2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!*

*కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!*


*2) నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ), గిరిపై నివసించే వాడు, పర్వతములకు అధిపతి, కరాళుడు (దుష్ట శిక్షణలో), యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం), కృపాకరుడు, గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.*



*3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!*

*స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!*


*3) హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.*



*4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!*

*మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!*


*4) ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు, ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.*



*5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!*

*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!*


*5) ప్రచండుడు (భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు, సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు, జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.*



*6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!*

*చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!*


*6) కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.*



*7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!*

*న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!* 


*7) నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.*



*8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!*

*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!*


*8) ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో! పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.*



*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!*


*శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.*


*ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.*


🕉️🌞🌏🌙🌟🚩

*🌹. మహా శివరాత్రి విశిష్టత - విధి  - శివ మంగళాష్టకం 🌹*

*🍀. మహాశివరాత్రి శుభాకాంక్షలు  అందరికి 🍀*

*ప్రసాద్ భరద్వాజ*


*మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.*


*శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.*


*శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.*


*ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.*


*నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.*


*🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀*


*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*

*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్*

*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*

*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్*

*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*

*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్*

*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*

*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్*

*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*

*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్*

*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*

*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్*

*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*

*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్*

*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*

*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్*

*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*

*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. మహిమాన్విత 108 లింగాలు 🌹*

*ప్రసాద్ భరద్వాజ*


*🍀. ఈ రోజు 108 నామాలు ఒకసారి చదువుకోండి 🍀*


1. ఓం లింగాయ నమః

2. ఓం శివ లింగాయనమః

3. ఓం శంబు లింగాయనమః

4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః

5. ఓం అక్షయ లింగాయనమః

6. ఓం అనంత లింగాయనమః

7. ఓం ఆత్మ లింగాయనమః

8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః

9. ఓం అమర లింగాయనమః

10. ఓం అగస్థేశ్వర లింగాయనమః


11. ఓం అచలేశ్వర లింగాయనమః

12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః

13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః

14. ఓం అపూర్వ లింగాయనమః

15. ఓం అగ్ని లింగాయనమః

16. ఓం వాయు లింగాయనమః

17. ఓం జల లింగాయనమః

18. ఓం గగన లింగాయనమః

19. ఓం పృథ్వి లింగాయనమః

20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః


21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః

22. ఓం ప్రణవ లింగాయనమః

23. ఓం పగడ లింగాయనమః

24. ఓం పశుపతి లింగాయనమః

25. ఓం పీత మణి మయ లింగాయనమః

26. ఓం పద్మ రాగ లింగాయనమః

27. ఓం పరమాత్మక లింగాయనమః

28. ఓం సంగమేశ్వర లింగాయనమః

29. ఓం స్పటిక లింగాయనమః

30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః


31. ఓం సువర్ణ లింగాయనమః

32. ఓం సుందరేశ్వర లింగాయనమః

33. ఓం శృంగేశ్వర లింగాయనమః

34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః

35. ఓం సిధేశ్వర లింగాయనమః

36. ఓం కపిలేశ్వర లింగాయనమః

37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః

38. ఓం కేదారేశ్వర లింగాయనమః

39. ఓం కళాత్మక లింగాయనమః

40. ఓం కుంభేశ్వర లింగాయనమః


41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః

42. ఓం కోటేశ్వర లింగాయనమః

43. ఓం వజ్ర లింగాయనమః

44. ఓం వైడుర్య లింగాయనమః

45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః

46. ఓం వేద లింగాయనమః

47. ఓం యోగ లింగాయనమః

48. ఓం వృద్ధ లింగాయనమః

49. ఓం హిరణ్య లింగాయనమః

50. ఓం హనుమతీశ్వర లింగాయనమః


51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః

52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః

53. ఓం భాను లింగాయనమః

54. ఓం భవ్య లింగాయనమః

55. ఓం భార్గవ లింగాయనమః

56. ఓం భస్మ లింగాయనమః

57. ఓం భిందు లింగాయనమః

58. ఓం బిమేశ్వర లింగాయనమః

59. ఓం భీమ శంకర లింగాయనమః

60. ఓం బృహీశ్వర లింగాయనమః


61. ఓం క్షిరారామ లింగాయనమః

62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః

63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః

64. ఓం మహా రుద్ర లింగాయనమః

65. ఓం మల్లికార్జున లింగాయనమః

66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః

67. ఓం మల్లీశ్వర లింగాయనమః

68. ఓం మంజునాథ లింగాయనమః

69. ఓం మరకత లింగాయనమః

70. ఓం మహేశ్వర లింగాయనమః


71. ఓం మహా దేవ లింగాయనమః

72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః

73. ఓం మార్కండేయ లింగాయనమః

74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః

75. ఓం ముక్తేశ్వర లింగాయనమః

76. ఓం మృతింజేయ లింగాయనమః

77. ఓం రామేశ్వర లింగాయనమః

78. ఓం రామనాథేశ్వర లింగాయనమః

79. ఓం రస లింగాయనమః

80. ఓం రత్నలింగాయనమః


81. ఓం రజిత లింగాయనమః

82. ఓం రాతి లింగాయనమః

83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః

84. ఓం గోమేధిక లింగాయనమః

85. ఓం నాగేశ్వర లింగాయనమః

86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః

87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః

88. ఓం శరవణ లింగాయనమః

89. భృగువేశ్వర లింగాయనమః

90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః


91. ఓం చౌడేశ్వర లింగాయనమః

92. ఓం ధర్మ లింగాయనమః

93. ఓం జోతిర్ లింగాయనమః

94. ఓం సైకత లింగాయనమః

95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః

96. ఓం జ్వాలా లింగాయనమః

97. ఓం ధ్యాన లింగాయనమః

98. ఓం పుష్యా రాగ

102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః

103. ఓం సాలగ్రామ లింగాయనమః

104. ఓం శరభ లింగాయనమః

105. ఓం విశ్వేశ్వర లింగాయనమః

106. ఓం పథక నాశన లింగాయనమః

107. ఓం మోక్ష లింగాయనమః

108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.

🌹 🌹 🌹 🌹 🌹

*🧘‍♂️శివ కవచం🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


అస్య శ్రీ శివకవచ స్తోత్ర\ మహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః ।


అనుష్టుప్ ఛందః ।

శ్రీసాంబసదాశివో దేవతా ।

ఓం బీజమ్ ।

నమః శక్తిః ।

శివాయేతి కీలకమ్ ।

మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ॥


కరన్యాసః

ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః । నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః । మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః ।


శిం శూలపాణయే అనామికాభ్యాం నమః । వాం పినాకపాణయే కనిష్ఠికాభ్యాం నమః । యం ఉమాపతయే కరతలకరపృష్ఠాభ్యాం నమః ।


హృదయాది అంగన్యాసః

ఓం సదాశివాయ హృదయాయ నమః । నం గంగాధరాయ శిరసే స్వాహా । మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ ।


శిం శూలపాణయే కవచాయ హుమ్ । వాం పినాకపాణయే నేత్రత్రయాయ వౌషట్ । యం ఉమాపతయే అస్త్రాయ ఫట్ । భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥


ధ్యానం

వజ్రదంష్ట్రం త్రినయనం కాలకంఠ మరిందమమ్ ।

సహస్రకరమత్యుగ్రం వందే శంభుం ఉమాపతిమ్ ॥

రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః పాలాంతరాలసితభస్మధృతత్రిపుండ్రః ।

పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః ॥


అతః పరం సర్వపురాణగుహ్యం నిఃశేషపాపౌఘహరం పవిత్రమ్ ।

జయప్రదం సర్వవిపత్ప్రమోచనం వక్ష్యామి శైవం కవచం హితాయ తే ॥


పంచపూజా


లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి ।

హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి ।

యం వాయ్వాత్మనే ధూపం ఆఘ్రాపయామి ।

రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి ।

వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి ।

సం సర్వాత్మనే సర్వోపచారపూజాం సమర్పయామి ॥


మంత్రః


ఋషభ ఉవాచ


నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ ।

వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ ॥ 1 ॥


శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః ।

జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయమ్ ॥ 2 ॥


హృత్పుండరీకాంతరసన్నివిష్టం స్వతేజసా వ్యాప్తనభోఽవకాశమ్ ।

అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం ధ్యాయేత్ పరానందమయం మహేశమ్ ॥



ధ్యానావధూతాఖిలకర్మబంధ- శ్చిరం చిదానంద నిమగ్నచేతాః ।

షడక్షరన్యాస సమాహితాత్మా శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ ॥


మాం పాతు దేవోఽఖిలదేవతాత్మా సంసారకూపే పతితం గభీరే ।

తన్నామ దివ్యం పరమంత్రమూలం ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ ॥


సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తి- ర్జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా ।

అణోరణియానురుశక్తిరేకః స ఈశ్వరః పాతు భయాదశేషాత్ ॥


యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం పాయాత్స భూమేర్గిరిశోఽష్టమూర్తిః ।

యోఽపాం స్వరూపేణ నృణాం కరోతి సంజీవనం సోఽవతు మాం జలేభ్యః ॥


కల్పావసానే భువనాని దగ్ధ్వా సర్వాణి యో నృత్యతి భూరిలీలః ।

స కాలరుద్రోఽవతు మాం దవాగ్నేః వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ ॥


ప్రదీప్తవిద్యుత్కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః ।

చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రమ్ ॥


కుఠారఖేటాంకుశ శూలఢక్కా- కపాలపాశాక్ష గుణాందధానః ।

చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ ॥


కుందేందుశంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః ।

త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః సద్యోఽధిజాతోఽవతు మాం ప్రతీచ్యామ్ ॥



వరాక్షమాలాభయటంకహస్తః సరోజకింజల్కసమానవర్ణః ।

త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం పాయాదుదీచ్యాం దిశి వామదేవః ॥


వేదాభయేష్టాంకుశటంకపాశ- కపాలఢక్కాక్షరశూలపాణిః ।

సితద్యుతిః పంచముఖోఽవతాన్మాం ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః ॥


మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌలిః భాలం మమావ్యాదథ భాలనేత్రః ।

నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ నాసాం సదా రక్షతు విశ్వనాథః ॥


పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః కపోలమవ్యాత్సతతం కపాలీ ।

వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః ॥


కంఠం గిరీశోఽవతు నీలకంఠః పాణిద్వయం పాతు పినాకపాణిః ।

దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః వక్షఃస్థలం దక్షమఖాంతకోఽవ్యాత్ ॥


మమోదరం పాతు గిరీంద్రధన్వా మధ్యం మమావ్యాన్మదనాంతకారీ ।

హేరంబతాతో మమ పాతు నాభిం పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే ॥


ఊరుద్వయం పాతు కుబేరమిత్రో జానుద్వయం మే జగదీశ్వరోఽవ్యాత్ ।

జంఘాయుగం పుంగవకేతురవ్యాత్ పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః ॥


మహేశ్వరః పాతు దినాదియామే మాం మధ్యయామేఽవతు వామదేవః ।

త్రిలోచనః పాతు తృతీయయామే వృషధ్వజః పాతు దినాంత్యయామే ॥


పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం గంగాధరో రక్షతు మాం నిశీథే ।

గౌరీపతిః పాతు నిశావసానే మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ ॥


అంతఃస్థితం రక్షతు శంకరో మాం స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ ।

తదంతరే పాతు పతిః పశూనాం సదాశివో రక్షతు మాం సమంతాత్ ॥


తిష్ఠంతమవ్యాద్ భువనైకనాథః పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః ।

వేదాంతవేద్యోఽవతు మాం నిషణ్ణం మామవ్యయః పాతు శివః శయానమ్ ॥


మార్గేషు మాం రక్షతు నీలకంఠః శైలాదిదుర్గేషు పురత్రయారిః ।

అరణ్యవాసాది మహాప్రవాసే పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః ॥


కల్పాంతకాలోగ్రపటుప్రకోప- స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః ।

ఘోరారిసేనార్ణవ దుర్నివార- మహాభయాద్రక్షతు వీరభద్రః ॥


పత్త్యశ్వమాతంగరథావరూథినీ- సహస్రలక్షాయుత కోటిభీషణమ్ ।

అక్షౌహిణీనాం శతమాతతాయినాం ఛింద్యాన్మృడో ఘోరకుఠార ధారయా ॥


నిహంతు దస్యూన్ప్రలయానలార్చిః జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య । శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్ సంత్రాసయత్వీశధనుః పినాకః ॥


దుః స్వప్న దుః శకున దుర్గతి దౌర్మనస్య- దుర్భిక్ష దుర్వ్యసన దుఃసహ దుర్యశాంసి । ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తిం వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః ॥


ఓం నమో భగవతే సదాశివాయ


సకలతత్వాత్మకాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వతంత్రస్వరూపాయ సర్వతత్వవిదూరాయ బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ పార్వతీమనోహరప్రియాయ సోమసూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూలితవిగ్రహాయ మహామణి ముకుటధారణాయ మాణిక్యభూషణాయ సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ దక్షాధ్వరధ్వంసకాయ మహాకాలభేదనాయ మూలధారైకనిలయాయ తత్వాతీతాయ గంగాధరాయ సర్వదేవాదిదేవాయ షడాశ్రయాయ వేదాంతసారాయ త్రివర్గసాధనాయ అనంతకోటిబ్రహ్మాండనాయకాయ అనంత వాసుకి తక్షక- కర్కోటక శంఖ కులిక- పద్మ మహాపద్మేతి- అష్టమహానాగకులభూషణాయ ప్రణవస్వరూపాయ చిదాకాశాయ ఆకాశ దిక్ స్వరూపాయ గ్రహనక్షత్రమాలినే సకలాయ కలంకరహితాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకభర్త్రే సకలలోకైకసంహర్త్రే సకలలోకైకగురవే సకలలోకైకసాక్షిణే సకలనిగమగుహ్యాయ సకలవేదాంతపారగాయ సకలలోకైకవరప్రదాయ సకలలోకైకశంకరాయ సకలదురితార్తిభంజనాయ సకలజగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వతనిజావాసాయ నిరాకారాయ నిరాభాసాయ నిరామయాయ నిర్మలాయ నిర్మదాయ నిశ్చింతాయ నిరహంకారాయ నిరంకుశాయ నిష్కలంకాయ నిర్గుణాయ నిష్కామాయ నిరూపప్లవాయ నిరుపద్రవాయ నిరవద్యాయ నిరంతరాయ నిష్కారణాయ నిరాతంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ

నిర్ద్వంద్వాయ నిరాధారాయ నీరాగాయ నిష్క్రోధాయ నిర్లోపాయ నిష్పాపాయ నిర్భయాయ నిర్వికల్పాయ నిర్భేదాయ నిష్క్రియాయ నిస్తులాయ నిఃసంశయాయ నిరంజనాయ నిరుపమవిభవాయ నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణ- సచ్చిదానందాద్వయాయ పరమశాంతస్వరూపాయ పరమశాంతప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోఽధిపతయే జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగ చర్మఖడ్గధర పాశాంకుశ- డమరూశూల చాపబాణగదాశక్తిభిందిపాల- తోమర ముసల ముద్గర పాశ పరిఘ- భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధభీషణాకార- సహస్రముఖదంష్ట్రాకరాలవదన వికటాట్టహాస విస్ఫారిత బ్రహ్మాండమండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర నాగేంద్రనికేతన మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుభయం శమయ శమయ అపమృత్యుభయం నాశయ నాశయ రోగభయం ఉత్సాదయోత్సాదయ

విషసర్పభయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ త్రిశూలేన విదారయ విదారయ కుఠారేణ భింధి భింధి ఖడ్గేన ఛింద్ది ఛింద్ది ఖట్వాంగేన విపోధయ విపోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణైః సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ అశేష భూతాన్ విద్రావయ విద్రావయ కూష్మాండభూతవేతాలమారీగణ- బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ మమ అభయం కురు కురు మమ పాపం శోధయ శోధయ విత్రస్తం మాం ఆశ్వాసయ ఆశ్వాసయ నరకమహాభయాన్ మాం ఉద్ధర ఉద్ధర అమృతకటాక్షవీక్షణేన మాం- ఆలోకయ ఆలోకయ సంజీవయ సంజీవయ క్షుత్తృష్ణార్తం మాం ఆప్యాయయ ఆప్యాయయ దుఃఖాతురం మాం ఆనందయ ఆనందయ శివకవచేన మాం ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ

హర హర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమః ॥


పూర్వవత్ - హృదయాది న్యాసః ।


పంచపూజా ॥


భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ॥


ఫలశ్రుతిః

ఋషభ ఉవాచ ఇత్యేతత్పరమం శైవం కవచం వ్యాహృతం మయా ।

సర్వ బాధా ప్రశమనం రహస్యం సర్వ దేహినామ్ ॥


యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ ।

న తస్య జాయతే కాపి భయం శంభోరనుగ్రహాత్ ॥


క్షీణాయుః ప్రాప్తమృత్యుర్వా మహారోగహతోఽపి వా ।

సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి ॥


సర్వదారిద్రయశమనం సౌమాంగల్యవివర్ధనమ్ ।

యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే ॥


మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః ।

దేహాంతే ముక్తిమాప్నోతి శివవర్మానుభావతః ॥


త్వమపి శ్రద్దయా వత్స శైవం కవచముత్తమమ్ ।

ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి ॥


శ్రీసూత ఉవాచ


ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివ సూనవే ।

దదౌ శంఖం మహారావం ఖడ్గం చ అరినిషూదనమ్ ॥


పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం పరితోఽస్పృశత్ ।

గజానాం షట్సహస్రస్య త్రిగుణస్య బలం దదౌ ॥


భస్మప్రభావాత్ సంప్రాప్తబలైశ్వర్య ధృతి స్మృతిః ।

స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా ॥


తమాహ ప్రాంజలిం భూయః స యోగీ నృపనందనమ్ ।

ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః ॥


శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసే స్ఫుటమ్ ।

స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ ॥


అస్య శంఖస్య నిర్హ్రాదం యే శృణ్వంతి తవాహితాః ।

తే మూర్చ్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః ॥


ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశకౌ ।

ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ ॥


ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ ।

ద్విషట్సహస్ర నాగానాం బలేన మహతాపి చ ॥


భస్మధారణ సామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసే ।

ప్రాప్య సింహాసనం పిత్ర్యం గోప్తాఽసి పృథివీమిమామ్ ॥


ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ ।

తాభ్యాం సంపూజితః సోఽథ యోగీ స్వైరగతిర్యయౌ ॥


ఇతి శ్రీస్కాందమహాపురాణే బ్రహ్మోత్తరఖండే శివకవచ ప్రభావ వర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః సంపూర్ణః ॥


🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️శ్రీ శివ అష్టోత్తర శత నామావళిః / శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్రీ శివ అష్టోత్తర శత నామావళి*

¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥


ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః (10)


ఓం శూలపాణయే నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంబికానాథాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః (20)


ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారయే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం కృపానిధయే నమః (30)


ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూఢాయ నమః (40)


ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం స్వరమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఓం హవిషే నమః

ఓం యజ్ఞమయాయ నమః (50)


ఓం సోమాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం దుర్ధర్షాయ నమః

ఓం గిరీశాయ నమః (60)


ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషణాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిధన్వనే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తివాససే నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమథాధిపాయ నమః (70)


ఓం మృత్యుంజయాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః (80)


ఓం అహిర్బుధ్న్యాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం స్వాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశవిమోచకాయ నమః (90)


ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరయే నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం హరాయ నమః (100)


ఓం భగనేత్రభిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః (108)


ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా!!


🕉️🌞🌏🌙🌟🚩


*శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం*

¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥


ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః ।

సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః ॥ 1 ॥


జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః ।

హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః ॥ 2 ॥


ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః ।

శ్మశానచారీ భగవానః ఖచరో గోచరోఽర్దనః ॥ 3 ॥


అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః ।

ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః ॥ 4 ॥


మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః ।

మహాఽఽత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః ॥ 5 ॥


లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః ।

పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః ॥ 6 ॥


సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః ।

సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః ॥ 7 ॥


చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః ।

అద్రిరద్\{\}ర్యాలయః కర్తా మృగబాణార్పణోఽనఘః ॥ 8 ॥


మహాతపా ఘోర తపాఽదీనో దీనసాధకః ।

సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః ॥ 9 ॥


యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః ।

సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః ॥ 10 ॥


దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః ।

విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరోఽబలోగణః ॥ 11 ॥


గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ ।

పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః ॥ 12 ॥


కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః ।

అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః ॥ 13 ॥


స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః ।

ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా ॥ 14 ॥


దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ ।

సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః ॥ 15 ॥


అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి ।

ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః ॥ 16 ॥


త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః ।

అహశ్చరోఽథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః ॥ 17 ॥


గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః ।

సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః ॥ 18 ॥


కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః ।

నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః ॥ 19 ॥


బహుభూతో బహుధనః సర్వాధారోఽమితో గతిః ।

నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః ॥ 20 ॥


ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః ।

సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః ॥ 21 ॥


అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః ।

దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా ॥ 22 ॥


తేజోఽపహారీ బలహా ముదితోఽర్థోఽజితో వరః ।

గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః ॥ 23 ॥


న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః ।

సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః ॥ 24 ॥


విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః ।

తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః ॥ 25 ॥


విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః ।

హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ॥ 26 ॥


ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః ।

జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ ॥ 27 ॥


శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ ।

వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః ॥ 28 ॥


నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయోఽగమః ।

ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః ॥ 29 ॥


విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః ।

మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా ॥ 30 ॥


సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః ।

వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః ॥ 31 ॥


త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః ।

బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః ॥ 32 ॥


సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః ।

ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః ॥ 33 ॥


సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః ।

హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః ॥ 34 ॥


లోహితాక్శో మహాఽక్శశ్చ విజయాక్శో విశారదః ।

సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః ॥ 35 ॥


ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః ।

సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః ॥ 36 ॥


సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ।

ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః ॥ 37 ॥


రౌద్రరూపోంఽశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ ।

వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః ॥ 38 ॥


సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః ।

మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః ॥ 39 ॥


పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః ।

ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః ॥ 40 ॥


వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః ।

సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః ॥ 41 ॥


భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః ।

మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః ॥ 42 ॥


వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ ।

ఋతురృతు కరః కాలో మధుర్మధుకరోఽచలః ॥ 43 ॥


వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః ।

బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః ॥ 44 ॥


ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః ।

నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః ॥ 45 ॥


నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః ।

భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః ॥ 46 ॥


చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ ।

లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః ॥ 47 ॥


బీజాధ్యక్శో బీజకర్తాఽధ్యాత్మానుగతో బలః ।

ఇతిహాస కరః కల్పో గౌతమోఽథ జలేశ్వరః ॥ 48 ॥


దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః ।

లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః ॥ 49 ॥


అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ ।

నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః ॥ 50 ॥


బహుప్రసాదః స్వపనో దర్పణోఽథ త్వమిత్రజితః ।

వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః ॥ 51 ॥


మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః ।

అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః ॥ 52 ॥


వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః ।

నీలస్తథాఽంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః ॥ 53 ॥


స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః ।

ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా ॥ 54 ॥


కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః ।

మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః ॥ 55 ॥


మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః ।

మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః ॥ 56 ॥


మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః ।

మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః ॥ 57 ॥


లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః ।

మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః ॥ 58 ॥


మహానఖో మహారోమా మహాకేశో మహాజటః ।

అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః ॥ 59 ॥


స్నేహనోఽస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః ।

వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః ॥ 60 ॥


మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా ।

అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః ॥ 61 ॥


యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా ।

అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః ॥ 62 ॥


ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః ।

నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః ॥ 63 ॥


ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః ।

నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః ॥ 64 ॥


సగణో గణ కారశ్చ భూత భావన సారథిః ।

భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః ॥ 65 ॥


అగణశ్చైవ లోపశ్చ మహాఽఽత్మా సర్వపూజితః ।

శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః ॥ 66 ॥


ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః ।

శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః ॥ 67 ॥


కపిలోఽకపిలః శూరాయుశ్చైవ పరోఽపరః ।

గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః ॥ 68 ॥


పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః ।

తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః ॥ 69 ॥


ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః ।

సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలోఽనలః ॥ 70 ॥


బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః ।

సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహాఽఽయుధః ॥ 71 ॥


బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరోఽధనః ।

అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా ॥ 72 ॥


అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా ।

అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః ॥ 73 ॥


ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా ।

ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః ॥ 74 ॥


ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః ।

ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః ॥ 75 ॥


రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః ।

పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః ॥ 76 ॥


బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ ।

కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః ॥ 77 ॥


సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః ।

దేవదేవః ముఖోఽసక్తః సదసతః సర్వరత్నవితః ॥ 78 ॥


కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః ।

కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః ॥ 79 ॥


వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః ।

సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః ॥ 80 ॥


సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః ।

సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః ॥ 81 ॥


ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః ।

సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః ॥ 82 ॥


భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః ॥ 83 ॥


వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః ।

అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః ॥ 84 ॥


ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః ।

గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః ॥ 85 ॥


హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః ।

ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః ॥ 86 ॥


గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః ।

మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః ॥ 87 ॥


మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః ।

ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః ॥ 88 ॥


తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః ।

సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః ॥ 89 ॥


నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః ।

యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః ॥ 90 ॥


ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః ।

వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః ॥ 91 ॥


శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః ।

అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః ॥ 92 ॥


సమామ్నాయోఽసమామ్నాయస్తీర్థదేవో మహారథః ।

నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః ॥ 93 ॥


రత్న ప్రభూతో రక్తాంగో మహాఽర్ణవనిపానవితః ।

మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః ॥ 94 ॥


ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః ।

సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః ॥ 95 ॥


యుగరూపో మహారూపో పవనో గహనో నగః ।

న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః ॥ 96 ॥


బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః ।

విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః ॥ 97 ॥


వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః ।

ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః ॥ 98 ॥


నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః ।

గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః ॥ 99 ॥


మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః ।

తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః ॥ 100 ॥


ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః ।

ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః ॥ 101 ॥


హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః ।

సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః ॥ 102 ॥


సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః ।

పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః ॥ 103 ॥


బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః ।

పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః ॥ 104 ॥


గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః ।

అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః ॥ 105 ॥


ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః ।

చందనీ పద్మమాలాఽగ్\{\}ర్యః సురభ్యుత్తరణో నరః ॥ 106 ॥


కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః ।

ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః ॥ 107 ॥


వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః ।

మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః ॥ 108 ॥


ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః ।

సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః ॥ 109 ॥


చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః ।

సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితాఽమృతః ॥ 110 ॥


వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః ।

ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః ॥ 111 ॥


కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తోఽహః క్శపాః క్శణాః ।

విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః ॥ 112 ॥


సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః ।

స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః ॥ 113 ॥


నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః ।

దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః ॥ 114 ॥


దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః ।

దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః ॥ 115 ॥


దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః ।

దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః ॥ 116 ॥


దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః ।

సర్వదేవమయోఽచింత్యో దేవతాఽఽత్మాఽఽత్మసంభవః ॥ 117 ॥


ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజోఽంబరః ।

ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః ॥ 118 ॥


విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః ।

ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః ॥ 119 ॥


గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః ।

శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః ॥ 120 ॥


అభిరామః సురగణో విరామః సర్వసాధనః ।

లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః ॥ 121 ॥


స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః ।

సిద్ధార్థః సర్వభూతార్థోఽచింత్యః సత్యవ్రతః శుచిః ॥ 122 ॥


వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః ।

విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః ॥ 123 ॥


శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ॥


ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రం సంపూర్ణమ్ ॥


🕉🌞🌏🌙🌟🚩

 *🧘‍♂️ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం🧘‍♀️*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥



*ద్వాదశ జ్యోతిర్లింగ లఘు స్తోత్రమ్*

¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥


*సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |*


*ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ||*


*పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |*


*సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||*


*వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |*


*హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||*


*ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |*


*సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||*


🕉️🌞🌏🌙🌟🚩


*ద్వాదశ జ్యోతిర్లింగ సంపూర్ణ స్తోత్రమ్*

¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥



*1) సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |*


*భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||*



*2) శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |*


*తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ||*



*3) అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |*


*అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ||*



*4) కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |*


*సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ||*



*5) పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |*


*సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||* 



*6) యం డాకిని శాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |*


*సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||*



*7) శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |*


*శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||*



*8) యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |*


*సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||*



*9) సానంద మానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |*


*వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||*



*10) సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |*


*యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||*



*11) మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |*


*సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ||*



*12) ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |*


*వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||*



*13) జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |*


*స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||*


🕉️🌞🌏🌙🌟🚩


*🚩ద్వాదశ జ్యోతిర్లింగాలు🚩*


¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥


*1. సోమనాధ లింగం (సౌరాష్ట్రం):-*


*పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాధ స్వామి..సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని చంద్రుడు ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.ఈ క్షేత్రం "గుజరాత్ లోని సౌరాష్ట్ర" లో వుంది.*



*2. మల్లికార్జున లింగం (శ్రీశైలం):-*


*ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే', శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక.*



*3. మహాకాళ లింగం (ఉజ్జయిని):-*


*మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో శిప్రా నదీ తీరంలోని (మాళవ) ఉజ్జయినీ నగరంలో వెలసిన క్షేత్రం మహాకాళేశ్వరుడు...సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.*



*4. ఓంకారేశ్వర, అమలేశ్వలింగం (ఓంకారం):-*


*మధ్యప్రదేశ్ లోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాలలో నాలుగవది. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది.*



*5. కేదారేశ్వర లింగం (కేదారనాథ్):-*


*హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో  సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్ర తపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు.*



*6. భీమశంకర లింగం (ఢాకిని):-*


*మహారాష్ట్ర, పూనా లోని భువనగిరి లో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం.*



*7. విశ్వేశ్వర లింగం (వారణాశి):-*


*మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం.*



*8. త్రయంబకేశ్వర లింగం (త్రయంబకం):-*


*మహారాష్ట్ర , నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రం.. బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసిక్ వద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.*



*9. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వరుడు ( వైద్యనాదం, దేవఘర్):-*


*జార్ఖండ్ లోని దేవఘర్ లో జ్యోతిర్లింగంగా వైద్యనాధస్వామిగా వెలసిన క్షేత్రం.. శివుడు ప్రత్యక్షంగా రోగనివారకుడై అనుగ్రహిస్తున్నాడిక్కడ.*



*10. నాగేశ్వర లింగం (ద్వారక):-*


*నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా గుజరాత్ లోని ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.*



*11. రామేశ్వర జ్యోతిర్లింగం (రామేశ్వరం):-*


*తమిళ నాడులోని రామేశ్వరం లో వెలసిన జ్యోతిర్లింగం త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో  శివార్చన చేసి,జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమశివుడు వెలసిన క్షేత్రం.*



*12. ఘృష్ణేశ్వర లింగం (దేవగిరి):-*


*మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలకి దగ్గరలో దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడు మహేశ్వరుడు.*


*ఓం నమః శివాయ*


*ఓం నమః శివాయ* 


*ఓం నమః శివాయ*


🕉️🌞🌏🌙🌟🚩

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

siva


వర్ణచ్ఛందములు - 23

==

ఆధారము: కల్పితము

సూత్రము: 

(తత్తన తనన తనతన - 

తత్తన తనన తనతన - 

తత్తన తనన తనతన తనతాన)2

==

ముత్తెపు నగవు గనగను 

    జిత్తము చెలువు నలరెను 

    విత్తము వలదు మనికిని నిజమేగా  

  ముప్పుల వెతలు మఱుగగు 

    తిప్పలు వదలుఁ దురితము 

    తప్పులు దొలఁగు భవమున సిరియేగా 

==

ఎత్తులు వలదు మనఁగను 

    జిత్తులు వలదు మనఁగను 

    సత్తెపు పలుకు లవసర మగుఁగాదా 

  యెప్పుడు నతనిఁ దలఁచినఁ  

    జప్పుడు నిడక మనలకుఁ 

    జప్పున వరము లొసఁగును ముదమేగా 

==

నిత్తెము మదిని గవనపు 

    చిత్తరు వొకటి మలచిన 

    సత్తెము హృదియు విరియును బొలుపేగా 

  నిక్కము భువన మతనిది 

    చిక్కఁడు మనకు దొఱకఁడు 

    చక్కని మొగపు చెలువుఁడు యెకిమీఁడే 

==

కత్తులు వలదు ధరణిని 

    మిత్తియు వెతయు జనులకు 

    మత్తిడు మదము నణచుము జగదీశా 

  కచ్చలు పగలు నసురము 

    లిచ్చయుఁ జెలిమి యమరము 

    త్రచ్చఁగ భయము గొలుతును సుగమీయ 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


రోజువారీ కధ - మనసుందాఁ నీకు (1)  

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

అస్తవ్యస్తమైన జీవితం, అర్ధం పర్ధం లేని ఆవేశం, అలుపెరగని పోరాటం, నిత్య0 సత్య అసత్యాలు, వెంటాడే సంభాషణలు, మానవత్వానికి ఇచ్చిన ప్రసాదాలు,వద్దన్నా తినాలి, ఆకలి తీర్చుకోవాలి, అర్ధం కోసం, ఆటలాడాలి, అనుకున్నది సాధించాలి, ఆరాధ్యునికి విన్నవించుకోవాలి, ఆశ్రయంలో అలుపెరగని జీవిగా జీవించాలి, ఇదే మానవులలో ఉన్న మేధస్సు తనం-               

వస్తువు, బంగారమో కాదో తెలియాలంటే యాసిడ్ లో వేయాలి. నీవు సత్యమో కాదో తెలియాలంటే కష్టం రావాలి. ఇద్దరిమధ్య ప్రేమ చిగురించాలంటే సృష్టిక్రమం జరగాలి 

కళల మేలి కలయక లే కనుల చుట్టు, తలపు హృదయాన్ని చుట్టేసి తనువు పట్టు

మలుపు జీవితం ఏకమై మధుర మెట్టు, నలుపు తెలుపు లే నలుగుటే నయన గుట్టు

అందుకే నేను చెప్పేది నిది అనేది ఏది లేదు అన్ని ఆ దేవుడు సృష్టించినవే అని తెలుసుకోవాలి 


పవన శక్తి యే ఒకటి వృక్షాలు ఎన్నో: మాన మొక్కటే మధ్య మతములు ఎన్నో

దైవ మొక్కటే మనసు రూపాలు ఎన్నో: సమయ మొక్కటే మనిషి ఆశలు ఎన్నో

బ్రతుకు ఒక్కటే ప్రేమ భావాలు ఎన్నో : సృష్టి ఒక్కటే జీవ రాశులు ఎన్నో

సూర్యు డొక్కడే కాంతి కిరణాలు ఎన్నో:చంద్రు డొక్కడే చలువ చీకట్లు ఎన్నో

***

వృక్ష మోక్కటే కొమ్మన పక్షులు ఎన్నో: దేశ మొక్కటే భాష భావాలు ఎన్నో

మట్టి ఒక్కటే కుండల రకాలు ఎన్నో : పత్తి ఒక్కటే గుడ్డలు రకాలు ఎన్నో

పుత్త డొక్కటే నగలలొ రకాలు ఎన్నో: నీరు ఒక్కటే ఉపయొ గాలుగా ఎన్నో

మనసు ఒక్కటే ఆలోచనలుగా ఎన్నో : ప్రేమ ఒక్కటే పద్ధతులుగాను ఎన్నో 

****

రూపం- రూపాయి తాత్కాలిక సత్యాలు : జ్ఞానం-సంస్కారమే నిత్య సుగుణాలు

చూడబడేదంతా మాయ. చూచేవాడు బ్రహ్మము. రూపంగా ఉన్నవాడు జీవుడు. స్వరూపంగా ఉన్నవాడు దేవుడు.                              

****

        రోజువారీ కధ - మనసుందాఁ నీకు (2)  

   ఆదర్శప్రాయంగా మారాలంటే ప్రతి ఒక్కరిలో నిగ్రహశక్తి ఉద్భవించాలి, చిరుహాస, మందహాసం మనో మయముగా మారి, మనసు ఉల్లాస ఉత్సాహంగా మారి, అర్థ0కాని ఆవేదనకు లోను గాక, అంబరంలో మేఘాన్ని సృష్టించి వర్షం కురిపించి నట్టుగా, ప్రతి ఒక్కరు తాను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి తృప్తి చెందటంలోనే ఉన్నది అసలైన ఆనందం అందరికీ ఆదర్శం।     

ప్రతియొక్కరు తెలుసుకోవాలి నింగి, నీరు నిప్పు, గాలి  తెలుసుకోవాలి ఇవియేమానవ బ్రతుకులో మూలమైనవి దివ్యమైన జీవితానికి వరమైనవి, వలపుల ఊయలకు మూలమైనవి, పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడుటకు ఆదర్శం, తనివితీరా అనుభవించుటకు మూలం।  

అందుకే చంద్రికా పద్యాలు ఉదాహారించాను

****

నింగినిర్మలమే నిగ్రహ చలనమే సూర్యచంద్ర ఘనత  

నీరు నిలకడగనె నియమసహాయమే నిర్ణయాల బ్రతుకు 

నిప్పు స్థిరమ్ముగా నిజముతెలిపి సాగు సర్వ దహన శక్తి 

గాలి లేని ప్రాంత మేది తెల్ప వలెను సర్వ ప్రాణ రక్ష 

****

నింగి నిర్మలమే నిగ్రహ చలనమే సూర్యచంద్ర ఘనత  

నింగి సౌందర్యము నిరతము గమనించు నీకు రక్ష గలుగు 

నింగి మేఘాలే నీకు వర్షమగుట పంట చేకూర్చే 

నింగి పుడమి పైనె విశ్వమయమగుటే జగతి సుకృతి ప్రకృతి      

*****

నీరు నిలకడగనె నియమసహాయమే నిర్ణయాల బ్రతుకు 

నీరు దహతీర్పు  నిర్విరామ కృషికి నిత్యా సోపానమె 

నీరు వరము గాద నీకు లక్ష్మినిచ్చి నిన్ను బ్రతకనేర్పు 

నీరు మ్రొక్కుతల్లి నిర్ణయమ్ము శక్తి కనకమహాలక్ష్మి 

****

నిప్పు స్థిరమ్ముగా నిజముతెలిపి సాగు సర్వ దహన శక్తి 

నిప్పు యే మనసున నీడ జననుతమై ఫలహృధ్యమవ్వుటె   

నిప్పు మానిత భర ణమ్ము గాఁపురుషం విపుల విశ్వమయం    

నిప్పు హృదయ గ0ధ నిత్యజఠరాగ్నియె ద్యేయ దహన శక్తి 

****

గాలి లేని ప్రాంత మేది తెల్ప వలెను సర్వ ప్రాణ రక్ష 

గాలి చిలిపితనం గళము పెనవేసి ఙ్ఞాని తత్వ శోభ    

గాలి ఙ్ఞాన నిధియు గమ్య వేగ పరచు తెలువు పంచ భూతి

గాలి వళ్ళ మేఘ గమన వర్ష మాయె నిత్య పోషకమ్ముఁ       

****


త్రిమూర్తుల జన జీవ తత్వ భావాలు...  


ఓం నమ: శివాయ 

ఓం నమ: గణాయ 

ఓం నమ: శిఖాయ 

ఓం నమ: తపాయ 

ఓం నమః రుద్రాయ

ఓం నమః భద్రాయ

ఓం నమః రౌద్రాయ

ఓం నమః చంద్రాయ

ఓం నమ: తినేత్రం 

ఓం నమ: భవేత్రం 

ఓం నమ:  కళేెత్రం 

ఓం నమ: ఘానేత్రం

ఓం నమః వీరభద్రాయ

ఓం నమః వాసుదేవాయ

ఓం నమః పంచవక్రాయ

ఓం నమః  వ్యోమకేశాయ

ఓం నమ: మహేశ్వరాయ 

ఓం నమ: తపేశ్వరాయ 

ఓం నమ: గణేశ్వరాాయ 

ఓం నమ: రమేశ్వరాయ 

ఓం నమ: ప్రాణ  శరీరాయ 

ఓం నమ: స్నేహ శరీరాయ 

ఓం  నమ: ప్రేమ శరీరాయ 

ఓం నమ:  శ్రావ్య  శరీరాయ

*****

*అర్థంలోనే పరమార్ధం


*అర్థ మైనట్టు ఉండి అర్థం కానిది.

అర్థం కానట్టు ఉండి అర్థమయ్యేది.

అర్ధంతో వ్యర్ధ మవ్వక ఉండేది 

అర్థంలోనే పరమార్ధం కనిపించేది 

****

*అర్ధం పూర్తిగా భౌతిక విషయమయ్యేది 

అర్ధం ఆధ్యాత్మిక విషయ మయ్యేది

అర్ధం ప్రకృతి ప్రమాణంగా ఉండేది 

అర్ధం అనర్ధాలు తేకుండా ఉండేది 

****

*అర్ధం కనుచూపు పారినంత ఉండేది 

అర్ధం కనబడే ప్రపంచం లో ఉండేది 

అర్ధం కనబడని లోకంలో కూడా ఉండేది 

అర్ధం మనచుట్టూ చుట్టే గాలిలా ఉండేది 

****

*అర్ధం మార్పులేని సత్యమవుతుంది     

అర్ధం మారుతూ ఉండే ప్రకృతి అవుతుంది  

అర్ధం దృశ్యంలోనికి రాకడ పుట్టుక అవుతుంది  

అర్ధం మరుగు కావడం మరణం అవుతుంది 

****

*ఓం ఈశ్వర్యై నమః*


*ఈశ్వరుడే* ... *ఈశ్వరీ*

*ఈశ్వరీ యే ... *ఈశ్వరుడు* 


బ్రహ్మజ్ఞాన కాసారమునకు మూలం ... ఈశ్వరీ 

శుద్ధసత్త్వగుణస్వరూపుముకు మూలం ... ఈశ్వరీ

మాయ నుండి రక్షించేశక్తిమూలం జగన్మాత *ఈశ్వరీ*   

పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులకు మూలం  - *ఈశ్వరీ*

*ఓం ఈశ్వర్యై నమః*

***

* ప్రాపంచిక ఆటలు -  భౌతికంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి.

 ఆధ్యాత్మిక ఆటలు -  ఆత్మకు 'అనుభవ జ్ఞానం' అనే ఆనందాన్ని ఇస్తాయి.

 రాజకీయ ఆటలు -  ఆశ, పాశము, ఆదుర్దా, గుండె పోతూ ఇస్తాయి 

 ప్రేమతో  ఆటలు -  పిల్లల పాలన పోషణ,దూషణ సంతృప్తి లీకుండా చేస్తాయి 

******

* ఇహలోక సమస్యల పరిష్కారాలకు - ధ్యానం

   ప్రేమలోక సమస్యల పరిష్కారాలకు - త్యాగం 

   దేహ రోగ సమస్యల పరిష్కారాలకు - ప్రేమ 

   కాలరోగ   సమస్యల పరిష్కారాలకు -  ఓర్పు 

*****

✳పరలోకాలకు సంబంధించిన జ్ఞానానికి - ధ్యానం 

    పరభాషలకు సంబంధించిన జ్ఞానానికి - ధనం 

    పరప్రేమ సంబంధించిన జ్ఞానానికి - శాంతి  

    ప్రబ్రహ్మకు సంబంధించిన జ్ఞానానికి - తపస్సు 

*****

* భగవంతునికి నిజమైన పేరు = వర్తమానం.

   ప్రేమకు ప్రతి రూపంపేరు  = అమ్మ 

   స్నేహానికి ప్రేమకి రూపం   =  భార్య  

    కలయిక ప్రతిరూపం ప్రేమ = సంతానం 

*****

* భగవంతుని చిరునామా = ఇప్పుడు, ఇక్కడ, ఇలా.

   దైవానికి ప్రతిరూపం  _=తల్లి తండ్రి గురువు 

   దేహానికి ప్రతిరూపం   = ప్రేమ శాంతి సౌభాగ్యం 

   ప్రణయానికి ప్రతిరూపం = పుట్టుక, మరణం 

*****

హావ భావ విన్యాసము, హాయి గొలుపునది నృత్యము, 

ఆత్మను చేరును సత్యము, ఇది సంస్కృతికి నిదర్శనము

*****

* జనజీవన తత్వం


గురు బ్రహ్మ, గురు విష్ణు గురుదేవో మహేశ్వరః 

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


 గురు బ్రహ్మ అంటే అంతటా అన్ని సృష్టిస్తున్న 'బ్రహ్మ' వంటి గురుతత్వానికి నమస్కారం.

 గురు విష్ణు అంటే ఈ సృష్టిలో అన్ని చోట్ల వ్యాప్తి చెందుతూ ఉన్న 'విష్ణు' వంటి గురుతత్వానికి నమస్కారం.

గురుదేవో మహేశ్వరః అంటే ఈ సృష్టిలో అంతటినీ లయింపచేసే మహేశ్వరుని వంటి గురుతత్వానికి నమస్కారం.

 గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే కంటికి కనిపించే వ్యక్తమైన సృష్టి తత్వానికి మరి కంటికి కనిపించని అవ్యక్తమైన పరబ్రహ్మ తత్వానికి

 తస్మై శ్రీ గురవే నమః - పై రెండింటి యొక్క సంపూర్ణ రూపమైన గురుతత్వానికి  వినయపూర్వక నమస్కారం.


 *గురువు అన్నది ఒక తత్వం., అంతేగాని గురువు అంటే ఒక వ్యక్తి ఎంత మాత్రం కానేకాదు.

 గురి అంటే శ్రద్ధ  

 మనం శ్రద్ధతో సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సృష్టిలో వ్యక్తమయి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక గురువులా మనకు నేర్పిస్తూనే ఉంటుంది.  

 అంతేకాదు జీవితంలోని ప్రతి ఒక్క క్షణం, ఎదురయ్యే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఒక గురువులా మనకు జ్ఞానాన్ని కలిగిస్తూనే ఉంటుంది.

*****

 భగవంతునికి నిజమైన పేరు ...గురువు= వర్తమానం.

భగవంతుని చిరునామా = ఇప్పుడు, ఇక్కడ, ఇలా.

తల్లి, తండ్రి, స్నేహితుడు మరియు భార్య కనబడే గురువులు ఇంకా కనబడని యెందరో గురువులు

******

నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది. అంతర్గతంగా గురువే నీకు దారి

****""

సకల అవయవాలు కలిపి -  దేహం వాంఛ గా గురువు

 ("అహంకారరూపమైన నేను")

సకల సృష్టి కలిపి -  దైవం .. గురువు

("అహం స్వరూపమైన నేను")

******

* శక్తికి లక్షణాలు ఏవి?

అభిధ...కుండ,బట్ట, తయారీ ధ్వంసమే

లక్షణ.. ప్రవాహ వేగం

వ్యంజన...వ్యంగ్యము, సాహిత్య వైయాకరణులు

లక్ష ణ..కేవల లక్షణం..తుమ్మెద

లక్షిత లక్షణ .బ్రమర విన్యాసాలు

లక్షణ... మంచము కదలిక

జహలక్షణ.. మంచము పై జన లక్షణ

అజహలక్షణ.. విడువకుండా సన్యార్ధమును‌బోధించుట

****

శివ తత్త్వం.. జనజీవన తత్వం

*. ప్ర: అందరి కిని  కోరదగినడేది ?

      స:  తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.

*.ప్ర:    మద్యమువలె మోహమును కలిగించునదియేది ?

      స:    స్నేహము.

*. ప్ర:   దొంగ లేవారు?

      స:    రూప రస గంధాది  విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు 

              యొక్క సామర్ద్యమును. అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.

*. ప్ర:    పేరాశ  ఏది?

       స:    ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.

****

*. ప్ర:   భయము దేని వలన కలుగును?

       స :  మరణము వలన .

*. ప్ర:    గ్రుడ్డి వానికంటె  పేద గ్రుడ్డి ఎవరు ?

      స:     విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.

*. ప్ర:    శూరుడెవ్వడు ?

       స:    అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు

*. ప్ర:    దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?

       స:   సత్పురుషుల హితోపదేశము.

****

*.  ప్ర:  గౌరవమును పొందుటకు మూలమేది?

       స:   యా చింపకుండుట.

*.  ప్ర:   తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?

        స:   స్త్రీలనడవడి.  

*.ప్ర:  సమస్త దు:ఖములను పోగొట్టువాడేవాడు ?

      స:  సర్వజనుల మేలుకోరు త్యాగధనుడు.

*.ప్ర:  మరణముతో సమానమైనదేది ?

     స:   మూర్ఖత్వము .

****

*.ప్ర: వేలకట్టుటకు వీలుకానిదేది?

      స:  అవసరమైనప్పుడు ఈయబడినది.

*.ప్ర: మరణము వరకు శల్యము వలే భాదిమ్చునదేది ?

     స:  రహస్యముగా చేయబడిన పాపము.

*. ప్ర:  ఎ విషయమున ప్రయత్నము  చేయదగును ?

            విద్యాభ్యాసము నందు , తగిన ఔషధమును సేవిమ్చుటయందు,  

            దానములు చేయుట యందు. 

*. ప్ర:  ఎచ్చట తిరస్కారము చేయదగును ?

       స:   చెడ్డవారితో స్నేహముచేయుట యందు, పరస్త్రీలను కామించుట 

              యందు, పరధనమును అపహరించుట యందు.

****

*. ప్ర:  రాత్రింబవళ్ళు ఆలోచింపతగినదేది ?

       స:  సంసారము నిస్సారము అనే అంశము అంటే కాని స్త్రీ కాదు .

*:ప్ర:  చాల ప్రేమతో సంపాదిమ్పడగినదేది ?

      స:  దీనుల యందు.దయ.

*.ప్ర: మరణము ఆసన్నమైనపుడు ఆత్మ ఎవనిచేత జింప బడదు?

      స: 1. మూర్కునకు  2. సంశయాత్మునకు 3. నిరంతరం దు:ఖపడు 

               శ్వభావము గలవానికి 4. చేసిన మేలు మరచిన వానికి.

*. ప్ర:  సాధువనగా నెవరు ?

       స:  శాస్త్ర  సమ్మతము ఐన ప్రవర్తన  కలవాడు.

*****

*:  ప్ర:  ఎవనిని అధముడని అందురు ?

        స:  శాస్త్ర  సమ్మతమగు  ప్రవర్తన లేని వాడిని.

*.ప్ర:  ఈ జగత్తు ఎవనిచే జేఇంప  బడును ?

      స:  సత్యమునే పల్కువారిచేత, ఓర్పు సహనము గలవానిచేత.

*.ప్ర:  దేవతలు ఎవనికి నమస్క రిమ్తురు ?

     స:  దయ అధికము కలవారికి, మంచి బుద్ధి గలవారికి.

*.ప్ర:  దేనివలన జుగుప్స కలుగును ?

     స:  అరణ్యమువంటి భీకరమైన సంసారమువలన .

****

*.ప్ర:  ప్రాణులందరు ఎవని వశమందు  ఉందురు ?

      స:   ఎల్లప్పుడూ సత్యమునే పల్కు వానికి, వినయముతో   

             ప్రవర్తిమ్చువానికి

*.ప్ర: మానవజన్మ లక్ష్యమేది?

జీవన్ముక్త స్ధితియోక్క ఆనందం పొందడం

*.ప్ర: ఎట్టి వాడు అచంచలుడు ?

వ్యక్తావ్యక్త ప్రపంచంలో పంచభూతాలకు అతీతగ సర్వసాక్షిగ ఏకైక సత్య సాధకుడు

*.ప్ర: భగవాన్ అనుగ్రహం ఉందా?

అనుగ్రహంతో నే ప్రయత్నం ఫలిస్తుంది

****

*.ప్ర:  వృక్షారణ్యంలో ఉండే యోగి శక్తి?

ప్రకృతి ప్రశాంతత తో మంత్ర శక్తి సాధన

*.ప్ర:  జనారణ్యంలో ఉండే యోగి శక్తి చాలా ఎక్కువ.?

లోకజ్ఞానం తో ఆత్మజ్ఞానం తెల్పే శక్తిసాధన

'పాదం' ?.... 'పదం' పట్టుకోవాలి.?

పాదం పెట్టుకొను పూజిస్తే మోక్షము

పదంపట్టుకొని సేవ చేస్తే ‌‌‌‌‌మనసుకేశాంతి

*****

*.ప్ర: మానవ జన్మ సార్ధకత కు మూలం...?

జ్ఞాతుం..  కని.. తెలిసికొనుట..

 దష్ట్రుం....చేరి...చూచుట...

 ప్రవేష్టుం... ప్రవేశించటం

అర్ధమైతే సార్ధకం, అర్ధం కాకపోతే నిరర్ధకం

******

*.ప్ర:  శక్తి బాంఢాకారాలు ఏవి?

అం..

*.ప్ర:  అందర్నీ ఆకర్షించే నారాయణ బీజాక్షరం

ఈం..

*.ప్ర:  మహాశక్తి ని ఆరాధించే బీజాక్షరం

ఓం...

*.ప్ర:  పరబ్రహ్మ ఓంకారం బీజాక్షరం

హుం...

*.ప్ర:  వారాహీ అమ్మవారి మంత్ర బీజాక్షరం

లం...

*.ప్ర:  పుడమి తల్లి మంత్ర బీజాక్షరం

శ్రీం...

*.ప్ర: లక్షీబీజాక్షరం సంపద కీర్తి కోసం 

హ్రీం....

జగన్మాత అనుగ్రహం కోసం బీజాక్షరం

*****

*.ప్ర:  అహం అనగానేమి?

ఆ అన్నగా అమ్మ జగన్మాత, హ అనగా అయ్య జగత్పిత సున్న అనగా ఇద్దరూ కలిసి వున్న స్థితి, పూర్ణ స్థితి. అహంనాస్తికాదు..అహం ఆస్తి..వదులుకుంటే మనస్సుకు శాంతి

******

దిభిః శుధ్యంతి గాత్రాణి బుద్ధిర్జానేన శుధ్యతి ౹

అహింసయా చ భూతాత్మా మనః సత్యేన శుధ్యతి౹౹


శరీరం నీటితో,బుద్ధియొక్క తత్వజ్ఞానముతో,మరియు మనిషి లోని అహింస భావాలతో పరిశుద్ధుడగును.

*****

*.ప్ర: శివం అంటే ఏమిటి?  

శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.

*.ప్ర:త్రినేత్రం  అంటే ఏమిటి?

ధ్యానం తో ఏర్పడే దృష్టి

*.ప్ర:ఢమరుకం అనగా ఏమి?

ఒకవిధమైన శబ్ద సంగీతం.

*.ప్ర: తాండవాభినయం అనగా నేమి

ఆనందంతో ఆడే నృత్యం.

****

*.ప్ర:శివుని చేతిలోని అగ్ని అనగా నేమి?

 నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.

*.ప్ర: భిక్ష పాత్ర  వల్ల ప్రయోజనం ఏమి ?

 ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.

*.ప్ర: కపాలం దేనిని సూచిస్తుంది?

 శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.

*.ప్ర:శివుని వద్ద కోరుకునేది ఏది?

 చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

*****

*.ప్ర: ప్రపంచంలో గడపడం అంటే ఏమిటి?

పనస పండును వలవటమే

*.ప్ర: ఇష్టదైవం తో సహవాసం?

తప్పో పైపులు నెత్తి నేసుకోక ప్రార్ధనే

*.ప్ర: పరిపూర్ణ తకుదారి ఏది?

భయరాహిత్య, నరక, బంధమోక్షస్థితి

*.ప్ర: ఆలోచనారాహిత్యస్థితి అనగానేమి?

సైనైడ్ రుచి, లేద యాసిడ్లో స్నానం


****

*.ప్ర: జీవుడు గా నీవెక్కడా ?

నేను ప్రజల హృదయాలలో

*.ప్ర: దేవుడు గా నీవెక్కడ?

త్యాగం, దానం, క్షమా, నిస్వార్థం, తో ప్రజల ఊపిరిలో

*.ప్ర: క్షణిక చిత్రం అంటే ఏమిటి?

ఉద్రేక ఆకర్షణ తాండవం

*.ప్ర: గుణపాఠం అంటే ఏమిటి?

అశ్లీలం తిరస్కరణ ఉద్యమం

****

*.ప్ర: నమ్మకం అంటే ఏమిటి?

సహకార మృదుభాష, త్యాగ బుధ్ధి

*.ప్ర: నమ్మకంలో ఏముంది?

నమ్మే మనసు వుంది, అమ్మకంలేదు

*.ప్ర: మహాప్రజ్ణ దేనినందురు?

స్వీయనభవంతో సమస్యపరిష్కారం

****

*. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

 

  స్వర ప్రధానముగా

   పద ప్రధానముగా  

   లయ ప్రధానముగా

   స్థితి ప్రధానముగా

 

  మనసు యొక్క అవధానము

   వయసు యొక్క కళ గానము 

   సొగసు యొక్క  లత గాళము 

   హృదయ మొక్క విష వాదము 


*. వాద్యము  

     (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు )

*నా ఆలోచనకు కారణం 

నా ధైర్యమ్మునకు మూలకం   

నా  ఆవేశముకు సంకటం                      

నా కర్తవ్యముకు భారతం 

 

* నా  వ్రాతలకు ప్రాణం 

నా చూపులకు గమ్యం 

నా ఆటలకు ధైర్యం 

నా వాక్కులకు విశ్వం 


* నా పదాలకు పరమార్ధం 

నా స్వరాలకు మది మార్గం 

నా వినోదము ఇది వాద్యం  

నా మనోమయ కల శబ్దం 


* నా మనసుకు ఉత్తేజం 

నా వయసుకు ఉన్మాదం 

నా కళలకు  విఘాతం 

నా పలుకుకు సమ్మోహం


* నా ఊహలకు మూలం 

నా ఆశలకు వాదం 

నా చూపులకు వేదం 

నా ప్రేమలకు దాహం 

****

*ప్ర : కుటీచకుడంటే ఎవరు?

మీ అల్పాహారం తింటూ భక్తిగా ప్రార్ధించె సన్యాసి

*ప్ర :  బహూదకుడు అనగా ఎవరు?

8 కబళముల ఆహారంతో నిత్య సాధన చేసే సన్యాసి

*ప్ర :  హంస..అని ఎవరిని అందురు?

జడధారియై కౌపీనం ధరించిన జ్నాని

*ప్ర :  తురియాతీతుడు...అనగా ఎవరు

దేహాన్ని ఒక శవంలా చూస్తాడు

****

*ప్ర : అవధూత ఎలా ఉంటారు?

సంచారం చేస్తూ పిచ్చివాడు గా తిరుగుతూ అందిన ఆహారం తింటూ, కంబళి కప్పుకొని

దేవుడొక్కడే అంటూ తిరిగేవాడు.

*ప్ర :  పరమహంస..అనగా ఎవరు?

5గృహాల భిక్షాటన తో నిత్య సాధన సన్యాసి ఆత్మసాక్షాత్కారం 

*ప్ర : బుద్ధివికసించుటకు మార్గాలు ఏవి?

చదివి, వ్రాసి, ప్రశ్న వేసి, పండితులను ఆశ్రయిస్తె కిరణాలచే పద్మం వికసించినట్లు వికసించును.

*ప్ర : ధనము కొరకు కాన రానివి ఏవి?

జాతి, గుణము, శీలము,వంశము, శౌర్యము 

****

*ప్ర :  శూన్యమే అనగానేమి?

విద్య, బంధువులు, పుత్రులు, ధనము,లేని జీవితం

*ప్ర :  భారము కానివి ఏవి?

ప్రేమ, సమర్ధత, కృషి, విద్య

*ప్ర :  ప్రధానమైనవి ఏవి?

శరీరంలో తల, ఇంద్రయాలలో కన్ను,రుచులలో ఉప్పు, పంచభూతాలు

*ప్ర :  భగవంతునికి నిజమైన పేరు ఏమి?

వర్తమానం.

*****

*ప్ర : భగవంతుని చిరునామా ఏది?

ఇప్పుడు, ఇక్కడ, ఇలా.

*ప్ర : పుట్టుక అనేది ఏది?

 నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది

*ప్ర :  ఇమ్ద్రజాలమేది?

          ప్రపంచము, స్త్రీ మనస్సు

*ప్ర :  ప్ర:  మిధ్య అనగానేమి?

          స:  విద్యచేత, జ్ఞానముచేత నశించునది .

****

*ప్ర :  ప్ర అనిర్వచానమైన వస్తువేది:

         స:  మాయ

* ప్ర:  అజ్ఞానము ఎక్కడనుండి  పుట్టినది ?

         స:  అనాది నుండి ఉన్నది, ఇది పుట్ట్టేడిది  కాదు.

* ప్ర:  ప్రారబ్దము అనగానేమి?

         స:  ఆయుర్దాయము

*  ప్ర:  ప్రత్యక్ష దేవత ఎవరు ?

         స :   తల్లి

*****

*  ప్ర:    ప్రత్యక్ష గురువు ఎవరు ?

          స:   తండ్రి

*  ప్ర:  సర్వదేవతా స్వరూపుడై భాసించు వాడేవాడు?

          స:  వేదవేదాంగా పారీణుడు సదాచార సంపన్నుడైన  

         బ్రాహ్మణుడు.

*  ప్ర:  స్ర్వవెదములకు మూలమేది ?>

          స:  ఓంకారం .

*. ధృతరాష్ట్రుడు - అంటే ఎవరు?

ఎంత విన్నా ఉపయోగం లేదు. గుడ్డివాడు అనగా 'వాస్తవాన్ని గ్రహించలేని వాడు' అని అర్థం.

****

* అర్జునుడు - అంటే ఎవరు ?

శ్రవణం వల్ల వాస్తవాన్ని తెలుసుకున్నాడు.,  నేను 'ఆత్మ పదార్థం' అని గ్రహించారు.  వీరు నా బంధువులు, నేను ఈ దేహాన్నీ అన్న 'మోహం' పోగొట్టుకున్నాడు.

*ప్ర : కపిధ్వజుడు (హనుమంతుడు) - అంటే ఎవరు?

సాధకుడు.  గీత శ్రవణం వల్ల సాధన వేగవంతం అయ్యి 'మోక్షాన్ని' సాధించారు.

*ప్ర :.వ్యాసుడు - అంటే ఎవరు?

వినకముందే జ్ఞాని. ఈయన వల్లనే సకల మానవాళికి గీత అందించబడింది.

 *ప్ర :.భగవాన్:- అనగానేమి?

భ = భూమి, 

గ = గగనం

వా = వాయువు, అగ్ని

న్ = నీరు

మొదలగు పంచభూతాల కలయికే భగవాన్ అంటే.

****.  

*. బ్రహ్మీ భూతుడు:-  అనంతముగా "నేను భగవంతుడను" అని ఉండును.

*. జీవన్ముక్తుడు:- " సమస్తము నాతో ఉన్నది"

*. సద్గురువు :- "సమస్తము నాది" "సమస్తము నాలో ఉన్నది" "సమస్తము నా నుండి ఉన్నది"


*. అవతారము :-

"నేను భగవంతుడను" సర్వము ‌‌‌ "నేనే"   

" నేను సమస్తమందున్నాను"

" సమస్తము నాలో ఉన్నది, నా నుండి వచ్చుచున్నది."

***

*నవరసాలకావ్య నవ్యమై వెలుగొందు 

నవరాగాలపద్య భవ్యమై వెలుగొందు 

నవరత్నాల వెల్గు దివ్యమై వెలుగొందు 

నవగ్రహాల దీప్తి సవ్యమై వెలుగొందు  

***

*అనుబంధ లోకములు | లోకానుభవము కలవారు

సమపోష  కాలములు | ప్రేమాభిమానము కలవారు 

తరుణాన సేవకులు | సేవాభావాలు కలవారు 

మనసంత చోదకులు | గర్వాతిశయము కలవారు 

***

*భౌతిక ప్రపంచము | సామాన్య మానవులు

నిర్ణయ సౌందర్యము | ఆకర్షిత దంపతులు 

సద్విద్య ప్రోత్సాహము | ఇష్ట  ప్రేరకులు 

సంతృప్తి సమ్మోహము | కలియుగ ప్రేక్షకులు  

***

*సూక్ష్మ ప్రపంచము | యోగులు

  ధర్మ ప్రభోధము | రోగులు   

  ఆశ ప్రభంజనము | ఆత్మీయులు 

  ఆదర్శ వాదము | ఆకర్షితులు 

***

భక్తి కావాలంటే అరుణాచలం (అగ్నిలింగం) చుట్టూ తిరగండి.

జ్ఞానం కావాలంటే అనిలాచలం (వాయు లింగం) చుట్టూ తిరగండి.

అనిలాచలం = శ్రీకాళహస్తి = వాయు లింగం = శ్వాస.

శ్వాస మీద ధ్యాస (ధ్యానం) ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.

****

*.  ప్ర:  ప్రాణముకంటే  రమ్యమైనదేది ?

       స: ధర్మము

*  ప్ర:  సంరక్షిమ్పవలసినదేది?

       స:  కీర్తి, ప్రతివ్రత

*.  ప్ర:  చేతిలోని ఆయుధమువలె రక్షించునట్టిదేది?

       స:  తగిన ఉపాయము .

*.  ప్ర:  తల్లివలె కాపాడునట్టిదేది ?

       స:  ఆవు

****

*. ప్ర: బలమనగానేమి?

       స:  ధైర్యము

*.  ప్ర:  మరణ సమానమైనదెది?

       స:  జాగరూకత లేకపోఫుట

*.  ప్ర:  విషము ఎవరియందు ఉండును?

       స:  దుర్జనుల యందు

*.  ప్ర:  అందరికి అశుచిత్వము కల్గిమ్చునట్టిదేది ?

       స: ఋణము

****

*.  ప్ర:  అందరికి భయము కల్గిమ్చునది ?

       స:  ధనము .    

*. ప్ర:   లోకమునందు ధన్య్యుడేవడు ?

       స:  సర్వసంగ  పరిత్యాగి యగు సన్యాసి .

*.  ప్ర:   సంన్మా నిమ్పదగినవాడేవాడు ?

       స:    సత్పర్తన గల పండితుడు .

*.  ప్ర:  సేవింప దగిన వాడేవాడు?

        స:  యాచకులకు తృప్తి కల్గునట్లు నిచ్చువాడు .

****

*.  ఏది మహాభాగ్యము ?

        ఆరోగ్యమే మహాభాగ్యము.

*. ప్ర:   ఎవడు ఫలమును పొందును?

       స:   కష్టపడి పనిచేయువాడు .

*.  ప్ర:  పాపములెట్లు నశించును?

        స:  సంన్మంత్ర జపమువల్ల

*. ప్ర:  ఎవరు పరిపూర్ణుడు  ?

      స:  సత్సంతానవంతుడు .

****

*.  ప్ర:  మానవులకు కడు  దుస్కరమైనదేది?

       స:  నియమనిష్టలుకలిగి మనస్సును నిగ్రహించుట

*. ప్ర: పరదేవతని స్తుతింపబడు  దేవత ఎవరు ?.

      స:  చిచ్చక్తి

*.  ప్ర:  జగద్భాన్దవుడేవాడు ?

        సూర్య భగవానుడు .

*. ప్ర:   అందరికి జీవనము ఇచ్చువాడు ?

       స:   మేఘుడు .

****

*. ప్ర:   జగద్గురువు ఎవరు?

      స:   పరమేశ్వరుడు .

*.  ప్ర:  ముక్తి దేనిచేత పొందవచ్చును?

        స:  హరిభక్తి

*.  ప్ర:  అవిద్య అనగానేమి ?

        స:  ఆత్మ స్వరూప భోధనకు అవరోధమైన మాయ .

*. ప్ర:  దు:ఖములేనివాడేవాడు?

       స:  కోపములేనివాడు

****

*.  ప్ర:  సుఖమనగానేమి?

       స:  మనస్సుకు తృప్తి

201.ప్ర:   ఎక్కడ నిలకడగా నుండవచ్చును?

      స:   ఇహికములు, అముష్మికములైన స్రయస్సులను కలిగించు  

              న్యాయ  మార్గమునందు.

202.ప్ర:  గ్రుడ్డివాడెవ్వడు ?

      స: చెయదగినదికూడ  చేయలేనివాడు.

`203.ప్ర:   చేవిటి వాడెవ్వడు?

      స:  పెద్దలు చెప్పిన హితము వినని వాడు

204.ప్ర:  మూగవాడేవ్వడు ? 

     స:  సమయము వచ్చినప్పుడు  ప్రియ వచనములు పలకనివాడు.

205.ప్ర :  దానమనగానేమి?

      స: యాచింపకయే  ఇచ్చునది.

206.ప్ర:  మిత్రుడెవ్వడు ?

      స:  పాపకార్యములను  చేయకుండ  నివారిమ్చువాడు.

207.ప్ర;  ఏది అలంకారము?

      స:  సత్య్యమును వచించుట .

208. మెరుపు వాలే చెంచలమేద?

       స్త్రీల ప్రేమ, దష్టులతో మైత్రి 

209.ప్ర:   కులము గురించి ఆలోచన లేనివారెవరు?

      స:   కేవలము సజ్జనులు మాత్రమే .

210.ప్ర:   చతుర్భుద్రము అనగానేమి ?

            1. ప్రియవచనములతో  ఇచ్చు దానము, గర్వరహితమైన 

                జ్ఞానము, క్షమాగుణముతోడి  పరాక్రమము, త్యగాముతో 

                కూడిన ధనము.

211.ప్ర:  ఐశ్వర్యము  ఉన్నప్పుడు దేనిని గూర్చి విచారపడవలసి 

            ఉండును ?

      స:  లోభము గూర్చి

212.ప్ర:  ప్రశంసింప దాగిన గుణమేది?

      స:  ఔదార్యము.

213.ప్ర:   విద్వామ్సులచేత పుజంప దాగిన వాడేవాడు?

     స:   సహజ మైన వినయగుణముతో ఒప్పుచుండువాడు. 

214.  ప్ర:  లక్ష్మీ  ఎవనిని కోరి వచ్చును?

       స:  నీతితో ఉన్న వారి, సోమరితనము లేని వారి వద్దకు లక్ష్మి  

       వచ్చును. 

215.  ప్ర:  ఎందు  నివసిమ్చదగును?

       స:   కాశీ యందు, సజ్జనుల సన్నిధి యందు.

216.  ప్ర:  విడిచిపెట్టదగిన  దేశమేది ?

       స:   లోభి పాలించు దేశము.

217.  ప్ర:  పురుషుడు దేనితోకూడి విచారములేనివాడుగా  ఉండును.

       స:  వినయశీలవతియగు భార్య తో

218.  ప్ర:  గొప్పవైభవముతొ కూడి  ఉన్నవాడు ?

       స:  తగినసంపద ఉన్నవాడును దాత్రుత్వములేనివాడు.

219.  ప్ర:  చాలా తేలికతనమును కలిగిమ్చునదేది ?

       స:  అల్ల్పులను యాచించుట.

220.  ప్ర:  శ్రీ రాముని కంటే  గొప్ప శూరుడేవడు ?

       స:  మన్మధుని భాణమునకు కలత చెందనివాడు. 

221.  ప్ర:  రాత్రిం పగళ్ళు ధ్యానించ దగినది ఏది ?

       స:  భగవంతుని పాదము, సంసారముకాదు.

222.  ప్ర:  కుంటి వాడుగా ప్రసిద్ధుడేవడు ?

       స:  ముసలితనమున తీర్ద్ధయార్త చేయు వాడు.

223.  ప్ర:  మనుష్యులు సమ్పాదీమ్పదగినదెది?

       స:  ధనము,కీర్తి ,విద్య ,పుణ్యము, బలము.

224.  ప్ర:  నాశనము చేయదగినదేది?

       స:  లోభము.

225.  ప్ర:  శత్రువు ఎవడు ?

       స:  కామమే  శత్రువు.

151. ప్ర:   స్త్రీల ప్రవర్తన చేత తప్పు దారి పట్టనివాడు?

      స :  శూరుడు.

152.ప్ర:  దు:ఖమనగానేమి?

      స:  సంతోషము లేకపోవుటయే.

153.ప్ర :   మానవుడు దేనిచేత చులకన యగును?

     స :    యాచనచేత .

154.ప్ర:  ఎట్టి  జీవితము ప్రశస్తమైనది ?

     స:   దోషరహితమైన జీవితము.

155.ప్ర :  సోమరితనమననేమి ?

      స :  వేదశాస్త్రములు చదివి మరల చదవకుమ్దుట.

156.ప్ర:  ఎవరు జాగరూకత కలవాడు ?

      స:  వివేకము కలవాడు .

157.ప్ర :  నిద్ర అన  నేమి?

     స :   అజ్ఞానము .

158.ప్ర:  తామరాకుపై నీరువలె చంచమైనదేది?

      స:  య్యోవ్వనము

159.ప్ర:  చెంద్రకిరణములవలె చల్లనైనవారెవరు ?  

     స:   సజ్జనులు.

160.ప్ర :  నరకమేది?

      స :  పరులకు లోబడి యోండుట.

161.ప్ర :  సౌఖ్య హేతువేది?

      స :  సర్వసంగ పరిత్యాగము.

162.ప్ర :  సత్యవాక్కు అనగానేమి ?

      స :  హితమును ప్రీతిని కలిగించు వాక్యము.

163.ప్ర:   అందరికి ప్రియమైనదేది?

      స:   ప్రాణము .

164.ప్ర:  అనర్ధకమైనదేది ?

      స:  గర్వము

165.ప్ర:  సుఖకరమైనదేది?

      స:  సజ్జనులతోడి  స్నేహము.

166..ప్ర :   ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది?                                   

స :   గురువాక్యము 

167. ప్ర :   అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది?                                                

 స:      వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.

168. ప్ర :    గురువనగా నెవరు?                                                                         

స:   పరతత్వము బాగుగా  తెలిసికొన్న  వాడై శి ష్యులకు మేలు     

               చేయ యత్నించువాడు .

169. ప్ర :  విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?

    స :  జనన మరణ పరం పరగా  కొనసాగు సంసారమును ఛేదించుట.

170. ప్ర:   మోక్షమను వృక్షమునకు బీజమేది ?

    స:    సత్కార్యా చరణము వలన  నేర్పబడిన  బ్రహ్మజ్ఞానము.  

171. ప్ర :  హితకరమైనది ఏది ?

    స:    ధర్మము .

172. ప్ర :  సుచియైన వాడేవాడు?

    స :   ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.

173. ప్ర :   పండితుడెవడు ?

    స:    వివేకము కలవాడు.

174. ప్ర :   విషమనగానేమి ?

    స :   గురువులను తిరస్కరించుట. 

175. ప్ర :   సంసారమందు సారమైనదెది?

      స :    సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.

0 Co

101।శిష్యుడు : భూమిని సృష్టించుటకు పూర్వము ఎవరున్నారు ? 

గరువు : పంచ భూతములు ఈశ్వరుడు। 

102। శిష్యుడు : భూమిని జీవ రాసిని ఎవరు సృష్టించారు ? 

గరువు : ఈశ్వరుడు। 

103। శిష్యుడు : సృష్టిని ఎవ్వరు వృద్ది పరుస్తారు ? 

గరువు : బ్రహ్మ దేవుడు। 

104। శిష్యుడు : బ్రహ్మ దేవుడు ఎవరు ? 

గరువు : ఆది పరా శక్తి 

105। శిష్యుడు : సృష్టిని పాలిమ్చేదెవరు ? 

గరువు : శ్రీ మహా విష్ణువు 

106। శిష్యుడు : విష్ణువు ఎవరు ? 

గరువు : ఈశ్వర శక్తి 

107। శిష్యుడు : సృష్టిని లయము, ధ్వంసం చేసేదెవరు ? 

గరువు : ఈశ్వర శక్తి 

108। శిష్యుడు : బ్రహ్మిణి ఎవరు ? 

గరువు : బ్రహ్మదేవుని శక్తి 

109। శిష్యుడు : లక్ష్మీ దేవి ఎవరు ? 

గరువు : విష్ణువు యొక్క శక్తి 

110।శిష్యుడు : పార్వతి ఎవరు ? 

గరువు : ఈశ్వర శక్తి 

111। శిష్యుడు: సంసార సాగరాన్ని తరిమ్పచేసేదెవరు? 

గురువు: ఈశ్వరుదు 

112। శిష్యుడు: భంధం అంటే ఏమిటి ? 

గురువు: విషయాను రక్తి । 

113। శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి ? 

గురువు: విషయం వళ్ళ విరక్తి చెంది ఈశ్వరునిలో లీనము కావడం। 

114। శిష్యుడు: ఘోరమైన నరకము ఏది ? 

గురువు: మానవ శరీరమ్ । 

115। శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది ? 

గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమె స్వర్గం। 

116। శిష్యుడు: సంసార భంధం ఎట్లా తొలగి పోతుంది ? 

గురువు: ఆత్మ జ్ఞానము వలన। 

117। శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది ? 

గురువు: తత్వజ్ఞానము వలన । 

118। శిష్యుడు: నరకమునకు కారణమేది ? 

గురువు: ఆశ, తృప్తి లేక పోవడం। 

119। శిష్యుడు: స్వర్గ ప్ర్రాప్తికి కారణ మేమి ? 

గురువు: అహింస, దాన గుణం, గౌరవించే లక్షణం। 

120। శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు ? 

గురువు: అతని ఇంద్రియాలు

0 Comments

131..ప్ర :   ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది?                                   

స :   గురువాక్యము 

132. ప్ర :   అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది?                                                

 స:      వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.

133. ప్ర :    గురువనగా నెవరు?                                                                         

స:   పరతత్వము బాగుగా  తెలిసికొన్న  వాడై శి ష్యులకు మేలు     

               చేయ యత్నించువాడు .

134. ప్ర :  విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?

    స :  జనన మరణ పరం పరగా  కొనసాగు సంసారమును ఛేదించుట.

135. ప్ర:   మోక్షమను వృక్షమునకు బీజమేది ?

    స:    సత్కార్యా చరణము వలన  నేర్పబడిన  బ్రహ్మజ్ఞానము.  

126. ప్ర :  హితకరమైనది ఏది ?

    స:    ధర్మము .

137. ప్ర :  సుచియైన వాడేవాడు?

    స :   ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.

138. ప్ర :   పండితుడెవడు ?

    స:    వివేకము కలవాడు.

139. ప్ర :   విషమనగానేమి ?

    స :   గురువులను తిరస్కరించుట. 

140. ప్ర :   సంసారమందు సారమైనదెది?

      స :    సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.

141. ప్ర: అందరి కిని  కోరదగినడేది ?

      స:  తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.

142.ప్ర:    మద్యమువలె మోహమును కలిగించునదియేది ?

      స:    స్నేహము.

143. ప్ర:   దొంగ లేవారు?

      స:    రూప రస గంధాది  విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు 

              యొక్క సామర్ద్యమును.   

              అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.

144. ప్ర:    పేరాశ  ఏది?

       స:    ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.

145. ప్ర:   భయము దేని వలన కలుగును?

       స :  మరణము వలన .

146. ప్ర:    గ్రుడ్డి వానికంటె  పేద గ్రుడ్డి ఎవరు ?

      స:     విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.

147. ప్ర:    శూరుడెవ్వడు ?

       స:    అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు

148. ప్ర:   చేవులను  దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?

       స:   సత్పురుషుల హితోపదేశము.

149.  ప్ర:  గౌరవమును పొందుటకు మూలమేది?

       స:   యా చింపకుండుట.

150.  ప్ర:   తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?

        స:   స్త్రీలనడవడి.

1 Com

ऊँ!

----

జయప్రదాయినీం ,జేత్రీం సుభగ శబ్ద వర్షదామ్

దౌర్భాగ్యనాశకీం , లక్ష్మీం , వందేశక్తిత్రయీం పరామ్

 శుభప్రదాయినీం, ధాత్రీం కరుణ దేవ వర్షదామ్

దుర్మార్గనాశకీం, శీఘ్రం గానే శక్తి నేత్రం పరామ్

----

జీవహింస చేయడం పాపం అనడం - నీతి 

ప్రేమచూపి బత్కడం పాపం అనడం - నీతి

దైవమాయ ఎప్పుడూ ఉందీ అనడం - నీతి

స్నేహ ధర్మ మెప్పుడూ న్యాయ మనడం - నీతి

కరిచే పామును చంపాలనడం - ధర్మం

మెరిసే చర్మము అందాలనడం - ధర్మం

అరిచే కుక్కయు కర్వాదనడం - ధర్మం

మనసే పంచియు మర్యాదనడం - ధర్మం

అక్షర మాల అర్ధాలలో పెరిగే

అక్కర హోద ఆర్భాటమే పెరిగే

ఆశల వల్ల అన్యాయమే జరిగే

అలక వల్ల పోరాటమే జరిగే

స్త్రీ హృదయం

పాషాణమైతే బతుకే దుర్భరం

ప్రోత్సాహమైతే మనువే దుర్భరం

దౌర్భాగ్యమైతే తనువే దుర్భరం

సౌలభ్య మైతే మనసే దుర్భరం

ఇంద్రజాలం అంటే ఏమిటి?

ఇంద్రియ జాలమే ఇంద్రజాలం. (మాయ)

 అది మూడు విధాల చూపెట్టి భ్రమ పెడుతుంది.

1. ఉన్నదానిని లేనట్లుగా చూపెడుతుంది.....

2. లేనిదానిని ఉన్నట్లుగా చూపెడుతుంది.

3. ఉన్నదానిని మరో విధంగా ఉన్నట్లు చూపెడుతుంది.

*మరణం అంటే అదృశ్యం. 

అదృశ్యం అంటే కేవలం దృశ్యం లేకపోవడమే  

*జననం అంటే దృశ్యం 

దృశ్యం అంటే కేవలం బంధం ఉండిపోవడమే 

*పయనం అంటే దాశ్యం 

దాశ్యం అంటే కేవలం స్నేహం ఉండిపోవడమే 

* నయనం అంటే దృష్టే 

దృష్టి అంటే కేవలం ప్రేమే ఉండిపోవడమే 

***

'నేను' అనే పదార్థం 'దేహం' లోనికి ప్రవేశించడమే 

"పరకాయ ప్రవేశం".

:నేను అనే ప్రయాణం " కాలం లోనికి ప్రవేశించడమే 

"అణువంత ఆవేశం" 

నేను అనే " ప్రమాణం " జీవం లోనికి ప్రవేశించటమే

"మనసే అవకాశం" 

నేను అనే " ఆశయం "  కార్యం లోనికి ప్రవేశించటమే 

" మనిషికి పాశం " 

***

*ఆత్మ బంధువు అంటే

 ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.

*ధర్మ భిక్షువు అంటే 

  ధర్మానికి నిజమైన భిక్షువు అని అర్ధం 

--(())

బ్రహ్మ జీవ తత్వాలు ... 10

సులభంగా, క్లుప్తంగా చెప్పబడిన వేదాంతమే

కఠినంగా, కోపంగా చెప్పబడిన వేదాంతమే 

మధురంగా మౌనంగా చెప్పబడిన వేదాంతమే 

శ్రవణంగా సాధ్యంగా చెప్పఁబడిన వేదాంతమే  

***

* భోగం, రోగం -- పాశ్చాత్య లక్షణం

 యోగం, జ్ఞానం -- భారతీయ లక్షణం

* త్రాగటం, తిరగటం .... పాశ్చాత్య లక్షణం

   తినటం, సహకరించటం.... భారతీయ లక్షణం

* ఆంగ్లభాష, ఆరాటం ... పాశ్చాత్య లక్షణం

   మాతృభాష, చదవటం .... భారతీయ లక్షణం

* అభద్రతా ఆశావాదం .... పాశ్చాత్య లక్షణం

   భాద్ద్రతా సేవాధర్మం .....  భారతీయ లక్షణం

***

* "జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

*"ప్రేమ బద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

* విద్యా బుద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం. 

   'స్వర్గం' కాదు.

* ధ్యాన సిద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

***

కానీ కాని జీవితంలో మలుపులు ఏవి?(3)

54--అద్దం లో చూడవచ్చేది ఏది?

 మాతాపితానుసారిణి (భౌతిక శరీరం) కదా

55-  మనం చేసె కర్మలను బట్టి తెలుసేది ఏది? 

మనస్సు ( సమాజానుసారిణి) కదా

56-  గురువుకు తెలుసేది ఏది?

 కర్మానుసారిణి (బుధ్ధి) కదా

57 -   ధ్యానంలో దొరుకేది ఏది?

 సర్వాత్మానుసారిణి (ఆత్మ)

58 -  చూడటానికి ఏమీ లేనిది ఏది?

  అనుసారిణి కాదు,  ఎందుకంటే ఆత్మే సర్వాత్మయే కదా

59 - జ్ఞానానికి నిధి ఎవరు?

అహం లేని పండితుడు కదా

60 - విమర్శ అనగా ఏమి?

సానుకూలం గా మార్చుకొనుటకే కదా

61 - మానవునకు ఉత్తమ మైన నిధి ఏది?

ఇచ్ఛాశక్తితో ధ్యానించడం మే కదా

62-  జీవితంలో ఆలోచన ఏది ?

మనిషికి చెట్టు చిగురులాంటిది కదా 

63 -జీవితంలో ఆ చరణ ఏది? 

మనిషికి చెట్టు మొగ్గ లాంటిది కదా 

64 -జీవితంలో ఫలితమనేది ఏది ?

మనిషికి చెట్టు లో కాయ వంటిది కదా 

65 -ఆత్మీయులకు ప్రేమ పంచితే ఏమవుతుంది ?

బాధ సగము, ఆనందం రెట్టింపు కదా 

66- కళ్ళు ఎవరిని నమ్ముతాయి ?

పేగు బంధాన్ని నమ్ము తాయి కదా 

67 -చెవులు ఎవరిని నమ్ముతాయి ? 

ఇతరుల మాటలనుఁ నమ్ముతాయి కదా

68- మాటకు, ప్రయత్నానికి సంభందం ఏది ? 

మాటకు మనసు కదులు, ప్రయత్నం జయమునిచ్చుకదా 

69- వివేకానికి, సహనానికి తేడా ఏమి ?

వేవేకంగెలవటానికి, సహనం విజయం సాధనకుకదా 

70- శ్రద్దగా విని ఏమిచెయ్యాలి ?

మితంగా, హితంగా, ప్రియంగా, జవాబు చెప్పాలికదా 

71- సామర్ద్యమువల్ల ప్రయోజనమేమి ?

సామర్ధ్యమే మనిషిని ఉన్నతస్థానమున ఉంచు కదా 

72- మనిషిలో దోషమంటే ఏది ?

తప్పుచెయ్యడం, తప్పును వప్పుకోకపోవడం, మరొకరిపై నెట్టడం కదా 

73- కృతజ్ఞత అంటే ఏమిటి ?

మనం చూపించేది ఆశించేది కాదు కదా 

74- విజ్ఞత అంటే ఏమిటి ?

మెదడుకు చేరే ఆలోచనలలో మంచిని ఎన్నుకోవడం కదా 

75- ఎవరిని క్షమించ కూడదు ?

శ్రద్ధ లేనివాడిని కదా

0 Comments

కధ కాని జీవి తం మలుపులు ఏవి?...(1)

నాకు మీకు ఉన్న సమస్యలే ఇవి అన్నీ

1. నాకు ఏదో లేదు?

జవాబు:-  ఏది ఉన్న పోయేదే కదా.

2. నాకు ప్రేమే లేదు ?

  జవాబు.. ఏది అన్న ప్రేమే కదా.

3. నాకు అనుబంధం లేదు ?

  జవాబు.. ఏది స్థిరముగా ఉండదు కదా.

4. నాకు ఆశ అనేది లేదు ?

   జవాబు... నిలకడలేనది జీవితం కదా

5. నాకు ఉన్నది పోయింది?

 జవాబు:- పోవడానికే  వచ్చింది. కదా

6. నాకు ఉన్నది., కానీ తృప్తిగా లేదు..?

 జవాబు:-  తృప్తి దానిలో కాదు,  నీలో లేదు.కదా

 7.నాకు కాలేపెనంతో సహవాసం లేదు..?

 జవాబు..నాలో  మటుమాయమై పోతుంది కదా

8. నాకు బురదతో పెనవేసు కోవాలని లేదు..?

జవాబు..నాలో మురికిమయమై పోతుంది కదా

9.. తామరాకు తో  స్నేహంచెయ్యాలని లేదు..?

జవాబు.నాలో..ఆణిముత్యమై మెరుస్తుంది కదా

10....ముత్యపుచిప్పలో చినుకు కావటంలేదు..?

జవాబు..నాలో.చినుకు ముత్యమై పోతుంది కదా

11....సాంగత్యమే మన జీవన మవ్వుటలేదు..?

జవాబు..నాకు కాలగమనంతో జీవనం అవుతుంది కదా

12...చెప్పేదెవరు? చేసేదెవరు?

జవాబు ।। చెప్పేది, చేసేది మనిషియే కదా

13... ఆలోచించే దెవరు, ఆచరిచే దెవరు?

జవాబు। భార్య ఆలోచనతో భర్త ఆచరణ కదా

14।మనిషి ఎవరు? ఆమనిషి ఎవరు?

జవాబు... మనిషి హృదయం, ఆమనిషి స్పంధనే కదా

15।।అసలు జ్ణానం అంటే ఏది?

జవాబు... హృదయం అర్ధం ఐతే జ్ణానం కదా

16। బానిసత్వం అంటే ఏంది?

జవాబు... ఓర్పుకు పరీక్ష యే కదా

17। మనసుకు వారసత్వం ఏది

జవాబు... ప్రేమ ఒక్కటే కదా

18।।పుట్టుమచ్చ,పచ్చబొట్టు దేనికి?

జవాబు... బిడ్డగా గుర్తింపుకే కదా

19। అనుభవం  దేనికి?

జవాబు... మనసుకే భారం దేహానికే కదా

20।।। కళ్ళు చూస్తే ఏమంటారు?

జవాబు... దృశ్యతే కదా

21।।। కళ్ళు మూస్తే ఏమంటారు ?

జవాబు... స్మృతి,అంతర్గత దృష్టే కదా

22।చేనులో ఏముంది?  నామేనులో ఏముంది ?

జవాబు... చేనులో బంగారం, నీ మేనులో సింగారం 

23-తోటలో ఏముంది ? నా మాటలో ఏముంది ?

జవాబు... తోటలో మల్లియలు, మీమాటలో సరిగమలు   

24-మబ్బులో ఈముంది ? నామనసులో ఏముంది ?

జవాబు...మబ్బులో పన్నీరు, నీ మనసులో కన్నీరు

0 Comments

కానీ కాని జీవితంలో మలుపులు కధ..(2)

25..దట్టమైన చీకటి ఏది ?

జవాబు : అహంకారంతో అంధకారం కదా 

26..నమ్రత తొలి మెట్టు ఏది ?

జవాబు :: అహంకారము విడనాడుట కదా 

27...నిరాశ ఎందుకు వస్తుంది ?

జవాబు:: ధైర్యం, విశ్వాసం సడలినప్పుడు కదా 

28...విజయం ఎక్కడుంటుంది ?

జవాబు :జ్ఞానం తెలివి ఉన్నచోట విజయం కదా 

29...ముహూర్తం అక్కర లేనిది ఏది ?

 జవాబు :: మంచిపనిచేయడానికి వద్దు కదా 

30...సహిచకూడనిది ఏది ?

జవాబు : న్యాయాన్ని అతిక్రమించే అన్యాయం కదా 

31...బాధలు లేకపోవుట కారణమేమి?

జవాబు : మనిషిలో ఆశ లేక ఉండుటే కదా  

32...మాకు మితిమీరిన ఖర్చు అయితే ఏమి ?

జవాబు : మీరు పేదరికం పాలు అవ్వటమే కదా  

33...మాకు మితిమీరిన పొదుపు అయితే ఏమి ? 

జవాబు : మీరు కష్టాల పాలే అవ్వటమే కదా

34...మాకు మితిమీరిన సంపాదన ఉంటే ఏమి ?

జవాబు : మనశ్శాంతే  లేకుండుటయే కదా  

35...మాకు మతి కర్తవ్యం శోధన అయితే ఏమి ?

జవాబు : భయము శాంతి లేకుండుటే కదా  

36...మాకు క్రమ శిక్షణ ఉంటే ఏమి ? 

జవాబు : రక్త సంబధమె దూరం అవ్వటమే కదా 

37...మాకు బాధ్యతలే ఉంటే ఏమి ?

జవాబు :అప్పులకు నీవు దూరం ఉండటమే కదా  

38...మాకు మితిమీరి నట్టి హాస్యము ఉంటే ఏమి ? 

జవాబు : నవ్వుల పాలు అవ్వటమే కదా 

39...మాకు మితిమీరిన నీ కోపము ఉంటే ఏమి ?

జవాబు : భయాన్ని  వృద్ధి చెయ్యటమే కదా 

40...మాకు మితిమీరిన ఆలోచన ఉంటే ఏమి ?

జవాబు : నీ జీవితం దుర్భరం అవ్వటమే కదా 

41...మాకు వ్యసనాలే అలవాటైన ఏమి ? 

జవాబు : అపమృత్యు పాలవ్వడం కదా  

42...మాకు మితిమీరిన స్వార్ధం ఉంటే ఏమి ?  

జవాబు : అందరిని దూరం చేయుటయే కదా  

43...మాకు మితిమీరే ప్రేమ ఉంటే ఏమి ?  

జవాబు : నష్టాల పాలే చేయుటయే కదా    

44...మాకు మితిమీరె లాభార్జన ఉంటే ఏమి ?

జవాబు : వ్యాపార ఉనికి మోసం అవ్వటమే కదా  

45...మాకు వస్తూత్పత్తీ మీరిన  ఉంటే ఏమి ?  

జవాబు : జరుగు నాణ్యత లోపం అవ్వటమేకదా 

46...మాకు మితి గర్వాహంకారం ఉంటే ఏమి ?

జవాబు : ఆపదలు కొని తెచ్చుకోవటమే కదా 

47...మాకు మితిమీరె అలంకారం ఉంటే ఏమి ?

జవాబు : ఎపుడు వెగటు పుట్టిస్తుంది కదా 

48...మాకు మితిమీరిన శృంగారం ఉంటే ఏమి ?

జవాబు : వైరాగ్య0 కలిగిస్తుంది కదా 

49...మీరె కామాంధకారం ఉంటే ఏమి ?

జవాబు : జీవచ్చవం చేస్తుంది కదా 

50...మాకు మితిమీరె దారిద్రయం ఉంటే ఏమి ?

జవాబు : నేరా లనే చేస్తుంది కదా  

51...మీరె అధికార దాహం ఉంటే ఏమి ?

జవాబు : పగను ప్రేరేపిస్తుంది కదా 

52...బలహీను లైనప్పుడు ఏంచెయ్యాలి ?

జవాబు : భగవంతుడి దాస్యం కోరాలి 

53...బలవంతులవగానే ఏంచెయ్యాలి ?

జవాబు : భగవంతుడి వేషం వెయ్యాలి 

--(())--

0 Com

నేటి కవిత్వం 

ఆకలికి తగ్గ ఆహారం

ఆచరణ తగ్గ  ఆరోగ్యం 

ఆశయము తగ్గ ఆదర్శం 

అక్కరకు తగ్గ  ఆనందం 

స్వల్ప ధర్మమే జీవితానికి శాంతి 

స్వల్ప సత్యమే సంశయానికి శాంతి 

స్వల్ప బుద్ధియే ఆశయానికి శాంతి 

స్పల్ప మాటలే  జీర్ణమవ్వుట శాంతి   

నిప్పు రవ్వ చిన్నదే దూది కుప్ప భస్మీపటలం  

తప్పు చేసి ఒప్పకే జీవితాన్ని   భస్మీపటలం

మంచి మాట నమ్మకే సంపదంత భస్మీపటలం

శంక భార్య భర్తలే మానవత్వ భస్మీపటలం

స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ (భగవద్గీత)

*****

బ్రహ్మ తత్వభావాలు

స్నేహ పాఠమే వెళ్ళి స్తే - సుఖం

కొన్ని కోర్కలే మానేస్తే - సుఖం

కాల ఛేధనం మానేస్తే - సుఖం

పోల్చుకోవడం మానేస్తే - సుఖం

దైవమ్ము నమ్మ కుంటే - దుఃఖం

కోపమ్ము చూపుచుంటే - దుఃఖం

ఏదైన కాల్చుకుంటే - దుఃఖం

దేన్నైన పోల్చుకుంటే - దుఃఖం

సృష్టి చైతన్య ప్రకృతి 

ఆత్మ చైతన్య ఆకృతి 

దైవ చైతన్య స్వీకృతి 

హర్ష చైతన్య జాగృతి

ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ 

యోగ తత్త్వం వినయ భావంతొ జన్మ   

మౌన తత్త్వం బతుకు భారంతొ జన్మ 

ప్రేమ తత్త్వం సుఖము పొందేటి జన్మ

పరాత్పరుని శబ్దము గ్రహించలేము 

అనంతునికి  శబ్దము బ్రమించలేము  

శివాత్మపర శబ్దము సృతించలేము

సహాయపర శబ్దము క్షమించ లేము 

సర్వోత్కృష్ట  శబ్దం ఓంకార నాదం

సంభోదాత్మ శబ్దం ఘింకార నాదం 

మొక్షాత్మాన శబ్దం  ఝ0కార నాదం   

జీవాత్మాన శబ్దం సంసార నాదం 

-(())-

విశ్వ రూప ప్రాణుల అంతర్గత శక్తియే 

ఉదర జఠరాగ్ని ని శాంతి పరచు 

విశ్వ రూప ఉషోదయ కిరణ శక్తియే  

స్పూర్తి దాయక జీవన శక్తిని ఏర్పరుచు ....   

విశ్వ రూప ముచే గ్రహించే శక్తియే 

జీవన ప్రదాత చేతన శక్తి  శాంతి పరచు 

చంద్ర  జీవశక్తి, మాంసమేధారూప 

స్థూల తత్వమే జీర్ణశక్తితో యుక్తిని ఏర్పరుచు ..... 

సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే 

ప్రాణము సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించు 

ప్రకృతి స్థూలరూప భూత సముదాయమే 

ప్రాణికి ఆశా పాశము కల్గి సంపదకు సహకరించు ..... 

ఆకృతి. ధన ఋణతత్వముల ప్రేమయే 

ప్రాణ రయిశక్తి  సంయోగముచే సృష్టికి సహకరించు

సంపూర్ణ జగత్తు లో బ్రహ్మ చర్యపు భక్తియే 

సంసార సంపూర్ణ విశ్వాస చేతనా శక్తి ముక్తి  సహకరించు ..

***బ్రహ్మ తత్వ భావాలు

పునరుత్పత్తికి సత్యం

దాంపత్యానికి ప్రాణం

ప్రకృతిలో పరవశత్వం

మనిషిలో ప్రేమతత్వం

హెచ్చు తగ్గులు దేనికి

తప్పు ఒప్పులు జీవికి

మంచి చెడ్డ లు గాలి కి

వచ్చి పోవును జీవికి

భగవంతుని త్రాసులో:-

అణువు, బ్రహ్మాండం సమంగా తూగుతాయి 

మగువ గర్భాండం సమంగా తూగుతాయి.

మనిషి దుష్టాత్మా సమంగా తూగుతాయి

ఫలము ఆహ్వానం సమంగా తూగుతాయి

' నీ తాడు తెగా..' 

ఇది ఒక వేదాంత పరమైన ఆశీర్వచనం.

' నీ గోడు మారే '

ఇది ఒక రాధ్ధాంత పరమైన ఆశీర్వచనం

' నీ ప్రేమ గోలే '

ఇది ఒక ఆకర్ష పరమైన ఆశీర్వచనం

' నీ ఇష్ట లీలే '

ఇది ఒక ఆనంద పరమైన ఆశీర్వచనం

 నీకు బంధం తొలగి (తాడు తెగి) మోక్షం కలగాలని ఆశీర్వదించడం అన్నమాట.

పంచభూతాలు వేరైనా సృష్టి ఒక్కటే

నిత్య ధర్మాలు వేరైనా ధర్మ మొక్కటే

సృష్టి ప్రాంతాలు వేరైనా సృష్టి ఒక్కటే

విద్య భావాలు వేరైనా బుధ్ధి ఒక్కటే

ఆధ్యాత్మికం అంటే 

ఉన్నదానిని ఉన్నది అని తెలుసుకోవడమే.

భక్తి భావము తెల్పుట అని తెలుసుకోవడమే

శాంతి పొందుట అన్నది అని తెలుసు కోవడమే

కాలం నిర్ణయ భావము అని తెలుసు కోవడమే

0 Comm

బ్రహ్మ తత్వ భవాలు 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మొదట 'జ్ఞానాన్ని' చూడు 

తర్వాత 'జ్ఞాని'ని చూడు

మొదట విశ్వాన్ని చూడు

తర్వాత విద్యని చూడు

మొదట దృశ్యాన్ని చూడు

తర్వాత అర్ధము చూడు

మొదట దేహాన్ని చూడు

తర్వాత బుద్ధిని చూడు

ప్రతి ఒక్కరు దేవుని అవతారములే 

సర్వ సృష్టి కి మూలము అవతారములే 

విశ్వ మోక్షము తెల్పును అవతారములే

జీవ కోటికి బుద్ధులు అవతారములే 

నిత్యమూ కనిపించేవి దశావతారాలు 

సత్యమై తలపించేవి దశావతారాలు

తత్వమై మనసించేవి దశావతారాలు

గత్యమై  నివసించేవి విశాలతారాలు  

 జీవుని తలంపు -

కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.

ప్రేమపక్వ౦ పొందడానికి కొంత కాలము అవసరం 

దేహభావం అర్ధమవ్వట కొంత దాహము అవసరం 

కాలదైవం పోల్చడానికి కొంత  భావము అవసరం   

 భగవంతుని తలంపు -

తలంపు, కార్యం  ఏకకాలంలో జరుగుతాయి.

అనంత, మొహం సామరస్యంలో జరుగుతాయి 

పదంతొ లాశ్యం  హావభావంలో జరుగుతాయి  

జపంతొ నిత్యం  సేవ కార్యంలో జరుగుతాయి

అన్ని వదిలితే అది "త్యాగం".

ప్రశ్న తగిలితే అది " బంధం"

సృష్టి జరిగితే అది " ధర్మం"

ప్రేమ పెరిగితే అది " మౌనం"

వదిలి న వాడిని కూడా వదిలితే అది "పరిత్యాగం".

ముదిరి న వాడిని ప్రశ్నే అడిగితే అది "ధనత్యాగం"

బతికిన వాడికి ఆశే కలిగితే అది "జప త్యాగం

మనసున చేరిన హోదా మరిచితే అది కధత్యాగం



మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు

బ్రహ్మ తత్వ భావాలు

స్త్రీ విశ్వరూపం... ఛందస్సు

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

దేహంలో తాను ఉండడం- జడ స్త్రీ గా

ప్రేమంతో ఉండి ఒప్పడం - నిత్య  స్త్రీ గా

మనలో మర్మం ఉండటం - జీవ  స్త్రీ గా

 తనలో దేహం ఉండడం - జీవ  స్త్రీ గా

ఆమె ఆత్మ సౌందర్యం చూపు స్త్రీ గా

తోసు కొచ్చె వైరాగ్యం  చూపు స్త్రీ గా

కాని దంటు కారుణ్యం చూపు స్త్రీ గా

ఉండే లేక వచ్చేంతా చూపు స్త్రీ గా

నిత్య ప్రేమ కుర్పించే చూపు స్త్రీ గా

దిక్కు లన్ని కమ్మేసే ప్రేమ స్త్రీ గా

దాగి ఉన్న భావాన్నే తెల్పు స్త్రీ గా

చెప్పుకోని జీవమ్మే మార్చు స్త్రీ గా

దేహ మంత ముద్దుల్తో ముంచు స్త్రీ గా

ప్రేమ తోను ఆడించే  నిత్య  స్త్రీ గా

 మర్మ మాయ తో వేదిం చేటి స్త్రీ గా

 జీవ ధర్మ భావంగా  ప్రేమ స్త్రీ గా

  దేహ త్యాగ మాధుర్యం  జీవ  స్త్రీ గా

నిత్య యవ్వ నమ్మేనూ పెంచు స్త్రీ గా

నిర్మ లత్వ సౌభాగ్యం పంచు స్త్రీ గా

నగ్న తత్వ శాస్త్రంమ్మే తెల్పు స్త్రీ గా

సర్వ మిచ్చి దోచేటీ కావ్య స్త్రీ గా

కొన్న బిడ్డ ఆరోగ్యం చూడు స్త్రీ గా

కన్న వారి ధర్మాన్నీ నిల్పు స్త్రీ గా

కన్న తల్లి తండ్రుల్లా చూచు స్త్రీ గా

--(())--

నీటి జీవిత చక్రం 


నా మనసే దేహములో మదనమ్ముతొ డోలుతూ

కొలిమి నిప్పు కణిక లన్ని వేదనలా కాలుతూ

కల్లోలిత కడలిగాను  అలలన్నీ పాకుతూ

ఎడారిలో రేణువులై గాలిలోన  ఎగురుతూ

కరిమబ్బులు  ఆశలతో అఘాధంలొ మునుగుతూ

కంటనీరు నిశిచింతల సమయములో జల్లుతూ

పద పలుకుయె అడకత్తెర వక్కలుగా నలుగుతూ

కోటిఆశ లన్ని గులక రాళ్ళవలే కూరుతూ

మమత మసక మతాబులై పొగలన్నీ సూరుతూ

దిక్చూచియె పరిహాసము స్థితి చిక్కులు తూగుతూ

కోరికలే మఱ్ఱి ఊడ లుగా  చుట్టు ఊగుతూ

ప్రవర్థమా న రుధిరమ్ము హృదయమ్మున సాగుతూ...!!


నవ్వుల రువ్వే పువ్వమ్మ నీ నవ్వులు నాకివ్వమ్మా ఓడిమిపడతాను నీ  స్థపణలు అన్నీ 

ప్రమిదకు వెలుగివ్వాలని తపన, స్నేహితులతో కలవాలని తపన,  ఓర్పుకు ఒక పరీక్ష తపన,  భంగ పడ్డ, మీదపడ్డ, తృప్తి లేక పొతే జీవితం అంతా తపనే  

కాంతి ధార పంచే తపన, నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించాలని తపన, నేల చినుకును కోరుకుంటుంది నాలో తపన తగ్గించమని,  నింగి సహకారంతో పులకరించి గలిగి అందుకోలేక అంతా తపనే 

మధురవాణి మనవెంటే ఉంటే తపనే,  మమతలు పంచుతూ విజ్ఞాన వంతులుచూపే మరోర్రకం తపనే, తనువును స్పర్శ అవసరమన్నదే, జిహ్వచాపల్యంనకు  స్పర్స్ సుఖమన్నదే బ్రతుకు తిగుర్తు తెలియపరిచే తపనే 

రచ్చబండ రాజకీయ కూడా తపనే, ఉడతలా సహాయ బడాలన్నది కూడా తపనే,  

వయసుని బట్టి  ప్రవర్తించడమే, వానరుడులా సహాయపడుతూ బ్రతకంతా సేవల మయమై యెలియుగంలో నిజమైన తాపాత్రయ తపనే అగును 

  *****                                                                          రేపు మళ్ళీ అధ్యాత్మికం 

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (3)  

              రెక్కలు ముక్కలు చేసిన డొక్కయుఁ నిండదు కొందరి బ్రతుకులో, మక్కువ చూపిన తిన్నది కక్కుము అనే దుర్భర పల్కులు కోపముయే, కొందరి మనస్సును విరచును, ఎక్కువ మాటలు చెప్పకె లొంగియె తిండికి రూకలు తీసుకునే వారు కొందరు, తక్కువ చాలవు, భాదతొ ధనము కోరితే రేపు  నుంచియు రాకుఅనే మాటే ఇదేలోకం దీనికి కారణం అవిద్య పరిణామం । 

చదువు సంధ్యలు లేకయే కొందరి జీవితాలు సాగి పోతూ ఉంటాయి 

విద్యయే నేర్పును - వినయ సాహిత్యము
విశ్వ జగతి మేలు - విద్య వల్ల
సద్విని యోగమే సర్వ - జనుల లీల
సత్య పంధాననే - సాగు నెల్ల
ధర్మ మార్గమ్ముగా ధోరణి - యందు ప్రగతి
నిర్విరామ కృషి యే - నిజము లెల్ల
నిర్ణీత బంధమే - నీకు విద్యయెరక్ష
నిర్మల మనసున - నియమ మల్లె
****
ఎంత చదివినా నడవడి ఎంతొ మేలు
చదువు వున్న గుణము లేక చచ్చు మేలు
బ్రతికి బ్రతికించు విద్యయే బంధమేను
ప్రాజలి ఘటించి విద్యతో ప్రభల వెలుగు
*****
ప్రాణమే స్ఫూర్తిగ - ప్రణయ ప్రభావమే
రేకెత్తించు మనసు - ప్రతిభ వెలుగు
ప్రాంతీయ శాంతియే - ప్రాధమిక విలువే
ప్రగతిలో చెలిమియే - ప్రభల వెలుగు
ప్రాబల్యం అధికమై - ప్రాధాన్యత కళలే
ప్రావిణ్య శక్తితో. - ప్రాణ వెలుగు
ప్రాముఖ్యత నుబట్టి - ప్రారబ్ధ సంతోషం
ప్రత్యేక పరిణతి - ప్రధమ వెలుగు
*****
తప్పులను సరిదిద్దుతూ తరువులాగ
కష్టములుపంచి సుఖములై కళలు లాగ
ఆలుమగలు చెలిమి తీర్పు పాలు జలము
ప్రాంజలి ప్రభ జీవితం ప్రతిభ వెలుగు
****
జీవుడు తన్ను తాను తెలుసుకునే ప్రయత్నంలోనే,  'జీవన చక్రం' ఏర్పడింది.
కొంతమంది జ్ఞానం సంపాదించి జ్ఞానమార్గం లో వెళతారు. పూర్తిగా  చదువు కోనివారు కూడా భగవంతుని పట్ల భక్తి ద్వారా తన అవగాహన మేరకు దానిని సాధించడానికీ ప్రయత్నిస్తారు.  అందరూ చివరికి పరబ్రహ్మ అయిన పరమాత్మ చేరుకుంటారు. నిరాకారమనగా ఏ పరబ్రహ్మ నుంచి ఈ ఆకృతులు వచ్చాయో ఆ పరబ్రహ్మకు రూపం లేదు, కానీ సాకారరూపం కూడా ధరించగలడు. ఆయన నిరాకారుడు, సాకారుడు, జ్ఞానీ, ముండీ, అజ్ఞాని,భిక్షు ఇలా రకరకాల రూపాలలో వ్యాపించి విద్య నభ్యసించి ప్రజల బాగోగులు తెలుసు కొని ఒక ఆధారం చూప పగలిగే శక్తి చదువుకున్న వారిలో ఉన్నది ఇది సత్యము, సత్యము , సత్యము 
                                                                 
****** రేపు మళ్ళీ అధ్యాత్మికం

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (4)  

 మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది.

    స్ధిర మన్నది బతుకే, బతుకన్నది కోరికే, కోరికన్నది నడకే, నడకన్నది కలయకే, కలయికే జీవితం  
జీవితం అన్నది జవాబు, జవాబు అన్నది ఆకలి, ఆకలి అన్నది దాహము, దాహము అన్నది ఓపిక 
ఓపిక అన్నది మనసు, మనసు అన్నది మాయ, మాయ అన్నది ఆశ, ఆశ అన్నది  ఆలోచన 
ఆలోచన అన్నది కళలు, కళలు అన్నది కలలు, కలలు అన్నది సెగలు, సెగలు అన్నది వెతలు 
వెతలు అన్నది కోరికలు, కోరికలు అన్నది గుర్రాలు, గుర్రాలు అన్నది దౌడులు, దౌడులు అన్నది కోపాలు శాపాలు కలయిక యే జీవితం, శ్రీరామచంద్రుని ప్రార్ధిస్తూ, ఆంజనేయకృపతో ధైర్యము గా జీవితాన్ని సాగించాలి        

త్రిగుణ సంపన్నుడు త్రికరణఙ్ఞానియే త్రివిధ శోభితుండు 
శ్రీగుణదాముండు సిద్ధపురుషడతడు శోకనివారణుడు
ద్విగుణీకృతుండు దివ్య తేజుండును ధైర్యగుణధాముడు
సుగుణ సంభూతుడుశుద్ధ శివ ప్రియుండు భక్త ఆంజనేయ 

నా నుండి అగ్ని.., అగ్ని నుండి వాయువు.., వాయువు నుండి ఓంకారం..,ఓంకారంతో హృతి..
 హ్రుతితో వ్యాహృతి..వ్యాహృతితో గాయత్రి.. గాయత్రితో సావిత్రి.. సావిత్రితో వేదాలు..వేదాలలో సమస్త క్రియలు..ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
.
        మన దైనందిత జీవితంలో జాగ్రదావస్థలోనే గాకుండా, గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు , ఇంద్రియాలు పనిచెయ్యవు. ఐనా ఊపిరి పీల్చుకోడం, గుండె కొట్టుకోవడం అనే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనలను జీవింప జేసేది ప్రాణము. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా శరీరాన్ని, అవయవాలను నడిపిస్తుంది. ఈ ప్రాణ శక్తి మనలో ఉండే సూక్ష్మ శక్తి. దేహంలో ఉండే చేతనమంతా ప్రాణము యొక్క వ్యాపారమేనని చెప్తారు.ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు అన్ని సమయ తృప్తి శాంతి సౌభాగ్యం అందరికీ ఆ పరాత్పరుడు అందచేస్తాడు అందుకే నేచెప్పేది "ఎలాంటి నటనలు  లేకుండా మీకు మీరుగా, యధాతథంగా ఉండండి. అదే మీ నిజ స్వరూపం".

******                                                                రేపు మళ్ళీ అధ్యాత్మికం
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (5)  

     ప్రేమ నీ సహజ లక్షణం అయినప్పుడు దేవుడు, నీ లోపల అనుభవ మవుతాడు।  ప్రేమ  ద్వారానే జనం దేవుణ్ణి చేరుతారు। ఇతరులు నిష్ఫలంగా నీరు గారుతారు।  ప్రేమని అనుభవానికి తెచ్చుకోండి। భయము లేని ప్రేమయే జీవితంలో సుఖము। చీకటి కలిసేది పలుకుమారేది, మనసున మనసై, ధనము చుట్టూ ఆటలాయే। బాల్యాయవ్వనవాంఛలు,  దూరదర్శని కధలు సమయాన్ని దుర్వినియోగమా సద్వినియోగమా అర్ధం కానీ జీవితాలు అలవాట్లు।       

సీ :: కటిక చీకటిగను కాని వారుకలిసె
కోపమే పెరిగియు కిటుకు లాగ
పరుల తప్పులవల్ల పలుకులో మార్పులే
మనసున బాధించు మమత లాగ
మంచి గుణము ఉండి మనసుననె మనసై
సహన శక్తి గనులే చరిత లేఖ
ధనము వల్లనె బుధ్ధి దారిమార్పులగుటే
అవివేక బుద్ధితో ఆటలాయె

తే :: మౌన మేను జీవితములో మౌఢ్య ప్రతి భ
క్తియును సర్వమంగళ కరం కలయకేను
కళలు సాహిత్య ప్రాభవం కలసి యుండి
ముఖ్య గమనిక బ్రతుకులో ముడుపు లగుట
*****
సీ ::శుభమేను బెరగని సూక్షముయే కొంత
బాల్యమందుండెడి బ్రమన కొంత
యవ్వన ఉల్లాస ఆశ వాంఛలు కొంత
వినయపు మాటలు వినక కొంత
విధి ఆట లొనలిగే విశ్వమ్ము నందంత
యేమార్గమోయని యెంచికొంత
సేవింపదలచియే సిగ్గు చేతను కొంత
ఏడ్చెవారున్నారు నేడ్పు కొంత

తే::కాలమంతయు ఇటులనే సాగియుండె
ఆశ పాశమనకు చిక్కి ఆట యుండె
నిన్ను పూజింపవలెను న్న నిశ్చ యంబె
నన్ను నా మనసుని మార్చె నటన యుండె
*****
సీ:: నేటి తెలుగు వింటె నియమాలు మార్చాలి
మన కుటుంబము యేన మత్తు చూపె
దూరదర్శిని చూడ ధూర్తుల నటనలే
పతనాన వ్యవస్థ ప్రగతి లేక
రోజు రోజుకు కధ రోకలి పోటు యే
రంకుబొంకుల స్త్రీ లు రంభ బుధ్ధి
చూడముచ్చటపాట చూపులకే లేదు
కొత్త వింత యనియు కోర్కె చూపె

తే :: కళ్ళు అలసటే తప్పని కనికరమ్ము
ఒళ్లు గుల్ల చేసి నటన ఓర్పు వల్లె
ధనముచుట్టూను తిరిగేది డప్పు మోత
తప్పనిసరిగా చూడాలి జనుల తీర్పు
                                                                                 రేపు మళ్ళీ అధ్యాత్మికం
******
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (6)  

దేశము ఒక పెద్ద తరువు,తెరువు కోసం వ్యక్తి గతాన్ని, విమర్శించడం, ప్రశ్నించడం,పరుష భాషగా,ధూషణగా, వాదనలతో, తెలుసు కోవాలని ఆకాంక్షతో, విజ్ఞాన మనే చెట్టునీడ చేరే పక్షిలాగ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, తరిమి వేసే సమర్ధత సామర్ధ్యం కలిగి, సర్వ మంగళం కొరకు కృషి చేయుటే వ్యక్తి గత మార్పు, సమాజం గుండెల్లోకి సమిష్టిగా, సహాయ సంస్కారం, వ్యవస్థ సంస్కృతి

సీ::రభస ఆస్తుల్లో నె క్రౌంచ పక్షి లగుటే
అంతస్తు ప్రేమలే అణువు పొంగు
జతలోన భయములే జాడ్యము లగుటయే
చెడుపుకోకనె బుధ్ధి చెడుగు లాట
సాధన అనునది శోధన మలుపులే
సంతోష ఓర్పులే సంఘ టాట
మనవారు పరులైన మనుగడకు నటనే
ఒంటరిగానేర్పు ఓర్పు మలుపు

తే::సమయ సంక్షోభ ప్రాభవ స్థితియ కలిగె
మారు పలకలేని వయసు మనసు మాట
విషయ వాంఛలు ధనముగా వినయ ముంచు
విధిలొ ఆటయే విపరీత విద్య వల్ల

తాత్విక చింతనే పత్రిక, సైనికుల్లా క్రమశిక్షణ,పట్టుదల, దేశంపై అవగాహన, ప్రజల ఆకాంక్ష ను దృష్టిలో పెట్టుకొని, బ్రతుకు తెరువు కోసం, ప్రజల మేధస్సు తో ఆడు కొనెటిది, అస్తవ్యస్తమైన సేకరణ, అందరికన్నా ముందుసమాచారాన్ని అందించాలని ఒకతపన, ఒక్కరూ కాదు లక్ష, లేదు లేదు కోటి సైన్యం తో అంది స్తున్న సమాచారం, ఒక్కరోజే, రేపటికి ఆ వ్రాతలు, వ్యాఖ్యలు,ప్రశ్నలే, నిజంనిర్భయంగాతెలపలేని రెండోరోజు స్థితి.

సీ::భాగ్యవంతులు గుండె -భయము చుట్టు తిరుగు
పెద్ద మాను ధనము- బలము చుట్టు
కుండీన దాచిన -కులమనే ధనమునే
సంకెళ్లు రానివ్వని -చరిత చెట్టు
ఆయుధాలరహస్య -ఆరాట బంధమే
సాయుధ జనులలో -సరయు పట్టు
వేరుకత్తులసాన - వేదన ధనమంటు
ఆచార తెరువు లా -ఆట గుట్టు

తే::ఉద్యమం తెర ధనముతో ఊపిరగుట
జీవితాన కత్తెర ఖర్చు జనుల గుట్టు
తరువు తపనలు ధనమనే తాప మెట్టు
ఊపిరి కలిగించును ధనం ఉద్యమం దు

ఇక ప్రజలకు రక్షణ దైన్యం, బ్రతుకు యే రాజకీయ మగుటే నేటి పరిస్ధితులు, చెట్టు మీద పక్షులు ఫలాలు కొరుక్కు తిన్నట్టు పత్రికా స్వేచ్ఛ తో ప్రజల మనసుతో ఆడుకుంటున్నారు. అవసరమా అనవసరమా అనేది లేదు డబ్బున్న వాడి మాటలు, అధికారుల ఆటలు అమాయకులపై వేటలు ఇదే దేశ ప్రగతి ప్రతిభను గుర్తించలేని అధోగతి, అర్ధం పరమార్ధం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అర్ధం కాని,లేని స్థితియే మనది ఇదే మనకున్న స్వేచ్ఛా.

కం :: తృటిలో న జరిగిన ఘటన
మటు మనసుననె దరహాస వేదన మారెన్
వటులై వరుసైన విధియె
కుటిలాలక యెడమ కన్ను కుడికన్నాయన్
****
ఇదే లోకంలో మాయ ఎవ్వరు ఛేదించలేరు అనుభవించటం తప్పా 

 త్ర్యంబకేశం , మహారుద్రం ,
  అభిషేకప్రియం , శివమ్..
  ధనాధిపతిసఖం , తం ,
  నమామి సూత్రదాయినమ్ !!! 
                                                                                రేపు మళ్ళీ అధ్యాత్మికం
******

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (7)  

అంశం:   "మాతృభాషాదినోత్సవం"       

చం..మాతృగర్భంమ్మై మారని ధైర్యమై  జేరు అమృత భాష
తల్లి నోటినుండి తొలుత చెవినబడిన మధుర తెలుగు భాష 
బాల్యమునందునే  ఊగుతూ విన్నది తెలుగు జీవ భాష
పిల్ల లనుండియే పెంపు జేసి నెట్టి ప్రాధమిక భాష
జల్లు పర్యంతము జీవ నాధారం మాతృభాష తెలుగు ఈశ్వరా
*****
మాతృభాషనుమోసగించుట పండితులు ప్రియమైనది, నోరు ఎత్తలేని స్థితి తెచ్చిన ప్రభుత్వాలు, మరియు అధికారభాష నాయకుల అసమర్ధత, ఇదేనండి తెలుగు ప్రగతీ.
మాత మదిలో పీఠమెక్కెను తనకు రాని భాష పిల్ల లునేర్వాలని ఆశ పౌరులుగా మారటం, బ్రతికి బ్రతికించని ఆంగ్ల బాష మనకొద్దు, మన తెలుగు భాష మనకు హద్దు, బానిసత్వ పలుకుల భాష మనకు అవసరమా, చిత్రసీమల చిలుక పలుకులు తెలుగు మంటకలిపే ‌‌‌‌‌‌‌‌‌‌ప్రచారాలు కళ్ళు తెరవండి తెలుగు తల్లి ఘోషించే చూడండి, భాషనేర్పగరాజకీయము‌ అమ్మరొమ్ము గట్టె విధాన ‌‌‌‌‌‌‌‌‌తెలుగు పాఠశాల లు మూతపడింది, మొక్కు బడి నిర్ణయాలు ఎవరి కొరకు,
ఆత్మ వంచన చేసుకోండి ప్రతిఒక్కరూ, మన మాతృభాష కు ఆదరణ కు కృషి చెయ్యడం అందరికీ అవసరం.
****
కం..కొండచిలువ గా ను తెలుగు యే
ఉండబట్టక వెల్గు రహదారి ఉరుకులు బట్టెన్
కొండను బాదుట మనస్సు
బండగ కదలని తెలుగు యే బంధము అవుటన్
పితృభాష తెలుగు ఎవరికీ
ఆతృత ఉన్నను మనస్సు అలకగా తెలుగున్
శృతి లయలు కదలికలు 
మతిలోన తెల్పక తెలుగనే మరిచెను ఇపుడున్

కాలముతొ కవిత్వము వచ్చు కళలు వలెను
వేల ఏదైన మనసులో వేడుకలు లె
మేలు రోగము కమ్మినా మనసు తెలుగు
కలలు అన్నియు తీరును కలిసి వచ్చు
****
చెం..తెలుగు సినిమా గ తెగులు తెచ్చు భాష వాడు చుండిరంత
వెలుగు దేవుడెరుగు వెకిలిచెష్టలగుట హాస్య మనట ఏల
బలపముపట్టకే బండెడు మోతగా ఆంగ్ల చదువు బ్రతుకు
మళినమాయె తెలుగు మంగళకరమైన తెలుగు ఎప్పుడొచ్చు
                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (8)  

దృశ్య జగత్తు.. మనకు ఆట స్థలం: -

Right (ఒప్పు)  -  అదృశ్య ప్రపంచం
Left (వదలడం) - దృశ్య ప్రపంచం
ఆత్మ పరిణామ క్రమంలో రెండు ప్రపంచాలను సమన్వయపరచాలి. 

ఈ ప్రయాణంలో క్రమక్రమంగా మన  "Left" Hand వైపు ఉన్న అశాశ్వతమైన సిద్ధాంతాలతో కూడిన దృశ్య ప్రపంచాన్ని "వదిలి" వేస్తూ,  "Right" Hand వైపున ఉన్న అదృశ్య ప్రపంచంలోని  శాశ్వతత్వాన్ని "ఒప్పు"కుంటూ దానికి చేరువగా ఉంటాము.  ఒక్కసారి కనుక మనం అపరిమిత శక్తులతో కూడిన ఈ ఉన్నత స్థలం లోని మన నిజ శాశ్వత తత్వంతో సంబంధం ఏర్పరచుకుంటే, మనం నివసిస్తున్న పరిమిత శక్తులతో కూడిన భౌతికపరమైన ఈ దృశ్య జగత్తు అంతా కుడా కేవలం ఒక ఆటస్థలంగా అర్థమవుతుంది.

సంపఁగివలె
కవితలు కలలుగా కదులునే -- కాలము కదలికే తెల్పెనే 
నవతకు నడకలే చదువుగా  - నాణ్యత వేగమే తెల్పెనే 
యువతకు విషయమే మనసుగా - యూతము నవ్వుతూ తెల్పెనే 
భవితకు నాందియే జీవితం - భాగ్యము నాగరికత పునాది    
****
స్నానము దేహమే శుభ్రతే  - సాహస భావమ్ము సాధనే   
ధ్యానము మేధస్సు శుభ్రతే - దారిని చూపేటి శోధనే    
గానము హృదయమ్ము శుభ్రతే - గాధలు నయగార సాధనే  
మౌనము జీవితం శుభ్రతే -  మధురము పంచుటే శోధనే  
*****
కాలము నీదియే వయసులో - కినుకుయె వలదులే ఇప్పుడే  
గోలలు చేయకే మెరుపుగా   - కనులలొ పిలుపులే ఇప్పుడే 
తాళము వేయకే తరుణమే  - తమకము తలపులే  ఇప్పుడే 
మేళము దేనికే మహిమగా  - మనసున వేల్పులే ఇప్పుడే 
*****
ప్రేమము నిక్కమై మనసులో - వికసిత సుమమేమొ చక్కఁగా 
శ్యామల వేళలోఁ శశి రుచుల్ - యవనికి దిగజారె చిక్కఁగా 
కోమల భావముల్ పెదవులన్ - గులుకుల రవమయ్యె గీతిగా 
సీమల దాటునో తురితమై - చెలువపు నది నేఁడు ప్రీతిగా 
*****
దాహము తృప్తియే మనసులో - ధరణిలొ తాపత్రయమంతా   
దేహము పోషణే వయసులో  -  ధర్మమె సమ బోధనాలుగా     
మోహము జీవితం మలుపులే - మనసున మాయలే జరుగునే 
వ్యూహము విజయమే వినయమై - పూర్తిగ వంచాలి పెరుగుటే 
*****
మనలో వున్న భయాన్ని తరమండి, అదే మనల్ని మంచి మార్గము చూపి ధైర్యాన్ని నింపుతుంది 

చం:: భయము పారద్రోలు బాధ్యతా గురువే  ప్రథమ కర్తవ్యము
భయము కరుడు కట్టె బంధ విశ్వాసము వలన భయమొచ్చె  
భయము నమ్మినచో భాగ్యలక్ష్మి మారు ఇదియు మోసగించు 
భయము అసత్యము తొ మారె కర్తవ్యము  తప్పు జీవించుట
****
చం ::భయమునకు కారణము అంతర్ముఖమగు స్వభావమే
భయము ప్రజాపతనము కారణమగుటయే నత్య సత్యమగుట
భయము కొంత కాల బంధం ప్రభావమే ప్రకృతి సహాయముయె
భయము ధైర్యంతో బంధ ప్రేమలోను భక్తితో తొలగును
****
                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (9)  

కల్పతరువు - కామధేనువు - చింతామణి:-
(ఆధ్యాత్మిక అంతరార్ధాలు)
కల్పన అంటే 'మనోశక్తి'.  మన మనోశక్తి ద్వారా మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు!
కామం అంటే 'కోరిక'.  మనం గట్టిగా ఏది కోరుకుంటే అది అచిరకాలంలో మన వద్దకు వచ్చి తీరుతుంది!
చింతన అంటే 'మేధస్సు యొక్క ఉపయోగం'.  శాస్త్రీయ చింతన ద్వారానే అన్ని చిక్కులను విడదీయవచ్చు.
కనుక 
 'శుద్ధమైన కల్పన' అన్నదే అన్నీ ఇచ్చే "కల్పతరువు"
 'సరియైన కామం' అన్నదే అన్నీ ప్రసాదించే "కామధేనువు"
'శాస్త్రీయ చింతన' అన్నదే చిక్కులన్నీ విప్పే "చింతామణి".
 ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవే;  బయట ఎక్కడో లేవు. ధ్యాన శక్తితో మన అంతర్ శక్తులను మనమే ఉద్దీపనం చేసుకోవాలి.
****
జడలా వేణీయె కదిలేను ... జాడ్యం కాదులే ఇదియేను
నీడలు సన్నగా మెదిలేను .... నియమమె కదలికే మెలికలులె
అడ్డున ఉన్ననూ ప్రక్కగా .... కదిలే కిరణమే మెరుపులా
తడబడి చీపురై ఊడ్చేను..... తకధిమ్ శబ్ధం గా పరుగులే
****
తనకే నచ్చియే చేయుటే... తపనే బుద్ధిగా తెల్పుటే
తనలో తోచింది చేయుటే....తన్మయ విదంగా తెల్పుటే
తన ఆలోచనే పల్కుటే.... తీర్పును తీర్మాన మవ్వటే
తన వ్యక్తిగత మే నమ్మకం... తత్వము మంచిదే అగుటే
****
మంచిని మాత్రమే తెల్పుమూ ....మనుగడ పురోగతి అగుటకే
మంచియు చెడ్డయే భేధమై....  మానస పూజ లే అగుటకే
వంచన లేకుండా బ్రతుకు లో... వేదపు పలకులే అగుటకే
మంచివి నిజమైన మాటలే .... మనసే శుభ్రమే యగుటకే
*****
ఎన్నాళ్ళిలాగే వుండాలి ...యదలో మంటలే ఆరేన
కొన్నాళ్ళు యైనా వుండాలి ...కోర్కే లేకయే ఉండేన
మూన్నాళ్ళ ముచ్చట యిదేగా ...ముంగిట ముత్యమై వేల్గేన
తన్మాయె తప్పులే బ్రతుకులో ...తత్వము వద్దులే మధ్యనే
                                     రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (10)  

మనుష్యుల యొక్క బంధమోక్షములకు మనస్సేకారణముగా నున్నది. బంధమునకుగాని, మోక్షమునకుగాని తన మనస్సే కారణము.

మన సుఖానికి మరేదో అవసరం అవుతున్నంతకాలం మన0 బానిసలమే.
మహాత్ముల విశాల దృష్టిని అందుకోనియ్యకుండా గర్వము కళ్ళు కప్పి వేస్తుంది. వినమ్రత అనే తెరచిన ద్వారంలో నుండి కరుణ, శక్తి అనే దివ్య జల ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ గ్రహణ శీల ఆత్మల్లోకి ప్రవహిస్తుంది.

శత్రువు ఇచ్చే గుండు దెబ్బకన్నా స్నేహితుడు చేసే మోసం ఎక్కువ ప్రభావం ఇస్తుంది.
వైరితో పోరాడి గుండు దెబ్బతిని మరణం పొందిన బాధ అంతగా బాధించదు. అయితే,స్నేహితుడు చేసే మోసంతో మరణం పొందేటపుడు నమ్మకాన్నే చంపేసింది కదా! అని కలిగే బాధ...
ఎంతో చిత్ర హింసను ఇస్తుంది!!
****
(రాగజరీ) 
నీకు రాదాయె రాదు నిదురయే రేయి 
మనసు కొలనులో కధలు మమతాయె రేయి 
సుడులు తిరిగే ను కలయు సుఖముయే రేయి
తిరుగు శాంతియే శోభ మస్తిష్క మాయె 
****
కాల జ్ణాపకాలు కళ కొత్తగా మలుపు
మరల పరిగెత్త లేక మనసుయే తెలుపు 
నిత్య వాస్తవం మనసు నిర్ణయం తలపు
రేయి గుర్తొచ్చి తలపు రొకవరి మలుపు
****
తలపు మధురాను భూతి తలగడ లయ్యె 
రాత్రి నిశ్శబ్ద  నిద్ర శబ్దము లయ్యె  
ఘర్షణలు కొన్ని కలలు ఘనమగు లయ్యె   
వేదనలు ఏవొ చుట్టు తిరిగుట టయ్యె 
****
ఎదలోన నళిని కండ్లకు ఎప్పుడా వెలుగు 
నడిరేయి పట్ట పగలల్లె నిజము వెలుగు 
నిత్య నిద్రయు లేక నిర్మలా వెలుగు  
దేహంలొ పెరిగె ఉష్ణము దాహ వెలుగు
 ****
కన్నుల కలల రెప్పలు గడియలు వేసి
చూసె కనుగుడ్ల సేద చూపులొ దాచి 
రేయి అందము సప్న రంగులై చూపి 
నిద్ర కోసమే చూస్తు తపిస్తు న్నాయి 
****
జపము జటరాఘ్ని జ్వాల జీవితం ఇదియె 
గోల పేదింట గంట ఖర్చుయె ఇదియె 
నీరు చల్లియే నీడ  నిప్పుయు ఇదియె 
నిద్ర మునకేసి మనసుగా నిజముయే కలిలొ
****
ఈలోకంతీరు అర్ధం చేసుకోవడం ఎవరి తరము 

                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (11)  

కారణం లేనిదే కార్యం లేదు। మట్టి -- కారణం , పొలం -- కార్యం, బంగారం - కారణం, ఆభరణం - కార్యం, మనిషి - కారణం , కుటుంబం -కార్యం , దేశం కారణం,  ఆకలి- కార్యం।   
కారణ రీత్యా అందరూ సమానమే।,
కార్య రీత్యా భేదాలు తప్పనిసరి। ఇదే లోకరీతి। పుట్టుకతో వచ్చిన బుద్దులు మారవు, ఆశ అనే ధనము చుట్టూ తిరుగుతూఉంటాయి।  

    బ్రతుకులో ఆట పయనం, పకృతిలో కదిలే కుటుంబ వైనం, బ్రతుకు కాల వైపరీత్యం లో సమయ మంతా గమనం, ఒక్కోసారి జీవితం జ్వాలా కళల తోరణం, సహజంగా కారుణ్యం తో నిత్య పోరాటం, ధ్యానం తోనే వినయం,  మదిలోనే ఆశ్చర్యం, ధైర్యం తోనే విజయం, కాలమే అదృశ్య హయం, వెంటాడె అదృశ్య హస్తం, అచ్చి రానట్టి నేస్తం, కానరానిదే అదృష్టం, భార్యా తోనే  ప్రాణం, మనిషికి ఆరో ప్రాణం,అంతు లేనట్టి  గమనం, అక్కరకు రాని చుట్టం, ఆదుర్శరాజ కీయం, అనుభవమే సాహిత్యం, ఎన్ని లక్షణాలను ఉన్నా ప్రేమ నమ్మకం ఉంటె చాలు  
****
గజిల్....ప్రేమ

ప్రేమ లోన ఆకర్షణ భరించడం తెలియాలి
తప్పు లెంచ వలదునీవు తోడునీడ తెలియాలి

పోరాటం చూపటమే ప్రేమలోన మలుపులై
ఓటమియే లేనట్టి ది ప్రేమభక్తి తెలియాలి

బలహీనత రానివ్వకె పట్టుదలే తలపులై
మచ్చలేని ప్రేమసృష్టి కల్పించుట తెలియాలి

స్వప్నాలను నెరవేర్చె శక్తితోను ధైర్యమై
కొండనైన ఢీకొట్టే సాహసమే తెలియాలి

నీ లక్ష్యం నీ ఊపిరి ప్రాణంగా ప్రేమయై
చీకట్లను తరిమేసే వెలుగు అనియు తెలియాలి

వివాదాలు విరోధంలొ  ప్రేమయే బలముగానై
కష్టాలను చిరునవ్వుతొ జయించడం తెలియాలి

కుటుంబంలొ కలిసిమెలిసి బ్రతకడమే తెలియాలి
సహాయం సహకారమే అందిచడం తెలియాలి
****
         అలౌకిక ఆవలి తీరం అన్నిచోట్ల ఉంది. మన చుట్టూ కూడా ఉంది. దానికి సదా అందుబాటులో ఉండడమే యోగ స్ధితి,  అదియే ప్రేమ అదియేఅందరిలో ఆనందం  

                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (12)  
చిత్తమే సంసారము. ఆ చిత్తము ప్రయత్నించి శోధించ వలెను.

రాముడే దేముడే -- రమ్యుడై భవ్యుడే
భీముడై నటనలో -- భీకరం దేహుడే
కాముడై దేహమున -- కామ్యతత వీరుడే
శోముడై మంగళుడు --సర్వమున కాంతుడే
****
సత్యమే తెల్పెనే -- సమరమే చేసెడే
నిత్యమై సిద్ధమై -- నియమమై నాట్యుడే
తత్వమై తెల్పెనే --తీవ్రమై భవ్యుడే
వాత్సల్య భావమే-- వ్యక్తిగత జీవుడే
****
ధర్మమే నడిచెనే -- ధ్యానమే తెల్పెడే
కర్మగా కలసియే -- కాలమే పట్టుడే
నిర్ణయం తరువాత -- నీ దయే ఇప్పుడే
కార్యేషు శాంతిగా -- కర్తగా దివ్యుడే 
****
న్యాయమే వాక్కు గా -- నమ్మకం శాంతుడే 
ప్రాయమే ప్రాణమై -- ప్రాబల్య భ్రాంతుడే
ఖాయమే పెద్దగా -- ఆసక్తి భీతుడే
స్వయముగా కదలేను -- సమస్యలు తీర్చుడే
****

శ్రీ రామ చంద్రుని లీలలు తెల్సుకొని  ప్రేమగా మార్చుకోవాలి ప్రతిఒక్కరు నిగ్రహశక్తితో ధైర్యముగా జీవనం సాగించాలి, శక్యతే చిన్మయం, చిన్మయం శక్యతే   

గజిల్..ప్రేమ

తీర్చగల్గు యాత్మ బంధు కోరికలకు శక్యతే
విద్యలెల్ల విశ్వమందు ప్రేమతోనె శక్యతే

నిత్య సత్య సవ్యసాచి విజయమందు శక్యతే
సర్వ పర్వ  విశ్వమాయధ సామరస్య చిన్మయం 

కార్యసాధ్య కష్టశోధ్య తత్వమాయ శక్యతే
భార్యభావ్య సత్పవర్త నిత్యసత్య చిన్మయం 

చర్యలివే సేవయెమది వేద పల్కె శక్యతే
అమ్మపంచు రక్త శిక్త ప్రేమభాష్య చిన్మయం 

కొమ్మ రెమ్మ పూలుకాయు స్నేహభావ శక్యతే
సొమ్ముఅంత వీధిమార్గ ఆశాపాశ చిన్మయం 

తమ్ముడున్ను అక్కచెల్లె సౌమ్యభావ శక్యతే
అమ్మనాన్న గురువు సేవ నిత్యమందు శక్యతే
******
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!
                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (13)  

జీవితంలో మలుపుకు, మూలకారణం మనస్సుయే, ➡ మనస్సు బలహీనం వల్ల అన్నీ అలానే అనిపిస్తుంది, కనిపిస్తుంది।  ➡ మానసికంగా ధృడం కావాలి। కనుక ప్రతివిషయాన్ని ఆలోచన పలు కులే బ్రతుకు మార్గానికి ప్రేమపక్వానికి, మూలాధారం। 

మనస్సే ను లేనిది -- మానవత్వమ్ము బ్రతుకు
తనువులో మార్పులే --తాపత్రయమ్ము బ్రతుకు

అణువులోననే నిధి  -- ఆశల భాగ్య బ్రతుకు
వినినమనసుమాటలె -- వింత పోకడ బ్రతుకు 

కననీ కాంతులల్లే -- కడకుచేర్చే బ్రతుకు
ఘనమైన దే ప్రకృతి-- ఘనతను నిచ్చె బ్రతుకు

వినయమ్ము చూపేటి --విజయమ్ము తో బ్రతుకు
కనికరింపగలదై -- కళల జీవిత బ్రతుకు 

ఆన తీయును గురువు -- యపర ప్రేమే బ్రతుకు 
కాన నందు మార్గమె --  కడకు మోక్షం బ్రతుకు  

మాన యవ మానమే --  మరిచి సాగే బ్రతుకు 
తాను చూపు వెలుగే --  తలచు సుఖమను బ్రతుకు ।

*****
సమస్త గ్రంధాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది. అంతకంటే వేయిరెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి లోనుగాకు. సమస్త శక్తి నీదే. భార్యాభర్తల బంధం భావాలు అనురాగాలపై ఆధారపడి ఉంటుంది   

గజిల్..ప్రేమ భావమే 

ఏమి చెప్పె ఏల చెప్పె ఏదో ఒక భావమే  
లక్ష్య భాష్య శీల రక్ష ధర్మ మార్గ భావమే 

గృహ్యభవ్య దివ్యధామ చిద్విలాస శ్రీమతీ
సహ్య భవ్య సాహచర్య అద్వితీయ భావమే

జిహ్వతాప గమ్యసౌఖ్య సత్యమార్గ శ్రీమతీ
స్నేహతత్వ ప్రేమభావ దేహశక్తి భావమే

జీవితమ్ము అర్ధపర్ధ సఖ్యవ్యక్త శ్రీమతీ
 కావ్యతత్వ సంగమత్వ నిత్యసత్య భావమే

నవ్యశోభ తోడుఉండి శాంతిసౌఖ్య శ్రీమతీ
శ్రావ్యభాష్య సంఘగౌర దానకర్మ భావమే

దానశీలయశోవిశ్వ ధర్మపాల శ్రీమతీ
దీనపోష సత్యభాష  దివ్యవేష భావమే

మాననీయ శీలరక్ష సృష్టిమూల భావమే
శ్రీనికేత శీలసంపదా పోషణ భావమే

--(())-
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!
                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (14)  

25-02-2022 రష్యా యుద్ధం ప్రాంరంభించింది, ఏంటో నష్టం నేటి పరిస్థితుల్లో..  పద్యాలు .. యుద్ధం వల్ల అనర్ధమే

యుద్ధమే తెచ్చేను యువకుల పోరాటం
సిద్ధమై యుద్ధమే... స్వేచ్ఛా పోరాటం

దేశము కోసమే ను.. దేహాలు త్యాగం
పాశం ఆశయమే... పాపాల్లో వైనం

ఇప్పుడు అనర్ధమే.. ఉన్మాద క్రీడలే
తప్పుడు నిర్ణయమ్ము .. తప్పదే కౌగిలే

బతుకులోన ఖననం... భద్రతా లోపమే
రక్తపు పైసాచం. ..... రణతంత్ర యుద్ధమే

కష్టాల ఘోషయే.... నష్టాల దేశమే
ప్రజల్లో భయమే... ప్రతిభయే మోసమే

పచ్చదనం మాయం . పరిశుభ్రత మాయం
ఆహారం మాయం... ఆత్మీయత మాయం
......
కంద పద్యములు

వ్యతరేక భావములు  తో
అతిగా ఆలోచనలు ఎ  కలలే మాయన్
మతిసాకారము ఉంచే 
శృతి లయ సిద్దము మనమ్ము  అభినయ మవుటన్

అలిగినె అక్షర దీపిక
నలిగిన హృదయం నవాభ్యుదయమే ఇపుడున్
మళిణం భావము కదిలే
తెలియాలి తెలుగు భారతి  వెలుగులు  ఇపుడన్

తరుణీ శక్తీ తెలివియె 
తరుణం సద్విని సహాయ వినయము పల్కుల్
అరుణోదయమే  నిత్యం
కరుణాల వాసి కమ్మని  భావము తెల్పున్

న్యస్తాక్షరి...మా..న..వ..త

మానస వాణీ  మహిమే
ననగణ శక్తీ మధురమ్ము వగటయె శుభమ్
వనమే వెలుగే హరితం 
తనమే భేదము యెలేదు మనమే ఒకటే

దత్తపది.. ముఖం, పుబ్బ,కన్య, హస్త

ఆటవెలది
ముఖము మునుల ధ్యాన మంత్రశో భమదియు
పుబ్బ నక్షత్రము గ పూర్వ శోభ
కన్య రాశి ఫలము కన్యలకు కలుగు
హస్త సాముద్రికము హస్త తార

తేటగీతి 
మఖము నందున వెల్గును మంత్రశోభ
పూర్వ ఫల్గుణి నక్షత్ర పుబ్బగాధ
కన్య రాశియే యుత్తర  కారణముగ
హస్తమందునస్వస్తియేయభయముద్ర
తేటగీతి ----
" మఖములనుఁగాచెడునతనిమధురరూపు
నిదరహాసాన్వితవదనునిఁగొలిచెదను
పుబ్బ నందునమొలకలుపుట్టుఁగరణి
ఉత్తరంపుయానమునందు క్రొత్తయాశ
హస్తగతమగునుఫలము హర్షముగను.."
----
ఛందస్సు 

ఒకరికే తోడులే... ఒకరవుట నిజమేను
మకిలమునె తొల్చునే ...మనుషులే నిజమేను

ఎప్ప టికీ విడువరు...ఏదియూ మరువరులె
తప్పులే చెయ్యరే...  తాడుబొంగరముగలె

సూర్య చంద్రులు గాను.. స్పూర్తి నిచ్చువారును
కార్యనిర్వాహణ... కామ్యపరులుగాను

ప్రేమ పావురాలు లె ... ప్రేమ వ్యవహారులె
ప్రేమ కలయకులుగాలె...ప్రేమ పక్షులు గాలె

 నీధ్కుయానమే నాకు... నీ నామమే నాకు
నీ గానమే నాకు... నీ మాటే నాకు

మనసొక వీడని... మబ్బు తునక మాకు
నీకరుణామృత ... నీచల్లని పలుకు

నా జీవన గమనం.. నమ్మక చేదోడు
సమ్మోహనపు చూపె... సౌందర్య చంద్రుడు

సర్వశక్తులతోను  ..సుందరరూపుడు
 మునిగిపోయానులే...ముక్తి ఫలాలు డు

చంద్రిక  .. ఎదుకండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా 

ఎక్కుఎక్కమా ఇది ఏడు కొండలులే అచట వేంక టేశ్వరుండు
మక్కువ తోనులే మదిలొ మాట తెల్పి వేడు కుందాములె
మ్రొక్కు తీర్చెదములె మోహము విడిచెదము మౌన దీక్షగనే
దిక్కు నీవనుచూ దివ్య రూపహరిని చూచి వద్దాములె

లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!
                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ - మనసుందాఁ నీకు (15)  

దత్తపది:: రంభ, ఊర్వశి,మేనక,ఘృతాచి
అందానికి దాసులైతే వారి ఊహలు 
****
కంద పద్యములు 
మనసున రంభయె చేరే
తణువున ఊర్వశి నటనలు తహతలు కలిగెన్   
అణువణువులోన మేనక
కణముననె ఘృతాచి కలిసి హృదయము నందున్ 
^^^  
సహనమ్ముచూపుచున్నా
అహమును మరచియె మనస్సు తెలిపెద నాగా
మహిమలు చూపుము మాకే
మహనీయ రక్షణే మాకే సుబ్రహ్మణ్యా

నన్ను నువ్వే ననకే
మన్నుతినుటయేను సర్పం వల్లెను అనకున్
కన్నుయె కానదె నీకే
మిన్ను ను నమ్ముట మనకు యే అవసరం అగుటన్

తేటగీతి పద్యాలు 
మార్పు అనునది సుఖము మనసు చుట్టు
ప్రేమ తోనె పిల్లలు తగ్గెప్రతిభ తట్టు
మనిషిలో మార్పు జరిగెను మంకు పట్టు
మానవత్వాన్ని బ్రతికించు మౌన మెట్టు

మిరప కాయలో కారము మార్పులేదు
జామ కాయలో రుచికూడ మార్పులేదు
ఆకులలొరంగు అసలు గా మార్పు లేదు 
జగతి మారదు మనుషుల జపము‌ మారె

నిత్య కనిక(రం భ)యము గా నియమ మేన
మనసున మ(మే నక)నకలు మనుగడేన
నీటిలోపుట్టిన( ఘృతాచి) నటన యేన
చూడు (ఊర్వశి) నృత్యము చరిత నేర్పు

మొదటి రోజుగనె ఉషారు మోత గుండె
రెండవది మైధిలి ఇటురా రవ్వ వెల్గు
రెండు వేళ్ళ సామెత జయం రెపరెలుగానె 
రెండ్రెళ్ళుయె బైట కెళ్లుటే రుద్ర భూమి

లేగ దూడలు దారి తప్పే తరుణము
కృష్ణ పలికేను చద్ది తినుములే ఇపుడు
దూడ లను వెతి కెందు పోయద అడవి
బ్రహ్మ కృష్ణుని తెలివి తెలియకే మాయ
చేసె పశువులు పిల్లల్ని తెలియని విధము
5
రాగ మంజరి, మాట చిన్నదై నాది, అనుభవం మనసు తెలిపె, చెట్టుకు వచ్చు గాలి, పక్క వాడిపై నింద, అప్పు చేయు మనిషియే,  నిజము చిన్న ది గాను, అబద్ధము పెద్ద గాను, గొప్పలు దారి తప్పు,మచ్చ మనిషి లో పుట్టు। గురువు తెల్పు మాట 

సోయగం
దౌర్జన్య బుధ్ధియే చూపియు।।।। ఆత్ర బుధ్ధి చూపె
దర్జాగ తిరుగుతూ ఉండియు।।। ధర్మ మరుపు వుండె
మూర్ఖత్వ బుధ్ధిగా కదిలేను ।।। మర్మ మాయ కుదిపె
ముఖ్యంగ గాంభీర్య భావమే।।।ముఖ్య గమన మాయె

ఉత్పలమాల
అయ్యవు విశ్వనాధుడవె ఆర్తిని తీర్చెటి ఆత్మబంధువే
శయ్యను ఉంచినాను ఇక శ్రవణ పూజలె చేయదల్చినా
కయ్యము వద్దులే మనలొ కార్యము తీర్చెటి ధ్యానమేనులే
వియ్యము విశ్వమై విరియు విద్యను తెల్పెటి విశ్వనేత్రడా
0 
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!

                                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ..మనుషులంతా నీకు (16)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ

కంద పద్యముల...ప్రేమ

" శ్రీమద్భగవన్నామము
సామోద్భవగానఫలముసమకూర్చునుగా
కామాద్యరులనుఁద్రెంచును
భామోపేత హరిదయయు భాగ్యములిచ్చున్ !!! "
----
నీదియె నా మనసంటా
నాదియె నీ మనసుగను నాట్యమె నంటా
నదిగను జగతిన   నుంటా
మది పిలుపులు కళలు పంచి  మధురము  నంటా 
*****
ఆశే పెంచెను లె అహల్య
పాశం చివరి కి శిలగను లెమారె నంటా
 చేసెేను  పరీక్ష కళలులె   
 ఊసే ఊయలలొ నంట ఊసులు అంటా
*****
చీకటి విడిపోదు నంటా
వాకిలి ఎంతకును మార దనియేనంటా
రోకలి పోటుకు రోషము  
ఆకలి అనురాగము సంగ మేనని అంటా
*****
వెలుగేటి పూలతొ మంటా
తెలిపెను పురివిప్పిన పూలవాసన లంటా
మలుపుల ముచ్చట కలలంట
కళల పుడమి తల్లి పిలుపుల మానస మంటా
***** 
కరిగిపోతానులె ఇప్పుడు
మరిగియె మారును యుగాలు మానస మంటా
కరిగి గుసగుసలు చేరెను
మరిగెను లె అనవసరమ్ము మార్పులె నంటా
****
ఆమెయె అమృత స్వరూపిణి
ఆమెయె మమతల కడలిలో అద్భుత ప్రతిభన్
ఆమెయె చదువుల భారతి
ఆమెయె సహనశీలి గాను తారక అయ్యెన్
*****
వలచితి తొలిచూపు లోనే
తలచితిని నిరంతరమ్ము తపనల వల్లన్
కలసిమెలిసియేను ఉండే
గెలిచితి హృదయాన్ని మనస్సు కీలక మయ్యెన్
******
రాతిరి కొమ్మకు పూలులె
ఖ్యాతిని చూపెను తరువులు కాలము నందున్
స్వాతి చినుకులతో మెరుపు లు
జాతికి నచ్చెటి సువాసన ల వెల్లు వయ్యెన్
*****
గాజులు గలగల శబ్దమ్
మోజును తీర్చదలిచేను మోమున ముద్దుల్
సైజులు మారెను తరుణాన
కాజును తినిపించ దలచెను కాలము నందున్
*****
పవలింపు సేవలు హాయిగ
జవరాలు చూపులలొ హొయలు జపమకు భగ్నమ్
నవరాత్రి సొగసులు చూసే
భవ భంజనమ్ము యె సుగంధ కౌగిలి యందున్
*****
 ప్రేమతొ సాధన శోధన
ప్రేమతొ నిజమైన అనుభూతి ప్రతిభకు నాందీ
ప్రేమ అనంతము ఆద్యము
ప్రేమలు నమ్మకము చుట్టు ప్రేరణ బందీ
***** 
హాయిగ ఉన్నది ఇప్పుడు
రేయి న సుఖము జీవనంబు రెల్లు గ సాగున్
రాయి నిరీక్షణ ప్రాణమె
నేయి గుణములతో ను హాయి నింపియు సాగున్
                            రేపు తరువాయ భాగము
****""""*"*"
రోజువారీ కధ..మనుషులంతా నీకు (17)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ
****
మరువనిది మన కలయిక
తరుణము  కధలులె యిజీవితమ్మున మలుపు ల్
కరుణయు కటాక్ష లబ్ధే
తెరిచిన మనసులొ విశాల వినయపు కధలన్
****
సిరిగల మాటలు చిరితయు 
విరిసిన మనసు కురిసెను వినయపు నవ్వే
హరిపలుకే నిధి వెల్లువ 
చరితయు కళలుగ విరిసిన పువ్వే నవ్వే
****
మనసు కవిత్వము తెల్పియు 
ఆణువణువు మలుపు సహాయ ముగనుకుటుంబం
మన అలవాట్లను సరియగు 
మన పొరపాట్లు సరిదిద్ది పద్యము నాట్లే
****
సూర్యుడు జగతిన ఏలే
ఆర్యకిరణములు పుడమిన ఆశయ మవుటన్
కార్యము నిర్ణయ భావము 
సౌర్యుని లీలలు ప్రకృతిన సేవల మేలున్
****
చెలిమి చేయు టేను సత్యం
కలిమిన చుట్టముగ ఉన్నకళలకు ధర్మం
బలిమితొ బ్రతుకున మేలే  
నిలిపియు మేలియు విజయము నిలకడ న్యాయం
****
శ్రీ కర శుభకర రంజని
మాకధ వినినను సుఖాలు మాగృహ మందున్
మాకల తీర్చుము తల్లీ 
మీకళలను బ్రస్తుతింతు ను మేలుకొలుపు కున్
***
ముప్పుయు  రానిది అంటూ
తప్పులు వల్లన నెముప్పు తిప్పలు కలుగున్
ఒప్పుల అర్ధము తెలియక
ఒప్పుల లోననె పలుకులు ఒడిసియు పట్టున్
***
బిక్షను కోరెను మనిషియె 
భిక్షవులె వేషమ నుతప్పు భీతియు అనుటన్
సాక్షి గ దుండుగ ఉంటివె
భిక్షం వేసెనులె దేవుని హుండి అగుటన్
****
మాలను వేసెను భక్తితొ
మేలును కోరియు  పాపము మాపుట కొరకే
మళినపు మనసున మార్చూ
తెలుసు కొనుటఇది  బ్రతుకున తెలివియె భిక్షా

****
చల్లని గాలియే మనసు జాడ్యము  చల్లగ మార్పుచేయుటన్ 
మెల్లని చూపులే కలసి మేలిన  పల్కులు  బంధమవ్వుటన్
మల్లెల పువ్వులే విరసి మానస మెప్పును పొందియుండుటన్
యుల్లము జల్లనే పలుకు యూహలు తీర్చియు సంతసమ్ముగన్ 
***   
యెల్లరు మెచ్చి సన్మతిని యెంచియు ఆశయ సాధనమ్ముగన్ 
వెల్లువ చేత లన్నియును వేదము వళ్ళను సాగుచుండుటన్     
నల్లని కాకిలా కదిలి  కాలము బట్టియె నడ్వ కల్గుటన్ 
తెల్లని హంసలా కదలి పాలను నీళ్లను వేరుచేయుదున్

           రేపు తరువాయి భాగము 
*******
రోజువారీ కధ..మనుషులంతా నీకు (18)
రచయిత..మల్లాప్రగడ రామకృష్ణ

సూక్తి సుధ
 సూత్రము తోకళ తెలిపి యు
క్తిగను లె బ్రతుకుటయె సాగు సమరము నందున్
సుఖపడుటే కళ ధరణిలొ
ధనమును బట్టియె సహాయ ముగనులె ఇందున్
****
అభిషేకం
అనకువ వల్లే మనిషిలొ
భిన్న తలపుల గనుపుట్టి భీతిగ నుండున్
శేషము కధలుకె సహజమె
కంకణ ధారిగ కవిత్వము తెలిపె చరితమ్
****
తారల మధ్యన వెలుగులు
ఓరగచూపులు కలిసిన చీకటి వేళన్
మెరుపుల పున్నమి చంద్రడు
తరువుల మధ్యే కళలను చూపెడి వేళన్
****
సీ..యధుప్రియ నందన యానందమోహనా
నెమలిఫించదరివి నెఱుగు సఖుడ
మందార యరవిందమధుపుష్ప సొబగులు
మౌనమే వేణువై మౌళి రూప
దవళపు కాంతితో దశయవ తారుండ
ధరణిభారముదీర్చు దాతనీదు
పవనపు పయనంబు పరవశ మొందగ
వేణుగాన ప్రియుడ వేడుకొనగ 
****
తే...శరణుకృష్ణనీ చరణముసరి వరములు
ధరణి  వేడుక చేయునీదయనుగల్గి
పరమ పావనుండ హరని పలుక రాగ
కరము లనుకాంచికరుణలనువరమీయ
****
సీ:;సుమతులందరుగూడి-సుమధురము లొలికింప
విమల మంజులములు- విరిసేటిముత్యములు
కమలము లన్నిజేరి- కనులువిందును జేయ
తలపులన్నిభక్తితొ- తన్మయత్వమునొంద
అమృతము నొలికింప-యక్షరంబులు పంచు
మధువులనుపంచుమరి-మధురమధుపంబులై
కాంతు లన్నియుచేరి-కనకంబులైమెరవ
కరములను జోడింతు- కమలవిభునకు ప్రియులు
****
తే::కష్టము కలిగి రక్షణ కొరకు మనసు
స్వార్ధ పరముగా చూపక సేవ చేయు
దుర్బలుడితోను చెలిమి యే దురిత మగును
దుఃఖ మడుగులో మునుగుటే దుష్ట బుద్ధి
,,,,....,,

శ్రీ శక్తి శ్రీమాత శ్రీ చక్ర రక్షాశ .. శ్రీ భక్తి శార్వాణి విశ్వాస భావమ్
శ్రీ విద్య శ్రీ లక్ష్మి శ్రీ నాగ చైతన్య.. శ్రీ ధర్మ శ్రీ కర్మ యోగీశ ధైర్యమ్
శ్రీ నీలకంఠన్ శుభాశిస్సు లొందున్ భ శ్రీ భవ్య శ్రీ దివ్య కైలాస నాధున్
శ్రీ యుక్త ఓంకార నాదాలు ప్రాధాన్య శ్రీ భుక్తి శ్రీ ముక్తి మార్గమ్ము యందున్
*****
           రేపు తరువాయి భాగము 
*****

రోజువారీ కధ..మనుషులంతా నీకు (19)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ
మానవుల అష్ట దరిద్రాలను తొలగించి అష్ట సిద్ధులను కలిగింపచేసేదే ధ్యాన సాధన.
ఆటవెలది మాలిక
అరకు బట్టి దున్నె ఆదర్శ భూమిని
ఆలుమగలు కలిసి అలక జలము
ఈశ్వర రాజ్ణ యనియు ఇల్లాలు నారేసి
 ఎదిగె చేను లోన ఎదను వుంచి
పిచ్చి మోక్క లన్ని పేర్చివేరును చేసి
చేను ముడులు కట్టి చెత్త తీసె
కాపలాగ కుక్క కాపుగా వుంచి యు
కుర్ర చేత బట్టి ఘడియఘడియ 
మంచ నెక్కి పక్షి మాటు మరనుతిప్పి
శబ్ద మోచ్చు నట్లు సేసి చూడు
మలుపు లెన్ని వున్న మనసును పెట్టియు
ముందు లెన్ని వున్న మంచి మందు
ముక్కు గుడ్డ కట్టి మూతి ముడిచి
చేను దారి నీరు సరిగను మార్పులు 
చేసి వల్లువంచి చేను రక్ష
కన్న బిడ్డకన్న కధికము శ్రద్ధతో
కన్న కూతు రనుచు కాపు కాసె
రకరకాల వెలుగు రగడలు కమ్మెను
రమ్య మైన మనసు రంగరించె
పలుకులమ్మతోడు పాటలు పాడియు
పాడి గేదలకును పాక వేసి
పాలు పితికి అమ్ము పడతులు ఉంచియు
బ్రతుకు తెరువు కొరకు బాధ్యత గను
మార్గ రీతులివియు మనసును పెట్టియు
ముంతికల్లు చేత ముందు పట్టి
మత్తు ఎక్కు దాక ముందు త్రాగి
నేల తల్లి మేలు నేతగ నెంచియు
నలర చేయదలచి నటన జూపె
తలుపులు న్న జాలు దారులు ఉండును
ఆశ లెన్ని ఉన్న అమ్మ చలువ
ఆకలికి ది తీరు నానంద మందించు
తెలియ పరచు చున్న తెలిసి నంత
తప్పు ఒప్పు లనక తపనను తెలిపితి
తాడుబొంగరమ్ము తోడు తిరిగె
****
రాత్రీరమ్య  ముగా రసాల మయమై .రవ్వల్ల మెర్సేను మాయ
మ్మేతీరే మనసే మసాల మయమై .. మాంధవ్యబుద్ధంత దేహం
మ్మేతీరే జరిగే మనోసమయమై..మంత్రము లయ్యేను మోహం
మ్మేతీరే మలుపే సహాయమయమై.. మాధుర్య ఆరోగ్య ఆటే
***
ఆనందమ్ముఇదే మనస్సు మమతే ఆశ్థర్య ఐశ్వర్య ఆధ్య
మ్మేనందమ్ముగనే వయస్సు వలపే మోహమ్ము సౌందర్య ఆరా
ధ్యానందమ్ము లుగా సహాయ మలుపే ధ్యాసంత శృంగార సాహి
త్యానందం నననిన్నునేను దలవున్ త్యాగమ్ము ఆత్రమ్ము గానే
****
నాదేనా ననుటేను చర్చ వలదూ..నాన్యత్వ తెల్పాలి సత్యం
బంధాలే మనలోను మార్చు పలుకే బంగారు వర్ణమ్ము నిత్యం
ఉందాంలే మనసేను పంచి సహనం చూపాలి సంతృప్తి తెల్పే
వేదాంతం అహకారమేను మనలో విద్యల్లె ఇష్టమ్ము గానే
*****
                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****
0

రోజువారీ కధ..మనుషులంతా నీకు (20)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ

నమశ్శివాయ.. నమశ్శివాయ.. నమశ్శివాయ...1/9
విధేయుడు...మల్లాప్రగడ రామకృష్ణ 

" మందాక్రాంతః ..
--
శ్రీ గౌరీశం ప్రమదగజచర్మాభిభూషం త్రినేత్రం ,
శ్రీ గంగాధారవరరససేవ్యాభిషేచ్యం మహేశమ్..
శ్రీగాఢాऽऽభీలనిజభయహాలాహలాత్తం గిరీశం ,
శ్రీ కంఠం తం నిగమనుతవాచామతీతం భజామి !!!
****
మాగురువుగారు పేరిట వేంకట సూర్యనారాయణ అప్పాజీ గారు నేడు  వ్రాసిన పద్యము తో నమశ్శివాయ స్తోత్రము వ్రాస్తున్నాను 
ఎందరో మహుఅందరికీ వందనాలు

శరణాగతి ఉత్తర తక్షణము నమశ్శివాయ 
పెనుమాయను తొల్చెటి ప్రత్యయము నమశ్శివాయ
అనురాగము పంచెడి అన్వయము నమశ్శివాయ
అపురూప ము కల్గిన భాసురము నమశ్శివాయ

మాలో మోహవిచ్ఛేదము ను చేయుము నమశ్శివాయ
మాలో దేహవాశ్చల్యము ను మాపుము నమశ్శివాయ
మాలో నిర్ణయం ప్రేరణము ఆపుము నమశ్శివాయ
మాలో ‌‌బంధమందే చలన మాపుము నమశ్శివాయ

ఇంద్రియ లౌల్యము నిగ్రహించుము నమశ్శివాయ
ఆత్రత ఆద్యమె వాద్యఘోషము నమశ్శివాయ
మంత్రము మూల్యము మాకుపంచుము నమశ్శివాయ
తంత్రము వల్లన దారి మార్చుము నమశ్శివాయ

ఇమ్ము ఉద్ధరణ చేసెటి  జ్ఞానము నమశ్శివాయ
ఇమ్ము లోకముకు పంచెడి ధర్మము నమశ్శివాయ
ఇమ్ము దుష్టులను మార్చెడి సత్యము నమశ్శివాయ
ఇమ్ము వేదమును తెల్పెడి పాఠము నమశ్శివాయ

కాల క్రోధుని నిర్జించు ధైర్యము నమశ్శివాయ
కాల బ్రష్టుని నర్కేటి ధైర్యము నమశ్శివాయ
కాల దుర్మార్గ నిర్మూల ధైర్యము నమశ్శివాయ
కాల కామమ్మ తగ్గించు ధైర్యము నమశ్శివాయ

ప్రాణహింస  వేటను మాపుము నమశ్శివాయ
మానహింస ఆటను ఆపుము నమశ్శివాయ
బౄణహింస వేటును బాపుము నమశ్శివాయ
జ్ఞానహింస దేహము తుంచుము నమశ్శివాయ

నీపద సేవలు చేసెద నిత్యము నమశ్శివాయ
యాపద దీర్పర యంబను గూడము నమశ్శివాయ
దీనదయాలువి ధర్మము నిల్పుము నమశ్శివాయ
సంపద నిల్పుము తేజము జ్ణానము నమశ్శివాయ

నిత్య భక్తుల్ మ్రొక్కుల్ తీర్చుము నమశ్శివాయ
నిత్య శక్తిన్ శాంతిన్ ఉంచుము నమశ్శివాయ
నిత్య రక్తిన్ మాయన్ తెంచుము నమశ్శివాయ
నిత్య భక్తిన్ శ్రద్ధన్  నిల్పుము నమశ్శివాయ
                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****
రోజువారీ కధ..మనుషులంతా నీకు (21)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ

నమశ్శివాయ... నమశ్శివాయ.. నమశ్శివాయ...2/9
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ

సతత జన్మ దాహ దగ్ద చందనము నమశ్శివాయ
నత విశిష్ట భక్త బృంద నందనము నమశ్శివాయ
శృతి శిరస్సహస్ర రత్న సుందరము నమశ్శివాయ   
మత కుతర్కశరధి మధన మందిరము నమశ్శివాయ

దారువన మునీ0ద్ర ముఖ్యధర్మము నమశ్శివాయ
దూర దూర హత నికృష్ట దుర్మదము నమశ్శివాయ
తరుణ చంద్ర జాట దర్పదర్పణము నమశ్శివాయ
హరణ భరణ శక్తి కృత సమర్పణము నమశ్శివాయ

పాట కూట త్రయంబులో ప్రణవతేజము నమశ్శివాయ
తేజతేజోలయవ్యాప్త మగుచు తేజము నమశ్శివాయ
మర్మవర్మాది ధర్మమగుచు కర్మము నమశ్శివాయ
బదులు నైదింట శోభిల్లు బ్రహ్మబిలము నమశ్శివాయ

శక్తిని యొసగము నిత్య మార్గము నమశ్శివాయ
భక్తిని తెలుపుము సత్య మార్గము నమశ్శివాయ
యుక్తిగ పలుకులు విద్య నేర్పుము నమశ్శివాయ
ముక్తిని కళలతొ తీర్పు కూర్చుము నమశ్శివాయ

మానుకు భారమ్ము లేదును  నిత్యము నమశ్శివాయ
మన్షిలొ భారమ్ము  కోపమ్ము భేదము నమశ్శివాయ
పువ్వులు విచ్చియు వాసన వాసము నమశ్శివాయ
మన్షిలో  నవ్వులు చిమ్మియు దాహము నమశ్శివాయ

నేస్తము ప్రజాస్వామ్యమ్  సహజము నమశ్శివాయ
హస్తము సంప్రాదిత్వమ్ సమయము నమశ్శివాయ
వాస్తవ రాజ్యమ్మేలే వినయము నమశ్శివాయ
జాస్తి యు మోసమ్మేలే మనసుకు నమశ్శివాయ

పంచ వర్ణ పంచ భూత భాసురము నమశ్శివాయ
శ్రీ గిరీశ విశ్వ మంత్ర సేకరము నమశ్శివాయ 
ఆగమోపదిష్ట విధి మహాకరము నమశ్శివాయ
అచింతానురక్త జిత గజాసురము నమశ్శివాయ

భూరిపుణ్య హేతుభూత భూషణము నమశ్శివాయ
పార లౌకిక ప్రధాన భాషణము నమశ్శివాయ
సునిసితోప నిష దధీత సుస్వరము నమశ్శివాయ       
కనదనూన భక్తిరస వికస్వరము నమశ్శివాయ

విశ్వాసమ్మే సామర్ధ్యముగ సమభావం భవహరా నమశ్శివాయ
ప్రాశస్త్యమ్మే ఆశ్చర్యముగ వినయం ప్రాభవ శివా నమశ్శివాయ
ఆశ్వీజమ్మే ఆరాధ్యముగ సమ సర్వేశ భవుడా నమశ్శివాయ
నిశ్శబ్దంగా నిర్మాణముగ పలుకే నిశ్చయ శివా నమశ్శివాయ

                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****

రోజువారీ కధ..మనుషులంతా నీకు (22)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ

****
శమీశాన విభుంనిర్వాణరూపము నమశ్శివాయ  
వ్యాపకం బ్రహ్మవేద స్వరూపము నమశ్శివాయ
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహము నమశ్శివాయ 
చిదాకాశమాకాశవాసం భజేఽహము నమశ్శివాయ

ఈశాన మూర్తికి నిర్వాణ రూపము నమశ్శివాయ
రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అర్థము నమశ్శివాయ
సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మము నమశ్శివాయ
వేద స్వరూపుడు, సత్యమైన గుణము నమశ్శివాయ

సంసార వారధిని దాటించే గుణము నమశ్శివాయ 
విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపము నమశ్శివాయ
నిరాకారమోంకార మూలము నమశ్శివాయ
జ్ఞాన గోతీతమీశం గిరీశము  నమశ్శివాయ

ఓంకారానికి మూలము తురీయుము నమశ్శివాయ
కరాళం మహాకాల కాలం కృపాలము నమశ్శివాయ
గుణాగార సంసారపారం నతోఽహము నమశ్శివాయ
స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమము నమశ్శివాయ
****
యముని పాలిటి మృత్యువు అతీతము నమశ్శివాయ
కృపాకరుడు, గుణములకు అతీతము నమశ్శివాయ
మృత్యువుని జయించుటకు సాధనము నమశ్శివాయ
ఊగే కర్ణ కుండలము విశాల నేత్రము నమశ్శివాయ
****
తుషారాద్రి సంకాశ గౌరం గభీరము నమశ్శివాయ
మనోభూత కోటిప్రభా శ్రీ శరీరము నమశ్శివాయ
జటా ఝూటములో గంగమయము నమశ్శివాయ
నుదుట నెలవంక, మెడలో భుజంగము నమశ్శివాయ
****
పరమ భక్త మహిత విభావనము నమశ్శివాయ
చరితర ప్రభావ  భావ జీవము నమశ్శివాయ
వామదేవ తత్వ లేశ వాచకము నమశ్శివాయ
సోమపాన ఫల సహస్ర సూచకము నమశ్శివాయ
****
నరక విశిష్ట మంత్ర నాయకము నమశ్శివాయ
ధరణి సుర సుధీ విధా విదాయకము నమశ్శివాయ
దారుణాధి జలధిమగ్న తారకము నమశ్శివాయ
కారణం ప్రధాన వస్తు కారకము నమశ్శివాయ
****
కర్మ దోష హర విచార కారణము నమశ్శివాయ
పారు ఘోరకృత్వ పాచకము నమశ్శివాయ
మూఢ గూఢ మోహ బంధం మోచకము నమశ్శివాయ
 బాఢ పాప ఘోరకృత్య పాచకము నమశ్శివాయ
****

                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****
రోజువారీ కధ..మనుషులంతా నీకు (23)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ

దత్తపది.......శివ, భావం, రుద్ర, లింగ
💚💚💚
శివ మూలమంత్రము శివతంత్రము నమశ్శివాయ
భవ భోగిభూషపక్షవిభవ భూధరము నమశ్శివాయ
రుద్ర రక్త భక్త నిత్య సత్య రక్షణము నమశ్శివాయ
లింగ ధరణి సుర సుధీ విధా విదాయకము నమశ్శివాయ
**** 
ఆ:: శివ శక్తి తోడు శివుడు భయహరణం
భవ యుక్తి తోడు బంధ మాపు
రుద్ర భూమి తోడు రుద్రుని స్మరణమే
లింగరూపధారి నిగమ నిఖిల
****
తే:: శివశివ యనుచు శివనామ స్థిరము పలుకు 
భవభవ యనుచు భవునినే భజన జేయు
రుద్ర అభిషేకముయు భక్తి ముక్తి నిచ్చె
లింగరూపధారి శివుడు లయలుజూపు
----
----
సీస పద్యము
తల్లి తండ్రుల వద్ద తరుణితో సేవలే
పాదపూజలుగాను పరమ భక్తి
హితవచనములన్ని వినియమాచరణమే
శ్రద్ధతో పఠనము శపధ భక్తి
ఈశ్వర సేవలు ఇష్టముగా చేసి
గుర్తించ గౌరవం  గురువు భక్తి
నొప్పింపకమనసు నోముఫలముపొందు
సన్మార్గ అనుభూతి సరయు భక్తి
****
తే:: మెచ్చునయ్యమహాశివ మేలు చేయు
మచ్చలేన ట్టి మనిషిగా మార్పు జేయు
స్వచ్ఛమైన ట్టి మనసుంటె సరయు జేయు
ఇచ్ఛ తెలిసియె శివరాత్రి ఈశ్వరకళ
*****
మా:: సృష్టి కీ శివుడే ఆదర్శ ప్రాయుడు 
దృష్టి కీ భవుడే సౌందర్య ప్రాయుడు
శిష్ట మే స్థితుడే కారుణ్య ప్రాయుడు
ముష్టి నెత్తియు జీవ బ్రతుకే ప్రాయుడు
****
భిక్ష మెత్తి అందరికీ లయకారుడు
రక్ష గుండే వీరులతో లయకారుడు
కక్ష సాధింపు లేనట్టి లయకారుడు
శిక్ష ణతో ఆదుకొనేటి లయకారుడు
****
హాలాహలమ్ము లీలగ మింగిన వాడు
జ్వాలా తోరణం తేజో  మహాశివుడు
దివ్యలీల భుజంగ ఉమామహేశ్వరుడు
కంకాళ మాలా ధారణ మహాశివుడు
****
చం ::  శశిధరుండు శంబుశంకరుండు హరహర మహదేవ 
నిత్య పూజ్యనీయ  నిర్మలమైనశివ నిఖిల లోక రక్ష
ముత్య ముక్తేశ్వర  మూర్తి మహేశ్వరా  మౌనగంభీరుడు
దైత్యదైవరూపదయసదాశివుడు బోళ శంకరుండు                     
****             
కం:: శివునకె జపముగ జనులలె
భవ ఉమా శివుడే జయంతి పరిణయ వేడుకే
నవ రుద్రుడులె పాపహరుడు 
భవుడె మమతల భుజంగ ధరుడే హరుడే
****
                        రేపు మళ్ళీ అధ్యాత్మికం
*****
రోజువారీ కధ..మనుషులంతా నీకు (24)
విధేయుడు ..మల్లాప్రగడ రామకృష్ణ


--
సీ:: శివ - శివ యనఁగనే శివములుగలుఁగును
  కామేశునకభిషేకములుసేయ
హర - హర యనిఁజెప్ప హరియించునఘములు
   గరళకంఠువిశేషకరుణతోడ
భవ - భవ యనిఁజేర భవములునుడుగును
   బిల్వదళాలతో కొల్వగాను
రక్ష యనంగనే దక్షగురుశివుఁడు
   భక్తవశ్యుఁడువచ్చు భయముఁదీర్ప
----
తే:: లోకకళ్యాణకారుని లోకభరితు
పార్వతీశుఁగపర్దిని సర్వవిదుని
సాంజలివిధుల భక్తిమై సాంబశివుని 
యభవునక్షరునర్థింతు జ్ఞాన భిక్ష !!! "
-----
ఉ::నీసమదైవమున్ గనము నీలగళాంచిత కాళహస్తిపా ..
భాసితతత్త్వమౌపదఁపుభావననీయుమ కామ్యభాగ్యమై..
కాశిపురాధిపా ! శమద ! కష్టవిదూర ! విభూతిదాయకా !
దాసజనావనా ! విషమదక్షమదఘ్న ! దయాబ్ధి ! దండముల్ !!! "
****
చం:: శంకరశివంకరి శివశివ యనుచునే జ్ణానభిక్షకోరె
శంకర భయంకరి శివభవయనుచునే కామ్యభాగ్యకోరె
శంకరరుద్రరూప సాంబసదాశివా సిద్ధిబుద్ధి కోరె
శంకర లింగరూప శివుని చే చింత జేయు నిష్ట కోరె
****
మాహేశ్వర దండకము.

 శ్రీకాళహస్తిత్రయోద్ధర్త!  కాశీపురాధీశ! కైలాస సంవాస! శ్రీశైల సంచార! శ్రీకంఠ చిద్రూప!  గౌరీమనోనాథ! గంగాధరా! చంద్ర మౌలీశ్వరా!  శుద్ధ భస్మాంగ! కామారి!  నాగేంద్ర హారా! త్రినేత్రా! మహాదేవ! దేవాలి సంభావ్య! నాట్యానురక్తా! హరా! నీ పదాబ్జమ్ము లెన్నండు నే వీడ నిత్యమ్ము నిన్నుంచి డెందమ్మునం దేను బూజింతు సద్భక్తిఁ బాపమ్ములం బాపి దేవేశ రక్షింపు నేత్రమ్ము లీయంగఁ గన్నప్పనుం బ్రోచితే ప్రీతి దక్షాధ్వరం బెల్లఁ గోపించి ధ్వంసమ్ము గావించితే పూని శాంతమ్ము రక్షించి తే పిమ్మటం బ్రీతి వేఁడంగ బ్రహ్మాదు లేతెంచి కారుణ్య మేపార లోకాలఁ బీడింపఁగా నప్పురామ్నాయముం గూల్చితే శంకరా యొక్క బాణమ్మునం బానముం జేసి హాలాహలం బెల్ల ముల్లోకముల్ గాచితే నీదు నామాలి నెన్నంగ శక్యంబె సౌరాష్ట్ర సోమేశ శ్రీశైల సన్మల్లికా ద్యర్జునా యయ్యవంతిన్ మహాకాళ నామేశ పుణ్యామరేశాన నోంకార నామేశ కేదార కేదార నామేశ యా ఢాకినిన్ భీమ నామేశ కాశీ పురం బందు విశ్వేశ మున్నీట నా నాశికం ద్ర్యంబకేశా మహద్వైద్య నాథంపు విద్యా మహానాథ తద్ద్వారకన్ నాగ నామేశ రామేశ్వరం బందు రామేశ భాస్వద్ఘ నేలా పురం బందు  ఘృష్ణేశ్వరా భక్త నందీశ్వరుం డింక భృంగీశ్వరుండుం ద్వదీ యాంఘ్రి యుగ్మంబు నిత్యంబు సేవించు భాగ్యంబునుం బొంది ధన్యాత్ములై రెంచ ఫాలమ్ముపైఁ గన్ను కంఠంబునం బాము గాత్రంబు నందెల్ల భస్మం బహో పుఱ్ఱెలే నీకు ముత్యాలు చిత్రాతి చిత్రంబు వేషంబు గాంచంగ నాద్యంత హీనుండ వత్యంత కారుణ్య చిత్తుండవే నీకటాక్షంబుఁ దానొంది పేట్రేగి వే కాలె భస్మాఖ్య దైత్యుం డహో ద్రౌణినిం గాచితే నర్జునిం గాచితే ప్రీతి సర్వజ్ఞ శశ్వద్ద యాంభోధివే పంచవక్త్రా భవానీధవా విశ్వనాథా విరూపాక్ష విశ్వాత్మ భూతేశ రుద్రా విశాలాక్ష పింగాక్ష నిత్యమ్ము సద్భక్తి నిం గొల్చెదం గొల్చెదం గొల్చెదన్.
(సేకరణ )
*****